
ధర్మవరం టౌన్: రైతులపై దౌర్జన్యం చేస్తున్న టీడీపీ నాయకుడి ఆగడాలను అడ్డుకున్నందుకు వైఎస్సార్‌సీపీ నాయకుడిపై మారణాయుధాలతో దాడి చేశారు. అనంతపురం జిల్లా, ధర్మవరం మున్సిపాలిటీ 15వ వార్డు వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జ్ గడ్డం కుమార్ మంగళవారం తెల్లవారుజామున కాయగూరల మార్కెట్‌కు వెళ్లాడు. కాయగూరల వ్యాపారి, టీడీపీ నాయకుడు నాగేంద్ర సమీపంలోని రైతులను అకారణంగా దుర్భా షలాడి, ఆపై దౌర్జన్యం చేశాడు.
ఈ క్రమంలో గడ్డం కుమార్ రైతులకు మద్దతుగా నిలిచాడు. నాగేంద్రతో పాటు అతనికి మద్దతుగా పలువురు వ్యక్తులు మారణాయుధాలతో గడ్డం కుమార్‌పై దాడికి పాల్పడ్డారు. కుమార్ తలకు తీవ్ర గాయమై రక్త స్రావమైంది. మరో వ్యక్తి రఫీపై కూడా మారణాయుధాలతో దాడి చేశారు. బాధితులను ఎమ్మె ల్యే సోదరుడు వెంకట కృష్ణారెడ్డి పరామర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment