నగలను తలపించే జిగేల్
బంగారం షాపోల్లు మొత్తుకుంటారు డైమండ్ వ్యాపారులు ‘ఢాం ఢుష్క్’ అంటారు ప్లాటినమ్ వ్యాపారాలు పరేషాన్ పరేషాన్! ఇలా ఎలా?! హౌ కాన్ దిస్ బి? నగలు అవసరం లేని డిజైన్లు వచ్చాయండోయ్! క్లాస్ కటింగ్.. స్టైలిష్ ఫిటింగ్! అవును... నగలు ఏవి?!
►నెక్ కాలర్ పార్ట్‌కి, హ్యాండ్ కఫ్స్‌కి ఎంబ్రాయిడరీ ఉంటే... నగల అవసరమే ఉండదు.
► ఎంత ఆధునికపు వస్త్ర హంగులైనా సరే ఆభరణం లేకపోతే అందం ఉండదు అనుకునేవారు తమ ఆలోచనను మార్చుకోవాల్సిందే ఇలాంటి ఎంబ్రాయిడరీ చూస్తే!
► లెహంగా ఓణీ.. వేడుకలకు తప్పని సరి హంగు. వీటికి నగలు కావాలి అనే టెన్షన్ ఎందుకు? ఆభరణంగా డిజైనర్ క్లాత్‌నే అమర్చితే సరి.
► చీరకట్టుకు ఆభరణాల మెరుగులు లేకపోతేనేం ఎంబ్రాయిడరీ జరీ మెరుపులు తోడైన అందమే వేరు.
► ప్లెయిన్ డ్రెస్ మీదకు ఎలాంటి ఆభరణాలు వేసుకోవాలి అనే టెన్షన్ ఎందుకు? దుపట్టానే హారంగా మార్చేస్తే చాలు.
► పట్టు దుస్తుల మీదకు ఆభరణాలు ఉంటేనే అందంగా ఉంటుందా? ఒక్క నెక్ స్టైల్ మార్చేస్తే ఆభరణాలు తీసికట్టేగా!
► హైనెక్ స్టైల్, అందులోనూ ఎంబ్రాయిడరీ చేసిన బ్లౌజ్ ధరిస్తే ఆభరణాల ఊసే అవసరం ఉండదని ఈ స్టైల్ చెబుతోంది.
► ఆభరణాలను పోలిన ఎంబ్రాయిడరీ బ్లౌజ్ మెడ అంతా కొత్త సింగారాలు పోతే వేరే నగలెందుకు?