school building
-
World Architecture Festival 2024: స్కూలు భవనం.. బహు బాగుంది
గది అంతటా సూర్యకాంతి ప్రసరించేలా రంపం పళ్లను ఆకారంలో రూఫ్.. ఎటు చూసినా పచ్చదనంతో కళకళలాడే ఆవరణలు.. పెద్ద బాస్కెట్‌బాల్ కోర్టు.. అందమైన కమ్యూనిటీ గార్డెన్.. ఓపెన్ ఎయిర్ టెర్రస్.. లోపలి వ్యక్తుల ప్రైవసీకి భంగం కలగకుండా చుట్టూ వంపులు తిరిగిన మెటల్ స్క్రీన్స్.. ఇంకా మరెన్నో ప్రత్యేకతలు. ఇదేదో రియల్ ఎస్టేట్ సంస్థ ప్రకటన కాదు! ఓ స్కూల్ భవన విశేషాలివి. దాంతో ఆకాశహర్మ్యాలను, మ్యూజియాలను, అందమైన విమానాశ్రయాలను కూడా తలదన్ని ప్రపంచంలోనే అత్యుత్తమ భవనంగా ఎంపికైంది. సింగపూర్‌లో జరిగిన ప్రపంచ ఆర్కిటెక్చర్ ఫెస్టివల్ (డబ్ల్యూఏఎఫ్)లో ఈ ఘనత సాధించింది. దీని పేరు డార్లింగ్టన్ పబ్లిక్ స్కూల్. సిడ్నీలోని చిపండేల్లో ఉంది. సాంస్కృతిక పరిరక్షణ దక్షిణ సిడ్నీ ప్రాంతంలో ఉన్న ఈ స్కూలు నిజానికి ఆ్రస్టేలియా మూలవాసులతో బలమైన సంబంధాలున్న కమ్యూనిటీ పాఠశాల. 1970 నాటి పాత భవనం శిథిలావస్థకు చేరడంతో కొత్తది నిర్మించాలనుకున్నారు. ఎఫ్‌జెడ్‌సీ స్టూడియో ఆ బాధ్యతలు తీసుకుంది. మూలవాసులతో బంధాన్ని ప్రతిబింబించేలా పాఠశాల హాల్, ఎంట్రన్స్ రిసెప్షన్, తరగతి గదుల్లో స్వదేశీ కళను చిత్రీకరించి సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించారు. పాత పాఠశాల గోడలపై ఉన్న ఆదిమ కుడ్యచిత్రాలను కొత్త భవనంలో పుననర్న్మించారు. ఆ స్ఫూర్తితోపాటు కొత్త, సమకాలీన అభ్యాస వాతావరణాన్ని సృష్టించారు. ప్రీసూ్కల్, కిండర్ గార్టెన్, ప్రైమరీ స్కూల్‌తో 500 మందికి పైగా విద్యార్థుల సామర్థ్యం ఈ కొత్త క్యాంపస్ సొంతం.ఆరోగ్యం, ఆహ్లాదం ప్రాధమిక పాఠశాల భవనంలో కాంతికోసం ప్రత్యేకంగా విద్యుత్ అక్కరలేదు. ప్రత్యేకమైన టెర్రస్ ప్రతి గదికీ సూర్యకాంతిని ప్రసరింపజేస్తుంది. అది బాగా వేడిగా కూడా ఉండదు. మృదువైన కాంతి స్థానిక కాసురినా చెట్ల ఆకుల మధ్య నుంచి జాలువారుతున్నట్లుగా ఉంటుంది. ఈ సహజకాంతి విద్యార్థుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. పాఠశాల భవనానికి అనుసంధానించి ఉన్న కమ్యూనిటీ హాల్, లైబ్రరీ విద్యార్థులను సమాజంలో భాగం చేస్తున్నాయి.175 మంది మనసు గెలుచుకుని.. క్రీడలు, రవాణా, ఆరోగ్యం, గృహనిర్మాణం వంటి 18 కేటగిరీల్లో డబ్ల్యూఏఎఫ్ అవార్డులు ఇస్తుంది. 175 మంది ఫెస్టివల్ డెలిగేట్ల ప్యానెల్ అన్ని కేటగిరీలకు చెందిన విజేతల నుంచి ‘వరల్డ్ బిల్డింగ్ ఆఫ్ ది ఇయర్’ ను ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది నేషనల్ స్టార్ అబ్జర్వేటరీ ఆఫ్ సైప్రస్, పోలండ్‌లోని ప్రఖ్యాత బస్ స్టేషన్, టర్కీలోని సోలార్ పవర్ ప్లాంట్ వంటి 220 ప్రాజెక్టులు అవార్డు కోసం పోటీపడ్డాయి. వాటన్నింటినీ తలదన్ని ఒక చిన్న పాఠశాల నెగ్గుకురావడం అసాధారణమని ఎఫ్జేసీ స్టూడియో అసోసియేట్ అలెస్సాండ్రో రోసీ అన్నారు. భవనంలో సమయాన్ని గడిపే పిల్లలే నిజమైన విజేతలని అభిప్రాయపడ్డారు. గతేడాది కూడా చైనాలోని ఓ బోర్డింగ్ స్కూల్ ఈ టైటిల్‌ను గెలుచుకోవడం విశేషం. – సాక్షి, నేషనల్ డెస్క్ -
గాజా స్కూల్‌పై ఇజ్రాయెల్ దాడి
డెయిర్ అల్–బలాహ్: గాజాలోని నుసెయిరత్ శరణార్థి శిబిరంలోని స్కూల్ భవనంపై గురువారం ఇజ్రాయెల్ ఆర్మీ జరిపిన దాడిలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 13 మంది చిన్నారులు, 18 ఏళ్ల మహిళలున్నారని పాలస్తీనా వైద్య విభాగం తెలిపింది. ఘటనలో గాయపడిన మరో 42 మంది దగ్గర్లోని ఔదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దాడిపై ఇజ్రాయెల్ ఆర్మీ స్పందించలేదు. హమాస్ మిలిటెంట్లే లక్ష్యంగా ఇజ్రాయెల్ ఆర్మీ తరచూ శరణార్థులు తలదాచుకుంటున్న స్కూల్ భవనాలపై దాడులకు దిగుతోంది. ఈ దాడుల్లో పెద్ద సంఖ్యలో మహిళలు, చిన్నారులు సైతం ప్రాణాలు కోల్పోతున్నారు. గతేడాది అక్టోబర్ 7వ తేదీన గాజాలోని హమాస్ లక్ష్యంగా ఇజ్రాయెల్ ఆర్మీ దాడులు మొదలుపెట్టింది. ఈ దాడుల్లో ఇప్పటి వరకు 42 వేల మంది పాలస్తీనియన్లు ప్రాణాలు మృతి చెందారు. క్షతగాత్రులు లక్ష వరకు ఉంటారని అంచనా. తాము 17 వేల మంది హమాస్ మిలిటెంట్లను చంపేశామంటున్న ఇజ్రాయెల్ ఆర్మీ సంబంధిత ఆధారాలను మాత్రం వెల్లడించడం లేదు. హమాస్, ఇజ్రాయెల్ ఆర్మీ మధ్య యుద్ధం కారణంగా గాజాలోని 23 లక్షల మందిలో 90 శాతం మంది నిరాశ్రయులయ్యారు. ఆస్పత్రుల్లో మందుల కొరత ఉత్తర గాజా ప్రాంతంపై ఇజ్రాయెల్ ఆర్మీ తరచూ చేస్తున్న దాడులతో నివాసాలు నేలమట్టమవుతున్నా యి. వందల సంఖ్యలో పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోతున్నారు. వేలాదిగా నిరాశ్రయులవుతున్నారు. మళ్లీ బలం పుంజుకుంటున్న హమాస్ సాయుధులే లక్ష్యంగా దాడులు చేస్తున్నట్లు ఇజ్రాయెల్ ఆర్మీ అంటోంది. అయితే, ఈ దాడుల్లో గాయపడిన ఇంటెన్సివ్ కేర్‌లోని 14 మంది చిన్నారులు సహా సుమారు 150 మంది తమ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఉత్తర గాజాలోని కమాల్ అద్వాన్ ఆస్పత్రి డైరెక్టర్ హొసమ్ అబూ సయేఫ్ తెలిపారు. వైద్య సిబ్బంది, మందుల కొరత కారణంగా గంటకొకరు చొప్పు న తుది శ్వాస విడుస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను ఆయన విడుదల చేశారు.ముగ్గురు లెబనాన్ సైనికులు మృతి బీరుట్: ఇజ్రాయెల్ ఆర్మీ గురువారం జరిపిన దాడిలో లెబనాన్ ఆరీ్మకి చెందిన ముగ్గురు చనిపోయారు. యటెర్ పట్టణంలో క్షతగాత్రులను తరలిస్తున్న ఒక ఆర్మీ అధికారి, ఇద్దరు సిబ్బంది చనిపోయినట్లు ఆ దేశ ఆర్మీ ‘ఎక్స్’లో తెలిపింది. సెప్టెంబర్‌లో హెజ్»ొల్లా, ఇజ్రాయెల్ ఆర్మీ మధ్య భీకర పోరు మొదలయ్యాక యటెర్పై దాడి జరగడం ఇది ఎనిమిదోసారని పేర్కొంది. -
గాజాలో 22 మంది మృతి
డెయిర్ అల్ బలాహ్: గాజాలోని జైటూన్ ప్రాంతంలో శరణార్థులు తలదాచుకుంటున్న పాఠశాల భవనంపై ఇజ్రాయెల్ ఆర్మీ శనివారం జరిపిన దాడిలో కనీసం 22 మంది చనిపోగా మరో 30 మంది గాయపడ్డారు. వీరిలో 13 మంది చిన్నారులు, ఆరుగురు మహిళలున్నారని గాజా ఆరోగ్య శాఖ పేర్కొంది. ఈ స్కూల్లో హమాస్ కమాండ్ సెంటర్ నడుస్తోందని ఇజ్రాయెల్ ఆరోపించింది. రఫాపై దాడిలో మరో నలుగురు చనిపోయారని హమాస్ పేర్కొంది. -
గాజా: స్కూల్‌పై ఇజ్రాయెల్ దాడి.. వంద మంది మృతి
జెరూసలెం: ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలతో పశ్చిమాసియాలో పరిస్థితులు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లోనూ గాజాపై ఇజ్రాయెల్ దాడులు ఆపడంలేదు. తాజాగా తూర్పు గాజాలోని ఓ స్కూల్లో తలదాచుకుంటున్న వారిపై ఇజ్రాయెల్ బాంబులతో దాడి చేసింది. ఉదయం ప్రార్థనల సందర్భంగా జరిగిన ఈ దాడిలో దాదాపు వంద మందికి పైగా ప్రజలు మరణించగా, పలువురు గాయపడినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. గత వారం గాజాలోని మూడు స్కూల్ భవనాలపై ఇజ్రాయెల్ దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో పదుల సంఖ్యలో గాజావాసులు మరణించారు. గతేడాది అక్టోబరు 7న హమాస్ ఉగ్రవాదుల మెరుపు దాడుల్లో వందల మంది ఇజ్రాయెల్ పౌరులు మరణించారు. ఇందుకు ప్రతీకారంగా అప్పటినుంచి గాజాపై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. ఈ దాడుల్లో ఇప్పటివరకు గాజాలో 40 వేల మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారు. -
గాజాలో స్కూల్‌పై ఇజ్రాయెల్ దాడి.. 31 మంది మృతి
గాజా: పాలస్తీనాలోని గాజాపై ఇజ్రాయెల్ బాంబుల మోత మోగిస్తూనే ఉంది. తాజాగా గాజాలోని ఓ స్కూల్ భవనంలో నిర్వహిస్తున్న ఆస్పత్రిపై ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడిలో 30 మంది ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. ఈ దాడిలో మరో 100 మంది గాయపడ్డారు. సెంట్రల్ గాజాలోని డీర్-అల్-బలా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.ప్రజలు అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ ఆదేశాలు ఇచ్చిన కొద్దిసేపటికే స్కూల్లోని ఆస్పత్రిపై బాంబుల వర్షం కురిసింది. ఇది కాక మరో దాడిలో 11 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. దాడుల ప్రభావంతో ఖాన్ యూనిస్ నగరం నుంచి ప్రజలు భారీ ఎత్తున తరలి వెళుతున్నారు. గత ఏడాది అక్టోబర్ నుంచి హమాస్ నిర్మూలనే లక్ష్యంగా గాజాలో ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. తమ దేశంపై దాడి చేసినందుకు ప్రతీకారంగా అప్పటి నుంచి హమాస్‌పై దాడులు కొనసాగిస్తూనే ఉంది. -
గాజా: స్కూల్‌పై ఇజ్రాయెల్ దాడి.. 15 మంది మృతి
గాజా: పాలస్తీనాలోని గాజా పట్టణంలో ఉన్న స్కూళ్లపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా ఆదివారం(జులై 15) సెంట్రల్ గాజాలోని అబు అరబన్ ప్రాంతంలోని ఓ స్కూల్‌పై ఇజ్రాయెల్ బాంబులు వేసింది. ఈ దాడిలో స్కూలులో ఆశ్రయం పొందుతున్న గాజా వాసులు 15 మంది మృతి చెందారు. ఈ విషయాన్ని గాజా సివిల్ డిఫెన్స్ ఏజెన్సీ వెల్లడించింది. యుద్ధం కారణంగా నిరాశ్రయులైన గాజా వాసులు వేలాది మంది అబు అరబన్ స్కూల్లో తాత్కాలికంగా ఆశ్రయం పొందుతున్నారు. గడిచిన ఎనిమిది రోజుల్లో గాజా వాసులు ఆశ్రయం పొందుతున్న స్కూళ్లపై ఇజ్రాయెల్ దాడి చేయడం ఇది ఐదోసారి. ఈ దాడిపై ఇజ్రాయెల్ స్పందించింది. అబు అరబన్ స్కూల్ కేంద్రంగా ఇజ్రాయెల్ సైన్యంపై దాడులు జరుగుతున్నందునే తాము టార్గెట్ చేశామని తెలిపింది. గతేడాది అక్టోబర్ 7న పాలస్తీనాకు చెందిన ఉగ్రవాద సంస్థ హమాస్ ఇజ్రాయెల్‌పై మెరుపుదాడికి దిగి వందలాదిమందిని చంపింది. అప్పటి నుంచి గాజాపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపిస్తూనే ఉంది. -
Pooranam: చదువుల తల్లీ నీకు వందనం
కొందరు సంపాదించింది దాచుకుంటారు. కొందరు కొద్దిగా పంచుతారు. మరికొందరు ప్రతిదీ సమాజహితం కోసం ధారబోస్తారు. పేద పిల్లల స్కూల్ కోసం 7 కోట్ల విలువైన భూమిని దానం చేసింది తమిళనాడుకు చెందిన పూరణం. గత నెలలో మొదటిసారి ఆ పని చేస్తే ఇప్పుడు మరో 3 కోట్ల రూపాయల విలువైన భూమిని దానం చేసింది. సామాన్య క్లర్క్‌గా పని చేసే పూరణం ఎందరికో స్ఫూర్తి కావాలి. ప్రభుత్వం అన్నీ చేయాలని కోరుకోవడం సరికాదు. సమాజం తన వంతు బాధ్యత వహించాలి. ప్రజాప్రయోజన కార్యక్రమాలలో తన వంతు చేయూతనివ్వాలి. విమర్శించే వేయినోళ్ల కంటే సాయం చేసే రెండు చేతులు మిన్న అని నిరూపించింది తమిళనాడు మధురైకు చెందిన 52 సంవత్సరాల పూరణం అలియాస్ ఆయి అమ్మాళ్. ఆమె ఒక నెల వ్యవధిలో దాదాపు పది కోట్ల రూపాయల విలువైన భూమిని పేద పిల్లల చదువు కోసం దానం చేసింది. కెనెరా బ్యాంక్ క్లర్క్ మదురైలో కెనెరా బ్యాంక్‌లో క్లర్క్‌గా పని చేసే పూరణంలో పెళ్లయిన కొద్దిరోజులకే భర్తను కోల్పోయింది. మానవతా దృక్పథంతో అతని ఉద్యోగం ఆమెకు ఇచ్చారు. నెలల బిడ్డగా ఉన్న కుమార్తెను చూసుకుంటూ, కొత్తగా వచ్చిన ఉద్యోగం చేస్తూ జీవితంలో ఎన్నో కష్టాలు పడింది. కుమార్తె భవిష్యత్తు కోసం ఆమె కొని పెట్టిన స్థలాలు ఖరీదైనవిగా మారాయి. హటాత్ సంఘటన పూరణం కుమార్తె జనని రెండేళ్ల క్రితం అనారోగ్య కారణాలతో మరణించింది. జననికి సమాజ సేవ చాలా ఇష్టం. అంతేకాదు పేదపిల్లల చదువుకు కృషి చేసేది. ఒక్కగానొక్క కూతురు మరణించడంతో కూతురు ఆశించిన విద్యావ్యాప్తికి తాను నడుం బిగించింది పూరణం. తన సొంతవూరు కొడిక్కులంలోని 1.52 ఎకరాల స్థలాన్ని ఆ ఊరి స్కూలును హైస్కూల్‌గా అప్‌గ్రేడ్ చేసి భవంతి కట్టేందుకు మొన్నటి జనవరి 5న దానం చేసింది. మదురై చీఫ్ ఎడ్యుకేషన్ ఆఫీసర్‌కు పట్టా అప్పజెప్పింది. దాంతో ఆమెకు రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రశంసలు దక్కాయి. ముఖ్యమంత్రి స్టాలిన్ మొన్నటి రిపబ్లిక్ డే రోజున ఆమెను సన్మానించాడు. అయితే రెండు రోజుల క్రితం పూరణం తనకున్న మరో 91 సెంట్ల భూమిని కూడా మరో స్కూల్ భవంతి నిర్మించేందుకు అప్పజెప్పింది. ఈ రెండు స్థలాల విలువ నేడు మార్కెట్లో పది కోట్లు ఉంటాయి. ‘బదులుగా నాకేమి వద్దు. ఆ స్కూల్ భవంతులకు నా కుమార్తె పేరు పెట్టండి చాలు’ అని కోరిందామె. ‘పల్లెటూరి పిల్లల చదువుల్లో వెలుగు రావాలంటే వారు బాగా చదువుకోవడమే మార్గం. పల్లెల్లో హైస్కూళ్లు చాలా అవసరం’ అందామె. -
China: స్కూల్లో అగ్ని ప్రమాదం.. 13 మంది మృతి
బీజింగ్: చైనాలోని హెనన్ ప్రావిన్సులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. శుక్రవారం అర్ధరాత్రి యశన్పూ గ్రామంలోని ఓ ఎలిమెంటరీ బోర్డింగ్ స్కూల్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో మొత్తం 13 మంది చనిపోయారు. ఒకరు గాయపడ్డారు. ఈ విషయాన్ని చైనా అధికారిక మీడియా జినుహా న్యూస్ రిపోర్ట్ చేసింది. అయితే మృతి చెందిన వారిలో ఎంత మంది విద్యార్థులున్నారన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఘటన జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలు ఆర్పివేశారు. మంటలకు గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనపై సోషల్ మీడియాలో ప్రజలు ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నారు. 13 కుటుంబాలకు చెందిన 13 మంది చిన్న పిల్లలు ఒక్కసారిగా లేకుండా పోయారు. ఘటనకు కారణమైన వారికి కఠిన శిక్ష విధించకపోతే చనిపోయిన వారి ఆత్మలు శాంతించవని నెటిజన్లు మండిపడుతున్నారు. ఇదీచదవండి.. పన్నూ హత్యకు కుట్ర.. నిఖిల్ గుప్తా అప్పగింతకు కోర్టు ఓకే -
కెనడాలో ఉద్రిక్తతలు.. యూదు పాఠశాలపై మళ్లీ కాల్పులు
మాంట్రియల్, కెనడా: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం నేపథ్యంలో కెనడాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. మాంట్రియల్‌లోని ఒక యూదు పాఠశాలపై కాల్పులు జరిగినట్లు అక్కడి పోలీసులు తెలిపారు. ఈ యూదు పాఠశాలపై కాల్పులు జరగడం వారం రోజుల్లో ఇది రెండోసారి. ఆదివారం (నవంబర్ 12) అక్కడి కాలమాణం ప్రకారం తెల్లవారుజామున 5 గంటలకు కాల్పుల శబ్దాలు వినిపించాయని, కాల్పులు జరిగినప్పుడు పాఠశాలలో ఎవరూ లేకపోవడంతో ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదని పోలీసులు తెలిపారు. బుల్లెట్ల ధాటికి పాఠశాల భవనం గోడలు దెబ్బతిన్నాయని, నేలపై గుంతలు ఏర్పడ్డాయని వివరించారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడానికే ఇలా ఒకే స్కూల్‌పై పదేపదే దాడులు చేస్తున్నారని ఆ పాఠశాల ప్రతినిధి లియోనెల్ పెరెజ్ విలేకరుల సమావేశంలో చెప్పారు. తరగతులు యథావిధిగా కొనసాగుతాయని పేర్కొన్నారు. వారం ప్రారంభంలో మాంట్రియల్ నగరంలోని కాంకోర్డియా విశ్వవిద్యాలయంలో పాలస్తీనియన్, ఇజ్రాయెల్ అనుకూల సమూహాలు ఘర్షణ పడినప్పుడు మాంట్రియల్ ప్రార్థనా మందిరం అగ్నిబాంబు దాడిలో స్వల్పంగా దెబ్బతింది. ముగ్గురు విద్యార్థులు గాయపడ్డారు. -
స్కూల్ నిర్మించడం కోసం ఆ రైతు ఏం చేశాడంటే..
ఓ సాధారణ రైతు పాఠశాల నిర్మించడానికి తన ఆస్తిలో కొంత భాగాన్ని దానంగా ఇచ్చి ఆదర్శంగా నిలిచాడు. ఈ ఘటన బిహార్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..బిహార్‌లోని భాగల్పూర్ జిల్లా బీహ్పూర్ బ్లాక్‌లో కహర్పూర్ గ్రామానికి చెందిన సుబోధ్ యాదవ్ అనే రైతు స్కూల్ నిర్మించేందుకు తన భూమిని దానంగా ఇవ్వాలనుకుంటున్నట్లు తెలిపారు. 2020లో కోసి నది నీటి మట్టం పెరగడంతో పాఠశాల మునిగిపోయింది. దీంతో విద్యార్థులు వేరే ప్రాంతానికి వెళ్లి చదువుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఆ గ్రామంలో ఉన్న ఏకైక పాఠశాల అదే. దీంతో బిహార్ ప్రభుత్వం పాఠశాల పూర్తిగా దెబ్బతినడంతో కొత్త పాఠశాల నిర్మించడం కోసం స్థలం వెతకడం ప్రారంభించింది. ఈ విషయం తెలుసుకున్న యాదవ్ తల్లి చడికా దేవి తన కూమారుడిని ఆస్తిలో కొంత ప్రభుత్వానికి దానంగా ఇవ్వమని కోరింది. దీంతో పక్కా పత్రాలతో రిజిస్ట్రేషన్ చేసి తన 15 సెంట్ల భూమిని ఆ పాఠశాల నిర్మాణం కోసం దానంగా ఇచ్చాడు. ఆ భూమి విలువ సుమారు రూ. 8 లక్షల వరకు ఉంటుందని అంచనా. ఈ మేరకు భాగల్పూర్ డీఈవో మాట్లాడుతూ..పాఠశాల కోసం భూమిని దానంగా ఇచ్చిన వ్యక్తి పేరు పెట్టాలని అనుకున్నామని, కానీ అతడు తన తల్లి పేరు పెట్టాలని అభ్యర్థించినట్లు తెలిపారు. సదరు రైతు యాదవ్ కూడా ఈ పాఠశాలలో చదువుకుంటున్న పిల్లలు ఈ పాఠశాల కోసం భూమిని దానంగా ఇచ్చిన వ్యక్తిగా తన తల్లి సదా గుర్తించుకుంటారని ఆనందంగా చెబుతున్నాడు. (చదవండి: ఓ వృద్ధుడు బతికుండగానే.. తన అంత్యక్రియలు తానే..) -
Animatronic Elephant: స్కూల్‌కు ఏనుగొచ్చింది
ఏనుగు స్కూల్‌కి వస్తే? పిల్లలు దానిని భయం లేకుండా తాకి, నిమిరి ఆనందిస్తే? ఆ ఏనుగు కళ్లార్పుతూ, చెవులు కదిలిస్తూ మాట్లాడుతూ తన గురించి చెప్పుకుంటే? ‘ఎలీ’ అనే యానిమెట్రానిక్ ఏనుగు ఇకపై దేశంలోని స్కూళ్లకు తిరుగుతూ పిల్లలకు ఏనుగుల జీవనంలో ఏది ఇష్టమో, ఏది కష్టమో చెప్పనుంది. ‘పెటా’ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా ‘ఎలీ’కి గొంతు ఇచ్చిన నటి దియా మిర్జా ఏనుగులపై జరుగుతున్న దాష్టీకాలపై పిల్లలకు అవగాహన కల్పించడానికి నడుం కట్టింది. ముంబైలో శుక్రవారం మొదలైన ఈ కార్యక్రమం పిల్లలు, తల్లిదండ్రులు, జంతు ప్రేమికులు తప్పక ఆహ్వానించదగ్గది. సుప్రసిద్ధ తమిళ రచయిత జయమోహన్ ‘ఏనుగు డాక్టర్’ అనే కథ రాశారు. మదుమలై అడవుల్లో ఏనుగుల డాక్టర్‌గా పని చేసిన ఒక వ్యక్తి అనుభవాలే ఆ కథ. అందులో ఆ డాక్టర్ అడవుల్లో పిక్నిక్ల పేరుతో తిరుగుతూ బీరు తాగి ఖాళీ సీసాలను రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ విసిరేసే వాళ్ల మీద చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. దానికి కారణం బీరు సీసా మీద ఏనుగు కాలు పెట్టగానే అది పగులుతుంది. ఏనుగు పాదంలో దిగబడి పోతుంది. ఇక ఏనుగుకు నడవడం కష్టమైపోతుంది. అది తిరగలేదు. కూచోలేదు. లేవలేదు. ఒక చెట్టును ఆసరా చేసుకుని నిలబడి పోతుంది. అలాగే వారం పదిరోజులు నిలబడి తిండి లేక కృశించి మరణిస్తుంది. ఇది ఎవరు జనానికి చెప్పాలి? ఎవరు ప్రచారం చేయాలి? ఎవరో ఒకరు లేదా అందరూ ఏదో ఒక మేరకు పూనుకోవాలి కదా. ‘పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్’ (పెటా) నిన్న (శుక్రవారం) ఏనుగులతో జనం మైత్రి కోసం ముఖ్యంగా పిల్లల్లో అవగాహన కోసం ఒక ప్రచార కార్యక్రమం మొదలుపెట్టింది. అచ్చు నిజం ఏనుగులా కనిపించే యానిమెట్రానిక్ ఏనుగును తయారు చేయించి దాని ద్వారానే పిల్లల్లో చైతన్యం కలిగించనుంది. ఆ ఏనుగుకు ‘ఎలీ’ అనే పేరు పెట్టారు. ఈ కార్యక్రమానికి ‘వైల్డ్‌లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా’లో అంబాసిడర్‌గా ఉన్న దియా మిర్జా తోడు నిలిచింది. ఆమె ఏనుగుకు తన కంఠం ఇచ్చింది. నేను... ఎలీని... నిజం ఏనుగులా అనిపించే ఎలీ ఇకపై ఊరూరా తిరుగుతూ స్కూల్‌కి వస్తుంది. అందులో రికార్డెడ్‌గా ఉన్న దియా మిర్జా కంఠంతో మాట్లాడుతుంది. ఇది యానిమెట్రానిక్ బొమ్మ కనుక కళ్లు కదల్చడం, చెవులు కదల్చడం లాంటి చిన్న చిన్న కదలికలతో నిజం ఏనుగునే భావన కలిగిస్తుంది. అది తన చుట్టూ మూగిన పిల్లలతో ఇలా చెబుతుంది. ‘నేను ఎలీని. నా వయసు 12 సంవత్సరాలు. నేను ఇంతకు ముందు ఒక సర్కస్‌లో పని చేసే దాన్ని. జనం నన్ను సర్కస్‌లో చూసి ఆనందించేవారు. కాని అలా ఉండటం నాకు ఆనందం కాదు. అడవిలో తిరిగే నన్ను కొందరు బంధించి సర్కస్‌కు అప్పజెప్పారు. సర్కస్ ఫీట్లు చేయడానికి నన్ను బాగా కొట్టేవారు. నన్ను గట్టి నేల మీద ఎప్పుడూ నిలబెట్టేవారు. అలా నిలబడితే నాకు కష్టంగా ఉంటుంది. అసలు జనం మధ్య తిరగడం, గోల వినడం ఇవన్నీ నాకు భయం. సర్కస్ లేనప్పుడు నన్ను గొలుసులతో కట్టేస్తారు. ఏనుగుల గుంపు నుంచి ఏనుగును విడదీస్తే అది ఎంతో బాధ పడుతుంది. కాని ఇప్పుడు నేను విముక్తమయ్యాను. నన్ను ఒక సంస్థ విడిపించి బాగా చూసుకుంటోంది. నేను హాయిగా ఉన్నాను’ అని తన కథను ముగిస్తుంది. కొనసాగుతున్న హింస ‘ఏనుగులు ప్రకృతిలో ఉండాలి. జనావాసాల్లో కాదు. ఒక తల్లిగా పిల్లలకు కొన్ని విషయాలు తెలియాలని కోరుకుంటాను. పెటాతో కలిసి బాలబాలికల్లో చైతన్యం కోసం పని చేయడం మూగజీవులకు, పిల్లలకు బంధం వేయడంగా భావిస్తాను’ అని దియా మిర్జా అంది. ఏనుగులను ఇవాళ్టికీ ఉత్సవాల్లో, పర్యాటక కేంద్రాల్లో, బరువుల మోతకు, వినోదానికి ఉపయోగిస్తున్నారు. మనుషుల ఆధీనంలో ఉన్న ఏనుగుకు ఎప్పుడూ కడుపు నిండా తిండి, నీరు దొరకవు. వాటిని గొలుసులతో బంధించి ఉంచడం వల్ల ఒక్కోసారి అవి అసహనానికి గురై మనుషుల మీద దాడి చేస్తాయి. ఎలిఫెంట్ సఫారీల వల్ల ఏనుగు వెన్ను సమస్యలతో బాధ పడుతుంది. ఇవన్నీ మన తోటి పర్యావరణ జీవులతో ఎలా మెలగాలో తెలియకపోవడం వల్ల జరుగుతున్న పనులేనని ‘పెటా’ వంటి సంస్థల ప్రతినిధులు, జంతు ప్రేమికులు తెలియచేస్తున్నారు. ‘ఎలీ’ వంటి ఏనుగులు ప్రతి ఊరు వచ్చి పిల్లలతో, పెద్దలతో సంభాషిస్తే లేదా ఇలాంటి సంభాషణను ప్రతి స్కూల్లో వీడియోల ద్వారా అయినా ప్రదర్శిస్తే మార్పు తథ్యం. -
ప్లీజ్ మోదీజీ మా బాధ వినండి.. కథువా బాలిక ఆవేదన
ప్లీజ్ మోదీ జీ.. మా కోసం ఒక మంచి స్కూల్ భవనం కట్టించండి.. అంటూ ఓ చిన్నారి ప్రధానిని కోరింది. తాను చదువుతోన్న ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సౌకర్యాల సరిగా లేవని ఆవేదక వ్యక్తం చేసింది. తాము సరిగా చదువుకోలేకపోతున్నామని ఫేస్బుక్ ద్వారా తన విన్నపాన్ని ప్రధాని మోదీకి వినిపించింది. తన స్కూల్ దుస్థితిని వీడియోలో పంపించింది. వివరాల ప్రకారం.. జమ్మూ కశ్మీర్‌లోని కథువా జిల్లా లొహయ్-మల్హర్ గ్రామానికి చెందిన సీరత్ నాజ్ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నట్టు వీడియోలో తెలిపింది. ఆ తర్వాత తాను చదువుతున్న స్కూల్ కాంపౌండ్‌లో నడుస్తూ పాఠశాల పరిస్థితిని వివరించింది. ‘ప్లీజ్ మోదీ జీ’ మా కోసం కొత్త భవన్నాని నిర్మించండి అని వేడుకుంది. తన పాఠశాలలో మౌలిక వసతులు మెరుగుపరచడానికి చర్యలు తీసుకోండి అని కోరింది. అనంతరం, ఫోన్ కెమెరాను తలుపులు మూసివున్న ఓ గది ముందు ఉంచి..‘ప్రిన్సిపాల్ ఆఫీస్, స్టాఫ్ రూమ్’ అని వివరించింది. ఇదే సమయంలో స్కూల్లోని ఫ్లోర్లింగ్ చూపిస్తూ చూడండి మోదీజీ.. ఎంత మురికిగా ఉందో అంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ దీనిపైనే మమ్మల్ని కూర్చోబెడతారు అంటూ తరగతి గదులను చూపించింది. మురికిగా ఉన్న ఫ్లోర్‌పై కూర్చోవడంతో మా యూనిఫామ్స్ మాసిపోతున్నాయి. మా డ్రెస్సులు మురికిగా ఉన్నాయని మా అమ్మలు తరచూ మమ్మల్ని తిడతారు. మాకు కూర్చోవడానికి బెంచీలు కూడా లేవు అంటూ ఆవేదన చెందింది. ఇదే సమయంలో మా పాఠశాల భవవాన్ని చూపిస్తాను అంటూ ముందుకు సాగింది. గత ఐదేళ్లుగా భవనం ఎంత అపరిశుభ్రంగా ఉందో చూడండి అని కోరింది. మొదటి అంతస్తులోకి వెళ్లిన ఆ చిన్నారి.. అక్కడ పరిస్థితి వివరిస్తూ ప్లీజ్ మోదీజీ.. మా పాఠశాల మౌలిక సదుపాయాలను మెరుగుపరచండి అని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. దయచేసి నా కోరిక తీర్చండి అని కోరింది. అనంతరం కిందకు దిగి.. కాంపౌండ్ వాల్ వద్దకు వెళ్లి విరిగిపోయి ఉన్న టాయ్‌లెట్‌ను చూపించింది. అలాగే, పాఠశాలలో సౌకర్యాలను ప్రత్యక్షంగా చూపించింది. బహిరంగ ప్రదేశాల్లో విద్యార్థులు ఏ విధంగా ఉపశమనం పొందుతున్నారో తెలిపింది. ఇక చివరగా మోదీజీ మీరు దేశం మొత్తం చెప్పేది వినండి.. దయచేసి నా మాట కూడా వినండి.. మాకు మంచి పాఠశాలను నిర్మించండి.. నేలపై కూర్చోవాల్సిన అవసరం లేని విధంగా పాఠశాల ఉండాలి. దీంతో, మేమంతా బాగా చదువుకుంటాం. దయచేసి మా కోసం ఒక చక్కని పాఠశాలను నిర్మించండి అని కోరింది. ఇక, వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
Aadhaar: ఎక్కడ పడితే అక్కడ నమోదు కేంద్రాలు ఇదిగో ఆధారం!
ఈ ఫొటోలో కనిపిస్తున్నది తాత్కాలిక ఆధార్ నమోదు కేంద్రం. జోగుళాంబ గద్వాల జిల్లా మానోపాడ్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చిరునామాలో ఈ కేంద్రాన్ని నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది. కానీ ఈ కేంద్రం నిర్దేశించిన చోటు కాకుండా ఓ ప్రైవేటు దుకాణంలో నిర్వహిస్తున్నారు. సాక్షి, హైదరాబాద్: పాఠశాల విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన తాత్కాలిక ఆధార్ నమోదు కేంద్రాల నిర్వహణ గాడితప్పింది. కేవలం బడి పిల్లల కోసం పాఠశాల ఆవరణలో మాత్రమే నిర్వహించాల్సిన ఈ కేంద్రాలు బహిరంగ మార్కెట్లో ప్రైవేటు ప్రాంతాల్లో కొనసాగుతున్నాయి. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడడం... వాస్తవాలను గుర్తించినప్పటికీ పట్టనట్లు ఉండడంతో ఈ కేంద్రాల నిర్వాహకులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలను గాలికొదిలేసిన నిర్వాహకులు... ఇష్టారీతిన నూతన ఆధార్ నమోదు, సవరణ ప్రక్రియను సాగిస్తున్నారు. దీంతో ప్రజా సమాచార గోప్యతకు భంగం వాటిల్లుతుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 33 జిల్లాల్లో 876 ఆధార్ ఎన్రోల్మెంట్ కిట్లు... రాష్ట్రంలోని ప్రభుత్వ/ప్రైవేటు పాఠశాలల్లోని విద్యార్థులకు నూతన ఆధార్ కార్డుల జారీ, ఇప్పటికే జారీ చేసిన కార్డులకు సంబంధించి సవరణ తదితర సేవలను అందించాలనే లక్ష్యంతో పాఠశాల విద్యాశాఖ సరికొత్త కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. ఏకంగా పాఠశాల ఆవరణలోనే ఈ కేంద్రాలను ఏర్పాటు చేసి లక్ష్యసాధన పూర్తయ్యే వరకు అక్కడే కొనసాగించేలా కార్యాచరణ రూపొందించింది. ఇందులో భాగంగా రెండు ప్రైవేటు ఏజెన్సీలను ఎంపిక చేసిన పాఠశాల విద్యాశాఖ... ఏజెన్సీల వారీగా జిల్లాలను నిర్దేశిస్తూ నమోదు, సవరణ, అప్డేషన్ కోసం ప్రతేకంగా ఆధార్ ఎన్రోల్మెంట్ కిట్లను కేటాయించింది. ఈ నేపథ్యంలో ఒక ఏజెన్సీకి 20 జిల్లాల బాధ్యతలను అప్పగిస్తూ 526 ఆధార్ ఎన్రోల్మెంట్ కిట్లు ఇవ్వగా... మరో ఏజెన్సీకి 13 జిల్లాల బాధ్యతలు అప్పగిస్తూ 350 ఆధార్ ఎన్రోల్మెంట్ కిట్లను ఇచ్చింది. ఈ ఏజెన్సీలు క్షేత్రస్థాయిలో విద్యాశాఖ అధికారుల సమన్వయంతో ఆధార్ ఎన్రోల్మెంట్ పూర్తి చేయాలి. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు గతేడాది డిసెంబర్లో వెలువడగా... ఈ ఏడాది జనవరి నుంచి కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. నిబంధనలు గాలికి... ప్రతి విద్యా ర్థికి చేరువలో ఆధార్ సర్వి సులను అందించాలనే లక్ష్యంతో తలపెట్టిన ఈ ప్రాజెక్టు నిబంధనలను ఏజెన్సీలు గాలికి వదిలేశాయి. క్షేత్రస్థాయిలో ఆపరేటర్లు, సూపర్వైజర్లను ఎంపిక చేసి వేతన చెల్లింపులతో నమోదు/సవరణ ప్రక్రియను చేపట్టాల్సి ఉంది. కానీ కాంట్రాక్టు పద్ధతిలో కాకుండా క్షేత్రస్థాయిలో ఆసక్తి ఉన్న వారికి ఏజెన్సీలు ఆధార్ ఎన్రోల్మెంట్ కిట్లను ఇచ్చేశాయి. దీంతో కిట్లు పొందిన వారు ఈ కేంద్రాలను ప్రైవేటు ప్రాంతాలకు తరలించారు. ప్రభుత్వ అధికారి సమక్షంలో కొనసాగాల్సిన ఈ కేంద్రాలు ఇప్పుడు అంగట్లో సరుకుగా ఎక్కడపడితే అక్కడ నిర్వహిస్తున్నారు. పర్యవేక్షణకు మంగళం పాడారు... ప్రభుత్వ కార్యాలయాల పరిధిలో నిర్వహిస్తున్న కేంద్రాల్లో ప్రతి దరఖాస్తునూ సంబంధిత పర్యవేక్షణ అధికారి వెరిఫై చేసిన తర్వాతే ఆమోదిస్తాం. కానీ పాఠశాల విద్యాశాఖ ఇచ్చిన కిట్లతో నిర్వహిస్తున్న కేంద్రాలు ఇష్టానుసారంగా నడుస్తున్నాయి. పర్యవేక్షణ లేకపోవడం, దరఖాస్తుల పరిశీలన కొరవడడంతో ఆధార్‌లో పొరపాట్లకు అవకాశం ఉంటుంది. – బైర శంకర్, రాష్ట్ర అధ్యక్షులు, తెలంగాణ మీసేవ ఫెడరేషన్ -
ఆ ఊరికి ఆత్మబంధువులు
ఉద్యోగం నిమిత్తం భార్య సుమితో కలిసి ఆఫ్రికాలోని మలావి దేశానికి వెళ్లాడు కేరళలోని మలప్పురంకు చెందిన అరుణ్ అశోకన్.అక్కడ ఒక గ్రామంలో శిథిలావస్థలో ఉన్న స్కూల్‌ను చూసి చలించిపోయాడు.ఆ తరువాత భార్యాభర్తలు ఇద్దరూ కలిసి స్కూల్ పునర్నిర్మాణానికి నడుం కట్టారు.తమ కలను సాకారం చేసుకున్నారు... మలావిలో ఒకరోజు... తాను పనిచేస్తున్న ప్రదేశానికి చిసాలియా అనే గ్రామం మీదుగా కారులో వెళుతున్నాడు అరుణ్ అశోకన్. వర్షం మొదలైంది. తల మీద పుస్తకాలు, బ్యాగులు పెట్టుకొని స్కూల్ పిల్లలు గుంపులు, గుంపులుగా పరుగెడుతున్నారు.‘వర్షం పడుతున్నప్పుడు స్కూల్లో కూర్చోక ఇలా పరుగెడుతున్నారేమిటి!’ అని డ్రైవర్‌ను అడిగాడు అరుణ్. ‘అది పేరుకే స్కూలు. గదులు పాడైపోయాయి. పిల్లలందరూ ఆరుబయటే కూర్చుంటారు. వర్షం వచ్చినప్పుడల్లా ఇలా ఇంటికి పరుగులు తీయాల్సిందే’ అని చెప్పాడు డ్రైవర్. అరుణ్‌కు మనసులో చాలా బాధగా అనిపించింది. ఇంటికి వెళ్లిన తరువాత తన బాధను భార్య సుమితో కలిసి పంచుకున్నాడు.‘బాధపడడం ఎందుకు? మనమే స్కూల్ కట్టిద్దాం’ అన్నది సుమి.నిజానికి ఈ యువదంపతులు సంపన్నులు కారు. అయితే వారు ఆ నిర్ణయం తీసుకునే ముందు ‘మనం స్కూల్ కట్టించగలమా?’ ‘అంత డబ్బు మన దగ్గర ఉందా?’ అని ఆలోచించలేదు. ‘మనం స్కూల్ కట్టించాలి. అంతే!’ అని గట్టిగా అనుకు న్నారు. తమ సేవింగ్స్‌ను బయటికి తీశారు. స్కూల్ పునర్నిర్మాణంలో శ్రమదానం చేయడానికి ఊరివాళ్లను ఒప్పించారు. తమ దగ్గర ఉన్న పొదుపు మొత్తాలతోనే పని కాదనే విషయం ఈ దంపతులకు అర్ధమైంది. ఈ పరిస్థితులలో ‘మలావి డైరీ’ పేరుతో యూట్యూబ్ చానల్‌కు శ్రీకారం చుట్టింది సుమి. ఈ చానల్ ద్వారా వచ్చిన డబ్బు, తమ సేవింగ్స్‌తో లోకాస్ట్ కన్స్ట్రక్షన్ టెక్నిక్‌తో స్కూల్ నిర్మాణాన్ని పూర్తి చేశారు. స్కూలో ఆవరణలో తోట పెంచారు. లైబ్రరీ ఏర్పాటు చేశారు. ప్లేగ్రౌండ్ తయారుచేశారు. స్కూల్ ప్రారంభోత్సావాన్ని ఒక పండగలా ఘనంగా జరుపుకున్నారు. సుమీ, అరుణ్‌లు ఇప్పుడు చిసాలియా ఊరి వాళ్లకు ఆత్మబంధువులయ్యారు. ‘స్కూల్‌ను పునర్నిర్మించాలనుకున్నాం. నిర్మించాం. ఇక సెలవ్’ అనడం లేదు సుమి, అరుణ్ దంపతులు. పిల్లల చదువుల గురించి కూడా పట్టించుకుంటున్నారు. తమకు సమయం ఉన్నప్పుడల్లా క్లాస్‌రూమ్‌లో పిల్లలతో కలిసి సమావేశం అవుతున్నారు. నాలుగు మంచి విషయాలు చెబుతున్నారు. ‘బాగా చదువుకోవాలి. పెద్ద ఉద్యోగాలు చేయాలి’ ‘పెద్ద చదువులు చదవడానికి పేదరికం ఎప్పుడూ అడ్డు కాదు’... మొదలైన మాటలను గట్టిగానే చెబుతున్నారు. -
పాఠశాలనే మద్యం గోదాం.. లిక్కర్ మాఫియా పనితో టీచర్స్ షాక్!
పాట్నా: మద్య నిషేధం అమలులో ఉన్న బిహార్ రాష్ట్రంలో లిక్కర్ మాఫియా కొత్త కొత్త ఎత్తుగడలతో రెచ్చిపోతోంది. విదేశీ మద్యం సీసాలను నిల్వ ఉంచేందుకు ఏకంగా గ్రామంలోని ఉన్నత పాఠశాలనే గోదాముగా మార్చింది. బిహార్ రాష్ట్ర వైశాలి జిల్లా లాల్గంజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బృందావన్ గ్రామ హైస్కూలులో ఈ సంఘటన జరిగింది. పాఠశాలలోని ఓ గదిలో ఏకంగా 140 కాటన్ల అక్రమ మద్యం లభించటం అధికారులు, స్థానికులతో పాటు నెజిటన్లను షాక్‌కు గురి చేస్తోంది. లిక్కర్ కాటన్లను కొందరు దుండగులు రాత్రి సమయంలో పాఠశాలలో దాచి పెట్టినట్లు ప్రధానోపాధ్యాయుడు పవన్ కుమార్ శుక్లా తెలిపారు. స్కూల్లోని ఓ గది తాళం పగలగొట్టి బాటిళ్లను అందులో పెట్టాక కొత్త తాళం వేశారని, బుధవారం ఉదయం పాఠశాలకు వచ్చిన టీచర్ ఆదేశ్పాల్ ఈ తాళాన్ని గమనించి, ప్రధానోపాధ్యాయుడికి ఫిర్యాదు చేశారు. లాల్గంజ్ పోలీసులు తాళం పగలగొట్టి చూడగా గదిలో 140 పెట్టెల మద్యం నిల్వ ఉంది. మద్యాన్ని పోలీస్‌స్టేషనుకు తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పాఠశాల గదిలో దాచిన మద్యం పెట్టెలు ఇదీ చదవండి: ఇదెక్కడి గొడవ.. కారు ఢీకొని గాల్లోకి ఎగిరిపడ్డా తగ్గేదేలే..! -
స్కూలుపై ఆర్మీ కాల్పులు.. 13 మంది మృతి!
యాంగూన్: తిరుగుబాటుదారులు నక్కి ఉన్నారనే అనుమానంతో మయన్మార్ ఆర్మీ హెలికాప్టర్ ఓ స్కూలు భవనంపై జరిపిన కాల్పుల్లో ఏడుగురు విద్యార్థులు సహా 13 మంది చనిపోయారు. సగయింగ్ ప్రాంతంలోని లెటెయెట్ కోన్ గ్రామంలో ఈ దారుణం జరిగింది. బౌద్ధ ఆశ్రమం ఆవరణలోని 240 మంది విద్యార్థులున్న స్కూలుపై సైన్యం కాల్పులకు తెగబడింది. ఇందులో 30 మంది విద్యార్థులు గాయపడినట్లు సమాచారం. బాలుని మృతదేహాన్ని తరలిస్తూ తండ్రి కంటతడి గ్రామంలోని 2 వేల మంది ప్రాణభయంతో ఊరొదిలారు. రెబల్స్ కాల్పులు జరిపారని, ఎదురుకాల్పుల్లో వారితో పాటు విద్యార్థులు చనిపోయారని సైన్యం తెలిపింది. సైనిక నేతలు గత ఏడాది ప్రజా ప్రభుత్వాన్ని కూలదోసి అధికారం చేజిక్కించుకున్నప్పటి నుంచి దేశంలో హింసాత్మక ఘటనలు ఎక్కువయ్యాయి. నేలపై రక్తం. అక్కడ పడున్న స్కూలు బ్యాగు ఇదీ చదవండి: ప్రపంచ నేతలు స్పందించాలి: ఎన్జీవోలు -
స్కూల్‌పై బాంబు పేలుడు.. భయంతో విద్యార్థులు, టీచర్ల పరుగులు
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ టీటాగఢ్లో ఓ పాఠశాలపై బాంబు పేలడం కలకలం రేపింది. విద్యార్థులు, టీటర్లంతా స్కూల్లో ఉన్న సమయంలోనే శనివారం మధ్యాహ్నం 1:00గంటలకు ఈ ఘటన జరిగింది. భారీ పేలుడు శబ్దం వినగానే సిబ్బంది, స్టూడెంట్స్ భయంతో బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనలో ఒక్కరు కూడా గాయపడకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. హుటాహుటిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాంబు స్క్యాడ్ నిపుణులతో తనిఖీలు చేయించారు. అయితే స్కూల్ భవనంపైకప్పుపై ఈ బాంబు ఎలా పేలి ఉంటుందనే విషయంపై మాత్రం పోలీసులు స్పష్టత ఇవ్వలేదు. ఈ బాంబును భవనంపైనే ఎవరైనా కావాలని పెట్టారా? లేక బయటి నుంచి స్కూల్ పైకి విసిరారా? అనే విషయం తెలియాల్సి ఉంది. అదృష్టవశాత్తు పేలుడు జరిగినప్పుడు విద్యార్థులంతా స్కూల్ లోపలే ఉన్నారని అధికారులు పేర్కొన్నారు. ఒకవేళ భవనంపై కాకుండా పాఠశాల లోపల పేలుడు జరిగి ఉంటే పరిస్థితి దారుణంగా ఉండేదని పేర్కొన్నారు. ఈ పేలుడు ఘటనపై అధికార టీఎంసీ, ప్రతిపక్ష బీజేపీ ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు గుప్పించుకున్నారు. క్రూడ్ బాంబులు, అక్రమ ఆయుధాల పరిశ్రమలే బెంగాల్లో పుట్టుకొస్తున్నాయని కమలం పార్టీ తృణమూల్ ప్రభుత్వంపై మాటల దాడికి దిగింది. ప్రభుత్వంపై బురద జల్లేందుకు బీజేపీ ఎలాంటి అవకాశన్నైనా వదులుకోదని టీఎంసీ దీటుగా బదులిచ్చింది. చదవండి: ప్రధాని మోదీని ఆకాశానికెత్తిన అమెరికా మీడియా -
మనబడి నాడు–నేడు.. నాణ్యతకు పెద్దపీట
సాక్షి, అమరావతి: మనబడి నాడు–నేడు పనుల్లో నాణ్యతకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. ఈ కార్యక్రమం కింద ప్రభుత్వ స్కూళ్లలో చేపడుతున్న మౌలిక వసతులు, అదనపు తరగతి గదుల నిర్మాణాలు కనీసం 80ఏళ్ల పాటు చెక్కుచెదరకుండా ఉండేలా నాణ్యతకు పెద్దపీట వేస్తోంది. అంతేకాక.. వాటి నిర్వహణకు కూడా ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోంది. ఇందులో భాగంగా.. ఇప్పటికే స్కూళ్లు, టాయిలెట్ల నిర్వహణకు నిధులను అందుబాటులో ఉంచింది. అలాగే, పాఠశాలల నిర్వహణ కోసం ప్రత్యేకంగా ఓ ఐఏఎస్ అధికారిని సైతం ఇటీవలే నియమించింది. క్షేత్రస్థాయిలో పనుల నాణ్యత తనిఖీ ఇక గతంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేపట్టని విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏకంగా రూ.16,450 కోట్ల అంచనాలతో పనులను చేపడుతోంది. ఇప్పటికే మనబడి నాడు–నేడు తొలిదశలో 15,715 స్కూళ్లలో మౌలిక సదుపాయాలను కల్పించడంతో పాటు వాటి రూపురేఖలను విజయవంతంగా మార్చింది. ఇప్పుడు రెండో దశలో ఏకంగా రూ.8వేల కోట్ల వ్యయంతో 22,344 స్కూళ్లలో మౌలిక సదుపాయాలు, అదనపు గదుల నిర్మాణాలను చేపట్టింది. వీటిని అత్యంత నాణ్యతతో చేపట్టాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడొద్దని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. నాడు–నేడు కింద సమకూరుతున్న విద్యా సంస్థల ఆస్తులు కనీసం 80 ఏళ్ల పాటు మన్నికతో ఉండాలనేది ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. ఇందులో భాగంగా ప్రతీ దశ పనుల్లోనూ క్షేత్రస్థాయిలో నాణ్యతను తనిఖీ చేయాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఇందుకోసం.. పనులు అమలుచేస్తున్న ఏజెన్సీలు, తనిఖీలు చేసే ఇంజనీర్లకు స్పష్టమైన మార్గదర్శకాలను కూడా జారీచేసింది. మార్గదర్శకాలు ఇవే.. ⇒ఇంజనీరింగ్ అసిస్టెంట్, ఎమినిటీస్ కార్యదర్శి తమ పరిధిలోని నూటికి నూరు శాతం స్కూళ్లలో నాడు–నేడు పనులను రోజు విడిచి రోజు తనిఖీ చేయాలి. ⇒మండల ఇంజనీర్ అన్ని స్కూళ్ల పనులను కనీసం 15 రోజులకోసారి సందర్శించి పనులను పరిశీలించాలి. ⇒డిప్యూటీ ఈఈ నెలలో కనీసం 30 స్కూళ్లను సందర్శించాలి. ⇒ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నెలలో 10 స్కూళ్లలో నాడు–నేడు పనుల నాణ్యతను తనిఖీచేయాలి. ⇒ఇక క్వాలిటీ కంట్రోల్ బృందాలు నెలలో 20 స్కూళ్లకు వెళ్లాలి. ⇒ఎస్ఈ, సీఈ నెలలో కనీసం ఐదు స్కూళ్లను పరిశీలించాలి. ⇒ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్ రెండు శాతం పనులను, థర్డ్ పార్టీ రెండు శాతం పనులను తనిఖీలు చేయాలి. ⇒తనిఖీలు చేసే ఇంజనీర్లందరికీ మొబైల్ అప్లికేషన్‌ను అందుబాటులో ఉంచుతారు. ⇒తనిఖీల నివేదికలను ఈ అప్లికేషన్ ద్వారా సంబంధిత శాఖలకు పంపాలి. ⇒తనిఖీల సమయంలో తమ దృష్టికి వచ్చిన అంశాలను సంబంధిత క్షేత్రస్థాయి అధికారులకు, ఏజెన్సీలకు తెలియజేయాలి. చదవండి: మునుపెన్నడూ ఇటు చూడని పారిశ్రామిక దిగ్గజాలు.. ఇప్పుడు ఏపీకీ వస్తున్నారు -
బాలికపై అత్యాచార యత్నం... తప్పించుకునే క్రమంలో భవనం పై నుంచి దూకి...
మహిళల పై జరుగుతున్న ఘోరాలకు అంతేలేదు. ఆమె మైనరా! వివాహితా! అనే ఇంకితం కూడా ఉండదు. కేవలం ఆడపిల్ల అయితే చాలు అఘాయిత్యాలకు ఒడిగడుతున్నారు. ఇలాంటి ఘటనలు చూస్తుంటే మనుఘలమేనా? అనిపించేంత అసహ్యం కలుగుతుంది. ఇక్కడొక బాలిక పై అలాంటి దారుణానికి ఒడిగట్టారు కొందరూ దుండగులు. వర్షం వస్తుందని ఒక భవనం వద్ద తలదాచుకోవడానికి వస్తే కబళించేందుకు యత్నించారు. ఆ దుండగులు దాష్టికం నుంచి తప్పించుకునే క్రమంలో ఆ బాలిక భవనం పై నుంచి దూకేసింది. ఈ ఘటన ఒడిశాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...పోలీసులు తెలిపిన కథనం ప్రకారం...ఒడిశాలోని కియోంజర్ జిల్లాకు చెందిన బాలిక తన సోదరుడితో కలసి సోదరి ఇంటికి వెళ్తున్నారు. ఐతే బస్సుదిగి ఇంటికి వెళ్లే క్రమంలో భారీగా వర్షం కురుస్తుండటంతో తలదాచుకునేందుకు అక్కడ ఉన్న ఒక పాఠశాల భవనం వద్ద బస చేశారు. వర్షం తగ్గాక వెళ్దామని అక్కడే కాసేపు ఉన్నారు ఆ ఇద్దరూ. ఇంతలో ఐదుగురు వ్యక్తులు వచ్చి బాలిక సోదరుడిని కొట్టి ఆమె పై అత్యాచారం చేసేందుకు యత్నించారు. ఐతే ఆ బాలిక ఆ దుండగుల నుంచి తప్పించుకునే క్రమంలో పాఠశాల భవనం పై కప్పు ఎక్కి దూకేసింది. దీంతో ఆమెకు తీవ్ర గాయలయ్యాయి. ఈ మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితురాలి సోదరుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనకు పాల్పడిన ఆ ఐదుగురు దుండగులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. ఆ బాలికను ఒడిశాలోని కళింగ నగర్‌లోని ఆస్పత్రిలో చేర్పించనట్లు తెలిపారు. ప్రస్తుతం ఆ బాలిక పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. (చదవండి: ప్రేమ పేరుతో వివాహితను వంచించిన ఏఆర్ ఎస్ఐ ) -
కాశ్మీర్ ఫైల్స్ సినిమా ఎఫెక్ట్.. ఢిల్లీలో ఆసక్తికర ఘటన
సాక్షి, న్యూఢిల్లీ: ద కాశ్మీర్ ఫైల్స్ సినిమా దేశంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా పలు రికార్డులను బద్దలుకొట్టిన విషయం తెలిసిందే. సినిమా విడుదలైన నాటి నుంచి విమర్శకులను సైతం ఆకట్టుకుంటోంది. ఈ సినిమా కారణంగా తాజాగా మరో ఆకస్తికర ఘటన చోటుచేసుకుంది. కాశ్మీర్ ఫైల్స్ సినిమా ఎఫెక్ట్‌తో ఢిల్లీలో ఓ పాఠశాల పేరును మార్చివేశారు. వివరాల ప్రకారం.. ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లో టీకా లాల్ తాప్లూ పేరుతో ఓ పాఠశాల ఉంది. కాగా, ఇటీవల విడుదలైన కాశ్మీర్ ఫైల్స్ సినిమాలో టికా లాల్ తాప్లూ పేరును ప్రస్తావిస్తూ.. కాశ్మీర్లో జరిగిన మారణహోమంలో అతడు మృతి చెందినట్టు చూపించారు. ఈ నేపథ్యంలో అతడి గౌరవార్ధం పాఠశాల పేరును 'షహీద్ టీకా లాల్ తాప్లూ'గా మార్చారు. కాగా, పాఠశాల పేరు మార్పు సందర్బంగా ఈ వేడుకకు ముఖ్య అతిధిగా కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ విచ్చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. "తాప్లూ జీ భారతీయ జనతా పార్టీ సభ్యుడు, జమ్మూకశ్మీర్ హైకోర్టులో న్యాయవాది" అని అన్నారు. అతనో గొప్ప దేశభక్తుడంటూ ప్రశంసించారు. సెప్టెంబరు 14, 1989న తీవ్రవాదుల చేతిలో హతమార్చబడిన కాశ్మీరీ పండిట్ల గొప్ప నాయకుడని కీర్తించారు. దేశ విభజన తర్వాత, కాశ్మీరీ పండిట్లపై జరిగిన దాడులపై పరిశోధన జరగాల్సిన అవసరం ఉందని మంత్రి అన్నారు. వివేక్ అగ్నిహోత్రి రూపొందించిన 'ది కాశ్మీర్ ఫైల్స్' చిత్రం దేశంలోని ప్రజలలో కాశ్మీరీ హిందువులపై "మారణహోమం" గురించి అవగాహన కల్పించిందని తెలిపారు. -
జనంపై బాంబుల మోత
కీవ్/వాషింగ్టన్/మాస్కో: ఉక్రెయిన్‌పై రష్యా సైన్యం పాశవిక దాడులు కొనసాగిస్తోంది. ఉక్రెయిన్ సైనిక దళాలతోపాటు సామాన్య ప్రజలను కూడా వదిలిపెట్టడం లేదు. ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్న వారిపై క్షిపణుల మోత మోగిస్తోంది. రాజధాని కీవ్ శివార్లలోని కాలీనివ్కా, బ్రోవరీ పట్టణాలపై గురువారం క్షిపణులు ప్రయోగించిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు కార్యాలయం పేర్కొంది. కీవ్‌లో 16 అంతస్తుల ఓ అపార్ట్ మెంట్ భవనంపై రష్యా సైన్యం రాకెట్ దాడులు జరిపింది. ఒకరు మరణించారు. మరో ముగ్గురు గాయపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి అపార్ట్మెంట్ మొదటి అంతస్తు నుంచి 30 మందిని క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. మంటలను ఆర్పేశారు. ఖర్కీవ్ సమీపంలో ఉన్న మెరెఫా పట్టణంలో ఓ పాఠశాల, కమ్యూనిటీ కేంద్రంపై రష్యా దాడికి దిగింది. ఈ ఘటనలో 21 మంది మరణించారు. మరో 25 మంది గాయపడ్డారని స్థానిక అధికారులు తెలిపారు. వీరిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్పారు. చెర్నీహివ్లోని ఓ హోటల్‌పై రష్యా బాంబులు ప్రయోగించడంతో ముగ్గురు పిల్లలతో సహా మొత్తం ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మారియుపోల్ సిటీలో మహిళలు, చిన్నారులు ఆశ్రయం పొందుతున్న నెప్ట్యూన్ మున్సిపల్ స్విమ్మింగ్ పూల్ కాంప్లెక్స్‌పైనా రష్యా సైన్యం విరుచుకుపడింది. గగనతలం నుంచి క్షిపణి దాడులు జరిపింది. ఈ ఘటనలో ఎంతమంది మృతి చెందారన్నది ఇప్పటివరకు తెలియరాలేదు. పోర్ట్ సిటీ మారియుపోల్‌లో దాదాపు 1,000 మంది తలదాచుకున్న ఓ థియేటర్‌పై రష్యా బాంబుల వర్షం కురిపించింది. మూడంతస్తుల ఈ థియేటర్ చాలావరకు ధ్వంసమయ్యింది. ముఖద్వారం పూర్తిగా కుప్పకూలింది. ఎంతమంది చనిపోయారన్నది ఇంకా నిర్ధారణ కాలేదు. కొందరు గురువారం క్షేమంగా బయటపడినట్లు ఉక్రెయిన్ పార్లమెంట్ సభ్యుడు, డొనెట్స్క్ మాజీ గవర్నర్ సెర్గీ టరూటా చెప్పారు. అయితే, థియేటర్‌పై దాడి అంటూ వస్తున్న వార్తలను రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ఖండించింది. థియేటర్‌పై తాము దాడి చేయలేదని వెల్లడించింది. మారియుపోల్‌లో ఎక్కడా దాడులు జరపలేదని పేర్కొంది. తిరిగి వస్తున్న శరణార్థులు! ఉక్రెయిన్ నుంచి పొరుగుదేశాలకు శరణార్థుల వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా దాదాపు 30 లక్షల మంది ఉక్రెయిన్ పౌరులు వలసబాట పట్టారు. ప్రధాన నగరాల్లోని రైల్వే స్టేషన్లు జనంతో కిక్కిరిసిపోతున్నాయి. రైళ్ల రాక కోసం పడిగాపులు గాస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. విదేశాలకు వెళ్లిన వారిలో కొందరు అక్కడ ఉండలేక తిరిగి వస్తున్నట్లు ఉక్రెయిన్ అధికారులు చెబుతున్నారు. ఉక్రెయిన్ గగనతలాన్ని నో–ఫ్లై జోన్‌గా ప్రకటించాలన్న ప్రతిపాదనకు మద్దతు తెలుపుతూ లిథువేనియా పార్లమెంట్ ఏకగ్రీవంగా ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఇప్పటికే ఎస్తోనియా, స్లొవేనియా కూడా ఇలాంటి తీర్మానాన్ని ఆమోదించాయి. ఆపదలో ఉన్నాం.. ఆదుకోండి: జెలెన్స్కీ రష్యా దండయాత్ర నుంచి మాతృదేశాన్ని కాపాడుకొనేందుకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రపంచ దేశాల సాయం అర్థిస్తున్నారు. బుధవారం అమెరికా పార్లమెంట్‌ను ఉద్దేశించి మాట్లాడిన ఆయన గురువారం జర్మనీ చట్టసభ సభ్యులకు మొరపెట్టుకున్నారు. జర్మనీ ఫెడరల్ పార్లమెంట్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. తమ దేశానికి మరింత సాయం అందించాలని కోరారు. రష్యా రాక్షసకాండ సాగిస్తోందని, వేలాది మంది ఉక్రెయిన్ పౌరులు చనిపోతున్నారని, ఇప్పటివరకు 108 మంది చిన్నారులు బలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. రష్యాపై ఆంక్షలు విధించకుండా జర్మనీ ఎందుకు వెనుకాడుతోందో చెప్పాలన్నారు. మెలిటోపోల్ మేయర్ విడుదల తమ సైన్యం వారం రోజుల క్రితం అపహరించిన ఉక్రెయిన్‌లోని మెలిటోపోల్ నగర మేయర్ ఇవాన్ ఫెడోరోవ్‌ను రష్యా విడుదల చేసింది. ఇందుకు ప్రతిఫలంగా ఉక్రెయిన్ తమ నిర్బంధంలో ఉన్న 9 మంది రష్యా సైనికులకు స్వేచ్ఛ కల్పించింది. ఈ విషయాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడి కార్యాలయం అధికార ప్రతినిధి డారియా జరీవ్నా ధ్రువీకరించారు. ‘నాటో’లో ఉక్రెయిన్ భాగమే: కమల ట్వీట్ నార్త్ అట్లాంటిక్ ట్రీటి ఆర్గనైజేషన్(నాటో)లో ఉక్రెయిన్ కూడా సభ్య దేశమేనంటూ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ చేసిన రెండు ట్వీట్లు చర్చనీయాంశంగా మారాయి. నాటో కూటమిని రక్షించుకోవడంలో భాగంగా ఉక్రెయిన్ ప్రజలకు అమెరికా అండగా నిలుస్తుందంటూ మొదట ఒక ట్వీట్ చేశారు. దీనిపై విమర్శలు రావడంతో తొలగించారు. గంట తర్వాత మరో ట్వీట్ చేశారు. ఉక్రెయిన్‌కు అండగా నిలుస్తామని, నాటో సభ్యదేశాలను రక్షించుకుంటామని రెండో ట్వీట్లో పేర్కొన్నారు. నేడు బైడెన్, జిన్‌పింగ్ చర్చలు ఉక్రెయిన్‌లో రష్యా దాడులు, తాజా పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు బైడెన్ శుక్రవారం చైనా అధినేత జిన్‌పింగ్‌తో చర్చించనున్నారని శ్వేతసౌధం తెలియజేసింది. అమెరికా–చైనా పరస్పర ప్రయోజనాలతో ముడిపడి ఉన్న అంశాలపైనా వారు చర్చిస్తారని పేర్కొంది. రష్యాకు మద్దతు ఇవ్వడం మానుకోవాలని, ఆ దేశాన్ని ఏకాకిని చేయాలని అమెరికా, నాటో దేశాలు చైనాపై ఒత్తిడి పెంచుతున్నాయి. -
కేసీఆరే నిజమైన అంబేడ్కర్‌వాది
సాక్షి, మహబూబ్‌నగర్: ‘రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ చూపిన మార్గంలో 14 ఏళ్లపాటు పోరాడి తెలంగాణ సాధించిన వ్యక్తి సీఎం కేసీఆర్.. డాక్టర్ బాబాసాహెబ్ గారినే కేసీఆర్ అవమానించిండు అని దుర్మార్గంగా మాట్లాడుతున్నారు.. కేంద్ర బడ్జెట్‌పై కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చే దమ్ము లేక విపక్ష నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. కేసీఆర్ కంటే నిజమైన అంబేడ్కర్‌వాది ఎవరూ లేరు’అని రాష్ట్ర ఐటీ, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి కె. తారక రామారావు అన్నారు. శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం కోడ్గల్‌లో రైతు వేదిక, 40 డబుల్ బెడ్రూం ఇళ్లతోపాటు ఎంజేఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజీపేటలో నూతనంగా నిర్మించిన జిల్లా పరిషత్ హైస్కూల్ భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి, గువ్వల బాలరాజు, ఎంపీ రాములు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై ఆవేదనతో సీఎం మాట్లాడారని.. తెలంగాణకు నిధుల కేటాయింపు విషయమై ప్రశ్నించారని.. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని అడిగితే కేంద్రం నుంచి ఉలుకూపలుకు లేదన్నారు. వాటికి సమాధానం చెప్పే సత్తా లేక, విషయ పరిజ్ఞానం లేక, భావ దారిద్య్రంతో కేవలం విమర్శ కోసమే విమర్శ అన్నట్లు కొందరు చిల్లరమల్లర మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి నిజంగా దళితులపై ప్రేమ ఉంటే దేశమంతా ‘దళితబంధు’ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలా చేస్తే ప్రధానమంత్రిని ప్రత్యేకంగా రాష్ట్రానికి పిలిచి సన్మానం చేస్తామన్నారు. తెలంగాణనూ సమదృష్టితో చూడాలని కోరుకుంటా.. ‘నేను రచించిన రాజ్యాంగాన్ని పాలకులు దుర్వినియోగం చేస్తే ఆ రాజ్యాంగాన్ని తగలబెట్టడంలో నేనే ముందుంటా’అని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ స్వయంగా చెప్పారని మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. నాటి నుంచి నేటి వరకు కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు 105 సార్లు రాజ్యాంగానికి సవరణలు చేశాయన్నారు. ఇది అంబేడ్కర్‌ను అవమానించినట్లు అవుతుందా అని ప్రశ్నించారు. 2001లో అటల్ బిహారీ వాజ్‌పేయి రాజ్యాంగ సవరణకు ఒక కమిటీ వేశారని, మోహన్ భాగవత్ కొత్త రాజ్యాంగం కావాలన్నారని.. వారు కూడా రాజ్యాంగాన్ని అవమానపరిచినట్లా అని నిలదీశారు. ‘ప్రధాని మోదీ శనివారం సమతామూర్తి విగ్రహాన్ని అవిష్కరించేందుకు వస్తున్నారు. ఆయన కలలోకి వెళ్లి తెలంగాణను కూడా సమదృష్టితో చూడాలని, పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని, కర్ణాటక, మహారాష్ట్రలతో సమానంగా తెలంగాణను చూడాలని ఆ రామానుజచార్యుల వారిని కోరుకుంటా’అని కేటీఆర్ పేర్కొన్నారు. కేంద్రం సహకరించడం లేదు.. ‘విద్య విషయంలో కేంద్రం తెలంగాణ పట్ల వివక్ష చూపుతోంది. దేశంలో 150 మెడికల్ కాలేజీలు, 8 ఐఐఎం కళాశాలలు, వందకు పైగా నవోదయ పాఠశాలలు మంజూరు చేసినా.. తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వలేదు’అని కేటీఆర్ ధ్వజమెత్తారు. బాబాసాహెబ్ చెప్పినట్లు బోధించు, సమీకరించు, పొరాడు అనే సూక్తిని స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ సాధించింది కేసీఆరే. కేంద్రం కలసి వచ్చినా రాకపోయినా ప్రజాశీర్వాదంతో టీఆర్ఎస్ ప్రభుత్వం వెనుకడుగు వేయదన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండల కేంద్రంలో నూతన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవనాన్ని ప్రారంభించి పాఠశాల విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేసిన మంత్రి కేటీఆర్ -
అవ్వా.. నీకు వందనం! అందుకే ఆ ఊరే మొక్కుతోంది మరి!
ఎప్పుడైనా మీ చుట్టుపక్కల వాళ్లకు సాయం చేశారా?. సపోజ్.. మీ దగ్గర కోటి రూపాయల డబ్బు ఉందనుకోండి!.. ఏం చేస్తారు? ఆలోచిస్తున్నారా? ఇక్కడో బామ్మ మరో ప్రస్తావన లేకుండా దానం చేసేసింది. ఎందుకో తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే. హుచ్చమ్మ చౌద్రి.. వయసు 75 ఏళ్లు. ఉండేది హవేరీ జిల్లా కునికేరి అనే చిన్న గ్రామం. చిన్న వయసులోనే బసప్ప చౌద్రిని పెండ్లి చేసుకుని ఆ ఊరికి కాపురం వచ్చింది. ఎన్నో ఏళ్లు గడిచినా పాపం పిల్లలు కలగలేదు ఆ జంటకు. ఒకరికొకరు తోడుగా పొలం పనులు చేసుకుంటూ కష్టపడి బతికేవాళ్లు. ముప్ఫై ఏళ్ల క్రితం బసప్ప చనిపోయాడు. అప్పటి నుంచి హుచ్చమ్మ ఒంటరిది అయ్యింది. కానీ, ఆమె కాయకష్టం ఆగలేదు. ఊరికి కష్టం.. పొలం పనులు చేసుకుంటున్న హుచ్చమ్మకి.. ఒకరోజు పంచాయితీలో పెద్దలు మాట్లాడుకుంటున్న విషయం చెవిన పడింది. స్కూల్లో బడి లేదు. ఎక్కడైనా స్థలం దొరికితే కట్టాలని అనుకుంటున్నారు. ఆ పెద్దావిడ ముందుకొచ్చింది. తన ఎకరం స్థలం తీసుకోమని చెప్పింది. అది వినగానే అందరూ కంగుతిన్నారు. నిజంగానే అంటున్నావా హుచ్చమ్మా? అన్నారు. ‘మనస్ఫూర్తిగా..’ అంటూ కాగితాలపై సంతకాలు చేసేసింది ఆమె. అలా ఆ ఊరికి స్కూల్ వచ్చింది. అటుపై పిల్లల ఆట స్థలం కోసం ఇబ్బంది పడకూడదని ఆ పక్కనే మరో ఎకరం కూడా ఇచ్చేసింది. ఈసారి రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన అధికారులు.. ఆమెకు ఆ స్థలం విలువ చెప్పే ప్రయత్నం చేశారు. ఆ భూమిలో ఇనుము ధాతువు ఉందని, ఎకరం కనీసం అర కోటి రూపాయలకు తక్కువకు పోదని ఆమెకు వివరించారు. కానీ, నవ్వుతూ ఆ పెద్దావిడ ‘ ఆ డబ్బు నేనేం చేసుకోను అయ్యా.. ఆకలి తీర్చుకునేందుకు పని చేస్తున్నా.. సంపాదించుకుంటున్నా. ఇలాగైనా ఈ ఊరి బిడ్డలు నన్ను జీవితాంతం గుర్తు పెట్టుకుంటారు కదా’ అంటూ సంతకాలు చేసేసింది. హుచ్చమ్మ ఇప్పుడు అదే స్కూల్లో ఆమె మధ్యాహ్నన భోజన పథకం కింద వంట మనిషిగా పని చేస్తోంది. బడి బంద్ ఉన్న టైంలో పొలం పనులు చేసుకుంటోంది. బడిలో అంతా ఆమెను అజ్జీ(అవ్వ) అని పిలుస్తున్నారు. తల్లి ప్రేమను నోచుకోకపోయినా.. ఊరి బిడ్డలకు ప్రేమగా వండిపెడుతోంది. 300 మంది ఆప్యాయంగా అవ్వా అంటుంటే సరిపోదా? అంటూ బోసినవ్వులతో చెప్తోంది హుచ్చమ్మ. అందుకే ఆ అవ్వ సాయానికి ఊరంతా మొక్కుతోంది ఇప్పుడు. -
కర్ణాటక సర్కారీ స్కూల్లో పిల్లల నమాజ్!
కోలార్ (కర్ణాటక): స్కూలు ఆవరణలో శుక్రవారం రోజు ముస్లిం విద్యార్థులు నమాజ్ చేసుకోవడానికి కర్ణాటక రాష్ట్రం ముల్బగల్ పట్టణంలోని బలెచంగప్ప ప్రభుత్వ పాఠశాల అనుమతివ్వడంపై పిల్లల తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులు, హిందూ సంఘాలు భగ్గుమన్నాయి. శుక్రవారం రోజు మధ్యాహ్నం ముస్లిం విద్యార్థులు ఓ తరగతి గదిలో నమాజ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో తాజాగా వైరలైంది. దీంతో స్కూలు నిర్ణయానికి వ్యతిరేకంగా పిల్లల తల్లిదండ్రులు, హిందూ సంఘాలు నిరసన తెలిపాయి. ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా సీఎం బసవరాజ్ బొమ్మై, కోలార్ ఎంపీ మునిస్వామి, విద్యా శాఖ అధికారులు స్పందించాలని డిమాండ్ చేశాయి. పిల్లలు నమాజ్ చేసుకోవడానికి ఎందుకు అనుమతిచ్చారని బ్లాక్ ఎడ్యుకేషన్ అధికారి నుంచి తనకు శుక్రవారం ఫోన్ వచ్చిందని, తాను త్వరగా వెళ్లి చూడగా పిల్లలు నమాజ్ చేస్తూ కనిపించారని తెలిపారు. -
అవమానం నుంచి పుట్టిన ఆలోచన.. నేడు పద్మశ్రీ
సాక్షి, వెబ్‌డెస్క్: ఆపదలో ఉన్న వారికి.. సాయం కోరే వారికి చేయూతనివ్వడానికి మన దగ్గర ఎనలేని సంపద ఉండాల్సిన పని లేదు. తోటి వారి కష్టాన్ని చూసి స్పందించే హృదయం.. చేయూత ఇవ్వాలనే ఆలోచన ఉంటే చాలు. ఈ కోవకు చెందిన వ్యక్తే కర్ణాటకకు చెందిన హరేకల హజబ్బ. పళ్లు అమ్ముకుని జీవనం సాగించే హజబ్బ తన ఊరి పిల్లల పాలిట దైవం అయ్యాడు. రెక్కడాతే కాని డొక్కాడని స్థితిలో ఉన్న హజబ్బ.. తన ఊరి పిల్లల కోసం ఏకంగా పాఠశాల నిర్మించాడు. 1-10వ తరగతి వరకు ఇక్కడ ఉచితంగా చదువుకోవచ్చు. హజబ్బ సేవా గుణాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఆయనను పద్మశ్రీతో సత్కరించింది. ఆయన సేవా గుణం ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తోంది. ఆ వివరాలు.. హజబ్బ జీవితాన్ని మార్చిన సంఘటన.. మంగుళూరుకు చెందిన హరేకల హజబ్బ స్థానికంగా ఉన్న సెంట్రల్ మార్కెట్లో కమలాలు అమ్ముతూ జీవనం సాగిస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో ఓ రోజు ఫారిన్ దంపతులు హజబ్బ దగ్గరకు వచ్చి.. కిలో కమలాలు ఎంత అని ఇంగ్లీష్‌లో అడిగారు. హజబ్బకు కన్నడ, మాతృభాష అరబ్బీ తప్ప మరో భాష రాదు. అందుకే ఆ ఫారిన్ దంపతులు అడిగిన ప్రశ్నకు అతను సమాధానం చెప్పలేకపోయాడు. ఆ దంపతులు హజబ్బను చూసి ఎగతాళిగా నవ్వుకుంటూ వెళ్లిపోయారు. (చదవండి: పద్మశ్రీకి ఎంపికైనా పింఛను కరువే) తన పరిస్థితి మరేవరికి రాకూడదని.. జరిగిన అవమానం హజబ్బను చాలా కుంగదీసింది. ఇంగ్లీష్ రాకపోవడం వల్లే తాను ఇలా అవమానాలు పొందాల్సి వచ్చిందని భావించాడు. తన గ్రామంలోని పిల్లలు ఎవరు ఇలాంటి పరిస్థితి ఎదుర్కొకుండా ఉండాలంటే.. వారికి ఇంగ్లీష్ తప్పనిసరిగా రావాలని భావించాడు. కానీ తన గ్రామంలో మంచి స్కూల్ లేకపోవడం.. మదర్సాలో అరబ్బీ తప్ప మరో భాష నేర్పకపోవడం హజబ్బను కలవరపరిచింది. రూ.5000తో ముందడుగు.. ఈ క్రమంలో హజబ్బ తానే స్వయంగా ఓ పాఠశాలను ప్రారంభించాలిన నిర్ణయించుకున్నాడు. అయితే అది అనుకున్నంత సులభంగా జరగలేదు. ఎన్నో అవమానాలు.. అడ్డంకులు ఎదురుకున్నాడు. వాటన్నింటిని దాటుకుని.. 1999, జూన్‌లో తన కలని నిజం చేసుకున్నాడు. అప్పటి వరకు తాను పొదుపు చేసుకున్న ఐదువేల రూపాయలతో సొంతంగా కొంత భూమి కొనుగోలు చేసి.. పాఠశాల నిర్మాణం ప్రారంభించాడు. (చదవండి: ‘ఆడపిల్లని, చెట్టుని కాపాడుకుంటే చాలు') ప్రభుత్వం, దాతల సాయంతో అలా 2001 జూన్ నాటికి 8 తరగతి గదులు, రెండు మరుగుదొడ్లతో స్కూలు నిర్మాణం పూర్తయింది. అయితే పాఠశాల నిర్మించాలనే అతని కల నెరవేరింది. ఆ తర్వాత హైస్కూలు స్థాపించాలని నిర్ణయించుకున్నాడు హజబ్బ. పదేళ్లు కష్టపడి దాన్ని కూడా సాకారం చేసుకున్నాడు. 2012 నాటికి ప్రాథమిక పాఠశాల పక్కనే ఉన్నత తరగతి విద్యార్థుల కోసం మరో బిల్డింగ్ నిర్మించాడు. ప్రస్తుతం తన గ్రామంలో ప్రీ యూనివర్శిటీ కళాశాలను ప్రారంభించాలని ఆశిస్తున్నాడు. సాయం చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాడు. అవార్డుల డబ్బులన్ని స్కూల్ అభివృద్ధి కోసమే.. హజబ్బ సేవా నిరతని గుర్తించి ఇప్పటికే పలు సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వం అనేక అవార్డులతో సత్కరింnebr. ఇక అవార్డులతో పాటు లభించే మొత్తాన్ని పాఠశాల అభివృద్ధి కోసమే వినియోగించాడు. ఈ క్రమంలో ఓ సారి అవార్డుతో పాటు వచ్చిన 5 లక్షల రూపాయలను స్కూల్ కోసం కేటాయించాడు. ఇక భవిష్యత్తులో వచ్చే మొత్తాన్ని కూడా పాఠశాల అభివృద్ధికే వినియోగిస్తానంటున్న హజబ్బకు సొంత ఇళ్లు లేదు. కానీ తన గురించి ఆలోచించకుడా.. పిల్లల భవిష్యత్తు గురించి ఇంతలా ఆరాటపడుతున్న హజబ్బను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు నెటిజనులు. చదవండి: పద్మ అవార్డుల ప్రదానోత్సవం -
ఏకలవ్య గురుకులాలకు శాశ్వత భవనాలు
సాక్షి, హైదరాబాద్: ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల(ఈఎంఆర్ఎస్)లకు వీలైనంత త్వరగా శాశ్వత భవనాలను నిర్మించాలని రాష్ట్ర గిరిజన, మహిళా–శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులకు ఆదేశించారు. శుక్రవారం డీఎస్ఎస్ భవన్లో గిరిజన సంక్షేమశాఖ ఇంజనీరింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వచ్చే విద్యా సంవత్సరంనుంచి ఈఎంఆర్ స్కూళ్లన్నీ శాశ్వత భవనాల్లోనే కొనసాగించాలని, అందుకోసం పనులు వేగవంతం చేయాలన్నారు. ప్రస్తుతం 44 విద్యా సంస్థల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని, వాటిలో 21 భవనాల నిర్మాణం పూర్తి అయ్యిందని, మరో 23 భవనాలు వివిధ దశల్లో ఉన్నట్లు ఇంజనీరింగ్ అధికారులు మంత్రికి వివరించారు. నిర్మాణాలు పూర్తయిన భవనాలకు త్వరలో శంకుస్థాపన కోసం ఏర్పాట్లు చేయాలని మంత్రి ఆదేశించారు. కొత్త భవనాల్లో వీలైనంత త్వరలో వేడినీటి వసతి కల్పించాలని రెడ్కో ప్రతినిధులను సూచించారు. ఈ సమీక్షలో గిరిజన గురుకుల సొసైటీ కార్యదర్శి రోనాల్డ్ రాస్, అదనపు కార్యదర్శి నవీన్ నికోలస్, చీఫ్ ఇంజనీర్ శంకర్ తదితరులు ఉన్నారు. -
పశువుల కొట్టంగా పాఠశాల
జనగామ: జనగామ జిల్లా నర్మెట మండలం ఏనెతండాలో పదేళ్ల క్రితం రాజీవ్ విద్యామిషన్ నిధులతో నిర్మించిన నూతన పాఠశాల భవనం ప్రస్తుతం పశువుల కొట్టంగా మారిపోయింది. విద్యార్థులు లేరనే సాకుతో అధికారులు పాఠశాలను మూసివేయడంతో నిర్మించిన నాటి నుంచి ఒక్కరోజు కూడా ఈ బడి తెరుచుకోలేదు. దీంతో ఈ బడి కాస్తా పశువుల కొట్టంగా మారిపోయింది. దీనిపై మండల విద్యాధికారి (ఎంఈఓ) భగవాన్ ను వివరణ కోరగా..ఏనెతండాలో పిల్లలు, టీచర్లు లేకపోవడంతోనే బడి మూసి వేశారని తెలిపారు. -
MK Stalin: బాలిక లేఖకు స్పందించిన సీఎం
తిరువళ్లూరు: తమ పాఠశాల ఆవరణలో ఆక్రమణల ను తొలగించి, తరగతి గదులకు మరమ్మతులు చేయాలని ముఖ్యమంత్రి స్టాలిన్‌కు ఓ బాలిక రాసిన లేఖపై మంగళవారం విద్యాశాఖ మంత్రి అన్బిల్ మహేష్ పొయ్యామెళి స్పందించారు. సీఎం ఆదేశాలతో సదరు పాఠశాలను ఆయన పరిశీలించారు. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా మీంజూరులో ప్రభుత్వ అప్పర్ ప్రైమరీ పాఠశాల ఉంది. ఇక్కడ 140 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇదే పాఠశాలలో 2019 వరకు చదివిన అధిగైముత్తరసి ఆక్రమణలను తొలగించి, పాడుబడిన తరగతి గదులను బాగు చేయాలనీ అప్పటి సీఎం, గవర్నర్‌తో పాటు ఇతర ఉన్నత అధికారులను కలిసి వినతిపత్రం సమర్పించింది. అయితే ఫలితం లేకపోవడంతో అధికారుల తీరుకు నిరసనగా టీసీ తీసుకుని ప్రైవేటు పాఠశాలలో చేరింది. తరావ్త ఏకంగా హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసును విచారించిన కోర్టు పాఠశాల చుట్టూ ఉన్న అక్రమణలను తొలగించాలని అధికారులను ఆదేశించింది. అయినా క్షేత్రస్థాయిలో ఎలాంటి మార్పు రాలేదు. దీంతో ఇటీవల ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన స్టాలిన్‌కు ఫిర్యాదు చేసింది. వెంటనే స్పందించిన ఆయన సంబంధిత మంత్రి మహేష్‌ను పిలిచి పాఠశాలను తనిఖీ చేయాలని ఆదేశించారు. దీంతో మంత్రి పాఠశాల కోసం పోరాడిన ముత్తురసిని అభినందించి తిరుక్కురల్ పుస్తకాన్ని అందజేశారు. ప్లస్‌టూ పరీక్షలపై త్వరలో నిర్ణయం : పాఠశాలను తని ఖీ చేసిన అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్లస్‌టూ పరీక్షల నిర్వాహణపై త్వరలో ఉన్నాతాధికారులు, విద్యార్థులు తల్లిదండ్రులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. -
‘కదిలావో కాల్చేస్తా..’ టీచర్‌ను బెదిరించిన బాలిక
వాషింగ్టన్: అమెరికాలో మరోసారి తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. ఈసారి ఏకంగా పాఠశాలలోనే కాల్పులు జరగడం ఆందోళన కలిగిస్తోంది. ఆరో తరగతి చదువుతున్న బాలిక పాఠశాలకు తుపాకీతో వచ్చింది. వచ్చి రాగానే తన తోటి విద్యార్థులపై కాల్పులకు పాల్పడింది. ఈ ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారని తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ఆమె టీచర్‌ను భద్రతా దళాలు వచ్చేంతవరకు తుపాకీతో పట్టుకుందని సమాచారం. అమెరికాలోని ఇదోహ రాష్ట్రంలో రిగ్బి మిడిల్ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న బాలిక తుపాకీతో పాఠశాలకు వచ్చింది. అదును చూసి తనతో తెచ్చుకున్న తుపాకీతో కాల్పులకు పాల్పడింది. ఈ కాల్పుల్లో తన తోటి విద్యార్థులు ఇద్దరు, పాఠశాల సిబ్బంది ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. కాల్పులతో ఒక్కసారిగా పాఠశాలలో కలకలం రేపింది. వెంటనే స్పందించిన నిర్వాహకులు పెద్ద ప్రమాదం జరగకుండా అడ్డుకున్నారు. అయితే బాలిక పోలీసులు వచ్చేదాక కూడా టీచర్‌తో తుపాకీతో నిర్బంధించిందని అక్కడి స్థానిక మీడియా తెలిపింది. గన్‌తో పాఠశాల లోపల, బయట పలు రౌండ్లు కాల్పులు జరిపింది. ఈ ఘటనలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉందని తెలుస్తోంది. అయితే బాలిక తుపాకీ ఎందుకు పాఠశాలకు తీసుకొచ్చిందో తెలియడం లేదు. ఇంత చిన్న వయసులో గన్ కల్చర్‌కు అలవాటు పడడంతో ఆందోళన రేపుతోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: కొత్త సీఎం స్టాలిన్: తొలి ఐదు సంతకాలు వీటిపైనే చదవండి: ‘వ్యవస్థ కాదు.. ప్రధాని మోదీ ఓడిపోయాడు’ -
స్కూల్లో తప్పదాగి చిందులేసిన ఎంఈఓ.. వీడియో వైరల్
సాక్షి,ఆదిలాబాద్: విద్యాబుద్ధులు నేర్పే ఉపాధ్యాయులు మద్యానికి బానిసై అనుచితంగా ప్రవర్తించిన ఘటనలు చూశాం. తాగి పాఠశాలకు వెళ్లిన టీచర్లపై అధికారులు చర్యలు తీసుకున్న వార్తలు చదివాం. అయితే, ఉపాధ్యాయుల పనితీరును పర్యవేక్షించే మండల విద్యాధికారే పాఠశాల ఆవరణలో మందు పార్టీ చేసుకుంటూ పట్టుబడిన ఘటన తాజాగా బయటపడింది. తాగిన మైకంలో ఆయన చిందులేస్తున్న వీడియో ఒకటి బయటికొచ్చింది. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. ఎంఈఓ నర్సింహులు మద్యం సేవించి ఓ స్కూల్ ఆవరణలో డ్యాన్స్ చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎంఈవో, ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్ చేస్తున్నారు. ‘ఎంఈవో అధికారి తాగి చిందులేయడం దారుణం, ఇది చాలా హేయమైన చర్య’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. చదవండి: లైసెన్స్ లేని వారికి వాహనం ఇస్తే జైలుకే.. -
చూస్తుండగానే నదిలోకి స్కూల్ బిల్డింగ్
పట్నా: భారీ వర్షాలు, వరదలతో బిహార్‌లోని కోషి నది ఉప్పొంగుతోంది. వరద ఉధృతికి నేల కోతకు గురవడంతో నది ఒడ్డున ఉన్న ఓ స్కూల్ భవనం చూస్తుండగానే కుప్పకూలింది. ఈ సంఘటన భగల్పూర్లో జరిగింది. భవన శిథిలాలు నదిలో కొట్టుకుపోయాయి. కరోనా లాక్డౌన్ కారణంగా పాఠశాలలు మూతపడటంతో ప్రమాదం తప్పిందని స్థానికులు చెప్పారు. పాఠశాల భవనం నదిలోకి జారిపోతున్న వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. (చదవండి: అక్కడ మరోసారి పూర్తిస్థాయి లాక్డౌన్!) -
నదిలోకి జారిన స్కూల్ బిల్డింగ్
-
ఐసోలేషన్ సెంటర్‌కు అడిగితే ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాలను కరోనా ఐసోలేషన్ సెంటర్లకు అడిగితే ఇవ్వాలని కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (కేవీఎస్) ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో రక్షణ శాఖ అధికారులు లేదా జిల్లా యంత్రాంగం లేఖ/ ఈమెయిల్ ద్వారా అడిగితే ఇవ్వాలని ఆదేశాల్లో పేర్కొంది. కేంద్రీయ విద్యాలయాల డిప్యూటీ కమిషనర్ లేదా ప్రాంతీయ కార్యాలయం సీనియర్ అధికారి, సంబంధిత కేవీల ప్రిన్సిపాళ్లు తరగతి గదులను కరోనా కేసులను ఉంచేందుకు అనుమతించాలని వెల్లడించింది. ఆ వివరాలను తమకు ఈమెయిల్ (్జఛిp.జుఠిటఃజఝ్చజీ.ఛిౌఝ) ద్వారా తెలియజేయాలని వివరించింది. -
చికిత్స పొందుతున్న విద్యార్థి మృతి
సనత్‌నగర్: పాఠశాల భవనంపై నుంచి దూకి తీవ్రంగా గాయపడిన ఓ విద్యార్థి 15 రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందిన సంఘటన ఎస్ఆర్నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ మురళీకృష్ణ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పశ్చిమగోదావరి జిల్లా, ఐ–పోలవరం ప్రాంతానికి చెందిన నాగేశ్వరరావు కుటుంబంతో సహా నగరానికి వలసవచ్చి ఎస్ఆర్నగర్లోని సాయిటవర్స్‌లో సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్నాడు. అతడి కుమారుడు మహేష్ (14) జయప్రకాష్‌నగర్‌లోని విశ్వభారతి స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాడు. గత నెల 29న మహేష్ మరో ఇద్దరు స్నేహితులతో కలిసి అల్లరి చేస్తుండడంతో వైస్ ప్రిన్సిపాల్ వారిని బయట నిల్చోబెట్టాడు. ఈ విషయం తల్లిదండ్రులకు చెప్పి, టీసీ ఇచ్చి పంపుతామని హెచ్చరించడంతో ఆందోళనకు గురైన మహేష్ పాఠశాల భవనం మూడో ఫ్లోర్‌కు వెళ్లి కిందకు దూకాడు. నేరుగా అతను కింద పార్కు చేసి ఉన్న స్కూల్ బస్సుకు తగలడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న అతడి తండ్రి నాగేశ్వరరావు మహేష్‌ను అమీర్‌పేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించాడు. అక్కడి నుంచి ఈఎస్ఐ ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా విద్యార్థి మృతికి కారణమైన విశ్వభారతి హైస్కూల్ గుర్తింపును రద్దు చేయాలని బాలల హక్కుల సంఘం డిమాండ్ చేసింది. బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సంఘం గౌరవ అధ్యక్షుడు అచ్యుతరావు కోరారు. -
బడి రుణం తీర్చుకున్నారు
సాక్షి, కాశీబుగ్గ(శ్రీకాకుళం) : అక్షరాలు నేరి్పన చోటు శిథిలమవ్వకుండా వారు కాపాడారు. విద్యా బుద్ధులు నేరి్పన బడి నిర్జీవమవుతుంటే వచ్చి ఆదుకున్నారు. బతుకునిచ్చిన బడి చితికిపోతుంటే ముందుకు వచ్చి తమ కర్తవ్యాన్ని మర్చిపోకుండా అమలు చేశా రు. మొత్తానికి ఆ బడి రుణం తీర్చుకున్నారు. పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలోని చినబడాంలో 1956లో ప్రభు త్వ పాఠశాల ఏర్పడింది. అప్పటి నుంచి ఇప్పటివరకు అనేక మంది విద్యార్థులు చదువులు పూర్తి చేసుకుని వివిధ హోదా ల్లో స్థిరపడ్డారు. చాలా మంది విదేశాల్లోనూ ఉన్నత స్థాయిలో ఉన్నారు. సంక్రాంతి, ఉగాది తదితర పండగలకు ఊరు వచ్చిన వారంతా శిథిలావస్థలో ఉన్న బడిని చూసి చలించిపోయేవారు. బడి దుస్థితిని చూసి తట్టుకోలేకపోయారు. దీంతో అంతా కలిసి బడిని బాగు చేసేందుకు నిర్ణయించుకున్నారు. ఓ సమావేశం పెట్టుకుని ఎవరెవరు ఏమేం చేయాలో బాధ్యతలు పంచుకున్నారు. అంతే.. ఏకంగా రెండు అంతస్తుల్లో నా లుగు గదులు, రక్షణ గోడ, ముఖ ద్వా రం ఏర్పాటైపోయాయి. కొందరు స్థలం రాసివ్వగా, మరికొందరు పనికి సాయం చేశారు, ఇంకొందరు డబ్బులు పంపించారు. మొత్తానికి రూ.25లక్షల విలువైన భవనాలను అవలీలగా కట్టేశారు. నేడు భవనాలు ప్రారంభం చినబడాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో దాతలు నిర్మించిన భవనాలను పలాస ఎమ్మెల్యే డాక్టర్ సీదిరి అప్పలరాజు గురువారం ప్రారంభించనున్నారు. ప్రధానోపాధ్యాయుడు కె.శ్రీనివాసరావు, ఇతర ఉపా«ధ్యాయులు ఇప్పటికే కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశారు. దాతలు ముందుకు రావడం సంతోషం ప్రభుత్వ పాఠశాలలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి చేస్తున్నారు. అందుకు ఇలాంటి దాతలు తో డైతే పాఠశాలలు బంగారంలా తయారవుతాయి. పూర్వ విద్యార్థులు, పెద్దలు ముందుకు వచ్చి వితరణ చేశారు. రూ.25 లక్షలు ఖర్చు చేశారు. విదేశాల్లో ఉన్నవారితో పాటు, వైద్య వృత్తిలో స్థిరపడినవారు సాయం అందించారు. – కె.శ్రీనివాసరావు, హెచ్ఎం, ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, చినబడాం దాతలు నిర్మించిన ముఖ ద్వారం, ప్రహరీ -
పాఠశాల భవనాన్ని ప్రారంభించిన పెద్దిరెడ్డి
సాక్షి, కృష్ణా: జిల్లాలోని ఉంగుటూరు మండలంలో తేలప్రోలు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నూతన భవనాన్ని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రెడ్డి ప్రారంభించారు. వనరత్నాల పథకంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాఠశాలల్లో నాడు-నేడు కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. దీనికి స్పందించిన ప్రవాస భారతీయుడు, పూర్వ విద్యార్థి భీమవరపు సోమశేఖర్ రెడ్డి రూ. కోటీతో ఈ పాఠశాల భవనాన్ని నిర్మించారు. అదే విధంగా పాఠశాల ఫర్నీచర్‌కు పది లక్షలు విరాళం అందించారు. ఈ స్కూల్ భవనం నాడు-నేడు కార్యక్రమంలో పూర్తి అయింది. పాఠశాల భవన ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిలుగా మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, మచిలీపట్నం ఎంపీ వల్లభనేని భాలశౌరి పాల్గొన్నారు. -
పాఠశాలకు ప్రేమతో..!
సాక్షి, ఇచ్ఛాపురం : విద్యాబుద్ధులు నేర్పిన గురువు, పాఠశాల రుణం తీర్చుకోవాలనే ఆలోచన ప్రతిఒక్కరికి ఉన్నప్పటికీ వివిధ కారణాల వల్ల వాటిని ఆచరణలోనికి తీసుకురాలేని పరిస్థితి. కొద్దిమంది మాత్రమే ఆచరణలోనికి తీసుకొచ్చి అందరికి ఆదర్శంగా నిలుస్తుంటారు. అటువంటి కోవకు చెందిన వారిలో ఇచ్ఛాపురం వ్యాపారవేత్త వజ్రపు వెంకటేశ్వరరావు ఒకరు. ఈయనతో పాటు ఎంతోమందికి విద్యాబుద్ధులు నేర్పించి ప్రయోజకులుగా తీర్చిదిద్దిన ఇచ్ఛాపురం ప్రభుత్వోన్నత పాఠశాల సమస్యలతో కొట్టుమిట్టాడటం, సరైన తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బందిపడటం చూసి చలించిపోయారు. అదనపు గదులను నిర్మించాలని గతేడాది ఆగస్టులో సంకల్పించారు. అందుకు తగ్గట్టుగా అప్పటి కలెక్టర్ కె.ధనంజయ్‌రెడ్డి, విద్యాశాఖ ఉన్నతాధికారులను స్వయంగా కలిసి నిర్మాణానికి అవసరమైన అనుమతులు పొందారు. ఇచ్ఛాపురం ప్రభుత్వోన్నత పాఠశాలను 1903లో శ్రీసురంగి రాజావంశీలయులు నిర్మించారు. ప్రస్తుతం గదులన్నీ శిథిలావస్థకు చేరుకున్నాయి. ప్రస్తుతం 1358 మంది విద్యార్థులు చదువుతున్నారు. వెంకటేశ్వరరావు ఇదే పాఠశాలో 1985లో విద్యాభ్యాసం ప్రారంభించారు. బడి రుణం తీర్చుకోవాలనే ఆలోచనతో కోటీ 50 లక్షల రూపాయంతో 10 అదనపు భవనాలు నిర్మించారు. ఈ నెల 28న రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి అన్నిరకాల ఏర్పాట్లు చేస్తున్నారు. -
హెల్మెట్ పెట్టుకుని పాఠాలు..
సాక్షి, వరంగల్ : కొన్ని సార్లు సామాన్యుల నిరసనలు.. వారు చేసే పోరాటాన్ని ప్రతిబింబించేలా ఉంటాయి. అలాంటి నిరసనలు సమస్య తీవ్రతను తెలియజేయడమే కాకుండా, ఇతరుల దృష్టిని ఆకర్షిస్తాయి. వరంగల్ రూరల్ జిల్లాలో ఓ ప్రభుత్వ పాఠశాల దుస్థితిపై అక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయుడు చేపట్టిన నిరసన కూడా ఇలాంటిదే. వివరాల్లోకి వెళితే.. చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లి ప్రాథమిక పాఠశాల శిథిలావస్థకు చేరింది. ఇంగ్లిష్ మీడియంలో బోధన సాగిస్తున్న ఈ పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి వరకు 89 మంది విద్యార్థులు ఉన్నారు. ఆరుగురు ఉపాధ్యాయులు ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్నారు. మూడు తరగతి గదులు ఉండగా.. అన్ని కూడా శిథిలావస్థకు చేరాయి. అలాగే ఆ పాఠశాలలో ఇతర కనీస వసతులు కూడా లేవు. ఈ పరిస్థితుల్లో స్లాబ్ పెచ్చులు ఎప్పుడూ తమపై ఊడి పడతాయనే భయంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు బిక్కుబిక్కుమంటూ పాఠశాలలో కాలం వెళ్లదీస్తున్నారు. అయితే ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చేందుకు ఆ పాఠశాలలో గణితం బోధిస్తున్న దస్రు అనే ఉపాధ్యాయుడు విద్యార్థులతో కలిసి వినూత్నంగా నిరసన తెలిపారు. తన తలపై హెల్మెట్ ధరించి విద్యార్థులకు పాఠాలు బోధించారు. ఆ సమయంలో విద్యార్థులు కూడా తమ తలలపై పలకలు ఉంచి నిరసన తెలిపారు. విద్యార్థులతో కలిసి ఆ టీచర్ నిరసన తెలుపుతున్న ఫొటో పరిస్థితి తీవ్రతను అద్ధం పట్టేలా ఉంది. -
నిధులున్నా నిర్మించలేకపోయారు
సాక్షి, నెల్లిమర్ల(విజయనగరం) : జూనియర్ కళాశాల నూతన భవనాల నిర్మాణానికి 2013లోనే ప్రస్తుత ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు స్థలం కేటాయించారు. అప్పట్లోనే భవనాల నిర్మాణానికి రూ.50లక్షలు మంజూరు చేయించారు. ఇంకా అదనంగా భవనాల నిర్మాణానికి రెండేళ్ల క్రితం సర్వ శిక్షాభియాన్ నిధులు రూ.2.6కోట్లు మంజూరయ్యాయి. ఆ నిధులతో టీడీపీ ప్రభుత్వం గత రెండేళ్లలో భవనాలను నిర్మించలేకపోయింది. దీంతో సమస్య యథాతధంగా మిగిలిపోయింది. నెల్లిమర్ల పట్ట ణంలో సీకేఎం ప్రభుత్వ జూనియర్ కళాశాలతో పాటు బాలుర ఉన్నత పాఠశాల ఒకే ప్రాంగణంలో నడుస్తున్నాయి. ఆరు దశాబ్దాలుగా ఈ రెండు విద్యాసంస్థలు అరకొర భవనాల్లోనే నిర్వహిస్తున్నారు. ఏడేళ్ల క్రితం వరకు ఉదయం పూట పాఠశాల, రెండోపూట కళాశాల నిర్వహించేవారు. అయితే పాఠశాలతో పాటు కళాశాలను రెండుపూటలా నిర్వహించాలని సంబంధిత అధికారులు ఆదేశించడంతో అప్పటి నుంచి రెండుపూటలా నిర్వహిస్తున్నారు. ఒకే ప్రాంగణంలో రెండు విద్యాసంస్థలు నిర్వహించడం, అరకొరగా భవనాలు ఉండటంతో ఇబ్బందులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు 2013లో కళాశాలకు ప్రత్యేకంగా భవనాలు నిర్మించేందుకు మిమ్స్ సమీపంలో రెండున్నర ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కేటాయించారు. ప్రాథమికంగా భవనాల నిర్మాణానికి రూ.50లక్షలు మంజూరు చేయించారు. ప్రస్తుతం అవే భవనాల్లో ఆర్ట్స్ గ్రూపులకు సంబంధించిన తరగతులు నిర్వహిస్తున్నారు. కళాశాల అంతటికీ నూతన భవనాలు నిర్మించాలని అప్పట్లోనే ఎమ్మెల్యే బడ్డుకొండ ప్రణాళికలు రూపొందించారు. అయితే 2014లో ఎన్నికలు రావడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. రెండేళ్ల క్రితం కళాశాల భవనాలకు సర్వ శిక్షాభియాన్ రూ.2.6కోట్లు మంజూ రు చేసింది. ఆ నిధులతో కళాశాలకు సంబంధించి 16 గదులతో పాటు ప్రహరీ, మరుగుదొడ్లు నిర్మించాలని తలంచారు. టెండరు కూడా ఖరారైంది. గత రెండేళ్లలో టీడీపీ ప్రభుత్వం ఆ నిధులను వినియోగించలేకపోయింది. ఇప్పటికీ నూతన భవనాలను నిర్మించలేకపోయారు. దీంతో కళాశా ల తరలింపు ప్రక్రియ ఇప్పటికీ పూర్తికాలేదు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే బడ్డుకొండ కల్పించుకుని నూతన భవనాలను వెంటనే నిర్మించేలా చర్యలు చేపట్టాలని పాఠశాల, కళాశాల విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కోరుతున్నారు. తద్వారా దశాబ్దాల తరబడి నెలకొన్న సమస్యను తీర్చాలని విన్నవిస్తున్నారు. -
ఇకపై ‘బాత్రూం బ్రేక్’ కూడా కౌంటే..!
కోల్‌కతా : పాఠశాలల్లో ఆత్మహత్యల నివారణ కోసం ఓ స్కూల్ తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇక మీదట విద్యార్థులు బాత్రూంలో ఎంత సేపు గడుపుతున్నారనే విషయాన్ని తప్పని సరిగా నమోదు చేయాలంటూ సౌత్ సిటి ఇంటర్నేషనల్ స్కూల్ ఓ నియమం తీసుకొచ్చింది. ఇందుకోసం బాత్రూముల్లో ప్రత్యేకంగా ట్యాబ్‌లను ఏర్పాటు చేయనన్నుట్లు పేర్కొంది. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ.. ‘జూలై 1నుంచి ఈ రూల్ అమల్లోకి వస్తుంది. మగ పిల్లలు, ఆడ పిల్లల బాత్రూం వెలుపల వేర్వేరు రిజస్టర్లను ఉంచుతాం. విద్యార్థులు బాత్రూంలో ఎంత సేపు గడుపుతున్నారనే అంశం దీనిలో నమోదవుతుంది. ఏదైనా అనుకోని సంఘటన జరిగితే.. ఆ సమయంలో విద్యార్థులు ఎక్కడ ఉన్నారనే విషయం మాకు సులభంగా తెలుస్తుంది’ అన్నారు. అయితే సదరు పాఠశాల ఇలాంటి నిర్ణియం తీసుకోవడం వెనక ఓ కారణం ఉంది. గత వారం కోల్‌కతాలోని ఓ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థిని బాత్రూమ్లో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసింది. ఊపిరాడకుండా ముఖానికి ప్లాస్టిక్ కవర్ కట్టుకుని.. మణికట్టు మీద కోసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ నేపథ్యంలో ఇలాంటి అవాంఛనీయ ఘటనలను నివారించడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సదరు స్కూల్ ప్రిన్సిపల్ తెలిపారు. ఈ కొత్త రూల్ వల్ల పాఠశాలల్లో ఆత్మహత్యలను పూర్తిగా కాకపోయినా చాలా వరకూ నివారించవచ్చని పేర్కొన్నారు. ఈ రూల్ వల్ల విద్యార్థులను ప్రతిక్షణం గమనించే అవకాశం ఉంటుందన్నారు. దాంతో పాటు నెలకొకసారి క్లాస్ టీచర్ విద్యార్థుల ఇళ్లకు వెళ్లి వారి ఇంటి పరిస్థితులు ఎలా ఉన్నాయనే అంశాన్ని పరిశీలిస్తారని తెలిపారు. ఈ నూతన నియమాల గురించి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చామని.. వారు దీనికి మద్దతిస్తున్నారో లేదో తెలపాలని కోరినట్లు ప్రిన్సిపల్ చెప్పారు. -
స్కూలా.. ఫంక్షన్ హాలా?
సాక్షి,విశాఖపట్నం : ఎంవీపీ కాలనీ పరిధిలోని వాసవానిపాలెం మత్స్యకార పాఠశాలను టీడీపీ నేతలు తమ ఆగడాలకు అడ్డాగా మార్చేశారు. తమకు నచ్చి నట్టు పాఠశాలను ఉపయోగించుకుంటున్నారు. బడిని ఫంక్షన్ హాల్‌ను చేసేశారు. రాష్ట్రంలోని ఎక్కడా లేని విధంగా మత్స్యకార విద్యార్థులకు ఆ మంత్రిత్వశాఖ ప్రత్యేకంగా పాఠశాలను ఇక్కడ అందుబాటులోకి తీసుకురాగా స్థానిక టీడీపీ నాయకుడు పేర్ల మషేన్, 7వ వార్డు టీడీపీ అధ్యక్షుడు పోలారావు నిరంకుశంగా వ్యవహరిస్తూ పాఠశాలను తమ కార్యక్రమాలకు వినియోగించుకుంటున్నారు. పాఠశాల పనిదినాల్లో ఉపాధ్యాయులపై ఒత్తిడి తెచ్చి ప్రైవేట్ కార్యక్రమాలకు పాఠశాల ఆవరణాన్ని యథేచ్ఛగా వినియోగించుకోవడం జరుగుతోంది. శనివారం కూడా ఉపాధ్యాయులపై ఒత్తిడి తీసుకొచ్చి పాఠశాల ఆవరణాన్ని పెళ్లిమంటపంగా మార్చేశారు. కాలనీలోని ఓ కుటుంబానికి చెందిన పెళ్లి వేడుక శనివారం రాత్రి జరగనుంది. అయితే మషే న్, పోలారావు ఒక పక్క పాఠశాలలో తరగతులు జరుగుతున్నా ఇక్కడే పెద్ద ఎత్తున షామి యానాలు వేయించారు. అంతేకాదు వంటలను కూడా పాఠశాలలోనే చేయించడం జరిగిం ది. దీంతో తరగతుల నిర్వహణకు తీవ్ర ఆటంకం కలిగించింది. ప్రైవేట్ కార్యక్రమాలకు పాఠశాలను వినియోగించడానికి వీల్లేదని స్థానికులు, ఉపాధ్యాయులు గతంలో చెప్పగా మషేన్ వారిపై చిందులు తొక్కాడు. దీంతో ఉపాధ్యాయులు ఏం చేయలేకపోతున్నారు. మిన్నకుండిపోవడం వారి వంతవుతోంది. చేసేది లేక పిల్లలను గదిలో ఒక మూలన కూర్చోబెట్టి పాఠాలు చెప్పాలి వస్తోంది. తరచూ ఇక్కడ ఇదే పరిస్థితి ఉంటోం దని విద్యార్థులు తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ఉపాధ్యాయులు ఎందుకు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు. -
స్కూల్ భవనం పైనుంచి పడి విద్యార్థిని మృతి
నాగోలు: అనుమానాస్పద స్థితిలో స్కూల్ భవనంపై నుంచి పడి ఓ విద్యార్థిని మృతి చెందిన సంఘటన గురువారం నాగోల్‌లో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. తట్టిఅన్నారం హనుమాన్ నగర్ కాలనీకి చెందిన నల్లా నర్సింగ్‌రావ్, అనురాధ దంపతుల మూడో కుమార్తె వివిక(14) నాగోల్, సాయినగర్ కాలనీలోని శ్రీనాగార్జున పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. గురువారం ఉదయం స్కూల్‌కు వచ్చిన వివిక ఐదో అంతస్తులోని తన క్లాస్ రూమ్‌కు వెళ్లింది. స్కూల్ బ్యాగ్, టిఫిన్ బాక్స్ అక్కడే వదిలేసిన ఆమె పక్కనే ఉన్న కిటికీలో నుంచి కింద పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. పాఠశాల సిబ్బంది వివికను కామినేని హాస్పిటల్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. కాగా విద్యార్థిని మృతి పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివిక భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుందా.. లేదా ఎవరైనా తోశారా..? అనే పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భద్రతా ప్రమాణాలు లేనందునే.. శ్రీనాగార్జున పాఠశాల భవనం ఐదో అంతస్తులోని కిటికీకి గిల్స్ లేకపోవడం, సైడ్ అద్దాలు మాత్రమే ఉండటంతో వివిక అందులోంచి దూకినట్లు తెలుస్తోంది. వందలాది మంది విద్యార్థులు చదువుకునే పాఠశాలలో భద్రతా ప్రమాణాలు పాటించడంలో యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. పాఠశాల సీజ్.. సంఘటనా స్థలాన్ని సందర్శించి విద్యాశాఖ అధికారులు పాఠశాలలో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం, నిబంధనలకు విరుద్ధంగా వ్యాపార సముదాయంలో స్కూల్‌ను నిర్వహిస్తున్నట్లు గుర్తించి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. మేడ్చల్ డీఈఓ ఆదేశాల మేరకు ఆర్ఐ రోజ, ఉప్పల్ ఎంఈఓ మదనాచారి పాఠశాలను సీజ్ చేశారు. ఉప్పల్ తహసీల్దార్ ప్రమీళారాణి, వీఆర్ఓ అలేఖ్య పాఠశాలను సందర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థి సంఘాల ధర్నా.. వివిక మృతికి కారణమైన పాఠశాల యాజమాన్యాన్ని వెంటనే అరెస్ట్ చేసి క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అరుణ్‌కుమార్‌గౌడ్, ఎమ్మార్పీఎస్ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తిన సుధాకర్ ఆధ్వర్యంలో విద్యార్థి సంఘాల నేతలు పాఠశాల ఎదుట ధర్నా నిర్వహించారు. హత్యా కోణంలో విచారణ జరిపించాలి.. నాగార్జున స్కూల్ విద్యార్థిని వివిక మృతిపై పలు అనుమానాలు ఉన్నాయని ఈ సంఘటనపై హత్య కోణంలో విచారణ జరిపించాలని బాల హక్కుల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు అచ్యుతరావు డిమాండ్ చేశారు. కామినేని హాస్పిటల్ వద్ద హై డ్రామా.. వివిక మృతదేహాన్ని స్కూల్ వద్దకు తీసుకువచ్చేందుకు ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు ప్రయత్నించగా ఎల్బీనగర్ పోలీసులు అందుకు నిరాకరించడంతో కామినేని ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు భారీగా బలగాలను మోహరించారు. మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు ఎల్బీనగర్ పోలీసులు స్కూల్ యాజమాన్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అవస్థల బడి
నాలుగు చినుకులు పడగానే కురిసే పై ఫొటోలోని ఈ పాఠశాల నల్లబెల్లి మండలం రుద్రగూడెంలో ఉంది. ఈ ప్రాథమిక పాఠశాలలో 81 మంది విద్యార్థులు, నలుగురు ఉపాధ్యాయులు.. ఒక హెచ్ఎం ఉన్నారు. వర్షాకాలం ప్రారంభం కానున్న తరుణంలో విద్యార్థులు, ఉపాధ్యాయుల బాధలు వర్ణనాతీతం. కాళోజీసెంటర్: అందరికీ విద్య అందించాలన్న ప్రభుత్వ లక్ష్యాని కి అవాంతరాలు తప్పడం లేదు. ఉపాధ్యాయులకు కొరతకు తోడు పలు చోట్ల మౌలిక వసతులు వేధిస్తుండడంతో సర్కారు బడులు సమస్యల వలయంలో కొట్టు మిట్టాడుతున్నాయి. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కారం కాకుండానే ఈ విద్యా సంవత్సరం సమస్యలతో స్వాగతం పలుకుతున్నాయి. జిల్లాలో ప్రాథమిక పాఠశాలలు 460 ఉండగా 15,972 మంది విద్యార్థులు, ఉన్నత పాఠశాలలు 83 లో 4,422 మంది విద్యార్థులు, హైస్కూల్ పాఠశాలలు 153లో 21,727 మంది, కస్తూర్బా ఆశ్రమ పాఠశాలలు 12, మోడల్ స్కూల్స్6, ఇవ్వే కాకుండా సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు 8, ఎస్టీ గురుకులాలు 2, మొత్తం 724 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో45,275 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరికి 2,988 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యనందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పినపటికీ క్షేత్రస్థాయిలో అమలు కాక ఎక్కడి సమస్యలు అక్కడే తిష్ట వేశాయి. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా తరగతి గదులు, మరుగుదొడ్లు మద్యాహ్న భోజనం కోసం వంట గదులు లేని పాఠశాలలు ఉన్నాయి. ప్రతి ఏటా ఎమ్మార్సీ సమావేశంలో సమస్యలను గుర్తించి నివేదికలు అడుగుతున్నారే తప్ప సమస్యలను పరిష్కరించలేకపోతున్నారనే విమర్శలు ఉన్నా యి. అతేకాకుండా కొన్ని పాఠశాలల భవనాలు శిధిలావస్థల్లో ఉన్నాయి. వీటి నిర్మాణం కోసం చర్యలు తీసుకోన్నప్పటికీ నత్తనడకన పనులు సాగుతున్నాయి. 36 పాఠశాలలు మూత రూరల్ జిల్లా పరిధిలో 460 ప్రాథమిక పాఠశాలలు ఉండగా విద్యార్థులు లేక గత ఏడాదే 36 పాఠశాలలు మూతపడ్డాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థుల తల్లీదండ్రుల ఆలోచన మారుతున్నది. తమబిడ్డల చదువులో ఉత్తమశ్రేణిలో మార్కులు సాధించాలని, ఇంగ్లిష్‌లో మాట్లాడాలని కళలు కంటున్నారు. అదే స్థాయిలో గ్రామీ ణ పాంతాల్లో కార్పొరేట్ స్కూల్స్ అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లిష్ మీడి యం లేక ఉత్తమ ఫలితాలు రాక ప్రైవేట్ బడుల వైపు మొగ్గు చూపడంతో ప్రభుత్వ పాఠశాలలు మూతపడుతున్నాయనే విమర్శలు వçస్తున్నాయి. ఉద్యోగ బాధ్యతలు మరిచి.. ఉద్యోగం చేసే చోటనే ఉండాలనే నిబంధనలకు విరుద్ధంగా పట్టణాల నుంచి బస్సుల్లో ప్రయాణం చేయడం మూలంగా పాఠశాలకు సమయానికి హాజరు కావడం లేదని స్థానిక ప్రజల నుంచి విమర్శలు లేకపోలేదు. అంతే కాకుండా సాయంత్రం సమయం కంటే ముందే తిరుగు ప్రయాణం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. కొంత మంది టీచర్లు ఫైనాన్స్, రియల్ ఎస్టేట్ వ్యాపారాలకే ఎక్కువ సమయం కేటాయిస్తూ ఉద్యోగ బాధ్యతలను విస్మరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోకపోవడం మూలంగానే ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి అధ్వానంగా తయారై బడులు మూతపడుతున్నాయని పలు గ్రామాల ప్రజలు తెలుపుతున్నారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నాం.. సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కారానికి కృషిచేస్తున్నాం. 60 పాఠశాలలు టెన్త్ క్లాస్‌లో వంద శాతం ఉత్తీర్ణత సాధించాయి. గత సంవత్సరం 88.75 శాతం ఉత్తీర్ణత సాధిస్తే ఈ సంవత్సరం 95.87 శాతం సాధించాం. విద్యార్థులకు మౌలిక వసతులు కల్పిస్తాం. – పెగడ రాజీవ్, ఇన్చార్జి డీఈఓ -
స్కూల్ కోసం ఇంటిని ఇచ్చిన రిటైర్డ్ ఐఏఎస్ అంబరీశ్
సాక్షి, హైదరాబాద్: రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కె.అంబరీశ్ తన పాత ఇంటిని పాఠశాల కోసం బహుమతిగా ఇచ్చి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండల హసకొత్తూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కోసం తన ఇల్లును (ఇంటి నంబరు 6.3) పాఠశాల కోసం ఇచ్చారు. ఈ మేరకు గురువారం పాఠశాల విద్యా కమిషనర్ విజయ్‌కుమార్‌ను కలసి విషయాన్ని తెలియజేశారు. దానికి సంబంధించిన పత్రాలను అందజేశారు. దీంతో విజయ్‌కుమార్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అంబరీశ్‌కు ధన్యవాదాలు తెలిపారు. అలాగే జిల్లా డీఈవోకు ఆదేశాలు జారీ చేశారు. ఆ ఇంటికి సంబంధించి గిఫ్ట్ రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన ప్రక్రియను చేపట్టాలని ఆదేశించారు. -
స్కూల్ బిల్డింగ్ పైనుంచి విద్యార్ధి ఆత్మహత్య
-
విద్యార్థులకు త్రుటిలో తప్పిన ప్రమాదం
విశాఖపట్నం , నాతవరం(నర్సీపట్నం): మండలంలో సరుగుడు పంచాయతీ శివారు రామన్నపాలెం గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాల భవనం శ్లాబుపెచ్చులూడి పడ్డాయి. అయితే ఈ సంఘటనలో ఎవరూ గాయపడలేదు. వివరాలు ఇలా ఉన్నాయి ఈ పాఠశాల భవనాలు చాలా కాలంగా శిథిలావస్థలో ఉన్నాయి.శిథలమైన భవనంలో తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ ఆశ్రమ పాఠశాలలో 201 మంది విద్యార్థులు చదువుతున్నారు. పెథాయ్ తుపాను కారణంగా రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా మంగళవారం శ్లాబు పెచ్చులూడి కిందపడ్డాయి. తరగతులు నిర్వహిస్తుండగా ఈ సంఘటన జరిగింది. విద్యార్థులకు త్రుటిలో ప్రమాదం తప్పింది. ఎంఈవో తాడి అమృత్‌కుమార్ పాఠశాలను పరిశీలించి, వివరాలు తెలుసుకున్నారు. శిథిలమైన భవనాల్లో తరగతులు నిర్వహించరాదని హెచ్ఎం మణిగోల్డ్‌కు అదేశించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడతూ 1977లో ఈ పాఠశాల భవనాలు నిర్మించారని, అవి పూర్తిగా శిథిలావస్థలో ఉన్నాయని చెప్పారు. కొత్త భవనాల కోసం పాడేరు ఐటీడీఏ పీవో ప్రతిపాదించినట్టు చెప్పారు. -
బళ్లో మందుబాబుల చిందులు
తానూరు(ముథోల్): ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని చెబుతున్న క్షేత్ర స్థాయిలో మాత్రం పరిస్థితి మరోలా ఉంది. ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు ఇక్కట్ల మధ్య చదువును కొనసాగించే పరిస్థితి నెలకొంది. అదనపు తరగతి గదులు, నీటివసతి, ఆటస్థ లాలు, పాఠశాలలకు ప్రహరీలు లేకపోవడంతో సమస్యలతో సతమతమవుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలకు ప్రహరీలు లేకపోవడంతో మూగజీవాలు సంచారం చేస్తున్నాయి. దీంతో పాఠశాల మైదానాలు దుర్గంధమవుతున్నాయి. విద్యార్థులు ఆటలు ఆడుకోలేని పరిస్థితి తలెత్తుతోంది. పాఠశాలల్లో దుర్గంధం వెదజల్లుతుండడంతో వాసన భరించలేకపోతున్నారు. ప్రహరీలు లేకపోవడం తో పాఠశాలలకు రక్షణ కరువైంది. మధ్యాహ్న భోజన సమయాల్లో మూగ జీవాలు విద్యార్థులకు ఇ బ్బందులు గురి చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప ర్యావరణ పరిరక్షణకు ప్రతిష్ఠాత్మ కంగా ప్రా రంభించిన హరితహారంలో భాగంగా నాటిన మొ క్కలు జంతువులు తినేస్తున్నాయి. దీంతో మొ క్కలు నాటిన మూన్నాళ్ల ముచ్చటగా మారుతోంది. సగానికిపైగా .... నిర్మల్ జిల్లాలోని సగానికిపైగా ప్రభుత్వ ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలలకు ప్రహరీలు లేవు. జిల్లాలో మొత్తం 953 పాఠశాలలున్నాయి. ఇందు లో 126 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, 90 ప్రాథమికోన్నత పాఠశాలలు, 737 ప్రాథమిక పాఠశాలాలున్నాయి. ఇందులో 43 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో, 24 ప్రాథమికోన్నత పాఠశాలల్లో, 102 ప్రాథమిక పాఠశాలల్లో మాత్రమే ప్రహారీలు నిర్మించారు. మిగితా పాఠశాలాలకు ప్రహరీలు లేకపోవడంతో ,విద్యార్థులకు ఇబ్బందులు తప్ప డం లేదు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలకు ప్రహరీలు లేకపోవడంతో మూగ జీవా లు స్వేచ్ఛగా సంచరిస్తున్నాయి. ప్రాథమిక పాఠశాలలో చిన్నారులు విద్యను అభ్యసిస్తుండడంతో మూగ జీవాలతో ప్రమాదం పొంచి ఉందని పోష కులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను పటిష్టం చేయడానికి చర్యలు తీసుకుంటున్న క్షేత్ర స్థాయిలో సరైన రీతి లో అమలు కావడం లేదని సర్వత్రా చర్చించుకుంటున్నారు. హరితహారం మొక్కలకు రక్షణ ఏది? రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణకు ప్రతిష్ఠాత్మకంగా అమలు చేసిన హరితహారంలో భా గంగా నాటిన మొక్కలు పెరిగే దశలోనే మూగజీ వాలు తమ ఆహారంగా వినియోగించుకుంటున్నా యి. పచ్చని తెలంగాణ ధ్యేయంగా ప్రభుత్వ పా ఠశాలలు, కార్యాలయాలు, కళాశాలల్లో మొక్కల ను నాటే కార్యక్రమాన్ని నిర్వహించి పాఠశాలలో సిబ్బంది, విద్యార్థులు సైతం మొక్కల రక్షణకు తమవంతుగా కృషి చేస్తున్నారు. పాఠశాలలకు ప్రహారీ లేకపోవడంతో హరితహారం మొక్కలకు జంతువులు నష్టం కలిగిస్తున్నాయి. రూ.లక్షల్లో ఖర్చు పెట్టి నాటిన మొక్కలకు రక్షణ కరువైందని పేర్కొంటున్నారు. వ్యయ ప్రయాసలకు గురై నాటిన మొక్కలు తమ కళ్ల ఎదుట జంతువులకు ఆహారంగా మారడంతో విద్యార్థులు, ఉపాధ్యా యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రహరీలు నిర్మించాలని కోరుతున్నారు. మందుబాబులకు అడ్డాగా .. బెల్తరోడ పాఠశాలలో మందు సీసాలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పాఠశాలలకు ప్రహరీలు లేకపోవడంతో రాత్రి వేళలో మందుబాబులకు అడ్డాగా మారుతున్నాయి. రాత్రి వేళలో పాఠశాల ఆవరణలో కూర్చుని మందు తాగి బాటిళ్లను అక్కడే పారేస్తున్నారు. దీంతో పాఠశాల మైదానం మందు బాబులకు స్థావరంగా మారింది.రాత్రి వేళల్లో పేకాటరాయుళ్లకు ఆవరణ అనుకూలంగా మారింది. ప్రతి రోజు పాఠశాల ఆవరణలో మందు సీసాలు, సారా ప్యాకెట్లు ,గూట్కా ప్యాకెట్ల ఉంటున్నాయి. దీంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. సంబంధిత శాఖాధికారులు స్పందించి పాఠశాలలకు ప్రహరీని నిర్మించి విద్యార్థుల సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
భార్యకు రిటైర్డ్ ఐఏఎఫ్ అధికారి వినూత్న నివాళి..
సాక్షి, న్యూఢిల్లీ : మరణించిన భార్యకు నిజమైన నివాళిగా ఓ మాజీ ఐఏఎఫ్ అధికారి ఆమె 21 ఏళ్ల పాటు పాఠాలు చెప్పిన స్కూల్‌కు రూ 17 లక్షల విరాళం ఇచ్చి తన ఔదార్యం చాటుకున్నారు. ఐఏఎఫ్ సీనియర్ అధికారి, రిటైర్డ్ వింగ్ కమాండర్ జేపీ బదౌని భార్య దివంగత విధు బదౌని ఎయిర్‌ఫోర్స్ గోల్డెన్ జూబ్లీ ఇనిస్టిట్యూట్‌లో 1986 నుంచి 21 సంవత్సరాల పాటు టీచర్‌గా సేవలు అందించారు. విధు బదౌని ఈ ఏడాది ఫిబ్రవరి 6న గుండెపోటుతో మరణించారు. ఆమె జ్ఞాపకార్ధం స్కూల్‌కు బదౌని రూ 17 లక్షలు విరాళం అందించారు. విరాళంలో పది లక్షల రూపాయలను ప్రతి ఏటా ఆరు నుంచి పదకొండో తరగతి వరకూ అత్యధిక మార్కులు సాధించిన విద్యార్ధులకు స్కాలర్షిప్లు, బహుమతులు అందించేందుకు వెచ్చిస్తామని, మిగిలిన మొత్తాన్ని ప్రాథమిక పాఠశాలలో మౌలిక వసతులు అభివృద్ధి చేసేందుకు వెచ్చిస్తామని ప్రిన్సిపల్ పూనం ఎస్ రాంపాల్ చెప్పారు. తన భార్య జ్ఞాపకార్ధంగా ఆమె ఎంతో ఇష్టపడే పాఠశాలకు విరాళంగా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నానని బదౌనీ చెప్పారు. స్కూల్లో టీచర్‌గా పనిచేసినప్పటి నుంచి తన భార్య అందుకున్న జీతంలో ఆమె చేసిన పొదుపు సొమ్ముతోనే ఈ విరాళం అందిస్తున్నానని ఆయన చెప్పుకొచ్చారు. -
బిక్కు..బిక్కు
వైరా ఖమ్మంజిల్లా : బాగా చదువుకోవాలనే ఉద్దేశంతో..వైరాలోని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయం ( పాఠశాల, కళాశాల)లో చేరిన విద్యార్థులు సరైన సౌకర్యాలు లేక, భవనం కూలుతుందేమోనని జంకుతూ, కరెంట్ షాక్ కొడుతున్న గోడలతో బిక్కుబిక్కుమంటున్నారు. ఎప్పుడేం జరుగుతుందోనని భయపడుతున్నారు. ఇక్కడి పాఠశాల భవనం నిర్మించి 35 ఏళ్లు గడుస్తోంది. ప్రస్తుతం డార్మెటరీ బిల్డింగ్ కూలేందుకు సిద్ధంగా ఉంది. ఇటీవల కురుస్తున్న వర్షాలకు భవనం పెచ్చులు ఊడిపోయి కురుస్తోంది. మొత్తం 10 గదులున్నాయి. సమావేశ మందిరం, కారిడార్ అంతా కూడా పగుళ్లు వచ్చి ప్రమాదకరంగా మారింది. రాత్రివేళల్లో చాలా భయపడుతున్నారు. ఇక్కడి పాఠశాలలో 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు 630 మంది విద్యార్థినులు తరగతులకు హాజరవుతున్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నిరుపేద పిల్లలు నానా అవస్థలు పడుతున్నారు. ఇటీవల కాలంలో డార్మెటరీ భవనం పెచ్చులు ఊడిపోయి విద్యార్థినుల మీద పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. కురుస్తున్న వర్షాలకు భవనం నాని..అంతా నీటి చెమ్మగా మారింది. షాక్‌తో సెలవులు.. డార్మెటరీ భవనం వర్షాలకు నాని కురుస్తుండటంతో ఇటీవల ఓ విద్యార్థిని ఫ్యాన్ స్వీచ్ వేయగా ఒక్కసారిగా షాట్ సర్క్యూట్ కావడంతో..అప్రమత్తమైన సిబ్బంది జిల్లా అధికారులకు తెలియజేసి ఈ నెల21నుంచి 27వరకు 5వ తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థినులకు సెలవులిచ్చి ఇళ్లకు పంపారు. ఇంకా..ఈ సమస్యను పరిష్కరించలేదు. ఇక్కడి విద్యార్థినులు తరగతి గదుల్లోనే ఉంటున్నారు. రాత్రిళ్లు కూడా ఇక్కడే నిద్రిస్తున్నారు. సైన్స్ల్యాబులో కింద కూర్చొని, ఇరుకుగా ఉంటూ ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం..రూ.3 కోట్ల నిధులతో చేపట్టిన జీప్లస్ వన్ భవన నిర్మాణం ప్రారంభమై ఎనిమిది నెలలు గడుస్తున్నా..అధికారులు, కాంట్రాక్టర్లల నిర్లక్ష్యం వల్ల ఇంకా..పునాదుల దశనే దాటలేదు. స్లాబ్ కూలుద్దేమో.. డార్మెంటరీ భవనం స్లాబ్ ఎప్పుడు కూలుతుంతోనని భయమేస్తోంది. ప్రమాదకరంగా ఉన్నప్పటీకీ ప్రతిరోజూ అక్కడే నిద్రిస్తున్నాం. రాత్రివేళల్లో కరెంట్ పోతే ఇబ్బందిగా ఉంది. మాకు చాలా భయమేస్తోంది. – టి.ప్రణవి, 8వ తరగతి ఎర్త్ కొడుతోంది.. డార్మెటరీ భవనం కురుస్తోంది. భవనం మొత్తం ఎర్త్కూడా వస్తోంది. అక్కడే నిద్రించాలంటే భయమేస్తోంది. కోతుల బెడద విపరీతంగా ఉంది. మా సమస్య ఎవరికి చెప్పుకోవాలో తెలియట్లేదు. – జి.ధృవిత, 8వ తరగతి ఇబ్బందికరంగా ఉంది.. పాఠశాలలో స్లాబ్ కురుస్తోంది. ఎప్పుడు కూలుతుందోనని ఇబ్బంది పడుతున్నాం. పాఠశాల ప్రిన్సిపాల్ సమస్యను అధికారులకు తెలియజేశా రు. ఇంకా పరిష్కారం కాలేదు. – ఐ.శిరీష, కేర్‌టేకర్, వైరా సెక్రటరీకి తెలియజేశాం.. పాఠశాలలో డార్మెటరీ భవనం సమస్యగానే ఉంది. రెండునెలల క్రితమే రాష్ట్ర సెక్రటరీకి విన్నవించాం. విద్యార్థినులకు ఇబ్బంది లేకుండా అవసరమైన ఏర్పాట్లు చేస్తూనే ఉన్నాం. కొత్త భవన నిర్మాణం త్వరగా పూర్తయితే ఇబ్బంది ఉండదు. – వి.మేరీ ఏసుపాదం, ప్రిన్సిపాల్, వైరా గురుకుల పాఠశాల -
స్కూల్ 3వ అంతస్తు నుంచి దూకిన విద్యార్థిని
తూర్పుగోదావరి ,కాకినాడ రూరల్: ఇంద్రపాలెంలోని లిటిల్‌బడ్స్ పాఠశాలలో ఓ పదోతరగతి విద్యార్థిని పాఠశాల భవనం మూడో అంతస్తు నుంచి దూకింది. ఎడమ చెయ్యి విరిగిపోయిన ఆమె ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె ఆత్మహత్యకు యత్నించిందన్న అభిప్రాయం వ్యక్తమవుతుండగా..ఆమె మాత్రం అందుకు భిన్నంగా పొంతన లేకుండా మాట్లాడుతోంది. దీనిపై జిల్లా ఉప విద్యాశాఖాధికారిణి దాట్ల సుభద్ర విచారణ చేపట్టారు. వివరాలు ఇలా ఉన్నాయి. లిటిల్‌బడ్స్‌లో పదోతరగతి చదువుతున్న కోలా రమ్యశ్రీ రోజూ మాదిరిగా బుధవారం ఉదయం 8 గంటలకే ఆటోలో పాఠశాలకు వచ్చింది. అనంతరం మిగతా విద్యార్థులతో కలిసి, అసెంబ్లీకి వెళ్లకుండా మేడపై భాగానికి వెళ్లి అక్కడ నుంచి దూకేసిందని, దీంతో ఎడమ చెయ్యి విరగ్గా ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని పాఠశాల యాజమాన్యం చెపుతోంది. ఆమె అలా ఎందుకు చేసిందో తమకు తెలియదని ప్రిన్సిపాల్ ఎస్కే ఆలీ డీవైఈవోకు చెప్పారు. చికిత్స పొందుతున్న రమ్యశ్రీని అడిగితే భవనం పైభాగానికి వెళ్లానని, అక్కడ కళ్లు తిరగడంతో కిందకి పడిపోయానని ఒకసారి, మేడపై నుంచి కిందికి ఎవరో తోసేశారని ఇంకోసారి చెప్పింది. పాఠశాల ఆవరణలో సీసీ కెమెరా ఫుటేజ్‌లను డీవైఈఓ పరిశీలించారు. అయితే రమ్యశ్రీ మేడపై నుంచి దూకిన దృశ్యం రికార్డు కాలేదు. కలెక్టర్‌కు నివేదిక ఇస్తా: డీవైఈఓ పాఠశాల డైరెక్టర్ పీఎస్ఎన్ మూర్తిని, ప్రిన్సిపాల్ ఆలీని డీవైఈఓ ప్రశ్నించారు. పాఠశాల జిల్లా విద్యాశాఖ కామన్‌బోర్డు నిబంధనల ప్రకారం పనిచేయడంలేదని, వారికి ఇష్టం వచ్చిన సమయంలో పాఠశాల అసెంబ్లీ నిర్వహిస్తున్నారని, ఉదయం 8 గంటలకే పాఠశాల ప్రారంభిస్తున్నారని డీవైఈఓ సుభద్ర విలేకరులకు వివరించారు. ఈ పాఠశాలపై గతంలో కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయని, ప్రస్తుత సంఘటన నేపథ్యంలో విచారణ జరిపి పూర్తి నివేదికను జిల్లా విద్యాశాఖాధికారి ద్వారా కలెక్టర్‌కు ఇస్తానని చెప్పారు. కాగా ఈ ఘటనపై ఇంద్రపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. కడుపునొప్పి రావడంతో భవనంపైకి వెళ్లి, కళ్లు తిరగడంతో అక్కడి నుంచి పడిపోయానని రమ్యశ్రీ చెప్పిందని, దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై డి.రామారావు తెలిపారు. -
తప్పిన ముప్పు
కొడంగల్ ( వికారాబాద్) : పట్టణంలో గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కురిసిన వర్షానికి స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల భవనం కూలిపోయింది. 150 మంది విద్యార్థులు చదువుతున్న ఈ పాఠశాలలో గదుల కొరత ఉంది. భవనం కూలిపోయిన సమయంలో విద్యార్థులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. -
సర్కారు బడుల్లో సౌకర్యాలు కరువు!
విజయనగరం మున్సిపాలిటీ/రూరల్ : నియోజక వర్గంలోని 127 పాఠశాలల్లో అధికారిక లెక్కల ప్రకారం 35 పాఠశాలలకు తాగునీటి సదుపా యం లేదు. మరుగుదొడ్లుకు నీటి సదుపాయం లేని పాఠశాలలు 49 ఉండగా అవి నిరుపయోగంగా మారాయి. 50 పాఠశాలలకు ఆటస్థలం లేక విద్యార్థులు ఆటలకు దూరమవుతున్నారు. విద్యాభివద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు పాలకులు గొప్పలు చెబుతున్నా ఆచరణలో కానరావడంలేదు. ప్రధానంగా తాగు నీరు, మరుగుదొడ్లు పూర్తిస్థాయిలో లేవు. కొన్ని పాఠశాలలకు ప్రహరీలు లేవు. మంగళవారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది కూడా తమకు ఇబ్బందులు తప్పవని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపాలిటీ పరిధిలో మూడు ఉన్నత పాఠశాలలు ఉండగా కస్పా ఉన్నత పాఠశాలలో తెలుగు, ఇంగ్లిష్ మీడియం కలపి 1300 మంది విద్యార్థులున్నారు. రెండు గదులు పాడయ్యాయి. వంటగది లేదు. 400 మంది విద్యార్థులున్న కంటోన్మెంట్ ఉన్నత పాఠశాలలో మరుగు సౌకర్యం లేదు. మూడు తరగతి గదులు నిర్మించాల్సి ఉంది. 568 మంది విద్యార్థులు గల బీపీఎం స్కూల్లో 12 గదులు పూర్తిగా పాడయ్యాయి. వంటగది లేదు. అధ్వానంగా ప్రాథమిక పాఠశాలలు గంజిపేట పాఠశాలలో చికెన్షెడ్, వాటర్, ప్రహరీ లేవు. బీసీ కాలనీ మున్సిపల్ ప్రాథమిక పాఠశాలకు ప్రహరీ లేదు. వీటీ అగ్రహారంలో చికె న్ షెడ్ లేదు. బొండాడ వీధి, ఎస్బీటీ మార్కెట్ పాఠశాలల్లో మరుగుదొడ్లు పాడయ్యాయి. çకుప్పిలివీధి పాఠశాలలో రెండు గదులు, పుత్సల వీధిలో మూడు తరగతి గదులు పాడయ్యాయి. కొత్తగ్రహారంలో మరుగుదొడ్లు, నీటి సదుపాయం, ప్రహరీ లేవు. కాళ్ల నాయకుడు మందిరం వద్ద పాఠశాలలో ఐదు గదులు పావడగా, టాయిలెట్స్ లేవు. అయ్యకోనేరకు గట్టుపై గల పాఠశాలకు కిచెన్‌షెడ్ లేదు. సిటీ బస్టాండ్ వద్ద పాఠశాలలో రెండు తరగతి గదులు పాడయ్యాయి. ఐదు టాయిలెట్స్ పని చే యడంలేదు. బుంగవీధిలో రెండు తరగతి గదులు పాడయ్యాయి. ప్రహరీ, మరుగుదొడ్లు లేవు.వన్‌ప్లస్ వన్ కాలనీ పాఠశాలకు ప్రహరీ, మరుగుదొడ్లు లేవు. ఆబాద్‌వీధి పాఠశాలలో మరుగుదొడ్లు లేవు. నాలుగు తరగతి గదులు పాడయ్యాయి. ఉర్ధూపాఠశాలలో పురాతన గదులు శిథిలావస్థకు చేరాయి. ప్రహరీ కూలిపోయింది. కస్పా ప్రాథమిక పాఠశాలలో మూడు తరగతి గదులు పాడయ్యాయి. కిచెన్‌షెడ్ లేదు. కొత్తపేట గొల్లవీధిలోని రెండు పాఠశాలల్లో నీటి సౌకర్యం, మరుగుదొడ్లు లేవు. సాకేటి వీధి పాఠశాలలో మరుగుదొడ్లు లేవు. చిక్కాలవీది పాఠశాలలో కిచెన్‌షెడ్, బాత్రూంలు, తరగతి గదులు శిథిలమయ్యాయి. కుమ్మరవీధి పాఠశాలలో రెండు మరుగుదొడ్లు నిరుపయోగంగా ఉన్నాయి. రెండు తరగతి గదులు పాడయ్యాయి. నీటి సౌకర్యం లేదు. లంకాపట్నం పాఠశాలలో ఐదు మరుగుదొడ్లు మూలకు చేరాయి. తాగు నీటి సౌకర్యం లేదు. పూల్‌బాగ్ కాలనీ రెండు తరగతి గదులు పాడయ్యాయి. నందిగుడ్డి పాఠశాలలో వంటగది, మరుగుదొడ్లు లేవు. వైఎస్సార్‌నగర్ పాఠశాలలో తాగు నీరు, వంటగది, ప్రహరీ లేవు. నందివీది పాఠశాలలో వంటగది లేదు. రెండు తరగతి గదులు పాడయ్యాయి. ఎస్సీ కాలనీ పాఠశాలకు ప్రహరీ లేదు. జొన్నగుడ్డి పాఠశాలలో నాలుగు తరగతి గదులు పాడయ్యాయి. ప్రహరీ లేదు. గాడిఖానా ము న్సిపల్ పాఠశాలకు భవనం, వంట గది లేదు. రా జీవ్నగర్ కాలనీ పాఠశాలకు వంటగది, ప్రహరీ లేవు. లంకవీధి పాఠశాలకు వంటగది లేదు. మఠం వీధి పాఠశాలలో వంటగది, ప్రహరీ లేవు. -
భయ‘బడి’ !
రామన్నపేట(నకిరేకల్) : ప్రమాదం పొంచి ఉం దని చెవిలో జోరిగలాగా పదేపదే అధికారులకు విన్నవించినా పట్టించుకున్న పాపానా పోలేదు. విద్యార్థుల ప్రాణం మీదికి వస్తుందని తెలిసినా అధికారులు పట్టీపట్టనట్లుగా వ్యవహరించారు. బుధవారం రాత్రి కురిసిన వర్షానికి రామన్నపేట మండలం సిరిపురం ఉన్నత పాఠశాలలోని తరగతిగది పైకప్పు కూలింది. రాత్రి సమయం కావడంతో విద్యార్థులకు ప్రాణా పాయం తప్పింది. అదే పగలు అయితే పరిస్థితి ఘోరంగా ఉండేది. రామన్నపేట మండలంలోని సిరిపురం ఉన్నత పాఠశాల భవనాన్ని 1970లో నిర్మించారు. అప్పట్టో ఇటుక గోడలపై కొయ్యదూలాలపైన సున్నం రాయితో కప్పువేశారు. భవన నిర్మాణం జరిగి 50 ఏళ్లు కావొస్తుండడంతో తరగతి గదులు శిథిలావస్థకు చేరాయి. పాత భవనాల్లోనే ఆఫీస్, స్టాఫ్ రూం, ల్యాబ్, ఒక తరగతిని నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం పాఠశాలలో 150మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వర్షాకాలం వచ్చిందంటే విద్యార్దులు ఉపాధ్యాయులు భయంభయంగా గడుపుతుంటారు. పాఠశాలను సందర్శించిన డీఈఓ సిరిపురం ఉన్నత పాఠశాలను జిల్లా విద్యాశాఖాధికారి రోహిణి గురువారం సందర్శించారు. స్థానిక ఎంఈఓ సల్వాది దుర్గయ్యతో కలిసి కూలిపోయిన తరగతి గదితోపాటు శిథిలావస్థకు చేరిన ఇతర గదులను పరిశీలించారు. ప్రమాదకరంగా ఉన్నటు వంటి గదులలో తరగతులను నిర్వహించరాదని ఆదేశించారు. అదనపు తరగతి గదుల నిర్మాణం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నట్లు తెలిపారు. కొత్తగదులు కట్టించాలి పాఠశాలలోని మూడు గదులు మినహా మిగిలిన తరగతి గదులన్నీ శిథిలావస్థకు చేరుకున్నాయి. గదులు సరిపడా లేక శిథిలావస్థకు చేరిన గదుల్లోనే ఆఫీస్, ల్యాబ్‌లు నిర్వహిస్తున్నారు. పాత భవన సముదాయాన్ని పూర్తిగా కూల్చివేసి కొత్త గదులు నిర్మించాలి. – పరశురాం, 7వ తరగతి విద్యార్థి -
ఫిట్‘లెస్’ బస్సులతో ప్రమాదం
తూప్రాన్ మెదక్ : జిల్లాలో రోజురోజుకు పుట్టగొడుగుల్లా పుట్టుకోస్తున్న ప్రైవేట్ పాఠశాలలు ప్రభుత్వ ఆదాయానికి గండికోడుతూ ధనర్జానే ధ్యేయంగా పనిచేస్తూ, చిన్నారుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. విద్యార్థులను, తల్లిదండ్రులను ఆకర్షించే విధంగా తమ వద్ద అన్ని రకాల వసతులు కల్పిస్తున్నామని గొప్పలు చేబుతూ పాఠశాలలు నిర్వహిస్తున్నారు. స్కూల్ బస్సులకు ఫిట్ నేస్ పరీక్షలు నిర్వహించడంలో రవాణా శాఖ నిర్లక్ష్యం చేస్తోంది. ప్రైవేటు విద్యా సంస్థలు కాలం చెల్లిన బస్సులు నడుపుతున్నా , రవాణాశాఖాధికారులు వాటిని చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు మెదక్ జిల్లా మాసాయిపేట రైల్వే ప్రమాద ఘటనే ఉదహరణ. జిల్లాలో 343 బస్సుల్లో కేవలం 109 బస్సులకు మాత్రమే ఫీట్నెస్ పరీక్షలు నిర్వహించినట్లు ఆర్టీఏ అధికారులు పేర్కొంటున్నారు. ఆదేశాలు బేఖాతరు.. పాఠశాలలకు వేసవి సేలవులు ప్రకటించిన తర్వాత ఏప్రిల్ చివరి వారం నుంచి మే నెల 15 వరకు పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా, ఇంతవరకూ వాటి ఊసుమరిచారు. 15 ఏళ్లు నిండిన విద్యా సంస్థల బస్సులను సీజ్ చేయాలని రాష్ట్ర రవాణా శాఖ ఉన్నతాధికారులు ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. కానీ జిల్లాలో మాత్రం ఒక్క బస్సును కూడా ఇప్పటి వరకు సీజ్ చేయకపోవడం గమనార్హం. అధికారుల ఉదాసీనత.. గతేడాది జిల్లాలో విద్యాసంస్థల బస్సులు ప్రమాదానికి గురైన సంఘటనలు ఉన్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని అధికారులు కాలం చెల్లిన బస్సులపై కొరడా ఝుళిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి జిల్లాకు చెందిన కొన్ని విద్యాసంస్థల యాజమాన్యాలు కొనుగోలు చేసి, ప్రస్తుతం వాటికి మరమ్మతులు చేయిస్తున్నారు. ఈ వాహనాల్లో కొన్ని కాలం చెల్లినవి ఉన్నాయని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అయితే ప్రైవేట్ వ్యక్తులు ప్రభుత్వానికి చెల్లించాల్సిన టాక్స్‌ను చెల్లించకుండా స్కూల్ బస్సులను స్కూల్ పేరుమీదనే రవాణా శాఖకు పన్నులు కడుతున్నారు. బస్సు ఫిట్నెస్ పరీక్షలకు ఆన్లైన్లో వాహన యాజమాని పేరు, విద్యార్థుల సంఖ్య, రక్తనమూనా, డ్రైవర్ వివరాలు నమోదు చేయాలి. అలా నమోదు చేసి రవాణాశాఖ నుంచి ఫిట్నెస్ పత్రాలు తీసుకోవాల్సిన ఉంటుంది. కాని ఎవరు నిబంధనలు పాటించడంలేదన్న విషయం తెలిసింది.కొత్తగా జారీ అయిన మార్గదర్శకాలు..విద్యాసంస్థల వాహనాలపై తగు జాగ్రత్తలు తీసుకునే విధంగా రవాణా శాఖ మోటారు వాహన చట్టం 1989 ప్రకారం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ నిబంధనలను ప్రతి విద్యాసంస్థ తప్పకుండా పాటించాల్సి ఉన్నప్పటికీ కాని ఏ సంస్థ పాటించడం లేదాని తేలుస్తోంది. నూతన నిబంధనలు æ విద్యాసంస్థకు చెందిన బస్సుపై పాఠశాల పేరు, టెలిఫోన్ నంబర్, సెల్ నెంబరుతో సహా పూర్తి చిరునామాను బస్సుకు ఎడమవైపున ముందు భాగంలో స్పష్టంగా రాయాలి. æ బస్సును ప్రిన్సిపాల్, విద్యార్థుల కమిటీ నెలకొకసారి పరీక్షలు చేయాలి. వాహనం కండీషన్, పనితీరు గురించి తెలుసుకోవాలి. æ ఏ విద్యాసంస్థ బస్సు కూడా పరిమితి సీట్ల కన్నా ఎక్కువ మందిని తీసుకెళ్లరాదు. æ ప్రతి బస్సులో అటేండర్( సహయకుడు) తప్పనిసరిగా ఉంచాలి æ విద్యా సంస్థల బస్సులకు నియామకమయ్యే డ్రైవర్‌కు 60 ఏళ్లు నిండి ఉండరాదు. ప్రతి డ్రైవర్ ఆరోగ్య పట్టికను బస్సులో పెట్టాలి. అతనికి ప్రతి మూడు నెలలకు ఒకసారి బీపీ, షుగర్, కంటిచూపు వంటి ప్రాథమిక పరీక్షలను యాజమాన్యం నిర్వహించాలి. æ డ్రైవింగ్ లైసెన్సు ఉన్న వ్యక్తినే బస్సు డ్రైవర్‌గా నియమించాలి. అతనికి అయిదేళ్ల బస్సు నడిపిన అనుభవం ఉండాలి. చర్యలు తీసుకుంటున్నాం జిల్లా వ్యాప్తంగా 343 ప్రైవేట్ స్కూల్స్ బస్సులు ఉన్నాయి. ఇందులో 109 బస్సులకు ఫీట్నెస్ పరీక్షలు నిర్వహించడం జరిగింది. మరో 234 బస్సులకు ఫీట్నెస్ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. నేటి(శుక్రవారం) నుంచి పాఠశాలలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా తనిఖీలు ముమ్మరం చేశాం. అనుమతులు లేని బస్సులపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. –గణేష్, జిల్లా ఆర్టీఏ అధికారి -
జక్కన్న చెక్కిన చదువుల గుడి
కశింకోట(అనకాపల్లి): కశింకోటలోని డీపీఎన్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వసతి సమస్య పరిష్కారానికి ప్రముఖ సినీ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి బృందం చేయూతనిచ్చింది. ఆ బృందం సుమారు రూ.40 లక్షల సమకూర్చగా నాలుగు తరగతి గదులతో నిర్మించిన భవనం పూర్తై ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. ఈ భవనానికి రాజమౌళి తన తల్లి రాజనందిని పేరుతో ‘జనని రాజనందిని’గా నామకరణం చేశారు. స్వాతంత్య్రం కోసం మొదటిసారి సిపాయిల తిరుగుబాటు జరిగిన 1857వ సంవత్సరంలోనే ఇక్కడి పాఠశాల ప్రారంభమైంది. హుద్‌హుద్ తుపానుకు ముందుగానే భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. వసతి సమస్య కారణంగా వేరే పాఠశాలలో తరగతులు నిర్వహించవలసి వస్తోంది. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో హుద్‌హుద్ తుపాను అనంతరం పాఠశాలల్లో భవనాలు నిర్మించాలని సంకల్పించిన సినీ దర్శకుడు రాజమౌళి... కలెక్టర్ సూచనల మేరకు ఇక్కడి పాఠశాలలో భవన నిర్మాణానికి ముందుకు వచ్చి నిధులు సమకూర్చారు. ఈ భవనంలోనే వర్చువల్ తరగతులు నిర్వహించడానికి ప్రభుత్వం తాజాగా నిధులను సమకూర్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి పాఠాలను ఈ తరగతుల ద్వారా విద్యార్థులు వినడానికి, అక్కడ ఉండే ఉపాధ్యాయులతో సందేహాలు నివృత్తి చేసుకోవడానికి అవకాశం కలగనుంది. అందుకు ఎసీ సౌకర్యం కల్పించడానికి అవసరమైన సీలింగ్ పనులు నిర్వహిస్తున్నారు. -
22 పాఠశాలలకు ఒకరే హెచ్ఎం
బెజ్జూర్ (సిర్పూర్): ఒకటి కాదు..రెండు కాదు ఏకంగా 22 పాఠశాలలకు ఒక్కరే ఇన్చార్జి ప్రధానోపాధ్యాయుడిగా ఉన్నారు. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. కుమురం భీం జిల్లా బెజ్జూర్ మండలంలో మొత్తం 79 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, 22 పాఠశాలలకు ప్రధానోపాధ్యాయులు లేరు. అలాగే రెగ్యులర్ ఉపాధ్యాయులు లేకపోవడంతో విద్యావలంటీర్లతో పాఠశాలలను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో సల్గుపల్లి జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గంధం తిరుపతికి 22 పాఠశాలల ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. దీంతో ఆయన అన్ని పాఠశాలలను సరిగా పర్యవేక్షించలేకపోవడంతో విద్యార్థులు నష్టపోతున్నారు. పాఠశాలల నిధులు పక్కదారి మరో పక్క బెజ్జూర్ మండలంలోని పాఠశాలల అభివృద్ధి కోసం ప్రభుత్వం విడుదల చేసిన పాఠశాల గ్రాంటు నిధులు పక్కదారి పట్టినట్లు తెలుస్తోంది. 2017–18 విద్యాసంవత్సరానికిగాను ప్రతీ పాఠశాలకు రూ.పది వేల చొప్పున ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. వీటితో పాఠశాలలకు అవసరమయ్యే బీరువాలు, కుర్చీలు తదితర సామగ్రిని కొనుగోలు చేయాల్సి ఉంది. కాని ఇప్పటివరకు ఈ పాఠశాలల్లో ఎలాంటి సామగ్రి కొనుగోలు చేయకుండానే బిల్లులు డ్రా చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయుడు, పాఠశాల యాజమాన్య కమిటీ ఆమోదం మేరకు సామగ్రిని కొనుగోలు చేసి బిల్లులు పొందుపర్చి నిధులను డ్రా చేయాల్సి ఉంటుంది. అయితే మండలంలో ఏ పాఠశాలలో కూడా సామగ్రి కొనుగోలు చేసిన దాఖలాలు కనిపించడంలేదు. ఎంఈవో, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు కలసి ఈ నిధులు స్వాహా చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఎంఈవోకు కొందరు రాజకీయ నాయకుల మద్దతు ఉండటంతోనే ఆయన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినవస్తున్నాయి. ఈ నిధులు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, పాఠశాల కమిటీ బ్యాంకు ఖాతాలో ఉండాల్సి ఉండగా, ఎంఈవో తన సొంత ఖాతాలోకి మార్చుకోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, ఈ విషయమై విచారణ జరిపించాలని స్థానికులు కోరుతున్నారు. జూన్‌లో కొనుగోలు చేస్తాం ఈ విషయమై ఎంఈవో రమేశ్ బాబును వివరణ కోరగా నిధులు తన వద్దనే ఉన్నాయని, జూన్‌లో పాఠశాలలకు అవసరమయ్యే సామగ్రిని కొనుగోలు చేస్తామని చెప్పారు. ఇన్చార్జి హెచ్ఎం గంధం తిరుపతినివివరణ కోరగా 22 పాఠశాలలకు సంబంధించిన చెక్కులను ఎంఈవోకు ఇచ్చానని తెలిపారు. -
విద్యార్థులపైకి దూసుకొచ్చిన బొలెరో : 9 మంది మృతి
-
స్కూలులోకి దూసుకెళ్లిన వాహనం: 9 మంది మృతి
పాట్నా : బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన ఓ వాహనం అదుపుతప్పి స్కూలు బిల్డింగ్‌లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది విద్యార్థులు అక్కడికక్కడే మృతిచెందగా మరో 24 మందికి తీవ్ర గాయాలపాలయ్యాయి. సంఘటనా స్థలికి పోలీసులు చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దీనిపై స్పందించి చనిపోయిన వారి కుటుంబాలకు రూ. 4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. -
ఏళ్లతరబడి
ములకలపల్లి : మండలకేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠ«శాలలో అదనపు తరగతి గదుల నిర్మాణం ఏళ్లతరబడి కొనసాగు...తూనే ఉంది. దీంతో సరిపడా గదులులేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత్యంతరంలేని పరిస్థితుల్లో పలుతరగతులను వరండాల్లో, చెట్ల కిందనే నిర్వహిస్తున్నారు. ఆరు నుంచి పదో తరగతి వరకూ గల ‘సక్సెస్ స్కూల్’లో సుమారు 400 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ప్రతీ తరగతిలో తెలుగు మీడియంలో రెండు సెక్షన్లు, ఇంగ్లిష్ మీడియంలో ఒక సెక్షన్ మొత్తం 15 సెక్షన్లు ఉన్నాయి. తరగతి గదులతోపాటు ల్యాబరేటరీ, లైబ్రరీ, స్టాఫ్‌రూంలకు కలసి మొత్తం 18 గదులు కావాల్సిఉంది. కానీ ప్రస్తుతం పది గదులు మాత్రమే ఉండడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మూడేళ్లుగా..: కాగా ఈ పాఠశాలలో అదనపు తరగతి గదుల భవన సముదాయ నిర్మాణానికి ఆర్‌ఎంఎస్‌ఏ ఫేజ్–3లో రూ.36.48 లక్షల నిధులు మంజూరయ్యాయి. దీంతో 2014 సెప్టెంబర్‌లో దీని నిర్మాణం ప్రారంభించారు. మూడేళ్లు గడిచినా నేటికీ అసంపూర్తిగానే ఉంది. ఎట్టకేలకు చివరి దశకు వచ్చినా, ఇంకా కిటీకీలు, తలుపులతోపాటు ఫినిషింగ్ పనులతోపాటు, రంగులు కూడా వేయాల్సివుంది. దీంతో ప్రస్తుతం ఈ భవనం నిరుపయోగంగా మారింది. ఈ భవన నిర్మాణం పూర్తయితే తమ సమస్యలు తీరుతాయని భావించిన విద్యార్థులు ఆశలు అడియాసలుగానే మిగిలిపోయాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు. -
జీవ వైవిధ్య పరిరక్షించుకుందాం
– జిల్లా పరిషత్ చైర్మన్ మల్లెల రాజశేఖర్ కర్నూలు (అర్బన్): జీవ వైవిధ్యాన్ని పరిరక్షించుకుందామని, ఇందుకు గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్, నగర పాలక, పురపాలక సంస్థల్లో యాజమాన్య కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని జిల్లా పరిషత్ చైర్మన్ మల్లెల రాజశేఖర్ అన్నారు. మంగళవారం ఉదయం నగరంలోని ఓ హోటల్లో జీవవైవిధ్య మండలి ఆధ్వర్యంలో ‘‘జీవ వైవిధ్య భావనలు, జీవ వైవిధ్య చట్టం, జీవవనరుల వినియోగం ద్వారా వచ్చే లాభాలు’’ అనే అంశంపై జిల్లా స్థాయి సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ఏపీఎస్‌బీడీబీ (ఆంధ్రప్రదేశ్ స్టేట్ బయోడైవర్సిటీ బోర్డు) చైర్మన్ ఎస్.బి.ఎల్.మిశ్రా, మెంబర్ సెక్రటరీ రమేష్ కుమార్ సుమన్, డీపీఓ బి.పార్వతి, వ్యవసాయ శాఖ జేడీ ఉమామహేశ్వరమ్మ, కర్నూలు, నంద్యాల డీఎఫ్ఓలు డి.చంద్రశేఖర్, శివ ప్రసాద్, జడ్పీ డిప్యూటీ సీఈఓ డి.ప్రతాపరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ మాట్లాడుతూ ప్రస్తుతం శబ్ద, వాతావరణ కాలుష్యం అధికమవ్వడంతో జీవరాశులు కనుమరుగు అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీఎస్‌బీడీబీ చైర్మన్ ఎస్.డి.ఎల్.మిశ్రా మాట్లాడుతూ బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ కమిటీలు పీపుల్స్ బయో డై వర్సిటీ రిజిష్టర్ల తయారీకి ఉపయోగపడతాయన్నారు. ఈ రిజిష్టర్లు స్థానిక జీవసంబంధ వనరుల లభ్యత, జ్ఞానం, ఔషధ ఇతర ఉపయోగాలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని కలిగి ఉంటాయన్నారు. మెంబర్ సెక్రటరీ రమేష్ కుమార్ సుమన్ మాట్లాడుతూ మానవ సంఘాలు, సంస్కృతుల మనుగడ, జీవ వైవిధ్యం మీద ఆధారపడి ఉంటుందన్నారు. సదస్సుకు రీజనల్ కోఆర్డినేటర్ డాక్టర్ ఎల్.వరలక్ష్మి, వివిధ విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్లు డాక్టర్ బి.రవిప్రసాదరావు, డాక్టర్ టి.రవిశంకర్, డాక్టర్ ఎం.సుబ్బారావు, శ్రీశైలం ఫీల్డ్ డైరెక్టర్ ఎస్.శరవనన్, జిల్లా కోఆర్డినేటర్ జి.రాముడుతో పాటు ఈఓఆర్డీ, ఎంపీడీఓ, అటవీ శాఖకు చెందిన అధికారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. -
వానకు తడుస్తూ..చెట్ల కింద చదువులు
-
వద్దన్నా..కూల్చేశారు!
► మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు పాఠశాల స్థలం అడిగిన ఎమ్మెల్యే ► నిరాకరించిన అధికారులు ► అయినా సర్పంచ్ సమక్షంలోనే అక్రమంగా కూల్చివేత సంజామల: స్థానిక మండల పరిషత్ ప్రాథమిక రెగ్యులర్ పాఠశాల ప్రహరీని అధికార పార్టీ నాయకులు సోమవారం అడ్డగోలుగా కూల్చివేశారు. పాఠశాలలో 90 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తుండగా ఆరుగురు ఉపాధ్యాయులు ఉన్నారు. అసలే పాఠశాలకు తగిన వసతి సౌకర్యాలు లేవు. మరుగుదొడ్లు, వంట గది ఉన్నా విద్యార్థులు ఆడుకునేందుకు ఆటస్థలం లేదు. అయినా మినరల్ వాటర్ ప్లాంట్ పేరుతో ప్రహరీని కూలగొట్టారు. హామీని నిలుపుకునేందుకు తంటాలు.. గ్రామంలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని ప్రజలు ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటికే రెండు మినరల్ వాటర్ ప్లాంట్లు ఉన్నా మూడోది తన సొంత నిధులతో ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఈ హామీని నిలబెట్టుకునే చర్యల్లో భాగంగా ఆరు నెలల క్రితం గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే పాఠశాల స్థలంలో భూమి పూజ చేశారు. ఇక్కడ సరిపోయేంత స్థలం లేకపోవడంతో ప్రహరీని, వంట గది కోసం ఏర్పాటు చేసిన షెడ్డును కూల్చేందుకు నిర్ణయించగా ఎంపీడీఓ మురళీకళ్యాణి అందుకు నిరాకరించారు. ఉన్నతాధికారుల అనుమతి తీసుకోవాలని సూచించారు. ఇదే విషయం జిల్లా పరిషత్ సీఈఓ దృష్టికి వెళ్లగా ఆయన ఉపాధి పనుల పరిశీలనకోసం వచ్చి గ్రామంలో పాఠశాలనూ సందర్శించి వెళ్లారు. అసలే పాఠశాలకు సరిపోయేంత స్థలంలేక ఇబ్బందులు పడుతుండగా ఉన్న ప్రహరీని, వంట గది షెడ్డును వాటర్ ప్లాంట్‌కు ఇస్తే తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని అనుమతులు ఇవ్వలేదు. మరోచోట స్థలం ఉన్నా.. గ్రామంలో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు అనువుగా అదే వీధిలోని కమలమ్మ బావి వద్ద స్థలం ఉర్రా అధికారపార్టీ నాయకులు మంకుపట్టుపట్టారన్న∙ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అందులోభాగంగానే అనుమతులు రాకపోయినా తమకు అడ్డువచ్చే వారు లేరనే ఉద్దేశంతో బరితెగింపునకు పాల్పడ్డారు. గ్రామ సర్పంచ్ గంగా ఈశ్వరయ్య సమక్షంలోనే టీడీపీ నాయకులు మద్దిలేటి, సాగునీటి సంఘం ఉపాధ్యక్షులు మల్కి వుశేని దగ్గరుండి పాఠశాల ప్రహరీని కూలీలతో కూల్చివేయించారు. కూల్చివేసిన విషయం తెలియదు: శ్రీరాములు, ఎంఈఓ, సంజామల పాఠశాల ప్రహరీ కూల్చివేత విషయం నాకు తెలియదు. గతంలో పాఠశాల స్థలం కావాలని అడిగారు కాని ఈ విషయం పూర్తిగా ఎంపీడీఓ పరిధిలో ఉంటుందని తెలిపాను. జెడ్పీ సీఈఓకు ఫిర్యాదు చేశా: గౌరుగారి ఓబుళరెడ్డి, ఎంపీపీ, సంజామల పాఠశాల ప్రహరీని టీడీపీ కార్యకర్తలు కూల్చివేయడంపై జెడ్పీ సీఈఓకు ఫిర్యాదు చేశాను. ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం టీడీపీ నాయకులకు తగదు. పోలీస్‌స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేస్తాం. అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి. సాక్షి విలేకరికి బెదిరింపులు వీరు చేసే దుశ్చర్యను సాక్షి విలేకరి ఫొటోలు తీసి కూల్చివేతకు ఏమైనా అనుమతులు వచ్చాయా అని ఆరా తీయగా జెడ్పీ సీఈఓ చూసి వెళ్లారని అనుమతులు ఇచ్చినందుకే పనులు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. వెంటనే ఎంపీడీఓ మురళీ కళ్యాణికి ఫోన్ చేసి వివరణ కోరగా అనుమతులు రాలేదన్నారు. అనంతరం ఆమె కూల్చివేతను నిలిపేలని ఫోన్లో ఆదేశించారు. అప్పటికే ప్రహరీ కూల్చివేయగా కిచెన్ షెడ్డు కూల్చి వేతకు అడ్డుకట్ట పడింది. దీంతో సాక్షి విలేకరిపై అధికార పార్టీ నాయకులు బెదిరింపులకు దిగారు. ఈ విషయంలో జోక్యం చేసుకుంటే ఇబ్బందులు పడతాడని సన్నిహితులతో చెప్పి పంపారు. -
విరిగిపడిన చెట్టు: 40 మందికి గాయాలు
జి.మాడుగుల : విశాఖపట్టణం జిల్లా జి.మాడుగులలో పాఠశాల భవనంపై మంగళవారం మధ్యాహ్నం ఒక చెట్టు విరిగిపడింది. ఈ ఘటనలో సుమారు 40 మంది ఉపాధ్యాయులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారిని జి. మాడుగుల ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. భవనంలో ఉపాధ్యాయులందరూ సమావేశమై ఉన్నప్పుడు భవనం పక్కనున్న చెట్టు ఒక్కసారిగా భవనంపై కుప్పకూలింది. దాంతో సమావేశంలో పాల్గొన్న ఉపాధ్యాయుల్లో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. -
మార్చి 21 నుంచి పైతరగతులు!
ఏప్రిల్ 24 వరకు నిర్వహణ.. పాఠశాల విద్య అకడమిక్ కేలండర్‌ను సిద్ధం చేసిన విద్యాశాఖ త్వరలో ప్రభుత్వ ఆమోదానికి ఫైలు.. ఏప్రిల్ 24 నుంచి జూన్ 11వ తేదీ వరకు వేసవి సెలవులు సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 4 వరకు దసరా సెలవులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం (2017–18)లో అమలు చేయాల్సిన విద్యా కార్యక్రమాలతో పాఠశాల విద్యా శాఖ అకడమిక్ కేలండర్‌ను సిద్ధం చేసింది. దీనిపై త్వరలోనే ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయాలను తీసుకొని, అవసరమైతే పలు మార్పులు చేసి ప్రభుత్వ ఆమోదానికి పంపించాలని నిర్ణయించింది. ముఖ్యంగా 2017–18 విద్యా సంవత్సరాన్ని మార్చి 21వ తేదీ నుంచే ప్రారంభించాలని అకడమిక్ కేలండర్లో వెల్లడించింది. ఇందులో భాగంగా పైతరగతుల బోధనను మార్చి 21 నుంచి చేపట్టి ఏప్రిల్ 23వ తేదీ వరకు నిర్వహించాలని నిర్ణయించింది. ఏప్రిల్ 24 నుంచి జూన్ 11వ తేదీ వరకు వేసవి సెలవులను ఇవ్వనుంది. తిరిగి జూన్ 12వ తేదీ నుంచి తరగతుల నిర్వహణను కొనసాగించాలని పేర్కొంది. అలాగే దసరా సెలవులను సెప్టెంబర్ 20వ తేదీ నుంచి అక్టోబర్ 4 వరకు ఇవ్వనున్నట్లు తెలిపింది. క్రిస్టియన్ మిషనరీ స్కూళ్లకు 2017 డిసెంబర్ 23వ తేదీ నుంచి 27 వరకు క్రిస్మస్ సెలవులు ఇవ్వనుంది. సంక్రాంతి సెలవులు 2018 జనవరి 12 నుంచి 16వ తేదీ వరకు ఉండేలా చర్యలు చేపట్టింది. ఇక బడిబాట కార్యక్రమాన్ని రెండు దశల్లో నిర్వహించాలని నిర్ణయించింది. మార్చి 21 నుంచి 28వ తేదీ వరకు ఒక దఫా, జూన్ 1వ తేదీ నుంచి 9 వరకు రెండో దఫా నిర్వహించాలని పేర్కొంది. జూలై, ఆగస్టు, సెప్టెంబర్, నవంబర్, జనవరి, ఫిబ్రవరిలలో స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహించాలని తెలిపింది. చదువులో వెనుకబడిన విద్యార్థుల కోసం మార్చి 21 నుంచి ఏప్రిల్ 23 వరకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని వివరించింది. అకడమిక్ కేలండర్లోని ప్రధానాంశాలు పాఠశాలల వేళలు ► ఉన్నత పాఠశాలలు (6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు) ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు (ఏడున్నర గంటలు) కొనసాగుతాయి. ► ప్రాథమికోన్నత పాఠశాలలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4:15 గంటల వరకు (7.15 గంటలు) ఉంటాయి. ► ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు (7 గంటలపాటు) కొనసాగుతాయి. పరీక్షల సమయం ► జూలై 15వ తేదీలోగా ఫార్మేటివ్–1 పరీక్షలు ఉంటాయి. ఫార్మేటివ్–2 పరీక్షలు సెప్టెంబర్ 19లోగా పూర్తి చేయాలి. సమ్మేటివ్–1 పరీక్షలు అక్టోబర్ 9 నుంచి 16వ తేదీ వరకు ఉంటాయి. ఫార్మేటివ్–3 పరీక్షలు నవంబర్ 30లోగా పూర్తి చేయాలి. ఫార్మేటివ్–4 పరీక్షలు 2018 జనవరి 31లోగా పూర్తి చేయాలి. ఒకటి నుంచి 9వ తరగతి వరకు సమ్మేటివ్–2 పరీక్షలు 2018 మార్చి 7వ తేదీ నుంచి 14వ తేదీలోగా పూర్తి చేయాలి. ► పదో తరగతి ప్రీఫైనల్ పరీక్షలను 2018 ఫిబ్రవరి 16 నుంచి 28వ తేదీలోగా పూర్తి చేయాలి (టెన్త్ వార్షిక పరీక్షలు మార్చి మొదటి వారంలో ఉంటే). ఒకవేళ టెన్త్ వార్షిక పరీక్షలు 2018 మార్చి మూడో వారంలో ఉంటే ఫిబ్రవరి 21 నుంచి మార్చి 6వ తేదీలోగా పూర్తి చేయాలి. 2018 జనవరి 31వ తేదీలోగా టెన్త్ సిలబస్‌ను మొత్తం పూర్తి చేయాలి. ఆ తరువాత వెనువెంటనే సిలబస్ రివిజన్ చేపట్టాలి. -
స్కూల్ బిల్డింగ్ పైనుంచి పడిన బాలిక
-
మొండిగోడల మధ్య అఆఇఈ
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం కంఠాయపాలెం హైస్కూల్లో తరగతి గదులు శిథిలా వస్థకు చేరి పైకప్పు కూలిపోయింది. దీంతో విద్యార్థులు మొండిగోడల మధ్య చదువు కుంటున్నారు. పాఠశాల భవనం కూలి నాలుగేళ్లయినా కొత్త భవనం నిర్మిం చకపోవడంతో చెట్లకిందే విద్యార్థులు పాఠాలు నేర్చుకుంటున్నారు. వర్షం వస్తే ఇంటిబాట పడుతున్నారు. తరగతి గదులు నిర్మిస్తామని స్వయంగా ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి అయిన కడియం శ్రీహరి హామీ ఇచ్చినప్పటికీ అది ఇంకా కార్యరూపం దాల్చడం లేదు. ఇక్కడ పది తరగతి గదులు అవసరం ఉండగా మూడు మాత్రమే ఉన్నాయి. – తొర్రూరు రూరల్ -
ప్రభుత్వ పాఠశాలలో జనచైతన్య యాత్ర సమావేశం
పుల్లంపేటః తెలుగుదేశంపార్టీ ఆగడాలకు అడ్డు అదుపులేకుండా పోతోంది. అధికారాన్ని అడ్డంపెట్టుకుని దుర్వినియోగాలకు పాల్పడుతున్నారు. భావిభారత పౌరులుగా తీర్చిదిద్దే ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగుదేశంపార్టీ తమరాజకీయ లబ్ధి కోసం జనచైతన్యయాత్రల పేరుతో పాఠశాల సమయాన్ని దుర్వినియోగం చేశారు. అనంతంపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో గురువారం తెలుగుదేశంపార్టీ నాయకులు పాఠశాల ఆవరణలో విద్యార్థులకు పాఠ్యాంశాలు జరిగే సమయంలో జనచైతన్యయాత్ర సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైల్వేకోడూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ రామచంద్రనాయుడు, టీడీపీ పుల్లంపేట అధ్యక్షుడు కృష్ణమనాయుడు తదితరులు పాల్గొన్నారు. దీంతో విద్యార్థులు తీవ్రఇబ్బందులు పడ్డారు. ప్రభుత్వ పాఠశాలల్లో జనచైతన్యయాత్రను నిర్వహించవచ్చా అని ఎంఈవో చెంగల్‌రెడ్డిని వివరణకోరగా నేను లీవ్‌లో ఉన్నానని తెలిపారు. -
శాన్ ఫ్రాన్సిస్కోలో విద్యార్థులపై కాల్పులు
శాన్ ఫ్రాన్సిస్కో : అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన కలకలం రేగింది. శాన్ ఫ్రాన్సిస్కోలో రెండు వేర్వేరు ప్రాంతాల్లో దుండగులు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో నలుగురు విద్యార్థులు గాయపడగా వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. కాగా పలువురు విద్యార్థులు కాల్పుల నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఈక్విటీ జూన్ జోర్డాన్ స్కూల్ సిటీ ఆర్ట్స్ అండ్ టెక్నాలజీ హైస్కూల్ బయట ఈ కాల్పులు జరిగాయి. నల్లటి ముసుగులు ధరించిన నలుగురు ఆగంతకులు... తరగతి గదుల్లోకి నడిచి వెళుతున్న విద్యార్థులపై ఒక్కసారిగా కాల్పులు జరిపినట్లు శాన్ ఫ్రాన్సిస్కో పోలీసు అధికారి కార్లస్ మాన్ఫ్రెడీ తెలిపారు. కాల్పుల అనంతరం అక్కడ నుంచి దుండగులు పరారీ అయినట్లు చెప్పారు. దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. మరోవైపు కాల్పుల్లో గాయపడ్డ తీవ్రంగా గాయపడ్డ విద్యార్థినికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. కాగా దుండగులు మహిళా విద్యార్థినులనే లక్ష్యంగా చేసుకుని ఈ కాల్పులు జరిపినట్లు ఫ్రాన్సిస్కో యూనిఫైడ్ స్కూల్ డిస్ట్రిక్ట్ ప్రతినిధి తెలిపారు. San Francisco shot, students,school campus, అమెరికాలో కాల్పులు, శాన్ ఫ్రాన్సిస్కోలో విద్యార్థులపై కాల్పులు, దుండగులు -
పెచ్చులూడుతున్న పైకప్పు
శిథిలావస్థకు చేరిన వైమాందాపూర్ ప్రాథమిక పాఠశాల భవనం భయాందోళన చెందుతున్న విద్యార్థులు, టీచర్లు పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు కొల్చారం: మండలంలోని ఏటిగడ్డ మాందాపూర్‌లో ప్రాథమిక పాఠశాల కొనసాగుతోంది. నాలుగు గదుల్లో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు 70 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఆంగ్ల మాధ్యమం ఒకటో తరగతిలో 22 మంది విద్యార్థులున్నారు. పాఠశాల భవనం పూర్తి శిథిలావస్థకు చేరుకుంది. భవనం ఏ క్షణంలోనైనా కూలడానికి సిద్ధంగా ఉంది. గదుల్లోని పైకప్పులు, వరండాలో పెచ్చులూడిపడుతున్నాయి. ఇనుప ఊచలు తేలి ప్రమాదకరంగా దర్శనమిస్తున్నాయి. వర్షం వచ్చిందంటే పాఠశాలకు సెలవు ప్రకటిస్తున్నారు. గత పది సంవత్సరాల నుంచి పాఠశాల భవనానికి మరమ్మతులు చేయడం లేదు. పాఠశాల దుస్థితిని ప్రజాప్రతినిధులు, అధికారులకు ప్రత్యక్షంగా చూపించినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. అదనపు గది నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని చెబుతున్నా అమలు చేయడం లేదు. ఎప్పుడు ఎలాంటి ప్రమాదం చోటు చేసుకుంటుందోనని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ప్రమాదం జరగకముందే తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అధ్వానంగా... మా గ్రామంలోని ప్రాథమిక పాఠశాల శిథిలావస్థకు చేరింది. కొత్త భవనం నిర్మిస్తామని అధికారుల చెబుతున్నా మంజూరు చేయడం లేదు. కనీసం మరమ్మతులు చేపట్టిన దాఖలాలు లేవు. ప్రజాప్రతినిధులు తగిన చర్యలు తీసుకోవాలి. - దుర్గయ్య, వైమాందాపూర్ అధికారులు స్పందించాలి పాఠశాలలో అన్ని వసతులు, మంచి ఉపాధ్యాయులున్నారు. పాఠశాల భవనం ఎప్పుడు కూలుతుందో తెలియని దుస్థితి నెలకొంది. మా పిల్లలు భయపడుతున్నప్పటికీ గత్యంతరం లేక పంపిస్తున్నాం. ఇప్పటికైనా అధికారులు స్పందించాలి. - సురేష్, ఎస్ఎంసీ వైస్‌చైర్మన్ దారుణంగా ఉంది ప్రస్తుతం పాఠశాల భవనం పరిస్థితి దారుణంగా ఉంది. వర్షం పడితే గదుల్లోకి నీళ్లు చేరుతున్నాయి. పైకప్పు పెచ్చులూడి పడుతున్నాయి. భయం భయంగానే పాఠాలు చెబుతున్నాం. ఈ విషయాన్ని అధికారులకు చెబుతూనే ఉన్నాం. - దేవరాజ్, హెచ్ఎం -
మితిమీరిన విద్యార్థుల ఆగడాలు
పాఠశాల ఫర్నీచర్ ధ్వంసం తల్లిదండ్రులకు చెప్పిన మారని పరిస్థితి ధ్వంసం చేస్తే చర్యలు తప్పవన్న అధికారులు గజ్వేల్ రూరల్: ఆకతాయిల ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండాపోతోంది. ఊరి చివరన పాఠశాల ఉండటతో ఏం చేసినా అడిగేవారుండరన్న దీమాతో పాఠశాలను ధ్వంసం చేస్తున్నారు. విలువైన ఫర్నిచర్‌ను పనికిరాకుండా చేశారు. ప్రధాన గేటును సైతం విడిచిపెట్టలేదు. ఈ విషయాన్ని వారి తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండాపోయింది. వందల మంది చదువుకునే పాఠశాలలో ఆకతాయిల చేష్టల వల్ల ఉపాధ్యాయులతో పాటు విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్నారు. గజ్వేల్-ప్రజ్ఞాపూర్ నగర పంచాయతీ పరిధిలోని కోట మైసమ్మ సమీపాన, జాలిగామ బైపాస్ రోడ్డు మార్గంలో గల జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ మీడియంలో సుమారు 304 మంది విద్యార్థినులు విద్యనభ్యసిస్తున్నారు. అయితే పట్టణ శివారులో ఉండడంతో పాఠశాల పనివేళలు ముగిసిన తర్వాత ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. ఇష్టారాజ్యంగా ఆవరణలో ఆటలాడటం, తరగతి గదుల్లోని కిటికీలు, తలుపులు విరగొట్టడంలాంటి పనులు చేస్తున్నారు. అంతేకాకుండా గదుల్లోని సీలింగ్ ఫ్యాన్ల రెక్కలను కూడా విరిచేశారు. ఇటీవల ఏర్పాటుచేసిన గేటును సైతం ధ్వంసం చేశారు. దీంతో పాఠశాలకు రక్షణ కరువైందని స్థానికులు మండిపడుతున్నారు. ఇదే విషయమై ప్రధానోపాధ్యాయురాలు శారద పాఠశాల సమీపంలో నివాసం ఉండే విద్యార్థుల తల్లిదండ్రులకు చెప్పడం కూడా జరిగింది. అయినా పరిస్థితిలో ఎటువంటి మార్పురాలేదు. వాళ్ల ఆగడాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఉన్నతాధికారులు చర్యలు తీసుకుని ఆకతాయిల ఆగడాలకు కళ్లెం వేయడంతోపాటు పాఠశాలకు రక్షణ కల్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. రక్షణ కల్పించాలి పాఠశాల పనివేళలు ముగిసిన తర్వాత సాయంత్రం సమయంలో సమీప ప్రాంతాల పిల్లలు ఇక్కడికి వచ్చి ఆటలు ఆడుకుంటున్నట్లు మా దృష్టికి వచ్చింది. అంతేగాకుండా పాఠశాలలోని తరగతి గదులను, కిటికీలను ధ్వంసం చేశారు. ఇదే విషయాన్ని పాఠశాల సమీపంలోని విద్యార్థుల తల్లిదండ్రులకు చెప్పడం జరిగింది. అయితే ఊరి చివరన ఈ పాఠశాల ఉండడం వల్ల ఆకతాయిల ఆగడాలు ఎక్కువయ్యాయి. పాఠశాలకు రక్షణ కల్పించే విధంగా విద్యాశాఖ అధికారులు చర్యలు చేపడితే బాగుంటుంది. - శారద, ప్రిన్సిపాల్, బాలికల ఉన్నత పాఠశాల గజ్వేల్ ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తే సహించం విద్యాలయాలను దేవాలయాలుగా భావించాలి అంతేకాని తమకు ఇష్టం వచ్చినట్లు పాఠశాలలోగల తలుపులు, కిటికీలను ధ్వంసం చేయడం సహించరానిది. పాఠశాలలకు రక్షణ కల్పించే విషయమై ఉన్నతాధికారులకు నివేదించడం జరుగుతుంది. ప్రభుత్వ ఆస్తులను రక్షించడంతో పాటు ఆకతాయిల ఆగడాలు అరికట్టేందుకు చర్యలు తీసుకుంటాం. - సునీత, ఎంఈఓ -
భవనంపై నుంచి దూకిన టీచర్ !
హైదరాబాద్: పాఠశాల భవనంపై నుంచి దూకి ఉపాధ్యాయుడొకరు ప్రాణం తీసుకున్నారు. కూకట్పల్లి శ్రీచైతన్య టెక్నో పాఠశాలలో పనిచేసే రాజు (34) అనే ఉపాధ్యాయుడు శనివారం మధ్యాహ్నం భవనంపై నుంచి దూకారు. తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే చనిపోయాడు. వ్యక్తిగత కారణాలతోనే అతడు ఈ ఘటనకు పాల్పడి ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
నేటి నుంచి బడిబాట
వెయ్యికి పైగా శిథిల భవనాల్లోనే పాఠాలు బితుకుబితుకుమంటున్న పిల్లలు, టీచర్లు నిధుల్లేక మధ్యలోనే నిలిచిన స్కూలు భవనాలు ‘విద్యా వ్యవస్థలో ఎన్ని మార్పులో తీసుకొస్తున్నాం.. ప్రైవేటు స్కూళ్లకు దీటుగా సర్కారు బడులను తీర్చిదిద్దుతున్నాం.. అన్ని సదుపాయాలూ సమకూరుస్తున్నాం.. సమస్యలు పరిష్కరిస్తున్నాం..’ అంటూ తరచూ ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకూ ఊదరగొడుతున్నారు. కానీ వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకు పోతున్నామంటూ తరచూ వల్లించే ముఖ్యమంత్రి పాలనలో, విద్యాశాఖ మంత్రి ఇలాకాలో నేటికీ చెట్ల కింద, వీధి అరుగులపైన, పూరి గుడిసెల్లోనూ, శిథిల భవనాల్లో, వరండాల్లో పాఠాలు సాగుతున్నాయంటే ఎంత ముందుకు పోతున్నామో తేటతెల్లమవుతోంది. అమాత్యులు దత్తత తీసుకున్న గ్రామాల్లో సైతం నేలపై చదువు సాగుతోందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. సవాలక్ష సమస్యల నడుమ సోమవారం నుంచి సర్కారు బడులు ఎప్పటిలాగే మళ్లీ తెరుచుకుంటున్నాయి. - సాక్షి నెట్వర్క్ -
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఈ
► కలెక్టరేట్ ఆవరణలో కలకలం ► పాఠశాల భవన నిర్మాణ బిల్లు చెల్లించేందుకు రూ.5వేలు డిమాండ్ ► గతంలోనూ రూ.45వేలు తీసుకున్న ఉద్యోగి నయీంనగర్ : జిల్లా పాలనకు కేంద్రబిం దువు, సాక్షాత్తు కలెక్టర్ విధులు నిర్వర్తించే జిల్లా కలెక్టరేట్లోని ఓ కార్యాలయ ఉద్యోగి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. ఈ ఘటన శుక్రవారం చోటుచేసుకోగా కలకలం సృష్టించింది. కలెక్టరేట్ ఆవరణలోని ప్రగతి భవన్ ప్రాంగణంలో విద్య, సంక్షేమ, మౌళిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్ కార్యాలయం ఉంది. ఈ కార్యాలయం ద్వారా ప్రభుత్వ విద్యాసంస్థల భవనాల నిర్మాణం, బిల్లులు చెల్లింపు ఇతరత్రా వ్యవహారాలు కొనసాగుతారుు. ఇందులో భాగంగా జఫర్‌గఢ్ మండలం తిమ్మంపేట గ్రా మంలోని ప్రభుత్వ పాఠశాల భవనం నిర్మాణ పనిని దక్కించుకున్న కాంట్రాక్టర్ ఆలకుంట్ల దుర్గయ్య పూర్తిచేశాడు. ఈ మేరకు చివరి విడత రూ.26లక్షల బిల్లు కోసం కార్యాలయంలోని ఏఈ ఎం.ఏ.అజీజ్‌ను సంప్రదించాడు. నిధులు విడుదల చేయూలం టూ రూ.5వేలు ఇవ్వాలని ఏఈ డిమాండ్ చేశాడు. అరుుతే, గతంలో మొదటి, రెండో విడత బిల్లుల కోసం కూడా అజీజ్‌కు రూ.45వేల వరకు ఇచ్చిన కాంట్రాక్టర్ దుర్గయ్య ఈసారి విసిగి పోయూడు. ఈ మేరకు ఏసీబీ అధికారులు సంప్రదించగా వారు నిఘా పెట్టారు. ఇందులో భాగంగా శుక్రవారం మధ్యాహ్నం ఏ ఈ అజీజ్‌కు ఆయన కార్యాలయంలో దుర్గయ్య రూ.5వేలు ఇస్తుండగా ఏసీబీ డీఎస్పీ సారుుబాబా ఆధ్వర్యంలో రెడ్ హ్యాం డెడ్‌గా పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆయన నుంచి నగదు స్వాధీనం చేసుకోవడంతో పాటు అదుపులోకి తీసుకున్నారు. దాడుల్లో డీఎస్పీతో పాటు సీఐలు సాంబయ్య, రాఘవేందర్రా వు పాల్గొన్నారు. కాగా, ఈనెల 1న ఇంటి నిర్మాణ అనుమతి కోసం రూ.20వేలు తీసుకుంటూ గ్రేటర్ వరంగల్ కాజీపేట సర్కిల్ కార్యాలయంలో టీపీఎస్ రమణయ్య, మేడారం జాతర పనుల్లో భాగంగా చిలుకల గుట్ట వద్ద నిర్మించిన సీసీ రోడ్డు పను ల బిల్లు చెల్లించేందుకు 6వ తేదీన రూ.40వేలు తీసుకుంటూ తా డ్వాయి పీఆర్ ఏఈ జీ.పీ.కృష్ణ ఏసీబీకి చిక్కారు. ఇలా పది రో జుల్లోనే ముగ్గురు ఉద్యోగులు ఏసీబీకి దొరకడం గమనార్హం. కలెక్టరేట్లో ఇది ఆరో కేసు హన్మకొండ: గత సంవత్సరం కాలంలో కలెక్టరేట్ ఆవరణలోని కార్యాలయూల్లో లంచం తీసుకుంటున్న ముగ్గు రు ఏసీబీకి పట్టుబడడం చర్చనీయూంశంగా మారింది. కలెక్టరేట్ ఆవరణలో ఇప్పటి వరకు ఆరు మార్లు ఏసీబీ దాడులు జరగగా ఎనిమిది మంది ఉద్యోగులు పట్టుబడ్డారు. ఈ మేరకు ఏసీబీకి దొరికిన ఉద్యోగుల వివరాలిలా ఉన్నారుు. ♦ కలెక్టరేట్ సమావేశ మందిరం పైభాగంలో ఉన్న చిన్నమొత్తాల పొదుపు విభాగం ప్రత్యేక తహశీల్దార్‌గా పనిచేసిన పంత్ ఇన్సూరెన్స్ ఏజెంట్ నుంచి రూ.3వేలు తీసుకుంటూ 2004లో ఏసీబీకి చిక్కారు. ♦ కలెక్టరేట్ ప్రగతి భవనంలోని సాంఘిక సంక్షేమ శాఖ డీఎస్డ బ్ల్యూవో వై.గాలయ్య.. వార్డెన్ మునిరుద్దీన్కు వైద్య బిల్లుల విషయంలో రూ.4వేలు తీసుకుంటూ పట్టుబడ్డారు. ♦ సాంఘిక సంక్షేమ శాఖలో గాలయ్య స్థానంలో ఇన్చార్జ్గా ఉన్న డీఎస్‌డబ్ల్యూవో ప్రభాకర్ కూడా అదే వార్డెన్ మునీరుద్దీన్ పదోన్నతి విషయంలో లంచం డిమాండ్ చేయగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ♦ కలెక్టరేట్లోని ‘సీ’ సెక్షన్లో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న సునీల్ తెలంగాణ అమరవీరుల కుటంబాలకు ఇవ్వాల్సిన పరిహారం విషయంలో లంచం డిమాండ్ చేశాడు. దీంతో 1 జూలై 2015న ఏసీబీ అధికారులు వల పన్నగా ఆయన చిక్కారు. ♦ కలెక్టరేట్ ఆవరణలో ఉన్న జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయంలో డీపీఓ ఈఎస్.నాయక్ కారుణ్య నియూమకం విషయంలో రూ.లక్ష లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. ఇంత నగదుతో ఏసీబీకి దొరకడం జిల్లాలో ఇదే ప్రథమం. కాగా, ఇదే అంశంలో రూ.5వేల చొప్పున లంచం తీసుకుంటున్న కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ మహబూబ్ అలీ, అటెండర్ సారంగపాణికి పట్టుబడ్డారు. ♦ ప్రస్తుతం కలెక్టరేట్ ఆవ ణలోని టీఎస్డబ్ల్యూఈఐడీసీ ఉద్యోగి రూ.5వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. కాగా, కలెక్టరేట్ ఆవరణలోనిఎస్సీ కార్పొరేషన్ ఉద్యోగి ఉమామహేశ్వర్, సివిల్ సప్లై కార్పొరేషన్ డీఎం కూడా ఏసీబీకి చిక్కారు. అరుుతే, ఈ దాడులు కలెక్టరేట్ ఆవరణలో జరగలేదు. -
స్యూల్ హాస్టల్లో మంటలు 17 మంది మృతి
బ్యాంకాక్: స్కూల్ హాస్టల్లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగడంతో 17 మంది మృతి విద్యార్థులు మృతి చెందిన ఘటన ఇండోనేషియాలో చోటు చేసుకుంది. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని,ఇద్దరు కనబడుట లేదని ఉత్తర ఇండెనేషియా పోలీసు అధికారులు తెలిపారు. పేదలు ఎక్కువగాఉన్న కొండల ప్రాంతంలో ఉన్న ఈ పాఠశాలను స్థానికంగా ఉన్న ఓ సంస్థ నడుపుతోందని ఇందులో ఉన్న అమ్మాయిలంతా మూడు నుంచి పదమూడేళ్ల లోపు వారేనని పోలీసు అధికారులు తెలిపారు. థాయిలాండ్ లోని ప్రజలు పేదరికం,అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. అక్కడ ఇటువంటి ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయి. -
మర్రి.. కనువిందేమరి
‘ఇంతింతై.. వటుడింతై’ అన్న చందంగా పాఠశాల భవనంపై పెరిగిన ఓ మొక్క.. నేడు ఓ చెట్టుగా రూపాంతరం చెందింది. మండలంలోని ఎన్కేపల్లి గ్రామ ప్రాథమిక పాఠశాలకు గతంలో నిర్మించిన భవనం శిథిలమవడంతో ఉపయోగించకుండా వదిలేశారు. ఇదే ఆవరణలో పాఠశాలకు కొత్తగా వేరే గదులు నిర్మించడంతో వాటిని వినియోగిస్తున్నారు. ఈ వృథా పాఠశాల భవాన్ని తొలగించకుండా అలాగే వదిలేయడంతో అప్పట్లో మట్టితో నిర్మించిన ఈ భవనంపై ఓ మర్రి మొక్క పెరిగింది. అది నేడు పెద్దదై ఏర్లు.. ఊడలు రావడంతో చిన్న సైజూ వృక్షాన్ని తలపిస్తోంది. - మొయినాబాద్ రూరల్ -
పాఠశాలను బాంబులతో పేల్చినా..
సిరియా: ఈ చిత్రంలో కనిపిస్తున్న ఇద్దరు చిన్నారులు ఇంతకు ముందు సిరియాలోని అలెప్పో పాఠశాలలో చదివేవారు. ఇప్పుడు ఆ పాఠశాల లేదు. దానిని ఉగ్రవాదులు బాంబులతో పేల్చేశారు. ఈ విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్పేందుకు లండన్‌లోని హౌస్ ఆఫ్ పార్లమెంట్ ఆవరణను వేదికగా చేసుకున్నారు. ఓ స్వచ్ఛంద సంస్థ సహాయంతో... శిథిలమైన పాఠశాల నమూనా మధ్య కూర్చొని ప్రపంచానికి తమ గోడును వెళ్లబోసుకున్నారు. -
స్కూల్ భవనం కూలి విద్యార్థుల మృతి
-
స్కూల్ భవనం కూలి విద్యార్థిని మృతి
చిత్తూరు: చిత్తూరు జిల్లా గుర్రంకొండలో విషాదం చోటు చేసుకుంది. గుర్రంకొండలోని ఓ ప్రైవేట్ స్కూల్ భవనం కూలిన ఘటనలో ఓ విద్యార్థిని మృతిచెందగా, మరో 10 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. బుధవారం మధ్యాహ్నం పాఠశాలలో ఎల్కేజీ విద్యార్థులు భోజనం చేస్తున్న సమయంలో భవనం పైకప్పు కూలిపోయింది. ఈ దుర్ఘటనలో హర్ష అనే విద్యార్థిని అక్కడికక్కడే మరణించింది. గాయపడిన విద్యార్థులను ఆటోలు, ఇతర వాహనాల్లో మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పాఠశాల భవనం వందేళ్ల పైబడిన పురాతనకట్టడం కావడం, ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల పైకప్పు కూలినట్టు తెలుస్తోంది. విద్యా శాఖ అధికారుల నిర్లక్ష్యం వ్యవహరించడం ఈ ఘటనకు కారణమనే విమర్శలు వస్తున్నాయి. పాఠశాల యాజమాన్యం ప్రస్తుతం అందుబాటులో లేదని, వారిపై చర్యలు తీసుకుంటామని స్థానిక ఎస్సై తెలిపారు. -
వ్యథాభరితంగా భవనాలు!
ఏళ్ల తరబడి పూర్తికాని పాఠశాల భవనాలు వసతి లేక అవస్థలు పడుతున్న విద్యార్థులు సాక్షి ప్రతినిధి, విజయనగరం: జిల్లాలో విద్యాభివృద్ధికి, పాఠశాలల భవనాల నిర్మాణం కోసం రూ.కోట్లు మంజూరు చేసినా ప్రయోజనం లేకుండా పోతోంది. పలు పాఠశాలలకు చెందిన దాదాపు ఐదు వందల భవనాల నిర్మాణం కోసం మూడేళ్ల క్రితం రూ.40 కోట్లకు పైగా మంజూరు చేశారు. అయితే ఇప్పటికీ అవి పూర్తికాలేదు. ఇప్పటికే చాలా భవనాలు శిథిలావస్థకు చేరాయి. వాటిని పట్టించుకునే నాథుడు కూడా కరువయ్యాడు. పాచిపెంట మండల కేంద్రంలో సక్సెస్ పాఠశాల కోసమని ఏడు గదులతో కొత్త భవనాన్ని నిర్మించేందుకు 2006లో ప్రభుత్వం రూ.28లక్షలు మంజూరు చేసింది. ఆరు నెలల్లో భవనాన్ని పూర్తి చేయాల్సి ఉంది. కానీ సకాలంలో పూర్తి చేయలేదు. 2010లో పూర్తి స్థాయిలో నిర్మాణం కాకుండానే నాటి ప్రధానోపాధ్యాయుడికి సదరు కాంట్రాక్టర్ భవనాన్ని అప్పగించే ప్రయత్నం చేశారు. పనులు అసంపూర్తిగా జరిగాయన్న కారణంతో ప్రధానోపాధ్యాయుడు స్వాధీనం చేసుకోలేదు. ఆ తరువాత ఏ ఒక్క అధికారీ దీనిని పట్టించుకోలేదు. దీంతో భవనం గోడలు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఆ భవనం అందుబాటులోకి రాకపోవడంతో ప్రస్తుతమున్న పాచిపెంట పాఠశాల భవనంలో వసతి సమస్యతో 600మంది విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ఇప్పుడు ఆ భవన పునర్నిర్మాణ పనులు చేసి పూర్తి చేయాలంటే మంజూరు చేసిన మొత్తానికి రెట్టింపు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఇదే విషయమై సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర పలుమార్లు జెడ్పీ, ఐటీడీఏ సమావేశాల్లో అధికారుల్ని ప్రశ్నించినా, నిలదీసినా స్పందన లేదు. ఈ ఒక్క భవనమే కాదు జిల్లాలో దాదాపు 500 పాఠశాల భవనాల పరిస్థితి ఇలాగే ఉంది. అదనపు తరగతుల కోసం సుమారు రూ.21కోట్లతో మంజూరు చేశారు. ఈ నిధులతో 323 పాఠశాలల్లో చేపట్టిన నిర్మాణాలు మూడేళ్లుగా అసంపూర్తిగానే ఉన్నాయి. అలాగే,రూ.4.5కోట్లతో మంజూరు చేసిన 68 ప్రాథమికోన్నత పాఠశాలల భవన నిర్మాణాల పరిస్థితీ అగమ్యగోచరంగా ఉంది. నాలుగు మున్సిపాల్టీలలో 77 తరగతి గదుల నిర్మాణాలకు రూ.9 కోట్లు మంజూరు చేశారు. వాటి పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా లేదు ఇలా కోట్లాది రూపాయలు మంజూరై ఏళ్లు గడుస్తున్నా నిర్మాణాలు మాత్రం పూర్తి కావడం లేదు. ఈ క్రమంలో అంచనాలు పెరిగిపోతున్నాయి. నిర్మాణాలు అసంపూర్తిగా ఉండిపోయి, శిథిలావస్థకు చేరుతున్నాయి. దీంతో పాఠశాలల భవనాల కోసం మంజూరు చేసిన కోట్లాది రూపాయలు వృథా అవుతున్నాయి. ఉన్నతాధికారులు కూడా వీటి గురించి పట్టించుకోకపోవడంతో కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూరుతోంది. బాధ్యులెవరో తేల్చాలి పాచిపెంట పాఠశాల భవనం కోసం ఖర్చు చేసిన రూ.28 లక్షలు వృథా అయ్యాయి. చాలా సార్లు జెడ్పీ, ఐటీడీఏ సమావేశాల్లో ప్రస్తావించినా అధికారుల నుంచి స్పందన లేదు. ప్రజాధనం దుర్వినియోగానికి బాధ్యులెవరో అధికారులే తేల్చాలి. ఇప్పుడా భవనానికి మరమ్మతులు చేపడితే ప్రయోజనం ఉండదు, పూర్తిగా కూల్చేసి, కొత్త భవనాన్ని నిర్మించాలి. -పీడిక రాజన్నదొర, ఎమ్మెల్యే, సాలూరు -
కళ్లల్లో నీళ్లు ఆగలే!
* అనాథ పిల్లల పరిస్థితిపై సీఎం కేసీఆర్ ఉద్వేగం * వారి బాగోగులు ప్రభుత్వమే చూసుకుంటుంది * యాదాద్రిలో మొదటి స్కూల్ శంకుస్థాపనకు రాష్ట్రపతిని ఆహ్వానించాలని ఆదేశం సాక్షి, హైదరాబాద్: ‘గజ్వేలు నియోజకవర్గంలో ఓ కార్యక్రమానికి వెళ్లాను. అక్కడో ఇద్దరు అమ్మాయిలు గణితంలో ఏది అడిగినా టకటకా సమాధానాలిచ్చారు. అబాకస్‌లో అద్భుత ప్రతిభ కనబరిచారు. కార్యక్రమం ముగిశాక వాళ్లిద్దరు నన్ను కలిశారు. వాళ్లిద్దరూ నా దగ్గరికొచ్చి రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టారు. ‘సార్ మేము పదో తరగతి చదువుకుంటున్నాం. తర్వాత ఏమి చేయాలో తెలియడం లేదు. మేము అనాథలం. మాకెవరూ లేరు సార్’ అన్నారు. మేము అనాథలం అనే మాట ఆ చిన్నారుల నోటి నుంచి రావడంతో నాకు దుఃఖం వచ్చింది. కళ్లల్లో నీళ్లు తిరిగాయి. బాగుండదని ఏడుపు ఆపుకొన్నా. ఇప్పటికీ ఆ పిల్లలు నా కళ్లల్లో మెదులుతున్నారు. అనాథలమని చెప్పుకొనే స్థితి రావడం నా మనసును కలిచివేసింది’ అని సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఉద్వేగంగా మాట్లాడారు. మంగళవారం అనాథ పిల్లల చదువు, వసతి తదితర అంశాలపై సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. తెలంగాణలో అనాథ పిల్లలకు ప్రభుత్వమే అమ్మ, నాన్న అవుతుం దని కేసీఆర్ అన్నారు. లక్ష కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టుకుంటున్న రాష్ట్రంలో అనాథ పిల్లలను ఆదుకోవడానికి ఏమీ చేయలేమా? ఎన్ని స్వచ్ఛంద సంస్థలు అనాథల కోసం కృషి చేస్తున్నా సరిపోవడం లేదని ఆయన అన్నారు. అందుకే పదో తరగతి తర్వాత రోడ్డున పడుతున్న వారిని ప్రభుత్వమే ఆదరిస్తుందని స్పష్టం చేశారు. యాదాద్రిలో మొదటి స్కూల్ పదో తరగతి తర్వాత అనాథ పిల్లలకు ఇంటిగ్రేటేడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు తెరవాలని అధికారులకు సీఎం సూచించారు. మొదటి రెసిడెన్షియల్ స్కూల్‌ను యాదగిరిగుట్టలో ప్రారంభించాలని, ఈ స్కూల్ శంకుస్థాపనకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని ఆహ్వానించాలని ముఖ్యమంత్రి చెప్పారు. అనాథ పిల్లల భవిష్యత్తుకు ఏం చేయాలనే అంశాలను అధ్యయనం చేసేందుకు నియమించిన మంత్రివర్గ ఉప సంఘం వీలైనంత తొందరగా నివేదిక ఇవ్వాలని సూచించారు. అనాథ పిల్లలకు బంగారు భవితను అందించేందుకు అవసరమైన విధానం రూపొందించాలని ఆదేశించారు. అనాథలకు రిజర్వేషన్లు కల్పించే అంశాన్ని పరిశీలించాలని చెప్పారు. త్వరలోనే కొన్ని అనాథశ్రమాలు సందర్శించి వారి స్థితిగతులు తెలుసుకుంటానని వెల్లడించారు. మంత్రులు పోచారం శ్రీనివాసరెడ్డి, కె.తారకరామారావు, లక్ష్మారెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగరావు ఇతర అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు