designer
-
లవ్ బ్రేస్లెట్..మణికట్టుపై కనికట్టు
రెండు చేతులు కలిస్తే చప్పుడవుతుంది. రెండు మనసులు కలిస్తే ప్రేమవుతుంది. ఇద్దరు మనుషులు కలిస్తే సంపూర్ణ జీవితమవుతుంది. రెండు సగాలు ఒకటిగా అమరితే పరిపూర్ణత వస్తుంది. ఇలాంటి ఒక ఊహకు రూపమిస్తే లవ్ బ్రేస్లెట్ అయింది. లవ్ బ్రేస్లెట్ రూపుదిద్దుకుని యాభై ఏళ్లు దాటింది. న్యూయార్క్‌లో డిజైన్ అయిన ఈ బ్రేస్‌లెట్‌కు లండన్‌లో ఎక్కడలేని ఆదరణ వచ్చింది. ఇప్పటికీ నిత్యనూతనంగా మార్కెట్‌ను ఏలుతోంది. ప్రేమలాగానే అజరామరంగా ప్రేమికులను దగ్గర చేస్తూనే ఉంది. సింబల్ ఆఫ్ లవ్ ‘ప్రేమ లేకపోతే జీవితమే లేదు. ప్రేమలేని జీవితం పెద్ద గుండుసున్న’ అన్నాడు లవ్ బ్రేస్లెట్ రూపకర్త ఆల్డో సిపుల్లో. అతడు 1969లో ఈ డిజైన్ చేశాడు. ఓవల్ షేప్ బ్రేస్లెట్ ఇది. ఇంగ్లిష్ అక్షరం ’సి’ ఆకారంలో ఉన్న రెండు అర్ధభాగాలను కలుపుతూ లాక్ చేయాలి. ఆ లాక్‌ను టైల్ చేయటానికి, ఓపెన్ చేయడానికి చిన్న స్క్రూడ్రైవర్‌ను పోలిన తాళం చెవి కూడా ఉంటుంది. ‘ఒక ‘సి’ నువ్వు, ఒక ‘సి’ నేను... ఇద్దరం కలిస్తే అదే అందమైన బంధం’ అని అబ్బాయి అమ్మాయి ఒకరికొకరు బాస చేసుకుని బ్రేస్‌లెట్‌ని మణికట్టుకు పెట్టి లాక్ చేస్తారు. ‘మన ప్రేమ నిబద్ధతతో కూడినది, ఎప్పటికీ విడిపోకూడద’ని మాటలతో మనసును లాక్ చేసుకుంటారు. ప్రేమ బంగారం లవ్ బ్రేస్‌లెట్‌ని కార్టియర్ అనే ఆభరణాల తయారీ సంస్థ మార్కెట్లోకి తెచ్చింది. దాంతో దీనికి కార్టియర్ లవ్ బ్రేస్లెట్ అనే పేరు వాడుకలోకి వచ్చింది. మొదట్లో గోల్డ్ ప్లేటెడ్ బ్రేస్లెట్లతో మొదలు పెట్టారు. ఆ తర్వాత సాలిడ్ గోల్డ్ 18 క్యారట్లో, ΄్లాటినమ్లో కూడా తయారవుతోంది. బంగారంలో ఎల్లో గోల్డ్, రోజ్ గోల్డ్, వైట్ గోల్డ్ షేడ్లలో వస్తోంది. బ్రేస్లెట్లో లాక్ గుర్తులున్న చోట వజ్రాన్ని పోలిన రోడియం ఫినిషింగ్, అసలైన వజ్రాలు, ఇతర జాతిరాళ్లను పొదగడం వంటి మార్పులు కూడా సంతరించుకుంది. హాలీవుడ్ నటీనటులు ఎలిజబెత్ టేలర్, రిచర్డ్ బర్టన్, అలీ మ్యాక్గ్రావ్, స్టీవ్ మెక్క్వీన్లు ధరించడంతో ఇది పాపులర్ అయింది. ఈ లవ్ బ్రేస్లెట్లు ఎక్కడికక్కడ స్థానికంగా తయారవుతున్నాయి. ఈ విషయంలో కార్టియర్ కొన్ని కంపెనీల మీద కేసు కూడా పెట్టింది. కొద్దిపాటి మార్పులతో కీ లేకుండా నేరుగా ధరించే మోడల్స్ వచ్చాయి. మనదేశంలో కూడా బంగారు ఆభరణాల తయారీదారులు ఈ మోడల్‌ను చేస్తున్నారు. రోజ్‌గోల్డ్ షేడ్‌లో ఇతర లోహాలతో ఫ్యాన్సీ మార్కెట్లోనూ విరివిగా దొరుకుతున్నాయి. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ లవ్ బ్రేస్లెట్ కోసం దుకాణాల్లో వాకబు చేసేవాళ్లు, ఆన్లైన్ లో ఈ కామర్స్ వెబ్సైట్లలో సెర్చ్ చేసే వాళ్ల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా ఏడాదికేడాదికీ మూడింతలు నాలుగింతలుగా పెరుగుతోంది. ఈ లవ్ బ్రేస్లెట్ కూడా ప్రేమలాగానే ప్రకాశిస్తోంది.హాస్పిటల్లో బ్రేస్లెట్ ‘కీ’ లవ్ బ్రేస్లెట్ ఎంతగా ప్రజాదరణ పొందిందో తెలిపే ఉదంతం ఒకటుంది. 1970–80లలో అమెరికాలోని హాస్పిటళ్లలో లవ్ బ్రేస్లెట్ తాళం చెవిని అందుబాటులో ఉంచేవారట. ఇంట్లో బ్రేస్లెట్ ధరించిన తర్వాత ‘కీ’ని ఇంట్లో పెట్టి బయటకు వస్తారు. ప్రమాదవశాత్తూ లేదా మరేదైనా కారణాలతో హాస్పిటల్‌కి వచ్చిన పేషెంట్‌కి అవసరమైన పరీక్షలు చేయాల్సినప్పుడు ఒంటిమీదున్న లోహపు వస్తువులన్నింటినీ తొలగించాల్సి ఉంటుంది. లవ్ బ్రేస్లెట్ కీ కోసం ఇంటికి వెళ్లే పరిస్థితి ఉండదు. కాబట్టి హాస్పిటళ్లు లవ్ బ్రేస్లెట్ కీని సిద్ధంగా ఉంచేవి. -
దటీజ్ సుధీర్..! దూషించే పదాన్నే లగ్జరీ బ్రాండ్‌గా మార్చి..
అవమానిస్తే కుంగిపోయి కూర్చొండిపోతాం. మన బతుకు ఇంతే అనే స్థితికి వచ్చేస్తాం. కానీ కొందరే ఆ అవమానానికి సరైన సమాధానం చెబుతారు. మరోసారి అలా దూషించే సాహసమే చెయ్యనీకుండా చేసి..తప్పు గ్రహించుకునేలా చేస్తారు. బాధపెట్టిన నోళ్ల చేతే గౌరవం పొందేలా చేసుకుంటారు. అలాంటి కోవకు చెందిన వాడే ఈ డిజైనర్ సుధీర్ రాజ్‌భర్. ఏ మాటతో అవమానించి దూషించేవారు. ఆ మాటతోనే గౌరవం పొందడమే గాక..దూషణాలనే ఎలా అలంకారప్రాయంగా మార్చుకోవాలో చూపి అందరికి ఆదర్శంగా నిలిచాడు. అతడి విజయగాథ వింటే..బతుకు విసిరే సవాళ్లకు చావుదెబ్బ కొట్టేలా సమాధానం చెప్పడం ఎలాగో తెలుస్తుంది. మరీ సుధీర్ స్టోరీ ఏంటో చూద్దామా..!భారతీయ కుల వ్యవస్థలో, 'చమర్' అనే పదాన్ని అణగారిన కులాలను దూషించడానికి ఉపయోగించే వారు. పూర్వం దళితులకు కులవృత్తి తోలుపని. వాళ్లని చర్మకారులు అని కూడా పిలుస్తారు. మన ఇప్పుడు చెప్పుకుంటున్న డిజైనర్ సుధీర్ రాజ్ భర్(Sudheer Rajbhar(36)) కూడా ఆ కులానికి చెందినవాడే. అతడు ఉత్తరప్రదేశ్‌లోని తన సొంతూరుకి వెళ్లినప్పుడల్లా "భర్", "చమర్" వటి కులదూషణ పదాలతో అవమానాలపాలయ్యేవాడు. అయితే అక్కడ అది సర్వసాధారణం. అక్కడి ప్రజలకు అదొక ఊతపదంలా ఆ పదాలు నోళల్లో దొర్లేవి. ఇక ఆ మాటలు పడుతున్న దళితులకు కూడా అవి అలవాటైపోయాయి. అందువల్ల వాళ్లెవ్వరూ దీన్ని వ్యతిరేకించే సాహసం కానీ, అలా పిలవొద్దని తెగేసి చెప్పడం గానీ చేసేవారు కాదు. అలాంటి స్థితిలో పెరిగిన సుధీర్ వాటన్నింటిని ఆకళింపు చేసుకునే బతికాడు. అతడి బాల్యం ముంబై(Mumbai)లోని చౌల్‌లో జరిగింది. అక్కడ ఫైన్ ఆర్ట్స్ పూర్తి చేశాడు. కొందరూ బాగా స్థిరపడిన కళాకారుల వద్ద పనిచేసే అవకాశం లభించింది కానీ, కేవలం తన కులం కారణంగా తన పనికి ఎలాంటి క్రెడిట్ రాకపోవడం అనేది కాస్త కష్టంగా ఉండేది సుధీర్‌కి. ముందు తనలాంటి వెనుబడిన కులాల నుంచి వచ్చిన ప్రజలు గౌరవంగా ఉండేలా ఏదైనా చేయాలని గట్టిగా అనుకున్నాడు. సరిగ్గా అదే సమయంలో 2015లో బీఫ్‌పై నిషేధం విధించింది మహారాష్ట్ర ప్రభుత్వం. అప్పటి నుంచి ఈ బలహీన వర్గాలకు ఉపాధి దొరకక కష్టాలు మొదలయ్యాయి. చాలామంది నిరుద్యోగులుగా మారిపోయారు. అప్పుడే ఈ తోలు కళాకారులకు సహాయపడే ఒక మాధ్యమాన్ని తయారు చేయడానికి సుధీర్ ముందుకు వచ్చారు. ఏ పదంతో తన కమ్యూనిటీని తక్కువ చేసి మాట్లాడుతున్నారో ఆ పేరుతోనే ఒక ప్రాజెక్టు చేపట్టి మార్పు తీసుకురావాలని భావించాడు. అలా సుధీర్ 2017లో ఆ తోలు కళాకారులకు ఉపాధి కల్పించేలా "చమర్" అనే స్టూడియో(Chamar Studio)ని ప్రారంభించారు. ఇక్కడ చమర్ అని పదం ఉపయోగించడానికి వివరణ ఇస్తూ..తన కమ్యూనిటీ వాళ్లను ఏ పదంతో అవమానించే ప్రయత్నం చేసేవారో ఆ పదంతోనే స్టూడియోకి నామకరణం చేసినట్లు తెలిపారు. దీనిలో తోలు ఉత్పత్తులకు బదులుగా రీసైకిల్ చేసిన రబ్బరు(recycled waste rubber)తో భర్తీ చేయడం ద్వారా చేతివృత్తులవారి జీవనోపాధిని పునరుద్ధరించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. చమర్ స్టూడియో అత్యంత అందంగా రూపొందించిన మినిమలిస్ట్ బ్యాగులు, వాలెట్లు, బెల్టులు, ఇతర ఉత్పత్తులను విక్రయిస్తుంది. అంతేగాదు డిజైనర్ ఉత్పత్తులను సరమైన ధరలోనే తయారు చేస్తుంది. కాబట్టి అత్యంత ఖరీదైన ధర రూ. 39,000 వరకు ఉండగా, అత్యల్ప ధర రూ. 1,500 నుంచి ప్రారంభమవుతుంది. అలా ఈ స్టూడియో ఉత్పత్తులు ప్రముఖ లగ్జరీ బ్రాండ్(Luxury Brand)గా అనతికాలంలోనే పేరుగాంచాయి. ఈ ఉత్పత్తుల ద్వారా వచ్చే ఆదాయంలో దాదాపు 50% కళాకారులకు, రాజ్‌భర్ ఫౌండేషన్, ది చమర్ ఫౌండేషన్‌కు తిరిగి వెళ్తుంది.సారూప్య బ్రాండ్లతో పోటీని స్థాపించడం కంటే, మార్పు, సాధికారతకు ఒక సాధనంగా కులతత్వ నిందను ఉపయోగించడం ఈ స్టూడియో ఆలోచన అని చెబుతారు సుధీర్. ఈ బ్రాండ్ పేరుతో తయారైన వస్తువుల కారణంగా ప్రజలకు తమను అవమానించే పదం గురించి తెలియడమేగాక, ఆలోచించడం వంటివి చేస్తారు. తద్వారా ఇలాంటి అవమానాలు, దూషణలకు తెరపడుతుందనేది ఆయన ఆశ. భారత ఆర్థిక వ్యవస్థలో అతిపెద్ద భాగం తమ కమ్యూనిటికి చెందిన వారు తయారు చేసే ఉత్పత్తులు. అలాంటప్పడు వారెందుకు ఇంతలా వివక్షకు గురవ్వుతున్నారనే బాధలోంచి పుట్టుకొచ్చిందే ఈ స్టూడియో అని గర్వంగా చెబుతారు సుధీర్. ఆయన తను నేర్చుకున్న కళతో పదిమందికి ఉపయోగపడేలా ముఖ్యంగా తన కమ్యూనిటీకి చెందిన వారు తలెత్తుకుని గౌరవంగా బతికేలా చేస్తున్నాడు. అణగారిన వర్గాలు, బలహీన వర్గాలు అంటూ సానుభూతి, ధన సాయం కాదు..వాళ్లు కూడా మనలాంటి మనుషులే అని గుర్తింపు, గౌరవం అని అంటారు సుధీర్. కళతో మానసిక ఆరోగ్యం నయం చేయడమే కాదు సమాజం తీరుని, దృకపథాన్ని మార్చి బాగు చెయ్యొచ్చని డిజైనర్ సుధీర్ తన చేతలతో చేసి చూపించాడు. అంతేగాదు అవమానానికి ప్రతిఘటించడం బదులు కాదు, అవతలి వాడు చేసిన తప్పును గ్రహించి, పశ్చాత్తాపంతో కుమిలిపోయేలా బతికి చూపాలి అని వెలుగెత్తి చెప్పారు. View this post on Instagram A post shared by CHAMAR (@chamarstudio) (చదవండి: జేఈఈ మెయిన్‌లో రికార్డు రేంజ్ మార్కులు! కానీ ప్లేస్‌మెంట్స్‌కి వెళ్లలేదు..) -
బ్రైడల్ బెస్ట్ ఫ్రెండ్
స్పెషల్ అకేషన్ ఎవరిదైనా, అక్కడ మిమ్మల్ని సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మార్చేస్తుంది స్టయిలిస్ట్ కళ్యాణి. ఇక పెళ్లికూతుళ్ల డ్రెస్ షాపింగ్ నుంచి వాటి ఔట్‌లుక్స్ వరకు ప్రతిదీ సూపర్‌గా ప్రజెంట్ చేసి, బ్రైడల్ బెస్ట్ ఫ్రెండ్‌గా మారుతుంది. ఆ విషయాలే..హైదరాబాద్‌లో పుట్టి, పెరిగిన కళ్యాణి ఫ్యాషన్ జర్నీ, చిన్నప్పుడు అమ్మ కుట్టు మెషిన్‌తో మెదలైంది. పట్టు లంగా వోణీలతో ప్రయోగాలు చేయటం ఆమె అలవాటు. క్రమంగా ఆ అలవాటే ఆసక్తిగా మారి, హమ్స్టెచ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ అండ్ ఇంటీరియర్ డిజైనింగ్ నుంచి ఫ్యాషన్ కోర్సు చేసింది. తర్వాత ‘కళ్యాణి డిజైన్స్’ పేరుతో బొటిక్ ప్రారంభించి, ఫ్యాషన్ డిజైనర్‌గా కెరీర్ మొదలుపెట్టింది. కొద్దిరోజుల్లోనే, తన అద్భుతమైన పనితీరుతో అందరినీ మెప్పించింది. ఇక పెళ్లికూతుళ్ళు అయితే, తమ హల్దీ, మెహందీ, బారాత్ ఇలా ప్రతి స్పెషల్ అకేషన్ కోసం డ్రెస్ సెలక్షన్స్‌కు కళ్యాణిని వెంట తీసుకొని వెళ్లేవారు. అలా చాలామంది బ్రైడల్స్‌కు బెస్ట్ ఫ్రెండ్‌గా మారి, వారి ఫొటో షూట్స్‌కు స్టయిలింగ్ చేయటం మొదలు పెట్టింది. అలా స్టయిలింగ్‌పై పట్టు సాధించి, ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. మ్యూజిక్ ఆల్బమ్స్‌తో పాటు, ‘స్వామిరారా’, ‘కేరింత’, ‘ఎఫ్ 2’, ‘సరిలేరు నీకెవ్వరు’, ‘రాజా విక్రమార్క’ సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేసింది. ఆ స్టయిలింగ్‌కు సెలబ్రిటీలు కూడా ఫిదా అయ్యారు. అలా ఆమె స్టయిలింగ్‌తో గార్జియస్ అనిపించుకున్న వారిలో శ్రీదివ్య, ఐశ్వర్యా రాజేష్, మీనాక్షి చౌదరి, హరితేజ ఉన్నారు. రానా, నిఖిల్, కార్తికేయలాంటి మేల్ యాక్టర్స్‌కూ కళ్యాణి స్టయిలింగ్ చేసింది. ∙దీపిక కొండి -
యువ డిజైనర్‌గా రాణిస్తున్న ముప్పిడి రాంబాబు
కష్టే ఫలి.. కృషి ఉంటే ఏదైనా సాధ్యమే అని నిరూపిత మైన సత్యం. చిన్న తనం నుంచే అదే సూత్రాన్ని తూచ తప్పకుండా పాటిస్తూ.. కష్టపడి పనిచేయడానికి అలవాటుపడి యువడిజైనర్గా డాక్టర్ ముప్పిడి రాంబాబు గుర్తింపు సాధించాడు. బొమ్మల తయారీలో కళాకారుడు తన కళకు నైపుణ్యాన్ని జతచేసి అద్భుతాలు సృష్టిస్తున్నాడు. అంతే కాకుండా శిల్పకారుడు, రచయిత, అధ్యాపకుడుగానూ పనిచేస్తున్నాడు. శిల్పకారుల కుటుంబానికి చెందిన ముప్పిడి చెక్క, తాటి ఆకు, జనపనార, రాతి ఉత్పత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. అనేక కళాకృతులను రూపొందించడంలో దిట్టగా పేరొందారు. ప్రస్తుతం రాయదుర్గంలోని ఎఫ్‌డీడీఐ హైదరాబాద్‌లో ఫ్యాకల్టీగా పనిచేస్తూ ఆర్ట్, క్రాఫ్ట్, డిజైన్ ప్రొడక్ట్ డిజైనింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, ఆర్కిటెక్చర్‌గా గుర్తింపు సాధించారు. – రాయదుర్గంపేద కళాకారుల ఆర్థికాభివృద్ధికి.. పేటెంట్ పొందిన డిజైన్లను పేద కళాకారుల ఆర్థికాభివృద్ధికి చేయూతను అందించాలనేదే నా తపన. మాది కళాకారుల కుటుంబం. కళాకారుల పరిస్థితులు నాకు బాగా తెలుసు. పేటెంట్ పొందిన డిజైన్లు ఉచితంగానే అందిస్తా. వాటి తయారీ గురించి వివరిస్తాను. నిర్మల్, కొండపల్లి బొమ్మల తయారీ దారులు కూడా నూతన డిజైన్లలో బొమ్మలు తయారు చేసేలా తగిన సూచనలు అందించాలన్న లక్ష్యంతో కృషి చేస్తున్నా.. – డాక్టర్ ముప్పిడి రాంబాబు, ఎఫ్‌డీడీఐ ఫ్యాకల్టీ రాయదుర్గం మంజూరైన పేటెంట్స్.. 2025లో టేబుల్‌టాప్ ఆర్టిక్రాఫ్ట్స్, ఫిల్లింగ్ 2024లో లెదర్, వుడ్బర్డ్ టాయ్, ఫిల్లింగ్, వుడ్ పెన్‌స్టాండ్, ఫిల్లింగ్, డాల్, లెదర్ వాల్ హ్యాంగింగ్, న్యూస్‌పేపర్ బాస్కెట్, డెకరేటివ్ యాక్సెసరీస్ ఫర్ టేబుల్‌టాప్ టాయ్స్, ట్రెక్కింగ్ బ్యాక్‌ప్యాక్, జ్యువెలరీ బాక్స్కేస్. పీహెచ్డీ పూర్తి చేసి.. ఆంధ్రప్రదేశ్‌లోని జంగారెడ్డిగూడెంలో నిరుపేద కళాకారుల కుటుంబంలో పుట్టి ఉన్నత విద్యను అభ్యసించారు. మొదటి, రెండో తరాలకు చదువులేదు. కానీ మూడో తరం వారు జీవనోపాధి కోసం చేతి వృత్తులు చేస్తున్నా, తండ్రి సూచన మేరకు పీహెచ్డీ పూర్తి చేశారు. రచయిత, కళాకారుడు, అసిస్టెంట్ ప్రొఫెసర్, హెచ్ఓడీ, అకడమిక్ కన్సల్టెంట్, జూట్బోర్డు ప్యానెల్ డిజైనర్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్, తెలుగు ఫిల్మ్ డైరెక్టర్, ప్రొడక్షన్ డిజైనర్ వంటి ఉద్యోగాలు చేశారు. కేంద్ర జూట్ బోర్డులో జైనర్‌గా పనిచేశాడు. ప్రస్తుతం ఎఫ్‌డీడీఐలో ఫ్యాకల్టీగా చేస్తున్నాడు. అవార్డులు, పురస్కారాలు.. 2024లో పీహెచ్‌డీలో గోల్డ్‌మెడల్ (పోట్టి శ్రీరాములు తెలుగు వర్శిటీ) 2023లో పికాక్ అవార్డు (తిరుపతి ఆర్ట్ సొసైటీ, ఎక్స్‌లెన్స్ ఇన్ రివ్యూ అవార్డు) 2018 జాతీయ సంజీవ్‌దేవ్ అవార్డు2017లో ప్రమోద్ కుమార్ చటర్జీ జాతీయ అవార్డు 2016లో విశిష్ట కళా సేవారత్న, రోటరీ యువజన అవార్డు, గురుబ్రహ్మ అవార్డు.వీటితో పాటు మరికొన్ని అవార్డులు.. పేటెంట్ల సాధనలో తనకంటూ ప్రత్యేకత సాధించిన ఎఫ్‌డీడీఐ ఫ్యాకల్టీ డాక్టర్ రాంబాబు -
లగ్జరీ ఇళ్లల్లో కొత్త ట్రెండ్..
ఆధునికత, విలాసవంతమైన జీవనశైలికి యువ గృహ కొనుగోలుదారులు ఆసక్తి చూపిస్తున్నారు. లగ్జరీ కాదు.. అంతకుమించి కోరుకుంటున్నారు. దీంతో 4 వేల నుంచి 15 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అపార్ట్మెంట్లను నిర్మిస్తున్నారు. ఇవి విశాలంగా ఉంటున్నాయే తప్ప సేవలపరంగా యువ కస్టమర్లలో అసంతృప్తి ఉంది. వీరిని సంతృప్తి పరిచేలా యువ డెవలపర్లు బ్రాండెడ్ హౌసింగ్‌లను నిర్మిస్తున్నారు. అగ్రశ్రేణి ఆతిథ్య సంస్థలతో కలిసి బ్రాండెడ్ రెసిడెన్సీ ప్రాజెక్ట్‌లను చేపడుతున్నారు. ఇప్పటివరకు ముంబై, బెంగళూరు, గుర్గావ్ వంటి నగరాలకే పరిమితమైన ఈ తరహా ప్రాజెక్ట్‌లు హైదరాబాద్‌లోనూ నిర్మితమవుతున్నాయి. – సాక్షి, సిటీబ్యూరోమారియట్, తాజ్, లీలా, ఇంటర్కాంటినెంటల్ వంటి అగ్రశ్రేణి ఆతిథ్య సంస్థలతో కలిసి విలాసవంతమైన అపార్ట్మెంట్లను నిర్మించడమే ఈ రెసిడెన్సీల ప్రత్యేకత. డిజైనింగ్, ఆర్కిటెక్చర్, ఎలివేషన్స్, విస్తీర్ణం, వసతులు, సేవలు.. అన్నీ టాప్ క్లాస్‌గా ఉంటాయి. బ్రాండెడ్ రెసిడెన్సీ అంటే కేవలం ప్రాపర్టీని కొనుగోలు చేయడం కాదు.. అంతర్జాతీయ జీవనశైలి అనుభూతిని పొందడం.బ్రాండెడ్ రెసిడెన్సీలు అంటే? స్టార్ హోటల్ సేవలు, అపార్ట్మెంట్ కలిపి ఉండే మిశ్రమ వినియోగ ప్రాజెక్ట్‌లనే బ్రాండెడ్ రెసిడెన్సీలు అంటారు. ఇందులో లేఔట్ స్థలంలో నివాసాల కోసం ప్రత్యేకంగా ఒక టవర్ ఉంటుంది. పక్కనే మరో టవర్‌లో హోటల్ ఉంటుంది. నివాసితులకు సేవలన్నీ ఆతిథ్య సంస్థలే అందిస్తాయి. కొన్ని ప్రాజెక్ట్‌లలో దిగువ అంతస్తుల్లో హోటల్, ఎగువ అంతస్తులో నివాస యూనిట్లు ఉంటాయి. నివాసితులకు ప్రత్యేక యాప్ ఉంటుంది. దాంట్లో నుంచి హోటల్లోని ఫుడ్, స్పా, సెలూన్ వంటి ఆర్డర్ చేయవచ్చు. వాళ్లే అపార్ట్‌మెంట్‌కు వచ్చి సర్వీస్ చేస్తారు. బ్రాండెడ్ గృహాల నిర్వహణ మొత్తం ఆతిథ్య సంస్థల ఆపరేటర్లే చూసుకుంటారు. హెచ్ఎన్ఐ, ప్రవాసులు కస్టమర్లు.. కొనుగోలుదారులకు అంతర్జాతీయ జీవనశైలి, డెవలపర్లకు అధిక రాబడి అందించే ప్రీమియం బ్రాండెడ్ గృహాలకు ఆదరణ పెరిగింది. ఫైవ్, సెవెన్ స్టార్ హోటళ్లు బ్రాండెడ్ రెసిడెన్సీల విభాగంలోకి ఎంట్రీ ఇచ్చాయి. దీంతో హెచ్ఎన్ఐలు(హై నెట్‌వర్త్ ఇండివిడ్యు వల్స్), ప్రవాసులు, బిజినెస్ టైకూన్లు, సినీ, క్రీడా సెలబ్రిటీలు డిజైనర్ హోమ్స్‌కు ఆసక్తి చూపిస్తున్నారు. బ్రాండెడ్ రెసిడెన్సీ కస్టమర్లు రెండు, లేదా మూడో గృహ కొనుగోలుదారులై ఉంటారు. దీంతో వీరికి ఆధునిక వసతులే అధిక ప్రాధాన్యత. ఎవరెక్కువ, వినూత్న, విలాసవంతమైన వసతులు అందిస్తారో అందులో కొనుగోలు చేస్తారు.ఎక్కడ వస్తున్నాయంటే.. దేశంలోని విలాసవంతమైన మార్కెట్లో హైదరాబాద్ వాటా 10 శాతంగా ఉంది. మన దేశంలో బ్రాండెడ్ హౌసెస్ 2,900 యూనిట్లు ఉండగా.. గ్లోబల్ మార్కెట్లో 3 శాతం వాటాగా నమోదైంది. అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు ఉన్న ప్రాంతాల్లోనే ఈ తరహా ప్రాజెక్ట్‌లకు డిమాండ్ ఉంటుంది. కోకాపేట, నియోపొలిస్, హైటెక్‌సిటీ, రాయదుర్గం, నానక్‌రాంగూడ, పుప్పాలగూడ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి ప్రీమియం ప్రాంతాల్లో ఈ తరహా నిర్మాణాలు వస్తున్నాయి. శ్రీఆదిత్య హోమ్స్, బ్రిగేడ్ వంటి పలు నిర్మాణ సంస్థలు బ్రాండెడ్ రెసిడెన్సీలను నిర్మిస్తున్నాయి. వీటి ధరలు రూ.6–8 కోట్ల నుంచి ప్రారంభమవుతాయి.ప్రైవసీ, భద్రత.. కరోనా తర్వాత విలాసవంతమైన ఇళ్ల అమ్మకాలు పెరుగుతూ ఉన్నాయి. మిగతా విభాగంలోని ఇళ్లపై ప్రభావం పడినా.. అత్యంత లగ్జరీ ఆవాసాలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. ఐటీ, ఫార్మా, తయారీ రంగంతో పాటు కాస్మోపాలిటన్ కల్చర్‌తో నగరంలో లగ్జరీకి మించి జీవనశైలి కోరుకుంటున్నారు. సెవెన్ స్టార్ హోటల్లో మాదిరి గ్రాండ్ లాంజ్, డబుల్ హైట్ బాల్కనీ, హోమ్ ఆటోమేషన్, స్కై వ్యూ, స్పా, స్కై లాంజ్, మినీ థియేటర్, రూఫ్‌టాప్ డైనింగ్, ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్, ప్రైవసీ, భద్రత అన్ని ఉంటాయి.ఎక్కువ గ్రీనరీ, ఓపెన్ స్పేస్.. ఆర్కిటెక్చర్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ డిజైన్, పర్యావరణహితంగా ఉండేలా అంతర్జాతీయ డిజైనర్లతో తోడ్పాటు అందిస్తారు. ఈ ప్రాజెక్ట్‌లలో విశాలమైన బాల్కనీ, గ్రీనరీ, ఓపెన్ స్పేస్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. దీంతో సాధారణ గృహాలతో పోలిస్తే రెసిడెన్సీలలో 5–7 డిగ్రీల ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. ఇంట్లోకి గాలి, వెలుతురు ధారాళంగా వస్తాయి. వేర్వేరుగా ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ద్వారాలు, ప్రతి అపార్ట్‌మెంట్‌కు ప్రత్యేక మార్గం ఉంటుంది. అపార్ట్మెంట్ ఫేసింగ్ ఎదురెదురుగా ఉండదు. దీంతో పూర్తిగా ప్రైవసీ ఉంటుంది. ఒకేరకమైన అభిరుచులు, జీవన శైలి కోరుకునే నివాసితులు ఒకే గేటెడ్ కమ్యూనిటీలో ఉండటంతో వీరి మధ్య సామాజిక సంబంధాలు బలపడతాయి. -
డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం: స్టైలిష్ లుక్‌లో మెలానియా ట్రంప్
డొనాల్డ్ ట్రంప్(Donald Trump) అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమం వాషింగ్టన్ డీసీ క్యాపిటల్ హిల్ రోటుండా ఇండోర్‌లో జరిగింది. ఈ వేడుకలో ప్రపంచ కుభేరులు, అతిపెద్ద పారిశ్రామిక వేత్తలు, ట్రంప్ మంత్రి వర్గంలోని నామినేటెడ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ వేడుకలో ఉపాధ్యాక్షుడు ఉషా చిలుకూరి, జేడీ వాన్స్ దంపతులు తమదైన డ్రెస్సింగ్ స్టైల్‌తో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. అలాగే ట్రంప్ సతీమణి, అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్(Melania Trump) డ్రెస్సింగ్ స్టైల్ కూడా హైలెట్‌గా నిలిచింది. మరీ ఆ డ్రెస్ విశేషాలేంటో చూద్దామా..!.ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవం కోసం ఫ్యాషన్ డిజైనర్ ఆడమ్ లిప్పెస్ రూపొందించిన ఆల్-అమెరికన్ ఎంసెంబుల్ను ధరించారు. ఇది అమెరికాలో తయారైన క్లాత్‌తో రూపొందించిన డ్రెస్. నేవీ సిల్క్ ఉన్ని కోటు, నేవీ సిల్క్ ఉన్ని పెన్సిల్ స్కర్ట్, ఐవరీ సిల్క్ క్రేప్ బ్లౌజ్‌లతో హుందాగా కనిపించారు. ఆ డ్రెస్‌కి తగిన విధంగా ఎరిక్ జావిట్స్ రూపొందించిన బోటర్-స్టైల్ టోపీలో మెరిశారు. నిజానికి అమె ఎక్కువగా యూరోపియన్ లగ్జరీ డిజైనర్ వేర్లను ధరిస్తారు. అలాంటి ఆమె తొలిసారి అమెరికన్ డిజైనర్లు(American Designer) రూపొందించిన డ్రెస్‌లతో తళుక్కుమన్నారు. ఆమె ఎక్కువగా రిటైల్ షాపింగ్ చేయడానికే ఇష్టపడతారు. ఆమె సింపుల్‌గా సాదాసీదాగా ఉండేందుకు ప్రయత్నిస్తుంది. ట్రంప్ మొదటిసారి అధ్యుక్షుడు అయినప్పడు ఆమె ఫ్యాషన్ డిజైర్‌లకు దూరంగా ఉండేవారు. తనకునచ్చిన స్టైలిష్ వేర్‌లోనే కనిపించేవారు. అలాంటిది తొలిసారిగా తన భర్త విజయాన్ని ఆస్వాదిస్తున్నట్లుగా ఈ వేడుకలో డ్రెస్సింగ్ స్టైల్‌కి ప్రాధాన్యత ఇచ్చారు. ప్రత్యేకంగా అమెరికన్ డిజైనర్ల బృందం ఫ్యాషన్‌ని అనుసరించారు. ఈ ఫ్యాషన్ శైలి అనేది వ్యక్తి ఆనందాన్ని, నమ్మకాన్ని ప్రస్ఫుటుంగా ప్రతిబింబిస్తాయి కదూ..!. గతంలో ఇలానే మరికొంతమంది .. గతంలో ఇలానే 2021లో అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్(Jill Biden) ఐక్యతను సూచించేలా ఐవరీ కష్మెరె కోటుని ధరించారు. ఆ డిజైనర్ వేర్‌పై సమాఖ్య చిహ్నమైన పూల ఎంబ్రాయిడీ ఉంటుంది. ఇలానే 1977లో నాటి అమెరికా అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ భార్య రోసాలిన్ కార్టర్ తన భర్త ప్రమాణ స్వీకారోత్వ వేడుకల్లో ఫ్యాషన్‌గా ఉండాలనుకంది. ఆమె బంగారు ఎంబ్రాయిడరీ తోకూడిని హై నెక్ బ్లూ షిఫాన్ గౌనుని ధరించింది. అయితే ఆ సమయంలో ఆ డిజైనర్‌వేర్ పాతది అని విమర్శల వెల్లువ వచ్చింది. అయితే ప్రథమ మహిళలు ఎలాంటి డ్రెస్‌లు అయినా ధరిస్తారు. ఫ్యాషన్‌ని మనమే సెట్ చేయాలి గానీ అది మనల్ని మార్చకూడదనేది వారి ఆంతర్యం. ప్రభావవంతమైన వ్యక్తులే రీ సైకిల్ చేసిన దుస్తులకు ప్రాధాన్యత ఇస్తేనే కదా సామాన్య ప్రజలు ఇలాంటి ఫ్యాషన్‌ని అనుకరించగలరనేది వారి భావన కాబోలు. అంతేగాదు 2009లో మిచెల్ ఒబెమా డిజైనర్ జాసన్ వు డిజైన్ చేసిన షిఫాన్ వన్-షోల్డర్ గౌనులో మెరిసిది. ఆమె యువ డిజైనర్లకు ప్రోత్సహించేందుకేనని చెప్పి అందరిని ఆలోచింప చేశారామె. ఆ డ్రెస్‌ని కుట్టడానికి ఎన్ని రాత్రుళ్లు నిద్రలేకుండా కష్టపడ్డాడనేది ఈడ్రైస్ని మరింత అందంగా ప్రత్యేకంగా చేసిందని సదరు డిజైనర్‌ని ప్రశంసించారు మిచెల్ ఒబామా. (చదవండి: ట్రంప్ విందుకి కాంచీపురం చీరకట్టులో నీతా అంబానీ..! ఏకంగా 22 ఏళ్ల నాటి..) -
పండగ కళ ఉట్టిపడేలా థీమ్ ఆర్ట్‌తో వెలిగిపోండి..!
గ్రాండ్‌గా వెలిగిపోయే వివాహ వేడుకైనా హుందాగా కదిలే సీమంతం ఫంక్షన్ అయినా ఆధునికంగా ఆలోచించే అమ్మాయిలు ఒకచోట చేరినా ఆ సందర్భంలో తమదైన ప్రత్యేకతను చూపాలనుకుంటారు. అందులో మరింత స్పెషల్‌గా నిలుస్తుంది ఫ్యాబ్రిక్ పెయింటింగ్(Fabric Painting) ఫ్యాషన్ రంగంలో(Fashion) హ్యాండ్ వర్క్(Hand Work) ఎప్పుడూ అగ్రస్థానంలో ఉంటుంది. అవే ప్రతియేటా రూపును మార్చుకొని కొత్తగా మన మదిని ఆకట్టుకుంటాయి. వాటిలో ఫ్యాబ్రిక్ పెయింటింగ్‌లు ఈ ఏడాది స్పెషల్‌గా సందడి చేయనున్నాయి. పండగ థీమ్మనవైన పండగల వేళ సంప్రదాయం ఉట్టిపడాలంటే అందుకు తగినట్టు వేషధారణలోనూ ఆ కళ కనిపించాలని కోరుకుంటున్నారు. పండగలో ప్రత్యేకంగా నిలిచే అమ్మవార్ల రూపాలు, పాదాలు, ఆభరణాలు, ముగ్గులు పెయింటింగ్ చేయించడం వీటి ప్రత్యేకత. వీటిలో సాదాసీదాగా కనిపించే పెయింటింగ్స్ కొన్ని అయితే పెయింటింగ్ కాంబినేషన్‌తో చేసే ఎంబ్రాయిడరీ, మగ్గం వర్క్, ప్యాచ్‌వర్క్‌లు అదనంగా జత కలుస్తున్నాయి.దంపతులకు ప్రత్యేకంవివాహ వేడుకలతో వధూవరుల దుస్తుల డిజైన్లు రిచ్‌గా కనిపించాలని కోరుకోని వారుండరు. దానితో పాటు తమ పెళ్లి ప్రత్యేకం అని చూపడానికి ఐదు రోజుల పెళ్లిలో ఏదో ఒకరోజు వధూవరుల రూపాలను పెయింటింగ్‌గా చిత్రించి, వాటిని ధరించడానికి ముచ్చట పడుతున్నారు. వీటిలో వారి వారి బడ్జెట్లను బట్టి ఎంపికలు ఉంటున్నాయి. సీమంతం వేడుకరాబోయే బిడ్డకు ఆహ్వానం పలకడానికి, తల్లీ–బిడ్డ క్షేమం కోసం చేసే ఈ వేడుకను... పెయింట్ చేసిన శారీస్, లెహంగాలతో ఎంతో సుందరంగా మార్చేస్తున్నారు. యశోదాకృష్ణ, గోపికా కృష్ణ, చిన్నారి ΄ాదాలు, కామధేను వంటి డిజైన్లు దుస్తులను అద్భుతంగా మార్చేస్తున్నాయి. తల్లిదండ్రులు–పిల్లల కాంబినేషన్ పెయింటింగ్స్ కూడా ఈ థీమ్‌లో చోటుచేసుకుంటున్నాయి.మోడరన్ మగువడెనిమ్స్, షర్ట్స్‌తో క్యాజువల్ వేర్‌గానూ, ఫ్రెండ్లీ గెట్ టు గెదర్ పార్టీల్లోనూ ప్రత్యేకంగా నిలవడానికి తమదైన థీమ్‌తో డిజైన్ చేయించుకుంటున్నారు. తమలోని ఆధునిక భావాలను డ్రెస్సింగ్ ద్వారా చూపుతున్నారు. దీనిలో భాగంగా పెయింటింగ్ చేసిన ఫ్యాబ్రిక్ ΄్యాచ్వర్క్ ఈ తరాన్ని బాగా ఆకట్టుకుంటోంది. -
మహారాణిలా పీవీ సింధు : బ్యాడ్మింటన్-ప్రేరేపిత డిజైనర్ లెహంగా విశేషాలు
భారత బ్యాడ్మింటన్ సూపర్ స్టార్ పీవీ సింధు పెళ్లి వేడుక లేటెస్ట్ సెన్సేషన్ అని చెప్పవచ్చు. చాలా సాదాసీదాగా, ఆట తప్ప, మరో ధ్యాస లేదు అన్నట్టుగా కనిపించే సింధు ఫ్యాషన్‌లో కూడా పర్ఫెక్ట్ అనిపించుకుంది. నిశ్చితార్థం మొదలు, ప్రీ-వెడ్డింగ్ షూట్, హల్దీ, సంగీత్, మూడు ముళ్ల ముచ్చట, రిసెప్షన్ ఇలా ప్రతీ వేడుకలో చాలా ఎలిగెంట్‌గా, సూపర్ స్టైలిష్‌గా మెరిసిపోయింది.తన చిరకాల స్నేహితుడు వెంకట దత్త సాయితో పీవీ సింధు వివాహ వేడుక (డిసెంబర్ 22)అత్యంత సుందరంగా, స్టైలిష్‌గా జరిగింది. గ్లామరస్ బ్రైడల్ లుక్‌తో అందర్ని కట్టి పడేసిందీ జంట. 'మాచీ-మ్యాచీ' లుక్స్‌తో స్వీట్ అండ్ క్యూట్ కపుల్ అనిపించుకున్నారు. తాజాగా ప్రీవెడ్డింగ్ షూట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఇందులో సీ గ్రీన్ డిజైనర్ లెహంగాలో అందంగా కనిపించింది. మరొక సెట్ చిత్రాలలో, బ్యాడ్మింటన్-ప్రేరేపిత పాస్టెల్ బ్లూ లుక్‌లో మెరిసారు.ఈ ఎథ్నిక్ పాస్టెల్ కలర్ లెహంగా డిజైనర్ మసాబా కలెక్షన్లోనిది. అంబర్ బాగ్ టిష్యూ లెహంగా సెమీ-షీర్ స్టైల్‌తో గోల్డ్-టోన్డ్ ఫాయిల్ ప్రింట్లతో వచ్చింది. దీని జతగా ఎంబ్రాయిడరీ దుపట్టా మరింత అందంగా అమిరింది. ఇక ఆభరణాల విషయానికి వస్తే లేయర్డ్ నెక్లెస్‌లు, స్టేట్మెంట్ చెవిపోగులు అతికినట్టు అమరాయి. మహారాణిలాంటి ఆమె లుక్‌తో సమానంగా దత్త సాయి మ్యాచింగ్ లుక్‌లో అదిరిపోయాడు. గోల్డ్ టోన్ ప్రింట్లతో కూడిన 'అంబర్ బాగ్' కుర్తా సంప్రదాయ పంచెకట్టుతో స్పెషల్‌గా కనిపించాడు. View this post on Instagram A post shared by Masaba 🤎 (@masabagupta)ఇంకా చాలా విశేషాలుఈ కస్టమ్ క్రియేషన్‌లో బ్యాడ్మింటన్ రాకెట్లు, షటిల్ కాక్స్, బంగారు పతకాలు (టోక్యో , రియో ఒలింపిక్స్‌లో సింధు సాధించిన విజయాలకు ప్రతీక) ఉంగరాలు, పేపర్ ఎయిర్‌ప్లేన్ మోటిఫ్స్, సొగసైన జడ స్టైల్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచాయి. -
'ఇలాంటివి ఇండియాలో కూడా దొరికితే'.. పూరి జగన్నాధ్ ఆసక్తికర సందేశం
టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ చివరిసారిగా డబుల్ ఇస్మార్ట్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. రామ్ పోతినేని, కావ్య థాపర్ జంటగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అంతగా రాణించలేకపోయింది. ఈ మూవీలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించారు. ఈ సినిమాను హీరోయిన్ ఛార్మి, పూరి జగన్నాధ్ సంయుక్తంగా నిర్మించారు.ఇక సినిమాల విషయం పక్కనపెడితే పూరి జగన్నాధ్ తన మోటివేషనల్ వీడియోలతో అభిమానులను అలరిస్తుంటారు. పూరి మ్యూజింగ్స్ పేరుతో తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా వీటిని విడుదల చేస్తుంటారు. ఇటీవల వరుసగా వీడియోలు రిలీజ్ చేస్తున్న డైరెక్టర్ పూరి జగన్నాధ్ తాజాగా మరో ఆసక్తికర సబ్జెక్ట్‌తో అభిమానులను పలకరించారు. అదేంటో మీరు చూసేయండి.అమెరికాకు చెందిన ప్రముఖ డిజైనర్ ఏంజెలా లూనా తయారు చేసిన జాకెంట్ గురించి ఈ వీడియోలో ప్రస్తావించారు. మనదేశంలో ఎలాంటి నీడ లేని వారికి ఇది చాలా ఉపయోగపడుతుందని తెలిపారు. ఎవరైనా ఇండియాలో వీటిని అందుబాటులోకి తీసుకొస్తే ఎందరో అభాగ్యులకు మేలు చేసిన వారవుతారని వీడియోలో మాట్లాడారు.పూరి జగన్నాధ్ తన మ్యూజింగ్‌లో మాట్లాడుతూ..' యుద్ధాల కారణంగా ఇంటిని వదిలి కట్టుబట్టలతో పెళ్లాం పిల్లలను తీసుకుని వేరే ప్రాంతాలకు వలసపోతున్న వాళ్లు ఎంతో మంది ఉన్నారు. ఇతర దేశాల్లో వీరికి ఇల్లు అనేదే ఉండదు. ముఖ్యంగా నైజీరియా, హోండురస్, ఇరాక్, సూడాన్, ఇండియా, చైనా, ఇథియోపియా, కాలిఫోర్నియా, న్యూయార్క్ ఫ్లోరిడాలో ఇల్లులేని వాళ్లు చాలా మంది ఉన్నారు. ఇండియాలో 4 కోట్ల మంది అడుక్కు తినేవాళ్లున్నారు. ప్రపంచ జనాభాలో ఐదుశాతం మందికి ఇల్లులేదు. వీళ్ల కష్టాలు వర్ణనాతీతం.కొంతమంది వడదెబ్బ, తీవ్రమైన చలికి తట్టుకోలేక చనిపోతున్నారు. ఇల్లు వాకిళ్లు వదిలేసి ఒక మనిషి, తనకు అవసరమైనవి మాత్రమే తీసుకుని ఒక బ్యాగ్‌లో వేసుకుని బయలు దేరాల్సి వస్తే ఏం వేయాలో తెలియదు. దేన్నీ వదులుకోలేం. అలాంటి బ్యాగ్ చాలా బరువుగా ఉంటుంది. దాన్ని పట్టుకుని మోసుకుంటూ నడవాలంటే ఎంత కష్టం. బట్టలు, గిన్నెలు, స్టవ్ చాలా బరువు ఉంటాయి. ఆఖరికి దుప్పటి పట్టుకెళ్లాలన్న కొన్నిసార్లు కష్టంగానే ఉంటుంది. ఇక టెంట్‌ను మోసుకువెళ్లే శక్తి ఉండదు' అని మాట్లాడారు.పూరి చెబుతూ.. 'ఇలాంటి వారు వసతి సౌకర్యం లేకపోవడం వల్ల ఎంతో మంది చనిపోతున్నారు. ఇలాంటి వారి కోసం న్యూయార్క్‌కు చెందిన ఏంజెలా లూనా అనే డిజైనర్ అద్బుతమైన ఐడియాతో సరికొత్త జాకెట్ చేసింది. దాని పేరే జాకెంట్. జాకెట్‌ను, టెంట్‌ను కలిపి చేసిన డిజైన్. దీన్ని మీరు జాకెట్లా వేసుకోవచ్చు. అలా ఎక్కడైనా పడుకోవాల్సి వస్తే.. టెంట్‌గా మారిపోతుంది. ఇది ఎంతో మంది సిరియా శరణార్థులను కాపాడింది. చాలా మంది డిజైనర్లు సెలబ్రిటీలు, డబ్బున్న వాళ్లకోసం కోసం లక్షలు, కోట్లు ఖర్చు పెట్టి కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తారు. వాటన్నింటి కంటే గ్రేట్ డిజైన్ ఇది. ఒక్కసారి మీరు గూగుల్ చేసి ఏంజెలా లూనా జాకెంట్ డిజైన్ చూడండి. దీన్ని అందరూ ప్రశంసించాలి. అతి తక్కువ ధరకే అందుబాటులో ఉంది. అయిే ఈ జాకెంట్ ఇండియాలోకి రాలేదు. ఇలాంటివి మనదేశంలో వస్తే అడక్కునేవాళ్లకు దుప్పట్లు గిప్ట్గా ఇవ్వొచ్చు. ఏదైనా కంపెనీ వీటిని ఇండియాలో వీటిని పరిచయం చేస్తే బాగుంటుందని ఆశ. ఇదే ఐడియాను తీసుకుని తయారు చేసినా, సంతోషమే. ఎంతో మందిని కాపాడిన వాళ్లు అవుతారు. త్వరలోనే జాకెంట్ భారత్‌లో దొరుకుతుందని ఆశిస్తున్నా'అని అన్నారు. -
మానుషి చిల్లర్ బెడ్రూం పోజులు.. డైమండ్ లాంటి నవ్వు (ఫొటోలు)
-
ఫ్యాషన్.. ప్రయాణం.. ఒరు పెన్!
అభిరుచినే వృత్తిగా చేసుకునే అవకాశం కొందరికే దొరుకుతుంది. ఆ కొందరిలో ఫ్యాషన్ డిజైనర్, స్టయిలిస్ట్ ప్రజన్య ఆనంద్‌ను చేర్చవచ్చు! అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచనలకు రూపం ఇస్తూ ఫ్యాషన్ ప్రపంచంలో తన సిగ్నేచర్‌ను క్రియేట్ చేసుకున్న ఆమె గురించి..చెన్నైకి చెందిన ఒరు పెన్ (ఒక వనిత) ప్రజన్య. ఆమెకు ఫ్యాషన్ అన్నా, ప్రయాణాలు అన్నా చాలా ఇష్టం. చిన్నప్పుడు తన తోబుట్టువులకు, ఫ్రెండ్స్‌కి రకరకాల జడలువేసేది. మేకప్ చేసి వాళ్లను మురిపించి, తాను మురిసిపోయేది. ఊహ తెలిశాక ప్రయాణాల్లోని మజాను ఆస్వాదించసాగింది. కాలేజ్ డేస్ నుంచి సోలో ట్రావెల్‌ను స్టార్ట్ చేసింది. అలా ప్రయాణాల్లో తనకు పరిచయమైన కళలు, తెలుసుకున్న సంస్కృతి, కనిపించిన ఒరవడి అన్నిటితో స్ఫూర్తి పొంది సరికొత్త డిజైన్స్‌కు రూపమిచ్చేది. అప్పుడనుకుంది తన కాలింగ్ ఫ్యాషనే అని! సెకండ్ థాట్ లేకుండా పర్ల్ అకాడమీలో చేరింది. ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేసింది. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్స్ దగ్గర ఇంటర్న్‌గా జాయిన్ అయి పనిలో మెలకువలను నేర్చుకుంది. తర్వాత అవకాశాల వేట మొదలుపెట్టింది. నాలుగేళ్లు ఫ్యాషన్ ఇండస్ట్రీ కారిడార్లోనే గడిపింది. అవకాశాలను అందుకోవడం అంత సులువుకాదని గ్రహించింది. దాంతో దాన్నో సవాలుగా తీసుకుంది. ప్రతి అడ్డంకిని లక్ష్యానికి మెట్టుగా మార్చుకుంది. ఆ పట్టుదలకు చాన్స్‌లు చలించి.. ప్రజన్య చెంత చేరాయి. తన డిజైన్స్కున్న ప్రత్యేకతను చూపింది. కాస్ట్యూమ్స్‌లోనే కాదు జ్యూల్రీ, మేకప్, హెయిర్ స్టయిల్.. ఇలా స్టయిలింగ్కి సంబంధించిన ప్రతి రంగంలోనూ తనకున్న పట్టును ప్రదర్శించింది. నాలుగేళ్ల నిరీక్షణ విలువేంటో చాటింది. ‘ప్రజన్య’ పేరుతో లేబుల్నూ లాంచ్ చేసి, బాలీవుడ్ సెలబ్రిటీలను ఆకర్షించింది. తన అద్భుతమైన డిజైన్స్‌తో ఐశ్వర్యా రాయ్, నయనతార, హృతిక్ రోషన్ల మెప్పు పొందింది. ఇంకెందరికో అభిమాన స్టయిలిస్ట్ అయింది. ‘డిజైన్డ్ స్టూడియో’ పేరుతో ఫ్యాషన్ స్టూడెంట్స్‌కి ట్రైనింగ్ ఇవ్వటమూ ప్రారంభించింది. ఔత్సాహికుల కోసం వర్క్‌షాప్స్‌ను కూడా నిర్వహిస్తోంది ప్రజన్య. -
మాధురీ నవ్వులతో పోటీ పడే ఇంటి కళ
బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్, డాక్టర్ శ్రీరామ్ మాధవ్ నేనే నివాసం ఉంటున్న ఇల్లు కళ, సాంకేతికతల మేళవింపులా ఉంటుంది. దీనిని డిజైనర్ అపూర్వ ష్రాఫ్ రూపోందించారు.ముంబై అపార్ట్మెంట్లోని 53వ అంతస్తులో మాధురీ దీక్షిత్ ఇంటి నుంచి ఒక ట్యూన్ వినిపిస్తుంటుంది. అది ఆమె నడక, హుందాతనం, అందాన్ని కూడా కళ్లకు కట్టేలా చేస్తుంది అంటారు ఆ ట్యూన్ విన్నవాళ్లు. బాలీవుడ్లో 90ల నాటి సినిమా హిట్లలో తేజాబ్ లో మోహిని, దిల్ లో మధు, అంజామ్ లో శివాని, హమ్ ఆప్కే హై కౌన్ లో నిషా, దిల్ తో పాగల్ హై లో పూజ ... వంటి. ఇంకా ఎన్నో పాత్రలతో ఆమె నటన నేటికీ ప్రశంసించబడుతూనే ఉంటుంది. మాధురి ఆమె భర్త డాక్టర్ శ్రీరామ్ మాధవ్ నేనే ముంబైలోని ఎతై ్తన భవనంలో తమ అధునాతన నివాసాన్ని రూపోందించడానికి ప్రఖ్యాత లిత్ డిజైన్ సంస్థకు చెందిన ఆర్కిటెక్ట్ అపూర్వ ష్రాఫ్‌ను పిలిచారు.సింప్లిసిటీఈ జంట కోరిన వాటిని సరిగ్గా అందించడంలో వారు చెప్పిన స్పష్టమైన సంక్షిప్త వివరణ ష్రాఫ్‌కు బాగా సహాయపడింది: ‘సమకాలీన సౌందర్యాన్ని మినిమలిస్ట్ అండర్ టోన్ తో మిళితం చేసేలా సరళ రేఖలు, అందమైన రూపాలు, హుందాతనాన్ని కళ్లకు కట్టే అభయారణ్యం...’ ఇవి ఇంటి యజమానుల శక్తివంతమైన వ్యక్తిత్వాలను చూపుతుందని వారిని ఒప్పించింది ష్రాఫ్. మాధురి, డాక్టర్ మాధవ్ ‘సింప్లిసిటీ’ని కోరుకున్నారు. ఇది ఇల్లులాగా అనిపించే టైమ్‌లెస్ టెంప్లేట్. మాధురి ఈ విషయాలను షేర్ చేస్తూ, ‘ప్రశాంతత, స్పష్టత, సౌకర్యాన్ని రేకెత్తించే వాతావరణాన్ని సృష్టించడం కూడా ఒక ఆర్ట్’ అంటారామె.హుస్సేన్ కళాకృతి40 సంవత్సరాల సినీ కెరీర్లో మాధురీ దీక్షిత్ లక్షలాది మంది ఆరాధకులతో పాటు, ఎంతో మంది ఊహాలోకపు రారాణి. వారిలో ఎమ్.ఎఫ్.హుస్సేన్ ఒకరు. భారతదేశపు ప్రసిద్ధ చిత్రకారుడు మక్బూల్ ఫిదా హుస్సేన్ మాధురి కోసం ప్రత్యేకంగా చిత్రించిన విసెరల్ వైబ్రెంట్ పెయింటింగ్‌లు ఇంటి డిజైన్ భాషకు అద్దంలా నిలిచాయి. విక్రమ్ గోయల్ వియా హోమ్ ద్వారా అలంకరించిన ప్రవేశ ద్వారం, హుస్సేన్ పవిత్రమైన గణేషులచే ఆకర్షణీయంగా ఉంటుంది. ఇది మాధురి వినయపూర్వకమైన ్రపారంభాన్ని గుర్తుచేసే స్వాగతతోరణంలా భాసిల్లుతుంది. ఇంట్లో ప్రతిచోటా హుస్సేన్ కళాకృతి సంభాషణలనుప్రోత్సహిస్తుంది. మాధురి వాటి గురించి మరింత వివరింగా చెబుతూ ‘హుస్సేన్ జీ మా ఇంటి గోడలకు రంగులతో కళ తీసుకురావాలనుకున్నాడు. కానీ నేను వద్దాన్నాను. దీంతో నాకు అత్యుత్తమ చిత్రాలను చిత్రించి, ఇచ్చాడు. అతను ఉపయోగించిన రంగులను ఇప్పటికీ ప్రేమిస్తున్నాను. ఆ కళ ఇలా బయటకు కనిపిస్తుంది’ అని వెల్లడించింది మాధురి. -
వాట్ ఏ ఫ్యాషన్? సాంకేతిక స్టైలిష్ డిజైనర్‌వేర్..!
శ్రీశ్రీ తన మహప్రస్థానంలో ఒకచోట కుక్కపిల్లా.. సబ్బుబిళ్ళా.. అగ్గిపుల్లా.. కాదేదీ కవితకనర్హం' అంటాడు. అలానే చక్కటి క్రియేటివిటీ ఉంటే దేనితో అయినే ఫ్యాషన్‌ని సృష్టించవచ్చని ఈ టెక్ డిజైనర్‌వేర్‌ని చూస్తే అనిపిస్తుంది. ఇంతవరకు రకరకాల ఫ్యాబ్రిక్‌లతో రూపొందించిన డిజైనర్‌వేర్‌లను చూసుంటారు. ఆఖరికి లోహాలతో చేసినవి కూడా చూసుండొచ్చు. కానీ ఈ డిజైనర్‌వేర్‌ని చూస్తే ఇలా కూడా ఫ్యాషన్‌ని క్రియేట్ చెయ్యొచ్చా అనిపిస్తుంది. అత్యంత వినూత్నంగా రూపొందించిన ఈ డిజైనర్‌వేర్ యావత్తు ఫ్యాషన్ ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఎక్కడ జరిగిందంటే..హర్పర్ బజార్ ఉమెన్ ఆప్ ది ఇయర్ అవార్డ్స్‌లో నటాషా పూనావల మిరుమిట్లు గొలిపే దుస్తులతో ఆశ్చర్యపరిచింది. మొత్తం సాంకేతిక స్ఫూర్తితో కూడిన ఈ డ్రెస్ అందర్నీ అమితంగా ఆకట్టుకుంది. ఆ డ్రెస్‌ని పాత సీడీలు, కాలిక్యులేటర్లు, ఫోన్లతో అత్యద్భుతంగా రూపొందించారు. అసాధారణ ఫ్యాషన్‌కి కేరాఫ్ అడ్రస్ అయిన ఎల్సా స్కియాపరెల్లి బ్రాండ్ దీన్నిడిజైన్ చేసింది. View this post on Instagram A post shared by DietSabya® (@dietsabya) దీనికి 'మదర్బోర్డ్' అని పేరుపెట్టడం విశేషం. క్రియేటివ్ డైరెక్టర్ రోజ్బెర్రీ సాంకేతికత హిస్టరీని తవ్వి మరీ ఐఫోన్ యుగానికి పూర్వం ఉన్న మెటీరియల్స్ని ఉపయోగించి ఈ డిజైనర్ వేర్ని రూపొందించారు. చెప్పాలంటే పాత గాడ్జెట్లతో రూపొందించిన డ్రెస్ ఇది. మధ్యమధ్యలో స్వరోవ్స్కీ స్ఫటికాలు, ఆకుపచ్చ చిప్‌లతో అలంకరించి ఉంటుంది. అలాగే అక్కడక్కడ కంప్యూటర్ వైర్లు కూడా ఉంటాయి. ఇక్కడ నటాషా టెక్-ప్రేరేపిత దుస్తులతో సరికొత్త స్టైలిష్ లుక్‌లో కనిపించింది. అంతేగాదు ఫ్యాషన్ అంటే ఎవరినో అనుకరించడం కాదు అత్యంత వినూత్నంగా ఆలోచించడం అని ఈ డ్రెస్‌ని చూస్తేనే అనిపిస్తుంది. కాగా, భారతదేశంలో అత్యంత సంపన్న వ్యాపారవేత్తల్లో ఒకరైన అదార్ పూనావాలా భార్యే నటాషా పూనావాలా. ఆమె అతిపెద్ద వ్యాక్సిన్ తయారీదారుగా ప్రసిద్ధి చెందిన సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII)కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. View this post on Instagram A post shared by Snehkumar Zala (@snehzala) (చదవండి: బెట్టీ ద ఫ్యాషన్ క్వీన్) -
బెట్టీ ద ఫ్యాషన్ క్వీన్
శ్వేతా శర్మది సాధారణ మధ్యతరగతి కుటుంబ నేపథ్యం. విజయగాథలు వింటూ పెరిగింది. అవన్నీ ఆమెలో ఏదో సాధించాలనే తపనను రగిలించాయి. వివిధ రంగాల పట్ల ఆసక్తిని కలిగించాయి. వాటిల్లో ఒకటే ఫ్యాషన్ డిజైనింగ్. ముంబైలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ నుంచి ఫ్యాషన్ కమ్యూనికేషన్లో బ్యాచిలర్స్ డిగ్రీ చేసింది. ‘బెట్టీ ఆఫ్ ఎల్’ పోటీలో గెలిచి, ‘ఎల్ ఇండియా’లో ఇంటర్న్‌గా చేరింది. అప్పుడే తన పేరును శ్వేతా బెట్టీగా మార్చుకుంది. ఆ సమయంలోనే ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ల దగ్గర పనిచేసే చాన్స్‌ను అందుకుంది. స్టయిలింగ్‌పై పట్టు సాధించింది. తర్వాత టీఎల్సీ చానల్లో ఫ్యాషన్ ఎడిటర్‌గా చేరింది. కాస్ట్యూమ్ డిజైనర్‌గానూ చేసింది. ఆ వర్కే ఆమెకు బాలీవుడ్లో ఎంట్రన్స్ కల్పించింది. అమితాబ్ బచ్చన్, ఫర్హాన్ అఖ్తర్లాంటి ఉద్దండులు నటించిన ‘వజీర్’ సినిమాకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా అవకాశం ఇస్తూ! ఆ తర్వాత ఆమె వెనక్కి మళ్లే అవసరమే రాలేదు. ఆమె ఈస్తటిక్ సెన్స్‌కి ముచ్చటపడిన రాధికా ఆప్టే.. తనకు స్టయిలింగ్ చేయమని కోరింది. యెస్ చెప్పింది శ్వేతా. మూవీ ఈవెంట్స్‌లో రాధికా స్టయిల్, గ్రేస్ చూసిన బాలీవుడ్ దివాస్ అంతా శ్వేతా స్టయిలింగ్కి క్యూ కట్టారు. సోనమ్ కపూర్, రియా కపూర్, అదితీ రావ్ హైదరీ, ట్వింకిల్ ఖన్నా, లీసా రే, కృతి సనన్, కియారా ఆడ్వాణీ, జాక్వెలిన్ ఫెర్నాండేజ్, కరిశ్మా కపూర్, యామీ గౌతమ్, సోనాక్షీ సిన్హా.. ఆ వరుసలోని వాళ్లే! నటీమణులే కాదు ఇంటర్నేషనల్ మోడల్స్ కూడా ఆమె స్టయిలింగ్కి ఫ్యాన్స్ అయిపోయారు. తమ స్టయిలిస్ట్‌గా ఆమెను అపాయింట్ చేసుకున్నారు. అలా తన ఫ్యాషన్ సెన్స్‌తో సెలబ్రిటీలకు మెరుగులు దిద్దుతూనే సెంట్రల్ సెయింట్ మార్టిన్స్ (యూనివర్సిటీ ఆఫ్ ది ఆర్ట్స్ లండన్) కాలేజ్‌లో కాంటెంపరరీ ఫైన్ ఆర్ట్స్‌లో కోర్స్ చేసింది. ఫొటోగ్రఫీ నేర్చుకుని, మహిళా క్రికెటర్స్‌తో ఫొటో సిరీస్ కూడా చేసింది. ఫ్యాషన్ కంటెంట్‌తో శ్వేతా.. బ్లాగ్నూ నిర్వహిస్తోంది. ఆమె ఇన్‌స్టా హ్యాండిల్కూ క్రేజీ ఫాలోయింగ్ ఉంది. అలాగే స్టయిలింగ్ అనేది నా దృష్టిలో మన పర్సనాలిటీని వ్యక్తపరచే ఒక మీడియం లాంటిది. వార్డ్రోబ్ మన స్వభావాన్ని రిఫ్లెక్ట్ చేసే అద్దం లాంటిదని అంటోంది శ్వేతా.– శ్వేతా బెట్టీ. (చదవండి: లాక్మే ఫ్యాషన్ వీక్ ర్యాంప్: ‘తగ్గేదెలే’ అంటున్న స్పెషల్ బ్యూటీ) -
దసరాలో ట్రెడిషనల్‌గా ఉండే స్టైలిష్ డిజైనర్ వేర్స్ ధరించండి ఇలా..!
తెలుగింటి సంప్రదాయం డ్రెస్సింగ్‌లో కనిపించాలి. స్టైల్ లో ఏ మాత్రం తగ్గకూడదు వెస్ట్రన్ వేర్ అనిపించకూడదు సౌకర్యం లో బెస్ట్ చాయిస్ అవ్వాలి... పండగ హంగులు ఔరా అనిపించాలి. ఇండియన్ వేర్ నే డిఫరెంట్‌గా ధరించాలి. దసరా వేడుకలో మరింత స్టైలిష్‌గా కనువిందు చేసే మోడ్రన్ హంగులివి. శారీ గౌన్కుట్టిన చీరలు, ధోతీ చీరలు, ప్యాంట్ తరహా చీరలు, కేప్ స్టైల్ డ్రేప్స్... వంటి వినూత్న పద్ధతులు ప్రాచుర్యం పొందుతున్నాయి. ఎన్నో విభిన్న డిజైన్లలో ఆకట్టుకుంటున్న శారీ గౌన్, షరారా శారీ ధరిస్తే చాలా స్టైలిష్‌గా, తేలికగా, రోజంతా సౌకర్యవంతంగా హుషారుగా ఉంచుతుంది. ఎంబ్రాయిడరీ బ్లేజర్బ్లేజర్లు కార్పొరేట్ రంగానికి మాత్రమే పరిమితం అనుకుంటారు చాలామంది. కానీ, ఎంబ్రాయిడరీ బ్లేజర్‌ను డ్రేప్డ్ స్కర్ట్ లేదా ధోతీ ప్యాంట్‌తో స్టైల్ చేయచ్చు. నడుము భాగాన్ని బెల్ట్‌తో అలంకరిస్తే ఈ డ్రెస్ బెస్ట్ మార్కులు కొట్టేస్తుంది. గవ్వల కుర్తీధోతీ ప్యాంట్ డ్రేప్డ్ స్కర్ట్‌లకు గవ్వలు, అద్దాలతో ఎంబ్రాయిడరీ చేసిన కేప్ లేదా షార్ట్ కుర్తీతో స్టైల్ చేయచ్చు. ఫ్లోరల్ ఎంబ్రాయిడరీ ΄్యాటర్న్ ఉన్న లెహెంగా లేదా పలాజో సెట్ కూడా పండగ కళను తెప్పిస్తుంది.సౌకర్యంగా! సల్వార్ కమీజ్ అయితే ప్రకాశవంతమైన రంగులు ఉన్నవి ఎంచుకోవాలి. పిల్లలతో సరి΄ోలే దుస్తులను ధరించడం వల్ల ఒకే కుటుంబ రూ΄ాన్ని సృష్టించవచ్చు. పండగ కళ రావాలనే ఆలోచనతో పిల్లలకు గాడీ ఎంబ్రాయిడరీ దుస్తులు వేయకూడదు. వారి డ్రెస్సులు సౌకర్యంగా ఉండాలి. ఆభరణాలు మేనికి గుచ్చుకోకుండా ఉండేవి ఎంచుకోవాలి. భారీ ఆభరణాలను ఉపయోగించే బదులు బ్యాంగిల్స్, జూకాలు తక్కువ బరువున్న యాక్ససరీస్‌ను ఉపయోగించాలి. (చదవండి: ఏజ్ ఈజ్ జస్ట్ నెంబర్..!) -
'ఆభరణాల గౌను'లో సారా అలీఖాన్ రాయల్ లుక్..!
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ కూతురు తండ్రికి తగ్గ తనయ అనేలా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. తన అందం అభినయంతో వేలాది అభిమానుల మనుసులను గెలుచుకుంది. అంతేగాదు తన విలక్షణమైన నటనతో ఫిల్మ్‌ఫేర్ అవార్డులు అందుకుంది. ఎప్పటికప్పుడూ తన బ్యూటీఫుల్ ఫోటోలను షేర్చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సారా తాజాగా సరికొత్త రాయల్టీ లుక్‌లో మెస్మరైజ్ చేసింది. ఈ స్టైలిష్ లుక్ ఆమె ఫ్యాషన్ శైలి ఏంటో చెప్పకనే చెబుతోంది. ఏస్ డిజైనర్లు అబు జానీ, సందీప్ ఖోస్లా ఈ గోల్డ్ జ్యువెలరీ గౌనుని రూపొందించారు.రకరకాల వజ్రాలు, కెంపులు, వైఢ్యూర్యాలతో పొదిగిన గౌను అది. ఎంత అద్భుతంగా ఉందంటే..ఆ డిజైనర్‌వేర్‌లో సారా దేవతలా ధగధగ మెరిసిపోతోంది. మల్టీకలర్ రాళ్లు, పూసలుతో.. చేతితో ఎంబ్రాయిడరీ చేసిన గౌను ఇది. ఈ గౌనుని సాంప్రదాయ మేళవింపుతో కూడిని ఆధునిక డిజైనర్‌వేర్‌లా తీర్చిదిద్దారు డిజైనర్లు.ఆ ఆభరణాల గౌనులో సారా లుక్ నాటి రాజుల దర్పాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నట్లుగా ఉంది. అందుకు తగ్గట్లు జుట్టుని చక్కగా హెయిర్ బన్ మాదిరిగా వేసిన తీరు, సింపుల్ మేకప్ లుక్ సారా అందాన్ని రెట్టింపు చేశాయి. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఓ లుక్కేయండి మరీ..!. View this post on Instagram A post shared by Sara Ali Khan (@saraalikhan95)(చదవండి: ఈ జంట 150 ఏళ్లు జీవించాలని ఏం చేస్తున్నారో తెలిస్తే ఆశ్చర్యపోతారు!) -
ఇంత టాలెంటా..! ఓ పక్క నృత్యం..మరోవైపు..!
పర్నియా కురేశీ.. పరిచయానికి చాలా విశేషణాలనే జోడించాలి. ఆమె కూచిపూడి డాన్సర్, ఫ్యాషన్ డిజైనర్, స్టయిలిస్ట్, మోడల్, యాక్ట్రెస్, ఆథర్ ఎట్సెట్రా! వివరాలు కావాలంటే కథనంలోకి వెళ్లాల్సిందే! పర్నియా పుట్టింది పాకిస్తాన్లో. పెరిగింది ఢిల్లీలో. చదువుకుంది అమెరికాలో. తండ్రి.. మోయిన్ అఖ్తర్ కురేశీ భారతీయుడు. బిజినెస్‌మన్. తల్లి.. నస్రీన్ కురేశీ పాకిస్తానీ నటి. తండ్రి నుంచి వ్యాపార మెలకువలు, తల్లి నుంచి కళలు వారసత్వంగా అందుకుంది. నాలుగో ఏటనే శాస్త్రీయ నృత్యంలో శిక్షణ మొదలుపెట్టింది. తొలి గురువు తల్లే. తర్వాత రాజా–రాధారెడ్డి దగ్గర కూచిపూడి నేర్చుకుంది. అమెరికాలోని జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీలో ‘లా’ చదివింది. లా చదివేటప్పుడే ఫ్యాషన్ రంగంలో ఇంటర్న్‌గా చేరింది. ఆ క్రమంలోనే ఫ్యాషన్ మీద ఆసక్తి పెరిగింది. అకడమిక్స్ కంటే తన క్రియేటివిటీకే ఎక్కువ మార్కులు పడసాగాయి. దాంతో ఫ్యాషన్‌నే సీరియస్‌గా తీసుకుని హార్పర్స్ బజార్, ఎల్ లాంటి ఫ్యాషన్ పత్రికల్లో పనిచేసింది. తర్వాత ఫ్రెంచ్ డిజైనర్ క్యాథరిన్ మలండ్రీనో దగ్గర పీఆర్ ఇంటర్న్‌గా చేరింది. ఇవన్నీ ఆమెలోని ఫ్యాషన్సెన్స్కి మెరుగులు దిద్దాయి. అయితే ఈ మొత్తం ప్రయాణంలో ఆమె ఎక్కడా తన డాన్స్‌ని నిర్లక్ష్యం చేయలేదు. సాధన చేస్తూనే ఉంది. ప్రదర్శనలిస్తూనే ఉంది. ఇండియా తిరిగిరాగానే.. ఫ్యాషన్ రంగంలో ఆమెకు ఇబ్బడిముబ్బడి అవకాశాలు కనిపించాయి. ఆ దిశగా అడుగులు కదిపేలోపే సోనమ్ కపూర్ హీరోయిన్గా నటించిన ‘ఆయశా’కు కాస్ట్యూమ్ డిజైనర్‌గా చాన్స్ వచ్చింది. ఆ సినిమా చేస్తున్నప్పుడే ఇక్కడ ఆన్లైన్లో డిజైనర్ వేర్ అందుబాటులో లేదని గ్రహించింది. అందుకే ఆ మూవీ అయిపోగానే, 2012లో Pernia's Pop-Up Shop పేరుతో ఆన్లైన్ స్టోర్‌ని లాంచ్ చేసింది. ఇందులో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఫ్యాషన్ డిజైనర్స్ డిజైన్ చేసిన దుస్తులు లభ్యమవుతాయి. అంట్రప్రెన్యూర్‌గా మారినా డిజైనింగ్‌ను ఆపలేదు. ఈ దేశ సంస్కృతి, సామాజిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని అన్నివర్గాల మహిళలకు అన్ని రకాల దుస్తులను డిజైన్ చేయడం మొదలుపెట్టింది. తన స్టయిలింగ్‌ని కోరుకునే వాళ్లకోసం ‘పర్నియా కురేశీ’ లేబుల్‌ని, ఇండియన్, ఫ్యూజన్ తరహా కావాలనుకునేవారికి ‘"Amaira' ’ లేబుల్‌ని స్టార్ట్ చేసింది. కిడ్స్ వేర్, జ్యూల్రీ డిజైనింగ్లోకీ అడుగుపెట్టింది. పర్సనల్ స్టయిలిస్ట్‌గా కాకుండా బాలీవుడ్ ఈవెంట్స్, రెడ్ కార్పెట్ వాక్ కోసం కోరిన సెలబ్రిటీలకు మాత్రం స్టయిలింగ్ చేస్తోంది.సుప్రసిద్ధ ఫ్యాషన్ డిజైనర్ల ఫ్యాషన్ షోల్లో మోడల్‌గా ర్యాంప్ మీద మెరుస్తోంది. ‘జాన్ నిసార్’ అనే చిత్రంలోనూ నటించింది. ఫ్యాషన్, స్టయిలింగ్కి సంబంధించిన వివరాలు, సలహాలు, సూచనలతో ‘"Be Stylish, with Pernia Qureshi'’ పేరుతో పుస్తకాన్నీ రాసింది. ‘మా అమ్మ ఇన్ఫ్లుయెన్స్తో క్లాసికల్ డాన్సర్నయ్యాను. నాన్న ఇన్స్పిరేషన్తో అంట్రప్రెన్యూర్నయ్యాను. నా పర్సనల్ ఇంట్రెస్ట్‌తో ఫ్యాషన్ డిజైనర్, స్టయిలిస్ట్, మోడల్నయ్యాను. ఉత్సుకతతో పుస్తకం రాశాను. చాన్స్ రావడంతో యాక్ట్రెస్నయ్యాను. లైఫ్‌లో నేను పోషించిన, పోషిస్తున్న ఈ రోల్స్ అన్నిటిలోకి నాకు క్లాసికల్ డాన్సర్ రోల్ అంటేనే ఇష్టం. డాన్స్ లేని జీవితాన్ని ఊహించుకోలేను. డాన్స్ ప్రాక్టీస్ లేని షెడ్యూల్ ఉండదు. సక్సెస్ అంటే నా దృష్టిలో చాలెంజెస్‌ని హ్యాండిల్ చేయడమే! దీనికి ఓర్పు, నేర్పులే టూల్స్!’ అంటుంది పర్నియా కురేశీ. (చదవండి: శ్లోకా మెహతా స్టైలిష్ లెహంగాలు రూపొందించిందే ఆ మహిళే..!) -
శ్లోకా మెహతా స్టైలిష్ లుక్ సీక్రెట్ ఇదే..! ఆ స్పెషల్ లెహంగాలు..
రిలయన్స్ దిగ్గజం ముఖేశ్ అంబానీ ఇంట గత నెల జులైలో గ్రాండ్‌గా అనంత్ రాధికల వివాహం జరిగి సంగతి తెలిసిందే. ఈ వివాహ వేడుకలో అంబానీ మహిళలంతా స్టైలిష్ ఐకాన్లు లాగా అత్యంత ఆకర్షణీయంగా కనిపించారు. ఆ వివాహ తంతులో ఆ ఇంట మహిళలు ధరించిన జ్యువెలరీ దగ్గర నుంచి చీరల వరకు ప్రతిది హైలెట్‌గా కనిపడింది. అయితే ఈ వేడుకలో స్పెషల్ అట్రాక్షన్‌గా కనిపించింది శ్లోకా మెహతా అనే చెప్పాలి. ఆమె ప్రతి ఈవెంట్‌కి ధరించిన డ్రెస్, జ్యువెలరీ ఇలా ప్రతిదీ అత్యంత లగ్జరియస్‌గా ఉండటమే గాక ఆమె కూడా స్టైలిష్ ఐకానిక్‌గా మెరిసింది. ఆ కార్యక్రమంలో అందరి దృష్టి శ్లోకా మీదనే ఉంది. అంతలా తన విభిన్నమైన స్టైలిష్ లుక్‌తో కట్టిపడేసింది శ్లోకా. అందుకు కారణం ఎవరో తెలుసా..!ఆమె ఎవరో కాదు ముఖేశ్ నీతా అంబానీల ప్రత్యేక అనుబంధ కలిగిన మహిళ. శ్లోకా మెహతాకి స్వయనా చెల్లెలు అయినా దియా మెహతా జాతియా. ఆమె స్కూల్ చదువంతా అంబానీ స్కూల్లోనే సాగింది. ఆ తర్వాత తన అభిరుచి రీత్యా లండన్ కాలేజ్ ఆఫ్ కమ్యూనికేషన్లో చేరి ఫ్యాషన్‌కి సంబంధించిన గ్రాఫిక్ డిజైన్ చేసింది. View this post on Instagram A post shared by Diya Mehta Jatia (@dmjatia) ఇక దియా అంబానీ ఇంట జరిగే గ్రాండ్ వేడుకలో తన అక్క శ్లోకా రూపాన్ని అందంగా కనిపంచేలా ప్రముఖ డిజైనర్లతో కలిసి మంచి లెహంగాలను డిజైన్ చేసింది. అవి కూడా మన వారసత్వానికి చిహ్నంగా ఉండే చీరలనే ఎంపిక చేసుకుని మరీ డిజైన్ చేయడమ ఆమె ప్రత్యేకత. ఆ వివాహ వేడుకలో జరిగే ప్రతి తంతులో ఇషా ప్రతి లుక్‌ని చాలా అద్భుతంగా తీర్చదిద్దింది. ఆమె కేవలం ఫ్యాషన్ డిజైనర్ మాత్రమే గాదు విభిన్న వెంచర్లు కలిగిన వ్యాపారవేత్త కూడా. అంతేగాఉ ఆమె అత్యంత డిమాండ్ ఉన్న స్టైలిస్ట్ డిజైనర్లో ఒకరు కూడా. ఆమె యూకే ఆధారిత రెస్టారెంట్ యజమాని ఆయుష్ జాతియాను వివాహం చేసుకుంది. ఈ జంటకి ఒక అబ్బాయి, అమ్మాయి ఉన్నారు.(చదవండి: ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి అతిషి మర్లెనా ఇష్టపడే రెసిపీ ఇదే..!) -
ఫ్యాషన్ బ్లాగ్‌తో ..ఏకంగా రూ. 40 కోట్లు..!
ఇటీవల యువత కంటెంట్ క్రియేటర్లుగా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా సత్తా చాటుతున్నారు. తమ టాలెంట్ ఏంటో ప్రపంచానికి చూపిస్తున్నారు. చిన్నగా బ్లాగర్‌గా మొదలుపెట్టి ఊహించని స్థాయిలో కోట్లు ఆర్జిస్తూ అందర్ని ఆశ్చర్యపరుస్తూ సెలబ్రిటీలుగా మారిపోతున్నారు. అందరికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అలాంటి కోవకు చెందిందే ఈ కోమల్ పాండే. ఫ్యాషన్ బ్లాగర్, కంటెంట్ క్రియేటర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. దేన్నయినా కామెడీ టచ్‌తో క్యాచీగా చెప్పడం ఆమె ప్రత్యేకత. ఢిల్లీలో పుట్టిపెరిగిన కోమల్ పాండే బీకామ్ గ్రాడ్యుయేట్. ఆమె ఫ్యాషన్ సెన్స్ చూసి ఫ్రెండ్స్ ఎంకరేజ్ చేయడంతో 2012లో ది కాలేజ్ ఆప్ కౌచర్’ పేరుతో ఫ్యాషన్ బ్లాగ్ స్టార్ట్ చేసింది. ఫ్యాషన్‌కి సంబంధించిన అన్ని విషయాలూ డిస్కస్ చేసే ఆమె బ్లాగ్ షార్ట్ టైమ్‌లోనే మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది.ఆ తర్వాత ఆమె యూట్యూబ్ చానల్‌నూ మొదలుపెట్టింది. పదిలక్షల సబ్‌స్క్రైబర్స్‌కి రీచై, యూట్యూబ్ గోల్డ్ బటన్‌ను అందుకుంది. దేశంలోనే టాప్ 7 డిజిటల్ స్టార్స్ లిస్ట్‌లో చేరి, ఫోర్బ్స్ మేగజీన్ కవర్ మీద మెరిసింది. దాదాపు 40 కోట్ల నెట్ వర్త్తో రిచెస్ట్ యూట్యూబర్స్లో ఒకరిగా ఉంది.(చదవండి: ఎముకలు కొరికే చలి! ఆ ఫీల్ కావలంటే ఈ మ్యూజియంకి వెళ్లాల్సిందే..!) -
Annu Patel: అన్నూస్ క్రియేషన్!
అన్నూ పటేల్.. ఫ్యాషన్ ఇండస్ట్రీలో స్పెషల్ స్టయిల్ ఆమెది! ఆ స్పెషాలిటీకి బాలీవుడ్ ఫిదా అయింది! అటు ఫ్యాషన్‌లో.. ఇటు స్టార్స్ స్టయిలింగ్‌లో సీనియర్స్‌తో ఇన్స్పైర్ అవుతూ, తన ప్రత్యేకతను చాటుకుంటూ సాగుతున్న ఆమె గురించి నాలుగు మాటలు ..అన్నూ పటేల్ స్వస్థలం గుజరాత్‌లోని వడోదర. ఫ్యాషన్‌గా ఉండటం, రకరకాల కలర్ కాంబినేషన్స్‌లో బట్టలు కుట్టించుకోవడమంటే ఆమెకు చిన్నప్పటి నుంచి ఆసక్తి. కనుకే, ఫిజియోథెరపీలో చేరిన కొన్నాళ్లకే అది తన కప్ ఆఫ్ టీ కాదన్న విషయాన్ని గ్రహించింది. ఫ్యాషన్ మీదే మనసు పారేసుకుంది. ఆలస్యం చేయక, వడోదరలోని ఐఎన్ఐఎఫ్డీ (ఇంటర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్)లో చేరింది. గ్రాడ్యుయేషన్ ఫస్టియర్‌లోనే ఆమె ఫ్యాషన్ ఐడియాస్కి ముచ్చటపడిన ఇన్స్టిట్యూట్ ఆమెకు ‘ద మోస్ట్ ఇన్నోవేటివ్ కలెక్షన్’ అవార్డ్నిచ్చింది. సెకండియర్‌లో ఉన్నప్పుడు ‘అన్నూస్ క్రియేషన్’ లేబుల్‌ను స్టార్ట్ చేసింది.ఆ చిన్న పట్టణంలో ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్ అయితే ఉంది కానీ.. డిజైనర్ వేర్కి డిమాండ్ ఎక్కడ? అందుకే మొదట్లో తను డిజైన్ చేసిన దుస్తులను ఇంటింటికీ వెళ్లి అమ్మి, డిజైనర్ వేర్ పట్ల మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వారికి మోజు కలిగేలా చేసింది. ఆ ప్రయత్నం.. ఆమె చదువైపోయేలోపు ఫ్యాషన్ మార్కెట్లో ‘అన్నూ క్రియేషన్’కి స్పేస్‌ని క్రియేట్ చేసింది. దాన్ని స్థిరపరచు కోవాలంటే తన లేబుల్‌కు ఒక స్పెషాలిటీ ఉండాలని ఆలోచించింది అన్నూ. ఈ దేశంలో పెళ్లికిచ్చే ప్రాధాన్యం స్ఫురణకు వచ్చింది.బ్రైడల్ వేర్ డిజైన్‌లో తన ప్రత్యేకతను చాటుకుంటే తన మార్కెట్ ఎక్కడికీ పోదని తెలుసుకుంది. తన ఐడియాను అర్థం చేసుకునే టీమ్‌ని ఎంచుకుని డిజైనింగ్ మొదలుపెట్టింది. తొలుత సామాన్యులకే బ్రైడల్ వేర్ ఇచ్చింది. అవి అసామాన్యుల మనసునూ దోచాయి. దాంతో అన్నూ క్రియేషన్ సెలబ్రిటీల స్థాయికి చేరింది. బ్రైడల్ వేర్ చేస్తున్నప్పుడే అన్నూకి ఫ్యాషన్ మార్కెట్లో ఎత్నిక్ వేర్కీ స్పేస్ కనపడింది. ముందు తనకు, తన టీమ్‌కి క్యాజువల్ ఎత్నిక్ వేర్ డిజైన్ చేసి, వాటిని ధరించి.. ఫొటో షూట్ చేయించి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయసాగింది. అవీ సెలబ్రిటీల దృష్టిలో పడి అన్నూ బ్రాండ్‌కి క్యూ కట్టసాగారు.ఆ డిమాండ్‌ను చూసి ‘ఎఫ్ అండ్ ఎఫ్ (ఫ్రిల్ అండ్ ఫ్లేర్)’ పేరుతో క్యాజువల్ ఎత్నిక్ వేర్ డిజైన్‌ను స్టార్ట్ చేసింది. ‘ఎఫ్ అండ్ ఎఫ్’ అంటే కుర్తీలు, ఇండో– వెస్ట్రన్ అవుట్‌ఫిట్స్‌కి పర్ఫెక్ట్ బ్రాండ్ అనే ఫేమ్‌ని సంపాదించింది. తనే కొత్త అవుట్‌ఫిట్‌ని డిజైన్ చేసినా వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అన్నూ అలవాటు. అలా ఆమె డిజైన్స్ అన్నిటినీ ఫాలో అయిన కొందరు బాలీవుడ్ సెలబ్స్.. తమకు స్టయిలింగ్ చేయమని ఆమెను కోరారు. తొలుత అప్రోచ్ అయింది మలైకా అరోరా! ఆ తర్వాత కృతి ఖర్బందా, సోఫీ చౌధరీ, తారా సుతారియా, మౌనీ రాయ్, జాన్వీ కపూర్, హెజల్ కీచ్ వంటి వాళ్లంతా అన్నూ పటేల్ స్టయిలింగ్ క్లయింట్ల లిస్ట్‌లో చేరిపోయారు. ‘సామాన్యులకు డిజైన్ చేస్తున్నా, సెలబ్రిటీలకు స్టయిలింగ్ చేస్తున్నా.. ఆయా స్థాయిల్లో అంతే ఎఫర్ట్స్ పెడతాను, అంతే కమిట్మెంట్తో ఉంటాను. నా డిజైనర్ వేర్ని.. నా స్టయిలింగ్‌ని కోరుకుంటున్న వాళ్ల సంతోషమే నాకు ముఖ్యం. అది నాకు కోటి అవార్డులతో సమానం!’ అంటుంది అన్నూ పటేల్.ఇవి చదవండి: Sanam Saeed: ప్రైడ్ ఆఫ్ పాకిస్తాన్.. ఫ్యాన్ ఆఫ్ ఇండియా! -
డిజైనర్ గాగ్రాలో అందమైన అదితి గ్రాండ్ లుక్ (ఫొటోలు)
-
హైదరాబాద్ హెచ్ఐసీసీలో.. హైలైఫ్ ఎగ్జిబిషన్!
మాదాపూర్: ప్రముఖ డిజైనర్లు రూపొందించిన వ్రస్తాభరణాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. మాదాపూర్‌లోని హెచ్ఐసీసీలో మూడు రోజుల పాటు కొనసాగనున్న హైలైఫ్ ఎగ్జిబిషను నటి శ్రవంతి చొకరపు, మాలవిక శర్మ నిర్వాహకుడు డొమినిక్‌తో కలసి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వివాహాది శుభకార్యాలకు ప్రత్యేక డిజైన్లతో కూడిన వ్రస్తాభరణాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. దేశంలోని 350 మంది డిజైనర్లు రూపొందించిన వ్రస్తాభరణాలు స్టాల్స్‌లో అందుబాటులో ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు. గృహాలంకరణ ఉత్పత్తులు, వధువరులకు ఆకర్షణీయమైన ఉత్పత్తులు ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు. నటి ప్రీతి సుందర్ తో పాటు పులవురు మోడల్స్, డిజైనర్లు పాల్గొన్నారు. -
పీవీ సింధు ఒలింపిక్ చీరపై దుమారం
అట్టహాసంగా ప్రారంభమైన ప్యారిస్ ఒలింపిక్స్ 2024 ప్రారంభ వేడుకల్లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఫ్లాగ్ బేరర్‌గా అరుదైన గౌరవాన్ని సాధించింది. మువ్వన్నెల చీరలో భారత పతాకాన్ని చేబూని భారత అథ్లెట్ల బృందానికి సారథ్యం వహించింది. దీనికి సంబందించిన ఫోటోలను పీవీ సింధు సోషల్ మీడియాలో షేర్ చేసింది. తన జీవితంలో ఇంతకంటే గొప్ప గౌరవం మరేదీ ఉండదంటూ తన ఆనందాన్ని ప్రకటించింది.Hello Tarun Tahiliani!I have seen better Sarees sold in Mumbai streets for Rs.200 than these ceremonial uniforms you’ve ‘designed’.Cheap polyester like fabric, Ikat PRINT (!!!), tricolors thrown together with no imagination Did you outsource it to an intern or come up with it… https://t.co/aVkXGmg80K— Dr Nandita Iyer (@saffrontrail) July 27, 2024భారతీయ ఒలింపిక్ యూనిఫాంపై దుమారంఅయితే అంతర్జాతీయ క్రీడా వేదికపై పీవీ సింధు కట్టుకున్న చీరపై దుమారం రేగింది. తరుణ తహిలియానీ డిజైన్ చేసిన దుస్తులు చాలా పేలవంగా ఉన్నాయంటూ బెంగళూరుకు చెందిన రచయిత డాక్టర్ నందితా అయ్యర్ ఎక్స్‌లో ఒక పోస్ట్ పెట్టారు. మీరు ‘డిజైన్ చేసిన’ ఈ యూనిఫామ్‌ల కంటే మెరుగైన చీరలు రూ.200లకు ముంబై వీధుల్లో అమ్మడం నేను చూశాను. చౌకైన పాలిస్టర్ వస్త్రంతో, ఇకత్ ప్రింట్((!!!) త్రివర్ణమనే ఊహకు అందకుండా గజిబిజిగా అద్దిన రంగులతో అధ్వాన్నంగా ఉందంటూ విమర్శించారు. అంతేకాదు ఇంటర్న్‌కి అవుట్సోర్స్ చేశారా? లేక ఆఖరి 3 నిమిఫాల్లో హడావిడిగా డిజైన్ చేశారా? అంటూ ఆమె మండి పడ్డారు. భారతదేశ సుసంపన్నమైన నేత సంస్కృతికి, చరిత్రకు ఇది అవమానం అటూ నందితా అయ్యర్ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలు ఈ డిజైనర్ దుస్తులను ధరించిన క్రీడాకారిణి పట్ల అగౌరవం కాదని కూడా వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో భారతీయ ఒలింపిక్ యూనిఫాంపై ఎన్ఐఎఫ్టీ బెంగళూరు మాజీ డైరెక్టర్ సుసాన్ థామస్ (అఫ్సర్నామా) ఇన్‌స్టాగ్రామ్‌లో దృక్కోణాన్ని కూడా ప్రస్తావించారు. కాగా ఒలింపిక్స్ చరిత్రలోనే తొలిసారిగా ఫ్యాషన్ రాజధాని పారిస్‌లో, నదిలో జరిగిన సంబరాలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి. పీవీ సింధు, టేబుల్ టెన్నిస్ ఛాంపియన్ శరత్ కమల్ భారతీయ జెండా బేరర్లుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్, అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు థామస్ బాక్ సహా దిగ్గజ అథ్లెట్లు ఇందులో పాల్గొన్నారు.TEAM INDIA IS HERE TO WIN 🇮🇳🫶💙#OpeningCeremony #Paris2024 #Olympic2024 #Paris #ParisOlympics #ParisOlympics2024 #paris2024olympics #Olympics #Olympics2024Paris #OlympicGames pic.twitter.com/7ELyTEFpMV— Ankit Avasthi Sir 🇮🇳 (@ankitavasthi01) July 27, 2024ప్రారంభ వేడుక కోసం ప్రఖ్యాత డిజైనర్ తరుణ్ తహిలియాని భారతీయ అథ్లెట్ల కోసం ప్రపంచ వేదికపై భారతీయ వారసత్వాన్ని హైలైట్ చేసే అసాధారణమైన దుస్తులను రూపొందించారు. పురుష అథ్లెట్లు తెల్లటి కుర్తా , నారింజ , ఆకుపచ్చ నక్సీ వర్క్‌తో అలంకరించబడిన బూండీ జాకెట్ ధరించగా. ఈ జాకెట్లపై 'ఇండియా' ఇన్ స్రిప్ట్, ఒలింపిక్ లోగో ఉన్న పాకెట్స్ కూడా ఉన్నాయి. మహిళలకు మూడు రంగుల మేళవింపుతో చీర, జాకెట్టును డిజైన్ చేశారు. -
ఎన్‌కన్వెన్షన్‌లో డిజైర్ డిజైనర్..
మాదాపూర్: పలువురు డిజైనర్లు రూపొందించిన వ్రస్తాభరణాలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. మాదాపూర్‌లోని ఎన్‌కన్వెన్షన్‌లో శుక్రవారం డిజైర్ డిజైనర్స్ ఎగ్జిబిషన్‌ను ప్రముఖ మొడల్ ఊర్మిళా చౌహాన్, పలువురు మొడల్స్తో కలసి నిర్వాహకురాలు అనితా అగర్వాల్ ప్రారంభించారు. మూడు రోజుల పాటు నిర్వహించనున్న ఈ ఎగ్జిబిషన్లో సంప్రదాయ వ్రస్తాలతో పాటు వివాహాది శుభకార్యాలకు ప్రత్యేక డిజైన్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. పలువురు మోడల్స్ పాల్గొన్నారు. -
పారిస్ ఫ్యాషన్ వీక్‌లో మత్స్య కన్యలా జాన్వీ స్టన్నింగ్ లుక్..! (ఫొటోలు)
-
వారి చేతుల్లో.. వ్యర్థాలు కూడా బొమ్మలవుతాయి..
ఈ మహిళల చేతిలో రూపుదిద్దుకున్న బొమ్మలు ఒక్కోటి ఒక్కో కథ చెబుతుంటాయి. బొమ్మల శరీరాలు కాటన్ కాన్వాస్‌తో విభిన్న రంగులతో సాంస్కృతిక వైవిధ్యంతో ఆకట్టుకుంటాయి. మూస దోరణులకు భిన్నంగా స్త్రీల చేతుల్లో తల్లీ–బిడ్డలు, భార్యాభర్తలు, పిల్లల బొమ్మలు రూపుదిద్దుకుంటాయి. న్యూఢిల్లీలోని అఫ్ఘాన్ శరణార్థ మహిళలకు హస్తకళల్లో నైపుణ్యాలకు శిక్షణ ఇస్తూ ఫ్యాబ్రిక్ వ్యర్థాలతో అందమైన బొమ్మలు, గృహాలంకరణ వస్తువులను రూపొందిస్తుంది ఐరిస్ స్ట్రిల్. శరణార్థులకు స్థిరమైన ఆదాయవనరుగా మారడమే కాదు పర్యావరణ హితంగానూ తనదైన ముద్ర వేస్తోంది.భారతదేశంలో నివసిస్తున్న ఫ్రెంచ్ డిజైనర్ ఐరిస్ స్ట్రిల్. టెక్స్టైల్, క్రాఫ్ట్ పరిశ్రమలో విస్తృతమైన అనుభవం ఉన్న సీనియర్ క్రియేటివ్ డిజైనర్. ఆమె భర్త బిశ్వదీప్ మోయిత్రా ఢిల్లీవాసి. కళాకారుల ప్రతిభను పెంపొందించడం, మహిళా సంఘాలనుప్రోత్సహించడం, ట్రెండ్‌ను అంచనా వేయడం, అట్టడుగు హస్తకళాకారుల కోసం వారి సామర్థ్యాన్ని పెంపొందించే కార్యక్రమాలను అమలు చేయడంలో ఐరిస్ విస్తృత స్థాయిలో పని చేస్తుంది. దేశంలోని హస్తకళాకారులతో ఆమెకు మంచి పరిచయాలు ఉన్నాయి. అందమైన ఇండియన్ ఫ్యాబ్రిక్ వ్యర్థాలు, వస్త్రాల తయారీలో మిగిలి పోయిన వస్త్రాల గుట్టలను చూస్తూ ఉండేది.పర్యావరణ అనుకూలమైన ఆలోచన..‘‘ఈ వ్యర్థాలను ఎలా సద్వినియోగం చేసుకోవాలో కొన్నాళ్లు పాటు ఆలోచించాను. అదే సమయంలో అఫ్ఘాన్ మహిళా శరణార్థులను శక్తిమంతం చేయాల్సిన అవసరాన్ని కూడా గుర్తించాను. ఇక్కడ డిజైన్ పని చేస్తున్న సమయంలో తరచూ భారతీయ గ్రామీణ మహిళలకు వారి సంప్రదాయ నైపుణ్యాలను ప్రపంచ మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని ఉత్పత్తులను అభివృద్ధి చేయడంలో శిక్షణ ఇచ్చే ప్రాజెక్ట్‌లను చేయడం మొదలుపెట్టాను.ఆ విధంగా అనేకమంది హస్తకళాకారులతో నాకు పరిచయం ఏర్పడింది. యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రెఫ్యూజీస్ (యుఎన్హెచ్సిఆర్) జీవనోపాధి కార్యక్రమాలలో భాగమైన ఆప్ఘన్ శరణార్థ మహిళలతో కలిసి అనేక శిక్షణా కార్యక్రమాలలో పాల్గొన్నాను. అలా నాలో శరణార్థులతో కలిసి పనిచేయాలనే ఆలోచన కలిగింది. ఆ ఆలోచన నుంచే ‘సిలైవాలి’ సంస్థ పుట్టింది. పర్యావరణ అనుకూలమైన, స్థిరమైన, వ్యర్థ పదార్థాలను ఉపయోగించి చేతి వృత్తుల ఉత్పత్తులను తయారు చేయడం ద్వారా జీవనోపాధిని పొందడంలో అట్టడుగున ఉన్న కళాకారులకు సహాయపడే ఒక సామాజిక సంస్థను నెలకొల్పాను. బొమ్మలు శరణార్థ మహిళల ప్రత్యేకతగా మారినప్పటికీ, ఇతర గృహోపకరణాలు కూడా వారు తయారుచేస్తారు.స్థిరమైన ఆదాయం..మా ఉత్పత్తులు పూర్తిగా పర్యావరణ అనుకూలమైనవి. వీటికి సరైన ధరలను నిర్ణయించి, వాటి ద్వారా కళాకారుల సంఘాలను ఏర్పాటు చేయడానికి సహాయపడేందుకు ఒక స్థిరమైన ఆదాయానికి కల్పిస్తున్నాం. అభివృద్ధి చెందిన దేశాలలో స్థిరపడాలనే ఉద్దేశంతోనూ, వారి స్వదేశంలో అస్థిరత కారణంగా పారిపోతున్న అఫ్ఘాన్ శరణార్థులకు న్యూఢిల్లీ ఒక ఇల్లుగా చెప్పవచ్చు.సిలైవాలి సంస్థ ద్వారా 70 మంది మహిళా శరణార్థులకు స్థిరమైన ఆదాయం లభిస్తోంది. శరణార్థుల ఇళ్లకు కూతవేటు దూరంలో పరిశుభ్రమైన పని వాతావరణం, పిల్లలను కూడా పనిలోకి అనుమతించడం వల్ల ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కావడం లేదు. ఈ సంస్థ ద్వారా తయారైన బొమ్మలు, ఇతర అలంకార వస్తువులు ప్రపంచవ్యాప్తంగా 100కి పైగా కాన్సెప్ట్ స్టోర్లలో అమ్మకానికి ఉన్నాయి. దేశరాజధానిలో సొంత స్టోర్‌తో పాటు వెబ్సైట్ ద్వారా కూడా అమ్మకాలను జరుపుతున్నాం.కళాత్మక వస్తువులను క్లాత్‌తో రూపొందించడం వల్ల ఫ్యాషన్ దృష్టిని ఆకర్షిస్తున్నాం. వేస్ట్ ఫ్యాబ్రిక్‌ను అందమైన స్మారక చిహ్నాలు, గృహాలంకరణలో హ్యాండ్ క్రాఫ్ట్ వస్తువుల తయారీకి మూడు గంటల వర్క్‌షాప్ నిర్వహిస్తున్నాం. దీనితో కళాకారుల నుంచి మహిళలు కుట్టుపని, ఎంబ్రాయిడరీ వంటివి నేర్చుకుంటున్నారు.సోషల్ మీడియా ద్వారా మా ఉత్పత్తులను ప్రజల ముందుకు తీసుకెళుతున్నాం. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సంవత్సరం గ్యారెంటీడ్ ఫెయిర్ ట్రేడ్ ఎంటర్‌ప్రైజ్‌గా వరల్డ్ ఫెయిర్ ట్రేడ్ ఆర్గనైజేషన్ సర్టిఫికెట్ ను కూడా పొందింది. మా సంస్థ ద్వారా గుడ్డ బొమ్మలు, బ్యాగులు, ఆభరణాలు తయారు చేస్తాం’’ అని వివరిస్తారు ఈ క్రియేటర్.ఇవి చదవండి: పక్షులను స్వేచ్ఛగా ఎగరనిద్దాం.. -
74 ఏళ్ల 'ఏజ్‌లెస్ బ్యూటీ'..చూస్తే టీనేజ్ అమ్మాయిలా..!
ఎవ్వరైనా కనీసం 50 దాటితేనే ఏజ్డ్గా కనిపించేస్తారు. ఎంతలా మేకప్‌తో కవర్ చేద్దామన్నా..ముడతలు పడ్డ చర్మాన్ని దాచడం అంత ఈజీ కాదు. ముఖ్యంగా మెడ, చేతులు, ముసలివాళ్లైనట్లు క్లియర్‌గా కనిపించేస్తుంది. అలాంటిది ఈ బామ్మ ఏజ్‌లో ఉన్న ఈ మహిళను చూస్తే వామ్మో అంటారు. అదెలా సాధ్యం అని ఆశ్చర్యపోకండి. ఆ రహస్యం ఏంటో ఆమె మాటల్లోనే విందామా..!అమెరికన్ ఫ్యాషన్ డిజైనర్ వెరా వాండ్ వయసు 74 ఏళ్లు. కానీ ఆమె అందానికే అందానివే.. అన్నంత ఆకర్షణీయంగా ఉంటుంది. ఆమెను చూడగానే ఎవ్వరూ కూడా ఆమెకు అంత ఏజ్ ఉంటుందని అస్సలు అనుకోరు. అంతేగాదు తాను ఎప్పుడూ మెరిసిన జుట్తుతో అస్సలు కనిపించనని చాలా ధీమాగా చెప్పేస్తోంది. అయితే ఒకనొక మీడియా ఇంటర్యూలో మాత్రం తన తలకు రంగు వేస్తానని ఒప్పుకుంది. అయినప్పటికీ స్కిన్ అంత టైట్‌గా యువకుల మాదిరిగా ఉండటం మాత్రం ఆశ్చర్యమే. View this post on Instagram A post shared by Vera Wang (@verawang) ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ పేరుగాంచిన వాంగ్ని తన బ్యూటీ రహస్యం ఏంటని పలు మీడియాలు ప్రశ్నించగా.."తాను 19 ఏళ్ల నుంచి ఫ్యాషన్ ప్రపంచంలో ఉన్నాను. తానెప్పుడూ యవ్వనం గురించి ఆలోచించలేదని చెబుతోంది. ఎందుకంటే..ప్రపంచంలోని అత్యంత అందమైన మహిళలతో రోజూ పని చేస్తుంటాను కాబట్టి నాకు ఆ ఆలోచనే రాదంటోంది. వాళ్లను చూస్తు ఉత్సాహాంగా పనిచేయడం వల్ల తాను ఇలా యంగ్‌గా కనిపిస్తున్నాని అంటోంది." వాంగ్. నిజంగా గ్రేట్ కదా ఆమె. ఈ ఏజ్‌లో కూడా టీనేజ్ అమ్మాయి లుక్ మెయింటైన్ చేస్తోందంటే మాములు విషయం కాదు కదా..! View this post on Instagram A post shared by Vera Wang (@verawang)(చదవండి: అనుష్క శర్మ బుడ్డి హ్యాండ్ బ్యాగ్ ధర తెలిస్తే..నోరెళ్లబెట్టడం ఖాయం!) -
తాను.. బాలీవుడ్ 'ఆస్థా'న ఫేవరెట్!
కాన్స్ రెడ్ కార్పెట్ మీద ఐశ్వర్యా రాయ్ లుక్స్‌కి వెస్ట్రన్ వరల్డ్ అంతా ఫిదా అయిపోయింది. మనకూ కొత్తగా కనిపించింది. అలా ఆమెను తీర్చిదిద్దిన స్టయిలిస్ట్ ఆస్థా శర్మ. ఆమె అంట్రప్రెన్యూర్ కూడా!ఆస్థా స్వస్థలం ఢిల్లీ. ఫ్యాషన్ ప్రపంచంతో అసలు ఆమెకు ఎలాంటి సంబంధం లేదు. వాళ్లది లాయర్ల కుటుంబం. ఆమె తండ్రి.. ఢిల్లీలో పేరుమోసిన అడ్వకేట్. కెరీర్ విషయంలో తన తండ్రి అడుగుజాడల్లోనే నడవాలనుకుని ఇంటర్ అయిపోగానే ‘లా’ ఎంట్రెన్స్ రాసింది. సీట్ వచ్చింది కూడా. కానీ ఆస్థా వాళ్ల నాన్న.. తన కూతురు లాయర్ కాకుండా ఇంకేదైనా రంగంలో స్థిరపడితే బాగుండు అనుకున్నాడు. అదే విషయాన్ని బిడ్డతో చెప్పాడు.. ‘నేను లాయర్ అయ్యాను కాబట్టి.. నువ్వూ కావాలనే మైండ్‌సెట్‌తో లా చదవకు. నీకేది ఇష్టమో అదే చెయ్’ అని. అప్పుడు ఆలోచించింది ఆస్థా.. నిజంగా తనకు లా చదవాలని ఉందా? అని! ఇంట్రెస్టింగ్గా ఏమీ అనిపించలేదు.దాంతో అది వదిలేసి ఢిల్లీ యూనివర్సిటీలో బీఏ ఇంగ్లిష్ లిటరేచర్‌లో చేరింది. అది చదువుతున్నప్పుడే ఆస్థాకు క్రియేటివ్‌గా ఏదో చేయాలనే తపన మొదలైంది. ఆ శోధనలోనే ఫ్యాషన్ పట్ల ఆసక్తి పెరిగింది. బీఏ అయిపోగానే ‘పర్ల్ అకాడమీ’ ఫ్యాషన్ మార్కెటింగ్ అండ్ మర్చండైజింగ్ కోర్స్‌లో జాయిన్ అయింది. కానీ అదేమంత ఇష్టంగా తోచలేదు. అప్పుడే ఒక ఫ్రెండ్ ద్వారా ‘స్టయిలింగ్’ గురించి తెలుసుకుంది.ఫ్యాషన్ మార్కెటింగ్ కోర్స్ పూర్తవగానే స్టయిలింగ్లోకి దిగింది. మ్యాగజైన్ స్టయిలిస్ట్ రిన్ జాజో దగ్గరికి ఇంటర్న్‌గా వెళ్లింది. అదే సమయంలో మరో స్టయిలిస్ట్ ఆదిత్య వాలియాకూ అసిస్టెంట్‌గా పని చేయడం మొదలుపెట్టింది. అప్పుడు గ్రహించింది స్టయిలింగ్ అనేది తన కైండ్ ఆఫ్ వర్క్ అని. ఆ ఇంటర్న్‌షిప్ అయిపోగానే ఆమెకు ఏ్చటp్ఛట’టఆ్చ్డ్చ్చట మ్యాగజైన్లో ఫ్యాషన్ ప్రొడ్యూసర్ కొలువు దొరికింది. అది ఆమెకు పనిలో అనుభవాన్నే కాదు.. ఫ్యాషన్ లోకపు కాంటాక్ట్స్నీ పెంచింది. గొప్ప ఎక్స్పోజర్నిచ్చింది.అది ఒక పంజాబీ సినిమాలోని అగ్రతారలకు స్టయిలింగ్ చేసే చాన్స్‌ని తెచ్చిపెట్టింది. అంతే మ్యాగజైన్లో ఉద్యోగానికి రాజీనామా చేసి ఆసా, ఆమె కొలీగ్ మోహిత్ ఇద్దరూ ఆ ప్రాజెక్ట్‌లో తలమునకలయ్యారు. సక్సెస్ సాధించారు. దానిద్వారా వచ్చిన పెద్దమొత్తాన్ని తీసుకుని ముంబై చేరారు. ‘వార్డ్‌రోబిస్ట్’ అనే ఫ్యాషన్ స్టార్ట్ప్ పెట్టారు. అది ఆస్థాకు బాలీవుడ్ ఎంట్రెన్స్ని కల్పించింది. ఐశ్వర్యా రాయ్‌ని పరిచయం చేసింది. తన పనితనాన్ని నిరూపించుకునే అవకాశాన్నిచ్చింది. ఐశ్వర్యా రాయ్ మెచ్చి ఆమెను తన పర్సనల్ స్టయిలిస్ట్‌గా అపాయింట్ చేసుకుంది.ఆ వాసి మరింత మంది తారలకు చేరి.. దిశా పాట్నీ, మృణాల్ ఠాకుర్, నోరి ఫతేహీ, విద్యా బాలన్, భూమి పెడ్నేకర్లకూ స్టయిలింగ్ చేసే ఆపర్చునిటీస్ని అందించింది. అంతేకాదు అంట్రప్రెన్యూర్‌గా ‘ద వెడ్డింగ్ స్టయిల్’ ప్రాజెక్ట్‌నూ లాంచ్ చేసే దశకు చేర్చింది. ఆస్థా ఇప్పుడు.. బాలీవుడ్ సెలబ్రిటీస్‌కి ఫేవరెట్ స్టయిలిస్ట్.. బడ్డింగ్ స్టయిలిస్ట్లకు రోల్ మోడల్!స్టయిలిస్ట్ అవడానికి ఫ్యాషన్ పట్ల ప్యాషన్ మాత్రమే సరిపోదు. ఫ్యాషన్ అండ్ డిజైనింగ్‌లో చదువు, ఆ సబ్జెక్ట్ మీద మంచి గ్రిప్, అంతులేని ఈ పోటీ రంగంలో అలుపెరగని శ్రమ, ఊహకందని సృజన చాలా ఇంపార్టెంట్! అందుకే ఎప్పటికప్పుడు మారుతున్న ట్రెండ్స్ మీద అవగాహన, స్టడీ, రీసెర్చ్ తప్పనిసరి! ఇవన్నీ ఉంటేనే స్టయిలింగ్‌లో మన మార్క్ చూపించగలం.. బెస్ట్ అనిపించుకోగలం! – ఆస్థా శర్మఇవి చదవండి: ఆ పాత్రలో.. మెప్పించడానికి చాలానే కష్టపడింది! -
థ్యాంక్స్ టూ మనీష్ మల్హోత్రా.. సమ్మర్ 2024 స్పెషల్ డిజైన్స్ (ఫొటోలు)
-
Rakul Preet Singh: డిజైనర్ వేర్లో మస్త్ క్యూట్‌గా రకుల్ ప్రీత్ సింగ్ (ఫొటోలు)
-
Shaleena Nathani: డిఫరెంట్ స్టార్స్‌తో పనిచేయడమంటే.. చాలా ఇంట్రెస్టింగ్!
ఇండియాలో ఫ్యాషన్ సీన్‌ని.. బాలీవుడ్ సెలబ్రిటీల గ్లామర్ గ్రామర్ని తిరగరాసిన అతికొద్ది మంది ఫ్యాషన్ డిజైనర్స్, స్టార్ స్టయిలిస్ట్లలో టాప్ ఆఫ్ ది ఆల్గా చెప్పుకునే పేరు శలీనా నథానీ. ఆమె మోడల్, ఇన్‌స్టా ఇన్ఫ్లుయెన్సర్ కూడా! యాక్ట్రెస్ దీపికా పదుకోణ్‌కి పర్సనల్ స్టయిలిస్ట్! క్యాజువల్ లుక్స్ నుంచి కాన్స్ రెడ్ కార్పెట్ అపియరెన్స్ దాకా.. దీపికా సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్‌గా నిలవడం వెనుకున్న అందమైన శ్రమ శలీనాదే!ఫ్యాషన్ విషయంలో శలీనాకు స్ఫూర్తి వాళ్లమ్మ, అమ్మమ్మే! ఆ ఇద్దరికీ ఫ్యాషన్ సెన్స్ మెండుగా ఉండేదట. ట్రెడిషన్‌కి ట్రెండ్స్‌ని.. కంఫర్ట్‌ని జోడించి తాము మెచ్చే.. తమకు నప్పే సల్వార్ సూట్స్, చీరల మీదకి బ్లౌజెస్ని డిజైన్ చేసుకునేవారట. ‘అలా పర్సనల్‌గా డిజైన్ చేసుకుని కుట్టించుకున్న దుస్తుల్లో మా అమ్మ, అమ్మమ్మ యూనిక్‌గా కనిపించేవారు.అలాంటివి మా చుట్టాల్లో, ఫ్యామిలీ ఫ్రెండ్స్‌లో ఎవరికీ ఉండేవి కావు. నాకు భలే అనిపించేది. బహుశా వాళ్లకున్న ఆ టేస్టే నాలో ఫ్యాషన్ స్పృహను పెంచి.. అందులో నేను కెరీర్‌ని బిల్డ్ చేసుకునేలా ఇన్స్పైర్ చేసుంటుంది’ అంటుంది శలీనా. ఆమె అన్నట్టుగానే శలీనా ఫ్యాషన్ డిజైన్ కూడా ట్రెడిషన్, ట్రెండ్స్, కంఫర్ట్ల మేళవింపుతో పర్ఫెక్ట్గా ఉంటుంది.ఫ్యాషన్ మ్యాగజైన్స్‌లో ఇంటర్న్‌గా చేశాక.. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్, స్టార్ స్టయిలిస్ట్ అనాయితా శ్రాఫ్ దగ్గర అసిస్టెంట్‌గా చేరింది శలీనా. ‘నాకిష్టమైన డిజైనర్స్, స్టయిలిస్ట్లలో అనాయితా ఒకరు. ఆమె దగ్గర చాలా నేర్చుకున్నాను’ అంటూ గురుభక్తి చాటుతుంది శలీనా. ఒక ఫ్యాషన్ ఈవెంట్లో ఆమె చేసిన వర్క్ నచ్చి శలీనాను తన పర్సనల్ స్టయిలిస్ట్‌గా అపాయింట్ చేసుకుంది దీపికా. ఆ రోజు నుంచి దీపికా ఆహార్యమే మారిపోయింది.ఓవర్ సైజ్డ్ కాస్ట్యూమ్స్ పట్ల యూత్‌కి క్రేజ్ పెంచిన క్రెడిట్ దీపికాకు దక్కేలా చేసింది శలీనాయే. నున్నగా దువ్వుకుని ముడుచుకున్న కొప్పయినా.. చింపిరి జుట్టును క్లచ్‌లో ఇమిడ్చినా .. అది దీపికా హెయిర్ స్టైల్‌గా వైరల్ అవుతోందీ అంటే దానికీ కర్త, కారణం శలీనాయే! ‘నాక్కాదు ఆ ఘనతను దీపికాకే ఇవ్వాలి. ఎందుకంటే తననలా తీర్చిదిద్దే ఫ్యాషన్ లిబర్టీ నాకిస్తుంది ఆమె. అన్నిటికన్నా ముఖ్యంగా తను నన్ను నమ్ముతుంది.దీనికన్నా ముఖ్యమైంది దీపికా అందం, శరీరాకృతి. ఎలాంటి అవుట్ఫిట్నైనా ఈజీగా.. కాన్ఫిడెంట్‌గా క్యారీ చేస్తుంది. ఏ కొత్త ట్రెండ్‌నైనా ట్రై చేయడానికి ఇష్టపడుతుంది. కరెక్షన్స్ చేసుకోవడానికి నాకు, నా టీమ్‌కి టైమ్ ఇస్తుంది. ఓపిగ్గా ఉంటుంది. అందుకే దీపికాకు కాస్ట్యూమ్స్‌ని డిజైన్ చేయడానికి ఉవ్విళ్లూరని డిజైనర్ ఉండడు. ఆమె స్టయిలిస్టుల స్టార్’ అంటూ దీపికా పదుకోణ్‌కి కితాబునిస్తుంది శలీనా. దీపికాతోపాటు షారుఖ్ ఖాన్, కియారా అడ్వాణీ, కార్తిక్ ఆర్యన్, సిద్ధార్థ్ కపూర్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ వంటి బాలీవుడ్ స్టార్స్‌కీ శలీనా కాస్ట్యూమ్స్‌ని డిజైన్ చేసింది."డిఫరెంట్ స్టార్స్‌తో పనిచేయడమంటే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఒక్కో స్టార్ ఆసక్తి ఒక్కోరకంగా ఉంటుంది. ఒక్కో స్టార్ బాడీ లాంగ్వేజ్ ఒక్కో రకంగా ఉంటుంది. షారుఖ్ ఖాన్ లాంటి వాళ్లు వైట్ కలర్ షర్ట్స్‌నే ఎక్కువ ఇష్టపడతారు. ఆ ఒక్క రంగుతో వేరియేషన్ చూపించడంలోనే మన క్రియేవిటీ.. కమిట్మెంట్.. ఈ ప్రొఫెషన్ పట్ల ఉన్న ఆసక్తి.. రెస్పెక్ట్ తెలుస్తుంది. అందుకే నామటుకు నాకైతే స్టార్స్‌తో పనిచేయడమంటే ఫ్యాషన్‌లో కొత్త కాంబినేషన్స్‌ని ఎక్స్పరిమెంట్ చేయడం.. సరికొత్త ట్రెండ్స్‌ని ఎక్స్ప్లోర్ చేయడమే!" - శలీనా నథానీ. -
క్యాజువల్ వేర్ ఆర్ పార్టీ వేర్: లుక్ మాత్రం అదుర్స్ ! (ఫోటోలు)
-
జూబ్లీహిల్స్ : వస్త్ర దుకాణంలో మోడళ్ల సందడి (ఫొటోలు)
-
వజ్రాలు, వైఢూర్యాలతో డిజైన్ చేసిన జాకెట్..ధర ఏకంగా..!
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకులు ధూమ్‌ధామ్‌గా జరిగాయి. ఆ వేడుకల్లో కళ్లు చెదిరే రేంజ్లో లగ్జరీయస్‌గా జరిగింది. ఆ వేడుకలు యావత్తు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. అతిథులు భోజనం దగ్గర నుంచి ధరించే బట్టల వరకు ప్రతీది ఓ సెన్సెషన్ అయ్యింది. ఆ వేడుకుల్లో నీతా అంబానీ తనయ ఇషా అంబానీ ధరించి వస్త్రాలు మరింత హాట్‌టాపిక్‌గా మారాయి. అంబానీ బిడ్డ కాబట్టి ఆ రేంజ్‌లోనే ఉంటాయి కానీ అంతకు మించి 'వేరేలెవెల్' అన్నట్లు ఉండటంతోనే నెట్టింట చర్చనీయాంశంగా మారింది. ఆమె లెహంగాపై ధరించిన బ్లౌజ్‌కి సంబంధించిన వీడియోని చూసి అంబానీ బిడ్డ ఆ మాత్రం ఉంటుందిలే అని అంటున్నారు. మూడు రోజుల వేడుకల్లో చివరి రోజు చక్కటి లెహంగాతో అలరించారు ఇషా. అందులో ఆమె ధరించిన బ్లౌజ్ ప్రతి ఒక్కరిని స్టన్ అయిపోయేలా చేసింది. ఆ బ్లౌజ్‌ని మనం చెవులకు ధరించే జూకాలతో డిజైన్ చేశారు. కేవలం బంగారుపు జూకాలు కాదండోయ్. బంగారంతో పొదగబడిన వజ్రాలు, కెంపులు, వైఢ్యూర్యాలతో డిజైన్ చేశారు. ఈ బ్లౌజ్‌ని డిజైన్ చేసింది ప్రముఖ డిజైనర్ అబూ జానీ సందీప్ ఖోస్లా. ఆ బ్లౌజ్లో ఉన్న ప్రతి ఆభరణం చాలా కళాత్మకంగా ఉంటుంది. View this post on Instagram A post shared by FlixZon (@flixzonofficial) డిజైనర్ సందీప్ 2012లో 'ఇండియ ఫెంటాస్టిక్"లో ప్రదర్శించిన ఐకానిక్ బ్లౌజ్‌లను తలదన్నేలా ఐషా ధరించిన బ్లౌజ్‌ని తీర్చిదిద్దడం విశేషం. ఆ బ్లౌజ్‌పై ఇంత బరువైన నగలను చాల పొదినిగ్గా అమర్చడమే కాకుండా చూసేందుకు బండగా కనిపించకుండా ఎలా బ్లౌజ్పీస్పై అమర్చారా? అనిపించేలా తేలికైన ధారాలతో ఎంబ్రాయిడరీ చేశారు. ఆ జాకెట్ డిజైన్ నైపుణ్యానికి ఫిదా అవ్వాల్సిందే. అయితే అంతలా ఖరీదైన వజ్రాలు, కెంపులు, రత్నాలతో రూపొందిన బ్లౌజ్ ధర ఏకంగా కోట్లలో ఉంటుందని తెలుస్తోంది. ఆ జాకెట్‌నే తమ్ముడి పెళ్లిలో ధరించి సందడి చేశారు ఇషా. ఆ అత్యంత లగ్జరీయస్ జాకెట్ డిజైన్ చేసిన విధానానికి సంబంధించిన వీడియోని నెట్టింట్ పోస్ట్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోకి వేలల్లో వ్యూస్ లైక్‌లు వచ్చాయి. View this post on Instagram A post shared by FlixZon (@flixzonofficial) (చదవండి: షాపు షట్టర్లో కోటు చిక్కుకుపోడంతో పాపం ఆ మహిళ..!) -
అద్భుతమైన క్రిస్టల్ గౌనుతో టాప్ 20కి చేరుకున్న సినీ శెట్టి!
ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2020 విజేత సిని శెట్టి ప్రస్తుతం మిస్ వరల్డ్ పోటీల్లో భారతదేశం గర్వపడేలా చేయాలన్న లక్ష్యంతో బిజీగా ఉంది. సుమారు 28 ఏళ్ల తర్వాత భారత్ (India) ఆతిథ్యమిస్తున్న ఈ 71వ ప్రపంచ సుందరి పోటీల్లో (Miss World Pageant) సినీ శెట్టి క్రిస్టల్ గౌనులో మెరిసింది. ముంబైలో జరుగుతున్న ఈ ప్రపంచ సుందరి పోటీట్లో ఆమె ఆసియా అండ్ ఓషియానియ తరుఫు నుంచి బెస్ట్ డిజైనర్ డ్రెస్ అవార్డుని దక్కించుకుని టాప్ 20కి చేరుకుంది. అలాగే ప్రాంతీయ పరంగా ఐదో స్థానంలోనూ నిలిచింది. స్లీవ్ లెస్ బ్లాక్ కలర్ పెప్లమ్ సైల్బాడీ డ్రెస్‌లో అదిరిపోయింది. వీ నెక్లైన్తో కూడిన పొడవు గౌను, కట్స్ ఉండి, లైన్స్ ఆర్ట్‌వర్క్‌లో క్రిస్టల్ పూసలతో అలంకరించి ఉంది. రోహిత్ గాంధీ, రాహుల్ ఖన్నాల డిజైనర్ ద్వయం రూపొందించిన ఈ క్రిస్ట్ల్ గౌను కారణంగా ఆమె ఈ ఘనతను దక్కించుకుంది. అందుకు సంబంధించిన వీడియోని నెట్టింట షేర్ చేసింది. ఇక సినీ శెట్టి ఈ 71వ మిస్ వరల్డ్ పోటీల ప్రారంభోత్సవం కోసం జయంతి రెడ్డి డిజైన్ చేసిన ఎరుపు రంగు బనారసీ చీరను ధరించింది. View this post on Instagram A post shared by Femina Miss India (@missindiaorg) ఆరుగజాల బెనారస్ చీరపై ఎంబ్రాయిడరీ అంచు మంచి లుక్ ఇవ్వగా, దానికి పూర్తి విభిన్నంగా నేవి బ్లూ కలర్ బ్లౌజ్‌ని జత చేయడంతో మరింత ఆకర్షణ ఉంది. అందుకు తగ్గట్లు బంగారు గాజులను ధరించింది సినీ శెట్టి. ఈ సంప్రదాయ లుక్ ఆమెను అగ్రస్థానంలో నిలబెట్టేంత గ్లామరస్‌గా ఉంది. కాగా, ఫిబ్రవరి 18 నుంచి మార్చి 9 వరకు ముంబై, ఢిల్లీ (Delhi) వేదికగా అందాల పోటీలు జరగనున్నాయి. ఫిబ్రవరి 18 నుంచి మార్చి 9 వరకు ఢిల్లీలోని...భారత్ మండపం, ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో మిస్ వరల్డ్ పోటీలు జరగనున్నాయి. ఫైనల్స్ మాత్రం ముంబయిలోనే జరగనున్నాయి. మార్చి 9న నిర్వహించే ఫైనల్ పోటీలను రాత్రి 7.30 గంటల నుంచి 10.30 గంటల వరకు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూడోచ్చు. ఈ ఈవెంట్లో 130కి పైగా దేశాల నుంచి పోటీదారులు పాల్గొని తమ అందాలతో పాటు ప్రతిభను ప్రదర్శించేందుకు పోటీ పడనున్నారు. View this post on Instagram A post shared by Femina Miss India (@missindiaorg) (చదవండి: స్టన్నింగ్ లుక్‌లో అదిరిపోతున్న మెగా డాటర్ నిహారిక! డ్రెస్ ధర ఎంతంటే..) -
ర్యాంప్ వాక్ లో అదరగొట్టిన 71వ మిస్ వరల్డ్ అందమైన భామలు (ఫొటోలు)
-
హైదర్‌నగర్‌లో ఫ్యాబ్రిక్ స్టూడియో ప్రారంభించిన రాకింగ్ రాకేష్,సుజాత (ఫొటోలు)
-
ఇంటీరియర్ డిజైనర్‌గా గౌరీ ఖాన్ ఎంత చార్జ్ చేస్తుందో తెలుసా!
బాలీవుడు సూపర్ స్టార్ షారుఖాన్ భార్య గౌరీ ఖాన్ సక్సెస్ ఫుల్ ఇంటీరియర్ డిజైనర్ తన కెరీర్‌తో దూసుకుపోతున్నారు. ఓ ఇంటీరియర్ డిజైనర్‌గా తన ఇంటినే ఎంత విలావంతంగా తీర్చిదిద్దిందో చూస్తే సృజనాత్మకతకు నిర్వచనం గౌరీ ఖాన్ ఏమో అనిపిస్తుంది. అంతేగాదు ఓ పక్క తన భర్త కెరియర్‌కు తన వంతుగా సహాయ సహకారాలను అందిస్తూనే మహిళా వ్యాపారవేత్తగా దూసుకుపోతున్నారు. ఆధునాతన సృజనాత్మక నైపుణ్యానికి ఓ కొత్త అద్దాన్ని ఇచ్చారామె. ఈ సందర్భంగా ఇంటీరియర్ డిజైనర్‌గా తన జర్నీ ఎలా సాగింంది? అందులో తాను ఎదర్కొన్న సవాళ్ల గురించి ఓ ఇంటర్యూలో చాలా ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. అవేంటంటే.. నిజానికి గౌరీ ఖాన్ బీఏ పట్టభద్రురాలే గాక ఫ్యాషన్ డిజైన్ కోర్సు కూడా చేశారు. ఇక ఆమె తండ్రిది గార్మెంట్ వ్యాపారం కావడంతో టైలరింగ్‌లో కూడా కొంత ప్రావిణ్యం ఉంది. అయితే ఈ అర్హతల కారణంగా ఇంటీరియర్ డిజైనర్ రంగంలోకి ప్రవేశించలేదు. ముంబైలో ఐకానిక్‌గా. మంచి పర్యాటక ప్రాంతంగా పేరుగాంచిన షారుఖ్-గౌరీ ఖాన్ల ఇల్లు 'మన్నాత్' బంగ్లా అత్యద్భుతంగా ఉంటుంది. అయితే దీన్ని నిర్మించి ఏళ్లు కావొస్తుండటంతో అత్యంత సుందరంగా పునర్నిర్మించాలనుకున్నారు ఫారుఖ్. ఆ తరుణంలోనే గౌరీఖాన్‌కి ఇంటీరియర్ డిజైనర్ రంగంపై మక్కువ ఏర్పడింది. అంతేగాదు ఈ ఇంటిని అత్యంత సుందరంగా మలచడం కోసం ప్రముఖ ఆర్కిటెక్చర్లతో కలిసి పనిచేసింది కూడా. అలా ఆమె తనకు తెలియకుండానే ఇంటీరియర్ డిజైనర్‌గా మారారు. పైగా తమ విలాసవంతమైన బంగ్లా మన్నాత్ని ఎంతం అందంగా తీర్చిదిద్దిందంటో అదోక అద్భుతమైన ప్యాలెస్ అన్నంత రేంజ్లో ఉంటుంది. ప్రస్తుతం ఆ ఇంటి విలువ ఏకంగా రూ. 200 కోట్లు. అలా గౌరీ ఖాన్ తన ఇంటిని సర్వాంగాసుందరంగా మార్చే క్రమంలో ఇంటీరియర్ డిజైనర్‌గా మారారు గౌరీ. ఆ తర్వాత ఆ రంగాన్నే వృత్తిగా ఎంచుకోవాలని స్ట్రాంగ్‌గా డిసైడ్ అయ్యింది. ఈ రంగంలో మరింత మెళ్లుకవలను నేర్చుకుని తన నైపుణ్యానికి మరింత పదునుపెట్టుకోవాలనే ఉద్దేశ్యంతో 2013లో ముంబైలో గౌరీ ఖాన్ డిజైన్స్ పేరుతో డిజైన్ స్టూడియోని ఏర్పాటు చేసింది. ఇక అక్కడ నుంచి పలు విభిన్న ప్రాజెక్టులను టేకప్ చేసింది. ఈ క్రమంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కోవాల్సి వచ్చిందని చెబుతోంది గౌరీ ఖాన్. ఈ నేపథ్యంలో ఎందరో ప్రముఖ అంతర్జాతీయ డిజైనర్లతో కలిసి పనిచేసినట్లు తెలిపారు. అయితే తాను ఓ ఇంటీరియర్ డిజైనర్‌గా తన సంస్థను ప్రమోట్ చేసుకుంటూ ఈ వ్యాపారంలో తనకంటూ ఓ సముచిత స్థానాన్ని ఏర్పరచుకునేందుకు చాలా శ్రమించాల్సి వచ్చిందని అంటోంది. అంతేగాదు ముఖేష్ అంబానీ , రాబర్టో కావల్లి రాల్ఫ్ లారెన్ వంటి ప్రముఖుల ఇళ్లకు ఇంటిరీయర్ డిజైనర్‌గా పని చేశారు. తాను ఓ స్టార్ భార్యను కాబట్టి ఈ రంగంలో సులభంగా విజయం వచ్చేస్తుంది అనుకుంటారు కానీ అది ముమ్మాటికి తప్పంటారు గౌరీ ఖాన్. ఎవ్వరైన ఓ వ్యాపారం చేసేటప్పడు జస్ట్ సపోర్ట్ ఇస్తారు ఇక అక్కడ నుంచి ఎవరికీ వారే స్వయంగా వ్యాపారాన్ని నడిపుంచుకుని, విజయం దక్కించుకోవాల్సిందే అంటున్నారు గౌరీ. దేనికైనా అత్యంత ఓపికతో కూడిన నేర్పు ఉంటేనే సాధ్యమని చెబుతోంది. ఈ రంగంలో తాను ఎదుర్కొన్నఇబ్బందిని, సవాళ్లని ఓ పాఠంగా తీసుకుని ముందుకు వెళ్లేదానిని, అందువల్లే ఇంటీరియర్ డిజైనర్ ఎంట్రప్రెన్యూర్‌గా సక్సెస్ అయ్యానని అన్నారామె. ఇక ఆమె ఇంటరీయర్ డిజైనర్‌గా టేకప్ చేసిన ప్రాజెక్టులకు ఎంత ఛార్జ్ చేస్తుందంటే సుమారు రూ. 6 లక్షలు నుంచి మొదలవ్వుతుందట. ఆమె ఇంటీరియర్ డిజైన్స్ నెట్ వర్తే దాదాపు రూ. 200 కోట్లు పైనే ఉంటుందట. దీంతోపాటు ఆమె 2014లో డిజైన్ సెల్ అనే పేరుతో కాన్సెప్ట్ స్టోర్‌ని కూడా ప్రారంభించింది. ఇందులో గౌరీనే స్వయంగా తీర్చిదిద్దినా ఫర్నీచర్ డిజైన్లు ఉంటాయి. అంతేగాదు పారిస్‌లోని ప్రతిష్టాత్మకమైన మైసన్ ఎట్ ఆబ్జెట్ షోలో తన ఫర్నిచర్ డిజైన్లను ప్రదర్శించడానికి ఆహ్వానం సైతం దక్కించుకుంది. అలాగే ఫార్చ్యూన్ మ్యాగజైన్ 50 అత్యంత శక్తివంతమైన మహిళల్లో ఆమె కూడా ఒకరిగా నిలవడం విశేషం సెలబ్రెటీ హోదా కంటే ప్రత్యేక గుర్తింపు మిన్న.. ఇక్కడ షారుఖ్ స్టారడమ్ అతడి భార్యగా ఆమెకు ఉంటుంది. అలాగా ఆమె షారుఖ్ సినిమాలను నిర్మిస్తూ చిత్ర నిర్మాతగా కూడా మారింది. అయినా మహిళ సాధికారత అనే పదానికి అర్థమిచ్చేలా తనకంటూ ఓ గుర్తింపు కావాలనుకుంది. అందుకోసం నచ్చిన రంగాన్ని ఎంచుకుంది. అది మొదటగా తన ఇంటి డిజైన్ నుంచి ప్రారంభంచి.. ప్రముఖులు ఇళ్లు డిజైన్ చేసే స్థాయికి చేరుకుంది. తన సంస్థకు గౌరీ ఖాన్ అనే బ్రాండ్ నేమ్ దక్కించుకుని సక్సెఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా దూసుకుపోయింది. ఏ మహిళైనా సరే పెళ్లి, పిల్లలు కారణంతో కెరీర్‌ను ఆపేయాల్సిన పనిలేదని నిరూపించింది. అంతేగాదు పిల్లలు ఎదిగిపోయి మనం అవసరం లేదనుకున్న తరుణంలో మళ్లీ మన కెరీర్లో లేదా మనకు ఇష్టమైన రంగంలో రాణించేందుకు యత్నించి, మనకంటూ ఓ గుర్తింపుని తెచ్చుకోగలమని ప్రూవ్ చేశారు గౌరీ ఖాన్. (చదవండి: 'నారీ శక్తి'.. 'నారీ శక్తీ' అంటారుగా! చేతల్లో చూపండి!) -
100 కోట్లతో లగ్జరీ ఇల్లు కొనుగోలు చేసిన సీఈఓ.. ఇంతకి ఎవరామె?
దేశంలో లగ్జరీ ఇళ్లకు అంతకంతకూ పెరుగుతుందే తప్ప ఏ మాత్రం తగ్గడం లేదు. ఇటీవల రియల్ ఎస్టేట్ సంస్థ డీఎల్ఎఫ్ ఢిల్లీలోని గురుగ్రామ్‌లో రెసిడెన్షియల్ ప్రాజెక్ట్‌పై ఫ్రీ-లాంచ్ ప్రకటించింది. అలా అనౌన్స్ చేసిందో లేదో ఇలా లగ్జరీ ఇళ్లను కొనుగోలు చేసేందుకు ఔత్సాహికులు ఎగబడ్డారు. కేవలం 72 గంటల్లో రూ.7200 కోట్ల విలువైన ఇళ్లు అమ్ముడు పోయాయి. ఢిల్లీతో పాటు ముంబైలో ఖరీదైన ప్లాట్లు ఊహించని విధంగా అమ్ముడు పోతున్నాయి. తాజాగా, ముంబైలో ఓ లగ్జరీ ప్లాట్ అమ్ముడుపోయింది. ఆ ఫ్లాట్ విలువ అక్షరాల రూ.116.42 కోట్లు. ఇంతకి ఆ ప్లాట్‌ను కొనుగోలు చేసింది ఎవరని అనుకుంటున్నారా? 49వ ఫ్లోర్లో ఇల్లు ప్రముఖ లగ్జరీ హోం డెకోర్ కంపెనీ మైసన్ సియా ఫౌండర్, అండ్ సీఈఓ ఫ్యాషన్ డిజైనర్ వ్రాతికా గుప్తా ఆకాశ హర్మ్యాలను తాకుతూ ముంబైలోని లోయర్ పారెల్ ప్రాంతంలో 52 ఫ్లోర్లతో నిర్మించిన త్రీసిక్స్టీ వెస్ట్‌లో ఓ ప్లాన్‌ను సొంతం చేసుకున్నారు. 49వ ఫ్లోర్లో 12,138 స్కైర్ ఫీట్లో ఉన్న ఈ ఫ్లాట్‌లో సుమారు 8 కార్ల వరకు పార్కింగ్ చేసుకునే సదుపాయం ఉంది. వ్రాతికా గుప్తా ఎవరు? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ,పెర్ల్ అకాడమీ ఆఫ్ ఫ్యాషన్‌లో పూర్వ విద్యార్థిని వ్రాతిక గుప్తా. అంజుమన్ ఫ్యాషన్స్ లిమిటెడ్‌లో అపెరల్ డిజైనర్‌గా ఫ్యాషన్ ప్రపంచంలో తన వృత్తిని ప్రారంభించారు. 2009 నుండి 2011 వరకు అంజూమోడీ డిజైనర్‌గా, టూ వైట్ బర్డ్స్‌లో డిజైన్ డైరెక్టర్‌గా పని చేశారు. 2017లో వస్త్రప్రపచంలోకి అడుగు పెట్టారు వ్రాతిక. వ్రాతిక & నకుల్‌ని స్థాపించారు. భర్త నకుల్ అగర్వాల్‌తో కలిసి భారతీయ వారసత్వం ఉట్టిపడేలా బ్రాండెడ్ డిజైన్లను తయారు చేస్తున్నారు. 2022లో మైసన్ సియా అనే లగ్జరీ హోమ్ డెకర్ బ్రాండ్‌తో రియల్ ఎస్టేట్‌లో విభాగంలో రాణిస్తున్నారు. -
బ్రైడల్ ఫ్యాషన్ షో.. ర్యాంప్ వాక్ తో అదరగొట్టిన మోడళ్లు (ఫొటోలు)
-
యాపిల్‌కి గట్టి దెబ్బ.. తప్పుకొంటున్న చీఫ్ డిజైనర్
ప్రపంచవ్యాప్తంగా అత్యంత క్రేజ్ ఉండే ప్రీమియం ఫోన్లు, వాచీల తయారీ సంస్థ యాపిల్‌కి గట్టి దెబ్బ తగిలింది. ఐఫోన్లు, యాపిల్ వాచీల డిజైన్‌ను పర్యవేక్షిస్తున్న యాపిల్ ప్రొడక్ట్ డిజైన్ వైస్ ప్రెసిడెంట్ టాంగ్ టాన్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వైదొలుగుతున్నారు. కీలకమైన టాన్ నిష్క్రమణతో కంపెనీ డిజైన్ బృందానికి గట్టి దెబ్బ తగిలిందని యాపిల్ వర్గాలు బ్లూమ్‌బెర్గ్‌కి వెల్లడించాయి. యాపిల్‌కు చెందిన అత్యంత ముఖ్యమైన ఉత్పత్తులకు సంబంధించి క్లిష్టమైన నిర్ణయాలు తీసుకునేది ఈయనే. యాపిల్ వాచ్, ఎయిర్‌పాడ్స్ వంటి ఇతర ఉత్పత్తుల రూపకల్పనలో టాన్ ప్రభావం ఎక్కువగా ఉంది. యాపిల్ ఉత్పత్తుల ఫీచర్లు, వాటి రూపం, అమరిక.. అన్నీ టాన్ బృందం ఆధ్వర్యంలోనే జరుగుతాయి. ముఖ్యంగా ఎయిర్ పాడ్స్, యాపిల్ వాచీలను కంపెనీకి లాభదాయక ఉత్పత్తులుగా మార్చడంలో టాన్ కీలక పాత్ర వహించారు. ఇప్పుడు టాన్ నిష్క్రమణతో కంపెనీ ముఖ్యమైన ఉత్పత్తి శ్రేణులలో మార్పులు అనివార్యం కానున్నాయి. ఈయన నేరుగా హార్డ్‌వేర్ ఇంజినీరింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్న జాన్ టెర్నస్ కింద పనిచేశారు. మరిన్ని నాయకత్వ మార్పులు కంపెనీకి చెందిన ఇతర మ్యాక్ ప్రొడక్ట్ డిజైన్, ఐఫోన్ హార్డ్‌వేర్ ఎగ్జిక్యూటివ్‌లు ఇటీవల పదోన్నతి పొందిన నేపథ్యంలో రాబోయే సంవత్సరంలో యాపిల్ మరిన్ని నాయకత్వ మార్పులకు సిద్ధమవుతుందని నివేదిక సూచిస్తోంది. కాగా టాన్ నిష్క్రమణ కంపెనీలో కీలక కార్యనిర్వాహక నిష్క్రమణల్లో రెండోది. ఐఫోన్ మల్టీటచ్ స్క్రీన్, టచ్ ఐడీ, ఫేస్ ఐడి వంటి కీలక సాంకేతికతలపై పనిచేసిన స్టీవ్ హోటల్లింగ్ యాపిల్ నుంచి రిటైర్ అవుతున్నట్లు ఈ వారం ప్రారంభంలో వార్తలు వచ్చాయి. -
పంట చేలో పాల కంకి పల్లకిలో పిల్ల ఎంకి నవ్వినంత అందంగా...
చీర గురించి ఎన్ని పాటలు రాసినా రాయాల్సినవి ఎన్నో మిగిలే ఉంటాయి. అందమైన చీరకట్టును చూస్తే పంటచేలో పాలకంకి, పల్లకిలో పిల్ల ఎంకీ నవ్వినంత అందంగా, అద్భుతంగా ఉంటుంది. డిజైనర్ నివేదిత సంజయ్ ప్రభు వినూత్నంగా డిజైన్ చేసిన చీరల ఛాయాచిత్రాలు నెటిజనులను ఆకట్టుకుంటున్నాయి. కేరళ కసువు శారీ (వైట్ కాటన్ శారీ విత్ గోల్డెన్ జరి బార్డర్) రకరకాల వేడుకలకు క్లాసిక్ ఫేవరేట్‌గా పేరు పొందింది. డిజైనర్ నివేదిత సంజయ్ ప్రభు ఈ చీరకు సంబంధించి పురాతన టెక్నిక్లను మాన్యువల్ స్క్రీన్ ప్రింటింగ్ ద్వారా తిరిగి తీసుకువచ్చింది. ప్రతి ప్రింట్ ఒక అందమైన కథ చెబుతుంది. అరటిఆకుల నుంచి ఇంగ్లీజ్ రోజ్, చెంబూర్ ఫ్లవర్ వరకు ప్రకృతిలోని ఎన్నో అందాలు కసువు చీరెలో కనిపించి కనువిందు చేస్తాయి. -
ప్రముఖ డిజైనర్ అనూషరెడ్డి కలెక్షన్స్ స్టోర్‌లో సందడి చేసిన పాయల్ రాజ్‌పుత్ (ఫొటోస్)
-
యువతకు ఇందులో అవకాశాలున్నాయి! : సెలబ్రిటీ డిజైనర్ 'షబ్నమ్ గుప్తా'
సాక్షి, హైదరాబాద్: యువతలకు ఇంటీరియర్ డిజైనింగ్‌లో అద్భుతమైన అపారమైన అవకాశాలు ఉన్నాయని, సృజనకు పదును పెట్టుకుంటే విజయాలు సుసాధ్యమని సెలబ్రిటీ డిజైనర్ షబ్నమ్ గుప్తా అన్నారు. నగరంలోని ఫిలిమ్నగర్లో ఏర్పాటు చేసిన కోషా ఇంటీరియర్స్ ఎక్స్పీరియన్స్ సెంటర్‌ను ఆమె గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తన పీకాక్ లైఫ్ బ్రాండ్‌ను నగరానికి పరిచయం చేస్తుండటం ఆనందంగా ఉందన్నారు. తన ఇంట్లో వేసిన కలర్స్ నచ్చక సొంతంగా రంగులు వేయడం అనే అభిరుచి నుంచి ప్రస్తుతం బాలీవుడ్ స్టార్స్ పరిణితి చోప్రా, ఇర్ఫాన్ ఖాన్, కంగనారనౌత్ తదితరుల ఇళ్లకు డిజైన్ చేసే దాకా సాగిన తన 3 దశాబ్దాల ప్రయాణాన్ని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేసుకున్నారు. శతాబ్దాల నాటి ఇంటీరియర్ వస్తువులకు కొత్త సొబగులు అద్దుతూ కోషాలో ఏర్పాటు చేసిన ప్రదర్శనలోని ఉత్పత్తుల విశేషాలను సంస్థ సీఈఓ అజితా యోగేష్ వివరించారు. కార్యక్రమానికి నగరానికి చెందిన పలువురు పేజ్ త్రీ సోషలైట్స్, డిజైనింగ్ రంగ ప్రముఖులు.. హాజరయ్యారు. -
కార్ డిజైనర్ థార్ డిజైనర్!
మహింద్రా థార్‌ను చూసి భలే ఉందే అనుకున్నారా? దానిని డిజైన్ చేసింది ఒక స్త్రీ అని చాలామంది అనుకోరు. ఎందుకంటే ఆటోమొబైల్ ఇండస్ట్రీలో మగవారి ప్రాబల్యం ఎక్కువ. కాని క్రిపా అనంతన్ గొప్ప కార్ డిజైనర్‌గా ఈ రంగంలో తన ప్రభావం చూపుతోంది. మహింద్రాలో హిట్ అయిన అనేక ఎస్‌యువీలను ఆమే డిజైన్ చేసింది. ఇపుడు ఓలాకు డిజైన్ హెడ్‌గా పని చేస్తూ ఉంది. మహింద్రా సంస్థకు గొప్ప పేరు తెచ్చిన ‘థార్’ను క్రిపా అనంతన్ డిజైన్ చేసింది. ఆమె వయసు 53. పూర్తి పేరు రామ్క్రిపా అనంతన్ అయితే అందరూ క్రిపా అని పిలుస్తారు. ‘ఆటోమొబైల్ డిజైనర్ కూడా చిత్రకారుడే. కాకపోతే చిత్రకారుడు కాగితం మీద రంగులతో గీస్తే మేము లోహాలకు రూపం ఇస్తాం... శక్తి కూడా ఇచ్చి కదలిక తెస్తాం’ అంటుంది క్రిపా. బిట్స్ పిలానీలో మెకానికల్ ఇంజినీరింగ్ చేసిన క్రిపా ఆ తర్వాత ఐ.ఐ.టి ముంబైలో ఇండస్ట్రియల్ డిజైన్ చదివి 1997లో మహింద్రాలో ఇంటీరియర్ డిజైనర్‌గా చేరింది. ఆ సమయంలో తయారైన వాహనాలు– బొలెరో, స్కార్పియోలకు ఇంటీరియర్ డిజైన్ పర్యవేక్షించింది. ఆమె ప్రతిభను గుర్తించిన సంస్థ కొత్త ఎస్‌యువిని తేదలిచి దాని డిజైనింగ్ బాధ్యతలు అప్పజెప్పింది. సాధారణంగా ప్రయాణాలంటే ఇష్టపడే క్రిపా తన టూ వీలర్– బజాజ్ అవెంజర్ మీద మనాలి నుంచి శ్రీనగర్ వరకూ ఒక్కతే ప్రయాణిస్తూ వాహనం ఎలా ఉండాలో ఆలోచించింది. అంతేకాదు దాదాపు 1500 మందిని సర్వే చేయించి ఎస్యువి ఎలా ఉంటే బాగుంటుందో సూచనలు తీసుకుంది. ‘మహింద్రా ఏ బండి తయారు చేసినా దాని రూపం ఘనంగా ఉండాలి. చిన్నబండి అయినా తన ముద్ర వేయాలి. నేను సాధారణంగా ప్రకృతి నుంచి అటవీ జంతువుల నుంచి వాహనాల డిజైన్లు చూసి ఇన్‌స్పయిర్ అవుతాను. చీటాను దృష్టిలో పెట్టుకుని నేను అనుకున్న డిజైన్ తయారు చేశాను’ అందామె. ఆ విధంగా ఆమె పూర్తిస్థాయి డిజైన్‌తో మహింద్రా ఎస్యువి 500 మార్కెట్లోకి వచ్చింది. పెద్ద హిట్ అయ్యింది. దాంతో ఆటోమొబైల్ ఇండస్ట్రీలో మహిళా డిజైనర్‌గా క్రిపా సంచలనం సృష్టించింది. ఆ తర్వాత ఇతర వాహనాల డిజైన్ల బాధ్యత కూడా ఆమెకే అప్పజెప్పారు. ‘ప్రతి మనిషికీ ఒక కథ ఉన్నట్టే ప్రతి వాహనానికీ ఒక కథ ఉండాలి. అప్పుడే జనానికి కనెక్ట్ అవుతుంది’ అంటుంది క్రిపా. ఆమె తయారు చేసిన ‘ఎస్యువి 300’ మరో మంచి డిజైన్‌గా ఆదరణ పొందింది. ఇక ‘థార్’ అయితే అందరూ ఆశపడే బండి అయ్యింది. ఇప్పుడు థార్ అమ్మకాలు భారీగా ఉన్నాయి. మహింద్రా సంస్థ ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి ఉపక్రమిస్తుండగా 2021లో తన సొంత ఆటోమొబైల్ డిజైన్ స్టూడియో ఏర్పాటు కోసం సంస్థ నుంచి బయటకు వచ్చింది క్రిపా. అయితే ఇప్పుడు ఓలా గ్రూప్‌కు డిజైన్హెడ్గా పని చేస్తోంది. అంటే ఇకపై ఓలా గ్రూప్ నుంచి వెలువడే వాహనాలు ఆమె రూపకల్పన చేసేవన్న మాట. ఇరవైమంది డిజైనర్లతో కొత్త ఆలోచనలకు పదును పెట్టే క్రిపా తన బృందంలో కనీసం 5గురు మహిళలు ఉండేలా చూసుకుంటుంది. మహిళల ప్రతిభకు ఎప్పుడూ చోటు కల్పించాలనేది ఆమె నియమం. క్రిపాకు ఏ మాత్రం సమయం దొరికినా పారిస్కో లండన్‌కో వెళ్లిపోతుంది. అక్కడ ఏదైనా కేఫ్‌లో కూచుని రోడ్డు మీద వెళ్లే స్పోర్ట్స్ కార్లను పరిశీలిస్తూ ఉండటం ఆమెకు సరదా. ‘2050 నాటికి ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఎలా ఉంటుందో ఊహించుకుంటూ ఇవాళ్టి నుంచి మన పనిని తీర్చిదిద్దుకోవాలి’ అంటుందామె.ఇంత దార్శనికత ఉన్న డిజైనర్ కనుక విజయం ఆమెకు డోర్ తెరిచి నిలబడుతోంది. (చదవండి: దేశంలోనే తొలి బధిర మహిళా అడ్వకేట్ సారా! చివరికి సుప్రీం కోర్టు..) -
గ్లాస్ సీలింగ్ బ్రేక్స్:ఈ మెకానికల్ ఇంజనీర్ గురించి తెలిస్తే ఫిదా
దేశీయ ఐఐటీ గ్రాడ్యుయేట్లు ప్రపంచంలోని కొన్ని అతిపెద్ద కంపెనీలను లీడ్ చేస్తున్నారు. కొత్త ఆవిష్కరణకు నాంది పలుకు తున్నారు. పురుషులతో పాటు సమానంగా మహిళలు మెకానికల్ ఇంజనీరింగ్, డిజైనింగ్ రంగాల్లో సత్తా చాటుతున్నారు. కొత్త మహీంద్రా థార్‌ను డిజైన్ చేసిన మహిళ, BITS పిలానీకి చెందిన మెకానికల్ ఇంజనీర్ రామ్‌కృపా అనంతన్ విశేషంగా నిలుస్తున్నారు. ఆటోమోటివ్ పరిశ్రమలో రామ్‌కృపా అనంతన్ పేరు తెలియని వారు లేరు అతిశయోక్తి కాదు.ముఖ్యంగా దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న ఆదరణ నేపథ్యంలో ఓలా ఎలక్ట్రిక్‌లో డిజైన్ హెడ్‌గా స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలుస్తున్నారు. అంతేకాదు సొంత డిజైన్ స్టూడియోను కూడా నిర్వహిస్తున్న రామ్ కృపా అనంతన్ గురించి, ఆమె సక్సెస్ జర్నీ గురించి తెలుసుకుందాం. మహీంద్రా అండ్ మహీంద్ర అండ్ లేటెస్ట్ వాహనాల్లో థార్ SUVకున్న క్రేజ్గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరి అంతటి ప్రజాదరణ ఉన్న థార్ 2వ తరం థార్ ఆవిష్కారం వెనుక చీఫ్ డిజైనర్ రామ్ కృపా. పాపులర్ బొలెరో, మహీంద్రా SUV విభాగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన ఘనత కూడా ఆమెదే. థార్, XUV700, స్కార్పియోలాంటి మహీంద్రా ఉత్పత్తులకు చీఫ్ డిజైనర్ గా తన సత్తా చాటుకున్నారు. ఎవరీ రామ్ కృపా అనంతన్ బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి మెకానికల్ ఇంజినీరింగ్ , ఐఐటీ బాంబే నుంచి మాస్టర్ ఆఫ్ డిజైన్ ప్రోగ్రామ్ ను పూర్తి చేశారు. ఆ తర్వాత 1997లో మహీంద్రా అండ్ మహీంద్రాలో ఇంటీరియర్ డిజైనర్‌గా కరియర్‌ను మొదలు పెట్టారు. 2005లో డిజైన్ హెడ్‌గా మహీంద్రా XUV 500 SUVని డిజైన్ చేసిన క్రెడిట్ దక్కించుకున్నారు.అలాగే XUV 700, స్కార్పియో ఐకానిక్ డిజైన్లను రూపకల్పన చేశారు. దాదాపు 10 సంవత్సరాల తర్వాత, రామ్‌కృపా అనంతన్ చీఫ్ డిజైనర్ పాత్రకు పదోన్నతి పొందారు. క్రక్స్ స్టూడియో, మైక్రో ఈవీ కాన్సెప్ట్ రెండేళ్ల తరువాత ప్రస్తుతం ఆమె సొంతంగా KRUX డిజైన్ స్టూడియో స్థాపించారు. 20 శాతం అప్‌సైకిల్ భాగాలను ఉపయోగించి Two 2 అనే మైక్రో-మొబిలిటీ కాన్సెప్ట్ వాహనాన్ని ఆవిష్కరించారు. చిన్న బ్యాటరీతో కూడా ఎక్కువ పరిధినిస్తుంది. 'ఓలా ఎలక్ట్రిక్'లో కృపా అనంతన్ దేశీయ ఈవీ మేకర్ బెంగళూరుకు చెందిన కంపెనీ తన ఎలక్ట్రిక్ కారు ‘ఓలా ఎలక్ట్రిక్ సెడాన్‌ను విడుదల చేయనుంది. దీని ధర రూ. 15 నుండి రూ. 25 లక్షల శ్రేణిలో ఉంటుందని అంచనా. గత ఏడాది ఆగస్టులో రామకృపా అనంతన్ ఓలా ఎలక్ట్రిక్స్‌లో డిజైన్ హెడ్‌గా చేరారు. ద్విచక్ర వాహనం , రాబోయే నాలుగు-చక్రాల విభాగాలకు ఆమె లీడ్‌గా ఉన్నారు. -
పెళ్లిలో ఆలియా భట్‌ను ఫాలో అయిన పరిణీతి చోప్రా, ఫోటోలు వైరల్
బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా, ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట వివాహ వేడుక రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ లీలా ప్యాలెస్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలను పరిణీతి సోషల్ మీడియా వేదికగా పంచుకోగా కాసేపటికే ఫోటోలు వైరల్‌గా మారాయి. 'మేము మొదటి సారి బ్రేక్‌ఫాస్ట్ కోసం కలిసి కూర్చున్నప్పుడే మా హృదయాలు కలిశాయి. ఈరోజు కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూశాను. ఎట్టకేలకు అందరి ఆశీర్వాదంతో మేము ఒక్కటయ్యాం. మేము ఒకరు లేకుండా ఒకరు బ్రతకలేము' అంటూ తన సంతోషాన్ని పంచుకుంది. దీంతో పరిణీతి-రాఘవ్‌ల దంపతులకు సెలబ్రిటీలు సహా నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. వీరిద్దరి జోడి చూడచక్కగా ఉందంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ఇక పెళ్లి వేడుకలో పరిణీతి చోప్రా మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన లెహెంగాలో మెరిసిపోగా, పవన్ సచ్‌దేవా డిజైన్ చేసిన డిజైనర్ అవుట్‌ఫిట్‌లో రాఘవ్ చద్దా కనిపించారు. ఈ ఇద్దరూ పేస్టల్ కలర్ దుస్తుల్లో అందంగా కనిపించారు. ఈమధ్య కాలంలో పేస్టల్ కలర్స్, న్యూడ్ మేకప్ ట్రెండ్ బాగా వినిపిస్తోంది. ఆలియా భట్ నుంచి ఇప్పుడు పరిణీతి చోప్రా వరకు.. సింపుల్‌గా, పేస్టల్ కలర్స్‌లో నేచురల్‌గా కనిపించేందుకే సెలబ్రిటీలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఒకప్పుడు పెళ్లంటే రెడ్, ఎల్లో, గ్రీన్ వంటి సాంప్రదాయ కలర్స్ దుస్తుల్లోనే వధూవరులు కనిపించేవారు. మరీ ముఖ్యంగా అమ్మాయిలకు హెవీ లెహంగాలు, భారీ నగలు, హెవీ మేకప్ వరకు.. అంతా భారీగా ఉండాలని కోరుకునేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. హెవీ అండ్ కాస్ట్లీ దగ్గర్నుంచి ఇప్పుడు సింపుల్ అండ్ క్లాసిక్ అనే ట్రెండ్ నడుస్తోంది. దీనికి తగ్గట్లే న్యూడ్ మేకప్ విత్ పేస్టల్ కలర్స్ అంటూ మరో అద్భుతమైన ట్రెండ్ సెట్ చేశారు మన బాలీవుడ్ ముద్దుగుమ్మలు. ఇక మరో విశేషం ఏమిటంటే.. పరిణీతి చోప్రా ఆలియా భట్‌ను ఫాలో అయ్యిందనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఆలియా కూడా తన పెళ్లికి క్రీం పేస్టల్ కలర్ అవుట్‌ఫిట్‌లో అందంగా ముస్తాబైంది. అంతేకాకుండా మెహందీ ఫంక్షన్లోనూ చాలా సింపుల్ మెహందీలో దర్శనమిచ్చింది. ఇప్పుడు పరిణీతి కూడా అచ్చంగా ఆలియాలానే క్రీం కలర్ పేస్టల్ లెహంగా, చాలా సింపుల్ మెహందీలో కనిపించింది. దీంతో వీరిద్దరి లుక్‌ని పోలుస్తూ పలు ఫోటోలు ఇంటర్నెట్లో దర్శనమిస్తున్నాయి. -
పరిణీతి- రాఘవ్ పెళ్లి.. అందుకోసం 2500 గంటలు పట్టిందా??
బాలీవుడ్ భామ పరిణీతి చోప్రా పెళ్లిబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఆదివారం ఉదయ్‌పూర్‌లోని లీలా ప్యాలెస్‌లో ఆప్ ఎంపీ రాఘవ్ చద్దాను పరిణయమాడింది. ఈ వివాహానికి సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు కూడా పెద్దఎత్తున హాజరయ్యారు. వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సైతం సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఈ జంట వెడ్డింగ్ దుస్తుల్లో దిగిన ఫోటోలు తెగ వైరలవుతున్నాయి. ఇవీ అభిమానులు సైతం నూతన జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. (ఇది చదవండి: నాకెలాంటి సంబంధం లేదు.. పైశాచిక ఆనందం కోసమే: టాలీవుడ్ హీరోయిన్) పరిణీతి లెహంగాపై చర్చ ఇదిలా ఉంటే పెళ్లిలో పరిణీతి చోప్రా ధరించిన డ్రెస్‌పైనే నెట్టింట చర్చ మొదలైంది. వధువుగా హీరోయిన్ ధరించిన లెహంగా డిజైన్ ప్రత్యేకంగా కనిపించడంతో అందరి దృష్టి దానిమీదే పడింది. అయితే వీరి పెళ్లికి దుస్తులను ప్రముఖ డిజైనర్ మనీశ్ మల్హోత్రా సిద్ధం చేశారు. వారి కోసం ప్రత్యేకంగా రూపొందించిన డ్రెస్సుల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. పరిణీతి ధరించిన లెహంగా ప్రత్యేకతలను ఆయన వివరించారు. పరిణీతి కోసం లెహంగా రూపొందించడానికి దాదాపు 2,500 గంటల సమయం పట్టిందని మనీష్ మల్హోత్రా తెలిపారు. ఇది పూర్తిగా హ్యాండ్ ఎంబ్రాయిడరీతో చేసినట్లు వెల్లడించారు. ఈ అందమైన లెహంగాను పాతకాలపు బంగారు దారంతో రూపొందించామన్నారు. అతిథులను మంత్రముగ్దులను సున్నితమైన మెష్, దుపట్టా, ముత్యాలు, ప్రతి ఒక్కటి ఫెయిర్‌తో అలంకరించామని డిజైనర్ మనీశ్ పేర్కొన్నారు. అంతే కాకుండా పరిణీతి డ్రెస్‌పై రాఘవ్ పేరు ముద్రించినట్లు తెలుస్తోంది. View this post on Instagram A post shared by @parineetichopra -
హ్యండ్ల్యూమ్స్తో.. ఆకట్టుకునేలా ఇండోవెస్ట్రన్ స్టైల్స్!
యువ ఆలోచనల్లో పర్యావరణం కళగా రూపుదిద్దుకుంటోంది. ఫ్యాషన్ వేర్లో ప్రత్యేకతతో పాటు నేచర్ పట్ల బాధ్యతనూ తెలుసుకుంటుంది. మనవైన చేనేతలు పెద్దవాళ్లకే సూట్ అవుతాయన్న ఆలోచన నుంచి మోడర్న్ టర్న్ తీసుకుంటోంది. హ్యాండ్లూమ్స్‌తో ఇండోవెస్ట్రన్ స్టైల్స్ ఆకట్టుకునేలా డిజైన్ చేయిస్తోంది హైదరాబాద్ వాసి, నటి, మోడల్ నిత్యాశెట్టి. హ్యాండ్లూమ్స్‌తో తన జర్నీఎప్పుడూ ప్రత్యేకమే అని చెబుతోంది నిత్య. ప్రొఫెషనల్స్ కాదు...ఈ డ్రెస్సులు ధరించడానికి మోడల్స్ ఎవరూ ప్రొఫెషనల్స్ కాదు. సాఫ్ట్వేర్, వెయిట్రెస్, ఇంటీరియర్ డిజైనర్, డెంటిస్ట్.. ఇలా ఇతర రంగాలలో ఉద్యోగాలు చేసుకుంటున్నవారు నేను చేసే డ్రెస్సులకు మోడల్స్‌గా చేస్తున్నారు. ఏ రంగంలో ఉన్నవారైనా వీటి ద్వారా దుస్తులు మన క్యారెక్టర్ని చూపాలన్నదే మెయిన్. మేకప్ వంటి హంగులేవీ లేకుండా నేచరల్‌గా మా డిజైన్స్‌ని ప్రెజెంట్ చేయాలయనుకున్నాను. దీనివల్ల అందరికీ రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇటీవల నేషనల్ హ్యాండ్లూమ్ డే రోజున నిర్వహించిన ఫ్యాషన్ షోలో మా డిజైన్స్‌ని కూడా ప్రదర్శించి, మాదైన ప్రత్యేకతను చూపాం. హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్స్‌లో స్టాల్స్ పెట్టి, మా వర్క్‌ని మరింత మందికి చేరువయ్యేలా చూస్తున్నాను. బ్రెజిల్లో జరగబోయే కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల నుంచి పది యూనిట్స్ వెళుతున్నాయి. అందులో మా ఇతిహాస కూడా ఉండటం నాకు చాలా ఆనందాన్నిస్తుంది’’ అని వివరిస్తున్నారు నిత్య. ‘‘హ్యాండ్లూమ్స్ అంటే నేటితరం చీరలు, కుర్తా పైజామా వరకే అనుకుంటారు. కానీ, యువత ధరించేందుకు వీలుగా రెగ్యులర్ వేర్‌గా, ఫ్యాషన్ వేర్‌గా హ్యాండ్లూమ్స్ను తీసుకు రావాలనుకున్నాను. ఇందుకు.. పోచంపల్లి, పుట్టపాక, పెడన, ఒరిస్సా, భువనేశ్వర్ హ్యాండ్లూమ్స్ వారిని కలిశాను. వీటిలో నుంచి చందేరీ, ఇక్కత్, చికంకారి, శిబోరి, బాందినీ, టై అండ్ డై .. వంటివి డ్రెస్ డిజైన్స్‌లో ప్రధానంగా తీసుకున్నాను. హ్యాండ్లూమ్స్‌తో బ్లేజర్లు, ఖఫ్తాన్స్, ప్లాజో, లాంగ్ అండ్ షార్ట్ ఫ్రాక్స్, షర్ట్స్.. నేటి యువతకు మెచ్చేలా మెన్ అండ్ ఉమెన్‌కి క్యాజువల్ అండ్ ఆఫీస్వేర్ ‘ఇతిహాస’ పేరుతో రూపొందిస్తున్నాం. ఈ ఇండో–వెస్ట్రన్ స్టైల్స్‌తో నేటితరానికి మన హ్యాండ్లూమ్స్ని దగ్గర చేయాలని, చేనేతకారులకు ఉపాధి అవకాశాలను మెరుగుపరచాలన్నదే నా ఆలోచన. (చదవండి: విలేజ్ అండ్ వింటేజ్ స్టైల్!) -
లెహంగా తయారీకి 10 వేల గంటలా.. ఎందుకంత స్పెషల్?
క్రికెటర్ కేఎల్ రాహుల్- బాలీవుడ్ నటి అతియా శెట్టి ఈనెల 23 వివాహబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. బంధువులు, సన్నిహితులు, స్నేహితుల మధ్య ఒక్కటైంది ఈ ప్రేమజంట. సునీల్ శెట్టి ఫామ్‌హౌస్ ఖందాలాలో అత్యంత వైభవంగా నిర్వహించారు. పెళ్లిరోజు సంప్రదాయ దుస్తుల్లో ఉన్న వధూవరుల ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి. అయితే అతియా శెట్టి ధరించిన పింక్ కలర్ లెహంగాపైనే బీ టౌన్లో చర్చ నడుస్తోంది. ఈ వేడుకలో అతియా ధరించిన లెహంగా స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది అయితే ఆ డ్రెస్ ఎందుకంత స్పెషల్? అందులో ప్రత్యేకత ఏంటో ఓ లుక్కేద్దాం. (ఇది చదవండి: మా జీవితకాలం గుర్తుండిపోయే రోజు: అతియా శెట్టి ఎమోషనల్ పోస్ట్) పెళ్లిలో అతియా శెట్టి ధరించిన లెహంగా తయారీకి దాదాపు 10,000 గంటల సమయం పట్టిందని ప్రముఖ డ్రెస్ డిజైనర్ అనామిక ఖన్నా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అతియా శెట్టి లెహంగా తయారీకి 416 రోజులు, 10 వేల గంటలు పట్టిందని ఆమె తెలిపారు. అతియా శెట్టి వివాహ లెహంగాను పూర్తిగా చేతితో తయారు చేసినట్లు పేర్కొన్నారు. జర్దోజీ, జాలీ వర్క్ పట్టుతో రూపొందించినట్లు వివరించారు. డిజైనర్ మాట్లాడుతూ.. 'అతియా చాలా చక్కగా,అందమైన అమ్మాయి. ఆమె వధువు కాబోతుందన్న వాస్తవాన్ని ప్రతిధ్వనించేలా లెహంగా డిజైన్ చేశాం. ఆమె కోసం ప్రత్యేకంగా తయారు చేశాం. అతియాపై ప్రేమతో ఆ వధువు ధరించిన లెహంగాను పదివేల గంటలపాటు కష్టపడి రూపొందించాం.' అని అనామిక చెప్పకొచ్చింది. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) (ఇది చదవండి: అతియా శెట్టి- కేఎల్ రాహుల్ పెళ్లి.. వారికి మాత్రమే ఎంట్రీ) -
సూపర్ వ్యాన్.. దీని స్పెషాలిటీ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
ఫొటోలో ఉన్నది కొత్త మోడల్ వ్యాన్లా కనిపిస్తోంది కదూ! ఇది కొత్త మోడల్ వ్యాన్ మాత్రమే కాదు, దాదాపు ఉభయచర వాహనం. దాదాపు ఉభయచర వాహనమేంటి అనుకుంటున్నారా? ఔను! ఇది పూర్తి ఉభయచర వాహనం కాదు గాని, ఆపద్ధర్మానికి ఉభయచర వాహనంగానే పనికొస్తుంది. ఇది ఎలాంటి రోడ్ల మీదనైనా సునాయాసంగా ప్రయాణిస్తుంది. అంతేకాదు, వరదనీరు ఉధృతంగా రోడ్లను ముంచెత్తినప్పుడు కూడా ఇది సునాయాసంగా ప్రయాణించగలదు. ‘ఎస్ట్యువరీ హోపర్’ పేరిట బ్రిటిష్ ఆటోమొబైల్ డిజైనర్ జోర్డాన్ బేమ్స్ ఈ విచిత్ర వాహనానికి రూపకల్పన చేశాడు. ఇది ‘సెమీ యాంఫీబియస్ వెహికల్’ అని చెబుతున్నారు. అంటే దాదాపు ఉభయచర వాహనమన్న మాట! వరదల్లో చిక్కుకుపోయిన వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ఇది భేషుగ్గా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ఇలాంటి వాహనాలు తరచుగా వరదల బారినపడే మన రోడ్ల మీదకు వస్తే బాగుంటుంది కదూ! చదవండి: Smartphone Printer: సెల్ఫీ లవర్స్ కోసం.. అదిరిపోయే ఫీచర్ ఈ స్మార్ట్‌ఫోన్ సొంతం! -
జీవితానికి రంగులద్దింది!
జీవితాన్ని ప్రారంభించేటప్పుడు తెలియదు ఆ జీవితం ఎన్ని మలుపులు తీసుకుంటుందో. మన ఆకాంక్షలు కొన్ని, అవకాశాలు కొన్ని, అభిరుచులు మరికొన్ని. వీటన్నింటినీ కలబోసుకుని జీవితాన్ని డిజైన్ చేసుకోవాలని ఉండడం ఏ మాత్రం తప్పులేదు. అది మనిషి హక్కు కూడా. అయితే అక్కడే మనిషి ముందు అనారోగ్యం రూపంలో ఓ ప్రశ్నార్థకం నిలబడుతుంది. ఆ సవాల్‌కు దీటైన సమాధానాన్ని విసిరి లైఫ్‌ని కలర్ఫుల్గా మలుచుకుంది ప్రకృతి గుప్తా. హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన ప్రకృతి గుప్తా ఉన్నతవిద్య కోసం కెనడాకి వెళ్లింది. అక్కడి యూనివర్సిటీ ఆఫ్ విండ్సర్‌లో అండర్ గ్రాడ్యుయేషన్ చేసింది. ఆ తర్వాత ఎంబీఏ పూర్తి చేసి క్రిజ్లర్ ఫైనాన్సియల్ కంపెనీలో ఉద్యోగం, కొంతకాలానికి మెర్సిడెస్ బెంజ్ కంపెనీలో ప్రాజెక్ట్ లీడ్ ఉద్యోగంలో చేరింది. ఆ తర్వాత పెళ్లితో ఆమె వర్క్ ప్లేస్ దుబాయ్‌కి మారింది. అక్కడ ఫియట్ క్రిజ్లర్ గ్రూప్‌తో పని చేసింది. ఇక్కడి వరకు జీవితంలో ప్రతి సోపానమూ ఆనందకరమే. అప్పుడు మొదలైంది అనారోగ్యం రూపంలో ఓ పరీక్ష. అనేక పరీక్షల తర్వాత నిర్ధారణ అయిన విషయం హాడ్గ్కిన్స్ లింఫోమా క్యాన్సర్ అని. జీవితం మీద ఆశలన్నీ ఆవిరైపోయే పరిస్థితి అది. క్యాన్సర్‌ను జయించాలంటే ట్రీట్మెంట్ కంటే ప్రధానమైనది మానసిక స్థయిర్యం. జయించగలననే ధీమాతో పోరాడినప్పుడే దేహం ట్రీట్మెంట్కు సహకరిస్తుంది. ప్రకృతి తన జీవితం మీద సడలని విశ్వాసంతో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఆలోచించింది. ‘ఈ విరామానికీ ఓ అర్థం ఉండి ఉంటుంది’ అని గట్టిగా నమ్మింది కూడా. చిన్నప్పుడు కలగన్న భవిష్యత్తు కళ్లముందు మెదలసాగింది. నాన్న స్వీట్ వ్యాపారి ‘‘నాన్న హైదరాబాద్‌లో స్వీట్స్ వ్యాపారి. స్వీట్స్ వ్యాపారి మాత్రమే కాదు, చాలా స్వీట్ వ్యాపారి కూడా! ఉద్యోగుల విషయంలో ఆయన చాలా బాధ్యతగా ఉండేవారు. నాన్నే నాకు రోల్‌మోడల్. నాన్నలా ఎంటర్ప్రెన్యూర్ కావాలని ఉండేది. అయితే బిజినెస్‌లో చాలెంజెస్ ఎక్కువ. ఉద్యోగమే హాయి అని నన్ను సౌకర్యవంతంగా ఉంచడానికే నిర్ణయించుకున్నారు మా వాళ్లు. నేనూ అదేబాటలో నడిచాను. కానీ ఈ విరామం నాలోకి నేను ప్రయాణించడానికి దోహదం చేసింది. కీమోథెరపీ కోసం మూడు నెలలు, రేడియేషన్ థెరపీ కోసం మరో రెండు నెలలు హాస్పిటల్లో నాలుగ్గోడల మధ్యనే గడిపాను. ఎటు చూసినా రంగు వెలసిన జీవితంలా తెల్లటి గోడలు. ‘నా జీవితానికి నేనే రంగులద్దాలి. నా జీవితాన్ని నేనే రీ డిజైన్ చేసుకోవాలి’ అని నిశ్చయించుకున్నాను. ఆ సంకల్పం నుంచి పుట్టుకొచ్చినదే కఫ్తాన్ కంపెనీ. ఇది నా విజయం ‘‘కఫ్తాన్లో నాతోపాటు యాభై మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. వారిలో ముప్పై ఐదు మంది మహిళలే. సాధారణంగా ఇలాంటి చిన్న కంపెనీలలో వర్కింగ్ సెక్షన్లో మహిళలు, పర్యవేక్షణ విభాగంలో మగవాళ్లు కనిపిస్తుంటారు. కానీ నా కంపెనీలో మేనేజర్, అకౌంటెంట్, వర్క్ సూపర్వైజర్ వంటి కీలక స్థానాల్లో మహిళలే ఉన్నారు. దీనిని 2011లో స్థాపించాను. దాదాపుగా కంపెనీ తొలినాళ్ల నుంచి కొనసాగుతున్న వాళ్లు ఉన్నారు. కఫ్తాన్తో పాటు నాన్న స్థాపించిన ‘క్రాక్ హీల్’ ఆయింట్మెంట్ కంపెనీ కూడా నేనే చూసుకుంటున్నాను. దానిని మా నాన్న సక్సెస్ చేసి నా చేతికిచ్చారు. దానిని నడిపించడంలో పెద్ద కిక్ ఉండదు. ఇది నా బ్రెయిన్ చైల్డ్. దీనిని విజయపథంలో నడిపించడం నా చాలెంజ్. ఈ జర్నీ నాకు సంతోషంగా ఉంది’’ అని వివరించింది ప్రకృతి గుప్తా. – వాకా మంజులారెడ్డి కఫ్తాన్... అంటే వదులుగా ఉండే చొక్కా. ఇది పర్షియా పదం. టర్కీ, ఫ్రాన్స్‌లో కూడా వాడుకలో ఉంది. మధ్యధరా ప్రాంతంలో నివసించే వాళ్లు ధరిస్తారు. మన దగ్గర నైట్డ్రస్గా వాడుకలో ఉన్న మోడల్ని సరికొత్తగా పగలు ధరించే మోడల్‌గా మార్చాను. మనం ధరించిన దుస్తుల విషయంలో దేహం ఎటువంటి ఆంక్షలనూ పెట్టకూడదు. ఒంటికి తగలగానే హాయిగా ఫీలవ్వాలి. అదే సౌకర్యాన్ని రోజంతా ఉంచగలగాలి. ధరించిన డ్రస్‌ను రోజంతా ఒంటి మీద ఉంచుకోగలగాలి... అనే ఆలోచనకు ప్రతిరూపమే ఈ లాంజ్‌వేర్. అలాంటి మెటీరియల్‌ను ఎంపిక చేయడం, ఆకర్షణీయమైన డిజైన్లకు రూపకల్పన చేయడమే నా సక్సెస్. ఇక వాటికి మరిన్ని సొబగుల కోసం దేశంలో రకరకాల అద్దకాలు, రకరకాల సంప్రదాయ డిజైన్లను ఎంచుకున్నాను. నేను అనుకున్న థీమ్‌తో పని చేస్తున్న వాళ్లు మార్కెట్లో పెద్దగా లేరు. ఇక ఆలస్యం చేయలేదు. అనారోగ్యం నుంచి కోలుకున్న వెంటనే వస్త్రాల తయారీ మొదలుపెట్టాను’’ అని తన జీవితానికి హైదరాబాద్‌లో కొత్త గమ్యాన్ని నిర్దేశించుకున్న వైనాన్ని వివరించింది ప్రకృతి. -
ప్లానెట్ 3 ఆర్: పాలిథిన్ ఫ్యాషన్
మనం పెరిగిన వాతావరణం, చుట్టూ ఉన్న పరిసరాలు మన భవిష్యత్‌ను తీర్చిదిద్దడంలో కీలకపాత్ర పోషిస్తాయి. నైజిరియాకు చెందిన అడెజోక్ లసిసి జీవితంలో సరిగ్గా ఇదే జరిగింది. చిన్నప్పటినుంచి లసిసికి చుట్టూ ఉన్న పరిసరాలను ఆసక్తిగా, నిశితంగా పరిశీలించే అలవాటు. తరచూ ప్లాస్టిక్, గుడ్డ ముక్కల వ్యర్థాలను రోడ్లపక్కన పడేయడం, దాని ఫలితంగా డ్రైనేజీలు పూడిపోయి నీళ్లుపోవడానికి వీలు లేక ఎక్కడికక్కడ మురుగు నీరంతా నిలిచిపోవడం... అప్పటి నుంచి ఈ సమస్యకు పరిష్కారం చూపాలనుకునేది. క్రమేణా వయసుతోపాటు ఆలోచనలు కూడా పెరిగి పెద్దయ్యాయి. దాని ఫలితమే డిగ్రీ పూర్తయ్యాక ఏకంగా రీసైక్లింగ్ కంపెనీ పెట్టి ప్లాస్టిక్‌తో ఫ్యాషనబుల్ ఉత్పత్తుల డిజైనింగ్! ప్లాస్టిక్ వ్యర్థాలను చూస్తూ పెరిగిన లసిసికి ఎలాగైనా దానికి పరిష్కారం కనుగొనాలన్న కుతూహలం పెరిగింది. ఒకపక్క చదువుకుంటూనే మరోపక్క ఆలోచిస్తుండేది. డిగ్రీ పూర్తయిన తరువాత ఇంటికి వచ్చింది. అప్పటికీ ఇంటి పరిసరాల్లో ఎటువంటి మార్పులూ కనిపించలేదు. కాలుష్య సమస్య మరింత ఎక్కువైంది. ఇలా అనుకుంటుండగానే వాటర్ ప్యాకెట్ల వ్యర్థాలు టన్నులకొద్ది పేరుకు పోవడం గమనించింది. వీటితో ఏం చేయాలి అనుకున్న సమయంలో లసిసి తల్లి దగ్గర నేత పని నైపుణ్యాలు నేర్చుకుని వాటర్ ప్యాకెట్లతో వస్త్రాన్ని రూపొందించింది. దీంతో ఏదైనా తయారు చేయవచ్చన్న ఆలోచన వచ్చింది. రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ నైజీరియాలో వాటర్ ప్యాకెట్స్ తయారీలో నైలాన్ ను వాడుతారు. ఈ ప్లాస్టిక్‌ను రీ సైకిల్ చేయడం కంటే కొత్తగా తయారు చేయడానికి ఖర్చు తక్కువ. అందువల్ల పారిశ్రామిక వర్గాలు కొత్త వాటర్ ప్యాకెట్స్‌ను తయారు చేస్తాయి. అవి టన్నుల కొద్దీ చెత్తలో పేరుకు పోతుంటాయి. వీటిని రీసైకిల్ చేయడమే లక్ష్యంగా ‘ప్లానెట్ 3ఆర్ (రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్) కంపెనీని ప్రారంభించింది లసిసి. ప్లానెట్ 3 ఆర్ వాడిపడేసిన వాటర్ ప్యాకెట్లను వివిధ ప్రాంతాల నుంచి సేకరిస్తుంది. దీనికోసం కొన్ని ముఖ్యమైన ప్రదేశాల్లో డస్ట్‌బిన్ లను ఏర్పాటు చేసింది. ఆ చుట్టుపక్కల వారంతా దానిలో ప్లాస్టిక్‌ను పడేయడం వల్ల సేకరణ సులభం అయింది. ఇలా సేకరించిన ప్లాస్టిక్‌ను శుభ్రం చేసి ఎండబెట్టి, తరవాత దారాలుగా కత్తిరించి మగ్గం మీద వస్త్రంగా నేస్తుంది. దీని తయారీలో తొంబై శాతం ప్లాస్టిక్, పదిశాతం గుడ్డముక్కలను వినియోగిస్తుంది. ఇలా తయారైన బట్టతో చెప్పులు, బూట్లు, స్కూలు బ్యాగ్‌లు, హ్యాండ్ బ్యాగ్‌లు, ఇంటి అలంకరణ వస్తువులు, ఫ్యాషన్ డ్రెస్‌లుగా తీర్చిదిద్దుతుంది. అంతేగాక మహిళలు, పిల్లలకు ప్లాస్టిక్ రీసైక్లింగ్‌పై అవగాహన కూడా కల్పిస్తుంది. కొన్ని వందలమంది వికలాంగ యువతీ యువకులకు రీసైక్లింగ్‌పై శిక్షణ ఇచ్చింది. నైజీరియా, ఆఫ్రికా దేశాల్లో ప్రత్యేక శిక్షణాతరగతులను నిర్వహిస్తోంది. లసిసి చేస్తోన్న పర్యావరణ కృషికి గాను ఆమెను అనేక అవార్డులు కూడా వరించాయి. రోజుకి అరవై మిలియన్ల వాటర్ ప్యాకెట్లు! ‘‘నైజిరియాలో రోజుకి యాభై నుంచి అరవై మిలియన్ల నీటిప్యాకెట్లు అవసరమవుతాయి. అరలీటరు వాటర్ ప్యాకెట్లను వీధుల్లోని షాపులు, సూపర్ మార్కెట్లలో విక్రయిస్తారు. ఇప్పటికీ కూడా 39 శాతం మందికి సరైన మంచి నీటి సదుపాయం లేదు. అందువల్ల వాటర్ ప్యాకెట్లపై ఎక్కువమంది ఆధారపడుతున్నారు. వాటర్ ప్యాకెట్లు దాహం తీరుస్తున్నప్పటికీ వాడి పడేసిన తరువాత అవి తీవ్ర కాలుష్యానికి దారితీస్తున్నాయి. ఏడాదికి లక్షా ముప్పైవేల టన్నుల ప్లాస్టిక్ వేస్ట్ ఒక్క వాటర్ విభాగం నుంచి వస్తోంది. దీన్ని తన చిన్నతనం నుంచి నిశితంగా గమనించిన లసిసి కాలుష్యానికి పరిష్కారం వెతుకుతూ ప్లానెట్ 3 ఆర్ ను నెలకొల్పింది. -
ఫ్యాబ్రిక్ ఇంజినీర్!
‘‘జీవితంలో అది అవ్వాలనుకుని ఇదయ్యాం! కాలం కలిసి రాక నేను అనుకున్నది జరగలేదు అందుకే చివరికి ఇలా స్థిరపడ్డాను’’ అని వాపోతుంటారు చాలామంది. అయితే, మనలో నైపుణ్యం, సాధించాలన్న పట్టుదల, అడుగు ముందుకేసే ధైర్యం ఉంటే.. కాస్త ఆలస్యం అయినా అనుకున్నది సాధించవచ్చని నిరూపించారు సంజుక్తా దత్త. అసోంలోని నాగౌన్ జిల్లాలో పుట్టిన సంజుక్తా దత్తాకు చిన్నప్పటినుంచి చీరలంటే మక్కువ. అస్సామీ మహిళలు సాంప్రదాయంగా ధరించే మేఖల ఛాడర్ (రెండు రకాల బట్ట, రంగులలో తయారయ్యే చీర) అంటే బాగా ఇష్టం. ఈ చీరలను మరింత అందంగా ఎలా తీర్చిదిద్దవచ్చో ఆలోచించి, వివిధ రకాల డిజైన్లతో చీరలు రూపొందించి కుటుంబ సభ్యులు, స్నేహితులు, కొన్ని తనకోసం తయారు చేసేది. అవి అందర్నీ ఆకర్షిస్తుండడంతో.. ఫ్యాషన్ డిజైనింగ్ మీద మరింత ఆసక్తి పెరిగింది. కానీ ఇంట్లో వాళ్ల ఇష్టం మేరకు ఇంజినీరింగ్ చదివింది. ఇంజినీరింగ్ అయిన వెంటనే ఉద్యోగం రావడంతో ‘అసోం పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్’లో అసిస్టెంట్ ఇంజినీర్‌గా చేరింది. ఉద్యోగం చేస్తున్నప్పటికీ తన మనసు మాత్రం ఫ్యాషన్ డిజైనింగ్‌పైనే ఉంది. పదేళ్ల ఉద్యోగం వదిలేసి... ఒక పక్క ఉద్యోగం చేస్తూనే మరోపక్క ఖాళీ సమయం ఉన్నప్పుడల్లా తనకిష్టమైన ఫ్యాబ్రిక్ డిజైన్ ను చేస్తుండేది. తన డిజైన్లు నచ్చిన వారంతా ‘చాలా బావున్నాయి’ అని పదేపదే పొగుడుతుండడంతో... ఫ్యాషన్ డిజైనింగ్‌కు పూర్తి సమయాన్ని కేటాయించాలని నిర్ణయించుకుంది. పదేళ్లుగా చేస్తోన్న ఇంజినీర్ ఉద్యోగానికి వెంటనే రాజీనామా చేసి, గువహటీలో మేఖల ఛాడర్ల చేనేత యూనిట్‌ను ప్రారంభించింది. ఈ యూనిట్లో స్వయంగా డిజైన్ చేసిన వస్త్రాలను ఏడాదిన్నరలోనే మూడు వేల వరకు విక్రయించింది సంజుక్తా. ఒక్క యూనిట్‌తో ప్రారంభమైన సంజుక్తా చేనేత యూనిట్ రెండేళ్లలోనే వందల యూనిట్లుగా విస్తరించింది. దాంతో కమర్షియల్ బోటిక్‌ను కూడా ప్రారంభించింది. ఈ బోటిక్‌ను కొనుగోలుదారులు కూడా సందర్శించే వీలు కల్పించడంతో మంచి స్పందన వచ్చింది. ఈ ప్రోత్సాహంతో అస్సామీ సాంప్రదాయ జ్యూవెల్లరి దగ్ దుగి, కెరు మోనీ, జున్ బైరీలను సరికొత్తగా తీర్చిదిద్ది విక్రయించింది. ఒకపక్క అస్సామీ పట్టు, మరోపక్క సాంప్రదాయ జ్యూవెల్లరీలను తనదైన డిజైన్లతో దేశవ్యాప్తంగా ఆదరణ పొందేలా చేసింది. అస్సామీ పట్టు ఎంతో నైపుణ్యం కలిగిన ఛాడర్ కళాకారులతోనే మేఖల ఛాడర్ను తయారు చేయించడం సంజుక్తా డిజైన్ల ప్రత్యేకత. స్థానికంగా దొరికే పట్టు దారాలు, ఛాడర్లను అనుభవజ్ఞులైన చేనేత కళాకారులతో రూపొందిస్తోంది. ప్రస్తుతం సంజుక్తా స్టూడియో, యూనిట్లలో వందలసంఖ్యలో కళాకారులకు ఉపాధి కల్పిస్తోంది. ఒక్క గువహటీలోనేగాక ముంబై, ఢిల్లీ, బెంగళూరులో ధరించే ఈ ఛాడర్లకు మంచి డిమాండ్ ఉండడంతో సంజుక్తా డిజైన్లు త్వరగానే పాపులర్ అయ్యాయి. సోషల్ మీడియా ప్రచారం ద్వారా కూడా మరిన్ని ఆర్డర్లు తీసుకుంటూ తన డిజైన్ లను దేశం నలుమూలలకు విస్తరించి, ప్రస్తుతం కోట్ల టర్నోవర్‌తో దూసుకుపోతోంది. ఆల్ఫూల్.. కరిష్మాకపూర్, బిపాషా బసు, హేమమాలిని, జహీర్‌ఖాన్ వంటి సెలబ్రిటీలు కూడా సంజుక్తా డిజైన్ చేసిన డ్రెస్‌లను పలు ఈవెంట్లలో ధరించారు. బ్రిటిష్ రాజవంశానికి చెందిన కేట్ మిడిల్టన్ 2015లో ‘కాజీరంగా జాతీయ పార్క్’ సందర్శించినప్పుడు సంజుక్త రూపొందించిన డ్రెస్‌ను ధరించారు. ప్రస్తుతం అమెరికాలో జరుగుతోన్న న్యూయార్క్ ఫ్యాషన్ వీక్ – 2022లో ‘ఆల్ఫూల్’ పేరిట తన కొత్త డిజైను ప్రదర్శించింది. అసోం పట్టుతో నేసిన చీరలు, గౌన్లు, డ్రేప్ స్కర్ట్స్ ఇండో వెస్ట్రన్ లెహంగాలను రూపొందించి, 25 రోజులపాటు సమయం కేటాయించి తుదిమెరుగులు దిద్దారు. దీంతో ధగధగ మెరుస్తోన్న పట్టు డ్రెస్‌లు చూపరులనే గాక అంతర్జాతీయ డిజైనర్లనూ ఆకట్టుకుంటున్నాయి. -
ఇంటికి కాళ్లుంటే.. అది ఎంచక్కా నడుచుకుంటూ వెళుతుంటే..!
ఇంటికి కాళ్లుంటే! ఇదిగో ఈ ఫొటోలో ఉన్నట్లే ఉంటుంది. ఈ ఇంటికి ఉన్న కాళ్లు కర్రకుర్చీకి ఉన్నలాంటి కదలని కాళ్లు కావు. ఎక్కడకనుకుంటే అక్కడకు నడిచే కాళ్లు. తమపై నిర్మించిన ఇంటిని ఎక్కడకనుకుంటే అక్కడకు మోసుకుపోయే కాళ్లు. ఫ్రాన్స్‌లోని ‘యూబిసాఫ్ట్’ సంస్థకు చెందిన త్రీడీ డిజైనర్ ఎంకో ఎన్షెవ్ వైరైటీగా ఈ కదిలే కాళ్లు గల ఇంటికి రూపకల్పన చేశాడు. ఇంటికి ఏర్పాటు చేసిన ‘మెకానికల్ లెగ్స్’ అడుగులు ముందుకు వేస్తూ ఎక్కడకు నిర్దేశిస్తే అక్కడకు చేరుకోగలవు. ఎలాంటి మిట్టపల్లాలనైనా సునాయాసంగా దాటగలవు. ఇదొక ‘రెట్రో–ఫ్యూచరిస్టిక్’ డిజైన్ అని ఎన్షెవ్ చెబుతున్నాడు. భవిష్యత్తులో పిక్నిక్లు వంటి అవసరాల కోసం వాహనాలకు బదులుగా ఇలాంటి ఇళ్లు వినియోగంలోకి వచ్చే అవకాశాలు లేకపోలేదని త్రీడీ డిజైనింగ్ పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. చదవండి: Pratima Joshi: ‘బస్తీ చిన్నది... భలేగున్నది’ అనుకునేలా చేసింది.. -
నా ఫ్యాషన్ సీక్రేట్ అదే.. షాపింగ్‌పై చాలా కంట్రోల్‌గా ఉంటా..: త్రిష
ఆచి తూచి అడుగులు వేయకుంటే.. బోల్తా కొట్టడం ఎవరికైనా తప్పదు. కెరీర్లో అలాంటి జాగ్రత్తలు పాటించింది కాబట్టే.. ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చి రెండు దశాబ్దాలు గడిచినా ఇప్పటికీ స్టార్ హీరోయిన్‌గానే కొనసాగుతోంది త్రిష. ఆ ప్రేక్షకాదరణకు ఆమె అభినయంతో పాటు అందమూ ఓ కారణమే. ఆ అందానికి అద్దం పడుతున్న ఫ్యాషన్ బ్రాండ్స్ ఇవే.. సబ్యసాచి.. పేరుకే ఇండియన్ బ్రాండ్ కానీ, ఇంటర్నేషనల్ బ్రాండ్ కంటే గొప్పది, ఖరీదైనది. దాదాపు బాలీవుడ్ సెలబ్రిటీస్ పెళ్లిళ్లు అన్నీ సబ్యసాచి కలెక్షన్స్‌తోనే జరుగుతాయి. వాటిల్లో విరాట్ కొహ్లీ, అనుష్కశర్మల పెళ్లి బట్టలు ఫేమస్. కనీసం ఒక్కసారైనా సబ్యసాచి డిజైన్ వేర్ ధరించాలని, సామాన్యుడి నుంచి సెలబ్రిటీ వరకు ఏంతోమంది ఆశపడుతుంటారు. ఆ బ్రాండ్‌కున్న వాల్యూ అలాంటిది. ఈ మధ్యనే మధ్యతరగతి మహిళల కోసం రూ. పదివేల చీరను డిజైన్ చేశారు. ఇదే ఈ బ్రాండ్ చీపెస్ట్ చీర. సుమారు లక్ష చీరలను సిద్ధం చేస్తే, రెండు రోజుల్లోనే మొత్తం కొనుగోలు చేశారు. పదివేల చీరైనా, పదినిమిషాల్లో అమ్ముడైపోతుంది. ఇదంతా సబ్యసాచి ముఖర్జీ డిజైన్ మహత్యం. బెంగాలీ కుటుంబ నేపధ్యం నుండి వచ్చిన సబ్యసాచి కెరీర్ ఆరంభించిన అనతి కాలంలోనే ఫేమస్ ఫ్యాషన్ డిజైనర్‌గా ఎదిగాడు. 1999లో తన పేరునే ఓ బ్రాండ్ హౌస్‌గా మార్చి, మరింత పాపులర్ అయ్యాడు. అందమైన ఆభరణాలు కూడా ‘సబ్యసాచి’ స్టోర్స్‌లో లభిస్తాయి. ఇండియాలోని ప్రముఖ నగరాలతోపాటు అమెరికా, లండన్‌లోనూ స్టోర్స్ ఉన్నాయి. ఆన్‌లైన్‌లోనూ సబ్యసాచి డిజైన్స్‌ను కొనుగోలు చేయొచ్చు. చీర బ్రాండ్: సబ్యసాచి ధర: రూ. 1,79,500 మంజుల జ్యూయెల్స్... ఒక సమస్యను ఎదుర్కొనే సమయంలోనే మన ప్రతిభ బయట పడుతుందంటారు. ఈ మాట మంజుల విషయంలో అక్షరాల నిజం. కుటుంబం గడవటం కోసం భర్తతో కలసి మైనింగ్ పరిశ్రమలో పనిచేసి, బంగారంతోపాటు తనలోని ప్రతిభను కూడా వెలికి తీసింది మంజుల. అప్పటివరకూ బంగారం అంటే ఇష్టం మ్రాతమే. ఆ ఇష్టాన్ని ఆసక్తిగానూ.. ఆ తర్వాత ఉపాధి అవకాశంగానూ మార్చుకుంది. జెమాలజీలో పీజీ చేసి, ఆభరణాల రూపకల్పన నేర్చుకుంది. మొదట బంధువులు, తెలిసిన వారి వివాహాది శుభకార్యాలకు డిజైన్ చేసింది. వాటికి మంచి పేరు రావడంతో 2010లో ‘మంజుల జ్యూయెల్స్’ సంస్థ స్థాపించింది. ప్రస్తుతం పలు సినిమాలతో పాటు, చాలామంది సెలబ్రిటీలకు కూడా మంజుల తన డిజైన్స్‌ను అందిస్తోంది. ధర ఆభరణాల నాణ్యత, డిజైన్ ఆధారంగా ఉంటుంది. హైదరాబాద్ మెయిన్ బ్రాంచ్‌గా ఉన్న మంజుల జ్యూయెల్స్ను ఆన్‌లైన్‌లోనూ కొనుగోలు చేయొచ్చు. జ్యూయెలరీ బ్రాండ్: మంజుల జ్యూయెల్స్ ధర: ఆభరణాల నాణ్యత, డిజైన్‌పై ఆధారపడి ఉంటుంది. - దీపిక కొండి చదవండి: దుస్తులకు లింగ భేదం ఏంటీ..! స్కూల్‌కి స్కర్టులతోనే వస్తాం!! -
‘నీ పర్సనాలిటీ చూసుకున్నావా.. నీ సైజ్‌కు సరిపోయే డ్రెస్ లేదు’
ముంబై: పెళ్లి గురించి ప్రతి అమ్మాయి ఎన్నో కలలు కంటుంది. అందుకోసం ప్రత్యేకంగా దుస్తులు, నగలు డిజైన్ చేయించుకుంటారు. పెళ్లిలో ధరించే ప్రతి దాని పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ఇక చాలా మంది పెళ్లిలో నాజుకుగా కనిపించడం కోసం వివాహానికి కొన్ని రోజుల ముందు నుంచే డైటింగ్ వంటివి పాటిస్తుంటారు. ఇదంతా సరే. ఒకరి వ్యక్తిగత అభిప్రాయాలను కాదనే హక్కు ఎవరికి లేదు. అలానే ఒకరి శరీరాకృతి గురించి విమర్శించే హక్కు కూడా ఎవరికి లేదు. కానీ ఈ విషయాన్ని ప్రముఖ డిజైనర్ తరుణ్ తహిలియాని మర్చిపోయినట్లున్నాడు. పెళ్లి లెహంగా కోసం వచ్చిన వైద్యురాలు, ఇన్‌స్టాగ్రమ్ ఇన్‌ఫ్లూయెన్సర్‌ని దారుణంగా అవమానించడట. ‘‘నీ ఆకారం చూసుకున్నావా.. నీ భారీ కాయానికి సెట్ అయ్యె డ్రెస్ మా దగ్గర లేదు’’ అన్నాడట. అతడి మాటలకు బాధపడిన సదరు డాక్టర్ ఇక జన్మలో అతడి స్టోర్‌కు వెళ్ల వద్దని నిర్ణయించుకుంది. మరో డిజైనర్ దగ్గరకు వెళ్లి డ్రెస్ కుట్టించుకుంది. పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలను షేర్ చేయడంతో పాటు తనకు జరిగిన అవమానాన్ని వెల్లడించింది. దీనిపై స్పందించిన తరుణ్ తహిలియాని సదరు వైద్యురాలికి క్షమాపణలు తెలిపాడు. ఆ వివరాలు.. సదరు డాక్టర్ పేరు తనయా నరేంద్ర. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె తన పెళ్లి ఫోటోలు షేర్ చేస్తూ.. ఇలా రాసుకొచ్చారు. ‘‘పెళ్లికి ముందు చాలా మంది మీద బరువు తగ్గమని ఒత్తిడి పెంచుతారు. నా విషయంలో కూడా అలానే జరిగింది. నువ్వు కూడా డైటింగ్ చేయోచ్చు కదా అని నా ఫ్రెండ్స్ అడిగారు. బరువు తగ్గడానికి చిట్కాలు కూడా చెప్పారు. కానీ నేను అవే పాటించలేదు. నన్ను నన్నుగా ప్రేమించుకోవడం నాకు బాగా తెలుసు. అందుకే వారి సూచనలు పట్టించుకోలేదు’’ అన్నారు. ‘‘పెళ్లి దుస్తుల విషయంలో నాకు చిన్నప్పటి నుంచే ఓ కోరిక ఉండేది. నా 12వ ఏట నుంచే నేను నా పెళ్లికి తరుణ్ తహిలియాని డిజైన్ చేసిన పెళ్లి లెహంగా ధరించాలని అనుకునేదాన్ని. ఆ ప్రకారమే పెళ్లికి నెల రోజుల ముందు అంబవట్టాలో ఉన్న తరుణ్ బ్రైడల్ స్టోర్‌కు వెళ్లాను. అక్కడ నాకు తీవ్ర అవమానం జరిగింది. నా శరీరాకృతి గురించి దారుణంగా మాట్లాడారు. నీ భారీ పర్సనాలిటీకి మా దగ్గర డ్రెస్ లేదు అనే సెన్స్‌లో కామెంట్ చేశారు. వారి మాటలు నన్ను తీవ్రంగా బాధించాయి. ఇక జన్మలో అతడి స్టోర్‌కు వెళ్లకూడదని నిర్ణియంచుకున్నాను’’ అన్నారు. ‘‘పెద్ద శరీరం, వక్షోజాలు ఉంటే డిజైనర్లకు ఎందుకు అంత భయమో నాకు అర్థం కాలేదు. ఆ తర్వాత నేను అనితా డోంగ్రే స్టోర్‌కు వెళ్లి నాకు కావాల్సిన లెహంగా గురించి వారికి వర్ణించాను. ఇవారు కేవలం మూడు వారాల వ్యవధిలోనే నాకు నేను కోరిన అందమైన లెహంగా డిజైన్ చేసి ఇచ్చారు. ఇందుకు తనను ఎంత పొగిడినా తక్కువే’’ అన్నారు. ‘‘నన్ను చూడండి. పెళ్లిలో నేను ఎంత సంతోషంగా ఉన్నానో. నాకు డబుల్ చిన్ ఉంది.. నా పొట్ట బయటకు కనిపిస్తుంది. కానీ ఇవన్ని నా సంతోషాన్ని పాడు చేశాయా.. లేదు కదా. ఎందుకంటే నా కుటుంబం, నా సన్నిహితులు, నా భర్త, నన్ను ప్రేమిస్తున్నాడు... మరీ ముఖ్యంగా నన్ను నేను ప్రేమించుకుంటున్నాను. నా పెళ్లి ద్వారా నేను నేర్చుకున్న అతి పెద్ద పాఠం ఇదే. ఆనందంగా ఉండండి. ఎందుకంటే సంతోషంగా ఉన్నవారే ఉత్తమ పెళ్లికుమార్తెలు’’ అంటూ షేర్ చేసిన ఈ స్టోరి ఎందరినో ఆకట్టుకుంది. ఇది చదివిన నెటిజనులు తరుణ్ తహిలియాని విమర్శిస్తున్నారు. ఈ క్రమంలో తరుణ్ తహిలియాని క్షమాపణలు తెలిపారు. తాను సదరు డాక్టర్ శరీరాకృతిని విమర్శించలేదని.. కరోనా కారణంగా ఆమెకు సెట్ అయ్యే డ్రెస్ తమ స్టోర్‌లో లేదని చెప్పాను అన్నారు. దాన్ని ఆమె తప్పుగా అర్థం చేసుకున్నారని వెల్లడించారు. ఇక మూడు వారాల్లో లెహంగా డిజైన్ చేయడం సాధ్యం కాదని.. ఒకవేళ చేసినా నాసిరకంగా ఉంటుందని తెలిపారు. -
లాక్మే ఫ్యాషన్ వీక్ ఫోటోలు
-
ఎయిర్ హోస్టెస్, ఏవియేషన్ సిబ్బంది ఫ్యాషన్ షో అదుర్స్
-
ఫ్యాషన్ 'డిజైర్'
-
సూత్ర వెడ్డింగ్ ఎడిట్ ఎగ్జిబిషన్లో మోడల్స్ సందడి
-
డిజైనర్ బామ్మ
వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ‘ఎనిమిది పదులు దాటిన బామ్మ చేతుల్లో రూపుదిద్దుకునే పెళ్లి డ్రెస్ ఎంత అందంగా ఉంటుందో.. అది తనను ఎంతగా ముస్తాబు చేస్తుందో..’ అని అక్కడ కాబోయే ప్రతి వధువూ అంతే అందంగా కల కంటుంది. వారి కలలను నిజం చేస్తూ 58 ఏళ్లుగా అబోక్ రాధే అందమైన పెళ్లి డ్రెస్‌లను రూపొందిస్తూనే ఉంది. ఆ డ్రెస్ డిజైన్ చూపు తిప్పుకోనివ్వదు. వెల్వెట్ లాంగ్ బ్లౌజ్, నడుము చుట్టూ కట్టిన సన్నని మస్లిన్ క్లాత్, మల్టీకలర్ సొగసుతో ఉండే స్కర్ట్స్, దండలు, నెమలీకలతో అలంకరించిన కిరీటం చూస్తున్నకొద్దీ చూడాలనిపిస్తాయి. ఇది మణిపూర్‌లోని సంప్రదాయ పెళ్లికూతురు ధరించే వెడ్డింగ్ డ్రెస్. ‘పొట్లోయి సెట్పి’ అని పిలిచే ఈ వెడ్డింగ్ డ్రెస్సులను ఓ 88 ఏళ్ల బామ్మ 58 ఏళ్లుగా సృష్టిస్తోంది. ఆమెను స్థానికులు అబోక్ రా«ధే అని ఆత్మీయంగా పిలుచుకుంటారు. ‘అబోక్’ అంటే మీటీ భాషలో ‘బామ్మ’ అని అర్ధం. ఈ వయసులోనూ అత్యంత శ్రద్ధగా అందమైన డిజైన్లను సృష్టిస్తూ, మహిళలకు శిక్షణ ఇస్తూ, వ్యాపారం చేస్తున్న ఈ బామ్మ నేటి తరానికి స్ఫూర్తి. మణిపూర్ సంప్రదాయ గ్రాండ్ పొట్లోయి కళను సజీవంగా ఉంచుతోంది. సాయం కోసం వెళ్లి శిక్షణ ‘వధువు కోసం పొట్లోయిని డిజైన్ చేసిన ప్రతిసారీ టెన్షన్ పడుతుంటాను. పెళ్లికూతురు ఈ డ్రెస్‌ను ఇష్టపడుతుందా, ఆమెకు ఈ డ్రెస్ సంతోషాన్ని ఇస్తుందా.. అని నన్ను నేను ప్రశ్నించుకుంటాను. వేడుకలో వధువు నడుస్తుంటే ఆమె ధరించిన డ్రెస్సు గురించి గొప్పగా చెప్పుకోవడం, ఎవరు తయారు చేశారని వారు అడిగినప్పుడు, నా గురించి నాకు గర్వంగా అనిపిస్తుంది’ అని చెబుతుంది ఈ బామ్మ. ఇన్నేళ్ల వయసులోనూ వారం రోజుల్లో పెళ్లికూతురు డ్రెస్ డిజైన్ చేయగలదు రాధే. దీనికితోడు ప్రసిద్ధ మణిపురి పౌరాణిక ఖంబాతోయిబి నృత్యానికి కూడా దుస్తులను తయారుచేసి ఇస్తుంది. పెళ్లిళ్ల సీజన్ లేనప్పుడు బట్టలు, స్ట్రాలను ఉపయోగించి బొమ్మలను తయారు చేసి, స్థానిక షాపులకు అమ్ముతుంది. ‘నాకు 15 ఏళ్ల వయసులో పెళ్లి అయ్యింది. ఏడుగురు పిల్లలకు తల్లిని. మొదట్లో గృహిణిగానే ఉన్నాను. నా భర్త మణిశర్మ జ్యోతిష్యం చెప్పేవాడు, ఆలయ ముఖ్య కార్యక్రమాల్లో పాల్గొనేవాడు. పాతికేళ్ల వయస్సులో ఉన్నప్పుడు అనుకోకుండా ఓసారి మా పక్కింటి ఆమెకు పొట్లోయి తయారీలో సాయం చేశా. అప్పుడే పెళ్లి డ్రెస్సులను రూపొందించడంపై ఆసక్తి ఏర్పడి, అందులో వివిధ ప్రక్రియలను నేర్చుకున్నాను. ఆ సమయంలో ఏడేళ్ల నా కూతురు రాస్లీలా నాటకంలో పాల్గొంటోంది. తనది గోపిక వేషం. ఆమె కోసం మొదటిసారి ఒక డ్రెస్ డిజైన్ చేశాను. అలా 30 ఏళ్ళ వయసు నుంచి పొట్లోయిని తయారు చేస్తూనే ఉన్నాను’ అని అబోక్ రాధే తనకీ కళ వంటపట్టిన విధానాన్ని గుర్తు చేసుకుంటుంది. తొమ్మిది పొరల వస్త్రంతో పొట్లోయి స్కర్ట్ పొట్లోయి చరిత్ర పరిశీలిస్తే దాని మూలాలు రాస్ లీలాలో ఉన్నాయి. 18వ శతాబ్దంలో శ్రీకృష్ణుడు గోపికల నృత్యంలో భాగంగా ధరించే డ్రెస్‌గా ఇది పరిచయం అయ్యింది. కాలక్రమేణ వివాహ వేడుకలలో పెళ్లి కూతురు డ్రెస్‌గా ఇది ప్రాచుర్యం పొందింది. ‘ఇప్పుడు లంగాకు గట్టి ఆకారం ఇవ్వడానికి డిజైనర్లు సన్నని రబ్బరు షీట్‌ను ఉపయోగిస్తున్నారు. గతంలో ఇది అందుబాటులో లేదు. స్కర్ట్ లోపలిభాగంలో తొమ్మిది పొరల వస్త్రాన్ని దళసరిగా వచ్చేలా కుడతాను. దీనికి చాలా సమయం పడుతుంది. అలాగే, స్కర్ట్ గట్టిగా ఉండటానికి, దానిని బియ్యం పిండిలో ముంచి ఎండలో ఆరబెట్టాలి. తగినంత ఎండ లేకపోతే డిజైన్ పాడైపోతుంది. పొట్లోయ్ ఎరుపు, గులాబీ, ఆకుపచ్చ వంటి రంగులలో వస్తుంది. దీనికి రిబ్బన్లు, రాళ్ళు, అద్దాలతో అలంకరిస్తాను’ అంటూ వివరించింది అబోక్. మొదట్లో ప్రతి పొట్లాయి డ్రెస్‌కు 500 రూపాయలు తీసుకునేది. ఇప్పుడు డిజైన్‌ను బట్టి రూ.10,000–15,000 మధ్యలో ఉంటుంది. పెళ్లిళ్ళ సీజన్ లేకపోయినా ఆమె ఖాళీగా ఉండదు. పొట్లోయి దుస్తుల్లో అందమైన బొమ్మలను రకరకాల సైజుల్లో చేస్తుంది. వీటి ధర 200 నుంచి 1000 రూపాయల్లో ఉంటుంది. శిక్షణకు విద్యార్థులు అబోక్ రాధే పొట్లోయి పనికి ప్రసిద్ధి చెందడంతో ఎంతోమంది విద్యార్థులు, ముఖ్యంగా మహిళలు ఈ కళను నేర్చుకోవడానికి ఆమె వద్దకు వస్తారు. శిక్షణ తీసుకున్న వారిలో చాలామంది తమకు తాముగా పొట్లోయి వ్యాపారాలను ప్రారంభించిన వారూ ఉన్నారు. ‘నా తదనంతరం కూడా ఈ పొట్లోయి కళ జీవించే ఉండాలి. నేను అందించిన నైపుణ్యాలు నా విద్యార్థులకు పొట్లోయి అందమైన నమూనాలను రూపొందించడానికి సహాయపడాలి‘ అంటోంది అబోక్ రాధే. అబోక్ ఖాళీ సమయంలో సామాజిక పనుల్లోనూ భాగం పంచుకుంటుంది. మాదకద్రవ్యాల వంటి వ్యసనాలను అరికట్టడం, మహిళల ఉపాధి అంశాలపై పనిచేసే రెండు స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేస్తుంది అబోక్. ‘ఒక మహిళ ఆర్థికంగా స్వతంత్రంగా ఉండటం చాలా ముఖ్యం. అప్పుడే ఏ పరిస్థితిలోనైనా ఎవ్వరి మీదా ఆధారపడకుండా తనను తన కుటుంబాన్ని చూసుకోగలదు. ఇదే నా జీవితం నాకు నేర్పిన పాఠం’ అని చెబుతున్న ఈ బామ్మను చూసి యువత స్ఫూర్తి పొందాలి. -
డిజైర్... హుషార్
-
మన ఇల్లు.. మన నేల
‘కొత్తదనం కోసం నేల విడిచి సాము చేయడం కాదు, నేల మీదనే ప్రయోగాలు చేయాలి’ అని నిరూపిస్తోంది త్రిపురసుందరి. తమిళనాడులోని ఎస్ఆర్ఎమ్ యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్లో గ్రాడ్యుయేషన్ చేసింది. తర్వాత ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్ సిటీ యూనివర్సిటీలో కొంతకాలంపాటు అధ్యయనం చేసింది. ‘అర్బన్ అండ్ రీజనల్ ప్లానింగ్ ఇన్ ఫ్రాన్స్’ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది. ఆ తర్వాత 2011లో ఇండియాకి తిరిగి వచ్చి కెరీర్‌ను ప్రారంభించింది త్రిపుర సుందరి. ఇంత చదివిన తర్వాత, ఇన్ని దేశాల్లో నిర్మాణశైలిని ఆకళింపు చేసుకున్న తర్వాత ఆర్కిటెక్చర్లో తనదైన శైలిలో ఏదైనా కొత్తగా చేయాలనుకుంది త్రిపుర సుందరి. ఆ కొత్తదనానికి మూలం కోసం అన్వేషణ మొదలు పెట్టింది. ఆమె అన్వేషణ కేరళలోని తన పూర్వీకుల స్వస్థలంలో ఫలించింది. ఒకప్పటి ఎర్ర నేల నిర్మాణాలలో సిరామిక్ టైల్స్, విట్రిఫైడ్ టైల్స్, మార్బుల్ ఫ్లోరింగ్‌లు రాజ్యమేలుతున్న ఈ రోజుల్లో అంతకంటే కొత్తగా ఏదైనా చేయాలనే త్రిపుర సుందరి మెదడులో ‘వెదర్ ఫ్రెండ్లీ ఫ్లోర్’ అనే ఆలోచన మెదలింది. ‘‘కేరళలో పాత ఇళ్లలో ఎర్రటి ఆక్సైడ్ ఫ్లోరింగ్‌లు ఇప్పటికీ ఉన్నాయి. కాళ్లకు చెప్పులు లేకుండా ఆ నేల మీద నడిచినప్పుడు కలిగిన హాయిని మాటల్లో చెప్పలేను. ఆ ఫ్లోరింగ్ గాలిని పీల్చుకుంటుంది. వాతావరణానికి అనువుగా ఉష్ణోగ్రతలను మార్చుకుంటుంది. అందుకే నా ప్రయోగాలకు ఆక్సైడ్ ఫ్లోరింగ్నే ఎంచుకున్నాను’’ అంటుంది త్రిపుర సుందరి. ఫ్లోరింగ్‌కి కలరింగ్ ‘‘అప్పట్లో అందరూ రెడ్ ఆక్సైడ్ మాత్రమే వాడేవాళ్లు. దాంతో అన్ని ఇళ్లకూ ఎర్ర ఫ్లోరింగే ఉండేది. ఇప్పుడు నేను ఇంటీరియర్‌కు తగినట్లుగా ఆక్సైడ్ ఫ్లోరింగ్లోనే రంగులు మార్చగలుగుతున్నాను. ‘నామ్ వీడు నామ్ ఊర్ నామ్ కాధై’ (మన ఇల్లు.. మన ఊరు.. మన కథ) కాన్సెప్ట్‌తో నేను డిజైన్ చేస్తున్న ఆర్కిటెక్చర్‌కు మంచి ఆదరణ లభిస్తోంది. ఇది పర్యావరణ హితమైనది మాత్రమే కాదు, రోజు వారీ వాడకంలో ఫ్లోర్‌ను శుభ్రపరచడానికి రసాయనాల అవసరమే ఉండదు. నగరాల్లో గృహిణులకు ఎక్కువవుతున్న కెమికల్ అలర్జీలకు ఈ ఫ్లోరింగ్ మంచి పరిష్కారం కూడా’’ అంటోంది త్రిపుర సుందరి. మార్బుల్ బాట పట్టిన ఫ్యాషన్ ట్రెండ్ వల్ల ఎర్రనేల ఫ్లోరింగ్ తగ్గుముఖం పట్టి దాదాపుగా ముప్పై ఏళ్లవుతోంది. అంటే ఒక తరం అన్నమాట. ఈ ఫ్లోరింగ్ పని చేసే వాళ్ల తరం అంతరించడానికి దగ్గరగా ఉంది. ఇప్పుడిక మిగిలి ఉన్న వారి అనుభవంతో కొత్త తరాన్ని తయారు చేయడానికి సిద్ధమైంది త్రిపుర సుందరి. కలరింగ్ వేసిన ఫ్లోరింగ్, త్రిపుర సుందరి, ఆర్కిటెక్ట్ మనసుతో చేసే పని మేము ఉదయ్‌పూర్‌లో ఒక ప్రాజెక్టు చేస్తున్నప్పుడు మా దగ్గర పని చేస్తున్న ఒక వృత్తికారుడి తండ్రి పోయినట్లు ఫోన్ వచ్చింది. అతడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే ఫ్లయిట్ టికెట్ బుక్ చేసి వాళ్ల ఊరికి వెళ్లడానికి ఏర్పాట్లు చేశాం. అయితే అతడు పని వదిలేసి వెళ్లడానికి ఇష్టపడలేదు. ‘మా నాన్న కూడా ఇదే పని చేసేవాడు. ఆయన ఎప్పుడూ పనిని సగంలో వదిలిపెట్టలేదు. నేనిప్పుడు పని వదిలేసి మా ఊరికి వెళ్లడం కంటే, ఈ పనిని పూర్తి చేసి వెళితేనే ఆయన ఆత్మకు నేను శాంతిని ఇవ్వగలుగుతాను’ అన్నాడు. వృత్తికారులు అంతటి అంకితభావంతో పని చేస్తారు. మేము పని చేసేది మనసు లేని ఇసుక– సిమెంటులతో కాదు, మనసున్న మనుషులతోనని నాకు ఆ క్షణంలో అనిపించింది – త్రిపుర సుందరి, ఆర్కిటెక్ట్ -
డబుల్ గ్లామర్
రెండు భిన్నమైన రంగుల లెహంగా ఒకటి.. ఒకే రంగులో రెండు పొరల లెహంగా మరొకటి. ఒకేరకం ఫ్యాబ్రిక్ లెహంగా ఒకటి.. రాసిల్క్– నెటెడ్ రెండు రకాల మెటీరియల్తోడిజైన్ చేసిన లెహంగా మరొకటి.ఇలా దేనికది భిన్నంగా, మది దోచేలా ఆకట్టుకుంటున్నాయి ఈ టు లేయర్డ్ లెహంగాలు. ట్విన్ లేయర్డ్ లెహంగాలుగానూ పేరున్న ఇవి వేడుకల్లో హైలైట్‌గా నిలుస్తున్నాయి. క్యాజువల్‌గానూ కలర్‌ఫుల్ అనిపిస్తున్నాయి. డబుల్ గ్లామర్ అని ప్రశంసలు అందుకుంటున్నాయి. ఇండియన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా ఈ యేడాది వెడ్డింగ్ సీజన్లో భాగంగా డబుల్ లేయర్డ్ లెహంగాలను డిజైన్ పలువురి ప్రముఖుల ప్రశంసలు పొందారు. ‘వివాహ వేడుకల్లో గ్రాండ్‌గా వెలిగిపోవడానికి గ్రాండ్ ఎంబ్రాయిడరీతో పాటు ట్విన్ లేయర్డ్ కూడా ప్రధాన కారణం’ అంటారు మనీష్ మల్హోత్రా. కుచ్చుల లెహంగా గురించి మనకు తెలిసిందే. లెహంగా ఎన్ని కుచ్చులతో ఉంటే అంచు భాగం అంత ఫ్లెయర్తో ఆకట్టుకుంటుంది. ►ఉత్తర భారతదేశంలో దాండియా వేడుకల్లో భాగంగా పుట్టుకొచ్చిందే ఈ రెండు పొరల లెహంగా. దీనికి డిజైనర్ టచ్ ఇచ్చి సౌతిండియా సైతం సరికొత్తగా ముస్తాబు చేసింది. వేడుకల్లో ప్రత్యేకంగా నిలిపింది. ►ఒక లెహంగా పార్ట్‌ని తక్కువ కొలత తీసుకొని, దాని అంచు వద్ద మరొక పొరగా కుచ్చుల భాగాన్ని జత చేస్తే ఈ అందమైన లెహంగా డిజైన్ వచ్చేస్తుంది. ►పై భాగం ప్లెయిన్ పట్టు మెటీరియల్ తీసుకుంటే, కుచ్చుల భాగం నెటెడ్తో జత చేస్తే ఇలా కొత్తగా కనువిందుచేస్తుంది. ►ఈ లెహంగాకి వెస్ట్రన్ స్టైల్ క్రాప్‌టాప్ ధరిస్తే ఇండో–వెస్ట్రన్ లుక్‌లో ఆకట్టుకుంటారు. ►లాంగ్ జాకెట్ ధరిస్తే ఒకలా, ఎంబ్రాయిడరీ ఛోలీ ధరిస్తే మరోలా భిన్నమైన లుక్‌లో కనిపిస్తారు. ►కాటన్, సిల్క్, నెటెడ్.. ఇలా ఏ ఫ్యాబ్రిక్‌తోనైనా ఈ డబుల్ లేయర్డ్ లెహంగాలను డిజైన్ చేసుకోవచ్చు. -
అధరాలంకరణం
పెదవులకు లిప్‌స్టిక్ వాడకం గురించి తెలుసు. చెవులకు, ముక్కుకు ఆభరణాల అలంకరించుకోవడం తెలుసు. కానీ, పెదవులకు కూడా ఆభరణం ధరించడం గురించి విన్నారా? కొత్తగా వచ్చిన ఈ ఆభరణం ఇప్పుడు యువతను ఆకట్టుకుంటోంది. ►జ్యువెల్రీ డిజైనర్లు ఫ్యాషన్ ప్రియుల అభిరుచులను దృష్టిలో పెట్టుకొని వినూత్న డిజైన్లను సృష్టిస్తున్నారు. వీటిలో భాగంగా వచ్చిందే లిప్ జ్యువెల్రీ. ►కొన్ని గిరిజన జాతుల్లో పెదవులను కూడా కుట్టి, ఆభరణాల అలంకరించుకోవడం ఉన్నది. దీనినే కొత్తగా ఇప్పుడు ఫ్యాషన్ జ్యువెల్రీలో సరికొత్తగా ప్రవేశపెట్టారు ఆభరణాల నిపుణులు. ►లిప్ జ్యువెల్రీని కింది పెదవికి తగిలించుకునేలా హుక్ ఉంటుంది. కింది పెదవికి హుక్ ఉన్న ఆభరణాన్ని తొడిగి, కొద్దిగా ప్రెస్ చేసి సెట్ చేయాలి. ► మేకప్ పూర్తయిన తర్వాతనే ఈ ఆభరణాన్ని ఉపయోగించాలి. ►పెదవులను కుట్టి, స్టడ్స్‌తో అలంకరించే ఆభరణాలు కూడా ఉన్నాయి. ►ఆన్లైన్ మార్కెట్లో అధరాలకు అందాన్ని పెంచే ఆభరణాలను కొనుగోలు చేయవచ్చు. డిజైన్, మెటల్‌ను బట్టి ధరలు ఉన్నాయి. -
ఆకట్టుకున్న హైదరాబాద్ డిజైన్ వీక్!
సాక్షి, సిటీబ్యూరో: తెలంగాణ ప్రభుత్వం, మరికొన్ని దేశవిదేశీ సంస్థలతో కలిసి నిర్వహిస్తున్న హైదరాబాద్ డిజైన్ వీక్ ఆకట్టుకుంది. మాదాపూర్‌లోని హైటెక్స్‌లో శనివారం సస్టెయినబుల్ ఫ్యాషన్ అనే అంశంపై ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనలో బంగ్లాదేశ్‌కు చెందిన డిజైనర్ బిబిరసెల్ డిజైన్ చేసిన వస్త్రాలను ప్రదర్శించారు. మనవైన చేనేత దుస్తులనూ మోడల్స్ ధరించి ర్యాంప్ వాక్ చేశారు. -
మెరిసిన లావణ్యం
-
మన ఫ్యాషన్ మెచ్చెన్ నేషన్
తెలుగు తెరపై సావిత్రి కట్టూబొట్టూ.. ఆహార్యమూ అన్నీ అప్పట్లో యువతులకు, మహిళలందరికీ అనుసరణీయాలే. ఆ దిగ్గజ నటిని మరోసారి తెరపై పరిచయం చేసిన ‘మహానటి’ సినిమాలో ఆ పాత్రకు తగిన జీవం పోశారు నగరానికి చెందిన కాస్ట్యూమ్ డిజైనర్లు గౌరంగ్‌షా, అర్చనారావులు. ఇటీవల ప్రకటించిన సినీ జాతీయ అవార్డుల్లో కాస్ట్యూమ్ డిజైనర్‌కి కూడా పురస్కారం లభించడంతో సిటీ ఫ్యాషన్ రంగానికి ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. ఎందుకంటే సిటీ ఫ్యాషన్ రంగానికి ఈ ఘనత దక్కడం ఇదే తొలిసారి. గౌరంగ్ షాతో పాటు నగరానికే చెందిన అర్చనారావు, కోల్‌కతా స్టైలిస్ట్ ఇంద్రాక్షి పట్నాయక్‌లు ఈ కీర్తిని సాధించడం గమనార్హం. సాక్షి, సిటీబ్యూరో :టాక్ ఆఫ్ ది సినీ కంట్రీ అనిపించుకున్న దేవదాస్, పద్మావతి వంటి బాలీవుడ్ సినిమాల్లో తారల వస్త్రధారణ తీర్చిదిద్దిన డిజైనర్లు కొంతకాలం పాటు వార్తల్లో వ్యక్తులుగా నిలిచేవారు. అలాంటి ఘనత ఇప్పటిదాకా నగరానికి చెందిన ఏ డిజైనర్‌కూ దక్కలేదు. భారీ చిత్రాలకు కాస్ట్యూమ్స్ ఇచ్చిన దాఖలాలతో పాటు సదరు చిత్రాల ద్వారా పేరు తెచ్చుకున్న సందర్భాలూ అరుదే. ఈ నేపథ్యంలో నగరానికి చెందిన డిజైనర్ గౌరంగ్ షా.. మరో ఇద్దరితో కలిసి మహానటి సినిమాకు అందించిన కాస్ట్యూమ్స్‌కు ఇటీవల ప్రకటించిన జాతీయ పురస్కారాల్లో చోటు దక్కడం విశేషం. దీని ద్వారా మన డిజైన్లు టాక్ ఆఫ్ ది నేషన్‌గా మారారు. జామ్దానీని ఉపయోగించి వైవిధ్యభరితమైన ఫ్యాబ్రిక్స్, టెక్చర్స్ల మేళవింపు దుస్తులు ముఖ్యంగా చీరల సృష్టికి చిరునామాగా నిలిచే ఈ డిజైనర్.. వింటేజ్ ఫ్యాషన్ ట్రెండ్స్‌కు తెరలేపారు. షర్మిలా ఠాగూర్లతో పాటు మరెంతో మందికి డిజైన్ చేసిన ఇదే గౌరంగ్ తొలి సినీ రంగప్రవేశం కావడం విశేషం. చేనేతలకు దక్కిన గౌరవం ఎంతో మంది బాలీవుడ్, టాలీవుడ్ సినీ తారలకు డిజైన్లు అందించినా, ఒక కాస్ట్యూమ్ డిజైనర్‌గా పూర్తి సినిమాకు పనిచేయడం ఇదే తొలిసారి. ఈ సినిమా నిర్మాత స్వప్నాదత్, దర్శకుడు నాగ్‌అశ్విన్‌లు మాకు అవకాశం ఇవ్వడం, తొలిసారిగా పూర్తి స్థాయిలో మా సృజనాత్మకతను వెండితెరపై ఆవిష్కరించగలగడం.. అది కూడా సావిత్రి వంటి మహానటి బయోపిక్కు డిజైన్ వర్క్ చేయడం.. దీనికి జాతీయ అవార్డు లభించడం.. అన్నీ అద్భుతాలే. ఇది అనూహ్యమైన అనుభూతి. – గౌరంగ్ షా,ఫ్యాషన్ డిజైనర్ ఏడాదిన్నర కృషి ఫలితం.. అలనాటి సావిత్రి దుస్తులన్నీ సింప్లిసిటీకి, హుందాకు ప్రతీకలుగా అనిపిస్తాయి. అందుకే ఆమె లుక్ గురించి పరిశోధనలో భాగంగా సినీ పరిశ్రమ పెద్దలతో కూడా సంప్రదించారు గౌరంగ్. అలనాటి టెక్స్టైల్స్ పునఃసృష్టి కోసం తరచూ మ్యూజియంలను కూడా ఆయన బృందం సందర్శించింది. నాటి టెక్స్టైల్, డిజైన్, టెక్చర్, కలర్లలోని ప్రతి విశేషాన్ని క్షుణ్ణంగా పరిశీలించి దాని ప్రకారం నేత కళాకారులకు మార్గదర్శకత్వం వహించింది. ఆర్నెళ్లకుపైగా రీసెర్చ్, ఏడాదిపైగా వీవింగ్‌కు, టెక్చరింగ్, కలరింగ్లకు కేటాయించాల్సి వచ్చింది. నటి సావిత్రి నిజజీవిత ఆహార్యాన్ని తెరపై మెరిపించేందుకు తీవ్రంగా శ్రమించాం అంటున్న గౌరంగ్.. కనీసం 100కిపైగా చేనేత కళాకారులు నిర్విరామంగా ఈ చిత్రంలోని కాస్ట్యూమ్స్ కోసం పని చేశారన్నారు. మొత్తంగా ఏడాదిన్నర సమయం వెచ్చించామన్నారు. దేశంలోని కాంచీపురం, బెనారస్ తదితర ప్రాంతాల నుంచి భారీ పట్టు ఫ్యాబ్రిక్స్‌ను సేకరించి కోట, మంగళగిరి, బ్లాక్ ప్రింట్స్‌లతో లూమ్స్‌లో అదనపు సొబగులు అద్దారు. శ్రద్ధగా.. భక్తిగా.. నాటి మహిళ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేలా ఆనాటి రంగులతో వీటిని బ్యాలెన్స్ చేశారు. చిన్నతనం నుంచి చివరి దశ దాకా ఆమె జీవన ప్రయాణంలోని ప్రతి సందర్భాన్నీ దృష్టిలో పెట్టుకుని వస్త్రధారణను తీర్చిదిద్దారు. ఎదిగే వయసులోని సావిత్రి కోసం మంగళగిరి, కోటా ప్రింట్స్‌ను స్వర్ణయుగంలాంటి సినీ దశ కోసం హెవీ బ్రొకేడ్స్, సిల్క్స్, ఆర్గంజా, చేతితో నేసిన శాటిన్స్, షిఫాన్స్లను వినియోగించారు. అలాగే చరమాంకానికి తగ్గట్టూ ఏర్చికూర్చారు. ‘సినిమాలో కొన్ని ప్రత్యేకమైన సీన్ల కోసం నన్ను శాటిన్స్ను అందించమన్నారు. ఆమె లుక్స్ పూర్తిగా స్వచ్ఛమైన చేనేతలతోనే ఉండాలని కోరుకున్నాను. భారీ కాంజీవరమ్ లెహంగా, బ్లౌజ్, ఆర్గంజా దుపట్టాతో ఉండే ‘మాయాబజార్’లోని సావిత్రి లుక్ కోసం 3 నెలలు పట్టింది’ అని చెప్పారు గౌరంగ్ షా. జీవితంలో మరిచిపోను.. జాతీయ అవార్డు గెలుపొందడం ప్రపంచాన్ని జయించినంత ఆనందంగా ఉంది. ఎంతో రిసెర్చ్ చేసి, ఎంతో కష్టపడి ఈ సినిమాకు పనిచేశాం. దర్శకుడు నాగ్అశ్విన్ నాపై ఉంచిన నమ్మకం నన్ను మరింతగా ఆ చిత్రంతో మమేకమయ్యేలా చేసింది. దుల్కర్ సల్మాన్, సమంత, విజయ్ దేవరకొండలతో పనిచేయడం చాలా సంతోషకరమైన విషయం. మన సృజన వెండితెర మీద ప్రత్యక్షం అవడం కన్నా గొప్ప విషయం మరొకటి ఉండదు. మహానటికి పనిచేసిన రోజుల్ని జీవితంలో మర్చిపోలేను. – అర్చనారావు, డిజైనర్ -
ఇలా కుట్టేశారు...
మొన్నటి దాకా అలా చుట్టేశారునిన్నటి దాకా ఏదోలా వేసేశారుఅటు మొన్నదాకా మెడకు పట్టేశారునిన్న మొన్నటి దాకా కట్టేశారుఅందుకే.. ఇక లాభం లేదనిదుపట్టాని ఇలా కుట్టేశారు. సల్వార్, పైజామాలతో పాటు దుపట్టా కంపల్సరీ. కుర్తా, లెగ్గింగ్స్‌కు తప్పనిసరి కాకపోయినా దుపట్టాని మెడకు చుట్టేసి స్టైలిష్ అనిపించారు. ఒక్కోసారి ఒన్‌సైడ్ బెస్ట్ అని తేల్చారు. అసలు దుపట్టాని కుర్తాకు జత చేస్తే గొడవే లేదుగా అని డిజైనర్లు కొత్తగా ఆలోచించారు. దీంతో, ఇదిగో పొడవు, పొట్టి కుర్తాలు ఇలా దుపట్టాతో కలిసి సరికొత్త డిజైన్‌తో స్టైల్‌గా వెలిగిపోతున్నాయి. ఇందుకు ఈ డిజైనర్ దుపట్టా కుర్తాలే సిసలైన ఉదాహరణ. -
కుచ్చు కుచ్చు హోతా హై!
కుచ్చులమ్మ కుచ్చులు మా ఊరు వచ్చాయి కుచ్చులు పెళ్ళి వారందరికీ నచ్చునండీ నచ్చును.వచ్చునండి వచ్చును అమ్మాయిలందరికీ కళ వచ్చును.నీజమే మరి, ఇది కుచ్చుల సీజన్‌కుచ్చు కుచ్చు హోతాహై! పెళ్ళి అంటేనే అందమంతా ఒక చోట రాసులుగా పోసిన కళతో ఉట్టిపడుతుంటుంది. అలాంటి చోట అమ్మాయిలంతా బుట్ట బొమ్మల్లా, యువరాణుల్లా మెరిసిపోతూ ఉంటారు. ‘ఎప్పుడూ వేసినట్టే పట్టు లంగా ఓణీ, చీరకట్టు అంతేనా, ఇంకేమీ స్పెషల్ లేదా..’ అనుకునే అమ్మాయిలు ఈ కొత్త రఫెల్ స్టైల్‌తో మెరిసిపోవచ్చు. లెహంగా, చోళీ కాన్సెప్ట్ పాతదే అయినా దీనికే కుచ్చులున్న దుపట్టాను జత చేసి చూడండి. మేని కళలో వచ్చిన తేడా మీకే తెలిసిపోతుంది. ►డిజైనర్ ష్రగ్ స్టైల్ చోలీ లెహెంగాకు జతగా కుచ్చుల నెటెడ్ దుపట్టా తోడైతే వేదిక ఏదైనా గ్రాండ్‌గా వెలిగిపోవచ్చు. ►షిమ్మర్ చోలీ, లెహెంగా డ్రెస్ ఏ వేడుకనైనా కాంతిమంతం చేస్తుంది. దానికి నెటెడ్ కుచ్చుల దుపట్టా జత చేర్చితే వేడుక కళ వెయ్యింతలు అవుతుంది. ►ప్లెయిన్ కలర్ లెహంగాని మరింత అందంగా చూపించేలా రఫెల్ దుపట్టా తోడైతే వేడుకలో బటర్ఫ్లైలా వెలిగిపోవచ్చు. ►రాసిల్క్ లెహంగాకి షిమ్మర్, పువ్వుల చోలీ ఆకర్షణ పెంచితే నెటెడ్ కుచ్చుల దుపట్టా రాణీ కళకు ఆహ్వానంపలుకుతుంది. ►రాసిల్క్ లెహంగాకి షిమ్మర్, పువ్వుల చోలీ ఆకర్షణ పెంచితే నెటెడ్ కుచ్చుల దుపట్టా రాణీ కళకు ఆహ్వానంపలుకుతుంది. ►దండలా కుచ్చిన దుపట్టా, దానికి జత చేసిన లేస్, కుచ్చుల లెహెంగా డ్రెస్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చింది. ►లెహెంగా చోలీ దుపట్టా.. ఒకే రంగులో ఉన్నా కుచ్చులు జత చేరితే వచ్చే కళే వేరు. పెళ్లింట అది రెట్టింపు వెలుగై వేడుకలో కనువిందు చేస్తుంది. -
అనార్వచనీయం
ప్యార్ కియా తో డర్నా క్యా అని అడిగింది నాటి అనార్కలి. ఉత్తరం, దక్షిణాలను కలిపితే తప్పేంటి అని అడుగుతోంది నేటి అనార్కలి. ఉత్తరాది అనార్కలి డ్రస్సును, దక్షిణాది లంగా ఓణీని కలిపి ఈ ‘హాఫ్ శారీ అనార్కలి’ డ్రస్సును తయారుచేశారు.ఈ కొత్త అందం అనార్వచనీయంగా ఉంది. ►‘డ్రెస్సింగ్ పూర్తి పాశ్చాత్య స్టైల్లో ఉండకూడదు. అలాగని మరీ సంప్రదాయబద్ధంగా ఓల్డ్ మోడల్లా అనిపించకూడదు’ అనేది నేటితరం మగువల కాన్సెప్ట్. అందుకే ఇండోవెస్ట్రన్ స్టైల్ కాన్సెప్ట్ అతివలను ఆపాదమస్తకం పట్టేసింది. లంగాఓణీ స్టైల్లో కనువిందు చేసే అనార్కలీ గౌన్లు సింగిల్‌పీస్ కంఫర్ట్నెస్తో మగువల మదిని దోచుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ►క్రీమ్, గోల్డ్, బ్లాక్.. మూడు రంగులూ ఒకే డ్రెస్‌లో.. అదీ అచ్చూ లంగా ఓణీలా ఉంటే ఎంత ముచ్చటగా ఉంటుంది. లంగాఓణీలా ఈ డ్రెస్‌తో కుస్తీ అక్కర్లేదు. గౌన్లా ధరించవచ్చు. బ్యాక్ సైడ్ జిప్ అటాచ్‌తో పూర్తి ఫిటింగ్ తీసుకురావచ్చు. ►పెద్ద అంచు ఉన్న లెహెంగా, డిజైనర్ బ్లౌజ్, ఓణీ, నడుముకు వడ్డాణం .. ఈ గెటప్ చూడగానే లంగాఓణీ అనేస్తారు. కానీ, ఇది అనార్కలీ డ్రెస్. దీనికి బాటమ్‌గా చుడీ లెగ్గింగ్ ధరిస్తే న్యూలుక్‌తో ఆకట్టుకుంటారు. ►చర్మం రంగును పోలీ ఉండే నెట్ ఫ్యాబ్రిక్‌తో నడుము, వీపు భాగంతో డిజైన్ చేశారు, ఆరెంజ్ ఓణీ, క్రీమ్ కలర్ లెహంగా, గోల్డ్ కలర్ బ్లౌజ్పార్ట్ కాంబినేషన్స్‌తో అనార్కలీ డ్రెస్‌ను అందంగా తీర్చిదిద్దారు డిజైనర్లు. ►చెస్ట్, హిప్ కొలతల ప్రకారం లెహెంగా స్టైల్ అనార్కలీ గౌన్ని ధరిస్తే చాలు. ఈ స్టైల్ వేడుకలో ప్రధాన ఆకర్షణగా ఉంటుంది కాబట్టి ఇతరత్రా అలంకారాల గురించి అదనపు శ్రమ అవసరం లేదు. బన్, ఫిష్‌టెయిల్ స్టైల్స్ కేశాలంకరణ ఈ డ్రెస్‌లకు బాగా నప్పుతుంది. ►లాంగ్ అనార్కలీ గౌన్‌కి అందంగా సెట్ చేసిన డిజైనర్ దుపట్టా, బ్లౌజ్ పార్ట్.. ఈవెనింగ్ గెట్ టుగెదర్ పార్టీలకే కాదు, వివాహాది సంప్రదాయపు వేడకులకూ ఈ డ్రెస్ మేలైన ఎంపిక. -
ఆఫ్ వైట్.. ఫుల్ బ్రైట్
మన ఆడపిల్లలు అందంగా ఉంటారుఆ అందానికి నగిషీయే ఆఫ్‌వైట్ శారీ! పూజకు తేజంవేడుకకు ఆకర్షణీయంఆ సౌందర్యానికి చిరునామాయే ఆఫ్‌వైట్ శారీ! ఆఫ్‌వైట్ శారీ సంప్రదాయానికి చిరునామా. అందుకే వివాహ వేడుకలకు, పండగలప్పుడు తప్పనిసరిగా ఈ కళ సందడి చేస్తుంటుంది. పాలమీగడలా ఉండే ఫ్యాబ్రిక్‌కి ఏ రంగు జత చేసినా చక్కగా నప్పుతుంది. బ్రైట్‌గా వెలిగిపోతుంది. కొంత తెలుపు–మరికొంత ఎరుపు లేదా పసుపు, నీలం లేదా నలుపు, ఎరుపు లేదా పింక్.. ఇలా ఏ రంగు కాంబినేషన్‌తో అయినా అందమైన అంచులతో చక్కగా కలుపుకొనే రంగు తెలుపుది. అందుకే బాలీవుడ్ టు టాలీవుడ్ భామలు సైతం ఈవెంట్స్‌కి ఆఫ్వైట్ని కోరి మరీ ఎంచుకుంటారు. వేడుకలలో ఫుల్ బ్రైట్‌గా వెలిగిపోతున్నారు. మన చుట్టూ ఉన్నవారితో మనం కూడా అంతే అందంగా కలిసిపోవాలని, అప్పుడే జీవితం కళవంతంగా తయారవుతుందని తెలుపురంగు చెప్పకనే చెబుతుంటుంది. కొంత ముతక తెలుపు కాంబినేషన్‌తో డిజైనర్లు కాటన్, సిల్క్, పట్టు చీరలను అందంగా నేస్తున్నారు. ఆఫ్ వైట్ శారీని «ఎంచుకోవాలంటే కాటన్ చీర రూ.300/ నుంచి అదే పట్టు చీర అయితే 30 వేల రూపాయల పైబడే ధరలు ఉన్నాయి. అభిరుచి, బడ్జెట్‌ను అనుసరించి ఆఫ్‌వైట్ కాంబినేషన్ శారీని పండగలకు ఎంచుకోవచ్చు. ∙ఎరుపు, పసుపు, పచ్చ, ఆరెంజ్.. ఈ కాంతిమంతమైన అంచులున్న ఆఫ్‌వైట్ చీరలు సంప్రదాయ వేడుకలలో ప్రత్యేకంగా నిలుస్తాయి. ∙ఆఫ్‌వైట్ శారీకి వైవిధ్యమైన, కాంతిమంతమైన అంచులున్న బ్లౌజలను ధరించవచ్చు ∙వేడిగా, చల్లగా ఉన్న వాతావరణంలోనూ ఈ రంగులు కంటికి హాయినిస్తాయి. ∙తెలుపు లేదా క్రీమ్ రంగు చీరకు సిల్వర్ లేదా బంగారు రంగు అంచులు లేదా బ్లౌజ్ ధరిస్తే స్టైలిష్‌గా, గ్లామరస్‌గా కనిపిస్తారు ∙మోడల్స్, సెలబ్రిటీలు ఆఫ్వైట్ను ఒక స్టైల్ స్టేట్‌మెంట్‌లా తీసుకుంటారు ∙తెలుపు రంగు బ్లౌజ్ వేసుకోవాలంటే చికున్, లక్నో వర్క్ చేసిన బ్లౌజ్‌లను ధరించాలి. ముచ్చటగొలిపే మగ్గం వర్క్ లేదా హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేసిన బ్లౌజ్‌లను ధరిస్తే లుక్ బ్రైట్‌గా కనిపిస్తుంది ∙ఆఫ్వైట్శారీకి ఇండోవెస్ట్రన్ లుక్ తీసుకురావాలంటే ఫ్రిల్డ్ స్లీవ్స్ బ్లౌజ్, క్రాప్‌టాప్స్, జాకెట్స్, పెప్లమ్ బ్లౌజ్.. లాంటి వెస్ట్రన్ స్టైల్ బ్లౌజ్‌లను ధరించాలి ∙ఆఫ్ వైట్ శారీలో ఎక్కువ రంగులు లేవు మరీ ప్లెయిన్‌గా ఉందని అనిపించినా సరే బ్లౌజ్ డిజైన్‌లో తక్కువ ఎంబ్రాయిడరీ, పెయింటింగ్, ప్రింట్లు.. ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి ∙ఈ రంగు చీరకు ఉన్న ప్రత్యేకత బ్లౌజ్ డిజైన్లలో ట్రెండ్‌ను అనుసరించి ఎంపిక చేసుకుంటే ఆభరణాల అలంకరణ పట్ల ఆందోళన అవసరం లేదు. చీరకట్టుతోనే స్పెషల్ స్టైల్‌ని క్రియేట్ చేయవచ్చు. ►ప్లెయిన్ ఆఫ్‌వైట్ పట్టు చీరకు నీలం రంగు బ్లౌజ్ ఓ ఆకర్షణ. సింపుల్‌గా అనిపించే ఫ్యాబ్రిక్ పెయింట్ లేదా హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేసిన బ్లౌజ్ ధరించడంతో అందం రెట్టింపు అవుతుంది. ►సంప్రదాయ కంచిపట్టు ఆఫ్‌వైట్ శారీకి మోడ్రన్ లుక్ తీసుకురావాలంటే ఓ చిన్నమార్పు చాలు. స్లీవ్‌లెస్ బ్లౌజ్ బెస్ట్ ఆప్షన్. ►ఆఫ్‌వైట్ శారీకి అదే రంగు బ్లౌజ్ ప్రత్యేక ఆకర్షణతో ఆకట్టుకుంటుంది. వేదిక ఏదైనా, వేడుక ఏదైనా గ్రాండ్‌గా వెలిగిపోతుంది. ►ముంజేతులు దాటిన త్రీ బై ఫోర్త్ బ్లౌజ్ ఆఫ్‌వైట్ శారీకి కొత్త హంగును తీసుకువచ్చింది. ►సింపుల్ కాటన్ ఆఫ్ వైట్ శారీ స్టైల్ సూపర్బ్ అనిపించాలంటే కాంట్రాస్ట్ క్రాప్‌టాప్ సరైన ఎంపిక అవుతుంది. ►ఆఫ్‌వైట్ పట్టు చీర, కొంగును పోలీ ఉండే బ్లౌజ్ రంగు, పెద్ద అంచు సంప్రదాయ వేడుకకు నిండుతనాన్ని తీసుకువస్తుంది. ►ఆభరణాల అలంకరణ లేకున్నా సంప్రదాయ కళను నట్టింటికి తీసుకువచ్చే తేజం ఆఫ్‌వైట్ శారీస్ది. ఇదే రంగు లెహంగా, కుర్తాలకీ వర్తిస్తుంది. ఆఫ్వైట్ని ఏ రూపంగా ధరించినా వేడుకలో అమ్మాయిలు కళగా వెలిగిపోతారు. – కీర్తికా గుప్త, డిజైనర్ -
ఓం..శాంతి పట్టు!
గాంధీజీ 150 వ జయంతి రేపు. సమాజంలోని అణువణువులో ఆయన ప్రవచించిన అహింస.. ఓంకార నాదంలా ధ్వనిస్తోంది. శాంతి మార్గమై నడిపిస్తోంది. జ్యోతిరెడ్డి ఆ ధ్వనికి... ప్రతిధ్వని అయ్యారు. ఆ శాంతిమార్గంలో ఓ ‘పట్టు’ కొమ్మ అయ్యారు. పట్టుకు ఆయువు పట్టు అయిన పురుగు ప్రాణం తియ్యకుండా దారాన్ని సేకరించే ‘ఇంటెలిజెంట్ డిజైనర్’ అయ్యారు. ‘‘ప్రకృతి మనకు పత్తితోపాటు పట్టును కూడా ఇచ్చింది. పట్టు కోసం పట్టు పురుగును పెంచి, చంపడం అనే అమానుషానికి పాల్పడనక్కర్లేదు’’ అంటారు జ్యోతిరెడ్డి. అందంగా కనిపించడానికి చక్కటి పట్టు దుస్తులు ధరించాలనుకుంటాం. అందుకోసం పట్టు పురుగు మనకు అమూల్యమైన సేవలందిస్తోంది. దాని జీవితమంతా పట్టును పుట్టించడంలోనే గడుపుతుంది. పట్టు పురుగులు మల్బరీ ఆకులను తిని తమ చుట్టూ గూడు అల్లుకుంటాయి. అదే పట్టుగూడు. పురుగు గూడు లోపల ఉంటుంది. ఆ పట్టు గూళ్లను వేడి నీటిలో వేసినప్పుడు దారం వస్తుంది, కానీ పురుగు ప్రాణం పోతుంది. బాగా ప్రాచుర్యంలో ఉన్న పట్టు సేకరణ విధానంలో పట్టు దారం కోసం పట్టు పురుగును నిర్దాక్షిణ్యంగా చంపేస్తారు. అహింసాయుతంగా జీవించడానికి గాంధీజీ చెప్పినట్లు ‘విలువైనది మనిషి ప్రాణం మాత్రమే కాదు, అన్ని జీవుల ప్రాణమూ అంతే సమానమైనది’ అని జ్యోతిరెడ్డి నమ్ముతారు. నిజమే. మన మనుగడ కోసం ప్రాణుల్ని చంపాల్సి రావడాన్ని తప్పు పట్టలేం. కానీ మన అందం, ఆనందం కోసం ప్రాణాలు తీయాల్సిన అవసరం ఏ మాత్రం లేదు. అహింస పట్టు ప్రకృతి మనకు జీవించడానికి అన్ని వనరులనూ ఇచ్చింది. అలాగే హింసకు తావులేని పట్టును కూడా ఇచ్చింది. అసోంతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో పెరిగే పట్టు పురుగులు స్వేచ్ఛాజీవులు. వాటికి ఆముదం ఆకులే ఆహారం. అక్కడ ఆముదం చెట్లు విస్తారంగా ఉంటాయి. ఆ పట్టుపురుగులు తమ చుట్టూ గూడు కట్టుకోవు. ఆకుల మీద పట్టు దారాలతో గూడు అల్లుతాయి. కొన్నాళ్లకు పాత గూడుని వదిలి మరో ఆకు మీదకు వెళ్లి కొత్త గూడు అల్లుతాయి. స్థానిక గిరిజనులు పురుగు వెళ్లిపోయిన ఆకును ఇట్టే గుర్తించగలుగుతారు. అలాంటి ఆకుల నుంచి మాత్రమే పట్టును సేకరిస్తారు. అంతే తప్ప పట్టు కోసం పురుగుకు హాని కలిగించరు. వారి జీవనం లాగానే వారి పట్టు వస్త్రాల తయారీ కూడా శాంతియుతంగానే ఉంటుంది. పట్టుదారం వడకడం, పట్టు వస్త్రాలను నేయడం అసోంలో కుటీరపరిశ్రమ. ఆ వస్త్రాలను పవిత్రంగా భావిస్తారు. పండుగలు, వేడుకలప్పుడు ధరిస్తారు. అహింసాయుత జీవితాన్ని ఆచరించే జైన, బౌద్ధులు ఈ వస్త్రాలను ధరిస్తారు. నేను వెదికింది అదే ‘ద వరల్డ్ నీడ్స్ ఇంటెలిజెంట్ ఫ్యాబ్రిక్ ’అన్న మాటలే తనను ఈ శాంతి పట్టు వైపు నడిపించాయంటారు జ్యోతి. ‘‘ఎక్స్పోర్ట్ వ్యాపారంలో అంతర్జాతీయ ట్రేడ్ షోలకు వెళ్లినప్పుడు ఇటాలియన్ ఫ్యాషన్ డిజైనర్ అన్న ఆ మాటకు అర్థం అప్పట్లో తెలియలేదు. ఇండియాకి వచ్చిన తర్వాత నా పనుల్లో నేను ఉన్నప్పటికీ వస్త్రరంగం మీద పరిశోధన మొదలు పెట్టాను. అంతకుముందు నేనే సొంతంగా డిజైన్ చేస్తూ బొటీక్ నడిపిన అనుభవాన్ని జోడించి రకరకాల వస్త్రరీతులను అధ్యయనం చేశాను. అందులో భాగంగా ముంబయిలో నాకు తెలిసిన డిజైనర్లతో కూడా మాట్లాడాను. అసోం గిరిజనులు పట్టు దారాన్ని సేకరించే విధానం, ఎరికల్చర్, ఎరి సిల్క్‌తో చేనేత గురించి తెలిసింది. ఓపెన్ కకూన్ని చూద్దామని వెళ్లాను. అక్కడ ఇది కుటీరపరిశ్రమ. ఇంట్లో అందరూ పని చేస్తారు. పట్టు దారం వడకడం నుంచి వస్త్రం నేయడం వరకు అన్నింటినీ స్వయంగా చేస్తారు. ప్రతి ఇంటి ముందు వెదురు కర్రల ఫ్రేమ్ ఉంటుంది. పట్టు వస్త్రం మీద కళాత్మకమైన డిజైన్‌తో నేసి ఆ ఫ్రేమ్‌కి తగిలిస్తారు. ఎవరి డిజైన్ వాళ్లదే. తల్లి నుంచి కూతురు నేర్చుకుంటుంది, ఆమె మరింత సృజనాత్మకత జోడించి కొత్త డిజైన్‌ను రూపొందిస్తుంది. అది ఆ కుటుంబానికే సొంతం. ఆ వస్త్రం చాలా అందంగా, ఒంటికి హాయిగా ఉంటుంది. రోజంతా ధరించినా ఒక్క ముడత కూడా పడదు. ఎన్ని రకాలుగా కట్టినా చక్కగా అమరిపోతుంది. ఆ పట్టు మీద మరెన్నో ప్రయోగాలు చేయవచ్చనిపించింది. ఇటాలియన్ ఫ్యాషన్ డిజైనర్ అన్న మాటల అర్థం అప్పుడు తెలిసింది. నిజంగా అది ఇంటెలిజెంట్ ఫ్యాబ్రికే. దీని మీద ఐదేళ్ల పాటు పరిశోధించాను. సురయ్యా హసన్ బోస్, ఉజ్రమ్మ, బీనారావు వంటి వాళ్ల అనుభవాలను తెలుసుకున్నాను. అసోం టు అమెరికా అసోం పట్టు దారాన్ని సన్నగా చేయగలిగితే విప్లవమే తీసుకురావచ్చనిపించింది. ఫ్యాక్టరీ పెట్టాలని ప్రయత్నాలు చేసేటప్పుడు.. ‘దీని మీద సమీప భవిష్యత్తులో లాభాలను ఆశించరాదు, మీ ఆలోచనను నిరూపించాలనే తపన ఉంటే మాత్రం ముందుకెళ్లవచ్చు’ అని చెప్పారు ఆడిటర్. నా ప్యాషనే నన్ను ముందుకు నడిపించింది. నాలాగే ఆలోచించే మరికొందరం కలిసి చైనా మిషనరీతో కో ఆపరేటివ్ విధానంలో ఫ్యాక్టరీ పెట్టాం. నాలుగు వందల మంది చేనేతకారులు మాతో పని చేస్తున్నారు. మేము తయారు చేస్తున్న సన్నటి దారాన్ని ఇకత్, జామ్దాని, పైథాని, జకార్డ్ నేతలతో మిళితం చేస్తున్నాం. అందుకోసం వివిధ రాష్ట్రాల్లో నిపుణులైన చేనేతకారులను కలిశాను. పుట్టపాక, పోచంపల్లి, చౌటుప్పల్ నుంచి కోల్‌కతా, మిడ్నాపూర్ వరకు మొత్తం ఎనభై మంది మాస్టర్ వీవర్స్ మాతో పని చేస్తున్నారు. వాళ్ల సంప్రదాయ డిజైన్లకు కొత్త రీతులను జోడించి వైవిధ్యంగా తెస్తున్నాం. కలంకారీ అద్దకం చేస్తున్నాం. నా ప్రయత్నం అన్నింటిలోనూ విజయవంతమైంది. కానీ అడ్డంకి ఒక్క బాతిక్ దగ్గరే వచ్చింది. ఓపెన్ కకూన్లు ఆముదం ఆకును తింటాయి, కాబట్టి వాటి నుంచి వచ్చిన పట్టు కూడా చాలా స్మూత్‌గా జారుడుగా ఉంటుంది. దాంతో బాతిక్ ప్రింట్ కుదరలేదు. బాతిక్ కోసం పట్టులో ఆర్గానిక్ కాటన్ మిక్స్ చేసి ప్రయోగం చేస్తున్నాం. ఎరీనా బ్రాండ్ కోసం... ఎరి సిల్క్‌లో ప్రయోగాలతోపాటు ఇప్పుడు మా ఉత్పత్తుల బ్రాండింగ్ మీద దృష్టి పెట్టాను. జర్మనీలో సిల్క్ ప్రమోషన్ కౌన్సిల్ ట్రేడ్ ఫెయిర్‌లో మా పట్టు వస్త్రాలకు మంచి ఆదరణ వచ్చింది. స్థానిక మ్యాగజైన్లలో మంచి కథనాలు రాశారు. అమెరికాకీ పరిచయం చేశాను. మనదేశంలో ఉన్న నైపుణ్యాన్ని ప్రపంచానికి తెలియజేసుకోవడంలో ఇప్పటికే చాలా వెనుకపడిపోయాం. దాంతో కొన్ని తరాల వెనుక మన చేనేతకారుల్లో ఉండిన కళ యథాతథంగా తర్వాతి తరాలకు కొనసాగలేదు. ఇప్పుడు అనేక ప్యాటర్న్లు పూర్తిగా కనుమరుగయ్యాయి. ఉన్న వాటినైనా పరిరక్షించుకుంటే.. ఇండియా వేల ఏళ్ల కిందటే ఫ్యాషన్‌కు ప్రతీక అని ప్రపంచానికి తెలుస్తుంది. ప్రతి ఒక్కరినీ నేను కోరేది ఒక్కటే. ‘బయటి దేశాలకు వెళ్లినప్పుడు మన వస్త్రాలను ధరిస్తే... మనదేశానికి మనమే బ్రాండ్ అంబాసిడర్లం అవుతాం’. అలాగని చీరలే కట్టాల్సిన పనిలేదు. కుర్తాలు, దుపట్టాలు, స్టోల్స్ ధరించినా చాలు. మన దగ్గర ఉన్న కళాత్మకతను గర్వంగా ప్రదర్శించవచ్చు’’. జర్మనీ ఫ్రెండ్ నుంచి ఫోన్ కాల్ నేను పుట్టింది, పెరిగింది ముంబయిలో. పెళ్లి తర్వాత అమెరికా వెళ్లాను. ఎంబీఏ అక్కడే చేశాను. పిల్లలిద్దరూ అక్కడే పుట్టారు. నాకేమో ఇండియా అంటే చాలా ఇష్టం. మనదేశంలో లేననే బెంగ ఉండేది. మా వారు (చంద్రశేఖర్) హైదరాబాద్‌లో బిజినెస్ ప్లాన్ చేయడంతో హాయిగా ఊపిరి పీల్చుకున్నాను. ఇండియాకి వచ్చేటప్పటికి పిల్లలు కొంచెం పెద్దయ్యారు. నేను కూడా ఏదైనా చేయాలనే ఆలోచనతో షూషాప్, బొటీక్ పెట్టాను. అమెరికాలో ఉన్న జర్మన్ ఫ్రెండ్‌కి ఎంబ్రాయిడరీ దుస్తులు ఎక్స్పోర్ట్ చేయాల్సిన ఎక్స్‌పోర్టర్ హటాత్తుగా సప్లయ్ ఆపేయడంతో ఆమె నాకు ఫోన్ చేసింది. ఆమెకు వస్త్రాలను ఎక్స్పోర్ట్ చేయడం కోసం 1996లో ఎక్స్పోర్ట్ బిజినెస్ మొదలైంది. ఆ బిజినెస్‌ని విస్తరించడం కోసం వెళ్లిన ఫ్రాన్స్, స్వీడన్లలో ట్రేడ్ ఫెయిర్లతో శాంతియుతమైన ఎరి సిల్క్ బాట పట్టాను. డిన్నర్ టేబుల్ స్టోరీలు మా అమ్మానాన్నల అనుభవాలే మాకు పాఠాలు. నాన్న వరంగల్‌లో చిన్న గ్రామం నుంచి ముంబయికి వెళ్లారు. అక్కడ షిప్పింగ్ వ్యాపారంలో నిలదొక్కుకోవడానికి ఎన్నో అడ్డంకులను ఎదుర్కొన్నారు. రాత్రి భోజనాలప్పుడు అన్ని విషయాలనూ చెప్తుండేవారు. ఒక సమస్యను అధిగమించడానికి ఎంత చాకచక్యంగా వ్యవహరించాలనేది ఆయన ప్రత్యేకంగా చెప్పలేదు. కానీ మాలో వ్యాపార నైపుణ్యాలు పెరగడానికి అవన్నీ ఉపకరించాయి. అమ్మ ప్రతి పనినీ చాలా క్రియేటివ్‌గా చేసేది. అప్పట్లో మాకు భోజనాలకు కేసరోల్స్ ఉండేవి కాదు, స్టీలు గిన్నెలనే టేబుల్ మీద చక్కగా అమర్చేది. పూలను ఒకసారి కట్టినట్లు మరోసారి కట్టేది కాదు. ముగ్గులు కూడా నేర్చుకున్న వాటిని నేర్చుకున్నట్లు యథాతథంగా వేసేది కాదు. తన సృజనను జోడించేది. వీటన్నింటినీ చూస్తూ పెరిగాను. కాబట్టే ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేయకపోయినా ఈ రంగంలో విజయవంతం కాగలుగుతున్నాను. నా ఈ ప్రయత్నంలో ప్రత్యక్షంగా వందల కుటుంబాలకు ఉపాధి దొరకడంతోపాటు పరోక్షంగా వేలాది కుటుంబాలకు రాబడి పెరుగుతోంది. భారతీయ వస్త్ర కళ అంతర్జాతీయ వేదిక మీద మన్ననలు పొందేలా చేయాలనేది నా ఆకాంక్ష. నా రక్తంలో భారతీయత ఉంది. దేశగౌరవాన్ని పెంచడానికి నా వంతుగా ఏదైనా చేయాలి. నేను చేస్తున్న దేశసేవ ఇది. -
డోరీ నెక్లెస్
నూలు దారాన్ని వరుసలుగా పేర్చి, ఒడుపుగా అల్లి, దానికి ఆభరణాన్ని జత చేర్చితే డోరీ నెక్లెస్ అవుతుంది. దీనినే థ్రెడ్ నెక్లెస్ అనీ అంటారు. ఈ నెక్లెస్ తయారీకి ఇమిటేషన్ జువెల్రీనే కాదు, రత్నాలు పొదిగిన బంగారు పెండెంట్స్, బీడ్స్ వాడి అందంగా రూపొందిస్తున్నారు డిజైనర్లు. తయారీకి కావల్సినవి: 1. నచ్చిన లేదా నలుపు రంగు నూలు/సిల్క్ దారం 2. గ్లూ 3. కత్తెర 4. ప్లకర్, కటర్ 5. హుక్ చెయిన్ లేదా గోల్డ్ కలర్ దారం తయారీ: 1. దారాన్ని మెడకు సరిపోయేలా తగిన ంత పొడవులో కొన్ని వరసలు తీసుకోవాలి. వాటన్నింటిని మూడు సమభాగాలుగా తీసుకోవాలి. 2. ఒకవైపు మూడి వేయడం లేదా ప్లాస్టర్‌తో అతికించాలి. 3. మూడు భాగాలను జడ మాదిరి అల్లాలి. పూర్తి అల్లిక గట్టిగా ఉండాలి. పూర్తిగా అల్లిన తర్వాత చివరలను ముడివేయాలి. 4. నచ్చిన పెండెంట్ లేదా పూసలను తీసుకొని అల్లిన నూలు దారానికి కటర్ సాయంతో జత చేయాలి. లేదంటే దారాన్ని అల్లుతున్నప్పుడే పెండెంట్స్‌ని సెట్ చేసుకోవచ్చు. అన్నింటిని సెట్ చేసిన తర్వాత చివరలను కలుపుకుంటూ గోల్డ్ కలర్ దారంతో చుట్టాలి. ఈ రెండు దారాలు ఊడిపోకుండా గట్టిగా చుట్టి, రెండువైపులను కలుపుతూ ఒక పేద్ద పూసను గుచ్చాలి. ఈ పూస చేత్తో కదిలిస్తే వెనక్కీ ముందుకూ కదిలేలా ఉండాలి. చివరన దారంతో చేసిన టస్సెల్(దారాలతో చేసిన కుచ్చు)ను జత చేస్తే అలంకరణకు డోరీ నెక్లెస్ రెడీ. -
ర్యాంప్‌వాక్‌తో మెస్మరైజ్
-
ఫ్యాషన్ షోలో మెరిసిన సల్మాన్ ,కత్రినా
-
చెవికి సీతాకోకచిలుకలు
దారపు పోగులతో అందంగా తీర్చిదిద్దిన చెవి జూకాలు ఇవి. రంగు రంగుల సిల్క్, ఊలు దారాలతో చేసి ఈ ఆభరణాలు సంప్రదాయ ఆభరణాలు కావు. ఆధునిక దుస్తుల మీదకు మరింత అందమైన సొబగులు అద్దే టస్సెల్ ఇయర్ రింగ్స్. వేసుకున్న డ్రెస్ అందం మరింత పెంచేలా, సరైన విధంగా మ్యాచ్ అయ్యేలా ఇంపుగా ఉండడం ఈ డిజైనర్ ఇయర్స్ రింగ్స్ ప్రత్యేకత. వీటిని చాలా సులువుగా ఎవరికి వారు తయారుచేసుకోవచ్చు. తయారీ: 1 దారపు పోగులను సమభాగాలుగా తీసుకోవాలి. కావల్సినంత పరిమాణం దారపు పోగులను కలిపి, మధ్యకు తీసుకోవాలి. మధ్య భాగాన్ని మరో దారంతో ముడివేయాలి. 2 తీగకు గుచ్చి గోల్డ్ కలర్ పూసను దారం ముడి వేసిన భాగంలో కనెక్ట్ చేసి, ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టి సెట్ చేయాలి. ∙పూస అటూ ఇటూ జరగకుండా తీగను పట్టుకారతో ముడి తిప్పాలి. 3 చెవికి తగిలించే హుక్‌ను ముడిలా తిప్పిన తీగకు సెట్ చేయాలి. ∙కింది భాగంలో సమంగా లేని దారపు పోగులను కత్తిరించాలి. ఇలాగే రంగు రంగుల చెవి హ్యాంగింగ్స్‌ను తయారు చేసుకోవచ్చు. వాటిలో ఇవి కొన్ని మోడల్స్ కావల్సినవి: ’ సిల్క్ లేదా ఊలు దారాలు’ గోల్డ్ కలర్ పూసలు’ గోల్ కలర్ తీగ’ ఇయర్ రింగ్ హుక్స్, పట్టుకార -
ఆ హీరోయిన్ డ్రెస్‌కి 25 ఏళ్లంట!
ముంబై: ప్రముఖ డైరెక్టర్ శశాంక్ ఘోష్ దర్శకత్వంలో బాలీవుడ్ నటులు సోనమ్ కపూర్, కరీనా కపూర్, స్వరా భాస్కర్, శిఖ తల్సానియా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘వీరే ది వెడ్డింగ్’. ఈ మూవీ గత శుక్రవారం విడుదలయి బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతోంది. ఈ చిత్రం చూసి ప్రతి ఒక్కరు హిరోయిన్ల డ్రెస్ గురించే మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా కరీనా కపూర్ వేసుకున్న డ్రస్‌కి మహిళలు అంతా ఫిదా అయ్యారు. తాజాగా కరినా వేసుకున్న డ్రస్ గురించి ఓ ఆసక్తికరమైన విషయం బయటకి వచ్చింది. ఈ సినిమాలోని వివాహ సన్నివేశంలో కరీనా కపూర్ వేసుకున్న డ్రస్ ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అబుజానీ సందీప్ ఖోస్లా డిజైన్ చేశారు. ఆ డ్రస్ చూడడానికి చాలా కొత్తగా, అందంగా ఉంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ డ్రెస్ 25 ఏళ్ల క్రితం డిజైన్ చేసినదట. ఈ విషయాన్ని అబుజానీ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ‘ ఆ డ్రెస్‌ను 25 ఏళ్ల క్రితం డిజైన్ చేశాం. మా ఫాక్టరీలోని ఓ పెట్టెలో దాన్ని ఉంచాం. ఓ రోజు ఫ్యాక్టరీలోని దాచిన దుస్తులన్ని బయటకు తీస్తుండగా నిర్మాత రియా మా ఫ్యాక్టరీకి వచ్చారు. ఆ సమయంలో రియాకు ఆ డ్రెస్ కన్పించింది. దాన్ని బయటికి తీయమని చెప్పారు. అది నచ్చడంతో దానిని లెహెంగాగా డిజైన్ చేయమన్నారు. స్కర్ట్, టాప్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు. కేవలం చున్నీని వెరైటీగా డిజైన్ చేశాం. దాన్ని కరినాకు సరిపడేలా డిజైన్ చేశాం. పెళ్లి సీన్లో కరీనా ఆ డ్రెస్‌లో కన్పిస్తుంది’ అని అబుజానీ వెల్లడించారు. మరోవైపు ‘ వీరే ది వెడ్డింగ్’ సినిమా రెండు రోజులకే రూ.22.95 కోట్ల వసూళ్లతో దూసుకెళ్తోంది. వీకెండ్ లోపు 35 కోట్లు దాటేలా ఉందని బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. -
గొల్ల భామలు
తరతరాలుగా వస్తున్న ఒక అందమైన, అద్భుతమైన సంప్రదాయం గొల్లభామ చీరలు.నేసినంతసేపు చేతులు నాట్యమాడతాయితొడిగినంతనే మేను నాట్యం చేస్తుంది.సంప్రదాయం పిల్లలకు అలవర్చాలి. అప్పుడే ఇంకో వంద తరాలు ఆ నేత నిలుస్తుంది.అందుకే గొల్లభామ చీరలతో పిల్ల భామలకు సొబగులు అద్దుతున్నారు డిజైనర్లు. ►హాఫ్‌వైట్, ఆరెంజ్ .. రెండు కాంట్రాస్ట్ కలర్ గొల్లభామ చీరలతో లాంగ్ గౌన్‌గా తీర్చిదిద్దారు. లాంగ్ స్లీవ్స్‌కి పల్లూ పార్ట్‌తో డిజైన్ చేశారు. ►ఈ డ్రెస్లోనూ రెండు కాంట్రాస్ట్ చీరలను ఎంపిక చేసుకున్నారు. బెల్ ఫ్రిల్స్ లాంగ్ స్లీవ్స్‌ని ఆకర్షణీయంగా డిజైన్ చేశారు. ►గొల్లభామ పంచెను ధోతీలా కుట్టి, దాని మీదకు కాటన్ బ్లేజర్‌ను జత చేశారు. కాంట్రాస్ట్ కలర్ దుపట్టాను వాడారు. దీంతో ఇండో వెస్ట్రన్ స్టైల్ లుక్ వచ్చింది. ► ఒకే రంగు గొల్లభామ చీరతో డిజైన్ చేసిన వెస్ట్రన్ డ్రెస్ ఇది. పల్లూభాగంతో డిజైన్ చేసిన బెల్ స్లీవ్స్‌కి , కాలర్ నెక్ ఈ డ్రెస్‌కు ప్రధాన ఆకర్షణ. ► పసుపు రంగు గొల్లభామ చీరతో రూపొందించిన పార్టీవేర్ డ్రెస్ ఇది. కొంగులో కొంత భాగం ఛాతీకి, మిగతాది చేతులకు డిజైన్ చేశారు. ► హాఫ్ వైట్, రెడ్ కలర్ రెండు చీరలను ఉపయోగించి కాంట్రాస్ట్ డిజైన్‌తో లేయర్డ్ గౌన్‌గా తీర్చిదిద్దారు. మీరే డిజైనర్ సిల్క్ థ్రెడ్ వడ్డాణం తయారీ 1. బంగారు రంగు దారాన్ని పొడవాటి స్కేల్‌కి నిలువుగా కనీసం 50–60 వరసలు చుట్టాక స్కేల్ నుంచి దారం తీసి, చివరన ప్లకర్ లేదా కత్తెరతో కట్ చేసి, గ్లూ పెట్టి దారం పోగులు విడివడకుండా గ్లూతో అతికించాలి. 2. గ్లూతో అతికించిన దారం పోగుల చివరి భాగాన్ని హెయిర్ క్లిప్‌కి సెట్ చేసి, మూడు పాయలు తీసి జడలా అల్లాలి. చివరన మళ్లీ గ్లూతో విడివడకుండా అతికించాలి. ఇలాంటివి దారాలతో జడలుగా అల్లిన నాలుగు చైన్లను సిద్ధం చేసుకోవాలి. 3. కాగితం చార్ట్ మీద గ్లూ రాసి దాని మీద పెద్ద ఎర్రటి కుందన్ పెట్టి సెట్ చేయాలి. దాని చుట్టూ గోల్డెన్ బాల్ చెయిన్ చుట్టి చివర్లను పక్కర్తో కట్ చేయాలి. తర్వాత మళ్లీ గ్లూ పెట్టి మరో వరుస రెడ్ బాల్ చెయిన్, రాళ్ల చెయిన్, గ్రీన్ బాల్చెయిన్, చివరగా ముత్యాల చెయిన్.. ఇలా ఒకదాని తర్వాత ఒకటి గ్లూ పెడుతూ, చుట్టాలి. ఇది గుండ్రటి షేప్ వస్తుంది. 4. చుట్టూ అదనంగా ఉన్న చార్ట్‌ని ప్లకర్‌తో కట్ చేయాలి. ఇలా గుండ్రటి డిజైనర్ షేప్‌ను తయారుచేసుకోవాలి. 5. సిద్ధం చేసుకున్న థ్రెడ్ చెయిన్‌ని మధ్యకు మడిచి, మార్క్ చేసుకొని, గ్లూ పెట్టి, డిజైనర్ బిళ్లను సెట్ చేయాలి. 6. దీని పక్కనే చిన్నకుందన్ని గ్లూతో అతికించి, దాని చుట్టూ గోల్డ్, స్టోన్, రెడ్ బాల్ చెయిన్స్‌ని అతికిస్తూ, చివర్లను ప్లకర్‌తో కట్ చే యాలి. 7. రెండువైపులా థ్రెడ్ చెయిన్స్‌ని గ్లూతో అతికించాలి. తర్వాత రెడ్, గ్రీన్, స్టోన్ బాల్ చెయిన్స్‌ని ఆ చెయిన్ మీద పొడవాటి లైన్‌గా అతికించాలి. 8. చివరలను కత్తిరించి, గ్లూతో అతికించాలి. 9. గోల్డ్ బాల్ చెయిన్‌ని చిన్న చిన్న పీసులుగా ప్లకర్‌తో కట్ చేసి, బెల్ట్‌కి వెనకాల తోరణం మాదిరి గ్లూతో అతికించాలి. 10. తెల్లటి పూసలు లేదా ముత్యాలు ఉన్న పిన్ బాల్స్‌ని బెల్ట్‌కి గుచ్చాలి. అవి ఊడకుండా మధ్య భాగంలో గ్లూతో అతికించాలి. 11. గోల్డ్ చెయిన్ బాల్ని తోరణంలా అతికించాలి. 12. చివరలు హుక్స్ ఉన్న చెయిన్స్‌ని అతికించాలి. నిర్వహణ: ఎన్.ఆర్.