statehood
-
ప్రధాని మోదీపై ఒమర్ అబ్దుల్లా ప్రశంసలు
శ్రీనగర్:కశ్మీర్లో ఎన్నికలు నిర్వహిస్తామన్న హామీని నెరవేర్చినందుకు ప్రధాని మోదీ(PM Modi)పై కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా(Omar Abdulla) ప్రశంసలు కురిపించారు. సోమవారం జెడ్‌మోర్ టన్నెల్‌ను ప్రధాని మోదీ ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో ఒమర్అబ్దుల్లా మాట్లాడారు.‘ఇక్కడ ఎన్నికలు నిర్వహిస్తామని మీరిచ్చిన హామీని నెరవేర్చారు.ప్రజలు వారికి కావాల్సిన వారిని ఎన్నుకున్నారు. దీంతో నేను సీఎం హోదాలో ఇక్కడ మాట్లాడుతున్నాను.దీంతో పాటు కశ్మీర్‌కు రాష్ట్ర హోదా ఇస్తానన్న హామీని కూడా మీరిచ్చారు. త్వరలో ఈ హామీని కూడా మీరు నెరవేరుస్తారని నేను ఆశిస్తున్నాను’అని ఒమర్ అబ్దుల్లా ఆశాభావం వ్యక్తం చేశారు. జమ్ము కశ్మీర్‌లోని గాందర్బల్ జిల్లాలో నిర్మించిన జడ్-మోడ్ సొరంగాన్ని భారత ప్రధాని మోదీ సోమవారం ప్రారంభించారు. శ్రీనగర్- లేహ్ జాతీయ రహదారిపై 2,400 కోట్ల రూపాయలతో ఈ టన్నెల్‌ను నిర్మించారు. ఇది 6.4 కిలో మీటర్ల పొడవుండే ఈ సొరంగంతో ఏడాదిలో ఏ సీజన్లోనైనా లద్దాఖ్‌ను రోడ్డు మార్గం ద్వారా ఈజీగా చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక, 2015లో ప్రారంభమైన నిర్మాణ పనులు గతేడాది పూర్తయ్యాయి. -
ఇజ్రాయెల్‌కు షాక్.. పాలస్తీనా కోసం రంగంలోకి సౌదీ అరేబియా
హమాస్, హోజ్బొల్లా ఉగ్రవాద సంస్థలను అంతం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయిల్ దాడులు కొనసాగుతున్నాయి. గాజా, లెబనాన్, ఇరాన్‌పై క్షిపణులు, బాంబులతో విరుచుకుపడుతోంది.ఈ క్రమంలో తాజాగా గాజా, లెబనాన్‌తో ఇజ్రాయెల్ వివాదాన్ని పరిష్కరించేందుకు సౌదీ అరేబియా అరబ్-ఇస్లామిక్ శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించనుంది. నవంబర్ 11న జరగనున్న ఈ సమ్మిట్ పాలస్తీనా రాజ్య స్థాపనపై దృష్టి సారించనుంది. రియాద్‌లో రెండు రోజుల పాటు చర్చలు జరగనున్నాయి.ఈ శిఖరాగ్ర సమావేశం గత సంవత్సరం 2023 అరబ్-ఇస్లామిక్ ఎక్స్‌ట్రార్డీనరీ సమ్మిట్‌కు కొనసాగింపుగా జరగనుంది. ఇది సౌదీ అరేబియా రాజు సల్మాన్, ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ అల్ సౌద్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. అయితే పాలస్తీనాకు రాజ్యాధికారం కల్పించేందుకు ఇజ్రాయెల్‌పై ఎలా ఒత్తిడి తేవాలనే దానిపై ఈ సదస్సులో ఇస్లామిక్ దేశాలు చర్చించనున్నాయి. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు మధ్యప్రాచ్యంలో నెలకొన్న అస్థిరత, యుద్ధాన్ని ముగింపుకు తీసుకోవాల్సిన చర్యలు వంటి ప్రధాన సమస్యలపై ఈ దేశాలు చర్చించనున్నాయి.కాగా గాజాపై ఇజ్రాయెల్ దాడులను సౌదీ అరేబియా ఖండిస్తున్న విషయం తెలిసిందే. అదే విధంగా లెబనాన్ సమగ్రతను దెబ్బతీసే చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇక 2023లో జరిగిన అరబ్-ఇస్లామిక్ శిఖరాగ్ర సమావేశంలో గాజాపై దాడులను ఆపేందుకు, శాంతి స్థాపనకు కృషి చేసేందుకు సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి, ఈజిప్ట్, ఖతార్, జోర్డాన్, ఇండోనేషియా, నైజీరియా, తుర్కియే వంటి ఇస్లామిక్ దేశాల విదేశాంగ మంత్రులతో పాటు ఇస్లామిక్ కోఆపరేషన్ సంస్థ (ఓఐసీ) ప్రధాన కార్యదర్శులు అంగీకరించారు.ఇదిలా ఉండగా గతేడాది అక్టోబరు 7న హమాస్ తమ దేశంలోకి చొరబడి నరమేథానికి పాల్పడటంతో ఇజ్రాయేల్ ప్రతీకారం తీర్చుకునేందుకు యుద్దం ప్రకటించిన విషయం తెలిసిందే. గత ఏడాదిగా సాగుతున్న ఈయుద్ధం కారణంగా- గాజాలో 43,000 మంది పాలస్తీనీయులు మృతి చెందినట్లు అక్కడి ఆరోగ్య శాఖ తెలిపింది. అందులో సగానికిపై మహిళలు, చిన్నారులు ఉన్నట్లు వెల్లడించింది. ఇప్పటి వరకు 1,01,110 మంది గాయపడినట్లు పేర్కొంది. అయితే మృతుల్లో ఎంతమంది పౌరులు, మిలిటెంట్లు ఉన్నారనే వివరాలు వెల్లడించలేదు. -
అమిత్‌షాతో సీఎం ఓమర్ అబ్దుల్లా భేటీ.. రాష్ట్ర హోదాపై హామీ?
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఓమర్ అబ్దుల్లా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారు. న్యూఢిల్లీలో అరగంటపాటు జరిగిన ఈ సమావేశంలో.. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి కేంద్రం పూర్తి మద్దతునిస్తుందని అమిత్‌షా హామీ ఇచ్చినట్లు సమాచారం. అదే విధంగా జమ్ముకశ్మీర్‌కు తిరిగి రాష్ట్ర హోదా కల్పించడంపై హోంమంత్రి సానుకూలంగాస్పందించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర హోదా పునరుద్ధరణ ప్రక్రియను ప్రారంభించేందుకు కేంద్రం పూర్తి మద్దతునిస్తుందని హోంమంత్రి చెప్పినట్లు సమాచారం.కాగా జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తూ రాజ్యాంగం అందించిన 370 ఆర్టికల్ కేంద్రం 2019లో రద్దు చేసిన విషయం తెలిసిందే. జమ్ముకశ్మీర్ రాష్ట్ర హోదాను తొలగిస్తూ జమ్ము కశ్మీర్, లడఖ్ రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. అయితే ఇది జరిగిన అయిదేళ్ల తర్వాత రాష్ట్ర హోదాను పునరుద్దరించే ప్రక్రియను కేంద్రం ప్రారంభించే అవకాశం ఉంది. ఇక గత వారం జరిగిన మొదటి కేబినెట్ భేటీలో జమ్ముకశ్మీర్ రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వం ఓ తీర్మానాన్ని ఆమోదించిన విషయం తెలిసిందే. అబ్దుల్లా నేడు సాయంత్రం న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకుని ఆ తీర్మానం కాపీని సమర్పించే అవకాశం ఉంది.ఇదిలా ఉండగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అబ్దుల్లా నేషనల్ కాన్ఫరెన్స్ 90 స్థానాలకు గాను 42 స్థానాలను కైవసం చేసుకుని ఘన విజయాన్ని సాధించింది. దీంతో పార్టీ నేత ఓమర్ అబ్దుల్లా ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. -
జమ్మూకశ్మీర్ రాష్ట్రహోదా తీర్మానానికి ఎల్జీ ఓకే
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతానికి రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలంటూ ఒమర్ అబ్దుల్లా కేబినెట్ చేసిన తీర్మానానికి లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆమోదముద్రవేశారు. గురువారం సమావేశమై కేబినెట్ ఆమోదించిన తీర్మానానికి ఎల్జీ ఆమోదం తెలిపినట్లు అధికారిక వర్గాలు శనివారం వెల్లడించాయి. జమ్మూకశ్మీర్ ప్రజల గుర్తింపు, రాజ్యాంగబద్ధ హక్కులను తిరిగి పొందేందుకు పాత గాయాలను మాన్పే పూర్తిరాష్ట్ర హోదా పొందే ప్రక్రియలో ఈ తీర్మానం తొలి అడుగు అని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. జమ్మూకశ్మీరీల ప్రత్యేక గుర్తింపే నూతన ప్రభుత్వం అనుసరించనున్న విధాననిర్ణయాలకు భూమిక అని ఆయన అన్నారు. నవంబర్ నాలుగోతేదీన అసెంబ్లీ సమావేశాలు జరపనున్నారు. రాష్ట్ర పునరుద్ధరణకు సంబంధించిన విషయాలపై ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులతో చర్చించేందుకు సీఎం ఒమర్ త్వరలో ఢిల్లీకి వెళ్లనున్నారు. అయితే రద్దయిన 370 ఆరి్టకల్‌ను తిరిగి తీసుకొచ్చే విషయంలో ఎలాంటి తీర్మానాలు జరగకపోవడాన్ని విపక్షాలు తీవ్రంగా తప్పుబట్టాయి. కొలువుతీరిన కొద్దిరోజులకే ఒమర్ సర్కార్ అప్పుడే కేంద్రప్రభుత్వానికి లొంగిపోయిందని ఆగ్రహం వ్యక్తంచేశాయి. -
జమ్ముకశ్మీర్‌కు త్వరలో రాష్ట్రహోదా !
సాక్షి,న్యూఢిల్లీ: త్వరలో జమ్ముకశ్మీర్‌కు త్వరలో రాష్ట్ర హోదా పునరుద్ధరించే అవకాశాలున్నాయి. జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదా కోరుతూ కొత్తగా ఏర్పడ్డ సీఎం ఒమర్ అబ్దుల్లా నేతృత్వంలోని ప్రభుత్వం ఇటీవలే అసెంబ్లీలో తీర్మానం చేసింది.ఈ తీర్మానాన్ని రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్‌సిన్హా ఆమోదం తెలిపారు. దీంతో కేంద్ర ప్రభుత్వం జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్రహోదా ఇవ్వనుందన్న ప్రచారం జరుగుతోంది. గతంలో ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదా రద్దైన విషయం తెలిసిందే. ఇదీ చదవండి: తమిళనాడు గవర్నర్ వర్సెస్ స్టాలిన్ -
Jammu & Kashmir: రాష్ట్ర హోదా పునరుద్దరణకు తీర్మానం ఆమోదం
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ నూతన సీఎం ఓమర్ అబ్దుల్లా నేతృత్వంలోని కేబినెట్ రాష్ట్ర హోదా పునరుద్దరణకు తీర్మానాన్ని ఆమోదించింది. గురువారం జరిగిన మొదటి సమావేశంలో జమ్ముకశ్మీర్ మంత్రివర్గం రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఒక తీర్మానాన్ని ఆమోదించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి సురీందర్ చౌదరి, మంత్రులు సకీనా మసూద్ ఇటూ, జావేద్ అహ్మద్ రాణా, జావైద్ అహ్మద్ దార్, సతీష్ శర్మ హాజరయ్యారు.‘తీర్మానం ముసాయిదా సిద్ధం అయ్యింది. జమ్ముకశ్మీర్ రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని కోరుతూ తీర్మానం ముసాయిదాను ప్రధాని నరేంద్ర మోదీకి అందజేయడానికి ముఖ్యమంత్రి రెండు రోజుల్లో న్యూఢిల్లీకి వెళతారు’ అంటూ సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.కాంగ్రెస్ జమ్ముకశ్మీర్ అధ్యక్షుడు తారిఖ్ హమీద్ కర్రా విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్ర హోదాను పునరుద్ధరించకపోతే తమ పార్టీ కేబినెట్లో భాగం అవ్వదని వెల్లడించారు. జమ్ముకశ్మీర్‌కు త్వరలో రాష్ట్ర హోదాను కేంద్రం పునరుద్ధరిస్తుందని ఆశిస్తున్నట్లు నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా విశ్వాసం వ్యక్తం చేశారు."మేము రాజ్యాధికారం గురించి ఇంతకు ముందు కూడా మాట్లాడాము. ఇప్పుడు కూడా అదే కోరుతున్నాం. రెండు నెలల్లో రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని కోరుతూ దాఖలైన పిటిషిన్‌ను విచారించడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది. కేంద్ర ప్రభుత్వం త్వరలోదీనిని ఖచ్చితంగా పునరుద్ధరిస్తుందని భావిస్తున్నాను’ అని అబ్దుల్లా తెలిపారు. ఇదిలా ఉండగా 2019 ఆగస్టు 5న ఆర్టికల్ 370ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రద్దు చేసింది. కాశ్మీర్‌కు మంజూరు చేసిన ప్రత్యేక హోదా, స్వయంప్రతిపత్తి నికూడా రద్దు చేసింది. దాంతో పాటు, జమ్మూ కాశ్మీరు రాష్ట్ర హోదాను తొలగిస్తూ జమ్ము కశ్మీర్. అలాగే లడఖ్ రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది.. -
రాష్ట్ర హోదా త్వరగా రావాలి
శ్రీనగర్: కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కశ్మీర్‌కు తొలి సీఎంగా బుధవారం బాధ్య తలు స్వీకరించిన కొద్దిసేపటికే పీటీఐ వీడియోస్‌తో ఒమర్ అబ్దుల్లా ముఖాముఖి మాట్లాడారు. జమ్మూకశ్మీర్‌కు త్వరలోనే రాష్ట్ర హోదా వస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. ‘‘ కాంగ్రెస్ పార్టీతో కలిసి రాష్ట్ర హోదా సాధనకు కృషిచేస్తాం. త్వరలోనే రాష్ట్ర హోదా దక్కొచ్చని భావిస్తున్నాం. ఖాళీగా ఉన్న మంత్రిపదవుల భర్తీ కోసం కాంగ్రెస్‌తో చర్చలు జరుపుతున్నాం. కాంగ్రెస్‌తో బేధాభి ప్రాయా లు అబద్ధం. నిజంగానే సఖ్యత చెడితే ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక వంటి అగ్రనేతలు మా ప్రమాణ స్వీకార కార్య క్రమానికి రారుకదా. ప్రభు త్వంలో చేరాలా వద్దా అనేది వాళ్ల ఇష్టం. శాసనమండలి కూడా లేని జమ్మూ కశ్మీర్లో తక్కువ మంది మంత్రులతో ప్రభు త్వాన్ని నడపాలని భావిస్తున్నాం. గతంలోలాగా 40, 45 మంది మంత్రులుండే కాలం పోయింది. 2018 నుంచి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కశ్మీర్లో లేదు. తమ సమస్యల్ని పట్టించుకున్న నాథుడే లేడని ప్రజలు నిరాశలో కుంగిపోయారు. అందుకే కొత్తగా ఏర్పడిన మా ప్రభుత్వ తక్షణ కర్తవ్యం వారి సమస్యలను పరిష్కరించడమే. కేంద్రపాలిత ప్రాంతంగా కశ్మీర్‌ను పాలించడం కొత్త రకం సవాల్. అందివచ్చిన తొలి అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోవడం పెద్ద నేరంతో సమానం. గత తప్పిదాలు చేయబోను. కేజ్రీవాల్‌సహా దేశంలో పరిపా లనా అనుభవం ఉన్న కీలక వ్యక్తులు అందరి నుంచి పాఠాలు నేర్చుకుంటా’’ అని ఒమర్ వ్యాఖ్యానించారు. -
కశ్మీర్‌కు రాష్ట్ర హోదాపైనే తొలి తీర్మానం: ఒమర్ అబ్దుల్లా
శ్రీనగర్:తమ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే జమ్మూ-కశ్మీర్‌కు రాష్ట్ర హోదా ఇవ్వాలనే తీర్మానాన్ని ప్రధానికి సమర్పిస్తామని నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ)నేత ఒమర్అబ్దుల్లా అన్నారు.నియోజకవర్గాల పునర్విభజన,రాష్ట్ర హోదా వరుసగా ఉంటాయన్నారు.కొందరు నేతలు జమ్ముకశ్మీర్‌ను ఢిల్లీతో పోల్చడంపై ఒమర్ మండిపడ్డారు. కశ్మీర్‌ను ఢిల్లీతో పోల్చొద్దన్నారు.దేశ రాజధానికి రాష్ట్ర హోదా ఇస్తామని ఎవరూ చెప్పలేదన్నారు.కానీ కశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామని ప్రధాని,హోంమంత్రి హామీ ఇచ్చారని చెప్పారు.2019 వరకు జమ్మూకశ్మీర్ రాష్ట్రంగానే ఉందన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. కశ్మీర్లో శాంతిని నెలకొల్పి అభివృద్ధికి బాటలు వేయాలంటే రాష్ట్ర హోదా తప్పనిసరి అని పేర్కొన్నారు. -
జమ్మూకశ్మీర్‌కు రాష్ట్రహోదాపై రాహుల్ కీలక వ్యాఖ్యలు
జమ్మూ: జమ్మూకశ్మీర్ రాష్ట్ర హోదా కోసం పార్లమెంటుతో పాటు వీధుల్లోనూ పోరాడతామని లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ అన్నారు.జమ్మూలో బుధవారం(సెప్టెంబర్25) జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో రాహుల్ మాట్లాడారు.‘జమ్మకశ్మీర్ను లెఫ్టినెంట్ గవర్నర్‌తో పరిపాలించాలని బీజేపీ అనుకుంటోంది.ఎల్జీ పరిపాలన ఉన్నంత కాలం జమ్మూకశ్మీర్ ప్రజలకు నష్టం తప్ప ఏమీ ఉండదు.రాష్ట్రహోదా సాధించడంతో పాటు ఇక్కడి స్థానిక పరిశ్రమలను కాపాడతాం.లోయలోని సామాన్యులకు మేలు చేస్తాం. ముందు జమ్మూకశ్మీర్‌కు రాష్ట్రహోదా ఇస్తారనుకున్నాం. కానీ బీజేపీ ముందు ఎన్నికలకు వెళ్లింది.ఎన్నికల తర్వాత బీజేపీ గనుక రాష్ట్రహోదా ఇవ్వకపోతే కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇండియా కూటమి ప్రభుత్వం ఆ పనిచేస్తుంది’అని రాహుల్ మాటిచ్చారు. -
ఢిల్లీ నుంచి పాలించాలనుకోవడం అవివేకం
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలనే డిమాండ్‌ను రాహుల్ గాంధీ పునరుద్ఘాటించారు. ఢిల్లీ నుంచి జమ్మూకశ్మీర్‌ను పాలించాలనుకోవడం అవివేకమన్నారు. గత వారం ఆ రాష్ట్ర పర్యటన సందర్భంగా విద్యార్థినులతో రాహుల్ గాంధీ ముఖాముఖి మాట్లాడారు. ఆ వీడియోను కాంగ్రెస్ పార్టీ సోమవారం విడుదల చేసింది. ఈ వీడియోలో రాహుల్ గాంధీ జమ్ముకశ్మీర్‌లో జరగబోయే ఎన్నికల గురించి మాట్లాడుతూ, ఒక రాష్ట్రం నుంచి రాష్ట్ర హోదాను తొలగించడం భారత చరిత్రలో ఇదే మొదటిసారన్నారు. అది చేసిన విధానం తమకు నచ్చలేదని, రాష్ట్ర హోదాను తిరిగి పొందడం, అందులో జమ్మూకశ్మీర్, లద్దాఖ్ ప్రజలకు ప్రాతినిధ్యం ఉండటం తమ ప్రధాన లక్ష్యమని రాహుల్ తెలిపారు. ఢిల్లీ నుంచి కశ్మీర్‌ను, జమ్మూను నడపాలనుకోవడంలో అర్థం లేదని ఆయన కొట్టిపారేశారు. ‘‘ప్రధాని నరేంద్ర మోదీ ఎవరి మాటా వినరు. మొదటి నుంచి తాము చెప్పింది కరెక్ట్ అనుకుంటారు. అదే అసలు సమస్య. తనది తప్పని చూపించినా ఒప్పుకోరు. అలాంటి వ్యక్తులు నిత్యం ఏదో ఒక సమస్యను సృష్టిస్తారు. తాము చెప్పిందే కరెక్ట్ అనుకోవడం బలం కాదు.. బలహీనత. ఆత్మన్యూనత నుంచే ఇలాంటివి వస్తాయి’’అని రాహుల్ విద్యార్థులతో వ్యాఖ్యానించారు. మళ్లీ.. పెళ్లి మాట.. నవ్వులు ఇక రాహుల్‌గాంధీ నిత్యం ఎదుర్కొనే అత్యంత పెద్ద ప్రశ్నను విద్యార్థినుల నుంచి మరోసారి ఎదుర్కొన్నారు. సంభాషణలో భాగంగా పెళ్లి చేసుకోవాలనే ఒత్తిడి గురించి విద్యార్థినులను ఆయన అడగ్గా.. వెంటనే వారు రాహుల్‌ను అదే ప్రశ్న అడిగారు. అయితే తాను 20, 30 సంవత్సరాల నుంచి ఎదుర్కొంటున్నా ఆ ఒత్తిడిని అధిగమించానని చె ప్పారు. పెళ్లి చేసుకుంటారా? అని మరో విద్యార్థిని అడగ్గా.. ‘ఇప్పటికైతే ఆలోచన చేయలేదు.. భవిష్యత్‌లో చెప్పలేను’అని సమాధానమిచ్చారు. చేసుకుంటే మాత్రం మమ్మల్ని ఆహ్వానించండంటూ విద్యార్థినులంతా ఒకేసారి కోరారు. ‘తప్పకుండా’అని చెప్పడంతో విద్యార్థినుల నవ్వులతో ప్రాంతమంతా సందడిగా మారిపోయింది. యూట్యూబ్ ఛానల్లో వీడియో... ఇదే వీడియోను రాహుల్‌గాంధీ తన వ్యక్తిగత యూట్యూబ్ చానల్లోనూ పోస్టు చేశారు. వివిధ కళాశాలల్లో లా, ఫిజిక్స్, జర్నలిజం, పొలిటికల్ సైన్స్ వంటి సబ్జెక్టులను చదువుతున్న విద్యార్థుల సమస్యలను, ఆకాంక్షలను తాను లోతుగా అర్థం చేసుకున్నానని రాహుల్ ఆ పోస్టులో పేర్కొన్నారు. కోల్‌కతా ఘటన నేపథ్యంలో మహిళలపై వేధింపుల గురించి కూడా విద్యార్థినులతో మాట్లాడానని, ఇటువంటి ఘటనలు వ్యవస్థాగత సమస్యలను ఎలా ప్రతిబింబిస్తాయి, ప్రాంతాలకతీతంగా మహిళల భద్రత, గౌరవాన్ని ఎలా ప్రభావితం చేస్తాయని విద్యార్థులు తమ ఆందోళనలను పంచుకున్నారని వెల్లడించారు. కశ్మీర్ మహిళలకు గొప్ప శక్తి, నిలదొక్కుకునే ధైర్యం, వివేకం ఉన్నాయని, ఒక్కసారి వారికి అవకాశం ఇస్తే అద్భుతాలు చేసి చూపుతారని కొనియాడారు. వారికి గౌరవం, భద్రతతోపాటు సమాన అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని రాహుల్ నొక్కి చెప్పారు. -
అక్టోబర్‌లో కశ్మీర్‌కు తిరిగి రాష్ట్ర హోదా
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌కు అక్టోబర్‌లో రాష్ట్ర హోదా పునరుద్ధరణతోపాటు అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారిత శాఖ సహాయ మంత్రి రాందాస్ అథవాలె చెప్పారు. శ్రీనగర్‌లో గురువారం ఆయన మీడియాతో మాట్లా డారు. ‘మహారాష్ట్ర, హరియాణా, జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీలకు అక్టోబర్‌లో ఎన్నికలు జరగనున్నాయి. వీటితోపాటు జమ్మూకశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయి. అప్పుడే జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరణ ప్రకటన వెలువడే అవకాశాలు కూడా ఉన్నాయి’అని మంత్రి అథవాలె వివరించారు. జమ్మూకశ్మీర్ రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామంటూ గతంలో ఆర్టికల్ 370 రద్దు సమయంలోనే హోం మంత్రి అమిత్ షా ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. -
నాగాలాండ్: ఆరు జిల్లాల్లో జీరో పోలింగ్
కోహిమా: లోక్‌సభ ఎన్నికల పోలింగ్ సందర్భంగా నాగాలాండ్‌లో అరుదైన రికార్డు నమోదైంది. రాష్ట్రంలో ఉన్న ఒకే ఒక ఎంపీ సీటుకు శుక్రవారం(ఏప్రిల్19) పోలింగ్ జరిగింది. అయితే ఈ పోలింగ్‌కు ఆరు జిల్లాల ప్రజలు దూరంగా ఉన్నారు. ఈ ఆరు జిల్లాల్లో ఉన్న నాలుగు లక్షల ఓటర్లలో ఒక్కరంటే ఒక్కరు కూడా ఒంటి గంటవరకు ఓటు వేయడానికి రాకపోవడం గమనార్హం. ఆరు జిల్లాలు కలిపి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలన్న తమ డిమాండ్‌ను పరిష్కరించనందున ఓటింగ్‌కు దూరంగా ఉండాలని ద ఈస్టర్న్ నాగాలాండ్ పీపుల్స్ ఆర్గనైజేషన్(ఈఎన్‌పీవో) పిలుపునిచ్చింది. ఈ పిలుపుతో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు. ఆరు జిల్లాల్లో ఈఎన్‌పీవో పబ్లిక్ ఎమర్జెన్సీని ప్రకటించింది. ఆరు జిల్లాలతో కలిపి ఫ్రాంటియర్ నాగాలాండ్ టెరిటరీ(ఎఫ్ఎన్టీ) ఏర్పాటు చేయాలని ఈఎన్‌పీవో పోరాడుతోంది. మొత్తం ఆరు గిరిజన సంఘాలు కలిసి ఈఎన్‌పీవోను ఏర్పాటు చేశాయి. ఇదీ చదవండి.. కొనసాగుతున్న లోక్‌సభ ఎన్నికల తొలివిడత పోలింగ్ -
Narendra modi: జమ్మూకశ్మీర్‌కు త్వరలో రాష్ట్ర హోదా
ఉద్ధంపూర్/జైపూర్: జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు ఇక ఎంతోదూరంలో లేవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరిస్తామని, శాసన సభ ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించారు. ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యేలతో, మంత్రులతో చెప్పుకోవచ్చని తెలియజేశారు. గతంలో జమ్మూకశ్మీర్‌లో వేర్పాటువాదుల నుంచి ఎన్నికల బహిష్కరణ పిలుపులు వినిపించేవని, ప్రస్తుతం అవన్నీ చరిత్రలో కలిసిపోయాయని పేర్కొన్నారు. సీమాంతర ఉగ్రవాదం, బాంబు దాడులు, రాళ్ల దాడులు, కాల్పులు, ఘర్షణలు, భయాందోళనల ప్రసక్తి లేకుండా ఇక్కడ సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా జరుగబోతున్నాయని చెప్పారు. శుక్రవారం జమ్మూకశ్మీర్‌లోని ఉద్ధంపూర్‌లో, రాజస్తాన్‌లోని బార్మర్‌లో ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని మోదీ మాట్లాడారు. రాజస్తాన్ రాష్ట్రం దౌసాలో రోడ్‌షోలో పాల్గొన్నారు. జమ్మూకశ్మీర్ ప్రజల సమస్యలు పరిష్కరిస్తానంటూ ఇచి్చన హామీని నిలబెట్టుకున్నానని తెలిపారు. ఆ అడ్డుగోడ కూల్చేశాం.. శకలాలు సమాధి చేశాం ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్‌లో అభివృద్ధి వేగవంతమైందని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. ప్రభుత్వంపై ప్రజల విశ్వాసం మరింత పెరిగిందని అన్నారు. గతంలో వైష్ణోదేవి, అమర్నాథ్ భక్తుల భత్రతకు ముప్పు ఉండేదని, ఇప్పుడు పరిస్థితి మారిపోయిందని వెల్లడించారు. గతంలో కుటుంబ పార్టీల నిర్వాకం వల్ల జమ్మూకశ్మీర్ ఎంతో నష్టపోయిందన్నారు. ఆర్టికల్ 370 అనే అడ్డుగోడను సృష్టించింది కుటుంబ పార్టీలేనని మండిపడ్డారు. ఈ ఆర్టికల్ వల్ల ప్రజలకు రక్షణ లభిస్తుందన్న భ్రమను కుటుంబ పారీ్టలు కలి్పంచాయని ధ్వజమెత్తారు. ప్రజల అండతో ఈ అడ్డుగోడను కూలి్చవేశామని, దాని శకలాలను సైతం సమాధి చేశామని వ్యాఖ్యానించారు. ఓ వర్గం ఓట్ల కోసమే మాంసాహార వీడియోలు విపక్ష ‘ఇండియా’ కూటమిది మొఘల్ రాజుల మైండ్‌సెట్ అని ప్రధానమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అయోధ్యలో రామమందిరం బీజేపీ ఎన్నికల ఎత్తుగడ అంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టారు. రామాలయం కోట్లాది మంది ప్రజల విశ్వాసానికి సంబంధించిన అంశమని అన్నారు. రామజన్మభూమి అంశానికి 500 ఏళ్ల చరిత్రఉందని, అప్పట్లో ఎన్నికలు లేవని చెప్పారు. మొఘల్ పాలకులు ఆలయాలను కూలి్చవేసి, మెజార్టీ ప్రజల మనోభావాలను గాయపర్చి ఆనందిస్తూ ఉండేవారని తెలిపారు. అదే ఆలోచనాధోరణితో విపక్షాలు వ్యవహరిస్తున్నాయని తప్పుపట్టారు. కాంగ్రెస్‌తోపాటు ప్రతిపక్ష నాయకులు ఓ వర్గం ప్రజలను సంతృప్తిపర్చి ఓట్లు దండుకోవడానికి పవిత్ర మాసాల్లో, నవరాత్రుల్లో మాంసాహారం తింటూ, ఆ వీడియోలను ఉద్దేశపూర్వకంగా ప్రచారంలోకి తీసుకొస్తున్నారని దుయ్యబట్టారు. దేశాన్ని శక్తిహీనంగా మారుస్తారా? భారత రాజ్యాంగాన్ని బీజేపీ ఎంతగానో గౌరవిస్తోందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తారంటూ విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. బాబాసాహెబ్ బీఆర్ అంబేడ్కర్ ఇప్పుడొచ్చినా రాజ్యాంగాన్ని రద్దు చేయలేరని అన్నారు. ప్రభుత్వానికి రాజ్యాంగం భగవద్గీత, రామాయణం, మహాభారతం, బైబిల్, ఖురాన్ లాంటిందని అన్నారు. తమకు రాజ్యాంగమే సమస్తం అని వివరించారు. కేంద్రంలో అధికారంలోకి వస్తే దేశంలో అణ్వాయుధాలను పూర్తిగా నిర్మూలిస్తామని విపక్ష ఇండియా కూటమిలోని భాగస్వామ్యపక్షాలు చెబుతున్నాయని మోదీ తప్పుపట్టారు. మనకు ఇరువైపులా అణ్వాయుధ సంపత్తి కలిగిన దేశాలున్నాయని చెప్పారు. మనకు అణ్వాయుధాలు లేకపోతే ఏం జరుగుతుందో తెలియదా? అని నిలదీశారు. మీరు ఎవరు ఆదేశాలతో పని చేస్తున్నారో చెప్పాలని ఇండియా కూటమిని నిలదీశారు. దేశాన్ని శక్తిహీనంగా మార్చడమే ఇండియా కూటమి లక్ష్యమా? అని ప్రధానమంత్రి మోదీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. -
జమ్మూ కాశ్మీర్‌పై ప్రధాని కీలక ప్రకటన
ఉదంపూర్: జమ్మూకాశ్మీర్‌కు త్వరలో రాష్ట్ర హోదా వస్తుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే సమయం దూరంలో లేదన్నారు. జమ్మూకాశ్మీర్ ఉదంపూర్‌లో శుక్రవారం(ఏప్రిల్12) లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాని పాల్గొన్నారు. ‘మోదీ చాలా దూరం ఆలోచిస్తాడు. ఈ పదేళ్లలో జరిగింది ట్రైలర్ మాత్రమే. జమ్మూకాశ్మీర్‌లో అద్భుతమైన సినిమా ముందు ముందు చూపించే పనిలో నేను బిజీ అవ్వాల్సి ఉంది. మీ కలలు మీరు త్వరలో మీ ఎమ్మెల్యేలతో, మంత్రులతో చెప్పుకుని నెరవేర్చుకునే రోజు దగ్గర్లోనే ఉంది’అని ప్రధాని అన్నారు. ఇదీ చదవండి.. ఢిల్లీలో రాష్ట్రపతి పాలన.. మంత్రి సంచలన కామెంట్స్ -
లఢక్‌లో రాష్ట్ర హోదా రగడ
లఢఖ్: రాష్ట్ర హోదా కల్పించాలని కోరుతూ లఢఖ్‌లో నిరసనలు మిన్నంటాయి. ప్రధానంగా నాలుగు అంశాలను నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. లడఖ్‌కు రాష్ట్ర హోదా, గిరిజన హోదా, స్థానికులకు ఉద్యోగ రిజర్వేషన్లు కల్పించడం, లడఖ్, కార్గిల్‌కు ఒక్కో పార్లమెంటరీ సీటు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. లఢఖ్ అంతటా పూర్తి బంద్‌కు పిలుపునిచ్చారు. శనివారం లడఖ్‌లోని లేహ్ జిల్లాలో భారీ నిరసన ర్యాలీలు చేశారు. లేహ్ అపెక్స్ బాడీ (LAB), కార్గిల్ డెమోక్రటిక్ అలయన్స్ (KDA) ఈ ప్రాంతంలో బంద్‌కు పిలుపునిచ్చింది. లడఖ్‌కు రాష్ట్ర హోదా, గిరిజన హోదాను డిమాండ్ చేస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు మెమోరాండం కూడా జనవరి 23నే సమర్పించారు. లడఖ్‌కు రాష్ట్ర హోదా కల్పించడానికి 2019 నాటి జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని సవరించే బిల్లు ముసాయిదాను కూడా ప్రతినిధులు సమర్పించారు. లేహ్ అపెక్స్ బాడీ, కార్గిల్ డెమోక్రటిక్ అలయన్స్ న్యాయ సలహాదారు హాజీ గులాం ముస్తఫా మాట్లాడుతూ.. " లడఖ్ యూటిగా మారినప్పటి నుండి అపెక్స్ బాడీ, కేడీఏ నాలుగు రకాల డిమాండ్లను లేవనెత్తింది. ఇక్కడ మా అధికారాలు బలహీనపడ్డాయి. జమ్మూ కాశ్మీర్లో భాగంగా ఉన్నప్పుడు మాకు అసెంబ్లీలో నలుగురు, శాసన మండలిలో ఇద్దరు సభ్యులు ఉన్నారు. ఇప్పుడు మాకు అసెంబ్లీలో ప్రాతినిధ్యమే లేదు." అని అన్నారు. లడఖ్ - లేహ్, కార్గిల్‌లోని రెండు ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న రెండు సంస్థల ప్రతినిధులతో హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ అధ్యక్షతన ఉన్నత స్థాయి కమిటీ సమావేశాలు నిర్వహిస్తున్నందున క్రమంలో ఈ నిరసనలు వెల్లువెత్తాయి. డిసెంబరు 4న జరిగిన చివరి భేటీలో రెండు సంస్థల నుంచి డిమాండ్ల జాబితాను మంత్రిత్వ శాఖ లిఖితపూర్వకంగా కోరింది. ఇదీ చదవండి: బలపరీక్షలో సోరెన్ పాల్గొనవచ్చు -
జమ్ములో ఎన్నికల నిర్వహణకు సిద్ధం: కేంద్రం
ఢిల్లీ: జమ్ము కశ్మీర్ స్వయంప్రతిపత్తికి సంబంధించిన ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా దాఖలైన పలు పిటిషన్లపై గురువారం సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. జమ్ముకు రాష్ట్ర హోదా ఎప్పుడు పునరుద్దరిస్తుందనే అంశంపై ఇవాళ సుప్రీంకు కేంద్రం ఒక స్పష్టత ఇవ్వాల్సి ఉంది. ఈ క్రమంలో వాదనలు వినిస్తున కేంద్రం.. అక్కడ ఎన్నికల నిర్వహణకు సిద్ధమని కేంద్రం స్పష్టం చేసింది. జమ్మూకశ్మీర్‌లో ఎన్నికల నిర్వహణ పూర్తిగా ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం చేతుల్లో ఉందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చెప్పారు. మొత్తం మూడు దశల్లో ఎన్నికలు జరగాల్సి ఉందని ధర్మాసనానికి తెలిపారు. పంచాయతీ, మున్సిపల్, అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగాలని చెప్పారు. అలాగే.. జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదా కల్పించే అంశానికి కాల వ్యవధిని నిర్ణయించలేమని తుషార్ మెహతా సుప్రీంకోర్టు ధర్మాసనానికి స్పష్టం చేస్తూనే.. కేంద్ర పాలిత ప్రాంతంగా తాత్కాలికమేనని పేర్కొన్నారు. పూర్తి రాష్ట్రంగా మార్చడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. జమ్మూ కశ్మీర్‌ని గణనీయమైన స్థాయిలో అభివృద్ధి చేసినట్లు సుప్రీంకోర్టుకు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. కొత్త ప్రాజెక్టులు భారీ స్థాయిలో వస్తున్నాయని చెప్పారు. ఉగ్రవాద చర్యలు 42.5 తగ్గాయని వెల్లడించారు. చొరబాటు ఘటనలు 90.20 శాతం తగ్గాయని తెలిపారు. 2023లోనే ఏకంగా కోటి మంది పర్యటకులు కశ్మీర్ లోయను సందర్శించారని పేర్కొన్నారు. Petitions challenging the abrogation of Article 370 in SC | Solicitor General Tushar Mehta, appearing for Centre, tells Supreme Court that it is ready for elections in Jammu and Kashmir at any time now. pic.twitter.com/mhiqqWPBbf — ANI (@ANI) August 31, 2023 జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా కల్పించే అంశంలో కేంద్రం నేడు కీలక ప్రకటన చేయనుంది. నాలుగేళ్లుగా కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్న జమ్మూకశ్మీర్‌కు ఎప్పుడు రాష్ట్ర హోదా కల్పించనున్నారనే సమాచారాన్ని నేడు సుప్రీంకోర్టుకు నివేదించనుంది. ఆర్టికల్ 370 రద్దును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. మంగళవారం పిటీషనర్ల వాదనలు విన్న తర్వాత సీజేఐ చంద్రచూడ్.. జమ్మూ కశ్మీర్లో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు ఎప్పటివరకు ఈ ప్రక్రియను పూర్తి చేస్తారో కూడా తెలపాలని ప్రశ్నించారు. #BREAKING Supreme Court asks when the Statehood of Jammu and Kashmir will be restored. Asks when elections will be allowed. Asks SG to get instructions on a definition timeline.#JammuKashmir #Article370 https://t.co/SK9wl5B5Ia — Live Law (@LiveLawIndia) August 29, 2023 ఈ క్రమంలో వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదాపై సానుకూల అంశాన్ని గురువారం తెలుపుతామని ధర్మాసనానికి విన్నవించారు. జమ్మూ కశ్మీర్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా తాత్కాలికంగానే ఉంచనున్నామని, లఢక్ మాత్రం యూనియన్ టెరిటరీగానే ఉంటుందని కోర్టుకు ఆయన స్పష్టం చేశారు. Justice Kaul: suppose you carve out portion of assam into a union territory and also make assam into a UT.. SG: Too extreme an example..... but one state cannot be declared a UT under article 3... but there needs to be separation... CJI: creation of UTs post independence..… — Bar & Bench (@barandbench) August 29, 2023 జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదాను కల్పిస్తున్న ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ 2019లో కేంద్రం నిర్ణయం తీసుకుంది. ప్రతిపక్ష నాయకులు విమర్శలను పక్కకు పెట్టి ఆ రాష్ట్రాన్ని లఢక్, జమ్మూ కశ్మీర్ రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానమిస్తూ.. అక్కడ పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చాక మళ్లీ రాష్ట్ర హోదా కల్పిస్తామని అప్పట్లో ప్రభుత్వం తెలిపింది. ఇదీ చదవండి: రక్షా బంధన్ రోజున ఇలాంటి తీర్పు ఇస్తాననుకోలేదు -
Russia-Ukraine War: అనుకున్నదొక్కటి.. అయినది ఒక్కటి!
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం రెండో ఏడాదిలోకి చొరబడింది. దురాక్రమణ ప్రయత్నాలు జోరుగా కొనసాగుతూనే ఉన్నాయి. ఏడాది మారణహోమం తర్వాత కూడా వ్లాదిమిర్ వ్లాదిమిరోవిచ్ పుతిన్ రాజ్యకాంక్ష ఏమాత్రం చల్లారలేదు. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా ఉక్రెయిన్‌పై ఉరుకులు పరుగుల మీద విరుచుకుపడ్డ రష్యాకు, తన అస్త్రాలేవీ పనికిరాకుండా పోయాయని జ్ఞానోదయం కలగడానికి ఎంతోసేపు పట్టలేదు. బాహుబలిగా కాలుదువ్విన పుతిన్ ఏడాది తిరిగేసరికి ప్రపంచం దృష్టిలో విలన్ అయ్యారు. సొంత ప్రజల దృష్టిలోనూ బాహుబలి హోదాను ఒకింత కోల్పోయారు. ఇంతకీ పుతిన్ ఊహించినదేమిటి? ఆయనకు ఎదురైందేమిటి...? ఎస్ రాజమహేంద్రారెడ్డి: పూర్వపు సోవియట్ యూనియన్ రిపబ్లిక్కులన్నింటినీ మళ్లీ ఒకే తాటిమీదకు తేవాలన్నది తన లక్ష్యమని పుతిన్ చెప్పుకుంటారు. పొరుగు దేశాలైన ఉక్రెయిన్, బెలారస్ కూడా ఒకప్పుడు రష్యాలో అంతర్భాగమేనని అంటారాయన. రెండేళ్ల క్రితం ఆయన రాసిన ఓ సుదీర్ఘ వ్యాసంలో కూడా ఈ విషయాన్ని సుస్పష్టం చేశారు. బెలారస్‌తో రష్యాకు ఎలాంటి విభేదాలూ లేవు. పైగా ఉక్రెయిన్‌పై దాడిలో రష్యాకు ఆదినుంచీ అది వెన్నుదన్నుగా ఉంది. రష్యా తొలుత ఉక్రెయిన్‌లో చొరబడేందుకు తన భూభాగాన్ని అనుమతించింది కూడా. ఎటొచ్చీ పుతిన్‌కు పేచీ అల్లా ఉక్రెయిన్‌తోనే! ఆ దేశ సార్వభౌమత్వాన్ని గుర్తించడానికి కూడా రష్యా ఎన్నడూ ఇష్టపడలేదు. రష్యా, ఉక్రెయిన్ ఒకే దేశమన్నదే పుతిన్ గట్టి నమ్మకం. లోగుట్టు వేరే నిగూఢంగా చూస్తే మాత్రం, ఈ గొడవంతా పైపై పటారమే. అసలు విషయం ఏమిటంటే సుదీర్ఘ కాలం పాటు రష్యాకు తిరుగులేని నాయకునిగా వెలిగిపోవాలన్నది పుతిన్‌లో అంతర్లీనంగా ఉన్న ఆశగా చెప్తారు. మూడేళ్ల క్రితం ఆయన ఆ దిశగా ప్రయత్నం చేశారు. ప్రజాభిప్రాయ సేకరణతో రాజ్యాంగాన్ని మార్చి అధ్యక్షునిగా 16 ఏళ్లపాటు నిరాటంకంగా కొనసాగేలా కొత్త చట్టం తెచ్చేందుకు క్రెమ్లిన్ ప్రయత్నించింది. ఆ సమయంలో రష్యా టీవీ పుతిన్ కీర్తనలు, గుణగానాలతో హోరెత్తేది. ‘కల్లోల సాగరంలాంటి ప్రపంచంలో రష్యా నౌకను సమర్థంగా నడిపిస్తున్న కెప్టెన్ పుతిన్’ అంటూ ఊదరగొట్టేవారు. క్రెమ్లిన్ దృష్టిలో పుతిన్ సకల కళావల్లభుడు, సకలశాస్త్ర పారంగతుడు. అందుకే జూడో, రేసింగ్, స్విమ్మింగ్, హార్స్ రైడింగ్ విన్యాసాల్లో పుతిన్ సాహసకృత్యాల తాలూకు ఫొటోలను తరచూ ప్రపంచం ముందుకు తెస్తూంటుంది క్రెమ్లిన్. రష్యా ప్రజలను ప్రభావితం చేసి పుతిన్ పట్ల ఆరాధనా భావాన్ని పెంపొందించే ప్రయత్నాల్లో క్రెమ్లిన్ ఎంచుకున్న మార్గమిది. అసలు విషయమేమిటంటే 2024లో రష్యా అధ్యక్ష ఎన్నికలున్నాయి. ఆలోపు ఏదో ఒక ఘనకార్యం చేసి పుతిన్ కీర్తిని అమాంతం పెంచేయడం క్రెమ్లిన్ లక్ష్యం. పశ్చిమ దేశాల కనుసన్నల్లో సాగుతున్న ఉక్రెయిన్ను ఓ దారికి తెస్తే బాహుబలి పుతిన్ సత్తా ఏమిటో తెలుస్తుందని, అధ్యక్ష ఎన్నికల్లో మంచి ప్రచారాస్త్రంగా మారుతుందని క్రెమ్లిన్ థింక్‌టాంక్ అంచనా. అనుకున్నదే తడవుగా దాడికి దిగడం, ఆరంభంలో కొన్ని ప్రాంతాను ఆక్రమించి ఎగిరి గంతెయ్యడం... తర్వాత ఉక్రెయిన్ధాటికి తట్టుకోలేక వాటిని వదిలేసి తోకముడవడం చకచకా జరిగిపోయాయి. అయినా సరే, ఇప్పటికీ ఉక్రెయిన్‌పై దాడిని తప్పుగా పుతిన్ అంగీకరించడం లేదు. రెండు మూడు రోజుల క్రితం మాట్లాడుతూ ఇదంతా పశ్చిమ దేశాల కుట్రేనని సెలవిచ్చారు! దానికి జవాబుగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఏకంగా ఉక్రెయిన్ యుద్ధభూమిలో అడుగుపెట్టారు! ఈ పోరులో తమ వైఖరిని మరోసారి కుండబద్ధలు కొట్టారు. ఉక్రెయిన్ను గెలవడం రష్యా తరం కాదని అక్కడే మీడియాముఖంగా ప్రకటించేశారు. బహుశా పుతిన్ కూడా ఇలాంటి సవాలు కోసమే ఎదురు చూస్తున్నట్టున్నారు! ఏదోలా వచ్చే ఏడాది రష్యా అధ్యక్ష ఎన్నికల దాకా యుద్ధం కొనసాగాలన్నదే ఆయన అభిమతమని పరిశీలకుల అంచనా. యుద్ధం సమాధుల మీద 2024 అధ్యక్ష ఎన్నికలను నెగ్గాలని పుతిన్ భావిస్తున్నట్టు చెబుతున్నారు. ఆపద్ధర్మ పాత్రతో మొదలై... 1999లో బోరిస్ యెల్సిన్ ఆకస్మిక రాజీనామాతో ఆపద్ధర్మ అధ్యక్షునిగా తొలిసారి గద్దెనెక్కిన పుతిన్ 2000–2004, 2004–08ల్లో రెండు దఫాలుగా అధ్యక్షునిగా కొనసాగారు. అప్పట్లో రష్యా అధ్యక్ష పదవీకాలం నాలుగేళ్లే. తర్వాత 2008 నుంచి 2012 దాకా ఆయన ప్రధానిగా ఉన్నారు. ఈ దశలో రాజ్యాంగ సవరణల ద్వారా అధ్యక్ష పదవీకాలాన్ని ఆరేళ్లకు పెంచారు. తర్వాత 2012 నుంచి 2018 దాకా, 2018 నుంచి ఇప్పటిదాకా పుతిన్ అధ్యక్షునిగా కొనసాగుతున్నారు. 2024 మార్చితో పదవీకాలం ముగుస్తుంది. ఒక వ్యక్తి వరుసగా రెండుసార్లకు మించి అధ్యక్షునిగా ఉండరాదన్న నిబంధనను కూడా రాజ్యాంగ సవరణ ద్వారా మార్చారు. ఫలితంగా 2024తో పాటు 2030 ఎన్నికల్లోనూ పోటీ చేసే అవకాశం పుతిన్‌కు సంక్రమించింది. ఈ రెండుసార్లూ గెలిస్తే 2036 దాకా ఆయనే రష్యా అధినేతగా చక్రం తిప్పుతారు. అలా ఒకే దెబ్బకు రెండు పిట్టల్లా ఒకే యుద్ధంతో అటు రాజ్యకాంక్షను, ఇటు పదవీకాంక్షనూ నెరవేర్చుకోవాలని పుతిన్ పట్టుదలగా ఉన్నారు. అందుకే యుద్ధానికి ఇప్పుడప్పట్లో ముగింపు పలికేందుకు ససేమిరా అంటున్నారు. యుద్ధంలో వెనకబడుతున్నట్టు అన్పించినప్పుడల్లా అణ్వాయుధ బూచితో ప్రపంచాన్ని బెదిరిస్తున్నారు. అటు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా అమెరికా మద్దతుతో లొంగేది లేదంటూ దీటుగా తలపడుతున్నారు. చివరికి గెలుపెవరిదైనా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం మాత్రం వైరి వర్గాలు రెండింటినీ వెంటాడుతూనే ఉంటాయి. చరిత్ర చెక్కిలిపై యుద్ధం ఎప్పుడూ ఓ కన్నీటి బిందువే! చెరిగిపోని మచ్చే!! కొసమెరుపు ఏడాది యుద్ధం బాహుబలిగా వ్లాదిమిర్ పుతిన్‌కున్న పేరుప్రతిష్టలను బలి తీసుకుంటే, పూర్వాశ్రమంలో సినిమాల్లో కమేడియన్ పాత్రలు పోషించిన వొలోదిమిర్ జెలెన్స్కీని మాత్రం నిజజీవితంలో హీరోను చేసింది! -
లద్దాఖ్‌లో కేంద్రానికి ఎదురుదెబ్బ!
లద్దాఖ్: జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది కేంద్ర ప్రభుత్వం. కశ్మీర్ ప్రాంత అభివృద్ధి, ప్రజలకు సుపరిపాలన, భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది. అయితే, లద్దాఖ్‌కు రాష్ట్ర హోదా కల్పించటం, ఆరవ అధికరణ ప్రకారం ప్రత్యేక హోదా ఇవ్వాలని అక్కడి నేతలు కొద్ది రోజులుగా నిరసనలు తెలుపుతున్నారు. ప్రజాగ్రహాన్ని తొలగించేందుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీ వేశారు. అయితే, ఈ ప్యానల్లో భాగమయ్యేందుకు నిరాకరించారు లద్దాఖ్ నేతలు. కేంద్ర పాలిత ప్రాంతంగా ఉండడం కన్నా జమ్ముకశ్మీర్‌తో కలవడమే మంచిదనే అభిప్రాయం వ్యక్తం చేయడంతో కేంద్రానికి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ఈ కమిటీ కార్యకలాపాల్లో భాగం కాకూడదని అపెక్స్ బాడీ ఆఫ్ లద్దాఖ్, కార్గిల్ డెమొక్రాటిక్ అలియాన్స్ ఏకగ్రీవంగా నిర్ణయించింది. తమ డిమాండ్లను తీర్చే వరకు ప్యానల్‌తో కలిసేది లేదని తేల్చి చెప్పారు. ‘ప్రస్తుత పరిస్థితుల ప్రకారం.. పూర్వ జమ్మూకశ్మీర్‌లో కలవడమే మంచిదనే భావన కలుగుతోంది.’అని పేర్కొన్నారు అపెక్స్ బాడీ ఆఫ్ లేహ్, లద్దాఖ్ బుద్దిస్ట్ అసోసియేషన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఛేరింగ్ డోర్జయ్. రాష్ట్ర హోదా, ప్రత్యేక హోదా కల్పించకుండా కమిటీని ఏర్పాటు చేసి లద్దాఖ్ ప్రజలను కేంద్రం పిచ్చివారిని చేయాలని చూస్తోందని ఆరోపించారు. కమిటీ అజెండాలో ఉద్యోగ భద్రత, లద్దాఖ్ ప్రజల గుర్తింపు, భూభాగాన్ని పరిరక్షిస్తామని చెబుతున్నారని, అయితే ఏ చట్టం, షెడ్యూల్ ప్రకారం చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఏడాది క్రితం రాష్ట్ర హోదా, ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ లద్దాఖ్‌లో ఆందోళనలు మొదలయ్యాయి. లద్దాఖ్‌లో చైనాతో సరిహద్దు వివాదాల వేళ ఈ నిరసనలు కేంద్ర ప్రభుత్వానికి పెద్ద సవాల్‌గా మారాయి. ఇదీ చదవండి: ‘ఎయిరిండియా’ ఘటనపై టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ కీలక వ్యాఖ్యలు -
కశ్మీర్ పర్యటనలో రాహుల్ గాంధీ తీవ్ర భావోద్వేగం..
శ్రీనగర్: రెండేళ్ల తర్వాత జమ్మూ కశ్మీర్ పర్యటనకు వచ్చిన కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తిరిగి తన సొంత ఉంటికి వచ్చినట్టుందని అన్నారు. శ్రీనగర్‌లో మంగళవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన రాహుల్ కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. ‘నా కుటుంబం ఢిల్లీలో నివసిస్తోంది. అంతకు ముందు అలహాబాద్‌లో ఉండేవారు. దానికంటే ముందు నా కుటుంబం కశ్మీర్‌లోనే ఉండేది. నా తాత ముత్తాతలు ఈ జీలం నది నీళ్లు తాగే బతికారు. అందుకే కశ్మీరీయత్ (ఈ ప్రాంత సంస్కృతి, సంప్రదాయాలు) నా నరాల్లో ఎంతో కొంత జీర్ణించుకొని పోయింది. ఇక్కడికి రాగానే తిరిగి సొంతింటికి వచ్చిన అనుభూతి కలిగింది’’ అని రాహుల్ ఉద్వేగభరితంగా మాట్లాడారు. ప్రేమ, గౌరవం ఈ రెండింటి ద్వారానే ఏదైనా సాధించాలి తప్ప విద్వేషం, బలవంతంతో ఒరిగేదేమీ లేదన్నారు. ‘‘కశ్మీర్‌కు లోక్‌సభలో ఎక్కువ స్థానాలు లేవు. ప్రస్తుతం దీనికి రాష్ట్ర హోదా కూడా లేదు. కానీ మీ సంస్కృతి సంప్రదాయాలే కశ్మీర్‌కు బలం. కశ్మీరీయత్ దేశానికి పునాది వంటిది. ఆ భావం నాలో కూడా ఉంది. అందుకే ప్రేమ, గౌరవం అనే సందేశాన్ని ఇవ్వడానికే ఇక్కడికి వచ్చాను’’ అని రాహుల్ అన్నారు. 2019 ఆగస్టులో కేంద్రం కశ్మీర్ స్వయంప్రతిపత్తిని రద్దు చేసిన తర్వాత రాహుల్ గాంధీ శ్రీనగర్‌కు వస్తే అధికారులు విమానాశ్రయం నుంచి ఆయన్ను వెనక్కి పంపేవారు. ఈ విషయాన్ని గుర్తు చేసిన రాహుల్ జమ్మూ, లద్దాఖ్‌లలో కూడా పర్యటిస్తానని చెప్పారు. ప్రధాని విభజన సిద్ధాంతంపై పోరాటం కొనసాగుతుంది: రాహుల్ సమాజాన్ని విభజించాలని చూస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సిద్ధాంతాలపై తమ పోరాటం కొనసాగుతుందని రాహుల్ గాంధీ అన్నారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో పెగసస్, రైతు సమస్యలు, అవినీతి ఇలా ఏ అంశంపైనా చర్చకు అంగీకరించడం లేదని విరుచుకుపడ్డారు. ప్రధాని విభజన సిద్ధాంతాలతో దేశమే ముక్కలయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘బీజేపీ మన వ్యవస్థలపై దాడి చేస్తోంది. న్యాయవ్యవస్థ, అసెంబ్లీ, పార్లమెంటు ఇలా అన్నింటిపైనా దాడికి దిగుతోంది. చివరికి మీడియాను కూడా తన గుప్పిట్లో ఉంచుకుంది. మీడియా మిత్రుల్ని బెదిరిస్తూ ఉండటంతో వారు తమ విధుల్ని కూడా నిర్వహించలేకపోతున్నారు. ఇది దేశంపై జరుగుతున్న దాడి’’ అని రాహుల్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికలకు ముందే రాష్ట్ర హోదా ఇవ్వాలి జమ్ము కశ్మీర్లో ఎన్నికలు నిర్వహించడానికి ముందే రాష్ట్ర హోదా కట్టబెట్టాలని రాహుల్ గాంధీ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ముందుగా రాష్ట్ర హోదా పునరుద్ధరించాక ఎన్నికలు నిర్వహించడం ప్రజాస్వామ్యబద్ధంగా జరిగే ప్రక్రియ అని అన్నారు. అంతకు ముందుమాతా ఖీర్ భవానీ అలయాన్ని రాహుల్ సందర్శించి పూజలు చేశారు. శ్రీనగర్‌లో కొత్తగా ఏర్పాటైన పీసీసీ కార్యాలయంలో మాట్లాడుతున్న రాహుల్ గాంధీ -
జమ్మూకశ్మీర్‌పై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన
న్యూఢిల్లీ: కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన లఢక్, కశ్మీర్‌లను మళ్లీ కలిపి రాష్ట్ర హోదా కల్పిస్తామని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది. సాధారణ పరిస్థితులు నెలకొన్న సమయంలో ఆ ప్రకటన విడుదల చేస్తామని తెలిపింది. శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది అడిగిన ప్రశ్నకు రాజ్యసభలో బుధవారం హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ రాతపూర్వక సమాధానం ఇచ్చారు. ఆగస్ట్ 5, 2019న జమ్మూకశ్మీర్‌కు ఉన్న ప్రత్యేక ప్రతిపత్తు కల్పిస్తున్న 370, 35ఏ అధికరణలను కొట్టివేశారు. వాటిని రాజ్యాంగం నుంచి తొలగించి జమ్మూకశ్మీర్, లఢక్‌లను కేంద్ర పాలిత ప్రాంతాలుగా చేసిన విషయం తెలిసిందే. బీజేపీ ఎంపీ సస్మిత్ పాత్ర జమ్మూకశ్మీర్‌లో భద్రతా చర్యలపై ప్రశ్న వేశారు. రెండూ ప్రశ్నలకు కలిపి సమాధానం ఇచ్చారు. ఉగ్రవాదుల దాడులు తగ్గుముఖం పట్టాయని తెలిపారు. 2020లో 59 శాతం ఉంటే జూన్ 2021 వరకు 32 శాతానికి తగ్గిపోయిందని వెల్లడించారు. ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఫలిస్తున్నాయని తెలిపారు. ఉగ్రవాదులకు సహకరిస్తున్న వారిపై నిరంతర నిఘా పెట్టినట్లు చెప్పారు. లోయలో కశ్మీరీ పండితుల పునరావాసం.. భద్రతపై పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. 900 కశ్మీరీ పండిత్, డోగ్రా హిందూ కుటుంబాలు కశ్మీర్లో ఉన్నాయని వెల్లడించారు. -
కశ్మీర్‌కు రాష్ట్ర హోదా: అమిత్ షా కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ పునర్వవ్యస్థీకరణ సవరణ బిల్లుకు శనివారం లోక్‌సభ ఆమోదం తెలిపింది. బిల్లుపై జరిగిన చర్చకు హోంమంత్రి అమిత్ షా సమాధానం ఇచ్చారు. జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా కల్పించే అంశంపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. జమ్మూకశ్మీర్‌కు సరైన సమయంలో రాష్ట్ర హోదా ఇస్తామని ప్రకటించారు. పునర్వవ్యస్థీకరణ బిల్లు తేవడమంటే రాష్ట్ర హోదా ఇవ్వబోమని కాదన్నారు. పైగా బిల్లులో జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదా ఇవ్వబోమని ఎక్కడా లేదని.. దీనిపై విపక్షాలు వక్రభాష్యం చెబుతున్నాయని మండి పడ్డారు. జమ్మూకశ్మీర్ అంశంలో గత 70 ఏళ్లుగా కాంగ్రెస్ ఏం చేసిందని ప్రశ్నించారు. గతంలోలా హింస, అశాంతితో కూడిన రోజులు ఇప్పుడు జమ్మూకశ్మీర్‌లో లేవు.. తిరిగి రావని స్పష్టం చేశారు. ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే మోదీ సర్కార్ ధ్యేయమని అమిత్ షా తెలిపారు. పునర్వవస్థీకరణ సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా కొందరు సభ్యులు ఈ ప్రాంతం తిరిగి రాష్ట్ర హోదా పొందుతుందన్న విశ్వాసం తమకు లేదంటూ చేసిన వ్యాఖ్యలకు అమిత్ షా సమాధానమిచ్చారు. తగిన సమయంలో రాష్ట్ర హోదా కల్పిస్తామని వ్యాఖ్యానించారు. జమ్మూకశ్మీర్‌లో అధికార పంపిణీ, అధికార వికేంద్రీకరణ జరిగిందన్నారు. పంచాయతీ ఎన్నికల్లో 51శాతానికి పైగా పోలింగ్ జరగడాన్ని ఆయన ప్రస్తావించారు. తమ ప్రత్యర్థులు కూడా ఎత్తిచూపని విధంగా ఎన్నికలు శాంతియుతంగా జరిగాయని తెలిపారు. 25వేల ప్రభుత్వ ఉద్యోగాలు! ఈ ప్రాంతంలో రెండు ఎయిమ్స్ పనులు ప్రారంభమయ్యాయని, కశ్మీర్ వ్యాలీకి 2022 కల్లా రైలు మార్గం ఏర్పాటవుతుందని చెప్పారు. అక్కడి ప్రజలెవరికీ భూములు కోల్పోతామన్న ఆందోళన అవసరం లేదన్నారు అమిత్ షా. అభివృద్ధి పనులకు అవసరమైన భూమి ప్రభుత్వం వద్ద ఉందని చెప్పారు. 2022 నాటికి జమ్మూకశ్మీర్‌లో 25వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని తెలిపారు. అనంతరం జమ్మూకశ్మీర్ పునర్ వ్యవస్థీకరణ (సవరణ) బిల్లును లోక్‌సభ ఆమోదించింది. జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం 2019 ఆగస్టులో రద్దు చేసిన విషయం తెలిసిందే. అనంతరం జమ్మూకశ్మీర్, లద్దాఖ్‌లను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేసింది కేంద్రం. ఈ నేపథ్యంలో ఇప్పటికే రాజ్యసభలో ఆమోదం పొందిన జమ్మూకశ్మీర్ పునర్వవ్యస్థీకరణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టిన సందర్భంగా అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. చదవండి: దారుణం.. ప్రాణం తీసిన జలుబు కెడిసేథి; ఒక తరం సైద్ధాంతిక స్వరం -
‘సర్దుకున్నాక రాష్ట్ర హోదా’
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో భద్రతా పరిస్థితులు మెరుగుపడగానే ఆ ప్రాంతాన్ని కేంద్రపాలిత హోదా నుంచి రాష్ట్ర హోదాకు మారుస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా స్పష్టం చేశారు. 2018 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ప్రొబేషనరీలతో భేటీ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఆర్టికల్ 370 రద్దయ్యాక జమ్మూకశ్మీర్‌లో ఇప్పటి వరకూ ఒక్క బుల్లెట్ కూడా పేలలేదని, ఒక్క వ్యక్తి కూడా మరణించలేదని తెలిపారు. కశ్మీరీ సంప్రదాయాలను ఆర్టికల్ 370 మాత్రమే కాపాడుతోందని అనుకోవడం పొరపాటని, రాజ్యాంగం ద్వారా ఇతర రాష్ట్రాల సంప్రదాయాలు కూడా కొనసాగుతున్నాయని గుర్తుచేశారు. ఆర్టికల్ 370ని తప్పుడు మార్గంలో ఉపయోగించడం వల్ల ఉగ్రవాదం దేశంలోకి చొచ్చుకొని వస్తోందని అన్నారు. ఎన్నార్సీ కేవలం దేశ క్షేమం కోసమే కాదని, సరైన పాలన అందించడానికి కూడా అవసరమని తెలిపారు. ఆ దృష్టి మారాలి.. ప్రజల్లో పోలీసులపై ఉన్న చెడు అభిప్రాయాన్ని మార్చాలని ప్రొబెషనరీలకు సూచించారు. దీనికి నిజాయితీతో పనిచేయడం ఒక్కటే మార్గమని తెలిపారు. సమాజ అభివృద్ధి కోసం మనమేం చేస్తున్నామో ప్రతిరోజూ ప్రశ్నించుకోవాలని సూచించారు. పోలీసు వ్యవస్థలో సంస్కరణ అంటే పాలసీలను పూర్తిగా మార్చడం కాదని, కొత్త సమస్యలను ఎదుర్కొనేందుకు పాత విధానాలను కొత్తగా ఉపయోగించడమేనని తెలిపారు. పోలీసు వ్యవస్థలో సంస్కరణలకు కేంద్రం కట్టుబడి ఉందని అన్నారు. (చదవండి: కశ్మీర్లో పర్యాటకులపై ఆంక్షల ఎత్తివేత) -
ఢిల్లీకి రాష్ట్ర హోదా లభించేనా?
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అవకాశం దొరికినప్పుడల్లా ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశం రేపటి ఎన్నికలను ప్రభావితం చేస్తుందా? ప్రజలు నిజంగా రాష్ట్ర హోదా కోరుకుంటున్నారా? విస్తృత అధికారాల కోసం అరవింద్ కేజ్రీవాల్ రాష్ట్ర హోదాను కోరుకుంటుండవచ్చు! అయితే అది సిద్ధిస్తుందని ఆయన ఆశిస్తున్నారా? అసలు ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా కావాలనే డిమాండ్ ఎప్పుడు వచ్చింది? ఎందుకు వచ్చింది? మార్చి 24వ తేదీన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నిర్వహించిన ర్యాలీలో కేజ్రీవాల్ మాట్లాడుతూ ఈ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. 1991లో చేసిన 69వ రాజ్యాంగ సవరణ ద్వారా అప్పటి వరకు కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్న ఢిల్లీకి ప్రజా ఎన్నికల ద్వారా అసెంబ్లీ, ముఖ్యమంత్రి నాయకత్వంలో ఓ ప్రభుత్వం ఏర్పాటు చేసుకునే అవకాశం లభించింది. అయితే ముఖ్యమంత్రికి పరిమితమైన కార్యనిర్వాహక అధికారాలు మాత్రమే ఈ రాజ్యాంగం ద్వారా సిద్ధించాయి. పోలీసు వ్యవస్థ, భూములు, కొన్ని పౌర అధికారాలు కేంద్ర ప్రభుత్వం పరిధిలోనే ఉన్నాయి. ‘ప్రతి దానికి మనం కేంద్రం నుంచి అనుమతి తీసుకోవాలి. ఇతర రాష్ట్రాలకు ఆ ఖర్మ లేదు. మాకు మాత్రం ఎందుకు ఉండాలి అని అడిగాం! ఢిల్లీకి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా లేదని వారు చెప్పారు. మరి ఢిల్లీకి సగం రాష్ట్ర హోదా ఎందుకు ఇచ్చారు ? ఢిల్లీ వాసులు పన్నులు చెల్లించడం లేదా?’ అని 24 నాటి సమావేశంలో కేజ్రివాల్ ఘాటుగా మాట్లాడారు. ఆ సమావేశానికి హాజరైన పలువురు సభికులను రాష్ట్ర హోదా గురించి ఏమనుకుంటున్నారని మీడియా ప్రశ్నించగా ‘నేనయితే రాష్ట్ర హోదా గురించి మొదటిసారి వింటున్నాను. రాష్ట్ర హోదా వస్తే ఉద్యోగాలు వస్తాయని చెబుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు హామీ ఇచ్చారు. ఒక్క ఉద్యోగం రాలేదు. రాష్ట్ర హోదా వస్తే మాత్రం వస్తుందనే నమ్మకం లేదు’ అని ఒకరు, ‘15 ఏళ్ల క్రితం అప్పటి ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ ఒక్కసారి రాష్ట్రహోదా గురించి మాట్లాడితే విన్నాం. ఇప్పుడు కేజ్రివాల్ మాట్లాతుంటే వింటున్నాం. దీని వల్ల ఏం ఒరుగుతుందో, ఏమో తెలియదుగానీ హోదా వస్తుందన్న నమ్మకం మాత్రం లేదు’ మరొకరు వ్యాఖ్యానించారు. ఏది ఏమైన ఈ ఎన్నికలపై ఈ అంశం ఎలాంటి ప్రభావం చూపించదని మాత్రం మెజారిటీ ఓటర్లు స్పష్టం చేశారు. ఢిల్లీకి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా కావాలంటూ 1998లో బీజేపీ, ఆ తర్వాత 2000 సంవత్సరం నుంచి 2015 సంవత్సరం వరకు కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఆ తర్వాత ఈ డిమాండ్‌ను ఆ రెండు పార్టీలు వదిలేశాయి. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేస్తున్నా కనీసం కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ఇవ్వకపోవడం విచిత్రం. -
మార్చి1 నుంచి కేజ్రీవాల్ నిరవధిక దీక్ష
న్యూఢిల్లీ : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మార్చి1 నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేయాలని నిర్ణయించారు. ఢిల్లీకి రాష్ట్ర హోదా ఇవ్వాలనే ప్రధాన డిమాండ్‌తో దీక్ష చేయనున్నట్టు కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఢిల్లీని సంపూర్ణ రాష్ట్రంగా ప్రకటిస్తామంటూ గత 20 ఏళ్లుగా బీజేపీ , కాంగ్రెస్ చెబుతూనే వస్తున్నాయనీ.. కానీ ఎప్పుడూ ఆ పార్టీలు మాట నిలబెట్టుకోలేదని కేజ్రీవాల్ విమర్శించారు. ఢిల్లీ పూర్తిస్థాయి రాష్ట్రంగా అవతరిస్తే.. యువతకు ఉద్యోగాలు రావడంతో పాటు ప్రజలకు ఇళ్లు, మహిళలకు భద్రత లభిస్తాయన్నారు. ఢిల్లీని పూర్తిస్థాయి రాష్ట్రంగా ప్రకటించాలని అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం మొదటి నుంచి డిమాండ్ చేస్తోన్న విషయం తెలిసిందే. ఇంతకు ముందు ఢిల్లీకి రాష్ట్ర హోదా ఇవ్వాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఇంటి ముందు మంత్రులతో కలిసి కేజ్రీవాల్ మెరుపు ధర్నా చేశారు. సుమారు ఆరుగంటల పాటు.. అర్ధరాత్రి దాటాక కూడా లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ కార్యాలయ వెయిటింగ్ రూంలో వేచిచూసినా ఆయన మాట్లాడేందుకు అనుమతించకపోవడంతో.. అక్కడే సోఫాలో నిద్రపోయారు. శాసనసభలో కూడా ఢిల్లీని పూర్తి స్థాయి రాష్ట్రంగా ప్రకటించాలన్న తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదం తెలిపారు. -
మోదీకి పది లక్షల లేఖలు..
సాక్షి, న్యూఢిల్లీ : జాతీయ రాజధాని ఢిల్లీకి రాష్ట్ర హోదా ఇవ్వాలని ఆమ్ ఆద్మీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పార్టీ మద్దతుదారులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో ఆదివారం కేజ్రీవాల్ ఢిల్లీలో సమావేశమయ్యారు. ఇచ్చిన హామీ మేరకు 2019 లోక్‌సభ ఎన్నికలలోపు ఢిల్లీకి రాష్ట్ర హోదా ఇవ్వాలని మోదీని కోరారు. దీనిపై ఢిల్లీలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నట్లు ఉపముఖ్యమంత్రి మనీశ్ శిసోడియా ప్రకటించారు. ఆప్ కార్యకర్తలు ఢిల్లీలోని ప్రతి ఇంటికి చేరుకుని హోదాకు ప్రజల మద్దతు కొరతారని తెలిపారు. సీఎం కేజ్రీవాల్ సంతకం చేసిన లేఖపై పది లక్షల మందితో సంతకాలు చేయించి వాటిని ప్రధాని మోదీకి పంపుతామని మనీశ్ శిసోడియా పేర్కొన్నారు. ఢిల్లీకి రాష్ట్ర హోదా అంశంపై కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ అభిప్రాయం ఏంటో చెప్పాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. ఈ అంశంపై త్వరలో అన్ని పార్టీల నేతలతో అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేస్తామని తెలిపారు. ఢిల్లీ జాతీయ రాజధాని అయినందువల్ల రాష్ట్ర హోదా ఇవ్వలేమని కేంద్రం చేస్తున్న వ్యాఖ్యలను కేజ్రీవాల్ కొట్టిపారేశారు. న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ (ఎన్ఎమ్డీసీ) మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుందని, మిగిలిన ప్రాంతానికి రాష్ట్రహోదా ఇవ్వాలని అన్నారు.