ప్లీజ్ మోదీ జీ.. మా కోసం ఒక మంచి స్కూల్ భవనం కట్టించండి.. అంటూ ఓ చిన్నారి ప్రధానిని కోరింది. తాను చదువుతోన్న ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సౌకర్యాల సరిగా లేవని ఆవేదక వ్యక్తం చేసింది. తాము సరిగా చదువుకోలేకపోతున్నామని ఫేస్‌బుక్ ద్వారా తన విన్నపాన్ని ప్రధాని మోదీకి వినిపించింది. తన స్కూల్ దుస్థితిని వీడియోలో పంపించింది.
వివరాల ప్రకారం.. జమ్మూ కశ్మీర్‌లోని కథువా జిల్లా లొహయ్-మల్హర్ గ్రామానికి చెందిన సీరత్ నాజ్ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నట్టు వీడియోలో తెలిపింది. ఆ తర్వాత తాను చదువుతున్న స్కూల్ కాంపౌండ్‌లో నడుస్తూ పాఠశాల పరిస్థితిని వివరించింది. ‘ప్లీజ్ మోదీ జీ’ మా కోసం కొత్త భవన్నాని నిర్మించండి అని వేడుకుంది. తన పాఠశాలలో మౌలిక వసతులు మెరుగుపరచడానికి చర్యలు తీసుకోండి అని కోరింది. అనంతరం, ఫోన్ కెమెరాను తలుపులు మూసివున్న ఓ గది ముందు ఉంచి..‘ప్రిన్సిపాల్ ఆఫీస్, స్టాఫ్ రూమ్’ అని వివరించింది. ఇదే సమయంలో స్కూల్‌లోని ఫ్లోర్లింగ్ చూపిస్తూ చూడండి మోదీజీ.. ఎంత మురికిగా ఉందో అంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ దీనిపైనే మమ్మల్ని కూర్చోబెడతారు అంటూ తరగతి గదులను చూపించింది. మురికిగా ఉన్న ఫ్లోర్‌పై కూర్చోవడంతో మా యూనిఫామ్స్ మాసిపోతున్నాయి. మా డ్రెస్సులు మురికిగా ఉన్నాయని మా అమ్మలు తరచూ మమ్మల్ని తిడతారు. మాకు కూర్చోవడానికి బెంచీలు కూడా లేవు అంటూ ఆవేదన చెందింది.
ఇదే సమయంలో మా పాఠశాల భవవాన్ని చూపిస్తాను అంటూ ముందుకు సాగింది. గత ఐదేళ్లుగా భవనం ఎంత అపరిశుభ్రంగా ఉందో చూడండి అని కోరింది. మొదటి అంతస్తులోకి వెళ్లిన ఆ చిన్నారి.. అక్కడ పరిస్థితి వివరిస్తూ ప్లీజ్ మోదీజీ.. మా పాఠశాల మౌలిక సదుపాయాలను మెరుగుపరచండి అని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. దయచేసి నా కోరిక తీర్చండి అని కోరింది. అనంతరం కిందకు దిగి.. కాంపౌండ్ వాల్ వద్దకు వెళ్లి విరిగిపోయి ఉన్న టాయ్‌లెట్‌ను చూపించింది. అలాగే, పాఠశాలలో సౌకర్యాలను ప్రత్యక్షంగా చూపించింది. బహిరంగ ప్రదేశాల్లో విద్యార్థులు ఏ విధంగా ఉపశమనం పొందుతున్నారో తెలిపింది.
ఇక చివరగా మోదీజీ మీరు దేశం మొత్తం చెప్పేది వినండి.. దయచేసి నా మాట కూడా వినండి.. మాకు మంచి పాఠశాలను నిర్మించండి.. నేలపై కూర్చోవాల్సిన అవసరం లేని విధంగా పాఠశాల ఉండాలి. దీంతో, మేమంతా బాగా చదువుకుంటాం. దయచేసి మా కోసం ఒక చక్కని పాఠశాలను నిర్మించండి అని కోరింది. ఇక, వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment