headmaster
-
తప్పతాగి పాఠశాలకు వెళ్లి.. ఛీ, విద్యార్థుల ముందే బట్టలు విప్పి...
లక్నో: విద్యార్థులకు చదువుతో వారికి మంచి చెడులను కూడా బోధించే వాడే ఉపాధ్యాయుడు. అందుకే ఉపాధ్యాయ వృత్తికి సమాజంలో ఓ గౌరవం ఉంది. అయితే ఓ ప్రధానోపాధ్యాయుడు మాత్రం ఛీ ఇవేం పనులు అనుకునేలా తప్పతాగి పాఠశాలకు వెళ్లడమే కాకుండా తరగతి గదిలోనే ఆదమరిచి నగ్నంగా నిద్రపోయాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో బహ్రైచ్ జిల్లాలోని శివపుర్ బైరాగి ప్రాథమిక పాఠశాలలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. విశేశ్వరగంజ్ బ్లాక్‌లోని శివపుర్ బైరాగి ప్రాథమిక పాఠశాలలో దుర్గా ప్రసాద్ జైశ్వాల్ అనే వ్యక్తి ప్రధానోపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. కొద్ది రోజులు క్రితం ఫూటుగా మద్యం సేవించి పాఠశాలకు వెళ్లాడు. విద్యార్థుల మందే దుస్తులన్నీ విప్పేసి నగ్నంగా నిద్రపోయాడు. ఇదంతా కొందరు వీడియో తీసి నెట్టింట షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో అతన్ని విధుల నుంచి సస్పెండ్ చేశారు. విద్యార్థినుల ముందు దుర్గా జైస్వాల్ అనుచిత ప్రవర్తన గురించి తెలిసి తల్లిదండ్రులు, గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఆ ప్రధానోపాధ్యాయుడు తరచూ ఇలాంటి చర్యలను పాల్పడేవాడని ఆరోపించారు. ఇటువంటి చేష్టలతో ఇబ్బంది పడిన విద్యార్థినులు కొందరు పాఠశాలకు వెళ్లడం మానేసినట్లు తెలిపారు. ఫిర్యాదుపై చర్య తీసుకున్న ప్రాథమిక శిక్షా అధికారి (బిఎస్ఎ) బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్‌తో విచారణకు ఆదేశించడంతో పాటు దుర్గా జైస్వాల్‌ను సస్పెండ్ చేశారు. అతడిపై శాఖాపరమైన విచారణ జరుగుతోందని.. అవసరమైతే, ప్రధానోపాధ్యాయుడిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసే అవకాశముందని అధికారులు తెలిపారు. చదవండి జేసీబీతో ఏటీఎంపై దాడి.. దోపిడీకి దొంగల యత్నం -
పిల్లలకు పని చెప్పి హాయిగా కునుకు తీసిన హెడ్ మాస్టర్..
భోపాల్: బాధ్యతగల ఉపాధ్యాయ వృత్తిలో ఉండి పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సింది పోయి బడి ఆవరణను శుభ్రం చేయమని పిల్లలకు చెప్పి తాను మాత్రం స్కూలు బ్యాగ్ ను తలదిండుగా చేసుకుని కునుకు తీశాడో ప్రధానోపాధ్యాయుడు. మధ్యప్రదేశ్ చత్తార్ పూర్ లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు ఆదమరచి నిద్రిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. లవకుశ నగర్ ప్రాధమిక పాఠశాలలో రాజేష్ కుమార్ అడ్జారియా హెడ్ మాస్టర్ గా పని చేస్తున్నారు. పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన సమయంలో బయట ఆవరణ శుభ్రం చేయమని చెప్పి వారి చేతికి చీపుర్లు ఇచ్చాడు. ఈ విరామంలో ప్రధానోపాధ్యాయుడు పిల్లల స్కూలు బ్యాగులను తలకింద దిండుగా పెట్టుకుని ఎంచక్కా సేదదీరాడు. ఆడపిల్లలు స్కూలు మొత్తాన్ని శుభ్రం చేస్తుండగా మగపిల్లలు మాత్రం ఆడుకంటూ ఉన్నారు. స్థానికులు ఈ విషయాన్ని గమనించి చోద్యం మొత్తాన్ని సెల్ ఫోన్లో చిత్రీకరించారు. ఈ వీడియో ఒక చరవాణి నుండి మరోదానికి చేతులు మారుతూ పాఠశాలలో చదువుతున్న పిల్లల బంధువుల చేతికి చేరింది. ఇంకేముంది వారు పిల్లల తల్లిదండ్రులకి విషయాన్ని తెలియజేశారు. బాగుపడుతుందనుకున్న తమ బిడ్డల జీవితం ఇలాంటి అధ్యాపకుల చేతిలో పడితే అంతే సంగతులని భావించి తలిదండ్రులు పై అధికారులకు ఫిర్యాదు చేశారు. తక్షణమే ఆ ప్రధానోపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకోమని డిమాండ్ చేశారు. Caught on camera: #MadhyaPradesh school headmaster takes a nap in classroom while students clean the floor. #viral Watch: https://t.co/dAOjb2JoMT pic.twitter.com/b1Ka8JWnMX — editorji (@editorji) July 15, 2023 ఇది కూడా చదవండి: మంత్రి ఆకస్మిక తనిఖీ.. ఫుల్లుగా తాగి పడుకున్న పంచాయతీ కార్యదర్శి -
టీచర్ @ ఎకో స్మార్ట్ కుండీ
లక్ష్మీదేవికి పాఠాలూ ప్రయోగాలే ఊపిరి. క్లాసులో పాఠంతోపాటు ప్రయోగమూ చేయిస్తారు. మొక్క కోసం నేలకు హాని తలపెడితే ఎలా? అందుకే నేలకు మేలు చేసే పూల కుండీ చేశారు. ఆ.. ఎకో స్మార్ట్ పూల కుండీ... అంతర్జాతీయ సదస్సులో ప్రదర్శితం కానుంది. ‘టీచర్ ఉద్యోగం ఒక వరం. దేవుడిచ్చిన ఈ అవకాశానికి నూటికి నూరు పాళ్లు న్యాయం చేయాలనేది నా ఆశయం’ అన్నారు కొల్లాటి లక్ష్మీదేవి. ఆమె పుట్టింది, పెరిగింది మచిలీ పట్నంలో. ఎమ్ఎస్సీ, బీఈడీ చేసి 1995లో డీఎస్సీ సెలెక్షన్లో ఉద్యోగం తెచ్చుకున్నారు. తొలి పోస్టింగ్ కృష్ణాజిల్లా, సుల్తానగరంలో. అప్పటి నుంచి మొదలైందామె విజ్ఞాన దానయజ్ఞం. ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పాఠ్యాంశాల్లో ఉన్న విషయాలను ప్రయోగాత్మకంగా చేసి చూపించడంతో మొదలైందా యజ్ఞం. పదేళ్ల తర్వాత పెడన మండలం చెన్నూరు ఈస్ట్‌లో మరో స్కూల్‌కి హెడ్మాస్టర్గా బదిలీ. ఆ సంతోషం ఆ స్కూల్‌కి వెళ్లే వరకే. పదిహేనుమంది పిల్లలున్న స్కూల్ అది. అలాగే వదిలేస్తే ఇద్దరు టీచర్ల స్కూల్లో ఒక పోస్ట్ రద్దయ్యే పరిస్థితి. ఇంటింటికీ వెళ్లి ‘మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపించండి. మంచి విద్యనందిస్తాం. మా మీద నమ్మకం ఉంచండి’ అని నచ్చచెప్పి ఎన్రోల్మెంట్ 45కి పెంచారు. సైన్స్ ప్రాజెక్టులు చేయించడం ద్వారా విద్యార్థుల్లో ఉత్సాహాన్ని కలిగిస్తూ పాఠశాల పిల్లలను అయస్కాంతంలా ఆకర్షించేటట్లు చేశారు. ఆ తర్వాత చెన్నూరు జిల్లా పరిషత్ స్కూల్‌కి వచ్చినప్పటి నుంచి పెద్ద తరగతులకు పాఠం చెప్పే అవకాశం రావడంతో మరింత విస్తృతంగా ప్రయోగాలు మొదలుపెట్టారు. వందకు పైగా ప్రయోగాలు చేసిన ఆమె ప్రయోగాల్లో ఎకో ఫ్రెండ్లీ పూల కుండీ ప్రయోగం అంతర్జాతీయ స్థాయికి చేరింది. ఈ నెల 13 నుంచి 18 వరకు ఆమె విద్యార్థులు మణికంఠ, వినయ కుమార్‌లు యూఎస్‌లోని టెక్సాస్ రాష్ట్రం, డల్లాస్ నగరంలో జరిగే ఐఎస్ఈఎఫ్ ఇంటర్నేషనల్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ ఫెయిర్‌లో ‘స్మార్ట్ సొల్యూషన్ ఫర్ ఎకో పొల్యూషన్’ పేరుతో ఈ ప్రయోగాన్ని ప్రదర్శించనున్నారు. తన ప్రయోగాల పరంపరను సాక్షితో పంచుకున్నారు లక్ష్మీదేవి. ఎంత నేర్పిస్తే అంత నేర్చుకుంటారు! పిల్లల మెదడు కొత్త విషయాలను తెలుసుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. వాళ్లకు మనం మనసు పెట్టి నేర్పిస్తే వాళ్లు అంతే చురుగ్గా నేర్చుకుంటారు. ప్రయోగాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. పాఠాలను ప్రయోగాత్మకంగా వివరించడానికి స్లయిడ్లు, స్టెమ్, లీఫ్, ప్లవర్ల భాగాలు నిలువుకోత, అడ్డకోతల నుంచి శరీర అవయవాల పనితీరును వివరించడానికి వధశాలల నుంచి మూత్రపిండాలు, గుండె, ఊపిరితిత్తులను సేకరించేదాన్ని. ఒక సైన్స్ ఫేర్‌లో సులువైన పద్ధతిలో పుట్టగొడుగుల పెంపకాన్ని నిరూపించాం. కానీ మా స్కూల్‌కి గణితం విభాగంలో ఒక అవార్డ్ ప్రకటించడంతో అదే స్కూల్‌కి రెండో అవార్డు ఇవ్వకూడదని చెప్పి అప్రిషియేషన్ ఇచ్చారు. నాచుతో సేద్యం ప్రయోగం రాష్ట్ర స్థాయికి ఎంపికైంది. కోవిడ్ సమయంలో ఎక్కువ ఖాళీ సమయం వచ్చింది. మా ఇంటి ఎదురుగా సంతలో అమ్మే మొక్కలు, నర్సరీల వాళ్లు వాడే పాలిథిన్ కవర్ల మీద దృష్టి పడింది. వాటికి ప్రత్యామ్నాయం కోసం ప్రయోగాలు మొదలుపెట్టాను. వేరుశనగపొట్టు, వేపాకు, కొబ్బరి పీచు, మెంతుల మిశ్రమంతో కుండీ తయారీ విజయవంతమైంది. ఎండకు, వానకు తట్టుకుని నిలవడంలో కష్టమవడంతో కలంకారీలో ఉపయోగించే సహజ రంగులను వేయడంతో సమస్య పరిష్కారమైంది. ఇక అవి మట్టిలో కలిసిపోవడం గురించినదే అసలు ప్రశ్న. నెలరోజుల్లో డీ కంపోజ్ అవుతోంది. ఈ కుండీ మట్టిలో కలిసిన తరవాత మట్టికి పోషణనిస్తోందా లేదా అనే విషయాన్ని నిర్ధారించుకోవడమూ అవసరమే. ఎన్పీకే చాలా తక్కువగా ఉన్న మట్టిలో వేసి, కలిసిపోయిన తర్వాత మట్టిని మళ్లీ టెస్ట్‌కి పంపిస్తే ఎన్పీకే గణనీయంగా పెరిగినట్లు రిపోర్ట్ వచ్చింది. అంతే కాదు నీటిని నిలుపుకునే శక్తి పెరిగింది, వేపలోని యాంటీ మైక్రోబియల్ స్వభావం వల్ల తెగుళ్లు నివారణ సాధ్యమైంది. పైటో కెమికల్స్ ఉన్నాయని ల్యాబ్టెస్ట్లో నిర్ధారణ అయింది. నేషనల్ చైల్డ్ సైన్స్ కాంగ్రెస్ పెట్టిన సైన్స్ ఫేర్లలో మండలం, డివిజన్, జిల్లా, రాష్ట్ర స్థాయులు దాటి జాతీయ స్థాయిలో కూడా ప్రదర్శించాం. మెరిటోరియస్ అవార్డు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి ‘బెస్ట్ గైడ్ టీచర్’ అవార్డు అందుకున్నాను. ఈ ప్రయోగాన్ని అంతర్జాతీయ వేదిక మీద ప్రదర్శించడానికి పెడన నుంచి ఈరోజు బయలుదేరుతున్నాం. ఢిల్లీలో కార్యక్రమాలు పూర్తి చేసుకుని 12వ తేదీన అమెరికా విమానం ఎక్కుతారు మా పిల్లలు’’ అని సంతోషంగా చెప్పారు లక్ష్మీదేవి. ఫ్లోరైడ్ జవాబు దొరికింది! నేను గర్వంగా చెప్పుకోదగిన ప్రయోగాల్లో ఫ్లోరైడ్ నీటిని శుద్ధి చేసే కుండ కూడా ముఖ్యమైనదే. మట్టిలో తులసి, మునగ ఆకులు కలిపి చేశాను. ఫ్లోరైడ్ 3.5 పీపీఎమ్ ఉన్న నీటిలో అడవుల్లో దొరికే చిల్లగింజలను వేసి హార్డ్నెస్ తగ్గించిన తరవాత ఆ నీటిని నేను చేసిన కుండలో పోసి ఆరు గంటల తర్వాత టెస్ట్ చేస్తే పీపీఎమ్ 1.5 వచ్చింది. ఈ కుండలో శుద్ధి అయిన నీటి పీహెచ్ సాధారణ స్థాయుల్లో ఉండడమే కాదు నీటిలో ఉండాల్సిన కంపోజిషన్స్ అన్నీ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఈ ప్రయోగాన్ని మినిస్ట్రీ ఆఫ్ ఇన్నోవేటివ్ అండ్ ఎడ్యుకేషన్ నిర్వహించిన స్మార్ట్ ఇండియన్ హాకథాన్‌లో ప్రదర్శించాం. ‘ద ఇనిషి యేటివ్ రీసెర్చ్ ఫర్ ఇన్నోవేషన్ ఇన్‌స్టెమ్ (ఐరిస్)’ నిర్వహించిన పోటీలో ప్రదర్శించినప్పుడు నా స్టూడెంట్ ‘సీహెచ్. తరుణ్‌బాబు’కి ‘యంగ్ ఇన్నోవేటర్ అవార్డు’, 45 వేల క్యాష్ ప్రైజ్ వచ్చింది. ఫిఫ్త్ యాన్యువల్ ఇంటర్నేషనల్ ఇన్నోహెల్త్ ప్రోగ్రామ్ ఢిల్లీ ట్రిపుల్ ఐటీ– ఇన్నో క్యూరియో సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో ఫైనల్స్‌కి వచ్చి ఆరు బెస్ట్ ప్రాజెక్టుల్లో రెండవ స్థానం. – కొల్లాటి లక్ష్మీదేవి, బయలాజికల్ సైన్స్ అసిస్టెంట్, బీజీకే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పెడన, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్ ‘స్మార్ట్ సొల్యూషన్ ఫర్ ఎకో పొల్యూషన్’ పేరుతో మేము తయారు చేసిన ఎకో ఫ్రెండ్లీ పూల కుండీని డల్లాస్‌లో జరిగే ఐఎస్ఈఎఫ్ ఇంటర్నేషనల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఫెయిర్‌లో ప్రదర్శిస్తారు. ఆ కార్యక్రమంలో వంద దేశాలు పాల్గొంటాయి, ప్రదర్శనలో 1800 ప్రాజెక్టులు ఉంటాయి. ఈ కార్యక్రమాన్ని బ్రాడ్‌కామ్ అనే మల్టీనేషనల్ కంపెనీ నిర్వహిస్తోంది. – వాకా మంజులారెడ్డి -
షాకింగ్ ఘటన: పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి 5 ఏళ్లు జైలు శిక్ష
ఒక పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి ప్రత్యేక కోర్టు 5 ఏళ్లు జైలు శిక్ష విధించింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...మధ్యప్రదేశ్‌లోని జిల్లా కేంద్రానికి 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న సూరజ్‌పురకాలన్‌లోని ప్రభుత్వ మిడిల్ స్కూల్లో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న చంద్రభాన్ సేన్ గెస్ట్ టీచర్ లక్ష్మీకాంత్ శర్మ అనే వ్యక్తిని పనిలో చేర్చుకునేందుకు రూ. 2 వేల రూపాయాలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. దీంతో ప్రత్యేక న్యాయస్థానం అవినీతి నిరోధక చట్టం కింద చంద్రబాన్ సేన్‌ను దోషిగా తేల్చి.. ఐదేళ్ల జైలు శిక్ష తోపాటు సుమారు రూ. 30 వేల రూపాయాలు జరిమాన కూడా విధించింది. సదరు గెస్ట్ టీచర్ శర్మ ఈ విషయమై జనవరి 6, 2015న లోకాయుక్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత రెండు రోజల్లోనే వారు వేసిన ప్లాన్‌లో ఇరుక్కుని జైలు పాలయ్యాడు. ఈ మేరకు న్యాయమూర్తి సిన్హా మాట్లాడుతూ...ప్రభుత్వ సేవకులు అవినీతికి పాల్పడటం అనేది సమాజంలో ఎదురవుతున్న అతిపెద్ద సమస్య. అందులోకి ఉపాధ్యాయుడు సమాజంలో కీలకమైన భాగం, పైగా అందరికీ మార్గదర్శి. అలాంటి వ్యక్తే అవినీతికి పాల్పడితే సమాజానికే చేటు అంటూ..సదరు ఉపాధ్యాయుడికి ఈ విధంగా శిక్ష విధిస్తున్నట్లు పేర్కొన్నారు. (చదవండి: పక్కా ప్లాన్‌తో కిడ్నాప్..త్రుటిలో తప్పించుకున్న మహిళ) -
అల్లరి చేస్తున్నారని.. విద్యార్థులను చితకబాదిన హెచ్ఎం
సాక్షి, ఖమ్మం: పలు ప్రాంతాల్లో ఉపాధ్యాయుల తీరుపై విమర్శలు వస్తున్నా... మిగతా వారిలో మార్పు రావడం లేదు. దండన లేని బోధన అందించాలని ప్రభుత్వం, విద్యారంగ నిపుణులు చెబుతున్నా ఉపాధ్యాయులు తీరు మార్చుకోవడం లేదు. ఖమ్మం 4వ డివిజన్ పాండురంగాపురం ప్రాథమిక పాఠశాలలో మంగళవారం ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. పాఠశాలలోని 5వ తరగతిలో 22మంది విద్యార్థులు చదువుతున్నారు. అయితే, మంగళవారం మధ్యాహ్నం పిల్లలు అల్లరి చేస్తున్నారంటూ తరగతి గదికి చేరుకున్న హెచ్ఎం చంద్రు.. వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ చితకబాదాడు. ఆ సమయంలో గది తలుపులు మూసి మరీ కొట్టడంతో పిల్లలు కన్నీరుమున్నీరుగా రోదించారు. పిల్లలను విపరీతంగా కొట్టడంతో శరీరంపై వాతలు తేలగా పాఠశాల సమయం ముగిసినా ఇంటికి వెళ్లకుండా రోదిస్తూ కూర్చున్నారు. దీంతో కొందరు తల్లిదండ్రులు చేరుకోగా విషయం తెలియడంతో మిగతా వారికి కూడా సమాచారం ఇచ్చారు. ఈమేరకు తల్లిదండ్రులంతా చేరుకుని ప్రధానోపాధ్యాయుడు చంద్రుపై తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు. కొందరు ఆయనపై చేయి కూడా చేసుకున్నట్లు తెలిసింది. చివరకు హెచ్ఎం దివ్యాంగుడని తోటి ఉపాధ్యాయులు నచ్చచెప్పడంతో తల్లిదండ్రులు రెండు గంటల అనంతరం శాంతించారు. ఇటీవలే ఆయన బదిలీల్లో భద్రాది కొత్తగూడెం జిల్లా నుండి పాండురంగాపురం వచ్చారు. ఈ ఘటనపై ఎంఈఓ శ్రీనివాస్‌ను ఫోన్ ద్వారా వివరణ కోరగా తనకు విషయం ఇప్పుడే తెలిసిందని, పూర్తిస్థాయిలో సమాచారం తెలుసుకుంటానని వెల్లడించారు. చదవండి: పెంపుడు కుక్క చనిపోయిందని.. డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య -
నువ్వొస్తేనే నేనెళ్తా.. హామీ ఇచ్చేవరకు కదిలేదే లేదు!
తెలంగాణలో విద్యార్థులను బడులకు రప్పించేందుకు ప్రభుత్వ ఉపాధ్యాయులు, అధికారులు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అవసరమైతే బతిమాలి మరీ పిల్లలను పాఠశాలలకు తీసుకువస్తున్నారు. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం డీఈవో, సంగారెడ్డి జిల్లాలో ఓ ప్రధానోపాధ్యాయుడు వినూత్నంగా స్పందించి విద్యార్థులను బడికి రప్పించారు. నువ్వొస్తేనే నేనెళ్తా: డీఈవో జూలూరుపాడు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యాశాఖాధికారి సోమశేఖర శర్మ గురువారం జూలూరుపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. పదో తరగతి విద్యార్థులు ఎక్కువ మంది రాకపోవడాన్ని ఆయన గమనించారు. దీంతో విద్యార్థుల చిరునామాలు తీసుకుని వారి ఇళ్లకు వెళ్లారు. విద్యార్థి పాలెపు జశ్వంత్ మరికొద్ది రోజుల తర్వాత వస్తానని చెప్పగా.. ఈరోజే రావాలంటూ శర్మ అక్కడే బైఠాయించారు. చివరకు ఒప్పించి విద్యార్థిని తీసుకెళ్లి పాఠశాలలో దిగబెట్టారు. కదిలేదే లేదు: హెచ్ఎం పుల్కల్ (అందోల్): బడి మానేసిన పిల్లలను తిరిగి బడికి పంపిస్తామని తల్లిదండ్రులు హామీ ఇచ్చేవరకు కదిలేది లేదంటూ సంగారెడ్డి జిల్లా ముదిమాణిక్యం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీధర్‌రావు వినూత్న ప్రచారం చేస్తున్నారు. మొండికేసిన, బడి మానేసిన పిల్లల్ని పాఠశాలకు పంపాలంటూ బుధవారం గ్రామంలో కొందరి ఇళ్ల ముందు నేలపై పడుకున్నారు. రెండు రోజుల్లో బడి మానేసిన నలుగురు విద్యార్థులను పాఠశాలలో చేర్పించడంలో ఆయన సఫలీకృతులయ్యారు. (క్లిక్: కుమార్తెను ప్రభుత్వ బడిలో చేర్పించిన జూనియర్ సివిల్ జడ్జి) -
ప్లీజ్ సార్, వెళ్లొద్దు.. బోరున విలపిస్తు రోడ్డెక్కిన విద్యార్థులు
జయపురం(భువనేశ్వర్): సమాజంలో తల్లీ, తండ్రి, తరువాతి స్థానం గురువులదే. అటువంటి ఉన్నతమైన గురువులపై ఆరోపణలు చేసేవారే ప్రస్తుతం ఎక్కువ మంది తారస పడుతుంటారు. అయితే ఒక ఉపాధ్యాయుడిని బదిలీ చేసినందుకు ఆ పాఠశాలలోని విద్యార్థులంతా అన్న, పానీయాలు విడిచిన ఘటన సర్వత్రా ఆసక్తి రేపింది. వారి తల్లిదండ్రులు, గ్రామస్తులు సైతం విలపించిన ఘటన నవరంగపూర్ జిల్లా డాబుగాం సమితి మెదన ప్రభుత్వం ఉన్నత పాఠశాలలో గురువారం చోటు చేసుకుంది. పిల్లల ఆవేదనను తెలుసుకున్న డాబుగాం పంచాయతీ అధ్యక్షుడు వంశీధర మఝి, సర్పంచ్ దివాకర పూజారి, పాఠశాల యాజమాన్య కమిటీ అధ్యక్షుడు సబితా కొలారి, గ్రామస్తులు ఉపాధ్యాయుడి బదిలీని రద్దు చేయాలని బ్లాక్ విద్యాధికారిని కోరారు, వివరాల్లోకి వెళ్తే... డాబుగాం సమితిలో కొద్ది రోజుల క్రితం 27 మంది ఉపాధ్యాయులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఇందులో ఆరుగురిని ఎమ్మెల్యే అనుమతితో ఇతర సమితులకు బదిలీ చేశారు. వారిలో మెదన ఉన్నత పాఠశాలలో మెచ్ఎంగా పనిచేస్తున్న దివాకర బారిక్ ఒకరు. ఆయన గత 22 ఏళ్లుగా ఇదే పాఠశాలలో పని చేస్తున్నారు. ఐదేళ్ల క్రితం ప్రధానోపాధ్యాయుడిగా పదోన్నతి పొంది, అక్కడే విధులు నిర్వహిస్తున్నారు. సమర్థవంతంగ సేవలందిస్తూ.. విద్యార్థుల హృదయాలలో చెరగని ముద్ర వేసుకొని, వారి అభిమానానికి పాత్రుడయ్యారు. గుణాత్మకమైన విద్య అందించడం, క్రమశిక్షణ అలవరచడం, ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దటంలో అందరి మన్ననలు పొందారు. అటువంటి ఉపాధ్యాయుడు బదిలీ కావడంతో విద్యార్థులు తీరని ఆవేదనకు గురయ్యారు. తామంతా అభిమానించే ఉపాధ్యాయుడు వెళ్లిపోతున్నారని తెలిసిన బోరున విలపించారు. వెంటనే హెచ్ఎం దివాకర బారిక్ బదిలీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. చదవండి: Gram Sarpanch: గ్రామ ప్రజల పాట.. 44 లక్షలకు సర్పంచ్ పదవి! -
నెల్లూరు: మళ్లీ క్షీణించిన కోటయ్య ఆరోగ్యం
-
కరోనా మందు: మళ్లీ క్షీణించిన కోటయ్య ఆరోగ్యం
సాక్షి, నెల్లూరు: రెండు రోజుల క్రితం ఆనందయ్య ఆయుర్వేద మందుతో ఆక్సిజన్ లెవల్స్ పెరిగాయన్న రిటైర్డ్ హెడ్మాస్టర్ కోటయ్య ఆరోగ్యం మళ్లీ క్షీణించింది. ఈ రోజు ఆక్సిజన్ లెవల్స్ తగ్గడంతో కోటయ్యను ఆస్పత్రికి తరలించారు. కాగా, కృష్ణపట్నం ఆనందయ్య కరోనా మందు పంపిణీకి వారం పాటు బ్రేక్ పడింది. కరోనా మందుపై ఆయుష్ కమిషనర్ రాములు ఆధ్వర్యంలో అధ్యయనం కొనసాగుతోంది. శనివారం ఉదయం ఆయుర్వేద నిపుణుడు ఆనందయ్య నివాసానికి చేరుకున్న పోలీసులు.. ఆయుర్వేద మందు పంపిణీ కేంద్రాన్ని ఖాళీ చేయించి, పంపిణీ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. కృష్ణపట్నానికి ఐసీఎంఆర్ బృందం రానుంది. బ్లాక్మార్కెట్లో ఆనందయ్య కరోనా మందు మరో వైపు కరోనా మందు పేరుతో బ్లాక్మార్కెట్లో విక్రయాలు జరుగుతున్నాయి. ప్రజల అవసరాలను కేటుగాళ్లు క్యాష్ చేసుకుంటున్నారు. ఆనందయ్య కరోనా మందుకు బ్లాక్ మార్కెట్లో రూ.3 వేల నుంచి 10 వేల డిమాండ్ ఏర్పడింది. చదవండి: ఆనందయ్య కరోనా మందు: ల్యాబ్ నుంచి పాజిటివ్ రిపోర్ట్ 50 పడకలు దాటితే.. ఆస్పత్రుల్లోనే ఆక్సిజన్ ప్లాంట్లు -
అదృశ్యం..అనుమానాస్పదం
సాక్షి, బంజారాహిల్స్: రోజులు గడుస్తున్నా అదృశ్యమైన ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడి ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. విద్యార్ధులకు విద్యాబుద్దులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడే సెల్‌ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పోలీసులు, కుటుంబ సభ్యులకు దొరక్కుండా తప్పించుకు తిరుగుతుండటం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. ఫిలింనగర్ రౌండ్‌టేబుల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఇన్ఛార్జ్ హెడ్మాస్టర్ షేక్ అబ్దుల్ రహీం(48) అనుమానాస్పద స్థితిలో అదృశ్యమయ్యాడు. అతడి భార్య ముబీన్‌ఫాతిమా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఓవైసీ కాలనీలో ఉంటున్న షేక్ అబ్దుల్ రహీం నాలుగేళ్లుగా ఫిలింనగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెడ్మాస్టర్గా పని చేస్తున్నారు. మే 1న స్కూల్‌కు వెళ్లారు. మధ్యాహ్నం అతడి భార్య ఫాతిమా ఆయనకు ఫోన్ చేసి లంచ్‌కు వస్తున్నారా అని అడిగింది. పని పూర్తయ్యాక వస్తానని చెప్పాడు. సాయంత్రం అతను ఇంటికి తిరిగి రాకపోవడంతో గాలింపు చేపట్టింది. వారం రోజుల నుంచి వెతికినా ఫలితం లేకపోవడంతో అదే నెల 8న పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు. ఇదిలా ఉండగా మే 1న సాయంత్రం 5 గంటల ప్రాంతంలో రహీం మలక్‌పేట రైల్వేస్టేషన్లో బైక్ పార్క్ చేసి రైల్లో వెళ్లినట్లు సీసీ ఫుటేజీల ద్వారా గుర్తించారు. జూన్ 2న దిల్‌సుఖ్‌నగర్‌లోని ఆంధ్రాబ్యాంకులో రూ.40వేలు డ్రా చేసినట్లు సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది. రహీం హైదరాబాద్‌లోనే ఉన్నాడని, తన కుటుంబ సభ్యులకు దొరక్కుండా దాక్కున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రతినెలా జీతంమాత్రం డ్రా చేస్తున్నట్లు రికార్డులు వెల్లడిస్తున్నాయి. -
జి.బొడ్డాపుట్టు బాలికల ఆశ్రమంలో వివాదం
విశాఖపట్నం, హుకుంపేట(అరకులోయ): జి.బొడ్డాపుట్టు గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో ప్రదానోపాధ్యాయురాలు, 9వ తరగతి విద్యార్ధుల మధ్య వివాదం నెలకొంది. హెచ్ఎం తమను వేధిస్తుందని, నాణ్యమైన భోజనం కూడా పెట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థులంతా గురువారం ఉదయం ఫలహారం, మధ్యాహ్నం భోజనం చేయకుండా, ఆశ్రమం వదిలి ఇళ్లకు వెళ్లిపోయిన ఉదంతం ఆలస్యంగా వెలుగు చూసింది. 33 మంది విద్యార్థినులు ఆశ్రమ పాఠశాలను వదిలి, ఇళ్లకు వెళ్లిపోయిన సంఘటనతో జి.బొడ్డాపుట్టు ప్రాంతంలో కలకలం రేగింది. శుక్రవారం ఉదయం 9వ తరగతి గదిలో ఒక్క విద్యార్థిని కూడా లేక గది ఖాళీగా ఉంది. ప్రధానోపాధ్యాయురాలు రూపవతి, డిప్యూటి మేట్రిన్ విధులకు కూడా నిర్వహిస్తున్నారు. ఆమె విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారం పెట్టడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. విద్యార్థినులంతా మాకుమ్మడిగా ఇళ్లకు వెళ్లిపోయిన సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలను చెప్పడానికి ఆశ్రమ పాఠశాలలోని మిగతా ఉపాధ్యాయులు కూడా నిరాకరించారు. తోటి విద్యార్థులు కూడా వివరాలు చెప్పడానికి భయపడుతున్నారు. హెచ్ఎం రూపవతి సమావేశం నిమిత్తం పాడే రు వెళ్లడంతో ఆమె వివరణకు అందుబాటులో లేరు. అయితే 9వ తరగతి విద్యార్థినులు ఇళ్లకు వెళ్లిపోయిన సమాచారాన్ని గిరిజన సంక్షేమశాఖ అధికారులకు జి.బొడ్డాపుట్టు గిరిజనులు చేరవేశారు. -
ప్రభుత్వ స్కూల్‌ని కోళ్లఫారం చేశారు
రాంపూర్: ఫర్యాద్ అలీ ఖాన్ ఓ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వ్యాపారవేత్తగా మారిపోయారు. వేసవి సెలవులకు విద్యార్థులు అలా వెళ్లిపోయారో లేదో వెంటనే ప్రభుత్వ పాఠశాలను కోళ్ల ఫారంగా మార్చేశారు. స్థానికంగా కోళ్ల వ్యాపారం చేసే ఓ వ్యక్తితో అవగాహన చేసుకొని పిల్లల జీవితాలను తీర్చిదిద్దే సరస్వతీ నిలయాన్ని వ్యాపార క్షేత్రంగా మార్చి కోళ్ల కంపు చేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ జిల్లాలోని దర్శన్పూర్లో చోటుచేసుకుంది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో వేగంగా స్పందించిన జిల్లా విద్యాధికారులు అతడిపై వేటు వేశారు. అతడిని సస్పెండ్ చేసి విచారణకు ఆదేశించారు. ఈ కోళ్ల ఫారంను నడుపుతున్న వ్యక్తి దర్శనపూర్ గ్రామంలో గ్రామ ప్రధాన్‌గా పనిచేస్తున్న మహిళ భర్తేనంట. అతడితో డబ్బులకు ఒప్పందం చేసుకొని ఆ ప్రధానోపాధ్యాయుడు ఈ ఘనకార్యం నిర్వహించినట్లు ప్రాథమిక సమాచారం. ఓ వీడియోను రహస్యంగా తీసి సోషల్ మీడియాలో పెట్టడం వల్ల అది కాస్త బయటకు వచ్చి ఆ హెడ్మాస్టర్ను పట్టించింది. -
అబార్షన్ మాత్రలు మింగించిన హెచ్ఎం
► మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే రెండో వివాహం చేసుకున్న హెచ్ఎం ► కట్నం తీసుకురావాలంటూ వేధింపులు ► ఆడపిల్ల పుడుతుందేమోనని అబార్షన్ మాత్రలు మింగించి గదిలో బంధింపు ► ఫిర్యాదు చేసిన మూడు నెలలకు ఎఫ్ఐఆర్ నమోదు ► కేసులు పెడితే..పలుకుబడితో తొక్కేస్తానంటూ హెచ్ఎం బెదిరింపులు ► న్యాయం చేయాలని వేడుకుంటున్న బాధితురాలు కందుకూరు రూరల్ : మొదటి భార్య నుంచి విడాకులు తీసుకోకుండానే ఓ హెడ్మాస్టర్ రెండో వివాహం చేసుకుని..ఆమెను కట్నం కోసం వేధించడమే కాక అబార్షన్ మాత్రలు మింగించి ఓ గదిలో బంధించాడు. తనకు జరిగిన అన్యాయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు మూడు నెలల పాటు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని బాధితురాలు వాపోతోంది. బాధితురాలు సీహెచ్.వెంకట సుహాసిని తెలిపిన వివరాల మేరకు..వలేటివారిపాలెం మండలం పోలినేనిపాలేనికి చెందిన బీరకాయల మాధవరావు ప్రస్తుతం కందుకూరు పట్టణంలోని సాయినగర్‌లో నివాసం ఉంటున్నాడు. ముండ్లమూరివారిపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయునిగా పనిచేస్తున్నాడు. ఉలవపాడుకు చెందిన సీహెచ్.మాలకొండయ్య రెండో కుమార్తె సుహాసినిని గతేడాది డిసెంబర్ 31వ తేదీన పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికీ ఇది రెండో వివాహం. సుహాసిని మొదటి భర్త నుంచి విడాకులు తీసుకొని ఉంది. మాధవరావు మొదటి భార్య నుంచి విడాకులు తీసుకున్నానని అందరికీ చెప్పాడు. తీరా పెళ్లి పీటలపై విడాకుల పత్రాలు చూపించాలని ఒత్తిడి చేయడంతో అప్పటికప్పుడు మొదటి భార్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని..తన ఇష్టపూర్వకంగా సుహాసినిని వివాహం చేసుకుంటున్నానని హామీ పత్రాలు రాసి అతని కుటుంబ సభ్యులు కూడా సంతకాలు చేసిచ్చాక పెళ్లిచేసుకున్నాడు. పెళ్లి సమయంలో కట్నకానుకల ప్రస్తావన తేలేదు. కాపురం పెట్టిన కొద్దిరోజులకే వారిమధ్య మనస్పర్ధలు మొదలయ్యాయి. కట్నం పేరుతో డబ్బులు తీసుకురావాలని..కొంత బంగారం చేయించమని సుహాసినిపై ఒత్తిడి చేశాడు. సుహాసిని వాళ్లు ముగ్గురు ఆడపిల్లలు. తండ్రి, అక్క మరణించారు. తండ్రి పింఛన్ డబ్బులతో తను, తల్లి, చెల్లెలు ఉండేవారు. ఉన్న ఆస్తిని అమ్మేసి తన వాటా తీసుకురావాలంటూ సుహాసినిని హింసించడం మొదలుపెట్టాడు. మాధవరావు మొదటి భార్యకు ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. ఇప్పటికే ఇద్దరు మగపిల్లలు ఉన్నారు కదా..మనకు ఆడపిల్ల చాలని సుహాసిని చెప్పింది. దీంతో ఆగ్రహించిన మాధవరావు ఆడపిల్ల అని తెలిస్తే అబార్షన్ చేయిస్తానని హెచ్చరించాడు. ఈలోపు ఏవో మాత్రలు తీసుకొచ్చి..అవి మింగితే ఆరోగ్యం బాగుంటుందని..పుట్టబోయే బిడ్డ కూడా బాగుంటుందని చెప్పడంతో నమ్మి సుహాసిని మింగింది. మింగిన తర్వాత ఒక గదిలో ఉంచి బయటకు రానివ్వలేదు. దీంతో అబార్షన్ అయి తీవ్రంగా నీరసించిపోయిన సుహాసినిని జనవరి 26వ తేదీన ఉలవపాడులోని ఆమె పుట్టింటి వద్దకు కారులో తీసుకొచ్చి వదిలేసి వెళ్లాడు. అప్పటి నుంచి వెంకట సుహాసినిని పట్టించుకోలేదు. పెళ్లి చేసిన పెద్దల ద్వారా రెండు, మూడు సార్లు పంచాయితీ పెట్టించినా లాభం లేకుండా పోయింది. ఆమె నాకు వద్దు..అవసరమైతే నష్టపరిహారం ఇస్తానన్నాడు. మాధవరావుపై ఫిబ్రవరిలో ఉలవపాడు, కందుకూరు పోలీస్స్టేషన్లలో సుహాసిని ఫిర్యాదు చేసింది. కేసులు పెడితే ఏమవుతుంది..నాకున్న పలుకుబడితో తొక్కేస్తానని బెదిరిస్తున్నారని సుహాసిని ఆవేదన వ్యక్తం చేసింది. పలుమార్లు పోలీసులను అడగడంతో ఫిర్యాదుపై ఈనెల 23న కేసు కట్టారని..అయినా ఇంత వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించింది. కేసు నమోదు చేశాం..ఇన్చార్జ్ ఎస్సై ప్రభాకర్‌రావు సీహెచ్.వెంకటసుహాసిని ఫిర్యాదు మేరకు 23వ తేదీ సాయంత్రం కేసు నమోదు చేశాం. రెండు స్టేషన్ల పరిధిలో కేసు ఉంది. మాధవరావు అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నాం. త్వరలో అరెస్టు చేస్తాం. -
విద్యార్థినిపై హెచ్ఎం పలుమార్లు అత్యాచారం
కొరాపుట్(ఒడిశా): మాయ మాటలు చెప్పి పదో తరగతి విద్యార్థినిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన ఓ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్సీ, ఎస్టీ బాలికల ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు(57) పదో తరగతి తరగతి బాలికను మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు. గత మార్చి 19న విద్యార్థినిని తన గదికి రప్పించుకున్నాడు. అప్పటినుంచి బాలికపై పలుమార్లు అత్యాచారం చేస్తున్నాడు. అదేరోజు తమ కూతురు కనిపించడంలేదని ఆమె తల్లిదండ్రులు పొట్టంగీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన తాము హెచ్ఎం మీద అనుమానం వచ్చి అతడి ఫోన్‌కాల్స్ ఆధారంగా ట్రేస్ చేసి బాలికను సోమవారం గుర్తించినట్లు ఇన్ స్పెక్టర్ దేవ్ గమాంగ్ తెలిపారు. ఈ మేరకు హెచ్ఎంను అదుపులోకి తీసుకుని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. పెళ్లి చేసుకుంటానని చెప్పి, హెచ్ఎం తనపై పలుమార్లు లైంగికదాడికి పాల్పడినట్లు బాధిత బాలిక పోలీసులకు తెలిపింది. వైద్య పరీక్షల నిమిత్తం ఇద్దరినీ ఆసుపత్రికి తరలించారు. ఈ నీచానికి ఒడిగట్టిన హెచ్ఎంను సస్పెండ్ చేసినట్లు విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. -
అశ్లీల చిత్రాలు చూపించిన హెచ్ఎం
బాదసాహి: ఒడిషాలో దారుణం సంఘటన వెలుగు చూసింది. విద్యాబుద్దులు నెర్పాల్సిన ప్రధానోపాధ్యాయుడు బాధ్యతలు మరిచి ప్రవర్తించాడు. విద్యార్ధులకు పాఠాలకు బదులు అశ్లీల చిత్రాలు చూపించాడని ఆ ప్రధానోపాధ్యాయుడిపై గ్రామస్థులు, విద్యార్థుల తల్లితండ్రులు దాడి చేశారు. ఈ దారుణ ఘటన ఒడిషాలోని మాయుబంజ్ జిల్లా బాదసాహిలో జరిగింది. దుర్గచరణ్ గిరి (59) మర్కుండి ప్రాథమిక ప్రభుత్వ పాఠశాల్లో ప్రధానోపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. బుధవారం పాఠశాల్లో ప్రధానోపాధ్యాయుడు అశ్లీల చిత్రాలు చూపించాడని ముగ్గురు విద్యార్ధులు తల్లితండ్రులకు చెప్పారు. దీంతో గురువారం తల్లితండ్రులు, గ్రామస్థులు పాఠశాలకు పెద్ద ఎత్తున చేరి టీచర్‌పై దాడిచేసి ఆందోళన చెపట్టారు. పోలీసులు రంగప్రవేశం చేసి ప్రధానోపాధ్యాయుడిని అదుపులోకి తీసుకున్నారు. గ్రామస్థుల ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలిలంచామని పోలీసులు తెలిపారు. -
ఇది ఏమి పనయ్యా.. ప్రధానోపాద్యాయ
చెన్నై: పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులతో బాలికలను లైంగిక వేదించాడు ఓ ప్రధానోపాధ్యాయుడు. ఈ ఘటన తమిళనాడులోని నాగపట్టినం జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని గవర్నమెంట్ ఎయిడ్ పాఠశాల్లో హెచ్ఎంగా విధులు నిర్వహిస్తున్న మణికందన్ (45) గత కొన్ని రోజులుగా పదో తరగతి పిల్లలకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాడు. తరగతులకు హాజరైన బాలికలను లైంగిక వేదించాడు. ఈ విషయాన్ని విద్యార్థినులు తల్లి తండ్రులకు తెలియజేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. తల్లితండ్రులు మంగళవారం హెచ్ఎంపై దాడి చేసి స్కూల్ ముందు ధర్నా చేశారు. పోలీసులకు, ఎమ్మార్వోకు సమాచారం అందడంతో హెచ్ఎంను తహశీల్ధార్ సస్పెండ్ చేశారు. పోలీసులు హెచ్ఎంను అరెస్టు చేసి నాగపట్టినం మహిళా కోర్టులో హాజరు పరిచగా కస్టడీలోకి తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. -
మద్యం మత్తులో పాఠశాలకు..
గార్లదిన్నె: పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి.. వారి భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన ఓ ప్రధానోపాధ్యాయుడు మద్యం మత్తులో విధులకు హాజరయ్యాడు. దీంతో ఆయనను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం ఎర్రగుంట గ్రామంలోని ప్రాధమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా విజయ్‌భాస్కర్ పని చేస్తున్నారు. కాగా విజయ్‌భాస్కర్ పాఠశాలకు మద్యం మత్తులో హాజరవుతున్నట్లు విద్యార్థులు, తోటి ఉపాధ్యాయులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ జరిపిన డీఈవో విజయ్‌భాస్కర్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
విద్యార్థులకు త్రుటిలో తప్పిన ప్రమాదం
మెదక్ జిల్లా చిన్నశంకరంపేట జడ్పీ పాఠశాలలో విద్యార్థులకు త్రుటిలో ప్రమాదం తప్పింది. పాఠశాలలోని ఒక తరగతి గది పైకప్పు పెచ్చులూడి కిందపడ్డాయి. అయితే, ఆసమయంలో విద్యార్థులెవరూ అక్కడ లేకపోవటంతో పెద్ద ప్రమాదం తప్పింది. విషయం తెలిసిన ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. ఘటన నేపథ్యంలో ప్రధానోపాధ్యాయుడు పాఠశాలకు సాయంత్రం సెలవు ప్రకటించారు. -
ఈ మాస్టారు మంచోడు కాడు..
నర్సాపూర్ రూరల్: ఓ ప్రధానోపాధ్యాయుడు విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ సంఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం ఆవంచ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం వెలుగులోకి వచ్చింది. 6, 7 తరగతి చదువుకునే విద్యార్థినులతో ప్రధానోపాధ్యాయుడు విజయ్‌కుమార్ మూడు రోజులుగా అసభ్యకరంగా ప్రవర్తిస్తుండటంతో బాలికలు తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో వారు గ్రామస్తులతో కలసి హెచ్ఎంను నిలదీశారు. ఆగ్రహానికి లోనైన కొందరు నిందితుడిపై దాడికి యత్నించగా..గ్రామ పెద్దలు హెచ్ఎంను గదిలో ఉంచి తాళం వేశారు. విద్యార్థినులతో పాటు ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందిని గ్రామస్తుల సమక్షంలో విచారణ చేసి నిందితుడిని పోలీస్‌స్టేషన్ కు తరలించారు. పూర్తిస్థాయి విచారణ అనంతరం కేసు నమోదు చేస్తామని ఎస్సై తెలిపారు. ఈ విషయమై హెచ్ఎం విజయ్‌కుమార్‌ను వివరణ కోరగా.. కొందరు ఉద్దేశపూర్వకంగా తనపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. హెచ్ఎం తీరుని నిరసిస్తూ గ్రామస్తులు పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. -
ప్రధానోపాధ్యాయుల భర్తీకి రంగం సిద్ధం
– జిల్లాలో 100 హెచ్ఎం పోస్టుల ఖాళీ – పదోన్నతుల ద్వారా నియమించేందుకు చర్యలు – ఇక నుంచి నెలనెలా పదోన్నతులు కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): జిల్లాలో ఖాళీగా ఉన్న ప్రధానోపాధ్యాయుల పోస్టులను భర్తీ చేసేందుకు విద్యాశాఖాధికారులు సన్నద్ధమవుతున్నారు. పది రోజుల్లో పదోన్నతుల ద్వారా నియమించేందుకు విధివిధానాలను రూపొందిస్తున్నారు. రెండేళ్ల నుంచి హెచ్ఎం పోస్టుల భర్తీ ప్రక్రియ నిలిచిపోవడంతో ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో 100 హెచ్ఎం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో ఇన్చార్జి హెచ్ఎంలు పని చేస్తుండడంతో సహ ఉపాధ్యాయులు వారి మాటను లెక్క చేయడం లేదు. దీంతో బోధనాభ్యాస కార్యక్రమాలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. జిల్లా వ్యాప్తంగా 1791 ప్రాథమిక, 454 ప్రాథమికోన్నత, 376 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో ప్రై మరీ విభాగంలో 60, హయ్యర్ విభాగంలో 40 హెచ్ఎం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని రెండేళ్ల నుంచి భర్తీ చేయడం లేదు. దీంతో ఆయా పాఠశాలలకు ఇన్చార్జ్ హెచ్ఎంలు ఉన్నారు. రెండేళ్ల నుంచి పదోన్నతులకు నో రెండేళ్ల నుంచి జిల్లాలో ఉపాధ్యాయుల పదోన్నతులను చేపట్టడం లేదు. గతంలో నెలనెలా పదోన్నతుల ప్రక్రియ ద్వారా ఖాళీ పోస్టులను భర్తీ చేసేవారు. అయితే రెండేళ్ల క్రితం ఉపాధ్యాయుల పదవీ విరమణ వయస్సును ప్రభుత్వం అదనంగా రెండేళ్లు పొడిగించింది. దీంతో ఒక్క ప్రధానోపాధ్యాయుడు పదవీ విరమణ చేయలేదు. ఈ నేపథ్యంలో పదోన్నతుల ప్రక్రియకు బ్రేక్ పడింది. ఈ డాది జూన్ ఒకటో తేదీ నుంచి ఉపాధ్యాయుల పదవీ విరమణలు ప్రారంభం కావడంతో మళ్లీ నెలనెలా పదోన్నతుల ద్వారా ఖాళీగా ఉన్న హెచ్ఎం పోస్టులను భర్తీ చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పదవీ విరమణ చేసి ఖాళీగా ఉన్న పోస్టుల్లో పదోన్నతుల ద్వారా హెచ్ఎంలను నియమిస్తారు. ప్రాథమిక పాఠశాలల హెచ్ఎం పోస్టులను ఎస్జీటీ ఉపాధ్యాయులు, ఉన్నత పాఠశాలల హెచ్ఎంలకు స్కూల్ అసిస్టెంటు ఉపాధ్యాయులకు పదోన్నతి కల్పించి భర్తీ చేస్తారు. ఈ మేరకు ఎంఈఓలు, డీవైఈఓలకు ఉపాధ్యాయుల సీనియార్టీ జాబితాను ఇవ్వాలని జిల్లా ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో ఉపాధ్యాయులు సీనియారిటీ జాబితాను డీఈఓ బ్లాగ్‌లో ఉంచి అభ్యంతరాలకు కూడా పిలుపునిచ్చారు. ఈ ప్రక్రియ మొత్తం దాదాపుగా పది రోజుల్లో పూర్తి కావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ వెంటనే ఖాళీ హెచ్ఎం పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేసేందుకు రంగం అంతా సిద్ధమైంది. ఆర్‌ఎంఎస్‌ఏ పోస్టులను భర్తీ చేయాలి గతంలో 31 మంది స్కూల్ అసిస్టెంట్లకు ఆర్‌ఎంఎస్‌ఏ ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతి కల్పించారు. దీంతో ఆయా పోస్టులు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి. వీటిని కూడా పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి. పది రోజుల్లో హెచ్ఎం పోస్టులను భర్తీ చేస్తాం: రవీంద్రనాథ్‌రెడ్డి, డీఈఓ జిల్లాలో ఖాళీగా ఉన్న హెచ్ఎం పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. పది రోజుల్లో పదోన్నతుల ద్వారా నియమిస్తాం. ఇప్పటికే ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాపై అభ్యంతరాలు కోరాం. ఆ ప్రక్రియ పూర్తవ్వగానే పదోన్నతులు చేపడుతున్నాం. రెండేళ్ల నుంచి పదవీ విరమణలు లేకపోవడంతోనే ఖాళీ హెచ్ఎం పోస్టులను భర్తీ చేయలేకపోయాం. -
వరంగల్‌లో హెడ్మాస్టర్ నిర్బంధం
-
తాగి పాఠశాలకు వచ్చి హెడ్మాస్టర్ వీరంగం
పీకలదాకా తాగి పాఠశాలకు వచ్చిన హెడ్మాస్టర్ అందరిపై చిందులువేస్తూ వీరంగం సృష్టించడంతో గ్రామస్తులు ఉన్నతాధికారులకు ఫిర్యాదుచేశారు. ఎంఈవో వచ్చి ప్రశ్నించినా ఆయనపైనా దుర్భాషలాడుతూ నానా హంగామా చేశాడు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం చారాల ప్రాథమిక పాఠశాలలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. తాగుబోతు ప్రిన్సిపాల్ తమకు వద్దని గ్రామస్థులు ఆందోళనకు దిగారు. పాఠశాల హెడ్మాస్టర్ ఎస్. జయప్రకాష్ సోమవారం ఉదయం తప్పతాగి పాఠశాలకు వచ్చాడు. పిల్లలను పాఠశాలకు తీసుకువచ్చిన హరిప్రసాద్ అనే పేరెంట్ను స్కూల్‌కు ఎందుకొచ్చావని తిట్టాడు. హెడ్మాస్టర్ వాలకం చూసిన అతను గ్రామస్తులకు చెప్పాడు. గ్రామస్తులందరూ పాఠశాల వద్దకు వచ్చి నిలదీయడంతో వారిపై వీరంగం సృష్టించాడు. సమాచారం అందుకున్న ఎంఈవో కోటేశ్వరరావు హుటాహుటిన పాఠశాలకు వచ్చి హెచ్ఎంను సముదాయించేందుకు ప్రయత్నించినా ఆయనపైనా చిందులు వేశాడు. ఎవరికి చెప్పుకుంటావో, ఏం చేసుకుంటావో చేసుకోపో అంటూ తిట్ల దండకం అందుకున్నాడు. దాంతో బిత్తరపోయిన ఎంఈవో వెంటనే డీఈవోకు ఫిర్యాదుచేశారు. గతంలో కూడా హెడ్మాస్టర్ విద్యార్థుల పట్లస తల్లిదండ్రులపట్ల అనుచితంగా వ్యవహరించారని గ్రామస్తులు పేర్కొన్నారు. ఒకటవ తరగతి నుంచి 6వ తరగతి వరకూ ఉన్న ఈ పాఠశాలలో 69 మంది విద్యార్థులు చదువుతున్నారు. ముగ్గురు ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. తాగుబోతు హెడ్మాస్టర్ తమకు వద్దని, వెంటనే అతణ్ణి మార్చాలని గ్రామస్తులు పట్టుపడుతున్నారు. -
ఈ హెడ్మాస్టర్ మాకొద్దు...
చండూరు: అదనంగా ఉపాధ్యాయులను నియమించేందుకు తమ వద్ద నుంచి డబ్బులు వసూలు చేయడమేకాకుండా, విద్యార్థులను చేర్చుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్న ప్రధానోపాధ్యాయుడు తమకు వద్దంటూ నల్లగొండ జిల్లా చండూరు మండలం బోడంగిపర్తిలోని మంచికంటి గోపమ్మ మెమోరియల్ ట్రస్ట్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రులు శనివారం రోడ్డెక్కారు. పాఠశాల గేట్‌కు తాళం వేసి రెండుగంటలకు పైగా రోడ్డుపైనే బైఠాయించారు. హెచ్ఎంను తొలగించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ అదనంగా ఉపాధ్యాయులను నియమించాలని చెప్పి ఒక్కొక్క విద్యార్థి నుంచి రూ.50 వసూలు చేస్తున్నారని ఆరోపించారు. తమ పిల్లలను పాఠశాలలో చేర్పించేందుకు వస్తే ఎంట్రెన్స్ టెస్ట్ పేరుతో 15 రోజులుగా తిప్పుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల హెచ్ఎం తన కూతురుకు ఎలాంటి టెస్ట్ పెట్టకుండానే ఇదే స్కూల్లో పదోతరగతిలో చేర్పించారన్నారు. ట్రిపుల్‌ఐటీలో సీటుకోసమే తన కూతురును చేర్పించారని ఆరోపించారు. ఒక వేళ నిజాయితీగానే ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని అనుకుంటే తను నివాసముండే నల్లగొండ జిల్లా కేంద్రంలోనే చేర్పించ వచ్చుగా అని వారన్నారు. హెచ్ఎంను తొలగించే వరకు ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కక్ష సాధించడానికే: హెచ్ఎం వివరణ ప్రభుత్వ పాఠశాలలో తన కూతురును చేర్పించి ఆదర్శంగా నిలిచానని హెచ్ఎం రాములు తెలిపారు. కావాలనే కొంత మంది తనపై కక్ష సాధిస్తున్నారన్నారు. అదనంగా ఉపాధ్యాయులను నియమించడం కోసం విద్యార్థులనుంచి కొంత నగదు వసూలు చేసిన మాట వాస్తవమేనని అన్నారు. -
ఓ ప్రధానోపాధ్యాయుడి నిర్వాకం
పిల్లలకు పాఠాలు బోధించే ఓ ప్రధానోపాధ్యాయుడి బుద్ధి వక్రమార్గంలో పయనించింది. దళిత మహిళా సర్పంచ్ పప్పీదేవి పట్ల అవమానకరంగా ప్రవర్తించాడు. కుల దురహంకారాన్ని ప్రదర్శించాడు. ఆమె కూర్చున్న కుర్చీని నీటితో శుద్ధి చేయించాడు. గ్రామంలో మధ్యాహ్న భోజనం నాణ్యతపై ఫిర్యాదులు రావడంతో గ్రామ అధికారిగా పప్పీ దేవి పరిశీలనకు వెళ్లినపుడు ఈ ఘటన చోటుచేసుకుంది. మధ్యాహ్న భోజనం నాణ్యతను పర్యవేక్షించేందుకు కాన్పూర్‌లోని దేహత్ పాఠశాలను పప్పీదేవి సందర్శించారు. దీనిపై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సంతోశ్ శర్మను నిలదీశారు. పేద విద్యార్థులకు పెట్టాల్సిన భోజనాన్ని జాగ్రత్తగా అందించాలని.. లేదంటే చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. సర్పంచ్ హెచ్చరికలను ఆయన ఏ మాత్రం ఖాతరు చేయలేదు. పైగా మరింత రెచ్చిపోయాడు. 'నన్ను అడిగేంత ధైర్యం నీకెక్కడిది.. నా ముందే కుర్చీలో కూర్చుంటావా' అంటూ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డాడు. ఎందుకు కూర్చోకూడదని నిలదీసిన పప్పీదేవిని చంపేస్తానంటూ బెదిరించాడు. విషయం తెలిసి అక్కడకు చేరుకున్న ఆమె భర్తపై కూడా బెదిరింపులకు దిగాడు. అంతటితో ఆయన ఆగ్రహం చల్లారలేదు. ఆమె కళ్లముందే ఆమె కూర్చున్న కుర్చీని నీటితో శుద్ధి చేయమని విద్యార్థులకు, పాఠశాల సిబ్బందికి ఆదేశాలు జారీచేశారు. విద్యార్థులు వచ్చి ఆ కుర్చీని శుభ్రం చేసేదాకా వదిలిపెట్టలేదు. దీంతో కలత చెందిన పప్పీదేవి తనకు జరిగిన అవమానాన్ని జిల్లా పాలనా యంత్రాంగం దృష్టికి తీసుకెళ్లారు. వివక్షాపూరితగా వ్యవహరించి, తన పట్ల అనుచితంగా ప్రవర్తించాడన్నారు. తనను, తన భర్తను తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ బెదిరించాడని ఆరోపిస్తూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ జరిపి నివేదిక సమర్పించాలని స్థానిక తహసీల్దారును ఆదేశించారు. -
జెండా ఆవిష్కరిస్తూ కుప్పకూలిన హెడ్మాస్టర్
కథలాపూర్: కరీంనగర్ జిల్లా కథలాపూర్ మండలం గంభీపూర్‌లో గణతంత్ర వేడుకల సందర్భంగా విషాదకర ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉండే నావెల్టీ పబ్లిక్ స్కూల్ ప్రధానోపాధ్యాయుడు భద్రం జెండా ఆవిష్కరిస్తూ కుప్పకూలి మృతి చెందారు. మంగళవారం ఉదయం నేతల చిత్రపటాలకు కొబ్బరికాయ కొట్టి జెండాను ఆవిష్కరించబోతున్న క్రమంలో గుండెపోటు రావడంతో ఆయన కుప్పకూలారు. ఆటోలో ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేయగా, అప్పటికే ఆయన మృతిచెందారు. మృతుడు కేరళ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. -
మదర్సాలో జాతీయగీతం పాడాలన్నందుకు..
కోల్‌కతా: కాజీ మసూం అఖ్తర్.. కోల్‌కతాలోని తల్పుకుర్ ఆరా ఉన్నత మదర్సాలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ గీతాన్ని పాడాలని విద్యార్థులకు బోధించినందుకు ఆయనపై మౌలానాలు, వారి అనుచరులు దాడి చేశారు. దాడికి పాల్పడిన మౌలానాలకు ఐఎస్ఐఎస్ సానుభూతిపరులన్న ముద్ర ఉంది. తనపై దాడి గురించి అఖ్తర్ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ, రాష్ట్ర మైనారిటీ కమిషన్ చైర్మన్‌ను ఆరుసార్లు కలిసినా ఆయనకు ఎలాంటి మద్దతుగానీ, హామీగానీ లభించలేదు. ఇప్పటికే మౌలానాలు అఖ్తర్‌కు వ్యతిరేకంగా ఫత్వా జారీచేశారు. అంతేకాకుండా జాతీయ గీతం దైవదూషణేనని, అది హిందూత్వ గీతమని వారు పేర్కొన్నారు. గత ఏడాది మార్చ్‌లో అఖ్తర్‌పై కొందరు దుండగులు ఇనుపరాడ్లతో దాడి చేశారు. దీంతో తలకు తీవ్ర గాయమైన ఆయన కొన్ని నెలలపాటు ఆస్పత్రి మంచానికే పరిమితమయ్యాడు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఎంపికైన ఉపాధ్యాయుడైనప్పటికీ అఖ్తర్ మదర్సాలోకి ప్రవేశించకుండా నిషేధిస్తూ ఫత్వా జారీచేశారు. ముస్లిం వస్త్రాలైన కుర్తా, పైజామా ధరించి.. గడ్డాన్ని పెంచితేనే ఆయనను మదర్సాలోకి అనుమతిస్తామని, గడ్డం ఎంతవరకు పెంచాలనేది కూడా మౌలానాలే నిర్ణయిస్తారని ఫత్వాలో పేర్కొన్నారు. గడ్డం పెరుగుదల గురించి ప్రతివారం ఫొటోలు పంపుతూ తమకు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. ఇంత జరుగుతున్నా.. మత ఉద్రిక్తతల కారణంగా అఖ్తర్‌కు భద్రత కల్పించలేమంటూ కోల్‌కతా పోలీసు కమిషనర్ మైనారిటీ కమిషన్ చైర్మన్‌కు లేఖ రాయడం గమనార్హం. -
తిరువూరులో దారుణం
-
మహిళా టీచర్‌పై హెడ్మాస్టర్ ప్రతాపం
జాయ్నగర్: విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఆదర్శంగా ఉండాల్సిన హెడ్మాస్టరే రౌడీలా ప్రవర్తించాడు. స్కూల్లో స్టాఫ్ రూమ్‌లో ఓ మహిళా టీచర్‌ను చెంపదెబ్బ కొట్టి జుట్టుపట్టిలాగాడు. ఈ సంఘటన పశ్చిమబెంగాల్లో 24 పరగనాల జిల్లాలోని జాయ్‌నగర్‌లో జరిగింది. జాయ్‌నగర్‌లోని ఓ స్కూల్లో హెడ్ మాస్టర్ అశోక్ నస్కర్, మ్యాథ్స్ టీచర్ సస్వతి కుందు మధ్య ఓ విషయంలో విభేదాలు ఏర్పడ్డాయి. స్పెషల్ క్లాసులు తీసుకోవాల్సిందిగా అశోక్ చెప్పగా.. సస్వతి అందుకు నిరాకరించారు. అశోక్ కోపంతో సస్వతిని చెంపదెబ్బ కొట్టి, ఆమె జట్టు పట్టుకొని ఈడ్చాడు. మహిళా టీచర్‌ను తోసివేసి, ఆమె మొబైల్ ఫోన్‌ను నేలకేసికొట్టాడు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థులు ఆందోళన చేపట్టారు. మహిళా టీచర్ ఫిర్యాదు మేరకు పోలీసులు హెడ్మాస్టర్ను అరెస్ట్ చేశారు. సస్పతికి ఆస్పత్రిలో చికిత్స చేయించారు. -
హెడ్ మాస్టర్ పైశాచికత్వం:విద్యార్థి మృతి
బరాబన్కీ(యూపీ): విద్యార్థిపై పైశాచికత్వాన్ని ప్రదర్శించి అతని మృతికి కారణమయ్యాడో హెడ్ మాస్టర్. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని బద్దాపూర్ చోటు చేసుకున్న ఈ ఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. రహిలామోవ్ గ్రామంలో ఉన్న చౌదరీ ద్వారిక ప్రసాద్ అకాడమీలో శివ రావత్(10) అనే విద్యార్ధి మూడో తరగతి చదువుతున్నాడు. అయితే ఆ విద్యార్థి తరగతిలో పెన్ దొంగిలించాడని హెడ్ మాస్టర్ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో రెచ్చిపోయిన ఆ స్కూల్ హెడ్ మాస్టర్ లలిత్ కుమార్ వర్మ.. రావత్ ఉదర భాగంపై చితకబాదాడు. దీంతో తీవ్ర అస్వస్థతకు గురైన విద్యార్థి వాంతులు చేసుకోవడం ప్రారంభించాడు. ఆ విద్యార్థి పరిస్థితి విషమించడంతో ఆస్పత్రికి తీసుకు వెళ్లారు. కాగా, ఆ విద్యార్థి దారిలోనే చనిపోయినట్లు డాక్టర్లు స్పష్టం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు లలిత్ కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు. -
విద్యార్థుల బియ్యాన్ని బొక్కుతున్న హెడ్మాస్టర్
నల్లగొండ: విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కోసం వినియోగించాల్సిన బియ్యాన్ని బొక్కుతున్నారు. నల్లగొండ జిల్లాలోని ఆత్మకూర్ ఎస్ మండలం మత్తకొత్తగూడెం పాఠశాల ప్రధానోపాధ్యాయుడే బియ్యాన్నిదారి మళ్లిస్తున్న వైనం వెలుగులోకి వచ్చింది. ప్రాధమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు హరిప్రసాదాచారి విద్యార్థుల హాజరును ఎక్కువగా చూపిస్తూ కొన్ని రోజులుగా బియ్యాన్ని బయట మార్కెట్లో అమ్ముకుంటున్నాడు. రోజుకు సుమారు 10 కిలోల చొప్పున బియ్యాన్ని మిగిలించుకుంటూ మార్కెట్లో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నట్టు సమాచారం. మంగళవారం 50 కిలోల బియ్యాన్ని విక్రయించే ప్రయత్నంలో ఉన్న చారిని గ్రామస్తులు పట్టకుని ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. -
విద్యార్థినికి గర్భనిర్ధారణ పరీక్షలు నిర్వహించిన హెడ్ మాస్టర్
తూర్పుగోదావరి: పాఠశాలలో చదువుకుంటున్న ఓ విద్యార్థినిపై ఒక కీచక ఉపాధ్యాయుడు అమానుషంగా ప్రవర్తించాడు. వివరాలు....తూర్పుగోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలం తెడ్డంగి ఆశ్రమ పాఠశాలలో 8 వ తరగతి చదువుతున్న విద్యార్థినికి అదే పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గర్భ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ విషయాన్ని ఆ విద్యార్థిని డీఈఓకు ఫిర్యాదుచేసింది. దీంతో డీఈఓ ఆ ఉపాధ్యాయున్ని సస్పెండ్ చేశారు. -
కాలేజీలో హెడ్మాస్టర్ ఆత్మహత్య
మచిలీపట్నం: కృష్ణాజిల్లా అవనిగడ్డ డిగ్రీ కాలేజీలో ఓ వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ విషయాన్ని శనివారం కళాశాల సిబ్బంది గుర్తించి... పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన డిగ్రీ కాలేజీకి చేరుకుని మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహన్ని మచిలీపట్నంలోని జిల్లా వైద్య ఆసుపత్రికి తరలించారు. మృతుడు నాగాయలంక మండలం ఎదురుమొండి హైస్కూల్ హెడ్మాస్టర్గా పోలీసులు గుర్తించారు. హెడ్మాస్టర్ మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
శభాష్ అలీ......
హైదరాబాద్ : బీబీసీ గుర్తించిన అతి పిన్న వయస్కుడైన ప్రధానోపాధ్యాయుడు బాబర్ అలీని తెలంగాణ మంత్రి కేటీఆర్ అభినందించారు. హైదరాబాద్ రామకృష్ణ మఠంలో మూడు రోజుల పాటు జరుగనున్న జాతీయ యువ సదస్సులో తొలి రోజున 2009 అక్టోబర్‌లో బీబీసీ గుర్తించిన అతి పిన్న వయస్కుడైన ప్రధానోపాధ్యాయుడు బాబర్ అలీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ యువ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన కేటీఆర్ ఈ సందర్భంగా బాబర్ అలీని ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లా బాబ్త గ్రామానికి చెందిన బాబర్ 16 ఏళ్ల వయసులోనేప్రపంచ గుర్తింపు పొందడం విశేషం. వివేకానందుడి స్ఫూర్తితో తొమ్మిదేళ్ల వయసులోనే గ్రామంలోని పేద పిల్లలకు చదువు చెప్పడం ప్రారంభించారాయన. పది మంది విద్యార్థులతో ప్రారంభమైన ఆ పాఠశాల ప్రస్తుతం 1100 మంది విద్యార్థులు, 10 మంది టీచర్లతో కొనసాగుతోంది. వీరంతా పాఠశాలలు, కళాశాలల్లో చదువుకుంటూ స్వచ్ఛందంగా సేవలందిస్తుండడం గమనార్హం. సీఎన్ఎన్ ఐబీఎన్ న్యూస్ ఛానల్ వారి రియల్ హీరోస్ అవార్డును బాబర్అలీ 2009లో అందుకున్నారు. -
విద్యార్థినిపై ప్రధానోపాధ్యాయుడి అత్యాచారం
రైలుపేటలో ఓ కీచక ప్రధానోపాధ్యాయుడు పదో తరగతి విద్యార్థినిపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపుతానంటూ బెదిరించడంతో ఐదురోజులుగా రక్తస్రావంతో బాధపడుతున్నప్పటికి బాధితురాలు మిన్నకుండిపోయింది. తల్లి శనివారం నిలదీయడంతో ఆ బాలిక బోరున విలపించింది. సోమవారం రాత్రి స్థానికులకు విషయం తెలియడంతో పాఠశాలను ధ్వంసం చేశారు. కీచకుడు పరారయ్యాడు. ఆ మేరకు బాలిక తల్లి పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. వివరాలిలా ఉన్నాయి.. రైలుపేట ఐదో లైనులో జవహర్ భారతి కాన్వెంట్ స్కూల్‌ను అన్నవరపు శ్రీనివాసరావు (50) నడుపుతున్నారు. అదే ప్రాంతంలో సొంత పాఠశాలలు రెండు ఉన్నాయి. స్కూల్లో పదో తరగతి చదివి పబ్లిక్ పరీక్షలు రాస్తున్న ఓ బాలికను మార్చి 26న ఇంటింటికి రావాలని, కష్టమైన ప్రశ్నలు చెబుతానంటూ పిలిచాడు. ఇంటికి వచ్చిన విద్యార్థినిపై లైంగికదాడికి పాల్పడ్డాడు. రక్తస్రావంతో బాధపడుతున్న బాలికను తల్లి గట్టిగా అడ గడంతో సోమవారం మధ్యాహ్నం విషయం చెప్పింది. భర్త చనిపోవడంతో ఉన్న ముగ్గురు పిల్లలను పోషించేందుకు ఆమె పాచి పని చేసి బతికిస్తోంది. బిడ్డ చెప్పిన మాటవిని తట్టుకోలేక బాధితురాలి తల్లి పెద్దలకు వివరించి భోరున విలపించింది. దీంతో అగ్రహించిన స్థానికులు పాఠశాలను ధ్వంసం చేశారు. కీచకుడు శ్రీనివాసరావును మందలించేందుకు యత్నించగా.. కుటుంబ సభ్యులతోసహా పరారయ్యాడు. పట్టణ సీఐ రామారావు, ఎస్ఐ బ్రహ్మం సంఘటన స్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. -
యంగెస్ట్ హెడ్మాస్టర్..!
నేను ఉన్నత స్థాయికి చేరాక... నా చుట్టూ ఉన్న సమాజాన్ని ఉద్ధరిస్తాను అని చెప్పుకునే వాళ్లు ఉండవచ్చు... నేను వంద కోట్ల రూపాయలు సంపాదించాక... ప్రపంచానికి కొత్త వన్నెలు తీసుకు వస్తాను అనే వాళ్లూ ఉండవచ్చు. అయితే తను ఉన్న స్థితి నుంచే తన చుట్టూ ఉన్న వారి జీవితాల్లో మార్పు తీసుకురావడానికి ప్రయత్నించే వారు మాత్రం చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వారిలో ఒకరు బాబర్ అలీ. 16 ఏళ్ల వయసుకే ఆదర్శవంతుడిగా ఎదిగిన అలీ కథ ఇది... ఇతడు నివసించేది ఒక మురికివాడ.. చదువుకోవడానికి సరైన సదుపాయాలు లేవు. సదుపాయాల కన్నా ముందు సరైన స్కూల్ లేదు. ఈ పరిస్థితుల్లో బాబర్ తన చదువు మీద శ్రద్ధ పెట్టి బాగా చదువుకొని ఉంటే ఉన్నతస్థాయికి చేరగలిగేవాడు. అయితే తను ఉన్నతస్థాయికి చేరడం గొప్ప అని భావించలేదు. తను ఉన్న ప్రాంతంలో కొన్ని వందల మంది చిన్నారులు స్కూల్ మొహం తెలియకుండా ఉన్నారనే బాధ అలీని మెలిపెట్టసాగింది. వారందరి కోసం ఒక పరిష్కార మార్గాన్ని కనిపెట్టాడు. స్కూల్ నుంచి వచ్చాక టీచర్ అయ్యాడు.. ప్రైమరీ స్కూల్, హైస్కూల్‌కు వెళ్లే విద్యార్థులు ఇంటికి రాగానే ఆటల మీద పడిపోతారు. తమ స్నేహితులతో కలిసి ఉల్లాసంగా గడపడానికి ప్రాధాన్యతనిస్తారు. అయితే అందరికీ భిన్నంగా అలీ... తాను ఉండే ప్రాంతంలోని కొంత ఖాళీస్థలంలో చదువురాని, చదువు మధ్యలో మానేసిన పిల్లలను చేరదీసి వారికి చదువు చెప్పడం ప్రారంభించాడు. సాయంత్రం నాలుగు గంటలకు బాబర్ అలీ క్లాస్‌లు ప్రారంభం అవుతాయి. ఆరుగంటల వరకూ కొనసాగుతాయి. ఒకరు కాదు ఇద్దరు కాదు.. అలీ చదువు చెప్పనారంభించిన కొన్నిరోజుల్లోనే విద్యార్థుల సంఖ్య 800కు చేరింది! అంతమంది ఎక్కడి నుంచి...? బాబర్ అలీ స్కూల్లో చదివే ఎనిమిది వందల మంది విద్యార్థులూ డ్రాప్ ఔట్సే! కొన్ని రోజులపాటు స్కూల్‌కు వెళ్లి మానేసి గాలి తిరుగుడు తిరిగేవాళ్లు, ఇంట్లో పరిస్థితుల వల్ల బాలకార్మికులుగా మారిన వాళ్లు, పెద్ద పెద్ద వాళ్ల ఇళ్లల్లో పాచిపనిచేసి వచ్చే అమ్మాయిలు.. వీరే అలీ విద్యార్థులు. వారిని పనులు మానుకుని తనతో పాటు స్కూల్‌కు రమ్మని పిలుపునివ్వలేదు అలీ. అది జరిగే పని కాదని అతడికీ తెలుసు. వారికి కనీస విజ్ఞానాన్ని పంచడాన్ని తన బాధ్యతగా తీసుకున్నాడు. తన చుట్టూ ఉన్న సమాజంలో తనకు చేతనైనంత స్థాయిలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాడు. బీబీసీ కూడా గుర్తించింది... ఈవెనింగ్స్కూల్ను ప్రారంభించిన కొత్తలోనే స్థానికుల నుంచి అలీకి అభినందనలు అందాయి. చేస్తున్న మంచి పనికి అనేకమంది సహకారాన్ని అందించారు. కొన్ని రోజుల్లోనే అలీ పేరు గొప్ప స్థాయికి చేరింది. 2009లో ‘బ్రిటీష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (బీబీసీ)’ అలీని ‘యంగెస్ట్ హెడ్మాస్టర్ ఇన్ ద వరల్ట్’గా గుర్తించి ప్రత్యేక అవార్డును ఇచ్చింది. అదే సంవత్సరం సీఎన్ఎన్ -ఐబీఎన్ అలీని ‘రియల్ హీరోస్’ అవార్డ్‌తో సత్కరించింది. ఆమీర్‌ఖాన్ ‘సత్యమేవ జయతే’లో కూడా అలీ గురించి ప్రస్తావించారు. ఆరేడేళ్లుగా అలీ స్కూల్ రన్ అవుతోంది. అనేకమందికి చదువును బోధిస్తూ, విజ్ఞానాన్ని పంచుతూ సాగుతోంది. బాలకార్మికులుగా మారిన వారికి చదువు చెప్పడం ద్వారా తన స్థాయిలో చిన్నపాటి మార్పునైనా తీసుకురావాలని ప్రయత్నిస్తున్న బాబర్ అలీ కచ్చితంగా ఆదర్శప్రాయుడే. -
పార్కు కాదు.. పాఠశాలే!
తిప్పర్తి, న్యూస్‌లైన్:విద్యార్థులకు విద్యాబోధనతో పాటు పాఠశాలలో ఆహ్లాదరకమైన వాతావరణం కల్పించేందుకు నడుం బిగించాడు తిప్పర్తి మండలం మాడ్గులపల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు. విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేర్చాలనే ఉద్ధేశంతోనే విద్యను సులభంగా విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విద్యాభోదనను భోదిస్తున్నారు. మాడ్గులపల్లి ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయునిగా 2009లో బాధ్యతలు చేపట్టాడు జాకటి వెంకటయ్య. అప్పట్లో పాఠశాల ఆవరణ విశాలంగా ఉన్నా చెట్లు మాత్రం లేకుండా ఉండడంతో ఆయన పర్యావరణ పరిరక్షణ కోసం చెట్ల పెంపకాన్ని చేపట్టాలనే ఆలోచనతో దాతల కోసం వేట మొదలు పెట్టారు. అందులో ముఖ్యంగా పూర్వ విద్యార్థులకు పాఠశాల అభివృద్ధి కోసం భాగస్వామ్యులను చేశారు. దీంతో పాఠశాల ఆవరణలో చెట్లు పెంచే బాధ్యతలను తన భుజాలపై వేసుకుని నిత్యం చెట్ల సంరక్షణను చేస్తూ పాఠశాలను మండలంలోనే ఆదర్శ పాఠశాలను తీర్చిదిద్దేందుకు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అంజుంరాజుతో కలిసి నిర్విరామంగా కృషి చేస్తున్నాడు. దీనికి తోడు పాఠశాలలో విద్యార్థులకు సులభంగా విద్య అబ్బడానికి టీచింగ్, లెర్నింగ్ మెటీరియల్ సాయంతో బోధన చేపట్టారు. అలాగే పాఠశాల కార్యాలయంలో కూడా జాతీయ నాయకుల ఫొటోలతో పాటు వివిధ రకాల స్టడీ మెటిరియల్‌ను గోడలపై ఉంచారు. వీటి కోసం గ్రామస్తులతో పాటు పూర్వ విద్యార్థుల సహకారాన్ని ఆయన ఉపయోగించుకున్నారు. చెట్లతో పాటు నీతి వాక్యాలు పాఠశాల ఆవరణలో నాటిన చెట్లు పెరిగి పెద్దయ్యి పాఠశాలలో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడింది. దీంతో విద్యతోపాటు పర్యావరణ పరిరక్షణ కోసం పార్కు వలే రూపొందించి చెట్ల మద్యలో విద్యకు సంబంధించిన నీతి వాక్యాల బోర్డులు ఏర్పాటు చేయించారు. అలాగే విద్యార్థులు కూర్చోవడానికి పాఠశాల ఆవరణలో సిమెంట్ బెంచీలు కూడా ఏర్పాటు చేయించారు. పాఠశాల హెచ్ఎంకు జిల్లాస్థాయి అవార్డు పాఠశాల అభివృద్ధి కోసం అహర్నిషలు శ్రమిస్తున్న జాకటి వెంకటయ్యకు 2010లో జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు వచ్చింది. స్వగ్రామమైన మాడ్గులపల్లిలో పాఠశాలకు ఎనలేని సేవలు చేస్తున్న ఆయన గ్రామ యువతకు కూడా ‘‘యువత - భవిత’’ అనే అంశంపై ఆరోగ్యం, యోగా అనే సదస్సులను ఏర్పాటు చేశారు. మండలంలోని అనేక పాఠశాలల్లో విద్యార్థులకు ఆయన ఫ్లోరోసిస్‌పై అవగాహన సదస్సులు నిర్వహించారు.