తెలంగాణ గ్రామానికి అంతర్జాతీయ గుర్తింపు.. | Pochampalli In Telangana Selected Best Tourism Village By UNO | Sakshi
Sakshi News home page

తెలంగాణ గ్రామానికి అంతర్జాతీయ గుర్తింపు..

Nov 16 2021 4:20 PM | Updated on Nov 17 2021 10:39 AM

Pochampalli In Telangana Selected Best Tourism Village By UNO - Sakshi

న్యూఢిల్లీ: తెలంగాణలోని పోచంపల్లి (యాదాద్రి భువనగిరి జిల్లా) గ్రామానికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఐక్యరాజ్యసమితి ప్రపంచ పర్యాటక సంస్థ జాబితాలో పోచంపల్లిని ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపిక చేసింది. ఈ మేరకు యునైటెడ్‌ నేషన్స్‌ వరల్డ్‌ టూరిజం సంస్థ ప్రకటించింది. డిసెంబర్‌ 2న స్పెయిన్‌లోని మాడ్రిడ్‌లో అవార్డుల ప్రధానం జరగనుంది. కాగా, పోచంపల్లి గ్రామానికి గుర్తింపుపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. గుర్తింపు రావడానికి కృషి చేసిన మంత్రిత్వశాఖ అధికారులను కిషన్‌ రెడ్డి ప్రశంసించారు. 

చదవండి: (బీజేపీ నేతలకు సిగ్గుండాలి: మంత్రి నిరంజన్‌రెడ్డి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement