లోయ‌లో ప‌డ్డ బ‌స్సు.. ముగ్గురు మ‌హిళ‌లు మృతి, 24 మందికి గాయాలు | Three Women Dead And 24 Injured As Bus Falls Into Gorge In Uttarakhand, More Details Inside | Sakshi
Sakshi News home page

Dehradun Earthquake: లోయ‌లో ప‌డ్డ బ‌స్సు.. ముగ్గురు మ‌హిళ‌లు మృతి, 24 మందికి గాయాలు

Published Wed, Jun 12 2024 11:08 AM | Last Updated on Wed, Jun 12 2024 12:22 PM

Three women dead, 24 injured as bus falls into gorge in Uttarakhand

డెహ్ర‌డూన్‌: ఉత్త‌రాఖండ్‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. గంగోత్రి జాతీయ ర‌హ‌దారిపై ఉన్న గంంగ‌గ‌నాని స‌మీపంలో బ‌స్సు లోయ‌లో ప‌డింది. డ్రైవ‌ర్ కంట్రోల్ త‌ప్ప‌డంతో ఈ  ఘ‌ట‌న జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో  ముగ్గురు మ‌హిళ‌లు మ‌ర‌ణించ‌గా.. మ‌రో 24 మందికి గాయాల‌య్యాయి.

గంగ‌నానికి 50 కిలోమీట‌ర్ల దూరంలో ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు పోలీసులు తెలిపారు. కంట్రోల్ త‌ప్పిన డ్రైవ‌ర్‌.. వాహ‌నాన్ని క్రాష్ బారియ‌ర్ల‌కు ఢీకొట్టాడు. లోయలో ప‌డి ఓ చెట్టుపై ఆగిపోయింది. గంగోత్రి నుంచి ఉత్త‌ర‌కాశీ వెళ్తున్న స‌మ‌యంలో ప్ర‌మాదం జ‌రిగింది. 

ప్ర‌మాద స‌మ‌యంలో ఆ బ‌స్సులో 27 మంది ప్ర‌యాణికులు ఉన్నారు. స‌రైన స‌మ‌యంలో స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టిన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. గాయ‌ప‌డ్డ‌వారిని ఉత్త‌ర‌కాశీ జిల్లా ఆస్ప‌త్రి, భ‌ట్వాడి హెల్త్ సెంట‌ర్‌కు త‌ర‌లించారు.

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement