హెడ్ మాస్టర్ పైశాచికత్వం:విద్యార్థి మృతి | Boy beaten up by headmaster in UP, dies | Sakshi
Sakshi News home page

హెడ్ మాస్టర్ పైశాచికత్వం:విద్యార్థి మృతి

Published Thu, Apr 9 2015 1:12 PM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM

హెడ్ మాస్టర్ పైశాచికత్వం:విద్యార్థి మృతి - Sakshi

హెడ్ మాస్టర్ పైశాచికత్వం:విద్యార్థి మృతి

బరాబన్కీ(యూపీ): విద్యార్థిపై పైశాచికత్వాన్ని ప్రదర్శించి అతని మృతికి కారణమయ్యాడో  హెడ్ మాస్టర్. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని బద్దాపూర్ చోటు చేసుకున్న ఈ ఘటన కలకలం రేపింది.  వివరాల్లోకి వెళితే.. రహిలామోవ్ గ్రామంలో ఉన్న చౌదరీ ద్వారిక ప్రసాద్ అకాడమీలో శివ రావత్(10) అనే విద్యార్ధి మూడో తరగతి చదువుతున్నాడు.

 

అయితే ఆ విద్యార్థి తరగతిలో పెన్ దొంగిలించాడని హెడ్ మాస్టర్ దృష్టికి తీసుకొచ్చారు.  దీంతో రెచ్చిపోయిన ఆ స్కూల్ హెడ్ మాస్టర్  లలిత్ కుమార్ వర్మ.. రావత్  ఉదర భాగంపై చితకబాదాడు. దీంతో  తీవ్ర అస్వస్థతకు గురైన విద్యార్థి వాంతులు చేసుకోవడం ప్రారంభించాడు. ఆ విద్యార్థి పరిస్థితి విషమించడంతో ఆస్పత్రికి తీసుకు వెళ్లారు. కాగా, ఆ విద్యార్థి దారిలోనే చనిపోయినట్లు డాక్టర్లు స్పష్టం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు లలిత్ కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement