darmavaram
-
విలువైన భూమిపై ‘సూరి’ కన్ను
సాక్షి, పుట్టపర్తి: ధర్మవరం మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత వరదాపురం సూరి అలియాస్ గోనుగుంట్ల సూర్యనారాయణ అనంతపురం నగరంలో రూ. 129 కోట్ల విలువైన 6.35 ఎకరాల స్థలంపై కన్నేశారు. నవోదయ కాలనీ 80 అడుగుల రోడ్డు పక్కనే ఈ స్థలం ఉంది. ఇక్కడ సెంటు రూ.20 లక్షలకు పైనే. అత్యంత విలువైన ఈ స్థలాన్ని నకిలీ పత్రాలతో భూమి తనదని చెప్పుకుంటున్న వ్యక్తి నుంచి తన కుమారుడు, అనుచరుడి పేరిట రిజిస్ట్రేషన్ చేయించారు. సూరి అనుచరులు భూమి అసలు హక్కుదారులను ఖాళీ చేయాలంటూ బెదిరించారు. కబ్జాకు యత్నించారు. హక్కుదారుల ఫిర్యాదు మేరకు సబ్‌రిజిస్ట్రార్‌ను అధికారులు సస్పెండ్ చేశారు. సూరి కుమారుడు నితిన్‌సాయి, అనుచరుడు రాజుపై క్రిమినల్ చర్యలకు ఆదేశించారు. మోసం చేశారిలా.. రాళ్లపల్లి నారాయణప్ప 1929లో గుండూరావు నుంచి 301 సర్వే నంబర్లో 7.77 ఎకరాలు కొని, పెద్ద మనవడు పెద్ద ఉలిగప్పకు 1933లో హక్కు ఇచ్చారు. 1935లో బ్యాంకులో తనఖా పెట్టి రుణం తీసుకున్నారు. అయితే.. దొడ్డమనేని మాలతేష్ అనే వ్యక్తి గుండూరావు తన చిన్నాన్న అంటూ 1985 నవంబర్ 19 తేదీతో అన్‌రిజిస్టర్డ్ వీలునామా సృష్టించారు. 1929 నాటికే గుండూరావు పింఛన్ తీసుకుంటున్నారు. అంటే అప్పటికే 60 ఏళ్లు పూర్తయి ఉంటాయి. దీన్నిబట్టి 1985 నాటికి గుండూరావు వయస్సు 116 సంవత్సరాలు. ఇంత వయస్సు ఉన్న వ్యక్తితో అన్ రిజిస్టర్డ్ వీలునామా ఎలా రాయిస్తారన్నది ప్రశ్నార్థకం. 2018లో 301–3 సర్వే నంబర్‌తో 4.46 ఎకరాలు మాలతేష్ పేరిట వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేశారు. దీనిపై రాళ్లపల్లి వంశస్తులు ఆర్డీవో కోర్టుకు వెళ్లారు. మాలతేష్ సమర్పించిన వీలునామా ఫోర్జరీ అని ఆర్డీవో ధ్రువీకరించారు. వెబ్‌ల్యాండ్ నుంచి మాలతేష్ పేరు తొలగించారు. రాళ్లపల్లి వంశస్తుల పేర్లు నమోదు చేశారు. 1933లో రాళ్లపల్లి వంశస్తులు ఆస్తి పన్ను చెల్లించిన పత్రాలు అక్రమంగా రిజిస్ట్రేషన్ మాలతేష్ సర్వే నంబర్ 301ను 301–3గా చూపించి నితిన్ సాయి ఇండియా ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ, వరదాపురం సూరి కుమారుడు గోనుగుంట్ల నితిన్‌సాయి పేరు మీద 4.30 ఎకరాలు, సూరి అనుచరుడు, ధర్మవరానికి చెందిన యంగలశెట్టి రాజు పేరిట 2.05 ఎకరాల స్థలాన్ని 2021 డిసెంబర్ 23న రిజిస్ట్రేష¯Œ చేశారు. నితిన్‌సాయి రూ.6 కోట్లు, రాజు రూ.1.50 కోట్లకు కొన్నట్లు చూపారు. వాస్తవానికి రాళ్లపల్లి వంశస్తుల వద్ద ప్రస్తుతం 3.57 ఎకరాలే ఉంది. వారి భూమిలో కొంత గతంలోనే వేరే వారికి అమ్మారు. 1982లో కొంత లేఅవుట్ వేశారు. మునిసిపాలిటీకి ఆస్తిపన్ను కూడా చెల్లిస్తున్నారు. దీనిని ప్లాట్ల వారీగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. కానీ సూరి కుమారుడు, అనుచరుడి పేరిట 6.35 ఎకరాలు మాలతేష్ రిజిస్ట్రేషన్ చేశారు. ఇందులో మునిసిపల్ కార్పొరేషన్ 80 అడుగుల రోడ్డుకు సేకరించిన 0.66 ఎకరాల స్థలం, వార్డు సచివాలయమూ ఉన్నాయి. వెబ్‌ల్యాండ్‌లో మాలతేష్ పేరుపై భూమి లేకపోయినా, అన్ రిజిస్టర్డ్ వీలునామాకు ఎలాంటి విశ్వసనీయత లేనప్పటికీ, సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ చేశారు. సబ్ రిజిస్ట్రార్, వరదాపురం సూరిది ఒకే ఊరని, అందువల్లే అక్రమ రిజిస్ట్రేషన్ జరిగిందనే విమర్శలున్నాయి. అనంతరం సూరి అనుచరులు ఆ భూమి తమకు అప్పగించాలని రాళ్లపల్లి వంశస్తులను బెదిరించారు. ఈ వ్యవహారంపై రాళ్లపల్లి వంశస్తులు ఫిర్యాదు చేయడంతో స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీ మాధవి ఆదివారం అనంతపురం సబ్ రిజిస్ట్రార్ హరికృష్ణను సస్పెండ్ చేశారు. ఫోర్జరీ డాక్యుమెంట్ల ఆధారంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్న వరదాపురం సూరి కుమారుడు నితిన్ సాయి, రాజు మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ఈ అంశంపై డీఆర్వో నేతృత్వంలో విచారణకు కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు. డిప్యూటీ కలెక్టర్, అనంతపురం కార్పొరేషన్ కమిషనర్ కమిటీలో సభ్యులుగా ఉంటారు. చర్యలు తీసుకుంటాం – గాయత్రీదేవి డీఆర్వో, అనంతపురం ఈ అక్రమ రిజిస్ట్రేషన్‌పై విచారణ జరుగుతోంది. కమిటీ సభ్యుల్లో ఒకరు నివేదిక ఇచ్చారు. ఫోర్జరీ డాక్యుమెంట్లతో వెబ్‌ల్యాండ్‌లోకి ఎక్కించారని, వెంటనే తొలగించామని ఆర్డీవో చెప్పిన విషయాలను నివేదికలో పొందుపరిచారు. మరొక అధికారి నివేదిక ఇచ్చిన వెంటనే చర్యలు తీసుకుంటాం. -
ఏడు రోజుల బాలింతకు ప్రత్యక్ష నరకం
అనంతపురం : పచ్చి బాలింతకు అత్తింట్లో ప్రత్యక్ష నరకం చూపించారు. ఏడు రోజుల బాలింత అని చూడకుండా నోట్లో గుడ్డకుక్కి చితకబాదిన ఘటన అనంతపురం జిల్లా కేంద్రంలోని నాయక్‌నగర్‌లో చోటు చేసుకుంది. స్థానిక ప్రజలు పోలీసుల దృష్టికి తీసుకెళ్లడంతో టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి బాలింతను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ధర్మవరానికి చెందిన లక్ష్మిదేవి బాయికి ఆరేళ్ల క్రితం నగరంలోని నాయక్‌నగర్‌కు చెందిన జగన్మోహన్ నాయక్‌తో వివాహమైంది. ఇతను చెన్నై ఇండియన్ ఆయిల్ కంపెనీ క్వాలిటీ ఆఫీసర్‌గా పని చేస్తున్నాడు. వీరికి నాలుగన్నరేళ్ల పాప ఉంది. ఈ నెల 18న నగరంలోని స్నేహలత ఆస్పత్రిలో లక్ష్మిదేవి బాయి మరో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ నెల 22న లక్ష్మిబాయి డిశ్చార్జ్ కాగా, నాయక్‌నగర్‌లోని అత్తింటికి వెళ్లింది. అప్పటి నుంచి బాలింతకు ప్రత్యక్ష నరకం మొదలైంది. మామ శంకర్‌నాయక్(ఏఎస్ఐ, పీటీసీ), అత్త శాంతిబాయి, భర్త జగన్మోహన్ నాయక్, మరిది పరమేష్‌నాయక్ విచక్షణారహితంగా చితకబాదారు. మరో కోడలు కట్నం కింద స్థలాలు తీసుకొచ్చిందని, నీవెమిచ్చావని నానా దుర్భాషలాడారు. రెండోసారి ఆడబిడ్డకు జన్మనిచ్చావని కొట్టారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం లక్ష్మిదేవిబాయిపై తీవ్రంగా దాడి చేయడంతో ఆమె కేకలు వేసింది. చుట్టుపక్కల వారు, మీడియా విషయాన్ని టూటౌన్ పోలీసుల దృష్టికి తీసుకెళ్లగా బాలింతను స్టేషన్‌కు తరలించి ఫిర్యాదు తీసుకొని ఆస్పత్రికి తరలించారు. అనంతరం అత్తా, మామ, భర్త, మరిదిపై పోలీసులు కట్నం, వేధింపులు తదితర కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న లక్ష్మీదేవిబాయిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీదేవి పరామర్శించారు. భార్యను కడతేర్చిన భర్త శింగనమల: అనుమానంతో కట్టుకున్న భార్యనే కడతేర్చాడు ఓ కసాయి భర్త. శింగనమల మండలం ఈస్ట్ నరసాపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాలు మేరకు.... ఈస్ట్ నరసాపురం గ్రామానికి చెందిన ఓబుళ నారాయణ, తన అక్క కుమార్తె తాడిపత్రికి చెందిన ఇందిరమ్మ (35)ను 22 సంవత్సరాలు క్రితం వివాహం చేసుకున్నాడు. వారికి ఒక కుమారుడు, కూమారై ఉన్నారు. 12 సంవత్సరాలు కలిసి కాపురం చేశారు. అయితే భార్యపై అనుమానంతో రోజూ వాదులాడుకునేవారు. ఈ నేపథ్యంలో పదేళ్ల క్రితమే భర్తను వదిలేసి ఇందిరమ్మ తాడిపత్రికి వెళ్లిపోయింది. ఇందిరమ్మ తన కుమారుడితో కలిసి తాడిపత్రిలో నివసిస్తుండగా.. ఓబుళ నారాయణ కుమార్తెను పోషిస్తూ ఈస్ట్ నరసాపురంలోనే ఉండేవాడు. అయితే కుమార్తెకు వివాహం నిశ్చయం కావడంతో ఓబుళ నారాయణ ఈ నెల 22న భార్య ఇందిరమ్మను ఇంటికి తీసుకొచ్చాడు. మంగళవారం రాత్రి భార్యాభర్తలు గొడవపడ్డారు. ఇందులో భాగంగా ఆవేశంతో ఓబుళ నారాయణ సుత్తి తీసుకొని భార్య ఇందిరమ్మ తలపై మోదాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం నిందితుడు శింగనమల పోలీస్‌స్టేషన్‌కు వచ్చి లొంగిపోయాడు. ఎస్ఐ మస్తాన్ సిబ్బందితో కలిసి ఈస్ట్ నరసాపురానికి వెళ్లి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అప్పటికే ఇందిరమ్మ మృతి చెందినట్లు గుర్తించారు. ఇటుకలపల్లి సీఐ విజయభాస్కర్‌గౌడ్ కూడా ఘటనా స్థలానికి వచ్చి వివరాలను తెలుసుకున్నారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
పాట వింటూ.. ప్రాణాలే కోల్పోయాడు..
ధర్మవరం టౌన్: ఇయర్ ఫోన్ పెట్టుకుని ఎంచక్కా పాటలు వింటూ నడుస్తున్నాడు.. అంతలోనే రైలు పట్టాలు.. సంగీతాస్వాదనలో మైమరచిపోయిన ఆ యువకుడికి రైలు వస్తున్న శబ్ధం వినిపించలేదు. సరిగ్గా పట్టాలు దాటుతుండగా.. రైలు ఢీకొట్టి దుర్మరణం పాలయ్యాడు. అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలోని పాతకుంట రైల్వేగేట్ వద్ద సోమవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. పట్టణంలోని జోగోనికుంటకు చెందిన రమణారెడ్డి, లక్ష్మీదేవిల కుమారుడు సాయికుమార్‌రెడ్డి(21). ఓ ప్రైవేట్ కళాశాలలో బీఎస్సీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. సోమవారం రాత్రి 8.30 గంటల సమయంలో కర్రీస్ తీసుకొచ్చేందుకని వెళ్లి ప్రమాదం బారినపడి అక్కడికక్కడే మృతిచెందాడు. బయటకు వెళ్లిన సాయికుమార్ ఎంతకూ రాకపోవడంతో బంధువులు చుట్టుపక్కల గాలించారు. ఈ క్రమంలో రైల్వే సిబ్బంది రాత్రి 12 గంటల ప్రాంతంలో పట్టాల వద్ద మృతదేహాన్ని గుర్తించి బంధువులకు సమాచారం అందించారు. మృతుడి చెవిలో ఇయర్‌ఫోన్ ఇరుక్కుపోయి ఉంది. రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
వైఎస్సార్సీపీ నాయకుడిపై మారణాయుధాలతో దాడి
ధర్మవరం టౌన్: రైతులపై దౌర్జన్యం చేస్తున్న టీడీపీ నాయకుడి ఆగడాలను అడ్డుకున్నందుకు వైఎస్సార్సీపీ నాయకుడిపై మారణాయుధాలతో దాడి చేశారు. అనంతపురం జిల్లా, ధర్మవరం మున్సిపాలిటీ 15వ వార్డు వైఎస్సార్సీపీ ఇన్చార్జ్ గడ్డం కుమార్ మంగళవారం తెల్లవారుజామున కాయగూరల మార్కెట్‌కు వెళ్లాడు. కాయగూరల వ్యాపారి, టీడీపీ నాయకుడు నాగేంద్ర సమీపంలోని రైతులను అకారణంగా దుర్భా షలాడి, ఆపై దౌర్జన్యం చేశాడు. ఈ క్రమంలో గడ్డం కుమార్ రైతులకు మద్దతుగా నిలిచాడు. నాగేంద్రతో పాటు అతనికి మద్దతుగా పలువురు వ్యక్తులు మారణాయుధాలతో గడ్డం కుమార్‌పై దాడికి పాల్పడ్డారు. కుమార్ తలకు తీవ్ర గాయమై రక్త స్రావమైంది. మరో వ్యక్తి రఫీపై కూడా మారణాయుధాలతో దాడి చేశారు. బాధితులను ఎమ్మె ల్యే సోదరుడు వెంకట కృష్ణారెడ్డి పరామర్శించారు. -
టీడీపీ ఎమ్మెల్యే అరాచకాలకు అంతు లేదు..
-
నన్ను గెలిపించండి.. ప్రత్యర్థులను నరుక్కోండి..
ధర్మవరం: ‘‘నన్ను గెలిపించండి.. ఎలక్షన్లు అయినాక ఆర్నెల్లు సమయం మీకు ఇడిసిపెడతా.. ఏం చేసుకుంటారో చేసుకోండి. చంపుతారా? కాళ్లు చేతులు ఇరుస్తారా.. పొడుస్తారా మీ ఇష్టం. అన్నీ నేను చూసుకుంటాను. ఈ ఐదేళ్లు శాంతియుతంగా ఉండాలనుకున్నాం. శాంతియుతంగా ఉంటే కొందరు బడాయి పడతున్నారు. ఆ బడాయిగాళ్లందరినీ కాళ్లు చేతులూ ఇరచాల్సిందే.. తప్పదు. కౌంటింగ్ పూర్తయిన వెంటనే పని మొదలుపెట్టండి. ప్రత్యర్థులను అంతమొందిస్తే తప్ప మనకు మనుగడ ఉండదు. మే 16 నుంచి నవంబర్ 16వ తేదీ వరకు టైం ఇస్తాం’’.. ధర్మవరం టీడీపీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ పార్టీకి చెందిన ‘హార్డ్‌కోర్.. సాఫ్ట్‌కోర్’(ధర్మవరం నియోజకవర్గంలోని టీడీపీ కార్యకర్తల్లో బలంగా బెదిరించే వారిలో రౌడీషీటర్లను హార్డ్‌కోర్ సభ్యులుగాను, చిన్నచితకా పనులు చేసేవారిని సాఫ్ట్‌కోర్ సభ్యులుగానూ విభజించారు) కార్యకర్తలతో జరిపిన అంతర్గత సమావేశంలో చేసిన వ్యాఖ్యలివీ.. అంతేగాక ప్రత్యర్థులను చంపుతుంటే అడ్డురాకుండా, ఎలాంటి చర్యలు తీసుకోకుండా పోలీసులకు ముందే ఆదేశిస్తానని సదరు టీడీపీ ఎమ్మెల్యే చెప్పారు. నియోజకవర్గంలో కీలకంగా పనిచేస్తున్న టీడీపీ నేతలైన మాజీ ఎంపీపీ, వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ మద్దిలేటి, కౌన్సిలర్ రాయపాటి రామకృష్ణ, గంటాపురం జగ్గు, బోయపాటి ప్రదీప్, నాగశేషయ్యలు ఎమ్మెల్యే ఆగడాలను భరించలేక బుధవారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా వారు అనంతపురంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి.. ఎమ్మెల్యే బెదిరింపులకు సంబంధించిన ఆడియో టేపులను మీడియాకు విడుదల చేశారు. హత్యా రాజకీయాల్ని ప్రోత్సహించేలా స్వయానా ఎమ్మెల్యే మాట్లాడిన వైనాన్ని వారు బహిర్గతం చేశారు. ఈ ఆడియో టేపులు జిల్లాలో, నియోజకవర్గంలో పెను సంచలనమయ్యాయి. ఎమ్మెల్యే అరాచకాలకు అంతు లేదు.. ధర్మవరం ఎమ్మెల్యే అఘాయిత్యాలను టీడీపీ నేతలు ఈ సందర్భంగా మీడియాకు వివరించారు. ఆయన అరాచకాలకు అంతులేదన్నారు. నియోజకవర్గంలో తన కోటరీని ఏర్పాటు చేసుకొని వసూళ్ల దందాకు తెరలేపారని ఆరోపించారు. ధర్మవరంలో ప్రత్యేకంగా సూరీ జీఎస్టీ చెల్లిస్తేనే పనులు సాగుతాయన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి కష్టపడి పనిచేసిన సీనియర్ నాయకులను పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ పార్టీని భ్రష్టు పట్టిస్తున్నాడన్నారు. ‘‘భూముల్ని దౌర్జన్యంగా రైతుల్నుంచీ లాగేసుకుంటున్నాడు. ఆయన అరాచకాలను ప్రశ్నించేవారిపై పోలీసులతో అక్రమ కేసులు బనాయింపచేసి భయభ్రాంతులకు గురిచేస్తున్నాడు. టీడీపీలో ఉన్నా మాకు ప్రతిపక్ష పార్టీలో ఉన్నట్టుగానే ఉంది. మాపైనా అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నాడు. రైల్వేస్టేషన్లో టీ అమ్ముకునే దగ్గర నుంచి పెద్ద పెద్ద టెండర్ల వరకు ఆయనకు కమీషన్లు ముట్టజెప్పందే పనులు దక్కవు. ఎవరైనా పనులు దక్కించుకుంటే తన అనుచరులతో వారిపై దాడులు చేయించి బలవంతపు వసూళ్లు చేస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నాడు’’ అని వారు తెలిపారు. ఆయన అరాచకాలు, వేధింపుల్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినా న్యాయం జరక్కపోవడంతో పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. సూరి ఓటమి లక్ష్యంగా వచ్చే ఎన్నికల్లో పనిచేస్తామన్నారు. విలేకరుల సమావేశంలో ఇంకా శంకర్, నరసింహులు, శంకరయ్య తదితరులు పాల్గొన్నారు. -
ధర్మవరంలో టీడీపీ నేతల బరితెగింపు
-
అ‘ధర్మవరం’
ధర్మవరం: ‘ఓటు వేసి గెలిపించిన ప్రజల సంక్షేమానికి ఎలాంటి చర్యలూ చేపట్టలేదు! ప్రజాక్షేత్రంలోకి వెళితే తిరస్కరణ తప్పదు’ అని భావించిన ధర్మవరం అధికార పార్టీ నేతలు.. ఈ సారి ఎన్నికల్లో అధికారం దక్కించుకునేందుకు కొత్త ఎత్తుగడలకు శ్రీకారం చుట్టారు. నకిలీ ఓటర్లను సృష్టించి మరోసారి గద్దెనెక్కేందుకు అనైతిక పనులకు తెరలేపారు. ఇందులో భాగంగానే తమ మాట వినని బూత్ లెవల్ ఆఫీసర్ (బీఎల్ఓ)లపై కక్ష సాధింపులు మొదలు పెట్టారు. వారికి పని రాదంటూ పొగపెట్టి సాగనంపసాగారు. బీఎల్వోలుగా చిరుద్యోగులు ధర్మవరం నియోజకవర్గ పరిధిలో ధర్మవరం మున్సిపాలిటీ, ధర్మవరం మండలం, ముదిగుబ్బ, బత్తలపల్లి, తాడిమర్రి మండలాల పరిధిలో మొత్తం 285 పోలింగ్ బూత్‌లున్నాయి. వీటి పరిధిలో మొత్తం 285 మంది బీఎల్ఓలు ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పని చేస్తున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా దాదాపు అన్ని ప్రాంతాల్లో అంగన్వాడీ టీచర్లు, ఆశ వర్కర్లు, వీఆర్ఓలు, వీఆర్ఏలు బూత్‌లెవల్ ఆఫీసర్లుగా వ్యవహరిస్తున్నారు. నూతన ఓటర్లను గుర్తించి, ఓటరు జాబితాలో వారిని చేర్చడం. గ్రామంలో లేని వారిని, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారిని ఓటరు జాబితా నుంచి తొలగించడం చేస్తుంటారు. వేధింపులతో వైదొలిగిస్తూ.. ఎన్నికలు సమీపిస్తుండటంతో బూత్ లెవల్ ఆఫీసర్లపై అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు ఎక్కువయ్యాయి. తమకు అనుకూలంగా ఉన్న వారిని ఓటరు జాబితాలో చేర్చేందుకు, గ్రామాలు వదిలి వెళ్లిన వారి పేర్లను జాబితాలో కొనసాగించేందుకు దిగజారుడు రాజకీయాలకు తెరలేపారు. అదే సమయంలో తమకు ఓటు వేయని వారిని జాబితా నుంచి తొలగించేందుకు బీఎల్వోలపై ఒత్తిళ్లు తీసుకెళ్లసాగారు. తమమాట వినకపోతే బెదిరింపులకు దిగుతున్నారు. ధిక్కరించిన వారిపై వేధింపులు మొదలు పెట్టారు. చివరకు బలవంతంగా వారిని ఉన్నతాధికారుల ఎదుట హాజరు పరిచి బీఎల్ఓగా పనిచేయడం తమకిష్టం లేదంటూ సంతకాలు పెట్టించుకుని, వారి స్థానంలో తమకు అనుకూలంగా ఉన్నవారిని నియమించుకోసాగారు. ఇలా ధర్మవరం మున్సిపాలిటీలో వంద మంది బీఎల్వోలు ఉండగా వారిలో 12 మందితో తమకు పనిరాదనే సాకును బలవంతంగా వారితోనే చెప్పించి విధుల నుంచి తప్పించారు. నకిలీ ఓటర్ల చేర్పులకు టార్గెట్ ఓటర్ల చేర్పులు, తొలగింపు వ్యవహారంలో అధికారపార్టీ నేతలు అక్రమాలకు తెరలేపారు. తమ మాట వినని బీఎల్వోలను, ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్‌ను ఇప్పటికే ఇక్కడి నుంచి బలవంతంగా పంపేశారు. తిరిగి తమకు అనుకూలమైన వారిని ఆయా పోస్టులో కూర్చోబెట్టి నకిలీ ఓటర్లను చేర్చేందుకు వ్యూహం పన్నారు. ఒక్కొక్కరు వంద నుంచి, రెండు వందల ఓటర్లను చేర్చించాలని దిగువస్థాయి నాయకులకు «టార్గెట్లు విధించినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో సదరు దిగువస్థాయి నాయకులు తమకు అనుకూలంగా ఉండి, ఇతర ప్రాంతాల్లో ఉన్నవారివి, ధర్మవరం పట్టణానికి వలస వచ్చిన ఇతర రాష్ట్రాలకు చెందిన వారి వివరాలు సేకరించి ఓటర్లుగా నమోదు చేయించే పనిలో ఉన్నారు. అయితే ఈ వ్యవహారంలో బీఎల్‌వోలది కీలక పాత్ర.. వారు అనుకూలంగా వ్యవహరిస్తేనే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగల్గుతారు. వారు వ్యతిరేకిస్తే తమ పని జరగదని భావించిన అధికార పార్టీ నేతలు ఈ తొలగింపుల పర్వానికి తెరలేపారు. -
పరారీలో బినామీ రైతులు
ధర్మవరం కోల్డు స్టోరేజీ వ్యవహారం ప్రత్తిపాడు : ధర్మవరంలో సాయిభ్య అగ్రి కోల్డ్‌స్టోరేజీ రుణాల కేసులో బినామీలు పరారయ్యారు. స్టోరేజీ యజమాని కె.వెంకటసత్య ప్రసాద్, 111 మంది రైతుల పేర తప్పుడు దృవీకరణ పత్రాలతో సుమారు రూ.28 కోట్లకు కాకినాడలోని దేనా బ్యాంకుకు టోకరా ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో విచారణకు పోలీసులు గ్రామం లోకి వస్తున్నార్న విషయం తెలుసుకున్న రైతులు పరారయ్యారు. తాము రుణాలు తీసుకోలేదని, సంతకాలు పెట్టమంటే పెట్టామని, పోలీసులకు చిక్కితే అరెస్టు చేస్తారన్న భయంతో గ్రామం విడిచి వెళ్లినట్టు తెలుస్తోంది. బ్యాంకు జాబితాలో ఉన్నవారు రైతులు కాదని రైతు కూలీలని తెలుస్తోంది. టోకరా ఇచ్చింది ఇలా.. కోల్డ్ స్టోరేజీలో ఉన్న సరుకు నిల్వపై యజమాని ఇచ్చిన ధ్రువీకరణ పత్రం చూపితే రూ.25 లక్షల వరకు రుణాలు పొందవచ్చు. ఈ అవకాశాన్ని వినియోగించుకున్న యజమాని ముందు వరుసలో ఉత్ప త్తులను ఉంచి వెనుక వరుసలో ఉన్న పెట్టెలు ఖాళీవి పెట్టి అధికారులకు మస్కా కొట్టినట్టు తెలుస్తున్నది. స్టోరేజీ యజమాని ఇచ్చిన తప్పుడు ధ్రువీకరణ పత్రంతో పాటు రైతు ఆధార్ కార్డు, రేష¯ŒSకార్డు, 2 ఫొటోలతో బినామీదారులను కాకినాడ దేవా బ్యాంకుకు తీసుకువెళ్లి యాజమానే రు ణం మంజూరు చేయించేవారు. ఇలా 2013 నుంచి ఇలాగే రుణాలు పొంది 2015–16 నుంచి బకాయి చెల్లించకపోవడంతో ఈ టోకరా బయటపడింది. బినామీకి ముట్టింది రూ. 2 వేలేనట కోల్డు స్టోరేజీ యాజమాని బినామీ రైతులకు చెల్లించింది రూ 2 వేలేనని, వ్యవసాయ కూలీలు, తన స్టోరేజీలో పనిచేసే వారి నుంచి ఆధార్‌కార్డు, రేష¯ŒSకార్డు, ఫొటోలతో వారిని కాకినాడ దేనా బ్యాంకు తీసుకువెళ్లి, రుణం మంజూరు చేయించేవారట. రుణం పొందిన సొమ్ముంతా స్టోరేజి యజమాని తీసుకుని, బినామీలకు ఆరోజు కాకినాడలో భోజన తదితర ఏర్పాట్లు చేసి, తిరుగు ప్రయాణంలో రూ. 2వేలు చేతిలో పెట్టి సాగనంపేవారని బినామీల బంధువులు చెబుతున్నారు. -
ఆధునిక డిజైన్లపై దృష్టి సారించాలి
భూదాన్‌పోచంపల్లి : మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా ఆధునిక డిజైన్లపై దృష్టి సారించాలని ధర్మవరం సెంట్రల్ సిల్క్‌బోర్డు సైంటిస్ట్ బీఎం మహాదేవయ్య అన్నారు. మంగళవారం సెంట్రల్ సిల్క్‌బోర్డు ప్రతినిధుల బృందం పోచంపల్లి చేనేత సహకార సంఘాన్ని సందర్శించి పాలకవర్గంతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. చేనేత గృహాలకు వెళ్లి మగ్గాలపై తయారవుతున్న చేనేత వస్త్రాలను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ధర్మవరం సెంట్రల్ బోర్డు సైంటిస్ట్ బీఎం మహాదేవయ్య మాట్లాడుతూ టెక్స్టైల్ స్కిల్ కౌన్సిల్ న్యూఢిల్లీ, డిపార్ట్మెంట్ ఫర్ ఇంటర్నేషనల్ డెవ్లప్మెంట్, ఎఫ్ఐసీసీఐ సంయుక్త ఆధ్వర్యంలో క్యాలిఫికేషన్ ప్యాక్ డెవలప్మెంట్ ప్రొగ్రామ్‌లో భాగంగా చేనేత కార్మికులకు ఆధునిక పద్ధతులపై శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. అందులో భాగంగానే క్షేత్రస్థాయి అధ్యయనం నిమిత్తం పోచంపల్లి సందర్శనకు వచ్చామని పేర్కొన్నారు. వీరి వెంట ఎఫ్ఐసీసీఐ కన్సల్టెంట్ సోహిని గుహ, హిందూపూర్, ధర్మవరం సెంట్రల్ సిల్క్‌బోర్డు టెక్నికల్ అసిస్టెంట్స్ పద్మాకర్, ఎ. రామకృష్ణ, చేనేత సహకార సంఘం ఉపాధ్యక్షుడు సిద్ధుల రాంచంద్రం, డైరక్టర్, భారత భారతమ్మ, సిబ్బంది చిలువేరు గోవర్ధన్, తదితరులు ఉన్నారు. -
సినీఫక్కీలో చోరీ
ధర్మవరం అర్బన్: ధర్మవరం పట్టణంలోని లక్ష్మీచెన్నకేశవపురం సమీపంలోని ఓ ఇంటిలో దొంగలు సినీ ఫక్కీలో దొంగతనం చేశారు. కుటుంబ సభ్యులను తాళ్లతో కట్టేసి 11 తులాల బంగారు ఆభరణాలు, రూ.70వేల నగదును అపహరించారు. సంఘటనా స్థలాన్ని డీఎస్పీ వేణుగోపాల్, రూరల్ సీఐ మురళీకృష్ణ పరిశీలించారు. పోలీసుల కథనం మేరకు, ధర్మవరం పట్టణంలోని లక్ష్మీచెన్నకేశవపురం సమీపంలో నివసిస్తున్న ఎల్ఐసీ ఏజెంట్ లక్ష్మీనారాయణ ఇంట్లోకి మంగళవారం అర్ధరాత్రి నలుగురు ముసుగు ధరించిన దుండగులు ప్రవే శించారు. వీరు తలుపును బండరాయితో పగులగొట్టే శబ్ధం విన్న లక్ష్మీనారాయణ, భార్య లక్ష్మీకాంతమ్మ, కుమార్తె హాల్లోకి వచ్చారు. అప్పటికే లోపలికి వచ్చిన దుండగులు వారిని పట్టుకుని తాళ్లతో చేతులు కట్టేశారు. అనంతరం వారిని బెడ్రూంలో వేసి బంధించారు. కత్తులు చూపిస్తూ తాము నక్సలైట్లమని బెదిరించి, 11 తులాల బంగారు అభరణాలు, రూ.70వేల నగదును ఎత్తుకెళ్లారు. తెల్లవారుజామున వారు కేకలు వేయడంతో సమీపంలో ఉన్నవారు గమనించి లక్ష్మీనారాయణ బంధువులకు తెలియజేశారు. వారు వచ్చి వారి చేతులకున్న తాళ్లను విప్పేశారు. అనంతరం పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. ధర్మవరం డీఎస్పీ వేణుగోపాల్, రూరల్ సీఐ మురళీకృష్ణ, పట్టణ ఎస్ఐ సుబ్బరామయ్య సంఘటనా స్థలాన్ని బుధవారం ఉదయం పరిశీలించారు. క్లూస్‌టీంను పిలిపించి వేలిముద్రలను తనిఖీ చేశారు. డాగ్‌స్క్వాడ్‌ను పిలిపించి చుట్టుపక్కల తనిఖీ చేశారు. బాధితుడు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ తన కూతురికి ఇంజనీరింగ్ కళాశాలలో కౌన్సెలింగ్ ఉందని ఫీజు కట్టేందుకు రూ.70వేలు అవసరమంటే ఇంట్లో పెట్టుకున్నానని ఇంతలో దొంగలు పడ్డారని పోలీసుల ఎదుట వాపోయాడు. ప్రధాన రోడ్డులో ఉన్న సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో దొంగలు ఎవరన్నది తెలియలేదని పోలీసులు తెలిపారు.