హైదరాబాద్: ఈతకెళ్లి ఇద్దరు గల్లంతైన సంఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోబుధవారం ఉదయం జరిగింది. శివాలయ నగర్ చెరువులో ఈతకు వెళ్లిన న్యూశివాలయ నగర్‌కు చెందిన శ్రీనివాస్ (35), అరవింద్ (10) అనే ఇద్దరు గల్లంతయ్యారు. చెరువులో ఈత కొడుతున్న వారు ఎంతకూ బయటకు రాలేదు. కుటుంబసభ్యులు, స్థానికులు చెరువులో గాలించినా వారి జాడ కనిపించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు గల్లంతైన వారి ఆచూకీ కోసం గజ ఈతగాళ్లను పిలిపించనున్నారు.