అశ్లీల చిత్రాలు చూపించిన హెచ్‌ఎం
బాదసాహి: ఒడిషాలో దారుణం సంఘటన వెలుగు చూసింది. విద్యాబుద్దులు నెర్పాల్సిన ప్రధానోపాధ్యాయుడు బాధ్యతలు మరిచి ప్రవర్తించాడు. విద్యార్ధులకు పాఠాలకు బదులు అశ్లీల చిత్రాలు చూపించాడని ఆ ప్రధానోపాధ్యాయుడిపై గ్రామస్థులు, విద్యార్థుల తల్లితండ్రులు దాడి చేశారు. ఈ దారుణ ఘటన ఒడిషాలోని మాయుబంజ్ జిల్లా బాదసాహిలో జరిగింది. దుర్గచరణ్ గిరి (59) మర్కుండి ప్రాథమిక ప్రభుత్వ పాఠశాల్లో ప్రధానోపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నాడు.
బుధవారం పాఠశాల్లో ప్రధానోపాధ్యాయుడు అశ్లీల చిత్రాలు చూపించాడని ముగ్గురు విద్యార్ధులు తల్లితండ్రులకు చెప్పారు. దీంతో గురువారం తల్లితండ్రులు, గ్రామస్థులు పాఠశాలకు పెద్ద ఎత్తున చేరి టీచర్‌పై దాడిచేసి ఆందోళన చెపట్టారు. పోలీసులు రంగప్రవేశం చేసి ప్రధానోపాధ్యాయుడిని అదుపులోకి తీసుకున్నారు. గ్రామస్థుల ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలిలంచామని పోలీసులు తెలిపారు.