gorge
-
లోయలో పడ్డ బస్సు.. ముగ్గురు మహిళలు మృతి, 24 మందికి గాయాలు
డెహ్రడూన్: ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గంగోత్రి జాతీయ రహదారిపై ఉన్న గంంగగనాని సమీపంలో బస్సు లోయలో పడింది. డ్రైవర్ కంట్రోల్ తప్పడంతో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు మరణించగా.. మరో 24 మందికి గాయాలయ్యాయి.గంగనానికి 50 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. కంట్రోల్ తప్పిన డ్రైవర్.. వాహనాన్ని క్రాష్ బారియర్లకు ఢీకొట్టాడు. లోయలో పడి ఓ చెట్టుపై ఆగిపోయింది. గంగోత్రి నుంచి ఉత్తరకాశీ వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో ఆ బస్సులో 27 మంది ప్రయాణికులు ఉన్నారు. సరైన సమయంలో సహాయక చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. గాయపడ్డవారిని ఉత్తరకాశీ జిల్లా ఆస్పత్రి, భట్వాడి హెల్త్ సెంటర్‌కు తరలించారు. -
లోయలో పడిన బస్సు.. 16 మంది మృత్యువాత
జమ్మూకశ్మీర్‌లో గురువారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జమ్మూ జిల్లాలో యాత్రికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలో పడటంతో 15 మంది మృతి చెందగా, 25 మందికి పైగా గాయపడ్డారు.వివరాలు.. జిల్లాలోని అఖ్నూర్ చుంగీ మోర్ ప్రాంతంలో ఈఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు దాదాపు 150 అడుగుల లోయలోకి బోల్తా పడిందని పోలీసులు తెలిపారు. హర్యానాలోని కురుక్షేత్ర ప్రాంతం నుంచి జమ్మూ కాశ్మీర్‌లోని రియాసీ జిల్లా శివ్ ఖోరీ ప్రాంతానికి వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రాణాలు కోల్పోగా 25 మందికి పైగా గాయపడినట్లు పోలీసులు పేర్కొన్నారు.పోలీసులు, స్థానికులతో కూడిన రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. గాయపడిన వారిని జమ్మూలోని అఖ్నూర్ ఆసుపత్రి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. -
జమ్ముకశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదాలివే..
జమ్మూ కశ్మీర్లో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 39 మంది మరణించగా, 16 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. దోడా జిల్లాలోని అస్సార్ సమీపంలో కిష్త్వార్-జమ్మూ హైవేపై కిష్త్వార్ నుండి జమ్మూకు ప్రయాణికులతో వస్తున్న బస్సు.. ఓల్డ్ జమ్మూ-కిష్త్వార్ రహదారిపై 300 అడుగుల లోయలో పడిపోవడంతో ఈ ప్రమాదం సంభవించింది. జమ్ముకశ్మీర్‌లో ఇటీవలి కాలంలో జరిగిన అతి పెద్ద ప్రమాదం ఇదేనని స్థానికులు చెబుతున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా, లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేలు సాయం అందజేస్తామని ప్రధాని ప్రకటించారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.5 లక్షలు, గాయపడిన వారికి రూ.లక్ష చొప్పున ఎక్స్‌గ్రేషియాను అందజేస్తామని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రకటించారు. కాగా జమ్ముకాశ్మీర్‌లో ఇటువంటి ప్రమాదాలు గతంలోనూ చోటుచేసుకున్నాయి. జమ్ముకాశ్మీర్‌లో భారీ రోడ్డు ప్రమాదాలు 2019, జూలై 1: కిష్త్వార్లోని సాంగ్వారీ ప్రాంతంలో మినీ బస్సు లోయలో పడి 35 మంది మృతి, 17 మందికి గాయాలు. 2018, సెప్టెంబర్ 14: కిష్త్వార్లోని దండారన్ ప్రాంతంలో మినీ బస్సు లోయలో పడి 17 మంది మృతి, 16 మందికి గాయాలు. 2009, జూన్ 27: దోడా జిల్లాలోని పుల్ దోడాలో రోడ్డు ప్రమాదంలో 27 మంది దుర్మరణం. 2021, అక్టోబర్ 28: దోడా జిల్లాలోని థాత్రిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది మృతి. 2022, నవంబర్ 16: కిష్త్వార్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది మరణించారు. 2023, మే 30: జమ్మూ-శ్రీనగర్ హైవేపై జమ్మూ జిల్లాలోని ఝజ్జర్ కోట్లిలో యాత్రికుల బస్సు వంతెనపై నుండి పడటంతో 10 మంది దుర్మరణం. 2019, మార్చి 15: రాంబన్‌లో కారు లోయలో పడిన ప్రమాదంలో 11 మంది మృతి, నలుగురికి గాయాలు. 2023, మే 24: కిష్త్వార్లోని దచాన్ ప్రాంతంలోని దంగ్దురు డ్యామ్ వద్ద ఒక కారు లోయలో పడటంతో ఏడుగురు మరణించారు, ముగ్గురు గాయపడ్డారు. 2023, ఆగస్టు 30: ఒక కారు 300 అడుగుల లోతైన లోయలో పడటంతో ఎనిమిది మంది మృతి, ముగ్గురికి గాయాలు. 2023, జూన్ 27: దోడాలోని భదర్వా-పఠాన్‌కోట్ రహదారిపై ఒక వాహనం లోయలో పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, 12 మంది గాయపడ్డారు. ఇది కూడా చదవండి: జమ్ము కశ్మీర్లో ఘోర ప్రమాదం.. 36 మంది మృతి -
కేరళ: వయనాడ్‌లో ఘోర ప్రమాదం
తిరువనంతపురం: కేరళలో ఘోర ప్రమాదం జరిగింది. వయనాడ్‌లో ఓ జీప్ లోయలోకి దూసుకెళ్లి తొమ్మిది మంది దుర్మరణం పాలయ్యారు. మృతి చెందిన వాళ్లంతా మహిళలే కావడం గమనార్హం. ఘటనలో డ్రైవర్ సహా మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. శుక్రవారం సాయంత్రం మనంథావాడీలో ఈ ఘోరం చోటు చేసుకుంది. మృతులంతా వయనాడ్‌కు చెందిన వాళ్లని.. టీఎస్టేట్‌లో పని చేసే కూలీలుగా నిర్ధారణ అయ్యింది. 25 మీటర్ల లోయలో అతి వేగంగా జీపు పడడంతో.. అది రెండు ముక్కలైంది. మృతదేహాలను వయనాడ్ ప్రభుత్వాసుపత్రికి తరలించిన అధికారులు.. క్షతగాత్రులకు వైద్యం అందిస్తున్నారు. #WATCH | Kerala | Nine people died, two injured after their jeep fell into a gorge near Thalapuzha in Wayanad district today. https://t.co/GRMc76Gv6M pic.twitter.com/V14Kuv1aja — ANI (@ANI) August 25, 2023 -
విషాదం: లోయలో పడిన బస్సు.. ఏడుగురు పర్యాటకులు మృతి..
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో విషాద ఘటన జరిగింది. 35 మంది పర్యాటకులతో ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదవశాత్తు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. మిగిలిన 27 మంది ప్రాణాలతో బయటపడ్డారు. ప్రయాణికులతో గంగోత్రి నుంచి వెనుదిరిగిన బస్సు.. గంజ్ఞాని వద్దకు రాగానే ప్రమాదానికి గురైంది. ఘటనపై సీఎం పుష్కర్ సింగ్ ధామి స్పందించారు. సహాయక చర్యలు వేగంగా కొనసాగాలని అధికారులను ఆదేశించారు. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించాలని చెప్పారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవారికి సంతాపం తెలిపారు. ఘటనాస్థలంలో ఎన్డీఆర్ఎఫ్, జాతీయ విపత్తుకు సంబంధించిన బలగాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి. ఉత్తరాఖండ్‌లో ఇటీవల భారీ వర్షాలు సంభవించాయి. దీంతో కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదీ చదవండి: హాస్టల్ గదిలో మారణాయుధాలు.. బాంబులు, పిస్టళ్లతో విద్యార్థులు.. -
జమ్ములో ఘోర రోడ్డు ప్రమాదం
శ్రీనగర్: జమ్ములో ఈ తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ఒకటి లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. మరో నలుగురు పరిస్థితి విషమంగా ఉందని, వాళ్లను ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. గాయపడిన మరో డజను మందికి స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స అందించారు. ఇదిలా ఉంటే.. బస్సు అమృత్సర్ నుంచి కాత్రాకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే.. పోలీసులతో పాటు సీఆర్పీఎఫ్ ఇతర సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. #WATCH | J&K | A bus from Amritsar to Katra fell into a gorge in Jammu. As per Jammu DC, 7 peopled died and 4 critically injured; 12 others also sustained injuries. Visuals from the spot. pic.twitter.com/iSse58ovos — ANI (@ANI) May 30, 2023 CRPF, Police and other teams are also here. Ambulances were called & the injured were immediately rushed to hospital. Bodies have also been taken to the hospital. A crane is being brought here to see if someone is trapped under the bus. A rescue operation is underway. We are… pic.twitter.com/0H5FiJ2eQe — ANI (@ANI) May 30, 2023 ఇదీ చదవండి: కరెంట్ పోల్ నిలబెడుతుండగా.. షాక్ తగిలి ఎనిమిది మంది..! -
150 అడుగుల లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. 12 మంది దుర్మరణం
ముంబై: మహారాష్ట్రలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాయ్‌గడ్ జిల్లా ఖోపాలి వద్ద బస్సు అదుపుతప్పి 150 అడుగుల లోయలోకి దూసుకెళ్లింది. ఈ విషాద ఘటనలో 12 మంది దుర్మరణం చెందారు. మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. పుణె-రాయ్‌గడ్ సరిహద్దులో ఈ ప్రమాదం జరింది. బస్సు పుణెలోని పంపిల్ గురవ్ నుంచి గొరెగావ్ వెళ్తుండగా ప్రమాదానికి గురైంది. ఘటన సమయంలో బస్సులో మొత్తం 41 మంది ప్రయాణిలుకున్నారు. ఘటనపై సమాచారం అందిన వెంటనే పోలీసులు, సహాయక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. లోయలోకి దిగి బస్సులోని క్షతగాత్రులను బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. చదవండి: పండుగ వేళ విషాదం.. కుప్పకూలిన బ్రిడ్జి -
జమ్ముకశ్మీర్‌లో విషాదం.. ముగ్గురు సైనికులు మృతి
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. బుధవారం జరిగిన ప్రమాదంలో ముగ్గురు సైనికులు మృతిచెందారు. ట్రాక్‌పై దట్టమైన పొగ మంచు కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. వివరాల ప్రకారం.. జమ్ముకశ్మీర్‌లో కుప్వారా జిల్లాలోని మాచల్ సెక్టార్లో నియంత్రణ రేఖ వెంబడి సైనికులు బుధవారం పెట్రోలింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ముగ్గురు సైనికులు లోయలో జారిపడి మరణించారు. కాగా, లైన్ ఆఫ్ కంట్రోల్ వెంబడి పెట్రోలింగ్ చేస్తుండగా చినార్ క్రాప్స్‌కు చెందిన జేసీఓతోపాటు మరో ఇద్దరు సైనికులు లోయలోకి జారిపడిపోయారు. ఈ క్రమంలో వారు మరణించినట్టు ఆర్మీ అధికారులు అధికారికంగా వెల్లడించారు. అయితే, ట్రాక్‌పై దట్టమైన మంచు కురవడంతో ఈ ప్రమాదం జరిగనట్టు అధికారులు చెప్పారు. -
700 మీటర్ల లోయలో పడిపోయిన టాటా సుమో.. 12 మంది దుర్మరణం..
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ చమోలి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 12 మంది ప్రయాణికులతో వెళ్తున్న టాటా సుమో అదుపు తప్పి 700 మీటర్ల లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో కారులోని మొత్తం 12 మంది మరణించారు. రాష్ట్ర విపత్తు నిర్వహణ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను లోయ నుంచి పైకి తీసుకువచ్చారు. ఈ వాహనం జోషిమఠ్ నుంచి కిమాన గ్రామం వెళ్లే సమయంలో పల్ల జఖోల్ వద్ద ప్రమాదానికి గురైంది. 12 మంది మృతుల్లో 10 మంది పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. లోయ 700 మీటర్ల లోతు ఉండటంతో టాటా సుమో ముక్కలు ముక్కలుగా విరిగిపోయింది. ప్రయాణికుల మృతదేహాలు చల్లాచెదురుగా పడి ఉన్నాయి. సీఎం దిగ్భ్రాంతి.. ఈ ఘటనపై సీఎం పుష్కర్ సింగ్ ధామీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షల పరిహారం ప్రకటించారు. చనిపోయిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. #Chamoli: जोशीमठ के पास हुए सड़क हादसे में कई लोगों की मौत, घटनास्थल का वीडियो आया सामने।#Uttarakhand #ViralVideo #UserGenerated pic.twitter.com/RWeWDgPWaA — News Tak (@newstakofficial) November 18, 2022 #उत्तराखंड - चमोली में गहरी खाई में गिरा वाहन, 12 लोगों की गई जान, 10 पुरुष और 2 महिलाओं की हुई मौत. #Uttrakhand #RoadAccident #Chamoli pic.twitter.com/AXS0RP8w8S — TheuttarpradeshNews.com (@TheUPNews) November 18, 2022 చదవండి: యూపీలో దారుణం.. యువకుడ్ని చితకబాది మొహంపై మూత్ర విసర్జన.. -
లోయలోకి దూసుకెళ్లిన కారు.. 8 మంది దుర్మరణం
జమ్మూ: జమ్ముకశ్మీర్‌లో బుధవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కిష్టవార్ జిల్లాలో ఓ క్యాబ్ అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 8 మంది దుర్మరణం చెందినట్లు సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఈ ప్రమాదంపై కిష్టవార్ డీసీపీ దేవాన్స్ యాదవ్ మాట్లాడుతూ.. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఉన్న 8 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్టు తెలిపారు. మృతదేహాలను వెలికి తీశామని.. సహాయక చర్యలు కొనసాగుతున్నట్టు వెల్లడించారు. ప్రమాదానికి అతివేగమే కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదీ చదవండి: గోఖలే వంతెన త్వరలో కూల్చివేత -
లోయలో పడ్డ టెంపో ట్రావెలర్.. ఏడుగురు దుర్మరణం
షిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పర్యాటకులతో వెళుతున్న టెంపో ట్రావెలర్ కులు జిల్లాలోని బంజార్ సబ్ డివిజన్ సమీపంలో అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఘటన ఆదివారం రాత్రి 8.30 గంటల సమయంలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఏడుగురు టూరిస్టులు మృతి చెందారు. దాదాపు 10 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న అధికారులు స్థానికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ‘కులు జిల్లా బంజర్ వ్యాలీలోని ఘియాఘి సమీపంలో టూరిస్ట్ వాహనం కొండపై నుంచి బోల్తా పడింది. ఈ ఘటనలో ఏడుగురు మృత్యువాతపడ్డారు. మరో పది మందికి గాయాలయ్యాయి. అయిదుగురిని కుళ్లులోని జోనల్ ఆసుపత్రికి తరలించాడం. మరో అయిదుగురికి బంజార్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నాం’మని కులు ఎస్పీ గురుదేవ్ సింగ్ తెలిపారు. బాధితులంతా రాజస్థాన్, మధ్యప్రదేశ్, హర్యానా, ఢిల్లీ సహా పలు రాష్ట్రాలకు చెందిన వారుగా గుర్తించారు. చదవండి: అసోం సీఎం హిమంత, సద్గురుపై కేసు -
ఘోర ప్రమాదం.. లోయలోకి కారు దూసుకెళ్లి 8 మంది మృతి
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లోని కిష్ట్వారా జిల్లాలో మంగళవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ఎస్యూవీ కారు అదుపుతప్పి భారీ లోయలోకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో 8 మంది ప్రయాణికులు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఎస్యూవీ కారు.. చింగమ్ ప్రాంతం నుంచి ఛత్రూకు వెళ్తోందని అధికారులు తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం 3.15 గంటల ప్రాంతంలో బొండా గ్రామానికి సమీపంలో ప్రమాదానికి గురైనట్లు వెల్లడించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, ఐదుగురు ప్రయాణికులు అక్కడిక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురు ఆసుపత్రికి తరలించే క్రమంలో చనిపోయినట్లు చెప్పారు. మరో ముగ్గురిని ఆసుపత్రికి తరలించామని, ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉందన్నారు. మరోవైపు.. కారు లోయలో పడి 8 మంది మృతి చెందిన సంఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్. ప్రమాదం జరగటం దురదృష్టకరమన్నారు. అన్ని విధాల అవసరమైన సాయం అందిస్తామన్నారు. ఇదీ చదవండి: ఎక్కడికి పోతావు చిన్నవాడా? పరారైన వరుడిని వెంబడించి పట్టుకున్న వధువు -
లోయలో పడిన బస్సు.. ఒకరు మృతి, 56 మందికి గాయాలు
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాజౌరి జిల్లా నుంచి నౌషేరా ప్రాంతానికి ప్రయాణిస్తున్న బస్సు.. లామ్ ప్రాంతంలో అదుపుతప్పి లోయలో పడటంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 56 మందికి గాయాలైనట్లు నౌషేరా పోలీసు అధికారి సుఖ్‌దేవ్ సింగ్ తెలిపారు. క్షతగాతత్రులను ఆసుపతత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఒకరు మృతిచెందినట్లు తెలిపారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పేర్కొన్నారు. చదవండి: యూపీ అసెంబ్లీలో అరుదైన దృశ్యం.. ఒకరికొకరు ఎదురుపడిన యోగి, అఖిలేష్ -
పెళ్లికి వెళ్లి వస్తుండగా ప్రమాదం .. 14 మంది మృతి.. మోదీ సంతాపం
రాంచీ: ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పెళ్లి బృందం ప్రయాణిస్తున్న బస్సు అదుపుతప్పి లోయలో పడటంతో 14 మంది మృత్యువాతపడ్డారు. ఈ ఘటనలో మరో ఇద్దరికి గాయాలవ్వగా స్థానిక ఆసుపత్రికి తరలించారు. చంపావత్ జిల్లాలో సుఖిధాంగ్-దండమినార్ రహదారిపై ఈ ప్రమాదం సంభవించింది. తనక్‌పూర్‌లో బంధువుల పెళ్లికి హాజరై తిరిగి వస్తుండగా సోమవారం రాత్రి 10 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో 16 మంది ప్రయాణికులు ఉన్నారు. చదవండి: విషాదం నింపిన పుట్టినరోజు వేడుకలు.. 4 కార్లు ధ్వంసం.. ముగ్గురు మృతి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. లోయలో నుంచి మృతదేహాలను వెలికి తీస్తున్నారని, సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని చంపావత్ ఎస్పీ వెల్లడించారు. కాగా మృతి చెందిన వారంతా కాకాని దండా, కతోటి గ్రామాలకు చెందిన వారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. అయితే ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నప్పటికీ, అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. చదవండి: నేనున్నా లేకున్నా, మరో 50 ఏళ్లు కొనసాగాలి: కమల్ హాసన్ ప్రధాని మోదీ సంతాపం ఉత్తరాఖండ్‌లోని చంపావత్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంపై నరేంద్ర మోదీ స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా ఆయన సంతాపం తెలిపారు. ‘ఉత్తరాఖండ్‌లోని చంపావత్‌లో జరిగిన ప్రమాదం హృదయ విదారకంగా ఉంది. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. స్థానిక యంత్రాంగం సహాయక చర్యల్లో నిమగ్నమై ఉంది.’ అని ట్వీట్ చేశారు. అదే విధంగా ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు -
లోయలో పడ్డ బస్సు: ఐదుగురి మృతి
ముంబై : బస్సు లోయలో పడిన ఘటనలో ఐదుగురు మృత్యువాతపడగా.. 35 మందికి గాయాలయ్యాయి. ఈ సంఘటన మహారాష్ట్ర, నందూర్బార్లో బుధవారం చోటుచేసుకుంది. ఎస్పీ మహేంద్ర పండిట్ తెలిపిన వివరాల మేరకు.. మహారాష్ట్రకు చెందిన ఓ బస్సు దాదాపు 40 మంది ప్రయాణికులతో మల్కాపూర్ నుంచి సూరత్ వెళుతోంది. బుధవారం ఉదయం నందుబార్‌లోని ఖాంఛౌన్ దార్ గ్రామం వద్ద ఎదురుగా వస్తున్న మరో బస్సును ఢీకొట్టింది. ఈ నేపథ్యంలో అదుపుతప్పి పక్కనే ఉన్న 80 అడుగుల లోయలోకి పడిపోయింది. ( 60 గంటలు దాటినా దొరకని దీక్షిత్ ఆచూకీ ) దీంతో బస్సు డ్రైవర్, క్లీనర్‌తో పాటు మరో ముగ్గురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. 35 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని అత్యవసర వైద్యం కోసం దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
లోయలో పడ్డ బస్సు ; 23 మంది దుర్మరణం
పెరు : దక్షిణ అమెరికాలోని పెరులో 50 మందితో ప్రయాణీస్తున్న ఓ బస్సు లోయలో పడిపోవడంతో 23 మంది మృతి చెందారు. మిగిలిన వారు గాయపడగా, వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కుస్కో నుంచి పుయెర్టో మల్డొనాడో వెళ్లే మార్గంలో గురువారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు పడిపోయిన లోయ లోతు దాదాపు వంద మీటర్లుటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకుంటున్నారు. కాగా, రోడ్ల నిర్వహణ సరిగ్గా లేకపోవడం, పర్వత ప్రాంతాల్లో రోడ్డు నిర్మాణం పాములా మెలికలు తిరిగి ఉండడమే ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ మార్గంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవట్లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
లోయలోకి వ్యాన్: ఎనిమిది మంది చిన్నారుల మృతి
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పాఠశాల విద్యార్థులతో వెళ్తున్న స్కూల్ వ్యాన్ మంగళవారం ప్రమాదానికి గురైంది. 18 మంది విద్యార్థులతో వెళ్తున్న వాహనం డ్రైవర్ నిర్లక్ష్యంతో కంగ్సాలి ప్రాంతంలో లోతైన లోయలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనతో ఎనిమిది విద్యార్థులు మృతి చెందారు. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్నవిపత్తు నివారణ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయ చర్యలను చేపట్టింది. ఘటనపై స్పందించిన స్థానిక పోలీసు అధికారి ఎనిమిది మంది విద్యార్థులు మరణించినట్లు నిర్ధారించారు. ప్రమాదం జరిగిన సమయంలో వ్యాన్‌లో మొత్తం 18మంది విద్యార్థులు ఉన్నారని, గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ప్రమాద ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
లోయలో పడిన బస్సు.. ఇద్దరు మృతి
డెహ్రడూన్ : ఉత్తరాఖండ్‌లో వరుస రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఓ ఘటనలో బస్సు లోయలో పడిపోయి ఇద్దరు మృతి చెందగా.. మరో చోట కారు యాక్సిడెంట్లో ఒకరు మరణించారు. బస్సు ప్రమాద సంఘటన పూరి జిల్లా ఖాబ్ర గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. బస్సు ఓ లోతైన లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. 16 మంది గాయపడ్డారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇక కారు యాక్సిడెంట్ చమోలీ జిల్లా కుంజో గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఓ వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందగా.. 9 మందికి గాయాలయ్యాయి. -
జమ్ము కశ్మీర్లో ఘోర ప్రమాదం
శ్రీనగర్ : జమ్ము, కశ్మీర్‌లోని ఉద్దంపూర్ జిల్లా మజాల్తా సమీపంలో గత రాత్రి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ బస్సు అదుపు తప్పి లోయలో పడిపోవటంతో ఆరుగురు మృతి చెందగా, మరో 38మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. బస్సు సురిన్సార్ నుంచి శ్రీనగర్ వెళుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్ సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. -
లోయలో పడ్డ బస్సు.. ఇద్దరు మృతి
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్‌లో గురువారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు లోయలో పడిపోయింది. కు నల్లా ప్రాంతంలోని రాంనగర్-ఉధంపూర్ రోడ్డు మార్గంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా 28 మందికి గాయాలయ్యాయి. ఘటనాస్థలానికి చేరుకున్న రెస్క్యూ సిబ్బంది మృతదేహాలను వెలికితీసి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. -
బస్సు లోయలో పడి.. 20 మంది దుర్మరణం
శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మినీ బస్సు లోయలో పడి 20 మంది మృతిచెందగా, మరికొందరికి గాయాలయ్యాయి. జమ్ము-శ్రీనగర్ జాతీయ రహదారిలోని కెలా మోత్ వద్ద శనివారం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. బస్సు బనిహల్ నుంచి రంబన్ వెళుతుండా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
లోయలో పడ్డ వ్యాను.. 13 మంది మృతి
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్‌లో దారుణం చోటు చేసుకుంది. ఉత్తర్కాశి జిల్లాలో వ్యాను లోయలో పడి 13 మంది మృతిచెందారు. బట్వాడీలో సోమవారం సాయంత్రం కొండచరియలు విరిగిపడటంతో ఓ వ్యాను అదుపుతప్పి లోయలో పడిపోయింది. పోలీసులు, రెస్క్యూ సిబ్బంది హుటాహుటిన ప్రమాదస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో 13మంది అక్కడికక్కడే మృతిచెందగా, బట్వాడీలోని బకోలీ గ్రామానికి చెందిన 13 ఏళ్ల మీనాక్షి, రాధలు ప్రాణాలతో బయటపడ్డారు. -
లోయలో పడిన బస్సు ; 10 మంది మృతి
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్‌లో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది తెహ్రి జిల్లా సూర్యధర్ సమీపంలో బస్సు లోయలో పడి 10 మంది మృతిచెందగా, 9 మంది గాయపడ్డారు. ఉత్తరాఖండ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్‌కు చెందిన బస్సు 25 మంది ప్రయాణికులతో ఉత్తరకాశి నుంచి హరిద్వార్‌కు బయలుదేరింది. బస్సు రిషికేశ్- గంగోత్రి హైవేపై సూర్యధర్ సమీపంలోకి రాగానే అదుపు తప్పి 250 మీటర్ల లోతైన లోయలో పడిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం రిషికేశ్ ఎయిమ్స్‌కు తరలించడానికి సంఘటన స్థలానికి హెలికాప్టర్లను పంపనున్నట్టు ఉత్తరాఖండ్ ప్రభుత్వం తెలిపింది. కాగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఈ ప్రమాదంలో మరణించిన వారికి 2 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 50 వేల రూపాయల పరిహారం ప్రకటించింది. ఈ ఘటనపై విచారణకు ఆదేశించామని పేర్కొంది. -
లోయలో పడిన బస్సు : 11 మంది మృతి
ఐజ్వాల్ : మిజోరాంలో మంగళవారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పంగ్జ్వాల్ గ్రామ సమీపంలో బస్సు లోయలో పడిన ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోగా, 21 మంది గాయాలపాలయ్యారు. పర్వత వాలులో ప్రయాణిస్తున్న సమయంలో బస్సు అదుపుతప్పి లోయలో పడినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో క్లీనర్ డ్రైవింగ్ చేస్తున్నట్లు సమాచారం. బస్సు ఐజ్వాల్‌కు వెళ్తోందని పోలీసులు తెలిపారు. గాయాలపాలైన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాద కారణాలను తెలుసుకునేందుకు యత్నిస్తున్నట్లు వెల్లడించారు. -
లోయలో పడిన బస్సు : ఐదుగురు మృతి
మీర్జాపూర్ ( యూపీ ) : ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. యాత్రికులతో వెళుతున్న ఓ బస్సును లారీ ఢీకొట్టడంతో, అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు భక్తులు మృతిచెందగా, మరో 12 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు సంఘనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు.