ఒడిషాలో దారుణం , 25 మంది మృతి
భువనేశ్వర్: ఒడిషాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటనలో 25 మంది మృతిచెందగా, మరో 15 మంది తీవ్రంగా గాయాలపాలయ్యారు. దేవ్ఘఢ్ జిల్లాలో జార్జ్ వ్యాలీ సమీపంలో కళాకారులు వెళ్తున్న బస్సు అదుపుతప్పి 300 అడుగల లోతున్న లోయలో పడింది. దాదాపు 40 మంది కళాకారులు ఈ బస్సులో రెంటా నుంచి దేవ్ఘఢ్ కు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులంతా భారతి గాన నాట్య సమితికి చెందిన కళాకారులు అని అధికారులు తెలిపారు. గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం దేవ్ఘఢ్ జిల్లా ఆస్పత్రికి తరలించినట్టు తెలుస్తోంది.