Udhampur
-
జమ్మూ కశ్మీర్లో ఎన్కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదుల హతం
జమ్మూ కశ్మీర్లో బుధవారం భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది. ఉదంపూర్, కథువా జిల్లాల్లోని అటవీ ప్రాంతంలో ఉగ్రవాదుల సంచారానికి సంబంధించి సమాచారం అందుకున్నఆర్మీ ప్రత్యేక బలగాలు, జమ్మూ కాశ్మీర్ పోలీసులు అక్కడికి చేరుకొని సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి.భారీ వర్షాలు, క్లిష్టమైన వాతావరణ పరిస్థితులు ఉన్నా ఉగ్రవాదులను ఏరివేయడంలో భద్రతా బలగాలు విజయం సాధించాయి. కథువా జిల్లాల్లో చేపట్టిన ఆపరేషన్‌లో ముగ్గురు టెర్రరిస్టులను అంతమొందించారు. హతమైన ఉగ్రవాదుల నుంచి ఎం4 రైఫిల్, ఏకే రైఫిల్, పిస్టల్ సహా పలు ఆయుధాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ప్రస్తుతం సంఘటనా స్థలంలో భారీగా బలగాలను మోహరించారు. ఆపరేషన్ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. -
జమ్ముకశ్మీర్‌లో ఎన్కౌంటర్.. సీఆర్పీఎఫ్ జవాన్ మృతి
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో సోమవారం భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు జరిగిన కాల్పుల్లో సీఆర్పీఎఫ్ జవాన్ ఒకరు ప్రాణాలు విడిచాడు. ఉదంపూర్‌లోని దాదు ప్రాంతంలో ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి.ఈ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారంతో జమ్ముకశ్మీర్ పోలీసులకు చెందిన స్పెషల్ ఆపరేషన్ గ్రూప్స్, సీఆర్పీఎఫ్ పోలీసులు సెర్చింగ్ ఆపరేషన్ నిర్వహించారు. పోలీసుల రాకను గమనించి ఉగ్రవాదులు మెరుపుదాడికి దిగారు. మావోయిస్టుల కాల్పుల్లో సీఆర్ఎపీఎఫ్ అధికారి మరణించినట్లు పోలీసులు ధృవీకరించారు.ఇదిలా ఉండగా.. జమ్మూ ప్రాంతంలో ఇటీవల తీవ్రవాద కార్యకలాపాలు పెరిగాయి. జూలైలో, దోడా జిల్లాలో జరిగిన ఉగ్రవాదుల కాల్పుల్లో ఒక అధికారితో సహా నలుగురు ఆర్మీ సిబ్బంది, ఒక పోలీసు సిబ్బంది మరణించారు. ఈ దాడికి పాల్పడింది తామేనని పాకిస్తాన్ మద్దతు ఉన్న ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మొహమ్మద్ షాడో గ్రూప్ 'కశ్మీర్ టైగర్స్' పేర్కొంది. జూలై 8న కతువా జిల్లాలోని పర్వత రహదారిపై ఉగ్రవాదులు ఆర్మీ కాన్వాయ్‌పై మెరుపుదాడి చేయడంతో జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్‌తో సహా ఐదుగురు ఆర్మీ సిబ్బంది మరణించారు. మరికొందరు గాయపడ్డారు. -
Narendra modi: జమ్మూకశ్మీర్‌కు త్వరలో రాష్ట్ర హోదా
ఉద్ధంపూర్/జైపూర్: జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు ఇక ఎంతోదూరంలో లేవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరిస్తామని, శాసన సభ ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించారు. ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యేలతో, మంత్రులతో చెప్పుకోవచ్చని తెలియజేశారు. గతంలో జమ్మూకశ్మీర్‌లో వేర్పాటువాదుల నుంచి ఎన్నికల బహిష్కరణ పిలుపులు వినిపించేవని, ప్రస్తుతం అవన్నీ చరిత్రలో కలిసిపోయాయని పేర్కొన్నారు. సీమాంతర ఉగ్రవాదం, బాంబు దాడులు, రాళ్ల దాడులు, కాల్పులు, ఘర్షణలు, భయాందోళనల ప్రసక్తి లేకుండా ఇక్కడ సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా జరుగబోతున్నాయని చెప్పారు. శుక్రవారం జమ్మూకశ్మీర్‌లోని ఉద్ధంపూర్‌లో, రాజస్తాన్‌లోని బార్మర్‌లో ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని మోదీ మాట్లాడారు. రాజస్తాన్ రాష్ట్రం దౌసాలో రోడ్‌షోలో పాల్గొన్నారు. జమ్మూకశ్మీర్ ప్రజల సమస్యలు పరిష్కరిస్తానంటూ ఇచి్చన హామీని నిలబెట్టుకున్నానని తెలిపారు. ఆ అడ్డుగోడ కూల్చేశాం.. శకలాలు సమాధి చేశాం ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్‌లో అభివృద్ధి వేగవంతమైందని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. ప్రభుత్వంపై ప్రజల విశ్వాసం మరింత పెరిగిందని అన్నారు. గతంలో వైష్ణోదేవి, అమర్నాథ్ భక్తుల భత్రతకు ముప్పు ఉండేదని, ఇప్పుడు పరిస్థితి మారిపోయిందని వెల్లడించారు. గతంలో కుటుంబ పార్టీల నిర్వాకం వల్ల జమ్మూకశ్మీర్ ఎంతో నష్టపోయిందన్నారు. ఆర్టికల్ 370 అనే అడ్డుగోడను సృష్టించింది కుటుంబ పార్టీలేనని మండిపడ్డారు. ఈ ఆర్టికల్ వల్ల ప్రజలకు రక్షణ లభిస్తుందన్న భ్రమను కుటుంబ పారీ్టలు కలి్పంచాయని ధ్వజమెత్తారు. ప్రజల అండతో ఈ అడ్డుగోడను కూలి్చవేశామని, దాని శకలాలను సైతం సమాధి చేశామని వ్యాఖ్యానించారు. ఓ వర్గం ఓట్ల కోసమే మాంసాహార వీడియోలు విపక్ష ‘ఇండియా’ కూటమిది మొఘల్ రాజుల మైండ్‌సెట్ అని ప్రధానమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అయోధ్యలో రామమందిరం బీజేపీ ఎన్నికల ఎత్తుగడ అంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టారు. రామాలయం కోట్లాది మంది ప్రజల విశ్వాసానికి సంబంధించిన అంశమని అన్నారు. రామజన్మభూమి అంశానికి 500 ఏళ్ల చరిత్రఉందని, అప్పట్లో ఎన్నికలు లేవని చెప్పారు. మొఘల్ పాలకులు ఆలయాలను కూలి్చవేసి, మెజార్టీ ప్రజల మనోభావాలను గాయపర్చి ఆనందిస్తూ ఉండేవారని తెలిపారు. అదే ఆలోచనాధోరణితో విపక్షాలు వ్యవహరిస్తున్నాయని తప్పుపట్టారు. కాంగ్రెస్‌తోపాటు ప్రతిపక్ష నాయకులు ఓ వర్గం ప్రజలను సంతృప్తిపర్చి ఓట్లు దండుకోవడానికి పవిత్ర మాసాల్లో, నవరాత్రుల్లో మాంసాహారం తింటూ, ఆ వీడియోలను ఉద్దేశపూర్వకంగా ప్రచారంలోకి తీసుకొస్తున్నారని దుయ్యబట్టారు. దేశాన్ని శక్తిహీనంగా మారుస్తారా? భారత రాజ్యాంగాన్ని బీజేపీ ఎంతగానో గౌరవిస్తోందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తారంటూ విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. బాబాసాహెబ్ బీఆర్ అంబేడ్కర్ ఇప్పుడొచ్చినా రాజ్యాంగాన్ని రద్దు చేయలేరని అన్నారు. ప్రభుత్వానికి రాజ్యాంగం భగవద్గీత, రామాయణం, మహాభారతం, బైబిల్, ఖురాన్ లాంటిందని అన్నారు. తమకు రాజ్యాంగమే సమస్తం అని వివరించారు. కేంద్రంలో అధికారంలోకి వస్తే దేశంలో అణ్వాయుధాలను పూర్తిగా నిర్మూలిస్తామని విపక్ష ఇండియా కూటమిలోని భాగస్వామ్యపక్షాలు చెబుతున్నాయని మోదీ తప్పుపట్టారు. మనకు ఇరువైపులా అణ్వాయుధ సంపత్తి కలిగిన దేశాలున్నాయని చెప్పారు. మనకు అణ్వాయుధాలు లేకపోతే ఏం జరుగుతుందో తెలియదా? అని నిలదీశారు. మీరు ఎవరు ఆదేశాలతో పని చేస్తున్నారో చెప్పాలని ఇండియా కూటమిని నిలదీశారు. దేశాన్ని శక్తిహీనంగా మార్చడమే ఇండియా కూటమి లక్ష్యమా? అని ప్రధానమంత్రి మోదీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. -
Madhavi Latha: ఆమె నదిని దాటించింది
కింద గాఢంగా పారే చీనాబ్ నది. పైన 359 మీటర్ల ఎత్తులో రైలు బ్రిడ్జి. కశ్మీర్ లోయలో ఉధమ్‌పూర్ నుంచి బారాముల్లా వరకు వేయదలచిన భారీ రైలు మార్గంలో చీనాబ్‌ను దాటడం ఒక సవాలు. దాని కోసం సాగిన ఆర్చ్ బ్రిడ్జి నిర్మాణంలో మన తెలుగు ఇంజినీర్ మాధవీ లత కృషి కీలకం. ‘వరల్డ్ హైయ్యస్ట్ రైల్వే బ్రిడ్జి’ నిర్మాణంలో పాల్గొన్న మాధవీ లత పరిచయం. ఒక సుదీర్ఘకల నెరవేరబోతోంది. సుదీర్ఘ నిర్మాణం ఫలవంతం కాబోతూ ఉంది. దేశ అభివృద్ధిలో కీలకమైన రవాణా రంగంలో ఎన్ని ఘన నిర్మాణాలు సాగితే అంత ముందుకు పోతాము. అటువంటి ఘన నిర్మాణం జాతికి అందుబాటులో రానుంది. జమ్ము కశ్మీర్లో ప్రపంచంలోనే అతి ఎత్తయిన రైల్వేవంతెన ట్రయల్ రన్ పూర్తి చేసుకుని త్వరలోనే కార్యకలాపాలు నిర్వహించనుంది. అయితే ఈ క్లిష్టమైన నిర్మాణంలో తెలుగు మహిళా ఇంజినీర్ కీలకపాత్ర పోషించడం ఘనంగా చెప్పుకోవాల్సిన సంగతి. తెనాలికి చెందిన ప్రొఫెసర్ గాలి మాధవీలతదే ఈ ఘనత. చీనాబ్ ఆర్చ్ బ్రిడ్జ్ భారతీయ రైల్వే 2004లో జమ్ము–కశ్మీర్లో భారీ రైలు ప్రాజెక్ట్‌కు అంకురార్పణ చేసింది. జమ్ము సమీపంలోని ఉధంపూర్ నుంచి శ్రీనగర్ సమీపంలోని బారాముల్లా వరకు రైలు మార్గం నిర్మించడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. ఈ మార్గంలో రీసీ జిల్లా బాక్కల్ దగ్గర చీనాబ్ నదిపై వంతెన నిర్మించాల్సి వచ్చింది. ఇది చాలా క్లిష్టమైన నిర్మాణం. ఎందుకంటే ఇది ఐఫిల్ టవర్ కంటే 35 మీటర్ల ఎత్తు వంతెన అవుతుంది. అయినప్పటికీ మన ఇంజినీర్లు దశల వారీగా నిర్మాణం పూర్తి చేయగలిగారు. జూలైలో దీని కార్యకలాపాలు పూర్తిస్థాయిలో మొదలవుతాయి. ప్రొఫెసర్‌గా పని చేస్తూ... ప్రకాశం జిల్లా ఏడుగుండ్లపాడుకు చెందిన మాధవీలత కాకినాడలో ఇంజినీరింగ్ చేశారు. ఐ.ఐ.టి. మద్రాస్‌లో పీహెచ్డీ చేశారు. బెంగళూరులోని ఐ.ఐ.ఎస్.సి.లో ‘రాక్ మెకానిక్స్’లో పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్‌ను కొనసాగించారు. బెంగళూరులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లో సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో ప్రొఫెసర్‌గా సేవలందిస్తున్న మాధవీలత అక్కడే సెంటర్ ఫర్ సస్టెయినబుల్ టెక్నాలజీస్ విభాగానికి చైర్పర్సన్ గా కూడా ఉంటూ సైన్స్ ను, టెక్నాలజీని గ్రామీణాభివృద్ధికి చేరువ చేసే ప్రాజెక్టులకు నాయకత్వం వహిస్తున్నారు. అయితే ‘రాక్ మెకానిక్స్’లో మాధవీలతకు ఉన్న అనుభవమే ఆమెను చీనాబ్ వంతెన నిర్మాణంలో పాల్గొనేలా చేసింది. చీనాబ్ వంతెన నిర్మాణానికి రూ.1400 కోట్లు వ్యయం చేస్తే 300 మంది సివిల్ ఇంజినీర్లు, 1300 మంది వర్కర్లు రేయింబవళ్లు పని చేశారు. బ్రిడ్జ్‌ను రెండు కొండల మధ్య నిర్మించాల్సి ఉన్నందున ఇంజినీరింగ్ డిజైన్ చాలా క్లిష్టంగా మారింది. అయినప్పటికీ అక్కడి రాళ్లను పరిశోధించి, అధ్యయనం చేసిన మాధవీలత, పటిష్టమైన వాలు స్థిరీకరణ ప్రణాళికను రూపొందించి, అమలును నిరంతరం పర్యవేక్షిస్తూ వచ్చారు. ఆమె విశ్లేషణ, సాంకేతిక సూచనలను దేశంతోపాటు విదేశాల్లోని పలువురు నిపుణులు తనిఖీ చేసి ఆమోదించడంతో వంతెన నిర్మాణం ముందుకు సాగింది. ఈ రైలు మార్గంలో నిర్మించిన కొన్ని సొరంగాల నిర్మాణంలోనూ మాధవీలత పాల్గొన్నారు. అవకాశం ఇలా... ఉధంపూర్ – బారాముల్లా కొత్త రైలుమార్గంలో చీనాబ్ నదిపై స్టీల్ ఆర్చ్ వంతెన నిర్మాణ బాధ్యతను కొంకణ్ రైల్వేస్ ‘ఆఫ్కాన్స్ ’ సంస్థకు ఇచ్చింది. ఆఫ్కాన్స్ సంస్థకు జియో టెక్నికల్ కన్సల్టెంటుగా ఉన్న మాధవీలతకు అలా ప్రాజెక్టులో పనిచేసే అవకాశం లభించింది. ‘ప్రాజెక్టు నిర్మాణంలో అనేక సవాళ్లు ఎదురయ్యాయి. చీనాబ్ నదిపై రెండు ఎత్తయిన వాలుకొండలను కలుపుతూ సాగిన ఈ వంతెన నిర్మాణంలో వాలు స్థిరత్వం కీలకమైంది. రాక్ మెకానిక్స్ సాంకేతికత, స్థిరత్వ అంశాలను అర్థం చేసుకోవటం, కొండ వాలుల స్థిరత్వాన్ని పొందటానికి నేను పరిష్కారాలను అందించటంతో ఇప్పుడో ఇంజినీరింగ్ అద్భుతం సాక్షాత్కరించింది. జోన్ భూకంపాలను, గంటకు 266 కి.మీ వేగంతో వీచే గాలులను, తీవ్రమైన పేలుళ్లను తట్టుకునేలా ఈ వంతెన నిర్మితమైంది’ అన్నారు మాధవీలత. ‘నేల పటిష్టతపై ఐ.ఐ.టి మద్రాస్‌లో నా పీహెచ్డీ పరిశోధనల్లో భాగంగా పాలిమర్లను ఉపయోగించి పటిష్టమైన రోడ్ల నిర్మాణానికి వినూత్న సాంకేతిక విధానాన్ని రూపొందించాను. ఆ దిశగా మూడు దశాబ్దాలపాటు చేసిన పరిశోధనల ఫలితంగా నేడు భూకంప నిరోధక శక్తి కలిగిన నిర్మాణాల్లో పాలిమర్‌లని, రబ్బర్ టైర్ల వంటి వ్యర్థపదార్థాలని వినియోగించగలుగుతున్నాం’ అన్నారు. చీనాబ్ వంతెన నిర్మాణానికి రేయింబవళ్లు శ్రమించిన మాధవీలత, ఈ ప్రాజెక్టు కోసం ఎన్నో వ్యక్తిగత త్యాగాలు చేయాల్సి వచ్చిందని చెప్పారు. తన కుటుంబ ప్రాధాన్యతలను పక్కనపెట్టి, సైట్‌ను సందర్శించిన సందర్భాలను గుర్తు చేసుకుంటూ, ‘నా పిల్లల పరీక్షల సమయాల్లో కూడా వాళ్లను వదిలి వెళ్లాల్సి వచ్చేది. నా భర్త హరిప్రసాద్‌రెడ్డి, పిల్లలు అభిజ్ఞ, శౌర్యల సహనం, సహకారాలతో ఇది సాధ్యమైంది. చీనాబ్ వంతెన నా సొంత ప్రాజెక్టులా మారిపోయింది’ అన్నారు. – బి.ఎల్.నారాయణ, సాక్షి, తెనాలి -
అక్టోబర్‌లో అమిత్ షా పర్యటన.. జమ్మూ కశ్మీర్లో జంట పేలుళ్ల కలకలం
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్లో జంట పేలుళ్లు కలకలం సృష్టిస్తున్నాయి. ఉధంపూర్‌లోని పెట్రోల్ బంక్ సమీపంలో డొమిల్ చౌక్ వద్ద పార్క్ చేసిన ఖాళీ బస్సులో బధవారం రాత్రి మొదటి పేలుడు జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. బస్సులోని డ్రైవర్ క్యాబిన్లో కూర్చున్న కండక్టర్ సునీల్ సింగ్(27), అతని స్నేహితుడు విజయ్ కుమార్(40)కు గాయాలయ్యాయి. వీరిని ఉధంపూర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. 8 గంటల్లో రెండు పేలుళ్లు ఉధంపూర్ జిల్లాలోని పాత బస్టాండ్ వద్ద పార్క్ చేసిన బస్సులో గురువారం తెల్లవారుజామున 5 గంటలకు మరో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు అవ్వలేదు. కాగా 8 గంటల వ్యవధిలో ఉధంపూర్ జిల్లాలో జరిగిన రెండో ప్రమాదం ఇది. మొదటి పేలుడు చోటుచేసుకున్న 4 కిలోమీటర్ల దూరంలోనే ఈపేలుడు జరిగింది. #WATCH | J&K: Investigation underway by Army Bomb Disposal Squad & dog squad at the bus stand in Udhampur. Two blasts occurred within 8 hours in Udhampur; two people got injured in the first blast and are now out of danger, no injury in 2nd blast, says DIG Udhampur-Reasi Range pic.twitter.com/DuCnMngqZq — ANI (@ANI) September 29, 2022 పేలుళ్లకు కారణం? పేలుడు జరిగిన సమీపంలో ఆపి ఉంచిన ఇతర వాహనాలు కూడా దెబ్బతిన్నాయి. ఈ సంఘటన అనంతరం పోలీసులు, భద్రతా సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. అయితే పేలుడుకి గల కారణాలు ఇంకా తెలియరాలేదని, ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నామని ఉధంపూర్ డీఐజీ తెలిపారు. ఇదిలా ఉండగా ఆరు నెలల తర్వాత ఉధంపూర్ పట్టణంలో ఈ జంట పేలుళ్లు జరిగాయి. చివరగా ఈ ఏడాది మార్చి 9 న స్లాథియా చౌక్‌లో స్టిక్కీ బాంబు పేలుడులో ఒకరు మృతి చెందగా, మరో 17 మంది గాయపడ్డారు. వచ్చే నెలలో అమిత్ షా పర్యటన కాగా అక్టోబర్ మొదటి వారంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మూడు రోజుల పర్యటన నిమిత్తం జమ్మూ కశ్మీర్‌కు రానున్నారు. కత్రా పట్టణానికి సమీపంలో ఉన్న త్రికుటా హిల్స్‌లోని మాతా వైష్ణోదేవి పుణ్యక్షేత్రాన్ని సందర్శించి, పూజలు చేయనున్నారు. అనంతరం సరిహద్దు జిల్లా రాజౌరి, బరాముల్లాలో బహిరంగ ర్యాలీలో ప్రసంగించడంతో పాటు, అక్కడే బస చేయనున్నారు. అయితే కేంద్రమంత్రి పర్యటన ముందు ఉధంపూర్ పట్టణంలో రెండు శక్తివంతమైన పేలుళ్లు సంభవించడం కలకలం రేపుతోంది. హోంమంత్రి సందర్శనను దృష్టిలో ఉంచుకుని పోలీసులు, భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. -
జమ్మూకాశ్మీర్ ఉదంపూర్ దగ్గర రోడ్డు ప్రమాదం
-
యువతి చేతికి బస్సు స్టీరింగ్.. ప్రాణాలు గాల్లో కలిసేవి!
ప్రయాణికులతో నిండిన ఓ బస్సును నడిపించడంలో తీవ్రమైన నిర్లక్ష్యం ప్రదర్శించాడో డ్రైవర్. అతని అజాగ్రత్త వల్ల బస్సులోని ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసేవి. ఆ డ్రైవర్ ఏం చేశాడంటే.. ప్రయాణికులతో నిండిన బస్సును తాను నడపకుండా ఓ విద్యార్థినికి స్టీరింగ్ ఇచ్చాడు. ఆమె బస్సును ప్రమాదకరంగా నడిపించింది. ఈ ఘటన జమ్ముకశ్మీర్‌లోని ఉధంపూర్ జిల్లాలో చోటు చేసుకుంది. ఉధంపూర్-లాండర్ మార్గంలో ప్రయాణిస్తున్న బస్సులో డ్రైవర్.. బస్సు స్టీరింగ్‌ను ఓ యువతి చేతికి ఇచ్చాడు. పైగా అది ఒక కొండ మార్గం. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా బస్సు లోయలోకి దూసుకెళ్లే ప్రమాదం ఉంది. అయినప్పటికీ ఆ నిర్లక్ష్యంగా సదరు యువతితో బస్సును ప్రమాదకరంగా నడిపించాడు. ఈ సమయంలో బస్సులో ప్రయాణిస్తున్న ఒకరు తన మొబైల్ ఫోన్లో వీడియో రికార్డు చేశాడు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ మారింది. అది కాస్త జమ్ముకశ్మీర్ ట్రాన్స్పోర్ట్ అధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో అధికారులు వెంటనే స్పందించి.. యువతి డ్రైవ్ చేసిన బస్సును సీజ్ చేసినట్లు తెలిపారు. ఆ డ్రైవర్‌పైన అధికారులు చర్యలు చేపట్టి డ్రైవింగ్ లైసెన్స్, వాహనం పర్మిట్‌ను సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు. అతని నిర్లక్ష్యంపై ప్రశ్నించేందుకు అధికారులు నోటీసులు కూడా జారీ చేసినట్లు వెల్లడించారు. ఈ వీడియోను వీక్షించిన నెటిజన్లు డ్రైవర్‌పై తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు. #ViralVideo of negligent #driving: Careless driver lets a girl student drive a #bus full of passengers in J&K's #Udhampur. The license & permit of the driver has now been suspended for endangering lives of passengers. pic.twitter.com/AtdeBWQw4C — India.com (@indiacom) April 18, 2022 -
జమ్మూలో పేలుడు... ఒకరు మృతి
జమ్ము: ఉదమ్‌పూర్ నగర కోర్టు కాంప్లెక్సుకు దగ్గరోని స్లాథియా చౌక్ వద్ద బుధవారం జరిగిన పేలుడులో ఒక వ్యక్తి మరణించగా, 14మంది గాయపడ్డారు. పేలుడులో ఐఈడీ ఉపయోగించినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసు ఏడీజీపీ ముకేశ్ సింగ్ చెప్పారు. పేలుడు చాలా శక్తివంతమైనదని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. గాయపడినవారిని ఆస్పత్రికి తరలించారని, వారు క్షేమంగానే ఉన్నారని పోలీసులు తెలిపారు. పేలుడుపై విచారణ జరుపుతున్నామన్నారు. (చదవండి: రాజీవ్ హత్య కేసు దోషికి బెయిల్) -
ఉధంపూర్ దుర్గ్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు.. రెండు బోగీలు దగ్ధం
భోపాల్: మధ్యప్రదేశ్‌లో విషాదం చోటు చేసుకుంది. ఉధంపూర్ దుర్గ్ ఎక్స్‌ప్రెస్‌లో శుక్రవారం మంటలు చెలరేగాయి. ఢిల్లీ నుంచి చత్తీస్‌గఢ్ దుర్గ్ వెళ్తుండగా రైలులోని నాలుగు బోగీల్లో మంటలు చెలరేగాయి. రైలు హేమంత్‌పూర్ రైల్వే స్టేషన్ దాటిని కొద్ది సేపటికే ఏ1, ఏ2 బోగీల్లో ఉన్నట్లుండి మంటలు చెలరేగాయి. మరో రెండు బోగీలకు మంటలు వ్యాపించాయి. (చదవండి: ‘జోకర్’ బీభత్సం: రైల్లో మంటలు.. 10 మందికి గాయాలు) ఈ సంఘటనలో ఏ1, ఏ2 బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. అయితే ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని.. ప్రాణ నష్టం సంభవించించలేదని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంపై ఎన్సీఆర్ అధికారి డాక్టర్ శివం శర్మ స్పందించారు. రైలులో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో ఎవరూ మరణించలేదని.. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే బోగీల్లో ఉన్న వారిని సురక్షితంగా కాపాడినట్లు తెలిపారు. Morena, Madhya Pradesh | Udhampur-Durg Express's A1 & A2 coaches reported fire due to unknown reasons after leaving the Hetampur Railway Station; no casualties were reported & passengers have been evacuated: Dr Shivam Sharma, CPRO/NCR (Video Courtesy: Unverified Source) pic.twitter.com/xzRnk7Xja2 — ANI (@ANI) November 26, 2021 చదవండి: తాజ్ ఎక్స్‌ప్రెస్ రైలులో అగ్నిప్రమాదం -
కరోనా అలర్ట్: 100 బెడ్లు రెడీ!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా (కోవిడ్-19) వ్యాప్తి అంతకంతకూ పెరుగుతుండటంతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్ బారినపడకుండా ప్రజల్లో అవగాహన కల్పించడంతోపాటు బాధితులకు సత్వర వైద్య చికిత్స అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈక్రమంలోనే కేంద్రపాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్‌లోని ఉద్ధంపూర్‌లో 100 పడకలు గల 4 ఐసోలేషన్ వార్డులు సిద్ధమయ్యాయని ట్విటర్ వేదికగా కేంద్రం వెల్లడించింది. ఉద్ధంపూర్‌లోని కమాండ్ ఆస్పత్రిలో ఈ ఏర్పాటు చేసినట్టు తెలిపింది. కరోనా అనుమానితులకు చికిత్స అందించేందుకు స్పెషలిస్టు డాక్టర్ల బృందాన్ని ఏర్పాటు చేసినట్టు పేర్కొంది. కాగా, గురువారం రాత్రి 9 గంటల వరకు దేశ వ్యాప్తంగా 74 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, ప్రపంచవ్యాప్తంగా ఆ సంఖ్య 1,28,872 కు చేరడం ఆందోళనకరం. (చదవండి: దేశవాసులకు ప్రధాని మోదీ కీలక సూచనలు!) (చదవండి: చివరి రోజు మ్యాచ్.. ప్రేక్షకులు లేకుండానే!) (చదవండి: కరోనా : స్కూళ్లు, కాలేజీలు, సినిమాలు అన్నీ బంద్) -
దగ్గు మందు తాగి 9మంది మృతి
సాక్షి, శ్రీనగర్: ఫార్మాసుటికల్ కంపెనీలు మందులు తయారు చేసే ప్రదేశాలు ఎక్కడున్నా ఉత్పత్తులు మాత్రం దేశం నలుమూలలకి వెళ్తుంటాయి. ఏ కొంత నిర్లక్ష్యం వహించినా వాటి వలన జరిగే నష్టం అంచనా వేయలేం. తాజాగా జమ్మూలో చిన్నారులకు దగ్గు మందు కావాల్సి వచ్చింది. హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన ఓ కంపెనీ వాటి ఉత్పత్తులను జమ్ములోని ఉదంపూర్ జిల్లా చిన్నారులకు పంపింది. అందులో పాయిజన్ కాంపౌండ్ కలిపిన సంగతి తెలియని చిన్నారులు 17 మంది తాగి అస్వస్థతకు గురయ్యారు. గత నెలరోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో పరిస్థితి విషమించి 9మంది ప్రాణాలు కోల్పోయారు. 'ప్రైమా ఫేసీ', 'డై ఇథిలీన్ గ్లైకాల్' అనే రెండు విష పదార్థాలు కోల్డ్ బెస్ట్ పీసీ టానిక్‌లో కలిశాయి. వీటి కారణంగానే ఉదంపూర్, ఛండీఘర్లోని చిన్నారుల ప్రాణాలు కోల్పోవడానికి కారణమైందని' డ్రగ్ అండ్ ఫుడ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ డ్రగ్స్ కంట్రోలర్ వెల్లడించారు. ఈ దగ్గుమందు కారణంగా ఊపిరితిత్తులు చెడిపోయి మరణాలు సంభవించినట్లు డైరక్టర్ హెల్త్ సర్వీస్‌కు చెందిన డా.రేణు శర్మ తెలిపారు. విషయం తెలిసిన వెంటనే ఆ కంపెనీ ఉత్పత్తులను 8 రాష్ట్రాల్లో మొత్తంగా 5,500 మందు బాటిళ్లను సీజ్ చేశారు. తయారీ యూనిట్‌ను కూడా మూసివేసినట్లు అధికారులు తెలిపారు. కాగా ఈ కంపెనీ మందులు సరఫరా అయ్యే ఉత్తరాఖండ్, హర్యానా, తమిళానాడు, ఉత్తరప్రదేశ్, మేఘాలయ, త్రిపురలో తనిఖీలు చేపడుతున్నట్లు హిమాచల్‌ప్రదేశ్ ఉన్నతాధికారులు వెల్లడించారు. -
జవాన్ కాల్పులు : ఇద్దరు కొలీగ్స్ మృతి
జైపూర్ : స్వల్ప వివాదంతో ఆగ్రహానికి లోనైన ఓ సీఐఎస్ఎఫ్ జవాన్ ఉద్ధంపూర్‌లోని శిబిరం లోపల కాల్పులు జరపడంతో ఇద్దరు సీఐఎస్ఎఫ్ జవాన్లు మరణించగా, మరొకరికి తీవ్రగాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. ఉద్ధంపూర్ జిల్లా కేంద్రానికి ఐదు కిలోమీటర్ల దూరంలోని సుయి గ్రామంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఓ అంశంపై వాగ్వాదం చెలరేగడంతో జవాన్ తన సహచరులపై కాల్పులు జరిపాడని ప్రాథమిక సమాచారం ప్రకారం తెలుస్తోంది. కాల్పుల్లో గాయపడిన ముగ్గురు జవాన్లను ఉద్ధంపూర్ జిల్లా ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఇద్దరు మరణించారని వైద్యులు నిర్ధారించారు. మరో బాధితుడికి వైద్య నిపుణుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని సీనియర్ పోలీస్ అధికారులు వెల్లడించారు. -
పెళ్లి నుంచి నేరుగా ఓటేయడానికి..
శ్రీనగర్ : ఎన్ని పనులున్నా ఓటుహక్కును తప్పకుండా వినియోగించుకోవాలనే ఉద్దేశ్యంతో పెళ్లి నుంచి నేరుగా ఓ కొత్త జంట ఓటు వేయడానికి పోలింగ్ బూత్‌కు రావడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. జమ్ము కశ్మీర్‌లోని ఉదంపుర్ పోలింగ్ బూత్‌కు పెళ్లి దుస్తుల్లోనే వచ్చిన ఈ జంటకు సంబంధించి వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాలో వైరల్ అవుతోంది. కొత్తజంటకు వివాహ శుభాకాంక్షలు చెబుతూ, ఓటు హక్కును తప్పకుండా ప్రతిఒక్కరు వినియోగించుకునేలా ఈ జంట అందరికీ స్పూర్తినిస్తుందని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. కాగా, దేశవ్యాప్తంగా రెండో విడత లోక్‌సభ ఎన్నికలు గురువారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మొత్తం 95 స్థానాల్లో నేడు పోలింగ్ జరగనుంది. ఒక కేంద్రపాలిత ప్రాంతం, 11 రాష్ట్రాల్లో పోలింగ్ జరగనుంది. పలువురు రాజకీయ ప్రముఖులు రెండో దఫా ఓటింగ్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. రెండో దశ పోలింగ్‌లో మొత్తంగా 1,600 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మొత్తంగా 15.8 కోట్ల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఉదయం 7 గంటలకు ప్రారంభంమైన పోలింగ్ సాయంత్రం 5గంటల వరకు కొనసాగనుంది. -
పెళ్లి నుంచి నేరుగా ఓటేయడానికి..
-
‘యుద్ధం’పూర్
కశ్మీర్‌లోని జమ్మూ ప్రాంతంలో కీలక లోక్‌సభ స్థానం ఉధంపూర్. హిందూ ఓటర్లు మెజారిటీగా ఉన్న ఈ నియోజకవర్గంలో బీజేపీ నుంచి కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ 2014లో గెలుపొందారు. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం గులాం నబీ ఆజాద్‌ను ఆయన దాదాపు 61 వేల ఓట్ల ఆధిక్యంతో ఓడించారు. కశ్మీర్ మాజీ సంస్థానాధీశుడు, రాజా హరిసింగ్ కుమారుడు, కేంద్ర మాజీ మంత్రి కరణ్‌సింగ్ (కాంగ్రెస్) గతంలో నాలుగుసార్లు ఇక్కడి నుంచే లోక్‌సభకు ఎన్నికయ్యారు. జమ్మూ, కశ్మీర్ నేషనల్ పాంథర్స్ పార్టీ నేత భీమ్‌సింగ్ 1988 ఉప ఎన్నికలో ఒకసారి ఇక్కడ విజయం సాధించారు. ఈసారి సిట్టింగ్ సభ్యుడు జితేంద్రసింగ్ బీజేపీ తరఫున, కాంగ్రెస్ టికెట్‌పై కరణ్‌సింగ్ కొడుకు విక్రమాదిత్యసింగ్ పోటీ చేస్తున్నారు. గ్వాలియర్ మాజీ సంస్థానాధీశుల కుటుంబానికి చెందిన మాధవరావు సింధియా కుమార్తెను విక్రమాదిత్య 1987లో వివాహమాడారు. పాంథర్స్ పార్టీ తరఫున హర్షదేవ్సింగ్ పోటీలో ఉన్నారు. 16.85 లక్షల ఓటర్లున్న ఈ సీటుకు ఏప్రిల్ 18న (రెండో దశ) పోలింగ్ జరగనుంది. ఏడు జిల్లాల్లోని 17 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉధంపూర్ లోక్‌సభ స్థానం పరిధిలో ఉన్నాయి. బీజేపీ నాలుగుసార్లు విజయం బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చమన్‌లాల్ గుప్తా గతంలో మూడుసార్లు ఉధంపూర్ నుంచి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. తర్వాత 2014లో జితేంద్రసింగ్ గెలిచారు. మాజీ సీఎం ఫరూఖ్ అబ్దుల్లా నాయకత్వంలోని నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ కలిసి పోటీచేస్తుండటంతో బీజేపీ గెలుపు అంత తేలిక కాదని భావిస్తున్నారు. బీజేపీ తిరుగుబాటు అభ్యర్థిగా చౌధరీ లాల్‌సింగ్ పోటీకి దిగడంతో హిందూ ఓట్లు చీలిపోతాయని అంచనా. కఠువా రేప్ కేసులో నిందితులకు అనుకూలంగా లాల్‌సింగ్ మాట్లాడి వివాదం సృష్టించారు. 2014 ఎన్నికల్లో బీజేపీ టికెట్‌పై అసెంబ్లీకి ఎన్నికైన లాల్‌సింగ్ తర్వాత మంత్రి అయ్యారు. ‘కఠువా’ పరిణామాలతో బీజేపీ రాజీ నామా చేయించింది. నలుగురు అభ్యర్థులూ రాజపుత్ర వర్గానికి చెందినవారే. కఠువా ఘటనలో బాధితులైన బక్రవాల్ ముస్లిం వర్గం ఓట్లు కాంగ్రెస్‌కే పడతాయని అంచనా. మాజీ సీఎం మహబూబా ముఫ్తీ.. కాంగ్రెస్‌కు అనుకూలంగా అభ్యర్థిని నిలపకపోవడం విక్రమాదిత్యకు కలిసొచ్చే అంశం. లాల్‌సింగ్ ర్యాలీలకు అనూహ్య స్పందన! కఠువా ఘటనతో సంచలనం సృష్టించిన లాల్‌సింగ్ ర్యాలీల్లో జనం పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. హిందువులకు ప్రధాని నరేంద్ర మోదీపై ఉన్న అభిమానం ఇక్కడ తగ్గలేదనీ, ఎంపీ అభ్యర్థి ఎవరనే పట్టింపు లేదనీ, ఈ కారణంగా బీజేపీ విజయావకాశాలు మెండుగా ఉన్నాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. లాల్‌సింగ్ చీల్చే ఓట్లు గణనీయంగా ఉంటే జితేంద్రసింగ్ గెలుపు కష్టమే అవుతుంది. కశ్మీర్ మాజీ రాజ కుటుంబానికి చెందిన విక్రమాదిత్యకు హిందువుల నుంచి లభించే ఆదరణ ఉధంపూర్ ఫలితాన్ని నిర్ణయిస్తుంది. పీడీపీ మద్దతు వల్ల విక్రమాదిత్యకు ముస్లింల ఓట్లు లభిస్తే కాంగ్రెస్ విజయావకాశాలు మెరుగవుతాయి. మొత్తం మీద 2014తో పోల్చితే ఈసారి బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోటీ ఉందని చెప్పవచ్చు. -
జమ్ము కశ్మీర్లో ఘోర ప్రమాదం
శ్రీనగర్ : జమ్ము, కశ్మీర్‌లోని ఉద్దంపూర్ జిల్లా మజాల్తా సమీపంలో గత రాత్రి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ బస్సు అదుపు తప్పి లోయలో పడిపోవటంతో ఆరుగురు మృతి చెందగా, మరో 38మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. బస్సు సురిన్సార్ నుంచి శ్రీనగర్ వెళుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్ సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. -
రెండు రోజులుగా రోడ్లపైనే వాహనాలు..
జమ్ము కశ్మీర్ : జమ్ము కశ్మీర్‌లోని ఉదయ్పుర్లో జాతీయ రహదారిపై కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. గత రెండు రోజులుగా ఎక్కడున్న వాహనాలు అక్కడే ఆగిపోయాయి. భారీగా వర్షం, మంచు కురుస్తుండటంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. వాహనదారులు సేదతీరడానికి రోడ్ల పక్కన తాత్కాలిక ఏర్పాట్లను జిల్లా అధికారులు చేశారు. హెల్ప్‌లైన్ నెంబర్‌ను కూడా జారీ చేశారు. మరోవైపు రోడ్డు క్లియర్ చేయడనికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. -
జాతీయ రహదారి వద్ద పేలుడు పదార్థం స్వాధీనం
ఉద్దంపూర్ : జమ్మూ కాశ్మీర్ ఉద్దంపూర్ జిల్లా ఖేరి ప్రాంతంలో జమ్మూ - శ్రీనగర్ జాతీయ రహదారి సమీపంలో ఉన్న భారీ ఎత్తున టీఎన్టీ పేలుడు పదార్థాన్ని సీఆర్పీఎఫ్ దళాలు మంగళవారం గుర్తించాయి. ఆ పేలుడు పదార్థాన్ని స్వాధీనం చేసుకుని సీజ్ చేశాయి. జాతీయ రహదారిపై పడిన కొండ చరియలు తొలగించే క్రమంలో ఈ టీఎన్టీని కనుగొన్నట్లు సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు తెలిపారు. దీనిపై విచారణ జరగుతుందని చెప్పారు. -
కాశ్మీర్ లో ఎన్నికలపై దాడి చేసే కుట్ర భగ్నం
జమ్మూ కాశ్మీర్ లో ఎన్నికలను భగ్నం చేసేందుకు, వోటు వేయాలనుకున్న ప్రజల్లో భయాందోళనలు సృష్టించేందుకు ఉగ్రవాదులు పన్నిన కుట్రను భద్రతాదళాలు విఫలం చేశాయి. జమ్మూ ప్రాంతంలోని డోడా జిల్లాలోని పూనేజా-భదర్వాహ్ ఏరియాలోని రంట్ సాకా అడవుల్లో ఉగ్రవాదులు దాచిపెట్టిన ఆయుధాలను పోలీసులు చేజిక్కించుకున్నారు. పోలీసులు రంట్ సాకా అడవుల్లోని కొండకోనల్లో భదానీ నాలా పక్కన దాదాపు 48 గంటల పాటు వెతికి, 8 కిలోల ఆర్డ డీ ఎక్స్, ఆరు ఆధునిక ఆయుధాలను, ఏడు గ్రెనేడ్లు, భారీ మొత్తంలో మందుగుండు సామగ్రిని, కమ్యూనికేషన్ పరికరాలు,పాకిస్తానీ కరెన్సీ, రెండు డిటోనేటర్లు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. స్థానిక ఉగ్రవాదుల సాయంతో విదేశీ ఉగ్రవాదులు ఈ స్థావరాన్ని నిర్మించారు. ఈ స్థావరం నుంచి ఉగ్రవాదులు ఎన్నికలను భగ్రం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఖచ్చితమైన సమాచారం లభించిన తరువాత భద్రతాదళాలు ఈ ఏరియాలో సోదాలు జరిపాయి. భదర్వాహ్ - డోడా ఉధమ్ పూర్ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. ఈ నియోజకవర్గం నుంచి కేంద్ర మంత్రి, మాజీ ముఖ్యమంత్రి గులామ్ నబీ ఆజాద్ పోటీలో ఉన్నారు.