Bus accident
-
ట్రక్కును ఢీకొన్న బస్సు.. 38 మంది మృతి
బ్రెసీలియా: బ్రెజిల్ దేశంలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. హైవేపై బస్సును ట్రక్కు ఢీకొన్న ఘటనలో దాదాపు 38 మంది మృతిచెందగా.. మరికొందరు గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.వివరాల ప్రకారం.. బ్రెజిల్‌లోని మినాస్గైరస్ నగరంలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. హైవేపై ట్రక్కును బస్సు ఢీకొన్న ఘటనలో 38 మంది మృతిచెందారు. బస్సు ప్రయాణంలో ఉండగా టైర్ ఊడిపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్టు బ్రెజిల్ దేశ మీడియా తెలిపింది. అయితే, టైర్ ఉడిపోవడంతో డ్రైవర్ బస్సును కంట్రోల్ చేసే సమయంలో వేగంగా ట్రక్కు ఢీకొన్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో మరో 13 మంది గాయపడటంతో వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.MG: acidente com ônibus, carreta e carro deixa 38 mortosÔnibus vinha de São Paulo com 45 passageiros. O acidente ocorreu quando um pneu do coletivo estourou, em Teófilo Otoni, Minas Gerais pic.twitter.com/JAzdqjOol5— Regresso Nacional (@RegressoNaciona) December 22, 2024 -
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ సమీపంలో బస్సు ప్రమాదం
-
రాళ్ల గుట్టను ఢీకొన్ని కావేరి ట్రావెల్స్ బస్సు..
సాక్షి, నల్లగొండ: నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. కావేరి ట్రావెల్స్‌కు చెందిన బస్సు ప్రమాదానికి గురికావడంతో ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ సమీపంలో కావేరి ట్రావెల్స్‌కు చెందిన బస్సు ప్రమాదానికి గురైంది. అదుపు తప్పి రాళ్ల గుట్టను బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పది మంది ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. బాధితులు స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే, డ్రైవర్ నిద్రమత్తులో ఉండటంతో బస్సు ప్రమాదానికి గురైనట్టు తెలుస్తోంది. -
Mumbai : ఆర్టీసీ బస్సు ప్రమాదం.. వెలుగులోకి సంచలన విషయాలు
ముంబై : ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు బీభత్సం సృష్టించిన ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బస్సు డ్రైవర్ సంజయ్ మోర్కి ఎలక్ట్రిక్ బస్సు నడపడం రాదని, ఈవీ బస్సుపై అవగాహన లేకపోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు విచారణ అధికారులు నిర్ధారించారు. విచారణలో బస్సు డ్రైవర్ సంజయ్ ఇదే విషయాన్ని పోలీసులకు చెప్పినట్లు తేలింది. పోలీస్ కస్టడీలో ఉన్న పోలీసుల విచారణలో బస్సు డ్రైవర్ సంజయ్ మోర్ పలు కీలక విషయాల్ని వెల్లడించాడు. ఎలక్ట్రిక్ బస్సు నడపడంలో తనకు అనుభవం లేదని, కేవలం ఒక్క రోజు ఈవీ బస్సును డ్రైవింగ్ చేసినట్లు చెప్పాడు. ఆ ఒక్క రోజు కేవలం మూడుసార్లు నడిపిట్లు చేసినట్లు, అనంతరం విధులకు హజరైనట్లు పోలీసుల ఎదుట అంగీకరించాడు.కాబట్టే 60 కేఎంపీహెచ్ వేగంతో వెళ్తున్న ఈవీ బస్సును ఎలా కంట్రోల్ చేయాలో తనకు అర్ధం కాలేదని, కాబట్టే ఈ ఘోర ప్రమాదానికి దారి తీసినట్లు పోలీసులకు చెప్పాడు. అనుభవం లేకపోవడంతో ఎలక్ట్రిక్ బస్సు అదుపు తప్పి ఘోర ప్రమాదానికి దారి తీసింది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే కిటికి అద్దాలు పగులగొట్టి, తన క్యాబిన్లో ఉన్న బ్యాగ్ తీసుకుని పారిపోయినట్లు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.ముంబై ఆర్టీసీ విభాగంపై విమర్శలుముంబై ఆర్టీసీ నిబంధనల ప్రకారం.. ఆరు వారాల పాటు ఎలక్ట్రిక్ బస్సు డ్రైవింగ్ శిక్షణ పూర్తి చేయాల్సి ఉంటుంది. నిబంధనలకు విరుద్ధంగా సంజయ్ మోరాకు ఈవీ బస్సులో విధులు అప్పగించడంపై ముంబై ఆర్టీసీ అధికారుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఆర్టీసీ బస్సు బీభత్సంగత సోమవారం సాయంత్రం 9.30 గంటల సమయంలో హౌసింగ్ కాలనీలో కుర్లాలోని ఎస్జీ బార్వేరోడ్‌లో ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు బీభత్సం సృష్టించింది. బ్రేకులు ఫెయిలవ్వడంతో దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించారు. 42మందికి తీవ్ర గాయాలయ్యాయి. 20కి పైగా వాహనాలు ధ్వంస మయ్యాయి. బస్సు ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు బస్సు డ్రైవర్ సంజయ్ మోర్(43)ని అరెస్ట్ చేశారు. బృహన్ ముంబై ఎలక్ట్రిక్ సప్లయ్ అండ్ ట్రాన్స్పోర్ట్ (బెస్ట్)కు చెందిన బస్సు కుర్లా స్టేషన్ నుంచి అంధేరికీ వెళ్తుండగా బ్రేక్‌లు ఫెయిల్ కావడంతో ప్రమాదం జరిగినట్టు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు నిర్ధారించారు. 👉చదవండి : ఆర్టీసీ బస్సు బీభత్సం.. జనాలపైకి దూసుకెళ్లి.. -
ఫస్ట్ డే డ్యూటీకి వెళ్లింది.. అంతలోనే అంతులేని విషాదం
19 ఏళ్ల అఫ్రీన్ షా ఎంతో హుషారుగా తన జీవితంలో తొలి రోజు ఉద్యోగానికి వెళ్లింది. కానీ అదే ఆమెకు చివరి రోజు అవుతుందని ఆమె ఊహించలేదు. అఫ్రీన్ షా కుటుంబ సభ్యులు కూడా అనుకోలేదు. మొదటి రోజు డ్యూటీ ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చే సమయంలో ఆటోలు దొరక్కపోవడంతో తండ్రి అబ్దుల్ సలీంకు అఫ్రీన్ ఫోన్ చేసింది. కుర్లా స్టేషన్‌కు వెళ్లమని కూతురికి ఆయన సలహా ఇచ్చాడు. కొద్దిసేపటి తర్వాత ఆయనకు మరోసారి ఫోన్ వచ్చింది. అర్జెంటుగా ఆస్పత్రికి రావాలని ఫోన్ చేశారు. అతడు ఆస్పత్రికి వచ్చే చూసేసరికి కూతురు నిర్జీవంగా కనిపించడంతో సలీం కుప్పకూలిపోయారు. అపురూపంగా పెంచుకున్న తన కుమార్తె మృతదేహాన్ని చూసి గుండెలవిసేలా రోదించాడు.కన్నిస్ అన్సారీ(55) అనే నర్సు నైట్ షిప్ట్ డ్యూటీ చేసేందుకు బయలుదేరి అనూహ్యంగా పప్రాణాలు కోల్పోయింది. వీరిద్దరితో పాటు మరో ఐదుగురిని బస్సు రూపంలో మృత్యువు కబళించింది. ముంబై మహానగరంలోని కుర్లా ప్రాంతంలో సోమవారం రాత్రి జరిగిన బస్సు ప్రమాదం ఏడుగురిని బలిగొంది. 42 మందిని గాయాలపాల్జేసింది. కుర్లా రైల్వే స్టేషన్ - అంధేరి మధ్య నడిచే రూట్ నంబర్ 332 బృహన్ ముంబయి ఎలక్ట్రిక్ సప్లయ్ అండ్ ట్రాన్స్పోర్ట్ (బెస్ట్) బస్సు అదుపుతప్పి విధ్వంసం సృష్టించడంతో ఈ ఘోరం జరిగింది. కుర్లా వెస్ట్‌లోని అంజుమన్-ఇ-ఇస్లాం స్కూల్ సమీపంలో నిన్న రాత్రి 9.30 గంటల సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.డ్రైవర్ తప్పిదం వల్లే..బస్సు డ్రైవర్ సంజయ్ మోర్(43) తప్పిదం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. వేగంగా దూసుకొచ్చిన బస్సు.. పోలీసు వ్యాను, కార్లు, టూవీలర్లు, తోపుడు బండ్లతో సహా 22 వాహనాలను ఢీకొట్టింది. చివరకు గోడను ఢీకొని ఆగిపోయింది. ప్రమాద తీవ్రత చూసిన వారంతా ఉగ్రదాడిగా భయపడి పరుగులు తీశారు. ‘ప్రమాదానికి గురైన వాహనాల జాబితాను సిద్ధం చేశాం. 22 వాహనాలను బస్సు ఢీకొట్టినట్టు మా దృష్టికి వచ్చింది. బస్సు డ్రైవర్ సంజయ్ మోర్ మరిన్ని వాహనాలను ఢీకొట్టాడో, లేదో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నామ’ని ముంబై జోన్ 5 పోలీస్ డిప్యూటీ కమిషనర్ గణేష్ గవాడే మీడియాతో చెప్పారు.బస్సు కండిషన్లోనే ఉందిబస్సు బ్రేకులు ఫెయిల్ కావడం వల్లే ప్రమాదం జరిగిందన్న వార్తలను గవాడే తోసిపుచ్చారు. బస్సు మంచి కండిషన్లో ఉందని, డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్లే దుర్ఘటన జరిగిందన్నారు. డిసెంబర్ 1 నుంచి డ్రైవర్ సంజయ్ మోర్ బెస్ట్ బస్సు నడుపతున్నాడని, గతంలో అతడు మాన్యువల్ మినీ బస్సు నడిపేవాడని వెల్లడించారు. ప్రయాణికులతో కూడిన బస్సును నడిపేందుకు అవసరమైన శిక్షణ తీసుకున్నాడా, లేదా విషయాన్ని పరిశీలిస్తున్నామన్నారు. కాగా, డ్రైవర్‌ను డిసెంబర్ 21 వరకు పోలీసు కస్టడీకి అప్పగిస్తూ కుర్లా కోర్టు ఆదేశాలిచ్చింది.చదవండి: 150 అడుగుల బోరుబావిలో బాలుడు..‘ప్రమాదానికి కారణమైన బస్సులో ఎటువంటి సాంకేతిక లోపం లేదు. యాక్సిలరేట్ ఇచ్చిన తర్వాత వేగాన్ని నియంత్రించడంలో డ్రైవర్ విఫలమయ్యాడు. భయాందోళనకు గురై బ్రేక్‌కు బదులుగా యాక్సిలరేటర్ తొక్కాడు. అతడు మొదట ఆటోరిక్షాను ఢీకొట్టాడు. ఆ తర్వాత పోలీసు వాహనం, ద్విచక్ర వాహనాలు, తోపుడు బండ్లను ఢీకొట్టాడు. గోడను ఢీకొట్టిన తర్వాత మాత్రమే బస్సు ఆగింద’ని డీసీపీ గణేష్ గవాడే తెలిపారు. డ్రైవర్‌పై కేసు నమోదు చేసి అరెస్టు చేశామని, సంబంధిత శాఖలు విచారించి నివేదిక సమర్పించాక తదుపరి చర్యలు చేపడతామన్నారు. సంజయ్ మోర్ మద్యం సేవించి బస్సు నడిపాడా లేదా అన్నది నిర్ధారించేందుకు అతడికి పోలీసులు వైద్య పరీక్షలు చేయించారు. ప్రమాదంపై విచారణకు జరిపేందుకు ఫోరెన్సిక్, రీజినల్ ట్రాన్స్‌ఫోర్ట్ కార్యాలయ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.ప్రత్యక్ష సాక్షులు ఏమన్నారంటే?బస్సు ప్రమాదాన్ని చూసి ప్రత్యక్ష సాక్షులు భయాందోళన చెంతారు. సహాయక చర్యల్లో పాల్గొని బాధితులను ఆస్పత్రులకు తరలించడంలో సాయపడ్డారు. ప్రత్యక్ష సాక్షి జైద్ అహ్మద్ (26) మీడియాతో మాట్లాడుతూ.. ‘నేను రైల్వే స్టేషన్‌కు వెళ్లేందుకు ఇంటి నుంచి బయలుదేరుతుండగా పెద్ద శబ్ధం వినిపించింది. వెంటనే సంఘటనా స్థలానికి పరిగెత్తాను. పాదచారులతో పాటు ఆటోరిక్షా, మూడు కార్లు, ఇతర వాహనాలను బస్సు ఢీకొట్టింది. నా కళ్ల ముందు కొన్ని మృతదేహాలను చూశాను. ఆటోరిక్షాలో ఉన్న ప్రయాణికులను రక్షించి బాబా ఆసుపత్రికి తీసుకెళ్లాం. మరో మూడు చక్రాల వాహనం కూడా క్షతగాత్రులకు సహాయం అందించింద’ని తెలిపాడు.సీఎం ఫడ్నవీస్ దిగ్భ్రాంతిముంబై బస్సు ప్రమాదంపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించారు. క్షతగాత్రుల చికిత్సకు అయ్యే ఖర్చును బృహన్ ముంబై ఎలక్ట్రిక్ సప్లయ్ అండ్ ట్రాన్స్పోర్ట్ (బెస్ట్) భరిస్తుందన్నారు. -
Mumbai: ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది
-
ఆర్టీసీ బస్సు బీభత్సం.. జనాలపైకి దూసుకెళ్లి..
ముంబై: కుర్లాలోని ఎస్జీ బార్వేరోడ్‌లో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. బ్రేకులు ఫెయిలవ్వడంతో పాదచారులపై దూసుకెళ్లినట్లు సమాచారం. మృతులను శివమ్ కశ్యప్ (18), కనీజ్ ఫాతిమా (55), అఫీల్ షా (19), అనమ్ షేక్ (20)లు మరణించారు. 29మంది గాయపడ్డారు. ఐదారు ఆటోలు, 10 ద్విచక్రవాహనాలు ధ్వంసమయ్యాయి. సోమవారం సాయంత్రం 9.30 గంటల సమయంలో హౌసింగ్ కాలనీలో బృహన్ ముంబయి ఎలక్ట్రిక్ సప్లయ్ అండ్ ట్రాన్స్పోర్ట్ (బెస్ట్)కు చెందిన కుర్లా- అంధేరి రైల్వే స్టేషన్ మధ్య నడిచే రూట్ నంబర్ 332 బస్సుగా గుర్తించారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు బస్సు డ్రైవర్ సంజయ్ మోర్(43)ని అరెస్ట్ చేశారు. సహాయక చర్యల్ని ముమ్మరం చేపట్టారు. ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులను అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బస్సు బ్రేకులు ఫెయిలవ్వడంతో జరిగిన ప్రమాద తీవ్రతను చూసిన స్థానికులు ఉగ్రదాడి తరహాలో ఉండడంతో భయాందోళనకు గురయ్యారు. పలువురు ప్రాణ భయంతో పారిపోయారు. పరిస్థితిని అదుపు చేసేందుకు క్విక్ రెస్పాన్స్ టీమ్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బంది రంగంలోకి దిగారు.బృహన్ ముంబయి ఎలక్ట్రిక్ సప్లయ్ అండ్ ట్రాన్స్పోర్ట్ (బెస్ట్)కు చెందిన బస్సు కుర్లా స్టేషన్ నుంచి అంధేరికీ వెళ్తుండగా బ్రేక్‌లు ఫెయిల్ కావడంతో ప్రమాదం జరిగినట్టు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తెలిపారు. అయితే ఆ బస్సు డ్రైవర్ సంజయ్ మోర్ కాంట్రాక్ట్ డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. బస్సు ప్రమాదానికి గల కారణాల్ని గుర్తించేందుకు ఆర్టీఓ అధికారి రవి గైక్వాడ్ నిపుణుల బృందం రంగంలోకి దిగింది.జాయింట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ సత్యనారాయణ చౌదరి స్వయంగా కుర్లా పోలీస్ స్టేషన్లో డ్రైవర్‌ను విచారించారు. సంజయ్ మోర్‌ను వైద్య పరీక్షల నిమిత్తం జేజే ఆస్పత్రికి తరలించి విచారణ చేపట్టారు. ఇదీ చదవండి : నా డెత్ లేఖ సుప్రీం కోర్టుకు చేరాలి -
మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. 10 మంది మృతి
ముంబై : మహరాష్ట్రలో ఘోర బస్సు ప్రమాదం సంభవించింది. బస్సు బోల్తాపడి 10 ప్రయాణికులు మరణించారు. పలువురి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదంతో అప్రమత్తమైన స్థానికులు క్షతగాత్రుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. బస్సు ప్రమాదంపై పోలీసులు తెలిపిన వివరాల మేరకు... మహరాష్ట్ర స్టేట్ రోడ్డు ట్రాన్స్ పోర్ట్ కార్పేషన్(ఎంఎస్ఆర్టీసీ)కు చెందిన బస్సు శుక్రవారం మధ్యాహ్నం భండారా నుండి సకోలి మీదుగా గోండియా అనే ప్రాంతానికి వెళ్తుంది.ఆ సమయంలో ఓ మలుపు వద్ద ఆర్టీసీ బస్సుకు అకస్మాత్తుగా ఓ ద్విచక్ర వాహనదారుడు ఎదురుగా వచ్చాడు. ఆకస్మిక పరిణామంతో అప్రమత్తమైన బస్సు డ్రైవర్ ప్రమాదం జరగకుండా బస్సును పక్కకి తిప్పాడు. దీంతో బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో బస్సులో ఉన్న 35 మంది ప్రయాణికుల్లో 10 మరణించారు. ప్రమాదం జరిగిన వెంటనే ప్రాణ భయంతో బస్సు డ్రైవర్ ఘటనా స్థలం నుంచి పారిపోయాడు. బస్సు ప్రమాదంతో అప్రమత్తమైన స్థానికులు, తోటి వాహనదారులు ప్రయాణికుల్ని రక్షించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యల్ని ముమ్మరం చేశారు.ప్రమాద బాధితులకు ఎక్స్ గ్రేషియాబస్సు ప్రమాదంపై మహరాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే విచారం వ్యక్తం చేశారు. ప్రమాద బాధితులకు తక్షణమే రూ.10లక్షలు ఎక్స్‌గ్రేషియా అందించాలని రవాణా శాఖకు ఆదేశాలు జారీచేశారు. మృతుల కుటుంబ సభ్యులకు మహరాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంపై ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ..‘గోండియా జిల్లాలోని సడక్ అర్జున్ సమీపంలో శివషాహి ఆర్టీసీ బస్సు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ప్రయాణికుల మరణం నన్ను కలచి వేస్తుంది. మరణించిన వారికి నా నివాళి’అని తెలిపారు. ‘ఈ ఘటనలో గాయపడిన ప్రయాణికులకు మెరుగైన వైద్య సేవల కోసం అవసరమైతే ప్రైవేట్ ఆస్పత్రికి తరలించాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.ఈ ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను' అని ఫడ్నవీస్ ట్వీట్లో పేర్కొన్నారు. गोंदिया जिल्ह्यातील सडकअर्जुनीनजीक शिवशाही बसचा दुर्दैवी अपघात होऊन काही प्रवाशांचा मृत्यू झाल्याची घटना अतिशय दुर्दैवी आहे. मृतांना मी भावपूर्ण श्रद्धांजली अर्पण करतो. त्यांच्या कुटुंबीयांच्या दु:खात आम्ही सहभागी आहोत.या घटनेत जे लोक जखमी झाले, त्यांना खाजगी रुग्णालयात उपचार…— Devendra Fadnavis (@Dev_Fadnavis) November 29, 2024 -
కష్టజీవులను కబళించిన మృత్యుశకటం.. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
గార్లదిన్నె: వారంతా వ్యవసాయ కూలీలు.. రెక్కాడితేగానీ డొక్కాడని నిరుపేదలు. రోజూ మాదిరిగానే ఉదయాన్నే పనులకు వెళ్లారు. పనులు ముగించుకుని ఆటోలో ఇంటికి వెళ్తుండగా ఆర్టీసీ బస్సు రూపంలో మృత్యుశకటం కబళించింది. ఈ ఘటనలో ఎనిమిది మంది దుర్మరణం చెందగా.. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతపురం జిల్లా గార్లదిన్నెకు సమీపంలోని 44వ నంబరు జాతీయ రహదారిపై శనివారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బాధితుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. పుట్లూరు మండలం ఎల్లుట్ల గ్రామ ఎస్సీ కాలనీకి చెందిన 12 మంది వ్యవసాయ కూలీలు గార్లదిన్నె మండలం తిమ్మంపేట వద్ద అరటి తోటలో ఎరువు వేసే పనికోసం ఉదయమే ఆటోలో వచ్చారు. అక్కడ పని ముగించుకుని మధ్యాహ్నం ఇంటికి తిరుగు పయనమయ్యారు. తలగాచిపల్లి క్రాస్ వద్ద ఆటో గార్లదిన్నె వైపునకు మలుపు తీసుకుంటుండగా.. అదే సమయంలో అనంతపురం నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాలపెద్దయ్య అలియాస్ తాతయ్య (55), చిన్ననాగమ్మ (48) రామాంజినమ్మ (47), పెద్ద నాగమ్మ (60) అక్కడికక్కడే మృతిచెందారు. మిగిలిన వారికి తీవ్ర గాయాలయ్యాయి. ఆటోలో నుంచి రోడ్డు మీద పడి తీవ్రగాయాలతో హాహాకారాలు, ఆర్తనాదాలు చేస్తున్న కూలీలను స్థానికులు గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు.ఎస్ఐ గౌస్ మహమ్మద్ బాషా తన సిబ్బందితో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను 108 వాహనాల్లో అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చిన్ననాగన్న (55), జయరాముడు (48), కొండమ్మ (50), ఈశ్వరయ్య మృతిచెందారు. లక్ష్మీదేవి, పెద్దులమ్మ, రామాంజినమ్మ, గంగాధర్, ఆటో డ్రైవర్ నీలకంఠ తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నారు. మృతుల్లో చిన్ననాగన్న–చిన్ననాగమ్మ, ఈశ్వరయ్య–కొండమ్మ దంపతులు.ఒకేరోజు ఎనిమిది మంది మృతిచెందడం, ఐదుగురు గాయపడడంతో ఎల్లుట్ల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అనంతపురం ప్రభుత్వాస్పత్రి వద్ద బాధిత కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఈ ప్రమాదంపై గార్లదిన్నె పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. సంఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ జగదీష్, అనంతపురం రూరల్ డీఎస్పీ వెంకటేశ్వర్లు తదితరులు పరిశీలించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించనున్నట్లు కలెక్టర్ వినోద్‌కుమార్ తెలిపారు.మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి:వైఎస్ జగన్అనంతపురం జిల్లాలో శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గార్లదిన్నె మండలం తలగాచిపల్లె వద్ద ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో ఎనిమిది మంది మరణించారు. వీరంతా కూలి పనులకు వెళ్లొస్తూ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. వారి కుటుంబాలకు వైఎస్ జగన్ ప్రగాఢ సంతాపం తెలియజేశారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఉదారంగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని.. వారికి అవసరమైన సాయం అందజేయాలని కోరారు. -
ఉత్తరాఖండ్ లో ఘోర రోడ్డుప్రమాదం
-
కల్వర్టును ఢీకొట్టిన బస్సు.. 12 మంది మృతి
జైపూర్: రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సికార్‌లో మంగళవారం మధ్యాహ్నం బస్సు కల్వర్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందగా, పలువురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. సలాసర్ నుంచి వెళ్తున్న బస్సు సికర్ జిల్లాలోని లక్ష్మణ్‌గఢ్ వద్దకు రాగానే ఎదురుగా కల్వర్టును ఢీకొట్టింది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం లక్ష్మణ్‌గఢ్‌లోని ప్రభుత్వ సంక్షేమ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటి వరకు 12 మంది మృతి చెందినట్లు నిర్ధారించినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ మహేంద్ర ఖిచాడ్ తెలిపారు. #Sikar: #लक्ष्मणगढ़ पुलिया के पास भीषण हादसामृतकों की संख्या पहुंची12, एक और घायल ने तोड़ा दम, 35 से अधिक लोग हुए थे घायल, सीकर अस्पताल में पांच मृतकों के शव, सात शव रखे है लक्ष्मणगढ़ अस्पताल की मोर्चरी में, घायलों का जारी है इलाज, सुजानगढ़ से नवलगढ़ आ रही थी बस #RajasthanNews pic.twitter.com/LHZCnSpscb— Manoj Bisu Sikar (@manoj_bisu) October 29, 2024 -
విజ్ఞాన యాత్రలో విషాదం
విజయవాడ స్పోర్ట్స్/సాక్షి, అమరావతి: బెజవాడ బార్ అసోసియేషన్ (బీబీఏ) న్యాయవాదులు చేపట్టిన విజ్ఞాన యాత్రలో విషాదం చోటుచేసుకుంది. దసరా సెలవులు కావడంతో ఈ నెల 2న 80 మంది న్యాయవాదులు విజయవాడ నుంచి 2 బస్సుల్లో యాత్రకు బయలుదేరారు. ఆంధ్రా, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లోని పలు న్యాయస్థానాలు, విజ్ఞాన ప్రాంతాలను చూసుకుంటూ ఈ నెల 6న రాజస్థాన్ చేరుకున్నారు. 7న రాత్రి రాజస్థాన్‌లోని జైసల్మేర్ నుంచి జైపూర్ వస్తుండగా మార్గ మధ్యలోని జో«ధ్‌పూర్ వద్ద మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు ఓ బస్సు ప్రమాదానికి గురైంది.ఈ ప్రమాదంలో ఆలిండియా లాయర్స్ యూనియన్ అధ్యక్షులు, ప్రముఖ న్యాయవాది సుంకర రాజేంద్రప్రసాద్ సతీమణి జ్యోత్స్న మృతిచెందారు. రాజేంద్రప్రసాద్‌తో పాటు బీబీఏ కార్యదర్శి అరిగల శివరామప్రసాద్ (రాజా), న్యాయవాదులు పద్మజ, అరుణదేవి, నాగరాజు, గంగాభవాని, జయలక్ష్మీ, సత్యవాణి, శ్రీనివాసరావు, దుర్గాప్రసాద్‌తో పాటు మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మిగిలిన వారు స్వల్పగాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు జోధ్‌పూర్‌లోని ఆసుపత్రికి తరలించారు. మృతురాలు జ్యోత్స్న విద్యార్ధి ఉద్యమ కార్యకర్తగా పనిచేశారు. నేటి తరుణీతరంగాలు, సేఫ్ లను స్థాపించడంతో కీలకభూమిక పోషించారు. జ్యోత్స్న మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. మృతదేహాన్ని విమానంలో బుధవారం విజయవాడ తీసుకువచ్చేందుకు న్యాయవాదులు సన్నాహాలు చేస్తున్నారు. క్షతగాత్రులైన వారు సైతం విమానంలో విజయవాడ చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నామని, విమానం టికెట్లు లభించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని బీబీఏ కార్యదర్శి రాజా తెలిపారు. సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతిఈ ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో ప్రముఖ న్యాయవాది సుంకర రాజేంద్ర ప్రసాద్ సతీమణి జ్యోత్స్న మృతి చెందడంపై విచారం వ్యక్తం చేశారు. మహిళలు, విద్యార్థినులను చైతన్యం పరిచేందుకు పలు కార్యక్రమాలు నిర్వహించిన జ్యోత్స్న మృతి బాధాకరమన్నారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. బస్సు ప్రమాదానికి గల కారణాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని, అవసరమైన సాయం అందించాలని తన కార్యాలయ అధికారులకు సీఎం సూచించారు. రాజస్థాన్ సీఎం బజన్ లాల్ శర్మతో ఫోన్లో మాట్లాడి బాధితులకు అవసరమైన సాయం అందించాలని కోరారు. -
కేరళలో బస్సు ప్రమాదం.. ఇద్దరి మృతి
తిరువనంతపురం: కేరళలోని ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కోజికోడ్ తిరువంబాడి ప్రాంతంలో కర్టాటక ఆర్టీసీ బస్సు అదుపు తప్పి కల్వర్టును ఢీకొని కాళియంబుజ నదిలో పడిపోయింది. ఈ ప్రమాదం మంగళవారం మధ్యాహ్నం 1:40 గంటల సమయంలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.#Kerala: A tragic accident occurred in Thiruvambadi, Kozhikode, on Tuesday when a KSRTC bus veered off course, hitting a culvert and plunging into the Kaliyambuzha River.The incident, which took place around 1:40 p.m., claimed the life of 63-year-old Rajeswari from… pic.twitter.com/sPyFzhmyAW— South First (@TheSouthfirst) October 8, 2024 నదిలో పడేముందు బస్సు బోల్తా పడటంతో పలువురు ప్రయాణికులకు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని.. సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని కోజికోడ్ మెడికల్ కాలేజీ, ఓమసేరీలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మృతి చెందినవారిలో అనక్కంపోయిల్కు చెందిన 63 ఏళ్ల రాజేశ్వరి వృద్దురాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు తెలిపారు. -
జమ్ముకశ్మీర్‌లో బస్సు బోల్తా.. ముగ్గురు బీఎస్ఎఫ్ జవాన్ల మృతి
జమ్ముకశ్మీర్‌లోని బుద్గామ్ జిల్లాలో శుక్రవారం ఘోర ప్రమాదం జరిగింది. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) జవాన్లు ప్రయాణిస్తున్న బస్సు లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో 30 మంది సైనికులు గాయపడినట్లు సమాచారం. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. భద్రతా విధుల్లో భాగంగా బీఎస్ఎఫ్కు చెందిన ఏడు బస్సుల కాన్వాయ్ బయలుదేరింది. ఈ క్రమంలో బ్రెల్ గ్రామం వద్ద ఓ బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. సమాచారం అందిన వెంటనే స్థానికులు, సాయుధ బలగాలు అక్కడకు చేరుకొని సహాయ కార్యక్రమాలు చేపట్టాయి. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారుఘటనా స్థలంలో స్థానికులు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు మూడు దశల్లో జరుగుతున్నాయి. సెప్టెంబర్ 18న తొలిదశ పోలింగ్ పూర్తికాగా.. రెండో దశ సెప్టెంబర్ 25న జరగనుంది. -
చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఎనిమిది మంది మృతి
సాక్షి, చిత్తూరు: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు లారీలను బస్సు ఢీకొన్న ప్రమాదంలో ఎనిమిది మంది మృతిచెందారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. మొగిలిఘాట్ వద్ద శుక్రవారం మధ్యాహ్నాం ఈ ప్రమాదం జరిగింది. అయితే, బస్సు అదుపు తప్పి లారీని ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని అంబులెన్స్‌ల సాయంతో స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఘాట్ రోడ్లో ప్రమాదం జరగడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తున్నారు. ఇక, లారీ చిత్తూరు నుంచి ఐరన్ లోడ్‌తో బెంగళూరు వెళ్తోంది. ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ మనోహర్‌తో పాటు బస్సులో ప్రయాణీకులు మృతి చెందారు. -
విశాఖ కైలాసగిరి వద్ద టూరిస్ట్ బస్సుకి ప్రమాదం
విశాఖపట్నం, సాక్షి: కైలాసగిరి వద్ద సోమవారం సాయంత్రం ఘోరం జరిగింది. ఓ టూరిస్ట్ బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 18 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. బ్రేక్ ఫెయిల్ కావడంతో మలుపు వద్ద కొండను బస్సు ఢీ కొట్టినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారని, వీళ్లంతా పశ్చిమ బెంగాల్‌కు చెందిన టూరిస్టులు అని తెలుస్తోంది. వీళ్లలో 18 మందికి 18 మందికి స్వల్ప గాయాలు కాగా.. చికిత్స నిమిత్తం కేజీహెచ్ కు తరలించారు. 16 మందికి ప్రాథమిక చికిత్స చేసి డిశ్చార్జ్ చేయగా.. మరో ఇద్దరికి మాత్రం కేజీహెచ్ వైద్యులు చికిత్స కొనసాగిస్తున్నారు. -
లోయలో పడిన బస్సులు 44 మంది దుర్మరణం
పాకిస్థాన్‌లో ఘోర విషాదం చోటు చేసుకుంది. ఆదివారం (ఆగస్ట్ 25) జరిగిన రెండు వేర్వేరు బస్సు ప్రమాదాల్లో 44 మంది మరణించారు.పాకిస్థాన్‌లో జరిగిన రెండు వేర్వేరు బస్సు ప్రమాదాల్లో కనీసం 44 మంది మరణించారని, వీరిలో 12 మంది యాత్రికులు ఇరాన్‌లోకి వెళ్లకుండా అడ్డుకున్నారని రెస్క్యూ అధికారులు తెలిపారు.పంజాబ్ ప్రావిన్స్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ మధ్య సరిహద్దులోని ఆజాద్ పట్టాన్ సమీపంలో ప్రయాణిస్తున్న బస్సు లోయలో పడింది. ఈ దుర్ఘటనలో 22మంది మరిణించారు. ప్రమాదంపై అత్యవసర సేవల ప్రతినిధి ఫరూక్ అహ్మద్ మాట్లాడుతూ..15 మంది పురుషులు, ఆరుగురు మహిళలు, ఒక బిడ్డతో సహా ఇప్పటి వరకు 22 మంది మరణించారని తెలిపారు. అయితే ఈ ప్రమాదం ఎందుకు జరిగిందనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. మరో దుర్ఘటనలో బలూచిస్తాన్‌లోని మక్రాన్ కోస్టల్ హైవేపై పాకిస్థాన్ పౌరులు ఇరాన్‌లోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే ప్రమాదకరమైన రహదారిలో పోలీసుల నుంచి తప్పించుకుని ఇరాన్‌లోకి ప్రవేశించే క్రమంలో డ్రైవర్ మితిమీరిన వేగంతో నడపడంతో బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో సుమారు 12 మంది ప్రయాణికులు మరణించినట్లు పోలీసు అధికారి అస్లాం బంగూల్జాయ్ చెప్పారు. -
నేపాల్ లో ఘోర ప్రమాదం.. బస్సులో 40 మంది భారతీయులు
-
ఘోర బస్సు ప్రమాదం.. పది మంది మృతి
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బులంద్‌షహర్ జిల్లాలోని సేలంపూర్ వద్ద ఓ వ్యాన్‌ను బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందగా.. 27 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. #Bulandshahr #बुलंदशहर: बस और पिकअप की टक्कर में 9 लोगों की #मौत, 16 #घायल #गाजियाबाद की एक कंपनी से मैक्स में सवार सभी लोग अपने घर अलीगढ़ रक्षाबंधन का त्यौहार मनाने जा रहे थे#Accident #ghaziabad #RoadAccident @bulandshahrpol @myogioffice @dmbulandshahr @Uppolice @UPGovt pic.twitter.com/TLETZCCwMw— Goldy Srivastav (@GoldySrivastav) August 18, 2024 ఈ ప్రమాదంలో చనిపోయిన వారంతా అలీగఢ్ జిల్లా రాయ్ పూర్ ఖాస్ అహిర్ నాగ్లా గ్రామానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. జిల్లా కలెక్టర్ చంద్రప్రకాశ్ సింగ్, ఎస్ఎస్పీ శ్లోక్ కుమార్ జిల్లా ఆసుపత్రికి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆయన సిబ్బందిని ఆదేశించారు. ఈ ప్రమాద ఘటనపై స్పందించిన సీఎం యోగి ఆదిత్యనాథ్.. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. కాగా, మృతులను అలీఘర్ జిల్లా అత్రౌలీ తహసీల్‌లోని రాయ్‌పూర్ ఖాస్ అహిర్ నాగ్లా గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. -
ఆర్టీసీ బస్సు ప్రమాదం.. నడిరోడ్డుపై టైర్లు ఊడిపోయి..
సాక్షి, జగిత్యాల: జగిత్యాల జిల్లాలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణీకులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు చక్రాలు ఒక్కసారిగా ఊడిపోవడంతో ప్రమాదం జరిగింది. ఈ క్రమంలో బస్సు రోడ్డుపై కుంగిపోయింది. అధిక లోడ్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.కాగా, జగిత్యాల నుండి నిర్మల్ వెళ్తున్న ఆర్టీసీ పల్లె వెలుగు బస్సుకు ప్రమాదానికి గురైంది. అయితే, బస్సులో దాదాపు 150 మంది ప్రయాణీకులు ఎక్కారు. దీంతో, బస్సు కొంత దూరం వెళ్లగానే అధిక లోడ్ కారణంగా టైర్లు ఊడిపోయాయి. ఒక్కసారిగా భారీ శబ్ధంతో బస్సు రోడ్డుపై కుంగిపోయింది. అకస్మాత్తుగా జరిగిన పరిణామంతో ఏమైందో అర్థం కాక ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. డ్రైవర్ ఎంతో చాకచక్యంగా బస్సును నిలిపాడు.మరోవైపు.. ఈ ప్రమాదం కారణంగా ఊడిపోయిన బస్సు వెనుక భాగంలోని రెండు చక్రాలు పక్కనే ఉన్న చెట్ల పొదల్లో పడిపోయాయి. కాగా, ఈ ప్రమాదం కారణంగా బస్సులో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇక, వరుస సెలవుల కారణంగా ప్రయాణీకులు స్వగ్రామాలకు వెళ్తున్నారు. -
వీడియో: ట్రాఫిక్‌లో ఓల్వో బస్సు బీభత్సం.. వాహనాలు నుజ్జునుజ్జు
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఫుల్ ట్రాఫిక్ ఉన్న రోడ్డుపై ఓల్వో బస్సు ఒకటి అదుపు తప్పడంతో ముందున్న వాహనాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు గాయపడగా.. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.వివరాల ప్రకారం.. బెంగళూరులోని హెబ్బాల్ ఫ్లైఓవర్‌పై ఓ ఓల్వో బస్సు వెళ్తోంది. ఈ క్రమంలో ఉన్నట్టుండి డ్రైవర్ బస్సుపై నియంత్రణ కోల్పోయాడు. డ్రైవర్ బ్రేకులు వేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. బస్సు ముందుకు సాగుతుండటంతో సెకన్ల కాలంలోనే ముందున్న వాహనాలపైకి దూసుకెళ్లింది. ముందుగా బైక్‌లను ఢీకొట్టిన బస్సు.. ఆపై రెండు కార్లను ఢీకొట్టి ఆగిపోయింది.ఇక, ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, వీడియో బస్సును కంట్రోల్ చేసేందుకు డ్రైవర్ ఎంత ప్రయత్నించాడో చూడవచ్చు. మరోవైపు.. ఈ ప్రమాద ఘటనపై ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. CCTV footage shows a Volvo bus going out of control and crashing into several vehicles. The incident, involving a BMTC AC Volvo bus, occurred at Hebbal in #Bengaluru. In this accident, two people were injured, and four cars and four bikes were damaged. pic.twitter.com/3AIMyhYVLK— Neelima Eaty (@NeelimaEaty) August 13, 2024 -
ఏలూరులో బస్సు ప్రమాదం, వేగంగా లారీని ఢీ కొట్టి..
ఏలూరు, సాక్షి: జిల్లాలో ఈ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు వేగంగా వచ్చి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, 20 మంది ప్రయాణికులకు గాయాలైనట్లు సమాచారం. పార్వతీపురం నుంచి విజయవాడ కనకదుర్గమ్మ దర్శనం కోసం ప్రయాణికులతో ఓ బస్సు వెళ్తోంది. అయితే ఏలూరు కలపరు టోల్గేట్ వద్ద ఆగి ఉన్న లారీని ఈ వేకువజామున బస్సు ఢీ కొట్టింది. వేగానికి బస్సు ముందు భాగంగా.. లారీలోకి చొచ్చుకుపోయింది. బస్సులోనే ఇద్దరు ప్రయాణికులు ఇరుక్కుపోగా.. ఒకరు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. అలాగే.. తన క్యాబిన్లో ఇరుక్కుపోయిన డ్రైవర్‌ను పోలీసులు బయటికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. గాయపడిన ప్రయాణికుల్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించి పోలీసుల నుంచి మరింత సమాచారం అందించాల్సి ఉంది. -
ఒడిశాలో బస్సు ప్రమాదం.. హైదరాబాద్ టూరిస్టులు మృతి
సాక్షి,హైదరాబాద్: తీర్థ యాత్రలో విషాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ పాతబస్తీ ఛత్రినాక నుంచి 23 మంది కలిసి ఒక ట్రావెల్ బస్సులో తీర్థయాత్రకు వెళ్లారు. వీరు ప్రయాణిస్తున్న బస్సు ఒడిశాలోని బరంపురం సమీపంలో ప్రమాదానికి గురైంది. హైవేపై బస్సు ట్రక్కును ఢీకొట్టడంతో బస్సు ముందు భాగం ధ్వంసమైంది. ప్రమాదంలో బస్సు డ్రైవర్‌తో పాటు ఇద్దరు యాత్రికులు మృతి చెందారు. మృతులను ఉదయ్‌సింగ్,క్రాంతిభాయ్, ఉప్పలయ్యగా గుర్తించారు. ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. మొత్తం 20 మంది గాయాల పాలయ్యారు. గాయపడ్డ వారందరిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
నేపాల్ బస్సు ప్రమాదం.. ఏడుగురు భారతీయుల మృతి
నేపాల్‌లో శుక్రవారం తెల్లవారుజామున ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. నారాయణఘాట్-ముగ్లింగ్ జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడటంతో రెండు బస్సులు పక్కనే ఉన్న నదిలో పడ్డాయి. దీంతో దాదాపు 65 మంది ప్రయాణికులు గల్లంతయ్యారు.వారిలో ఏడుగురు భారతీయులు ఉండగా.. తాజాగా ఆ ఏడుగురు భారతీయులు మరణించినట్లు తేలింది. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. కాగా నేపాల్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో చిట్వాన్ జిల్లాలోని నారాయణ్‌ఘాట్-ముగ్లింగ్ రహదారి వెంబడి సిమల్తాల్ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటంతో రెండు బస్సులు పక్కనే ఉన్న త్రిశూలి నదిలో పడిపోయాయి. 24 మంది ప్రయాణికులతో ఓ బస్సు కాఠ్మాండూ వెళుతోంది. మరో బస్సులో 41 మంది ఉన్నట్లు గుర్తించారు.రెండు బస్సుల్లో దాదాపు 65 మంది ప్రయాణికులు ఉండగా.. వారందరూ గల్లంతయ్యారు. వారిలో ఏడుగురు భారతీయులు కూడా ఉన్నారు. సంఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.. అదే మార్గంలో మరోచోట కూడా బస్సుపై కొండచరియ విరిగిపడటంతో దాని డ్రైవర్ తీవ్రంగా గాయపడి మృతి చెందారు. బస్సు ప్రమాదం, భారతీయులు మృతి, కొండచరియలు, భారీ వర్షాలుఈ ఘటనపై నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహల్ విచారం వ్యక్తంచేశారు. అధికారులు వెంటనే బాధితుల గాలింపునకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆ దేశ సాయుధ దళాలు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. -
లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. మహారాష్ట్ర నాసిక్‌లో దుర్ఘటన
ముంబై: మహారాష్ట్ర నాసిక్‌లో మంగళవారం ఘోర ప్రమాదం జరిగింది. ఓ బస్సు లోయ పడిన ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. మరో 28 మందికి గాయాలు కాగా.. వాళ్లను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. సత్పురా ఘాట్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న వాహనాన్ని బస్సు డ్రైవర్ ఓవర్ టేక్ చేశాడు. ఆ ప్రయత్నంలో ముందు మలుపు ఉండడంతో వేగంగా వెళ్తున్న బస్సును నియంత్రించలేకపోయాడు. దీంతో బస్సు లోయలోకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నారు.బస్సులోని ఓ ప్రయాణికుడు.. ఆ జర్నీని లైవ్ టెలికాస్ట్ కోసం చిత్రీకరించాడు. బస్సు ప్రమాదం తర్వాత కూడా ఆ వీడియో రికార్డయ్యింది. ప్రయాణికుల ఆర్తనాదాలు ఆ వీడియోలో వినిపించాయి. ఆపై ప్రమాద ఘటన తాలుకా వీడియో నెట్టింటకు చేరింది.Nashik: A bus fell into a valley in Nashik, LIVE video of the accident has surfaced#BusAccident #Nashik #Satpura #ViralVideo pic.twitter.com/bSidD45caK— Siraj Noorani (@sirajnoorani) July 9, 2024