దుండిగల్‌లో ఐదేళ్ల క్రితం ఆగిపోయిన ప్లాటినం ప్రాజెక్టు
రూ. వందల కోట్లు కాజేసి బోర్డు తిప్పేసిన జయత్రీ ఇన్‌ఫ్రా
‘రెరా’ను ఆశ్రయించిన కొనుగోలుదారులు.. పనులు మరో బిల్డర్‌కు అప్పగింత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రీలాంచ్, బై బ్యాక్ స్కీమ్‌ల పేరిట కొందరు బిల్డర్లు చేస్తున్న మోసా లకు అటు రూ. కోట్లలో డబ్బు పోగొట్టుకోవడంతోపాటు ఇటు సొంతింటి కలకు దూరమవుతున్న బాధితులకు న్యాయం చేసేందుకు తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (టీజీ–రెరా), రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించాయి. రాష్ట్రంలోనే తొలిసారిగా దుండిగల్‌లో ఇలా బోర్డు తిప్పేసిన జయత్రీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనే సంస్థకు చెందిన ‘ప్లాటినం’ప్రాజెక్టు పనులను థర్డ్ పార్టీ (మరో బిల్డర్)కు అప్పగించాయి. ఈ మేరకు టీజీ–రెరా చేసిన ప్రతి పాదనకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచి్చంది.
దీంతో రెరా–2016 చట్టంలోని సెక్షన్ 8 కింద ఉన్న అధికారాలను ఉపయోగించి ఆ ప్రాజెక్టును థర్డ్ పార్టీకి బదిలీ చేస్తూ టీజీ–రెరా మధ్యంతర ఉత్తర్వు లు జారీ చేసింది. త్వరలోనే ఇలా ఆగిపోయిన మరికొన్ని ప్రాజెక్టులను కూడా థర్డ్ పారీ్టలకు ఇచ్చేందుకు టీజీ రెరా కసరత్తు చేస్తోంది. దీంతో ఆగిపో యిన నిర్మాణాలు మళ్లీ జీవం పోసుకోనున్నాయి.
ఇదీ ‘ప్లాటినం’కథ..: ఐదేళ్ల క్రితం జయత్రీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ యజమాని కాకర్ల శ్రీనివాస్ దుండిగల్‌లో ప్లాటినం పేరుతో అపార్ట్‌మెంట్ ప్రాజెక్టును ప్రకటించాడు. 3,267 గజాల స్థలంలో స్టిల్ట్+5 అంతస్తులకు హెచ్‌ఎండీఏ నుంచి అను మతి తీసుకొని 5,865 చ.అ. బిల్టప్ ఏరియాలో 60 అపార్ట్‌మెంట్లను నిర్మిస్తున్నామని ప్రచారం చేశాడు. రెరాలో రిజిస్ట్రేషన్ చేయకుండానే ప్రీలాంచ్ ఆఫర్ కింద కస్టమర్ల నుంచి రూ. కోట్లు వసూలు చేశాడు. కొనుగోలుదారులను నమ్మించేందుకు శ్లాబ్ లెవల్స్ వరకు నిర్మాణ పనులను శరవేగంగా చేపట్టాడు. హెచ్‌ఎండీఏకు తనఖా పెట్టిన 9 ఫ్లాట్లు మినహా మిగిలిన 51 ఫ్లాట్లను విక్రయించేశాడు. అయితే నిధుల దురి్వనియోగం కారణంగా ప్రాజెక్టు మధ్యలోనే ఆగిపోయింది. దీంతో గతేడాది సెపె్టంబర్‌లో కస్టమర్లు ‘రెరా’కు ఫిర్యాదు చేశారు.
త్వరలోనే సాహితీ, మంత్రి ప్రాజెక్ట్‌లు కూడా..: జయత్రీ కేసులాగే సాహితీ ఇన్‌ఫ్రాటెక్ వెంచర్స్, మంత్రి డెవలపర్స్ మధ్యలోనే వదిలేసిన పలు అపార్ట్‌మెంట్ ప్రాజెక్టులను కూడా సెక్షన్–8 కింద ఉత్తర్వులు ఇచ్చేందుకు రెరా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. గచి్చ»ౌలి, గుండ్లపోచంపల్లి, అమీన్‌పూర్ ప్రాంతాల్లో అపార్ట్‌మెంట్లను నిర్మిస్తున్నామని కస్టమర్ల నుంచి సొమ్ము వసూలు చేసి సాహితీ సంస్థ చేతులెత్తేసింది. మరోవైపు జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వద్ద లగ్జరీ ప్రాజెక్టు నిర్మిస్తున్నామని వినియోగదారుల నుంచి మంత్రి డెవలపర్స్ రూ. కోట్లు వసూలు చేసింది. నిధుల దురి్వనియోగం కారణంగా ఆయా ప్రాజెక్టులు మధ్యలోనే ఆగిపోయాయి. బాధితుల ఫిర్యాదుతో సెక్షన్–8 కింద ఆయా ప్రాజెక్టుల నిర్మాణ పనులను థర్డ్ పార్టీ బిల్డర్‌కు అప్పగించేందుకు ‘రెరా’కసరత్తు చేస్తోంది.
8 కంటే ఎక్కువ ఫ్లాట్లు ఉంటే ‘రెరా’
పరిధిలోకి..: గృహ కొనుగోలుదారుల భద్రత, పెట్టుబడులకు భరోసా కల్పించేందుకు ఉద్దేశించిన ‘రెరా’తెలంగాణలో 2016 మే 1న అమల్లోకి వచ్చింది. 500 చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణం లేదా ఒక అపార్ట్‌మెంట్‌లో 8 అంతకంటే ఎక్కువ ఫ్లాట్లు నిర్మించే రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు ‘రెరా’పరిధిలోకి వస్తాయి. స్థానిక మున్సిపాలిటీ/కార్పొరేష న్ అనుమతులు ఉన్నప్పటికీ ఫ్లాట్ల వ్యాపారం చేస్తే తప్పనిసరిగా సదరు ప్రాజెక్టు ‘రెరా’రిజి్రస్టేషన్ పొందాలి. అయితే చాలా మంది బిల్డర్లు నిర్మాణ అనుమతులు రాకముందే.. ‘రెరా’రిజిస్ట్రేషన్ లేకుండానే ఫ్లాట్లను విక్రయిస్తున్నారు. నిధుల మళ్లింపు, దురి్వనియోగం కారణంగా ప్రాజెక్టు నిర్మాణ పను లు మధ్యలోనే ఆగిపోతున్నాయి. దీంతో కస్టమర్లు రోడ్డున పడుతున్నారు. ఇలాంటి కేసుల్లో రెరా– 2016 చట్టంలోని సెక్షన్–8 కింద థర్డ్ పారీ్టకి నిర్మా ణ పనులను బదలాయించే అధికారం రెరాకు ఉంది.
కస్టమర్లకు ఊరట లభిస్తుంది
పలువురు బిల్డర్లు, ఏజెంట్లు అబద్ధపు హామీలతో కస్టమర్లను నమ్మించి మోసం చేస్తున్నారు. అలాంటి వారిని వదిలిపెట్టం. టీజీ–రెరాకు విస్తృత అధికారాలు ఉన్నాయి. చట్ట పరిధిలో గృహ కొనుగోలుదారులకు న్యాయం అందించి తీరతాం. మధ్యలోనే ఆగిపోయిన ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ‘రెరా’అధికారాలను వినియోగించి కస్టమర్లకు ఊరట కల్పిస్తాం. – కె. శ్రీనివాసరావు, టీజీ–రెరా సభ్యుడు
Comments
Please login to add a commentAdd a comment