car rammed
-
చెట్టును ఢీకొన్న కారు.. నలుగురు భారతీయ వైద్య విద్యార్థులు మృతి..
మాస్కో: రష్యాలో విషాదం జరిగింది. క్రిమియాలోని సింఫరోపోల్‌లో ఓ కారు చెట్టును ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో నలుగురు భారతీయ వైద్య విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. వీరు ఎంబీబీఎస్ మూడు, నాలుగో సంవత్సరం చదువుతున్నారు. వేగంగా వెళ్తున్న కారు డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు రష్యా అధికారులు తెలిపారు. కారు సెర్గీవ్ నుంచి సెన్స్కీ వెళ్తుండగా అదుపుతప్పి చెట్టును ఢీకొట్టిందన్నారు. ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జు అయింది. అందులో ఉన్న నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. చదవండి: అమెరికా విమానాన్ని ఢీ కొట్టబోయిన చైనా యుద్ధ విమానం -
విప్రో జంక్షన్లో టిప్పర్ బీభత్సం.. స్విగ్గీ డెలివరీ బాయ్ మృతి
సాక్షి, హైదరాబాద్: బండరాళ్ల లోడ్‌తో వెళ్తున్న టిప్పర్ వాహనం ఆదివారం అర్ధరాత్రి ఐటీ కారిడార్‌లో బీభత్సం సృష్టించింది. ఫైనాన్షియల్ డిస్టిక్ట్‌లోని విప్రో జంక్షన్లో సిగ్నల్ వద్ద నిలిచి ఉన్న 3 కార్లను, 3 బైక్‌లను ఢీకొట్టింది. ఆ తర్వాత ఓ టిప్పర్‌ను ఢీకొని అది ఆగిపోయింది. ఈ ప్రమాదంలో స్విగ్గీ డెలివరీ బాయ్ మృతి చెందాడు. బైక్‌లపై వెళుతున్న ఇద్దరు, టిప్పర్ సూపర్వైజర్ తీవ్రంగా గాయపడ్డారు. గచ్చిబౌలి సీఐ గోనె సురేష్ చెప్పిన వివరాల ప్రకారం.. ఖానామెట్‌లోని ఓ సైట్లో బండరాళ్లు లోడ్ చేసుకున్న టిప్పర్.. వట్టినాగులపల్లిలోని క్రషర్లో అన్లోడ్ చేసేందుకు బయలుదేరింది. ఆదివారం అర్ధరాత్రి ట్రిపుల్ ఐటీ జంక్షన్ నుంచి విప్రో జంక్షన్‌కు చేరుకుంది. రెడ్ సిగ్నల్ పడటంతో అప్పటికే కార్లు బైక్‌లు ఆగి ఉన్నాయి. టిప్పర్ అతివేగంతో దూసుకువచ్చి మొదట స్విఫ్ట్ కారు ఢీకొట్టింది. దీంతో స్విఫ్ట్ కారు ముందున్న ఐ20 కారు, ఇండిగో కార్లను బలంగా తాకడంతో అవి నుజ్జునుజ్జయ్యాయి. కార్లను ఢీకొట్టిన టిప్పర్ ఎడమ వైపు దూసుకెళ్లి మూడు బైక్‌లను ఢీకొంది. అంతటితో ఆగకుండా గౌలిదొడ్డి వైపు నుంచి వస్తున్న మరో టిప్పర్‌ను ఢీకొని ఆగిపోయింది. ఈ ప్రమాదంలో స్కూటీపై ఉన్న నాంపల్లికి చెందిన స్విగ్గీ డెలివరీ బాయ్ నసీర్ హుస్సేన్ (30) తలకు గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఆస్పత్రులకు క్షతగాత్రుల తరలింపు.. యమహా బైక్‌పై ఉన్న బీటెక్ విద్యార్థి అబ్దుల్ రజాక్ కుడి కాలు విరిగింది. వెనకాల ఉన్న యువకుడు సురక్షితంగా బయపడ్డాడు. మరో బైక్‌పై ఉన్న సుబెందుదాస్ ఎడమ కాలు విరగడంతో కాంటినెంటల్ హాస్పిటల్‌కు తరలించారు. టిప్పర్‌లో ఉన్న ఖలీం అందులోనే ఇరుక్కుపోవడంతో కాలు విరిగింది. కొండాపూర్ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీళ్లు సురక్షితం.. నుజ్జునుజ్జయిన స్విఫ్ట్ కారులో ఉన్న ఇంటీరియర్ డిజైనర్ మురళి రెండు బెలూన్లు తెరుచుకోవడంతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఐ 20 కారులో గౌలిదొడ్డి వైపు వస్తున్న దంపతులు సాయి చైతన్య, పల్లవి, కుటుంబ సభ్యులు సాహితి, సుదీప్తిలు ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. ధ్వంసమైన ఇండిగో కారు క్యాబ్ డైవర్‌కు ఎలాంటి గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు. మూడు రోజుల క్రితమే విధుల్లో చేరిన టిప్పర్ డ్రైవర్.. టిప్పర్ బీభత్సానికి కారణమైన డ్రైవర్ కాసీంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బిహార్ చెందిన ఇతను మూడు రోజుల క్రితమే నగరానికి వచ్చి డ్రైవర్ విధుల్లో చేరినట్లు సమాచారం. ఖానామెట్ నుంచి వట్టినాగులపల్లికి వెళ్లే దారి తెలియకపోవడంతో అతని వెంట సూపర్వైజర్ ఖలీం వచ్చారు. రాత్రి సమయంలో ట్రాఫిక్ తక్కువగా ఉంటడం, విప్రో జంక్షన్లో ఏటవాలు ఎక్కువగా ఉన్న విషయంపై అవగాహన లేకపోవడంతో టిప్పర్ అదుపు తప్పినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలాన్ని, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల పరిస్థితిని మాదాపూర్ ఏసీపీ రఘునందన్ రావు, సీఐ గోనె సురేష్‌లు పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ప్రమాదానికి టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని సీఐ గోనె సురేష్ స్పష్టం చేశారు. -
షాకింగ్ ఘటన: ఈ డ్రైవర్ కళ్లు మూసుకుని కారు నడిపాడా?
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని కరోల్ బాఘ్ ప్రాంతంలో ఓ కారు బీభత్సం సృష్టించింది. రోడ్డు పక్కన పార్కింగ్ చేసిన పదుల సంఖ్యలో వాహనాలు ఢీకొట్టటమే కాకుండా ఓ వ్యక్తిని లాక్కెళ్లింది. సోమవారం రాత్రి జరిగిన ఈ సంఘటన దృశ్యాలు స్థానిక సీసీటీవీ కెమెరాల్లో నమోదయ్యాయి. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. సీసీటీవీ దృశ్యాల ప్రకారం.. కరోల్ బాఘ్ ప్రాంతంలో రహదారి పక్కన ఓ మహిళ స్కూటీ వద్ద నిలుచుని ఉంది. ఈ క్రమంలో ఓ ఫార్చునర్ ఎస్యూవీ కారు దాని ముందు నిలిపి ఉంచిన కార్లను ఢీకొడుతూ ముందుకు వెళ్లింది. అలాగే ఓ వ్యక్తిని సుమారు 100 మీటర్ల దూరం వరకు లాక్కెళ్లింది.ఈ సంఘటనతో అక్కడ ఉన్నవారు షాక్‌కు గురయ్యారు. ఎస్యూవీ కారు బీభత్సంలో పదుల సంఖ్యలో వాహనాలు, బైక్‌లు ధ్వంసమయ్యాయి. ప్రస్తుతం కారును పోలీసులు స్వాధీనం చేసుకోగా.. డ్రైవర్ పరారీలో ఉన్నాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. Video: Fortuner Rams Multiple Vehicles, Drags Man For 100 Metres In #Delhi https://t.co/DDtF49VJD5 pic.twitter.com/1PTcOihghd — NDTV (@ndtv) September 19, 2022 (వీడియో సోర్స్: ఎన్డీటీవీ) ఇదీ చదవండి: వీడు మనిషేనా.. మానవత్వం లేకుండా కుక్కను కారుకు కట్టి లాక్కెళ్లి.. -
బాలుడి పైనుండి దూసుకుపోయిన కారు
-
Hyderabad: చూస్తుండగానే బాలుడిపైకి దూసుకెళ్లిన కారు.. భయానక దృశ్యాలు
సాక్షి, హైదరాబాద్: నగరంలో శుక్రవారం దారుణ ఘటన వెలుగు చూసింది. దుండిగల్ పరిధిలోని బౌరంపేటలో రోడ్డుపై ఆడుకుంటున్న బాలుడిపై నుంచి కారు దూసుకెళ్లింది. ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఇంటి ముందు పార్క్ చేసిన కారును తీసే సమయంలో 15 నెలల బాలుడు రిహన్ అక్కడి వచ్చాడు. కాగా బాలుడిని గమనించకుండా డ్రైవర్ కారును ముందుకు పోనిచ్చాడు. దీంతో బాలుడిపై కారు ఎక్కింది. రోడ్డుపై పడి ఉన్న బాలుడిని గమనించిన తల్లిదండ్రులు వెంటనే పరుగెత్తుకొచ్చి చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రమాదం నుంచి బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు. చికిత్స అందించిన తర్వాత బాలుడి పరిస్థితి మెరుగ్గా ఉందని, ప్రాణాపాయం లేదని డాక్టర్లు వెల్లడించారు. సీసీటీవీ పుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: కలెక్టర్ అయ్యుండి తెలియదంటారా? నిర్మలా సీతారామన్ ఫైర్ -
గుజరాత్లో భక్తులపైకి దూసుకెళ్లిన కారు .. ఆరుగురు మృతి
గాంధీనగర్: గుజరాత్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అరవల్లీ జిల్లా కృష్ణాపూర్ సమీపంలో ఇన్నోవా కారు బీభత్సం సృష్టించింది. బనాస్‌కాంఠలోని అంబాజీ ఆలయానికి కాలినడకన వెళ్తున్న భక్తులపైకి దూసుకెళ్లింది. ఈ భయానక ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై గుజరాత్ ముఖ్యమంత్రి భూపేశ్ పటేల్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.4లక్షలు పరిహారం ప్రకటించారు. క్షతగాత్రలకు రూ.50వేలు సాయం అందిస్తామన్నారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అంబాజీ ఆలయంలో ప్రతి ఏటా భదర్వీ పూనం ఉత్సవాలు నిర్వహిస్తారు. గుజరాత్, రాజస్థాన్‌తో పాటు ఇతర రాష్ట్రాల నుంచి అనేక మంది భక్తులు వస్తుంటారు. కాలినడకనే బనాస్కాంఠా వెళ్తారు. ఈ ఏడాది సెప్టెంబర్ 5 నుంచి 10 వరకు ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే భక్తులు మరాఠ్‌వాడీ వెళ్తుండగా కారు అదుపుతప్పి వారిపైకి దూసుకెళ్లింది. చదవండి: భారీ అగ్నిప్రమాదం.. 300 సిలిండర్లున్న లారీలో పేలుడు -
రివర్స్ తీస్తుండగా.. ఒక్కసారిగా జనంపైకి దూసుకెళ్లిన కారు
భోపాల్: మధ్యప్రదేశ్‌లో దసరా వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. దుర్గామాత విగ్రహాల నిమజ్జన ఊరేగింపు కార్యక్రమంలో ఓ కారు జనాలపైకి దూసుకేళ్లింది. ఈ ఘటన శనివారం భోపాల్‌లోని బజారియా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనకు కారకుడైన కారు డ్రైవర్‌ను పట్టుకున్నామని పోలీసులు పేర్కొన్నారు. కారును రివర్స్ తీసే క్రమంలో వేగం అదుపు తప్పి జనంపైకి దూసికేళ్లింది. ఈ ఘటనలో గాయపడిన ఓ యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై భోపాల్ డీఐజీ ఇర్షాద్ వలీ మాట్లాడుతూ.. కారు డ్రైవర్‌ను అరెస్ట్ చేసి, కారును సీజ్ చేశామని తెలిపారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. #WATCH Two people were injured after a car rammed into people during Durga idol immersion procession in Bhopal's Bajaria police station area yesterday. Police said the car driver will be nabbed.#MadhyaPradesh pic.twitter.com/rEOBSbrkGW — ANI (@ANI) October 17, 2021 -
అయ్యో.. ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి, చెన్నై: తమిళనాడులో బుధవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. పుదుకోటై- తిరుచ్చి రహదారిలో నార్తామలై రైల్వే పాలిటెక్నిక్ కళాశాల ఎదురుగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఒకదాని వెనుక ఒకటిగా ఆరు కార్లు పరస్పరం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద తీవ్రతకు కార్లు నుజ్జయ్యాయి. మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. క్షతగాత్రుల హాహాకారాలతో ఘటనా స్థలి మార్మోగింది. ఈ దుర్ఘటనలో 21 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఏడుగురి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే స్థానిక అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. -
గుళ్లోకి దూసుకెళ్లిన కారు.. ఏడుగురి దుర్మరణం
రాంచీ : జార్ఖండ్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డుపై వెళ్తున్న కారు అదుపు తప్పి దూసుకెళ్లటంతో ఏడుగురు మృతి చెందగా.. ఏడుగురు గాయపడ్డారు. జంషెడ్‌పూర్‌కు 90 కిలోమీటర్ల దూరంలో చియాబస పట్టణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. శనివారం రాత్రి చియాబాసా-ఛాకర్దార్ హైవేపై బరోడా బ్రిడ్జి వద్ద ఉన్న ఓ గుడిలో రెండు గిరిజన కుటుంబాలు వివాహ వేడుకల కోసం పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఆ సమయంలో రోడ్డుపై వేగంగా వెళ్తున్న ఓ కారు అదుపు తప్పి వారిపైకి దూసుకెళ్లింది. ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. నిందితుడు పారిపోయేందుకు యత్నించగా.. స్థానికులు అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నిందితుడు ట్రాన్స్పోర్ట్ అండ్ బస్ అసోషియేషన్ అధ్యక్షుడు ప్రదీప్ అగర్వాల్ కొడుకు అని దర్యాప్తులో తేలింది. దీంతో ప్రతిపక్షాలు నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి. స్థానిక ఎమ్మెల్యే శశి భూషణ్ క్షతగాత్రులను పరామర్శించి.. ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాడు. కాగా, కొద్దిరోజుల క్రితం బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో బీజేపీ నేత మనోజ్ బైతా ర్యాష్ డ్రైవింగ్‌తో స్కూల్లోకి దూసుకెళ్లగా.. 9 మంది చిన్నారులను మృత్యువాత పడిన విషయం తెలిసిందే. -
కారు బోల్తా, నలుగురు దుర్మరణం
మహబూబ్‌నగర్ : పాలమూరు జిల్లాలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొనటంతో చిన్నారి సహా నలుగురు మృత్యువాత పడ్డారు. మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల మండలం మేడిపల్లి వద్ద శనివారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్ వైపు నుంచి కర్నూలు వైపు వెళ్తున్న కారు మేడిపల్లి వద్ద రోడ్డు పక్కనున్న కల్వర్టును వేగంగా డీకొట్టింది. ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జయింది. అందులో ఉన్న ఒక చిన్నారితోపాటు ఇద్దరు పురుషులు, ఒక మహిళ అక్కడికక్కడే చనిపోయారు. ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడి కారులోనే ఇరుక్కున్నాడు. అతడిని పోలీసులు రక్షించేందుకు యత్నిస్తున్నారు. బాధితులను శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం పామిరెడ్డిపాడు గ్రామానికి చెందిన అచ్చెంనాయుడు, భారతి, చిన్నారి యశస్విని కాగా మరొకరు కారు డ్రైవర్. కారు డ్రైవర్‌తోపాటు తీవ్రంగా గాయపడిన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది.