జమ్ము కశ్మీర్‌లో ఘోర ప్రమాదం | Bus falls into deep gorge in Jammu Kashmir | Sakshi
Sakshi News home page

లోయలో పడ్డ బస్సు, ఆరుగురు మృతి

Published Sat, Mar 2 2019 9:09 AM | Last Updated on Sat, Mar 2 2019 11:11 AM

Bus falls into deep gorge in Jammu Kashmir  - Sakshi

శ్రీనగర్ : జమ్ము, కశ్మీర్‌లోని ఉద్దంపూర్ జిల్లా మజాల్తా సమీపంలో గత రాత్రి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ బస్సు అదుపు తప్పి లోయలో పడిపోవటంతో ఆరుగురు మృతి చెందగా, మరో 38మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. బస్సు సురిన్‌సార్‌ నుంచి శ్రీనగర్‌ వెళుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్‌ సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస‍్పత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement