సాక్షి, దుండిగల్: మంత్రి కేటీఆర్ మేడ్చల్ జిల్లా పర్యటనలో ఉన్నారు. ఈ సందర్బంగా దుండిగల్‌లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అర్హులకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను పంపిణీ చేశారు. ఈ క్రమంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. పేదల గురించి ఆలోచించే సీఎం కేసీఆర్ మాత్రమే. అన్ని సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు పూర్తి చేస్తాం. బీఆర్‌ఎస్ పార్టీ ఎప్పుడూ ప్రజలపక్షమే. పనిచేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదింమని కోరుతున్నాను. పేదలను ప్రేమించే నాయకుడు కేసీఆర్. కొత్త లింక్ రోడ్డు, బ్రహ్మండమైన నాలాలు నిర్మిస్తున్నాం. గతంలో మంచినీటి కోసం ఎంత ఇబ్బందులు పడ్డారో అందరికీ తెలుసు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చాక మంచినీటి కష్టాలు లేవు.
కేసీఆర్ ప్రజల మనిషి..
ఇల్లు కట్టిసూడు-పెళ్లి చేసిచుడు అంటారు పెద్దలు. కానీ కేసీఆర్ మాత్రం ఇళ్ళు నేనే కట్టిస్తా..పెళ్లి నేనే చేయిస్తా అంటున్నారు. ఒక్కో డబుల్ బెడ్ రూమ్ ఇల్లుకు 10లక్షలు ప్రభుత్వానికి ఖర్చు అయితే.. దాని విలువ 30లక్షలు ఉంది. గ్రేటర్ పరిధిలో 50వేల కోట్లు ఖరీదు చేసే ఆస్తులను ప్రభుత్వం పేదలకు ఇస్తోంది. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ ఎంతో పారదర్శకంగా జరుగుతోంది. జగద్గిరి గుట్టలో డివిజన్ కాంగ్రెస్ పార్టీ మహిళ అధ్యక్షురాలికి ఇల్లు వచ్చింది. ఇప్పటి వరకు 30వేల ఇండ్లను పంపిణీ చేశాం. వికలాంగులు, దళితులు, పేదలకు ఇండ్లు పంపిణీ చేస్తున్నాం. గ్రేటర్ పరిధిలో 1లక్ష ఇండ్లను ఎన్నికల లోపు చేస్తాం. దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా ఇలాంటి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు ఇచ్చారా?. దుండిగల్‌కి త్వరలోనే కొత్త పరిశ్రమ రాబోతోంది
అభివృద్ధి చెప్పుకోలేక కొత్త మార్గాల్లో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఢిల్లీ నుంచి హామీలు ఇస్తే తొందర పడొద్దు. వాళ్ళు ఇచ్చే హామీలకంటే మంచి హామీలు కేసీఆర్ ఇవ్వబోతున్నారు. ఇళ్ల పంపిణీలో ఎవరి జోక్యం లేదు కాబట్టే కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలకు ఇల్లులు వచ్చాయి’ అని కామెంట్స్ చేశారు.
ఇది కూడా చదవండి: సెల్‌ఫోన్ యూజర్లకు వార్నింగ్ మెసేజ్.. స్పందించిన కేంద్రం
Comments
Please login to add a commentAdd a comment