శాసనసభ ఎన్నికలు నిర్వహిస్తాం
ప్రజలు తమ సమస్యలు ఎమ్మెల్యేలకు, మంత్రులకు చెప్పుకోవచ్చు
జమ్మూలో ఎన్నికల బహిష్కరణ పిలుపులు చరిత్రలో కలిసిపోయాయి
ఆర్టికల్ 370 రద్దు తర్వాత అభివృద్ధి వేగం పుంజుకుంది
జమ్మూకశ్మీర్, రాజస్తాన్ ఎన్నికల ప్రచారంలో మోదీ
ఉద్ధంపూర్/జైపూర్: జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు ఇక ఎంతోదూరంలో లేవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరిస్తామని, శాసన సభ ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించారు. ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యేలతో, మంత్రులతో చెప్పుకోవచ్చని తెలియజేశారు. గతంలో జమ్మూకశ్మీర్‌లో వేర్పాటువాదుల నుంచి ఎన్నికల బహిష్కరణ పిలుపులు వినిపించేవని, ప్రస్తుతం అవన్నీ చరిత్రలో కలిసిపోయాయని పేర్కొన్నారు.
సీమాంతర ఉగ్రవాదం, బాంబు దాడులు, రాళ్ల దాడులు, కాల్పులు, ఘర్షణలు, భయాందోళనల ప్రసక్తి లేకుండా ఇక్కడ సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా జరుగబోతున్నాయని చెప్పారు. శుక్రవారం జమ్మూకశ్మీర్‌లోని ఉద్ధంపూర్‌లో, రాజస్తాన్‌లోని బార్మర్‌లో ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని మోదీ మాట్లాడారు. రాజస్తాన్ రాష్ట్రం దౌసాలో రోడ్‌షోలో పాల్గొన్నారు. జమ్మూకశ్మీర్ ప్రజల సమస్యలు పరిష్కరిస్తానంటూ ఇచి్చన హామీని నిలబెట్టుకున్నానని తెలిపారు.
ఆ అడ్డుగోడ కూల్చేశాం.. శకలాలు సమాధి చేశాం
ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్‌లో అభివృద్ధి వేగవంతమైందని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. ప్రభుత్వంపై ప్రజల విశ్వాసం మరింత పెరిగిందని అన్నారు. గతంలో వైష్ణోదేవి, అమర్‌నాథ్ భక్తుల భత్రతకు ముప్పు ఉండేదని, ఇప్పుడు పరిస్థితి మారిపోయిందని వెల్లడించారు.
గతంలో కుటుంబ పార్టీల నిర్వాకం వల్ల జమ్మూకశ్మీర్ ఎంతో నష్టపోయిందన్నారు. ఆర్టికల్ 370 అనే అడ్డుగోడను సృష్టించింది కుటుంబ పార్టీలేనని మండిపడ్డారు. ఈ ఆర్టికల్ వల్ల ప్రజలకు రక్షణ లభిస్తుందన్న భ్రమను కుటుంబ పారీ్టలు కలి్పంచాయని ధ్వజమెత్తారు. ప్రజల అండతో ఈ అడ్డుగోడను కూలి్చవేశామని, దాని శకలాలను సైతం సమాధి చేశామని వ్యాఖ్యానించారు.
ఓ వర్గం ఓట్ల కోసమే మాంసాహార వీడియోలు
విపక్ష ‘ఇండియా’ కూటమిది మొఘల్ రాజుల మైండ్‌సెట్ అని ప్రధానమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అయోధ్యలో రామమందిరం బీజేపీ ఎన్నికల ఎత్తుగడ అంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టారు. రామాలయం కోట్లాది మంది ప్రజల విశ్వాసానికి సంబంధించిన అంశమని అన్నారు. రామజన్మభూమి అంశానికి 500 ఏళ్ల చరిత్రఉందని, అప్పట్లో ఎన్నికలు లేవని చెప్పారు.
మొఘల్ పాలకులు ఆలయాలను కూలి్చవేసి, మెజార్టీ ప్రజల మనోభావాలను గాయపర్చి ఆనందిస్తూ ఉండేవారని తెలిపారు. అదే ఆలోచనాధోరణితో విపక్షాలు వ్యవహరిస్తున్నాయని తప్పుపట్టారు. కాంగ్రెస్‌తోపాటు ప్రతిపక్ష నాయకులు ఓ వర్గం ప్రజలను సంతృప్తిపర్చి ఓట్లు దండుకోవడానికి పవిత్ర మాసాల్లో, నవరాత్రుల్లో మాంసాహారం తింటూ, ఆ వీడియోలను ఉద్దేశపూర్వకంగా ప్రచారంలోకి తీసుకొస్తున్నారని దుయ్యబట్టారు.
దేశాన్ని శక్తిహీనంగా మారుస్తారా?
భారత రాజ్యాంగాన్ని బీజేపీ ఎంతగానో గౌరవిస్తోందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తారంటూ విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. బాబాసాహెబ్ బీఆర్ అంబేడ్కర్ ఇప్పుడొచ్చినా రాజ్యాంగాన్ని రద్దు చేయలేరని అన్నారు. ప్రభుత్వానికి రాజ్యాంగం భగవద్గీత, రామాయణం, మహాభారతం, బైబిల్, ఖురాన్ లాంటిందని అన్నారు. తమకు రాజ్యాంగమే సమస్తం అని వివరించారు.
కేంద్రంలో అధికారంలోకి వస్తే దేశంలో అణ్వాయుధాలను పూర్తిగా నిర్మూలిస్తామని విపక్ష ఇండియా కూటమిలోని భాగస్వామ్యపక్షాలు చెబుతున్నాయని మోదీ తప్పుపట్టారు. మనకు ఇరువైపులా అణ్వాయుధ సంపత్తి కలిగిన దేశాలున్నాయని చెప్పారు. మనకు అణ్వాయుధాలు లేకపోతే ఏం జరుగుతుందో తెలియదా? అని నిలదీశారు. మీరు ఎవరు ఆదేశాలతో పని చేస్తున్నారో చెప్పాలని ఇండియా కూటమిని నిలదీశారు. దేశాన్ని శక్తిహీనంగా మార్చడమే ఇండియా కూటమి లక్ష్యమా? అని ప్రధానమంత్రి మోదీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment