
ముంబై: మహారాష్ట్రలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాయ్‌గడ్ జిల్లా ఖోపాలి వద్ద బస్సు అదుపుతప్పి 150 అడుగుల లోయలోకి దూసుకెళ్లింది. ఈ విషాద ఘటనలో 12 మంది దుర్మరణం చెందారు. మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు.
పుణె-రాయ్‌గడ్ సరిహద్దులో ఈ ప్రమాదం జరింది. బస్సు పుణెలోని పంపిల్ గురవ్ నుంచి గొరెగావ్ వెళ్తుండగా ప్రమాదానికి గురైంది. ఘటన సమయంలో బస్సులో మొత్తం 41 మంది ప్రయాణిలుకున్నారు.
ఘటనపై సమాచారం అందిన వెంటనే పోలీసులు, సహాయక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. లోయలోకి దిగి బస్సులోని క్షతగాత్రులను బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు.
చదవండి: పండుగ వేళ విషాదం.. కుప్పకూలిన బ్రిడ్జి