పిలాయిపల్లి సర్వే పనులు పది రోజుల్లో పూర్తి చేయాలి
పిలాయిపల్లి సర్వే పనులు పది రోజుల్లో పూర్తి చేయాలి
Published Sat, Jul 23 2016 8:37 PM | Last Updated on Mon, Sep 4 2017 5:54 AM
భూదాన్‌పోచంపల్లి : పది రోజుల్లో పిలాయిపల్లి కాలువ సర్వే పనులను పూర్తి చేయాలని ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ కె. సురేశ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. శనివారం ఇరిగేషన్ ఎస్‌ఈ ధర్మ, డీఈఈ శ్రీధర్‌రావు, సర్వే అధికారులతో కలిసి మండలంలోని పిలాయిపల్లి వద్ద కాల్వ పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారం కార్యక్రమంలో పాల్గొనడానికి జిల్లాకు వచ్చినపుడు మూసీ కాల్వలకు రూ.350 కోట్లు మంజూరు చేశారని తెలిపారు. ఈ నేపథ్యంలో మూసీపై గల పిలాయిపల్లి, ధర్మారెడ్డిపల్లి, బునాదిగాని కాల్వల సర్వే పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ¯ సర్వే పనుల కోసం ప్రభుత్వం రూ. 1.23 కోట్లు విడుదల చేసిందన్నారు. 400 క్యుసెక్కుల సామర్థ్యంతో పిలాయిపల్లి కాల్వను విస్తరించనున్నట్లు తెలిపారు. వారం, పదిరోజుల్లో సర్వే పనులు పూర్తి చేసి డిటైల్ ప్రాజెక్ట్ రిపోర్ట్‌ను ప్రభుత్వానికి అందజేస్తామన్నారు. వీరి వెంట ఏఈ రాజశేఖర్, సర్పంచ్ అందెల స్వాతిహరీష్, ఎంపీటీసీ రంగ జ్యోతివిశ్వనాథం తదితరులు పాల్గొన్నారు.
Advertisement