బాలికపై అత్యాచార యత్నం... తప్పించుకునే క్రమంలో భవనం పై నుంచి దూకి... | Girl Injured Jump Roof Of School Building Escape Molestation | Sakshi
Sakshi News home page

బాలికపై అత్యాచార యత్నం... తప్పించుకునే క్రమంలో భవనం పై నుంచి దూకి...

Published Tue, Jul 19 2022 10:55 AM | Last Updated on Tue, Jul 19 2022 10:55 AM

Girl Injured Jump Roof Of School Building Escape Molestation - Sakshi

మహిళల పై జరుగుతున్న ఘోరాలకు అంతేలేదు. ఆమె మైనరా! వివాహితా! అనే ఇంకితం కూడా ఉండదు. కేవలం ఆడపిల్ల అయితే చాలు అఘాయిత్యాలకు ఒడిగడుతున్నారు. ఇలాంటి ఘటనలు చూస్తుంటే మనుఘలమేనా? అనిపించేంత అసహ్యం కలుగుతుంది. ఇక్కడొక బాలిక పై అలాంటి దారుణానికి ఒడిగట్టారు కొందరూ దుండగులు. వర్షం వస్తుందని ఒక భవనం వద్ద తలదాచుకోవడానికి వస్తే కబళించేందుకు యత్నించారు. ఆ దుండగులు దాష్టికం నుంచి తప్పించుకునే క్రమంలో ఆ బాలిక భవనం పై నుంచి దూకేసింది. ఈ ఘటన ఒడిశాలో చోటు చేసుకుంది. 

వివరాల్లోకెళ్తే...పోలీసులు తెలిపిన కథనం ప్రకారం...ఒడిశాలోని కియోంజర్‌ జిల్లాకు చెందిన బాలిక తన సోదరుడితో కలసి సోదరి ఇంటికి వెళ్తున్నారు. ఐతే బస్సుదిగి ఇంటికి వెళ్లే క్రమంలో భారీగా వర్షం కురుస్తుండటంతో తలదాచుకునేందుకు అక్కడ ఉన్న ఒక పాఠశాల భవనం వద్ద బస చేశారు. వర్షం తగ్గాక వెళ్దామని అక్కడే కాసేపు ఉన్నారు ఆ ఇద్దరూ. ఇంతలో ఐదుగురు వ్యక్తులు వచ్చి బాలిక సోదరుడిని కొట్టి ఆమె పై అత్యాచారం చేసేందుకు యత్నించారు.

ఐతే ఆ బాలిక ఆ దుండగుల నుంచి తప్పించుకునే క్రమంలో పాఠశాల భవనం పై కప్పు ఎక్కి దూకేసింది. దీంతో ఆమెకు తీవ్ర గాయలయ్యాయి. ఈ మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితురాలి సోదరుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనకు పాల్పడిన ఆ ఐదుగురు దుండగులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. ఆ బాలికను ఒడిశాలోని కళింగ నగర్‌లోని ఆస్పత్రిలో చేర్పించనట్లు తెలిపారు. ప్రస్తుతం ఆ బాలిక పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. 

(చదవండి: ప్రేమ పేరుతో వివాహితను వంచించిన ఏఆర్‌ ఎస్‌ఐ )

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement