Tragedy
-
SLBC: సొరంగంలో సరిగ్గా నెల కిందట..
నాగర్ కర్నూల్, సాక్షి: దాదాపు ఐదేళ్లపాటు నిలిచిపోయిన సొరంగం పనులు మళ్లీ మొదలయ్యాయి. ఆ పనుల సన్నాహాకాల కోసం కార్మికులు, ఇంజినీర్ సిబ్బంది ఉత్సాహంగా లోపలికి వెళ్లారు. బోర్ టన్నెల్ మిషన్‌ను ఆన్ చేశారు. అంతే.. భూకంపం వచ్చినట్లుగా టన్నెల్ మొత్తం ఒక్కసారిగా ఊగిపోయింది. పై నుంచి మట్టి.. బరద ముంచెత్తడంతో లోపల ఉన్నవాళ్లంతా కాళ్లకు బలం కూడదీసుకుని బయటకు పరుగులు తీశారు. కట్ చేస్తే.. టన్నెల్ ట్రాజెడీ జరిగి నెలకావస్తున్నా ఇంకా ఏడుగురి మృతదేహాల ఆనవాళ్లను కూడా బయటకు తీసుకురాలేకపోయారు... ఫిబ్రవరి 22వ తేదీన నాగర్‌కర్నూల్ జిల్లా దోమలపెంట శివారులో శ్రీశైలం ఎడమ గట్టు కాలువ(ఎస్ఎల్బీసీ) సొరంగం పైకప్పు కూలిన దుర్ఘటన చోటు చేసుకుంది. ఉదయం 8.30గం. ప్రాంతంలో ప్రమాదం జరగ్గా.. సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు. ఒక్కొక్కరిగా మొత్తం 42 మందిని సురక్షితంగా మధ్యాహ్నాంలోపు బయటకు తీసుకొచ్చారు. సొరంగంలో చిక్కుకున్న 8 మంది సిబ్బంది కోసం సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ఫిబ్రవరి 22వ తేదీన.. ప్రమాదం జరిగిన కొన్ని గంటలకే ఇటు సింగరేణి నుంచి అటు సైన్యం దాకా పలు రాష్ట్రాల నుంచి ప్రత్యేక సహాయక బృందాలు రంగంలోకి దిగి ముమ్మరంగా చర్యలు చేపట్టాయి. దేశంలోనే అత్యుత్తమ కేంద్ర, రాష్ట్ర ఏజెన్సీల బృందాలు దాదాపు వెయ్యి మందితో మూడు షిఫ్టుల్లో 24 గంటలూ పని చేస్తున్నాయి. అయినా పురోగతి కనిపించడం లేదు.మానవ అవశేషాలను గుర్తించడంలో దిట్ట అయిన కేరళ ప్రత్యేక జాగిలాలు రంగంలోకి దిగినా.. ప్రయోజనం లేకుండా పోయింది!మార్చి 9వ తేదీన ఒక్క మృతదేహాం మాత్రమే దొరికింది. అది గుర్‌ప్రీత్‌సింగ్ మృతదేహంగా నిర్ధారించారు. ఎస్ఎల్బీసీలో అనుమానిత ప్రాంతాలుగా D1-D2 మార్క్ చేసి.. విస్త్రతంగా తవ్వకాలు జరుపుతున్నారుమిగతా ఏడుగురి జాడ గుర్తించేందుకు దేశంలోని అత్యుత్తుమ ఏజెన్సీలతో సహాయక చర్యలు కొనసాగిస్తున్నా పురోగతి కనిపించట్లేదు. ఈ సొరంగం ప్రమాదం దేశంలోనే అరుదైనదిగా నిపుణులు చెబుతున్నారు. భారీగా వస్తున్న ఊటనీరు,బురదతో సహయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. సొరంగంలో 13.85వ కి.మీ. వద్ద పైకప్పు కూలింది. మట్టి, రాళ్లు, బురద, సీసీ సెగ్మెంట్స్, నీరు, టీబీఎం శిథిలాలన్నీ సొరంగంలో 11వ కి.మీ. నుంచి 13.85 కి.మీ. వరకు పేరుకుపోయాయి. నిమిషానికి 5 వేల లీటర్ల నీటి ఊట వస్తుండటంతో మట్టి తడిసి చాలా గట్టిగా మారింది. తవ్వాల్సిన మట్టి గట్టిగా ఉండటం, పైకప్పు బలహీనంగా ఉండటంతో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. సాంకేతికంగా చూసుకుంటే.. లోకో ట్రైన్స్, కన్వేయర్ బెల్టులు, హైకెపాసిటీ పంపులతో నీరు, బురదను బయటకు పంపిస్తున్నా లాభం కనిపించడం లేదు. అడ్వాన్స్డ్ సెంట్ డిటెక్షన్, టన్నెల్ బోరింగ్ మెషిన్.. భారీ ట్రాన్స్ఫార్మర్లను కత్తిరించేందుకు అల్ట్రా థర్మల్ కట్టర్లను ఉపయోగిస్తున్నారు. అయితే రోబో సహయక చర్యలు ప్రారంభం కాలేదు. తమవారు సురక్షితంగా బయటకు వస్తారని ఎదరు చూసిన కుటుంబ సభ్యులకు, బంధువులకు.. గుర్ప్రీత్ సింగ్ మృతదేహాం చూశాక ఆ ఆశలు ఆవిరైపోయాయి. నెల రోజుల తర్వాత కూడా మృతదేహాల కోసం బాధిత కుటుంబాలు టన్నెల్ వద్దే ఎదురుచూపులు చూస్తున్నాయి. -
‘అర్ధ గంటలో ఇంట్లో ఉంటానంటివి గద బిడ్డో....అంటూ’
వరుసగా రెండు రోజులు సెలవులు. సరదాగా పిల్లలను తీసుకుని సొంతూరుకు బయలుదేరారు. కారులో భార్యాభర్తలు పిల్లలతో ముచ్చట్లు పెట్టుకుంటూ వెళ్తున్నారు. నానమ్మ, తాతయ్య దగ్గరికి వెళ్తున్నామన్న ఆనందం మనుమరాలిది. కానీ విధి వక్రించింది. మార్గమధ్యలో కారు నడుపుతుండగానే ఇంటిపెద్దకు గుండెపోటు తీవ్రం కావడంతో నేరుగా కాల్వలోకి దూసుకెళ్లింది. భర్త, కూతురు, రెండేళ్ల కుమారుడు జలసమాధి అయ్యారు. భార్య ప్రాణాలతో బయటపడినా ఒంటరిగా మిగిలిపోయింది. వరంగల్ జిల్లా (Warangal District) పర్వతగిరి మండలం కొంకపాక గ్రామశివారులో శనివారం(Saturday) మధ్యాహ్నం జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదం నింపింది.12.25 గంటలకు : కారు మార్గమధ్యలోని సంగెం మండలం తీగరాజుపల్లి ఎస్సారెస్పీ కాల్వ (కొంకపాక గ్రామశివారు) దాటి 200 మీటర్లు ముందుకెళ్లాక ప్రవీణ్‌కుమార్ తనకు ఛాతిలో నొప్పిగా ఉందని భార్య కృష్ణవేణికి చెప్పాడు. దీంతో కారు కాసేపు ఆపారు. టీ తాగితే తగ్గుతుందని కృష్ణవేణి అనడంతో కారును వెనక్కి తిప్పి తీగరాజుపల్లి వైపు బయలుదేరారు.12.30 గంటలకు : కారు వంద మీటర్ల ముందుకు రాగా, గుండెనొప్పి (Heart Attack) అధికం కావడం.. స్టీరింగ్ తిప్పే పరిస్థితి లేకపోవడంతో కృష్ణా(భార్యపేరును తలుస్తూ).. కాల్వలో పడిపోతున్నామంటూ ప్రవీణ్ చెప్పాడు. వెంటనే కృష్ణవేణి కారు డోర్ తెరిచి చేతిలో ఉన్న బాబును బయటకు విసిరివేసి వంగింది. అంతలోనే నీటి ప్రవాహంలో కృష్ణవేణి బయటకు వచ్చి కాళ్లు ఆడిస్తున్నది.12.40 గంటలకు : అదే సమయంలో సమీపంలో ఉన్న చౌటుప్పల్‌కి చెందిన నవీన్, సందీప్, రవి వెంటనే కాల్వ వద్దకు చేరుకుని అలానే కాళ్లు ఆడించండి అని చెప్పి తాడు తీసుకువచ్చి కృష్ణవేణిని బయటకు తీశారు. ఇంతలో బాబు నీటిపై తేలుతుండడంతో అతడిని బయటకు తీశారు. కానీ, అప్పటికే చనిపోయాడు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండ డం, వెనక కూర్చున్న కూతురితో సహా తండ్రి కారులోనే నీటిలో మునిగిపోయారు. 1.10 గంటలకు : ఫైర్ సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కాల్వలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో అధికారులు పర్వతగిరి వైపు నీటిని ఎక్కువగా వదిలి.. వర్ధన్నపేట వైపు తగ్గించారు.4.35 గంటలకు : నీటి ప్రవాహం తగ్గడంతో కారు కనిపించగా తాళ్లసాయంతో బయటికి లాగారు. కారు డ్రైవింగ్ సీట్లో ప్రవీణ్‌కుమార్, వెనుక సీట్లో కూతురు చైత్రసాయి విగతజీవులుగా బయటపడ్డారు.నాన్నా..పిల్లలతో వస్తున్నా..మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం మేచరాజుపల్లి గ్రామానికి చెందినసోమారపు సారంగపాణి, పద్మకు ఇద్దరు కొడుకులు. వీరిలో చిన్న కొడుకు ప్రవీణ్‌కుమార్ (పప్పి) కష్టపడి చదువుకుని హనుమకొండ ఎల్ఐసీలో డెవలప్మెంట్ ఆఫీసర్‌గా ఉద్యోగం సాధించాడు. భార్య కృష్ణవేణి, ఒక కూతురు, ఒక కుమారుడు ఉన్నారు. పదేళ్లుగా హనుమకొండలోని రాంనగర్లో నివాసం ఉంటున్నారు. సెలవు రోజుల్లో ఊరులో ఉన్న అమ్మానాన్న వద్దకు వచ్చివెళ్లేవాడు. ‘రెండు రోజులు సెలవులు ఉన్నాయి. పిల్లలతో సహా ఇంటికి వస్తున్నాం. అర్ధగంటలో చేరుకుంటాం’ అని ప్రవీణ్‌కుమార్ శనివారం ఉదయం తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పాడు. అదే అర్ధగంటలో కారు కాల్వలో పడిందని సమాచారం అందడంతో ‘అర్ధ గంటలో ఇంట్లో ఉంటానంటివి గద బిడ్డో... అంటూ’ ఆ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా విలపించారు. ఇంటికి వచ్చినప్పుడు అందరితో సరదాగా ఉండే ప్రవీణ్ కుమార్ చనిపోయాడని తెలియడంతో అయ్యో.. దేవుడు మంచి మనిషిని తీసుకెళ్లాడు’ అంటూ స్నేహితులు, గ్రామస్తులు కంటతడిపెట్టారు.నా భర్త, పిల్లలను బతికించండి..స్థానికుల సహాయంతో ప్రాణాలతో బయటపడిన కృష్ణవేణి తన పిల్లలను, భర్తను బతికించండని అక్కడున్న వారిని ప్రాధేయపడింది. రెండేళ్ల కుమారుడిని బయటికి తీసుకువచ్చాక ‘లే నాన్నా.. లే’ అంటూ తట్టిలేపుతున్న కృష్ణవేణిని చూసి ప్రతి ఒక్కరూ కంట తడిపెట్టారు.నువ్వు వస్తావా.. నన్నే రమ్మంటావా..‘నా మనుమరాలు చైత్ర ఉదయం ఫోన్లో మాట్లాడింది. హనుమకొండకు నువ్వు వస్తావా.. లేదా నన్నే రమ్మంటావా..’ అని ముద్దుగా చెప్పిందని తాత సారంగపాణి అక్కడున్న వారికి చెబుతూ రోదించారు. అప్పుడే నూరేళ్లు నిండాయా తల్లి అంటూ కన్నీటిపర్యంతమయ్యాడు. ప్రవీణ్ అంటే దయగల గుణం అని, అందరూ తనవాళ్లేనని అంటుండేవాడని, ఆస్పత్రుల్లో బంధువులుంటే వారికి అన్నం పెట్టేవాడని, అందరితో మంచివాడని పేరు తెచ్చుకున్న నా కొడుకుకు అప్పుడే నూరేళ్లు నిండి దేవుడి వద్దకు వెళ్లాడా. చైత్రకు నాన్న ప్రవీణ్ అంటే అమితమైన ప్రేమ అని, చివరికి తండ్రితో కలిసే పరలోకాలకు చేరింది’ అంటూ అని పద్మ గుండెలవిసేలా రోదించింది.రెయిలింగ్ లేకనే ప్రమాదాలురెయిలింగ్ లేకపోవడంతో కొంకపాక గ్రామ శివారులోని ఎస్సారెస్పీ డీబీఎం–48 కాల్వ వద్ద తరచూ ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోతున్నారు. రెండేళ్ల క్రితం కారు వేగంగా కాల్వలోకి వెళ్లి ఒక ప్రభుత్వ టీచర్, మరో ఇద్దరు మృతి చెందారు. అంతేకాకుండా ట్రాక్టర్ బోల్తాపడి మరొకరు మృత్యువాతపడ్డారు. శనివారం ఎస్సారెస్పీ కాల్వలో కారు పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. కాల్వ చుట్టూ రెయిలింగ్, ప్రమాద సూచికలు లేకపోవడంతోనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని పలువురు ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి రక్షణ చర్యలు చేపట్టి ప్రమాదాలను నివారించాలని వాహనదారులు కోరుతున్నారు. -
SLBC Tragedy : ప్రజల దశాబ్దాల ఆకాంక్ష ఎస్ఎల్బీసీ కథ ఇదీ!
ఉమ్మడి నల్లగొండ జిల్లాకు తాగు – సాగునీరు అందించే లక్ష్యంతో నిర్మిస్తున్న ‘శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్’ (ఎస్ఎల్బీసీ) టన్నెల్ పనుల్లో జరిగిన ప్రమాదం అందరికీ బాధ కలిగిస్తోంది. చివరికి సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికులు ప్రాణాలు కోల్పోవడం తీరని విషాదాన్ని మిగిల్చింది. భద్రతా చర్యల్లో డొల్లతనానికి అద్దం పట్టింది.నల్లగొండ జిల్లా కరువు పీడిత ప్రాంతాలలో నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు, 516 ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాలకు తాగునీరు అందించాల్సి ఉంది. ఈ ప్రాజెక్టు కోసం రోజుకు అరటీఎంసీ చొప్పున 60 రోజుల పాటు 30 టీఎంసీలు శ్రీశైలం రిజర్వాయర్ నుంచి 43.93 కిలో మీటర్ల సొరంగం తవ్వి గ్రావిటీ ద్వారా అందించాల్సి ఉంది. ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం పూర్తి చేసే లోపు, నాగార్జునసాగర్ రిజర్వాయర్ నుంచి పుట్టంగండి, అక్కంపెల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లతో నీళ్లు అందించేందుకు ‘ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్ట్’ ప్రారంభించారు. కరెంట్ మోటార్లతో నీళ్లు ఎత్తి పోయడం వల్ల ఇది జిల్లా ప్రజల అవసరాలను పూర్తిగా తీర్చలేదు. విద్యుత్ వినియోగం వల్ల అధిక వ్యయం అవుతుంది.అందువల్ల జిల్లా ప్రజల తాగు–సాగునీటి అవసరాలు తీర్చేందుకు ఎస్ఎల్బీసీ పూర్తి చేయడమే సరైన పరిష్కారం. ఈ ప్రాజెక్టును శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ మీదుగా అర కిలోమీటర్ లోతున సొరంగ తవ్వకం జరుగుతోంది. ఇది పూర్తి అయితేనే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ ప్రభావితప్రాంతాల్లో తాగునీరు; సూర్యాపేట భువనగిరి ప్రాంతాలకు సాగునీరు అందించేందుకు అవకాశం ఉంటుంది. దీని కోసం గత రెండున్నర దశాబ్దాల నుంచి వామపక్ష పార్టీలు, ఇతర ప్రజా సంఘాలు ఉద్యమాలు చేశాయి. వామపక్ష పార్టీలు శాసనసభ లోపల, వెలుపల ఈ ప్రాజెక్టు నిర్మాణం గురించి ఆందోళనలు చేశాయి. ఈ నేపథ్యంలోనే ఉమ్మడిఆంధ్రప్రదేశ్ ఎస్ఎల్బీసీ ప్రాజెక్టుకు అంకురార్పణ జరిగింది. ఈ క్రమంలో నాటి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంలో 2005 ఆగస్టు 11న పరిపాలనా అనుమతులు పొంది, అదే నెల 28న ‘జేపీ అసోసియేట్స్’ సంస్థతో ఎస్ఎల్బీసీ ఒప్పందం చేసుకుంది. మొదటి అంచనా మేరకు రూ. 2,813 కోట్ల ఖర్చు. అయితే 2017 నాటికి 3,152 కోట్ల రూపా యలకు పెంచారు. ఇప్పుడు అది 4,636.75 కోట్ల రూపాయలకు పెరిగింది. ఈ ప్రాజెక్టు శ్రీశైలం రిజ ర్వాయర్ బ్యాక్ వాటర్స్ నుంచి ‘దోమల పెంట’ వద్ద ఇన్లెట్తో మొదలై... నాగర్ కర్నూలు జిల్లా ‘మన్నె వారి పల్లె’ వద్ద అవుట్లెట్తో... మొత్తం 49.93 కిలో మీటర్ల ప్రధాన సొరంగం ముగుస్తుంది. ఇప్పటి వరకు 34.71 కిలోమీటర్ల సొరంగం తవ్వకం పూర్త యింది. 7.13 కిలోమీటర్ల పొడవైన రెండవసొరంగం తవ్వకం బ్లాస్టింగ్ పద్ధతిలో మొత్తం పూర్తి చేశారు. అయితే ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం ఈ ప్రాజెక్టు పనులు 2010 నాటికి పూర్తి కావాల్సి ఉంది. కానీ గత పాలకులు ముఖ్యంగా పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఈ ప్రాజెక్టుకు ఇప్పటివరకు జరి గిన పనుల విలువ రూ. 2,689.47 కోట్లు. రెండు దశాబ్దాల్లో 34.37 కిలోమీటర్ల సొరంగం తవ్వారు. 9.56 కిలోమీటర్ల సొరంగం తవ్వకం పనులు ఆగి పోయాయి. నాలుగైదు సంవత్సరాలలో పూర్తి చేయాల్సిన ప్రాజెక్టు 20 ఏళ్లుగా కొనసాగడం వల్ల వ్యయ భారా నికీ, తాజా పరిణామాలకూ పాలకుల అలసత్వమే కారణం. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక దాన్ని పూర్తి చేయడానికి కొంత బడ్జెట్ కేటాయించి తిరిగి పనులకు శ్రీకారం చుట్టారు. సొరంగం లోపల పైకప్పు నుంచి నీరు, మట్టి పడుతున్నదనీ, పనులు చేయడంలో ఇబ్బంది కలుగుతున్నదనీ కార్మికులు సంబంధిత కాంట్రాక్ట్ కంపెనీకి చెప్పినా, ఏమీ కాదని పని చేయాలని ఒత్తిడి చేయడంతో ఈ ప్రమాదం సంభవించింది. భద్రతా ప్రమా ణాలు, ప్రభుత్వ అజమాయిషీ సరిగా లేక సాగునీటి ప్రాజె క్టుల్లో, పరిశ్రమల్లో తరచుగా ఇలాంటి ప్రమాదాలతో నష్టం జరుగుతోంది. ఆయా సంఘటనలకు ప్రభుత్వాలే బాధ్యత వహించాల్సి ఉంది.టన్నెల్లో చిక్కుకుపోయిన 8 మంది కార్మికులను రక్షించడానికి, టన్నెల్లో బురద నీరు, వ్యర్ధాలను తొలగించడానికి వివిధ విభాగాల ప్రభుత్వ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొంటున్నప్పటికీ ఎలాంటి పురోగతీ కనిపించలేదు. ఈ ప్రమాదంపై ‘నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆథార్టీ (ఎన్డీఎస్ఏ) వారి నుంచి స్పందన రాలేదు. ఈ ప్రమాదం జరిగిన దోమల పెంట ప్రాంతాన్ని సీపీఎం బృందం ఫిబ్రవరి 23న సందర్శించింది. అక్కడ సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్న రాష్ట్ర మంత్రులు నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులతో సహాయక చర్యల విషయం చర్చించింది. చివరికి ఆశలన్నీ గల్లంతై కార్మికుల ప్రాణలు గాల్లో కలిసిపోయాయి. భద్రతాపరంగా తగిన సాంకేతిక చర్యలు తీసుకొని ఇప్పటిౖకైనా పనుల్లో అలసత్వం లేకుండా త్వరిత గతిని పూర్తి చేయాలి. ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చాలి.-జూలకంటి రంగారెడ్డి వ్యాసకర్త రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు,సీపీఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ -
ఒకే ఇంట్లో ముగ్గురి మృతి.. డైరీలో ఆమె ఫోన్ నంబర్!
వారిద్దరూ విద్యావంతులు. దానికి తోడు ప్రభుత్వ ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నారు. ఏమైందో ఏమో తెలియదుగానీ తల్లితో కలిసి విగతజీవులుగా మారిపోయారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మరణాలు కేరళలో (Kerala) కలకలం రేపాయి. వారు ముగ్గురు ఎలా చనిపోయారు, ఎందుకు అకాల మరణం చెందారనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విచారణ పూర్తయితేనే అన్ని వివరాలు తెలుస్తాయని పోలీసులు అంటున్నారు.అసలేం జరిగింది?కొచ్చిలోని ఎకాముఖ్ ప్రాంతంలో ఉన్న సెంట్రల్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ క్వార్టర్స్‌లోని ఓ ఇంటిలో ఇద్దరు మహిళలతో పాటు ముగ్గురి మృతదేహాలను పోలీసులు శుక్రవారం కనుగొన్నారు. మృతులు శాలిని విజయ్, మనీశ్ విజయ్, శకుంతలగా గుర్తించారు. శాలిని.. జార్ఖండ్ (Jharkhand) సాంఘిక సంక్షేమ శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తుండగా, ఆమె సోదరుడు మనీశ్.. ఐఆర్ఎస్ అధికారి. కొచ్చిలోని సెంట్రల్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ విభాగంలో అడిషనల్ కమిషనర్ ఉద్యోగం చేస్తున్నాడు. లివింగ్ రూములో సీలింగ్ హుక్కు ఉరివేసుకుని మనీశ్ చనిపోయాడు. మరో గదిలో శాలిని నిర్జీవంగా కనిపించారు. వీరి తల్లి శకుంతల మృతదేహం తెల్లని వస్త్రంలో చుట్టివుందని, పూలు చల్లిన ఆనవాళ్లు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు.మనీశ్ డైరీలో చెల్లెలి ఫోన్ నంబర్మనీశ్, శాలిని ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. శకుంతల మరణానికి గల కారణాలు అటాప్సీ రిపోర్ట్ వచ్చిన తర్వాతే వెల్లడవుతాయని చెప్పారు. ‘శకుంతల మరణం సహజమా, మరేదైనా కారణాలు ఉన్నాయనేది అటాప్సీ నివేదిక వచ్చిన తర్వాతే తెలిసే అవకాశం ఉంద’ని త్రిక్కకరా ఏసీపీ పీవీ బేబీ తెలిపారు. మనీశ్ డైరీలో ఫిబ్రవరి 15న రాసిన నోట్‌ను పోలీసులు గుర్తించారు. తమకు సంబంధించిన కొన్ని పత్రాలను దుబాయ్‌లో (Dubai) ఉంటున్న తన చెల్లెలికి అప్పగించాలని కోరుతూ, ఆమె ఫోన్ నంబరు కూడా అందులో రాశారు.టాపర్‌గా నిలిచి.. కేసులో ఇరుక్కుని.. శాలిని.. జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(జేపీఎస్సీ) 2003లో నిర్వహించిన మొదటి సివిల్ సర్వీసెస్ కంబైన్డ్ పోటీ పరీక్షలో టాపర్‌గా నిలిచారు. ఈ పరీక్ష ద్వారా 64 మంది ప్రభుత్వ ఉన్నత ఉద్యోగాలు సాధించారు. అయితే ఇందులో అక్రమాలు జరిగాయని ఆరోపణలు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేపట్టింది. దర్యాప్తు ముందుకు సాగకపోవడంతో 2022, జూలైలో జార్ఖండ్ హైకోర్టు విచారణను సీబీఐకి అప్పగించింది. రంగంలోకి దిగిన సీబీఐ.. శాలినితో పాటు మిగతా నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది. ఈ కేసులో తదుపరి విచారణ ఈనెల 27న జరగాల్సివుంది. ఈ నేపథ్యంలో శాలిని మరణించడం చర్చనీయాంశంగా మారింది.ప్రొఫెసర్ శకుంతల శకుంతల బొకారో (Bokaro) ప్రాంతానికి చెందిన వారని, వీరి కుటుంబం రాంచీలో 2013 వరకు అద్దె ఇంటిలో ఉందని తెలిసింది. శకుంతల కుటుంబ సభ్యులు భక్తిభావంతో మెలిగేవారని, తమతో స్నేహంగా ఉండేవారని పొరుగింటివారు వెల్లడించారు. బొకారోలో శకుంతల ప్రొఫెసర్‌గా పనిచేసేవారని తెలిపారు. ఆమె మరో కుమార్తె పెళ్లిచేసుకుని రాజస్థాన్‌లో స్థిరపడిందని చెప్పారు. నాలుగేళ్ల క్రితం రాంచీ ఇన్‌కం ట్యాక్స్ ఆఫీసులో కలిసినప్పుడు మనీశ్ అప్యాయంగా పలకరించాడని.. అతడితో పాటు శాలిని, శకుంతల మరణించారన్న వార్త తెలిసి చాలా బాధపడ్డామన్నారు. కాగా వీరి ముగ్గురి మరణానికి కారణాలను పోలీసులు అన్వేషిస్తున్నారు.చదవండి: వివాహ వేడుకలో విషాదం.. విచారణలో బయటపడ్డ అసలు విషయంఅన్నికోణాల్లోనూ దర్యాప్తుశాలినిపై సీబీఐ కేసు కారణంగానే వీరు ఆత్మహత్య చేసుకున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శకుంతల సహజంగా చనిపోయివుంటే ఆమె మరణాన్ని తట్టుకోలేక కూతురు, కొడుకు ప్రాణాలు తీసుకున్నారా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. వీరి మానసిక పరిస్థితి గురించి కూడా ఆరా తీస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. -
అయ్యో దేవుడా.. ఎందుకు ఇలా చేశావ్?
ఎంతో ఆనందంగా వీడ్కోలు పార్టీకి వెళ్లిన ఆ అమ్మాయి విగతజీవిగా మారిపోయింది. చదువు చెప్పిన గురువుల ముందు స్నేహితులతో కలిసి ఉత్సాహంగా డాన్స్ చేసిన ఆ విద్యార్థిని అర్థాంతరంగా తనువు చాలించింది. అప్పటివరకు ఆడిపాడిన అమ్మాయి ఆస్పత్రి బెడ్‌పై నిర్జీవంగా కనిపించడంతో తల్లిదండ్రులు శోక సంద్రంలో ముగినిపోయారు. అయ్యో దేవుడా.. ఎందుకు ఇలా చేశావ్ అంటూ కన్నీరుమున్నీరుగా రోదించారు.పాఠశాల విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమంలో (ఫేర్వెల్ పార్టీ) ఒక విద్యార్థిని నృత్యం చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు వదిలింది. మహబూబాబాద్ జిల్లా సీరోలు మండల కేంద్రంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల/కళాశాల (ఈఎంఆర్ఎస్)లో మంగళవారం రాత్రి జరిగిన ఈ సంఘటన వివరాలివి. సీరోలు ఈంఎఆర్ఎస్ పాఠశాల/కళాశాలలో పదో తరగతి విద్యార్థులకు ఫేర్వెల్ పార్టీ (farewell party) కోసం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. డీజే సౌండ్ (DJ Sound) బాక్స్‌లను ఏర్పాటు చేశారు. ఇందులో ఇంటర్ విద్యార్థినులు సైతం నృత్యాలు చేశారు.ఈ క్రమంలో మరిపెడ మండలం తానంచర్ల (Tanamcherla) శివారు సపావట్ తండాకు చెందిన సీఈసీ మొదటి సంవత్సరం విద్యార్థిని సపావట్ రోజా (16).. వేదికపై నృత్యం చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వెంటనే తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు రోజాను లేపేందుకు ప్రయత్నించారు. ఆమెను 108 వాహనంలో తరలిస్తున్న క్రమంలో ఈఎంటీ గాంధీ సీపీఆర్ చేశారు. చివరికి మహబూబాబాద్ జనరల్ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. తల్లిదండ్రులు కుమార్తె మృతదేహంపై పడి గుండెలవిసేలా రోదించారు. విచారణ లేకుండా సస్పెండ్ చేశారని..ములుగు/వెంకటాపురం(కె): ములుగు జిల్లా వెంకటాపురం (కె) మండల కేంద్రంలోని తన అద్దె గృహంలో మంగళవారం ఉదయం వెంకటాపురం అంగన్వాడీ ప్రాజెక్టు సీడీపీఓ ధనలక్ష్మి ఆత్మహత్యాయత్నం చేశారు. తనపై వచ్చిన ఆరోపణలపై కనీసం విచారణ లేకుండానే ఏకపక్షంగా సస్పెండ్ చేశారని మనస్తాపానికి గురై ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ మేరకు బాధితురాలి వీడియో క్లిప్ సామాజిక మాధ్యమాల్లో వైరలైంది.గతంలో ప్రాజెక్టు పరిధిలో జరుగుతున్న తతంగంపై కలెక్టర్‌కు విన్నవించినా పట్టించుకోలేదని, ప్రస్తుతం సమాన వృత్తిలో ఉన్న ములుగు సీడీపీఓ, ఇన్చార్జ్ డీడబ్ల్యూఓ చెప్పినట్లుగా వినడం తప్ప ఎదుట వ్యక్తి విషయాలను పరిగణనలోకి తీసుకోవటం లేదని ఆమె వీడియోలో పేర్కొన్నారు. సెంటర్లు నడవని కేంద్రాలకు ఎందుకు అద్దె చెల్లిస్తున్నారని, రిటైర్ అయిన ఆయాకు వేతనం ఎలా ఇస్తారని అడిగానని, వీటిని మనసులో పెట్టుకుని కలెక్టర్ ద్వారా సస్పెన్షన్ లెటర్ వచ్చేలా చేశారన్నారు. వీటన్నింటికి కారణం డీడబ్ల్యూఓ శిరీష అని పునరుద్ఘాటించారు.చదవండి: తెలంగాణ బీసీల్లో ముదిరాజ్‌లే టాప్.. తర్వాత ఎవరంటే?కాగా, సీడీపీఓ ధనలక్ష్మి తమపట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆరోపిస్తూ శనివారం వెంకటాపురం(కె) ప్రాజెక్టు కార్యాలయం ఎదుట అంగన్వాడీ టీచర్లు ధర్నా చేశారు. అనంతరం జిల్లా కేంద్రానికి చేరుకుని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై సోమవారం కలెక్టర్ ధనలక్ష్మిని పిలిపించి మాట్లాడారు. ఇది జరిగిన అరగంటలోనే సీడీపీఓను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు రావడంతో ఆమె ఆందోళన చెందారు. ఈ క్రమంలో మంగళవారం ఆమె ఆత్మహత్యాయత్నం సంచలనం సృష్టించింది. ఈ విషయమై డీడబ్ల్యూఓ శిరీషను వివరణ కోరగా తాను ఆమెను ఏమీ ఇబ్బంది పెట్టలేదని వివరణ ఇచ్చారు. -
Baghpat Incident: లడ్డూ పండుగలో విషాదం.. ఏడుగురు మృతి
ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్‌లో ఈరోజు (మంగళవారం) పెను ప్రమాదం చోటుచేసుకుంది. ఆదినాథుని నిర్వాణ లడ్డూ పండుగ సందర్భంగా మానస్తంభ్ కాంప్లెక్స్‌లో నిర్మించిన చెక్క నిర్మాణం కూలిపోయింది. ఈ ఘటనలో 50 మందికి పైగా భక్తులు శిథిలాల కింద చిక్కుకున్నారు. తాజాగా ఈ ప్రమాదంలో ఏడుగురు మృతిచెందినట్లు తెలుస్తోంది.ఈ ఘటన గురించి బాగ్పత్ పోలీసు అధికారి అస్మితా లాల్ మాట్లాడుతూ ‘బరౌట్లో జైన సమాజ ఉత్సవం జరుగుతుండగా, ఒక చెక్క నిర్మాణం కూలిపోయింది. ఫలితంగా 40 మంది గాయపడ్డారు. చికిత్స తర్వాత 20 మందిని వారి ఇళ్లకు పంపించారు. మరో 20 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఏడుగురు మృతి చెందారు’ అని తెలిపారు.ఈ ప్రమాదం మంగళవారం ఉదయం బరౌత్‌లోని గాంధీ రోడ్డులో జరిగింది. ప్రమాదం అనంతరం సంఘటనా స్థలంలో తొక్కిసలాట జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో ఏడుగురు పోలీసులు కూడా గాయపడ్డారని తెలుస్తోంది. ఈ సంఘటన గురించి సమాచారం అందిన వెంటనే డిఎం అస్మితా లాల్, ఎస్పీ అర్పిత్ విజయవర్గియా ఆసుపత్రికి చేరుకుని గాయపడిన వారిని పరామర్శించారు.#बागपत l भगवान आदिनाथ के निर्वाण लड्डू पर्व पर मान स्तम्भ परिसर में बना लकड़ी से बना पैड ढह गया। इसमें सात श्रद्धालुओं की मौत की खबर है। जबकि 75 से अधिक घायल हैं। मृतकों की संख्या में इजाफा हो सकता है। #baghpat #upnews pic.twitter.com/0BHLOjFYdE— Sudhir Chauhan (@sudhirstar) January 28, 2025బాగ్‌పత్‌లో జరిగిన ప్రమాదం గురించి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలుసుకున్నారు. అధికారులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి సరైన చికిత్స అందించాలని జిల్లా పరిపాలన అధికారులను సీఎం ఆదేశించారు. అలాగే గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.ఇది కూడా చదవండి: Mahakumbh : 15 కోట్ల మంది పుణ్యస్నానాలు పూర్తి.. మౌని అమావాస్య అంచనాలివే -
మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం, 8 మంది మృతి
-
కామారెడ్డి జిల్లాలో ముగ్గురి అదృశ్యం విషాదాంతం
-
‘నేవీ స్పీడ్ బోట్ డ్రైవర్ ‘అతి’ 14 మంది ప్రాణాలు తీసింది’
ముంబై : నేవి చెందిన బోటు నడిపే డ్రైవర్ అత్యుత్సాహం ప్రదర్శించడం వల్లే ముంబై సముద్ర తీరంలో జరిగిన పెను విషాదంలో 14 మంది ప్రాణాలు కోల్పోయారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.ముంబై సముద్ర తీరంలో ‘గేట్ వే ఆఫ్ ఇండియా’ నుంచి ఎలిఫెంటా గుహలకు ‘నీల్కమల్’ అనే ఫెర్రీ (పడవ) దాదాపు 100 మందికి పైగా పర్యాటకులతో బయలుదేరింది. ఈ క్రమంలో చక్కర్లు కొడుతూ వేగంగా వచ్చిన నేవీకి చెందిన ఓ స్పీడ్ బోటు దాన్ని బలంగా ఢీకొట్టింది. దాంతో ఫెర్రీ సముద్రంలో బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో 14 మంది ప్రాణాలు కోల్పాయారు.వారిలో తన అత్త ప్రాణాలు కోల్పోయిందని గౌరవ్ గుప్తా అనే యువకుడు విచారం వ్యక్తం చేశారు. ఫెర్రీ ప్రమాదం ఘటనలో సురక్షితంగా బయటపడ్డ గౌరవ్ గుప్తా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా.. ఇండియన్ నేవీ చెప్పినట్లుగా నేవీ బోటు ఇంజిన్‌లో సాంకేతిక లోపం వల్ల ప్రమాదం జరగలేదని, నేవీ బోటు డ్రైవర్ అత్యుత్సాహం వల్లే భారీ ప్రాణ నష్టం సంభవించిందని వాపోయాడు. ‘‘నేను పాల్ఘర్ జిల్లాలోని నలసోపరాకు కూరగాయాల వ్యాపారం చేస్తున్నా. గత వారం నా వివాహానానికి ముంబై నుంచి మా అత్త, ఇతర కుటుంబ సభ్యులు వచ్చారు. వారికి ఎలిఫెంటా గుహలు చూపించేందుకు గేట్ వే ఆఫ్ ఇండియా వద్ద నుంచి పడవలో బయలుదేరాము. మా అత్తతో పాటు, ఇతర ప్రయాణికులకు అదే చివరి రోజవుతుందని అనుకోలేదు. ఎలిఫెంటా ద్వీపం వైపు వెళుతుండగా నేవీకి చెందిన స్పీడ్ బోట్ 5 నుండి 6 మంది సిబ్బందితో మేం ప్రయాణిస్తున్న బోటు వేగంగా పక్కకు వచ్చింది. ఆ సమయంలో నేవీ బోటు డ్రైవర్ కొన్ని నిమిషాల పాటు అత్యుత్సాహం ప్రదర్శించారు. బోటును అటూ ఇటూ తిప్పుతూ ఫోజులు కొట్టారు. నేవీ డ్రైవర్ చేస్తున్న విన్యాసాల్ని తోటి ప్రయాణికులు వీడియోలు కూడా తీశారు. చివరికి మా బోటును ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నించాడు. డ్రైవర్ ఆ బోటును మా బోటుకు వైపుకు వేగంగా దూసుకొచ్చాడు. ఓవర్ టేక్ చేద్దామని అనుకున్నారు. కానీ ఆ స్పీడ్ బోటు.. మేం ప్రయాణిస్తున్న బోటు వేగంగా ఢీకొట్టింది. దీంతో 100 మంది ప్రయాణిస్తున్న బోటు సముద్రంలో మునిగింది. అప్రమత్తమైన రెస్క్యూ బృందాలు మమ్మల్ని రక్షించాయి’’అని అన్నారు.#MumbaiBoatAccident - Live video "Today afternoon, an #IndianNavy craft lost control while undertaking engine trials in #Mumbai Harbour due to engine malfunction. As a result, the boat collided with a passenger #ferry which subsequently capsized (#BoatCapsized ).""13… pic.twitter.com/9ifLLurccP— Surya Reddy (@jsuryareddy) December 18, 2024 నేవీ బోటు ఇంజిన్‌లో సాంకేతిక లోపం వల్లే ప్రమాదం తలెత్తిందనే వాదనను గుప్తా ఖండించారు. ఫెర్రీని ఢీకొట్టడానికి ముందు నేవీ స్పీడ్ బోట్ డ్రైవర్ సంతోషంగా ఉన్నారు. తాము ప్రయాణిస్తున్న బోటు ఎదురుగా వచ్చే మా ముందు విన్యాసాలు చేశారు. నేవీ బోటులో ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తితే.. అలా ప్రయాణం చేయరు కదా? అంత వేగంగా స్పీడు బోటును ఎలా నడిపారు అని ప్రశ్నించారు. కాగా, ఫెర్రీ బోటు ప్రమాదంపై సమాచారం అందుకున్న రెస్క్యూ బృందాలు 11 నేవీ పడవలతో సహా తీర ప్రాంత దళాలకు చెందిన మూడు పడవలు, నాలుగు హెలికాప్టర్లు కూడా ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. పోర్టు అధికారులు, కోస్ట్‌గార్డ్, మత్స్యకారుల సహాయక చర్యల్లో పాల్గొని 101 మందిని కాపాడాయి. -
‘పుష్ప 2’ ప్రీమియర్ షో.. తొక్కిసలాటలో మహిళ మృతి!
సాక్షి, హైదరాబాద్: ‘పుష్ప 2’ సినిమా ప్రీమియర్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందింది. ప్రీమియర్ షో చూసేందుకు అల్లు అర్జున్ థియేటర్‌కి రాగా..ఆయనను చూసేందుకు జనాలు ఎగబడ్డారు. అభిమానులు ఒక్కసారిగా తోసుకుంటూ రావడంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. ఈ క్రమంలో అక్కడ తొక్కిసలాట జరిగింది. దిల్సుఖ్ నగర్‌కు చెందిన రేవతి అనే మహిళ (35) కు తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రేవతి మృతి చెందింది. తీవ్ర అస్వస్థతకు గురైన ఆమె కుమారుడు శ్రీతేజ్(9)కు సీపీఆర్ చేసి బేగంపేట కిమ్స్‌కి తరలించారు. ప్రస్తుతం ఆ బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 సినిమా చూసేందుకు రేవతి తన ఇద్దరు పిల్లలు(శ్రీతేజ్, సన్వీక)తో బుధవారం సాయంత్రం సంధ్య థియేటర్‌కి వచ్చింది. అదే సమయంలో హీరో అల్లు అర్జున్ కూడా ధియేటర్‌కు వచ్చాడు. దీంతో అప్పటికే అక్కడికి పెద్ద సంఖ్యలో వచ్చిన బన్నీ ఫ్యాన్స్.. ఆయనను చూసేందుకు ఎగబడడంతో తొక్కిసలాట జరిగి..రేవతి మృతి చెందారని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని గాంధీ మార్చురికి తరలించారు. -
పాపాల భోపాల్‌లో పారా తారలు.. విషం కాటేసినా ఆటై మెరిశారు
భోపాల్ గ్యాస్ దుర్ఘటన జరిగి నేటికి 40 ఏళ్లు. డిసెంబర్ 2, 1984 అర్ధరాత్రి మొదలై డిసెంబర్ 3 వరకూ కొనసాగిన విష వాయువులు ఆ ఒక్క రాత్రితో తమ ప్రభావాన్ని ఆపేయలేదు. అవి జన్యువుల్లో దూరి నేటికీ వెంటాడుతూనే ఉన్నాయి. ఆ దుర్ఘటన నుంచి బయటపడిన వారికి నేటికీ అవకరాలతో పిల్లలు పుడుతున్నారు. ఏనాటి ఎవరి పాపమో ఇప్పటికీ వీళ్లు అనుభవిస్తున్నారు. అయితే వీరిలో కొందరు పిల్లలు పారా స్పోర్ట్స్‌లో ప్రతిభ చూపుతుండటం ఒక ఆశ. కాని ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని చెప్పడమే వీరు మనకు కలిగిస్తున్న చైతన్యం.పదిహేడేళ్ల దీక్షా తివారి ‘ఇంటెలెక్చువల్ డిజేబిలిటీ డిజార్డర్’ (ఐడిడి) రుగ్మతతో బాధ పడుతోంది. ఆ అమ్మాయిని బాల్యంలో గమనించిన తల్లిదండ్రులు మహేష్ తివారి, ఆర్తి తివారి డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లినప్పుడు ఆయన ‘ఇది భోపాల్ గ్యాస్ విష ఫలితం’ అనంటే ఆ తల్లిదండ్రులు హతాశులయ్యారు. ‘అదెప్పటి సంగతో కదా’ అన్నారు. ‘అవును... ఇప్పటికీ వెంటాడుతోంది’ అన్నాడు డాక్టర్. దానికి కారణం భోపాల్ ఘటన జరిగినప్పుడు మహేష్ వయసు 5 ఏళ్లు, ఆర్తి వయసు 3 సంవత్సరాలు. వారు భోపాల్‌లో ఆ గ్యాస్‌ని పీల్చారు. కాని అది జన్యువుల్లో దూరి సంతానానికి సంక్రమిస్తుందని నాడు వాళ్లు ఊహించలేదు.అదృష్టం ఏమిటంటే దీక్షా తివారి 2023 స్పెషల్ ఒలింపిక్స్‌లో భారత్ తరఫున బాస్కెట్ బాల్లో రజత పతకం తేవడం. ఈ అమ్మాయే కాదు భోపాల్ విష వాయువు వెంటాడుతున్న చాలా మంది బాలలు భోపాల్‌లోని జేపీ నగర్ప్రాంతంలో అత్యధికం ఉన్నారు. వీరంతా తమ శారీరక, మానసిక లోపాలను, రుగ్మతలను జయించడానికి స్పోర్ట్స్‌ను ఎంచుకున్నారు. అథ్లెటిక్స్, సైక్లింగ్, ఫుట్‌బాల్ తదితర ఆటల్లో ప్రతిభ చూపుతున్నారు. బతుకు జీవచ్ఛవం కాకుండా ఉండేందుకు క్రీడలు వారిని కాపాడుతున్నాయి. కాని ప్రభుత్వం వీరికి చేయవలసింది చేసిందా?40 టన్నుల గ్యాస్డిసెంబర్ 2, 1984 అర్ధరాత్రి భోపాల్‌లోని యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ నుంచి అత్యంత ప్రాణాంతకమైన ‘మిథైల్ ఐసొసైనెట్’ విడుదలవడం మొదలయ్యి మరుసటి రోజు సాయంత్రం వరకూ వ్యాపించింది. దాదాపు 40 టన్నుల విషవాయువు విడుదలైంది. దీని వల్ల చనిపోయిన వారు అధికారికంగా 2,259 కాని 20 వేల నుంచి 40 వేల వరకు మరణించి ఉంటారని సామాజిక కార్యకర్తల అంచనా. ఆ సమయంలో బతికున్నవారు జీవచ్ఛవాలుగా మారితే కొద్దిపాటి అస్వస్థతతో బయటపడిన వారూ ఉన్నారు. విషాదం ఏమంటే ఈ ఘటన జరిగినప్పుడు చంటిపాపలు, చిన్న పిల్లలుగా ఉన్నవారు ఆ ఘటన నుంచి బయట పడి అదృష్టవంతులం అనుకున్నారు కానీ వారికి యుక్తవయసు వచ్చి పిల్లలు పుట్టాక వారిలో అధిక శాతం దివ్యాంగులుగా, మానసిక దుర్బలురుగా మిగిలారు.1300 మంది దివ్యాంగులు‘‘భోపాల్ విషవాయువులు భోపాల్‌లోని 42 వార్డుల మీద ప్రభావాన్ని చూపాయి. ఆ 42 వార్డుల్లో దివ్యాంగ శిశువులు జన్మిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం వీరి సంఖ్య అధికారికంగా 1300. వీరిలో అత్యధికులు అంధత్వం, సెరిబ్రల్ పాల్సీ, డౌన్ సిండ్రోమ్, మస్క్యులర్ డిస్ట్రఫీ, అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ (ఏడీహెచ్‌డీ) వంటి సమస్యలతో బాధ పడుతున్నారు.వీరికి రెగ్యులర్‌గా థెరపీ అవసరం. కాని మా వద్ద వున్న వనరులతో కేవలం 300 మందికే సేవలు అందించగలుగుతున్నాం. మిగిలినవారికీ ఏ థెరపీ అందడం లేదు. వీరిలో చాలామంది పేద, దిగువ మధ్యతరగతి కుటుంబాల వారు. ఈనాటికీ వీరికి నష్టపరిహారం అందలేదు’’ అని ‘చింగారి’ ట్రస్ట్ బాధ్యుడొకరు తెలిపారు. భోపాల్ విషవాయువు బాధిత దివ్యాంగ శిశువులకు ఈ సంస్థ వైద్య సహాయం అందిస్తుంది.కల్లాకపటం లేని పిల్లలుభోపాల్లోని జేపీనగర్‌లో కల్లాకపటం లేని అమాయక బాలలు చాలామంది కనిపిస్తారు. ముద్దొచ్చే మాటలు మాట్లాడుతూ అందరిలాగా ఆటలాడాలని, స్కూలుకు వెళ్లాలని, కబుర్లు చెప్పే వీరంతా చాలామటుకు బుద్ధిమాంద్యంతో బాధపడే పిల్లలే. కొందరు శరీరం చచ్చుబడ్డ వారే. ప్రతి సంవత్సరం డిసెంబర్ 2వ తేదీన వీరంతా నిరసన కార్యక్రమం జరుపుతుంటారు. న్యాయం కోరుతుంటారు. కానీ దుర్ఘటన జరిగి 40 ఏళ్లు అవుతున్నా వీరు రోడ్ల మీదకు వస్తూనే ఉండాల్సి రావడం బాధాకరం.నీరు తాగిభోపాల్ విషవాయులు భూమిలోకి ఇంకడం వల్ల కొన్ని చోట్ల ఇప్పటికీ ఆ నీరు విషతుల్యం అయి ఉంది. వేరే దిక్కు లేక పేదలు ఆ నీరే చాలాకాలం తాగి ఇప్పుడు దివ్యాంగ శిశువులకు జన్మనిస్తున్నారు. ‘ఆటలాడే ఉత్సాహం ఉన్నా వీరికి ఆటవస్తువులు లేవు. హెల్త్ కార్డులు లేవు’ అని తల్లిదండ్రులు భోరున విలపిస్తుంటే ఏ పాపానికి ఈ శిక్ష అనిపిస్తుంది. -
HYD: లంగర్‌హౌజ్‌లో ‘హిట్ అండ్ రన్’.. దంపతులు మృతి
సాక్షి,హైదరాబాద్:లంగర్‌హౌజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హిట్ అండ్ రన్ ప్రమాదం రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.మద్యం మత్తులో స్విఫ్ట్‌కారు నడుపుతూ టూ వీలర్‌తో పాటు ఆటోను ఢీకొట్టారు.ఈ ప్రమాదంలో ఇద్దరు నవ దంపతులు మృతి చెందారు. మరో నలుగురికి గాయాలయ్యాయి.టూవీలర్‌పై వెళ్తున్న దంపతులు మొనా(34)& దినేష్(35) అక్కడికక్కడే మృతి చెందారు. మృతురాలు మోనా గర్భవతి కావడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. మృతులు మోనా,దినేష్ ఇద్దరిదీ ప్రేమ వివాహం. దినేష్ ఇటీవలే తన పుట్టినరోజు వేడుకల కోసం తన భార్యతో కలిసి లంగర్ హౌస్‌లోని అత్తారింటికి వచ్చాడు.లంగర్‌హౌస్ నుంచి బంజారాహిల్స్‌కు జూపిటర్ స్కూటీపై బయలుదేరారు. ఈ సమయంలోనే స్విఫ్ట్ కారు ఢీకొట్టింది. మృతులు బంజారాహీల్స్ నంది నగర్ లో కొంతకాలంగా నివాసం ఉంటున్నారు. ఇద్దరు దంపతులు ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నారు.మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.ఈ ప్రమాదంలో స్విఫ్ట్ కారు ఢీకొట్టిన ఆటోలో ఉన్న మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.గాయపడ్డవారు ఆస్పత్రితో చికిత్సపొందుతున్నారు. కారు డ్రైవర్ పవన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
కర్వా చౌత్ ట్రాజెడీ : ఆవేశంతో భార్య, ఆమె చీరతో భర్త
దేశమంతా వివాహిత జంటలు కర్వాచౌత్ (అట్ల తద్ది) సంబరాలను ఆనందంగా జరుపుకుంటే జైపూర్‌లో విషాదం చోటు చేసుకుంది. కర్వా చౌత్ రాత్రి భర్తఆలస్యంగా రావడంతో భర్తతో గొడవపడిన ఒక మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. భార్య చనిపోయిన బాధలో భర్త కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. భార్యభర్తల క్షణికావేశంతో వారి పిల్లలు అనాథలుగా మిగిలారు.జైపూర్‌లోని హర్మారా ప్రాంతంలో నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలో పనిచేస్తున్నాడు ఘనశ్యామ్ బంకర్ (38). కర్వాచౌత్ రోజు ఇంటికి ఆలస్యంగా వచ్చాడు. దీంతో (అక్టోబరు 20, ఆదివారం) భార్య మోనా (35) భర్తతో గొడవపడింది. ఇద్దరి మధ్యా మాటామాటా పెరిగింది. దీంతో మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో ఆవేశంతో ఇంటి నుండి వెళ్లిపోయింది. ఆమె వెనుకే ఘనశ్యామ్ వెళ్లాడు. కానీ చూస్తుండగానే ఆమె కదులుతున్న రైలు ముందు దూకి చనిపోయింది. దీంతో షాక్ అయిన అతను ఇంటికి వచ్చి భార్య చీరతో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. చనిపోయేముందు తన సోదరుడికి జరిగిన విషయంపై సమాచారం ఇచ్చాడు. భార్యాభర్తల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పంపి, కేసును దర్యాప్తు చేస్తున్నామని హర్మారా ఎస్హెచ్ఓ ఉదయ్ భన్ తెలిపారు. ఇదీ చదవండి: ఊపిరితిత్తులకు ఊతం, వెయిట్ లాస్ కూడా... -
కళ్లెదుటే కన్నకొడుకు సజీవ దహనం.. పాపం ఆ తల్లి..
మానకొండూర్: ఆరేళ్ల బాలుడు మిట్టమధ్యాహ్నం ఇంట్లో గాఢనిద్రలో ఉన్నాడు.. హఠాత్తుగా శరీరానికి వేడి తాకింది. నిద్రలోంచి తేరుకున్న ఆ చిన్నారి చుట్టూ మంటలు.. అమ్మా.. అమ్మా.. అంటూ హాహాకారాలు చేస్తూ ప్రాణాలు కాపాడుకునేందుకు మరోగదిలోకి పారిపోయాడు. ఇంటి ఆవరణలో కొంత దూరంలో ఉన్న తల్లి మంటలను గమనించింది. కొడుకును కాపాడుకునేందుకు విశ్వప్రయత్నాలు చేసినా ఫలించలేదు. ఊపిరాడక ఆ చిన్నారి ప్రాణాలు వదిలాడు. కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం ఈదులగట్టెపల్లి గ్రామంలో శుక్రవారం జరిగిన ఈ విషాదంపై స్థానికులు తెలిపిన వివరాలివి.ఈదులగట్టెపల్లి గ్రామానికి చెందిన అగ్గిడి రాజు, అనిత దంపతులకు రితిక, కొడుకు సాయికుమార్ (6) సంతానం. సాయికుమార్ కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు స్కూల్లో యూకేజీ చదువుతున్నాడు. రాజు ఆటో డ్రైవర్, అనిత కూరగాయలు అమ్ముతుంది. దీంతోపాటు సీజన్లో టార్పాలిన్లు (పరదాలు) కిరాయికి ఇస్తూ ఉపాధి పొందుతున్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఇంట్లో కూలర్ వేసుకుని సాయికుమార్ నిద్రిస్తున్నాడు. అనిత, రితిక ఇంటికి కొంతదూరంలో చెట్టు కింద కూర్చుకున్నారు. విద్యుదాఘాతంతో ఇంటి ఎదుట పందిరికి మంటలు అంటుకుని ఇంట్లోని టార్పాలిన్లకు వ్యాపించాయి.నిద్రలో ఉన్న సాయికుమార్ గమనించి ‘అమ్మా.. అమ్మా.. మంటలు’అంటూ ఏడుస్తూ అరిచాడు. గమనించిన తల్లి అనిత ఇంటి వద్దకు పరుగు తీసింది. అప్పటికే మంటలు ఎగిసిపడుతున్నాయి. కొడుకును కాపాడుకునేందుకు తల్లి చేసే ప్రయత్నాలు ఫలించడం లేదు. ఈ క్రమంలో ఆమెకూ గాయాలయ్యాయి. మంటలు మరింత వ్యాపించడంతో బాలుడు తన ప్రాణాలు కాపాడుకునేందుకు.. ఇంట్లోని మరోగదిలోకి వెళ్లి గడియ పెట్టుకున్నాడు. చదవండి: ప్రియుడితో కలిసి మరో ప్రియుడి హత్యస్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి అగ్నిమాపక శకటం చేరుకుని, మంటలార్పగా.. అప్పటికే మంటల వేడి తాళలేక, పొగతో ఊపిరి ఆడక బాలుడు మృతి చెందాడు. ఇంట్లోని సామగ్రి కాలిబూడిదైంది. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కొడుకు కళ్లెదుటే మంటల్లో కాలిపోవడంతో తల్లిదండ్రులు, కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. మానకొండూర్ ఇన్చార్జి సీఐ స్వామి మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కరీంనగర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
‘కానరాని లోకాలకు చిట్టితల్లి’
చిత్తూరు, సాక్షి: పోలీసులకు సవాల్‌గా మారిన పుంగనూరు చిన్నారి అదృశ్యం కేసు.. విషాదాంతం అయ్యింది. నాలుగు రోజుల కిందట కనిపించకుండా పోయిన ఆరేళ్ల బాలిక అస్పియా ఇవాళ శవంగా కనిపించింది. తన చిట్టితల్లి సురక్షితంగానే ఉండి ఉంటుందని, ఏ క్షణంలోనైనా తిరిగి వస్తుందని ఆశగా ఎదురు చూసిన ఆ తల్లికి.. చివరకు కడుపు కోతే మిగిలింది. సెప్టెంబర్ 29వ తేదీ ఆదివారం సాయంత్రం స్నేహితులతో కలిసి ఇంటి వద్ద ఆడుకుంటోంది ఆస్పియా. కరెంట్ పోయి వచ్చాక చిన్నారి కనిపించలేదు. కంగారుపడిన తల్లి.. తండ్రి అజ్మతుల్లాకు ఫోన్ చేసి సమాచారం అందించింది. స్థానికంగా వెతికినా ఆమె కనిపించలేదు. దీంతో అదే రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని గాలింపు చేపట్టారు. మూడు రోజులుగా బాలిక ఆచూకీ కనిపెట్టడం కోసం పోలీసులు చేయని ప్రయత్నమంటూ లేదు. ఏకంగా 11 ప్రత్యేక బృందాలతో, డాగ్ స్క్వాడ్‌తో పుంగనూరు చుట్టుపక్కల జల్లెడ పట్టారు. అయితే ఇవాళ (బుధవారం) ఉదయం సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో ఓ శవం తేలుతుందని పోలీసులకు సమాచారం అందింది.హుటాహుటిన అక్కడకు చేరుకున్న పోలీసులు.. అదొక చిన్నారి మృతదేహంగా తేల్చారు. అస్పియా తండ్రిని పిలిపించి.. ఆ చిన్నారిదేనని నిర్ధారణకు వచ్చారు. తిరిగి వస్తుందని ఆశగా ఎదురుచూస్తున్న కుటుంబ సభ్యులు.. బిడ్డ మృతితో రోదించారు. చిన్నారి విగత జీవిగా మారిందని తెలియడంతో పట్టణమంతా శోకసంద్రంలో మునిగింది. అయితే బాలిక అక్కడికి ఎలా వెళ్లింది? ప్రమాదవశాత్తు చెరువులో పడిందా..? లేదా ఎవరైనా కిడ్నాప్ చేసి చంపి పడేసారా?.. ఇలా అనేక కోణాల్లో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. -
వయనాడ్ విలయం : గుండెల్ని పిండేస్తున్నమహిళ ఫోన్ రికార్డింగ్
కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటన మారణహోమానికి దారి తీసింది. వరుసగా ఏడో రోజుకూడా ఈ ప్రకృతి విలయానికి సంబంధించిన అనేక హృదయ విదారక దృశ్యాలు, కథనాలు ఒక్కొక్కటీ వెలుగులోకి వస్తున్నాయి. ఈ సమయంలో తొలి విపత్తు కాల్ చేసిన మహిళ కాల్ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వయనాడ్‌లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో పని చేసే మహిళ ఫోన్ కాల్, ప్రాణాలను కాపాడుకునేందుకు ఆమె పడ్డ తపన పలువురి గుండెల్ని పిండేస్తోంది.వివరాలను పరిశీలిస్తే..జూలై 30న జిల్లాలోని మెప్పాడి సమీపంలోని కొండ ప్రాంతాలలో భారీ కొండచరియలు విరిగిపడటంతో నీతూ జోజో అనే మహిళ తొలుత స్పందించారు. తాము ఇబ్బందుల్లో ఉన్నాం, ప్రాణాలకే ప్రమాదం.. రక్షించండి! అంటూ కాల్ చేశారు. డాక్టర్ మూపెన్స్ మెడికల్ కాలేజీ సిబ్బందికి కాల్ రికార్డింగ్‌లో నీతూ, "చూరల్మల వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. మేం పాఠశాల వెనుక ఉంటున్నాం, దయచేసి మాకు సహాయం చేయడానికి మీరు ఎవరినైనా పంపగలరా?" అని చాలా ఆందోళనతో వేడుకున్నారు. ఇంటిచుట్టూ నీరే ఉందని తెలిపారు. అంతేకాదు తమతోపాటు ఏడు కుటుంబాలవారు తన ఇంట్లో ఆశ్రయం పొందారని తెలిపింది. అయితే తాము దారిలో ఉన్నామని, కంగారు పడొద్దని రెస్క్యూ టీమ్‌లు తమ ఆమెకు ధైర్యం చెప్పాయి. కానీ వారు వెళ్లేసరికే ఆలస్యం జరిగిపోయింది. మంగళవారం తెల్లవారుజామున 1 గంట. రాత్రికి రాత్రే దూసుకొచ్చిన నదీ ప్రళయఘోష బెడ్రూంకి చేరడంతో ఆమెకు మెలకువ వచ్చింది. చూరల్‌మలలోని హైస్కూల్ రోడ్డులోని ఆమె ఇంట్లోకి నీళ్లొచ్చాయి. ఎటు చూసిన కొట్టుకొస్తున్న వాహనాలు, కుప్పకూలిన శిథిలాలు, మట్టి,బురద భయంకరంగా కనిపించాయి. మెప్పాడిలోని డాక్టర్ మూపెన్స్ మెడికల్ కాలేజీలో ఫ్రంట్ ఆఫీస్‌లో పనిచేసే నీతులో ఆందోళన మొదలైంది. వెంటనే తన భర్త జోజో జోసెఫ్‌ను నిద్ర లేపారు. ఇంతలోనే సమీపంలోని ఏడు కుటుంబాల ఇళ్లు కూడా కొట్టుకుపోయాయి. వారికి కొండపైకి ఎత్తైన ఆమె ఇంట్లో ఆశ్రయం ఇచ్చారు. దీంతో 1.30 గంటలకు ఆసుపత్రికి ఫోన్ చేసింది. మళ్లీ 2.18 గంటలకు ఆమె మళ్లీ తన ఆసుపత్రికి ఫోన్ చేసింది. కొన్ని నిమిషాలకే ఆమె ఇంట్లోని వంటగది కొట్టుకుపోయింది. నీతూ మాత్రం సాయం కోసం ఎదురుచూస్తూ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. ఆమె భర్త జోజో, వారి ఐదేళ్ల కుమారుడు, మిగిలిన రెండు గదుల్లో ఉన్న జోజో తల్లిదండ్రులు క్షేమంగా ఉన్నారు. అంబులెన్స్ డ్రైవర్, మరొక సిబ్బంది ఆమెతో నిరంతరం ఫోన్లో టచ్‌లో ఉన్నారు కానీ, చెట్లు నేలకొరగడంతో రోడ్డు మార్గం స్థంభించిపోయింది. దీంతో రక్షణ బృందాలు చేరుకోలేకపోయాయి. వీళ్లు వెళుతున్న క్రమంలోనే రెండో కొండచరియలు విరిగిపడటంతో కనెక్షన్ పూర్తిగా తెగిపోయింది. చూరల్మల వంతెన కొట్టుకు పోయింది. అంబులెన్స్‌లు, ఇతర రెస్క్యూ సిబ్బంది నీతు వద్దకు చేరుకోలేకపోయింది. ఐదు రోజుల తర్వాత నీతు మృతదేహం చలియార్లో లభ్యమైంది. నీతు ధరించిన ఆభరణాలను బట్టి బంధువులు ఆమెను గుర్తించారు.కాగా జూలై 30న వాయనాడ్‌లో భారీ కొండచరియలు విరిగిపడటంతో 360 మందికి పైగా మరణించారు ప్రాణాలతో బయటపడిన వారి ఆచూకీ కోసం అధునాతన రాడార్లు, డ్రోన్లు, భారీ యంత్రాలను ద్వారా రెస్క్యూ బృందాలు రక్షణ చర్యలను వేగవంతం చేశాయి. -
వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 44వేలమంది యువతుల అదృశ్యమనేది పూర్తిగా అబద్ధం.. ఇంకా ఇతర అప్డేట్స్
-
వయనాడ్ లో మరణ మృదంగం
-
కోచింగ్ సెంటర్లు వ్యాపారంగా మారిపోయాయి: రాజ్యసభ ఛైర్మన్
‘కోచింగ్ వ్యవస్థ పూర్తిగా వాణిజ్యంగా మారింది. ఎప్పుడూ వార్తాపత్రికలను చదువుదాం అని తెరిచిన ప్రతిసారీ ముందు ఒకటి రెండు పేజీల్లో వారి ప్రకటనలే కనిపిస్తాయి’ అంటూ అని ఢిల్లీలోని కోచింగ్ సెంటర్లో వరదనీటిలో మునిగి యూపీఎస్సీ అభ్యర్థులు మరణించిన ఘటనను ఉద్దేశిస్తూ సోమవారం రాజ్యసభలో చైర్మన్ జగదీప్ ధన్కర్ ఆందోళన వ్యక్తం చేశారు.ఢిల్లీ దుర్ఘటనపై రాజ్యసభలో స్వల్పకాలిక చర్చకు పిలుపునివ్వడం సముచితమని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ అంశంపై తన ఛాంబర్లో అన్ని పార్టీల నేతలతో సమావేశం నిర్వహిస్తానని ఉపరాష్ట్రపతి ధన్కర్ తెలిపారు. కాగా ఢిల్లీలోని రావూస్ ఐఏఎస్ స్టడీ సెంటర్లోని బేస్మెంట్లోకి వరద నీరు పోటెత్తడంతో ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన విషయం తెలిసిందే.ఈ ఘటనపై విద్యార్థులు పెద్దఎత్తున ఆందోళన చేపట్టడంతో కోచింగ్ సెంటర్ యజమాని అభిషేక్ గుప్తా, కోఆర్డినేటర్ దేశ్పాల్ సింగ్ సహా ఏడుగురిని అరెస్టు చేశారు. ప్రమాదం జరిగిన మూడంతస్తుల భవనం సెల్లార్‌ను స్టోర్ రూమ్, పార్కింగుకు కేటాయిస్తామని ప్రణాళికలో చూపించి గ్రంథాలయంగా ఉపయోగిస్తున్నట్లు తేలిందని పోలీసులు పేర్కొన్నారు. -
Delhi Tragedy: ‘ముగ్గురు కాదు 10 మంది మృతి’
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలోని ఓల్డ్ రాజేంద్ర నగర్‌లోగల ఓ స్టడీ సెంటర్లోని బేస్మెంట్లోకి చేరిన వరద నీటిలో మునిగి ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. పోలీసులు, అగ్నిమాపక శాఖ, ఎన్డిఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి.ఈ సంఘటన అనంతరం విద్యార్థులు అటు కోచింగ్ సెంటర్‌పైన, ఇటు ప్రభుత్వం మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బేస్మెంట్లో ముగ్గురు మాత్రమే కాదు ఎనిమిది నుంచి పది మంది విద్యార్థులు మృతిచెంది ఉంటారని ఓ విద్యార్థి మీడియాకు తెలిపాడు. ఈ వాదనపై ఢిల్లీ పోలీసులు స్పందించారు. వెంటనే విచారణకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనపై ఒక విద్యార్థి మీడియాతో మాట్లాడుతూ ఈ ఘటనకు నిర్లక్ష్యమే కారణమన్నారు. అరగంట పాటు వర్షం కురిస్తే రోడ్లపై మోకాళ్ల లోతు వరకు నీరు చేరుతుందన్నారు. దీంతో అప్పుడప్పుడు విపత్తులు జరుగుతుంటాయన్నారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని, మృతుల వాస్తవ సంఖ్యను వెంటనే వెల్లడించాలని ఆ విద్యార్థి కోరాడు. #WATCH | Old Rajender Nagar incident | Delhi: "MCD says it is a disaster but I would say that this is complete negligence. Knee-deep water gets logged in half an hour of rain. Disaster is something that happens sometimes. My landlord said that he had been asking the councillor… pic.twitter.com/W4fhem3lE6— ANI (@ANI) July 28, 2024 ఓల్డ్ రాజేంద్ర నగర్లో జరిగిన ఘటనపై ట్విట్టర్లో సమాచారాన్ని పంచుకున్న ఢిల్లీ పోలీసులు సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ ముగిసిందని తెలిపారు. ముగ్గురి మృతదేహాలను వెలికితీశారని తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నామన్నారు. కాగా యూపీఎస్సీకి సిద్ధమవుతున్న అభ్యర్థి అమన్ శుక్లా మాట్లాడుతూ ముందుగా బేస్మెంట్లలో అక్రమంగా నిర్మించిన లైబ్రరీని మూసివేయాలన్నారు. #WATCH | Old Rajender Nagar Incident | "Three people have died. Why will we hide anything? We assure you that we will do whatever is legally possible. The investigation is on...," says Additional DCP Sachin Sharma to protesting students3 students lost their lives after the… pic.twitter.com/V82Xq21mQ7— ANI (@ANI) July 28, 2024 -
సైనిక విన్యాసాల్లో తీవ్ర విషాదం
లేహ్/రాచర్ల: సైనిక విన్యాసాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. విన్యాసాల్లో భాగంగా యుద్ధ ట్యాంకుతో నదిని దాటుతుండగా హఠాత్తుగా వరద పోటెత్తడంతో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జూనియర్ కమిషన్డ్ అధికారి(జేసీఓ) ముత్తముల రామకృష్ణారెడ్డి సహా ఐదుగురు జవాన్లు మృత్యువాత పడ్డారు. తూర్పు లద్దాఖ్‌లో భారత్–చైనా సరిహద్దు వాస్తవా«దీన రేఖ(ఎల్ఏసీ) సమీపంలోని షియోక్ నదిలో శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటి గంట సమయంలో ఈ దుర్ఘటన జరిగినట్లు సైనికాధికారులు వెల్లడించారు. లేహ్ నుంచి 148 కిలోమీటర్ల దూరంలోని మందిర్ మోర్హ్ వద్ద భారత సైన్యం విన్యాసాలు చేపట్టింది. ఈ విన్యాసాల్లో భాగంగా జవాన్లు యుద్ధ ట్యాంకులు నడుపుతూ షియోక్ నదిని దాటుతుండగా, టి–72 ట్యాంకు నదిలో ఇరుక్కుపోయింది. ఇంతలో ఎగువ ప్రాంతం నుంచి ఆకస్మికంగా వరద పోటెత్తింది. నదిలో నీటిమట్టం ఒక్కసారిగా పెరిగిపోయింది. క్షణాల వ్యవధిలోనే టి–72 ట్యాంకు నీట మునిగిపోయింది. యుద్ధ ట్యాంకుపై ఉన్న ఐదుగురు సైనికులు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు రంగంలోకి దిగినప్పటికీ నదిలో వరద ఉధృతి అధికంగా ఉండడంతో జవాన్లను రక్షించలేకపోయాయి. నదిలో ఐదుగురి మృతదేహాలు లభ్యమైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఐదుగురు జవాన్లు తూర్పు లద్దాఖ్ దౌలత్ బేగ్ ఓల్డీ మిలటరీ బేస్‌లోని 52 ఆర్మర్డ్ రెజిమెంట్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. విన్యాసాల్లో పాల్గొంటూ దుదృష్టవశాత్తూ మరణించారు. ఈ సైనిక శిబిరం చైనా సరిహద్దుకు అత్యంత సమీపంలో∙ఉంది. ఎగువ ప్రాంతాల్లో మంచు కరిగిపోవడం వల్లే షియోక్ నదిలో వరద ప్రవాహం హఠాత్తుగా పెరిగినట్లు అధికారులు వెల్లడించారు. దేశ రక్షణపరంగా వ్యూహాత్మకంగా కీలకమైన దెప్సాంగ్ ప్రాంతంలో ఈ నది ప్రవహిస్తోంది. పదవీ విరమణకు ఆరు నెలల ముందు మృత్యువాత తూర్పు లద్దాఖ్‌లో సైనిక విన్యాసాల్లో ప్రాణాలు కోల్పోయిన ముత్తముల రామకృష్ణారెడ్డి(47) స్వగ్రామం ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా రాచర్ల మండలం కాలువపల్లె. ఆయన భారత సైన్యంలో 30 ఏళ్లుగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్‌గా సేవలందిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరిలో రామకృష్ణారెడ్డి పదవీ విరమణ చేయాల్సి ఉందని గ్రామస్థులు తెలిపారు. ఆయనకు భార్య ఉమాదేవి, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుమారుల చదువుల కోసం ఉమాదేవి హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. రామకృష్ణారెడ్డి మృతదేహం ఆదివారం సాయంత్రం కాలువపల్లెకు చేరుకోనున్నట్లు స్థానికులు చెప్పారు. రామకృష్ణారెడ్డి మరణ వార్త తెలిసిన వెంటనే హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న ఆయన భార్య ఉమాదేవి, కుమారులు కాలువపల్లెకు బయలుదేరారు. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన రాజ్‌నాథ్ సింగ్ వాస్తవా«దీన రేఖ సమీపంలో ఐదుగురు సైనికులు మరణించడం పట్ల రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని శనివారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాం«దీ, ప్రియాంక సంతాపం ప్రకటించారు. -
‘హోర్డింగ్’ అనుమతులపై విచారిస్తున్నాం
దాదర్: ముంబైలోని ఘాట్కోపర్ ప్రాంతంలో హోర్డింగ్ కూలిన 14 మంది మృతిచెందిన దుర్ఘటన ప్రజలను తీవ్రంగా కలవరపరిచింది. మృతులు, గాయపడ్డవారి బంధువుల ఆందోళన నేపథ్యంలో అసలు ఈ భారీ హోర్డింగ్‌కు ఎవరు? ఎలా అనుమతిచ్చారన్న అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సోమవారం ఈదురు గాలులు, దుమ్ము, ధూళితో కూడిన భారీ వర్షం జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. గంటకు 60–70 కిలోమీటర్ల వేగంతో వీచిన ఈదురు గాలుల వల్ల పలు హోర్డింగులు, చెట్లు నేలకూలాయి.ఇదే క్రమంలో ఘాట్కోపర్లోని ఓ పెట్రోల్ బంకు షెడ్డుపై 120/120 అడుగుల భారీ హోర్డింగ్ కూలిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో తొమ్మిది మంది అక్కడికక్కడే దుర్మరణం చెందగా వంద మందికి పైగా గాయాలపాలయ్యారు. ఆకస్మాత్తుగా కురిసిన భారీవర్షం, ఈదురు గాలుల వల్ల ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయమేర్పడి ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోవడంతో అగి్నమాపక వాహనాలు, అంబులెన్స్‌లు సంఘటన స్ధలానికి చేరుకొనేందుకు తీవ్ర ఆలస్యమైంది దీంతో అగి్నమాపక సిబ్బంది, పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బలగాల ఆధ్వర్యంలో అర్ధరాత్రి దాటిన తరువాత కూడా సహాయ చర్యలు కొనసాగాయి. ఐతే వీరిలో తీవ్ర గాయాలపాలైన కొందరిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారని, దీంతో మృతుల సంఖ్య 14కు చేరిందని చడ్డానగర్ పోలీసులు తెలిపారు. హోర్డింగ్‌పై బీఎంసీకి మాజీ ఎంపీ కిరిట్ సోమయ్య లేఖ నేల కూలిన భారీ హోర్డింగ్ పునాదులు, వెల్డింగ్ చేసిన ఇనుప పట్టీలు చిలుము పట్టి శిథిలావస్థకు చేరుకోవడంతో దీన్ని తొలగించాలని స్ధానిక మాజీ ఎంపీ కిరిట్ సోమయ్య బీఎంసీకి గతంలో లేఖ రాశారు. దీన్ని పరిశీలించిన బీఎంసీ కమిషనర్ (అడ్మిన్) భూషన్ గగ్రానీ రెండు రోజుల కిందటే హోర్డింగ్ యజమానికి నోటీసు జారీ చేశారు. ఈలోగానే సోమవారం కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలులకు ఈ భారీ హోర్డింగ్ పక్కనే ఉన్న పెట్రోల్ బంకు షెడ్డుపై కూలింది. ఘటన జరిగిన సమయంలో బంకులో పెట్రోల్, డీజిల్, సీఎన్జీ కోసం పదుల సంఖ్యలో ఆటోలు, కార్లు, టెంపోలు, ఇతర వాహనాలు క్యూలో ఉన్నా యి.వీరే కాకుండా ఆకస్మాత్తుగా వర్షం కురవడంతో అనేక మంది ద్విచక్ర వాహన చోదకులు తల దాచుకునేందుకు బంకు షెడ్డు కిందకు చేరుకున్నారు. అలాగే భారత్ పెట్రోలియం బంకు సైన్ ప్రాంతం తర్వాత చడ్డానగర్లోనే ఉంది. ఆ తరువాత ఈస్టర్న్ ఎక్స్‌ప్రెస్ హై వేపై థానే వరకు భారత్ పెట్రోలియం బంకులు లేవు. దీంతో చడ్డానగర్లో హైవేకు ఆనుకుని ఉన్న ఈ పెట్రోల్ బంకు ఎప్పుడూ వాహనాలతో రద్దీగా ఉంటుంది.సోమవారం సాయంత్రం కూడా బంకులో ఇదే పరిస్థితి ఉండటం, అదే సమయంలో భారీ హోర్డింగ్, బంకు పైకప్పు కూలడంతో వాహనాల్లో చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు పోలీసులు, అగి్నమాపక అధికారులు తీవ్రంగా శ్రమించారు. కార్లపై హోర్డింగ్, పెట్రోల్ బంకు పైకప్పు కూలడంతో కార్ల డోర్లు జామ్ అయ్యాయి. వాహనాలకు సెంట్రల్ డోర్ లాకింగ్ సిస్టం ఉండడంవల్ల ఇంజన్ (ఆన్‌లో ఉంటేనే) పని చేస్తేనే డోర్లు తెరుచుకుంటాయి. దీంతో పలువురు కార్లలోనే ఇరుక్కుపోయారు. మృతుల సంఖ్య పెరగడానికి ఇది కూడా కారణమైందని, క్షతగాత్రులను 40 అంబులెన్స్‌ల ద్వారా వివిధ ఆస్పత్రులకు తరలించామని పోలీసులు తెలిపారు.గాలి తీవ్రత వల్లే.. ప్రమాదంఘాట్కోపర్ పరిసరాల్లో నాలుగు భారీ హోర్డింగులున్నాయి. సోమవారం నేల కూలిన హోర్డింగ్ రైల్వే పోలీసు క్వార్టర్స్ పరిధిలో ఉంది. మహరాష్ట్ర స్టేట్ పోలీసు వెల్ఫేర్ అసోసియేషన్ పేరిట ఉన్న ఈ స్థలంలో ప్రమాదానికి గురైన హోర్డింగ్‌కు రైల్వే మాజీ కమిషనర్ కేసర్ ఖాలీద్ హయాంలో అంటే 2021లో 10–20 ఏళ్ల కాలవ్యవధి కోసం అనుమతిచి్చనట్లు తెలుస్తోంది. బీఎంసీ నిబంధనల ప్రకారం ఒక్కో హోర్డింగు 40/40 అడుగుల ఆకారంలో ఉండాలి. కానీ ఈ హోర్డింగులు ఏకంగా మూడు రెట్లు అధికంగా అంటే 120/120 అడుగుల ఆకారంలో ఉండడంవల్ల గాలి వేగాన్ని తట్టుకోలేక కూలిపోయి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.హోర్డింగ్ యజమాని, ఈగో ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ సంచాలకుడు భావేష్ భిడేపై నిర్లక్ష్యంగా వ్యవహరించడం, అమాయకుల ప్రాణాలు పోవడానికి కారకుడయ్యాడనే అభియోగం మోపుతూ స్ధానిక పంత్నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. హోర్డింగ్ అనుమతులకు సంబంధించి కేసర్ ఖాలీద్‌ను సంప్రదించే ప్రయత్నం చేస్తున్నామని, అనంతరం కేసు దర్యాప్తును పూర్తిస్థాయిలో కొనసాగిస్తామని రైల్వే పోలీసు కమిషనర్ రవీంద్ర శిసావే వెల్లడించారు. -
న్యూ ఇయర్ వేడుకల్లో విషాదం
పటాన్చెరు టౌన్: న్యూఇయర్ వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ దుర్గం చెరువు వద్ద జరిగిన ఈవెంట్‌కి హాజరై తిరిగి హాస్టల్‌కు వెళ్తుండగా స్కూటీ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో ఇద్దరు బీటెక్ విద్యార్థులు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన పటాన్చెరు శివారులో ఆదివారం చోటుచేసుకుంది. పటాన్చెరు ఎస్ఐ వెంకట్‌రెడ్డి తెలిపిన వివరాలు... సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం సుల్తాన్పూర్ పరిధిలోని జేఎన్టీయూ యూనివర్సిటీలో బీటెక్ సెకండియర్ చదువుతున్న తొమ్మిది మంది విద్యార్థులు హాస్టల్లో పర్మిషన్ తీసుకుని ఆదివారం సాయంత్రం మూడు బైక్‌లపై దుర్గం చెరువు ఈవెంట్‌కు వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి వస్తుండగా పటాన్చెరు శివారు వాల్యూమాట్ సమీపంలోకి రాగానే భరత్ చందర్ (19) నడుపుతున్న స్కూటీ అదుపు తప్పడంతో డివైడర్‌ను ఢీకొట్టాడు. ఈ ఘటనలో భరత్ చందర్‌తో పాటు వెనుక కూర్చున్న స్నేహితుడు నితి న్ (18) అక్కడికక్కడే మృతి చెంద గా, మరో స్నేహితుడు వర్షిత్ (19) కు తీవ్రగాయాలయ్యాయి. అతన్ని పటాన్చెరు ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అనంతరం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. భరత్ చందర్ స్వస్థ లం జనగామ జిల్లా పాలకుర్తి మండలం రాఘవపురం గ్రామం. నితిన్ ది అదే జిల్లా బచ్చన్నపేట మండ లంలోని అలింపురం. మృతదేహాలను పోస్టుమార్టం నిమి త్తం పటాన్చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
నవ్వుల రాజా.. ఇలా షాక్ ఇచ్చాడేంటి?
సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ హాలీవుడ్ స్టాండ్‌అప్ కమెడియన్ నీల్ నందా(32) కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన సన్నిహితుల్లో ఒకరు ట్వీట్ చేశారు. చిన్న వయసులోనే కమెడియన్ కన్నుమూయడంతో అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. 32 ఏళ్ల నీల్ నందా మృతి పట్ల హాలీవుడ్ ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. అయితే అతని మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. నీల్ నందా హాస్యనటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అంతే కాకుండా రచయిత కూడా. నీల్ నందా ప్రధానంగా అట్లాంటాలో స్టాండప్ కామెడీ షోలను ప్రదర్శించారు. అతను కామెడీ సెంట్రల్, ఎంటీవీ, వైస్ల్యాండ్, హులు అనేక కామెడీ షోస్‌లో కూడా కనిపించాడు. అంతేకాకుండా వెస్ట్‌సైడ్ కామెడీ థియేటర్లో ప్రదర్శించిన అన్నెససరీ ఈవిల్ షో లాస్ఎంజిల్స్ వీక్లీ టాప్ -10లో చోటు దక్కించుకుంది. అయితే ప్రాథమిక సమాచారం ప్రకారం నీల్ నందా ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు ఇంకా ధృవీకరించలేదు. 2013లో తన ప్రయాణాన్ని ప్రారంభించిన నీల్ ప్రముఖ షో జిమ్మీ కిమ్మెల్ షో ద్వారా ఫేమ్ తెచ్చుకున్నారు. అంతేకాకుండా అమెజాన్ ప్రైమ్ షోలు ఇన్సైడ్ జోక్, హులు కమింగ్ టు ది స్టేజ్‌లో కూడా కనిపించాడు. నీల్ నందా మృతి చెందారనే వార్త సోషల్ మీడియాలో వ్యాపించడంతో నెటిజన్లు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. తమ అభిమాన హాస్యనటుడికి సోషల్ మీడియా వేదికగా నివాళులర్పించారు. RIP Neel Nanda. Just at a total loss for words here. One of the nice and hardest working ones we had 💔 pic.twitter.com/unFtmN2xoU — Eli Olsberg (@EliOlsberg) December 23, 2023 RIP Neel Nanda 😔 you were one of the nicest, hardest working comedians I’ve ever called a friend and i hope you can be at peace brother ❤️🩹 — Matt Rife (@mattrife) December 23, 2023 -
భోపాల్ విషాదానికి 39 ఏళ్లు.. ఆ రోజు ఏం జరిగింది?
భోపాల్ గ్యాస్ దుర్ఘటన జరిగి నేటికి 39 ఏళ్లు. 1984, డిసెంబర్ 2,3 తేదీల మధ్య రాత్రి జరిగిన ఈ గ్యాస్ లీక్ ఘటనలో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. నేటికీ మధ్యప్రదేశ్‌లోని భోపాల్ ప్రజలు నాటి ఘటన మిగిల్చిన విషాదాన్ని దిగమింగుతూనే కాలం వెళ్లదీస్తున్నారు. ప్రపంచంలోనే భారీ పారిశ్రామిక దుర్ఘటనగా పేరొందిన భోపాల్ ఉదంతపు గాయాలు 39 ఏళ్లు గడిచినా మానలేదు. ఈ గ్యాస్ దుర్ఘటనలో వేలాది మంది మృతిచెందారు. వారి పిల్లలు, మనుమలు ఇప్పటికీ ఈ విష వాయువు ప్రభావాలను ఎదుర్కొంటూనే ఉన్నారు. ప్రభుత్వాలు అందించిన సాయం ఎందుకూ సరిపోలేదు. నాడు గ్యాస్ దుర్ఘటన జరిగిన ప్రదేశంలో విషపూరిత వ్యర్థాలు నేటికీ కనిపిస్తాయి. ప్రభుత్వాలు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఈ విషపూరిత వ్యర్థాలను కాల్చడం సాధ్యం కావడం లేదు. ఈ దుర్ఘటనకు బలై, న్యాయ పోరాటానికి దిగిన చాలామంది ఈ లోకం నుండి నిష్క్రమించారు. ఈ ఉదంతంలో బాధ్యులను శిక్షించాలనే అంశం ఇంకా కోర్టుల్లో పెండింగ్‌లోనే ఉంది. భోపాల్ గ్యాస్ దుర్ఘటనలో 15 వేల మందికి పైగా జనం ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం దరిమిలా నగరం మృతదేహాలతో నిండిపోయింది. 1979లో మిథైల్ ఐసోసైనైడ్ ఉత్పత్తి కోసం ఇక్కడ ఒక కర్మాగారం ఏర్పాటయ్యింది. అయితే ఈ పరిశ్రమ యాజమాన్యం తగిన భద్రతా ఏర్పాట్లు చేయలేదు. డిసెంబర్ 2, 3వ తేదీ రాత్రి ఫ్యాక్టరీలోని ఏ 610 నంబర్ ట్యాంక్‌లో నీరు లీకైంది. మిథైల్ ఐసోసైనేట్లో నీరు కలవడంతో ట్యాంకులోపల ఉష్ణోగ్రత పెరిగింది. ఆ తర్వాత విషవాయువు వాతావరణంలోకి వ్యాపించించింది. 45 నిమిషాల వ్యవధిలోనే దాదాపు 30 మెట్రిక్ టన్నుల గ్యాస్ లీకైనట్లు సమాచారం. ఈ వాయువు నగరమంతటా వ్యాపించింది. ఈ విషవాయువుల బారినపడి 15 వేల మందికి పైగా జనం మృత్యువాత పడ్డారు. అయితే ఈ ప్రమాదం నుంచి బయటపడిన వారు కూడా విష వాయువు ప్రభావం నుంచి తప్పించుకోలేకపోయారు. వైకల్యం రూపంలో వారిని, వారి తరాలను వెంటాడుతోంది. ఈ విష వాయువు ప్రభావంతో మరణించిన వారి అధికారిక సంఖ్య ఇంకా అందుబాటులో లేదు. అధికారిక మరణాల సంఖ్య మొదట్లో 2259గా నివేదించారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం 3,787 మంది గ్యాస్ బారిన పడినట్లు నిర్ధారించింది. ఇతర అంచనాల ప్రకారం ఎనిమిది వేల మంది మరణించారు. మరో ఎనిమిది వేల మంది గ్యాస్ సంబంధిత వ్యాధులతో కన్నుమూశారని వివిధ నివేదికలు చెబుతున్నాయి. ఇది కూడా చదవండి: రెబల్స్, స్వతంత్రుల టచ్‌లో బీజేపీ, కాంగ్రెస్ నేతలు? -
ట్రాక్టర్‌తో విన్యాసం.. అతడి ప్రాణం తీసింది
చండీగఢ్: ట్రాక్టర్‌తో విన్యాసం చేస్తూ ఓ వ్యక్తి దురదృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోయాడు. పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లా సర్చుర్లో శనివారం ఈ విషాదం చోటుచేసుకుంది. సుఖ్‌మన్‌దీప్ సింగ్(29) గ్రామంలో జరుగుతున్న ఉత్సవంలోని మైదానంలో ట్రాక్టర్‌తో విన్యాసాలు చేస్తున్నాడు. స్టంట్స్‌లో నిపుణుడైన సుఖ్‌మన్‌దీప్ ముందుగా తన ట్రాక్టర్ రెండు చక్రాలను గాల్లోకి లేపి కిందికి దిగాడు. ఆ వాహనం గిరగిరా తిరుగుతుండగానే తిరిగి టైరుపైకి కాలుపెట్టి డ్రైవర్ సీట్లో కూర్చునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో కాలు జారీ ట్రాక్టర్ వెనుక చక్రాల కిందపడిపోయాడు. వేగంగా తిరుగుతున్న ట్రాక్టర్ అతడిపైకి పలుమార్లు వెళ్లడంతో తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ ఇలాంటి తరహా వినాస్యాలు చేయకుండగా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. The Punjab Government should impose a ban on such activities at events. A young man, Sukhmanjeet Singh, aged 29, lost his life while performing stunts on a tractor. He raised the front wheels, pressed the rear tires into the soil, and got down from the tractor while it was… pic.twitter.com/w8DVAN1b3u — Gagandeep Singh (@Gagan4344) October 29, 2023 -
హైదరాబాద్ లో విషాదంతమైన బాలుడి మిస్సింగ్
-
టైటాన్ విషాదం: వాళ్ళ చివరి మాటలు వింటే కన్నీళ్లు ఆగవు
యూఎస్: ఇటీవల అట్లాంటిక్ మహా సముద్రంలో టైటానిక్ శకలాలను చూసేందుకు వెళ్లి దురదృష్టవశాత్తూ అటునుంచటే అనంత లోకాలకు వెళ్ళిపోయారు ఐదుగురు. వారిలో పాకిస్తాన్ వ్యాపారవేత్త షాహ్జాదా దావూద్ అతని కుమారుడు కూడా ఉన్నారు. దావూద్ తన కుమారుడితో చివరిగా మాట్లాడిన మాటలను గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు ఆయన భార్య క్రిస్టీన్ దావూద్. గంటలు గడిచే కొద్దీ.. పాకిస్తాన్ వ్యాపారవేత్త షాహ్జాదా దావూద్ అతని కుమారుడు సులేమాన్ దావూద్ సముద్ర గర్భంలోకి సాహసయాత్రకు వెళ్లగా వారు యాత్రను దిగ్విజయంగా పూర్తి చేసుకుని తిరిగి వస్తారని పోలార్ ప్రిన్స్ (టైటాన్ జలాంతర్గామికి అనుబంధ పడవ) పైన క్రిస్టీన్ కూతురితో ఎదురుచూస్తూ ఉన్నారు. టైటాన్ జలాంతర్గామి తప్పిపోయిందనగానే ఏమాత్రం భయపడని ఆమె గతంలో కూడా ఒకసారి తన భర్త విమాన ప్రమాదం నుండి తప్పించుకున్నారని తాను ధైర్యం కూడదీసుకుని అందరికీ ధైర్యం చెప్పారు. కానీ ఎప్పుడైతే 96 గంటలు గడిచాయో అప్పుడే ఆశలు వదులుకున్నట్లు ఆమె తెలిపారు. అమ్మా గిన్నిస్ రికార్డు సాధిస్తా.. ఈ సందర్బంగా చివరిగా తన భర్త, కుమారుడితో మాట్లాడిన మాటలను గుర్తు చేసుకుంటూ.. టైటానిక్ శకలాలను చూడటానికి వెళ్తున్నానని సులేమాన్ చాలా ఉత్సాహంగా ఉన్నాడు. తనతో పాటు రూబిక్ క్యూబ్ ని తీసుకుని వెళ్లి సముద్రగర్భంలో రూబిక్ క్యూబ్ అమర్చిన మొట్టమొదటిగా వ్యక్తిగా గిన్నిస్ రికార్డు నెలకొల్పాలని సంబరపడ్డాడని, అందుకోసం దరఖాస్తు కూడా చేశాడని తెలిపారు. ఆ సన్నివేశాన్ని రికార్డ్ చేయాలని తన భర్త తనతోపాటు కెమెరాని కూడా తీసుకు వెళ్లినట్లు చెప్పారు. చివరికి.. వారు వెళ్లి 96 గంటలు గడిచాయని చెప్పగానే నాకు కీడు శంకించింది, విపత్తును గ్రహించాను. కానీ నా కూతురు మాత్రం వాళ్ళు తిరిగి వస్తారని నమ్మకంతోనే ఉంది. తీర రక్షక దళాలు జలాంతర్గామి శకలాలు కనిపించాయని చెప్పాక గాని తను నమ్మలేదని చెప్పి భావోద్వేగానికి గురయ్యారు. Christine Dawood wanted to talk to the BBC and pay tribute to the son and husband she lost. #Titan Longer interview running on @BBCWorld on-air and online 🎥 @robtaylortv @EloiseAlanna pic.twitter.com/q1LW946xpn — Nomia Iqbal (@NomiaIqbal) June 25, 2023 ఇది కూడా చదవండి: ఒక్కరి కోసం రెండు విమానాలు.. అదే వెరైటీ.. -
Odisha Train Tragedy:ఖాళీ చేతులతో 88 మందిని రక్షించి..
ఒడిశా:ఎదో బాంబు పేలిన శబ్దం. వచ్చి చూస్తే.. ఘోర రైలు ప్రమాదం. ఎక్కడ చూసినా అరుపులు, మూలుగులు, రక్తం, చెదిరిపడిన శరీర భాగాలు అన్నీ ఒళ్లు జలదరించే దృశ్యాలే. వాటన్నింటినీ దాటుకుని దాదాపు 88 మంది ప్రాణాలను కాపాడారు ఆ ఇద్దరు యువకులు. రెస్క్యూ పరికరాలు ఏం లేకున్నా.. పడిపోయిన బోగీల్లోకి ధైర్యంగా వెళ్లి, ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని బయటికి తీశారు. గ్రామస్థుల సహకారంతో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఆ యువకులే దీపక్ రంజన్, శుభంకర్ జెనాలు. రెస్క్యూ టీంలు రాకముందే ప్రమాదంలో సహాయక చర్యలు మొదలుపెట్టారు. అంతా అల్లకల్లోలం.. దీపక్ రంజన బెహ్రా ఒక రిటైర్డ్ ఆర్మీ అధికారి.. స్థానిక పిల్లలతో కలిసి మైదానంలో ఆటలాడుతున్నారు. ఆ సమయంలో ఓ పెద్ద శబ్దం వినిపించింది. వెళ్లి చూడగా.. ఘోర రైలు ప్రమాదం. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వారంతా కలిసి సహాయ చర్యలు మొదలుపెట్టారు. రాత్రి తొమ్మిదింటికి రెస్క్యూ బృందాలు వచ్చేవరకు అన్నీ తామే అయి చూసుకున్నారు. రాత్రంతా అక్కడే ఉండి నీళ్లు, ఆహారం పంచిపెట్టారు.'బోగీల వద్దకు మేము వెళ్లేసరికి అల్లకల్లోలంగా ఉంది. చీకటిగా ఉన్న బోగీల్లోకి వెళ్లి చాలామందిని బయటికి లాగాము. బోగీల కిందపడి కొంతమంది విపరీతంగా అరుస్తున్నారు' అని చెప్పారు. కళ్లలో మెదులుతున్నాయి.. 'గాయపడ్డవారికి మొదటి గంట చాలా కీలకం. సరైన సమయానికి ఆస్పత్రికి తీసుకువెళితే బతికే అవకాశం ఉంటుంది. మేమంతా కలిసి మా దగ్గర ఉన్న వాహనాలలో క్షతగాత్రులను ఆస్పత్రికి తరిలించాము. గంట తర్వాత అంబులెన్సులు వచ్చాయి. రెస్క్యూ టీంలు వచ్చే సమయానికే మేము చాలా మందిని రక్షించాము' అని దీపక్ తెలిపారు. 'మేము బోగి లోపలికి వెళ్లేసరికి ఓ గర్భవతి అరుస్తూ కనిపించింది. ఆమెను మేము బయటికి తీసుకురాగలిగాము. కానీ బోగీల లోపలే ఉన్న తన ఇద్దరు కుమారులను రక్షించమని ఆవిడ అడిగిన తీరు ఇంకా కళ్లలో మొదలుతోంది. ఆ భయానక దృశ్యాలు ఇంకా మా మనసును వెంటాడుతున్నాయి.' అని శుభంకర్ చెప్పారు. ఇదీ చదవండి:ఆ దుర్ఘటనలో కీలకంగా మారనున్న లోకోపైలట్ చివరి మాటలు.. -
ఆ దుర్ఘటన జరిగిన ప్రాంతం గుండానే..వందే భారత్ రైలు..
ఒడిశా రైలు ప్రమాదం ఎంతటీ తీవ్ర విషాదాన్ని మిగిల్చిందో తెలిసిందే. ఆ దుర్ఘటన తర్వాత ఆ ప్రాంతం గుండా తొలిసారిగా వందే భారత్ హైస్పీడ్ ప్యాసింజర్ హౌరా పూరీ రైలు వెళ్లింది. ఆ ప్రమాదం తర్వాత... పట్టాలు పునరుద్ధరణ పనులు పూర్తవ్వడంతో.. ఈ ఉదయమే బాలాసోర్ గుండా వందే భారత్ రైలు వెళ్లినట్లు అధికారులు తెలిపారు . ఈ రోజు ఉదయం 9.30 నిమిషాలకు బహనాగ బజార్ స్టేషన్‌ను దాటినట్లు తెలిపారు. అదే సమయంలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా ప్రమాద స్థలంలోనే ఉన్నట్లు సమాచారం. ఆ వందే భారత్ రైలు వెళ్లినప్పుడూ.. అందులోని డ్రైవర్లకు వైష్ణవ్ చేయి చూపినట్లు అధికారులు తెలిపారు. ఆ పట్టా పునురుద్ధరణ పనులు ఆదివారం రాత్రికే పూర్తయినట్లు వైష్ణవ్ తెలిపారు. ఆదివారం రాత్రి 10.40 గంటల ప్రాంతంలో వైజాగ్ పోర్టు నుంచి బొగ్గుతో కూడిన రూర్కెలా స్టీల్ ప్లాంట్ రైలు ఆ ట్రాక్‌పై పరుగులు పెట్టినట్లు తెలిపారు అధికారులు. కాగా ఆ మూడు రైళ్ల ప్రమాదం విషయమై ఇది మానవ తప్పిదమా? ..సిగ్నల్ వైఫల్యమా లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనేదానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: రైలు ప్రమాదం మరణాలపై సర్వత్రా ఆరోపణలు..ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఒడిశా ప్రధాన కార్యదర్శి) -
మృతులు 300కు చేరువలో...
న్యూఢిల్లీ/భువనేశ్వర్: ఒడిశా మూడు రైళ్ల ప్రమాదం దేశమంతటినీ తీవ్ర విషాదంలో ముంచేసింది. శుక్రవారం షాలిమార్ నుంచి చెన్నై వెళ్తున్న కోరమండల్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రాత్రి ఏడింటి ప్రాంతంలో బహనగా రైల్వేస్టేషన్ సమీపంలో మెయిన్ ట్రాక్ నుంచి లూప్ లైన్లోకి వెళ్లడం, దానిపై ఆగి ఉన్న గూడ్స్‌ను గంటకు 128 కి.మీ. వేగంతో ఢీకొనడం తెలిసిందే. దాని బోగీలు పక్క ట్రాక్‌పై పడటం, అదే సమయంలో దానిపై బెంగళూరు నుంచి హౌరా వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ వాటిని ఢీకొని పట్టాలు తప్పడం తెలిసిందే. ఈ ఘోర ప్రమాదంలో 70 మందికి పైగా మరణించినట్టు తొలుత భావించినా మృతుల సంఖ్య భారీగా పెరిగింది. చిక్కుకుపోయిన బోగీలను విడదీస్తూ గాలింపు కొనసాగిన కొద్దీ శవాలు భారీగా బయట పడుతూ వచ్చాయి. 288 మంది మరణించినట్టు ఇప్పటిదాకా తేలింది. 1,175 మందికి పైగా గాయపడ్డారు. వారందరినీ సమీపంలోని పలు ఆస్పత్రుల్లో చేర్చారు. వీరిలో 700 మందికి పైగా డిశ్చార్జి కాగా మిగతా వారు ఇంకా చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో మృతుల సంఖ్య మరికాస్త పెరిగేలా కన్పిస్తోంది. ప్రమాద సమయంలో రెండు రైళ్లలో కలిపి రిజర్వుడ్ ప్రయాణికులే 2,400 మంది దాకా ఉన్నారు. వీరు గాక జనరల్ బోగీల్లో భారీ సంఖ్యలో ప్రయాణిస్తున్నారు. అంతా కలిపి 3,000 మందికి పైగా ఉంటారని చెబుతున్నారు. ప్రమాదానికి సిగ్నల్ వైఫల్యమే ప్రధాన కారణమని రైల్వే శాఖ ప్రాథమిక విచారణలో తేలింది. సమగ్ర దర్యాప్తు కోసం ఉన్నత స్థాయి బృందాన్ని ఏర్పాటు చేశారు. ఘటనా స్థలిని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం సందర్శించారు. ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు. ఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. మృతుల కుటుంబాలకు మరో రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున అదనపు పరిహారాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆయన వెంట ఉన్నారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో పాటు పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా ప్రమాద స్థలాన్ని సందర్శించారు. అంతకుముందు ఈ ఉదంతంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రైల్వేతో సహా పలు శాఖ ఉన్నతాధికారులతో మోదీ ఢిల్లీలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రమాదం జరిగిన తీరును అధికారులు ఆయనకు వివరించారు. ప్రమాద స్థలి నుంచి బాధితుల తరలింపు దాదాపుగా పూర్తయింది. సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్తో పాటు వేలాది మంది సిబ్బంది శ్రమిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మోదీ, రైల్వే మంత్రి బదులివ్వాల్సిన ప్రశ్నలెన్నో ఉన్నాయని విపక్ష కాంగ్రెస్ మండిపడింది. పెను విషాద సమయం గనుక సహాయక చర్యలు పూర్తవడానికే ప్రస్తుతానికి ప్రాధాన్యమిస్తున్నామని పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. కోరమండల్‌కు కలిసిరాని శుక్రవారం కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌కు శుక్రవారం కలిసిరావడం లేదు. గత 20 ఏళ్లలో ఈ రైలు మూడుసార్లు ప్రమాదానికి గురైంది. అవన్నీ శుక్రవారమే జరిగాయి. పైగా వాటిలో రెండు ప్రమాదాలు ఒడిశాలోనే చోటుచేసుకున్నాయి. హౌరా–చెన్నై మధ్య నడిచే కోరమండల్ మూడుసార్లూ చెన్నై వెళ్తూనే ప్రమాదానికి గురైంది! 2009లో ఒడిశాలోని జైపూర్ వద్ద తొలిసారి ప్రమాదం జరిగింది. అప్పుడు 16 మంది చనిపోయారు. తర్వాత 2022 మార్చిలో నెల్లూరు వద్ద జరిగిన రెండో ప్రమాదంలో చాలామంది గాయపడ్డారు. తాజా ప్రమాదం మూడోది. లోకో పైలట్లకు గాయాలు భువనేశ్వర్: కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ దుర్ఘటనలో లోకోపైలట్ జీఎన్ మహంతి, సహాయ లోకో పైలట్ హజారీ బెహరా తీవ్రంగా గాయపడ్డారు. అదృష్టవశాత్తూ ఇరువురూ ప్రాణాలతో బతికి బయటపడ్డారు. వీరిని ఆస్పత్రిలో చేర్పించి, ఉన్నత స్థాయి చికిత్స అందిస్తున్నారు. జీఎన్ మహంతికి పక్కటెముక విరిగింది. దుర్ఘటనలో ఊపిరితిత్తులు తీవ్ర ఒత్తిడికి గురికావడంతో అంతర్గత రక్తస్రావమైనట్లు వైద్యులు తెలిపారు. హజారీ బెహరా ఎడమకాలి ఎముక విరగడంతో శస్త్రచికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరారు. -
కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌ను వెంటాడిన విధి.. సరిగ్గా 14 ఏళ్ల తర్వాత..
సరిగ్గా 14 ఏళ్ల తర్వాత... కోరమండల్ ఎక్స్ ప్రెస్ ప్రమాదానికి గురికావడం ఇదే మొదటిసారి కాదు. 14 ఏళ్ల క్రితం కూడా ఇదే ఓడిశాలోని జాజ్ పూర్ వద్ద ఈ రైలు మొదటిసారి పట్టాలు తప్పింది. ఆసక్తికరమైన మరో సంగతేంటంటే ఆరోజు కూడా శుక్రవారమే. సరిగ్గా పద్నాలుగేళ్ల తర్వాత మళ్ళీ అదే కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ఒడిశాలోనే, శుక్రవారం రోజునే ప్రమాదానికి గురికావడం యాదృచ్చికం. 2009, ఫిబ్రవరి 13, శుక్రవారం రోజున... ఒడిశాలోని జాజ్ పూర్ రోడ్ రైల్వే స్టేషన్ మీదుగా అత్యంత వేగంగా వెళ్తోన్న కోరమండల్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. ఆరోజు ఆ ప్రమాదంలో స్లీపర్ క్లాస్ కు చెందిన 13 భోగీలు పట్టాలు తప్పగా అందులో ప్రయాణిస్తున్న 11 మంది మృతి చెందారు, 161 మంది గాయపడ్డారు. ఇన్నేళ్ల తర్వాత అదే శుక్రవారం రోజున కోరమండల్ ఎక్స్ ప్రెస్ మళ్ళీ ప్రమాదానికి గురికావడం కొత్త అనుమానాలకు తావిస్తోంది. కానీ ఇప్పుడు బాలాసోర్‌లో జరిగిన ఈ ప్రమాదం అంతకంటే తీవ్రమైనది. రైలు ప్రమాదం తదనంతర పరిణామాలు మరింత విషాదకరంగా ఉన్నాయి.సంఘటనా స్థలంలో ఎటు చూసినా మృతదేహాల వద్ద రోదిస్తున్న బాధితులతో హృదయవిదారక దృశ్యాలే దర్శనమిస్తున్నాయి. దేశ చరిత్రలోనే అత్యంత విషాదకరమైన రైలు ప్రమాదాల్లో బాలాసోర్ సంఘటన కూడా ఒకటిగా మిగిలిపోతుంది. మృతుల సంఖ్య ఇప్పటికింకా ఒక కొలిక్కి రాలేదు. గాయపడినవారి సంఖ్య తగ్గుతుంటే.. మృతుల సంఖ్య మాత్రం పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇది కూడా చదవండి: సహాయక చర్యల్లో అందరూ పాల్గొనండి -
అమ్మా.. నీ వెంటే నేనూ.. గంటల వ్యవధిలో తల్లీకుమారుడి మృతి..
సాక్షి, నల్లగొండ: అనారోగ్యంతో బాధపడుతున్న తల్లీ కుమారుడు గంటల వ్యవధిలో మృతి చెందారు. మాతృ దినోత్సవం రోజు నల్లగొండ జిల్లాలో జరిగిన ఈ విషాద సంఘటన వివరాలివి. హాలియా మున్సిపాలిటీ పరిధి ఇబ్రహీంపేటకు చెందిన వందనపు పార్వతమ్మ (95), చంద్రయ్య దంపతులకు కుమారుడు వందనపు ఈశ్వరయ్య (74)తో పాటు ఐదుగురు కుమార్తెలు సంతానం. వందనపు చంద్రయ్య గ్రామంలోనే కిరాణా దుకాణం ఏర్పాటు చేసుకొని పిల్లలను పెంచి పెద్దచేసి అందరి వివాహాలు జరిపించాడు. పదహారేళ్ల క్రితం చంద్రయ్య అనారోగ్యంతో మృతి చెందాడు. వీరి కుమారుడు ఈశ్వరయ్య ఇబ్రహీంపేటలో నివసిస్తూ కిరాణా దుకాణం నిర్వహిస్తున్నాడు. పార్వతమ్మ, ఈశ్వరయ్య కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. బిడ్డ వద్ద ఉంటున్న పార్వతమ్మ తీవ్ర అస్వస్థతకు గురై శనివారం ఉదయం 11 గంటలకు మృతి చెందింది. అదేరోజు కుమారుడు వందనపు ఈశ్వరయ్య ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోవడంతో కుటుంబ సభ్యులు నల్లగొండ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ శనివారం రాత్రి 11 గంటలకు మృతి చెందాడు. తల్లి, కొడుకు ఒకే రోజు 12 గంటల వ్యవధిలో మృతి చెందడంతో ఇబ్రహీంపేట గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. చదవండి: 20 ఏళ్లుగా ఇంట్లోనే బంధించి.. -
కేరళ బోటు విషాదం..
-
కేరళలో ఘోర ప్రమాదం.. పడవ మునిగి 22 మంది మృతి
తిరువనంతపురం: కేరళలోని మలప్పురంలో విషాద ఘటన జరిగింది. పర్యాటకులతో వెళ్తున్న పడవ బోల్తా పడి 22 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో తానూర్‌లోని పర్యాటక ప్రాంతం తూర్వాల్ తీరమ్ వద్ద ఘటన చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో దాదాపు 40 మంది బోటులో ఉన్నట్లు చెబుతున్నారు. సహాయక చర్యల్లో ఆరుగురిని కాపాడామని యంత్రాంగం తెలిపింది. రూ.2లక్షల పరిహారం.. ఈ విషాధ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. రూ.2లక్షల పరిహారం అందించనున్నట్లు పేర్కొన్నారు. ఈమేరకు ప్రధాని కార్యాలయం ట్వీట్ చేసింది. Pained by the loss of lives due to the boat mishap in Malappuram, Kerala. Condolences to the bereaved families. An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be provided to the next of kin of each deceased: PM @narendramodi — PMO India (@PMOIndia) May 7, 2023 సీఎం విచారం.. ఈ బోటు ప్రమాదంపై కేరళ సీఎం పినరయి విజయన్ కూడా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. రెస్క్యూ ఆపరేషన్‌పై జిల్లా అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. మృతుల కుటుంబాలకు, సన్నిహితులకు సంతాపం తెలిపారు. Deeply saddened by the tragic loss of lives in the Tanur boat accident in Malappuram. Have directed the District administration to effectively coordinate rescue operations, which are being overseen by Cabinet Ministers. Heartfelt condolences to the grieving families & friends. — Pinarayi Vijayan (@pinarayivijayan) May 7, 2023 చదవండి: ఘోర ప్రమాదం.. చిన్నారి సహా ఎనిమిది మంది మృత్యువాత -
పరిస్థితి భయంకరం.. ఊపిరి తీసుకోరాలేదు.. ఎక్కడివాళ్లక్కడ పడిపోయారు
చండీగఢ్: పంజాబ్ లుధియానాలోని గియాస్పూరలో కెమికల్ ఫ్యాక్టరీ నుంచి గ్యాస్ లీకై 11 మంది చనిపోయిన విషయం తెలిసిందే. మృతుల్లో ఎక్కువ మంది వలస కార్మికులే ఉన్నారు. అయితే ఈ ఘటనను చూసిన ప్రత్యక్ష సాక్షి అరవింద్ చౌబె.. ఉదయం గ్యాస్ లీకైనప్పుడు పరిస్థితి ఎలా ఉందో కళ్లకుగట్టినట్లు వివరించారు. ఊపిరి పీల్చుకోవడానికి స్థానికులు తీవ్రంగా ఇబ్బందిపడ్డారని, ఎక్కడివాళ్లు అక్కడ స్పృహ తప్పిపడిపోయారని తెలిపారు. 'నేను మా సోదరుడు ఉదయం క్రికెట్ మ్యాచ్ ఆడాలనుకున్నాం. 7 గంటలకు గ్యాస్ లీకైందని నా సోదురుడు చెప్పాడు. వెంటనే మేం అక్కడకు చేరుకున్నాం. స్థానికులకు కాపాడేందుకు మా వంతు ప్రయత్నం చేశాం. స్పృహ తప్పి పడిపోయిన వాళ్లలో ఒక వ్యక్తి బతికున్నాడని గమనించి వెంటనే అంబులెన్సు వరకు తీసుకెళ్లాం. అతను ప్రాణాలతో బయటపడ్డాడు. మేము ఊపిరి తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బందిపడ్డాం. ప్రాణాలతో బతికున్నామంటే నిజంగా మా అదృష్టం.' అని అరవింద్ చెప్పారు. అరవింద్ సోదరుడు ఆశీశ్ మాట్లాడుతూ.. తమ వాళ్లను కాపాడుకునేందుకు వెళ్లే క్రమంలో కొంతమంది విషవాయువు పీల్చి రోడ్డుపైనే కుప్పకూలారని తెలిపారు. ఓ వ్యక్తి అపస్మారక స్థితిలో ఉన్న తన భార్యపై నీళ్లుచల్లుతూ సాయం కోసం పిలిస్తే దగ్గరకు వెళ్లానని, ఈలోగా అతను కూడా స్పృహ కోల్పోయాడని వివరించాడు. ఈ ప్రాంతమంతా పొగ అలుముకుందని, ఎవరికీ ఊపిరాడలేదని పేర్కొన్నాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలానికి వచ్చారని తెలిపారు. మరో ప్రత్యక్ష సాక్షి అర్జూ ఖాన్ మాట్లాడుతూ.. విషవాయువు పీల్చి తన 12 సోదరుడు చనిపోయాడని బోరున విలపించాడు. గ్యాస్ లీకైనప్పుడు అతను గదిలోనే ఉన్నాడని పేర్కొన్నాడు. ఘటనలో చనిపోయినవారంతా దాదాపు ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందినవారేనని పేర్కొన్నాడు. కాగా.. గ్యాస్ లీకైన ప్రాంతాన్ని విపత్తు నిర్వహణ దళాలు నిర్బంధించాయి. ఇళ్లలో ఉన్నవారికి ఆస్పత్రికి తరలించాయి. ఇంకా చాలా మంది బాధితులు ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: ఫ్యాక్టరీ నుంచి గ్యాస్ లీక్ -
150 అడుగుల లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. 12 మంది దుర్మరణం
ముంబై: మహారాష్ట్రలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాయ్‌గడ్ జిల్లా ఖోపాలి వద్ద బస్సు అదుపుతప్పి 150 అడుగుల లోయలోకి దూసుకెళ్లింది. ఈ విషాద ఘటనలో 12 మంది దుర్మరణం చెందారు. మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. పుణె-రాయ్‌గడ్ సరిహద్దులో ఈ ప్రమాదం జరింది. బస్సు పుణెలోని పంపిల్ గురవ్ నుంచి గొరెగావ్ వెళ్తుండగా ప్రమాదానికి గురైంది. ఘటన సమయంలో బస్సులో మొత్తం 41 మంది ప్రయాణిలుకున్నారు. ఘటనపై సమాచారం అందిన వెంటనే పోలీసులు, సహాయక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. లోయలోకి దిగి బస్సులోని క్షతగాత్రులను బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. చదవండి: పండుగ వేళ విషాదం.. కుప్పకూలిన బ్రిడ్జి -
శ్రీరామ నవమి వేడుకల్లో విషాదం
-
ఫంక్షన్ నుంచి తిరిగివస్తుండగా ఘోర ప్రమాదం.. 11 మంది..
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ బలోదా బజార్ జిల్లా ఖమారియా గ్రామం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కు, పికప్ వాహనం ఢీకొన్న ఘటనలో 11 మంది చనిపోయారు. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సాయంతో వీరిని ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. వైద్యుల సిఫార్సు మేరకు క్షతగాత్రుల్లో కొందరిని రాయ్‌పూర్ ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు చెప్పారు. పికప్ వాహనంలో ఉన్నవారంతా ఓ పంక్షన్‌కు వెళ్లి తిరిగివస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బఘేల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు అసరమైన సాయం అందించాలని సూచించారు. రెండు వారాల క్రితం కంకేర్ జిల్లాలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. స్కూల్ పిల్లలతో వెళ్తున్న ఆటోను ట్రక్కు ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మరొక చిన్నారితో పాటు ఆటో డ్రైవర్‌కు తీవ్రగాయాలయ్యాయి. చదవండి: పేపర్ లీక్ చేస్తే 10 ఏళ్ల జైలు శిక్ష.. రూ. కోటి జరిమానా! -
హనీమూన్‌లో విషాదం.. గుర్రపు స్వారీ చేస్తూ కిందపడ్డ నవ వరుడు
ముంబై: పెళ్లి అనంతరం భార్యతో హనీమూన్‌కు వెళ్లిన నవ వరుడు గుర్రపు స్వారీ చేస్తూ కందపడి ప్రాణాలు కోల్పోయాడు. కట్టుకున్న భార్యకు తీవ్ర విషాదాన్ని మిగిల్చాడు. మహారాష్ట్ర రాయ్‌గఢ్ జిల్లాలోని మాథెరాన్ పర్వత ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. మృతుడి పేరు ఇంతియాజ్ షేక్. వయసు 23 ఏళ్లు. ఇటీవలే వివాహమైంది. ఈ జంట మరో జంటతో కలిసి హనీమూన్‌కు వెళ్లింది. నలుగురు సన్ అండ్ షేడ్ హోటళ్లో దిగారు . అయితే సరదాగా గుర్రపు స్వారీ చేసేందుకు నలుగురూ నాలుగు గుర్రాలపై హోటల్ నుంచి బయల్దేరారు. 70 మీటర్ల దూరం వెళ్లాక ఇంతియాజ్ గుర్రం ఒక్కసారిగా వేగంగా పరుగెత్తింది. దీంతో దానిపై నియంత్రణ కోల్పోయి ఇంతియాజ్ కిందపడిపోయాడు. తలకు తీవ్ర గాయాలయ్యాయి. సృహ కోల్పోయాడు. ఇంతియాజ్‌ను మొదట మాథెరాన్ మున్సిపల్ కౌన్సిల్ నిర్వహించే బీజే హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అక్కడి వైద్యుల సూచన మేరకు ఉల్లాస్‌నగర్‌లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కానీ ఫలితం లేకపోయింది. తలకు తీవ్ర గాయాల వల్ల అతను ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు ప్రకటించారు. ఇదే తొలిసారి.. ఇలాంటి ఘటనలు ఇప్పటివరకు జరగలేదని పోలీసులు తెలిపారు. గుర్రంపై నుంచి పడి పలువురు గాయపడిన సందర్భాలు ఉన్నాయి కానీ, ప్రాణాలు కోల్పోయిన ఘటన ఇదే తొలిసారి అని చెప్పారు. అయితే గుర్రం వేగంగా ప్రయాణించడం వల్లే అతను కిందపడిపోయాడా? లేక ఇతర కారణాలు ఉన్నాయా అనే విషయం నిర్ధరించుకోవాల్సి ఉందని పోలుసుల పేర్కొన్నారు. మరోవైపు గుర్రపు స్వారీ చేసే పర్యటకులకు కచ్చితంగా హెల్మెట్ ఇవ్వాలనే నిబంధన ఉంది. కానీ అలా జరగడం లేదని అధికారులు తెలిపారు. కొంతమంది పర్యటకులు హెల్మెట్ ఇచ్చినా ధరించడం లేదని పేర్కొన్నారు. గుర్రాలు సమకూర్చిన వారి తప్పు ఉందని తెలిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. చదవండి: భార్యను హత్య చేసి ఢిల్లీకి పరార్..విచారణలో అతడు.. -
ఘోర ప్రమాదం.. పడవ మునిగి 145 మంది జల సమాధి
వాయవ్య డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో(డీఆర్సీ) ఘోర ప్రమాదం జరిగింది. లులోంగా నదిలో 200 మంది ప్రయాణికులతో వెళ్తున్న మోటారు బోటు ఓవర్ లోడుతో మునిగిపోయింది. ఈ దుర్ఘటనలో 145 మంది చనిపోయి ఉంటారని అధికారులు తెలిపారు. మిగతా 55 మంది సురక్షితంగా ప్రాణాలతో బయపడినట్లు వెల్లడించారు. వీరంతా తమ వస్తువులు, పశువులతో రిపబ్లిక్ ఆఫ్ కాంగో వెళ్తుండగా బసన్కుసు పట్టణం సమీపంలో మంగళవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. పడవలో సామర్థ్యానికి మించి ప్రయాణికులు ఎక్కడం, వారితో పాటు వస్తువులు, పశువులు ఉండటంతో బరువు ఎక్కువై పడవ నదిలో మునిగిపోయింది. డీఆర్సీలో తరచూ పడవ ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. ఇక్కడ రోడ్డు మార్గాలు లేకపోవడంతో ప్రజలు పడవల్లోనే ప్రయాణిస్తున్నారు. వలసదారులు బతుకుదెరవు కోసం ఇతర ప్రాంతాలకు వెళ్తుంటారు. ఈ క్రమంలోనే ఈత రాకపోయినా పడవల్లో ప్రయాణించి ప్రమాదాలకు గురవుతుంటారు. ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్లు కూడా చాలా ఆలస్యమవుతుంటాయి. గతేడాది అక్టోబర్‌లోనూ కాంగో నదిలో ఇలాంటి ప్రమాదమే జరిగింది. పడవ మునిగి 40 మంది చనిపోయారు. చదవండి: సారీ.. నేను చేసింది తప్పే.. ప్రజలకు రిషి సునాక్ క్షమాపణలు -
నేపాల్ విమాన ప్రమాదం.. 10 సెకన్ల ముందు వీడియో వైరల్..
కాఠ్మాండు: నేపాల్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనకు 10 సెకన్ల ముందు దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఓ స్థానికుడు మొబైల్లో ఈ వీడియోను చిత్రీకరించాడు. ఇందులో విమానం అతి తక్కువ ఎత్తులో ఎగురుతోంది. క్షణాల్లోనే అదుపుతప్పి ఏటవాలుగా ప్రయాణించింది. అనంతరం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. The terrible last moments of the #NepalPlaneCrash! pic.twitter.com/wRTnB9i0QW — Ayushi Agarwal (@ayu_agarwal94) January 15, 2023 విమానం నేపాల్ రాజధాని కాఠ్మాండు నుంచి పోఖారా వెళ్లే సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. కాఠ్మాండు నుంచి టేకాఫ్ అయిన 20 నిమిషాల తర్వాత పోఖారా చేరుకోవడానికి క్షణాల ముందు విమానం క్రాష్ ల్యాండ్ అయింది. ఘటన తర్వాత అక్కడి దృశ్యాలు భయానకంగా ఉన్నాయి. కూలిపోయిన విమానం నుంచి భారీగా మంటలు చెలరేగి దట్టమైన పొగలు అలుముకున్నాయి. Aerial shots of plane crash site in Pokhara#NepalPlaneCrash #pokhra #PokharaAirport #nepal pic.twitter.com/Fz1KsdqB4y — Vivek Bajpai (@vivekbajpai84) January 15, 2023 ప్రమాదం సమయంలో సిబ్బంది సహా మొత్తం 72 మంది విమానంలో ఉన్నారు. ఇందులో 68 మంది చనిపోయినట్లు నేపాల్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఘటనా స్థలం నుంచి వారి మృతదేహాలను సిబ్బంది వెలికి తీశారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముంది. ఈ విమానంలోని ప్రయాణికుల్లో ఐదుగురు భారతీయులు కూడా ఉన్నారు. #NepalPlaneCrash Prayers! pic.twitter.com/pn7ECs1Gyk — Rukhsar (@Rukhsar987) January 15, 2023 काठमांडू से पोखरा के लिए रवाना हुआ था विमान हादसे का शिकार, 72 में से अब तक 36 शव बरामद#YetiAirlines #NepalPlaneCrash #planecrash pic.twitter.com/wse90PU3n2 — Anchor Charul Sharma (@Anchor_Charul) January 15, 2023 చదవండి: వెలుగులోకి మరో భూమి.. ఇదే తొలిసారి.. అచ్చంగా భూ గ్రహం మాదిరిగానే! -
కూకట్‌పల్లిలో ఘోర ప్రమాదం.. భవనం శ్లాబ్ కూలీ పలువురికి గాయాలు
హైదరాబాద్: కూకట్‌పల్లిలో ఘోర ప్రమాదం జరిగింది. బీజేపీ కార్యాలయం సమీపంలోని పాపారాయుడు విగ్రహం వద్ద నిర్మాణంలో భవనం నాలుగో అంతస్తు శ్లాబ్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. శిథిలాల కింద ఇద్దరు కూలీలు చిక్కున్నట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసుకేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. చదవండి: రేవంత్ మాపై పిర్యాదు చేయడం హాస్యాస్పదం: సుధీర్ రెడ్డి -
ఏం చేస్తాం! మా రాత అట్టా రాసుందయ్యా
పేదరికం పేగు తెంచుకొని పుట్టినందుకు పూటకుపూట అన్నం కోసం దేవులాడుకుంటున్నాం ఏం చేస్తాం! మా రాత అట్టా రాసుందయ్యా మీ ప్రచార ఆర్భాట గాలానికి గుచ్చిన రూపాయి ఎరకు ఆశపడి కష్టాల కొక్కెను గొంతులో ఇరికించుకున్నాం ఏం చేస్తాం! మా రాత అట్టా రాసుందయ్యా మీ మోచేతి మత్తు కోసం గుటకలు మింగే మా మొగోళ్ళు మా బాధలను గాలికొదిలేసి మీ చెప్పులతో స్నేహం చేస్తున్నారు ఏం చేస్తాం! మా రాత అట్టా రాసుందయ్యా జనమంతా మీతోనే ఉన్నారని నమ్మించడానికి మీరు చల్లిన నూకలు ఆకలి గుంపును అదిమి పట్టడానికే అని తెలిసికూడా మీ మాయల ఉచ్చులోపడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నాం ఏం చేస్తాం! మా రాత అట్టా రాసుందయ్యా మీరు విదిలించే కానుకల కిట్లు మా ఇంట్లో కొత్త సంవత్సర శోభ తెస్తాయని ఇంటిల్లిపాది పనులు మానుకొని బారులు తీరి మీ కుతంత్రం కాళ్ళకింద పడి ఊపిరి వదిలేశాం ఏం చేస్తాం! మా రాత అట్టా రాసుందయ్యా ఈ ప్రపంచాన్ని నోటు నడిపించినంత కాలం... ఈ నోట్లు పెద్దోళ్ళ పెరట్లో కాస్తున్నంత కాలం... మా కూలి బతుకుల్లో విచ్చుకున్న ఆకలి గాయాలు నిత్యం ఏడుస్తూనే ఉంటాయి ఏం చేస్తాం! మా రాత అట్టా రాసుందయ్యా – డాక్టర్ ఎన్. ఈశ్వర రెడ్డి, ప్రొఫెసర్, యోగివేమన యూనివర్సిటీ, వైస్సార్ కడప జిల్లా (గుంటూరు తొక్కిసలాటలో కూతురును కోల్పోయిన ఒక తల్లి రోదిస్తూ... ‘మా రాత అట్టా రాసుందయ్యా’ అన్న వాక్యం విన్న బాధతో) -
చెట్టును ఢీకొన్న కారు.. నలుగురు భారతీయ వైద్య విద్యార్థులు మృతి..
మాస్కో: రష్యాలో విషాదం జరిగింది. క్రిమియాలోని సింఫరోపోల్‌లో ఓ కారు చెట్టును ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో నలుగురు భారతీయ వైద్య విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. వీరు ఎంబీబీఎస్ మూడు, నాలుగో సంవత్సరం చదువుతున్నారు. వేగంగా వెళ్తున్న కారు డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు రష్యా అధికారులు తెలిపారు. కారు సెర్గీవ్ నుంచి సెన్స్కీ వెళ్తుండగా అదుపుతప్పి చెట్టును ఢీకొట్టిందన్నారు. ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జు అయింది. అందులో ఉన్న నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. చదవండి: అమెరికా విమానాన్ని ఢీ కొట్టబోయిన చైనా యుద్ధ విమానం -
కంబోడియా క్యాసినోలో భారీ అగ్ని ప్రమాదం
-
క్యాసినో హోటల్లో భారీ అగ్నిప్రమాదం.. 19 మంది సజీవ దహనం..
దక్షిణ ఆసియా దేశం కంబోడియాలోని ఓ క్యాసినో హోటల్లో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. బుధవారం అర్ధరాత్రి జరిగిన ఈ విషాద ఘటనలో 19 మంది సజీవదహనమయ్యారు. మరో 60 మంది తీవ్రంగా గాయపడ్డారు. పయోపెట్లోని గ్రాండ్ డైమెండ్ హోటల్లో ఈ ప్రమాదం జరిగింది. అగ్నీ కీలక భారీగా ఎగిసిపడ్డాయి. వందల మంది అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నప్పటికీ మంటలు ఆర్పేందుకు రెండు గంటలు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ప్రమాద సమయంలో మొత్తం 400 మంది క్యాసినోలో ఉన్నారు. అగ్నిప్రమాదం సంభవించిన వెంటనే వారంతా భయంతో పరుగులు తీశారు. కొందరైతే అగ్నిమాపక సిబ్బంది కాపాడేందుకు వెళ్తున్నా ప్రాణభయంతో ఐదో అంతస్తు నుంచి కిందకు దూకేశారు. ప్రమాద సమయంలో విదేశీయులు కూడా లోపల ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం 360 మంది అత్యవసర సిబ్బంది, 11 ఫైరింజన్లు సహాయక చర్యలు చేపట్టాయి. అయితే అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. అయితే న్యూఇయర్ సందర్భంగా భారీ విద్యుత్ దీపాల అలంకరణ చేపట్టడం వల్లే ప్రమాదం జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. చదవండి: Viral: జారిపోతున్న కార్లు.. అమెరికా మంచు తుఫాన్ వీడియోలు వైరల్.. -
చంద్రబాబు కందుకూరు రోడ్ షో లో అపశృతి
-
విషాదం.. పుట్టినరోజు నాడే మృత్యు ఒడికి.. మంచులో గడ్డకట్టి..
వాషింగ్టన్: పుట్టినరోజు నాడే మృత్యు ఒడికి చేరాడు ఓ వ్యక్తి. మంచులో గడకట్టి ప్రాణాలు విడిచాడు. అతను కన్పించట్లేదని పోలీసులను ఆశ్రయించిన కుటుంబసభ్యులు.. ఆ తర్వాత కొన్ని గంటలకే విషాదంలో మునిగిపోయారు. మంచుదిబ్బలో అతని మృతదేహం దొరకడంతో కన్నీరుమున్నీరుగా విలపించారు. అమెరికా న్యూయార్క్ నగరంలోని బఫెలోలో ఈ ఘటన జరిగింది. చనిపోయిన వ్యక్తి పేరు విలియం క్లే(56). డిసెంబర్ 24న అతని బర్త్‌డే. ఆ మరునాడే క్రిస్మక్ కూడా కావడంతో ఆ ఇంట్లో పండుగ వాతావరణం ఉంది. అయితే అమెరికాలో అప్పటికే మంచు తుఫాన్ బీభీత్సం సృష్టిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో డిసెంబర్ 24న ఇంటి దగ్గర ఉన్న ఓ దుకాణానికి వెళ్లాడు విలియం. చాలాసేపైనా తిరిగిరాలేదు. దీంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఆ తర్వాత కొన్ని గంటలకే మంచులో ఓ శవం కన్పించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అది విలియందేనని పోలీసులు గుర్తించారు. కుటుంబసభ్యులు కూడా దీన్ని ధ్రవీకరించారు. పుట్టినరోజు నాడే తన తండ్రి చనిపోవడంతో విలియం కుమారుడు జూల్స్ క్లే కన్నీటి పర్యంతమయ్యాడు. ఒక్కరోజు ముందే తండ్రితో చాలాసేపు మాట్లాడానని, ప్రేమిస్తున్నాని చెప్పానని బోరున విలపించాడు. మరోవైపు విలియం సోదరి అతడు మరణించిన విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించింది. అతడి మృతదేహం వీడియోలను షేర్ చేయవద్దని విజ్ఞప్తి చేసింది. విలియంకు అంత్యక్రియలు నిర్వహించేందుకు విరాళాలు ఇవ్వాలని కోరింది. దాతలు వెంటనే స్పందించి 5,000 డాలర్లుకుపైగా(దాదాపు రూ.4లక్షలు) సమకూర్చారు. చదవండి: పండుగకు ఫ్యామిలీతో షాపింగ్ చేస్తుండగా కాల్పులు.. టిక్ టాక్ స్టార్ మృతి -
నటుడు చలపతిరావు జీవితంలో ఎన్నో విషాదాలు..
చలపతిరావు జీవితంలో విషాదాలు : సీనియర్ నటుడు చలపతి రావు మృతితో టాలీవుడ్లో తీవ్ర విషాదం నెలకొంది. అనారోగ్యంతో గతకొంతకాలంగా నటనకు దూరమైన ఆయన ఇవాళ తెల్లవారుజామును కన్నూమూశారు. కుమారుడు రవిబాబు ఇంట్లో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. విభిన్న పాత్రలతో తనదైన ముద్ర వేసిన చలపతిరావుకు ఇండస్ట్రీలో బాబాయ్‌గా పేరుంది. ఎప్పుడూ చిరునవ్వుతో కనిపించే చలపతిరావు జీవితంలో ఎన్నో విషాదాలున్నాయి. ఈయన సతీమణి పేరు ఇందుమతి. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత కుటుంబాన్ని ఒప్పించారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కొడుకు. చెన్నైలో నివాసం ఉన్న సమయంలో ఇందుమతి చీరకు అనుకోకుండా నిప్పు అంటుకోవడంతో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. మూడు రోజుల చికిత్స అనంతరం ఆమె కన్నుమూశారు. అప్పటికే కొడుకు రవిబాబు వయస్సు ఏడేళ్లు మాత్రమేనట. ఆ తర్వాత చలపతిరావును మళ్లీ పెళ్లిచేసుకోవాలని కుటుంబసభ్యులు ఎంతగానో ఒత్తిడి చేసినప్పటికీ ఆయన మాత్రం మరో పెళ్లి చేసుకోలేదు. రవిబాబు కూడా తండ్రికి మళ్లీ పెళ్లి చేయాలని చాలా ప్రయత్నాలు చేశారు కానీ చలపతిరావు మాత్రం ససేమిరా ఒప్పుకోలేదట. ఇదిలా ఉంటే సిల్లీ ఫెలోస్ అనే సినిమా షూటింగ్ సమయంలో ఆయనకు ఒక ఒక మేజర్ ఆక్సిడెంట్ కి గురయ్యారు. దాదాపు 8నెలలపాటు చక్రాల కుర్చీకే పరిమితం అయ్యారు. ఆ సమయంలో కంటిచూపు కూడా కోల్పోయే పరిస్థితి ఏర్పడిందట. ఇలా జీవితంలో ఎన్ని విషాదాలు ఎదురైనా పైకి మాత్రం ఎప్పుడూ నవ్వుతూ అందరిని పలకరిస్తారని ఆయన సన్నిహితులు గుర్తు చేసుకుంటున్నారు. -
చలపతిరావు సినీప్రస్థానం.. ముగ్గురు పిల్లలు పుట్టిన కొన్నేళ్లకే..
సాక్షి,హైదరాబాద్: టాలీవుడ్ సీనియర్ నటుడు చలపతిరావు(78) గుండెపోటుతో హఠాన్మరణం చెందడం ఇండస్ట్రీలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఐదున్నర దశాబ్దాల సీనిప్రస్థానంలో 1200లకు పైగా సినిమాల్లో నటించి టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన జీవిత విశేషాలు ఇప్పుడు చూద్దాం. చలపతిరావు పూర్తి పేరు తమ్మారెడ్డి చలపతిరావు. కృష్ణా జిల్లా పామర్రు మండలంలోని బలిపర్రులో 1944 మే 8న జన్మించారు. 22 ఏళ్లకే 1966లో సీనిరంగంలోకి అడుగుపెట్టారు. సూపర్‌స్టార్ కృష్ణ సూపర్‌హిట్ చిత్రం గూఢచారి 116.. చలపతిరావు మొదటి సినిమా. ఆ తర్వాత 1967లో సాక్షి చిత్రంలో ఓ పాత్ర పోషించారు. ఆ తర్వాత రెండేళ్లు అవకాశాలు రాలేదు. మళ్లీ 1969లో బుద్ధిమంతుడులో నటించారు. ఇక అప్పటినుంచి వెనుదిరిగి చూసుకోలేదు. వరుస చిత్రాలు చేస్తూ దూసుకుపోయారు. విలనిజంలో తనదైన శైలితో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇలా మొత్తం 1200కు పైగా సినిమాల్లో ఆయన నటించారు. విలన్‌గానే కాకుండా అన్ని రకాల పాత్రల్లో చలపతిరావు ప్రేక్షకులను మెప్పించారు. నిన్నేపెళ్లాడతా చిత్రంలో నాగార్జునకు తండ్రిగా నటించడం ఆయన కెరీర్‌ను మలుపుతిప్పిందని చెబుతారు. చలపతిరావు ఏడు సినిమాలకు నిర్మాతగాను వ్యవహరించారు. కలియుగ కృష్ణుడు, కడపరెడ్డమ్మ, జగన్నాటకం, పెళ్లంటే నూరేళ్ల పంట, ప్రెసిడెంటుగారి అల్లుడు, అర్ధరాత్రి హత్యలు, రక్తం చిందిన రాత్రి చిత్రాలు ఆయన నిర్మించినవే. ఫ్యామిలీ.. చలపతిరావు తండ్రిపేరు మణియ్య. తల్లి పేరు వియ్యమ్మ. భార్యపేరు ఇందుమతి. వీరికి ముగ్గురు సంతానం. కుమారుడు రవిబాబు టాలీవుడ్లో నటుడిగా, దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇద్దరు కుమార్తెలు అమెరికాలో స్థిరపడ్డారు. ముగ్గురు పిల్లలు పుట్టిన కొన్నేళ్లకే చలపతిరావు సతీమణి ఇందుమతి అగ్నిప్రమాదంలో చనిపోయారు. వీళ్లు చెన్నైలో ఉన్నప్పుడు ఇంట్లోనే ఈ ఘటన జరిగింది. వేకువజామున మంచినీళ్లు పట్టేందుకు వెళ్లిన ఇందుమతి చీరకు నిప్పంటుకుంది. కేకలు వేయడంతో చలిపతిరావు వెళ్లి మంటలార్పారు. ఆస్పత్రిలో మూడు రోజులు మృత్యువుతో పోరాడి ఆమె మరణించింది. దీంతో కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఆ తర్వాత చలపతిరావు రెండో పెళ్లి చేసుకోలేదు. చదవండి: టాలీవుడ్లో తీవ్ర విషాదం.. నటుడు చలపతిరావు హఠాన్మరణం -
Ukraine-Russia War: ఉక్రెయిన్ యుద్ధం ‘విషాదం’: పుతిన్
మాస్కో: ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని ‘ఓ విషాదం’గా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అభివర్ణించారు! ‘‘ఉక్రెయిన్ ప్రజలను మేమెప్పుడూ మా సోదరులుగానే చూశాం. ఇప్పటికీ అలాగే చూస్తున్నాం. ఇప్పుడక్కడ జరుగుతున్నది కచ్చితంగా విషాదమే’’ అని అంగీకరించారు. ఏకపక్షంగా కయ్యానికి కాలు దువ్వి 9 నెలలుగా ప్రపంచమంతటినీ అతలాకుతలం చేస్తున్న ఆయన బుధవారం అత్యున్నత సైనికాధికారులతో భేటీలో ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ యుద్ధానికి కారణం పశ్చిమ దేశాలే తప్ప తాము కాదని చెప్పుకొచ్చారు. లక్ష్యాలు సాధించేదాకా ముందుకే వెళ్లి తీరతామని పునరుద్ఘాటించారు. మరోవైపు రష్యా సైన్యం సంఖ్యను ఇప్పుడున్న 10 లక్షల నుంచి 15 లక్షలకు పెంచుతామని రక్షణ మంత్రి సెర్గీ షొయిగూ ప్రకటించారు. వీరిలో దాదాపు 7 లక్షల మంది స్వచ్ఛంద, కాంట్రాక్టు సైనికులుంటారన్నారు. ఫిన్లండ్, స్వీడన్లకు చెక్ పెట్టేందుకు పశ్చిమ రష్యాలో నూతన సైనిక విభాగాలను నెలకొల్పుతామని షొయిగూ ప్రకటించారు. -
మేడ్చల్: బాలిక మిస్సింగ్ ఘటన విషాదాంతం
-
నిజామాబాదు: నవీపేటలో పెళ్లింట విషాదం
-
విషాదం: వైద్యం కోసం బస్సులో వెళ్తుండగా భార్య ఒడిలోనే..
పరకాల: వైద్యం కోసం ఆర్టీసీ బస్సులో బయల్దేరిన ఒక డయాలసిస్ రోగి గుండెపోటుతో భార్య ఒడిలోనే కుప్పకూలాడు. ఈ విషాద సంఘటన హనుమకొండ జిల్లా పరకాల బస్టాండ్‌లో శుక్రవారం ఉదయం జరిగింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగె గ్రామానికి చెందిన అలిగేటి తిరుపతి రెడ్డి (44) కొంతకాలంగా వరంగల్‌లో డయాలసిస్ చేయించుకుంటున్నారు. వైద్యం కోసం భార్య స్వప్నతో కలిసి వెంకట్రావుపల్లి నుంచి వరంగల్‌కు ఆర్టీసీ బస్సులో వస్తున్నారు. బస్సు పరకాల బస్టాండ్‌కు చేరుకున్న కాసేపటికే.. భార్య ఒడిలో గుండెపోటుతో కుప్పకూలిపోయారు. వైద్యం చేస్తే బతుకుతాడనుకున్న భర్త.. కన్ను మూయడంతో భార్య స్వప్న కన్నీరుమున్నీరుగా విలపించింది. (క్లిక్ చేయండి: సోదరులిద్దరికీ ఒకేసారి వివాహం.. పెళ్లైన ఆరు నెలలకే మృత్యుఒడికి) -
విషాదం.. 8 నెలల గర్భిణీపై నుంచి దూసుకెళ్లిన మిలిటరీ బస్సు..
చెన్నై: నెలరోజులైతే పండటి బిడ్డకు జన్మనివ్వాల్సిన 8 నెలల గర్భిణీ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. తమిళనాడు రాజధాని చెన్నై మెరీనా బీచ్ సమీపంలో శుక్రవారం రాత్రి ఈ విషాద ఘటన జరిగింది. మృతురాలి పేరు లలిత(22). ఆమె భర్త పేరు శివారెడ్డి(26). భారత నావికాదళంలో పనిచేస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం తనను మెరీనా బీచ్ తీసుకెళ్లమని లలిత శివారెడ్డిని అడిగింది. దీంతో అతను ఆమెను బీచ్‌కు తీసుకెళ్లాడు. ఇద్దరూ గంటసేపు అక్కడే సేదతీరారు. అనంతరం తిరిగి క్వార్టర్స్ వెళ్లే క్రమంలో శివారెడ్డి నడుపుతున్న బైక్ స్కిడ్ అయింది. దీంతో వెనకాల కూర్చున్న లలిత రోడ్డుపై పడిపోయింది. అదే సమయంలో నేవీకి చెందిన బస్సు వచ్చి లలితపైనుంచి దూసుకెళ్లింది. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. అయితే లలిత కడుపులోని బిడ్డ అయినా బతుకుతుందేమో అన్న ఆశతో హుటాహుటిన ఆమెను ఆస్పత్రికి తరలించారు. కానీ బిడ్డ కూడా చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. దీంతో భార్యతో పాటు పుట్టబోయే బిడ్డను కూడా పోగొట్టుకుని శివారెడ్డి శోకసంద్రంలో మునిగిపోయాడు. చదవండి: శ్రద్ధ హత్య కేసు.. అడవిని జల్లెడ పట్టిన పోలీసులు.. 3 ఎముకలు స్వాధీనం -
మోర్బీ బ్రిడ్జి కూలిన ఘటనలో సంచలన విషయాలు
-
శాపమా? పాలకుల పాపమా?
దారుణం... దిగ్భ్రాంతికరం. ఆదివారం సాయంత్రం గుజరాత్‌లోని మోర్బీ వద్ద కుప్పకూలిన తీగల వంతెన దుర్ఘటనను అభివర్ణించడానికి బహుశా ఇలాంటి మాటలేవీ సరిపోవేమో! నదిపై కట్టిన తీగల వంతెన సెకన్ల వ్యవధిలో కూలిపోతుంటే, ఒకరి మీద మరొకరుగా వందల సంఖ్యలో జనం నదీజలాల్లో పడిపోయిన తీరును వీడియోల్లో చూస్తుంటే గొంతు పెగలడం కష్టం. తెగిపోయిన తీగల మొదలు అందిన అవశేషం ఏదైనా సరే పట్టుకొని, ప్రాణాలు దక్కించుకొనేందుకు పైకి ఎగబాకాలని బాధితులు శతవిధాల ప్రయత్నిస్తూనే ప్రాణాలు కోల్పోయిన తీరు ఎంతటివారినైనా కన్నీరు పెట్టిస్తుంది. రెండేళ్ళ చిన్నారి సహా 47 మంది పిల్లలు... కడపటి వార్తలందేసరికి మొత్తం 140 మందికి పైగా అమాయకులు... అన్యాయంగా వారి ప్రాణాలు తీసిన ఈ ఘటన పరిహారమిచ్చి తప్పించుకోలేని పాపం. ఆరంభించిన అయిదు రోజులకే రోప్ బ్రిడ్జి కూలిపోవడం మరమ్మత్తుల పనిలో నాణ్యతా లోపంతో పాటు, ప్రభుత్వ యంత్రాంగ నిర్లక్ష్యానికి పరాకాష్ఠ! గుజరాత్‌లోని మచ్ఛు నదిపై దాదాపు 150 ఏళ్ళ క్రితం బ్రిటీషు కాలంలో కట్టిన ఈ తీగల వంతెన పేరున్న పర్యాటక ప్రాంతం. ఇప్పుడిది మరుభూమికి మారుపేరు. కొన్ని కుటుంబాలకు కుటుంబాలు నదిలో పడి ప్రాణాలు కోల్పోయాయి. ఓ పార్లమెంట్ సభ్యుడి సోదరి సహా సమీప బంధువులు 12 మంది ఒకేసారి ఈ దుర్ఘటనలో చనిపోయారు. రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాలు తక్షణ నష్టపరిహారాలు ప్రకటించి, సహాయక చర్యలు దిగాయి. ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సారథ్యంలో దర్యాప్తునకు ఆదేశించి, పోలీసులతో ఎఫ్ఐఆర్ నమోదు చేయించి, ప్రస్తుతానికి ఈ బిడ్జి మరమ్మత్తులు చేసిన కంపెనీ ఉద్యోగులతో పాటు టికెట్లు అమ్మిన ఇద్దరు క్లర్కుల్నీ, ఒక బ్రిడ్జి కాంట్రాక్టర్నీ, భద్రతా సిబ్బందినీ అంతా కలిపి 9 మందిని అరెస్టు చేశారు. ఇప్పటికీ మరో 100 మందికి పైగా జాడ తెలియని పరిస్థితుల్లో ఇవేవీ బాధితుల కన్నీళ్ళను తుడిచేయలేవు. ప్రకృతి కాక, మానవ తప్పిదాలే ఈ ఘోరకలికి కారణం కావడం విచారకరం. అనేక అంశాల్లో పాతుకుపోయిన ప్రభుత్వ యంత్రాంగ నేరపూరిత నిర్లక్ష్యానికి నిలువుటద్దం. అజంతా బ్రాండ్ పేరుతో గోడ గడియారాలు, కాలిక్యులేటర్లకు ప్రసిద్ధమై, సీఎఫ్ఎల్ దీపాలు, ఇ– బైక్స్ రూపొందిస్తున్న ప్రైవేటు సంస్థ ఒరేవా. ఏటా రూ. 800 కోట్లకు పైగా టర్నోవర్ ఉన్న ఈ గడియారాల కంపెనీకి వంతెన మరమ్మత్తుతో సంబంధం ఏమిటో, దానికి ఈ పని ఎందుకు అప్పగించారో అర్థం కాదు. 51 ఏళ్ళుగా వ్యాపారంలో ఉన్న ఈ సంస్థ బ్రిడ్జి నిర్వహణను 15 ఏళ్ళకు లీజు తీసుకొని, మరమ్మత్తుల పని మూడోవ్యక్తికి కట్టబెట్టింది. బ్రిడ్జి పనులకు అధికారికంగా 8 నుంచి 12 నెలల టైమ్ ఇచ్చినా, హడావిడిగా 5 నెలల్లో పూర్తి చేశారు. ఏడాదికి పైగా పట్టే మరమ్మత్తులను హడావిడిగా అయిందనిపించి, గుజరాతీ సంవత్సరాదికి అక్టోబర్ 26న ప్రారంభించాల్సిన తొందర ఏమిటి? స్థానిక మునిసిపాలిటీ నుంచి అనుమతి లేకుండానే, బ్రిడ్జి దృఢత్వంపై పరీక్షలు చేయకుం డానే ఒరేవా సంస్థ రోప్బ్రిడ్జిపై పర్యాటకం ఎలా ప్రారంభించింది? ఏకకాలంలో 125 మందిని మించి మోయలేని వంతెనపై అదే పనిగా టికెట్లమ్ముతూ 500 పైచిలుకు మందిని ఎలా అనుమతిం చారు? తీగల వంతెన పైకి చేరిన కొందరు ప్రమాదకరంగా ఆ తీగలను పట్టుకొని ఊగుతుంటే వారిని ఆపేందుకు సిబ్బంది ఎందుకు ప్రయత్నించలేదు? ఇలా ఎన్నో ప్రశ్నలకు జవాబు లేదు. మరో నెలలో గుజరాత్లో ఎన్నికలున్న వేళ ఈ ప్రమాదం రాజకీయ ఆరోపణల పర్వానికి దారి తీసింది. 2016లో కోల్‌కతాలో ఫ్లై–ఓవర్ కూలి, పలువురు మరణించినప్పుడు అక్కడి మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని ప్రధాని మోదీ తప్పుపడుతూ ‘ఇది దేవుడి శాపమా, లేక అవినీతి పాపమా’ అంటూ చేసిన మాటల దాడిని ప్రతిపక్షాలు వ్యంగ్యంగా గుర్తు చేస్తున్నాయి. శవ రాజకీయాలు ఎవరు చేసినా సమర్థనీయం కాదు కానీ, ఎఫ్ఐఆర్లోని నిందితుల పేర్లలో సంస్థ పేరు కానీ, దాని అధిపతి పేరు కానీ, వ్యక్తుల పేర్లు కానీ లేకపోవడం కచ్చితంగా ప్రశ్నార్హమే. చిన్న చేపల్ని పట్టుకొని వ్యాపార తిమింగలాల్ని వదిలేస్తున్నారనే ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. కార్పొరేట్లకూ, రాజకీయాలకూ మధ్య పెరుగుతున్న బంధాన్ని సూచిస్తోంది. దాదాపు పాతికేళ్ళుగా గుజరాత్‌ను పాలిస్తున్న బీజేపీకి ఇది కొంత ఇబ్బందికరమైన విషయమే. మోదీ, షాలిద్దరూ గుజరాత్ వారే కావడం మరో ఇబ్బంది. యూపీలోని చందౌలీ దగ్గరా ఛఠ్ పూజ సందర్భంగా ఆదివారం ఓ వంతెన పాక్షికంగా కూలినట్టు ఆలస్యంగా వార్తలందుతున్నాయి. ఎలాంటి ప్రాణహానీ జరగనప్పటికీ, ఇలాంటి ఘటనలన్నీ మన ప్రాథమిక వసతి సౌకర్యాలలోని లోటుపాట్లను ఎత్తిచూపుతున్నాయి. ఎన్నికల వేళ 3 రోజుల గుజరాత్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనాస్థలిలో పర్యటించనున్నారు. కానీ అంతకన్నా ముఖ్యం ఇలాంటివి భవిష్యత్తులో జరగకుండా చూసుకోవడం! ప్రతిపక్షాలు కోరుతున్నట్టు రాష్ట్ర సర్కార్ హయాంలోని అధికారులతో కాక, రిటైర్డ్ జడ్జీల్లాంటి వారితో స్వతంత్ర దర్యాప్తు జరిపి, అసలైన బాధ్యుల్ని కనిపెట్టడం కఠినంగా శిక్షించడం! అలవి మాలిన నిర్లక్ష్యం అన్నింటా ప్రమాదకరమే. ప్రజా సౌకర్యాలపై ప్రభుత్వ నిర్లక్ష్యం కొన్నిసార్లు అది ప్రజల ప్రాణాలకే ముప్పు. ఏమైనా, మోర్బీ ఘటన అక్షరాలా పాలకుల, ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యమే. కొందరి బాధ్యతారాహిత్యానికీ, అవినీతికీ ప్రజలు బలి కావాలా? ఆత్మవిమర్శ చేసుకో వాలి. పర్యాటకంతో ఆర్థిక ఆర్జన కన్నా అమాయకుల ప్రాణాలు ముఖ్యమని అర్థం చేసుకోవాలి. -
మోర్బీ విషాదంపై మోదీ ఉన్నత స్థాయి సమీక్ష
గాంధీనగర్: గుజరాత్‌లోని మోర్బీ జిల్లాలో కేబుల్ బ్రిడ్జి కుప్పకూలి 140 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. మరో 100 మందికిపైగా ఆచూకీ గల్లంతైన క్రమంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో మోర్బీ ప్రమాదంపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. గుజరాత్ రాజధాని గాంధీనగర్‌లోని రాజ్‌భవన్ వేదికగా ఈ రీవ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేబుల్ బ్రిడ్జి కూలిపోయినప్పటి నుంచి తీసుకుంటున్న సహాయక చర్యలు, రెస్క్యూ ఆపరేషన్లను ప్రధానికి వివరించారు అధికారులు. ఈ విషాదానికి కారణమైన అన్ని అంశాలపై ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. ప్రమాదంలోని బాధితులకు అన్ని విధాల సాయం చేస్తామని ప్రధాని మోదీ చెప్పారని అధికారవర్గాలు తెలిపాయి. ఈ సమావేశానికి గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర భాయ్ పటేల్, హోంశాఖ సహాయ మంత్రి హర్ష సంఘవి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ సహా ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఇదీ చదవండి: మోర్బీ ఘటన.. మరో వంద మందికిపైగా జలసమాధి! -
దేవుడా.. ఇదేమి అన్యాయం.. గుండెకోత మిగిల్చావ్
వరంగల్ చౌరస్తా: వారిది మధ్య తరగతి కుటుంబం. ఇద్దరూ ఆడపిల్లలే. పిల్లలను బాగా చదివించాలనుకున్నాడు. అనుకున్నట్టుగానే పిల్లలు కూడా కష్టపడి చదివారు. పెద్దకూతురు సాఫ్ట్వేర్ ఉద్యోగి, కాగా, చిన్నకూతురును ఉన్నత విద్యాభ్యాసానికి అమెరికా పంపాడు. కానీ ఆ తల్లిదండ్రుల ఆశలు.. మధ్యలోనే ఆరిపోయాయి. అమెరికాలో స్నేహితులతో కలిసి వ్యాన్‌లో వెళ్తున్న ఆమె.. పొగమంచు కారణంగా జరిగిన ప్రమాదంలో చనిపోయింది. ఆ తల్లిదండ్రులకు గుండెకోత మిగిల్చింది. ఇక్కడ మరో విషాద ఏమిటంటే.. కూతురు చనిపోయిన విషయం తల్లికి తెలియజేయలేని పరిస్థితి. వివరాల్లోకి వెళ్తే.. వరంగల్ నగరంలోని గిర్మాజీపేటకు చెందిన గుళ్లపెల్లి రమేష్, కల్పన దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అతను ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో అడ్తి దుకాణాల్లో అకౌంటెంట్‌గా పనిచేస్తుండగా, తల్లి కల్పన ప్రైవేట్ స్కూల్ టీచర్. పెద్ద కుమార్తె వాసవి ప్రస్తుతం సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తోంది. చిన్నకూతురు పావని (22)ని అమెరికా పంపించాలనుకున్నారు. అందుకోసం రూపాయి.. రూపాయి కూడబెట్టారు. గత ఏడాది బీటెక్ పూర్తికాగా, ఎంఎస్ కోసం రెండు నెలల క్రితం అమెరికా వెళ్లింది. స్నేహితులతో వెళ్తుండగా.. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 5 నుంచి 7 గంటల సమయంలో కనెక్టికట్ రాష్ట్రంలో 8 మంది స్నేహితులు మినీ వ్యానులో ప్రయాణిస్తున్నారు. వీరి వాహనం పొగమంచు కారణంగా ఓ ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మొత్తం ముగ్గురు చనిపోగా, అందులో పావని ఒకరు. మిగతా ఇద్దరు ఏపీకి చెందిన వారు ఉన్నారు. మరికొంతమంది గాయపడ్డారు. గుండెలవిసేలా.. కూతురు చనిపోయిన విషయం తెలుసుకున్న తండ్రి రమేష్ గుండెలవిసేలా రోదిస్తున్నాడు. తల్లికి అనారోగ్యం కారణంగా విషయం చెప్పకుండా దాస్తున్నట్లు తెలిసింది. బంధువులు, ఇతరులు కూడా విషయం తెలిసినా మిన్నకుండిపోతున్నారు. ఆదివారం పావని మృతదేహం నగరానికి చేరుతుందని సమాచారం అందించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. (క్లిక్ చేయండి: ఉన్నత చదువుకు అమెరికా వెళ్లి.. మృత్యుఒడికి..) దేవుడు అన్యాయం చేసిండు ‘ఇద్దరు కూతుళ్లు అని ఎప్పుడూ బాధ పడలేదు. ఉన్నత చదువులు చదివించాలనేది మా లక్ష్యం. అందుకోసం నేను, నా భార్య అహర్నిశలు కష్టపడ్డాం. మా కలలకు తగ్గట్టుగా పెద్ద పాప ఇక్కడే సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తోంది. చిన్న పాపను అమెరికాను పంపాలనుకున్నాం. రెండు నెలల కిందట పంపించాం. మొన్న దసరా, దీపావళి పర్వదినాల సందర్భంగా వీడియో కాల్లో మాతో మాట్లాడింది. అంతా బాగానే ఉందని ఓదార్చింది. అంతలోనే ఏం జరిగిందో తెలియదు. చనిపోయినట్లు అమెరికా నుంచి ఫోన్‌కాల్ వచ్చింది. ఇది నమ్మలేకపోతున్నాను. దేవుడా.. ఇదేమి అన్యాయం’ - దగ్గర బంధువుల వద్ద పావని తండ్రి ఆవేదన -
పాపం సాయి.. ఉద్యోగావకాశం వదులుకుని అమెరికా వెళ్తే...
కడియం: యూఎస్‌లో పెద్ద చదువు చదివి ఉన్నత స్థితికి చేరుకుంటాడని పంపిన బిడ్డ ఇక లేడని తెలిసి ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడని సమాచారం అందుకుని గుండెలవిసేలా రోదిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంక పంచాయతీ పరిధిలోని బుర్రిలంకకు చెందిన నర్సరీ రైతు పాటంశెట్టి శ్రీనివాసు (వాసు), సుశీల దంపతుల కుమారుడు సాయినరసింహ (25). చెన్నైలోని హిందుస్థాన్ ఇంజినీరింగ్ కాలేజీలో ఈ ఏడాది బీటెక్ చదివాడు. యూఎస్‌లో ఎంఎస్ చదవాలనేది సాయినరసింహ ఆకాంక్ష. ఇదే విషయాన్ని తలిదండ్రుల వద్ద వ్యక్తం చేశాడు. దీనికి వారు అంగీకరించి ఇందుకు ఏర్పాట్లు చేశారు. ఆగస్టు 6న యాఎస్లోని కనెక్టికట్ స్టేట్ పరిధిలోని న్యూ హెవెన్స్ యూనివర్శిటీకి పంపించారు. అక్కడ పార్ట్‌టైమ్ జాబ్ చేస్తూ చదివే అవకాశం లభించడంతో కుటుంబ సభ్యులు సంతోషించారు. బుర్రిలంకకు చెందిన సిద్దిరెడ్డి సత్తిబాబు కుమార్తె ఐశ్వర్య కూడా అక్కడే చదువుతోంది. సెలవులు కావడంతో మంగళవారం సాయినరసింహ, ఐశ్వర్య, మరో అయిదుగురు స్నేహితులు కలిసి సమీపంలోని విలేజ్‌ను సందర్శించేందుకు మినీ వ్యాన్‌లో బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న వ్యాన్ గంటన్నరకే మరో మినీ ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సాయి నరసింహతో పాటు, మరో ఇద్దరు మృతి చెందారు. ఐశ్వర్య గాయపడి, ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడు నరసింహ సోదరి నందిని చెన్నైలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తోంది. మృతదేహం తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు సాయి నరసింహ మృతి చెందినట్టు తెలియడంతో బుర్రిలంకలో విషాద వాతావరణం నెలకొంది. యూఎస్ వెళ్లిన మూడు నెలలకే మృత్యు ఒడికి చేరడం పట్ల స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాయి తండ్రి శ్రీనివాసు (వాసు) నర్సరీ రైతుగా అందరికీ తలలోనాలుకగా ఉంటారు. గ్రామంలో ఏ కార్యక్రమం జరిగినా తోడ్పాటు అందిస్తుంటారు. బుధవారం ఉదయం పెద్ద ఎత్తున గ్రామస్తులు వాసు ఇంటికి చేరుకున్నారు. అమెరికా పంపడం తమ శక్తికి మించినదే అయినప్పటికీ బిడ్డ ఉన్నత స్థాయికి చేరుకుంటాడని పంపించామంటూ మృతుడి తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమవుతున్నారు. బీటెక్ చేస్తుండగా ఉద్యోగావకాశం వచ్చినా ఎంఎస్ చదువుతానని వెళ్లి మృత్యు ఒడికి చేరాడని రోదిస్తున్నారు. యూఎస్ ప్రయాణానికి ముందు కుమారుడితో కలిసి తిరుమల వెళ్లామని చివరి క్షణాలను గుర్తు చేసుకుని కుమిలిపోతున్నారు. మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకువచ్చే విషయంలో ఎంపీ భరత్‌రామ్ దృష్టికి తీసుకువెళ్లారు. శనివారానికి మృతదేహం బుర్రిలంకకు చేరుకోవచ్చని భావిస్తున్నారు. (క్లిక్: అమెరికాలో తెలుగు విద్యార్థుల దుర్మరణం: అక్కడి డ్రైవింగ్ రూల్స్ తెలుసుకోండి!) -
లాస్ట్ జర్నీ.. లాస్ట్ సెల్ఫీ.. యువకుల ఫొటోలు, వీడియోలు వైరల్
అజిత్‌సింగ్‌నగర్(విజయవాడ సెంట్రల్): దసరా పండుగ సెలవులను మరింత సరదాగా చేసుకుందామని ఆశపడిన ఆ యువకుల ఆలోచన ఆవిరైపోయింది... వారి స్నేహబంధాన్ని చూసి ఓర్వలేని ఆ కడలి వారిని కబళించింది... తమ పిల్లలే తమ సర్వస్వంగా బతుకుతున్న ఆ నిరుపేద తల్లిదండ్రులకు తీరని కడుపుకోతను... గుండెశోకాన్ని మిగిల్చింది... బాపట్ల సూర్యలంక బీచ్‌లో సముద్ర స్నానానికి వెళ్లిన ఎనిమిది మంది యువకుల్లో మొత్తం ఆరుగురు యువకులు మృతిచెందారు. దీంతో సింగ్‌నగర్, శాంతినగర్ ప్రాంతాలు ఆ యువకుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు చేసిన ఆర్తనాదాలతో కన్నీటి సంద్రంగా మారాయి. చదవండి: పెళ్లయిన వ్యక్తితో సహజీవనం.. కారులో మంత్రాలయం వచ్చి.. విజయవాడ సింగ్‌నగర్ కృష్ణాహోటల్ సెంటర్లోని శివాలయం రోడ్డు, పైపులరోడ్డు సమీపంలోని శాంతినగర్ మస్జీద్ పరిసర ప్రాంతాలకు చెందిన ఎనిమిది మంది యువకులు చెరుకూరి సాయిమధు(16), బాజం అభిలాష్(17), చింతల సాయిప్రణిదీప్(18), నల్లపు రాఘవ(16), సర్వసుద్ది వెంకట ఫణికుమార్(14), ప్రభుదాస్(17), చందాల కైలాష్(13), వసంత పరిశుద్ధ(17) ఈ నెల 4వ తేదీన బాపట్ల సూర్యలంక బీచ్‌లో సముద్ర స్నానానికి వెళ్లారు. వీరిలో కైలాష్, పరిశుద్ధ మినహా మిగిలిన ఆరుగురు సముద్రం లోపలికి వెళ్లి స్నానం చేస్తూ అలల తాకిడికి గల్లంతయ్యారు. వీరిలో చెరుకూరి సాయిమధు, బాజం అభిలాష్, చింతల సాయిప్రణిదీప్ మంగళవారం మృతిచెందిన విషయం తెలిసిందే. గల్లంతైన మరో ముగ్గురు సర్వసుద్ది వెంకట ఫణికుమార్, ప్రభుదాస్, చందాల కైలాష్ల మృతదేహాలు బుధవారం గుర్తించారు. దీంతో వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు పండుగ రోజంతా కన్నీటి సంద్రంలో మునిగారు. బుధవారం ముగ్గురికి, గురువారం ముగ్గురికి వారి వారి కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. బాపట్ల బీచ్‌కు వెళ్లే ముందు ఎనిమిది మంది యువకులు రైలులో దిగిన సెల్ఫీ ఫొటోలు, వీడియోలు బయటకు వచ్చాయి. రైలులో వారు సరదాగా సినిమా పాటలకు పేరడీ చేస్తూ గడిపిన క్షణాలను చూసి వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. వాటిని చూసిన బంధువులు, స్థానికులు కూడా కన్నీటిపర్యంతమయ్యారు. మృతుల కుటుంబాలకు బాసటగా నిలిచిన ప్రజాప్రతినిధులు శాంతినగర్, సింగ్‌నగర్ ప్రాంతాల్లో యువకుల మరణవార్తను తెలుసుకున్న ఎమ్మెల్యే మల్లాది విష్ణు, డెప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజ, కార్పొరేటర్లు ఉమ్మడి వెంకట్రావ్, అలంపూరు విజయలక్ష్మి వారికి బాసటగా నిలిచారు. విషయం తెలిసిన దగ్గర నుంచి వైఎస్సార్సీపీ నాయకులు అవుతు శ్రీనివాసరెడ్డి, ఉమ్మడి వెంకట్రావ్, అలంపూరు విజయ్ దగ్గరుండి యువకుల తల్లిదండ్రులను బాపట్ల పంపడం, బాపట్లలో అధికారులతో మాట్లాడి వారి భౌతికకాయాలు తీసుకురావడంతో పాటు దగ్గరుండి వారి అంత్యక్రియలను నిర్వహించారు. ఎమ్మెల్యే విష్ణు, డెప్యూటీ మేయర్ శ్రీశైలజ, కార్పొరేటర్ అలంపూరు విజయ్ ఒక్కొక్కరూ రూ.5 వేల చొప్పున ఒక్కో కుటుంబానికి రూ.15 వేలు మొత్తం ఆరుగురికి రూ.90 వేలను మట్టి ఖర్చుల నిమిత్తం తక్షణ సహాయంగా అందించారు. యువకుల మరణవార్తను తెలుసుకున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్ బాబూరావు, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, స్థానిక నాయకులు కె.దుర్గారావు, బి.రమణారావు, దాసరి దుర్గారావు తదితరులు మృతుల కుటుంబాలను పరామర్శించారు. మృతిచెందిన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండ అజిత్‌సింగ్‌నగర్(విజయవాడ సెంట్రల్): బాపట్ల సముద్రంలో స్నానానికి వెళ్లి మృతిచెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని జిల్లా కలెక్టర్ ఎస్.ఢిల్లీరావు తెలిపారు. సింగ్‌నగర్, శాంతినగర్‌కు చెందిన ఆరుగురు మృతుల కుటుంబ సభ్యులను గురువారం రాత్రి స్థానిక ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో కలిసి ఆయన పరామర్శించారు. 61వ డివిజన్లోని సచివాలయంలో మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.25 వేల చొప్పున ఆరు కుటుంబాలకు రూ.లక్షన్నర విలువైన చెక్కులను అందజేశారు. తక్షణ సాయంగా మాత్రమే తన వంతుగా ఈ సహాయాన్ని అందిస్తున్నామని తెలిపారు. బాధితులందరికీ పూర్తి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. డెప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజ, నార్త్‌జోన్ తహసీల్దార్ చందన దుర్గాప్రసాద్, వైఎస్సార్సీపీ నాయకులు ఉమ్మడి వెంకట్రావ్, అవుతు శ్రీనివాసరెడ్డి, అలంపూరు విజయ్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రాణం తీసిన ఈత సరదా.. నలుగురు చిన్నారుల మృత్యువాత
యాచారం: ఈత సరదా నలుగురు చిన్నారులను బలి తీసుకుంది. చెరువులో పెద్ద గుంత ఉన్న విషయం తెలియక ఈతకు వెళ్లిన వారిలో ఒకరు మునిగిపోతుండగా కాపాడబోయి ఒకరి తర్వాత మరొకరు వరుసగా నలుగురు నీటిలో మునిగి మృత్యువాత పడ్డారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తాడిపర్తి అనుబంధ గ్రామం గొల్లగూడలో ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది. యాచారం సీఐ లింగయ్య కథనం ప్రకారం.. గొల్లగూడకు చెందిన ఎండీ కాశీం, బీబీ జానీ దంపతుల కుమారుడు కహ్లీద్ (12), కూతురు సమ్రీన్ (14), కాశీం సోదరుడు రజాక్, హస్మ దంపతుల కుమారుడు రెహాన్ (10), వారి సమీప బంధువైన ఎస్కే హుస్సేన్, పార్‌జాన్ దంపతుల కుమారుడు ఇమ్రాన్(9) ఆదివారం మధ్యాహ్నం కొంతమంది బంధువులతో కలసి గ్రామ సమీపంలోని దర్గాకు వెళ్లి ప్రార్థనలు చేశారు. తిరిగి గ్రామానికి వచ్చేటప్పుడు కహ్లీద్, సమ్రీన్, రెహాన్, ఇమ్రాన్ ముందుగా బయలుదేరారు. సమీపంలో ఉన్న ఎర్రకుంట వద్దకు వచ్చి సరదాగా ఈత కొట్టడానికి అందులోకి దిగారు. భారీ వర్షాలతో కుంట పూర్తిగా నిండిపోయి ఉంది. చెరువులో పెద్దపెద్ద గుంతలు ఏర్పడ్డాయి. ఈత కోసం కుంటలోకి దిగిన ఓ బాలుడు మునిగిపోతుండగా గమనించిన మిగతావారు కేకలు వేస్తూ అతడిని కాపాడబోయి ఒకరి తర్వాత ఒకరు నలుగురూ మునిగి పోయారు. అదే సమయంలో వారితో కలసి ఈత కొట్టడానికి కొంత ఆలస్యంగా వచ్చిన మరో బాలుడు అయాన్ అక్కడ ఎవరూ కనిపించకపోవడంతో తిరిగి గ్రామానికి వచ్చి ప్రాణాలతో బయటపడ్డాడు. కాగా, సమీపంలోని వ్యవసాయ బావి వద్ద పనిచేస్తున్న రైతు లక్ష్మయ్య చిన్నారుల అరుపులు విని గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. గ్రామస్తులు వచ్చేసరికే నలుగురు చిన్నారులు నీటిలో మునిగి మృత్యువాత పడ్డారు. ఒకేరోజు నలుగురు పిల్లల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అప్పటి వరకు సంతోషంగా ఉన్న చిన్నారులను విగతజీవులుగా చూసి తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. పోలీసులు పిల్లల మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కాగా, ప్రభుత్వం బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లించాలని బంధువులు, గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ లింగయ్య తెలిపారు. చదవండి: షాకింగ్ ఘటన.. రెండో భార్యను లాడ్జికి తీసుకెళ్లి.. -
రూబీ లాడ్జి విషాదంపై కీలక రిపోర్ట్.. నివేదికలో షాకింగ్ విషయాలు
సాక్షి, హైదరాబాద్: రూబీ లాడ్జి విషాద ఘటనపై ఫైర్ డిపార్ట్మెంట్ నివేదిక విడుదల చేసింది. మూడు పేజీల రిపోర్ట్‌లో కీలక విషయాలను వెల్లడించింది. లీథియం బ్యాటరీల పేలుళ్ల వల్ల దట్టమైన పొగలు వ్యాపించాయని, పొగలు వల్ల భవనంలోకి వెళ్లలేకపోయామని ఫైర్ డిపార్ట్మెంట్ తెలిపింది. భవనానికి సింగిల్ ఎంట్రీ, ఎగ్జిట్ మాత్రమే ఉంది. లిప్ట్ పక్కన మెట్లు ఏర్పాటు చేయకూడదనే నిబంధన ఉన్నా పట్టించుకోలేదని నివేదికలో పేర్కొంది. చదవండి: రూబీ లాడ్జి ప్రమాదం: ఇలాంటి కాంప్లెక్స్లెన్నో? అగ్నిమాపక పరికరాలు ఏర్పాటు చేసినా అవి పనిచేయలేదు. భవనం మొత్తం కూడా క్లోజ్డ్ సర్క్యూట్లో ఉండిపోయింది. భవనానికి కనీసం కారిడార్ కూడా లేదు. ఓవర్ హెడ్ ట్యాంక్ కూడా ఏర్పాటు చేయలేదు. భవన, హోటల్ యజమాని నిర్లక్ష్యంతోనే అగ్ని ప్రమాదం జరిగింది. సెల్లార్లో మొదటిగా అగ్ని ప్రమాదం మొదలైంది.తర్వాత మొదటి అంతస్తు వరకు మంటలు వ్యాపించాయని నివేదికలో ఫైర్ డిపార్ట్మెంట్ పేర్కొంది. -
నిజాం రాజు.. తలవంచెన్ చూడు
‘‘1948 సెప్టెంబర్ 13.. తెల్లవారుజామున టెలిఫోన్ భీకరంగా మోగడంతో మేల్కొన్నాను. ఆర్మీ కమాండర్ ఇద్రూస్ అత్యవసర కాల్. రిసీవర్ ఎత్తకముందే అది భారత సైనికదళాల ఆగమనానికి సంబంధించినదై ఉంటుందని భావించా.. అది అదే. గడిచిన పావుగంటలో ఐదు విభిన్న సెక్టార్ల నుంచి భారత సైన్యం పెద్దసంఖ్యలో హైదరాబాద్ వైపు పురోగమిస్తున్నట్టు సమాచారం ఉందన్నాడు. అతను నాతో మాట్లాడుతుండగానే బీడ్, వరంగల్ ఔరంగాబాద్, విమానాశ్రయాలపై బాంబుదాడులు జరుగుతున్నాయి.. ఏం చేయాలని అడిగాడు. ఎలాగైనా అడ్డుకోవాలన్నాను. కానీ హైదరాబాద్ సైన్యాల నిస్సహాయ ప్రదర్శన, సాయం చేస్తుందనుకున్న పాకిస్తాన్ ప్రేక్షకపాత్ర, మా ఫిర్యాదుపై భద్రతా మండలి (యూన్ సెక్యూరిటీ కౌన్సిల్) జాప్యం..వెరసి హైదరాబాద్ కథ విషాదంగా ముగిసింది..’’ – హైదరాబాద్ స్టేట్ చివరి ప్రధాని లాయక్ అలీ ‘ట్రాజెడీ ఆఫ్ హైదరాబాద్’ బుక్‌లో రాసుకున్న మనోగతమిది. (శ్రీగిరి విజయ్‌కుమార్‌రెడ్డి, సాక్షి, ప్రత్యేక ప్రతినిధి) ఆపరేషన్ పోలో.. కేవలం ఐదురోజుల్లోనే హైదరాబాద్ భవిష్యత్తును మార్చేసింది. 1947 ఆగస్టు 15న దేశమంతా స్వాతంత్య్ర సంబురాలతో, త్రివర్ణజెండాలతో రెపరెపలాడితే.. హైదరాబాద్‌లో మాత్రం నిజాం రాజుకు వ్యతిరేకంగా నిలబడ్డ యోధుల తలలు తెగాయి. హైదరాబాద్ స్టేట్‌ను భారత్‌లో విలీనం చేయాలని నెహ్రూ, పటేల్ చేసిన విజ్ఞప్తులను నిజాం బుట్టదాఖలు చేయడంతో ‘ఆపరేషన్ పోలో’ మొదలైంది. ఐదు రోజుల్లోనే అంతా పూర్తి నిజాం మెడలు వంచే లక్ష్యంతో 1948 సెప్టెంబర్ 13న భారత మేజర్ జనరల్ చౌదరి ఆధ్వర్యంలో మొదలైన ‘ఆపరేషన్ పోలో’ ఐదురోజుల్లోనే ముగిసింది. పశ్చిమాన షోలాపూర్–హైదరాబాద్, తూ ర్పున మచిలీపట్నం–హైదరాబాద్ రహదారి వెంట యుద్ధట్యాంకులు, తేలికపాటి స్టువర్ట్ టైప్ ట్యాంకులు, వాటి వెనక ఆయుధ వాహనాలు, పదాతిదళాలు దూసుకురాగా.. నిజాం సైన్యాలు, రజాకార్ల బృందాలు ఎక్కడా నిలువరించలేకపోయాయి. ముట్టడి ప్రారంభమైన తొలిరోజునే పశ్చిమం నుంచి వస్తున్న దళాలు నల్‌దుర్గ్‌ను స్వాధీనం చేసుకోగా.. తూర్పున మునగాల, సూర్యాపేట వరకు వశమ య్యాయి. సూర్యాపేట శివారులో మకాంవేసిన ని జాం సైన్యం.. 14వ తేదీన భారత సైన్యాలను అడ్డు కునేందుకు మూసీ వంతెనను పేల్చేసినా, తాత్కా లిక వంతెన నిర్మించుకున్న భారతసైన్యాలు మూసీ ని దాటాయి. భారత వాయుసేన పైనుంచి బాంబులువేస్తూ దారివేయగా.. పదాతిదళాలు నిజాం సైన్యాలను ఎదుర్కొంటూ ముందుకుసాగాయి. స్వేచ్ఛా వాయువులతో.. సెప్టెంబర్ 16 నాటికి నిజాంకు వాస్తవ పరిస్థితి అర్థమైంది. ఆరోజు సాయంత్రమే తొలుత ప్రధానమంత్రి మీర్‌లాయక్ అలీ రేడియో స్టేషన్‌కు వెళ్లి తాను రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. మర్నాడు, అంటే.. సెప్టెంబర్ 17న సాయంత్రానికి భారత ప్రభుత్వ ప్రతినిధి మున్షీ ఆదేశంతో.. మీర్ ఉస్మాన్‌అలీఖాన్ స్వయంగా దక్కన్ రేడియో ద్వారా హైదరాబాద్ సైన్యం తరఫున కాల్పుల విరమణ చేస్తున్నామని, యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్‌కు ఇచ్చిన ఫిర్యాదును వెనక్కి తీసుకుంటున్నామని ప్రకటించా రు. దీనితో హైదరాబాద్ స్టేట్ స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంది. జనమంతా భారత జాతీయజెండాలతో హైదరాబాద్ నగరాన్ని త్రివర్ణమయం చేశారు. రజాకార్ల అధ్యక్షుడు ఖాసీంరజ్వీని అరెస్ట్‌చేసి జైల్లో పెట్టగా.. ప్రధాని లాయక్ అలీని గృహ నిర్బంధం చేశారు. ఆయన రెండేళ్ల తర్వాత తప్పించుకుని పాకిస్తాన్ చేరాడు. ఖాసీం రజ్వీ 1958లో జైలు నుంచి విడుదలై పాకిస్తాన్లో స్థిరపడ్డాడు. నిజాం గుండెల్లో నిదురించిన గెరిల్లా.. ‘‘కట్ట బట్ట, తిన తిండి, పొట్టనక్షరం ముక్కలేనివాడు. వెట్టిచాకిరీకి అలవాటుపడ్డవాడు. ఎముకల గూడు తప్ప ఏమీ మిగలని వాడు.. దొరా నీ బాంచెన్ అన్న దీనుడు.. హీనుడు, దిక్కులేనివాడు.. తెలంగాణ మానవుడి సాహసోపేత సాయుధ పోరాటం ప్రపంచంలో ఓ కొత్త చరిత్ర’’.. నిజాం రాజ్యంలో సంస్థానాలు, జాగీ ర్దార్లు, దేశ్‌ముఖ్‌లు, దేశ్‌పాండేలు, పటేల్, పట్వా రీ వ్యవస్థలు రైతుకూలీలను పీల్చి పిప్పిచేశాయి. నిజాంకు వ్యతిరేకంగా రైతుకూలీల సాయుధపోరు సొంత భూమి లేని సాదాసీదా జనం జీవితాంతం వెట్టిచేయాల్సిన పరిస్థితి. న్యాయ, కార్యనిర్వహణ వ్యవస్థలు పటేల్, పట్వారీల చేతుల్లో ఉండటంతో జనమంతా బాంచెన్ దొరా.. కాల్మొక్తా.. అంటూ బతికిన దుస్థితి. అయితే దేశ స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తి, ఆంధ్ర మహాసభలు తెచ్చిన చైతన్యం సాయుధ రైతాంగ పోరాటానికి దారితీసింది. ఖాసీంరజ్వీ ఆధ్వర్యంలో ఏర్పాటైన రజాకార్ల ఆగ డాలపై.. నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో జనం తిరుగుబాటు మొదలైంది. భారత సైన్యాలను ఎదుర్కొనేందుకు రజాకార్లకు తర్ఫీదునిస్తున్న ఖాసీంరజ్వీ 1946 జూలై 4న అప్పటి నల్లగొండ జిల్లా కడవెండిలో విసునూరు దేశ్‌ముఖ్ ఇంటిమీదుగా వెళ్తున్న జులూస్పై దేశ్ ముఖ్ పేల్చిన తూటాలకు దొడ్డి కొమురయ్య హతమయ్యాడు. అది తెలంగాణ రైతాంగ సా యుధ పోరాటానికి నాంది పలికింది. 4వేల మంది రక్తతర్పణతో 3వేల గ్రామాలు కమ్యూనిస్టుల ప్రజారక్షక దళాల అధీనంలోకి వెళ్లాయి. భారత ఉపప్రధాని వల్లభ్‌బాయ్‌పటేల్ ముందు లొంగిపోతున్న ఉస్మాన్‌అలీఖాన్ ఇదీ హైదరాబాద్ స్టేట్ ప్రస్తుత మహారాష్ట్రలోని ఔరంగాబాద్, బీడ్, నాందేడ్, పర్బని, ఉస్మానాబాద్, కర్ణాటకలోని రాయచూర్, బీదర్, గుల్బర్గా (కలబుర్గి), తెలంగాణతో కలిపి మొత్తం 83 వేల చదరపు మైళ్ల విస్తీర్ణంతో.. దేశంలోనే అతిపెద్ద సంస్థానంగా ఉండేది. నిజాం.. ప్రపంచ కుబేరుడు మీర్ ఉస్మా న్ అలీఖాన్.. హై దరాబాద్ స్టేట్ విలీనం నాటికి ప్రపంచ ధనవంతుల్లో నంబర్‌వన్. 1937 ఫిబ్ర వరిలో టైమ్ మేగజైన్ అలీఖాన్ కవర్‌పేజీతో ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. అప్పట్లోనే నిజాం సంపద విలువ రూ. 660 కోట్లుగా పే ర్కొంది. గోల్కొండ వజ్రాల గనులతో పాటు వివిధ సంస్థానాల నుంచి వచ్చే ఆదాయాలతో ఉస్మాన్ అలీఖాన్ ప్రపంచ కుబేరుడయ్యాడు. జాకబ్ వజ్రాన్ని పేపర్ వెయిట్‌గా వాడేవాడు. ఉస్మాన్‌అలీఖాన్ ధరించిన.. విలువైన రాళ్లు పొదిగిన ఈ కత్తి విలువ అప్పట్లోనే 2 లక్షల డాలర్లు ఆయనకు హైదరాబాద్ చుట్టూరా 23 వేల ఎకరాల (సర్ఫెకాస్) భూములతోపాటు దేశంలోని వి«విధ ప్రాంతాల్లో 600కుపైగా విల్లాలు, విలాసవంతమైన భవంతులు ఉన్నాయి. ఒక్క హైదరాబాద్‌లోనే చౌమహల్లా, ఫలక్‌నుమా, చిరాన్‌పోర్ట్, నజ్రీబాగ్, పరేడ్ విల్లా ఫెర్న్‌విల్లా, హిల్‌ఫోర్ట్, మౌంట్ ప్లజెంట్ విల్లాలు ఉస్మాన్‌అలీఖాన్ సొంతం. 173 రకాల బంగారు, వజ్రాభరణాలతో నిజాం ఖజానా ఉండేది. ఉస్మాన్ అలీఖాన్ కుటుంబం: లొంగుబాటుకు ముందు కుమారులు, కోడళ్లతో ఉస్మాన్ అలీఖాన్ ఎవరీ నిజాంలు? 1724లో స్వతంత్రుడిగా ప్రకటించుకున్న ఖమ్రుద్దీన్‌ఖాన్ దక్కన్లో అసఫ్‌జాహీ రాజ్యానికి నిజాం కాగా, 1948 సెస్టెంబర్ 17న భారత సైన్యాలకు లొంగిపోయిన ఉస్మాన్ అలీఖాన్ చివరివాడు. భారత్‌లో విలీనం అనంతరం ఉస్మాన్ అలీఖాన్ ఏటా రూ.50 లక్షల రాజభరణం పొందుతూ 1956 వరకు రాజ్‌ప్రముఖ్‌గా కొనసాగారు. ప్రస్తుతం ఉస్మాన్ అలీఖాన్ మనవళ్లు ముఖర్రం జా, ముఫకం జా లండన్‌లో స్థిరపడి.. ఏటా హైదరాబాద్ వచ్చి వెళ్తున్నారు. చివరి నిజాం ఉస్మాన్ అలీఖాన్ కుటుంబమిదీ.. భార్య: ఆజం ఉన్నీసాబేగం కుమారులు: ఆజం జా, మౌజం జా, కూతురు మహ్మద్ ఉన్నీసా బేగం ఆజంజా కుటుంబం: భార్య దుర్రేషెవార్(టర్కీ), వారసులు ముఖర్రం జా, ముఫకం జా మౌజంజా కుటుంబం: భార్యలు నిలోఫర్ (టర్కీ), రజియాబేగం, అన్వరీబేగం. వారసులు ఫాతిమా, ఫాజియా అమీనా, ఓలియా, శ్యామత్ అలీఖాన్ -
సికింద్రాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం.. పలువురి మృతి
రాంగోపాల్‌పేట్ (హైదరాబాద్): ఉవ్వెత్తున ఎగిసిన మంటలు.. దట్టమైన పొగ.. వివిధ పనుల మీద నగరానికి వచ్చి లాడ్జీలో బస చేసినవారు ఉక్కిరిబిక్కిరయ్యారు. మిగతావారు ఎలాగో తప్పించుకునా ఏడుగురు కాలినగాయాలు, పొగతో ఊపిరి అందక ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఆరుగురు పురుషులు, ఒక మహిళ ఉన్నట్టు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. 13 మంది గాయపడినట్లు సమాచారం కాగా వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘోర దుర్ఘటన సోమవారం రాత్రి సికింద్రాబాద్‌లో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. రాత్రి సేద తీరుతుండగా..: ప్రత్యక్ష సాక్షులు, పోలీసుల కథనం ప్రకారం.. సెయింట్ మేరీస్ రోడ్డులోని మనోహర్ థియేటర్ ఎదురుగా రంజిత్ సింగ్ బగ్గా అనే వ్యక్తి రూబీ ఎలక్ట్రికల్ స్కూటర్స్ పేరుతో బైక్‌ల షోరూమ్ నిర్వహిస్తున్నా రు. ఈ షోరూమ్ సెల్లార్లో ఉండగా, ఆపై నాలుగు అంతస్తుల్లో రూబీ డీలక్స్ హోటల్‌ను నిర్వహిస్తున్నారు. సోమవారం రాత్రి 9.30 గంటల సమయంలో సెల్లార్‌లోని షోరూమ్ నుంచి మంటలు చెలరేగాయి. ఇందులో ఎలక్ట్రికల్ బైక్‌ల బ్యాటరీలు పేలి భారీ శబ్దాలతో పాటు మంటలు వ్యాపించాయి. నాలుగు అంతస్తుల్లోని లాడ్జీ గదుల్లోకి మంటలు, దట్టమైన పొగలు వ్యాపించాయి. అప్రమత్తమైన కొంతమంది హోటల్ గదుల నుంచి పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకున్నారు. కొందరు మాత్రం దట్టమైన పొగల కారణంగా బయటకు రాలేక గదుల్లో చిక్కుకుపోయారు. లాడ్జీలో 23 మంది..: హోటల్లో వ్యాపారాల నిమిత్తం ఉత్తర భారత దేశం, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు 23 మంది ఉన్నట్లు తేలింది. దట్టమైన పొగలు పైన ఉన్న గదుల్లోకి వ్యాపించడంతో చాలామంది పై నుంచి కిందకు దిగేందుకు వీలులేకుండా పోయింది. ఓ మహిళతో పాటు మరో ముగ్గురు వ్యక్తులు డ్రైనేజీ పైప్‌ల ద్వారా నాలుగు, మూడో అంతస్తుల నుంచి కిందకు దిగారు. వీళ్లు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అలాగే దీన్ని ఆనుకుని ఉండే యాత్రి ఇన్ హోటల్ మీదుగా మరికొంత మంది ప్రాణాలతో బయట పడ్డారు. వీరికి సైతం ఊపిరితిత్తుల్లోకి పొగ చేరడంతో గాలి తీసుకోవడం కూడా ఇబ్బందిగా మారింది. ఫైర్ సిబ్బంది స్నారికల్ వాహనం ద్వారా కొంత మందిని కిటికీల నుంచి బయటకు రప్పించి రక్షించారు. ఒక మహిళతో పాటు మరో ముగ్గురు గదుల్లో అపస్మారక స్థితిలో పడిఉండగా బయటకు తీసి హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. వీరి పరిస్థితి మాత్రం విషమంగా ఉంది. కాలిన గాయాలైన వారిని గాంధీ ఆస్పత్రికి తరలించగా మిగతా వారిని సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి తరలించారు. మార్కెట్ పోలీసులు, సికింద్రాబాద్ ఫైర్ స్టేషన్ సిబ్బంది, డీఆర్ఎఫ్ సిబ్బంది, పెద్దసంఖ్యలో స్థానికులు సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బాధితులు కిటికీల నుంచి హెల్ప్ హెల్ప్ అని అరుస్తుండగా అక్కడికి చేరుకున్న స్థానికులు వారికి నిచ్చెనలు అందించి, పైప్‌ల ద్వారా దిగేలా సహాయం చేశారు. మరికొంత మంది పొగలోనే లోపలికి వెళ్లి గదుల్లో ఉండే వారిని బయటకు తీసుకుని వచ్చారు. అగ్ని ప్రమాద ఘటన తెలియగానే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. హోంమంత్రి మహమూద్ అలీ కూడా ఘటనా స్థలాన్ని సందర్శించారు. అంతా క్షణాల్లోనే: కేశవులు, చెన్నై చెన్నై నుంచి వ్యాపారం నిమిత్తం హైదరాబాద్ వచ్చాను. రాత్రి 9 గంటలకు హోటల్లో దిగాను. అంతలోపే ప్రమాదం జరిగింది. దట్టమైన పొగలు కమ్ముకోవడంతో బయటకు వచ్చే అవకాశం లేకపోయింది. స్థానికుల సహాయంతో 4వ అంతస్తు నుంచి పైౖౖపులు పట్టుకుని కిందకు దిగాను. ఇది మరో జన్మ: ఉమేష్ ఆచార్య, ఒడిశా ఒడిశా నుంచి ఆఫీస్ పనిమీద హైదరాబాద్ వచ్చాను. 4వ అంతస్తులో ఉన్నాను. దట్టమైన పొగలు కమ్ముకోవడంతో అగ్ని ప్రమాదం జరిగిందని తెలిసింది. మెట్ల నుంచి వెళ్లే అవకాశం కనిపించలేదు. వెంటనే ప్రాణాలు కాపాడుకోవాలంటే పైపులు పట్టుకుని దిగాలని «ధైర్యం చేశా. పైపులు పట్టుకుని కిందికి దిగాను. ఇది నాకు మరో జన్మ. పొగ పీల్చుకోవడంతో ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంది. ఇదీ చదవండి: మళ్లీ.. గోదావరి ఉగ్రరూపం -
గణేష్ నిమజ్జనంలో అపశ్రుతి.. ఆరుగురు యువకులు మృతి
చండీగఢ్: హర్యానాలో గణేష్ నిమజ్జనంలో అపశ్రుతి చోటు చేసుకుంది. మహేంద్రగఢ్, సోనిపత్ జిల్లాల్లో శుక్రవారం సాయంత్రం జరిగిన వేరు వేరు ఘటనల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మహేంద్రగఢ్‌లో ఏడు అడుగుల వినాయకుడి విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు కాలువలోకి దిగిన 9 మంది యువకులు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయారు. వీరిలో నలుగురు ప్రాణాలు కోల్పోగా.. మిగతా ఐదుగురిని సహాయక సిబ్బంది సురక్షితంగా కాపాడారు. ప్రస్తుతం వీరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సోనిపత్ జిల్లాలో జరిగిన మరో ఘటనలో గణేష్ విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు సరయూ నదిలోకి దిగిన ఇద్దరు యువకులు నీటమునిగి చనిపోయారు. ఈ విషాద ఘటనలపై హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గణేష్ నిమజ్జనంలో పాల్గొనేందుకు వెళ్లి వీరంతా ప్రాణాలు కోల్పోవడం తన హృదయాన్ని కలచివేసిందని ట్వీట్ చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే సహాయక చర్యల్లో ఎంతో మంది ప్రాణాలు కాపాడిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని ప్రశంసించారు. महेंद्रगढ़ और सोनीपत जिले में गणपति विसर्जन के दौरान नहर में डूबने से कई लोगों की असामयिक मृत्यु का समाचार हृदयविदारक है। इस कठिन समय में हम सभी मृतकों के परिजनों के साथ खड़े हैं। NDRF की टीम ने कई लोगों को डूबने से बचा लिया है, मैं उनके शीघ्र स्वस्थ होने की प्रार्थना करता हूँ। — Manohar Lal (@mlkhattar) September 9, 2022 చదవండి: అడ్డు తొలగించుకునేందుకే హత్య.. భార్య అంగీకారంతోనే.. -
అమ్మా.. ఎందుకిలా చేశావు?, నాన్నా.. నేనేం పాపం చేశాను?
పరిష్కారం లేని సమస్య ఏదీ ఉండదన్న విషయాన్ని ఓ తల్లి, ఓ తండ్రి మరిచిపోయారు. తమ సమస్యల పరిష్కారానికి చావే మార్గమని భావించారు. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం వారితోపాటు ఎంతో భవిష్యత్ ఉన్న పిల్లల ప్రాణాలను సైతం బలితీసుకుంది. భార్య ప్రవర్తన, బంధువుల చేష్టలతో విసిగివేసారిన నెల్లూరులోని అంబాపురం గ్రామానికి చెందిన తండ్రి తన కొడుకుతో కలిసి బావిలో దూకాడు. తాళి కట్టి జీవితాంతం తోడుంటానని ప్రమాణం చేసిన భర్త వేధింపులను తట్టుకోలేకో ఏమో.. ఓ మహిళ అభంశుభం తెలియని ఇద్దరు బిడ్డలతో సహా మృత్యువుని చేరిన ఘటన వింజమూరులోని జైభీమ్‌నగర్‌లో చోటుచేసుకుంది. ఈ హృదయ విదారకర ఘటనలు బాధిత కుటుంబాల్లో పెను విషాదం నింపగా, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో సంచలనం రేపాయి. అమ్మా.. ఎందుకిలా చేశావు? అమ్మా.. పేగును పంచావు.. ప్రేమగా పెంచావు.. మమ్మల్నే సర్వస్వం అనుకున్నావు.. మేమే జీవితమని పొంగిపోయావు.. ఏమైందో ఏమో.. క్షణికావేశంలో నీ ప్రాణాన్ని తీసుకోవాలనుకున్నావో ఏమో.. నీవు లేని మా జీవితాలు మోడువారుతాయని తలిచావో ఏమో.. మమ్మల్ని ఉరితాడుకు బిగించి.. నువ్వూ ఉరేసుకుని తనువు చాలించావు.. ఆవేశంలో నీ కంటిపాపలమని మరిచావా అమ్మా? వింజమూరు: స్థానిక జైభీమ్ నగర్లో గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఓ వివాహిత తన ఇద్దరు పిల్లలతో సహా ఆత్మహత్య చేసకుంది. ఈ ఘటన వింజమూరులో సంచలనం సృష్టించింది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. జైభీమ్ నగర్‌కు సాదం వెంకట్రావు స్థానిక గ్యాస్ ఏజెన్సీలో గుమస్తాగా పనిచేస్తున్నాడు. ఆయనకు ఆత్మకూరు మండలం నాగులపాడుకు చెందిన గీత (31)తో 12 సంవత్సరాల క్రితం వివాహమైంది. వారికి కుమారుడు వెంకట్ (10), కుమార్తె చరిష్మ (5) ఉన్నారు. వెంకట్ గండిపాళెం గురుకుల పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నాడు. కుమార్తె స్థానిక పాఠశాలలో చదువుతోంది. గీత తండ్రి మరణించాడు. తల్లి, ఇద్దరు అన్నలు, ఒక అక్క ఉన్నారు. కుటుంబసభ్యులు ప్రస్తుతం నెల్లూరులో స్థిరపడ్డారు. గీత గతంలో వింజమూరు పెట్రోలు బంకులో పనిచేసింది. ప్రస్తుతం రెడీమేడ్ దుస్తుల దుకాణంలో పనిచేస్తూ కుటుంబానికి చేదోడువాదోడు ఉంది. వెంకట్రావు గురువారం మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చేసరికి భార్య, ఇద్దరు పిల్లలు వరండాలో వేలాడుతుండడాన్ని చూసి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. కలిగిరి సీఐ సాంబశివరావు, ఎస్సై జంపానికుమార్ ఘటనా స్థలానికి చేరుకుని విచారించారు. గీత ముందుగా కుమారుడు, కుమార్తెకు ఉరేసి తర్వాత తాను ఉరేసుకుని ఉంటుందని భావిస్తున్నారు. విషయం తెలుసుకున్న గీత తల్లి డోలా సరస్వతమ్మ ఘటనా స్థలానికి చేరుకుని కుమార్తె, ఆమె బిడ్డల మృతదేహాలను చూసి బోరున విలపించింది. అనంతరం వింజమూరు పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని అల్లుడి వేధింపుల వల్లే తన కుమార్తె బిడ్డలతో సహా ఆత్మహత్యకు పాల్పడిందని ఫిర్యాదు చేసింది. నాన్నా.. నేనేం పాపం చేశాను? నాన్నా.. మా బంగారు భవిష్యత్తుపై ఎన్నో కలలు కన్నావు.. నేను, తమ్ముడూ బాగా చదువుకోవాలనుకున్నావు.. మేమిద్దరం నువ్వే మా లోకమని జీవిస్తున్నాం.. చేయిపట్టి నడిపించాల్సిన నువ్వే నీ చేతులకు, నా చేతులకు తాడు కట్టి బావిలోకి దూకించావు.. నేనేం పాపం చేశాను.. నీ బిడ్డ ప్రాణం కూడా పోతుందని ఒక్క నిమిషం ఆలోచించలేకపోయావా నాన్నా? నెల్లూరు(క్రైమ్): భార్య ప్రవర్తన, బంధువుల వేధింపులే చావుకి కారణమని స్నేహితుడికి వాయిస్ మెసేజ్ పంపి ఓ తండ్రి తన కుమారుడితో కలిసి నేలబావిలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన నెల్లూరు రూరల్ మండలం అంబాపురం గ్రామ పొలాల్లో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. అంబాపురం ఎల్బీఎస్ నగర్‌కు చెందిన కృష్ణస్వామి రంగస్వామి (45), విజయలక్ష్మి దంపతులకు సంజయ్‌కుమార్ (14), ప్రేమ్‌కుమార్ పిల్లలున్నారు. సంజయ్ 9వ తరగతి చదువుతున్నాడు. రంగస్వామికి అతని భార్యకు మధ్య కొంతకాలంగా తీవ్ర గొడవలు జరుగుతున్నాయి. ఇటీవల ఆమె ఎవరికీ చెప్పకుండా ఇంట్లోంచి వెళ్లిపోయింది. భర్త ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టాడు. ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. ఈ నేపథ్యంలో రంగస్వామి, పెద్ద కుమారుడు సంజయ్‌కుమార్ వెనుక చేతులు కట్టుకుని ఊరికి సమీప పొల్లాలోని నేలబావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. స్థానిక వీఆర్వో బాలసర్వేశ్వరరావు వేదాయపాళెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇన్స్పెక్టర్ కె.నరసింహారావు తన సిబ్బందితో కలిసి స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది సహాయంతో మృతదేహాలను వెలికితీయించారు. చనిపోయే ముందు రంగస్వామి ఆడియో మెసేజ్ రికార్డు చేసి తన స్నేహితుడు సెల్వమణికి పంపాడు. చావుకి కారణం తన వదిన, బావ, వాళ్లమ్మ కారణమని, వారి వల్లే కుటుంబంలో వివాదాలు తలెత్తాయని, భార్య తనను వదిలిపోయిందని అందులో పేర్కొన్నాడు. ఆడియో మెసేజ్ ఆధారంగా ఇన్స్పెక్టర్ కేసు నమోదు చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్‌కు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
80 ఏళ్లు పూర్తి.. అయినా గుండెలపై మానని గాయం
కొరాపుట్(భువనేశ్వర్): అది 1942 ఆగస్టు 24వ తేదీ. భారతదేశ చరిత్రలో అత్యంత అమానవీయ ఘటన జలియన్ వాలా బాగ్ దురంతం వంటి ఘటన ఒడిశాలో చోటు చేసుకుంది. బ్రిటీష్ సైనికుల కాల్పులకు 19 మంది స్వాతంత్య్ర సమరయోధులు అశువులు బాశారు. నబరంగ్‌పూర్ జిల్లా పపడాహండి సమితి టురి నది ఒడ్డున అమరులయ్యారు. నాటి రోజుల్లోకి వెళ్తే.. దేశవ్యాప్తంగా క్విట్ ఇండియా ఉద్యమం తీవ్రంగా జరుగుతున్న రోజులవి. జాతిపిత మహాత్మా గాంధీ పిలుపు దక్షిణ ఒడిశాకు చేరడంతో అవిభక్త కొరాపుట్ జిల్లాలోని దండకారణ్యంలో మన్యంవీరుల్లో కదలిక వచ్చింది. నందాహండి, తెంతులకుంటి, జొరిగాం, డాబుగాం, పపడాహండి సమితుల్లో క్విట్ ఇండియా ఉద్యమం ర్యాలీల నిర్వహణకు సన్నాహాలు జరిగాయి. 1942 ఆగస్టు 14న స్థానిక సమరయెధుడు మాధవ ప్రధాని భారీ బహిరంగ సభకు పిలుపునిచ్చాడు. ఈ సభ నబరంగ్‌పూర్ సమీపంలోని చికిలి వద్ద జరగాల్సి ఉంది. సుమారు 200 మంది ప్రజలు గూమిగూడారు అని తెలిసి పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే చికిలి నది ఒడ్డుకు ఎవరూ చేరకుండా వంతెన కూల్చివేశారు. ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమం ఈ సంఘటనతో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. స్వాతంత్య్ర సమరయెధుడు సోను మజ్జి నేతృత్వంలో ఉద్యమకారులు జఠాబల్ వంతెన కూల్చివేశారు. ఆగస్టు 24వ తేదీన సుమారు 500 మంది ఉద్యమకారులు పపడాహండి వద్ద టురి నదిపై ఉన్న వంతెన కూల్చి వేయడానికి బయల్దేరారు. వీరికి మాధవ ప్రధానితో ఉన్న 200 మంది ఉద్యమకారులు జత కలిశారు. దీంతో వీరిని నిలువరించేందుకు జయపురం, నబరంగ్పూర్ల నుంచి రిజర్వ్ పోలీసు బలగాలు టురి నది ఒడ్డుకు చేరుకున్నాయి. వంతెనకు ఒకవైపు పోలీసులు మరోవైపు ఉద్యమకారులు ఉన్నారు. ఉద్యమకారులు వంతెనపైకి రావడంతో పోలీసులు కాల్పులు జరిపారు. నదిలో రక్తం ప్రవహించిన వేళ పోలీసుల కాల్పులకు అక్కడికక్కడే 11 మంది స్వాతంత్య్ర సమరయోధులు కనుమూశారు. మరో 7గురు నబరంగ్‌పూర్ ఆస్పత్రిలో చనిపోయారు. పదుల సంఖ్యలో నదిలో పడి గల్లంతయ్యారు. అనేక మంది శాశ్వత దివ్యాంగులుగా మారారు. 140 మంది అరెస్టై జైలు పాలయ్యారు. ఫలితంగా టురి నది రక్తంతో పారినట్లు నాటి ప్రత్యక్ష సాకు‡్ష్యలు పేర్కొన్నారు. స్వాతంత్య్ర అనంతరం గల్లంతైన వారి కోసం గాలించినా లాభం లేకపోయింది. 1980 ఆగస్టు 24న అదే చోట అప్పటి రాష్ట్ర మంత్రి, స్వాతంత్య్ర సమరయెధుడు రాధాకృష్ట విశ్వాస్ రాయ్, స్థానిక ఎమ్మెల్యే హబిబుల్లాఖాన్లు సాయుధ స్థూపం కోసం శంకుస్థాపన చేశారు. 1984 మే 23న అప్పటి రాష్ట్ర గవర్నర్ విశ్వనాథ్ పాండే ఈ స్థూపాన్ని ప్రారంభించారు. స్థూపం మీద చనిపోయిన 19 మంది ఉద్యమకారుల పేర్లు లిఖించారు. నాటి నుండి నేటి వరకు అగస్టు 24న ఉద్యమకారుల కుటుంబాలను అక్కడ సత్కరిస్తున్నారు. వారి ఆచారాలకు అనుగుణంగా టురి నదిలో పిండ ప్రధానం చేస్తున్నారు. అనంతరం 2011లో డాబుగాం ఎమ్మెల్యే భుజబల్ మజ్జి తన కోటా నిధులతో అక్కడ స్మారక మందిరం నిర్మించారు. ప్రభుత్వం 24 మంది స్వాతంత్య్ర సమరయెధుల విగ్రహాలు, 100 అడుగుల జాతీయ జెండా ఏర్పాటు చేసింది. ఈ ఏడాది బుధవారం జరగనున్న కార్యక్రమానికి కలెక్టర్ డాక్టర్ కమలోచన్ మిశ్రా మంగళవారం ఏర్పాట్లను పరిశీలించారు. -
విషాద ఘటన: దేశభక్తితో ప్రసంగిస్తూనే కుప్పకూలాడు
సాక్షి, హైదరాబాద్: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు. దేశభక్తితో తండ్రి ప్రసంగిస్తుండగా, అతడిని వీడియోలో బంధిస్తున్న కూతురు. చుట్టూ పండుగ వాతవరణం. అప్పటిదాకా కోలాహలంగా ఉన్న ఆ ప్రాంతంలో ఒక్కసారిగా విషాద చాయలు నెలకొన్నాయి. ప్రసంగిస్తున్న వ్యక్తి.. ఉన్నట్టుండి కుప్పకూలాడు. అందరూ చూస్తుండగానే మృత్యు ఒడికి చేరాడు. ఈ విషాద ఘటన కాప్రా, వంపుగూడలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కాప్రా డివిజన్ వంపుగూడ లక్ష్మీవిల్లాస్‌లో పంద్రాగస్టు వేడుకలను నిర్వహిస్తున్నారు. కాలనీ అసోసియేషన్ సభ్యుడైన ఉప్పల సురేశ్ కూతురు మైత్రితో కలిసి స్వాతంత్ర వేడుకలకు వచ్చాడు. జాతీయ పతాకావిష్కరణ అనంతరం ఆయన మాట్లాడుతున్నాడు. స్వాతంత్య్రోద్యమ చర్రితను చెబుతూ.. కుప్పకూలిపోయాడు. గుండెపోటు వచ్చి కూతురు చూస్తుండగానే మృత్యుఒడిలోకి చేరుకున్నాడు. సురేష్ అకస్మాత్తుగా మృతి చెందడంతో స్థానికంగా విషాద చాయలు అలుముకున్నాయి. బాగ్అంబర్పేట్ డీడీ కాలనీలో ఫార్మాస్యూటికల్ ఏజెన్సీ నిర్వహిస్తున్న సురేష్‌కు తల్లిదండ్రులు యాదగిరి, సరోజని, భార్య కరుణ, కూతురు మైత్రి, కొడుకు ధర్మపాల్ ఉన్నారు. తండ్రి యాదగిరి హైదరాబాద్‌లోని సీతాఫల్మండిలో ఉన్న వేదిక్ విద్యాలయ అధ్యక్షుడుగా ఉన్నారు. స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొనేందుకు అక్కడికి వెళ్లిన యాదగిరి, కొడుకు మరణవార్త విని హుటాహుటిన ఇంటికి వచ్చాడు. విగతజీవిగా పడి ఉన్న కొడుకును చూసి ఆయన బోరున విలపించడం అందరిని కంటతడి పెట్టించింది. సురేశ్ కూతురు మైత్రి సీఏ చదువుతుండగా, కొడుకు ధర్మపాల్ బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాడు. తల్లిదండ్రులను చూసేందుకు ధర్మపాల్ రెండ్రోజుల క్రితమే బెంగళూరు నుంచి ఇంటికి వచ్చాడు. (క్లిక్: హైదరాబాద్ శివారులో కాల్పుల కలకలం) -
జెండా పండుగలో విషాదం
యశవంతపుర: జెండా పండుగ వేళ పలుచోట్ల విషాదాలు చోటుచేసుకున్నాయి. గుండెపోటుతో ఒకరు, జెండా కడుతూ కిందపడి మరొకరు ప్రాణాలు విడిచారు. దక్షిణ కన్నడ జిల్లా కడబ తాలూకా కుట్రుపాడి గ్రామ పంచాయతి ఆఫీసులో సోమవారం ఉదయం జెండాను ఎగురవేస్తుండగా మాజీ జవాన్ గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. మాజీ జవాన్ గంగాధర గౌడను ఈ కార్యక్రమానికి అతిథిగా ఆహ్వానించారు. అతిథి ప్రసంగిస్తుండగా గంగాధరగౌడ కిందపడిపోయాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా కన్నుమూశాడు. సంఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జారిపడి గాయాలతో టెక్కీ మృతి హర్ ఘర్ తిరంగాలో భాగంగా ఇంటిపై జెండా కడుతూ కిందపడి టెక్కీ చనిపోయాడు. ఈ ఘటన బెంగళూరు హెణ్ణూరు పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. దక్షిణకన్నడ జిల్లా సుళ్యకు చెందిన విశ్వాస్‌కుమార్ భట్ (33) బెంగళూరులో టెక్కీగా పని చేస్తున్నాడు. హెచ్బీఆర్ లేఔట్ ఐదో బ్లాక్‌లో భార్య వైశాలితో కలిసి రెండేళ్ల నుంచి నివాసం ఉంటున్నారు. ఆదివారం ఇంటి మీద పతాకాన్ని కడుతూ అదుపుతప్పి కిందపడడంతో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పోందుతూ సోమవారం మృతి చెందాడు. (చదవండి: కాల్చేస్తాం, జరిమానా కట్టేస్తాం ) -
ఏటి ఒడ్డున కన్నీటి సుడులు.. తమ్ముడూ రాఖీ కడదామని వచ్చానురా.. !
నేలకొండపల్లి / ఖమ్మం వైద్యవిభాగం: మండలంలోని సుర్దేపల్లి ఏటిలో చేపల వేటకు వెళ్లి వ్యక్తితో పాటు ఆయనను కాపాడేందుకు వచ్చి గల్లంతైన డీఆర్ఎఫ్ సిబ్బంది మృతదేహాలు శుక్రవారం లభించాయి. గురువారం ఏటిలో చేపల వేటకు వెళ్లిన రంజిత్ గల్లంతు కాగా, ఆయనను రక్షించేందుకు వచ్చిన ఖమ్మం కార్పొరేషన్ డీఆర్ఎఫ్ సిబ్బంది ఎం.వెంకటేశ్వర్లు, బి.ప్రదీప్ కూడా గల్లంతైన విషయం విదితమే. అయితే, గురువారం రాత్రి వెంకటేశ్వర్లు మృతదేహం లభించగా, శుక్రవారం ప్రదీప్, రంజిత్ మృతదేహాలను గుర్తించారు. అనంతరం రంజిత్ మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాక, డీఆర్ఎఫ్ టీమ్ లీడర్ ప్రదీప్ మృతదేహాన్ని తరలించే క్రమంలో కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ ఘటన జరిగిందని ఆరోపిస్తూ బాధ్యులను సస్పెండ్ చేసి న్యాయం చేయాలంటూ ధర్నాకు దిగారు. అధికారులు రాకుండా బలవంతం చేస్తే తాము ఏటిలో దూకి ఆత్మహత్య చేసుకుంటామని స్పష్టం చేశారు. (చదవండి: అభ్యర్థి ఎవరైనా కలిసి పని చేయండి: కృష్ణారెడ్డితో కేసీఆర్) వీరి ఆందోళనకు వివిధ పార్టీల నాయకులు సంఘీభావం తెలపగా, ఖమ్మం రూరల్ సీఐ ఎం.శ్రీనివాస్ చర్చించినా ససేమిరా అన్నారు. చివరకు కార్పొరేషన్ ఈఈ కృష్ణలాల్ వచ్చి నచ్చచెప్పారు. అలాగే, ఖమ్మంలో ఉన్న నాయకులతో ఫోన్లో మాట్లాడిన ప్రదీప్ బంధువులు వారి సూచనతో ఐదు గంటల ఆందోళన అనంతరం మృతదేహాన్ని ఖమ్మం తరలించారు. కాగా, ఆందోళన నేపథ్యాన నేలకొండపల్లి, ఖమ్మం రూరల్, ముదిగొండ పోలీస్స్టేషన్ల నుంచి సిబ్బందిని పిలిపించి ఖమ్మం రూరల్ సీఐ ఎం.శ్రీనివాస్, ముదిగొండ ఎస్సై నాగరాజు ఆధ్వర్యాన బందోబస్తు ఏర్పాటు చేశారు. తహసీల్దార్ దారా ప్రసాద్, ఎంపీడీఓ కె.జమలారెడ్డి, ఎంపీఓ సీ.హెచ్.శివ పర్యవేక్షించారు. సీపీఐ, సీపీఎం, ప్రజాపంథా, కాంగ్రెస్‌తో పాటు ప్రజాసంఘాల నాయకులు బాగం హేమంతరావు, పోటు ప్రసాద్, నున్నా నాగేశ్వరరావు, యర్రా శ్రీకాంత్, గోగినపల్లి వెంకటేశ్వరరావు, మిక్కిలినేని నరేందర్, తుమ్మా విష్ణువర్ధన్, మందా వెంకటేశ్వర్లు, జి.రామయ్య, ఎం.జయరాజ్, పొట్టపింజర నాగులు, పగిడికత్తుల నాగేశ్వరరావు, కే.వీ.రెడ్డి, కడియాల శ్రీనివాసరావు, గరిడేపల్లి రామారావు, తోళ్ల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. రోదిస్తున్న ప్రదీప్ భార్య బంధువులు విలేకరిపై రాళ్లదాడి ప్రదీప్ కుటుంబానికి న్యాయం చేయాలని బంధువులు, స్థానికులు న్యాయం చేయాలని ధర్నా చేస్తూ అధికారులు రావాలి్సందేనని పట్టుబడ్డారు. ఇంతలోనే నేలకొండపలి్లకి చెందిన ఓ పత్రిక(సాక్షి కాదు) విలేకరి.. అధికారులంతా రావడానికి చనిపోయిన వ్యక్తి ఏమైనా వీఐపీనా అంటూ హేళనగా మాట్లాడాడు. దీంతో మృతుడి కుటుంబీకులు ఆగ్రహంతో అక్కడే ఉన్న రాళ్లతో దాడికి దిగారు. దాదాపు అర కిలోమీటర్ మేర పరుగులు పెట్టిస్తూ రాళ్లు విసరగా, సహచర విలేకరులు, పోలీసులు అడ్డుకుని పంపించారు. రోదిస్తున్న నాగరాణి(కుడి) కుప్పకూలిన నాగరాణి తమ్ముడూ... రాఖీ పండగకు వచ్చాను... నీకు రాఖీ కడతాను, లేవరా అంటూ ప్రదీప్ మృతదేహం వద్ద ఆయన సోదరి రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. డీఆర్ఎఫ్ టీమ్ లీడర్ బి.ప్రదీప్(32) అక్క లింగం కనకదుర్గ నాగరాణి బోనకల్లో ఉంటుండగా, పండుగ సందర్భంగా సోదరుడికి రాఖీ కట్టేందుకు రావాలని గురువారం సాయంత్రం సిద్ధమవుతోంది. ఇంతలోనే ఆయన ఏటిలో గల్లంతైనట్లు తెలుసుకుని ఆవేదనతో వచ్చింది. గురువారం చీకటి పడడంతో గాలింపు నిలిపివేసినా తమ్ముడు వస్తాడని ఆశగా ఎదురుచూసింది. శుక్రవారం అక్కడే ఉన్న ఆమె తమ్ముడిపై ప్రేమతో ఆశగా చూస్తోంది. ఇంతలోనే ఆయన మృతదేహాన్ని స్థానికులు తీసుకురావడంతో నాగరాణి కుప్పకూలింది. నాగరాణి తన తమ్ముడు ప్రదీప్‌తో పాటు అన్నకు ఏటా రాఖీ కట్టేది. కానీ సుర్దేపల్లి చెక్‌డ్యామ్ ఆమె సంతోషంపై నీళ్లు చల్లడంతో రోదిస్తున్న తీరు అందరినీ కలిచివేసింది. పరిహారం, ఉద్యోగం డీఆర్ఎఫ్ టీం లీడర్ ప్రదీప్ మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చాక అక్కడ కూడా ధర్నా చేశారు. చివరకు ఒక్కో కార్మికుడి కుటుంబానికి రూ.7 లక్షల పరిహారం, ఇంటి స్ధలం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని అధికారులు హమీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. (చదవండి: మాయలేడీలు.. న్యూడ్ వీడియోలతో వలపు వల..) -
విషాదం: ఎంగేజ్మెంట్కు ఆహ్వానించేందుకు వచ్చి.. కొన్ని గంటలముందే..
వరంగల్/ఎంజీఎం: ఎంగేజ్మెంట్కు ఆహ్వానించేందుకు వచ్చిన ఓ యువకుడు పాత భవనం గోడ కూలడంతో మృత్యువాతపడ్డాడు. ఇదే ఘటనలో మరో వ్యక్తి సైతం ప్రాణాలు కోల్పోగా, మహిళకు తీవ్రగాయాలయ్యాయి. వరంగల్ మండిబజార్‌లో శుక్రవారం అర్ధరాత్రి ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇంతేజార్గంజ్ ఇన్స్పెక్టర్ డి.మల్లేష్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం రేబల్లె గ్రామానికి చెందిన తిప్పారపు పైడి (55), ఖమ్మం జిల్లా కేంద్రంలోని వైఎస్‌ఆర్‌నగర్‌కు చెందిన సమ్మక్క అలియాస్ సలీమా మండిబజార్‌లో నిర్మిస్తున్న భవనం వద్ద వాచ్‌మెన్‌గా చేరారు. ఈ క్రమంలో పక్కనే తడకలు ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. సలీమా కొడుకు ఫిరోజ్(24) తొర్రూరులో నివాసం ఉంటుండగా, రంగశాయిపేటకు చెందిన యువతితో పెళ్లి కుదిరింది. ఈ నెల 24న(ఆదివారం) ఎంగేజ్మెంట్ ఉండడంతో తల్లి సలీమాను ఆహ్వానించేందుకు శుక్రవారం అన్నావదినతో కలిసి కృష్ణా ఎక్స్‌ప్రెస్‌లో ఖమ్మం నుంచి వరంగల్‌కు వచ్చాడు. చదవండి👉క్లౌడ్ బరస్ట్, పోలవరం ఎత్తు టీఆర్ఎస్కు కొత్త ఆయుధాలా! ఫిరోజ్ అన్నావదిన రంగశాయిపేటలోని బంధువుల ఇంటికి వెళ్లగా, ఫిరోజ్ తన తల్లి సలీమా వద్దకు వెళ్లాడు. రాత్రి పైడి, సలీమాతోనే నిద్రించాడు. ఈ క్రమంలో పక్కనే శిథిలావస్థలో ఉన్న మూడు పోర్షన్ల పాత భవనం గోడ కూలి నిద్రిస్తున్న ముగ్గురిపై పడింది. ఈ ఘటనలో పైడి, ఫిరోజ్ అక్కడికక్కడే మృతి చెందగా, సలీమాకు తీవ్రగాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమె ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. సమాచారం అందుకున్న ఏసీపీ కలకోట గిరికుమార్, పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. బాధితురాలు సమ్మక్క అలియాస్ సలీమా ఫిర్యాదు మేరకు శిథిలభవనం యజమానులు జిజియ భాయి, గుండా సంతోష్‌కుమార్, కుస్రు ఫయిజల్లతోపాటు కొత్తగా ఇల్లు కట్టుకుంటున్న కందకట్ల రాంప్రసాద్పై కేసు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ మల్లేష్ తెలిపారు. చదవండి👉అంగట్లో జూనియర్ లైన్‌మన్ పోస్టులు రూ.5 లక్షలకు బేరం! మంత్రి, ఎమ్మెల్యేల పరామర్శ ఎంజీఎం మార్చురీలో ఉన్న పైడి, ఫిరోజ్ మృతదేహాలను మంత్రి దయాకరరావు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, వర్ధన్నపేట, వరంగల్ తూర్పు ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, నన్నపునేని నరేందర్ పరిశీలించారు. బాధిత కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ కుటుంబాలను ఆదుకుంటామని తెలిపారు. అలాగే, మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ ఘటనా స్థలాన్ని పరిశీలించిన అనంతరం ఎంజీఎంలో మృతదేహాలను సందర్శించి బాధిత కుటుంబాలను పరామర్శించారు. రూ.20లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చదవండి👉పాలేరు వరద మధ్యలో బిక్కుబిక్కుమంటూ 21 మంది కూలీలు! -
హృదయ విదారకం: ఓ వైపు వివాహ తంతు, మరో వైపు అంత్యక్రియలు
పుల్కల్(సంగారెడ్డి): మరో గంటలో కూతురు పెళ్లి. బంధువులు, కుటుంబ సభ్యులు ముస్తాబవుతున్నారు. కూతురు పెళ్లిని అంగరంగ వైభవంగా చేయాలనుకున్న ఆ నాన్న కల నెరవేరకుండానే కన్నుమూసాడు. ఫాదర్స్ డే రోజు తండ్రిని పోగొట్టుకుని ఆ కూతురు శోకసంద్రంలో మునిగిపోయింది. బంధువులు ఓవైపు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తునే నిఖా తంతు ముగించారు. ఈ హృదయ విదారకర సంఘటన సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని ముద్దాయిపేటలో ఆదివారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ముద్దాయిపేటకు చెందిన మక్బుల్ అహ్మద్(గూడు పటేల్)కూతురికి సంగారెడ్డికి చెందిన యువకుడితో పెళ్లి నిశ్చయించారు. మూడు నెలల క్రితం ఎంగేజ్మెంట్ ఘనంగా చేశారు. ఆదివారం సంగారెడ్డిలో వివాహ ఏర్పాట్లు చేశారు. బంధువులందరు పెళ్లి మండపానికి చేరుకున్నారు. మహ్మద్ మక్బుల్ అహ్మద్ అస్వస్థతకు గురవడంతో ఇంట్లోనే ఉంచారు. పెళ్లి మరో గంట ఉందనగా పెళ్లి పెద్ద మృతిచెందాడు. బంధువులు కొందరు కూతురు పెళ్లి తంతు ముగించగా,మరికొందరు తండ్రి అంత్యక్రియలు పూర్తిచేశారు. చదవండి👉🏻 మరణించి ఉంటారులే.. బతికి ఉన్న మహిళ పోస్టుమార్టానికి.. -
అయ్యో పాపం.. పరీక్ష రాస్తూ విద్యార్థి మృతి
పాతపట్నం/సారవకోట: శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియెట్ పరీక్ష రాస్తూ బూరాడ కార్తీక్ (16) అనే విద్యార్థి మృతిచెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సారవకోట మండలం ధర్మలక్ష్మిపురం పంచాయతీ దాసుపురం గ్రామానికి చెందిన కార్తీక్ పాతపట్నంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని ప్రభుత్వ బీసీ వసతి గృహంలో ఉంటూ ఓ ప్రైవేటు జూనియర్ కళాశాలలో ఇంటర్ (ఎంపీసీ) మొదటి సంవత్సరం చదువుతున్నాడు. బుధవారం ఉదయం వసతి గృహంలో అస్వస్థతకు గురై వాంతులు రావడంతో తోటి విద్యార్థులతో కలిసి హాస్టల్ వార్డెన్ బి.వైకుంఠరావు పాతపట్నం సీహెచ్‌సీకి తీసుకువచ్చారు. చికిత్స అందించాక విశ్రాంతి తీసుకోవాలని సూపరింటెండెంట్ బాలకృష్ణ విద్యార్థికి సూచించారు. అయితే పరీక్షకు సమయమవుతోందని చెప్పిన కార్తీక్ ఆస్పత్రి నుంచి నేరుగా పాతపట్నం బస్టాండ్ వద్ద ఉన్న పరీక్ష కేంద్రానికి వెళ్లాడు. పరీక్ష ప్రారంభమైన అరగంట తర్వాత స్పృహ తప్పడంతో ఇన్విజిలేటర్లు, సిబ్బంది కలిసి పాతపట్నం సీహెచ్‌సీ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే విద్యార్థి మృతి చెందినట్లు సూపరింటెండెంట్ బాలకృష్ణ తెలిపారు. మెదడుకు సంబంధించిన సమస్యతో కార్తీక్ మృతి చెంది ఉండొచ్చని చెప్పారు. తల్లిదండ్రులు బూరాడ శ్యామ్‌సుందరావు, కుమారి, తమ్ముడు దినేష్‌లు ఆస్పత్రి వద్దకు చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. ఎస్ఐ మహమ్మద్ అమీర్ ఆలీ ఆస్పత్రికి చేరుకుని వైద్యుడు బాలకృష్ణతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతదేహాన్ని అంబులెన్స్‌లో స్వగ్రామం దాసుపురం పంపించారు. స్పృహ తప్పిన మరో విద్యార్థిని పాతపట్నం కోర్టు కూడలిలో ఉన్న ఓ ప్రైవేటు జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం కెమిస్ట్రీ పరీక్ష రాస్తున్న తూలుగు ధనలక్ష్మి అనే విద్యార్థి స్పృహ తప్పిపోయింది. వెంటనే ప్రిన్సిపాల్ ఎం.ఆంజనేయులు విద్యార్థినిని సీహెచ్‌సీకి తీసుకువెళ్లి వైద్యం చేయించారు. కడుపు నొప్పి వస్తోందని వైద్యులకు చెప్పడంతో సూపరింటెండెంట్ కె.బాలకృష్ణ చికిత్స అందించారు. చికిత్స అందించిన అనంతరం విద్యార్థిని స్వగ్రామం హిరమండలంలోని ధనుపురం పంపించినట్లు వైద్యుడు తెలిపారు. -
ఇలా జరుగుతుందని అనుకోలేదు.. చాలా విషాదకరం: రష్యా
మాస్కో: ఉక్రెయిన్‌పై రష్యా మిలిటరీ ఆపరేషన్ ప్రకటించి నాలభై రోజులు దాటింది. ఈ యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌తో పాటు రష్యా కూడా భారీగానే నష్టపోయింది. ముఖ్యంగా ఇరువర్గాలు తమ సైనిక బలగాలను చాలా వరకు కోల్పోయినట్లు తెలుస్తోంది. తాజాగా దీనిపై క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ స్పందించారు. దిమిత్రీ మీడియాతో మాట్లాడుతూ.. యుద్ధం కారణంగా భారీ స్థాయిలో రష్యన్ బలగాలను కోల్పోయామని, జరిగిన ఘటన చాలా విషాదకరమని ఆయన అవేదన వ్యక్తం చేశారు. అయితే ప్రస్తుతం పరిస్థితులను చూస్తుంటే.. యుద్ధ ప్రారంభంలో ఇంత నష్టం జరుగుతుందని ఊహించనట్లు తెలిపారు. ఇక తొందర్లోనే తమ యుద్ధ లక్ష్యాలను చేరుకోనున్నట్లు ఆయన చెప్పారు. ఉక్రెయిన్‌పై యుద్ధం మొదలుపెట్టి ఆరు వారాల కాగా ఇప్పటికే 4 మిలియన్లకు పైగా ప్రజలు ఉక్రెయిన్‌ని విడిచి విదేశాలకు వలస వెళ్లారు. అంతేకాకుండా వేలాది మంది గాయపడడంతో పాటు మరణాలతో కీవ్ నగరం మారుమోగింది. దీనికి ప్రతీకాత్మక చర్యగా.. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ రష్యాను యూఎన్ మానవ హక్కుల మండలి నుంచి సస్పెండ్ చేసింది. ఆ తర్వాత రష్యా కూడా ఈ కౌన్సిల్ నుంచి వైదొలిగింది. ఉక్రెయిన్‌లో రష్యా జరుపుతున్న దాడులు కారణంగా పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. దీని కారణంగా రష్యా గత మూడు దశాబ్దాలుగా రష్యా చూడని అత్యంత క్లిష్ట ఆర్థిక పరిస్థితిని ఎదుర్కొంటుందని ప్రధాన మంత్రి మిఖాయిల్ మిషుస్టిన్ అన్నారు. యూఎస్ కాంగ్రెస్ కూడా రష్యాని దాని మోస్ట్ వాంటెడ్ కంట్రీ జాబితా నుంచి తొలగించింది. దీని మూలాన వాణిజ్య పరంగా రష్యాకు మరింత దెబ్బ తగలనుంది. చదవండి: వార్నింగ్ ఇచ్చినా హ్యాండ్ ఇచ్చిన భారత్.. పుతిన్ రెస్పాన్స్‌పై టెన్షన్! -
ఉత్సాహంగా పయనం.. గమ్యం చేరకముందే ఘోరం..
ధర్మవరం టౌన్(అనంతపురం జిల్లా) : నిశ్చితార్థ వేడుక ఘనంగా చేయాలనుకున్నారు. దగ్గరి బంధువులందరినీ పిలిచారు. ప్రైవేటు బస్సును అద్దెకు తీసుకుని సంతోషంగా బయలుదేరారు. తిరుచానూరులో కార్యక్రమం కావడంతో అందరిలోనూ ఉత్సాహం కనిపించింది. తిరిగొచ్చేటప్పుడు తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకుని రావచ్చనుకున్నారు. కానీ గమ్యం చేరకముందే ఘోరం జరిగిపోయింది. శనివారం రాత్రి చిత్తూరు జిల్లా భాకరాపేట వద్ద ఘాట్‌రోడ్డులో బస్సు లోయలోకి బోల్తా పడింది. అర్ధరాత్రి వరకు అందిన సమాచారం మేరకు ప్రమాదంలో ఆరుగురు చనిపోయారు. 49 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో పలువురు ధర్మవరం పట్టణంలోని మారుతీనగర్‌కు చెందిన వారు కాగా..మరికొందరు చెన్నేకొత్తపల్లి మండలం బసంపల్లి వాసులు. దీంతో ఆయా ప్రాంతాల్లో విషాదం నెలకొంది. చదవండి: 300 అడుగుల లోతు.. చిమ్మ చీకటి.. ప్రాణాలను ఫణంగా పెట్టి.. ఉత్సాహంగా పయనం..మధ్యలో విషాదం ధర్మవరం పట్టణంలోని మారుతీనగర్‌కు చెందిన మలిశెట్టి మురళి, లలిత దంపతులు. వీరికి కుమారుడు వేణు, కుమార్తె కోమలి సంతానం. మురళి పట్టణంలో సిల్్కహౌస్ నిర్వహిస్తున్నాడు. వేణు తండ్రికి చేదోడుగా ఉంటున్నాడు. వేణుకు పుత్తూరు సమీపంలోని నారాయణవనంకు చెందిన అమ్మాయితో నిశి్చతార్థం కుదిరింది. ఆదివారం తిరుచానూరులోని రాధాకృష్ణ కల్యాణ మండపంలో నిశ్చితార్థ వేడుకను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ధర్మవరం నుంచి శనివారం ఉదయం 11 గంటలకు కేఏ 30ఏ 4995 నంబర్ బస్సులో బయలుదేరారు. మలిశెట్టి మురళి కుటుంబంతో పాటు వారి బంధువులు, పరిచయస్తులు అదే కాలనీకి చెందిన మునుస్వామి, సరస్వతి, కాంతమ్మ (వేణు పిన్ని), సునీత, శశితో పాటు పలు ప్రాంతాలకు చెందిన 55 మంది పయనమయ్యారు. అయితే..బస్సు మార్గమధ్యంలోని భాకరాపేట ఘాట్‌రోడ్డులో 300 అడుగుల లోతున్న లోయలోకి పడిపోయింది. అతి వేగంతో పాటు ఫిట్నెస్ లేని బస్సు కావడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి, 49 మందికి తీవ్ర గాయాలయ్యాయన్న సమాచారం రావడంతో ధర్మవరంలోని బంధువులు, కాలనీ వాసులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. క్షతగాత్రుల్లో పెళ్లికుమారుడు వేణు కూడా ఉన్నాడు. మలిశెట్టి మురళి పట్టణంలో చేనేత ప్రముఖుడు కావడంతో చాలా మంది చేనేతలు నిశ్చితార్థానికి బయలుదేరి వెళ్లారు. దీంతో ఘటనలో తమ వారికి ఏమైందోనన్న ఆందోళనలో కుటుంబ సభ్యులు ఉన్నారు. విషయం తెలుసుకున్న మున్సిపల్ వైస్‌చైర్మన్ చందమూరి నారాయణరెడ్డి బాధితుల బంధువులను పరామర్శించి..ధైర్యం చెప్పారు. దిక్కుతోచడం లేదు మా అన్న కుమారుడు మలిశెట్టి వేణు నిశ్చితార్థానికి మా కుటుంబ సభ్యులంతా బయలు దేరి వెళ్లారు. కొద్దిసేపటి క్రితమే బస్సు లోయలో పడిందని టీవీలో చూశాను. ఎవరికి ఏమయ్యిందోనన్న బాధతో దిక్కుతోచడం లేదు. –మలిశెట్టి శివ, మారుతీనగర్, ధర్మవరం ఫొటోలు తీయడానికి వెళ్లి.. చెన్నేకొత్తపల్లి మండలం బసంపల్లికి చెందిన రామాంజినమ్మ, వెంకటేశులు కుమారుడు చంద్రశేఖర్ (28) ధర్మవరంలోని ఓ స్టూడియోలో ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. నిశ్చితార్థ వేడుకలో ఫొటోలు తీయడం కోసం బయలుదేరాడు. ప్రమాదంలో అతను చనిపోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అతనికింకా వివాహం కాలేదు. అక్క కుమారుడి నిశ్చితార్థం చూడాలని.. అక్క కుమారుడి నిశ్చితార్థ వేడుక చూడాలని సంతోషంగా బయలుదేరిన కాంతమ్మ (52) బస్సు ప్రమాదంలో చనిపోయింది. ఈమె వేణుకు స్వయాన పిన్ని కావడం గమనార్హం. ఈమె భర్త శివ ధర్మవరంలోనే ఉండిపోయాడు. భార్య చనిపోయిందన్న వార్త విని తీవ్ర విషాదంలో మునిగిపోయాడు. -
క్రికెట్ ఆడుకోవడానికి వెళ్లి మృత్యువాత
నిడమానూరు: ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం నిడమానూరు లో విషాదం చోటు చేసుకుంది. క్రికెట్ ఆడుకోవడానికి వెళ్లిన ముగ్గురు విద్యార్థులు ముసి ఏటిలో మునిగి మృతి చెందారు. మృతి చెందిన చిన్నారులు మహేష్, వాసు, జగన్‌లుగా గుర్తించారు. నిన్న సాయంత్రం నుండి కనిపించకపోవడంతో ఇవ్వాళ ముసి కాలువ లో గాలించగా చిన్నారుల మృతదేహాలు బయటపడ్డాయి. లాకీగా వుండే చిన్నారులు ముగ్గురు చనిపోవడం తో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
వివాహ వేడుకల్లో విషాదం: 11 మంది మృతి.. మోదీ సంతాపం
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో వివాహ వేడుకలో విషాదం చోటుచేసుకుంది. ఖుషీనగర్ జిల్లాలోని నెబువా నౌరంగియా ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో 11 మంది బావిలో పడి మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. వివాహ కార్యక్రమానికి హాజరయిన వీరంతా బావి స్లాబ్‌పై కూర్చున్నారు. ఈ క్రమంలో అధిక బరువు కారణంగా స్లాబ్ ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో స్లాబ్‌పై కూర్చున్న 13 మంది బావిలో పడిపోయారు. ఈ ప్రమాదంలో 11 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు గాయపడ్డారు. మృతుల్లో 9 మంది బాలికలు, ఇద్దరు మహిళలు ఉన్నారు. ఖుషీనగర్ ప్రమాదంలో మరణించిన వారికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రగాఢ సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. UP | 11 people died & two are seriously injured after they accidentally fell into a well. During a wedding program, some people were sitting on a slab of a well and due to heavy load the slab broke. An ex-gratia of Rs 4 lakh will be given to the kin of the deceased: DM Kushinagar pic.twitter.com/6PHeVYATp0 — ANI UP/Uttarakhand (@ANINewsUP) February 16, 2022 ప్రధాని మోదీ సంతాపం ఉత్తర ప్రదేశ్‌లోని ఖుషీనగర్లో జరిగిన ఘటనపై ప్రధాని మోదీ స్పందించారు. ఈ ఘటనను హృదయ విదారకంగా అభివర్ణించారు. మరణించిన కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవలని ప్రార్థించారు. उत्तर प्रदेश के कुशीनगर में हुआ हादसा हृदयविदारक है। इसमें जिन लोगों को अपनी जान गंवानी पड़ी है, उनके परिजनों के प्रति मैं अपनी गहरी संवेदनाएं व्यक्त करता हूं। इसके साथ ही घायलों के जल्द से जल्द स्वस्थ होने की कामना करता हूं। स्थानीय प्रशासन हर संभव मदद में जुटा है। — Narendra Modi (@narendramodi) February 17, 2022 -
కృష్ణా జిల్లా కలిదిండిలో విషాదం
-
లే.. నాన్నా.. లే! ...అందర్నీ కంటతడి పెట్టించే ఆక్రందన!
ఉరవకొండ(అనంతపురం): రెండ్రోజుల్లో వస్తానమ్మా అన్నావ్‌గా నాన్నా.. అంతలోనే ఇలా నన్ను వదిలి వెళతావా..? నీవు నాకు కావాలి.. లే నాన్నా.. లే’ అంటూ నవ వధువు ప్రశాంతి తన తండ్రి కోకా వెంకటప్ప మృతదేహాన్ని పట్టుకుని గుండెలవిసేలా రోదించడం స్థానికులను కలచివేసింది. బళ్లారిలో కుమార్తె ప్రశాంతి వివాహ వేడుక అనంతరం దగ్గరి బంధువులతో కలిసి బీజేపీ నేత కోకా వెంకటప్పనాయుడు ఇన్నోవా వాహనంలో ఆదివారం సాయంత్రం నింబగల్లుకు వస్తుండగా బూదగవి వద్ద లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది దుర్మరణం చెందిన విషయం విదితమే. వెంకటప్ప మృతదేహాన్ని స్వగ్రామం నింబగల్లుకు సోమవారం తీసుకొచ్చారు. తండ్రిని కడసారి చూసేందుకు కర్ణాటక రాష్ట్రం దావణగెరె నుంచి నవ వధువు ప్రశాంతి, కుమారుడు సతీష్ స్వగ్రామానికి వచ్చారు. మృతదేహం వద్ద ప్రశాంతిని పట్టుకుని తల్లి దాక్షాయణి ‘నీకు ఇక నాన్న లేడమ్మా’ అంటూ రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. ఎవరి కోసం బతకాలి... ప్రమాదంలో మృతి చెందిన లత్తవరం గ్రామానికి చెందిన స్వాతి భర్త శ్రీధర్ రోదన వర్ణనాతీతంగా మారింది. బళ్లారిలో వివాహ వేడుకలు ముగించుకుని శ్రీధర్ తన భార్య స్వాతి, ఇద్దరు కవలలు జాహ్నవి, జశ్వంత్‌తో ఇన్నోవా వాహనం ఎక్కారు. అయితే స్వాతి తమ్ముడు అశోక్ వచ్చి ‘బావా నేను చాలా అలసిపోయాను. నీవు బైక్‌లో ఉరవకొండకు రా. నేను, అక్క, పిల్లలు ఇన్నోవాలో వెళతాం’ అని శ్రీధర్‌ను కోరాడు. ప్రమాదంలో వారంతా చనిపోవడంతో ‘నాకు ప్రాణ భిక్ష పెట్టి.. మీరంతా కానరాని లోకాలకు వెళ్లిపోతిరా’ అంటూ శ్రీధర్ విలపించాడు. కవలల మృతితో పాఠశాలకు సెలవు ఉరవకొండలోని ఎడిసన్ పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న కవలలు జాహ్నవి, జశ్వంత్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో సోమవారం పాఠశాలకు సెలవు ఇచ్చారు. మృత్యువులోనూ వీడని అక్కాచెల్లెళ్ల బంధం బూదగవి రోడ్డు ప్రమాదం బ్రహ్మసముద్రం మండలం రాయలప్పదొడ్డి, పిల్లలపల్లి గ్రామాల్లో విషాదం నింపింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఈ ప్రమాదంలో మృతి చెందారు. రాయలప్పదొడ్డికి చెందిన కవలకుంట్ల లచ్చన్న, ఈరమ్మ దంపతులకు నలుగురు కుమార్తెలు సరస్వతి, శివమ్మ, సుభద్రమ్మ, దాక్షాయణి, కుమారుడు బసవరాజు ఉన్నారు. బసవరాజు రెండు నెలల క్రితం గుండెపోటుతో మరణించాడు. అక్కాచెల్లెళ్లు సరస్వతి, శివమ్మ, సుభద్రమ్మలు కోకా వెంకటప్ప కుమార్తె ప్రశాంతి వివాహానికని బళ్లారికి వెళ్లారు. ఆదివారం వేడుక ముగియగానే తిరిగింపుల ఏర్పాట్ల కోసం బంధువులతో కలిసి ఇన్నోవా వాహనంలో నింబగల్లుకు వస్తుండగా బూదగవి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. తొమ్మిది మంది మరణించారు. మృతుల్లో సరస్వతి, శివమ్మ, సుభద్రమ్మ ఉన్నారు. కడచూపునకు నోచని కుమారుడు సుభద్రమ్మ, తిమ్మప్ప దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. వీరిది బ్రహ్మసముద్రం మండలం రాయలప్పదొడ్డి గ్రామం. కుటుంబ పెద్ద సుభద్రమ్మ భర్త తిమ్మప్ప ఏడాది క్రితం కోవిడ్‌తో మృతిచెందాడు. పెద్ద కుమార్తె భారతికి వివాహమైంది. చిన్న కుమార్తె సునీత తల్లితో కలిసి ఉంటోంది. కుమారుడు సతీష్ జర్మనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా స్థిరపడ్డాడు. తల్లి, పెద్దమ్మలు మృతి చెందారన్న విషయం తెలుసుకున్న సతీష్ వెంటనే భారత్‌కు వచ్చేందుకు బయల్దేరాడు. అయితే జర్మనీ అయితే జర్మనీ ఎయిర్‌పోర్టులో కోవిడ్ పరీక్షలు నిర్వహించగా సతీష్‌కు పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో అక్కడే నిలిచిపోయాడు. కన్నీటి వీడ్కోలు బూదగవి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తొమ్మిది మందికి ఆదివారం అర్ధరాత్రి ఉరవకొండ ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యాధికారులు డాక్టర్ ఎర్రిస్వామిరెడ్డి, డాక్టర్ గంగాధర్, డాక్టర్ ఆశా, గుంతకల్లుకు చెందిన డాక్టర్ రామాంజనేయులు, డాక్టర్ అబుబకర్ పోస్టుమార్టం నిర్వహించారు. సోమవారం ఉదయానికల్లా నింబగల్లుకు చెందిన బీజేపీ నేత కోకా వెంకటప్ప (58), బొమ్మనహాళ్‌కు చెందిన సరస్వతి (60), ఆమె కుమారుడు అశోక్ (35), లత్తవరానికి చెందిన స్వాతి(38), ఆమె కవల పిల్లలు జాహ్నవి, జశ్వంత్ (12), కణేకల్లు మండలం హనుమాపురానికి చెందిన రాధమ్మ (48), బ్రహ్మసముద్రం మండలం పిల్లలదొడ్డికి చెందిన శివమ్మ (35), రాయలప్పదొడ్డికి చెందిన సుభ్రదమ్మ (58) మృతదేహాలు స్వగ్రామాలకు చేరాయి. పెళ్లికని వెళ్లి విగతజీవులుగా వచ్చిన వారిని చూసి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, గ్రామస్తులు కన్నీరుపెట్టారు. అదే రోజు అంత్యక్రియలు పూర్తి చేశారు. -
పెళ్లి జరిగిందన్న ఆనందం నిలువక మునుపే ఆ ఇంట మృత్యుఘోష
అల్లారుముద్దుగా పెంచిన ఏకైక కుమార్తె పెళ్లిని అంగరంగ వైభవంగా జరిపించాడు. గొప్ప సంబంధమే దొరికిందని మురిసిపోయాడు. ఇక కుమార్తె జీవితం బంగారు మయమేనంటూ బంధువులతో చెప్పుకొని సంతోషంగా గడిపాడు. పెళ్లి తంతు ముగిశాక దగ్గరి బంధువులతో కలిసి సంతోషంగా స్వగ్రామానికి బయలుదేరారు. అయితే, ఆ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. వాహనంలో పెళ్లి కబుర్లు చెప్పుకుంటూ వెళ్తూ మరో అరగంటలో ఇంటికి చేరుకుంటామనే లోపు మృత్యువు లారీ రూపంలో దూసుకొచ్చింది. కళ్లు తెరిచేలోపే అయిన వారందరినీ కబళించేసింది. తీవ్ర గాయాలపాలైన ఆయన కూడా ఆస్పత్రిలో తుది శ్వాస వదిలాడు. ఉరవకొండ: మండలంలోని నింబగల్లు గ్రామానికి చెందిన బీజేపీ నేత కోకా వెంకటప్ప నాయుడు (58) ఏకైక కుమార్తె ప్రశాంతి. ఒక్కగానొక్క బిడ్డ కావడంతో ఈమెను అల్లారుముద్దుగా పెంచాడు. ఆదివారం ఉదయం బళ్లారిలోని అల్లంభవన్ ఫంక్షన్ హాలులో ఎంతో వైభవంగా ప్రశాంతి వివాహం జరిపించాడు. పెళ్లి తంతు ముగిసిన తర్వాత వెంకటప్ప నాయుడు, ఆయన దగ్గరి బంధువులు ఎనిమిది మంది ఇన్నోవా వాహనంలో నింబగల్లుకు బయలుదేరారు. వీరి వాహనం బూదగవి వద్ద వస్తుండగా.. అనంతపురం నుంచి బళ్లారి వైపు వెళుతున్న 16 చక్రాల ఐరన్‌ఓర్ లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఇన్నోవా ముందు భాగం నుజ్జునుజ్జు అయ్యింది. డ్రైవింగ్ సీటులోని వెంకటప్ప నాయుడు తీవ్రంగా గాయపడ్డాడు. కొన ఊపిరితో ఉన్న ఆయన్ను ఉరవకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించగా కొద్ది నిమిషాల్లోనే ప్రాణాలొదిలాడు. మిగిలిన ఎనిమిది మంది తీవ్రగాయాలతో వాహనంలోనే మృతి చెందారు. మరో అరగంటలో ఇంటికి చేరాల్సి ఉండగా.. ఘటనా స్థలం నుంచి నింబగల్లుకు కొద్ది దూరమే. మరో అరగంటలో వీరు గ్రామం చేరేవారు. అయితే, ఊహించని విధంగా దూసుకొచ్చిన మృత్యువు అందరినీ కబళించేసింది. మృతులంతా దగ్గరి బంధువులే. పైగా ఒకే సామాజిక వర్గానికి చెందినవారు. వీరి మరణవార్త తెలియడంతో నింబగల్లు గ్రామం శోకసంద్రంలో మునిగిపోయింది. వెంకటప్ప నాయుడి ఇంటి వద్దకు గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వెంకటప్ప నాయుడు బీజేపీ సీనియర్ నేత కూడా కావడంతో విషయం తెలుసుకున్న పలు పార్టీల నాయకులు హుటాహుటిన గ్రామానికి చేరుకున్నారు. నిన్నటి వరకూ సందడిగా ఉన్న ఇంటి పరిసరాల్లో ఒక్కసారిగా నిశ్శబ్ద వాతావరణం అలుముకుంది. మృతులతో తమ అనుబంధాన్ని తలచుకుని పలువురు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎంత పనిచేశావు దేవుడా అంటూ బంధువులు విలపించిన తీరు పలువురిని కలచివేసింది. ఇదే ప్రమాదంలో బొమ్మనహాళ్‌కు చెందిన సరస్వతి, ఆమె కుమారుడు అశోక్, కుమార్తె స్వాతి, మనవడు జశ్వంత్, మనవరాలు జాహ్నవి చనిపోవడంతో బొమ్మనహాళ్‌లోని సరస్వతి ఇంటి వద్ద విషాదఛాయలు అలుముకున్నాయి. అలాగే రాధమ్మ మృతితో కణేకల్లు మండలం హనుమాపురం, శివమ్మ, సుభద్రమ్మ మృతితో బ్రహ్మసముద్రం మండలం పిల్లలపల్లి, రాయలప్ప దొడ్డి శోకసంద్రంగా మారాయి. ఆస్పత్రిలో మిన్నంటిన ఆర్తనాదాలు.. మృతదేహాలను ఘటనాస్థలం నుంచి పోస్టుమార్టం నిమిత్తం ఉరవకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సాయంత్రం వరకూ తమ కళ్లెదుటే ఎంతో సంతోషంగా కనిపించిన వారు.. ఒక్కసారిగా విగతజీవులుగా పడి ఉండడం చూసి బంధువులు దుఃఖసాగరంలో మునిగిపోయారు. ఆస్పత్రి ప్రాంగణంలో వారి ఆర్తనాదాలు మిన్నంటాయి. విదేశాల నుంచి కూడా కొంత మంది బంధువులు పెళ్లి వేడుకకు వచ్చారు. ఈ ఘోరాన్ని చూసేందుకే తమను రప్పించావా దేవుడా అంటూ వారు విలపించారు. -
కాటేసిన కల్తీ మద్యం.. ఏడుగురు మృతి
లక్నో: యూపీలో దారుణం చోటుచేసుకుంది. స్థానికంగా జరిగిన ఒక కార్యక్రమంలో మద్యం తాగిన వారిలో ఏడుగురు మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా కలకలంగా మారింది. పోలీసులు తెలిపిన వివరాలు.. రాయ్బేరేలీలోని పహర్ పూర్ గ్రామంలో కొంత మంది గ్రామస్తులు మంగళవారం (జనవరి25)న మద్యం తాగారు. వీరంతా స్థానికంగా జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో వీరికోసం ఒక మద్యం దుకాణం నుంచి తెప్పించిన బీరును తాగారు. ఆ తర్వాత.. వీరంతా అర్థరాత్రి వీరంతా అస్వస్థతకు లోనయ్యారు. వీరికి వాంతులు, విరేచనాలు కావడంతో వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అస్వస్థతకు గురైన వారిలో ఎక్కువగా పహన్పూర్ గ్రామానికి చెందిన వారున్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే సదరు గ్రామానికి చేరుకున్నారు. బాధితుల పరిస్థితిపై ఆరాతీస్తున్నారు. మద్యం దుకాణంనుంచి సాంపుల్స్ సేకరించి పరీక్షల కోసం పంపారు. కాగా, బాధితులు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మద్యంషాపు యజమానిపై పోలీసులు కేసును నమోదు చేశారు. ఈ ఘటనపై జిల్లా మేజిస్ట్రేట్ శ్రీవాత్సవ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. బుధవారం లక్నో కమిషనర్ రంజన్ కుమార్ సదరు గ్రామానికి చేరుకున్నారు. మద్యం తాగిన ఘటనలో.. ఏడుగురు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు గుర్తించారు. మరికొందరికి అత్యవసర విభాగంలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. మృతి చెందిన వారిలో.. సుఖ్రాణి(65), రామ్‌సుమేర్(50), సరోజ్(40), బన్సీ(55) వారు ఉన్నట్లు గుర్తించారు. మరికొందరిని గుర్తించాల్సి ఉందని అధికారులు తెలిపారు. వీరంతా కల్తీ మద్యం తాగి మృతి చెంది ఉంటారని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చదవండి: రిపబ్లిక్ డే రోజు జాతీయ జెండాకు ఘోర అవమానం.. -
భర్త ఇంటి ముందు 40 రోజుల పోరాటం విషాదాంతం
సాక్షి, హుజూరాబాద్(కరీంనగర్): కట్టుకున్నవాడు కాపురానికి తీసుకెళ్లడం లేదని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వివాహిత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది. పోలీసులు, మృతురాలి సోదరుడు తెలిపిన వివరాల ప్రకారం.. హుజూరాబాద్ పట్టణానికి చెందిన నరహరి సుజిత్‌రెడ్డి కడప జిల్లాకు చెందిన సుహాసిని రెడ్డి (32)కి 2011లో ఆన్లైన్లో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. పెళ్లి ప్రస్తావన రాగానే పలుమార్లు సుజిత్ దూరం పెట్టడంతో సుహాసిని ఒత్తిడి తెచ్చింది. దీంతో 2020 నవంబర్‌లో హైదరాబాద్‌లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. పెళ్లి తర్వాత సిటీలో కొంతకాలం కాపురం చేశాడు. తల్లిదండ్రులను ఒప్పించి తీసుకెళ్తానని ఊరికెళ్లాడు. ఆ తర్వాత ఎంతకూ తాను రాకపోవడంతో సుహాసిని హుజూరాబాద్ వెళ్లి భర్త ఇంటి ముందు 40 రోజులు ఒంటరి పోరాటం చేసింది. అయినా భర్త, అత్తమామల మనసు కరగలేదు. మరోవైపు సుజిత్ మరో యువతిని వివాహం చేసుకున్నాడని తెలిసి మనస్తాపం చెంది బుధవారం భర్త ఇంటి ఎదుట గడ్డి మందుతాగి ఆత్మహత్యాయత్నం చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఆమెను హుజూరాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స చేయించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వరంగల్ ఎంజీఎంకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం తుది శ్వాస విడిచింది. సుజిత్ మరో మహిళను పెళ్లి చేసుకున్నాడని, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్లో సుహాసిని పేర్కొంది. తన చావుకు కారణమైన వాళ్లను కఠినంగా శిక్షించి తన అవయవాలను దానం చేయాలని చెప్పింది. మృతురాలు సోదరుడు శివారెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
అప్పుల బాధలు: గతంలో భర్త, చిన్నకుమారుడు, అల్లుడు.. ఇప్పుడేమో
సాక్షి, పాల్వంచ(ఖమ్మం): అప్పుల బాధ తాళలేక, ఆస్తి పంపకాల్లో అన్యాయం జరిగిందనే మనస్తాపంతో పాత పాల్వంచకు చెందిన మండిగ నాగరామకృష్ణ తన భార్య శ్రీలక్ష్మి, కుమార్తెలు సాహిత్య, సాహితిపై పెట్రోల్ పోసి నిప్పటించిన విషయం విదితమే. సోమవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో రామకృష్ణ, ఆయన భార్య ఓ కుమార్తె మృతి చెందగా, మరో కుమార్తె సాహితి కొత్తగూడెం ఏరియా ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య చికిత్స పొందుతోంది. అయితే, రామకృష్ణ తన కుటుంబీకులపై పెట్రోల్ పోసి నిప్పంటించిన సమయంలో మరో గదిలో నిద్రిస్తున్న ఆయన తల్లి సూర్యావతి మంటల్లో కాలిపోతున్న కొడుకు, కోడలు, మనవరాళ్ల పరిస్థితిని కళ్లారా చూసింది. అయినా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోవడంతో వారు మంటల్లో మాడిపోయారు. ఈ దృశ్యాలు కళ్ల ముందే కదలాడుతుండగా సూర్యావతి గుండెలవిసేలా రోదిస్తోంది. ఈ సందర్భంగా మంగళవారం ఆమెను పలకరించగా..కన్నీరుమున్నీరుగా విలపిస్తూ తమ కుటుంబ స్థితిని వెల్లడించింది. గతంలో రెండు మరణాలు.. సూర్యావతి భర్త చిట్టెబ్బాయ్ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లోని మోతుగూడెంలో వైద్య, ఆరోగ్య శాఖలో సూపరింటెండెంట్‌గా విధులు నిర్వర్తించేవారు. 1992లో ఆయన ప్రయాణిస్తున్న జీప్‌లో తహసీల్దార్ ఎక్కగా.. తహసీల్దార్ లక్ష్యంగా మావోలు పేల్చిన మందుపాతరలో చిట్టెబ్బాయ్ కూడా మృతి చెందారు. ప్రస్తుతం కుమారుడు, కోడలు మాదిరిగానే మాంసం ముద్దగా ఇంటికి మృతదేహం వచ్చిందని సూర్యావతి బోరున విలపించింది. అంతేగాక చిన్న కారణంతో క్షణికావేశానికి లోనైన చిన్న కుమారుడు సురేష్ 1999లో ఇంట్లోనే ఉరి వేసుకుని చనిపోయాడని గుర్తు చేసుకుంది. ఇక మిగిలిన కొడుకు నాగ రామకృష్ణ, కోడలు, పిల్లలను అపురూపంగా చూసుకుంటున్నట్లు తెలిపింది. అయితే, వ్యాపారాల్లో నష్టపోవడమే కాక ఇష్టమొచ్చిన చోట అప్పులు చేసినా విషయం తనకు ఏనాడూ చెప్పలేదని వాపోయింది. తీరా రూ.30లక్షలు ఇవ్వాలని, లేదంటే ఇళ్లు అమ్మాలని అడుగుతుండడమే కాక నెలనెలా రూ.వేలల్లో డబ్బు ఇవ్వాలని గొడవ చేసేవాడని తెలిపింది. ఆస్తి పంపకాల్లోనూ తాను అన్యాయం చేయలేదని, డబ్బు వృథా చేయొద్దని మాత్రమే చెప్పానని వెల్లడించింది. హైదరాబాద్‌లో ఉన్న ఇంటి స్థలాన్ని కూడా అతడికే ఇవ్వగా, రెండు, మూడు రోజుల్లో అన్నీ సవ్యంగా జరుగుతాయని ఆశిస్తున్న నేపథ్యంలో ఎవరో చెప్పిన మాటలు నమ్మి తనతో పాటు సోదరిపై కక్ష పెట్టుకుని అన్యాయంగా కుటుంబాన్ని పొట్టన పెట్టుకున్నాడని రోదిస్తోంది. ఇప్పుడు తనకు దిక్కెవరని ఆమె విలపిస్తున్న తీరు అందరినీ కంట తడి పెట్టించింది. కాగా, సూర్యావతి కూతురు భర్త సైతం కరోనాతో మృతి చెందడం గమనార్హం. చావుబతుకుల మధ్యే సాహితి మంటల్లో కాలిపోయి రామకృష్ణ, ఆయన భార్య, ఓ కుమార్తె మృతి చెందగా.. మరో కుమార్తె సాహితి మాత్రం ప్రాణాపాయ స్థితిలో బయటపడింది. ఘటన జరిగిన సమయంలో ఆమె ఇంట్లో నుండి బయటకు పరుగెత్తుకొచ్చింది. తనను ఎవరైనా కాపాడుతారని, ఆస్పత్రికి తీసుకెళ్తారని ఆశగా ఎదురుచూసింది. అయితే, చుట్టుపక్కల వారు, ఫైర్ ఇంజన్, పోలీసులు, అంబులెన్స్ వచ్చే సరికి గంటకు పైగా సమయం పట్టడం, ఆమెపై సకాలంలో నీళ్లు పోసి కాపాడకపోవడంతో ఒళ్లంతా కాలిపోయి చావుబతుకుల మధ్యే కొత్తగూడెం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. అయితే, 90శాతానికి పైగా సాహితి శరీరం కాలిపోవడంతో ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ముగిసిన అంత్యక్రియలు నాగ రామకృష్ణ, ఆయన భార్య, ఓ కుమార్తె మృతదేహాలు మంటలో మాడిపోయాయి. ఈ మేరకు పాల్వంచ ప్రభుత్వ ఆస్పత్రిలో మంగళవారం సాయంత్రానికి పోస్టుమార్టం పూర్తి చేశారు. అనంతరం పాత పాల్వంచ హిందూ శ్మశాన వాటికలో ముగ్గురి అంత్యక్రియలను నాగరామకృష్ణ భార్య శ్రీలక్ష్మి సోదరుడు జనార్దన్ పూర్తిచేశారు. -
కరోనాలో సేవా కార్యక్రమాలు.. ట్రాన్స్‌జెండర్ అనుమానాస్పద మృతి
సాక్షి, మంచిర్యాల(ఆదిలాబాద్): జిల్లా కేంద్రంలోని గోపాలవాడ శివారు రైల్వే ఏ క్యాబిన్ సమీపంలో నివాసం ఉంటున్న ట్రాన్స్‌జెండర్ బెజ్జం వెంకటేశ్ అలియాస్ శిరీష (24) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మంగళవారం స్థానికులు అందించిన సమాచారం మేరకు ఎస్సై కిరణ్‌కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. స్థానికులు, ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా కేంద్రంలోని శ్రీనివాస్‌నగర్‌కు చెందిన బెజ్జం చంద్రయ్య, సత్యవతి దంపతుల నాలుగో కుమారుడు వెంకటేశ్ ఐదేళ్ల క్రితం ట్రాన్స్‌జెండర్‌గా మారి మంచిర్యాలకు చేరుకున్నాడు. శిరీషగా పేరు మార్చుకున్న అనంతరం సామాజిక సేవల్లో పాల్గొంది. ఈ క్రమంలో ఇక్కడే ఇంటిని నిర్మించుకుంది. జనవరి 1 తర్వాత కనిపించకపోవడం, ఇంటి నుంచి వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని తలుపులు తీసి చూడగా బెడ్‌పై కుళ్లిన స్థితిలో శిరీష మృతదేహం ఉంది. దుర్గంధం వస్తుండటంతో నాలుగురోజుల క్రితమే మృతి చెంది ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. బంధువులకు సమాచారం అందించి, మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి స్నేహితురాలు పింకి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వెల్లడించారు. పలు అనుమానాలు.. శనివారం రాత్రి వరకు చుట్టపక్కల వారితో చలాకీగా మాట్లాడిన శిరీష ఆ తర్వాత కనిపించలేదని స్థానికులు పేర్కొంటున్నారు. మంగళవారం శిరీష ఉంటున్న ఇంట్లో నుంచి వాసన రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఇంట్లో బెడ్‌పై కూర్చోని, వెనుక వైపునకు వాలిపోయి ఉన్న స్థితిలో మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ముందు అన్నం ప్లేట్ ఉండటంతో అన్నంలో విషం కలుపుకుని ఆత్మహత్యకు పాల్పడిందా..? లేక ఎవరైనా మద్యం మత్తులో హత్య చేసి ఉంటారా..? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. సేవా కార్యక్రమాల్లో శిరీష.. అందరిలా కాకుండా శిరీష సొంతంగా వివాహది కార్యక్రమాలకు, డ్యాన్స్ ప్రోగ్రాంలకు, క్యాటరింగ్ పనులు చేసేందుకు వెళ్లేది. 2020లో కరోనా బారిన పడిన వారికి, నిరుపేదలకు బియ్యం, కూరగాయలు, నిత్యావసరాలు పంపిణీ చేసింది. -
పెళ్లయిన 21 రోజులకే మృత్యు ఒడిలోకి..
సాక్షి, జన్నారం(ఆదిలాబాద్): పెళ్లి సంబురం తీరకముందే రోడ్డు ప్రమాదం రూపంలో యువకుడిని మృత్యువు కబళించింది. ద్విచక్ర వాహనం అతివేగంగా నడపడంతో అదుపుతప్పి దుర్మరణం చెందాడు. ఈ సంఘటన మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో చోటు చేసుకుంది. నూతన సంవత్సరం వేళ ఆ కుటుంబంలో విషాదం మిగిల్చింది. ఎస్సై మధుసూదన్‌రావు, మృతుడి తండ్రి మురిమడుగుల రాజన్న తెలిపిన వివరాల ప్రకారం.. జన్నారం మండలం పొనకల్ సాయిబాబ టెంపుల్ కాలనీలో నివాసం ఉంటున్న రాజన్నకు ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. పెద్ద కుమారుడు మురిమడుగుల నరేశ్(23)కు గత డిసెంబర్ 10న వివాహం జరిగింది. నూతన సంవత్సరం పురస్కరించుకుని శుక్రవారం స్నేహితులతో కలిసి సరదాగా గడిపాడు. ఈ క్రమంలో లింగయ్యపల్లి గ్రామంలో ఉంటున్న స్నేహితుడి ఇంటికి పిలవడంతో రాత్రి 9గంటల ప్రాంతంలో మరో స్నేహితుడు గుడ్ల శ్రావణ్‌కుమార్‌తో కలిసి తన ద్విచక్ర వాహనంపై వెళ్లాడు. అతివేగం కారణంగా ధర్మారం రోడ్డు వైశ్య భవన్ సమీపంలో మూలమలుపు వద్ద మోటార్‌సైకిల్ అదుపు తప్పి చెట్టును ఢీకొని పొలాల్లో పడిపోయారు. తీవ్ర గాయాలైన వారిద్దరిని 108లో తరలిస్తుండగా నరేశ్ మృతిచెందాడు. శ్రావణ్‌కుమార్‌ను మంచిర్యాల ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. పెళ్లి సంబురం తీరకముందే.. నరేశ్‌కు డిసెంబర్ 10న వివాహం జరిగింది. ఆ సంబరం ఇంట్లో ఇంకా పూర్తి కాలేదు. చుట్టాల రాకపోకలు సాగుతున్నాయి. ఇంకా సంబరం తీరకముందే ఆ ఇంట్లో విషాదం నెలకొంది. తన భర్త విగతా జీవిగా పండి ఉండడాన్ని చూసి నవ వధువు రోదించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. చదవండి: కారులో చిన్నారి.. అద్దాలు పగులకొట్టిన పోలీసు.. ట్విస్ట్ ఏంటంటే -
అయ్యో.. ఎంత ఘోరం.. బారసాల మురిపెం తీరకముందే..
సాక్షి, ఎల్లారెడ్డిపేట(కరీంనగర్): బారసాల చేసి నోటి నిండా బిడ్డను పిలుచుకోకుండానే ఆ దేవుడు ఆ దంపతులకు తీరని వేదనను మిగిల్చాడు. నవమాసాలు మోసి బిడ్డకు జన్మనిచ్చినా ఆ తల్లి మురిపెంగా 21వ రోజు(నామకరణం) చేసిన మరుసటి రోజే మృత్యువు ఆ పసికందును కబళించడం అందరినీ కలచివేసింది. కనుపాప కళ్లముందే తుదిశ్వాస విడవడంతో ఆ కన్నతల్లి గుండెలు అవిసేలా రోదించడం అందరినీ కలచి వేసింది. రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లెకు చెందిన చెరుకు మానస–భాస్కర్ దంపతులకు ఇద్దరు కూతుర్లు. పెద్ద కూతురు గౌతమి(3) ఉండగా, 22రోజుల క్రితం మరో ఆడబిడ్డకు మానస జన్మనిచ్చింది. నామకరణం జరిపిన మరుసటిరోజు మరోసారి వైద్య చికిత్సకోసం మానస ఇద్దరు కూతుర్లు, అత్త ఎల్లవ్వతో కలిసి ఓ ఆటోలో బుధవారం సిరిసిల్ల వెళ్తుండగా పెద్దూరు శివారులో టాటా పికప్, ఆటో ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ సంఘటనలో పసికందు ఆటోలో ఉన్న తల్లి ఒడి నుంచి జారి కింద పడింది. ఈ ప్రమాదంలో తలకు బలమైన గాయం కావడంతో సిరిసిల్లకు తరలించేలోపే మరణించింది. మానసతో పాటు ఎల్లవ్వ, గౌతమిలు గాయాలపాలయ్యారు. ఈ సంఘటన రాగట్లపల్లెలో విషాదం నింపింది. బిడ్డ కోసం రూ.2లక్షల ఖర్చు.. ప్రమాదంలో మరణించిన పసికందును కడుపులో ఉండగా అనారోగ్యంతో ఉన్న బిడ్డను బతికించుకోవడానికి తల్లిదండ్రులు అప్పులు చేసి ఆస్పత్రుల్లో రూ.2లక్షల వరకు ఖర్చు చేశారు. ఉమ్మినీరు తక్కువగా ఉండడం, పాప ఎదుగుదల సరిగా లేని కారణంగా వైద్యుల సూచనల మేరకు బిడ్డను దక్కించుకోవడానికి దొరికిన కాడల్లా అప్పులు చేసి ఆరోగ్యంగా బిడ్డకు జన్మనిచ్చారు. బిడ్డ పుట్టిన మురిపెం మూడునాళ్లు నిలవకముందే రోడ్డు ప్రమాదం ఆ పసికందును దంపతులకు దూరం చేసి కడపుకోతను మిగిల్చింది. విగత జీవిగా మారిన బిడ్డను చూసి ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. చదవండి: వివాహితకు మరో వ్యక్తితో పరిచయం.. ఏడాదిగా సహజీవనం -
హైదరాబాద్: 15 మందిని బలిగొన్న భోలక్‌పూర్ విషాద ఘటన.. 12 ఏళ్లకు..
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలో పెను సంచలనం సృష్టించిన, జలకాలుష్యానికి సంబంధించిన భోలక్‌పూర్ ట్రాజడీ కేసులో నిందితులపై ఎట్టకేలకు అభియోగపత్రాలు దాఖలయ్యాయి. ఈ విషాదానికి బాధ్యులుగా గుర్తించిన జల మండలి అధికారులు, సిబ్బందిని నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) పోలీసులు పదిన్నరేళ్ళ క్రితం అరెస్టు చేశారు. వీరిపై కోర్టులో అభియోగపత్రాలు దాఖలు చేయడానికి ప్రభుత్వం నుంచి ప్రాసిక్యూషన్ అనుమతి అవసరం కావడంతో ఆ మేరకు లేఖ రాశారు. ఈ ఫైల్‌కు ఇటీవల మోక్షం లభించడంతో దాదాపు పన్నెండున్నర ఏళ్ల తర్వాత ముగ్గురిపై చార్జ్‌షీట్ దాఖలైంది. ఈ కాలంలో నిందితులు పదవీ విరమణ చేసేశారు. నాటి విషాదంలో 15 మంది మృతి చెందగా, మరో 250 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. జలమండలి నిర్లక్ష్యం కారణంగా 2009 మే 5న భోలక్‌పూర్ ట్రాజడీ చోటు చేసుకుంది. ఆ ప్రాంతంలో సరఫరా అయిన నీటిలో వీ–కలరా అనే వైరస్ ఉండటంతో పరిస్థితి చేయిదాటింది. నాటి మే నెల్లో ఉన్న మండే ఎండల కారణంగా వేడి తోడవడం వల్లే వీ–కలరా విజృంభించి 15 ప్రాణాలు బలిగొంది. భోలక్‌పూర్ ప్రాంతంలో తాగునీటి, మురుగునీటి (సీవరేజ్ లైన్) పైపు లైన్లు పక్కపక్కనే ఉండేవి. ప్రధాన తాగునీటి పైను నుంచి అక్కడున్న ఇళ్లకు కనెక్షన్లు ఇచ్చారు. ఇలా ఇచ్చిన వాటిలో కొన్ని మురుగునీటి పైపు కింది నుంచి ఉన్నాయి. ఇలా కింద ఉన్నవే ప్రమాద హేతువులుగా మారాయి. భోలక్‌పూర్ ప్రాంతంలో ఉన్న తోళ్ల మండిల వల్ల వీటితో పాటు రక్తం, ఉప్పు, తోలు వ్యర్థాలు, వెంట్రుకలు, జంతు పేగులు సైతం ఈ డ్రైనేజ్ పైప్‌లైన్‌లో ప్రవహించాయి. వీటిలో ఉండే ఉప్పు వలన సీవరేజ్ పైపు లైన్లు దెబ్బతిన్నాయి. దానికి రంధ్రాలు ఏర్పడి దాని కింద ఉన్న మంచినీటి కనెక్షన్ పైపుల మీద ఉప్పు, ఇతర వ్యర్థాలు పడ్డాయి. ఈ ఉప్పు ప్రభావంతో మంచినీటి కనెక్షన్ పైపుకీ రంధ్రాలు పడి అందులోకి ఈ వ్యర్థాలు కలిశాయి. భోలక్‌పూర్ డివిజన్లోని భోలక్‌పూర్, ఇందిరానగర్, సిద్ధిఖ్‌నగర్, గుల్షన్ నగర్, బంగ్లాదేశ్ బస్తీల్లో కుళాయి ద్వారా వచ్చిన ఈ నీటిని స్థానికులు తాగడంతోనే పెను విషాదం చోటు చేసుకుంది. ఈ ఉదంతంపై ముషీరాబాద్‌లో నమోదైన కేసు సీసీఎస్‌కు బదిలీ అయింది. అధికారుల అజాగ్రత్త వల్లే ఈ ఉదంతం చోటు చేసుకున్నట్లు తేలండంతో కేసును రీ–రిజిస్టర్ చేశారు. ఈ దుర్ఘటన చోటు చేసుకోడంలో ప్రభుత్వ విభాగాల బాధ్యత అనేది దర్యాప్తు చేశారు. జలమండలి అధికారుల పాత్రపై ఆధారాలు లభించడంతో నాటి చీఫ్ జనరల్ మేనేజర్, జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, బోట్స్ క్లబ్ సెక్టార్ ఏరియా ఇన్చార్జ్, భోలక్‌పూర్ లైన్మ్యాన్లను అరెస్టు చేసినప్పటికీ సొంత పూచీకత్తుపై విడిచిపెట్టారు. దర్యాప్తు పూర్తి చేసినప్పటికీ న్యాయస్థానంలో అభియోగపత్రాలు దాఖలు చేయడానికి ప్రభుత్వ అనుమతి (ప్రాసిక్యూషన్ పర్మిషన్) తప్పనిసరైంది. ఏదైనా కేసులో ప్రభుత్వ ఉద్యోగులపై చార్జ్‌షీట్ దాఖలు చేయాలంటే ప్రభుత్వం అనుమతి తప్పనిసరి. భోలక్‌పూర్ ట్రాజడీ కేసులోనూ ప్రాసిక్యూషన్ పర్మిషన్ కోరుతూ దాదాపు పదేళ్ళ క్రితం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అప్పటి నుంచి ఈ ఫైల్ పెండింగ్‌లోనే ఉండిపోయినా... నెల రోజుల క్రితం అనుమతి వచ్చింది. దీంతో నిందితుల్లో ముగ్గురిపై ఇటీవల అభియోగపత్రాలు దాఖలు చేశారు. చదవండి: Hyderabad: సెక్స్‌వర్కర్లతో ఒప్పందం.. సోదరుడి ఇంట్లోనే.. -
డొమినికన్ రిపబ్లిక్లో కుప్పకూలిన విమానం.. 9 మంది మృతి
శాంటా డొమింగో: కరేబియన్ దీవుల్లోని డొమినికన్ రిపబ్లిక్లో విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో 9 మంది ప్రాణాలను కొల్పోయినట్లు అధికారులు ప్రకటించారు. కాగా, శాంటో డొమింగోలో.. ఒక ప్రైవేటు విమానం లా ఇసబెల్లా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి విమానం ఫ్లోరిడా వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఆ విమానంలో ప్రముఖ ప్యూర్టోరికన్ సంగీత నిర్మాత జోస్ ఏంజెల్ హెర్నాండెజ్ కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆయన ‘ఫ్లోలా మూవీ, టె బోటే’వంటి హిట్ సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. హెర్నాండెజ్ 38 ఏళ్లకే ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. మృతి చెందిన వారిలో అమెరికాకు చెందిన ఆరుగురు, డొమినికన్ రిపబ్లిక్ నుంచి ఇద్దరు, వెనిజులాకు చెందిన మరో ప్రయాణికుడు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. విమాన ప్రమాదంపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. చదవండి: బంగ్లాలో భారత రాష్ట్రపతికి ఘనస్వాగతం -
బతుకునిచ్చే చెట్టుపైనే ఊపిరి పోయె..
సాక్షి, తంగళ్లపల్లి(కరీంనగర్): కుటుంబాన్ని పోషించేందుకు 20 ఏళ్లు గల్ఫ్ బాట పట్టిన ఇంటి పెద్ద.. ఇకపై కళ్లముందే ఉంటూ, తమను కంటికి రెప్పలా చూసుకుంటాడని భావించిన భార్యాబిడ్డల ఆశలు గల్లంతయ్యాయి. కల్లు గీసేందుకు తాటిచెట్టు ఎక్కి ప్రమాదవశాత్తు అదే చెట్టుపై మరణించడంతో కుటుంబంతోపాటు గ్రామంలో విషా దం నెలకొంది. పోలీసుల కథనం ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లికి చెందిన గుగ్గిళ్ల కిష్టయ్య గౌడ్ (59) బతుకుతెరువుకు 20 ఏళ్లుగా గల్ఫ్‌లో ఉన్నాడు. ఆరు నెలల క్రితమే గ్రామానికి వచ్చి కులవృత్తి చేసుకుంటూ ఉండిపోదామని నిర్ణయించుకున్నాడు. గౌడ సంఘంలో అతనికి 13 తాటి, 6 ఈత చెట్లను కేటాయించగా.. రెండు నెలలుగా కల్లుగీస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. బుధవారం ఉదయం కల్లు గీసేందుకు గ్రామ శివారులోని తాటిచెట్టు ఎక్కాడు. చెట్టు దిగుతుండగా మోకు జారి చెట్టుపైనే వెనక్కి వంగిపోయాడు. ఎంత ప్రయత్నించినా పైకి లేవలేకపోయాడు. మోకు గట్టిగా బిగుసుకుపోవడంతో ఊపిరాడక చెట్టుపైనే ప్రాణాలు వదిలాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకుని బోరున విలపించారు. పోలీసులు, గ్రామస్తులు జేసీబీ సా యంతో మృతదేహాన్ని చెట్టుపైనుంచి కిందకు దింపారు. మృతునికి భార్య పద్మ, నలుగురు కూతుళ్లు రజిత, నవ్య, కావ్య, స్వాతి, కొడుకు సాయి ఉన్నారు. ఇద్దరు కూతుళ్ల వివాహాలు జరిగాయి. మూడో కూతురు హైదరాబాద్‌లోని ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తోంది. కవల పిల్లలైన స్వాతి, సాయి డిగ్రీ పూర్తి చేసి ఇంటి వద్దే ఉంటున్నారు. మృతుని భార్య పద్మ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ లక్ష్మారెడ్డి తెలిపారు. చదవండి: ఆ ఇమ్యూనిటీతో ఒమిక్రాన్‌ను ఎదుర్కొనే శక్తి వస్తుంది -
ఈక్వెడర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 18 మంది మృతి
క్విటో: ఈక్వెడర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అమెజోనియన్ రాష్ట్రంలోని సుకువాలో బస్సు బొల్తాపడింది. ఈ ఘటనలో 18 మంది సంఘటన స్థలంలోనే మృతిచెందారు. మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. స్థానికులతో కలిసి సహయక చర్యలు చేపట్టారు. క్షత గాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. మృతి చెందినవారిని మార్చురీకి తరలించారు. కాగా, బస్సు ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. చదవండి: అత్యాచార ఆరోపణలు.. బాధితురాలికి అలీబాబా షాక్ -
అక్కను హతమార్చిన తమ్ముడు
సాక్షి, గుంటూరు: తోబుట్టువును సోదరుడే హతమార్చిన ఘటన నగరంలో ఆదివారం చోటుచేసుకుంది. పట్టాభిపురం ఎస్హెచ్ఓ రాజశేఖరరెడ్డి కథనం ప్రకారం మారుతీనగర్‌కు చెందిన కొవ్వూరి యేసు నగరంలో ఆటో నడుపుకుని జీవనం సాగిస్తాడు. 30 సంవత్సరాల క్రితం తన అక్క సీతామహాలక్ష్మి కుమార్తె దానమ్మను వివాహం చేసుకున్నాడు. వీరికి ఇరువురు పిల్లలు. అయితే రెండు నెలల క్రితం యేసు ప్రమాదవశాత్తు గాయపడ్డాడు. అనంతర కాలంలో భార్యతో తరచూ గొడవలు పడుతుండేవాడు. శనివారం భార్యాభర్తలు తారాస్థాయిలో గొడవపడడంతో సీతామహాలక్ష్మి ఇరువురికీ సర్దిచెప్పే ప్రయత్నం చేసి అక్కడే నిద్రకు ఉపక్రమించింది. దీంతో కోపం పెంచుకున్న యేసు తెల్లవారు జామున ముందు గదిలో నిద్రిస్తున్న అక్క సీతా మహాలక్ష్మమ్మను పలుగుతో మెడపై నొక్కి హత్యచేశాడు. అనంతరం మరోగదిలో నిద్రిస్తున్న భార్య దానమ్మను హతమార్చేందుకు యత్నించాడు. దానమ్మ పెనుగులాడడంతో అలికిడికి పెద్ద కుమారుడు ఆదిసురేష్ నిద్రలేచి తండ్రిని అడ్డుకున్నాడు. తల్లీ, కుమారుడు ఇరువురు మరోగదిలోకి వెళ్లి తలుపులు వేసుకోని కేకలు వేయడంతో యేసు పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. చదవండి: ఎంఐఎం ఎమ్మెల్యే జులుం.. సలాం చేయలేదని చెంపదెబ్బకొట్టాడు -
ప్రాణం తీసిన సెల్ఫీ మోజు.. గోల్కొండ ఖిల్లా నుంచి జారిపడి
సాక్షి, చందుర్తి(కరీంనగర్): సెల్ఫీ తీసుకునే క్రమంలో ప్రమాదవశాత్తు కాలు జారి, ఖిల్లా మీది నుంచి కింద పడి తీవ్రంగా గాయపడ్డ ఓ యువకుడు చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. ఈ ఘటన చందుర్తి మండలంలోని ఎన్గల్‌లో విషాదం నింపింది. గ్రామానికి చెందిన సింగం స్వామి–రాజమణి దంపతులకు కుమారుడు రంజిత్(25) డిగ్రీ వరకు చదువుకుని, హైదరాబాద్‌లో ఏసీ మెకానిక్ నేర్చుకుంటున్నాడు. రంజిత్ (ఫైల్) బుధవారం గోల్కొండ ఖిల్లాను చూసేందుకు వెళ్లి, సెల్ఫీ దిగేందుకు ఖిల్లా ఎక్కాడు. సెల్ఫీ తీసుకునే క్రమంలో ప్రమాదవశాత్తు కాలు జారి, కిందపడడంతో తలకు బలమైన గాయాలయ్యాయి. హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున మృతి చెందాడు. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురాగా.. కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతుడికి తమ్ముడు రాకేశ్, ఒక అక్క ఉన్నారు. -
కుక్కను తప్పించబోయి అదుపుతప్పిన కారు.. ఒకరి మృతి.. మరో ముగ్గురు
సాక్షి, ఘట్కేసర్(హైదరాబాద్): కుక్కను తప్పించబోయి కారు అదుపు తప్పిన సంఘటనలో ఓ విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందగా ముగ్గురు గాయపడ్డారు. ఘట్కేసర్ పోలీసులు తెలిపిన మేరకు.. మక్తకు చెందిన విద్యార్థి సిద్దగోని అఖిల్ (19), కొర్ర విశాల్ (15), కొర్రెముల్కు చెందిన విద్యార్థి షఫీ (20), బడుగుల సురేశ్ (19) బుధవారం అర్ధరాత్రి ఇన్నోవా వాహనంలో ప్రతాపసింగారం చౌరస్తా నుండి కొర్రెముల్కు వెళుతున్నారు. ఐమాత ఆలయం సమీపంలో ఓ కుక్క కారుకు అడ్డుగా వచ్చింది. కుక్కను తప్పించే క్రమంలో కారు అదుపు తప్పి రోడ్డు పక్కనున్న వెంచర్లో పడిపోయింది. దీంతో తీవ్ర గాయాలైన సిద్దగోని అఖిల్ అక్కడికక్కడే మృతి చెందగా వాహనం నడుపుతున్న షఫీ తలకు దెబ్బతగిలింది. మిగిలిన ఇద్దరికి సాధారణ గాయాలయ్యాయి. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. చదవండి: 2 ఆస్పత్రుల్లో 2 సర్జరీలు.. మృతదేహానికి పోస్టుమార్టం! -
2 ఆస్పత్రుల్లో 2 సర్జరీలు.. మృతదేహానికి పోస్టుమార్టం!
సాక్షి, గోల్కొండ(హైదరాబాద్): వైద్యుల నిర్లక్ష్యం వల్లే తన కుమారుడు మృతి చెందాడని ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఖననం చేసిన మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిర్వహించారు.గోల్కొండ పోలీసులు తెలిపిన మేరకు.. పుప్పాలగూడ ఫ్రెండ్స్ కాలనీకి చెందిని షేక్ అబ్దుల్ రహీం లక్డీకపూల్లో మిరాకిల్ గ్లాస్ ట్రేడర్ పేరు షాపు నిర్వహిస్తున్నాడు. ఈనెల 2వ తేదీ సాయంత్రం తన వీపు పై భాగంలో నొప్పిగా ఉందని, అక్కడ కురుపు లాగా ఉందని రహీమ్ కొడుకు షేక్ జునేద్ (21) తండ్రికి తెలిపాడు. దీంతో తండ్రి షేక్ అబ్దుల్ రహీమ్.. జునేద్‌ను పుప్పాలగూడలోని ప్రో లైఫ్ ఆస్పత్రికి తీసుకు వెళ్లాడు. అక్కడ డాక్టర్ సజ్జాద్ షేక్ జునైద్‌కు పరీక్షలు నిర్వహించి క్లినిక్‌లోకి తీసుకువెళ్లి షేక్ అబ్దుల్ రహీమ్‌ను అడగకుండానే మైనర్ సర్జరీ చేసి కురుపును తొలగించాడు. సర్జరీ విషయం తెలిసిన జునైద్ తండ్రి ఎటువంటి పరీక్షలు లేకుండానే, తన అనుమతి లేకుండానే ఎందుకు చేశావని నిలదీశాడు. ఇదిలా ఉండగా అదే రోజు రాత్రి 9 గంటల సమయంలో షేక్ జునేద్‌కు నొప్పి బాగా పెరిగింది. అక్కడరక్తస్రావమైంది. గమనించిన డాక్టర్ సజ్జాద్ షేక్ జునైద్‌ను వెంటనే టోలిచౌకిలోని ఆపిల్ ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించాడు. అక్కడ షేక్ జునేద్‌కు ఆపరేషన్ చేయాలంటూ వైద్యులు నేరుగా ఆపరేషన్ థియేటర్‌కి తీసుకెళ్లారు. కురుపు వద్ద మైనర్ సర్జరి చేసే సమయంలో సూది జునైద్ శరీరంలోనే ఉండిపోయిందని డాక్టర్ సజ్జాద్ తెలిపారు. ఇదిలా ఉండగా 3వ తేదీ తెల్లవారు జామున షేక్ జునైద్ చనిపోయాడని వైద్యులు తెలిపారు. ఆపిల్ ఆస్పత్రిలో కూడా అనుమతి లేకుండా సర్జరీ చేశారని షేక్ అబ్దుల్ రహీం తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఫిర్యాదును గోల్కొండ పోలీసులు బుధవారం స్వీకరించి కేసు నమోదు చేశారు. మృతుడి తండ్రి విజ్ఞప్తి మేరకు గురువారం ఉస్మానియా వైద్యులు ఖననం చేసిన షేక్ జునైద్ మృతదేహాన్ని వెలికితీసి అక్కడికక్కడే పోస్టుమార్టం నిర్వహించారు. కాగా సెవెన్ టూంబ్స్ సమీపంలోని స్మశానవాటిలో పోస్టుమార్టం నిర్వహించే సమయంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
Hyderabad: బిపిన్ రావత్ యాదిలో..
సాక్షి, హైదరాబాద్: త్రివిధ దళాల చీఫ్ జనరల్ బిపిన్ రావత్ బుధవారం హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడంతో సికింద్రాబాద్ మిలిటరీ స్టేషన్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. 2017లో ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆయన అదే ఏడాది చివర్లో సికింద్రాబాద్‌లోని ప్రతిష్టాత్మక డిఫెన్స్ మేనేజ్మెంట్ కాలేజీ (సీడీఎం)ని, 2018 డిసెంబర్లో ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజినీరింగ్ కాలేజీ (ఎంసీఈఎంఈ)ని సందర్శించారు. సీడీఎం సందర్శనలో భాగంగా హయ్యర్ డిఫెన్స్ మేనేజ్మెంట్ కోర్సు (హెచ్‌డీఎంసీ)లో శిక్షణ పొందుతున్న అభ్యర్థులతో ప్రత్యేకంగా ముచ్చటించారు. దేశ రక్షణలో ఆర్మీ ప్రాముఖ్యత, అధునాతన టెక్నాలజీకి అనుగుణంగా ఆర్మీ పని తీరును మెరుగుపరుచుకోవడంపై పలు కీలక సూచనలు చేశారు. 2019 డిసెంబర్ 14న తిరుమలగిరిలోని ఎంసీఈఎంఈ 99వ స్నాతకోత్సవానికి సైతం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీ సందర్శన సందర్భంగా.. ఈ సందర్భంగా ఎంసీఈఎంఈలో విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న మిలిటరీ అధికారులకు పట్టాలను ప్రదానం చేశారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు అందజేశారు. 2019 తర్వాత బిపిన్ రావత్ సికింద్రాబాద్ మిలిటరీ స్టేషన్‌ను సందర్శించలేదు. ఇక్కడి ప్రతిష్టాత్మక శిక్షణ సంస్థలకు సంబంధించిన కార్యక్రమాలకు వెబ్‌నార్ ద్వారా హాజరయ్యేవారు. ఎంసీఈఎంఈ స్నాతకోత్సవంలో.. – కంటోన్మెంట్ చదవండి: CDS Bipin Rawat: సెలవిక దళపతి... వెల్లింగ్టన్లో మృతులకు నివాళి -
మరో వారం రోజుల్లో కేన్సర్ చికిత్స.. అయ్యో కేటుగాళ్లు..
సాక్షి, మహబూబాబాద్(వరంగల్): రిటైర్డ్ ఉద్యోగి ఖాతాలోనుంచి రూ.2.30 లక్షలు మాయమయ్యాయి. ఈ ఘటన మానుకోట జిల్లా కేంద్రంలోని సిగ్నల్ కాలనీలో చోటుచేసుకుంది. వివరాలు.. మాజీ సైనికుడు పెద్దబోయిన భిక్షపతి మానుకోట సిగ్నల్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఈయనకు ఎస్బీఐ బ్యాంకు ఖాతాలో రూ.లక్ష, హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఖాతాలో రూ.95 వేలు, ఇండియన్ బ్యాంకు ఖాతాలో రూ.35 వేలు మాయమయ్యాయి. బాధితుడు భిక్షపతి ఎస్బీఐ బ్యాంకు ఖాతాలో చెక్‌బుక్ కోసమని దరఖాస్తు చేయగా వివరాలు తెలుసుకునేందుకు బ్యాంకు టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్‌చేసి మాట్లాడి ఫోన్ పెట్టేయగానే మరో నంబర్ నుంచి ఫోన్ వచ్చింది. అవతలి వ్యక్తులు వివరాలు అడగగానే బ్యాంకు వారే అనుకుని వారు అడిగిన సమాచారం అందించి ఫోన్ కట్‌చేశాడు. ఆ వెంటనే ఆయన ఫోన్‌కు రూ.2.30 లక్షలు ఉపసంహరణ (డ్రా) అయినట్లు మెసేజ్ వచ్చింది. సదరు మూడు బ్యాంకు ఖాతాలకు ఒకే ఫోన్‌నంబర్ లింకు చేశారు. బ్యాంకు అధికారులు అనుకుని గుర్తు తెలియని వ్యక్తి చేసిన ఫోన్‌కు స్పందించి సమాచారం ఇవ్వడంతో ఆర్థికంగా నష్టపోవాల్సి వచ్చింది. బ్యాంకు ఖాతాల్లో నగదు పోయినట్లు గుర్తించి వెంటనే బ్యాంకులకు వెళ్లి ఆరాతీయగా ఆయన ఖాతాల్లోని నగదు మాయమైనట్లు గుర్తించారు. వెంటనే ఆ బ్యాంకు ఖాతాలను బ్లాక్ చేశారు. తనకు మోసం జరిగిందని గుర్తించిన సదరు బాధితుడు భిక్షపతి, మహబూబాబాద్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు సైబర్ క్రైం పోలీసులకు సమాచారం ఇచ్చారు. మరో వారం రోజుల్లో భిక్షపతికి కేన్సర్ చికిత్స కోసం హైదరాబాద్‌కు వెళ్లాల్సి ఉండగా ఇంతపెద్ద గోరం జరిగిందని గుండె బాదుకుంటూ బోరున విలపించాడు. పోలీసులు, బ్యాంకు అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని ఆయన కోరాడు. చదవండి: వివాహితతో పరిచయం .. చేనులోకి బలవంతంగా తీసుకెళ్లి.. -
సంసార విషయంలో గొడవ .. భర్త ఆత్మహత్య
సాక్షి, పటాన్చెరు(మెదక్): సంసార విషయంలో జరిగిన గొడవ భర్త ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైంది. ఈ సంఘటన పటాన్చెరు పోలీసు స్టేషన్‌పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పు గోదావరి జిల్లా అమలాపురం తాలూక అంబాజీ పేటకు చెందిన శ్రీనివాస్(46) భార్య వరలక్ష్మి పిల్లలతో కలసి బతుకుదెరువు కోసం 18 ఏళ్ల క్రితం పటాన్చెరు పట్టణంలోని శ్రీనగర్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఓ ప్రైవేట్ పరిశ్రమలో పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం ఇంట్లో సరుకులు లేవని భార్య వరలక్ష్మి భర్తతో గొడవపడి ఇద్దరు కూతుర్లు సాయిప్రసన్న, శ్రీదేవిలను తీసుకొని మార్కెట్‌కు వెళ్లింది. తిరిగి ఇంటికి వచ్చి చూసేసరికి బెడ్రూంలో చీరతో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని విగతజీవిగా కనిపించాడు. వెంటనే కిందకు దించి ఆటోలో పటాన్చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
‘వాటర్ ట్యాంకులో శవం’.. కీలక విషయాలు వెలుగులోకి
సాక్షి, ముషీరాబాద్(హైదరాబాద్): రాంనగర్‌లోని రిసాలగడ్డ జలమండలి వాటర్ ఓవర్‌హెడ్ ట్యాంకులో లభ్యమైన కుళ్లిన శవం మిస్టరీ వీడింది. మృతుడు రాంనగర్ అంబేడ్కర్ నగర్ బస్తీకి చెందిన కిషోర్(26)గా పోలీసులు నిర్ధారించారు. పోస్టు మార్టం నిర్వహించి బుధవారం కుటంబసభ్యులకు శవాన్ని అప్పగించారు. పోలీసులు తెల్పిన వివరాల మేరకు అంబేడ్కర్‌నగర్‌లో నివాసం ఉంటున్న పుష్పకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమారైలు. వీరిలో పెద్ద కుమారుడు కిషోర్ గతంలో పెయింటింగ్ పనులు చేసేవాడు. కొద్దికాలంగా ఆటో నడుపుతూ.. గంజాయి, మద్యానికి బానిసగా మారాడు. అక్టోబర్ 19న మద్యం అతిగా తాగి ఇంటికి రావడంతో కుటుంబ సభ్యులు మందలించారు. దీంతో ఇంటి నుంచి వెళ్లిపోయాడు. దీనిపై అక్టోబర్ 23న చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి అదృశ్యమైన కిషోర్ మంగళవారం చిలకలగూడ జలమండలి వాటర్ ట్యాంకులో శవమై కన్పించాడు. ముషీరాబాద్ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి హత్యా, ఆత్మహత్యా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కాగా కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కిషోర్ స్నేహితుడు మధును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. -
బీడీ ముట్టించుకుంటుండగా మంటలు
సాక్షి, జవహర్‌నగర్(హైదరాబాద్): బీడీ ముట్టించుకుంటున్న సమయంలో ప్రమాదవశాత్తు మంటలు అంటుకొని వృద్ధుడు సజీవ దహనమైన సంఘటన జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ భిక్షపతిరావు తెలిపిన వివరాల ప్రకారం... కార్పొరేషన్‌లోని ఆనంద్‌నగర్ కాలనీలో శ్రావణ్‌కుమార్ (79) కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటున్నాడు. బీడీ తాగే అలవాటు ఉన్న శ్రావణ్‌కుమార్ బీడీ అంటించుకునే సమయంలో ప్రమాదవశాత్తు మంటలు అంటుకొని సజీవదహనమయ్యాడు. కుటుంబ సభ్యులు చూసి తేరుకునే లోపే అతడు పూర్తిగా కాలిపోయాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
కాపురం చేయనంటూ తెగేసి చెప్పిన భార్య.. రాయితో పదే పదే బాది..
సాక్షి, మంథని(కరీంనగర్): మండలంలోని ఉప్పట్ల గ్రామంలో కాసిపేట రేణుకను చంపిన కేసులో ఆమె భర్త కాసిపేట బానయ్యను అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ సతీశ్ తెలిపారు. ఆదివారం పోలీస్‌స్టేషన్‌లో సమావేశం నిర్వహించి నిందితుడి అరెస్టు వివరాలు వెల్లడించారు. బానయ్యకు ఇద్దరు భార్యలని, గ్రామానికి చెందిన రేణుకను 16ఏళ్ల క్రితం రెండో పెళ్లి చేసుకున్నాడని సీఐ తెలిపారు. వీరిమధ్య చాలా ఏళ్లుగా గొడవలు జరుగుతున్నాయని, దీంతో రేణుక జూలైలో ఇంటి నుంచి వెళ్లిపోగా స్థానిక పోలీస్‌స్టేషన్ మిస్సింగ్ కేసు నమోదైందన్నారు. ఈక్రమంలో రేణుకను వెతికి తీసుకురాగా భర్తతో ఉంటానని వెళ్లిపోయిందన్నారు. కొంతకాలం తర్వాత భార్యపై మళ్లీ అనుమానం పెంచుకోవడంతో ఇళ్లు వదిలి హైదరాబాద్‌కు వెళ్లిపోయింది. అక్కడ ఓ హోటల్లో పనిచేస్తున్న విషయం తెలుసుకుని తన భర్త బానయ్య వారం క్రితం వెళ్లి తీసుకుచ్చాడు. శనివారం గ్రామంలోని పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టాడు. రేణుక తన భర్తతో కాపురం చేయనంటూ వెళ్లిపోతుండగా భార్యను వెంబడించి తలపై పెద్దరాయితో నాలుగుసార్లు కొట్టడంతో రేణుక అక్కడికక్కడే మృతిచెందినట్లు సీఐ తెలిపారు. హత్యకు ఉపయోగించిన రాయితో పాటు ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపా రు. ఎస్సై చంద్రశేఖర్ వెంట ఉన్నారు. -
బంజారాహిల్స్‌లో కారు బీభత్సం..
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్‌లోని రోడ్ నెంబర్-2లో ఆదివారం అర్ధరాత్రి కారు బీభత్సాన్ని సృష్టించింది. కారు అతివేగంతో రోడ్డును దాటుతున్న ఇద్దరు వ్యక్తులను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు సంఘటన స్థలంలోనే మృతి చెందారు. మృతులు త్రిభువన్(23), ఉపేందర్(25)లుగా పోలీసులు గుర్తించారు. వీరిద్దరు రెయిన్బో ఆసుపత్రిలో పనిచేస్తున్నట్లు తెలిపారు. కారు నడిపిన వ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. నిందితులు రోహిత్‌గౌడ్, సాయిసోమన్ వాహన ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు గుర్తించారు. కారు ప్రమాదం తర్వాత నిందితుడు.. జూబ్లీహిల్స్‌లోని తన ఇంటికి వెళ్లి కారును పార్క్ చేశాడు. ఈ నేపథ్యంలో.. అక్కడ డ్యూటీలో ఉన్న ఒక కానిస్టేబుల్ అనుమానించి పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కాగా, మృత దేహలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతులు దేవేంద్రకుమార్ ,అయోధ్య రాయ్ -
సొరంగంలోకి వెళ్లిన రైలు అదృశ్యం.. ఇప్పటికీ మిస్టరీనే..
మనిషి మేధస్సుకి అందని ఈ సృష్టి.. ఓ అస్పష్టమైన అధ్యాయం. గతాన్ని, వర్తమానాన్ని బేరీజు వేసుకుంటూ ప్రయాణించడమే మనకి తెలిసిన తర్కం. అయితే ఊహలను సైతం వణికించే కొన్ని విషయాలను విశ్లేషించే కంటే విస్మరించడమే మేలంటారు అనుభవజ్ఞులు. ఏలియన్స్, టైమ్ ట్రావెల్, పునర్జన్మలు, ఆత్మలు ఇవన్నీ అలాంటివే. ‘గ్రహాంతరవాసుల రాక, చనిపోయినవారు తిరిగి జన్మించడం, ఆత్మకు మరణం లేదనుకోవడం వంటివాటికి అంతో ఇంతో ఆధారాలు కనిపించినా టైమ్ ట్రావెల్ మాత్రం కంప్లీట్‌గా íఫిక్షన్‌కి, సినిమాలకు మాత్రమే పరిమితం’ అనుకుంటే పొరబాటే. ఎందుకంటే దాన్ని నిర్ధారించే కొన్నిపేజీలను నూటా డెబ్భై ఆరేళ్ల కిందటే చరిత్ర భద్రపరచింది. ‘ఆదిత్య 369’ సినిమా చూసే ఉంటారుగా? ప్రస్తుతం నుంచి గతానికి, గతం నుంచి భవిష్యత్‌కి వెళ్లడమే ఆ కథసారాంశం. అలాంటిదే ఇటలీలో సరిగ్గా నూట పదేళ్ల కిందట జరిగింది. అది కథ కాదు నిజం! ఇంతకుముందే నూట డెబ్భైఆరేళ్లు అని, ఇప్పుడు నూట పదేళ్లు అంటారేంటీ? అని డౌటనుమానం వద్దు. ఈ కథనాన్ని పూర్తిగా చదివితే మీకే అర్థమవుతుంది. ట్రైన్ మిస్సింగ్ నూట పదేళ్ల కిందట అంటే 1911లో ఇటలీలోని జనెటి అనే కంపెనీ.. మూడు బోగీల న్యూ మోడల్ ట్రైన్‌ను ప్రవేశపెట్టి, ‘ఉచిత ప్రయాణం చేసేవాళ్లకు ఇదే అరుదైన అవకాశం’ అంటూ ప్రకటించింది. ఉత్సాహవంతులు ఎగబడ్డారు. వంద మంది ప్రయాణికులు.. ఆరుగురు రైల్వే సిబ్బందితో మొత్తం నూటారు మంది రోమ్ నగరం నుంచి ఆ ట్రైన్లో బయలుదేరారు. దారిలో ఓ పర్వత ప్రాంతం మీదుగా పోతున్న ఆ ట్రైన్.. ఒక కిలోమీటరు పొడవున్న సొరంగంలోకి ప్రవేశించింది. అంతే, ఆ తర్వాత ఆ ట్రైన్ మరో స్టేషన్‌ని చేరుకోలేదు. కనీసం ఆ సొరంగాన్ని కూడా దాటలేదు. ఏదైనా ప్రమాదం జరిగి ఉంటుందని భావించిన రైల్వే అధికారులు సొరంగాన్ని చేరి, కిలోమీటరు పొడవునా అణువణువూ గాలించారు. ఎలాంటి ఆధారం దొరకలేదు. పోనీ ఆ సొరంగానికి మరో మార్గం ఉందా అంటే, అదీ లేదు. ‘అయినా ఏదో కుక్కపిల్ల మిస్ అయినట్లు నూటారు మంది ఉన్న ట్రైన్ ఎలా మిస్ అవుతుంది? కనిపించకుండా పోవడానికి చిన్న వస్తువేం కాదు కదా?’ ఇవే ప్రశ్నలు నాటి పత్రికలను, అక్కడి మహా మహా మేధావులను, ఉన్నతాధికారులను తలలు పట్టుకునేలా చేశాయి. సరిగ్గా అప్పుడే ఆ ట్రైన్ నుంచి బయటపడిన ఇద్దరు ప్రయాణికుల సమాచారం తెలిసింది. ఆ ఇద్దరూ భయంతో రైలు నుంచి దూకేశారని తేలింది. మరి మిగిలిన నూట నాలుగు మంది ఏమయ్యారు? మూడు బోగీల ట్రైన్ ఎక్కడికి వెళ్లింది? రైలు నుంచి దూకిన ఆ ఇద్దరు ప్రయాణికులు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యి ఆసుపత్రిలో చేరారు. కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. చికిత్స అనంతరం ఆ ఇద్దరిలో ఒకతను నోరు విప్పాడు. అసలు విషయం బయటపెట్టాడు. ఆ రోజు రైలు సొరంగంలోకి ప్రవేశించగానే తెల్లని పొగ కమ్మేసిందని, రైల్లో ఉన్నవాళ్లంతా పెద్దపెద్దగా అరవడం విని భయంతో బయటకు దూకేశామని, ఆ తర్వాత రైలు ఏమైందో తెలియదని చెప్పాడు. అతడు చెప్పింది విని చిన్నపాటి ఆశతో మరోసారి ఆ సొరంగాన్ని శోధించారు అధికారులు. ఫలితం లేదు. అరవై ఆరేళ్లు వెనక్కి.. 1911లో మిస్సయిన నూట నాలుగు మంది ప్రయాణికులు.. 1845 సంవత్సరానికి చేరుకున్నారనే ఓ రిపోర్ట్ 1926లో అంటే ట్రైన్ మిస్ అయిన పదిహేనేళ్ల తర్వాత వెలుగులోకి వచ్చింది. అది విన్న యావత్ ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అప్పటి మెక్సికో అధికారిక సమాచారం ప్రకారం 1845 సంవత్సరంలో ఆ నూట నాలుగు మంది ప్రయాణికులు.. ‘మేమంతా ఇటలీలోని రోమ్ నుంచి జనెటి ట్రైన్లో ఇక్కడికి వచ్చాం’ అని చెప్పారు. అయితే పదివేల కిలోమీటర్ల దూరంలో ఉన్న మెక్సికో–ఇటలీల మధ్య రైల్వే మార్గం లేదు. సముద్రయానం తప్ప మరో దారే లేదు. అలాంటిది.. ‘మేమంతా ఇటలీ నుంచి రైల్లో వచ్చాం’ అని చెప్పడంతో అక్కడ అధికారులు వాళ్లని పిచ్చివాళ్లుగా భావించి మానసిక చికిత్సాలయంలో చేర్పించారు. ఆ తర్వాత కూడా ఎందుకైనా మంచిదనే ఉద్దేశంతో మెక్సికో అధికారులు.. ఇటలీ అధికారులని సంప్రదించారు. అయితే, అది 1845వ సంవత్సరం కావడం వల్ల అప్పటికి ‘1911 ట్రైన్ మిస్సింగ్’ ఘటన ఇటలీలో చోటుచేసుకోలేదు. దాంతో ఆ నూట నాలుగు మంది తమ దేశం వాళ్లు కాదని, అలాంటి ట్రైన్ తమ వద్ద లేనే లేదని తేల్చేసింది ఇటలీ. ఆ నూట నాలుగు మందిలో ఒక వ్యక్తి దగ్గర ‘డన్హిల్’ కంపెనీకి చెందిన సిగార్ పెట్టె దొరికింది. దాని మీద ‘1907’ సంవత్సరం ప్రింట్ అయ్యి ఉండటం ఆశ్చర్యం. అయితే ఈ ట్రైన్ రష్యా, జర్మనీ, రుమేనియా, ఇటలీతో పాటు ఇండియాలో కూడా అప్పుడప్పుడూ కనిపిస్తూ మాయమవుతూ ఉందని, 1991లో ఉక్రేయి¯Œ లోని పోల్టావాలోనూ ఈ రైలు కనిపించిందని, ఆత్మలపై పరిశోధనలు చేసే ఓ వ్యక్తి ఈ రైలులోకి దూకాడని, ఆ తర్వాత మళ్లీ అతడు కనిపించలేదని, ఇదో ఘోస్ట్ ట్రైన్ అని హడలెత్తించే పలు కథనాలు పుకారులుగా నేటికీ షికార్లు చేస్తున్నాయి. అయితే 1911లో ఇటలీలో ట్రైన్‌తో సహా మిస్ అయిన నూట నాలుగు మంది.. అరవై ఆరేళ్లు వెనక్కి వెళ్లి, 1845లో మెక్సికోలో ప్రత్యక్షం కావడమేంటీ? పైగా వారి దగ్గర 1907 సంవత్సరం నాటి సిగార్ ప్యాకెట్ దొరకడమేంటి? అనేది నేటికీ మిస్టరీనే. సంహిత నిమ్మన జనెటి ట్రైన్‌ని మాయం చేసిన ఆ సొరంగం.. ప్రపంచయుద్ధ సమయంలోని వైమానిక దాడుల్లో నాశనం అయింది. ఇటలీలోని రైల్వే మ్యూజియంలో నేటికీ ఆ ట్రైన్ మోడల్ ప్రదర్శనకు ఉంది. ఇక ఆ ట్రైన్లో లభించిన 1907 నాటి సిగార్ ప్యాకెట్‌ని ఇప్పటికీ మెక్సికోలోనే భద్రపరిచారు. -
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: ఆరుగురు దుర్మరణం
సాక్షి, చిత్తూరు: చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలో ఆదివారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పూతలపట్టు-నాయుడుపేట రహదారిపై ఐతేపల్లి వద్ద కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒక్కసారిగా.. మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు సంఘటన స్థలంలోనే మృతి చెందారు.మృతుల్లో ఒక చిన్నారి కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో వారిని.. తిరుపతి లోని రుయా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో 8 మంది ఉన్నట్టు స్థానికులు తెలిపారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మంటలార్పి కారులోని మృతదేహాలను బయటకు తీశారు. మృతులు విజయనగరం జిల్లా వాసులుగా పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
కన్నీటి గాథ: ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నా ఆ నాన్న అనాథే
సాక్షి,డోర్నకల్(వరంగల్): ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు పుట్టగానే ఆ నాన్న చాలా సంతోషపడ్డాడు. తన రెక్కలను ముక్కలు చేసుకుని మరీ పిల్లలకు ఏ కష్టమూ రానీయకుండా ప్రేమతో పెంచి పెద్దచేశాడు. ఉన్నత చదువులు చదివించాడు. పెళ్లిళ్లు చేసి వారందరినీ ఇంటివారిని చేశాడు. పిల్లల అభివృద్ధిని ఆకాంక్షించాడు తప్పా మరే స్వార్థమూ ఆలోచించలేదు. పిల్లలే ఆస్తిపాస్తులుగా భావించాడు. ఈ క్రమంలోనే భార్య, ఓ కూతురు మృతిచెందారు. తన పిల్లలు కలకాలం బాగుండాలని సింగరేణి ఉద్యోగానికి కూడా స్వచ్ఛంద విరమణ తీసుకుని కుమారుడికి ఉద్యోగం ఇప్పించాడు. ఉన్నదంతా పిల్లలకే.. ఉన్న ఆస్తిపాస్తులన్నీ పిల్లలకు ఇచ్చేశాడు. ఇప్పుడు వృద్ధాప్యం మీదపడింది. చేతిలో చిల్లిగవ్వలేదు. ఒక్కడు అంత మందిని పోషించినా ఏ రోజూ ఇబ్బంది పడని ఆ నాన్నను వారు అనాథ చేశారు. కుమారుడు, కూతుర్లు ఇంటినుంచి గెంటేశారు. నా అనుకున్న వారు కూడా దగ్గరకు రానీయడం లేదు. దీంతో ఇప్పుడు అనాథ నాన్నగా సమాజం ముందు నిలబడ్డాడు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం సీరోలు కాంపెల్లికి చెందిన సలవాది ఇమ్మానియల్ (75) కొత్తగూడెం సింగరేణి కాలరీస్‌లో ఉద్యోగం చేశాడు. ఇతనికి భార్య, ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నాడు. కుమార్తెలకు, కుమారుడికి పెళ్లిళ్లు చేశాడు. అనారోగ్యంతో ఐదేళ్ల క్రితం భార్య, ఓ కుమార్తె మృతిచెందారు. తను స్వచ్ఛంద పదవీ విరమణ పొంది తన ఉద్యోగాన్ని కుమారుడికి ఇప్పించగా కుమారుడు ఉద్యోగం చేస్తూ ప్రసుతంతం కొత్తగూడెంలోని రుద్రంపూర్‌లో ఉంటున్నాడు. ఇద్దరు కుమార్తెలు ఖమ్మంలో నివాసం ఉంటున్నారు. ఇమ్మానియల్ వృద్ధుడు కావడంతో తన పనులు తాను చేసుకోవడం ఇబ్బందిగా ఉంది. దీంతో కుమారుడు, కుమార్తెలు ఇంట్లో ఉంచుకోకుండా బయటకు వెళ్లగొట్టారు. దీంతో కేసముద్రంలోని బంధువుల ఇంటికి వెళ్లగా శుక్రవారం ద్విచక్రవాహనంపై తీసుకువచ్చి డోర్నకల్‌లో వదిలిపెట్టారు. దీనస్థితిలో రోడ్డుపక్కన ఉన్న వృద్ధుడిని ఆశ కార్యకర్తలు వి.నిర్మల, సువర్ణ గమనించి పోలీసులకు సమాచారం అందించి స్థానిక బాలుర ప్రభుత్వ హాస్టల్‌కు తరలించారు. సీడీపీఓ ఎల్లమ్మ, అంగన్వాడీ కార్యకర్త వాణి, కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీ ఇన్చార్జ్ ఎల్లావుల హరికృష్ణ హాస్టల్లో ఇమ్మానియల్తో మాట్లాడారు. ఇమ్మానియల్ కుటుంబ సభ్యులతో మాట్లాడగా వారు ఇమ్మానియల్ను తీసుకెళ్లేందుకు అంగీకరించలేదు. దీంతో సీడీపీఓ సూచన మేరకు కాంగ్రెస్ నాయకులు హరికృష్ణ ఆటోలో సికింద్రాబాద్తండాకు తీసుకెళ్లి అక్కడి ఆదరణ అనాథాశ్రమంలో చేర్పించారు. చదవండి: ఉదయం పూలు అమ్ముతూ.. రాత్రి అయితే వేషం మార్చి.. -
పాపమని లిఫ్ట్ ఇచ్చిన పోలీసుకే షాకిచ్చిన యువతి!
సాక్షి, పంజగుట్ట(హైదరాబాద్): మానవత్వంతో లిఫ్ట్ ఇచ్చిన పాపానికి ఓ కానిస్టేబుల్ మెడలోని చైన్‌ను దొంగిలించిన సంఘటన పంజగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. సన్‌సిటీలో నివాసం ఉండే ఈశ్వర్ ప్రసాద్ ఏఆర్ కానిస్టేబుల్. ఈ నెల 12న రాత్రి 8:30 సమయంలో విధులు ముగించుకుని ఇంటికి వస్తుండగా గ్రీన్‌ల్యాండ్స్ వద్ద ఓ యువతి లిఫ్ట్ అడగగా ఆమెకు లిఫ్ట్ ఇచ్చాడు. రాత్రి 9 గంటలకు ఆమెను పంజగుట్టలో దింపి ఇంటికి వెళ్లిపోయాడు. ఇంట్లో స్నానం చేసే సమయంలో తన బంగారు గొలుసు మాయమైనట్లు తెలుసుకున్నాడు. పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా నిందితురాలు మహంకాళి పోలీస్‌స్టేషన్ పరిధిలో కూడా ఇలానే దొంగతనం చేసేందుకు యత్నించగా అక్కడి పోలీసులు ఆమెను మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేయగా పంజగుట్టలో కానిస్టేబుల్ వద్ద కూడా చైన్ కొట్టేసినట్లు తెలిపింది. కాగా ఆమె ట్రాన్స్‌జెండర్‌గా పోలీసులు గుర్తించారు. బెంగళూరుకు చెందిన అంజూన్ అని నిర్ధారించారు. అంజూన్ బెంగళూరు నుండి హైదరాబాద్‌కు వచ్చి దొంగతనాలు చేసి తిరిగి వెల్లిపోతుందని పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు..
సాక్షి, చెన్నై(తమిళనాడు): తమిళనాడులోని శివకాశి బాణాసంచా తయారీ కేంద్రంలో మంగళవారం భారీపేలుడు సంభవించింది. పేలుడు ధాటికి భవనం కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిని వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో స్థానిక అధికారులు పెద్ద ఎత్తున ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలను ముమ్మరం చేశారు. -
మానేరు వాగు గల్లంతు ఘటన: స్పందించిన కేటీఆర్..
సాక్షి, కరీంనగర్: మానేరువాగులో ఆరుగురు బాలురు గల్లంతు కావడం పట్ల మంత్రి కే.తారకరామారావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటన పైన జిల్లా అధికారులతో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. చనిపోయిన బాలుర కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. నియోజకవర్గంలోని జలవనరులు సంపూర్ణంగా నిండి ఉన్న నేపథ్యంలో ప్రజలు ఆయా ప్రాంతాల్లోకి వెళ్లేటప్పుడు జాగ్రత్తగా వహించాలని కేటీఆర్ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ప్రాజెక్టుల వద్ద సాధ్యమైనన్ని రక్షణ చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా అధికారులకు మంత్రి కేటీఆర్ సూచించారు. ప్రభుత్వం తరఫున ఆయా కుటుంబాలను ఆదుకుంటామని మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు. సరదాగా 8 మంది స్నేహితులు మానేరు వాగులో ఈతకు వెళ్లిన ఘటన విషాదంగా మారిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో రాజీవ్‌నగర్‌కు చెందిన కొలిపాక గణేశ్(15), జడల వెంకటసాయి(14), తీగల అజయ్(14), కొంగ రాకేశ్ (15) శ్రీరామ్ క్రాంతి (14) వాగులోకి దూకారు. నీరు లోతుగా ఉండటంతో వారంతా గల్లంతయ్యారు. దీంతో భయపడిన సింగం మనోజ్(14), దిడ్డి అఖిల్(15)తోపాటు మరో బాలుడు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఐదుగురి మృతదేహలు లభ్యమయ్యాయి. మరోకరి కోసం గజ ఈతగాళ్లు గాలిస్తున్నారు. -
ఘరానా దంపతులు.. ఏడడుగులు.. ఏడాదిగా ఏడు చోరీలు..
సాక్షి, మంచిర్యాల(ఆదిలాబాద్): ఏడాది జిల్లాలో దొంగతనాలు చేస్తూ.. తప్పించుకు తిరుగుతున్న ఇద్దరు దొంగలను (భార్యాభర్తలు) పోలీసులు పట్టుకున్నారు. జిల్లాకేంద్రంలోని మార్కెట్ ఏరియాలో అనుమానస్పదంగా తిరుగుతుండగా సోమవారం అదుపులోకి తీసుకున్నారు. మంచిర్యాల పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల స మావేశంలో సంబంధిత కేసు వివరాలను ఏసీపీ అఖిల్ మహాజన్ వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. బెల్లంపల్లి మండలం బట్వన్పల్లికి చెందిన తాళ్లపల్లి ప్రసాద్, విజయవాడకు చెందిన ధనలక్ష్మి భార్యాభర్తలు. రెండేళ్ల క్రితం వీరు జిల్లా కేంద్రంలోని ఎక్బల్ హైమద్‌నగర్‌లో ఇల్లు అద్దెకు తీసుకున్నారు. ధనలక్ష్మి ప్రతిరోజూ కాలనీల్లో తిరుగుతూ గాజులు అమ్మేది. ప్రసాద్ కూల్‌డ్రింక్స్ విక్రయిస్తుండేవాడు. కుటుంబ పోషణ, జల్సాలకు డబ్బులు సరిపోక దొంగతనాలు చేయడం ప్రవృత్తిగా ఎంచుకున్నారు. ఈ క్రమంలో ఏడాదిగా జిల్లాలో ఏడు చోరీలు చేశారు. సీసీ కెమెరాలకు సైతం చిక్కారు. పోలీసులు వీరిపై ప్రత్యేక నిఘా పెట్టారు. సోమవారం మరో దొంగతనం కోసం రెక్కి నిర్వహించేందుకు తిరుగుతున్న దంపతులను ప్రత్యేక బృందం అదుపులోకి తీసుకుంది. విచారణలో ఏడు దొంగతనాలను ఒప్పుకున్నారని, నిందితుల వద్ద నుంచి రూ.9వేల నగదు, రూ.4లక్షల విలువైన నగలు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ వెల్లడించారు. విజయవాడలోనూ చోరీలు ప్రసాద్ చిన్నతనంలోనే విజయవాడకు వెళ్లి కూలీగా పనిచేసేవాడు. హోటళ్లలో పనిచేసే క్రమంగా చిన్నచిన్న చోరీలు చేసి జైలుకు వెళ్లొచ్చాడు. ఈ క్రమంలో ధనలక్ష్మి పరిచయం అది ప్రేమకు దారి తీసింది. ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత దంపతులిద్దరూ మంచిర్యాల జిల్లా కేంద్రానికి మకాం మార్చారు. పగటిపూట ప్రసాద్ కాలనీల్లో రెక్కి నిర్వహించి, తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించేవాడు. రాత్రి పూట భార్యతో కలిసి చోరీలకు పాల్పడేవాడు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించి అరెస్ట్ చేసిన సీఐ నారాయణ్‌నాయక్, ఎస్సైలు దేవయ్య, ప్రవీణ్‌కుమార్, కిరణ్‌కుమార్, ప్రత్యేక పోలీస్ బృందం సభ్యులు దివాకర్, శ్రీనివాస్‌ను ఏసీపీ అభినందించారు. -
హైడ్రామా: కిరోసిన్ డబ్బా పట్టుకుని ఇంటి డాబా ఎక్కిన కొడుకు..
సాక్షి, సత్తుపల్లి(ఖమ్మం): ఆస్తిలో తనకూ వాటా ఇవ్వాలంటూ ఓ వ్యక్తి భవనమెక్కి హల్చల్ చేసిన సంఘటన సత్తుపల్లిలో ఆదివారం చోటుచేసుకుంది. పట్టణంలోని గాంధీనగర్–4కు చెందిన గుణగంటి రామకృష్ణ పదేళ్ల క్రితం కులాంతర వివాహం చేసుకున్నాడు. అప్పటి నుంచి తల్లిదండ్రులతో అతనికి సంబంధాలు నిలిచిపోయాయి. ఇటీవల తండ్రి ఆస్తిని ఇద్దరు కూతుళ్లకు పంచుతున్న క్రమంలో తనకూ వాటా ఇవ్వాలని వారం రోజులపాటు ఇంటి ముందు వరండాపైనే ఆందోళన చేశాడు. సమస్య పరిష్కా రం కాకపోవడంతో ఆదివారం ఉదయం కిరోసిన్ డబ్బా పట్టుకుని తన ఇంటి డాబా ఎక్కాడు. ఆస్తిలో వాటా ఇవ్వకపోతే పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరించాడు. సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్, చల్లగుళ్ల నర్సింహారావు, గాదె సత్యం తదితరులు ఘటనా స్థలానికి వెళ్లి న్యాయం చేస్తామని నచ్చజెప్పారు. కాగా రామకృష్ణను మాటల్లో పెట్టి రామిశెట్టి కృష్ణమూర్తి అనే వ్యక్తి వెనుకవైపు నుంచి వెళ్లి గట్టిగా పట్టుకుని రక్షించాడు. పెద్దల సమక్షంలో ఆస్తిలో వాటా ఇస్తామని హామీ పత్రం రాసి ఇవ్వటంతో.. సుమారు ఐదు గంటలపాటు నడిచిన హైడ్రామా సద్దుమణిగింది. పోలీసులు, ఫైర్ సిబ్బంది ఎటువంటి ప్రమాదం జరగకుండా వల ఏర్పాటు చేశారు. -
విషాదం: తల్లీకూతుళ్లను కబళించిన మృత్యువు
సాక్షి, ఆరిలోవ(విశాఖ): విశాఖనగరంలోని ఆరిలోవ ప్రాంతం దీన్‌దయాల్‌పురం వద్ద బీఆర్టీఎస్లో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లీకూతుళ్లు మృతి చెందారు. ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తూ ఎదురుగా వస్తున్న కారును ఢీకొని ప్రాణాలు కోల్పోయారు. ఆరిలోవ ఎస్ఐ గోపాలరావు తెలిపిన వివరాలివీ.. పెందుర్తి దరి సుజాతనగర్ ప్రాంతం పాపయ్యరాజుపాలేనికి చెందిన సత్యవేణి(45) ఆమె చిన్న కుమార్తె మౌనిక(22)తో కలసి ద్విచక్రవాహనంపై నగరానికి వచ్చారు. తిరిగి హనుమంతవాక, పెదగదిలి, సింహాచలం మీదుగా బీఆర్టీఎస్లో పెందుర్తి వెళ్లడానికి బయలుదేరారు. చినగదిలి దాటిన తర్వాత దీన్‌దయాల్‌పురం వద్ద హెల్త్‌సిటీలో క్యూ1 ఆస్పత్రి ఎదురుగా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ద్విచక్రవాహనం నడుపుతున్న మౌనిక వీఐపీలకు కేటాయించిన సెంటర్ రోడ్డులో ప్రయాణిస్తున్నారు. అదే రోడ్డులో ఎదురుగా వస్తున్న కారును ఢీకొన్నారు. కిందపడిన మౌనిక, ఆమె తల్లి సత్యవేణిలు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో సంఘటన స్థలంలోనే మౌనిక ప్రాణాలు విడిచింది. సత్యవేణిని ఆరిలోవ పోలీసులు హెల్త్‌సిటీలో ఓ ఆస్పత్రిలో చేర్పించారు. ఆమె చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతి చెందింది. కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ గోపాల్ తెలిపారు. సత్యవేణి పెద్ద కుమార్తె తేజస్విని, భర్త శ్రీరాములున్నారు. శ్రీరాములు హుకుంపేటలో ఉద్యోగం చేస్తున్నారు. హెల్మెట్ ఉన్నా... ద్విచక్రవాహనం నడుపుతున్న మౌనిక హెల్మెట్ ధరించింది. అయినా ప్రమాదం జరిగే సమయంలో ఆ హెల్మెట్ ప్రాణాలు కాపాడలేకపోయింది. తలకు ధరించిన హెల్మెట్ బలంగా రోడ్డును తాకడంతో ముక్కలైపోయింది. దీంతో తలకు తీవ్ర గాయాలపై సంఘటన స్థలంలోనే మౌనిక ప్రాణాలు కోల్పోయింది. వాహనానికి వెనుక కూర్చొన్న ఆమె తల్లి సత్యవేణి కొంత దూరం తుల్లిపోయి ప్రమాదానికి గురయ్యారు. పాడేరులో విషాదఛాయలు పాడేరు: గిరిజన ఉపాధ్యాయురాలు కంకిపాటి సత్యవేణి, ఆమె కుమార్తె మౌనికలు మృతి చెందడంతో పాడేరు, లగిశపల్లిల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. బీటెక్ చదివిన మౌనికకు ఇటీవల బెంగళూరులో ఉద్యోగం లభించింది. లగిశపల్లికి చెందిన సత్యవేణి జి.మాడుగుల మండలంలోని కొత్తపల్లి ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. పాడేరు లోచలిపుట్టులోని ఐటీడీఏ రెంటల్ క్వార్టర్స్‌లో తన భర్త, కాఫీ సబ్ అసిస్టెంట్ కంకిపాటి శ్రీరాములుతో కలిసి నివసిస్తున్నారు. విశాఖపట్నం సుజాత నగర్‌లోని గతంలో కొనుగోలు చేసిన ఫ్లాట్‌కు శని,ఆదివారాలు, సెలవు దినాల్లో వెళుతుంటారు. అలా వెళ్లిన వారు మృతి చెందడంతో బంధువులు, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఎంపీ, ఎమ్మెల్యేల సంతాపం సత్యవేణి, ఆమె కుమార్తె మౌనికలు మృతి చెందిన సంఘటనపై అరకు ఎంపీ గొడ్డేటి మాధవి, పాడేరు, అరకులోయ ఎమ్మెల్యేలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, చెట్టి పాల్గుణలు వేర్వేరు ప్రకటనల్లో విచారం వ్యక్తం చేశారు. జెడ్పీటీసీ సభ్యురాలు కిముడు గాయత్రిదేవి, పీఆర్టీయూ ఉపాధ్యాయ సంఘం నేత కిముడు దేముళ్లునాయుడు, లగిశపల్లి సర్పంచ్ లకే పార్వతమ్మతో పాటు ఉపాధ్యాయ, గిరిజన ఉద్యోగ సంఘాల నేతలు సంతాపం తెలిపారు. పాడేరు, జి.మాడుగుల ఎంఈవోలు సీహెచ్ సరస్వతిదేవి, కురుసా నాగభూషణంలు సహాయ కార్యక్రమాలు చేపట్టారు. -
కొంప ముంచిన పెళ్లి భోజనం.. 190 మంది అస్వస్థత
సాక్షి, దొడ్డబళ్లాపురం(కర్ణాటక): పెళ్లింట భోజనం చేసిన 190 మంది అస్వస్థతకు గురై ఆస్పత్రిపాలైన సంఘటన దావణగెరె జిల్లా హోన్నాళి తాలూకా హోసదేవర హొన్నాళి గ్రామంలో చోటుచేసుకుంది. శనివారం రాత్రి గ్రామంలో జరిగిన వివాహ వేడుకలో భోజనం చేసిన వారికి అర్థరాత్రి వాంతులు, విరేచనాలు ప్రారంభమయ్యాయి. దీంతో వారందరినీ సమీప ప్రభుత్వ,ప్రైవేటు ఆస్పత్రులకు తరలించారు. 10 మందికి ఆరోగ్యం విషమించడంతో జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఎవరికీ ప్రాణాపాయం లేదని వైద్యులు స్పష్టం చేసారు. వివాహ వేడుకలో చేసిన ఆహారాన్ని పరీక్షల కోసం దావణగెరెకు పంపించారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
ప్రాణం తీసిన ‘మందు’ జాగ్రత్త..
సాక్షి, అల్వాల్ (హైదరాబాద్): అనారోగ్యానికి గురి కాకుండా తీసుకున్న మందు వికటించి ఒకరు మృత్యువాత పడగా మరో ఇద్దరు చికిత్స పొందుతున్న సంఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్ఐ. పరుశురామ్ వివరాల ప్రకారం.. మచ్చబొల్లారం చంద్రనగర్‌లో నివసించే నరేష్కుమార్ (30), ప్రైవేట్ ఉద్యోగి. ఇదిలా ఉండగా ఓ చానల్లో సూచించిన ఆయుర్వేద మందు తీసుకుంటే కరోనాతో పాటు ఎలాంటి వ్యాధులు దరిచేరవని భావించి నరేష్కుమార్ బుధవారం తల్లి లక్ష్మీ, భార్య సంధ్యారాణిలతో కలిసి తాగారు. కాసేపటి తర్వాత ముగ్గురు వాంతులు విరోచనాలతో తీవ్ర అస్వస్థతకు గురవ్వగా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ నరేష్కుమార్ గురువారం మృతి చెందగా, లక్ష్మీ, సంధ్యారాణి చికిత్స పొందుతున్నారు. మృతుడి సోదరుడి శ్రవణ్‌కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రియుడి పక్కా స్కెచ్.. ఎక్కడికైన తీసుకెళ్లాలని కోరిన ప్రియురాలిని..
సాక్షి, పెనుమూరు(చిత్తూరు): నమ్మి వచ్చిన ప్రియురాలిని హత్య చేసిన ప్రియుడిని పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఈ ఘటన మండలంలో కలకలం రేపింది. గురువారం చిత్తూరు డీఎస్పీ సుధాకరరెడ్డి తెలిపిన వివరాలు.. బిహార్ రాష్ట్రం, గోపాల్ గంజి జిల్లా, మధు సారియా గ్రామానికి చెందిన రాజ్‌దూత్, అతని పక్కింటికి చెందిన కవితకుమారి(20) ప్రేమించుకున్నారు. ఇద్దరూ ఒక్కటి కావడంతో కవితకుమారి గర్భం దాల్చింది. ఫలితంగా తనను ఎక్కడికైనా తీసుకెళ్లాలని ప్రియుడిని ఆమె బలవంతం చేయడంతో చెన్నైలో ఉద్యోగం చేస్తున్న రాజ్‌దూత్ ఆమెను చిత్తూరుకు తీసుకొచ్చాడు. ఈ ఏడాది అక్టోబర్ 11న చిత్తూరులోని ఓ సెల్‌ఫోన్ షాపులో ఫోన్ రిపేరు చేసుకున్నారు. అనంతరం పెనుమూరు క్రాస్ రోడ్డు సమీపంలో ఉన్న శ్రీవెంకటేశ్వరా ఇంజినీరింగ్ కళాశాలలో కవిత కుమారిని బీ–ఫార్మసీ కోర్సులో చేర్చేందుకు ప్రయత్నించాడు. అయితే సీటు లభించకపోవడంతో మండలంలోని కలవగుంట పంచాయతీ విజయనగరం యానాదికాలనీలో ఓ ఇంట అద్దెకు దిగారు. అబార్షన్ చేసుకోవాలని ప్రియురాలిపై ఒత్తిడి తెచ్చాడు. దీనికి ఆమె ససేమిరా అనడంతో అంతం చేయాలని స్కెచ్ వేశాడు. ఆమె నిద్రిస్తున్న సమయంలో ముఖంపై దిండుతో గట్టిగా అదిమి, ఊపిరి ఆడకుండా చేసి, హతమార్చాడు. అనంతరం ఆమె దుస్తులతో సహా ఎలాంటి ఆధారాలు లేకుండా అతడు పారిపోయాడు. రెండు రోజుల తర్వాత ఆ ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు అనుమానించారు. అక్టోబర్ 19న పోలీసులకు సమాచారం ఇచ్చారు. పాకాల సీఐ ఆశీర్వాదం, ఎస్ఐ నరేంద్ర అక్కడికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మృతదేహం వెలుగులోకి వచ్చిన రూములో లభించిన మొబైల్ షాపు విజిటింగ్ కార్డు, ఓ షర్టుపై ఉన్న స్టిక్కర్ కేసు దర్యాప్తుకు ‘క్లూ’లయ్యాయి. అలాగే, మొబైల్ షాపులోని సీసీ ఫుటేజీల ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేశారు. -
మరో నెలరోజుల్లో ఆ ఇంట్లో పెళ్లి బాజాలు.. అంతలోనే..
సాక్షి, బాన్సువాడ టౌన్(నిజామాబాద్): మరో నెలరోజుల్లో కూతురి పెళ్లి. పెళ్లి పనులు ప్రారంభం అయ్యాయి. అంతా సంతోషంగా ఉన్న సమయంలో ఒక్కసారిగా ఆ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. వివరాలు.. పట్టణంలోని పాత బాన్సువాడకు చెందిన గులెపల్లి నిర్మల(35), భర్త కిషన్ దంపతుల కుమార్తెకు వచ్చే నెలలో వివాహం నిశ్చయమైంది. ఈక్రమంలో వారు ఈనెల 6న అల్లుడికి బైక్ కొనిచ్చారు. అనంతరం తమ పొలానికి వెళ్లి ఇంటికి వస్తుండగా మార్గమధ్యలో పంది అడ్డుగా వచ్చి బైక్‌ను ఢీకొంది. ఈప్రమాదంలో భార్యభర్తలిద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు వెంటనే బాధితులనుని ఆస్పత్రికి తరలించగా, నిర్మలా కాలు విరగడంతో వైద్యులు సిమెంట్ పట్టి కట్టారు. దీంతో మరో నెలరోజుల్లో కూతురు పెళ్లి, తనకేమో ఇలా కాలు విరిగిందని నిర్మలా బాధపడుతుండగా, ఈ నెల 7న గుండెపోటు వచ్చింది. వెంటనే కుటుంబసభ్యులు ఆమెను స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లగా, వైద్యుల సూచన మేరకు నిజామాబాద్‌కు తరలించారు. అప్పటికే నిర్మలా మృతి చెందిందని అక్కడి వైద్యులు పేర్కొన్నారు. నిర్మలా మృతితో బాన్సువాడలో విషాదచాయలు అలుమకున్నాయి. నెల రోజుల్లో కూతురి పెళ్లి, ఇంకా ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉండటంతో ప్రతి ఒక్కరు కన్నీరు పెట్టుకున్నారు. చదవండి: మసాజ్ ముసుగులో వ్యభిచారం.. 10 మంది అరెస్టు -
అన్నా.. నీవెంటే నేను..
సాక్షి, ఇంద్రవెల్లి(ఆదిలాబాద్): అన్నా.. నీ వెంటే నేనూ అంటూ సోదరుడు మరణించిన గంట వ్యవధిలో సోదరి కూడా మృతిచెందింది. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం తేజాపూర్‌లో మంగళవాం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. తేజాపూర్ గ్రామానికి చెందిన నర్వటె మారుతి(65) తెల్లవారు జామున గుండెపోటుతో మృతిచెందాడు. ఆదే గ్రామంలో ఉంటున్న చెల్లెలు మస్కె రేణుక(48) అన్న మరణ వార్త విని వెంటనే సోదరుడి ఇంటికి చేరుకుంది. మారుతి మృతదేహం వద్ద రోదిస్తూ ఒక్కసారిగా కుప్పకూలింది. బంధువులు వెంటనే రేణుకను ప్రైవేటు వాహనంతో ఆదిలాబాద్ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు రేణుక అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. అన్న చనిపోయాడన్న బాధతో రేణుక కూడా గుండెపోటుతో మృతిచెంది ఉంటుందని తెలిపారు. గంట వ్యవధిలోనే అన్నాచెల్లెలు మృతిచెందడంతో తేజాపూర్‌లో విషాదం నెలకొంది. నర్వెట మారుతికి భార్య రత్నాబాయి, మస్కె రేణుకాబాయికి కూతురు నిర్గున, కొడుకు గోరాక్నాథ్ ఉన్నారు. బంధువులు అన్నాచెల్లెలిద్దరికీ ఒకేచోట అంత్యక్రియలు పూర్తిచేశారు. -
మాయదారి రోగం: రెండేళ్ల క్రితం తండ్రి.. నేడు తల్లి..
సాక్షి, చండూరు(నల్లగొండ): అభం శుభం తెలియని వయసులో పెద్ద కష్టమే వచ్చింది. అమ్మానాన్న నీడలో హాయిగా ఉండాల్సిన చిన్నారులపై విధి కన్నెర్రజేసింది. రెండేళ్ల తేడాతో తల్లిదండ్రులను కోల్పోయిన ఆ అభాగ్యులు నేడు విధి వంచితులుగా మిగిలారు. ఈ విషాదకర ఘటన నల్లగొండ జిల్లా చండూరు మండల పరిధిలో చోటు చేసుకుంది. వివరాలు.. మండల పరిధిలోని బోడంగపర్తి గ్రామానికి చెందిన బొమ్మరగాని రాజు (32), యాదమ్మ (30) దంపతులకు వర్షిత్(10), వైష్ణవి(8) సంతానం. కూలి పనులు చేసుకుంటూ పిల్లలను పోషించుకుంటున్నారు. స్థానికంగా వర్షిత్ 5వ తరగతి, వైష్ణవి 3వ తరగతి చదువుతున్నారు. సొంత భూమి లేకపోయినా పూరి గుడిసెలోనే ఉన్నంతలో హాయిగా జీవనం సాగిస్తున్నా రు. కాగా, రెండేళ్ల క్రితం మాయదారి రోగం బారిన పడి రాజు మృతిచెందాడు. దీంతో యాదమ్మపైనే కుటుంబ భారం పడింది. మనోధైర్యం కోల్పోకుండా కూలీ పనులు చేస్తూ పిల్లల ఆలనా పాలన చూస్తోంది. కొంతకాలం క్రితం అనారోగ్యం బారిన పడిన యాదమ్మ కూడా సోమవారం కన్నుమూయడంతో ఆ చిన్నారులకు నా అనేవారు లేకుండా పోయారు. దీంతో గ్రామస్తులే ఆమె దహనసంస్కారాలు నిర్వహించారు. అనాథలైన చిన్నారులను ప్రభుత్వం ఆదుకోవా లని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. చిన్నారులకు టీఆర్ఎస్ గ్రామ నాయకులు కట్కూరి సత్తయ్య, గుర్రం వెంకట్‌రెడ్డి, ము త్తయ్య, వెంకన్న, సురేష్, నరేష్, రామలింగం, శ్రీను, మహేష్ రూ. 10వేల ఆర్థికసాయం అందజేశారు. -
పూజ సామాగ్రిని నీటిలో కలపడానికి వెళ్లారు.. అంతలోనే..
సాక్షి, దొడ్డబళ్లాపురం(కర్ణాటక): చెరువులో కాలుజారిపడి ఇద్దరు బాలికలు మృతి చెందిన సంఘటన బెళగావి తాలూకా మారిహాళ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సాంబ్రా నివాసులు నేత్రకొళవి (8), ప్రియాకొళవి (6) మృతి చెందారు. దీపావళి సందర్భంగా పూజకు ఉపయోగించిన పూజా సామాగ్రిని నీటిలో వదలడానికి అక్క సుధ (10)తో కలిసి చెరువు వద్దకు వెళ్లిన ప్రియ, నేత్ర ఇద్దరూ అరటి చెట్టును చెరువు నీటిలో వదిలే క్రమంలో కాలుజారి నీటిలో మునిగి మృతి చెందారు. స్థానికులు బాలికల మృతదేహాలను వెలికితీసారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. చదవండి: పోలీసుల టార్చర్.. పురుగుల మందు తాగి ఐదుగురు మృతి.. -
పరాయి పురుషుల వద్దకు వెళ్లాలని బలవంతం చేస్తున్నాడు!
సాక్షి, దొడ్డబళ్లాపురం(కర్ణాటక): రెండవ భార్య చేతిలో రియల్టర్ ప్రాణాలు కోల్పోయిన ఘటన నెలమంగల తాలూకా మాదనాయకనహళ్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పలార్‌స్వామి అలియాస్ స్వామిరాజ్ (50)ను బ్యూటీషీయన్ కమ్ రెండవ భార్య అయిన నేత్ర హత్య చేసినట్లు కేసు నమోదైంది. ఆరేళ్ల కిందట పెళ్లి వివరాలు.. పలార్‌స్వామికి ఇదివరకే పెళ్లయింది. బెంగళూరు ఉత్తర తాలూకాలో లేఔట్లు వేసి కోట్ల రూపాయలు ఆర్జించాడు. 6 ఏళ్ల కిందట బ్యూటీపార్లర్ నడుపుతున్న నేత్రతో వివాహేతర సంబంధం ఏర్పడి తరువాత పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు హారో క్యాతనహళ్లి వద్ద రూ.6 కోట్లు ఖర్చుపెట్టి పెద్ద బంగ్లా నిర్మించి ఇచ్చాడు. ఆదివారం రాత్రి పలార్‌స్వామిని రాడ్‌తో కొట్టి హత్యచేసిన నేత్ర మాదనాయకనహళ్లి పోలీస్‌స్టేషన్‌కు వచ్చి లొంగిపోయింది. భర్త తనను పరాయి పురుషుల వద్దకు వెళ్లాలని బలవంతం చేసేవాడని, అందుకే హత్య చేసానని పోలీసులకు తెలిపింది. అయితే తమను, పిల్లలను బాగా చూసుకుంటున్నాడనే కోపంతో హత్య చేసిందని మొదటి భార్య ఆరోపిస్తోంది. కేసు విచారణలో ఉంది. -
Custard Apple: ప్రాణం తీసిన సీతాఫలం
సాక్షి, దుగ్గొండి (వరంగల్): వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం స్వామిరావుపల్లిలో ఆదివారం సీతాఫలాల కోసం వెళ్లి బాలుడు మృత్యువాత పడ్డాడు. గ్రామానికి చెందిన జమలాపురం శ్రీనివాస్– మమత దంపతుల కుమారుడు సన్ని(9) ఆదివారం పాఠశాలకు సెలవు కావడంతో ఇంటి సమీపంలోని జమలాపురం చిన్న సాంబయ్య ఇంటి ప్రహరీ పక్కనే ఉన్న సీతాఫలం చెట్టుపై పండ్లు కోయడానికి గోడ ఎక్కాడు, కాయలు కోస్తుండగా ప్రమాదవశాత్తు గోడకూలి పెల్లలు సన్నిపై పడ్డాయి. దీంతో తీవ్రగాయాలైన సన్ని అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహం వద్ద బాలుడి తల్లిదండ్రులు శ్రీనివాస్–మమత రోదనలు కంటతడిపెడుతున్నాయి. బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై లక్ష్మారెడ్డి తెలిపారు. చదవండి: Hyderabad: పూల కుండీల్లో గంజాయి మొక్కలు -
కూతురిపై ఆరోపణలు.. కుటుంబమంతా పురుగులమందు తాగారు..
సాక్షి, కోలారు (కర్ణాటక): ఒకే కుటుంబంలో ఐదు మంది ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన కోలారు నగరంలోని కారంజికట్ట కాలనీ 4వ క్రాస్‌లో చోటుచేసుకుంది. మునేశప్ప (75), భార్య నారాయణమ్మ (70), కుమారుడు బాబు (45), కూతురు పుష్ప (33), మనవరాలు గంగోత్రి (17) ఆదివారం పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకోబోయారు. మునేశప్ప కుమార్తె పుష్ప వేరొకరికి మగబిడ్డని విక్రయించిందని ఆరోపణపై కోలారు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దీంతో పరువు పోయిందని కుంగిపోయిన కుటుంబ సభ్యులందరూ ఆత్మహత్య చేసుకోవాలని పురుగుల మందు తాగారు. స్థానికులు వీరిని ఎస్ఎన్ఆర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్స కొనసాగుతోంది. నగర పోలీసులు కేసు నమోదు చేశారు. చదవండి: ప్రియునికి కాబోయే భార్యపై ప్రియురాలి దాడి.. -
పుదుచ్చేరి: బైకులో తీసుకేళుతుండగా పేలిన నాటుబాంబులు
-
టపాకాయలు తీసుకుని గంటలో వస్తానన్నారు.. అంతలోనే..
పుదుచ్చేరి: దీపావళి పండుగ రోజు ఆ కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఈ ఘటన పుదుచ్చేరి లోని విల్లుపురం జిల్లాలో జరిగింది. కూనిమెడు గ్రామానికి చెందిన కలైనేషన్, తన కొడుకు ప్రదీప్‌తో కలసి టపాకాయలు కొనుగోలు చేసి స్కూటర్‌పై.. తన స్వగ్రామానికి వస్తున్నారు. ఈ క్రమంలో విల్లుపురం రహదారిపై ఒక్కసారిగా మంటలు చేలరేగాయి. ద్విచక్ర వాహనం పెద్ద ఎత్తున పేలిపోయి.. కలైనేషన్, ప్రదీప్‌లు అక్కడిక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో వీరితో పాటు మరో ముగ్గురు కూడా తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి.. ఒక లారీతోపాటు, రెండు ద్విచక్రవాహనాలు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. వెంటనే స్థానికులు క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఒక గంటలో వస్తామని చెప్పిన భర్త.. కొడుకు చనిపోయారని తెలియడంతో.. వారి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. కాగా, పేలుడుకి గల కారణాలు తెలియాల్సిఉంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్నపోలీసులు దర్యాప్తు చేపట్టారు. చదవండి: భార్యకు వీడియో కాల్ చేసి జైలు వార్డెన్ ఆత్మహత్య -
పాక్‌లో ఘోర రోడ్డు ప్రమాదం: 22 మంది మృతి
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఒక ప్యాసింజర్ బస్సు అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 22 మంది మృతి చెందారు. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. సంఘటన స్థలానికి చేరుకున్న స్థానికులు, పోలీసులు సహయంతో సహయక చర్యలు ప్రారంభించారు. బస్సు బలోచ్ ప్రాంతం నుంచి రావల్పిండి వెళ్తుండగా సుద్నోతి జిల్లాలో ప్రమాదం సంభవించింది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. బస్సు.. బ్రేకులు సరిగా పడకపోవడం వలన అదుపుతప్పి 500 మీటర్ల పాటు.. రోడ్డుకిందకు వచ్చి పడింది. చనిపోయిన వారిలో మహిళలు, చిన్నారులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. స్థానికులు, అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. -
వేగంగా వెళ్తూ.. చెట్టును ఢీకొట్టి..
కామారెడ్డి (నిజామాబాద్): తాడ్వాయి మండలం ఎర్రపహాడ్‌లో ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. కారు చెట్టును ఢీకొన్న ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. కాగా, టపాసులు కొనడానికి కారులో వెళ్లినప్పుడు ఈ ఘటన జరిగిందని కుటుంబ సభ్యులు తెలిపారు. కారులో ఎనిమిది మంది ప్రయాణికులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మృతిచెందిన వారిలో.. జగన్ (45), ఆనంద్ (28), శ్రీనివాస్ (52), శశాంక్ ఐదు సంవత్సరాల బాలుడు ఉన్నట్టు గుర్తించారు. కామారెడ్డిలో టపాసులు కొనుగోలు చేసి.. ఎల్లారెడ్డివైపు వెళ్తుండగా కారు ప్రమాదం సంభవించింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
టీఆర్ఎస్ కార్యకర్తల టాటా ఏస్‌ను ఢీకొట్టిన లారీ.. ముగ్గురి పరిస్థితి విషమం
కరీంనగర్: హుజురాబాద్ మండలం రాజపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హుజారాబాద్‌లో ఎన్నికల ప్రచారం కోసం తరలిస్తున్న టీఆర్ఎస్ కార్యకర్తల టాటా ఏస్ వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో 10 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. టాటా ఏస్‌లో మొత్తంగా.. 20 మంది మహిళలు ఉన్నారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం జరిగిన వెంటనే.. ట్రాలీలో ఉన్నమహిళలు రోడ్డుపై ఎగిరి పడ్డారు. ఆ ప్రదేశమంతా క్షత గాత్రుల ఆర్తనాదాలతో మిన్నంటిపోయింది. వెంటనే వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. వారిలో ముగ్గురు మహిళల పరిస్థితి విషమంగా ఉండటంతో .. వారికి మెరుగైన చికిత్సకోసం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ప్రమాద స్థలాన్ని హుజురాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. రోడ్డుపై ఒకవైపు పూర్తిగా ధాన్యం రాసులు కుప్పగా పోయడం వలన ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. -
డ్రైవర్ నిర్లక్ష్యంతో.. సంధ్య వాలింది
సాక్షి, తిరుపతి తుడా/రాయచూరు (కర్ణాటక): రాయచూరు సమీపంలోని ముదగల్ గ్రామానికి చెందిన భాగ్యలక్ష్మి(55)కి సువర్ణ, సంధ్య, సౌమ్య, సుజిత్ నలుగురు పిల్లలు. పెద్ద అల్లుడు సువర్ణ భర్త వినోద్‌కుమార్, రెండో అల్లుడు సంధ్య భర్త హరీష్‌తో పాటు రెండేళ్ల మనుమరాలు విన్మయ్ తదితర కుటుంబ సభ్యులు మొత్తం ఎనిమిది మందితో గురువారం రాత్రి బెంగళూరు మీదుగా శుక్రవారం కంచికి చేరుకున్నారు. అక్కడ అమ్మవారిని దర్శించుకుని తిరుమల వెళ్లేందుకు తిరుపతికి బయలుదేరారు. రాత్రి 12 నుంచి ఒంటి గంట దాకా నగరంలో భారీ వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ క్రమంలో రైల్వే అండర్ బ్రిడ్జి కింద 8 అడుగులకు పైగా నీరు చేరింది. ఇదే సమయంలో వారు ప్రయాణిస్తున్న తుఫాన్ వాహనం రైల్వే అండర్ బ్రిడ్జి వద్దకు చేరింది. డ్రైవర్ ఆంజనేయులు నిర్లక్ష్యంగా వాహనాన్ని నీటిలో దింపాడు. మధ్యలో ఇంజిన్ ఆగిపోవడం.. అంతలోనే నీటి ప్రవాహం పెరగడంతో వాహనం పూర్తిగా మునిగిపోయింది. చీర విసిరినా.. నీట మునిగిన వాహనంలోని పిల్లలు, అల్లుళ్లు, మనుమరాలును కాపాడేందుకు ఇంటికి పెద్ద దిక్కు అయిన భాగ్యశ్రీ విశ్వప్రయత్నాలు చేసింది. తన చీరను అప్పటికే గట్టువద్దకు చేరుకున్న పోలీసులు, స్థానికుల వద్దకు విసిరింది. వాహనంలోని వారు చీర సహాయంతో ఒక్కొక్కరూ గట్టుకు చేరారు. వెనుక సీటులో నిద్రిస్తున్న సంధ్యను గుర్తించలేకపోయారు. వారందరూ బయటకు వచ్చిన రెండు నిమిషాల తర్వాత సంధ్య కోసం ప్రయత్నించగా.. ఊపిరి ఆడక వాహనంలోనే తుది శ్వాస విడిచింది. విధికి కన్నుకుట్టిందేమో.. ముదగల్‌కు చెందిన సంధ్య(28)కి సమీపంలోని లింగసూగూరుకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ హరీష్ గుప్తా(30)తో ఇటీవలే వివాహమైంది. చూడచక్కని జంట. చిలకా గోరింకల్లా ఉన్నారని అందరూ సంతోషపడ్డారు. ఇంతలో విధికి కన్నుకుట్టిందేమో.. నవ వధువును అర్ధంతరంగా కబళించింది. సంధ్య స్వగ్రామంలో, అటు అత్తవారి గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. -
Tragedy: వినాయక నిమజ్జన వేడుకల్లో అపశృతి
సాక్షి, ఆదిలాబాద్: వినాయక నిమజ్జన వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. అప్పటివరకు బ్యాండ్ మేళాల మధ్య నృత్యాలు చేస్తూ ఆనందంగా గడిపిన యువకుడు నిమజ్జనం అనంతరం వాగులో మునిగి మృతిచెందాడు. ఆదిలాబాద్‌రూరల్ ఎస్సై అంజమ్మ వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ పట్టణం అనుకుంటకు చెందిన దేవన్న–అక్కమ్మల కుమారుడు కన్నయ్య(22) బంగారుగూడ వాగులో గణేశ్ నిమజ్జనం అనంతరం కొంతమంది యువకులు కలిసి వాగులో స్నానం చేశారు. వారితో పాటు కన్నయ్య కూడా స్నానం చేయగా ఈత రాకపోవడంతో నీటిలో మునిగాడు. స్నేహితులందరూ రక్షించేందుకు ప్రయత్నించినప్పటికీ గల్లంతయ్యాడు. తీరా శవమై తేలాడు. కన్నయ్యకు నలుగురు అక్కాచెల్లెళ్లు ఉన్నారు. తండ్రి గతంలో మరణించగా తల్లి కూలీనాలి చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. చేతికొచ్చిన కుమారుడు ఇలా మృతిచెందడంతో కుటుంబ సభ్యుల రోదనలు స్థానికులను కలచివేశాయి. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. చదవండి: Medak: ఒకేరోజు ఏడు చోట్ల చోరీలు మరువక ముందే.. -
Tamilnadu: ఆ బిడ్డకు నేనే తండ్రిని.. ఇద్దరు యువకుల ఘర్షణ
సాక్షి, తిరువొత్తియూరు(తమిళనాడు): వివాహితతో ఇద్దరూ అక్రమ సంబంధం పెట్టుకున్నారు. ఆమె గర్భం దాల్చడంతో నేనంటే నేనే తండ్రిని అని గొడవపడ్డారు. కత్తితో దాడి చేయడంతో ఒకరు మృతిచెందారు. వివాహేతర సంబంధం ఎప్పటికైనా విషాదాంతం అవుతుందని తెలిపే ఈ ఘటన సేలం జిల్లాలో జరిగింది. వివరాలు.. అయోధ్య పట్టణం రామ్‌నగర్ కాలనీకి చెందిన మురుగేశన్ రెండో భార్య కలైమణి (23)కి అదే ప్రాంతానికి చెందిన కలై అరసన్(23), కృపై రాజ్(23)తో ఒకరికి తెలియకుండా మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ క్రమంలో కలైమణి గర్భం దాల్చింది. శుక్రవారం ఈ విషయం ఇద్దరు ప్రియులకు తెలియడంతో గొడవపడ్డారు. కడుపులోని బిడ్డకు నేనంటే నేనే తండ్రిని అని వాదించుకున్నారు. ఆగ్రహించిన కలైఅరసన్ కత్తితో కృపైరాజ్‌పై దాడి చేసి హత్య చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు కలైమణి, కలై అరసన్‌లను అరెస్టు చేశారు. చదవండి: నిఖా అయిన నిమిషానికే ప్రియుడితో పెళ్లికూతురు పరార్! -
నా భర్తను వెతికి పెట్టండి: కెనడాలో తెలుగు మహిళ ఆవేదన
సాక్షి, హైదరాబాద్: కెనడాలోని మాంట్రియల్లో ఉంటున్న దీప్తిరెడ్డి అనే వివాహిత తన భర్త కనిపించడం లేదని భారత విదేశాంగ శాఖకు ట్విటర్లో తెలిపింది. ఎటువంటి సమాచారం లేకుండా తన భర్త తనను వదిలేసి ఇండియాకు వచ్చేశారని వాపోయింది. ప్రస్తుతం, తాను గర్భవతిని ఉన్నట్లు వెల్లడించింది. తన భర్త అనుగుల చంద్రశేఖర్ రెడ్డి కెనడాలో మెక్‌గ్రిల్ యూనివర్సిటీలో రసాయన శాస్త్రవిభాగంలో పనిచేసేవారని తెలిపింది. తన భర్తకు చాలా సార్లు ఫోన్‌చేశాను.. నా సెల్ నంబరును నా భర్త తరపు కుటుంబ సభ్యులు బ్లాక్ చేశారని వాపోయింది. ఆగస్టు 9 నుంచి తన భర్త ఆచూకీ లేదని వాపోయింది. తాను.. భారత హైకమిషన్‌కు 2021 ఆగస్టు 20న ఫిర్యాదు చేశానని తెలిపింది. ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేదని తన ట్వీట్లో తెలియజేసింది. కావాలనే నా భర్త ఆచూకీ తెలియకుండా చేస్తున్నారని తెలిపింది. కాగా, తన బావ శ్రీనివాస్ రెడ్డి చైతన్యపురిలో కానిస్టేబుల్‌గా పనిచేస్తుంటారని దీప్తి పేర్కొంది. ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి బాగోలేదని తెలిపింది. తన భర్త ఆరోగ్యం పట్ల తీవ్ర ఆందోళనకు లోనవుతున్నానని తెలిపింది. దీప్తి వినతి మేరకు స్పందించిన విదేశాంగ శాఖ రాచకొండ పోలీసులకు సమాచారం ఇచ్చింది. రంగంలోకి దిగిన రాచకొండ పోలీసులు చంద్రశేఖర్ రెడ్డి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చదవండి: Krishna: కేఈబీ కెనాల్ లోకి దూసుకెళ్లిన ఇన్నోవా వాహనం -
Nellore: ఈతకు వెళ్లిన ఇద్దరు బాలికలు మృతి
నెల్లూరు: నెల్లూరు జిల్లా దీన్‌దయాల్ నగర్లో విషాదం చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న చెరువులో సరదాగా ఈతకు వెళ్లిన ఇద్దరు బాలికలు మృతిచెందారు. ప్రస్తుతం ఈ సంఘటన స్థానికంగా కలకలంగా మారింది. మృతి చెందిన వారిని చందు, కల్పనలుగా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. చదవండి: ప్రియుడితో ఉండగా చూశాడని.. కొడుకు హత్య -
విషాదం: చెరువులో దూకిన తల్లి, కొడుకు
కర్నూలు: కర్నూలు జిల్లా సంజామ మండలం నోస్సం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. చెరువులో దూకి తల్లి, కొడుకు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కాగా, వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహలను బయటకు తీసే ప్రయత్నాలు చేస్తున్నారు. వీరి ఆత్మహత్యలకు కుటుంబ కలహలు కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. చదవండి: ప్రియుడితో ఉండగా చూశాడని.. కొడుకు హత్య -
విషాదం: పురుడు పోశారు.. ప్రాణం తీశారు..
సాక్షి, పెద్దపల్లి(కరీంనగర్): కాన్పు కోసం ఆసుపత్రికి వెళ్లిన ఓ మహిళ సకాలంలో వైద్యం అందక కన్నుమూసిన ఘటన జిల్లా కేంద్రంలో చర్చనీయాంశమైంది. పోలీసులు, బాధిత కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. పెద్దపల్లి మండలం పెద్దబొంకూర్ గ్రామానికి చెందిన మిట్టపల్లి అనూష (26) రెండోసారి గర్భం దాల్చింది. బుధవారం రాత్రి పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు రాత్రి 8 గంటలకు పెద్దపల్లి ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఆ సమయంలో విధుల్లో ఉన్న డాక్టర్ రుక్మిణి, మత్తు డాక్టర్ కృష్ణారెడ్డి పరిశీలించి సాధారణ ప్రసవం అవుతుందని వేచిచూశారు. రాత్రి 11గంటల వరకు వేచి చూసినా ప్రసవం జరగకపోవడం.. పురిటి నొప్పులు తీవ్రం కావడం.. అనూష కన్నీరు పెట్టడంతో కుటుంబసభ్యులు ఆపరేషన్ చేయాలని వైద్య సిబ్బందిపై ఒత్తిడి చేశారు. దీంతో వైద్యులు 11 గంటల సమయంలో ఆపరేషన్ థియేటర్‌కు తీసుకెళ్లి సిజేరియన్ చేసి పండంటి బాబుకు పురుడుపోశారు. బాలింతను పట్టని వైద్య సిబ్బంది ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యమే అనూష పాలిట శాపంగా మారింది. పురుడు పోసిన వైద్యులు.. అనంతరం పట్టించుకోకపోవడంతో ఆమె పరిస్థితి విషమించింది. తీవ్ర రక్తస్రావం అయినా ఎలాంటి చర్యలూ తీసుకోలేదని తెలుస్తోంది. తీరా అర్ధరాత్రి దాటాక గమనించే సరికి అనూష పరిస్థితి విషమించింది. కుటుంబసభ్యులకు తెలపకుండానే వైద్య సిబ్బంది ఆమెను అంబులెన్స్‌లో కరీంనగర్ తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. కుటుంబ సభ్యులు గమనించి నిలదీయగా.. జరిగిన విషయాన్ని వారితో చెప్పారు. అందరూ కలిసి అనూషను కరీంనగర్‌కు తీసుకెళ్లేసరికి అప్పటికే చనిపోయినట్లు అక్కడి వైద్యులు తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు అదే అంబులెన్సులో మృతదేహంతో పెద్దపల్లి ఆస్పత్రికి చేరుకుని ఆందోళనకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే అనూష చనిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యులను సస్పెండ్ చేయాలంటూ.. విషయం తెలుసుకున్న అనూష బంధువులు పెద్ద ఎత్తున ఆసుపత్రికి చేరుకున్నారు. అనూషకు ఆపరేషన్ చేసి నిర్లక్ష్యం చేసిన వైద్యులు రుక్మిణి, మత్తు డాక్టర్ కృష్ణారెడ్డి, స్టాఫ్‌నర్స్ నిర్మలతను సస్పెండ్ చేయాలని కుటుంబ సభ్యులు, ప్రజాసంఘాల నాయకులు కుమార్ గౌడ్, స్వామి వివేక్ పటేల్, శ్రావణ్ దిలీప్, అశోక్, కృష్ణ, పెద్దబొంకూర్ సర్పంచ్ మానస, ముత్తారం సర్పంచ్ కుమారస్వామి, మిట్టపల్లి వెంకటేశం డిమాండ్ చేశారు. ఆందోళన విషయం తెలుసుకున్న పెద్దపల్లి, బసంత్‌నగర్ ఎస్సైలు రాజేష్, మహేందర్ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అనూష మృతిపై చేపట్టిన విచారణ ప్రాథమిక నివేదికను జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ వాసుదేవ రెడ్డి కలెక్టర్ సంగీతకు అందించారు. అయితే సంఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేసేందుకు గోదావరిఖని ఏరియా ఆసుపత్రి వైద్యుడిని నియమించారు. అనూషకు భర్త శ్రీకాంత్, కూతురు ఉంది. మృతురాలి అత్త స్వరూప ఫిర్యాదు మేరకు వైద్య సిబ్బందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజేష్ తెలిపారు. చదవండి: Karimnagar: ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుకు రూ.2 లక్షలు..? -
Karnataka: బుల్లెట్‌ను ఢీకొని వంతెన గోడమీదకు దూసుకెళ్లిన కారు
సాక్షి, బొమ్మనహళ్లి (కర్ణాటక): ఇటీవల ఆడి కారు ప్రమాదంలో ఏడుగురు మృత్యువాత పడిన దుర్ఘటన మరువకముందే మరో రోడ్డు బీభత్సం చోటుచేసుకుంది. బెంగళూరులో బొమ్మనహళ్ళి–ఎలక్ట్రానిక్ సిటీ మధ్యలోనున్న వంతెన పైన మంగళవారం రాత్రి జరిగిన ప్రమాదంలో ఇద్దరు టెక్కీలు వంతైన పై నుంచి కింద పడి దుర్మరణం చెందారు. మృతులు తమిళనాడుకు చెందిన ప్రీతం (30), కృతికా రామన్ (28)గా పోలీసులు గుర్తించారు. వంతెన మీద ఆగడమే తప్పయింది.. ఎలక్ట్రానిక్ సిటీ ట్రాఫిక్ పోలీసులు తెలిపిన ప్రకారం.. ప్రీతం జేపీ నగరలో నివాసం ఉంటూ సర్జాపుర రోడ్డులోని ఒక ఐటీ కంపెనీలో పనిచేస్తున్నాడు. కృతికా రామన్ మహాదేవపురలో నివాసం ఉంటోంది. ఇద్దరూ మంచి స్నేహితులు. మంగళవారం రాత్రి 9:45 సమయంలో ఇద్దరూ బెంగళూరు నుంచి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్‌పై హోసూరు వైపు వెళ్తున్నారు. సరిగ్గా వంతెనపైకి రాగానే బైక్‌లో ఏదో సమస్య రావడంతో నిలిపి చూడసాగారు. మృత్యుశకటమైన కారు.. ఇంతలో ఒక మారుతి బాలెనో కారు వేగంగా వచ్చి ప్రీతం, కృతికాలను ఢీకొట్టడంతో వారు 50 అడుగుల దూరం ఎగిరి వంతెన పై నుంచి కింద సర్వీసు రోడ్డుపై పడిపోయారు. వంతెన ఎత్తు సుమారు 40 అడుగుల పైనే ఉంటుంది. ఇద్దరూ క్షణాల్లో మృత్యువాత పడ్డారు. దీంతో రోడ్డుపై పెద్దసంఖ్యలో జనం పోగయ్యారు. మృతదేహాల నుంచి రక్తం రోడ్డుపై ధారలు కట్టడం, వాహనాల విడిభాగాలు చెల్లాచెదురుగా పడిపోవడంతో భయానకంగా కనిపించింది. కారు వంతెన గోడను సగం వరకూ ఎక్కి నిలిచిపోయింది. కారులోని ఇద్దరికి గాయాలు.. కారు నడుపుతున్న బెంగళూరు ఆనేకల్‌వాసి నితీష్ (23), అతని స్నేహితుడు తీవ్రంగా గాయపడ్డారు. కొంతసేపటికి పోలీసులు చేరుకుని మృతదేహాలను సెయింట్‌జాన్స్ ఆస్పత్రికి, క్షతగాత్రులను ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. మద్యం మత్తులో కారును వేగంగా నడపడమే కారణమని అనుమానిస్తున్నారు. జంట బ్రిడ్జి పై నుంచి కింద పడడం అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయింది. ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ బీఆర్. రవికాంత్‌గౌడ ఘటనాస్థలిని పరిశీలించారు. కేసు దర్యాప్తులో ఉంది. చదవండి: Hyderabad: తొమ్మిదేళ్ల బాలికను షెటర్‌లోకి తీసుకెళ్లి.. -
తల్లి ఆత్మహత్యాయత్నం.. బైకుపై బయలుదేరిన కుమారుడు.. అంతలోనే
ఖమ్మం: కుటుంబ కలహాలతో ఓ మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమెను ఆస్పత్రిలో చేర్పించగా అక్కడకు వెళ్తున్న క్రమంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కుమారుడు మృతి చెందగా, భర్త, సోదరుడు తీవ్రంగా గాయపడ్డారు. గంటల వ్యవధిలో జరిగిన ఈ ఘటనలు ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపాయి. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. కారేపల్లి మండలం జైత్రాంతండా గ్రామానికి చెందిన ధరావత్ కౌసల్య కుటుంబంలో చోటుచేసుకున్న వివాదానికి మనస్థాపం చెంది ఆదివారం ఉదయం పురుగుల మందు తాగింది. దీంతో గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను కొత్తగూడెం ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. అక్కడ పరిస్థితి విషమించటంతో ఖమ్మం ఆస్పత్రికి అంబులెన్స్‌లో పంపించారు. అనంతరం ఖమ్మం ఆస్పత్రికి కౌసల్య కుమారుడు ధరావత్ సురేష్(25) తన తండ్రి ధరావత్ సూర్య, మామయ్య కేలోతు గోపీతో కలిసి ద్విచక్రవాహనంపై ఆదివారం సాయంత్రం బయలుదేరాడు. ఈక్రమంలో ఇల్లెందు – ఖమ్మం ప్రధాన రహదారిపై మంచుకొండ సమీపాన శివాయిగూడెం వద్ద గుర్తు తెలియని వాహనం వీరిని ఢీకొంది. ఈఘటనలో సురేష్ అక్కడికక్కడే మృతి చెందగా, సూర్య, కేలోతు గోపీకి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రులను ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. మృతుడు సురేష్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఒకేరోజు ఒకే కుటుంబంలో ఒకవైపు తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా, రోడ్డు ప్రమాదంలో కొడుకు మృతి చెందడం... తండ్రి, మామయ్య తీవ్రగాయాలతో అపస్మారక స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతుండడంతో జైత్రాం తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి. చదవండి: డిగ్రీ చేశానని నమ్మించి నిశ్చితార్థం -
ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు.. నాలుక కోసుకున్నాడు..
సాక్షి, హోసూరు(కర్ణాటక): మనోవేదనతో ఓ కార్మికుడు నాలుక కోసుకున్నాడు. ఈఘటన హోసూరులో చోటు చేసుకుంది. వసంతనగర్ ప్రాంతానికి చెందిన భవన నిర్మాణ కార్మికుడు మురుగేషన్(58)కు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. మురుగేషన్ ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు. ఒంటరిగా ఉండేవాడు. ఈ క్రమంలో బుధవారం ఉదయం మురుగేషన్ కత్తి తీసుకొని నాలుకను కోసుకున్నాడు. గమనించిన పిల్లలు నాలుకను ప్లాస్టిక్ కవర్లో భద్రపరచి తండ్రిని హోసూరు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. నాలుకను అతికించడం సాధ్యం కాదని, అయితే మాట్లాడేందుకు ఇబ్బంది ఉండదని చెప్పి వైద్యం చేస్తున్నారు. చదవండి: Tollywood Drugs Case: రకుల్ ప్రీత్ సింగ్‌కు ఈడీ నోటీసులు -
క్షణాల్లో కళ్లముందే కొత్త బుల్లెట్, పాత కారు దగ్ధం
సాక్షి, దొడ్డబళ్లాపురం(కర్ణాటక): వేర్వేరు చోట్ల కారు, ఎన్ఫీల్డ్ బైక్ రోడ్డు మధ్యలోనే కాలిపోయిన సంఘటన నెలమంగల తాలూకాలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. బెంగళూరు నాగరబావి నుంచి తుమకూరు వెళ్తున్న పాత ఇండికా కారు నెలమంగల వద్ద జాతీయ రహదారిపై ఇంజన్లో మంటలు చెలరేగి క్షణాల్లో రోడ్డుమధ్యలోనే కాలిపోయింది. అందులోని చిరాగ్, నాగేశ్, నాగరాజు, మరో మహిళ బయటకు దిగి బయటపడ్డారు. ఇక కుణిగల్ జాతీయ రహదారి మార్గంలో యంటగానహళ్లి వద్ద శివమొగ్గకు చెందిన గగన్ అనే వ్యక్తి వస్తున్న బుల్లెట్ బైక్‌లో మంటలు లేచి దగ్ధమైంది. వారం క్రితమే కొనుక్కున్న ఈ బైక్‌లో ఫుల్ ట్యాంక్ పెట్రోల్ వేయించినట్టు బాధితుడు చెప్పాడు. నెలమంగల ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. చదవండి: ఆరునెలల్లో కూతురు వివాహం.. దైవదర్శనానికి వెళ్లివస్తుండగా.. -
ఆరునెలల్లో కూతురు వివాహం.. దైవదర్శనానికి వెళ్లివస్తుండగా..
సాక్షి, దేవరుప్పుల(వరంగల్): ఆరు నెలల్లో కూతురు వివాహం చేయాలనే తలంపుతో దైవదర్శనికి వెళ్లొస్తున్న కుటుంబాన్ని వరద రూపంలో మృత్యువు వెంటాడింది. రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. జనగామ జిల్లా దేవరుప్పుల మండల పరిధి చిన్నమడూరుకు చెందిన ఎంపీటీసీ సభ్యురాలు గొడుగు సుజాత మల్లికార్జున్ దంపతులకు కొడుకు నవీన్, కూతురు సింధూజ ఉన్నారు. మల్లికార్జున్ కులవృత్తి చేపల పెంపకంతోపాటు రాజకీయంగా ప్రాబల్యం కలిగి ఉన్నాడు. ఇటీవల కొడుక్కి సాప్టవేర్ ఉద్యోగం వచ్చింది. ఇక కూతురు వివాహం చేద్దామని సంబంధాల కోసం చూస్తున్నారు. ఈ క్రమంలోనే సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి అమ్మమ్మ ఊరైన యాదగిరిగుట్టకు చేరుకొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం రాజపేట మండలం బొందుగులలో తోడల్లుడు పొన్నం ఆంజనేయులు చేపల పెంపకం యూనిట్ ప్రారంభోత్సవానికి పిలువగా కారులో కుటుంబసభ్యులు వెళ్తున్నారు. మల్లికార్జున్ సమీపబంధువు శ్రవణ్.. సింధూజ, హిమబిందులను మోటరు సైకిల్‌పై తీసుకెళ్తుండగా పారుపెల్లివాగు ఉధృతి పెరగడంతో కురారం మీదుగా వెళ్తుండగా ప్రమాదవశాత్తు రోడ్డుడ్యామ్‌పై జారిపడి వరదల్లో కొట్టుకుపోయారు. ఈ సంఘటనలో సింధూజ మృతదేహం లభ్యంకాగా హిమబిందువు జాడదొరకలేదు. చదవండి: మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి.. ఐదుగురు కలిసి ఇంట్లో బంధించి.. -
ట్రక్కులకు నిప్పుపెట్టిన దుండగులు.. ఐదుగురు సజీవ దహనం
డిస్పూర్: అస్సాంలో దారుణం చోటు చేసుకుంది. హసావోలో కొందరు గుర్తు తెలియని దుండగులు అర్ధరాత్రి ట్రక్కులను తగులబెట్టారు. ఈ ఘటనలో ఐదుగురు ట్రక్కు డ్రైవర్లు సజీవ దహనమయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిన్న(గురువారం) అర్ధరాత్రి హాసావోలోని ఉమ్రాంగ్సోలోని డిస్మావో గ్రామంలో కొంత మంది దుండగులు ఏడు ట్రక్కులను తగులబెట్టారు. దీంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఐదుగురు వ్యక్తులు సజీవ దహనమైనట్లు గుర్తించారు. వారి మృత దేహలను వెలికితీసి ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు అస్సాం పోలీసులు తెలిపారు. చదవండి: రాహుల్ హత్య కేసు: మరో 11 మంది నేడు కోర్టు ముందుకు -
విలేకరి పేరుతో రూ.7 లక్షలకు టోకరా..
సాక్షి, లింగంపేట (నిజామాబాద్): విలేకరి పేరుతో ఏకంగా రూ.7 లక్షలకు టోకరా వేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుల కథనం ప్రకారం.. ఎల్లారెడ్డి మండలం కొట్టాల్ గ్రామానికి చెందిన ఆలకుంట మంజుల, రాములు దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 2017లో జరిగిన రోడ్డు ప్రమాదంలో రాములు మృతి చెందాడు. అయితే, లింగంపేట గ్రామానికి చెందిన సాయికృష్ణ తాను విలేకరినని, బాధిత కుటుంబానికి న్యాయం చేస్తానని నమ్మబలికి ఖర్చుల నిమిత్తం రూ.70 వేలు తీసుకున్నాడు. అలాగే, యాక్సిడెంట్ కేసులో రూ.12 లక్షలు రాగా, అందులో మంజులకు రూ.4 లక్షలు, ఆమె అత్తమ్మ హన్మవ్వకు రూ.లక్ష ఇచ్చాడు. మిగతా రూ.7 లక్షలు బాధితులకు ఇవ్వకుండా దగ్గర పెట్టుకున్నాడు. బాధితులు అడిగితే రేపు, మాపు అనుకుంటూ కాలం వెళ్లదీస్తున్నాడని బాధితులు గురువారం విలేకరులతో ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ పెద్దను కోల్పోయి తాము పుట్టెడు దుఃఖంలో ఉంటే, తమను నమ్మించి నిలువునా మోసం చేశాడని వాపోయారు. సాయికృష్ణను డబ్బులు అడిగితే భయభ్రాంతులకు గురిచేస్తున్నాడని, ఎవరికైనా చెబితే చంపుతానని బెదిరిస్తున్నాడని తెలిపారు. ప్రస్తుతం కామారెడ్డిలో నివాసముంటున్న సాయికృష్ణ నుంచి తమకు డబ్బులు ఇప్పించి ఆదుకోవాలని మంజుల విజ్ఞప్తి చేశారు. చదవండి: అమానుషం: వృద్ధుడిని చాపలో చుట్టి పడేశారు! -
విదేశాల నుంచి వచ్చిన కుమార్తె.. దైవదర్శనానికి వెళ్లివస్తూ..
సాక్షి, ఇల్లెందు(ఖమ్మం): విదేశాల్లో విద్యనభ్యపిస్తున్న కుమార్తె ఇటీవల వచ్చింది. ఆమెకు హైదరాబాద్ విమానాశ్రయంలో స్వాగతం పలికిన తల్లిదండ్రులు, సోదరి పది రోజుల పాటు హైదరాబాద్‌లోని బంధువుల ఇంట్లో గడిపారు. ఇక వేములవాడలో రాజన్నను దర్శించుకుని స్వస్థలానికి వెళ్లాక కుమార్తె పెళ్లి సంబంధాలు చూడాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆనందంగా మాట్లాడుకుంటూ కారులో బయలుదేరిన వారి ప్రయాణంలో విషాదం చోటు చేసుకుంది. మార్గమధ్యలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా, మిగతావారు గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. సిద్దిపేట హైవేపై ప్రమాదం ఇల్లెందుకులోని సుభాష్‌నగర్‌కు చెందిన ఆర్ఎంపీ రమేష్ కుమార్తె విదేశాల్లో చదువుకుంటోంది. ఇటీవల ఆమె హైదరాబాద్ రాగా, తన భార్య చిప్ప స్వరూపరాణి(42), చిన్న కుమార్తె శ్రావ్యతో కలిసి హైదరాబాద్‌లో స్వాగతం పలికాడు. అక్కడే పది రోజుల పాటు బంధువుల ఇంట్లో ఉంటూ పర్యాటక ప్రదేశాలను సందర్శించారు. అనంతరం వేములవాడలో రాజరాజేశ్వరుడి దర్శనానికి గురువారం ఉదయం బయలుదేరగా, సిద్ధిపేట హైవే రోడ్డు మీద కొండిపాక మండలం తిమ్మారెడ్డిపల్లి వద్ద వీరు వెళ్తున్న కారు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో స్వరూపరాణి అక్కడిక్కడే మృతి చెందింది. కారులో ఉన్న రమేష్, ఆయన ఇద్దరు కుమార్తెలు, సమీప బంధువు గాయాలతో బయటపడ్డారు. కాగా, ప్రమాద విషయం తెలిసిన వెంటనే ఇల్లెందులో విషాదం అలుముకుంది. గత 25ఏళ్లుగా ఆర్ఎంపీగా ప్రాక్టీస్ చేస్తున్న రమేష్, మెడికల్ షాపు నిర్వాహకురాలిగా స్వరూపరాణికి స్థానికంగా మంచి పేరు ఉంది. ఈ మేరకు ఆమె మృతి విషయం తెలియగానే కెమిస్ట్ అసోసియేషన్ డివిజన్ అధ్యక్షుడు పసుమర్తి లక్ష్మణ్‌రావు తదితరులు సంతాపం తెలిపారు. చదవండి: మంత్రాలతో నీ కొడుకు ఆరోగ్యం నయం చేస్తానంటూ.. -
పశువులు మేపేందుకు వెళ్లిన మహిళపై అఘాయిత్యం.. ఆపై
సాక్షి, తుమకూరు(కర్ణాటక): పశువులు మేపేందుకు వెళ్లిన మహిళపై దుండగులు అత్యాచారానికి పాల్పడి హత్యచేసి నగలతో ఉడాయించారు. ఈ ఘోరం తుమకూరు నగర సమీపంలోని బెట్టద బుడద వద్ద చోటు చేసుకుంది. చోటాసాబ్ పాళ్యకు చెందిన శివకుమార్ భార్య జయలక్ష్మి(35) రోజూ తరహాలోనే మంగళవారం ఉదయం పశువులను మేపడానికి కొండప్రాంతానికి వెళ్లింది. సాయంత్రమైనా ఇంటికి రాకపోవడంతో భర్త గాలిస్తూ కొండ వద్దకు వెళ్లాడు. అక్కడ జయలక్ష్మి విగతజీవిగా కనిపించింది. వంటిపై దుస్తులు చెదిరిపోవడం, మెడలోని మాంగల్యం చైన్, ఇతర బంగారు ఆభరణాలు లేకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. క్యాత్సంద్ర పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. దుండగులు ఆమెపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసినట్లు ఆనవాళ్లు గుర్తించారు. మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి దుండగుల కోసం గాలింపు చేపట్టారు. చదవండి: భర్త, పిల్లలు దూరమయ్యారనే మనస్తాపంతో.. -
భర్త, పిల్లలు దూరమయ్యారనే మనస్తాపంతో..
సాక్షి, నిజాంసాగర్(నిజామాబాద్): భర్త, పిల్లలు దూరమయ్యారని కలత చెందిన మన్నె వినోద(28) బుధవారం నిజాంసాగర్ ప్రాజెక్టు వద్ద ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించగా పెట్రోలింగ్ పోలీసులు కాపాడారు. వివరాలు ఇలా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా పెద్దశంకరంపేట మండలం గోపని వెంకటాపురం గ్రామానికి విక్రమ్,వినోద దంపతులకు ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. భార్య నుంచి దూరంగా విక్రమ్ తన ఇద్దరు పిల్లలతో ఉంటున్నాడు. గడిచిన ఆరు ఏళ్ల నుంచి పిల్లలు, భర్త దూరం అయ్యాడని మానసిక వేదనకు గురై వినోద ఆత్మహత్య చేసుకునేందుకు కోసం నిజాంసాగర్ ప్రాజెక్టు వచ్చింది. అటుగా పెట్రోలింగ్ కోసం వచ్చిన పోలీసులకు వినోద ఒంటరిగా కన్పించింది. అనుమానంతో పోలీసులు వినోదను విచారించగా నిజాంసాగర్ ప్రాజెక్టులో దూకి ఆత్మహత్య చేసుకునేందుకు వచ్చాని చెప్పడంతో ఆమెను పోలీసులు పట్టుకున్నారు. కుటుంబీకులకు సమాచారం అందించి ఆమెను బంధవులకు అప్పగించారు. మహిళ ప్రాణాలు కాపాడిన పోలీస్ కానిస్టేబుళ్లను ఎస్సై హైమద్ అభినందించారు. చదవండి: దారుణం: ఆరేళ్ల చిన్నారిపై 60 ఏళ్ల వృద్ధుడి అత్యాచారం -
అన్నకు ఆనందంగా రాఖీకట్టిన చెల్లెలు.. అంతలోనే..
సాక్షి, నస్రుల్లాబాద్(నిజామాబాద్): మండలంలోని కామిశెట్టిపల్లి గ్రామానికి చెందిన రాజు(35) ఆదివారం పాము కాటుతో మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజు మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తాడు. తన సోదరితో రాఖీ కట్టిన తర్వాత రాజు తన బార్బర్ షాపులో పని చేసుకుంటుండగా పాము కరవడం గమనించకపోవడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. పాము కరిచిన చాలా సేపటి తర్వాత స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడన్నారు. గ్రామంలో విషాద ఛాయలు చోటు చేసుకున్నాయి. కేసు నమోదు చేసుకొని దర్యాపు చేస్తున్నట్లు ఎస్సై మచ్చేందర్ పేర్కొన్నారు. చదవండి: Snake: ఐదు అడుగుల నాగుపాము పట్టివేత -
పండుగరోజు విషాదం: చెల్లితో రాఖీ కట్టించుకోకుండానే...
సాక్షి, జమ్మికుంట(కరీంనగర్): జమ్మికుంట పురపాలక సంఘం పరిధి రామన్నపల్లి గ్రామానికి చెందిన వెలిపికొండ రాకేశ్(25) పండుగపూట మృతిచెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామస్తుల వివరాల ప్రకారం.. ఆదివారం రాకేశ్ కారులో బంధువులను సుల్తాన్బాద్లో దించి తిరిగి ఇంటికి వస్తుండగా ఓదెల మండలం కనగర్తి గ్రామ శివారులో కారు చెట్టును ఢీకొని చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో రాకేశ్ మృతిచెందాడు. రాకేశ్ స్వగ్రామం హూజూరాబాద్ మండలం సిరిసపల్లి గ్రామం. అతడి తల్లిదండ్రులు కొన్నేళ్ల క్రితం మృతి చెందగా అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటున్నాడు. రాకేశ్ మృతి విషయం తెలుసుకున్న గ్రామస్తులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. మృతుడికి ఒక చెల్లె ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు. చదవండి: తాలిబన్ల దమనకాండ -
వ్యాపారి మధుసూదన్‌రెడ్డి హత్య కేసులో నలుగురు ప్రమేయం!
హైదరాబాద్: అప్పుగా ఇచ్చిన సొమ్మును తిరిగి ఇవ్వమన్నందుకు వ్యాపారి మధుసూదన్ రెడ్డిని స్నేహితులే పథకం ప్రకారం హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్దారించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు జగన్నాథ్‌ను చార్మినార్ పోలీసులు అరెస్ట్ చేశారు. మధుసూదన్ రెడ్డి వద్ద రూ. 40 లక్షలను తన స్నేహితులకు అప్పుగా ఇచ్చాడు. ఈ క్రమంలో ఇచ్చిన అప్పును తిరిగి ఇవ్వమన్నందుకు స్నేహితులే చార్మినర్ ప్రాంతంలో కిడ్నాప్ చేసి.. సంగారెడ్డికి తీసుకెళ్లి దారుణంగా హత్య చేశారు. ఆ తర్వాత వ్యాపారిని పొలంలో పూడ్చిపెట్టారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రధాన నిందితుడిగా భావిస్తున్న జగన్నాథ్‌ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పరారీలో ఉన్న ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చదవండి: ఏడేళ్ల క్రితం హిజ్రాగా మారిన యువకుడు.. మిత్రులు అన్యాయం చేశారని.. -
పందుల ఉచ్చు.. ప్రాణం తీసింది
సాక్షి, స్టేషన్‌ఘన్‌పూర్ (వరంగల్): అడవి పందుల నుంచి మొక్కజొన్న చేనును రక్షించుకునేందుకు విద్యుత్ తీగతో అమర్చిన కంచె ఓ రైతు ప్రాణం తీయడంతో పాటు మూడు మేకల మృతికి కారణమైంది. ఈ సంఘటన మండల పరిధి ఛాగల్లు శివారు కమ్మరిపేటలో గురువారం చోటుచేసుకుంది. కమ్మరిపేటకు చెందిన పెసరు సోమయ్య(50) చిన్నాన్న పెసరు మల్లయ్య.. గ్రామానికి చెందిన శ్యామ్‌సుందర్‌రెడ్డి వ్యవసాయ భూమిని కౌలుకు తీసుకున్నాడు. మొక్కజొన్న పంట సాగుచేస్తున్న మల్లయ్య అడవి పందుల సమస్య నివారణకు చేనుచుట్టూ విద్యుత్ తీగను ఏర్పాటు చేసుకున్నాడు. గురువారం సాయంత్రం మేకలను తోలుకుని అటువైపు వచ్చిన పెసరు సోమయ్య చేను పక్కన ఉన్న విద్యుత్ తీగ కాలికి తగలడంతో షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. అలాగే మూడు మేకలు సైతం విద్యుదాఘాతంతో మృతిచెందాయి. ఎస్సై రమేష్‌నాయక్ సంఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య సోమలక్ష్మి, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కాగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. -
ప్రాణం తీసిన పిండిమిల్లు
సాక్షి, (ఖమ్మం)బూర్గంపాడు: లక్ష్మీపురం గ్రామానికి చెందిన మారం చౌడమ్మ(65) గురువారం తన ఇంట్లోని పిండిమిల్లును నడుపుతున్న క్రమంలో ప్రమాదవశాత్తూ చీర మరలో చిక్కుకుంది. ఈ క్రమంలో ఆమె చీరతో పాటుగా పిండిమరలోకి జారిపడడంతో తీవ్రగాయాలయ్యాయి. వెంటనే కుటుంబసభ్యులు ఆమెను భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్థారించారు. చౌడమ్మ, రామిరెడ్డి దంపతులు గత కొన్నేళ్లుగా లక్ష్మీపురంలో పిండిమిల్లు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. జీవనాధారమైన పిండిమిల్లే చౌడమ్మ ప్రాణం తీయడాన్ని కుటుంబసభ్యులు జీర్ణించుకోలేక పోతున్నారు. మృతురాలికి ఇద్దరు కుమారులున్నారు. ఎస్ఐ జితేందర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డ్రిల్లింగ్ పనిచేస్తుండగా విద్యుదాఘాతం అన్నపురెడ్డిపల్లి: రాజాపురం గ్రామానికి చెందిన చింతల రాజు(32)గురువారం ఎర్రగుంటలోని ఓ పాత భవనం పిల్లర్లను తొలగించే పనికి వెళ్లాడు. డ్రిల్లింగ్ మిషన్‌తో ఇనుప చువ్వలను తొలగించే క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురయ్యాడు. తోటి కార్మికులు వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించగా..అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొడుకు మృతదేహం వద్ద తల్లి సోమమ్మ కన్నీరుమున్నీరుగా విపలించింది. ఎస్సై తిరుపతి కేస -
భార్యతో చనువుగా ఉంటున్నాడని.. స్నేహితుడిని..
సాక్షి, భువనగిరి(నల్లగొండ): భార్యతో చనువుగా ఉంటున్నాడని స్నేహితుడిపై అనుమానం పెంచుకొని హత్య చేశాడు తోటి మిత్రుడు. కేసు వివరాలను డీసీపీ నారాయణరెడ్డి బుధవారం తన క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఆత్మకూర్(ఎం) మండలం కొరటికల్‌కు చెందిన పెద్దిటి అశోక్‌రెడ్డి, చిన్నం అర్జున్, బండ సురేష్ స్నేహితులు. అశోక్‌రెడ్డి 2012లో ఇదే మండలం మోదుగుగూడెం గ్రామానికి చెందిన శిరీషను ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఇతని స్నేహితుడు చిన్నం అర్జున్ తరచు అశోక్‌రెడ్డి ఇంటికి వస్తుండే వాడు. ఇద్దరు కలిసి మద్యం సేవిస్తుండేవారు. కాగా ఆరు నెలల క్రితం తన భార్యతో అర్జున్ మాట్లాడుతుండగా అశోక్‌రెడ్డి గమనించాడు. అర్జున్ ప్రవర్తనపై అనుమానం పెంచుకొని అతన్ని ఎలాగైనా హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. జరిగిన విషయాన్ని మరో స్నేహితుడైన బండ సురేష్‌కు చెప్పాడు. అర్జున్ తన భార్యతో వివాహేతర సంబంధం నెరుపుతున్నాడని అతన్ని చంపడానికి సహకరించాలని కోరడంతో సురేష్ ఒప్పుకున్నాడు. అదే విధంగా అశోక్‌రెడ్డి తన మామ ఉడుత నర్సింహ, బావమరిది ఉడుత నవీన్‌కు కూడా ఈ విషయాన్ని చెప్పి తనకు సహకరించాలని కోరాడు. ఈ క్రమంలో అర్జున్ కదలికలపై నెల రోజులుగా రెక్కీ నిర్వహిస్తున్నారు. ఈ నెల 14 రాత్రి 8 గంటల సమయంలో అర్జున్ వద్దకు సురేష్ వెళ్లాడు. మద్యం తీసుకొని అశోక్‌రెడ్డి షెడ్డు వద్దకు రావాలని సూచించాడు. అతని మాటలు నమ్మిన అర్జున్.. మద్యం తీసుకొని అశోక్‌రెడ్డి ఇంటికి బయలుదేరాడు. సమీపంలోకి రాగానే అతని వెనకాల అశోక్‌రెడ్డి, సురేశ్, శిరీష, ఉడుత నర్సింహ, నవీన్‌తో పాటు మరో వ్యక్తి మల్లెమాల శ్రీశైలం ద్విచక్రవాహనాలపై రావడంతో అర్జున్‌కు అనుమానం వచ్చింది. తప్పించుకునే ప్రయత్నిస్తుండగా అశోక్‌రెడ్డి తన వెంట తెచ్చుకున్న కర్రతో అర్జున్ ముఖంపై మోదడంతో అతను కిందపడిపోయాడు. మిగతా వారిని చుట్టూ కాపలా ఉంచి అర్జున్ చాతిపై విక్షణరహితంగా కర్రతో కొట్టాడు. అర్జున్ మృతి చెందినట్లు నిర్థారించుకొని అక్కడినుంచి వెళ్లిపోయారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. నిందితులను బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నిదితులనుంచి ఐదు సెల్ఫోన్లు, మూడు బైకులు, హత్యకు ఉపయోగించిన కర్ర, చేతి కడియం స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. సమావేశంలో ఏసీపీ శంకర్ పాల్గొన్నారు.