శ్రీనగర్: జమ్ము కశ్మీర్‌లో ప్రధాని మోదీ పర్యటన వేళ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. జమ్ము కశ్మీర్‌లో ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆర్టికల్-370 రద్దుతో సంబంధమే లేదన్నారు. 370 రద్దు కంటే ముందే అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్టు ఆయన చెప్పుకొచ్చారు. అభివృద్ధికి, ఆర్టికల్ రద్దుకు లింక్ పెట్టొద్దు అంటూ ఘాటు విమర్శలు చేశారు.
తాజాగా సీఎం ఒమర్ అబ్దుల్లా మీడియాతో మాట్లాడుతూ..‘జమ్ము కశ్మీర్‌లోని మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ఆర్టికల్ 370తో ముడిపెట్టవద్దు. దీనికి రాజకీయాలతో సంబంధం లేదు. ఈ ప్రాజెక్టులు ఏవీ ఆగస్టు 5, 2019 తర్వాత ప్రారంభించినవి కావు. అంతకంటే ముందుగానే ఇవి ప్రణాళిక చేయబడ్డాయి. ఆర్టికల్ 370 రద్దుతో సంబంధం లేకుండా జరిగిన అభివృద్ధి ఇది. ఈ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో లేవు అని చెప్పుకొచ్చారు.
ఇదే సమయంలో జమ్ము కశ్మీర్‌లో 2008, 2010, 2016లో ప్రముఖంగా కనిపించిన రాళ్ల దాడులు, నిరసనలు వంటి కార్యకలాపాలు ఇప్పుడు గణనీయంగా తగ్గాయి. దీన్ని నేను అంగీకరిస్తున్నాను. అయితే, ఇది కొంతవరకు ప్రభుత్వం తీసుకున్న కఠిన నిర్ణయాల కారణంగా ఇది జరిగింది. సీఐడీ విభాగాన్ని ఆయుధంగా మార్చడం, ఉద్యోగులను తొలగించడం, వ్యక్తులను బ్లాక్‌లిస్ట్ చేయడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం. మార్పును ప్రజలు అంగీకరించాలి. వారు మనస్పూర్తిగా అంగీకరిస్తే అది ప్రశంసనీయం అంటూ కామెంట్స్ చేశారు. దీంతో, ముఖ్యమంత్రి ఒమర్ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
"Let's not link the infrastructure projects in J&K to the politics surrounding Article 370. Most of these projects are not located in any areas that saw activities like stone-pelting and protests": CM Omar Abdullah@OmarAbdullah pic.twitter.com/gbODYR3KdH
— Rahul Kanwal (@rahulkanwal) January 13, 2025
ఇదిలా ఉండగా.. జమ్ముకశ్మీర్‌లోని గాందర్‌బల్ జిల్లాలో నిర్మించిన జడ్-మోడ్ సొరంగాన్ని భారత ప్రధాని మోదీ నేడు ప్రారంభించనున్నారు. శ్రీనగర్- లేహ్ జాతీయ రహదారిపై 2,400 కోట్ల రూపాయలతో ఈ టన్నెల్‌ను నిర్మించారు. ఇది 6.4 కిలో మీటర్ల పొడవుండే ఈ సొరంగంతో ఏడాదిలో ఏ సీజన్‌లోనైనా లద్దాఖ్‌ను రోడ్డు మార్గం ద్వారా ఈజీగా చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక, 2015లో ప్రారంభమైన నిర్మాణ పనులు గతేడాది పూర్తి అయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment