Platinum
-
అసంపూర్తి నిర్మాణాలకు మళ్లీ జీవం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రీలాంచ్, బై బ్యాక్ స్కీమ్‌ల పేరిట కొందరు బిల్డర్లు చేస్తున్న మోసా లకు అటు రూ. కోట్లలో డబ్బు పోగొట్టుకోవడంతోపాటు ఇటు సొంతింటి కలకు దూరమవుతున్న బాధితులకు న్యాయం చేసేందుకు తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (టీజీ–రెరా), రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించాయి. రాష్ట్రంలోనే తొలిసారిగా దుండిగల్‌లో ఇలా బోర్డు తిప్పేసిన జయత్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే సంస్థకు చెందిన ‘ప్లాటినం’ప్రాజెక్టు పనులను థర్డ్ పార్టీ (మరో బిల్డర్)కు అప్పగించాయి. ఈ మేరకు టీజీ–రెరా చేసిన ప్రతి పాదనకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచి్చంది.దీంతో రెరా–2016 చట్టంలోని సెక్షన్ 8 కింద ఉన్న అధికారాలను ఉపయోగించి ఆ ప్రాజెక్టును థర్డ్ పార్టీకి బదిలీ చేస్తూ టీజీ–రెరా మధ్యంతర ఉత్తర్వు లు జారీ చేసింది. త్వరలోనే ఇలా ఆగిపోయిన మరికొన్ని ప్రాజెక్టులను కూడా థర్డ్ పారీ్టలకు ఇచ్చేందుకు టీజీ రెరా కసరత్తు చేస్తోంది. దీంతో ఆగిపో యిన నిర్మాణాలు మళ్లీ జీవం పోసుకోనున్నాయి. ఇదీ ‘ప్లాటినం’కథ..: ఐదేళ్ల క్రితం జయత్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ యజమాని కాకర్ల శ్రీనివాస్ దుండిగల్‌లో ప్లాటినం పేరుతో అపార్ట్మెంట్ ప్రాజెక్టును ప్రకటించాడు. 3,267 గజాల స్థలంలో స్టిల్ట్+5 అంతస్తులకు హెచ్ఎండీఏ నుంచి అను మతి తీసుకొని 5,865 చ.అ. బిల్టప్ ఏరియాలో 60 అపార్ట్మెంట్లను నిర్మిస్తున్నామని ప్రచారం చేశాడు. రెరాలో రిజిస్ట్రేషన్ చేయకుండానే ప్రీలాంచ్ ఆఫర్ కింద కస్టమర్ల నుంచి రూ. కోట్లు వసూలు చేశాడు. కొనుగోలుదారులను నమ్మించేందుకు శ్లాబ్ లెవల్స్ వరకు నిర్మాణ పనులను శరవేగంగా చేపట్టాడు. హెచ్ఎండీఏకు తనఖా పెట్టిన 9 ఫ్లాట్లు మినహా మిగిలిన 51 ఫ్లాట్లను విక్రయించేశాడు. అయితే నిధుల దురి్వనియోగం కారణంగా ప్రాజెక్టు మధ్యలోనే ఆగిపోయింది. దీంతో గతేడాది సెపె్టంబర్లో కస్టమర్లు ‘రెరా’కు ఫిర్యాదు చేశారు. త్వరలోనే సాహితీ, మంత్రి ప్రాజెక్ట్‌లు కూడా..: జయత్రీ కేసులాగే సాహితీ ఇన్ఫ్రాటెక్ వెంచర్స్, మంత్రి డెవలపర్స్ మధ్యలోనే వదిలేసిన పలు అపార్ట్మెంట్ ప్రాజెక్టులను కూడా సెక్షన్–8 కింద ఉత్తర్వులు ఇచ్చేందుకు రెరా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. గచి్చ»ౌలి, గుండ్లపోచంపల్లి, అమీన్పూర్ ప్రాంతాల్లో అపార్ట్మెంట్లను నిర్మిస్తున్నామని కస్టమర్ల నుంచి సొమ్ము వసూలు చేసి సాహితీ సంస్థ చేతులెత్తేసింది. మరోవైపు జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వద్ద లగ్జరీ ప్రాజెక్టు నిర్మిస్తున్నామని వినియోగదారుల నుంచి మంత్రి డెవలపర్స్ రూ. కోట్లు వసూలు చేసింది. నిధుల దురి్వనియోగం కారణంగా ఆయా ప్రాజెక్టులు మధ్యలోనే ఆగిపోయాయి. బాధితుల ఫిర్యాదుతో సెక్షన్–8 కింద ఆయా ప్రాజెక్టుల నిర్మాణ పనులను థర్డ్ పార్టీ బిల్డర్‌కు అప్పగించేందుకు ‘రెరా’కసరత్తు చేస్తోంది. 8 కంటే ఎక్కువ ఫ్లాట్లు ఉంటే ‘రెరా’పరిధిలోకి..: గృహ కొనుగోలుదారుల భద్రత, పెట్టుబడులకు భరోసా కల్పించేందుకు ఉద్దేశించిన ‘రెరా’తెలంగాణలో 2016 మే 1న అమల్లోకి వచ్చింది. 500 చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణం లేదా ఒక అపార్ట్మెంట్లో 8 అంతకంటే ఎక్కువ ఫ్లాట్లు నిర్మించే రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు ‘రెరా’పరిధిలోకి వస్తాయి. స్థానిక మున్సిపాలిటీ/కార్పొరేష న్ అనుమతులు ఉన్నప్పటికీ ఫ్లాట్ల వ్యాపారం చేస్తే తప్పనిసరిగా సదరు ప్రాజెక్టు ‘రెరా’రిజి్రస్టేషన్ పొందాలి. అయితే చాలా మంది బిల్డర్లు నిర్మాణ అనుమతులు రాకముందే.. ‘రెరా’రిజిస్ట్రేషన్ లేకుండానే ఫ్లాట్లను విక్రయిస్తున్నారు. నిధుల మళ్లింపు, దురి్వనియోగం కారణంగా ప్రాజెక్టు నిర్మాణ పను లు మధ్యలోనే ఆగిపోతున్నాయి. దీంతో కస్టమర్లు రోడ్డున పడుతున్నారు. ఇలాంటి కేసుల్లో రెరా– 2016 చట్టంలోని సెక్షన్–8 కింద థర్డ్ పారీ్టకి నిర్మా ణ పనులను బదలాయించే అధికారం రెరాకు ఉంది. కస్టమర్లకు ఊరట లభిస్తుంది పలువురు బిల్డర్లు, ఏజెంట్లు అబద్ధపు హామీలతో కస్టమర్లను నమ్మించి మోసం చేస్తున్నారు. అలాంటి వారిని వదిలిపెట్టం. టీజీ–రెరాకు విస్తృత అధికారాలు ఉన్నాయి. చట్ట పరిధిలో గృహ కొనుగోలుదారులకు న్యాయం అందించి తీరతాం. మధ్యలోనే ఆగిపోయిన ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ‘రెరా’అధికారాలను వినియోగించి కస్టమర్లకు ఊరట కల్పిస్తాం. – కె. శ్రీనివాసరావు, టీజీ–రెరా సభ్యుడు -
ఆభరణాల ఎగుమతులకు కొత్త ప్రమాణాలు
న్యూఢిల్లీ: బంగారం, వెండి, ప్లాటినం ఆభరణాల ఎగుమతులకు సంబంధించి సవరించిన వేస్టేజీ (తరుగు/వృధా) నిబంధనలను కేంద్రం శుక్రవారం విడుదల చేసింది. ఇవి జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఆభరణాల తయారీ సమయంలో కొంత లోహం వృధా అవుతుందని తెలిసిందే. ఎగుమతి చేసే ఆభరణాలకు సంబంధించి ఈ వేస్టేజీ పరంగా పరిమితులు ఉన్నాయి. ఈ వేస్టేజీని తగ్గిస్తూ ఈ ఏడాది మే 27న కేంద్రం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. వీటిపట్ల పరిశ్రమ ఆందోళన వ్యక్తం చేయడంతో 2024 డిసెంబర్ చివరి వరకు అమలును వాయిదా వేసింది. కొంత వెసులుబాటుతో సవరించిన నిబంధనలను కేంద్రం తాజాగా విడుదల చేసింది. ‘‘ఎగుమతి చేసే ఆభరణాలకు సంబంధించి ప్రామాణిక ఇన్పుట్–అవుట్‌పుట్, అనుమతించిన వేస్టేజీ నిబంధనలను సవరించడమైనది’’అంటూ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారీన్ ట్రేడ్ ప్రకటించింది. ఆభరణాల తయారీ ప్రక్రియకు తగ్గట్టు వేస్టేజీని వాస్తవికంగా నిర్ణయించాలని ప్రరిశ్రమ కోరడం గమనార్హం. అలాగే, కొత్త నిబంధనల అమలుకు తగినంత సమయం ఇవ్వాలని కూడా కోరింది. సాధారణ బంగారం, ప్లాటినం ఆభరణాల తయారీలో వేస్టేజీని 2.5 శాతం నుంచి 0.5 శాతానికి, వెండి ఆభరణాలకు వేస్టేజీని 3.2 శాతం నుంచి 0.75 శాతానికి తగ్గిస్తూ మే నెలలో ప్రకటించిన నిబంధనల్లో కేంద్రం పేర్కొంది. అదే స్టడెడ్ జ్యుయలరీ విషయంలో బంగారం, వెండి, ప్లాటినం ఆభరణాల తయారీలో వేస్టేజీని 0.75 శాతానికి తగ్గించింది. అంతకుముందు ఇది 5 శాతంగా ఉండేది. కొంత వెసులుబాటు..: తాజాగా విడుదల చేసిన నిబంధనల ప్రకారం.. చేతితో తయారు చేసిన బంగారం, ప్లాటినం ఆభరణాలకు సంబంధించి గరిష్ట వేస్టేజీని 2.5% వరకు అనుమతించనున్నారు. చేతితో చేసిన వెండి ఆభరణాలకు 3.2 % వేస్టేజీ అమలు కానుంది. మెషిన్లపై చేసిన బంగారం ఆభరణాలకు 0.45% వేస్టేజీ, వెండికి 0.5% అమలు కానుంది. చేతితో చేసిన బంగారం, వెండి, ప్లాటినం స్టడెడ్ ఆభరణాలకు 4 శాతం, మెషిన్‌పై చేసిన స్టడెడ్ ఆభరణాలు అయితే 2.8% మేర వేస్టేజీని అనుమతించనున్నారు. ఆభరణాలతోపాటు విగ్రహాలు, కాయిన్లు, పతకాలు, ఇతర వస్తువులకు సైతం ఇవే వేస్టేజీ నిబంధనలు అమలవుతాయి. -
గెలాక్సీ గ్రానైట్‌లో ప్లాటినం
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: ఎంతో ప్రఖ్యాతిగాంచిన గెలాక్సీ గ్రానైట్‌లో అత్యంత విలువైన ప్లాటినం నిక్షిప్తమై ఉంది. విభిన్న రంగాలకు ఎంతో ఉపయుక్తమైన ఈ ఖనిజం ప్రకాశం జిల్లా చీమకుర్తిలో లభ్యమవుతున్న గెలాక్సీ గ్రానైట్‌లో మిళితమై ఉందని భూగర్భ శాస్త్రవేత్తలు ఇప్పటికే గుర్తించారు. జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) లాంటి కేంద్ర సంస్థలు పరిశోధనలు నిర్వహించి ప్లాటినం లభ్యత ఏ స్థాయిలో ఉందనేది నిర్ధారిస్తే ప్రభుత్వానికి ఖనిజాదాయం పెరుగుతుంది. చీమకుర్తి మండలం రామతీర్థం పరిసరాల్లో 500 హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో గెలాక్సీ గ్రానైట్ నిక్షిప్తమై ఉన్న సంగతి తెలిసిందే. గ్రానైట్ వెలికితీతకు ప్రభుత్వాలు 136 లీజులను మంజూరు చేయగా 32 మందికి పైగా లీజుదారులు 139 క్వారీలను నడుపుతూ గ్రానైట్ బ్లాక్‌లను తీస్తున్నారు. విభిన్న కారణాలరీత్యా పలు క్వారీల నుంచి బ్లాక్‌లు ఆశించిన స్థాయిలో రావడంలేదు. దాదాపు మూడు దశాబ్దాలుగా నడుస్తున్న ఈ క్వారీలకు సంబంధించిన డంప్‌లు సుమారు 200 హెక్టార్లకు విస్తరించాయి. ఈ డంప్‌ల్లో 200 కోట్ల టన్నులకు పైగా గ్రానైట్ వేస్ట్ ఉంటుందనేది అంచనా. దక్షిణాఫ్రికాలో 80 శాతం వరకు... ప్రపంచంలో అత్యధికంగా దక్షిణాఫ్రికాలోని సుర్బురి బేసిన్లో 80 శాతం వరకు ప్లాటినం నిల్వలు ఉండగా, రష్యాలోని యురల్ పర్వత శ్రేణులు, అమెరికా, జింబాబ్వే, ఆస్ట్రేలియాలోనూ ఇది లభిస్తోంది. మన దేశంలో కర్ణాటకలోని హుట్టి బంగారు గనుల దిగువన, ఒడిశాలోని బౌలా–నౌషాహిలలో, తమిళనాడులోని సీతంపూడి గనులు, ఛత్తీస్గడ్, మహారాష్ట్ర, కేరళ తదితర రాష్ట్రాల్లోనూ ‘ప్లాటినం గ్రూప్ ఆఫ్ మెటల్స్ (పీజీఎం)’ లభ్యతను నిర్ధారిస్తూ పదేళ్ల కిందటే జీఎస్ఐతో సహా ఇతర కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు తమ పరిశోధనల ఫలితాలను వెల్లడించాయి. ఎన్నెన్నో ప్రయోజనాలు.. నిజానికి.. ప్లాటినం, పల్లాడియం, ఇరిడియం, రోడియం, రుథేనియం, ఓస్మియం ఖనిజాల మిళితాన్ని ‘ప్లాటినం గ్రూప్ ఆఫ్ మెటల్స్ (పీజీఎం)’ అంటారు. ఈ ఆరు ఖనిజాలు భౌతిక, రసాయనిక గుణాల సారూప్యతను కలిగి ఉంటాయి. ఈ ఖనిజాల సమ్మిళితాన్ని ఇరిడియం, ప్లాటినం సబ్ గ్రూపులుగా విభజిస్తారు. ప్లాటినం, పల్లాడియం, రోడియం ఖనిజాలు శాస్త్ర సాంకేతిక, ఆరోగ్య రంగాలకు ఎంతగానో ఉపయుక్తమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అలాగే.. పెట్రోలియం రిఫైనరీ, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ ఇండస్ట్రీ (యాంటీ పొల్యూషన్ డివైజస్), ఫార్మాసూ్యటికల్స్, గ్లాస్, ఫెర్టిలైజర్స్, ఎక్స్పో్లజివ్స్, లాబ్స్ పరికరాల తయారీలో ప్లాటినం ఎంతగానో ఉపయోగపడుతుంది. జ్యువెలరీ రంగంలో ప్లాటినానిది ప్రత్యేక స్థానం. బంగారం, వెండి, రాగి లోహాలతో కూడిన అలంకరణ వస్తువుల తయారీలోనూ వినియోగిస్తారు. వైద్య రంగానికి సంబం«ధించి క్యాన్సర్ చికిత్సలో ప్లాటినం గ్రూప్ ఆఫ్ మెటల్స్ కీమోథెరపీకి ప్రాథమికంగా ఉపయోగపడతాయి. పేస్‌మేకర్ తయారీకి, (డెంటిస్టరీ.. దంతసంబంధ వైద్యం) ఎగుడు దిగుడు దంతాలు, ఎత్తు దంతాలను సరిచేసి వాటిని ఒకేరీతిన అమర్చి అందాన్ని ఇనుమడింపజేయడంలోనూ ప్లాటినానిది ప్రధానపాత్ర. ఇక ప్లాటినం– ఇరిడియంలను బయోమెడికల్ పరికరాల తయారీకి విరివిగా వినియోగిస్తారు. ప్లాటినం–రోడియం కలిసిన ఖనిజాలు ఫ్లాట్ స్క్రీన్ టెలివిజన్, కంప్యూటర్ మోనిటర్, హార్డ్‌డిస్క్‌లు, సెల్ఫోన్లు, డిజిటల్ కెమెరాలు, డిస్ప్లే ప్యానల్స్, ఆటోమొబైల్ డిస్ప్లేల తయారీకి ఉపయోగపడతాయి. వంద గ్రాములు రూ.2.37 లక్షలు.. ప్లాటినం ధర కూడా ఎక్కువే. పలు సందర్భాలలో బంగారం ధరతో పోటీపడుతుంది. ప్రస్తుతం మార్కెట్లో ఒక గ్రాము ప్లాటినం ధర రూ.2,374లు. వంద గ్రాములు రూ.2.37 లక్షలకు పైగా పలుకుతోంది. ఆభరణాల తయారీ, అలంకరణలకు ప్లాటినం పెట్టింది పేరు. గ్రానైట్ డంప్‌ల నుంచి.. చీమకుర్తి గ్రానైట్‌లో ప్లాటినం ఉందనేది నిర్ధారితమైనందున ఇందులో ప్లాటినం సమ్మిళితాలు ఎంతశాతం.. ఎంతమేరకు లాభదాయకమనే స్పష్టత కోసం తదుపరి పరిశోధనలు నిర్వహించాలని గనుల శాఖ కేంద్ర ప్రభుత్వ సంస్థలను కోరాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర విభజన జరగకముందు వరకు జీఎస్ఐ, ఓఎన్జీసీ, ఎన్జిఆర్ఐ, ఎన్ఎండీసీ, ఎంఇఎల్ఎల్ (మినరల్ ఎక్స్ల్పిరేషన్ కంపెనీ లిమిటెడ్), ఏఎండీ (అటావిుక్ మినరల్ డివిజన్), ఐబీఎం (ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్) తదితర కేంద్ర సంస్థలతో పాటు రాష్ట్ర పరిధిలోని అటవీ, జలవనరులు తదితర శాఖలతో సంయుక్తంగా స్టేట్ జియలాజికల్ ప్రోగ్రామింగ్ బోర్డు సమావేశాలు జరిగేవి. ఈ సందర్భంగా.. రాష్ట్రంలో తమకు కావాల్సిన సర్వేలు చేయాలని మైనింగ్ విభాగాలు కోరడంతో పాటు కేంద్ర సంస్థలు నిర్వహించిన ఖనిజాన్వేషణ నివేదికలను పొందేవి. తద్వారా మైనింగ్ రంగంలో ఏ రీతిన పురోగతి సాధించాలి, ఆదాయ సముపార్జన మార్గాల ప్రణాళిక సాధ్యమవుతుంది. ఇందులో భాగంగానే చీమకుర్తిలోని డంప్‌ల్లోని దాదాపు 200 కోట్ల టన్నుల గ్రానైట్ వేస్ట్‌ను ప్రాసెస్ చేయడానికి సాధ్యాసాధ్యాలపై దృష్టిసారించాలని నిపుణులు సూచిస్తున్నారు. -
కోట్లు పలికే ‘రంగురాయి’ ఏది? బంగారం, ప్లాటినం ఎందుకు దిగదుడుపు?
ఎవరైనా ఏదైనా ఖరీదైన వస్తువు గురించి మాట్లాడినప్పుడు ముందుగా బంగారాన్ని ప్రస్తావిస్తారు. నిజానికి ఒక గ్రాము బంగారం కొనాలన్నా కూడా చాలా డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్లాటినం దాని కంటే ఖరీదైనదిగా పరిగణిస్తారు. అయితే బంగారం, ప్లాటినం మాత్రమే అత్యంత ఖరీదైన ఖనిజాలు కాదు. దీనికంటే ఖరీదైన ఖనిజాలు భూమిపై చాలా ఉన్నాయి. అందుకే ఇప్పుడు ప్రపంచంలోని అత్యంత ఖరీదైన ఖనిజం ఏది? దాని ధర ఎంత అనేది తెలుసుకుందాం. బంగారం కంటే ఖరీదైన ఖనిజాల ప్రస్తావన వచ్చినప్పుడు ఈ జాబితాలో అనేకమైనవి కనిపిస్తాయి. వాటిలో మనం ఉపయోగించే వాటి విషయానికొస్తే రోథియం, పల్లాడియం, ఇరిడియం, జాడైట్ మొదలైనవి ఉన్నాయి. ఇవేకాకుండా మనం నేరుగా ఉపయోగించని అనేక ఖనిజాలు కూడా ఉన్నాయి. అవి బంగారం కంటే చాలా ఖరీదైనవి. వీటిలో లిథియం లాంటి అనేక పదార్థాలు ఉన్నాయి. ఇప్పుడు అత్యంత ఖరీదైన ఖనిజం ఏమిటో తెలుసుకుందాం. అత్యంత ఖరీదైన ఖనిజం విషయంలో అనేక వాదనలు వినిపిస్తాయి. దానికి సంబంధించిన అనేక నివేదికలు కనిపిస్తాయి. ఆ నివేదికల ప్రకారం చూస్తే రోథియం అత్యంత ఖరీదైనది. మరికొందరు శాస్త్రవేత్తలు జాడైట్ ఖనిజం అత్యంత ఖరీదైనదిగా చెబుతారు. జాడైట్ ఒక రకమైన రాయి. అది లేత ఆకుపచ్చ రంగులో ఉంటుంది. దీనిని ఖరీదైన ఆభరణాల తయారీలో ఉపయోగిస్తారు. దీని ధర క్యారెట్లలో ఉంటుంది. డైమండ్ మాదిరిగా ఇది క్యారెట్ల లెక్కన లభిస్తుంది. జాడైట్ క్యారెట్ ధర చాలా అధికం. ఒక క్యారెట్ జాడైట్ ధర 3 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ అని చెబుతారు. అంటే ఒక్క జాడైట్ రాయి కోసం కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇది కూడా చదవండి: ఏ రాష్ట్రంలో బిచ్చగాళ్లు అధికం? -
అద్భుత ఘటన: ఇంజనీరింగ్ రంగంలో విప్లవాత్మక మార్పులు!
ఐశ్వర్యారాయ్ లాంటి ప్రపంచ సుందరిని అతి సమీపంలో చూసేసరికి రజనీ వంటి రోబోలో కూడా రసస్పందన కలిగింది. తట్టుకోలేని తమకంలో తలమునకలయ్యాడు. భగవంతుని ఈ సృష్టి వైచిత్రిని తలచుకుని తెగ ఆశ్చర్యపోయాడు. తనవంటి జడపదార్థంలోనూ జమకాలు పాడించిన ఆడదానికి ఓరచూపు పవరుకు పదేపదే సలాములు చేశాడు. ఇనుములో హృదయం మొలిచెనే... అనుకుంటూ డ్యుయెట్లు పాడుకుని మురిసిపోయాడు. దర్శక దిగ్గజం శంకర్ సృజన నుంచి పుట్టుకొచి్చన ఈ సూపర్‌హిట్ సినీ ఫాంటసీ నిజ జీవితంలోనూ జరిగితే? ఇనుములో నిజంగానే హృదయం మొలిస్తే? అమెరికాలో సరిగ్గా ఇదే జరిగింది. ఓ చిన్న ప్లాటినం ముక్క తనలో పుట్టుకొచి్చన పగుళ్లను తనంత తానుగా నయం చేసుకుంది. అదీ ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్తలంతా కళ్లారా చూస్తుండగా! ఈ పరిణామాన్ని అతి సూక్ష్మమైన మైక్రోస్కోప్ ద్వారా వీక్షించి వాళ్లంతా అక్షరాలా అవాక్కయ్యారు. ‘‘మా కళ్లను మేమే నమ్మలేకపోయాం. దీనికి కారణమేమిటన్నది మాకైతే అంతుబట్టడం లేదు. మానవ మేధకు బహుశా ఎప్పటికీ అంతుబట్టదేమో!’’అని చెప్పుకొచ్చారు. ప్రాకృతిక నియమాలనే పూర్తిగా తలకిందులు చేయగల ఈ పరిణామం ఎలా సాధ్యమైందన్న కీలకాన్ని పట్టుకోగలిగితే ఇంజనీరింగ్ రంగంలో కనీవినీ ఎరగని విప్లవాత్మక మార్పులు ఖాయమని వారంతా ముక్త కంఠంతో అంటున్నారు. ఇప్పుడా కీలకాన్ని ఒడిసిపట్టే పనిలో తలమునకలుగా ఉన్నారు... నిరంతర వాడకం తదితరాల వల్ల అరుగుదల వంటివి జరిగి యంత్రాలు పగుళ్లివ్వడం, అవి క్రమంగా పెరిగిపోయి చివరికి పాడవడం సర్వసాధారణం. ఆ మాటకొస్తే ఇది ప్రతి ఇనుప వస్తువు విషయంలోనూ జరిగేదే. నిజానికి చాలా పరిశ్రమల్లో ఈ అరుగుదల తదితరాల ఖర్చే తడిసి మోపెడవుతూ ఉంటుంది కూడా. మరి కార్లు, బస్సులు, భారీ ఇంజన్లు, బ్రిడ్జిలు, విమానాల వంటి ఇనుప వస్తువులన్నీ తమలో తలెత్తే పగుళ్ల వంటి సమస్యలన్నింటినీ తమంతట తామే ఎప్పటికప్పుడు సరిచేసుకోగలిగితే? వాటి భద్రతపై దిగులుండదు. జీవితకాలమూ పెరుగుతుంది. అన్నింటికంటే ముఖ్యంగా నిర్వహణ తదితర భారీ ఖర్చులన్నీ పూర్తిగా తప్పుతాయి. ఎంతగా అంటే, ఒక్క అమెరికాలోనే ఏటా వేలాది కోట్ల డాలర్లు ఆదా అవుతాయని ఈ పరిశోధనకు పూనుకున్న శాస్త్రవేత్తల బృందమే అంచనా వేస్తోంది! పైగా రిపేర్లు తదితరాలకు పట్టే అతి విలువైన సమయమూ పూర్తిగా ఆదా అవుతుంది! ఇప్పటికిది అందమైన ఊహే అయినా మున్ముందు నిజమయ్యే ఆస్కారం పుష్కలంగా ఉందంటున్నారు ప్రఖ్యాత అంతర్జాతీయ శాస్త్రవేత్తలు. అదే జరిగితే మౌలిక శాస్త్ర సాంకేతిక సిద్ధాంతాలన్నీ పూర్తిగా మారిపోవడం ఖాయమని కూడా చెబుతున్నారు. ఆ అద్భుతం జరిగిందిలా... ఇనుప పరికరాల్లో అతి సూక్ష్మస్థాయిలో పగుళ్లు ఎలా మొదలవుతాయో తెలుసుకునేందుకు అమెరికాలో ఇంధన శాఖకు చెందిన సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ నానోటెక్నాలజీస్ శాస్త్రవేత్తల బృందం ఇటీవల ఓ పరిశోధన చేసింది. అందులో యాదృచ్ఛికంగా అద్భుతమొకటి జరిగింది. ఏమైందంటే... ► అమెరికాలోని శాండియా, లాస్ అలామోస్ నేషనల్ లేబోరేటరీస్, టెక్సాస్ ఏ అండ్ ఎం యూనివర్సిటీ సంయుక్తంగా ఈ పరిశోధనకు పూనుకున్నాయి. అతి సూక్ష్మ పరిమాణంలోని ప్లాటినం ముక్కలో పగుళ్లు మొదలయ్యే తీరును లోతుగా పరిశోధించడం దీని ముఖ్యోద్దేశం. ► కానీ తీరా ప్రయోగం మొదలైన 40 నిమిషాలకు వారు కలలో కూడా ఊహించనిది జరిగింది. ప్లాటినం ముక్క మొదలైన పగులు విస్తరించడం ఆగిపోయింది! ► ఇదేమిటా అని వాళ్లు తల బద్దలు కొట్టుకుంటుండగానే, ఆ పగులు తనంతట తానే చిన్నదవుతూ క్రమంగా పూర్తిగా పూడి కనుమరుగైపోయింది! ఎంతగా అంటే, అక్కడ పగులు వచి్చన ఆనవాలు కూడా కనిపించలేదు! ► ఇలా మానవ జోక్యం అసలే లేకుండా ఓ లోహం తనలోని పగుళ్లను తానే పూడ్చుకోవడం మనకు తెలిసిన చరిత్రలో బహుశా తొలిసారి జరిగిందని సైంటిస్టులు చెబుతున్నారు. ► ఈ పరిశోధన వివరాలు ప్రఖ్యాత జర్నల్ నేచర్‌లో ప్రచురితమయ్యాయి. అచ్చం అతను సూత్రీకరించినట్టే... ఇలాంటి దృగ్విషయాన్ని టెక్సాస్ ఏ అండ్ ఎం వర్సిటీ ప్రొఫెసర్ మైకేల్ డెంకోవిజ్ కొన్నేళ్ల క్రితమే కంప్యూటర్ సిమ్యులేషన్ల ఆధారంగా సూత్రీకరించాడు.తాజా పరిశోధన ఫలితం గురించి తెలిసి ఆయనిప్పుడు ఎంతగానో ఆనందపడుతున్నాడు. తన పాత ప్రయోగాన్ని మరోసారి చేసి చూపిస్తూ, ‘అప్పట్లో నేనెలా సూత్రీకరించానో ఇప్పడు అక్షరాలా అలాగే జరిగిం’దంటూ సంబరపడిపోతున్నాడు. అద్భుతమే, కాకపోతే... జరిగింది నిజంగానే మహాద్భుతమే. ఇందులో అనుమానమే లేదు. కాకపోతే లోహాల్లో అసలు ఈ ‘స్వీయ వైద్యం’ఎలా సాధ్యమన్నది మాత్రం మనకు ప్రస్తుతానికి ఏమీ తెలియదు. దీన్ని ఇంజనీరింగ్, తయారీ రంగాలకు ఎలా అన్వయించుకోవాలన్నది అంతకంటే అవగాహనలోకి రాలేదు. ‘‘అతి సూక్ష్మ స్ఫటికాకార లోహంపై గాలి తదితరాల ఆనవాలు కూడా లేని పూర్తి నియంత్రిత, కృత్రిమ శూన్య పరిస్థితుల్లో ఇది జరిగింది. సాధారణ వాతావరణంలో సంప్రదాయ లోహాల్లో ఇది ఏ మేరకు సాధ్యమన్నది ప్రస్తుతానికి పెద్ద ప్రశ్నే’’అని బాయ్స్ చెప్పుకొచ్చారు. కొసమెరుపు ఇదెలా సాధ్యపడిందన్న దానిపై నెలకొన్న అస్పష్టత, దీన్ని మనకు మేలు జరిగేలా మలచుకోవడం ఏ మేరకు సాధ్యమన్న సందిగ్ధత తదితరాలను పక్కన పెడితే ఇంజనీరింగ్, మెటీరియల్స్ సైన్స్ వంటి పలు రంగాల్లో ఈ పరిశోధన ఫలితం అతి పెద్ద ముందడుగన్నది మాత్రం నిస్సందేహం. లోహాల్లో పగుళ్లంటూ మొదలైతే పెరుగుతూనే పోతాయి. కానీ, అత్యంత జడమైనవిగా భావించే లోహాలకు కూడా ఇలా తమను తాము నయం చేసుకోగల స్వాభావిక సామర్థ్యం ఉందని మా పరిశోధన తేటతెల్లం చేయడం ఓ నమ్మశక్యం కాని నిజం!’’ – బ్రాడ్ బాయ్స్, మెటీరియల్స్ సైంటిస్టు, శాండియా నేషనల్ లేబోరేటరీస్ –సాక్షి, నేషనల్ డెస్క్ -
బాబోయ్ ఈ స్మార్ట్‌ఫోన్ ఖరీదు అన్ని కోట్లా? లగ్జరీ లంబోర్ఘినికే ఝలకా?
అతి ఖరీదైన ఫోన్లు అనగానే యాపిల్ ఐఫోన్లు గుర్తొస్తాయి. ముఖ్యంగా ప్రస్తుతం రూ. 1,27,999 ధర పలుకుతున్న ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ అత్యంత ఖరీదైన ఫోన్‌గా భావిస్తాం. దీని లేటెస్ట్ వెర్షన్ ధర కళ్లు చెదిరే ధర పలుకుతోంది. డైమండ్ స్నోఫ్లేక్ వేరియంట్, కేవియర్ ద్వారా కస్టమైజ్ చేసిన ఐఫోన్ ధర సుమారు రూ. 5 కోట్లు (616,000 డాలర్లు) పలుకుతోంది. ఐఫోన్ 14 ప్రో మాక్స్ స్నోఫ్లేక్ ఎడిషన్ ప్రత్యేకత ఏమిటంటే బ్రిటీష్ జ్యువెలరీ బ్రాండ్ గ్రాఫ్ సహకారంతో రూపొందించారు. డైమండ్ మోడల్ బ్యాక్ప్లేట్కు లాకెట్టు అమర్చారు. దీన్ని అతి ఖరీదైన ప్లాటినం, వైట్ గోల్డ్‌తో రూపొందించారు. ఈ రౌండ్ అండ్ మార్క్యూస్-కట్ డైమండ్స్‌తో తయారు చేసిన లాకెట్టు ధర ఒక్కటే దాదాపు రూ. 62 లక్షలు. దీనికి అదనంగా,18 కేరట్ల వైట్ గోల్డ్ బ్యాక్ప్లేట్ను కూడా అమర్చారు. దీనికి 570 వజ్రాలను అమర్చారట. ప్రస్తుతానికి మూడు యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉంచినట్టుతెలుస్తోంది. దీనిపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. ప్రస్తుతం దేశంలో రూ.3.7 కోట్లకు లభ్యమవుతున్న లంబోర్గిని హురాకాన్ ఎవో సూపర్‌కార్ ధర కంటే ఎక్కువ కదా బాసూ అంటే కమెంట్ చేస్తున్నారు. కాగా 1,39,900 రూపాయల వద్ద భారతీయ మార్కెట్లో ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ లాంచ్ అయిన సంగతి తెలిసిందే. -
NGRI Hyderabad: ఆ గనుల్లో బంగారం కంటే విలువైన లోహం
సాక్షి, హైదరాబాద్: కర్ణాటకలోని హట్టి బంగారు గనుల్లో..బంగారం కంటే విలువైన లోహం ప్లాటినం కూడా దొరికే అవకాశముందని హైదరాబాద్ భూ భౌతిక పరిశోధన సంస్థ (ఎన్జీఆర్ఐ) గుర్తించింది. ఆరేళ్ల పరిశోధనల అనంతరం ప్లాటినం నిల్వలను కనుగొన్నట్లు ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్త డాక్టర్ పీవీ సురేందర్ రాజు ‘సాక్షి’కి వెల్లడించారు. హట్టి బంగారు గనుల్లో ఇతర విలువైన లోహాలు ఏమైనా లభిస్తాయా అన్న కుతూహలంతో తాము పరిశోధనలు చేపట్టామని, ఈ క్రమంలో అక్కడ క్వార్ట్జ్ ఉన్నట్లు తెలిసిందన్నారు. క్వార్ట్జ్ను అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) అంగారక యాత్రకు వాడిన ప్రత్యేకమైన ఎస్ రే యంత్రాన్ని ఉపయోగించి విశ్లేషించినప్పుడు అందులో ప్లాటినం ఉన్నట్లు గుర్తించామని వివరించారు. బంగారం కంటే విలువైన ప్లాటినం లోహాన్ని కంప్యూటర్ల తయారీతో పాటు రసాయన చర్యల వేగాన్ని పెంచే ఉ్రత్పేరకంగాను వాడతారన్నది తెలిసిందే. దేశంలోని పలు ప్రాంతాల్లో ప్లాటినం నిల్వలు ఉన్నాయని... ఒడిశాలోని బౌల–సుసహి, సితంపుండి తమిళనాడు, హనుమాన్‌పూర్ హట్టి గనుల్లో కూడా గతంలో లభ్యమైనట్లు తెలిపారు. క్రోమియం ఉన్న ప్రతి చోట ప్లాటినంను గుర్తించినట్లు తెలిపారు. పరిశోధనశాలలు అవసరం దేశంలో ఖనిజాల ఉనికినిని గుర్తించేందుకు ప్రత్యేకమై న పరిశోధనశాలలు అవసరం అని ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. జిల్లా స్థాయిలో వీటిని ఏర్పాటు చేయాలని, విద్యార్థులను భాగస్వాములను చేయాలని డా. సుందర్ రాజు అభిప్రాయపడ్డారు. నిజాం తవ్విన గనులు.. ఆస్ట్రేలియాలో ఒక ముడిసరుకు కోసం తవ్వకాలు జరిపే క్రమంలో మరిన్ని ఇతర ఖనిజాలను గుర్తిస్తుండటం తమ దృష్టికి వచ్చి తామూ అదేవిధంగా ముందుకు వెళ్లామన్నారు. ఈ నేపథ్యంలో కర్ణాటక హట్టిలో బంగారంతోపాటు అనేక ఖనిజాలు ఉండవచ్చన్న ఆలోచన వచి్చందని, దీంతో వెంటనే పనులను, పరిశోధనలు ప్రారంభించామని ఈ పరిశోధనల్లో పాల్గొన్న డాక్టర్ సంగూర్ తెలిపారు. హట్టి గనుల్లో 1880– 1920 ప్రాంతంలో అప్పటి బ్రిటన్ శాస్త్ర వేత్తతో కలిసి జాన్‌టైలర్స్ అండ్ సన్స్ మైనింగ్‌ను ప్రారంభించారన్నారు. 1887లో డక్కన్ నిజాం కంపెనీ ఆఫ్ హైదరాబాద్ స్వాధీనం చేసుకుని తవ్వకాలు ప్రారంభించిందన్నారు. 1902 నుంచి 1918 వరకు 1052 మీటర్ల లోతు నుంచి తవ్విన 3.8 లక్షల టన్నుల ఖనిజం నుంచి 7.41 టన్నుల బంగారాన్ని సాధించారు. అంటే టన్నుకు 19.45 గ్రాముల బంగారం వెలికితీసినట్లు తెలిపారు. ఆ తర్వాత 1956లో హట్టి గోల్ట్ మైన్స్ కంపెని లిమిటెడ్ గా రూపాంతరం చెందిందని ఆయన వివరించారు. -
ఫాదర్స్ డే.. బ్రాండెడ్ గిఫ్ట్స్
సాక్షి, సిటీబ్యూరో: రానున్న ఫాదర్స్ డే సందర్భంగా తండ్రీ కూతుళ్ల అనుబంధాన్ని పెంచే వైవిధ్యభరితమైన ప్లాటినం ఆభరణాల్ని అందుబాటులోకి తెచ్చినట్టు ప్లాటినం గిల్డ్ ఇంటర్నేషనల్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ కలెక్షన్లో బ్రాస్లెట్స్, రింగ్స్, చెయిన్స్ తదితర విభిన్న రకాల వెరైటీలలో నగరంలోని ప్రముఖ షోరూమ్స్‌లో కొలువుదీరినట్టు వివరించారు. గెలాక్సీ బడ్స్.. సంగీత ప్రియులైన తండ్రులకు పిల్లలు అందించదగిన కానుకగా ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ బ్రాండ్ శామ్సంగ్ గెలాక్సీ బడ్స్ పేరుతో ప్రత్యేకమైన ఉత్పత్తులను సిటీ మార్కెట్లోకి విడుదల చేసింది. వైవిధ్యభరితమైన ఫీచర్లతో ఈ కార్డ్ ఫ్రీ ఇయర్ బడ్స్ రూపొందాయని, అలాగే గెలాక్సీ వాచ్ వంటివి కూడా ప్రత్యేకంగా అందిస్తున్నామని సంస్థ ప్రతినిధులు తెలిపారు. -
నకిలీ ప్లాటినం గుండ్ల విక్రయ ముఠా అరెస్ట్
అనంతపురం , హిందూపురం అర్బన్: ప్లాటినం గుండ్లని సీసం గుండ్లను విక్రయించాలని చూసిన ఏడుగురు సభ్యుల ముఠాను హిందూపురం వన్‌టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను సీఐ చిన్నగోవిందు ఆదివారం మీడియాకు వెల్లడించారు. అరెస్టయిన ముఠాలో అనంతపురానికి చెందిన పార్వతమ్మ, సేవామందిర్ నాగభూషణరెడ్డి, హిందూపురం ఆర్టీసీ కాలనీ ఆర్.కె.శ్రీనివాసులు, కర్ణాటక రాష్ట్రం తుమకూరు డి.హెచ్.నాగరాజు, బెంగళూరుకు చెందిన శ్రీనివాసులు, గురుమూర్తి, పావగడ ప్రకాష్ ఉన్నారు. వీరు తమవద్ద ఉన్న ప్లాటినం గుండ్లు రూ.కోట్లు విలువ చేస్తాయని, మీకు కావాలంటే రూ.15లక్షలకు ఇస్తామని రామగిరికి చెందిన వీరేంద్రతో బేరం కుదుర్చుకుని, కొంత అడ్వాన్స్ తీసుకున్నారు. శనివారం రాత్రి గుడ్డం ఆలయం సమీపంలో పాట్లినం గుండ్లు ఇవ్వడానికి ముఠా సభ్యులందరూ చేరుకున్నారు. అప్పటికే సమాచారం అందుకున్న ఎస్ఐ మక్బుల్‌బాషా సిబ్బందితో దాడిచేసి ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నట్లు సీఐ తెలిపారు. వారి వద్ద నుంచి ప్లాటినం గుండ్లుగా చెబుతున్న 1.7 కిలోల సీసం గుండ్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. వీరు ప్లాటినం పేరు చెప్పి భారీగా డబ్బు దండుకోవాలని చూసినట్లు విచారణలో తేలిందని సీఐ తెలిపారు. వీరిని కోర్టులో హాజరుపరచగా మెజిస్ట్రేట్ రిమాండ్‌కు ఆదేశించారన్నారు. -
ప్లాటినంపై యువత మోజు
కొరుక్కుపేట: ప్లాటినం నగలపై యువతకు మోజు పెరగుతుందని, దీంతో ప్లాటినం అమ్మకాలు పెరుగున్నాయని ప్లాటినం గిల్డ్ ఇంటర్నేషనల్ (పీజీఐ) మేనేజింగ్ డైరెక్టర్ వైశాలి బెనర్జీ అన్నారు. సోమవారం చెన్నైలో జరిగిన సమావేశంలో ఆమె మట్లాడారు. ప్లాటినం జ్యువెలరీ బిజినెస్ రివీవ్– 2017 ఇటీవల చేపట్టామన్నారు. అందులో ఇండిపెండెంట్ ప్లాటినం మార్కెట్ నిపుణులు, ఇండస్ట్రీ అనలిస్ట్ సంయుక్తంగా భారత్‌లో కన్సూమర్ రీటైల్ సేల్స్ గ్రోత్‌పై సర్వే నివేదికను అందించారన్నారు. భారత్‌లో ప్లాటినం మార్కెట్ గ్రోత్ పటిష్టంగా ఉందన్నారు. రీటైల్ సేల్స్ 21 శాతం ఏటా పెరుగుతున్నాయన్నారు. ఫ్యాబ్రికేషన్ డిమాండ్ గ్రోత్ ఏడాది ఏడాదికి 34 శాతం పెరుగుతున్నట్లు తెలిపారు. ప్రసుత్తం ప్యాషన్ రంగం కొత్త పుంతలు తొక్కుతున్న తరుణంలో యువత సైతం ప్లాటినం జ్యువెలరీపై మోజు పెరుగుతుందన్నారు. బ్రైడల్ మార్కెట్ సైతం చైనా, జపాన్, యూఎస్‌తోపాటు భారత్‌లో పెరుగుతుందన్నారు. -
వలసలపై వేటు: అమెరికా బాటలో సౌదీ
నిబంధనలు కఠినతరం చేసే దిశగా అడుగులు రియాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలను కొన్ని దేశాలు వ్యతిరేకిస్తున్నా..మరికొన్ని మాత్రం అనుసరిస్తున్నాయి. వాటిల్లో సౌదీ ఒకటి. 12.1 శాతంగా ఉన్న నిరుద్యోగాన్ని 2020 కల్లా ఉన్న తొమ్మిది శాతానికి తగ్గించాలనే లక్ష్యసాధనలో భాగంగా విదేశీ కార్మికులపై వేటువేయనుంది. తద్వారా నిరుద్యోగం తగ్గుతుందని ఆశిస్తోంది,. దీంతో తక్కువ వేతనాలు చెల్లించి కార్మికులను వినియోగించే కంపెనీలపై భారం పడనుంది. ఈ కొత్త నింబంధనల వల్ల 12 మిలియన్ల విదేశీ కార్మికులు ఇబ్బందులపాలయ్యే ప్రమాదం ఉంది. ఇక నుంచి 500 నుంచి 2,999 మంది ఉద్యోగులున్న కంపెనీలు టాప్ ‘ప్లాటినమ్’ కేటగిరీలో వంద శాతం సౌదీ పౌరులనే నియమించాలి. పది శాతం మాత్రమే ఉద్యోగాలిస్తే ఆ కంపెనీలను ‘లోయర్ గ్రీన్’ కేటగిరీగా రేటింగ్ ఇస్తారు. ప్రస్తుతం ఈ రేటింగ్ ప్లాటినంకు 16 శాతం, లోయర్ గ్రీన్‌కు ఆరు శాతంగా ఉంది. బాగా చదువుకుని పొట్టకూటి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లే వారికి ఈ నిర్ణయం వారికి ఇబ్బంది కలిగించనుంది. -
నగలు ఏవి?!
నగలను తలపించే జిగేల్ బంగారం షాపోల్లు మొత్తుకుంటారు డైమండ్ వ్యాపారులు ‘ఢాం ఢుష్క్’ అంటారు ప్లాటినమ్ వ్యాపారాలు పరేషాన్ పరేషాన్! ఇలా ఎలా?! హౌ కాన్ దిస్ బి? నగలు అవసరం లేని డిజైన్లు వచ్చాయండోయ్! క్లాస్ కటింగ్.. స్టైలిష్ ఫిటింగ్! అవును... నగలు ఏవి?! ►నెక్ కాలర్ పార్ట్‌కి, హ్యాండ్ కఫ్స్‌కి ఎంబ్రాయిడరీ ఉంటే... నగల అవసరమే ఉండదు. ► ఎంత ఆధునికపు వస్త్ర హంగులైనా సరే ఆభరణం లేకపోతే అందం ఉండదు అనుకునేవారు తమ ఆలోచనను మార్చుకోవాల్సిందే ఇలాంటి ఎంబ్రాయిడరీ చూస్తే! ► లెహంగా ఓణీ.. వేడుకలకు తప్పని సరి హంగు. వీటికి నగలు కావాలి అనే టెన్షన్ ఎందుకు? ఆభరణంగా డిజైనర్ క్లాత్‌నే అమర్చితే సరి. ► చీరకట్టుకు ఆభరణాల మెరుగులు లేకపోతేనేం ఎంబ్రాయిడరీ జరీ మెరుపులు తోడైన అందమే వేరు. ► ప్లెయిన్ డ్రెస్ మీదకు ఎలాంటి ఆభరణాలు వేసుకోవాలి అనే టెన్షన్ ఎందుకు? దుపట్టానే హారంగా మార్చేస్తే చాలు. ► పట్టు దుస్తుల మీదకు ఆభరణాలు ఉంటేనే అందంగా ఉంటుందా? ఒక్క నెక్ స్టైల్ మార్చేస్తే ఆభరణాలు తీసికట్టేగా! ► హైనెక్ స్టైల్, అందులోనూ ఎంబ్రాయిడరీ చేసిన బ్లౌజ్ ధరిస్తే ఆభరణాల ఊసే అవసరం ఉండదని ఈ స్టైల్ చెబుతోంది. ► ఆభరణాలను పోలిన ఎంబ్రాయిడరీ బ్లౌజ్ మెడ అంతా కొత్త సింగారాలు పోతే వేరే నగలెందుకు? -
ఆరుగురి అరెస్ట్..ప్లాటినం స్వాధీనం
అక్రమంగా ప్లాటినం అమ్మకానికి ప్రయత్నించిన ఆరుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన విశాఖపట్టణం జిల్లా గోపాలపట్నంలో మంగళవారం జరిగింది. ఎలాంటి బిల్లులు, అనుమతులు లేకుండా ప్లాటినం అమ్మడానికి కొందరు వ్యక్తులు ప్రయత్నించారు. ముందస్తు సమాచారం తో వీరు రాజు అనే వ్యక్తికి లోహాన్ని విక్రయిస్తుండగా పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వారి నుంచి రూ.2 లక్షల విలువైన ప్లాటినంను స్వాధీనం చేసుకున్నారు. -
మైనే ప్యార్ కియా మూవీ ప్లాటీనమ్
-
గ్రీన్ సిగ్నల్ మూవీ ప్లాటీనమ్
-
డైమండ్స్, ప్లాటినం వైపు భారతీయుల దృష్టి
న్యూఢిల్లీ: బంగారం ధరలు పెరిగిపోతున్న నేపథ్యంలో భారతీయులు వైట్‌గోల్డ్, డైమండ్, ప్లాటినం ఆభరణాలవైపు దృష్టి సారిస్తున్నారు. పండుగల సీజన్లో ఈ ధోరణి కనబడుతున్నట్లు ఒక సర్వే పేర్కొంది. దేశీయ వినియోగదారుల డిమాండ్‌కు అనుగుణంగా 76 శాతం ఆభరణాల వర్తకులు సైతం ప్లాటినం ఆధారిత డైమండ్ ఆభరణాల వైపు దృష్టి పెడుతున్నట్లు సర్వే పేర్కొంది. హైదరాబాద్‌సహా 350 ఆభరణాల మార్కెట్లను సర్వే అధ్యయనం చేసింది. బంగారం, వెండి ధరల్లో తీవ్ర ఒడిదుడుకుల వల్ల వినియోగదారులు ప్లాటినం, డైమండ్ ఆధారిత ఆభరణాలపై దృష్టి సారిస్తున్నట్లు అసోచామ్ సెక్రటరీ జనరల్ డీఎస్ రావత్ తెలిపారు. వార్షిక ప్రాతిపదికన డైమండ్, డైమండ్ ఆభరణాల డిమాండ్ ఈ ఏడాది 25 శాతం పెరిగినట్లు సర్వే తెలిపింది. బంగారం టారిఫ్ విలువ పెంపు... కాగా కస్టమ్స్ సుంకాల విధింపునకు ప్రాతిపదిక అయిన బంగారం దిగుమతుల టారిఫ్ విలువను ప్రభుత్వం బుధవారం పెంచింది. దీనితో 10 గ్రాములకు ఈ ధర 418 డాలర్ల నుంచి 442 డాలర్లకు చేరింది. ఐదుశాతం పైగా పెరిగిన ఈ విలువ ప్రభావం మార్కెట్‌పై పడే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. కాగా వెండి టారిఫ్ విలువ మాత్రం యథాపూర్వం కేజీకి 699డాలర్లుగా కొనసాగనుంది. సాధారణంగా ప్రతి పక్షం రోజులకు ఒకసారి ఈ ధరలను ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ సెంట్రల్ బోర్డ్ సమీక్షిస్తుంటుంది. అంతర్జాతీయ ధరలు, దేశీయ డిమాండ్ వంటి అంశాలకు అనుగుణంగా విలువలో మార్పులు చేస్తుంది.