Pochampalli
-
Fashion: ఒక్కో బ్లవుజు ధర రెండున్నర వేల నుంచి 20 వేల వరకు..!
ఏ ఇద్దరు మనుషులూ ఒక్కలా ఉండరు. ఏ ఇద్దరి అభిరుచులూ ఒక్కలా ఉండవు. మరి ధరించే దుస్తులు మాత్రం ఒకేలా ఎందుకుండాలి? దేనికది ప్రత్యేకంగా ఎందుకు ఉండకూడదు? ఇది ఓ సందేహం. చీరల కోసం వందలాది షోరూమ్‌లున్నాయి. బ్లవుజుకు ఒక్క షో రూమ్ కూడా ఉండదెందుకు? మరో సందేహం. అది లేదు... ఇది లేదు... అనుకోవడం కాదు, ఆ ఖాళీని నేనే ఎందుకు భర్తీ చేయకూడదు? ఇన్ని సందేహాలు, సమాధానాల మధ్య రూపుదిద్దుకున్న ఐడియా ‘డిజైనింగ్ ఐడియాస్, జస్ బ్లవుజ్’. హైదరాబాదీ డిజైనర్ వర్షామహేంద్ర ఆలోచనల నుంచి పుట్టుకొచ్చిన ఓ కొత్త ఆలోచన ఆ తర్వాత వందలాది మందికి ఉపాధి మార్గంగా మారింది. వర్షామహేంద్రది హైదరాబాద్‌లో స్థిరపడిన గుజరాతీ కుటుంబం. హైదరాబాద్, సెయింట్ ఫ్రాన్సిస్ నుంచి బి.ఎ ఎకనమిక్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ‘‘మా నాన్న వ్యాపారి. అమ్మ స్కూల్ టీచర్. నాకు డెస్క్ జాబ్ నచ్చేది కాదు. నాన్నలాగ బిజినెస్‌నే కెరీర్‌గా ఎంచుకోవాలని ఉండేది. అదే సమయంలో కెరీర్ సృజనాత్మకంగా, నాకంటూ ప్రత్యేకమైనదిగా ఉండాలనే కోరిక కూడా ఉండేది. దాంతో డిగ్రీ పూర్తయిన తర్వాత ముంబై, జేడీ ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్లో ఏడాది డిప్లమో కోర్సు చేశాను. పెళ్లి చేసుకుని ఢిల్లీ వెళ్లడం నా లక్ష్యాన్ని సులువు చేసింది. అక్కడ నిఫ్ట్‌లో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేశాను. నా పెళ్లి చీరలు, బ్లవుజ్‌ల అనుభవంతో కోర్సులో చేరినప్పటి నుంచి ప్రత్యేకమైన దృష్టితో ఫ్యాషన్ ప్రపంచాన్ని గమనించగలిగాను. ఆంధ్రప్రదేశ్ హ్యాండీ క్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీహెచ్డీసీ) కోసం పని చేయడం నాకు మంచి అవకాశం. వర్షామహేంద్ర క్లోతింగ్‌లో అనేక ప్రయోగాలు చేశాం. కలెక్షన్ ఆఫ్ డిజైన్స్ నా బలం. అలాగే సెంట్రల్ కాటేజ్ ఇండస్ట్రీస్ నిర్వహించిన వడపోతలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన ఆరువందల మందిలో ముగ్గురిని ఎంపిక చేశారు. అందులో నేనూ ఉండడంతో నాకు సొంతంగా నా బ్రాండ్‌ను విజయవంతం చేయగలననే నమ్మకం వచ్చింది. ఆ నమ్మకంతోనే 2010లో హైదరాబాద్‌కి వచ్చిన తర్వాత సొంత స్టార్టప్ ప్రారంభించాను. ఇండియన్ బిజినెస్ స్కూల్– గోల్డ్మాన్సాచె ఫెలో పదివేల మంది మహిళల్లో స్థానం లభించడం నాకు మంచి సోపానం అయింది. ఇంటర్న్‌షిప్ కోసం న్యూయార్క్‌కి వెళ్లే అవకాశం వచ్చింది. క్లింటన్ గ్లోబల్ ఇనిషియేటివ్ ఆహ్వానం అందింది. దాదాపుగా రెండు నెలలు అక్కడ క్రాఫ్ట్మెన్ను, విద్యార్థులను సమన్వయం చేస్తూ వాళ్లతో కలిసి పని చేసే అవకాశం ఒక టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి. 2014లో యునైటెడ్ నేషన్స్ కార్యక్రమానికి హాజరయ్యాను. అది నా ఫస్ట్ ఫ్యాషన్ షో. న్యూయార్క్ ట్రేడ్ ఫెయిర్‌లో పాల్గొన్నాను. ఇన్ని వేదికల మీద విజయవంతంగా ప్రదర్శనలు ఇచ్చిన తర్వాత ... కేవలం బ్లవుజ్‌ల కోసమే ఒక వేదికకు రూపకల్పన చేస్తూ నేను స్టార్టప్ ప్రారంభించడం తెలివైన నిర్ణయమే అని అనిపించింది. మార్కెట్ స్టడీ చేయలేదు మామూలుగా స్టార్టప్ ప్రారంభించే ముందు మార్కెట్ స్టడీ చేయాలి. కానీ నేను మార్కెట్లో ఉన్న గ్యాప్‌ని గుర్తించగలిగాను. అదే నా విజయ రహస్యం. నాతోపాటు ఇద్దరు ఉద్యోగులతో మొదలైన స్టార్టప్ ఇప్పుడు డెబ్బై మందితో పని చేస్తోంది. వెయ్యి నుంచి పన్నెండు వందల బ్లవుజ్‌లు ఒక చోట దేనికది ప్రత్యేకంగా ఉంటే ఇంకేం కావాలి. ఒక్కో బ్లవుజ్ ధర రెండున్నర వేల నుంచి ఇరవై వేల వరకు ఉంటుంది. ఒకప్పుడు చీర కొనుక్కుని బ్లవుజ్ కోసం మ్యాచింగ్ సెంటర్లకు వెళ్లేవాళ్లు. ఇప్పుడు నచ్చిన డిజైనర్ బ్లవుజ్ కొని ఆ తర్వాత దానికి సరిపడే సింపుల్ చీరను సెలెక్ట్ చేస్తున్నారు. బ్లవుజ్ హైలైట్ కావడమే ఫ్యాషన్ ట్రెండ్‌గా చేయగలిగాను. ఇది ఫ్యాషన్ రంగానికి నా కంట్రిబ్యూషన్ అని గర్వంగా చెప్పగలను. ఎందుకంటే రెండు దశాబ్దాలుగా నేను ఫ్యాషన్ రంగంలో ఉన్నాను. దేశవిదేశాల ఫ్యాషన్ వేదికలను చూశాను. మన భారతీయ వస్త్రధారణలోనే ప్రయోగాలు చేయడానికి అవకాశం ఎక్కువ. ఇక నా స్వీయ అనుభవంలోకి వస్తే... నా పెళ్లికి హెవీ చీర కొనేశాను. బ్లవుజ్ కుట్టించుకోవడానికి పెద్ద–చిన్న టైలర్ల చుట్టూ తిరిగాను. ఏ మాత్రం సంతృప్తిగా అనిపించలేదు. నా అసంతృప్తి నుంచి నేను డిజైన్ చేసుకున్న ఫ్యాషన్ ఇది. నేను సృష్టించుకున్న కెరీర్ ఇది. అప్పుడు నేను సృష్టించిన ట్రెండ్ వందలాది మందికి ఉపాధి మార్గం అయిందంటే ఎంతో సంతోషంగా కూడా ఉంది’’ అన్నారు వర్షామహేంద్ర. ఎల్లలు దాటిన మన నేత మన సంప్రదాయ నేతకు ఆదరణ తగ్గి నేతకారుల ఇంటి కొత్త తరం ఇతర వృత్తుల్లోకి వెళ్లిపోతున్న రోజుల్లో వర్ష వీవింగ్ ఫ్యూజన్‌కు తెర తీశారు. నేతకారుల జీవిక కోసం సహాయం చేస్తున్న యూకేలోని ఎన్జీవోతో కలిసి పోచంపల్లి నేతకారుల కోసం పని చేశారామె. అలాగే ఇప్పుడు పైథానీ, కంచిపట్టు, నారాయణపేట, చీరాల, లక్నో నేతకారులు, ఉదయ్‌పూర్–జైపూర్ బ్లాక్ ప్రింటింగ్ కళాకారులు, కోల్‌కతా రేషమ్ కళాకారులతో కలిసి ఒక చీరలో రెండు – మూడు రకాల సమ్మేళనానికి రూపమిస్తున్నారు. ‘‘ఒక చీరను విదేశీ వేదిక మీద ప్రదర్శించినప్పుడు దాని గురించి వివరించడానికి బోలెడంత సమాచారం ఉంటుంది. మన వస్త్ర విశేషం అదే’’ అన్నారామె. చీరకు చక్కటి కట్టు అందాన్ని తెస్తుంది, బ్లవుజ్‌కి చక్కటి కుట్టు అందాన్ని తెస్తుంది. ఈ రెండింటినీ మేళవించడంలో సక్సెస్ అయ్యారు వర్ష. – వాకా మంజులారెడ్డి చదవండి👉🏾Fashion Blouse Trend: డిజైన్లను బట్టి బ్లౌజ్‌కు రూ.600 నుంచి 5వేల వరకు చార్జీ! రోజుకు రూ. 1000 వరకు వస్తున్నాయి! -
తెలంగాణ గ్రామానికి అంతర్జాతీయ గుర్తింపు..
న్యూఢిల్లీ: తెలంగాణలోని పోచంపల్లి (యాదాద్రి భువనగిరి జిల్లా) గ్రామానికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఐక్యరాజ్యసమితి ప్రపంచ పర్యాటక సంస్థ జాబితాలో పోచంపల్లిని ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపిక చేసింది. ఈ మేరకు యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం సంస్థ ప్రకటించింది. డిసెంబర్ 2న స్పెయిన్‌లోని మాడ్రిడ్‌లో అవార్డుల ప్రధానం జరగనుంది. కాగా, పోచంపల్లి గ్రామానికి గుర్తింపుపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. గుర్తింపు రావడానికి కృషి చేసిన మంత్రిత్వశాఖ అధికారులను కిషన్ రెడ్డి ప్రశంసించారు. చదవండి: (బీజేపీ నేతలకు సిగ్గుండాలి: మంత్రి నిరంజన్‌రెడ్డి) -
చేనేత అధ్యయన కేంద్రంగా పోచంపల్లి
సాక్షి, భూదాన్‌పోచంపల్లి: పోచంపల్లి ఇక్కత్ అంటే ఒక బ్రాండ్ ఇమేజ్. నేడు అంతర్జాయ మార్కెట్లో పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలకు మంచి ఆదరణ, గుర్తింపు ఉంది. అమెజాన్, వీవ్‌మార్ట్ లాంటి బహుళజాతీయ కంపెనీలు ఇక్కత్ వస్త్రాలను ఆన్లైన్లో విక్రయిస్తున్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా అన్ని వర్గాలు, దేశాల ప్రజలకు పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలు మరింత చేరువయ్యాయి. సినిమాలు, సీరియల్స్‌లో హీరో, హీరోయిన్లు, యాంకర్లు, పారిశ్రామిక వేత్తలు పోచంపల్లి చేనేత వస్త్రాలను అమితంగా ఇష్టపడుతున్నారు. వెండితెరపై కూడా చేనేత వస్త్రాలు కనువిందు చేస్తున్నాయి. ఇటీవల కాలంలో చేనేతలకు మంచి క్రేజ్ పెరిగింది. అధ్యయన కేంద్రంగా.... ఇక్కత్ వస్త్రాలకు ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచిన పోచంపల్లి దేశ, విదేశీయులకు అధ్యయన కేంద్రంగా మారింది. ప్రపంచం నలుమూలల నుంచి విదేశీయులు చేనేత వస్త్ర తయారీ తీరు తెన్నులు తెలుసుకోవడానికి నిత్యం వస్తుంటారు. అంతేకాక ముంబాయి, హైదరాబాద్, ఢిల్లీ, కోల్కత్తా, బెంగుళూరు రాష్ట్రాలకు చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్), బిజినెస్ స్కూల్ ఆఫ్ ఇండియా, పలు ఫ్యాషన్ టెక్నాలజీ ఆఫ్ ఇనిస్టిట్యూట్స్ స్టడీటూర్‌లో భాగంగా ఇక్కడికి వచ్చి చేనేతపై అధ్యయనం చేస్తుంటారు. అదేవిధంగా చేనేతను పాఠ్యాంశంగా చేర్చడంతో రాష్ట్రం నలుమూలల నుంచి విద్యార్థులు అధ్యయన నిమిత్తం ఇక్కడి వస్తుంటారు. అధ్యయన అంశాలు ఇవే... అమెరికా, జర్మనీ దేశాల అధ్యక్ష భవనాలలో పోచంపల్లి కర్టెన్స్‌ను వాడుతున్నారంటే ఇక్కడి చేనేత కార్మికుల కళా నైపుణ్యం తెలుస్తోంది. ముఖ్యంగా పలు దేశాల ప్రజలు ఇక్కత్ చేనేత వస్త్రాలైన డ్రెస్ మెటీరియల్స్, డోర్ కర్టెన్స్, బెడ్ షీట్స్‌ను ఎక్కువ కొనుగోలు చేస్తుంటారు. ముస్లిం దేశాల్లో స్టోల్స్‌ను ఎక్కువ కొనుగోలు చేస్తుంటారు. పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్క్ తమ వస్త్ర ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేస్తూ ప్రతిఏటా కోట్ల రూపాయల టర్నోవర్ సాధిస్తుంది. అంతేకాక పలువురు ఔత్సాహిక యువకులు ఆన్లైన్ వస్త్ర వ్యాపారాలు సాగిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇక్కత్ వస్త్ర విశిష్టతను తెలుసుకోవడానికి వచ్చే విదేశీయులు చేనేత గృహాలు, చేనేత సహకార సంఘం, హ్యాండ్లూమ్ పార్క్‌ను సందర్శించి అక్కడ నూలు వడికే విధానం, చిటికి కట్టడం, గ్రాఫ్‌పై డిజైన్లు వేయడం, అచ్చు అతకడం, రంగుల అద్దకం, మగ్గాలు, వస్త్రాలు నేసే విధానం, మార్కెటింగ్, చేనేత కళాకారుల జీవన స్థితిగతులు, కూలీ, ఇక్కడి ఆచార, వ్యవహారాలను అధ్యయనం చేస్తుంటారు. ఫ్యాషన్ డిజైనింగ్ చదివిన విద్యార్థులు మాత్రం నూతన డిజైన్లను అధ్యయనం చేస్తుంటారు. పోచంపల్లి బాట పట్టిన 100కు పైగా దేశాలు.. చేనేతతో పాటు భూదానోద్యమానికి పురుడుపోసుకున్న పోచంపల్లిని ఇప్పటివరకు 100కు పైగా దేశాలు, వేలాది మంది విదేశీ ప్రతినిధులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, వీఐపీలు సందర్శించడంతో ప్రపంచపటంలో పోచంపల్లికి తగిన గుర్తింపు వచ్చిం ది. అంతేకాక వివిధ రా ష్ట్రాల మంత్రులు, ఐఏఎస్ అధికారులు, ఫ్యాషన్, సినీరంగ ప్రముఖులు సందర్శించి చేనేతను అధ్యనం చేసి ఇక్కడి వస్త్రాలను కొనుగోలు చేశారు. ముఖ్యంగా జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ(నిర్డ్), జాతీయ సూక్ష్మ, లఘు, మధ్య పరిశ్రమల సంస్థ (నిమెస్మీ), నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్), గ్రామీణాభివృద్ధి జాతీయ మండలి (ఎన్సీఆర్డీ), కపార్డ్, ఆర్కిటెక్ట్, అడ్మినిస్ట్రేటీవ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా(ఆస్కీ), టూరిజం శాఖ, జాతీయ సస్య రక్షణ శిక్షణ సంస్థ, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బి), అపార్డ్, గ్లోబల్ పీస్ ఆర్గనైజేషన్ తదితర సంస్థల ఆధ్వర్యంలో దేశ, విదేశాలకు చెందిన ప్రతినిధులు సందర్శించారు. ముఖ్యంగా అమెరికా, జర్మనీ, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, ఈజిప్ట్, ఇటలీ, డెన్మార్క్, ఇండోనేషియా, హాలెండ్, దక్షిణాఫ్రికా, మలేషియా, బోట్స్వానా, టునీషియా, మంగోలియా, ఇథియోఫియా, ఘనా, లావోస్, అఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్, థాయ్‌లాండ్, సిరియా ఉజ్భకిస్థాన్, మయన్మార్, నేపాల్, సూడాన్, ఉగాండా, ఐర్లాండ్, కజకిస్థాన్, పెరూ, డర్భన్, నైజీరియా, జింబాంబ్వే, హంగరీ, టాంజానియా, ఐలాండ్, సోలోమన్, ఈక్విడార్, యెమన్, ఇరాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, చిలీ, వియత్నాం, లిబియా, స్విడ్జర్లాండ్, జోర్ధాన్, కాంగో, పోర్సుగీస్ మొదలగు దేశాల వారున్నారు. చేనేత కళ గొప్పది.. ఇండియాకు మొదటిసారి వచ్చా. ప్రాచీన చేనేత కళను తెలుసుకోవడానికి పోచంపల్లిని సందర్శించడం గొప్ప అనుభూతినిచ్చి ంది. ఇక్కడి చేనేత కళాకారులు రూపొందిస్తున్న చేనేత వస్త్రాలు చాలా బాగున్నాయి. అయితే ఇంటిల్లిపాది కలిసి పని చేయడం, సమష్టిగా బాధ్యతలు పంచుకోవడం ఎంతో నచ్చింది. నూతన ప్రయోగాలతో చేనేత కళను కాపాడుకోవాలి. – మిల్లిహట్టన్, కెనడా మంచి ఆదరణ ఉంది ప్రస్తుతం పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలకు మంచి ఆదరణ ఉంది. నిత్యం దేశ, విదేశాల నుంచి హ్యాండ్లూమ్ పార్క్‌ను సందర్శిస్తుంటారు. ఇక్కడ వస్త్ర తయారీ ప్రక్రియలను అధ్యయనం చేస్తుంటారు. గత యాభై ఏళ్లుగా చేనేత కళాకారులు అనేక మార్పులు, వినూత్న ప్రయోగాలు చేస్తూ విజయం సా«ధిస్తున్నారు. చేనేతను ఉపా«ధి కేంద్రంగా గుర్తించి ప్రోత్సహిస్తే చేనేత పరిశ్రమ నిలదొక్కుకుంటుంది. – భారత లవకుమార్, హ్యాండ్లూమ్ పార్క్ డైరెక్టర్, పోచంపల్లి -
కారుదే విజయం
సాక్షి ప్రతినిధి, వరంగల్: వరంగల్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ఘన విజయం సాధించారు. మొదటి నుంచి ఆయన గెలుపు లాంఛనమేనని భావిస్తుండగా.. మొత్తం ఓట్లలో ఆయనకు 883 దక్కాయి. దీంతో 825 ఓట్ల భారీ మెజార్టీతో శ్రీనివాస్‌రెడ్డి గెలుపొందారు. సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి ఇనుగాల వెంకట్రాంరెడ్డికి కేవలం 23 ఓట్లు రాగా, ఘోర పరాజయం పొందారు.ఏనుమాములలో లెక్కింపుఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ సోమవారం ఉదయం 8 గంటలకు వరంగల్ ఏనుమాముల మార్కెట్ గోదాంలో ప్రారంభమైంది. కౌంటింగ్‌కు మూడు టేబుళ్లను ఏర్పాటు చేసి అభ్యర్థుల వారీగా ఓట్లు విభజించి లెక్కించారు. మొత్తం 902 ఓట్లకు 883 పోల్ కాగా, టీఆర్ఎస్ అభ్యర్థి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డికి 848, కాంగ్రెస్ అభ్యర్థి ఇనుగాల వెంకట్రాంరెడ్డికి 23 మాత్రమే వచ్చాయి. ఇక 12 ఓట్లు చెల్లలేదు. స్వతంత్రులుగా ఎమ్మెల్సీ బరిలో నిలిచిన తక్కళ్లపెల్లి రవీందర్రావు, అన్నారపు యాకయ్య, రంగరాజు రవీందర్‌కు ఒక్క ఓటు కూడా రాలేదు. కాంగ్రెస్ నాయకుడు, ఖానాపూర్ ఎంపీపీ రవీందర్రావు తన ఓటు తాను సైతం వేసుకోలేదు. ఏకపక్షంగా పోలింగ్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 902 మంది ఓటర్లు ఉండగా... 883 మంది తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. మాజీ ఎంపీలు బూర నర్సయ్య గౌడ్, ఆజ్మీరా సీతారాం నాయక్ ఓట్లను పరిగణనలోకి తీసుకోవద్దన్న ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎక్స్అఫిషీయో కోటాలో వారు ఓటేయలేదు. మరో 17 మంది కూడా వివి ధ కారణాలతో ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. 12 మంది ఎక్స్అఫీషీయో సభ్యులు, 871 మంది జెడ్పీటీసీ, ఎంపీటీసీ, కౌన్సిలర్లు, కార్పోరేటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ నాటికి ఎన్నికల సంఘం సమాచారం మేరకు ఎక్స్అఫిషీ యో సభ్యులు కలుపుకుని 680 మంది టీఆర్ఎస్, 169 మంది కాంగ్రెస్ మద్దతుదారులు ఉండగా, 53 మంది స్వతంత్రులు ఉన్నట్లు తేలింది. ఇందులో మెజార్టీ ఓట్లను సాధించేందుకు టీఆర్ఎస్ పార్టీ వ్యూహరచన చేసి సక్సెస్ అయ్యింది. మూడు టేబుళ్ల ద్వారా ఓట్లను లెక్కించగా, మొదటి టేబుల్లో 300 ఓట్లకు గాను టీఆర్ఎస్ 292, కాంగ్రెస్‌కు ఆరు ఓట్లు రాగా, రెండు ఓట్లు చెల్లలేదు. రెండో టేబుల్లో 300 ఓట్లకు టీఆర్ఎస్కు 285, కాంగ్రెస్‌కు 11 ఓట్లు రాగా, నాలుగు ఓట్లు చెల్లలేదు. మూడో టేబుల్లో మొత్తం 283 ఓట్లను లెక్కించగా 271 టీఆర్ఎస్కు, ఆరు కాంగ్రెస్‌కు రాగా 6 ఓట్లు చెల్లని ఖాతాలో పడ్డాయి. టీఆర్ఎస్ ఉన్న 680 ఓట్లకు తోడు 53 మంది స్వతంత్రులు, 115 మంది కాంగ్రెస్ ఓటర్ల మద్దతును కూడగట్టారు. దీంతో పోలైన 883 ఓట్లలో 12 చెల్లకుండా పోగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేవలం 23 ఓట్లే వచ్చాయి. ఈ లెక్కన అత్యధికంగా కాంగ్రెస్ మద్దతుదారులు, స్వతంత్రులు కూడా టీఆర్ఎస్ వైపే మొగ్గు చూపినట్లు తేలింది. ఒక్క ఓటు దక్కించుకోలేని స్వతంత్రులు ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సందర్భంగా పోటీలో నిలిచిన ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులకు ఒక్క ఓటు కూడా రాలేదు. ప్రధాన పార్టీల అభ్యర్థులు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి(టీఆర్ఎస్), ఇనుగాల వెంకట్రాంరెడ్డి (కాంగ్రెస్)తో పాటు స్వతంత్రులుగా తక్కళ్లపెల్లి రవీందర్ రావు, అన్నారపు యాకయ్య, రంగరాజు రవీందర్ పోటీలో నిలిచారు. అయితే ఈ ఎన్నికల్లో ముగ్గురికీ ఒక్క ఓటు కూడా పడలేదు. ఈ ముగ్గురు బరిలో ఉండటం కోసం కొందరు ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, కార్పోరేటర్లు ప్రతిపాదించగా, వారు సైతం ఓటేయలేదు. కాగా కాంగ్రెస్ సీనియర్ నేత, ఖానాపూర్ ఎంపీపీగా ఉన్న తక్కెళ్లపల్లి రవీందర్రావు తన ఓటును తనకు కూడా వేసుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ ఖాతాలో 169 మంది ఉన్నప్పటికీ ఆ పార్టీ అభ్యర్థికి కేవలం 23 ఓట్లు రావడాన్ని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు జీర్ణించుకోలేక పోతున్నారు. అధికారుల పర్యవేక్షణ ఎన్నికల సంఘం నియమించిన అనిత రాజేంద్రన్ పర్యవేక్షణలో కౌంటింగ్ ఏజెంట్లు, అభ్యర్థులు, ఎన్నికల ఎజెంట్ల సమక్షంలో వీడియో రికార్డింగ్ ద్వారా ఓట్లు లెక్కించారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రశాంత్ జె.పాటిల్, శాసనమండలి ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జేసీ ఎస్.దయానంద్ లెక్కింపును పరిశీలించారు. ఓట్ల లెక్కింపు పూర్తయిన అనంతరం ఎమ్మెల్సీగా గెలుపొందిన పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి అధికారులు ధృవీకరణ పత్రం అందజేశారు. -
పోచంపల్లిలో రంగమ్మత్త
-
సుందర్రావు కూతుర్ని: అనసూయ
భూదాన్‌పోచంపల్లి(భువనగిరి) : పోచంపల్లిలో సినీనటి, ప్రముఖ యాంకర్ అనసూయ(రంగమ్మత్త) సందడి చేశారు. చేనేత ప్రోత్సాహక మండలి అధ్యక్షుడు, చేనేత దినోత్సవ రూపకర్త ఎర్రమాద వెంకన్న ఆధ్వర్యంలో శుక్రవారం ఆమె పోచంపల్లిలోని మహామ్మాయి కాలనీలోని పలు చేనేత కార్మికుల గృహాలను సందర్శించారు. అక్కడ నూలు, చిటికి, రంగులద్దకం, మగ్గాలపై తయారవుతున్న చేనేత వస్త్రాలను పరిశీలించారు. కార్మికులతో ముచ్చటిస్తూ ఎన్నాళ్లుగా ఈ వృత్తిలో కొనసాగుతున్నారు.. ఎంత గిట్టుబాటు అవుతుందనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. మగ్గం నేసి, కండెలు చుట్టి కార్మికులను ఉత్సాహపరిచారు. అనంతరం కళాత్మకంగా చేనేత వస్త్రాలు రూపొందిస్తున్న ఆరుగురి కార్మిక కుటుంబాలను పూలమాలతో సన్మానించారు. చిన్ననాటి జ్ఞాపకాలనుగుర్తుచేసుకున్న అనసూయ తాను కూడా పోచంపల్లి ఆడపడుచునని, తనకు పోచంపల్లితో ఎంతో అనుబంధం ఉందని అనసూయ గుర్తుచేశారు. చేనేత కార్మికులతో ముచ్చటిస్తూ తాను పోచంపల్లి సుందర్రావు కూతురునని పరిచయం చేసుకున్నారు. 8వ తరగతిలో ఉండగా పోచంపల్లికి వచ్చానని ఇల్లు, చెరువు ఒక్కటే గుర్తుకున్నాన్నారు. 20 ఏళ్ల తర్వాత పోచంపల్లికి వచ్చానని, సొంతూరి ప్రజలు చూపిస్తున్న ఆదరణ మరువలేనిదని ఆనందభాష్పాలు రాల్చారు. ఇకపై వీలైనపుడల్లా పోచంపల్లికి వస్తానని హామీ ఇచ్చారు. ఇక్కత్ వస్త్రాలు ఎంతో నిండుదనంతో ఉంటాయన్నారు. ఈమె వెంట చేనేత రంగ నిపుణులు తడక యాదగిరి, చేనేత వర్గాల చైతన్యవేదిక జాతీయ అధ్యక్షుడు చిక్క దేవదాసు, సర్పంచ్ తడక లతావెంకటేశం, టీపీసీసీ కార్యదర్శి తడక కల్ప నాకుమారి, పట్నం కృష్ణకుమార్, టై అండ్ డై అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు తడక రమేశ్, భారత లవకుమార్, చేనేత నాయకులు చింతకింది రమేశ్, పాలాది యాదగిరి, అంకం యాదగిరి, అంకం మురళి, ముసునూరి యాదగిరి, చిల్వేరు గోవర్థన్, కర్నాటి పురుషోత్తం, ఏర్వ నీలమ్మ, గోశిక అన్నపూర్ణ, శశిరేఖ, జోగు శ్రీనివాస్, గుద్దేటి నర్సింహ తదితరులు పాల్గొన్నారు. ఇక్కత్ వస్త్రాలు అద్భుతం ఇక్కత్ వస్త్రాలు అద్భుతంగా ఉన్నాయని, వాటిని చూసినా, ధరించినా అమ్మకు దగ్గర ఉన్నట్లుగా ఉంటుందని అనసూయ అభిప్రాయం వ్యక్తం చేశారు. పోచంపల్లి టూరిజం పార్క్‌లో ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘చేనేత పండుగ చేద్దాం.. చేనేత కళాకారులను ఘనంగా సన్మానిద్దాం’ అనే పోస్టర్‌ను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ పోచంపల్లి నా జన్మభూమి అని, తాను చిన్నపుడు పోచంపల్లి చేనేత వస్త్రాలు వేసుకుని స్కూల్‌కు వెళ్తే బెడ్‌షీట్ ధరించి వచ్చిందని తోటి స్నేహితులు హేళన చేశారని చెప్పారు. కానీ నేడు వాళ్లు ముఖం చాటేసుకుంటున్నారని తెలిపారు. ఎంతో కష్టమైన చేనేత పనిని స్వయంగా చూడడం వల్ల ఈ వృత్తిపై మరింత గౌరవం పెరిగిందన్నారు. చేనేత కళను ప్రోత్సహించే ఏ కార్యక్రమానికైనా తాను రెడీ అని అన్నారు. చేనేత వస్త్రాలంటే కేవలం చీరలు అని అపోహ ఉంటుంది. కానీ నేటితరం యువత ధరంచే విధంగా అన్ని రకాల ఇక్కత్ వస్త్రాలు ఎంతో స్టైలిష్‌గా ఉన్నాయని చెప్పారు. అనంతరం అనసూయను పలువురు శాలువా కప్పి సన్మానించారు. అంతకుముందు చేనేత డిజిటల్ సాధికారిత సెంటర్‌ను సందర్శించి, ఇక్కత్ డిజైన్లను పరిశీలించారు. -
అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలి
భూదాన్ పోచంపల్లి/ సంస్థాన్ నారాయణపురం: పోచంపల్లి ఇక్కత్ బ్రాండ్‌ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు చేనేత కార్మికులంతా కృషి చేయాలని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ సూచించారు. బుధవారం యాదా ద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి, కనుముక్కుల పరిధిలోని హ్యాండ్లూమ్ పార్క్‌ను నరసింహన్ దంపతులు సందర్శించారు. మగ్గాలపై తయారవుతున్న చేనేత వస్త్రాలు, కార్మికుల జీవన స్థితిగతులు, గిట్టుబాటు ధర గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్థానిక టూరిజం పార్క్‌లో కార్మికులు, మాస్టర్ వీవర్స్, బ్యాంకర్స్‌తో సమీక్ష నిర్వహించి, ప్రభుత్వ పరంగా ఏమి చేయాలని అడిగారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, పోచంపల్లి ఇక్కత్ కళ ఎంతో అద్భుతంగా ఉందని, ఎంతో కష్టమైన పని అని పేర్కొన్నారు. స్కిల్ వర్క్ అంటే చేనేత అని కొనియాడారు. చేనేత కార్మికుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వ పరంగా కావాల్సిన సహాయాన్ని అందజేసేందుకు కృషి చేస్తానని హామీనిచ్చారు. మార్కెట్‌కు అనుగుణంగా నూతన డిజైన్లను రూపొందించాలని, తద్వారా అమ్మకాలు పెరగడంతోపాటు ఉపాధి అవకాశాలు ఎక్కువగా లభిస్తాయన్నారు. చేనేత వస్త్రాలను హైదరాబాద్ నగరానికి విస్తరిస్తే అందరూ ధరించే వీలు కలుగుతుందని చెప్పారు. అనంతరం చేనేత వస్త్రాలను కొనుగోలు చేశారు. జలాల్పురంలోని స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థను సందర్శించి యువతకు అందిస్తున్న స్వయం ఉపాధి కోర్సులను పరిశీలించారు. నైపుణ్యాలను పెంపొందించుకొని స్వయం ఉపాధి రంగంలో రాణించాలని సూచించారు. గవర్నర్ వెంట రాష్ట్ర చేనేత జౌళి శాఖ కమిషనర్ శైలజా రామయ్యర్, కలెక్టర్ అనితా రామచంద్రన్, జాయింట్ కలెక్టర్ రవినాయక్ ఉన్నారు. అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి... ప్రభుత్వ విద్య బలోపేతానికి కల్పిస్తున్న వసతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ సూచించారు. చౌటుప్పల్ పట్టణంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, చౌటుప్పల్ మండలంలోని మల్కాపురంలోని మోడల్ అంగన్వాడీ కేంద్రాన్ని బుధవారం ఆయన సందర్శించారు. విద్యార్థులు మేధాశక్తిని పెంపొందించుకోవాలన్నారు. తల్లిదండ్రులు, గురువు దైవంతో సమానమన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడారు. అంగన్వాడీ కేంద్రం నిర్వహణపై ఆరా తీశారు. కార్యక్రమంలో గురుకుల పాఠశాలల కార్యదర్శి ప్రవీణ్‌కుమార్, మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, కలెక్టర్ అనితారామచంద్రన్, జాయింట్ కలెక్టర్ రవినాయక్, ఆర్డీవో సూరజ్‌కుమార్, డీఈవో రోహిణీ, డీఆర్డీవో పీడీ వెంకట్రావ్ తదితరులు పాల్గొన్నారు. -
పోచంపల్లిని సందర్శించిన హైకోర్టు జడ్జి
భూదాన్‌పోచంపల్లి : చేనేత కార్మికుల కళా నైపుణ్యం అద్భుతంగా ఉందని హైకోర్టు జడ్జి దుర్గాప్రసాద్ కొనియాడారు. బుధవారం ఆయన సతీసమేతంగా పోచంపల్లిని సందర్శించారు. చేనేత సహకార సంఘంలో పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలు, డిజైన్లను పరిశీలించారు. అనంతరం చేనేత వస్త్రాలను కొనుగోలు చేశారు. ఆయన వెంట చేనేత సహకార సంఘం అధ్యక్షుడు భారత వాసుదేవ్, కార్యదర్శి సూరపల్లి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు సిద్దుల రాంచంద్రం, డైరెక్టర్లు అంకం మురళి, సీత చక్రపాణి, గంజి అంజయ్య తదితరులు ఉన్నారు. -
పోచంపల్లిని సందర్శించిన విదేశీయులు
భూదాన్‌పోచంపల్లి: చేనేత వృత్తిలో మహిళల భాగస్వామ్యం– అభివృద్ధిని అధ్యయనం చేయడానికి సోమవారం విదేశీ అధికారుల బృందం పోచంపల్లిని సందర్శించారు. హైదరాబాద్‌లోని జాతీయ సూక్ష్మ, లఘు, మధ్యతరహా పరిశ్రమల సంస్థ ఆధ్వర్యంలో తజకిస్తాన్, హోండూరస్, మాల్దీవులు, ఇరాక్, టాంజానియా, జాంబియా, ఇ«థియోపియా, శ్రీలంక, సిరియా, ఘనా, జింబాబ్వే, భూటాన్, ఆఫ్ఘనిస్తాన్, నైజీరియా, లిథునియా, లిబేరియా దేశాలకు చెందిన 33 మంది సభ్యులు పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్క్‌ను సందర్శించారు. ఇక్కడ తయారవుతున్న చేనేత వస్త్రాలు, వస్త్ర తయారీ ప్రక్రియలు, మార్కెటింగ్, పనిచేస్తున్న కార్మికులలో మహిళలు ఎంత మంది పనిచేస్తున్నారు, వారికి లభిస్తున్న గిట్టుబాటు ఆరా తీశారు. వారి వెంట ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ వివేక్‌కుమార్, వి. స్వప్న, పార్క్ డైరక్టర్లు చిక్క కృష్ణ, చిట్టిపోలు గోవర్దన్, అశోక్, వెంకటయ్య పాల్గొన్నారు. -
చేనేత అభివృద్ధికి అధిక ప్రాధాన్యం
భూదాన్‌పోచంపల్లి : చేనేత పరిశ్రమ అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని చేనేత డైహౌజ్‌లో పోచంపల్లి చేనేత సహకార సంఘం 61వ వార్షిక, 58వ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం చేనేతను పరిశ్రమల శాఖలో కలపకూడదని నిర్ణయానికి వచ్చిందన్నారు. అలాగే చేనేత కార్మికులకు ఉపాధి అవకాశాలు పెంచడానికి హ్యాండ్లూమ్ పాలసీని తీసుకొస్తుందని వెల్లడించారు. బాల్కొండ మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్‌కుమార్ మాట్లాడుతూ చేనేత పరిశ్రమ అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని కోరారు. సహకార సంఘం అధ్యక్షుడు భారత వాసుదేవ్ మాట్లాడుతూ త్రిఫ్ట్, ఎఫ్‌డీల రూపంలో కాకుండా నగదును ఇప్పించాలని అధికారులను కోరారు. నష్టాల్లో ఉన్న సంఘాన్ని రూ. 8లక్షల, 52వేల లాభాలతో అభివృద్ధి బాటలో నడిపిస్తున్నామని తెలిపారు. ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ కొండా లక్ష్మణ్‌బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో కొంగరి భాస్కర్, సర్పంచ్ తడక లతావెంకటేశం, సీత చంద్రయ్య, చిట్టిపోలు శ్రీనివాస్, సూరపల్లి శ్రీనివాస్, రాంచంద్రం, బుచ్చమ్మ, అంకం మురళి, సీత చక్రపాణి, గంజి అంజయ్య, గుండు వెంకటేశం, భారత భారతమ్మ, మేనేజర్ చిలువేరు గోవర్ధన్, విష్ణుచక్రం, తడక రమేశ్, భారత లవకుమార్, గోలి యాదగిరి తదితరులు పాల్గొన్నారు. -
మొక్కలు నాటి సంరక్షించాలి
భూదాన్‌పోచంపల్లి : మండలంలోని దోతిగూడెంలోని హెజలో ల్యాబ్ ఆవరణలో సోమవారం తెలంగాణ హరితహారం కార్యక్రమంలో భాగంగా భువనగిరి ఆర్డీఓ భూపాల్‌రెడ్డి మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యత మొక్కలను నాటడమే కాకుండా వాటిని సంరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. మొక్కల పెంపకం వల్ల పర్యావరణాన్ని కాపాడుకోవచ్చునని అన్నారు. ఈ కార్యక్రమంలో హెజెలో ల్యాబ్ హెచ్ఆర్ ప్రభాకర్, వీఆర్వో షేక్ చాంద్‌పాష, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా కంఠ మహేశ్వరస్వామి బోనాల పండుగ
భూదాన్‌పోచంపల్లి : మండల కేంద్రంలో శనివారం గౌడ సంఘం ఆధ్వర్యంలో శ్రీ కంఠ మహేశ్వరస్వామి, శ్రీ వనం మైసమ్మ బోనాల పండుగను వైభవంగా నిర్వహించారు. పోతురాజుల విన్యాసాలు, డప్పు వాయిద్యాలతో మహిళలు బోనాలను ఎత్తుకొని ప్రదర్శనగా వెళ్లి తమ కులదేవతలకు బోనాన్ని నైవేద్యంగా సమర్పించారు. అనంతరం పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సార సరస్వతీబాలయ్యగౌడ్, గౌడ సంఘం అధ్యక్షుడు చెర్కు అంజయ్య, కండె యాదయ్య, బండి యాదగిరి, కొయ్యడ నర్సింహ, గునిగంటి మల్లేశ్, తండ వెంకటేశం, తండ రమేశ్, తండ కిషన్, తంతరపల్లి వెంకటేశ్, బండి మహేశ్‌గౌడ్, ముప్పిడి శ్రీనివాస్, కాసుల కృష్ణ, అనిల్, కట్కూరి నరహరి, తంతరపల్లి శ్రీను, టి. పాండు తదితరులు పాల్గొన్నారు. -
మూసీ పరీవాహకంలో పెరిగిన వరిసాగు
భూదాన్ పోచంపల్లి మూసీ పరీవాహక ప్రాంతమైన పోచంపల్లి మండలంలో ఈ ఖరీఫ్‌లో వరిసాగు గణనీయంగా పెరిగింది. పిలాయిపల్లి కాలువ మరమ్మతులను పూర్తి చేసి ఇటీవల సాగునీటిని విడుదల చేశారు. ఫలితంగా కాలువ ద్వారా సాగునీరు వస్తుండడంతో మూసీ పరీవాహక గ్రామాల్లోని రైతులు బీడు భూములను సాగులోకి తీసుకువస్తున్నారు. నెల పదిహేను రోజులుగా సాగు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. కొన్ని గ్రామాల్లో ఇప్పటికే వరినాట్లు పూర్తవగా మరికొన్ని గ్రామాలోల వరిలో కలుపు తీస్తున్నారు. 25వేల ఎకరాల్లో... మండలంలో వరి సాగు క్రమంగా పెరుగుతూ వస్తుంది. రెండు, మూడేళ్ల క్రితం 12 నుంచి 15వేల వరకు వరిసాగు అయ్యేది. అధికారికంగా గత ఏడాది 16వేలు ఉండగా, ఈ ఏడాది 18వేల ఎకరాల వరిసాగువుందని అధికారులు పేర్కొంటున్నారు. కాని అనధికారికంగా మాత్రం 25వేల ఎకరాల పైగా వరి సాగు చేస్తున్నారు. ముఖ్యంగా పిలాయిపల్లి, పెద్దగూడెం, జూలూరు, కప్రాయిపల్లి, పెద్దరావులపల్లి, ఇంద్రియాల, శివారెడ్డిగూడెం, రేవనపల్లి, గౌస్‌కొండ, పోచంపల్లి, భీమనపల్లి, కనుముకుల, దంతూర్, వంకమామిడి, జలాల్పురం, జగత్పల్లి తదితర గ్రామాల్లో రైతులంతా వరిసాగు చేస్తున్నారు. లె గుళ్లను తట్టుకొనే రకాలు.. స్థానిక ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం ద్వారా ఈ సీజన్లో 900 క్వింటాళ్ల విత్తనాలు, 300 వందల మెట్రిక్ టన్నుల ఎరువులు పంపిణీ చేశారు. ముఖ్యంగా మూసీ నీటి వల్ల వచ్చే తెగుళ్లను తట్టుకొనే 1010, ఐఆర్ 64, తెలంగాణ సోన, బీపీటీ రకాలను రైతులు సాగు చేశారు. మూసీ నీటిలో యూరియా అధికంగా ఉండడం వల్ల వరిఏపుగా పెరిగి ఆశించిన స్థాయిలో దిగుబడులు వస్తున్నాయని రైతులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా సాగునీటి వనరులు లేని జిబ్లక్‌పల్లి, దోతిగూడెం, అంతమ్మగూడెం, హైదర్‌పూర్, బుర్రోనిబావి తదితర గ్రామాల్లో 250 ఎకరాల్లో కంది, 1000 ఎకరాల్లో పత్తి, 200 ఎకరాల్లో కూరగాయలను పండిస్తున్నారు. ఐదు ఎకరాలు వరి సాగు చేశా – నేదురు మల్లారెడ్డి, రైతు, జగత్పల్లి గతంలో మూసీ పరీవాహకంలో క్రాప్ హాలిడే ప్రకటించడంతో 3 ఎకరాలు పడావు పెట్టాను. కాని ఈ ఖరీఫ్ సీజన్లో పిలాయిపల్లి కాలువ ద్వారా నీటిని విడుదల చేయడంతో ఐదు ఎకరాలు వరిసాగు చేశాను. పిలాయిపల్లి కాలువ గ్రామం సమీపం నుంచి వెళ్తుండడంతో గతంలో కంటే ఈసారి వరిసాగు పెరిగింది. కాలువ ద్వారా సరిపోను నీళ్లు వస్తున్నాయి. వరిసాగు పెరిగింది – ఏజాజ్ అలీఖాన్, వ్యవసాయాధికారి, పోచంపల్లి మండలంలో వరిసాగు క్రమంగా పెరుగుతుంది. రైతులు 70శాతం పిలాయిపల్లి కాలువ ద్వారా, 30శాతం పంపుసెట్ల ద్వారా వరిసాగు చేస్తున్నారు. ఈ ఖరీఫ్‌లో 18వేల ఎకరాలు వరిసాగు చేశారని అంచనా వేస్తున్నాం. ఇప్పటికే ఎరువులు పంపిణీ చేశాం. రైతు చైతన్య యాత్రల ద్వారా ఆధునిక వ్యవసాయ పద్ధతులపై రైతులకు అవగాహన పెంపొందించాం. -
ఆధునిక డిజైన్లపై దృష్టి సారించాలి
భూదాన్‌పోచంపల్లి : మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా ఆధునిక డిజైన్లపై దృష్టి సారించాలని ధర్మవరం సెంట్రల్ సిల్క్‌బోర్డు సైంటిస్ట్ బీఎం మహాదేవయ్య అన్నారు. మంగళవారం సెంట్రల్ సిల్క్‌బోర్డు ప్రతినిధుల బృందం పోచంపల్లి చేనేత సహకార సంఘాన్ని సందర్శించి పాలకవర్గంతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. చేనేత గృహాలకు వెళ్లి మగ్గాలపై తయారవుతున్న చేనేత వస్త్రాలను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ధర్మవరం సెంట్రల్ బోర్డు సైంటిస్ట్ బీఎం మహాదేవయ్య మాట్లాడుతూ టెక్స్టైల్ స్కిల్ కౌన్సిల్ న్యూఢిల్లీ, డిపార్ట్మెంట్ ఫర్ ఇంటర్నేషనల్ డెవ్లప్మెంట్, ఎఫ్ఐసీసీఐ సంయుక్త ఆధ్వర్యంలో క్యాలిఫికేషన్ ప్యాక్ డెవలప్మెంట్ ప్రొగ్రామ్‌లో భాగంగా చేనేత కార్మికులకు ఆధునిక పద్ధతులపై శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. అందులో భాగంగానే క్షేత్రస్థాయి అధ్యయనం నిమిత్తం పోచంపల్లి సందర్శనకు వచ్చామని పేర్కొన్నారు. వీరి వెంట ఎఫ్ఐసీసీఐ కన్సల్టెంట్ సోహిని గుహ, హిందూపూర్, ధర్మవరం సెంట్రల్ సిల్క్‌బోర్డు టెక్నికల్ అసిస్టెంట్స్ పద్మాకర్, ఎ. రామకృష్ణ, చేనేత సహకార సంఘం ఉపాధ్యక్షుడు సిద్ధుల రాంచంద్రం, డైరక్టర్, భారత భారతమ్మ, సిబ్బంది చిలువేరు గోవర్ధన్, తదితరులు ఉన్నారు. -
ఆధునిక డిజైన్లపై దృష్టి సారించాలి
భూదాన్‌పోచంపల్లి : మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా ఆధునిక డిజైన్లపై దృష్టి సారించాలని ధర్మవరం సెంట్రల్ సిల్క్‌బోర్డు సైంటిస్ట్ బీఎం మహాదేవయ్య అన్నారు. మంగళవారం సెంట్రల్ సిల్క్‌బోర్డు ప్రతినిధుల బృందం పోచంపల్లి చేనేత సహకార సంఘాన్ని సందర్శించి పాలకవర్గంతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. చేనేత గృహాలకు వెళ్లి మగ్గాలపై తయారవుతున్న చేనేత వస్త్రాలను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ధర్మవరం సెంట్రల్ బోర్డు సైంటిస్ట్ బీఎం మహాదేవయ్య మాట్లాడుతూ టెక్స్టైల్ స్కిల్ కౌన్సిల్ న్యూఢిల్లీ, డిపార్ట్మెంట్ ఫర్ ఇంటర్నేషనల్ డెవ్లప్మెంట్, ఎఫ్ఐసీసీఐ సంయుక్త ఆధ్వర్యంలో క్యాలిఫికేషన్ ప్యాక్ డెవలప్మెంట్ ప్రొగ్రామ్‌లో భాగంగా చేనేత కార్మికులకు ఆధునిక పద్ధతులపై శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. అందులో భాగంగానే క్షేత్రస్థాయి అధ్యయనం నిమిత్తం పోచంపల్లి సందర్శనకు వచ్చామని పేర్కొన్నారు. వీరి వెంట ఎఫ్ఐసీసీఐ కన్సల్టెంట్ సోహిని గుహ, హిందూపూర్, ధర్మవరం సెంట్రల్ సిల్క్‌బోర్డు టెక్నికల్ అసిస్టెంట్స్ పద్మాకర్, ఎ. రామకృష్ణ, చేనేత సహకార సంఘం ఉపాధ్యక్షుడు సిద్ధుల రాంచంద్రం, డైరక్టర్, భారత భారతమ్మ, సిబ్బంది చిలువేరు గోవర్ధన్, తదితరులు ఉన్నారు. -
పిలాయిపల్లి సర్వే పనులు పది రోజుల్లో పూర్తి చేయాలి
భూదాన్‌పోచంపల్లి : పది రోజుల్లో పిలాయిపల్లి కాలువ సర్వే పనులను పూర్తి చేయాలని ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ కె. సురేశ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. శనివారం ఇరిగేషన్ ఎస్ఈ ధర్మ, డీఈఈ శ్రీధర్‌రావు, సర్వే అధికారులతో కలిసి మండలంలోని పిలాయిపల్లి వద్ద కాల్వ పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారం కార్యక్రమంలో పాల్గొనడానికి జిల్లాకు వచ్చినపుడు మూసీ కాల్వలకు రూ.350 కోట్లు మంజూరు చేశారని తెలిపారు. ఈ నేపథ్యంలో మూసీపై గల పిలాయిపల్లి, ధర్మారెడ్డిపల్లి, బునాదిగాని కాల్వల సర్వే పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ¯ సర్వే పనుల కోసం ప్రభుత్వం రూ. 1.23 కోట్లు విడుదల చేసిందన్నారు. 400 క్యుసెక్కుల సామర్థ్యంతో పిలాయిపల్లి కాల్వను విస్తరించనున్నట్లు తెలిపారు. వారం, పదిరోజుల్లో సర్వే పనులు పూర్తి చేసి డిటైల్ ప్రాజెక్ట్ రిపోర్ట్‌ను ప్రభుత్వానికి అందజేస్తామన్నారు. వీరి వెంట ఏఈ రాజశేఖర్, సర్పంచ్ అందెల స్వాతిహరీష్, ఎంపీటీసీ రంగ జ్యోతివిశ్వనాథం తదితరులు పాల్గొన్నారు. -
మొక్కలు నాటడం సామాజిక బాధ్యత : ఎమ్మెల్యే పైళ్ల
భూదాన్‌పోచంపల్లి : మొక్కలు నాటడం సామాజిక బాధ్యత అని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. హరితహార కార్యక్రమంలో భాగంగా శనివారం మండలంలోని కనుముకుల గ్రామంలో రోడ్లకు ఇరువైపులా మొక్కలను నాటి మాట్లాడారు. కార్యక్రమంలో ఎంపీపీ సార సరస్వతీ బాలయ్యగౌడ్, జెడ్పీటీసీ మాడ్గుల ప్రభాకర్‌రెడ్డి, తహíసీల్దార్ డి.కొమురయ్య, ఎంపీడీఓ గుత్తా నరేందర్‌రెడ్డి, ఏఈ బండ వెంకటేశ్వర్‌రెడ్డి, సర్పంచ్ పాక కవితావెంకటేశం, వీఆర్వో చాంద్‌పాష, ఉపసర్పంచ్ నిర్మల మోహన్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కె.భూపాల్‌రెడ్డి పాల్గొన్నారు. పీఏసీఎస్ ఆధ్వర్యంలో.. మండల కేంద్రంలోని పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి మొక్కలను నాటారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ మర్రి నర్సింహారెడ్డి, ఏఓ ఏజాజ్ అలీఖాన్, డైరెక్టర్లు కె. బాల్‌రెడ్డి, వారాల యాదిరెడ్డి, గుర్రం మణెమ్మ,మాధవరెడ్డి, పెద్దల సత్తమ్మ, పగిళ్ల సుధాకర్‌రెడ్డి, కార్యదర్శి బాల్‌రెడ్డి, శ్రీధర్, శేఖర్‌రెడ్డి, నర్మద తదితరులు పాల్గొన్నారు. -
2019 నాటికి సంపూర్ణ పారిశుద్ధ్య సాధనే లక్ష్యం
భూదాన్‌పోచంపల్లి : తెలంగాణలో 2019 నాటికి బహిరంగ మలవిసర్జన లేకుండా సంపూర్ణ పారిశుద్ధ్య సాధనే లక్ష్యంగా కృషి చేస్తున్నామని రాష్ట్ర స్వచ్ఛ భారత్ మిషన్ డైరక్టర్ ఎం.రామ్మోహన్రావు తెలిపారు. మంగళవారం మండంలోని దేశ్ముఖిలోని సాయి బృందావనంలో మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటి దశలో నిజామాబాద్, మెదక్, కరీంనగర్ జిల్లాలను ఎంపిక చేసినట్లు తెలిపారు. వచ్చే ఏడాది మార్చి వరకు ఇంటింటా వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలను వంద శాతం పూర్తి చేస్తామని అన్నారు. ఇలా మూడేళ్లలో దశల వారీగా రాష్ట్రంలో సంపూర్ణ పారిశుద్ధ్యం సాధించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని పేర్కొన్నారు. ఇందుకు ప్రజలంతా సహకరించాలని కోరారు. ఆయన వెంట ఘంటా నారాయణస్వామిజీ, ఎంపీటీసీ దాసర్ల జంగయ్య ఉన్నారు. -
బస్‌షెల్టర్ నిర్మాణ పనులకు శంకుస్థాపన
ఇంద్రియాల (భూదాన్‌పోచంపల్లి) : మండలంలోని ఇంద్రియాలలో ఆదివారం రూ.2లక్షల వ్యయంతో నిర్మిస్తున్న కొప్పుల దామోదర్‌రెడ్డి స్మారక బస్‌షెల్టర్ నిర్మాణ పనులకు సర్పంచ్ బండి కృష్ణగౌడ్ ప్రారంభించారు. ఈ షెల్టర్ నిర్మాణానికి కొప్పుల దామోదర్‌రెడ్డి కుటుంబ సభ్యులు ఆర్థికసాయాన్ని అందజేశారు. కార్యక్రమంలో కొప్పుల లింగారెడ్డి, ఎంపీటీసీ సంతోష్‌కుమార్, చింతల రామకృష్ణ, జగతి, గరిసె జంగయ్య, శ్రీశైలం, బద్దం రాజేశ్వర్, జంగారెడ్డి, వెంకటేశ్, శంకర్, మధు, గోవర్ధన్ పాల్గొన్నారు. -
పోచంపల్లిలో ఫేస్బుక్ ప్రతినిధులు
భూదాన్‌పోచంపల్లి: కాలిఫోర్నియాలోని ఫేస్బుక్ ప్రధాన కార్యాలయానికి చెందిన 25 మంది ప్రతినిధుల బృందం బుధవారం నల్లగొండ జిల్లాలోని పోచంపల్లిని సందర్శించింది. రెండు బృందాలుగా విడిపోయి ఆదరణ ఫౌండేషన్, కళాశాలలు, చిరు వ్యాపారులు, చేనేత గృహాలను సందర్శించారు. ఎంత మంది విద్యార్థుల వద్ద స్మార్ట్ఫోన్లు ఉన్నాయి... ఫేస్బుక్, వాట్సప్ అకౌంట్స్‌ను ఎంత మంది వినియోగిస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. రోజూ ఫేస్బుక్ పై ఎంత సమయం వెచ్చిస్తారు, ఎలాంటి పోస్టింగులు చేస్తారు, సోషల్ మీడియా ప్రభావాన్ని గురించి అడిగి వివరాలు రాబట్టారు. చాలా మంది విద్యార్థినులు ఫేస్బుక్, వాట్సప్ గురించి తెలియదని చెప్పడంతో వారు ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. చేనేత కార్మికుల గృహాలకు వెళ్లి ఫేస్బుక్, వాట్సప్ యాప్స్ ద్వారా ఆన్లైన్ వ్యాపారాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆదరణ ఫౌండేషన్ ప్రతినిధి బోగ కిరణ్ మాట్లాడుతూ... ఫేస్బుక్, వాట్సప్ వంటి యాప్స్‌లను గ్రామీణ ప్రజలు వినియోగిస్తున్నారా, ఇంకా యాప్స్‌లలో చేయాల్సిన మార్పులు, చేర్పులపై సర్వే చేసేందుకు ప్రతినిధులు ఇక్కడికి వచ్చారని తెలిపారు. -
పోదాం పద.. పోచంపల్లికి
► చేనేత కళా జగతికి పర్యాటక శోభ కల్పించేందుకు సర్కారు నిర్ణయం ► ప్రపంచవ్యాప్తంగా టూరిస్టులను ఆకట్టుకొనేలా బృహత్తర ప్రణాళిక ► కేంద్రం నుంచి భారీగా నిధులు పొందేందుకు యత్నాలు ► ఆన్లైన్లో నేత వస్త్రాల వ్యాపారం చేసేలా ప్రత్యేక ఏర్పాట్లు ► అంతర్జాతీయ డిమాండ్ ఉన్న డిజైన్లపై నేత కార్మికులకు శిక్షణ ► వచ్చే నెల ఐదో తేదీన కన్సల్టెంట్లతో కీలక భేటీ చూడచక్కని చేనేత పనితనంతో అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన పోచంపల్లికి మరింత ఖ్యాతి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ప్రపంచ ప్రఖ్యాత ‘ఇక్కత్’ డిజైన్ వస్త్రాలతో గుర్తింపు తెచ్చుకున్న పోచంపల్లి ప్రాంతాన్ని.. గ్రామీణ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయనుంది. జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకట్టుకునేలా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయటం ద్వారా... అక్కడి చేనేత వస్త్రాలకు డిమాం డ్ పెంచడం, నూతన డిజైన్లపై ఇక్కడి కార్మికులకు శిక్షణ ఇప్పించడం, తద్వారా నేత వస్త్రాల మార్కెటింగ్‌ను పెంచడంపై ప్రధానంగా దృష్టి సారించింది. ఇందుకోసం కేంద్రం నుంచి రూరల్ టూరిజం ఖాతాలో నిధులు పొందేందుకు ప్రయత్నాలు ప్రారంభించిం ది. దీనికోసం ఏప్రిల్ 5న కన్సల్టెంట్లతో కీలక భేటీ నిర్వహిస్తోంది. - సాక్షి, హైదరాబాద్ ఏం చేస్తారు..? పోచంపల్లి నేత పనిలోని నైపుణ్యాన్ని కళ్లకు కట్టే ప్రదర్శన కేంద్రాలు, ‘ఇక్కత్’ డిజైన్‌పై డాక్యుమెంటరీలు, ప్రత్యేక ప్రదర్శనలను ఏర్పాటు చేస్తారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే ఏర్పాట్లను, తెలంగాణ వంటకాలతో కూడిన భోజనశాలలను సిద్ధం చేస్తారు. పండుగల సమయంలో ఇక్కడ ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తారు. పల్లె సౌందర్యాన్ని ప్రతిబింబించేలా ప్రత్యేక చర్యలు చేపడతారు. ఈ ప్రాంతంలో తాటి వనాలు ఎక్కువగా ఉన్నందున నాణ్యమైన సంప్రదాయ పానీయం ‘నీరా’కు ప్రాచుర్యం కల్పించనున్నారు. చుట్టూ నెలకొన్న గుట్టలను ఈ ప్రాజెక్టులో భాగం చేసి వాటి వద్ద సాహసక్రీడలకు అవకాశం కల్పిస్తారు. సమీపంలోని ఆలయాలను తెలంగాణ సంప్రదాయ కేంద్రాలుగా మారుస్తారు. మొత్తంగా ఈ ప్రాంతం సందర్శనకు వచ్చేవారు పల్లె సౌందర్యాన్ని ఆస్వాదించటంతోపాటు, ‘ఇక్కత్’ వస్త్రాలు ఎలా రూపొందుతాయో తెలుసుకోగలుగుతారు. అంతేగాకుండా ఇక్కడి వస్త్రాలను ఆన్‌లైన్‌లోనూ కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేయనున్నారు. ఇక ప్రపంచ మార్కెట్లో డిమాండ్ ఉన్న డిజైన్లలో వస్త్రాలు రూపొందించేందుకు వీలుగా ఇక్కడి చేనేత పనివారికి ప్రత్యేక శిక్షణ కోసం కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. ప్రత్యేకతలెన్నో.. పోచంపల్లి అనగానే వెంటనే గుర్చొచ్చేది ‘ఇక్కత్’ డిజైన్‌లోని నాణ్యమైన నేత వస్త్రాలు. ఇండోనేసియా, జపాన్లలో గుర్తింపు పొందిన ‘ఇక్కత్’కు మన దేశంలో పేరు తెచ్చింది పోచంపల్లే. పోచంపల్లి పరిధిలో రెండు క్లస్టర్లుగా ఉన్న దాదాపు 80 గ్రామాలకు చెందిన పది వేల కుటుంబాలు నేత పనిపైనే ఆధారపడ్డాయి. ఈ ప్రాంతం కేవలం నేత పనికే కాకుండా ప్రకృతి రమణీయతకూ గుర్తింపు పొందింది. అంతేకాదు భూదాన్ ఉద్యమంతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన చారిత్రక ప్రాంతం కూడా. వీటన్నింటి నేపథ్యంలో పోచంపల్లి ప్రాంతాన్ని తెలంగాణ సంస్కృతికి చిరునామాగా చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. తొలి గ్రామీణ పర్యాటక కేంద్రం కొత్తగా ఏర్పడ్డ తెలంగాణలో ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన పర్యాటక ప్రదేశాలు పెద్దగా లేవు. ఇటీవలి కేంద్ర బడ్జెట్లోనూ ఈ విషయంలో రాష్ట్రానికి ప్రాధాన్యం దక్కలేదు. ఒక్క హైదరాబాద్‌లోని కుతుబ్‌షాహీ టూంబ్స్ అభివృద్ధి ప్రాజెక్టు మాత్రమే దక్కింది. అయితే దేశంలో గ్రామీణ పర్యాటకానికి ప్రాధాన్యమివ్వాలని ప్రధాని మోదీ భావిస్తున్న నేపథ్యంలో... ఈ కేటగిరీలో పోచంపల్లికి నిధులు పొందాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే నెలలో దీనికి సంబంధించిన ప్రతిపాదన సిద్ధం చేసి పంపనున్నారు.