సాక్షి, హైదరాబాద్: ఒంటరిగా ఉన్న ఓ మహిళపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపింది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని షోలాపూర్‌కు చెందిన మానసిక స్థితి సరిగా లేని 30 ఏళ్ల రెండ్రోజుల క్రితం నగరానికి వచ్చింది. శక్రవారం రాత్రి గండిమైసమ్మ నుంచి దుండిగల్‌కు వెళ్లే రోడ్డులోని ఉజ్వల బార్ అండ్ రెస్టారెంట్ పక్కన సదరు మహిళ ఒంటరిగా నిలుచుని ఉంది. ఈ క్రమంలో ఐదుగురు యువకులు ఆమెను ఉజ్వల బార్ వెనుక ఉన్న నిర్జన ప్రదేశానికి తీసుకువెళ్లి సామూహిక ఆత్యాచారానికి పాల్పడ్డారు.
బాధితురాలు వారి నుంచి తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుల్లో ఇమ్రాన్(20)ను పోలీసులు అదుపులోకి తీసుకోగా ఆత్యాచారానికి పాల్పడినట్లు అంగీకరించాడు. మరికొందరు నిందితులు నర్సింహ, ఖుద్దూస్, ఉమిద్దీన్, ఇమామ్‌లు పరారీలో ఉన్నారు. కాగా నిందితులంతా డి.పోచంపల్లి ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్లుగా తేలింది. వారిపై 377డీ సెక్షన్ కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: మిసిసిపీ ఫెస్టివల్‌లో అపశ్రుతి
Comments
Please login to add a commentAdd a comment