చెట్టును ఢీకొన్న కారు.. నలుగురు భారతీయ వైద్య విద్యార్థులు మృతి.. | Car Crashes Into Tree Russia Crimea Indian Students Dead | Sakshi
Sakshi News home page

విషాదం.. రష్యాలో చెట్టును ఢీకొన్న కారు.. నలుగురు భారతీయ వైద్య విద్యార్థులు మృతి..

Published Sat, Dec 31 2022 10:52 AM | Last Updated on Sat, Dec 31 2022 10:52 AM

Car Crashes Into Tree Russia Crimea Indian Students Dead - Sakshi

మాస్కో: రష్యాలో విషాదం జరిగింది. క్రిమియాలోని సింఫరోపోల్‌లో ఓ కారు చెట్టును ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో నలుగురు భారతీయ వైద్య విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. వీరు ఎంబీబీఎస్ మూడు, నాలుగో సంవత్సరం చదువుతున్నారు.

వేగంగా వెళ్తున్న కారు డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు రష్యా అధికారులు తెలిపారు. కారు సెర్గీవ్ నుంచి సెన్‌స్కీ వెళ్తుండగా అదుపుతప్పి చెట్టును ఢీకొట్టిందన్నారు. ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జు అయింది. అందులో ఉన్న నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు.
చదవండి: అమెరికా విమానాన్ని ఢీ కొట్టబోయిన చైనా యుద్ధ విమానం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement