Headmaster Drunk, Sleeping In Front Of Students Got Suspended Up - Sakshi
Sakshi News home page

తప్పతాగి పాఠశాలకు వెళ్లి.. ఛీ, విద్యార్థుల ముందే బట్టలు విప్పి...

Published Thu, Jul 27 2023 1:28 PM | Last Updated on Thu, Jul 27 2023 4:12 PM

Headmaster Drunk Sleeping In Front Of Students Got Suspended Up - Sakshi

లక్నో: విద్యార్థులకు చదువుతో వారికి మంచి చెడులను కూడా బోధించే వాడే ఉపాధ్యాయుడు. అందుకే ఉపాధ్యాయ వృత్తికి సమాజంలో ఓ గౌరవం ఉంది. అయితే ఓ ప్రధానోపాధ్యాయుడు మాత్రం ఛీ ఇవేం పనులు అనుకునేలా తప్పతాగి పాఠశాలకు వెళ్లడమే కాకుండా తరగతి గదిలోనే ఆదమరిచి నగ్నంగా నిద్రపోయాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో బహ్రైచ్‌ జిల్లాలోని శివపుర్‌ బైరాగి ప్రాథమిక పాఠశాలలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. విశేశ్వరగంజ్‌ బ్లాక్‌లోని శివపుర్‌ బైరాగి ప్రాథమిక పాఠశాలలో దుర్గా ప్రసాద్‌ జైశ్వాల్ అనే వ్యక్తి ప్రధానోపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. కొద్ది రోజులు క్రితం ఫూటుగా మద్యం సేవించి పాఠశాలకు వెళ్లాడు. విద్యార్థుల మందే దుస్తులన్నీ విప్పేసి నగ్నంగా నిద్రపోయాడు.  ఇదంతా కొందరు వీడియో తీసి నెట్టింట షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో అతన్ని విధుల నుంచి సస్పెండ్ చేశారు. విద్యార్థినుల ముందు దుర్గా జైస్వాల్ అనుచిత ప్రవర్తన గురించి తెలిసి తల్లిదండ్రులు, గ్రామస్తులు ఆందోళనకు దిగారు.

ఆ ప్రధానోపాధ్యాయుడు తరచూ ఇలాంటి చర్యలను పాల్పడేవాడని ఆరోపించారు. ఇటువంటి చేష్టలతో ఇబ్బంది పడిన విద్యార్థినులు కొందరు పాఠశాలకు వెళ్లడం మానేసినట్లు తెలిపారు. ఫిర్యాదుపై చర్య తీసుకున్న ప్రాథమిక శిక్షా అధికారి (బిఎస్‌ఎ) బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్‌తో విచారణకు ఆదేశించడంతో పాటు దుర్గా జైస్వాల్‌ను సస్పెండ్ చేశారు. అతడిపై శాఖాపరమైన విచారణ జరుగుతోందని.. అవసరమైతే, ప్రధానోపాధ్యాయుడిపై ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు  చేసే అవకాశముందని అధికారులు తెలిపారు.

చదవండి   జేసీబీతో ఏటీఎంపై దాడి.. దోపిడీకి దొంగల యత్నం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement