Dundigal
-
గుర్రం విజయలక్ష్మి అరెస్ట్..
దుండిగల్: నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు చేపట్టడమేగాక, వినియోగదారులను మోసం చేసి రూ.కోట్లు సంపాదించింది. పోలీసు కేసులు నమోదు కావడంతో దేశం విడిచి పారిపోయేందుకు యత్నించిన ఓ నిర్మాణ సంస్థ యజమానురాలిని దుండిగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మేడ్చల్ జిల్లా దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలో మల్లంపేటలోని సర్వే నెంబర్ 170/3, 170/4, 170/5లోని 15 ఎకరాల భూమిని పాతికేళ్ల క్రితం ముగ్గురు స్వాతంత్ర సమరయోధులకు అప్పటి ప్రభుత్వం కేటాయించింది. ఆ తర్వాత సదరు భూమి పలువురి చేతులు మారి చివరికి కొన్నేళ్ల క్రితం శ్రీ లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్ సంస్థకు చేరింది. సంస్థ నిర్వాహకురాలు గుర్రం విజయలక్ష్మి ఐదేళ్ల క్రితం 3.20 ఎకరాల్లో 65 విల్లాల నిర్మాణం కోసం హెచ్ఎండీఏకు దరఖాస్తు చేసుకుంది. ఆ తర్వాత సదరు సంస్థ ఎలాంటి అనుమతులు లేకుండానే పక్కనే ఉన్న కత్వ చెరువుకు సంబంధించిన 16 గుంటల ఎఫ్టీఎల్, మూడు ఎకరాల బఫర్ జోన్‌ను ఆక్రమించి ఏకంగా 300కు పైగా విల్లాలను నిరి్మంచింది. దీనిపై స్థానికులు పలుమార్లు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. బఫర్ జోన్, ఎఫ్టీఎల్ పరిధిలోని 11 అక్రమ విల్లాలను గత సెప్టెంబరులో అధికారులు కూల్చివేశారు. అంతేగాక ఇరిగేషన్ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు చేపట్టారని దుండిగల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనికి తోడు తమకు అన్ని సదుపాయాలు కల్పిస్తామని చెప్పి మోసం చేశారని, రిజి్రస్టేషన్లు సైతం చేసుకుని బ్యాంకుల్లో రుణాల్లో తీసుకుని రూ. లక్షలు వెచ్చించి ప్లాట్లను కొనుగోలు చేశామని, చివరికి తమ విల్లాలను కూల్చివేశారని, సంస్థ నిర్వాహకురాలు గుర్రం విజయలక్ష్మిపై చర్యలు తీసుకోవాలని బాధితులు దుండిగల్ పోలీసులను ఆశ్రయించారు. విజయలక్ష్మిపై ఇప్పటి వరకు ఏడు కేసులు నమోదు చేసిన పోలీసులు లుక్ఔట్ నోటీసులు జారీ చేశారు. కాగా గురువారం తెల్లవారుజామున దేశం విడిచి పారిపోయేందుకు ప్రయతి్నంచిన ఆమెను శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీసులు అదుపులోకి తీసుకుని దుండిగల్ పోలీసులకు అప్పగించారు. వారు ఆమెను న్యాయమూర్తి ఎదుట హాజరు పరచడంతో 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆమెను చంచల్‌గూడ జైలుకు తరలించారు. -
దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో అబ్బురపరిచే విన్యాసాలు (ఫోటోలు)
-
అసంపూర్తి నిర్మాణాలకు మళ్లీ జీవం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రీలాంచ్, బై బ్యాక్ స్కీమ్‌ల పేరిట కొందరు బిల్డర్లు చేస్తున్న మోసా లకు అటు రూ. కోట్లలో డబ్బు పోగొట్టుకోవడంతోపాటు ఇటు సొంతింటి కలకు దూరమవుతున్న బాధితులకు న్యాయం చేసేందుకు తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (టీజీ–రెరా), రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించాయి. రాష్ట్రంలోనే తొలిసారిగా దుండిగల్‌లో ఇలా బోర్డు తిప్పేసిన జయత్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే సంస్థకు చెందిన ‘ప్లాటినం’ప్రాజెక్టు పనులను థర్డ్ పార్టీ (మరో బిల్డర్)కు అప్పగించాయి. ఈ మేరకు టీజీ–రెరా చేసిన ప్రతి పాదనకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచి్చంది.దీంతో రెరా–2016 చట్టంలోని సెక్షన్ 8 కింద ఉన్న అధికారాలను ఉపయోగించి ఆ ప్రాజెక్టును థర్డ్ పార్టీకి బదిలీ చేస్తూ టీజీ–రెరా మధ్యంతర ఉత్తర్వు లు జారీ చేసింది. త్వరలోనే ఇలా ఆగిపోయిన మరికొన్ని ప్రాజెక్టులను కూడా థర్డ్ పారీ్టలకు ఇచ్చేందుకు టీజీ రెరా కసరత్తు చేస్తోంది. దీంతో ఆగిపో యిన నిర్మాణాలు మళ్లీ జీవం పోసుకోనున్నాయి. ఇదీ ‘ప్లాటినం’కథ..: ఐదేళ్ల క్రితం జయత్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ యజమాని కాకర్ల శ్రీనివాస్ దుండిగల్‌లో ప్లాటినం పేరుతో అపార్ట్మెంట్ ప్రాజెక్టును ప్రకటించాడు. 3,267 గజాల స్థలంలో స్టిల్ట్+5 అంతస్తులకు హెచ్ఎండీఏ నుంచి అను మతి తీసుకొని 5,865 చ.అ. బిల్టప్ ఏరియాలో 60 అపార్ట్మెంట్లను నిర్మిస్తున్నామని ప్రచారం చేశాడు. రెరాలో రిజిస్ట్రేషన్ చేయకుండానే ప్రీలాంచ్ ఆఫర్ కింద కస్టమర్ల నుంచి రూ. కోట్లు వసూలు చేశాడు. కొనుగోలుదారులను నమ్మించేందుకు శ్లాబ్ లెవల్స్ వరకు నిర్మాణ పనులను శరవేగంగా చేపట్టాడు. హెచ్ఎండీఏకు తనఖా పెట్టిన 9 ఫ్లాట్లు మినహా మిగిలిన 51 ఫ్లాట్లను విక్రయించేశాడు. అయితే నిధుల దురి్వనియోగం కారణంగా ప్రాజెక్టు మధ్యలోనే ఆగిపోయింది. దీంతో గతేడాది సెపె్టంబర్లో కస్టమర్లు ‘రెరా’కు ఫిర్యాదు చేశారు. త్వరలోనే సాహితీ, మంత్రి ప్రాజెక్ట్‌లు కూడా..: జయత్రీ కేసులాగే సాహితీ ఇన్ఫ్రాటెక్ వెంచర్స్, మంత్రి డెవలపర్స్ మధ్యలోనే వదిలేసిన పలు అపార్ట్మెంట్ ప్రాజెక్టులను కూడా సెక్షన్–8 కింద ఉత్తర్వులు ఇచ్చేందుకు రెరా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. గచి్చ»ౌలి, గుండ్లపోచంపల్లి, అమీన్పూర్ ప్రాంతాల్లో అపార్ట్మెంట్లను నిర్మిస్తున్నామని కస్టమర్ల నుంచి సొమ్ము వసూలు చేసి సాహితీ సంస్థ చేతులెత్తేసింది. మరోవైపు జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వద్ద లగ్జరీ ప్రాజెక్టు నిర్మిస్తున్నామని వినియోగదారుల నుంచి మంత్రి డెవలపర్స్ రూ. కోట్లు వసూలు చేసింది. నిధుల దురి్వనియోగం కారణంగా ఆయా ప్రాజెక్టులు మధ్యలోనే ఆగిపోయాయి. బాధితుల ఫిర్యాదుతో సెక్షన్–8 కింద ఆయా ప్రాజెక్టుల నిర్మాణ పనులను థర్డ్ పార్టీ బిల్డర్‌కు అప్పగించేందుకు ‘రెరా’కసరత్తు చేస్తోంది. 8 కంటే ఎక్కువ ఫ్లాట్లు ఉంటే ‘రెరా’పరిధిలోకి..: గృహ కొనుగోలుదారుల భద్రత, పెట్టుబడులకు భరోసా కల్పించేందుకు ఉద్దేశించిన ‘రెరా’తెలంగాణలో 2016 మే 1న అమల్లోకి వచ్చింది. 500 చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణం లేదా ఒక అపార్ట్మెంట్లో 8 అంతకంటే ఎక్కువ ఫ్లాట్లు నిర్మించే రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు ‘రెరా’పరిధిలోకి వస్తాయి. స్థానిక మున్సిపాలిటీ/కార్పొరేష న్ అనుమతులు ఉన్నప్పటికీ ఫ్లాట్ల వ్యాపారం చేస్తే తప్పనిసరిగా సదరు ప్రాజెక్టు ‘రెరా’రిజి్రస్టేషన్ పొందాలి. అయితే చాలా మంది బిల్డర్లు నిర్మాణ అనుమతులు రాకముందే.. ‘రెరా’రిజిస్ట్రేషన్ లేకుండానే ఫ్లాట్లను విక్రయిస్తున్నారు. నిధుల మళ్లింపు, దురి్వనియోగం కారణంగా ప్రాజెక్టు నిర్మాణ పను లు మధ్యలోనే ఆగిపోతున్నాయి. దీంతో కస్టమర్లు రోడ్డున పడుతున్నారు. ఇలాంటి కేసుల్లో రెరా– 2016 చట్టంలోని సెక్షన్–8 కింద థర్డ్ పారీ్టకి నిర్మా ణ పనులను బదలాయించే అధికారం రెరాకు ఉంది. కస్టమర్లకు ఊరట లభిస్తుంది పలువురు బిల్డర్లు, ఏజెంట్లు అబద్ధపు హామీలతో కస్టమర్లను నమ్మించి మోసం చేస్తున్నారు. అలాంటి వారిని వదిలిపెట్టం. టీజీ–రెరాకు విస్తృత అధికారాలు ఉన్నాయి. చట్ట పరిధిలో గృహ కొనుగోలుదారులకు న్యాయం అందించి తీరతాం. మధ్యలోనే ఆగిపోయిన ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ‘రెరా’అధికారాలను వినియోగించి కస్టమర్లకు ఊరట కల్పిస్తాం. – కె. శ్రీనివాసరావు, టీజీ–రెరా సభ్యుడు -
ఆక్రమణలపై హైడ్రా దూకుడు
-
దుండిగల్‌లో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు బీటెక్ విద్యార్ధులు మృతి
సాక్షి,హైదరాబాద్: మేడ్చల్ జిల్లా దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధి ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని స్కోడా కారు ఢీకొట్టడంతో వీఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతికి చెందిన ముగ్గురు విద్యార్ధులు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్ర గాయాలపాలైన ఇద్దరిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన విద్యార్థులు అక్షయ్, హరి, అస్మిత్ గా గుర్తించారు. దుండిగల్ నుంచి కుత్బుల్లాపూర్‌కు వెళ్తుండగా ప్రమాదం జరిగిందని, అతివేగం వల్లే విద్యార్ధులు మరణించినట్లు సమాచారం. రోడ్డు ప్రమాదంపై స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. -
‘రియల్’ వేధింపులు.. రైతు అదృశ్యం.. ఆగిన తండ్రి గుండె
దుండిగల్: రియల్ ఎస్టేట్ వ్యాపారుల వేధింపులకు తాళలేక ఓ రైతు అదృశ్యమయ్యాడు. బెంగపెట్టుకున్న అతడి తండ్రి గుండెపోటుతో మృతి చెందాడు. ఈ సంఘటన మేడ్చల్ జిల్లా దుండిగల్ మున్సిపాలిటీ బౌరంపేట గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. బౌరంపేటకు చెందిన వంపుగూడెం కృష్ణారెడ్డి(72), సముద్రమ్మ భార్యాభర్తలు. వీరికి మాధవరెడ్డి, జైపాల్‌రెడ్డి సంతానం. ఈ కుటుంబానికి డి.పోచంపల్లిలోని సర్వే నెంబరు 188లో 1.13 ఎకరాల స్థలం ఉంది. దీనిని మాధవరెడ్డి సాగుచేస్తున్నాడు. వీరి స్థలం పక్కనే త్రిపుర ల్యాండ్‌మార్క్ సంస్థ ఇతర రైతుల నుంచి స్థలాలను కొనుగోలు చేసి వెంచర్‌ను నిరి్మస్తోంది.మాధవరెడ్డితోపాటు మరో రైతు సురేందర్‌రెడ్డికి చెందిన భూములను సైతం తమకు విక్రయించాలని వెంచర్ నిర్వాహకులు పట్టుబట్టడంతో వారు అంగీకరించలేదు. ఈ క్రమంలో మే నెలలో› ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. రైతులు, సంస్థ సిబ్బంది ఇచి్చన ఫిర్యాదుల మేరకు పరస్పర కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలో ఈ నెల 8వ తేదీన రాత్రి మాధవరెడ్డి దుండిగల్ సీఐ శంకరయ్య పేరిట లెటర్ రాసి పెట్టి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. ఇంటి నుంచి కుమారుడు వెళ్లిపోవడంతో ఆవేదన చెందిన కృష్ణారెడ్డి బుధవారం గుండెపోటుతో మృతి చెందాడు. లెటర్లో ఏముందంటే..‘త్రిపుర ల్యాండ్‌మార్క్ ఎండీ పసుపులేటి సుధాకర్, కార్పొరేటర్ మేకల వెంకటేశం, వంపుగూడెం సభ్యులను తీసుకువచ్చి నన్ను మానసికంగా వేధిస్తున్నారు. ఈ రోజు అందరు నన్ను అట్టి భూమి గురించి మళ్లీ పిలిపించుకుని బూతులు తిట్టారు. నేను మనస్తాపానికి గురై వెళ్లిపోతున్నాను. సార్.. నా పిల్లల్ని కాపాడండి.. పిల్లలు, అమ్మా నాన్న, భార్య నన్ను క్షమించండి’అంటూ సీఐ శంకరయ్యకు లేఖ రాశాడు. జైలుకు పంపారు..దాడి చేయడమే కాకుండా తమపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసులు నమోదు చేసి 14 రోజులు జైలుకు పంపారని, వారికి మాత్రం పోలీసులు స్టేషన్లోనే బెయిల్ ఇచ్చి పంపించేశారని బాధిత కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. సంస్థ ఎండీ పసుపులేటి సుధాకర్, కార్పొరేటర్ మేకల వెంకటేశంపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ విషయంపై దుండిగల్ సీఐ శంకరయ్యను ‘సాక్షి’వివరణ కోరగా రైతులు ఇచి్చన ఫిర్యాదుల ఆధారంగా 5, త్రిపుర ల్యాండ్ మార్క్‌సంస్థ సభ్యులు ఇచి్చన ఫిర్యాదుల ఆధారంగా 3 కేసులు నమోదు చేశామని, ఇద్దరు రైతులతోపాటు సంస్థకు చెందిన నలుగురిని రిమాండ్‌కు తరలించామన్నారు. త్రిపుర ల్యాండ్ మార్క్‌సంస్థ ఎండీ సుధాకర్ పరారీలో ఉన్నారని పేర్కొన్నారు. -
యువతితో వీడియో కాల్ మాట్లాడుతూ యువకుడి ఆత్మహత్య
దుండిగల్: ఓ యువతితో చివరిసారిగా వీడియో కాల్ మాట్లాడుతూ తాను చనిపోతున్న దృశ్యాలను చూపిస్తూ ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన దుండిగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం కన్నారం గ్రామం చెర్రీ తాండాకు చెందిన రాజు కుమారుడు డి.శ్రీకాంత్(22) డి.పోచంపల్లిలోని సర్వే నం.120లో తన అన్నా వదినలతో కలిసి ఉంటున్నాడు. అతడు గండిమైసమ్మలోని గ్లాండ్ ఫార్మా పరిశ్రమలో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. తమ సొంత గ్రామంలో పొలం పనులు ఉండటంతో అన్నా వదినలు 15 రోజుల క్రితమే ఊరికి వెళ్లిపోగా శ్రీకాంత్ ఒక్కడే ఉంటున్నాడు. కాగా గురువారం రాత్రి శ్రీకాంత్ ఫోన్లో ఎవరితోనో గొడవ పడ్డాడు. తన గదిలోకి వెళ్లి తాడుతో రాడ్డుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక ఆధారాలు సేకరించారు. శ్రీకాంత్ చివరిసారిగా ఓ యువతితో ఫోన్లో వీడియో కాల్ మాట్లాడినట్లు గుర్తించారు. మంచంపై ఫోన్ పెట్టి తాను ఉరి వేసుకుని చనిపోతున్న దృశ్యాలను వీడియో కాల్ ద్వారా ఆ యువతికి చూపించినట్లు తెలుస్తోంది. ప్రేమ వ్యవహారమా.. లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ మేరకు పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేశారు. -
SKY IS THE LIMIT: నాన్న ఇచ్చిన రెక్కలు
ఇంటి గడప దాటకూడని ఆంక్షలు అక్కడా ఇక్కడా ఇంకా కొనసాగుతున్నా నేడు భారతీయ యువతులు ఆకాశమే హద్దుగా ఎదుగుతున్నారు. ఎగురుతున్నారు. కొడుకు ఎంతో కూతురూ అంతే అనే ఎరుక కలిగిన తల్లిదండ్రులు వారిని ప్రోత్సహిస్తున్నారు. అమ్మ ఆశీస్సులు ఉన్నా నాన్న ప్రోత్సాహమే తమను ముందుకు నడిపిందని ఈ మహిళా ఫ్లయింగ్ ఆఫీసర్లు అంటున్నారు. దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో శనివారం నిర్వహించిన పాసింగ్ ఔట్ పరేడ్‌లో పాల్గొన్న మహిళా ఫ్లయింగ్ ఆఫీసర్ల విజయగాథలు ఇవి.నాన్న మాటే ఇంధనంనా పేరు శ్రీప్రియ మోదలే. మాది మహారాష్ట్రలోని పూణే. నాన్న శ్రీకాంత్ మోదలే. అమ్మ ప్రజ్ఞ మోదలే. మా తల్లిదండ్రులకు నేను ఒక్కదాన్నే సంతానం. అయినా కూడా మా తల్లిదండ్రులు నన్ను ఎంతో ప్రోత్సహించారు. మా నాన్న పెట్రోల్ పంపులకు సంబంధించిన చిన్న వ్యాపారం చేస్తారు. అమ్మ ఇంట్లోనే ఆహారం తయారు చేసి అమ్ముతుంది. తండ్రి శ్రీకాంత్, తల్లి ప్రజ్ఞతో శ్రీప్రియ ఇలా దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినా నా తల్లిదండ్రులు నన్నెప్పుడూ నిరాశపర్చలేదు. మా నాన్నైతే నీకు నచ్చిన వృత్తిలో వెళ్లు అని వెన్నుతట్టి ప్రోత్సహించారు. నేను పూణే యూనివర్సిటీ నుంచి మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశాను. ఆ తర్వాత ఎట్మాస్ఫియరిక్ సైన్సెస్‌లో ఎంటెక్ చేశాను. ఆ తర్వాత రీసెర్చ్ అసోసియేట్‌గా, స్విమ్మింగ్ కోచ్‌గా, జాతీయ స్థాయి కరాటే ప్లేయర్‌గా, సెల్ఫ్ డిఫెన్స్ ఇన్ స్ట్రక్టర్‌గా రకరకాల పనులు చేశాను. ఇన్ని చేసినా ఎక్కడో అసంతృప్తి నాలో ఉండేది. దేశసేవలో భాగం అయ్యేందుకు నాకున్న బలాలను, అవకాశాలను ఆలోచించాను. దేశ రక్షణ కోసం పనిచేసే ఉద్యోగం కరెక్ట్ అనిపించింది. అందుకే నేను భారత వాయుసేన వైపు రావాలని నిర్ణయించుకుని కష్టపడ్డాను. చివరకు ఫ్లయింగ్ ఆఫీసర్‌గా శిక్షణ పూర్తి చేయడం సంతోషాన్ని, ధైర్యాన్ని ఇచ్చింది. వాయుసేన ఆపరేషన్స్ అన్నింటికీ వాతావరణ సమాచారం అత్యంత కీలకమైంది. వాతావరణ సమాచారాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ అందించే కీలక బాధ్యతలు దక్కడం నాకు సంతోషంగా ఉంది. – శ్రీప్రియ, ఫ్లయింగ్ ఆఫీసర్నాన్నే నాకు స్ఫూర్తినా పేరు నందినీ సౌరిత్. హర్యానాలోని పల్వల్ జిల్లా మా స్వస్థలం. నాన్న శివ్‌నారాయణ్ సౌరిత్, అమ్మ సంతోషికుమారి సౌరిత్. మా నాన్న ఫ్లయిట్ లెఫ్టినెంట్‌గా పని చేసి రిటైర్ అయ్యారు. చిన్నప్పటి నుంచి అన్ని విషయాల్లో ఆయనే నాకు స్ఫూర్తి. మా తల్లిదండ్రులకు నేను ఒక్కగానొక్క సంతానం. పైగా అమ్మాయిని అయినా నాన్న నాకు ఎప్పుడూ ఎలాంటి ఆంక్షలూ లేకుండా పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. మా నాన్న కోరిక వల్లే నేను ఎయిర్ ఫోర్స్‌లో చేరాను.తండ్రి శివ్‌నారాయణ్, సంతోషికుమారిలతో నందిని సౌరిత్ ‘నా కూతురు ఎంతో ఉన్నతంగా అందరికంటే ఎత్తులో ఉండాలి’ అని నాన్న నాకు చెబుతూ ఉండేవారు. అదే నాలో చిన్ననాటి నుంచి స్ఫూర్తి నింపింది. నేను ఎన్సీసీ కేడెట్ను. జాతీయ స్థాయిలో అథ్లెట్‌ను. భారత వాయుసేనలో చేరిన తర్వాత శిక్షణ సమయంలో ఇవి నాకు ఎంతో ఉపయోగపడ్డాయి. కఠోర శిక్షణ పూర్తి చేసి ఈ రోజు నేను ఫ్లయింగ్ ఆఫీసర్‌గా బాధ్యతలు తీసుకోవడం ఎంతో గర్వంగా ఉంది. నా తల్లిదండ్రులు ఇప్పుడు నా పక్కన ఉండడం నాకు మరింత సంతోషంగా ఉంది. నేను శిక్షణలో ఆర్డర్ ఆఫ్ మెరిట్‌తో ఎడ్యుకేషన్ బ్రాంచ్‌కు ఎంపికయ్యాను. వాయుసేనకు సంబంధించిన కీలక బాధ్యతలు అవి. – నందినీ సౌరిత్, ఫ్లయింగ్ ఆఫీసర్నాన్నే దేశసేవ చేయమన్నారుమాది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. శామిలి జిల్లా. పుట్టిపెరిగింది అంతా ఢిల్లీలోనే. అక్కడే కేంద్రీయ విద్యాలయ్‌లో చదువుకున్నాను. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బీకామ్ పూర్తి చేశాను. మా నాన్న రవీందర్‌కుమార్ ఇన్‌కమ్‌ట్యాక్స్ ఆఫీసర్, అమ్మ అంజేష్ గృహిణి. ఎయిర్‌ఫోర్స్‌లో చేరడానికి ముందు నేను ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తుండేదాన్ని.‘ఆ ఉద్యోగాలు చేసేందుకు అందరూ ఉత్సాహపడతారు. కాని దేశ సేవ కోసం కొందరే ముందుకు వస్తారు. నువ్వు దేశ సేవ చేయమ్మా’ అని నాన్న అన్నారు. తండ్రి రవీందర్‌కుమార్, తల్లి అంజేష్లతో మాన్వి నా మొదటి ప్రయత్నంలోనే ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు ఎంపికయ్యాను. మా కుటుంబంలో భారత సైన్యంలోకి వచ్చిన మొదటి ఆఫీసర్ని నేనే. అందుకు నాకు గర్వంగా ఉంది. శారీరకంగా, మానసికంగా ఎంతో గొప్ప ఉద్యోగం ఇది. అకాడమీకి రాక ముందు, ఇప్పుడు ట్రైనింగ్ పూర్తి చేసిన తర్వాత నాలో నేనే ఎంతో మార్పు గమనించాను. ఇక్కడ వృత్తిగతంగానే కాదు వ్యక్తిగత జీవితానికి సంబంధించి కూడా ఎన్నో అంశాలు నేర్చుకున్నాను. నాపై నాకు ఆత్మవిశ్వాసం పెరిగింది. నేను అకౌంట్స్ బ్రాంచ్‌లో ఉత్తమ కేడెట్‌గా నిలిచాను. నాకు ఇప్పుడు అకౌంట్స్ బ్రాంచ్ ఇచ్చారు. – మాన్వి, ఫ్లయింగ్ ఆఫీసర్ -
దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో గ్రాడ్యుయేషన్ పరేడ్ (ఫొటోలు)
-
సాయుధ దళాలు.. వినూత్నంగా ఉండాలి
సాక్షి, హైదరాబాద్: సాయుధ దళాలలో సంప్రదాయ పద్ధతులకు తగిన ప్రాధాన్యం ఇస్తూనే.. కాలానుగుణంగా కొత్త ఆవిష్కరణలు తేవాల్సిన అవసరం ఉందని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ చెప్పారు. కొత్త ఆలోచనలు చేయకుండా చాలా కాలం ఒకే తరహా సంప్రదాయాలను అనుసరిస్తే వ్యవస్థలో జడత్వం వస్తుందని అభిప్రాయపడ్డారు. యువ అధికారులు తమలో నూతనత్వానికి, వినూత్న ఆలోచనలకు ఎప్పటికప్పుడు పదునుపెట్టాలని పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్ శివార్లలోని దుండిగల్‌లోని ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ ( ఇఎ్క) జరిగింది. ఇందులో శిక్షణ పూర్తి చేసుకున్న 213 ఫ్లైట్ కేడెట్లు (వీరిలో 25 మంది మహిళలు) పాల్గొన్నారు. గౌరవ వందనం స్వీకరించి.. పరేడ్‌కు సమీక్ష అధికారిగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పాల్గొని యువ అధికారుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. యువ కేడెట్లు భారత వాయుసేనలోని వివిధ విభాగాల్లో విధుల్లోకి చేరడానికి సూచికగా వారందరికీ అధికారిక హోదా కల్పిస్తూ రాష్ట్రపతి కమిషన్ (అధికారిక బ్యాడ్జ్‌లను)ను ప్రదానం చేశారు. తర్వాత రాజ్‌నాథ్‌సింగ్ ప్రసంగించారు. ‘‘నిరంతరం అభివృద్ధి చెందుతున్న కాలానికి అనుగుణంగా సంప్రదాయాలు, ఆవిష్కర ణల మధ్య సమతుల్యత సాధించండి. సంప్రదాయాన్ని మాత్రమే పాటిస్తే.. మనం ఎండిపోయిన సరస్సులా మారిపోతాం. మనం ప్రవహించే నదిలా ఉండాలి. ఇందుకు సంప్రదాయంతోపాటు కొత్తదనాన్ని తీసుకురావాలి. వాయుసేన అధికారులుగా మీరు ఆకాశంలో ఎగురుతూ ఉండండి. ఎక్కు వ ఎత్తును తాకండి, కానీ నేలతో మీ సంబంధాన్ని కొనసాగించండి’’అని పిలుపునిచ్చారు. అకాడమీలో భారత వాయుసేనకు చెందిన అధికారులతోపాటు నౌకాదళానికి చెందిన ఎనిమిది మంది అధికారులు, కోస్ట్ గార్డ్ (తీర రక్షక దళం) నుంచి 9 మంది, స్నేహపూర్వక దేశమైన వియత్నాం నుంచి ఇద్దరు అధికారులు కూడా ఫ్లయింగ్ శిక్షణను విజయవంతంగా పూర్తిచేసి.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ నుంచి అవార్డులు అందుకున్నారు. శిక్షణలో టాపర్‌గా నిలిచిన ఫ్లయింగ్ ఆఫీసర్ అతుల్ ప్రకాశ్ రాష్ట్రపతి ఫలకాన్ని చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్ స్వోర్డ్ ఆఫ్ హానర్‌ను రాజ్‌నాథ్ చేతులమీదుగా అందుకున్నారు. గ్రౌండ్ డ్యూటీ బ్రాంచ్‌లలో మెరిట్లో నిలిచిన ఫ్లయింగ్ ఆఫీసర్ అమరీందర్ జీత్ సింగ్‌కు రాష్ట్రపతి ఫలకం లభించింది. అంతకుముందు ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి, యువ కేడెట్లతో ప్రమాణం చేయించారు. ఆకట్టుకున్న కవాతు శిక్షణలో ప్రథమస్థానంలో నిలిచిన ఫ్లయింగ్ ఆఫీసర్ అతుల్ ప్రకాశ్ ఆదివారం నాటి కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్‌కు పరేడ్ కమాండర్‌గా వ్యవహరించారు. ఈ సందర్భంగా యువ ఫ్లయింగ్ కేడెట్లు చేసిన కవాతు ఆకట్టుకుంది. పరేడ్ అనంతరం భారత వాయుసేన నిర్వహించిన వైమానిక ప్రదర్శన అలరించింది. సారంగ్ హెలికాప్టర్ బృందం, సూర్యకిరణ్ ఏరోబాటిక్ బృంద విన్యాసాలు, సుఖోయ్–30 ఎంకేఐ గగనతల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఎయిర్‌ఫోర్స్ అధికారులతోపాటు యువ ఫ్లయింగ్ ఆఫీసర్ల తల్లిదండ్రులు, బంధుమిత్రులు పాల్గొన్నారు. -
దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్
-
ప్రజల కోసం బ్రహ్మాండమైన ప్యాకేజీ
సాక్షి, హైదరాబాద్/దుండిగల్: ఎంతో కాలం అధికారంలో ఉన్నా ఏమీ చేయని వాళ్లు.. చేసింది చెప్పుకోవ డానికి ఏమీ లేనివాళ్లు ఇప్పుడు తమ కు అవకాశమిస్తే ఎన్నో చేస్తామని కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారని, వారి మాటలు నమ్మొద్దని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావు ప్రజలను హెచ్చరించా రు. సంక్రాంతి ముందు గంగిరెద్దుల వాళ్లు వచ్చినట్లు ఎన్నికల ముందు వచ్చేవాళ్ల మాటలతో మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ, బెంగళూరుల నుంచి వచ్చేవారు ఎన్నో ప్యాకేజీలు ప్రకటిస్తున్నారని, వాళ్లు చెప్పిన దానికంటే ఎక్కువ సంక్షేమ కార్యక్ర మాలు, బ్రహ్మాండమైన ప్యాకేజీ ఇచ్చే ఆలోచన బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఉందని, ఆ విషయాల్ని ఆయనే త్వరలో ప్రకటిస్తారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీ స్కీముల్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని దుండిగల్‌లో నిర్మించిన 1,800 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పట్టాలను కేటీఆర్ గురువారం లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘డబుల్’ లబ్ధిదారుల్లో బీజేపీ, కాంగ్రెస్ నేతలు పేదలు, రైతులపై కేసీఆర్కున్న ప్రేమ దేశంలో మరెవ్వరికీ లేదని కేటీఆర్ చెప్పారు. ప్రగతి రథ చక్రాన్ని ఆపేందుకు ఇష్టమొచ్చినట్లుగా హామీలిస్తు న్న వారి మాటలు నమ్మి మోసపోవద్దని, పనిచేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులైన వారిని ఎలాంటి పక్షపాతం లేకుండా ఆన్లైన్ లాటరీ ద్వారా ఎంపిక చేశామని తెలిపారు. జగద్గిరిగుట్ట డివిజన్లోని కాంగ్రెస్ మహిళా అధ్యక్షు రాలు కౌసల్యకు, బీజేపీ నాయకురాలు సునీతకు కూడా ఇళ్లు వచ్చాయని చెప్పారు. తొలిదశలో అర్హులకు లక్ష ఇళ్లు ఇస్తుండగా, అర్హులైన మిగతా మూడున్నర లక్షల మందికి కూడా ఇచ్చే బాధ్యత తమదేనని అన్నారు. ఈ రోజుతో 30 వేల ఇళ్ల పంపిణీ పూర్తవుతుండగా, త్వరలోనే మిగతా 70 వేల ఇళ్లు కూడా అందజేస్తామన్నారు. లక్ష ఇళ్ల నిర్మాణా నికి ప్రభుత్వానికైన ఖర్చు దాదాపు రూ.10 వేల కోట్లయితే, మార్కెట్ రేటు ప్రకారం దాదాపు రూ. 50 వేల కోట్ల నుంచి రూ.60 వేల కోట్ల విలువైన ఆస్తిని పేదల చేతుల్లో పెడుతున్న ప్రభుత్వం తమదని కేటీఆర్ పేర్కొన్నారు. దుండిగల్‌కు త్వరలోనే కొత్త పరిశ్రమ రానుందని తెలిపారు. ఇలాంటి ఇళ్లు ఇంకెక్కడైనా ఉన్నాయా ? మన రాష్ట్రం కాక దేశంలో ఉన్న మరో 27 రాష్ట్రాల్లో, కాంగ్రెస్, బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఎక్కడైనా ఇలాంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఉన్నాయేమో చూపిస్తారా? అంటూ బీజేపీ, కాంగ్రెస్ నేతలకు కేటీఆర్ సవాల్ విసిరారు. పేదలకు ఇలాంటి ఇళ్లు ఇస్తున్న రాష్ట్రం దేశంలోనే ఎక్కడా లేవని చెప్పారు. ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు.. అని పెద్దలు అంటారని, నిరుపేద ప్రజలకు ఇళ్లు కట్టించి, పెళ్లి చేయించి ముఖ్యమంత్రి కేసీఆర్ వారికి మేనమామగా నిలిచారని పేర్కొన్నారు. చాయ్ అమ్ముకో.. దేశాన్ని మోసం చేయొద్దు ఇంటి పట్టా అందుకున్న ఒక మహిళను కేటీఆర్ ఏం చేస్తావంటూ ప్రశ్నించారు. ఆమె తాను చా య్ అమ్ముతానని చెప్పడంతో ‘చాయ్ అమ్ము కోవాలి.. కానీ దేశాన్ని మోసం చేయొద్దు’ అని అన్నారు. ఏమీ అర్థం కాక ఆమె తెల్లముఖం వేయడంతో.. ‘నీ గురించి కాదులే.. వేరేవా ళ్లు ఉన్నారు.. వారి గురించి చెబుతున్నా’ అంటూ పరోక్షంగా ప్రధాని మోదీని ప్రస్తావించారు. -
‘కాంగ్రెస్ నాయకురాలికి డబుల్ ఇల్లు ఇచ్చాం.. ఇప్పుడేమంటారు’
సాక్షి, దుండిగల్: మంత్రి కేటీఆర్ మేడ్చల్ జిల్లా పర్యటనలో ఉన్నారు. ఈ సందర్బంగా దుండిగల్‌లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అర్హులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేశారు. ఈ క్రమంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. పేదల గురించి ఆలోచించే సీఎం కేసీఆర్ మాత్రమే. అన్ని సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు పూర్తి చేస్తాం. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ ప్రజలపక్షమే. పనిచేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదింమని కోరుతున్నాను. పేదలను ప్రేమించే నాయకుడు కేసీఆర్. కొత్త లింక్ రోడ్డు, బ్రహ్మండమైన నాలాలు నిర్మిస్తున్నాం. గతంలో మంచినీటి కోసం ఎంత ఇబ్బందులు పడ్డారో అందరికీ తెలుసు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక మంచినీటి కష్టాలు లేవు. కేసీఆర్ ప్రజల మనిషి.. ఇల్లు కట్టిసూడు-పెళ్లి చేసిచుడు అంటారు పెద్దలు. కానీ కేసీఆర్ మాత్రం ఇళ్ళు నేనే కట్టిస్తా..పెళ్లి నేనే చేయిస్తా అంటున్నారు. ఒక్కో డబుల్ బెడ్ రూమ్ ఇల్లుకు 10లక్షలు ప్రభుత్వానికి ఖర్చు అయితే.. దాని విలువ 30లక్షలు ఉంది. గ్రేటర్ పరిధిలో 50వేల కోట్లు ఖరీదు చేసే ఆస్తులను ప్రభుత్వం పేదలకు ఇస్తోంది. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ ఎంతో పారదర్శకంగా జరుగుతోంది. జగద్గిరి గుట్టలో డివిజన్ కాంగ్రెస్ పార్టీ మహిళ అధ్యక్షురాలికి ఇల్లు వచ్చింది. ఇప్పటి వరకు 30వేల ఇండ్లను పంపిణీ చేశాం. వికలాంగులు, దళితులు, పేదలకు ఇండ్లు పంపిణీ చేస్తున్నాం. గ్రేటర్ పరిధిలో 1లక్ష ఇండ్లను ఎన్నికల లోపు చేస్తాం. దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా ఇలాంటి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు ఇచ్చారా?. దుండిగల్‌కి త్వరలోనే కొత్త పరిశ్రమ రాబోతోంది అభివృద్ధి చెప్పుకోలేక కొత్త మార్గాల్లో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఢిల్లీ నుంచి హామీలు ఇస్తే తొందర పడొద్దు. వాళ్ళు ఇచ్చే హామీలకంటే మంచి హామీలు కేసీఆర్ ఇవ్వబోతున్నారు. ఇళ్ల పంపిణీలో ఎవరి జోక్యం లేదు కాబట్టే కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలకు ఇల్లులు వచ్చాయి’ అని కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: సెల్‌ఫోన్ యూజర్లకు వార్నింగ్ మెసేజ్.. స్పందించిన కేంద్రం -
Hakimpet Air Force Academy Photos: హకింపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో ఫస్ట్ టైం.. (ఫోటోలు)
-
కుదరదట! విధుల్లో చచ్చినట్లు చేరాల్సిందేనట మమ్మీ!
కుదరదట! విధుల్లో చచ్చినట్లు చేరాల్సిందేనట మమ్మీ! -
సవాళ్లు ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండాలి
సాక్షి, హైదరాబాద్: భూమి, సముద్రం, గగనతల రక్షణలో వస్తున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు సాయుధ దళాలకు చెందిన ప్రతి అధికారి సిద్ధంగా ఉండాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. ఇదే సమయంలో ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలని సూచించారు. భారత వాయుసేనలో మహిళల సంఖ్య పెరుగుతుండటం, ఫైటర్ జెట్ పైలట్లలోనూ మహిళలు ఉండటం సంతోషకరమన్నారు. శనివారం హైదరాబాద్ శివారులోని దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో నిర్వహించిన ‘కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్’కు రివ్యూయింగ్ ఆఫీసర్‌గా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరయ్యారు. మొత్తం 119 ఫ్లయింగ్ ఎయిర్ ట్రైనీ, 75మంది గ్రౌండ్ డ్యూటీ ట్రైనీ కేడెట్లు, నేవీ, కోస్ట్‌గార్డ్‌కు చెందిన మరో ఎనిమిది మంది అధికారులు, వియత్నాంకు చెందిన ఇద్దరు అధికారులు ఈ పరేడ్‌లో పాల్గొన్నారు. కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్‌లో రాష్ట్రపతి రివ్యూయింగ్ ఆఫీసర్‌గా పాల్గొనడం వాయుసేన చరిత్రలో తొలిసారి కావడం విశేషం. కేడెట్ల నుంచి రాష్ట్రపతి ముర్ము గౌరవ వందనం స్వీకరించారు. శిక్షణలో ఉత్తమ ప్రతిభ కనబర్చినవారిని అవార్డులతో సత్కరించారు. వైమానిక దళం ఎంతో సేవ చేసింది భారత వాయుసేనలో ఉద్యోగ జీవితం సవాళ్లతో కూడుకోవడంతోపాటు ఎంతో గౌరవప్రదమైందని రాష్ట్రపతి చెప్పారు. దేశ సేవకోసం తమ పిల్లలను పంపిన తల్లిదండ్రులకు, కేడెట్లను ఉత్తమంగా తీర్చిదిద్దేందుకు కృషి చేసిన అకాడమీ అధికారులు, సిబ్బందికి అభినందనలు తెలిపారు. సుఖోయ్ యుద్ధ విమానంలో భూమి నుంచి 2 కిలోమీటర్ల ఎత్తులో, గంటకు 800 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించడం తనకు గొప్ప అనుభూతిని ఇచ్చిందని గుర్తుచేసుకున్నారు. ‘1948, 1965, 1971లలో జరిగిన యుద్ధాల్లో దేశాన్ని రక్షించడంలో భారత వైమానిక దళానికి చెందిన వీరులు పోషించిన గొప్ప పాత్ర సువర్ణాక్షరాలతో లిఖించబడింది. కార్గిల్ పోరాటంలో, బాలాకోట్‌లోని ఉగ్రవాద స్థావరాన్ని నాశనం చేయడంలో అదే సంకల్పాన్ని, నైపుణ్యాన్ని చూపారు. అందుకే భారత వైమానిక దళానికి వృత్తి నైపుణ్యం, అంకితభావానికి మారుపేరన్న ఖ్యాతి ఉంది. విపత్తుల సమయంలో మానవత్వంతో సాయం చేయడంలోనూ భారత వాయుసేనకు గొప్ప పేరుంది’ అని రాష్ట్రపతి ముర్ము చెప్పారు. భవిష్యత్ యుద్ధరంగంలో అత్యాధునిక సాంకేతికత ముఖ్య భూమిక పోషిస్తుందని. ఈ నేపథ్యంలో రఫెల్ యుద్ధ విమానాలు, చినోక్ హెవీ లిఫ్ట్ చాపర్ల వంటి సాధన సంపత్తిని వాయుసేన సమకూర్చుకుంటోందని చెప్పారు. ఆకట్టుకున్న ఎయిర్ షో పరేడ్ అనంతరం నిర్వహించిన ఎయిర్‌షో ఆకట్టుకుంది. పిలాటస్ పీసీ–7 ట్రైనర్ ఎయిర్ క్రాఫ్ట్, సుఖోయ్ ఎస్‌యూ–30, సారంగ్ హెలికాప్టర్లు, సూర్యకిరణ్ ఎరోబాటిక్ బృందాల గగనతల ప్రదర్శనలు అలరించాయి. గవర్నర్ తమిళిసై పాల్గొన్నారు. -
17న హైదరాబాద్‌కు రాష్ట్రపతి
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 17న దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో నిర్వహించనున్న ఫ్లైట్ కేడెట్ల కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ (సీజీపీ) కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము హాజరుకానున్నట్లు అధికారులు తెలిపారు. పరేడ్ రివ్యూయింగ్ ఆఫీసర్‌గా హాజరవుతున్న రాష్ట్రపతి యువ కేడెట్ల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించనున్నారు. శిక్షణ పూర్తి చేసిన యువ కేడెట్లను భారత వాయుసేనలోని వివిధ విభాగాల్లో విధుల్లో చేరుతున్న వారితో ప్రతిజ్ఞ చేయించనున్నారు. శిక్షణ కాలంలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఫ్లైట్ కేడెట్‌కు రాష్ట్రపతి గౌరవ కరవాళాన్ని ద్రౌపదీముర్ము బహూకరిస్తారు. అనంతరం భారత వాయుసేనతోపాటు భారత నేవీ, ఇండియన్ కోస్ట్‌గార్డ్, భారత్‌తో మైత్రి బంధంలో ఉన్న దేశాల నుంచి ఈ బ్యాచ్‌లో శిక్షణ పొందిన ఫ్లైట్ కేడెట్లకు సైతం రాష్ట్రపతి అవార్డులను అందించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. చదవండి: బీసీలకు శాపంగా జాతీయ విద్యా విధానం.. దేశవ్యాప్తంగా బీసీ పోరు! -
హైదరాబాద్ : దుండిగల్ పీఎస్ పరిధిలో ఓ వ్యక్తి దారుణ హత్య
-
IAF Combined Graduation Parade: ఈ పైలట్లు ఫైటర్లు
పోరాటాలంటే మక్కువ ఉన్నవారు ఏ సవాల్‌నైనా ఇట్టే అధిగమిస్తారు. ఫైటర్ జెట్ పైలెట్‌గా ఎంపికైన మైత్రేయ నిగమ్, మెహర్ జీత్ కౌర్‌లను చూస్తే ఆ మాట నూటికి నూరుపాళ్లు నిజం అంటారు. 22 మంది మహిళల్లో ఫైటర్లుగా ఎంపికైన వీరి ప్రతిభ, కృషి నవతరానికి స్ఫూర్తి. హైదరాబాద్ శివార్లలోని దుండిగల్‌లో ఉన్న ఎయిర్‌ఫోర్స్ అకాడెమీలో (ఏఎఫ్ఏ) జరిగిన కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పెరేడ్ అది. వాయుసేనలో ఉన్న ఖాళీలు, శిక్షణ సమయంలో అభ్యర్థులు చూపించిన ప్రతిభ ఆధారంగా వారిని ఫైటర్లుగా ఎంపిక చేస్తారు. మొత్తం 164 మంది శిక్షణ పూర్తి చేసుకున్న ఫ్లయింగ్ ఆఫీసర్లు పట్టాలు పొందారు. వీరిలో 22 మంది మహిళలు ఉండగా మైత్రేయ నిగమ్, మెహర్ జీత్ కౌర్‌లు ఫైటర్ జెట్ పైలట్లుగా నిలిచారు. మైత్రేయ నిగమ్ ఆమె కుటుంబంలో మూడో తరం ఫైటర్. వదలని కృషి గ్రూప్ కెప్టెన్‌గా పదవీ విరమణ పొందిన పీకే నిగమ్ ప్రస్తుతం ఏవియేషన్ డొమైన్ సంస్థలో పని చేస్తుండగా, ఆయన కుమారుడు అమిత్ నిగమ్ వింగ్ కమాండర్ హోదాలో రిటైర్ అయి ఇండిగో విమానయాన సంస్థలో సీనియర్ కెప్టెన్‌గా పని చేస్తున్నారు. మైత్రేయ నిగమ్ ఢిల్లీలోనే విద్యాభ్యాసం పూర్తి చేశారు. అక్కడి ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో విద్యనభ్యసించారు. అహ్మదాబాద్‌లోని ముద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్స్‌లో (మికా) ఎంబీఏ కోర్సులో చేరారు. అదే సమయంలో తనకు ఆసక్తి ఉన్న వైమానిక దళంలోకి ఎంపికయ్యారు. ‘మా తాత, తండ్రిని చూసి స్ఫూర్తి పొందాను. ఫైటర్ జెట్ పైలట్ కావాలనే ఆశయంతో కృషి చేశా. తమ లక్ష్యాన్ని సాధించడానికి ఎవరైనా అనునిత్యం శ్రమించాల్సిందే. వెంట వెంటనే విజయాలు లభించవు. కల నెరవేరాలంటే ఎన్నో అడ్డంకులు వస్తాయి. కానీ, ఆగిపోవద్దు. కృషిని మధ్యలోనే వదిలేయకుండా కష్టపడితే విజయం తథ్యం’ అని చెబుతోంది మైత్రేయ. పోరాటాలంటే ఇష్టం ఢిల్లీకి చెందిన మెహర్ జీత్ కౌర్ బీఎస్సీ (కెమిస్ట్రీ) పూర్తి చేశారు. ఆది నుంచీ మెహర్‌కి మిలటరీ బలగాలు చేసే పోరాటాలంటే మక్కువ. దీంతో ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్... ఏదో ఒకదాంట్లో చేరాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఏఎఫ్ఏలో శిక్షణలో ప్రతిభ చూపించి ఫైటర్ జెట్ పైలట్‌గా ఎంపికయ్యారు. ‘జీవితంలో అనుకున్న లక్ష్యాన్ని సాధించే వరకు వెనక్కు రాకూడదు. మహిళలు ఈ విషయంలో మరింత పట్టుదలతో ఉండాలి. ఏ సాయుధ బలగంలో అయినా అతివలు దూసుకుపోగలరని గుర్తుంచుకోండి. బీదర్ లో అదనపు శిక్షణ అనంతరం విధుల్లో చేరుతా’ అని పేర్కొన్నారు. నావిగేటర్.. మా నాన్న గుర్దీప్ సింగ్ గుర్దాస్పూర్ సిటీ పోలీసు విభాగంలో అసిస్టెంట్ సబ్–ఇన్స్పెక్టర్గా పని చేస్తున్నారు. తాత గురుబచన్ సింగ్ ఆర్మీలో పని చేసి పదవీ విరమణ పొందారు. వారు ఇచ్చిన ప్రోత్సాహం నన్ను ఈ స్థాయికి చేర్చింది. పంజాబ్‌లోని గుర్దాస్పూర్ నుంచే పన్నెండో తరగతి పూర్తి చేశాను. 2016లో భారత వాయుసేనలోకి ముగ్గురు మహిళా ఫైటర్లు తొలిసారిగా బాధ్యతలు స్వీకరించిన వార్త చూసి వారి బాటలోనే నడవాలనుకున్నాను. ప్రణాళికా బద్ధంగా ముందుకు వెళ్లి ఏఎఫ్ఏలో శిక్షణ పూర్తి చేసుకుని, నావిగేటర్‌గా ఎంపికయ్యాను. – కోమల్ ప్రీత్ కౌర్, పంజాబ్ కఠినమైన శిక్షణ ఎయిర్‌ఫోర్స్ అకాడెమీలో శిక్షణ ఎంతో కఠినంగా ఉంటుంది. ఇక్కడ శిక్షణ పొందే ప్రతి ఒక్కరూ నెవర్ గివిట్ అప్ ధోరణిలోనే ఉంటారు. స్త్రీ, పురుష తేడాలు ఉండవు. ప్రతి ఒక్కరూ విధుల్లో ఉన్నట్టుగానే శిక్షణలో పాల్గొనాలి. నా తల్లిదండ్రుల ప్రోత్సాహం, త్యాగాల కారణంగానే ఈ స్థాయికి చేరా. 12వ తరగతి వరకు సైన్స్ చదివినా డిగ్రీ మాత్రం ఆర్ట్స్‌లో పూర్తి చేశాను. నా తండ్రి రణ్‌బీర్ సింగ్ ఢిల్లీ కేంద్రంగా టెరిటోరియర్ ఆర్మీలో పని చేస్తున్నారు. ప్రస్తుతం అత్యున్నత హోదా అయిన సుబేదార్ మేజర్‌గా పని చేస్తున్నారు. ఆర్మీ జీవితాన్ని వారి ద్వారా ఇప్పటికే చూశాను. అందుకే వైమానిక దళాన్ని ఎంపిక చేసుకున్నా. ఎదగాలి, ఎగరాలనే కోరిక బలంగా ఉంది. – సహజ్ప్రీత్ కౌర్, అమృత్సర్ ఈ శిక్షణలో పాల్గొన్న కోమల్‌ప్రీత్‌కౌర్, సహజ్ప్రీత్కౌర్లు కూడా తమ శిక్షణ అనుభవాలను పంచుకున్నారు. – శ్రీరంగం కామేష్, సిటీబ్యూరో, హైదరాబాద్ -
దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో ఘనంగా పాసింగ్ అవుట్ పరేడ్ (ఫొటోలు)
-
బాలుడి పైనుండి దూసుకుపోయిన కారు
-
Hyderabad: చూస్తుండగానే బాలుడిపైకి దూసుకెళ్లిన కారు.. భయానక దృశ్యాలు
సాక్షి, హైదరాబాద్: నగరంలో శుక్రవారం దారుణ ఘటన వెలుగు చూసింది. దుండిగల్ పరిధిలోని బౌరంపేటలో రోడ్డుపై ఆడుకుంటున్న బాలుడిపై నుంచి కారు దూసుకెళ్లింది. ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఇంటి ముందు పార్క్ చేసిన కారును తీసే సమయంలో 15 నెలల బాలుడు రిహన్ అక్కడి వచ్చాడు. కాగా బాలుడిని గమనించకుండా డ్రైవర్ కారును ముందుకు పోనిచ్చాడు. దీంతో బాలుడిపై కారు ఎక్కింది. రోడ్డుపై పడి ఉన్న బాలుడిని గమనించిన తల్లిదండ్రులు వెంటనే పరుగెత్తుకొచ్చి చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రమాదం నుంచి బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు. చికిత్స అందించిన తర్వాత బాలుడి పరిస్థితి మెరుగ్గా ఉందని, ప్రాణాపాయం లేదని డాక్టర్లు వెల్లడించారు. సీసీటీవీ పుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: కలెక్టర్ అయ్యుండి తెలియదంటారా? నిర్మలా సీతారామన్ ఫైర్ -
విద్యా ప్రమాణాలు పెంచుతున్నాం
కుత్బుల్లాపూర్/సుభాష్‌నగర్: ప్రభుత్వ రంగంలో గత 8 ఏళ్లుగా విద్యా ప్రమాణాలను పెంచుతూ వస్తున్నామని... పేదలకు నాణ్యమైన విద్యను అందిస్తున్నామని పురపాలక, ఐటీ శాఖ మంత్రి కె. తారక రామారావు తెలిపారు. అంగన్వాడీ మొదలు యూనివర్సిటీ స్థాయి వరకు విద్యా వ్యవస్థలో గుణాత్మక మార్పులు తెచ్చామని చెప్పారు. శనివారం ఆయన హైదరాబాద్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని దుండిగల్, బహుదూర్‌పల్లిలలో రూ. 2.5 కోట్ల వ్యయంతో నిర్మించిన జూనియర్ కాలేజీని మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, ఎమ్మెల్యే వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజులతో కలసి ప్రారంభించారు. వొకేషనల్ కాలేజీకి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ పేదలకు నాణ్యమైన విద్య అందించేందుకు సీఎం కేసీఆర్ కల్పించిన వసతులను సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో సకల జనుల భేరిలో పాల్గొనేందుకు వెళ్లే సమయంలో ఇదే జూనియర్ కాలేజీ శిథిలావస్థలో ఉండేదని, ప్రస్తుతం కొత్త భవనం నిర్మించి వొకేషనల్ కాలేజీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. గురుకుల విద్యార్థులు ఐఐటీలకు... ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 973 గురుకుల పాఠశాలల్లో 5 లక్షల మంది విద్యార్థులకు రూ. 1.20 లక్షల చొప్పున ఖర్చు చేస్తోందని మంత్రి కేటీఆర్ తెలిపారు. నాణ్యమైన విద్యతోపాటు ఇంట్లో కూడా అందని సకల సౌకర్యాలు అందిస్తోందని చెప్పారు. ప్రభుత్వం అందించే నాణ్యమైన చదువుతో వెయ్యి మందికంటే ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు ఐఐటీకి వెళ్లారని... ఇది ప్రభుత్వం చదువుకు ఇస్తున్న ప్రాధాన్యతను తెలియజేస్తోందన్నారు. 400 గురుకుల పాఠశాలలను 1,052 గురుకులాలను కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేశామని.. ఇది ఎంతో గర్వకారణమన్నారు. విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్మెంట్ కింద రూ.18 వేల కోట్లు చెల్లించామని, విదేశాల్లో చదువుకోవాలనుకునే ఒక్కో విద్యార్థికి రూ.20 లక్షలు అందిస్తున్నామని కేటీఆర్ వివరించారు. జిల్లాకో మెడికల్ కాలేజీ చొప్పున 33 మెడికల్ కాలేజీలు మంజూరయ్యాయని... అగ్రికల్చర్, లా కాలేజీలు, 79 డిగ్రీ కాలేజీలు, రెండు యూనివర్సిటీలను మంజూరు చేసిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. స్థానిక ఎమ్మెల్యే వివేకానంద కోరిన మేరకు ఉర్దూ కాలేజీని మంజూరు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సబిత, మల్లారెడ్డి ప్రసంగించగా ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, నవీన్, సురభి వాణీదేవి, తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి పాల్గొన్నారు. -
దుండిగల్‌లో సీజీపీ పరేడ్.. అదుర్స్!
-
ప్రియురాలితో గొడవపడి వ్యక్తి ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: ప్రియురాలితో గొడవ పడిన ఓ వ్యక్తి మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడిన ఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. అస్సాం రాష్ట్రానికి చెందిన సానుతపా(28) రెండేళ్ల క్రితం బతుకు దెరువు నిమిత్తం నగరానికి వలసవచ్చి దుండిగల్‌లోని గ్రీన్ మెట్రోలో కూలీగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి తన ప్రేయసితో ఫోన్లో మాట్లాడుతూ గొడవ పడ్డాడు. ఈ విషయాన్ని దుండిగల్ చౌరస్తాలో నివాసముండే తన చిన్నాన్న కుమారుడు, సెక్యూరిటీగార్డు సాహిల్‌కు చెప్పి తనకు ఇది మామూలే అంటూ పడుకునేందుకు ఇంటికి వెళ్లిపోయాడు. అయితే మంగళవారం ఉదయం సాహిల్‌కు తోటి కార్మికుడైన టీకా రామ్ ఫోన్ చేసి దుండిగల్ గ్రీన్ మెట్రో సమీపంలోని తుమ్మచెట్టుకు సానుతపా ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలిపాడు. ఈ విషయాన్ని అతను పోలీసులకు సమాచారం ఇవ్వగా మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టమ్ నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. సాహిల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (ప్రేమ పేరుతో మోసం.. మాయమాటలు చెప్పి లోబర్చుకుని..) -
హైదరాబాద్: ఒంటరి మహిళపై సామూహిక అత్యాచారం
సాక్షి, హైదరాబాద్: ఒంటరిగా ఉన్న ఓ మహిళపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపింది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని షోలాపూర్‌కు చెందిన మానసిక స్థితి సరిగా లేని 30 ఏళ్ల రెండ్రోజుల క్రితం నగరానికి వచ్చింది. శక్రవారం రాత్రి గండిమైసమ్మ నుంచి దుండిగల్‌కు వెళ్లే రోడ్డులోని ఉజ్వల బార్ అండ్ రెస్టారెంట్ పక్కన సదరు మహిళ ఒంటరిగా నిలుచుని ఉంది. ఈ క్రమంలో ఐదుగురు యువకులు ఆమెను ఉజ్వల బార్ వెనుక ఉన్న నిర్జన ప్రదేశానికి తీసుకువెళ్లి సామూహిక ఆత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు వారి నుంచి తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుల్లో ఇమ్రాన్(20)ను పోలీసులు అదుపులోకి తీసుకోగా ఆత్యాచారానికి పాల్పడినట్లు అంగీకరించాడు. మరికొందరు నిందితులు నర్సింహ, ఖుద్దూస్, ఉమిద్దీన్, ఇమామ్‌లు పరారీలో ఉన్నారు. కాగా నిందితులంతా డి.పోచంపల్లి ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్లుగా తేలింది. వారిపై 377డీ సెక్షన్ కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: మిసిసిపీ ఫెస్టివల్లో అపశ్రుతి -
Sakshi Premier League 2022: విజేతలు ఎంఎల్ఆర్ఐటి, గౌతమ్ కాలేజి
-
డ్రెస్ కొనుక్కుంటానని చెప్పి బయటకు వెళ్లి..
సాక్షి, దుండిగల్: ఓ మహిళ కుమారుడితో సహా అదృశ్యమైన ఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్ రాష్ట్రం సంస్తాన్‌పూర్‌కు చెందిన చంచల్ పాశ్వాన్, చాందిని దేవిలు భార్యాభర్తలు. కాగా వీరికి ముగ్గుకు సంతానం. బతుకు దెరువు కోసం వీరు నగరానికి వలస వచ్చి దుండిగల్ మున్సిపాలిటీ గండిమైసమ్మలోని 120 గజాల్లో నివాసముంటున్నారు. చంచల్ పాశ్వాన్ కూలీ పనులు చేస్తుండగా, అతడి భార్య ఇంటి వద్దనే ఉంటోంది. కాగా ఈ నెల 20న మధ్యాహ్నం 2 గంటల సమయంలో చాందినిదేవి తన చిన్నకుమారుడు యువరాజ్(3)ను వెంట బెట్టుకుని డ్రెస్ కొనుక్కుంటానని చెప్పి బయటకు వెళ్లింది. రాత్రైనా ఆమె ఇంటికి రాకపోవడంతో భర్త వారి కోసం చుట్టు పక్కల వెతికినా ఫలితం లేకుండా పోయింది. దీంతో సోమవారం దుండిగల్ పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
మైనర్‌ను గర్భవతి చేసి అబార్షన్ చేయించిన మారు తండ్రి
సాక్షి, దుండిగల్: మైనర్ బాలికని గర్భవతి చేసి అబార్షన్ చేయించిన మారు తండ్రిని దుండిగల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దుండిగల్ మున్సిపాలిటీ పరిధి మల్లంపేట్‌లో పదేళ్లుగా ఓ జంట సహజీవనం చేస్తోంది. కాగా సదరు మహిళ కుమార్తె(12)పై మారు తండ్రి కన్నేశాడు. ఈ క్రమంలో బాలికను లోబర్చుకుని గర్భవతి చేశాడు. విషయం ఎక్కడ బయటకు పొక్కుతుందోనని ఓ ఆర్ఎంపీ ద్వారా నిజాంపేట్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో గుట్టుచప్పుడు కాకుండా అబార్షన్ చేయించాడు. అయితే బాలిక తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో బొల్లారంలోని ఓ ఆర్ఎంపీ వద్దకు తీసుకువెళ్లారు. అయితే విషయాన్ని గుర్తించిన సదరు ఆర్ఎంపీ దుండిగల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. కాగా బాలికకు అబార్షన్ చేసిన ప్రైవేట్ ఆస్పత్రిలో ఇలాంటి ఘటనలు ఇంకేమైనా చోటు చేసుకున్నాయా.. అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. -
హైదరాబాద్‌లో అమానుషం: అన్నను కొట్టి చంపిన తమ్ముడు
సాక్షి, దుండిగల్(హైదరాబాద్): మద్యం మత్తులో రక్త సంబంధాన్నే మరిచారు.. తాగిన మైకంలో అన్నదమ్ములిద్దరూ గొడవ పడ్డారు. మత్తులో అన్నపై తమ్ముడు దాడి చేయడంతో అన్న మృతి చెందిన ఘటన దుండిగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. దుండిగల్ మున్సిపల్ పరిధి చర్చి గాగిల్లాపూర్‌కు చెందిన వాడపల్లి వెంకటమారుతి భరత్‌భూషణ్ (35), సాయితేజ(28)లు అన్నదమ్ములు. వీరికి వివాహాలు కాలేదు. పనిపాట లేకుండాగా ఇంటి పట్టునే ఉంటూ ప్రతిరోజూ మద్యం తాగి గొడవ పడేవారు. వీరి తల్లికి పక్షపాతం ఉండటంతో కదలలేని స్థితిలో ఉండేది. 24వ తేదీ రాత్రి మద్యం తాగి గొడవ పడ్డారు. తమ్ముడు సాయితేజ కుక్కర్‌తో అన్న భరత్భూషణ్పై విచక్షణ రహితంగా దాడి చేయడంతో స్పృహతప్పి పడిపోయాడు. ఉదయం అన్నను నిద్ర లేపేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో చనిపోయాడని నిర్ధారించుకుని పారిపోయాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్ నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: స్నేహితురాలి పుట్టినరోజు.. యువతుల కార్ల రేస్.. చివరికి ఏం జరిగిందంటే? -
దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో పాసింగ్ ఔట్ పరేడ్ ఫొటోలు
-
దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో పాసింగ్ అవుట్ పరేడ్
-
Hyderabad: గంటకు 65 కి.మీ దాటితే ప్రమాదమే..
Road Accidents Hyderabad: దుండిగల్ పోలీసుస్టేషన్ పరిధిలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో ముగ్గురు యువకులు మరణించారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదానికి మద్యం మత్తుతో పాటు అతివేగమూ కారణమే. ప్రమాద సమయంలో ఆ కారు గంటకు 100 కి.మీకి పైగా వేగంతో ఉన్నట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. పరిమితికి మించిన వేగంతో వాహనం ప్రయాణించిన కారణంగానే ఎయిర్‌బ్యాగ్స్ తెరుచుకున్నా ఫలితం దక్కలేదు. కేవలం ఈ ఒక్క ప్రమాదమే కాదు.. సిటీలో రోడ్డు ప్రమాదాల్లో అత్యధిక శాతం అతివేగం వల్లే జరుగుతున్నాయని పోలీసులే అంగీకరిస్తున్నారు. సిటీ రహదారులు గరిష్టంగా గంటకు 50 కిమీ వేగంతో ప్రయాణించడానికి మాత్రమే అనువైనవని రవాణా రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. గంటకు 65 కి.మీలు వేగం దాటితే ప్రమాదాలను కొని తెచ్చుకున్నట్లే అని వివరిస్తున్నారు. నగరంలోని రోడ్ల సామర్థ్యం, వాటి పైకి వస్తున్న వాహనాల గరిష్ట వేగానికి మధ్య పొంతన లేకపోవడం గమనార్హం. ఆ రెంటికీ సంబంధం లేదు.. ►రాజధానిలో వాహనాల సరాసరి వేగం గంటకు 25 కి.మీ మించట్లేదు. రహదారులు పరిస్థితి, ఇబ్బడిముబ్బడిగా వచ్చి పడుతున్న కొత్త వాహనాలు, ఆక్రమణలు సహా మరెన్నో దీనికి కారణంగా మారుతున్నాయి. మరోపక్క సిటీ రహదారులు గంటకు గరిష్టంగా 50 కిమీ వేగంతో ప్రయాణించేలా డిజైన్ చేసినవే. ►నగర రోడ్ల పైకి కొత్తగా వస్తున్న, ఇప్పటికే ఉన్న వాహనాల గరిష్ట వేగం గంటకు 200 కి.మీపైగా ఉంటోంది. దిగుమతి చేసుకున్న వాహనాలది ఇంతకంటే ఎక్కువే. రహదారుల స్థితిగతులు, వాహనాల గరిష్ట వేగం మధ్య ఎలాంటి పొంతన లేకపోయినప్పటికీ వీటిని నియంత్రించే అవకాశం లేదని అధికారులు చెప్తున్నారు. దీనికి సంబంధించి ప్రత్యేక చట్టం, నిబంధనలు లేవని పేర్కొంటున్నారు. చదవండి: (ఆహా ఏమి రుచి.. తినరా మైమరచి.. అక్కడ రూ.1కే బజ్జీ !) రాత్రి వేళల్లోనే ఎక్కువ.. ►వాహనాల రద్దీ, ట్రాఫిక్ పోలీసుల నిఘా తదితర కారణాల నేపథ్యంలో పగటి పూట సిటీ రహదారులపై మితిమీరిన వేగానికి ఆస్కారం లేదు. కొన్ని రోడ్లలో వేగంగా వెళ్లే అవకాశం ఉన్నప్పటికీ.. జంక్షన్లలతో పాటు ఇతర ప్రాంతాల్లో ఉండే సిగ్నల్స్ కారణంగా దీనికి బ్రేక్ తప్పట్లేదు. ►కేవలం ఇన్నర్ రింగ్ రోడ్, శివారు రహదారులు వంటి కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వాహనాలు పగటిపూట వేగంగా, ఎలాంటి బ్రేక్ లేకుండా ప్రయాణించే ఆస్కారం ఉంది. రాత్రి వేళల్లో రోడ్లన్నీ దాదాపు నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. ఫలితంగా వాహనాలు మితిమీరిన వేగంతో ప్రయాణించడంతో పాటు రేసింగ్స్ వంటివి జరుగుతున్నాయి. ఏటా నగర రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా బాధితులుగా మారుతోంది పాదచారులే కావడం గమనార్హం. ►వాహన వేగం మితిమీరి ఉంటే... ఈ సమయంలోపే డ్రైవర్ లేదా ప్రయాణికులు స్టీరింగ్, డ్యాష్‌బోర్డ్, సీట్లకు కొట్టుకునే అవకాశం ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లోనే ఎయిర్ బ్యాగ్స్ పేలిపోవడం కూడా జరుగుతుంది. ఈ పరిస్థితుల్లో ఎయిర్ బ్యాగ్స్ కూడా వాహనంలోని వారిని రక్షించలేవు. ►హైదరాబాద్ నగరంలో మితిమీరిన వేగం 1,785 ప్రమాదాలకు కారణమైంది. ఫలితంగా 213 మంది చనిపోయారు. 1,548 మంది క్షతగాత్రులయ్యారు. ఈ ఏడాది ఇప్పటి వరకు మొత్తం 237 ప్రమాదాలు జరిగాయి. వీటిలో ఓవర్ స్పీడింగ్‌తో జరిగినవి 178. కొంపల్లిలో కారు బీభత్సం కుత్బుల్లాపూర్: మద్యం మత్తులో కారు నడపడంతో వాహనం పల్టీ కొట్టిన ఘటనలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలైన ఘటన పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ఛోటాబజార్కు చెందిన సాయి శ్రీనివాస్ (27) అకౌంటెంట్. ఆదివారం రాత్రి ఆర్మూర్ నుంచి నగరానికి కారులో తన స్నేహితులు పిండిత శ్రీకాంత్, పవన్‌లతో కలిసి వస్తున్నారు. ఈ క్రమంలో కొంపల్లిలోని మహీంద్రా షోరూమ్ సమీపంలోకి రాగానే కారు అదుపు తప్పి డివైడర్ గ్రిల్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను బయటకు తీశారు. వీరికి బ్రీతింగ్ అనలైజ్ పరీక్ష చేయడంతో మద్యం తాగినట్లు వెల్లడైంది. వీరిపై ఐపీసీ సెక్షన్ 337, 185 కింద కేసులు నమోదు చేశారు. సదరు కారుపై ఇప్పటికే 3 చలానాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. -
దుండిగల్‌లో తీవ్ర విషాదం: చచ్చినా.. మారరా..?
సాక్షి, హైదరాబాద్: డీకే నగర్లో విద్యార్థిని దేవి.. పంజగుట్ట వద్ద చిన్నారి రమ్య కుటుంబం.. తాజాగా వారం రోజుల క్రితం బంజారాహిల్స్, నార్సింగిల్లో నలుగురు.. ఇవి సంచలనం సృష్టించి.. రికార్డులకెక్కిన ‘డ్రంకన్ డ్రైవింగ్’ ఉదంతాలు. వీటికి తోడు ఆదివారం తెల్లవారుజామున దుండిగల్ పోలీసుస్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న మరో ఘోర ప్రమాదమూ ఈ జాబితాలో చేరింది. (చదవండి: మందు కొట్టి.. ఫ్యామిలీని బలిపెట్టాడు) ఈ దుర్ఘటనలో అక్కడిక్కడే ముగ్గురు చనిపోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, ఏటా ఎందరు జైలుకు వెళ్తున్నా, నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నా మందుబాబుల్లో మార్పు రావట్లేదు. మద్యం మత్తులోనే వాహనాలు నడుపుతూ ప్రమాదాలను కొనితెచ్చుకోవడంతో పాటు ఎదుటి వారి ప్రాణాలు తీస్తున్నారు. తీవ్రమైన సెక్షన్లతో కేసులు పెట్టినా... ► సాధారణంగా రోడ్డు ప్రమాద ఉదంతాలు చోటు చేసుకున్నప్పుడు పోలీసులు ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ)లోని సెక్షన్ 304 (ఎ) కింద కేసు నమోదు చేస్తారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారణంగా ఎదుటి వారికి ప్రాణనష్టం కలిగించడం ఆరోపణలపై దర్యాప్తు చేసి అభియోగాలు మోపుతారు. (చదవండి: నన్ను అడ్డుకుంటే పొడుచుకుంటా..) ► డ్రంకన్ డ్రైవింగ్ చేస్తూ ప్రమాదంతో ఎదుటి వారి మరణానికి కారణమైన వారిపై ఐపీసీలోని సెక్షన్ 304 (పార్ట్–2) కింద కేసు నమోదు చేయడం ప్రారంభించారు. అంటే ఓ వ్యక్తి నిర్లక్ష్యంతో ప్రాణం పోయిందే కానీ ప్రాణం పోతుందని తెలిసీ నిర్లక్ష్యంగా వ్యవహరించారని అర్థం. ఆపై వెంట ఉన్న వారి పైనా ప్రేరేపించడం సెక్షన్ కింద ఆరోపణలు జోడిస్తున్నారు. ► ఇలాంటి కేసుల్లో బెయిల్ సైతం తొందరగా లభించదు. న్యాయస్థానంలో నిరూపితమైతే గరిష్టంగా పదేళ్ల నుంచి జీవిత ఖైదు లేదా జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంది. ఈ సెక్షన్ కింద నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్ సైతం లభించదు. అయినప్పటికీ మందుబాబుల్లో మాత్రం మార్పు రావట్లేదు. డేటాబేస్‌ను సెంట్రలైజ్డ్ చేయాలి... ► మద్యం తాగి వాహనాలు నడుపుతూ చిక్కడంతో పాటు ర్యాష్ డ్రైవింగ్, నిర్లక్ష్య డ్రైవింగ్ వల్ల ప్రమాదాలకు కారణమైన, తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడిన వారి వివరాలతో సమగ్ర ఎల్రక్టానిక్ డేటాబేస్ సిద్ధం చేయాల్సిన అవసరం ఉంది. ► ఈ తరహా ఉల్లంఘనుల్లో అత్యధికం యువత, విద్యాధికులే ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే మద్యం తాగి ప్రమాదాలు చేసిన వారితో పాటు వాహనాలు నడుపుతూ చిక్కిన వారి వివరాలను ఆధార్‌తో సహా పొందుపరచాలి. ఈ వివరాలను క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టం (సీసీటీఎన్ఎస్) ద్వారా వివిధ రకాలైన సేవలు అందించే విభాగాలకు అందుబాటులో ఉంచాలి. ► ఆయా విభాగాలు ఇందులోని వివరాలు సరిచూసుకుని తదుపరి చర్యలు తీసుకోవడాన్ని తప్పనిసరి చేయాలి. ప్రధానంగా పాస్‌పోర్ట్, వీసా, జాబ్ వెరిఫికేషన్ సమయాల్లో ఇలాంటి కేసులు అడ్డంకిగా మారాలి. అప్పుడే మందుబాబులు కాస్త తగ్గే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. -
చికిత్స కోసం ఆస్పత్రికి.. చనిపోయిందనడంతో తీసుకొచ్చినవారు పరార్
దుండిగల్: అపస్మారక స్థితిలో ఉన్న ఓ గుర్తుతెలియని మహిళను ఆస్పత్రికి తీసుకొచ్చిన వ్యక్తులు తీరా ఆమె చనిపోయిందని తెలియడంతో పరారైన ఘటన దుండిగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు... ఈ నెల 16న రాత్రి 10:25 గంటల సమయంలో సూరారంలోని నారాయణ మలారెడ్డి ఆస్పత్రికి ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఆటోలో ఓ మహిళను చికిత్స నిమిత్తం తీసుకొచ్చారు. సదరు మహిళను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందిందని చెప్పారు. దీంతో ఇద్దరు వ్యక్తులు అక్కడ నుంచి పరారయ్యారు. ఆస్పత్రి సిబ్బంది వారి కోసం వెతకగా కనిపించలేదు. దీంతో ఆస్పత్రి సిబ్బంది శనివారం దుండిగల్ పోలీçసులకు ఫిర్యాదు చేశారు. ఆస్పత్రికి చేరుకున్న పోలీసులు సీసీ కెమెరాల్లో పరిశీలించగా ఆటోలో వెళ్లిపోయినట్లు కనిపించింది. స్పష్టత లేకపోవడంతో సదరు వ్యక్తులను గుర్తించలేకపోయారు. మహిళ ఎడమ చేతిపై లక్ష్మి, కుడి చేతిపై ‘ఎం’ అనే అక్షరాలతో పచ్చబొట్లు ఉన్నాయని, మెడలో మంగళసూత్రం, చేతులు, కాళ్లకు పారాణి ఉండటంతో కొత్తగా పెళ్లై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. మహిళ వయసు సుమారు 25 సంవత్సరాలు ఉంటుందని, కుటుంబ గొడవల నేపథ్యంలో హత్యాయత్నం జరిగిందా లేదా ఇతరాత్రా కారణాలతో మృతి చెంది ఉంటుందా అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మహిళ కుటుంబ సభ్యులెవరైనా ఉంటే దుండిగల్ పోలీస్‌స్టేషన్‌లో సంప్రదించాలని కోరారు. -
దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో పాసింగ్ ఔట్ పరేడ్
-
వివాహేతర సంబంధం: చెరువులోపడి భార్య ఆత్మహత్య
సాక్షి, మేడ్చల్: దుందిగల్ పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. తన భార్య చూడటానికి లావు ఉందనే కోపంతో నిత్యం వేధింపులకు గురి చేశాడు ఓ కానిస్టేబుల్. దీంతో ఆ వివాహిత తీవ్ర మనస్తాపానికి గురై చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీలత భర్త శివ కుమార్ సనత్ నగర్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. కొంత కాలంగా శ్రీలత లావు అందనే కోపంతో అన్నం కూడా పెట్టేవాడు కాదని తెలిపారు. కొన్ని నెలలు క్రితమే పూర్వ విద్యార్థుల గేట్‌టుగెదర్ కార్యక్రమం జరిగిన సమయంలో అక్కడ మరో వివాహిత శివ కుమార్‌కి పరిచయం అయింది. దీంతో ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉందని శ్రీలత తీవ్ర మనస్తాపం చెందినట్లు తెలుస్తోంది. ఈ ఘటనను పోలీసులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని దుండిగల్ సీఐ తెలిపారు. మరోవైపు తమ కూతురును చంపేసి, ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని శ్రీలత తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఎనిమిదేళ్ల క్రితం తమ అమ్మాయి శ్రీలతను కానిస్టేబుల్ శివకుమార్‌తో వివాహం చేశామని తెలిపారు. వివాహం జరిగినప్పటి నుంచి కట్నం కోసం వేధింపులు చేస్తున్నాడని తెలిపారు. ఇక కానిస్టేబుల్ శివ కుమార్ ఆరేళ్ల కూతురు తన తండ్రి అరాచకంపై కన్నీరు పెట్టుకుంది. అమ్మను ప్రతిరోజు కొట్టేవాడని, అన్నం పెట్టకుండా వేధించే వాడని చిన్నారి తెలిపింది. బయట నుంచి కోపంతో వచ్చి అమ్మ పైన దాడి చేసేవాడిని తెలిపింది. చదవండి: గగన్ అగర్వాల్ హత్యకేసు: వెలుగులోకి కీలక విషయాలు -
ఘోరం: డ్రైవింగ్‌లో ఉండగా ఫిట్స్!
సాక్షి, దుండిగల్: వేగంగా కారు నడుపుతున్న వ్యక్తికి ఫిట్స్ రావడంతో వాహనం అదుపు తప్పి ప్రహరీని ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందిన ఘటన దుండిగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. దుండిగల్ మున్సిపల్ పరిధి డీపోచంపల్లికి చెందిన అక్బర్ ఖాన్(38) ఎలక్ట్రీషియన్ శనివారం రాత్రి ఔటర్ నుంచి దుండిగల్ వైపు వర్నా కారులో వేగంగా ప్రయాణిస్తున్నాడు. ఈ క్రమంలో ఫిట్స్ రావడంతో కారు పక్కనే ఉన్న ఓపెన్ ప్లాట్ గోడను ఢీకొంది. అతడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న దుండిగల్ పోలీసులు అతడిని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పోలియో చుక్కలు వేయించిన కొద్దిసేపటికే
సాక్షి, దుండిగల్: పోలియో చుక్కలు వేయించిన కొద్ది నిమిషాలకే 3 నెలల పసిపాప విగత జీవిగా మారింది. ఈ ఘటన దుండిగల్ మున్సిపాలిటీ పరిధి శంభీపూర్లో చోటు చేసుకుంది. జగద్గిరిగుట్టకు చెందిన యాదగిరి, రమ్యలకు దీక్షిత (3 నెలల) పాప ఉంది. మహేశ్వరంలో తల్లిగారి ఇంటికి వెళ్లిన రమ్య ఆదివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో చిన్నారికి శంభీపూర్‌లోని అంగన్వాడీ కేంద్రంలో పోలియో చుక్కలు వేయించింది. ఇంటికి వెళ్లిన 15 నిమిషాలకే చిన్నారి నుంచి ఎలాంటి ఉలుకూపలుకూ లేదు. చిన్నారిలో చలనం లేకపోవడంతో ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు మదీనాగూడలోని చిన్న పిల్లల ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే చిన్నారి అప్పటికే మృతి చెందిందని వైద్యులు పేర్కొన్నారు. చదవండి: అన్యాయం జరుగుతుంటే గాడిదలు కాస్తున్నారా? వ్యాక్సిన్ వికటించడంతోనే పాప మృతి చెందిందని పేర్కొంటూ చిన్నారి కుటుంబ సభ్యులు, బంధువులు అంగన్వాడీ కేంద్రం వద్ద ఆందోళనకు దిగారు. మేడ్చల్ జిల్లా వైద్యాధికారి మల్లికార్జున్, దండిగల్ మండల వైద్యాధికారి నిర్మల, సీఐ వెంకటేశం, ఎస్ఐ చంద్రశేఖర్ అంగన్వాడీ కేంద్రం వద్దకు చేరుకుని బాధిత కుటుంబ సభ్యులను సముదాయించడంతో ఆందోళన విరమించారు. ఈ సందర్భంగా మల్లికార్జున్ మాట్లాడుతూ.. ఇదే బూత్‌లో 250 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేశామని, వారందరూ క్షేమంగానే ఉన్నారన్నారు. పుట్టిన సమయంలో ఏదైనా అనారోగ్య సమస్యలుంటేనే ఇలా జరిగే ఆస్కారముందని, పోస్ట్‌మార్టమ్ నివేదికలోనే నిజానిజాలు బయటకు వస్తాయని, అప్పటి వరకు ఏ విషయం చెప్పలేమన్నారు. -
నాలుగు యుద్ధాల్లో మట్టికరిచినా బుద్ధి రాలేదు
సాక్షి, హైదరాబాద్ : ‘భారత్ స్వభావ రీత్యా శాంతి కాముకదేశం. ఏ విషయాన్నైనా చర్చ ల ద్వారా పరిష్కరించుకోవాలన్నదే మా విధానం. అలాగని మా జోలికొస్తే.. ఊరుకోం. ముఖం పగిలేలా దీటుగా సమాధా నం చెబుతాం’అని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చైనా, పాకిస్తాన్లను ఉద్దేశించి పరోక్షంగా హెచ్చరించారు. శనివారం దుం డిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో జరిగిన పైలట్ల పాసింగ్ ఔట్‌పరేడ్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి, ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కే సింగ్ బదౌరి యా, డీఆర్డీవో చీఫ్ సతీశ్రెడ్డిలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘ఈ రోజు వాయు సేనలో పైలట్లుగా చేరబోతున్న మీ అంద రికీ శుభాకాంక్షలు. దేశంలోని అత్యున్నత వైమానిక శిక్షణ కేంద్రంగా పేరొందిన దుండిగల్ ఎయిర్పోర్స్లో మీరు శిక్షణ పూర్తి చేసుకున్నందుకు ఆనందంగా ఉంది. మీ సీనియర్లు ఎందరో విధి నిర్వహణలో అత్యున్నత ధైర్య సాహసాలు ప్రదర్శించారు. ప్రాణాలు అర్పించి పరాక్రమ వీరులయ్యారు. వారి సేవలే మీకు ఆదర్శం. శిక్షణలో నేర్చుకున్న పాఠాలతో ధైర్యంగా ముందడుగు వేయండి. శిక్షణ వేరు.. విధి నిర్వహణ వేరు.. కొత్త విషయాలు నేర్చుకుంటూ ముందు కు సాగండి. త్వరలోనే నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లలో సేవలందించేందుకు వెళ్తున్న మీరు.. మీ గురువులు, తల్లిదండ్రులు, దేశం గర్వించేలా చేయండి. దేశ గౌరవం, భద్రత మీ చేతుల్లో ఉన్నాయి. ఎప్పుడు ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి. మీ ప్రదర్శన గురించి ఒక్కమాటలో చెప్పాలంటే.. ఎక్స్లెంట్’అని రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు. 1971 యుద్ధవీరులను సత్కరించుకుంటాం.. ‘1971 యుద్ధంలో వేలాది మంది భారత సైనికులు ప్రాణాలు అర్పించారు. ఆ యుద్ధం ముగిసి 50 ఏళ్లు అవుతున్న సందర్భంగా త్వరలోనే స్వర్ణోత్సవాలను నిర్వహిస్తాం. అమరుల కుటుంబాలను సత్కరించుకుంటాం. వాయుసేనకు బడ్జెట్లో పెద్దపీట వేశాం. దేశీయంగా రక్షణ ఉత్పత్తులకు ప్రాధాన్యమిస్తున్నాం. క్షిపణులు, రక్షణ పరికరాల తయారీలో స్వయం సమృద్ధి సాధించాం. దేశీయంగా తయారు చేసిన తేలికపాటి యుద్ధవిమానం తేజస్ నుంచి రఫేల్ వరకు మన వాయుసేన బలంగా ఉంది. ఆత్మ విశ్వాసంతో ముం దడుగు వేయండి. మీ అందరికీ శుభాకాంక్షలు. ఈ కేంద్రం నుం చి శిక్షణ పొందిన వియత్నాం, శ్రీలంక, నైజీరియా పైలట్లకు కూడా శుభాకాంక్షలు’అంటూ రాజ్‌నాథ్‌సింగ్ తన ప్రసంగాన్ని ముగించారు. అవసరమైతే సరిహద్దు దాటుతాం.. ‘ఇప్పటికీ నాలుగు యుద్ధాల్లో భారత్ చేతిలో మట్టి కరిచినా.. పాకిస్తాన్‌కు బుద్ధి రావడం లేదు. మనల్ని నేరుగా ఎదుర్కోలేక సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తోంది. అయినా భారత్ అన్ని ఆటంకాలకు చక్కగా సమాధానం ఇస్తోంది. బాలాకోట్ దాడి అనంతరం పాకిస్తాన్ సరిహద్దు దాటి చేపట్టిన సర్జికల్ స్ట్రైక్స్ మన సైనికుల పరాక్రమానికి మచ్చు తునక. ఇది ఒకప్పటి ఇండియా కాదు. ఇది నవభారతం. యుద్ధక్షేత్రంలోనే కాదు, అవసరమైతే సరిహద్దు దాటేందుకు వెనుకాడం. యుద్ధరీతులు మారుతున్నాయి. టెక్నాలజీ పెరిగింది సైబర్ వార్ కీలక పాత్ర పోషిస్తోంది. పైలట్లు నిత్యం టెక్నాలజీపై అప్డేట్గా ఉండండి ముఖ్యంగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌పై పరిజ్ఞానాన్ని పెంపొందించుకోండి’అని రాజ్‌నాథ్‌సింగ్ చెప్పారు. వాయుసేన సేవలు చిరస్మరణీయం ‘భారత్ ఎదుర్కొన్న యుద్ధాల్లో భారత వాయుసేన సేవలు చిరస్మరణీయం. ముఖ్యంగా 1961, 1965, 1971లో బంగ్లాదేశ్ విముక్తి, 1999 కార్గిల్ యుద్ధాల్లో భారత వాయుసేన చూపిన ప్రతిభ స్వర్ణాక్షరాలతో లిఖించదగింది. పదాతి, నేవీ దళాలకు వెన్నుదన్నుగా నిలుస్తూ తన వంతు పాత్ర పోషించింది. ఇండో–చైనా సరిహద్దులో లద్దాఖ్‌లో సైనికులకు సామగ్రి చేరవేయడంలో, నిఘా విధుల్లో, కోవిడ్ సమయంలో దేశంలో పలు ప్రాంతాలకు సాయం అందించడంలో అత్యున్నత సేవలందించింది. భారత వాయుసేన సేవలు కేవలం దేశానికే పరిమితం కాలేదు. ఐరాస పీస్ కీపింగ్ మిషన్‌లోనూ భారత వాయుసేన ప్రపంచదేశాల నుంచి ప్రశంసలందుకుంటోంది’అని రక్షణ మంత్రి పేర్కొన్నారు. అలరించిన కవాతు.. ఈ కార్యక్రమంలో పైలట్లు చేసిన కవాతు ఎంతగానో అలరించింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కే సింగ్ బదౌరియా.. కేడెట్లకు పైలట్ బ్యాడ్జీలు అలంకరించారు. ట్రైనీ కేడెట్లలో అత్యుత్తమ ప్రదర్శన ట్రోఫీని ఆశీష్ కత్రి అందుకున్నారు. చివరలో భారత వైమానికదళంలోని తేలికపాటి విమానం నుంచి సుఖోయ్ 30 యుద్ధ విమానాల వరకు ఆకాశంలో చేసిన యుద్ధ విన్యాసాలు ఆహూతులను కట్టిపడేశాయి. మొత్తం 114 మంది కేడెట్లు దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో తమ శిక్షణ పూర్తి చేసుకున్నారు. తమ వారిని పైలట్లుగా చూసుకుని తల్లిదండ్రులు, సోదరులు మురిసిపోయారు. అమరుల స్తూపం చూసి చలించిపోయా సాక్షి, హైదరాబాద్: దుండిగల్ ఎయిర్‌పోర్స్ అకాడమీలో విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న పైలట్లలో తెలుగుతేజం అక్షయ్ కూడా ఒకరు. శనివారం పాసింగ్ ఔట్ పరేడ్ వేడుక ముగిసిన అనంతరం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. లద్దాఖ్‌కు సరదాగా చేసిన యాత్ర తన జీవితాన్ని మార్చిందని గుర్తు చేసుకున్నారు. ఆర్మీ త్యాగాలు చూసి చలించిన తానూ దేశసేవ చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలిపారు. ఎందుకు పైలట్ అయ్యారో అక్షయ్ మాటల్లోనే.. ఆ యాత్ర నన్ను మార్చింది.. మాది వికారాబాద్ జిల్లా పరిగి. పుట్టి పెరిగింది అంతా అక్కడే. తర్వాత హైదరాబాద్‌కు మా రాం. మా నాన్న ఆక్యుపంక్చర్ వైద్యుడు. ఇంట్లో అమ్మా నాన్న, నేను, చెల్లి ఉంటాం. 2015లో ఘట్కేసర్లోని సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీ నుంచి బీటెక్ పూర్తి చేశాను. ఆ తర్వాత విప్రోలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా చేరాను. ఒకసారి లద్దాఖ్‌కు ఒంటరిగా బైక్‌పై యాత్ర చేశాను. అక్కడ యుద్ధంలో మరణించిన వారి స్మారక చిహ్నాన్ని చూశాను. ఆర్మీ వారితో మాట్లాడాను. ‘దేశం రేపటి కోసం మేం ఈ రోజు మరణిస్తాం’అని మీ వాళ్లకు చెప్పమని ఆర్మీ అధికారులు అన్న మాటలు నన్ను కదిలించాయి. అంతే దేశానికి ఏదైనా చేయాలని ఆ క్షణాన్నే అనిపించింది. సాఫ్ట్వేర్ జాబ్ నా లక్ష్యం కాదని నాకు అర్థమైంది. పైలట్ కావాలని నిర్ణయించుకున్నాను. కుటుంబసభ్యులు కూడా భుజం తట్టి నన్ను ప్రోత్సహించారు. వారి సహకారంతోనే ఎయిర్‌ఫోర్స్ ఎగ్జామ్ రాసి 2019లో పైలట్‌గా శిక్షణలో చేరాను. ఏడాది కఠోర శిక్షణ తర్వాత విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్నాను. దేశం కోసం పనిచేయబోతున్నానన్న మాట తలుచుకుంటేనే గర్వం గా ఉంది. ఎయిర్‌ఫోర్స్‌లోకి రావాలనుకునేందుకు చాలామంది గ్రామీణ యువత వెనుకడుగు వేస్తుం టారు. అలాంటి సంశయాలు ఏమీ పెట్టుకోవద్దు. అందుకు నేనే పెద్ద ఉదాహరణ. దేశానికి సేవ చేయాలన్న కోరిక, విద్యార్హతలు, శారీరక దారుఢ్యం ఉంటే చాలు’అని అక్షయ్ వివరించారు. -
దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో ట్రైనీ పైలట్ల పరేడ్
-
హైదరాబాద్ చేరుకున్న రాజ్‌నాథ్ సింగ్
సాక్షి, హైదరాబాద్ : కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం హైదరాబాద్ చేరుకున్నారు. రెండు రోజుల పాటు ఆయన పర్యటన ఉండనుంది. దుండిగల్ ఎయిర్‌పోర్స్ అకాడమీలో ట్రైనీలతో ఆయన ముఖాముఖి అయ్యారు. అలాగే శనివారం ఉదయం ట్రైనీ పైలట్ల పరేడ్‌లో రాజ్‌నాథ్ పాల్గొంటారు. మధ్యాహ్నం CASలో కార్యక్రమంలో పాల్గొననున్నారు. అనంతరం అగ్ని మిసైల్ పరీక్షను స్వయంగా ఆయన పరిశీలించనున్నారు. రేపు సాయంత్రం పహాడీషరీఫ్‌లోని ఆర్సీఐలో డీఆర్డీవో రక్షణ పరికరాలను పరిశీలిస్తారు. Telangana: Defence Minister Rajnath Singh arrives at Indian Air Force Academy, Dundigal. The Defence Minister is on a two-day visit to Telangana.#DefenceMinster #AirForce #RajnathSingh #Telangana #Dundigal #MinisterOfDefence pic.twitter.com/bQsq8O2e28 — MD ANEES QAMAR (@MDANEESQAMAR) December 18, 2020 -
ఆశ్రమంలో భారీ అగ్నిప్రమాదం
సాక్షి, హైదరాబాద్: దుండిగల్‌లో గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆశ్రమం పరిసరాల్లో ఏర్పాటు చేసిన భారీ షెడ్డు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యింది. మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపుచేస్తున్నారు. ఆశ్రమంలో ఉన్న రెండు ఆలయాలకు మంటలు వ్యాపించాయి. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగనప్పటికీ.. భారీగా ఆస్తి నష్టం సంభవించింది. -
రిపోర్టర్ కిడ్నాప్ కేసులో ఆసక్తికర విషయాలు
హైదరాబాద్ : యూట్యూబ్ రిపోర్టర్ కిడ్నాప్ కేసులో ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. గతకొంత కాలంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న వ్యక్తులతో రిపోర్టర్లు మిలాఖతైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బియ్యం తరలిస్తున్న వారిని బెదిరించి బంధించడంతోనే అజ్మత్ను కిడ్నాప్ చేసినట్లు సమాచారం. గురువారం మహ్మద్ ఇక్బాల్ దుండిగల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగు చూసింది. సీఐ వెంకటేశం తెలిపిన వివరాల ప్రకారం.. మహ్మద్ ఇక్బాల్, అతని స్నేహితులు అప్ఫర్, నయీమ్, తౌఫిక్, ఆసిఫ్, జబ్బర్, ఫయాజ్‌లు గత కాలంగా హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి కర్నాటకలో అధిక ధరలకు విక్రయిస్తుండేవారు. (తీన్మార్ మల్లన్న హద్దులు దాటాడు..) ఇదే తరహాలో ఈ నెల 5న అఫ్సర్ తన డ్రైవర్ సిరాజ్‌తో కలిసి రోడామేస్ట్రీనగర్, జీడిమెట్లల్లో కొనుగోలు చేసిన బియ్యాన్ని ఆటోలో తరలిస్తుండగా అక్కడికి చేరుకున్న యూట్యూబ్ రిపోర్టర్లు సలీమ్, అజ్మత్, అజర్, పర్వీజ్ అహ్మద్ లతో పాటు మరికొంత మంది ఆటోను అటకాయించారు. తమకు డబ్బులు ఇవ్వకుంటలే పోలీసులకు పట్టిస్తామని బెదిరించి ఇక్బార్ బావ ఇమ్రాన్ నుంచి రూ. 15 వేలు వసూలు చేశారు. అంతే కాక తమకు నెలనెలా రూ. 1 లక్ష ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదేరోజు రాత్రి 10 గంటలకు బియ్యాన్ని తరలిస్తుండగా అక్కడికి చేరుకున్న అజ్మత్, సమీర్, సలీం, అజార్, నవీన్, శ్రీకాంత్‌లు అడ్డుకుని ఆటోలో ఉన్న సిరాజ్, హర్షద్‌లను గదిలో బంధించారు. ఆపై రూ.1 లక్ష ఇస్తేనే ఆటోను వదులుతామని బేరం పెట్టారు. వారిని విడిపించుకునేందుకు సలీం, అజ్మత్‌లు చెప్పిన కైసర్‌నగర్ చౌరస్తాకు ఇన్నోవా లో అక్కడికి చేరుకోగా యూట్యూబ్ రిపోర్టర్లు పారిపోయే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అజ్మత్ దొరకడంతో అతన్ని తాండూరుకు తీసుకెళ్లి మరోసటి రోజు వదిలిపెట్టారు. ఈ మేరకు ఇక్బాల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని కేసులు.. యూట్యూబ్ రిపోర్టర్లు అజ్మత్, సలీం, అజార్, నవీన్, శ్రీకాంత్, సమీర్, ఖయ్యూమ్‌లపై గతంలో కూడా పలువురు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఎక్కడైనా కొత్త నిర్మాణం చేపట్టినా, బోరు వేసినా వెళ్లి బెదిరించడం, అందిన కాడికి దండుకోవడం పనిగా పెట్టుకున్నారు. దీంతో ఆ దిశగా కూడా పోలీసులు వీరి ఆగడాలపై దర్యాప్తు చేపట్టారు. -
ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొంటాం
సాక్షి, హైదరాబాద్: చైనాతో సరిహద్దు వెంబడి ఎదురయ్యే ఎలాంటి భద్రతా సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా, తగిన విధంగా మోహరించి ఉన్నామని ఐఏఎఫ్ చీఫ్, ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ భదౌరియా స్పష్టం చేశారు. చైనా వాయుసేన సామర్థ్యం, దాని వైమానిక కేంద్రాలు, కార్యకలాపాల స్థావరాలు, సరి హద్దులో బలగాల మోహరింపు గురించి తమకు తెలుసని, అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు అవసరమైన చర్యలన్నీ తీసుకున్నామని వెల్లడించారు. శనివారం హైదరాబాద్ శివార్లలోని దుండిగల్‌లో ఉన్న ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో అధికారుల కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్‌ను సమీక్షించిన అనంతరం ఆయన ప్రసంగించారు. ‘వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వద్ద పూర్తి పరిస్థితితో పాటు ఎల్ఏసీ ఆవల మోహరింపుల గురించి కూడా మాకు తెలుసు. లద్దాఖ్‌లోని గల్వాన్ లోయ లో వీర జవాన్లు చేసిన అత్యున్నత త్యాగాన్ని వృథా కానివ్వబోమన్న కృతనిశ్చయం తో ఉన్నాం’అని భదౌరియా తెలిపారు. శనివారం దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో గ్రాడ్యుయేషన్ పరేడ్ అనంతరం యువ అధికారుల సంబరం అయితే అదే సమయంలో తాజా పరిస్థితిని శాంతియుతం గా పరిష్కరించేలా అన్ని చర్యలూ తీసుకుంటున్నట్లు చెప్పారు. సరిహద్దులో చైనా ఏటా బలగాలను మోహరించి వైమానిక విన్యాసాలు చేపడుతున్నప్పటికీ ఈసారి మాత్రం ఆ కార్యకలాపాలు పెరిగాయన్నారు. ‘ఈ ప్రాంతంలో భద్రతా పరిస్థితుల దృష్ట్యా మన సాయుధ దళాలు అన్ని సమయాల్లో సర్వసన్నద్ధంగా, అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. ఎల్ఏసీ వద్ద చోటుచేసుకున్న పరిణామం మేం అతితక్కువ సమయంలో ఏం చేయాల్సిన అవసరం ఉందో చెప్పే చిన్న ఉదాహరణ’అని భదౌరి యా వ్యాఖ్యానించారు. అంతకుముందు జరిగిన పరేడ్‌లో 123 మంది ఫ్లయిట్ కేడెట్లకు ‘ప్రెసిడెం ట్స్ కమిషన్’ను, ఇండియన్ నేవీ, ఇండియన్ కోస్ట్ గార్డ్స్‌కు చెందిన 11 మంది అధికారులకు ‘వింగ్స్’ ను ఎయిర్ చీఫ్ మార్షల్ భదౌరియా అందజేశారు. 123 మంది అధికారుల్లో 61 మంది ఫ్లయింగ్ బ్రాంచీలో, 62 మంది గ్రౌండ్ డ్యూటీ బ్రాంచీలో చేరారు. వారిలో 19 మహిళా అధికారులున్నారు. వియత్నాం ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఇద్దరు ఫ్లయింగ్ కేడెట్లు కూడా శిక్షణను పూర్తిచేసుకున్నారు. ప్రతిభావంతులకు అవార్డులు పైలట్ కోర్సులో అత్యుత్తమ ప్రతి భ కనబరిచి ప్రథమ స్థానంలో నిలిచిన ఫ్లయింగ్ బ్రాంచ్ ఫ్లయింగ్ ఆఫీసర్ అనురాగ్ నయన్‌కు ‘స్వార్డ్ ఆఫ్ హానర్’తోపాటు రాష్ట్రపతి ఫలకాన్ని (ప్రెసిడెంట్స్ ప్లేక్) అందజేశారు. గ్రౌండ్ డ్యూటీ బ్రాంచీలో ప్రథ మ స్థానంలో నిలిచిన ఫ్లయింగ్ ఆఫీసర్ ఆంచల్ గంగ్వాల్‌కు రాష్ట్రపతి ఫలకాన్ని (ప్రెసిడెంట్స్ ప్లేక్) అందించారు. కలలు నెరవేర్చుకోండి.. కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ సందర్భంగా ఎయిర్‌ఛీఫ్ మార్షల్ భదౌరియాకు ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్, ట్రైనింగ్ కమాండ్ ఎయిర్ మార్షల్ ఏఎస్ బుటోలా, ఎయిర్‌ఫోర్స్ అకాడమీ కమాండెంట్ ఎయిర్ మార్షల్ జె. చలపతి సాదర స్వాగతం పలికారు. కోవిడ్ ప్రొటోకాల్‌కు అనుగుణంగా జనరల్ సెల్యూట్ చేశారు. ఈ సందర్భంగా భదౌరియా మాట్లాడుతూ తాము ఎన్నుకున్న రంగంలో మేటిగా నిరూపించుకునేలా కృషి చేయాలని అధికారులకు సూచించారు. వాయుసేన సేవల్లో చేరుతున్న సందర్భంగా చేసిన ప్రతిజ్ఞ మేరకు తమ బాధ్యతలు, విధులను అంకితభావంతో నిర్వహించాలన్నారు. సైనికదళాల్లో చేరాలనే తమ పిల్లల నిర్ణయానికి మద్దతు తెలిపి సహకరించిన తల్లితండ్రులు, వారి బంధువులకు భదౌరియా కృతజ్ఞతలు తెలియజేశారు. భారత వాయుసేనలో చేరడం ద్వారా తమ కలలు, అభిరుచులను సాధించుకోవాలని యువతీ యువకులకు పిలుపునిచ్చారు. -
దారుణం.. కూతుళ్లపై తండ్రి అత్యాచారం
సాక్షి, మేడ్చల్ : జిల్లాలోని దుండిగల్‌లో దారుణమైన ఘటన వెలుగుచూసింది. మైనర్ కూతుళ్లపై కన్న తండ్రే అత్యాచారానికి పాల్పడ్డాడు. కూతుర్లపై అఘాయిత్యం చేస్తున్న భర్తపై భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయంపై భర్తను నిలదీయడంతో తనను హత్యచేసేందుకు ప్రయత్నించాడని భార్య ఫిర్యాదులో పేర్కొంది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. -
అమ్మానాన్నల హల్చల్..
దుండిగల్: ఆట పాటలతో తల్లిదండ్రులు సందడి చేశారు. దుండిగల్‌లోని మర్రి లక్ష్మణ్‌రెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలో శుక్రవారం ‘అమ్మానాన్నల హల్చల్’ పేరుతో రెండవ రాష్ట్ర స్థాయి క్రీడలు, సాంస్కృతిక సమ్మేళనాన్ని నిర్వహించారు. తెలంగాణ సోషల్ వెల్ఫేర్, రెసిడెన్సియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు వేడుకలు జరుగనున్నాయి. ఈ కార్యక్రమాన్ని ఎంఎల్ఆర్ విద్యా సంస్థల చైర్మన్ మర్రి లక్ష్మణ్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్‌రెడ్డి మాట్లాడుతూ... వినూత్న కార్యక్రమాలను ఏర్పాటు చేసిన టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈటీ సొసైటీని ప్రత్యేకంగా అభినందించారు. కళాశాల సెక్రటరీ మర్రి రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ... సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టాలన్న సీఎం కేసీఆర్ పిలుపు మేరకు తమ కళాశాలలో ఇటువంటి వినూత్న కార్యక్రమాలకు వేదికైందిన్నారు. కార్యక్రమంలో సొసైటీ జాయింట్ సెక్రటరీ ప్రవీణ్ మామిడాల, అడిషనల్ సెక్రటరీ ఉమాదేవి, రజనీ, వందలాది మంది తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. వాలీబాల్ ఆడుతున్న తండ్రులు -
సుత్తితో తలపై మోది భార్యను హతమార్చాడు
సాక్షి, దుండిగల్: ఓ వ్యక్తి సుత్తితో తలపై మోది భార్యను దారుణంగా హత్య చేసిన సంఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కరీంనగర్ జిల్లా, మన్నెపల్లి గ్రామానికి చెందిన బస్వరాజు రాజ్‌కుమార్, శిల్ప(38) దంపతులు. 20 ఏళ్ల క్రితం నగరానికి వలస వచ్చి జగద్గిరిగుట్ట శ్రీనివాస్‌నగర్‌లో నివాసముంటున్నారు. రాజ్‌కుమార్ ఆర్ఎంపీ డాక్టర్‌గా పని చేస్తుండగా శిల్ప గృహిణి. వారికి శివానీ, పవన్ సంతానం. శివానీకి డీపోచంపల్లికి చెందిన హరీష్‌తో వివాహం కాగా, పవన్ సూరారంలోని ఓ ప్రైవేట్ పాఠశాలో 10వ తరగతి చదువుతున్నాడు. కుమారుడికి స్కూల్ దూరంగా ఉండడంతో నెల రోజుల క్రితం రాజ్‌కుమార్ భవానీ నగర్‌కు మకాం మార్చాడు. సోమవారం రాత్రి పవన్ రోడా మేస్త్రీనగర్‌లోని తన బావ దుకాణానికి వెళ్లి అక్కడే పడుకున్నాడు. అదే రోజు రాత్రి శిల్ప, రాజ్‌కుమార్ మధ్య గొడవ జరగడంతో ఆగ్రహానికి లోనైన రాజ్‌కుమార్ సుత్తితో శిల్ప తలపై మోదడంతో తీవ్రంగా గాయపడిన ఆమె అపస్మారక స్థితికి చేరుకుంది. దీంతో ఇంటికి తాళం వేసి బయటికి వెళ్లి పోయిన రాజ్‌కుమార్ మంగళవారం ఉదయం హరీష్‌కు ఫోన్ చేసి ‘ మీ అత్తకు నాకు చిన్న గొడవ జరిగింది.. ఆమెను కొట్టాను, బతికి ఉందో.. చనిపోయిందో.. వెళ్లి చూడని’ చెప్పి ఫోన్ కట్ చేశాడు. దీంతో హరీష్ తన భార్య శివానీతో కలిసి అక్కడికి వెళ్లి చూడగా శిల్ప అప్పటికే మృతి చెందింది. హరీష్ ఫిర్యాదు మేరకు దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
పైలెట్ల కార్ఖానా
-
ఎస్ఐ పైకే కారు ఎక్కించబోయారు
కుత్బుల్లాపూర్: ముగ్గురు దొంగలు.. కారు కొట్టే శారు.. నగలషాప్‌లో దొంగతనానికి ప్లాన్ చేశారు.. ఇంతలో ఎస్ఐ అక్కడికి రావడంతో ఆయనపైకే కారు ఎక్కించే ప్రయత్నం చేశారు. తర్వాత కారుతో పరారయ్యారు. ఈ ఘటన ఆదివారం అర్ధరాత్రి దూలపల్లి ప్రాంతంలో చోటుచేసుకుంది. దూలపల్లి నుంచి దుండిగల్ మార్గంలో దుండిగల్ ఎస్ఐ శేఖర్‌రెడ్డి పెట్రోలింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ వాహనం అనుమానాస్పదంగా కనిపించింది. వెంటనే పేట్ బషీరాబాద్ డిటెక్టివ్ ఇన్ స్పెక్టర్ సంతోష్‌కు సమాచారమిచ్చారు. అర్ధరాత్రి 2 గంటలకు అక్కడికి చేరుకున్న డీఐ సంతోష్, ఎస్ఐ శేఖర్‌రెడ్డి కలిసి ఆ కారు (మారుతీ సుజుకీ ఏకో టీఎస్10ఈజీ 7029) దగ్గరకు వెళ్లారు. ఇంతలో అందులోని వ్యక్తులు ఒక్కసారిగా కారు స్టార్ట్ చేసి ఎస్ఐ మీదకు పోనివ్వడంతో అతను కిందపడిపోయారు. పోలీసులు కింద పడిపోయిన ఎస్ఐను లేవదీసి కారును వెంబడించారు. వేగంగా వెళ్లిన కారు అదుపు తప్పి దూలపల్లి ఫారెస్ట్ రోడ్డు సమీపంలో చెట్టును ఢీకొట్టి ఆగిపోయింది. అందులోని ముగ్గురు కారు వదిలేసి ఫారెస్ట్ ప్రాంతంలోకి పరారయ్యారు. దీంతో జీడిమెట్ల, పేట్ బషీరాబాద్, దుండిగల్ పోలీసులను అప్రమత్తం చేశారు.కారులో మారణాయుధాలు.. పోలీసులు కారును స్వాధీనం చేసుకుని పరిశీలించగా గ్యాస్ కట్టర్, గడ్డపార, షటర్లు లేపే సామగ్రితో పాటు మారణాయుధాలు లభించాయి. కారు నిలిపిన ప్రాంతాన్ని పరిశీలిస్తే సమీపంలో ఉన్న ధనేష్ జ్యువెలరీ దుకాణంలో దొంగతానికి వచ్చి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఎస్సై శేఖర్‌రెడ్డి ఫిర్యాదు మేరకు సీఐ మహేశ్ కేసు నమోదు చేశారు. చోరీకి యత్నం.. దొంగలు ఉపయోగించిన వాహనాన్ని అదే రోజు రాత్రి అల్వాల్ పీఎస్ పరిధిలో దొంగలించినట్లు పోలీసులు గుర్తించారు. అదే పోలీస్‌స్టేష¯Œ పరిధిలో ఏటీఎం, జ్యువెలరీ దుకాణాల్లో చోరీ చేసేందుకు విఫలయత్నం చేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. దొంగలించిన వాహనం సికింద్రా బాద్ తిరుమలగిరిలోని సుభాష్‌నగర్‌కు చెందిన పొన్నాల వెంకటేశ్ పేరుపై రిజిస్టర్ అయి ఉంది. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా పోలీసులు దొంగలను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ముఠాను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. -
అడ్డొచ్చిన ఎస్సై మీదకు కారు తోలడంతో..
సాక్షి, హైదరాబాద్ : నగర శివారులోని దుండిగల్‌లో దొంగలు బీభత్సం సృష్టించారు. దోపిడీ యత్నాన్ని అడ్డుకోబోయిన దుండిగల్ ఎస్సై శేఖర్ రెడ్డిపైకి కారు ఎక్కించేందుకు యత్నించారు. దుండిగల్ ప్రాంతంలోని ఓ జ్యుయెలరీ షాప్ వద్ద ఆదివారం రాత్రి ఓ వ్యాన్ నిలిచి ఉంది. సిబ్బందితో కలిసి అటుగా వెళ్తున్న ఎస్సై శేఖర్‌రెడ్డి ఆ వాహనాన్ని చూసి వెంటనే అప్రమత్తమయ్యారు. వారిని పట్టుకునేందుకు యత్నించారు. అయితే, పోలీసుల రాకను గమనించిన దొంగలు.. వ్యాన్‌లో వేగంగా ముందుకు దూసుకెళ్లారు. అడ్డుకోబోయిన ఎస్సై శేఖర్‌రెడ్డిని ఢీకొట్టాలని చూశారు. ప్రమాదాన్ని గ్రహించిన ఎస్సై వెంటనే పక్కకు తప్పుకుని తమ వాహనంలో వారిని వెంబడించారు. కారును దూలపల్లి అడవుల్లోకి మళ్లించిన దొంగలు వాహనాన్ని అక్కడే వదిలేసి పరారయ్యారు. కారు, కట్టర్, షెటర్ తెరిచేందుకు ఉపయోగించే సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన కారు కొద్ది రోజుల క్రితం అల్వాల్‌లో చోరీకి గురైందని పోలీసులు తెలిపారు. దొంగల కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
ఏసీబీకి చిక్కిన ముగ్గురు అవినీతి ఉద్యోగులు
సాక్షి, హైదరాబాద్ : దుండిగల్ పంచాయతీ కార్యలయంలో ముగ్గురు ఉద్యోగులు ఏసీబీకి అడ్డంగా దొరికిపోయారు. పంచాయతీ కార్యలయంలో 31 వేలు లంచం తీసుకుంటూ మేనేజర్ గోవింద్ రావు, జూనియర్ అసిస్టెంట్ కృష్ణా రెడ్డి , ఔట్ సోర్సింగ్ ఉద్యోగి మహేందర్ రెడ్డి పట్టుబడ్డారు. ఒక కేసుకు సంబంధించి బాధితుల నుంచి 2 లక్షల 50 వేలు డిమాండ్ చేసినట్లు సమాచారం. -
దుండిగల్ ఎయిర్‌ఫోర్స్‌లో ఆకాడమీలో విన్యాసాలు
-
దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అక్కాడమీలో ప్రత్యేకంగా ఎయిర్ఎక్స్ పో
-
ఫ్లయింగ్ పరేడ్
-
కాలేజీ బస్సును ఢీకొట్టిన లారీ
-
దుండిగల్‌లో కాలేజీ బస్సును ఢీకొట్టిన లారీ..
సాక్షి, హైదరాబాద్: దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుంది. హితం కాలేజీకి చెందిన బస్సును ఓ లారీ వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటన బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు, బస్సు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. బస్సును లారీ వెనక నుంచి ఢీకొట్టడంతో వెనుక సీట్లలో కూర్చున్న ఇద్దరు విద్యార్థులు ఇరుక్కుపోయారు. వారిని బయటకు తీసేందుకు సహాయక చర్యలు చేపట్టామని పోలీసులు తెలిపారు. వర్షం కారణంగా సహాయక చర్యలు ఆలస్యమవుతున్నాయని వెల్లడించారు. తలకు తీవ్ర గాయంకావడంతో బస్సు డ్రైవర్ అపస్మారక స్థితిలోకి జారుకున్నాడని వైద్య సిబ్బంది తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో భర్త మృతి...భార్య పరిస్థితి విషమం
మేడ్చెల్: దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో భర్త మృతిచెందగా, భార్య తీవ్రంగా గాయపడింది. దుండిగల్ తండా-1కు చెందిన బాల్సింగ్, దీప దంపతులు ద్విచక్రవాహనంపై వెళుతుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన ఇన్నోవా వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో బాల్సింగ్ అక్కడికక్కడే మృతిచెందాడు. తీవ్రంగా గాయపడిన దీపను స్థానికులు 108లో ఆస్పత్రికి తరలించారు. -
దుండిగల్‌లో చైన్‌స్నాచింగ్
హైదరాబాద్: రోడ్డు పై నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలో నుంచి గుర్తుతెలియని దుండగులు బంగారు గొలుసును లాక్కెళ్లారు. ఈ సంఘటన నగరంలోని దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సూరారం కాలనీలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. బైక్ పై వచ్చిన దుండగులు రోడ్డు పై నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలో నుంచి 3 తులాల బంగారు గొలుసును లాక్కెళ్లారు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. -
సంప్రదాయ సరిగమలు
కుత్బుల్లాపూర్: దుండిగల్‌లోని ఎంఎల్ఆర్ఐటీఎం ఇంజినీరింగ్ కళాశాలలో శనివారం ట్రెడిషనల్ డే ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సాంప్రదాయ వస్త్రధారణలో ర్యాంప్ వాక్ చేసి అదరహో అనిపించారు. బతుకమ్మ ఆడి సందడి చేశారు. కార్యక్రమంలో కళాశాల చైర్మన్ మర్రి లక్ష్మణ్‌రెడ్డి, కార్యదర్శి మర్రి రాజశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సంప్రదాయాల సందడి
దుండిగల్: విద్యార్థులు సాంప్రదాయ దుస్తులతో సందడి చేశారు.. ర్యాంప్ వాక్‌తో ఆహుతులను ఉర్రూతలూగించారు..కుత్బుల్లాపూర్ మండలం దుండిగల్‌లోని మర్రి లక్ష్మణ్‌రెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ( ఎంఎల్ఆర్ఐటి) కళాశాలలో గురువారం ట్రెడిషనల్ డే ఘనంగా జరిగింది. కార్యక్రమంలో కళాశాల చైర్మన్ మర్రి లక్ష్మణ్‌రెడ్డి, సెక్రటరీ మర్రి రాజశేఖర్‌రెడ్డి, కోశాధికారి మమతరెడ్డి, ప్రిన్సిపాల్ కె.భాస్కరారెడ్డి, రాధికదేవి, పరంకుశం, ఫ్యాకల్టీ, విద్యార్థులు పాల్గొన్నారు. -
మహిళపై వడ్డీవ్యాపారి లైంగిక దాడి
దుండిగల్: మహిళను మభ్యపెట్టి యువకుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన దుండిగల్ ఠాణా పరిధిలో జరిగింది. సీఐ శంకర్‌రెడ్డి, బాధితురాలి కథనం ప్రకారం.. గుంటూరు జిల్లా తెనాలి మండలం సుండూరు గ్రామానికి చెందిన భార్యాభర్తలు రెండేళ్ల క్రితం నగరానికి వలస వచ్చి కుత్బుల్లాపూర్ మండలం గండిమైసమ్మ సమీపంలోని శ్రీరామ్‌నగర్‌లో నివాసముంటున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు. భర్త మేస్త్రీ కాగా.. భార్య కూలీ పని చేస్తోంది. ఇదిలా ఉండగా తమిళనాడుకు చెందిన కత్రివేల్ అనే యువకుడు చింతల్లో స్థిరపడి శ్రీరామ్‌నగర్ కాలనీలో వడ్డీ వ్యాపారం చేస్తున్నాడు. ఈ క్రమంలో బాధితురాలి కుటుంబం కత్రీవేల్ వద్ద రూ.9 వేలు అప్పుగా తీసుకున్నారు. ఇప్పటికే రూ.4,500 తిరిగి చెల్లిం చారు. అయితే ఈ నెల 27న భర్త సొంత గ్రామానికి వెళ్లగా ఇంటికి వచ్చిన కత్రివేల్ బాకీ సొమ్ము చెల్లించాలని ఒత్తిడి తెచ్చాడు. తన వద్ద డబ్బులు లేవని, తన భర్త వచ్చాకా ఇస్తాడని ఆమె చెప్పింది. అయినా వినకుండా డీపోచంపల్లి సర్వే నెంబర్ 120లో ఉండే ఓ మహిళ అప్పు చెల్లింపునకు మధ్యవర్తిగా ఉంటానని చెప్తే తాను వెళ్లిపోతానని చెప్పి అదే రోజు రాత్రి 10 గంటలకు ఆమెను తనబైక్ పై ఎక్కించుకెళ్లాడు. 120 ప్రాంతానికి కాకుండా మండల కార్యాలయం సమీపంలో ఉండే స్టేడియం వద్ద నిర్జన ప్రదేశానికి తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడి వెళ్లిపోయాడు. ఎలాగోలా ఇంటికి చేరిన బాధితురాలు అప్పుడే వచ్చిన తన భర్తకు జరిగిన విషయా న్ని చెప్పింది. బాధితురాలు బుధవారం భర్తతో కలిసి వచ్చి దుండిగల్ పోలీసులకు ఫిర్యాదు చేయ గా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
సిగరెట్‌కు వచ్చి.. గొలుసు స్నాచింగ్
దుండిగల్: సిగరెట్ కావాలని వచ్చి పుస్తెలతాడు తెంచుకెళ్లిన ఘటన దుండిగల్ ఠాణా పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... సూరారం కాలనీ 60 గజాలకు చెందిన పట్టిపతి మణి (34) డీపోచంపల్లి సర్వే నెంబర్ 120 ప్రధాన రోడ్డులో టీకొట్టు నిర్వహిస్తోంది. శనివారం మధ్యాహ్నం బైక్‌పై ఇద్దరు యువకులు టీకొట్టు వద్దకు వచ్చారు. వారిలో ఒకడు సిగరెట్ కావాలని అడిగి అమాంతం మణి మెడలో ఉన్న రెండు తులాల బంగారు పుస్తెల తాడు తెంచుకొని.. మరో యువకుడితో కలిసి బైక్‌పై మేడ్చల్ వైపు పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల వయసు 20 నుంచి 25 మధ్య ఉంటుందని, ఇద్దరూ హెల్మెట్లు, రెయిన్ కోట్ ధరించారని మణి పోలీసులకు తెలిపింది. -
టికెట్ బుకింగ్ అని వచ్చి కేటుగాళ్ల మాయ
దుండిగల్: ఆన్ లైన్ లో రైలు టికెట్లు బుక్ చేయాలని వచ్చిన ఇద్దరు దుండగులు యువతి దృష్టి మళ్లించి రూ. 50 వేలు ఎత్తుకెళ్లారు. దుండిగల్ పోలీసుల కథనం ప్రకారం... గండిమైసమ్మ చౌరస్తాలో పుష్ఫక్ కమ్యూనికేషన్స్ పేరుతో ఆన్ లైన్ సర్వీస్ సెంటర్ ఉంది. శుక్రవారం సాయంత్రం 4.30కి ఇక్కడికి ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చారు. ఆన్లైన్లో రైలు టికెట్లు బుక్ చేసుకొనేందుకు వచ్చామని కంప్యూటర్ ఆపరేటర్ విజయలక్షి్మకి చెప్పారు. అనంతరం తమ వద్ద వంద నోట్లు ఉన్నాయని, వాటికి బదులు 500 నోట్లు కావాలని కోరారు. వారు 10 వంద రూపాయల నోట్లు ఇవ్వగా, విజయలక్ష్మి వారికి రెండు 500 నోట్లు ఇచ్చింది. అయితే, ఆ రెండు నోట్లు బాగాలేవని, వేరేవి ఇవ్వమని వారు పట్టబట్టారు. దీంతో తన వద్ద ఉన్న నోట్లన్నీ ఇలాగే ఉన్నాయని చెప్పి విజయలక్ష్మి క్యాష్ పెట్టెలో ఉన్న నోట్లను చూపించింది. అదే సమయంలో మరొకడు తమకు త్వరగా టికెట్లు బుక్ చేయాలని హడావుడి చేశాడు. చివరకు రైలు టికెట్లు బుక్ చేయకుండానే వెళ్లిపోయారు. దీంతో విజయలక్ష్మి అనుమానం వచ్చి క్యాష్ పెట్టెలో ఉన్న నగదును చూసుకోగా...రూ.50 వేల బండిల్ కనిపించలేదు. వెంటనే బాధితురాలు పోలీసులకు సమాచారం ఇవ్వగా, ఎస్ఐ రమేష్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. విజయలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలంలోని సీసీ కెమెరాల ఫుటేజీలను సేకరించారు. అందులో నమోదైన అనుమానితుల ఫొటోలను మీడియాకు విడుదల చేశారు. -
నగరం నుంచి 400 కిమీల సైకిల్ రైడ్
దుండిగల్: కుత్బుల్లాపూర్ మండలం దూలపల్లి సెయింట్ మార్టిన్స్ ఇంజనీరింగ్ కళాశాలలో శనివారం హైదరాబాద్–400 ద గ్లోరీ 400 బ్రెవట్ సైకిల్‌రైడ్ కార్యక్రమం నిర్వహించారు. హైదరాబాద్ రౌండోనర్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి ఎంపీ మల్లారెడ్డి, ఇంటర్నేషనల్ వెటరన్ అథ్లెటిక్, కళాశాల చైర్మన్ మర్రి లక్ష్మణ్‌రెడ్డి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. 27 గంటల్లో 400 కిలోమీటర్ల లక్ష్యాన్ని 42 మంది రైడర్లు ఛేదించనున్నారు. సెయింట్ మార్టిన్స్ ఇంజనీరింగ్ కళాశాల నుంచి ప్రారంభమయ్యే ఈ రైడ్ ఆర్మూర్, నిజామాబాద్, బోధన్, ఎల్లారెడ్డి, మెదక్, నర్సాపూర్, గండిమైసమ్మ చౌరస్తా, బహదూర్‌పల్లి మీదుగా దూలపల్లిలోని కళాశాల ఆవరణలో ముగియనుంది. కళాశాల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చంద్రశేఖర్ యాదవ్, డైరెక్టర్ ఆఫ్ అకడమిక్స్ ప్రొఫెసర్ డి.శోభారాణి, ప్రిన్సిపాల్ కె.సమ్మయ్య, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
సాగర్‌లో ఫ్లోటింగ్ గార్డెన్
దుండిగల్: కుత్బుల్లాపూర్ మండలం దుండిగల్‌లోని మర్రి లక్ష్మణ్‌రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాల విద్యార్థులు హుస్సేన్ సాగర్‌లో ఫ్లోటింగ్ గార్డెన్‌ను ఏర్పాటు చేశారు. కళాశాల చైర్మన్ లక్ష్మణ్‌రెడ్డి దీన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్ఆర్ఐటీఎం ప్రిన్సిపాల్ కె.భాస్కరరెడ్డి, మర్రి మల్లికSరెడ్డి, డాక్టర్ కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు పక్కన మహిళ మృతదేహం
దుండిగల్ (హైదరాబాద్) : గుర్తుతెలియని మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.ఈ ఘటన నగరంలోని దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం వెలుగు చూసింది.రోడ్డు పక్కన మహిళ మృతదేహం పడి ఉండటాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలాన్ని చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతికి గల కారణాలు తెలియరాలేదు. అత్యాచారం చేసి అంతమొందించారేమోననే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రేమ ముసుగులో అత్యాచారం
దుండిగల్ (రంగారెడ్డి) : ప్రేమ పేరుతో ఓ యువతిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన యువకుడిని దుండిగల్ పోలీసులు అరెస్టు చేశారు. సీఐ వెంకటేశ్వర్లు కథనం ప్రకారం.. సూరారం కాలనీ డివిజన్ పాండు బస్తీకి చెందిన నాగరాజు (26) అలియాస్ దొమ్మర రాజు కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. రాజీవ్ గృహకల్పకు చెందిన ఓ యువతి (23), నాగరాజు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటానని యువతిని నమ్మించిన నాగరాజు ఆమెపై అత్యాచారం చేశాడు. కారు కొనుగోలు చేసి ట్రావెల్స్ తరఫున తిప్పుతానని యువతి నుంచి రూ. 50 వేలు సైతం తీసుకున్నాడు. గత నెల 27 వ తేదీ రాత్రి సాయిబాబానగర్‌లోని తన స్నేహితుడి ఇంటికి ఆమెను తీసుకువెళ్లిన నాగరాజు మరోసారి అత్యాచారానికి పాల్పడ్డాడు. కాగా సోమవారం సాయంత్రం 4 గంటలకు మరోసారి ఆమె ఇంటికి వచ్చిన నాగరాజు తనతోపాటు లాడ్జికి రావాలని లేకపోతే మనం కలిసి ఉన్న వీడియోలను అందరికీ చూపిస్తానని బెదిరించాడు. దీంతో బాధితురాలు మంగళవారం దుండిగల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు అదే రోజు నాగరాజును అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. -
పిల్లలకు విషమిచ్చి... తండ్రి ఆత్మహత్య
రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం సూరారం కాలనీ సాయిబాబానగర్‌లో ఆర్థిక ఇబ్బందులతో ఒక కుటుంబం గురువారం ఉదయం విషం తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటనలో తండ్రి అక్కడికక్కడే మృతిచెందగా, ఇద్దరు పిల్లలు మృత్యువుతో పోరాడుతున్నారు. వివరాల్లోకి వెళితే.. మెదక్‌జిల్లా గజ్వేల్‌కు చెందిన రవీంద్రాచారికి రంగారెడ్డి జిల్లా మేడ్చెల్‌కు చెందిన రాధికతో వివాహమైంది. రవీంద్రాచారి హైదరాబాద్ వచ్చి సాయిబాబా కాలనీలో అద్దెఇంట్లో ఉంటూ బంగారు నగల తయారీ దుకాణంలో పనిచేస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ కావడం, అప్పులు ఇచ్చినవారి ఒత్తిడి పెరిగింది. దీంతో గురువారం ఉదయం ఇద్దరు ఆడపిల్లలకు విషయం ఇచ్చి తనూ విషం తాగాడు. రవీంద్రాచారి విషం తాగిన కాసేపటికే మృతిచెందగా కుమార్తెలు జయశ్రీ(10), అపర్ణ(9) కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. ఉదయం రవీంద్రాచారి భార్య రాధిక చిన్నకొడుకు సూర్యప్రసాద్‌ను తీసుకుని పాలు తెచ్చేందుకు బయటికి వెళ్లి సమయంలో ఇంట్లో వంటరిగా ఉన్న రవీంద్రాచారి విషంతాగి పిల్లలకూ విషం తాగించాడు. ఇంటికి వచ్చిన రాధిక భర్త, పిల్లలు పడి ఉండడం చూసి కేకలు పెట్టింది. ఇరుగు పొరుగువారు వచ్చి ప్రాణంతో ఉన్న పిల్లలను సమీపంలోని మల్లారెడ్డి ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో జయశ్రీని గాంధీ ఆస్పత్రికి రెఫర్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘఠనా స్థలాన్ని పరిశీలించి రవీంద్రాచారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు
వేగంగా దూసుకువచ్చిన కారు ఎదురుగా వచ్చిన బైక్‌ను ఢీ కొట్టడంతో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన దుండిగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుత్బుల్లాపూర్ మండలం డీ పోచంపల్లి సాయిపూజ కాలనీకి బానోతు తుల్జా, సికిందర్‌లు కూలి పనులు చేస్తు జీవనం సాగిస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం వీరు బైక్‌పై సాయి పూజ కాలనీకి వెళ్తుండగా దుండిగల్ పోలీస్‌స్టేషన్ ఎదురుగా మేడ్చల్ నుంచి వస్తున్న ఇన్నోవా కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో తుల్జా, సికిందర్లకు తీవ్ర గాయాలు కాగా వారిని వెంటనే ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఇన్నోవా కారు నడుపుతున్న వ్యక్తి పరారు కాగా... కారులో బీరు సీసాలు లభ్యమయ్యాయి. ఈ మేరకు దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
నవదంపతుల ఆత్మహత్య!
-
ప్రేమపెళ్లి చేసుకున్న నవదంపతుల ఆత్మహత్య!
హైదరాబాద్: ఆ ప్రేమ జంటకు పెళ్లైన నాలుగు నెలలకే నూరేళ్లు నిండాయి. వారికి ఏం కష్టమొచ్చిందో ఏమో ఇద్దరూ కలసి ఆత్మహత్య చేసుకున్నారు. దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బహదూర్‌పురాలో ఈ విషాద సంఘటన జరిగింది. బహదూర్‌పల్లికి చెందిన వెంకటేష్, ప్రీతి ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. అయితే వారి పెళ్లిని ఇరువైపుల పెద్దలు అంగీకరించలేదు. అయినా వారు ఇద్దరూ నాలుగు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ తరువాత బహదూర్‌పురాలో నివాసం ఉంటున్నారు. అయితే వారిని పట్టించుకునేవారు లేరు. దాంతో వారికి ఆర్థిక ఇబ్బందు ఎదురయ్యాయి. దాంతోనే వారు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇద్దరూ వారు ఉంటున్న ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయం తెలిసి ఇరువైపుల పెద్దలు వచ్చి వారి మృతదేహాలను చూసి విలపిస్తున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. -
ఈతకెళ్లి ఇద్దరి గల్లంతు
హైదరాబాద్: ఈతకెళ్లి ఇద్దరు గల్లంతైన సంఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోబుధవారం ఉదయం జరిగింది. శివాలయ నగర్ చెరువులో ఈతకు వెళ్లిన న్యూశివాలయ నగర్‌కు చెందిన శ్రీనివాస్ (35), అరవింద్ (10) అనే ఇద్దరు గల్లంతయ్యారు. చెరువులో ఈత కొడుతున్న వారు ఎంతకూ బయటకు రాలేదు. కుటుంబసభ్యులు, స్థానికులు చెరువులో గాలించినా వారి జాడ కనిపించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు గల్లంతైన వారి ఆచూకీ కోసం గజ ఈతగాళ్లను పిలిపించనున్నారు. -
ఆర్టీసీ - డీసీఎం వ్యాన్ ఢీ: 25 మందికి గాయాలు
హైదరాబాద్ నగర శివారులోని దిండిగల్ పోలీసు స్టేషన్ పరిధిలో మంగళవారం ఉదయం ఆర్టీసీ బస్సు, డీసీఎం వ్యాన్‌ను కొట్టింది. ఆ ఘటనలో 25 మంది గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే వారిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉందని, దాంతో వారిని మెరుగైన వైద్య చికిత్స కోసం మరో ఆసుపత్రికి తరలించాలని వైద్యులు సూచించారు. దాంతో పోలీసులు వారిని హైదరాబాద్ తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ర్యాగింగ్ కేసులో ముగ్గురు విద్యార్థులు అరెస్ట్
పార్మసీ విద్యార్థి శ్రావణ్ కుమార్‌పై ర్యాగింగ్ చేసిన కేసులో ముగ్గురు సీనియర్ విద్యార్థులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అరెస్ట్ చేసిన విద్యార్థులపై ఆంధ్రప్రదేశ్ ప్రొబిహెషన్ ఆఫ్ ర్యాగింగ్ యాక్ట్ అండ్ ఐపీసీ కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పోలీసులు కథనం ప్రకారం... నగర శివారులోని దిండిగల్‌లోని ఓ ప్రైవేట్ ఇనిస్టిట్యూట్‌లో కొత్తగా శ్రావణ్ కుమార్ పార్మసీ కోర్సులో చేరాడు. అయితే అదే కాళాశాలలో ఇంజనీరింగ్ విభాగానికి చెందిన సీనియర్ విద్యార్థులు సురేష్ బాబు, ఎం బాను ప్రకాశ్, ఎం హేమంత్లు ర్యాగింగ్ చేశారు. అ క్రమంలో శ్రావణ్ వారికి ఎదురు తిరిగాడు. దాంతో సీనియర్ విద్యార్థులు శ్రావణ్‌పై దాడి చేశారు. దాంతో శ్రావణ్ తీవ్ర మనస్థాపం చెంది ఆత్మహత్యకు యత్నించాడు. ఆ విషయాన్ని గమనించిన తోటి విద్యార్థులు శ్రావణ్‌ను ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే శ్రావణ్ ఆత్మహత్యకు యత్నించాడన్న విషయం తెలుసుకున్న సీనియర్ విద్యార్థులు పరారయ్యారు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. -
ఆత్మహత్యగా నమ్మించబోయి..
దుండిగల్, న్యూస్‌లైన్ : భార్యను హతమార్చి ఆత్మహత్యగా చిత్రీకరించి పోలీసులను తప్పుదోవ పట్టించిన భర్త నిజాలు వెలుగులోకి రావడంతో కటకటాలపాలయ్యా డు. సోమవారం దుండిగల్ సీఐ బాల కృష్ణ కేసు వివరాలు వెల్లడించారు. పశ్చి మ గోదావరి జిల్లా పాలకోడేరు మం డలం మోగల్లు గ్రామానికి చెందిన పెనుమత్స సుబ్రహ్మణ్య కుమార్రాజు(28)కు అత్తిలి మండలం ఈడూరుకు చెందిన పావని(22)తో 2013 ఫిబ్రవరి 13న వివాహమైంది. నాలుగు నెలల క్రితం సుబ్రహ్మణ్య రాజు భార్య పావని, తన తల్లిదండ్రులతో కలిసి నగరానికి వచ్చి బాచుపల్లి రామచంద్రారెడ్డినగర్లోని వైష్ణవి సాయి రెసిడెన్సీ అపార్ట్మెంట్ పెంట్‌హౌస్‌లో అద్దెకుంటున్నాడు. ఖాజీ పల్లిలోని ప్రసాద్ స్టోన్ క్రషర్లో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. అతని తండ్రి సూర్యనారాయణరాజు అక్కడే మెస్‌లో పనిచేస్తున్నాడు. కాగా పెళ్లైనప్పటి నుంచి పావని భర్తతో దాంపత్య జీవితానికి దూరంగా ఉంటోంది. గతేడాది డిసె ంబర్ 24న మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చిన సుబ్రహ్మణ్య రాజు భార్య ను బలవంతం చేయగా ఆమె ఒప్పుకోకపోవడంతో ఆగ్రహానికి గురై కొట్టాడు. పావని తలకు బలమైన గాయమై స్పృహ కోల్పోయింది. చనిపోయిందని భావించిన అతను చీరతో ఫ్యాన్‌కు ఉరేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడు. అనంతరం దోపిడీ దొంగల పనిగా ఇంట్లోని వస్తువులను చిందరవందరగా పడేసి బయట నుంచి తలుపు గడియపెట్టి వెళ్లిపోయాడు. తిరిగి ఇంటికి వచ్చి ఏమీ తెలియనట్టుగా భార్య మృతదేహం వద్ద విలపించాడు. అనంతరం మృతదేహాన్ని ఈడూరుకు తరలించగా అక్కడికి వెళ్లిన సుబ్రహ్మణ్య రాజుపై మృతురాలి బంధువులు దాడిచేసి నిలదీయడంతో తానే చంపినట్టు ఒప్పుకున్నాడు. అత్తిలి పోలీసులు దుండిగల్ పోలీసులకు సమాచారం అందించగా వారు పోస్టుమార్టం నివేదిక ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు.