![Car Rammed 2 Years Old Boy At Dundigal, CCTV Footage Viral - Sakshi](/styles/webp/s3/article_images/2022/09/2/Boy.jpg.webp?itok=do8z5I3V)
సాక్షి, హైదరాబాద్: నగరంలో శుక్రవారం దారుణ ఘటన వెలుగు చూసింది. దుండిగల్ పరిధిలోని బౌరంపేటలో రోడ్డుపై ఆడుకుంటున్న బాలుడిపై నుంచి కారు దూసుకెళ్లింది. ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఇంటి ముందు పార్క్ చేసిన కారును తీసే సమయంలో 15 నెలల బాలుడు రిహన్ అక్కడి వచ్చాడు. కాగా బాలుడిని గమనించకుండా డ్రైవర్ కారును ముందుకు పోనిచ్చాడు. దీంతో బాలుడిపై కారు ఎక్కింది.
రోడ్డుపై పడి ఉన్న బాలుడిని గమనించిన తల్లిదండ్రులు వెంటనే పరుగెత్తుకొచ్చి చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రమాదం నుంచి బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు. చికిత్స అందించిన తర్వాత బాలుడి పరిస్థితి మెరుగ్గా ఉందని, ప్రాణాపాయం లేదని డాక్టర్లు వెల్లడించారు. సీసీటీవీ పుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: కలెక్టర్ అయ్యుండి తెలియదంటారా? నిర్మలా సీతారామన్ ఫైర్
Comments
Please login to add a commentAdd a comment