శ్రీనగర్:కశ్మీర్‌లో ఎన్నికలు నిర్వహిస్తామన్న హామీని నెరవేర్చినందుకు ప్రధాని మోదీ(PM Modi)పై కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా(Omar Abdulla) ప్రశంసలు కురిపించారు. సోమవారం జెడ్‌మోర్ టన్నెల్‌ను ప్రధాని మోదీ ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో ఒమర్‌అబ్దుల్లా మాట్లాడారు.
‘ఇక్కడ ఎన్నికలు నిర్వహిస్తామని మీరిచ్చిన హామీని నెరవేర్చారు.ప్రజలు వారికి కావాల్సిన వారిని ఎన్నుకున్నారు. దీంతో నేను సీఎం హోదాలో ఇక్కడ మాట్లాడుతున్నాను.దీంతో పాటు కశ్మీర్‌కు రాష్ట్ర హోదా ఇస్తానన్న హామీని కూడా మీరిచ్చారు. త్వరలో ఈ హామీని కూడా మీరు నెరవేరుస్తారని నేను ఆశిస్తున్నాను’అని ఒమర్ అబ్దుల్లా ఆశాభావం వ్యక్తం చేశారు.
జమ్ము కశ్మీర్‌లోని గాందర్‌బల్ జిల్లాలో నిర్మించిన జడ్-మోడ్ సొరంగాన్ని భారత ప్రధాని మోదీ సోమవారం ప్రారంభించారు. శ్రీనగర్- లేహ్ జాతీయ రహదారిపై 2,400 కోట్ల రూపాయలతో ఈ టన్నెల్‌ను నిర్మించారు. ఇది 6.4 కిలో మీటర్ల పొడవుండే ఈ సొరంగంతో ఏడాదిలో ఏ సీజన్‌లోనైనా లద్దాఖ్‌ను రోడ్డు మార్గం ద్వారా ఈజీగా చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక, 2015లో ప్రారంభమైన నిర్మాణ పనులు గతేడాది పూర్తయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment