ఆధునిక డిజైన్లపై దృష్టి సారించాలి
ఆధునిక డిజైన్లపై దృష్టి సారించాలి
Published Tue, Aug 9 2016 7:45 PM | Last Updated on Thu, May 24 2018 2:36 PM
భూదాన్‌పోచంపల్లి : మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా ఆధునిక డిజైన్లపై దృష్టి సారించాలని ధర్మవరం సెంట్రల్ సిల్క్‌బోర్డు సైంటిస్ట్ బీఎం మహాదేవయ్య అన్నారు. మంగళవారం సెంట్రల్ సిల్క్‌బోర్డు ప్రతినిధుల బృందం పోచంపల్లి చేనేత సహకార సంఘాన్ని సందర్శించి పాలకవర్గంతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. చేనేత గృహాలకు వెళ్లి మగ్గాలపై తయారవుతున్న చేనేత వస్త్రాలను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ధర్మవరం సెంట్రల్ బోర్డు సైంటిస్ట్ బీఎం మహాదేవయ్య మాట్లాడుతూ టెక్స్‌టైల్ స్కిల్ కౌన్సిల్ న్యూఢిల్లీ, డిపార్ట్‌మెంట్ ఫర్ ఇంటర్నేషనల్ డెవ్‌లప్‌మెంట్, ఎఫ్‌ఐసీసీఐ సంయుక్త ఆధ్వర్యంలో క్యాలిఫికేషన్ ప్యాక్ డెవలప్‌మెంట్ ప్రొగ్రామ్‌లో భాగంగా చేనేత కార్మికులకు ఆధునిక పద్ధతులపై శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. అందులో భాగంగానే క్షేత్రస్థాయి అధ్యయనం నిమిత్తం పోచంపల్లి సందర్శనకు వచ్చామని పేర్కొన్నారు. వీరి వెంట ఎఫ్‌ఐసీసీఐ కన్సల్టెంట్ సోహిని గుహ, హిందూపూర్, ధర్మవరం సెంట్రల్ సిల్క్‌బోర్డు టెక్నికల్ అసిస్టెంట్స్ పద్మాకర్, ఎ. రామకృష్ణ, చేనేత సహకార సంఘం ఉపాధ్యక్షుడు సిద్ధుల రాంచంద్రం, డైరక్టర్, భారత భారతమ్మ, సిబ్బంది చిలువేరు గోవర్ధన్, తదితరులు ఉన్నారు.
Advertisement
Advertisement