international recognition
-
తోలుబొమ్మ.. రూపు మార్చిందమ్మా!
ఒకప్పుడు తెరవెనుక లేలేత వెలుగుల మధ్య సందడి చేసిన బంగారక్క.. కేతిగాడు.. జుట్టుపోలిగాడు.. అల్లాటప్పగాడు రూపం మార్చేసుకున్నారు. తోలు బొమ్మలాటకు ఆదరణ కరువైన తరుణంలో అలనాటి తోలు బొమ్మలు కొత్తరూపు సంతరించుకుని అలంకరణ వస్తువులుగా జనాన్ని అలరిస్తున్నాయి. లాంతర్లు, ఇళ్లలో గోడలకు అమర్చుకునే అందమైన కర్టెన్లు, హ్యాండ్ బ్యాగుల రూపంలో మార్కెట్లోకి వస్తున్నాయి.ధర్మవరం రూరల్: కరువు.. కళలు పేరు చెబితే గుర్తొచ్చేది ఉమ్మడి అనంతపురం జిల్లానే. ధర్మవరం మండలం నిమ్మలకుంటలో (Nimmalakunta) తయారయ్యే తోలుబొమ్మలు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. వీటి తయారీదారులు ఏ డిగ్రీలు చేయకపోయినా.. ఇతర దేశాలకు వెళ్లిమరీ తోలు బొమ్మల తయారీలో శిక్షణ సైతం ఇస్తున్నారు. కేవలం పొట్టకూటి కోసం పేద కళాకారులు అంకితభావంతో చేస్తున్న ఈ పని కళాభిమానుల మనసు దోచుకుంటోంది. ఇళ్లలో అంతర్గత అలంకరణ (ఇంటీరియర్ డెకరేషన్) పట్ల ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ నిమ్మలకుంట కళాకారులు తయారు చేసే తోలు బొమ్మల్ని కొని తీరాల్సిందే అనేంత అందంగా తీర్చిదిద్దుతున్నారు. తరతరాలుగా ఇదే వృత్తి ధర్మవరం పట్టణానికి 9 కిలోమీటర్ల దూరంలో పుట్టపర్తి వెళ్లే రహదారిపై గల నిమ్మలకుంట కళాకారులు తరతరాలుగా హస్తకళల్నే నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. వీరంతా తోలు బొమ్మలాట ప్రదర్శనతో పాటు తోలుబొమ్మల తయారీలోనూ అంతర్జాతీయ ఖ్యాతి గడించారు. వీరి పూర్వీకులు ఎడ్లబండ్లపై గ్రామాలు తిరుగుతూ తోలు బొమ్మలాట ప్రదర్శించేవారు. కాలక్రమేణా సినిమాలు, టీవీల ప్రభావం ఎక్కువ కావడంతో తోలుబొమ్మల ప్రదర్శనకు ఆదరణ కరువైంది. బొమ్మలాటనే నమ్ముకున్న కుటుంబాలు తోలుబొమ్మల తయారీ, విక్రయం వైపు దృష్టి సారించారు. మేక, గొర్రె, జంతువుల చర్మాలతో ల్యాంప్‌సెట్స్ (లాంతర్లు), ఇళ్లలో గోడలకు అమర్చుకునే అందమైన కర్టెన్లు, హ్యాండ్ బ్యాగులు తదితర ఆకృతుల్లో తోలుబొమ్మల్ని తయారు చేస్తున్నారు. వీటిని ముంబై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ, చెన్నై తదితర ప్రాంతాలలో విక్రయిస్తున్నారు. ప్రస్తుతం ఆ గ్రామంలో తోలుబొమ్మలపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలు 200 వరకు ఉన్నాయి. తయారీ ఇలా.. మేక తోలును మాత్రమే బొమ్మల తయారీకి ఉపయోగిస్తున్నారు. మేక చర్మాన్ని బాగా కడిగిన తర్వాత ఎండబెడతారు. ఎండిన చర్మంపై తయారు చేయాలనుకున్న బొమ్మను మొదట పెన్సిల్‌తో గీస్తారు. చిన్నచిన్న రంధ్రాల ద్వారా మిగతా భాగాన్ని తొలగించి బొమ్మకు రంగులు వేస్తారు. ఒక బొమ్మ తయారీకి మూడు నుంచి ఏడు రోజుల సమయం పడుతుంది. తయారైన బొమ్మలను హ్యాండ్లూమ్ సొసైటీ ద్వారా పట్టణాలలో మార్కెటింగ్ చేస్తున్నారు. గతంలో కొద్దిమంది మాత్రమే ఈ బొమ్మలను తయారు చేసేవారు. మార్కెటింగ్ సదుపాయం అందుబాటులోకి రావడంతో తయారీదారులు పెరుగుతున్నారు. పద్మశ్రీ వరించింది తోలుబొమ్మలాటకు ఆదరణ కరువైన తరువాత ఆ కళాకారులంతా వివిధ ప్రాంతాల్లో స్థిరపడి వేర్వేరు వృత్తుల్లోకి మారిపోగా.. దళవాయి కడేరావు, వీరనారప్ప, అంజినప్ప అనే కళాకారులు మాత్రం ఇదే వృత్తిని కొనసాగిస్తూ నిమ్మలకుంట గ్రామంలో స్థిరపడ్డారు. వీరి వారసులే గ్రామంలో తోలుబొమ్మలకు జీవం పోస్తున్నారు.వీరితో పాటు ఇతర కులాల వారు కూడా తోలుబొమ్మల తయారీ నేర్చుకుని.. ఉపాధి మార్గంగా ఎంచుకున్నారు. తోలుబొమ్మల ప్రదర్శనకు విశేష గుర్తింపు తె చ్చినందుకు గాను గ్రామానికి చెందిన దళవాయి చలపతిరావును 2020వ సంవత్సరంలో పద్మశ్రీ పురస్కారం వరించింది. అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా చలపతిరావు అవార్డు అందుకున్నారు. ఇదే గ్రామానికి చెందిన శివమ్మ అనే కళాకారిణి ‘శిల్పగురు’ అవార్డుకు ఎంపికైంది. షిండేరావు, శ్రీరాములు వంటి కళాకారులు సైతం అనేక అవార్డులు సొంతం చేసుకున్నారు. -
'మనం' చాక్లెట్ తిన్నామంటే.. మైమరిచిపోవాలంతే!
సాక్షి, సిటీబ్యూరో: మీకు చాక్లెట్లంటే ఇష్టమా..? అసలు చాక్లెట్లు చూస్తేనే నోరూరుతుందా..? డిఫరెంట్ చాక్లెట్లను టేస్ట్ చేయడం మీకు అలవాటా? అయితే మీరు తప్పకుండా నగరంలోని ‘మనం’ చాక్లెట్ కార్ఖానాను ఒక్కసారైనా సందర్శించాల్సిందే. ఎందుకంటే ఇక్కడ దాదాపు 60కి పైగా వెరైటీ చాక్లెట్లు నోరూరిస్తుంటాయి. ఒకే దగ్గర పెరిగిన కోకో చెట్ల నుంచి తయారైన చాక్లెట్లను వీరు విక్రయిస్తున్నారు.టైమ్ మ్యాగజైన్ జాబితాలో చోటు..ప్రతిష్టాత్మక టైమ్ మ్యాగజైన్ ‘ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల’ జాబితాను ప్రచురించింది. ఆయా రంగాలతో పాటు ప్రపంచంలో ప్రత్యేకంగా నిలిచే 100 అద్భుతమైన ప్రదేశాలు, కంపెనీలను ఇందులో చేర్చింది. హోటళ్లు, క్రూజ్‌లు, రెస్టారెంట్స్, పర్యాటక స్థలాలు, మ్యూజియాలు, పార్క్‌లను గుర్తించింది. పలు మార్గాల్లో స్వదేశీ పదార్థాలకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చేందుకు మనం చాక్లెట్ కార్ఖానా పనిచేస్తోందని కొనియాడింది.అంతర్జాతీయ గుర్తింపు..భారత్‌లో పండించిన కోకోతో చాక్లెట్ల తయారీకి ‘మనం చాక్లెట్’ ప్రసిద్ధి పొందింది. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఉన్న ఈ సంస్థ ఉత్పత్తులకు ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులు వచ్చాయి. ఇక్కడ తయారైన చాక్లెట్లకు అంతర్జాతీయంగా చాలా డిమాండ్ ఉంది. 2023 ఆగస్టులో మనం చాక్లెట్ కార్ఖానాను ముప్పల చైతన్య స్థాపించారు. ఆల్మండ్ హౌజ్ మిఠాయి దుకాణం వీరి కుటుంబానికి చెందినది కావడం విశేషం.ఎన్నో రకాల వెరైటీలు.. డార్క్ చాక్లెట్లు, చాక్లెట్ ట్యాబ్లెట్స్, స్నాక్స్, ఒకే ప్రదేశంలో పండించినవి, అంతర్జాతీయంగా పండించిన కోకో నుంచి తయారైనవి, పాల మిశ్రమంతో చేసినవి ఇలా ఎన్నో రకాల వెరైటీ చాక్లెట్లు ఈ కార్ఖానాలో లభిస్తుంటాయి. పండ్లు, ప్లేన్, వీగన్ వంటి చాక్లెట్ల రకాలు కూడా తయారు చేస్తారు. ఇక్కడ తయారైన పది రకాల చాక్లెట్లను అవార్డులు కూడా వరించాయి.వర్క్‌షాప్స్‌తో పిల్లలకు నేరి్పస్తూ..చాక్లెట్ల తయారీలో మనం చాక్లెట్ కార్ఖానా అప్పుడప్పుడూ వర్క్‌షాప్స్ కూడా నిర్వహిస్తుంటుంది. సొంతంగా క్లస్టర్లు, కేక్ పాప్స్ తయారు చేసే విషయంలో పిల్లలకు శిక్షణ కూడా ఇస్తుంటుంది. కొన్నిసార్లు అసలు చాక్లెట్లు ఎలా తయారు చేస్తారో తెలుసుకునేలా టూర్ కూడా ఏర్పాటు చేస్తుంటారు. చాక్లెట్ కుకీస్, చాక్లెట్ ఇంక్లూజన్ స్లాబ్స్ తయారీలో 5–10 ఏళ్ల పిల్లలకు మెళకువలు నేర్పిస్తుంటారు.ఇవి చదవండి: అంతా స్మార్ట్.. ఆరోగ్యంపై ముందస్తు సమాచారం! -
నాడు-నేడు పథకానికి అంతర్జాతీయ గుర్తింపు
-
ఆంధ్రా బౌద్ధ శిల్పాలకు అంతర్జాతీయ గుర్తింపు
సాక్షి, అమరావతి: ప్రాచీన కళలు, సంస్కృతి, సంప్రదాయాలకు నెలవైన ఆంధ్రప్రదేశ్‌కు మరో అంతర్జాతీయ గుర్తింపు దక్కింది. రాష్ట్రానికి చెందిన ఆరు బౌద్ధ శిల్పాలు అమెరికా, దక్షిణ కొరియాల్లో అంతర్జాతీయ ప్రదర్శనకు ఎంపికయ్యాయి. ఇందులో భాగంగా క్రీ.పూ. 200 ఏళ్ల నుంచి క్రీ.శ. 400 ఏళ్ల మధ్య కాలం నాటి రాష్ట్ర ప్రాచీన శిల్ప కళాసంపద ఖండాంతర ప్రజలకు కనువిందు చేయనుంది. ఈ మేరకు న్యూయార్క్‌లోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్.. ‘టీ అండ్ సర్పెంట్: ది ఎవల్యూషన్’ అనే పేరుతో అంతర్జాతీయ ప్రదర్శనను నిర్వహించనుంది. ఇందులో భాగంగా భారతదేశంలో బౌద్ధానికి పూర్వం నాటి సంస్కృతిని చాటే శిల్పాలు, బౌద్ధం తొలినాళ్లలోని అలంకారిక కళలు, చిత్రాలను ప్రపంచానికి పరిచయం చేయనుంది. ఈ క్రమంలో మన దేశం నుంచి సున్నపురాయి, బంగారం, వెండి, కాంస్యం, రాక్ క్రిస్టల్, ఐవరీ వంటి 140 రకాల శిల్పాలను అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శించనున్నారు. అంతర్జాతీయంగా రెండు వేదికలపై.. భారతీయ బౌద్ధ శిల్పకళా రూపాల ప్రదర్శనను ముందు అమెరికాలోని న్యూయార్క్‌లో మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్‌లో జూలై 17 నుంచి నవంబర్ 13 వరకు నిర్వహించనున్నారు. ఈ మ్యూజియాన్ని ‘ది మెట్’ అని పిలుస్తారు. ఇది అమెరికాలో అతిపెద్ద ఆర్ట్ మ్యూజియం. 2022లో 32,08,832 మంది దీన్ని సందర్శించారు. ప్రపంచంలో అత్యధికంగా సందర్శించే ఆర్ట్ మ్యూజియంల జాబితాలో ఇది ఎనిమిదో స్థానంలో ఉంది. యూఎస్‌లో అయితే రెండో స్థానంలో నిలుస్తోంది. అమెరికాలో ప్రదర్శన ముగిశాక తర్వాత దక్షిణ కొరియాలో నేషనల్ మ్యూజియం ఆఫ్ కొరియాలో డిసెంబర్ 22 నుంచి 2024 ఏప్రిల్ 14 వరకు శిల్పాలను ప్రదర్శించనున్నారు. ఇందుకోసం మెట్రోపాలిటన్ మ్యూజియం ‘స్టార్ వరల్డ్ వైడ్’ సంస్థకు పురాతన కళా రూపాలను తరలించే బాధ్యతను అప్పగించింది. దీనికి మనదేశంలో నేషనల్ మ్యూజియం నోడల్ ఏజెన్సీగా పనిచేస్తోంది. ఏపీ విగ్రహాల్లో విశిష్టతలు తొలి బౌద్ధ కళల్లో అలంకరణ ముఖ్యంగా కనిపిస్తోంది. అందమైన పువ్వులు, తీగల అల్లికలు, పూర్ణకుంభం, విజ్ఞాన, ఆధ్యాత్మిక శక్తికి ప్రతీకగా కొలిచే గుర్రం వంటి చిత్రాలు వంటివి శిల్పాల్లో ఉన్నాయి. ముఖ్యంగా శిల్పాలపై చెక్కిన ఆరాధకుల ముఖకవళికల్లో మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి. మహాపురుషుని రూపం, యక్షుల చిత్రాలు, బౌద్ధంలోని వివిధ సంఘటనలను తెలిపే స్థూపం, ఒకే శిలపై సింహం తల, మొసలి, చేప, ఏనుగు తొండం రూపంలోని వాహనంపై సవారీని ప్రతిబింబించే దృశ్యాలున్నాయి. రాష్ట్రం నుంచి ఆరు విగ్రహాలు అంతర్జాతీయ ప్రదర్శనకు ఆంధ్రప్రదేశ్ నుంచి వేల సంవత్సరాల క్రితం నాటి ఆరు తెల్లటి పాలరాతి విగ్రహాలను ఎంపిక చేశారు. ఇందులో ఐదింటిని అమరావతి హెరిటేజ్ మ్యూజియం నుంచి, ఒకదాన్ని గుంటూరులోని బౌద్ధశ్రీ పురావస్తు మ్యూజియం నుంచి తరలించనున్నారు. ఇందుకు ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అనుమతులు సైతం మంజూరు చేసింది. మన రాష్ట్రంలో అమరావతి ప్రాంతానికి అంతర్జాతీయ బుద్ధిజం కేంద్రంగా ప్రత్యేక గుర్తింపు ఉన్న సంగతి తెలిసిందే. బుద్ధుడు తన శిష్యులకు ఇక్కడే 10 ధరణిలు (మంత్రాలు) బోధించారని.. అందుకే అమరావతి ప్రాంతం ధరణికోటగా పేరొందినట్టు చరిత్రకారులు చెబుతున్నారు. కాలచక్ర యానం కూడా ఇక్కడి నుంచే ప్రారంభమైందని బౌద్ధులు దృఢంగా విశ్వసిస్తున్నారు. కాగా ప్రదర్శనకు తెలంగాణ నుంచి తొమ్మిది శిల్పాలను ఎంపిక చేశారు. గొప్ప కళా సంపదకు నిలయం.. బుద్ధుడి ఆనవాళ్లు ఆంధ్రప్రదేశ్‌లో అత్యధికంగా ఉన్నాయి. అమరావతి, నాగార్జునకొండ ప్రాంతాలు గొప్ప శిల్ప కళా సంపదను నిక్షిప్తం చేసుకున్నాయి. ఇలాంటి ఎన్నో గొప్ప, అరుదైన శిల్పాలను ఏపీ మ్యూజియాల్లో భద్రపరిచాం. వీటిని అంతర్జాతీయ స్థాయి ప్రదర్శనకు ఎంపిక చేయడం ఎంతో గర్వకారణం. – జి.వాణీమోహన్, కమిషనర్, ఏపీ పురావస్తు, ప్రదర్శనశాలలు -
రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థకు అంతర్జాతీయ గుర్తింపు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అటవీ, అభివృద్ధి సంస్థ (ఎఫ్డీసీ)కు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. అడవుల నిర్వహణ, అభివృద్ధిలో ఉన్నత ప్రమాణాలు పాటిస్తున్నందుకుగాను ఎఫ్డీసీకి జర్మనీ ఫారెస్ట్ స్టీవర్డ్ కౌన్సిల్ సర్టిఫికెట్ దక్కింది. సేంద్రియ పద్ధతిలో యూకలిప్టస్, వెదురు, టేకు, జీడిమామిడి లాంటి అటవీ ఉత్పత్తు(ముడిసరుకు)ల నుంచి తయారయ్యే వస్తువులకు ఐదేళ్లపాటు తమ లోగోను ఉపయోగించుకునేందుకు ఎఫ్డీసీకి కౌన్సిల్ అనుమతినిచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 75 వేల ఎకరాల్లో యూకలిప్టస్, వెదురు, టేకు, జీడిమామిడి చెట్లను ఉన్నత ప్రమాణాలతో సాగు చేస్తున్నట్టు అధికారులు తెలియజేశారు. అయితే కొత్తగూడెం, పాల్వంచ, సత్తుపల్లి అటవీ డివిజన్లలో సుమారు 45 వేల ఎకరాల్లో సేంద్రియ పద్ధతుల్లో సాగు చేస్తున్న పంటకు ఈ గుర్తింపు దక్కిందని అటవీ అభివృద్ధి సంస్థ అధికారులు మంత్రికి వివరించారు. దీనివల్ల అంతర్జాతీయంగా ఎఫ్డీసీ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుందని, ఐకియా వంటి ఇంటర్నేషనల్ బ్రాండ్లకు జర్మన్ కౌన్సిల్ ధ్రువీకరించిన కలపను విక్రయించే అవకాశం దక్కిందని వెల్లడించారు. ఐదేళ్లలో రూ.10 కోట్ల అదనపు ప్రయోజనం కలగనుందని, కంపోజిట్ వుడ్‌పేపర్, ప్యాకింగ్ పరిశ్రమల కోసం ప్రాసెస్ చేసిన ఉత్పత్తులకు అధికధర లభిస్తుందన్నారు. అటవీ ఉత్పత్తుల నుంచి చేసిన కాగితం, టెట్రాప్యాక్, మిశ్రమ కలపకు ఎఫ్ఎస్సీ ఆమోదం లభించిందని తెలియజేశారు. గుర్తింపు రావడం గొప్ప విషయం: మంత్రి అరణ్యభవన్‌లో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆ శాఖ అధికారులు, సిబ్బందిని అభినందించారు. మంత్రి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపునకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశంలో భాగంగా ఇలాంటి గుర్తింపు రావడం గొప్ప విషయమన్నారు. మెరుగైన పద్ధతుల్లో సాగు చేస్తుండటం వల్ల మన అటవీ ఉత్పత్తులకు అంతర్జాతీయంగా మంచి డిమాండ్‌తోపాటు 30 శాతం రెవెన్యూ పెరిగిందని తెలిపారు. భవిష్యత్‌లో అటవీ ఉత్పత్తులను మరింత పెంచుకుని, వీటితో వచ్చిన ఆదాయంతో అడవుల సంరక్షణకు మరిన్ని చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, పీసీసీఎఫ్ ఆర్.యం.డొబ్రియల్, అటవీ శాఖ అదనపు కార్యదర్శి ఎం. ప్రశాంతి, ఎఫ్డీసీ వైస్ చైర్మన్, ఎండీ చంద్రశేఖర్‌రెడ్డి, అదనపు పీసీసీఎఫ్ వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
తెలుగు సినిమాలకు అంతర్జాతీయ గుర్తింపు గొప్ప విషయం
సాక్షి, హైదరాబాద్: తెలుగు సినిమాలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడం ఎంతో గొప్ప విషయమని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. ఇటీవల జాతీయస్థాయిలో ఉత్తమ చిత్రంగా ఎంపికై రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకున్న కలర్‌ఫొటో చిత్ర దర్శకు డు సందీప్‌రాజ్ శనివారం వెస్ట్ మారేడ్‌పల్లిలోని మంత్రి శ్రీనివాస్ యాదవ్‌ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశా రు. ఈ సందర్భంగా సందీప్ రాజ్ తనకు లభించిన అవా ర్డు, ప్రశంసా పత్రాన్ని మంత్రికి చూపించారు. మంత్రిని కలిసిన వారిలో యాదవ్ సంఘం రాష్ట్ర యువజన నాయకులు నవీన్ యాదవ్, రాహుల్ యాదవ్, ప్రదీప్, వంశీరెడ్డి, గంగాధర్ ఉన్నారు. -
ధవళేశ్వరం బ్యారేజ్ కు అంతర్జాతీయ గుర్తింపు
-
ప్లీజ్.. సాయం చేయండి: చైనా పంచన చేరిన తాలిబన్లు
గ్లోబల్ పొలిటికల్ సినారియోలో మరో ఆసక్తికర పరిణామం ఒకటి చోటు చేసుకుంది. అఫ్గనిస్థాన్‌లో పాలన కొనసాగిస్తున్న తాలిబన్ ప్రభుత్వం.. ఇప్పుడు చైనా సాయం కోరుతోంది. ఇదే అదనుగా అమెరికాపై విమర్శలు ఎక్కుపెట్టింది డ్రాగన్ కంట్రీ. తమ ఇస్టామిక్ ఎమిరేట్ ప్రభుత్వానికి(తాలిబన్ ప్రభుత్వం).. అంతర్జాతీయ సమాజంలో గుర్తింపు దక్కేలా చూడాలంటూ చైనాను వేడుకుంటున్నారు తాలిబన్లు. తద్వారా ఓవర్సీస్లో నిలిచిపోయిన 9 బిలియన్ డాలర్ల నిధులకు మోక్షం దక్కుతుందేమోనని ఆశాభావం వ్యక్తం చేస్తోంది. అంతర్జాతీయ సమాజం నుంచి గుర్తింపు కోసం కావాల్సిన పరిస్థితులన్నీ ఇప్పుడు మాకు ఉన్నాయి. చైనా ఇస్లామిక్ ఎమిరేట్‌కు పెద్ద దిక్కుగా సాయం చేయాలని కోరుకుంటున్నాం అని తాలిబన్ ప్రతినిధి బిలాల్ కరిమి మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. నో రికగ్నిషన్ అమెరికా, అమెరికా మిత్రపక్ష దేశాలు, రష్యా, చైనా.. ఇలా ఏ దేశం కూడా ఇప్పటిదాకా అఫ్గనిస్థాన్‌లోని తాలిబన్ ప్రభుత్వాన్ని గుర్తించింది లేదు. ఉగ్రవాదంతో ముడిపడి ఉండడం, మానవ హక్కుల్ని కాలరాయడం, అమ్మాయిలను విద్యకు దూరం చేయడంతో పాటు ప్రస్తుతం తాలిబన్ కేబినెట్లో ఉన్న సభ్యులు కొందరిపై అమెరికా, ఐరాస ఆంక్షలు ఉన్నాయి. అందుకే అగష్టులో అధికారం చేపట్టినప్పటికీ.. ఇప్పటిదాకా తాలిబన్ ప్రభుత్వానికి అంతర్జాతీయ సమాజం గుర్తింపు దక్కలేదు. నివేదికలతో తారుమారు అయితే అధికారం చేపట్టాక సంస్కరణలకు పెద్ద పీట వేస్తామని తాలిబన్లు ప్రకటించుకున్నారు. ఉగ్రవాదాన్ని ప్రొత్సహించబోమని, అఫ్గనిస్థాన్‌లో ఉగ్రచర్యల కట్టడికి ప్రయత్నిస్తామని, ఉమెన్ ఫ్రెండ్లీ ప్రభుత్వంగా కొనసాగుతామని ప్రకటించుకుంది. ఈ తరుణంలో పరిస్థితులు అనుకూలిస్తాయని భావిస్తుండగా.. సొంత దేశంలో కొన్ని ఘటనలు(వ్యతిరేక ఉద్యమాలు), 2022లో దేశం తీవ్ర ఆహార సంక్షోభం ఎదుర్కొనబోతోందని ఐరాస ఇచ్చిన హెచ్చరికల నివేదికతో గుర్తింపు ఆలస్యం అవుతోంది. ఈ తరుణంలో రంగంలోకి దిగిన తాలిబన్లు.. చైనా సంప్రదింపుల ద్వారా గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నారు. ఈమధ్యే చైనా రాయబారి వాంగ్ యూతో సమావేశమైన తాలిబన్ మంత్రి సిరాజుద్దీన్ హక్కానీ.. చైనా మద్దతు కోరినట్లు తెలుస్తోంది. దీనికి సానుకూల స్పందన లభించినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ భేటీలో అమెరికన్,యూరోపియన్ బ్యాంకుల నిధులు నిలిచిపోవడానికి అమెరికానే కారణమని ఇరువర్గాలు ఆరోపించినట్లు సమాచారం. ‘ఆర్థిక ఆంక్షల ద్వారా అఫ్గన్ల మీద ప్రతీకారం తీర్చుకోవడం అమెరికాకు మంచిది కాదు’ అంటూ వాంగ్ వ్యాఖ్యలు చేయడం విశేషం. ఇదిలా ఉంటే ఎఫ్‌బీఐ మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో తాలిబన్ మంత్రి హక్కానీ ఉన్నాడు. చదవండి: తాలిబన్ల పిలుపునకు స్పందన.. అమెరికా సాయం, యూఎన్ భారీ ప్రణాళిక -
Cheena Kapoor: కొత్త దారి...కెమెరా చెప్పే కథలు
‘మనుషులే కాదు కెమెరా కూడా కథలు చెబుతుంది...వినే మనసు ఉంటే!’ అంటుంది చీనాకపూర్. దిల్లీలో ఇంజనీరింగ్ చేసిన చీనా లండన్‌లో ఐటీ ఇండస్ట్రీలో పనిచేసింది. అయితే ‘జీవితంలో ఉద్యోగం’ కాదు ‘ఉద్యోగమే జీవితం’లాంటి పరిస్థితి ఎదురైంది. కొత్తగా ఏదైనా చేయాలనిపించింది. అప్పుడు వచ్చిన ఆలోచనే కెమెరా చెప్పే కథలు. అయితే ఇవి ప్రకృతి అందాలను కళ్లకు కట్టే కథలు కాదు. కాల్పనిక కథలు అంతకంటే కాదు. కదిలించే నిజజీవిత కథలు. మానసిక సమస్య బాధితుల ఆశ్రమం నుంచి రెడ్‌లైట్ ఏరియాల వరకు ఎన్నో ప్రాంతాలకు వెళ్లింది చీనా. వారి జీవితాన్ని, దైన్యాన్ని ఫొటోల్లోకి తీసుకువచ్చింది. ‘ఫర్గాటెన్ డాటర్స్’ ప్రాజెక్ట్ చీనాకు మంచి పేరు తీసుకువచ్చింది. ఈ ప్రాజెక్ట్ ఆలోచన ఎలా వచ్చిందంటే... చీనా వాళ్ల బంధువుల కుర్రాడు యాక్సిడెంట్లో చనిపోయాడు. అప్పటి నుంచి అతడి తల్లి మానసిక పరిస్థితి సరిగా లేదు. కుటుంబ సభ్యులు ఆమెను ఒక ఆశ్రమంలో చేర్చి చేతులు దులుపుకున్నారు. 35 సంవత్సరాల నుంచి ఆమె అక్కడే ఉంటోంది. వచ్చి చూసే వారు లేరు. పలకరించేవారు లేరు. ఆమెను చూడడానికి ఒకసారి ఆశ్రమానికి వెళ్లింది చీనా. అక్కడ తన బంధువులాంటి ఎంతో మందిని చూసి చలించిపోయింది. ఆ సమయంలోనే ‘ఫర్గాటెన్ డాటర్స్’ ప్రాజెక్ట్ ఆలోచన వచ్చింది. ‘మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే’ అంటారు. ఆర్థిక విషయాలే కాదు ఆరోగ్య విషయాలు కూడా మానవసంబంధాల్లో కీలక పాత్ర పోషిస్తాయని ‘ఫర్గాటెన్ డాటర్స్’ చెప్పకనే చెబుతుంది. ఆరోగ్య సమస్యలు ఉంటే అయిన వారు కూడా కాని వారవుతారా! అలాంటి ఎంతోమంది బాధిత మహిళల దీనస్థితికి చిత్రరూపం ఇచ్చింది చీనా. రెడ్‌లైట్ ప్రాంతాలకు వెళ్లేముందు వద్దని వారించారు చాలామంది. అయితే చీనాకపూర్ వారి మాటలు వినలేదు. అక్కడ ఎన్నో దృశ్యాలు. కనిపించే దృశ్యం ఒకటి... కనిపించని దృశ్యం ఒకటి. వీటిని ఆమె కెమెరా పట్టుకోగలిగింది. ఎప్పుడూ ఎవరో వచ్చే ఆ ప్రాంతంలో ‘భద్రత’ లేదనే విషయం అర్థమైంది. అక్కడ ఉన్న ఎంతోమందితో తాను మాట్లాడింది. వారి కన్నీటికథలను డాక్యుమెంట్ చేసింది. ఇన్స్టాగ్రామ్ వేదికగా చీనా నిర్వహించే ‘మై షాట్ స్టోరీస్’కు ఎంతోమంది ఫాలోవర్స్ ఉన్నారు. తాను చేస్తున్న పనికి ‘యూనిసెఫ్’లాంటి అంతర్జాతీయ సంస్థల నుంచి ప్రశంసలు లభించాయి. డాక్యుమెంటరీ ఫొటోగ్రాఫర్‌గా చీనా కపూర్‌కు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. అయితే తన గుర్తింపు కంటే గుర్తింపుకు నోచుకోని బాధిత సమూహాల పైనే ఎక్కువ దృష్టి పెడుతోంది చీనా కపూర్. -
తెలంగాణ గ్రామానికి అంతర్జాతీయ గుర్తింపు..
న్యూఢిల్లీ: తెలంగాణలోని పోచంపల్లి (యాదాద్రి భువనగిరి జిల్లా) గ్రామానికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఐక్యరాజ్యసమితి ప్రపంచ పర్యాటక సంస్థ జాబితాలో పోచంపల్లిని ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపిక చేసింది. ఈ మేరకు యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం సంస్థ ప్రకటించింది. డిసెంబర్ 2న స్పెయిన్‌లోని మాడ్రిడ్‌లో అవార్డుల ప్రధానం జరగనుంది. కాగా, పోచంపల్లి గ్రామానికి గుర్తింపుపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. గుర్తింపు రావడానికి కృషి చేసిన మంత్రిత్వశాఖ అధికారులను కిషన్ రెడ్డి ప్రశంసించారు. చదవండి: (బీజేపీ నేతలకు సిగ్గుండాలి: మంత్రి నిరంజన్‌రెడ్డి) -
ప్రియరాగం
గ్రామీ అవార్డ్‌ల నామినీల జాబితాలో ‘బెస్ట్ న్యూ ఏజ్ ఆల్బమ్’ విభాగంలో స్థానాన్ని దక్కించుకొని అంతర్జాతీయ గుర్తింపు పొందింది ప్రియదర్శిని. ప్రియదర్శిని గురించి మాట్లాడుకోవాలంటే యూత్‌ను ఊపేస్తున్న ‘పెరిఫెరీ’ ఆల్బమ్ గురించి మాత్రమే కాదు... ఆమె బహుముఖప్రజ్ఞ, సేవాతత్వం గురించి కూడా మాట్లాడుకోవాలి. చిన్నాచితకా పనులు చేస్తూనే ‘అబ్బా! టైమ్ సరిపోవడం లేదు’ అని గొణుక్కుంటాం. పెద్ద పెద్ద పనులు చేస్తున్నవారి గురించి ఆలోచిస్తూ ‘ఒక్కరే ఇన్నిన్ని పనులు ఎలా చేస్తారు!’ అని కూడా ఆశ్చర్యపోతుంటాం. ‘టైమ్ మన చేతిలో ఉంటే అదృష్టం కూడా మన చేతిలో ఉంటుంది’ అని చెప్పడానికి నిలువెత్తు ఉదాహరణ... ప్రియదర్శిని. సింగర్ సాంగ్ రైటర్ స్విమ్మర్ ఎంటర్ప్రెన్యూర్ సోషల్ యాక్టివిస్ట్ ఆల్ట్రా–మారథానర్... ప్రియదర్శిని అనే పేరుకు ముందు ఇన్ని విశేషణాలు ఉన్నాయి. ‘నా పేరు నిలపాలి సుమా!’ అని పెద్దలు అంటుంటారు. నిలపడమేమిటి, అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లింది. ప్రియదర్శిని బామ్మ పేరు ప్రియదర్శిని. సేమ్ పేరు అన్నమాట! అమ్మమ్మ ఒడిలోనే సంప్రదాయ కర్నాటక సంగీతాన్ని నేర్చుకుంది. ముంబైలో పుట్టి పెరిగిన ప్రియదర్శిని న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో ఫిల్మ్–మేకింగ్, యాక్టింగ్‌లో శిక్షణ తీసుకుంది. ప్రసిద్ధ మ్యూజిక్ బ్యాండ్లు, సంగీతకారులతో కలిసి పనిచేసింది. మదర్ థెరెసా జీవితం ఆధారంగా తీసిన హాలివుడ్ సినిమా ‘ది లెటర్స్’లో సుభాషిణి దాస్ పాత్రలో ఒదిగిపోయింది. ప్యార్ క్యోం కియా, డి–కంపెనీ... మొదలైన బాలీవుడ్ సినిమాలలో పాటలు పాడి తన గాత్రంతో శ్రోతలను ఆకట్టుకుంది. వందకు పైగా రేడియో, టీవి కమర్షియల్స్‌కు తన గాత్రాన్ని అందించింది. నే పాడితే లోకమే ఆడదా... 2017లో ‘ఇట్ కాన్ట్ హ్యాపెన్ హియర్’ నాటకంలో నటించి రంగస్థలంపై కూడా తన ప్రతిభ చాటుకుంటుంది. ఇవన్నీ ఒక ఎత్తయితే ‘పెరిఫెరీ’ ఆల్బమ్ ఒక ఎత్తు. ఆమె తొలి ఆల్బమ్ యూత్‌ను తెగ ఆకట్టుకుంది. సంప్రదాయ కర్నాటక సంగీతం, అమెరికన్ పాప్ మ్యూజిక్ కలయికగా వచ్చిన ఈ ఆల్బమ్ న్యూ ఏజ్ మ్యూజిక్‌లో తనదైన స్టాంప్ వేసింది. ‘నా చిన్నప్పటి కల నిజమైంది. ముంబైలోని గోరెగావ్‌లో పెరిగిన నాలాంటి తమిళ పొన్నుకు ఇలాంటి నిజాలు జీర్ణం చేసుకోవడం కాస్త కష్టమే’ అంటోంది ప్రియదర్శిని. ఆమె తన గురించి ఏమనుకుంటుంది సరే, మరి ఇతరులు? ఫైవ్ టైమ్ గ్రామీ విన్నర్ రాయ్ వుటెన్ ఇలా అంటారు... ‘ఆమె ఎంతోమందికి స్ఫూర్తి’ గానం, సాహిత్యంలోనే కాదు సాహసంలోనూ తనదైన ప్రత్యేకత చాటుకుంది ప్రియదర్శిని. అత్యంత ప్రతికూల వాతావరణంలో ఆల్ట్రా మారథాన్ రన్నర్‌గా 100–మైల్ హిమాలయన్ స్టేజ్ రేస్ పూర్తి చేసి రికార్డ్ సృష్టించింది. ఆ సమయంలో పోర్టర్లు, గైడ్లుగా బతుకుతున్న షేర్పాల జీవితాన్ని దగ్గరగా చూసే అవకాశం వచ్చింది. వాళ్లు దోపిడికి గురవుతున్నారనే వాస్తవం బోధ పడింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆల్ట్రా మారథాన్లను నిర్వహించడానికి ‘ది విండ్ ఛేజర్స్’ అనే కంపెనీ లాంచ్ చేసింది. దీని ద్వారా వచ్చిన ఆదాయాన్ని షేర్పాల కుటుంబ సంక్షేమానికి కేటాయిస్తున్నారు. హోమ్ మ్యూజిక్ వీడియోలో ఒక దృశ్యం నమీబియా ఎడారిలో 250 కిలోమీటర్ల హార్డ్ కోర్ రేస్ మరో సాహసం ప్రియదర్శిని దృష్టిలో గానం, పరుగు రెండు వేరు విషయాలు కాదు. ఒకదానికొకటి అనుసంధానమైవి. ‘సృజనాత్మకత మరింత పదును తేలడానికి ఇది ఉపకరిస్తుంది’ అంటోంది ప్రియదర్శిని. సాహనం మాత్రమే కాదు సహాయం కూడా ఆమెకు ఇష్టమైన మాట. క్యాన్సర్ చికిత్స కోసం ముంబై మహానగరానికి వచ్చి ఆశ్రయం దొరకక ఇబ్బందిపడే పేదలకు ప్రియదర్శిని తల్లి తన వన్–బెడ్రూమ్ ఫ్లాట్‌లో ఆశ్రయం కల్పించేది. తల్లి నుంచి ఇలాంటి మంచి గుణాన్ని పుణికిపుచ్చుకున్న ప్రియదర్శిని ‘జనరక్షిత’ అనే స్వచ్ఛందసంస్థను ప్రారంభించింది. ‘జనరక్షిత’ ద్వారా ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకొని సౌకర్యాలు సమకూరుస్తుంది. బాలికల విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాప్ అవుట్స్‌ను తగ్గించడానికి కృషి చేస్తుంది. కళ,సేవ,వ్యాపారరంగంలో ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తుంది ప్రియదర్శిని. నామినీ జాబితాలో చోటు సంపాదించుకున్న మన కళాకారులు అనుష్క శంకర్, నేహా మహాజన్, శిల్పారావులకు అభినందనలు తెలియజేద్దాం. -
భారతీయ శాస్త్రవేత్తకు అంతర్జాతీయ గుర్తింపు
పణజీ: గోవాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎన్ఐటీ)లో పరిశోధక విద్యార్థిగా ఉన్న ప్రీతి జగదేవ్ అంతర్జాతీయ గుర్తింపు సాధించారు. 2021 సంవత్సరానికి గానూ ఆప్టిక్స్ రంగంలో పరిశోధనలు చేస్తున్న అత్యుత్తమ 25 మంది మహిళా శాస్త్రవేత్తల్లో ఒకరుగా అమెరికాకు చెందిన ప్రఖ్యాత ‘ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ ఆప్టిక్స్ అండ్ ఫొటోనిక్స్’ జాబితాలో స్థానం సంపాదించారు. ఈ ఏడాది ఈ జాబితాలో స్థానం సంపాదించిన ఏకైక భారతీయురాలుగా ప్రీతి ఘనత సాధించారు. ప్రీతికి కేంద్ర విద్యామంత్రి రమేశ్ పోఖ్రియాల్ అభినందనలు తెలిపారు. ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఇది ఎన్ఐటీ, గోవాకు లభించిన మరో అంతర్జాతీయ గుర్తింపు అని ఆ విద్యాసంస్థ డైరెక్టర్ గోపాల్ ముగరేయ పేర్కొన్నారు. ప్రీతి జగదేవ్ ప్రస్తుతం గోవా ఎన్ఐటీలో ‘ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్’లో పోస్ట్ డాక్టోరల్ రీసెర్చ్ స్కాలర్‌గా ఉన్నారు. కృత్రిమ మేథ, ఇన్ఫ్రారెడ్ థర్మోగ్రఫీ సాంకేతికత సహాయంతో మానవుల్లో ఆరోగ్య పర్యవేక్షణ విధానాలపై డాక్టర్ లలత్ ఇందు గిరి పర్యవేక్షణలో పరిశోధన చేస్తున్నారు. -
రుషికొండ బీచ్‌కు అంతర్జాతీయ గుర్తింపు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ రుషికొండ బీచ్‌కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. పర్యావరణహిత, ప్రమాదరహిత బీచ్‌లకు అందించే బ్లూఫ్లాగ్ సర్టిఫికెట్‌ని ఆదివారం ఈ బీచ్ దక్కించుకుంది. బ్లూఫ్లాగ్ ఇంటర్నేషనల్ జ్యూరీ బృందం ఆయా బీచ్‌ల్లో నిర్వహించిన పనుల్ని వర్చువల్ ద్వారా పరిశీలించింది. అనంతరం దేశంలో 13 బీచ్‌ల నుంచి ఎనిమిది బీచ్‌లు బ్లూఫ్లాగ్ సర్టిఫికెట్‌కు ఎంపికయ్యాయని వెల్లడించింది. అదేవిధంగా తీర ప్రాంతాల్లో కాలుష్య నియంత్రణకు భారత్ తీసుకుంటున్న విధానాలు అద్భుతంగా ఉన్నాయని, బెస్ట్ ప్రాక్టీసెస్ విభాగంలో ఇండియా మూడో స్థానంలో నిలిచిందని బ్లూఫ్లాగ్ బీచెస్ ఆఫ్ ఇండియా మిషన్ లీడర్ సంజయ్ జల్లా ప్రకటించారు. బ్లూఫ్లాగ్ గుర్తింపు వల్ల లాభమేమిటంటే.. ప్రపంచవ్యాప్తంగా బ్లూఫ్లాగ్ బీచ్‌లకు విశేష ఆదరణ ఉంటుంది. విదేశీ పర్యాటకులు ముందుగా బ్లూఫ్లాగ్ బీచ్‌నే ఎంపిక చేసుకుంటారు. ఈ సర్టిఫికెట్‌ని పొందాలంటే బీచ్ పర్యావరణహితంగా ఉండటంతోపాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి. ఎలాంటి రసాయనాలు బీచ్ పరిసరాల్లో కలవకుండా చూడాలి. ఈ సర్టిఫికెట్‌ని డెన్మార్క్‌కి చెందిన ఫౌండేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ (ఎఫ్ఈఈ) సంస్థ అందిస్తోంది. ఇప్పటివరకు 46 దేశాల్లో 4,500 బీచ్‌లు బ్లూఫ్లాగ్ సర్టిఫికెట్‌ని పొందాయి. మరిన్ని బీచ్‌ల గుర్తింపునకు కృషి చేస్తాం బీచ్‌ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం, అధికారులు కష్టపడటం వల్లే బ్లూఫ్లాగ్ సర్టిఫికెట్ లభించింది. దేశంలో కేవలం 8 బీచ్‌లు ఈ గుర్తింపు పొందగా అందులో రుషికొండ ఉండటం గర్వంగా ఉంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచనలకు అనుగుణంగా ఏడాది కాలంగా బీచ్‌లో చేపట్టిన పనులు జ్యూరీ ప్రశంసలు పొందాయి. ఏపీ నుంచి మరిన్ని బీచ్‌లకు బ్లూఫ్లాగ్ సర్టిఫికెట్ వచ్చేందుకు కృషి చేస్తాం. - పర్యాటక మంత్రి ముత్తంశెట్టి -
‘బతుకమ్మ’కు అంతర్జాతీయ గుర్తింపు
• 10వేల మందితో 8న ఎల్బీ స్టేడియంలో మహా బతుకమ్మ • మంత్రి చందూలాల్ వెల్లడి సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ తెలిపారు. బుధవారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ పండుగకు గిన్నిస్ రికార్డుల్లో చోటు కల్పించేందుకు కృషి చేయనున్నట్లు చెప్పారు. అక్టోబర్ 8న ఎల్బీ స్టేడియంలో 10వేల మంది మహిళలతో బతుకమ్మ పండుగ జరుపనున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 8న ప్రభుత్వం తరఫున ఉత్సవాలు జరుగుతాయని, 9న ప్రజలు పెద్ద బతుకమ్మను నిర్వహిస్తారన్నారు. రాష్ట్రంలో 8న జిల్లాల్లో కూడా వెయ్యి మంది మహిళలతో ఉత్సవాలు జరుపుతారన్నారు. హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ వద్ద 9న పెద్ద బతుకమ్మను వినాయక నిమజ్జనం తరహాలో నిర్వహిస్తామన్నారు. పండుగ కోసం ప్రభుత్వం రూ.15 కోట్లు విడుదల చేసిందన్నారు. బతుకమ్మ ఉత్సవాల కోసం పాత జిల్లాలకు రూ. 10 లక్షలు, కొత్త జిల్లాలకు రూ.5 లక్షలు విడుదల చేస్తుందన్నారు. తెలంగాణ వాసులు నివసించే ముంబై, సూరత్, భీవండి, ఢిల్లీ వంటి ప్రాంతాల్లో, అమెరికా, జర్మనీ, బ్రిటన్, ఆస్ట్రేలియాతో పాటు పలు గల్ఫ్ దేశాల్లో బతుకమ్మ ఉత్సవాల నిర్వహణకు స్థానిక సంఘాలకు ప్రభుత్వం ఆర్థికంగా సహకరిస్తుందన్నారు. బ్రహ్మకుమారీల ఆధ్వర్యంలో ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ఐశ్వర్య విశ్వవిద్యాలయ ఆధ్వర్యంలో నగరంలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు సంస్థ ప్రతినిధులు అంజలి, షీలా తెలిపారు. సచివాలయంలో వారు మీడియా తో మాట్లాడుతూ.. అక్టోబర్ 7న రవీంద్రభారతిలో, 8న గచ్చిబౌలిలోని గ్లోబల్ పీస్ ఆడిటోరియంలో, 9న ట్యాంక్‌బండ్, 10న రవీంద్రభారతి, 11న గచ్చిబౌలిలో 7 దేశాల కళాకారులతో ఉత్సవాలు జరుపుతామన్నారు. -
ప్రకాశం అధ్యాపకుడికి అంతర్జాతీయ గుర్తింపు
కందుకూరు: ప్రకాశం ఇంజినీరింగ్ కాలేజీలో మ్యాథ్స్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ డి.రామలింగారెడ్డి తన ఆర్టికల్స్ ద్వారా అంతర్జాతీయ స్థాయిలో ప్రఖ్యాతి గాంచారని కాలేజీ కరస్పాండెంట్ కంచర్ల రామయ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రామలింగారెడ్డి ఆర్టికల్స్ ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఇన్నోవేటివ్ రీసెర్చి అండ్ డెవలప్మెంట్స్ (ఐజెఐఆర్డీ)లో ప్రచురితమయ్యాయని తెలిపారు. దీంతో ఆర్టికల్స్ పరిశీలనార్థం కేంబ్రిడ్జి, స్టాన్‌ఫర్డ్, ఆక్స్ఫర్డ్ యూనివర్సీటీ లైబ్రరీలలో ఉంచనున్నట్లు తమకు సమాచారం అందిందన్నారు. ఇది తమ కాలేజీ అధ్యాపకుల సామర్ధ్యాన్ని తెలియజేస్తుందని వివరించారు. తమ కాలేజీ ప్రొఫెసర్ అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతిగడించడం గర్వకారణం అన్నారు. రామలింగారెడ్డిని ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మణరావుతో పాటు, తోటి అధ్యాపకులు డాక్టర్ రవికుమార్, శ్రీనివాస్, రాముడు, ప్రసాద్ అభినందించారు. -
ఏటికొప్పాక బొమ్మకు చేయూత
ఆర్బీఐ జనరల్ మేనేజర్ జి.జె.రాజు {పపంచ మార్కెట్లో గిరాకీ ఉందని వెల్లడి హస్తకళాకారులతో ముఖాముఖి యలమంచిలి: ఏటికొప్పాక లక్కబొమ్మలకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చేందుకు రిజర్వు బ్యాంకు చేయూతనిస్తుందని ఆర్బీఐ జనరల్ మేనేజర్ జి.జె.రాజు చెప్పారు. సహజ సిద్ధమైన రంగులతో తయారవుతున్న ఇక్కడి బొమ్మలకు ప్రపంచ మార్కెట్లో గిరాకీ ఉందన్నారు. మేక్ఇన్ఇండియాలో భాగంగా ఆర్బీఐ స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహిస్తున్నట్టు వెల్లడించారు. రిజర్వు బ్యాంకు పరిధిలో ఉన్న 56 ఆర్టిజాన్ జోన్లలో ఏటికొప్పాక లక్కబొమ్మల పరిశ్రమ కూడా ఒకటన్నారు. మారుతున్న జీవనశైలి, ప్రపంచీకరణకు అనుగుణంగా హస్తకళాకారులు నైపుణ్యం పెంపొందించుకుని సృ జనాత్మకతతో కొత్త డిజైన్లు రూపొందించాలని సూచించారు. హైదరాబాద్ నుంచి యలమంచిలి మండలం ఏటికొప్పాకకు వచ్చిన జనరల్ మేనేజర్ మంగళవారం అక్కడి కల్యాణ మండపంలో లక్కబొమ్మలు తయారుచేసే కళాకారులతో ముఖాముఖి సమావేశమయ్యారు. హస్తకళాకారుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆకట్టుకునే బొమ్మలు తయారు చేస్తున్నప్పటికీ సరైన మార్కెటింగ్ సదుపాయంలేక గిట్టుబాటు కావడంలేదని కళాకారులు ఆయనకు విన్నవించారు. ప్రపంచవ్యాప్తంగా రసాయనాలతో కూడిన రంగులను చాలా దేశాలు దిగుమతిని నిషేదిస్తున్నాయని, సహజసిద్ధమైన రంగులతోనే బొమ్మలు తయారు చేస్తే ఏటికొప్పాక బొమ్మలకు భవిష్యత్తులో మరింత గిరాకీ ఉంటుందని జీఎం చెప్పారు. ఇక్కడి హస్తకళల అభివృద్ధికి రిజర్వుబ్యాంకు ఏదైనా చెయ్యాలని తపన పడుతోందని, అందుకు ఇక్కడి పరిస్థితులు స్వయంగా గమనించడానికి వచ్చినట్లు ఆయన తెలిపారు. ఇక్కడి పరిస్థితులు రిజర్వుబ్యాంకు అత్యున్నత కమిటీకి తెలియజేస్తానని ఆయన హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మార్కెటింగ్ వ్యాపారి దేవీ ప్రసాద్, హస్తకళాకారులు మాట్లాడుతూ బొమ్మలకు ముడిసరుకైన అంకుడు కర్ర సేకరించడం కష్టమవుతోందని, దీనికి అటవీశాఖ వెసులు బాటు కల్పించాలని కోరారు. నామ మాత్రపు వడ్డీకి రుణసదుపాయం కల్పించాలని నివేదించారు. ఇక్కడి హస్తకళాకారులు రుణాలు తీర్చడంలో వెనుకబడి ఉన్నారని, వారికి మరో ఛాన్సు ఇస్తూ తిరిగి రుణాలు పొందే అవకాశం ఇస్తున్నట్టు జీఎం ప్రకటించారు. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్సు సాధించిన వారు, రాష్ట్రపతికి బహమతులు అందించిన కళాకారులు ఇక్కడ ఉండడం ఆనందదాయకమని కొనియాడారు. కార్యక్రమానికి సర్పంచ్ కాండ్రకోట చిరంజీవి అధ్యక్షత వహించగా రిజర్వు బ్యాంకు మేనేనర్లు ఎన్.సత్యప్రసాద్, ఎం.మురళీ, డి.శరత్‌బాబు, సాగునీటి సంఘం అధ్యక్షుడు చింతలపాటి దేవీ ప్రసాద్, ఏటికొప్పాక, యలమంచిలి ఎస్బీఐ మేనేజర్లు ఆర్.వెంకటేశ్వరరావు, పి.ఎస్.శ్రీనివాసమూర్తి, ఏపీ గ్రామీణవికాస బ్యాంకు, జిల్లా కేంద్ర సహకార బ్యాంకు యలమంచిలి బ్రాంచిల అధికార్లు పాల్గొన్నారు. -
బాహుబలితో అంతర్జాతీయ గుర్తింపు
సినీనటుడు కృష్ణంరాజు ఇంద్రకీలాద్రి : బాహుబలితో తెలుగు సినీపరిశ్రమకు అంతర్జాతీయ గుర్తింపు లభించిందని, పరిశ్రమలో ఉన్న ప్రముఖులందరూ ఇదేస్థాయిలో సినిమాలు తీసేందుకు ముందుకు రావాలని ప్రముఖ సినీనటుడు, కేంద్ర మాజీ మంత్రి యు.కృష్ణంరాజు పేర్కొన్నారు. ఇంద్రకీలాద్రిపై నిర్వహించిన దసరా ఉత్సవాల్లో ఆఖరి రోజు గురువారం రాజరాజేశ్వరిదేవి అలంకారంలో అమ్మవారిని కృష్ణంరాజు దంపతులు దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనం అనంతరం దేవస్థానం ఈవో నర్సింగరావు కృష్ణంరాజుకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందచేశారు. అనంతరం కృష్ణంరాజు మీడియాతో మాట్లాడుతూ బాహుబలి సినిమా మన సినీ పరిశ్రమకు అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు తీసుకువచ్చిందన్నారు. శుక్రవారం హీరో ప్రభాస్ పుట్టిన రోజు అని, ఈ సందర్భాన్ని పురస్కరించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపించినట్లు చెప్పారు. దుర్గమ్మ ఆశీస్సులతో ప్రపంచస్థాయి రాజధాని నిర్మాణం చేసుకుంటున్నామని, మన పూర్వ చరిత్ర కంటే గొప్పగా అమరావతి నిర్మాణం జరగాలని అమ్మ వారి ఆశీస్సులు కోరుకున్నట్లు కృష్ణంరాజు తెలిపారు. ఎన్నోయేళ్ల తర్వాత మనం అనుభవించిన కష్టాల నుంచి బయటపడ్డామని, ప్రజల ఇబ్బందులు, కష్టాలు తెలిసిన మనలో ఒకరు దేశ ప్రధానిగా వచ్చారని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖులు.. కృష్ణలంక: శరన్నవరాత్రులను పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా గురువారం రాజరాజేశ్వరిదేవిగా దర్శనమిచ్చిన దుర్గమ్మను పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. అమ్మవారిని దర్శించుకున్నవారిలో ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాస్, సీఐడీ చీఫ్ అధికారి ద్వారకాతిరుమల, రిటైర్డ్ ఐజీ సీఆర్ నాయుడు, సినీనటుడు సాయికుమార్ తదితరులు ఉన్నారు. -
రూ.200 కోట్లతో ఓక్వుడ్ హోటల్!
శంషాబాద్‌లో ఏర్పాటు; వచ్చే ఏడాది పనులు షురూ... - రెండేళ్లలో దేశంలో మరో 4 ప్రాజెక్ట్‌లు - ఓక్వుడ్ డెరైక్టర్ మిచెల్ ప్రైజ్ - లగ్జరీ సర్వీస్ అపార్ట్మెంట్ ప్రారంభం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సర్వీస్ అపార్ట్మెంట్లు, కార్పొరేట్ హౌసింగ్ రంగంలో అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందిన ఓక్వుడ్.. హైదరాబాద్‌లో తన తొలి ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. లాస్ ఏంజిల్స్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న ఓక్వుడ్... రాష్ట్రానికి చెందిన కపిల్ గ్రూప్‌తో కలిసి ఐటీ హబ్‌గా పేరొందిన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ‘ఓక్వుడ్ రెసిడెన్సీ కపిల్ హైదరాబాద్’ పేరిట సర్వీస్ అపార్ట్‌మెంట్‌ను మంగళవారం ప్రారంభించింది. ఈ సందర్భంగా ఓక్వుడ్ దక్షిణ, ఆగ్నేయాసియా డెరైక్టర్ మిచెల్ ప్రైజ్ విలేకరులతో మాట్లాడారు. ఆయనేమన్నారంటే... - హైదరాబాద్కొచ్చే అంతర్జాతీయ విమానాలు చాలా వరకు రాత్రిళ్లే ఇక్కడికి చేరుకుంటాయి. ఆ సమయంలో లగ్జరీ సదుపాయాలతో పాటు భద్రత కలిగిన అపార్ట్మెంట్ దొరకడం కష్టం. ఒకవేళ ఉన్నా బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, హిమాయత్‌నగర్ వంటి ప్రాంతాల్లోకి వెళ్లాలి. అంటే సిటీలోకి వెళ్లాలి. మళ్లీ ఉదయం మీటింగ్‌లకు వెళ్లాలంటే ట్రాఫిక్ సమస్య. ఇలాంటి సమస్యలకు పరిష్కారం చూపించేదే ‘ఓక్వుడ్ రెసిడెన్సీ కపిల్ హైదరాబాద్’. వెస్ట్రన్ స్టయిల్ కిచెన్స్, టీవీ, ఏసీ, స్విమ్మింగ్ పూల్, జిమ్, లాంజ్, బార్ అండ్ రెస్టారెంట్ వంటి 7 స్టార్ హోటల్స్‌లో ఉండే ప్రతి ఒక్క ఆధునిక వసతులూ ఇందులో పొందవచ్చు. - ఇందులో మొత్తం 158 లగ్జరీ రెసిడెన్సీ యూనిట్లుంటాయి. యూనిట్ల విస్తీర్ణాలు 380 చదరపు అడుగుల నుంచి 1,069 చదరపు అడుగుల వరకూ ఉన్నాయి. ఇక ఒక రాత్రి బస చేయడానికి రూ.5వేల నుంచి 18 వేల వరకూ చెల్లించాల్సి ఉంటుంది. గ్రేడ్-ఏ కస్టమర్లకు ప్రత్యేకంగా రూపొందించిన ప్రాజెక్ట్ ఇది. ఇప్పటివరకు ఓక్వుడ్ సంస్థ దేశంలో బెంగళూరు, ముంబై, పుణె నగరాల్లో 5 ప్రాజెక్ట్‌లను నిర్మించింది. హైదరాబాద్‌లోని ప్రాజెక్ట్ 6వది. ఆసియాలో 28వ ప్రాజెక్ట్. - రూ.200 కోట్లతో అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరువలో శంషాబాద్‌లో ఓక్వుడ్ కపిల్ అంతర్జాతీయ హోటల్‌ను నిర్మించనున్నాం. ఇప్పటికే స్థల సేకరణ పూర్తయింది. వచ్చే ఏడాది నిర్మాణ పనులు ప్రారంభిస్తాం. రెండేళ్లలో దేశంలో మరో 4 ప్రాజెక్ట్‌లు నిర్మిస్తాం. అయితే వీటిని ఇప్పటికే ఉన్న నగరాల్లో కాకుండా.. ఢిల్లీ, గుర్గావ్, చెన్నై నగరాల్లో నిర్మిస్తాం. 2017లో ముంబైలో మరో ప్రాజెక్ట్‌ను నిర్మిస్తాం. - ఇప్పటివరకు ప్రీమియర్, రెసిడెన్సీ, అపార్ట్మెంట్ అనే మూడు రకాల బ్రాండ్ ప్రాజెక్ట్‌లను నిర్మిస్తున్నాం. కానీ, 2016లో కొత్తగా మరో బ్రాండ్‌తో కొనుగోలుదారుల ముందుకురానున్నాం. ఈ తొలి ప్రాజెక్ట్‌ను సింగపూర్‌లో నిర్మించనున్నాం. త్వరలో ఇండియాలో కూడా కొత్త బ్రాండ్‌తో ప్రాజెక్ట్‌లను నిర్మిస్తాం. -
పర్యాటకానికి అంతర్జాతీయ గుర్తింపు
మంత్రి అజ్మీర చందూలాల్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పర్యాటక రంగానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకువచ్చేందుకు కృషిచేయాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అజ్మీర చందూలాల్ అధికారులకు సూచించారు. తెలంగాణ టూరిజం కార్పొరేషన్ ఆధ్వర్యంలో సాగుతున్న వివిధ అభివృద్ధి పనులను సోమవారం ఆయన పర్యాటక భవన్లో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా తెలంగాణలో ప్రస్తుత పర్యాటక రంగం పరిస్థితి, భవిష్యత్ కార్యాచరణపై అధికారులతో చర్చించారు. రాష్ట్రంలోని అటవీ ప్రాంతాలతో పాటు అలీసాగర్ ప్రాజెక్టు వద్ద ఎకో టూరిజంను అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. కుంతాల, పాండవుల గుట్ట ప్రాంతాల్లో వాటర్‌ఫాల్స్ టూరిజం, మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోని అక్క మహాదేవి గుహల్లో కేవ్ టూరిజం అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళుతున్నామన్నారు. కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతాలు, కాకతీయుల కాలం నాటి విశాలమైన చె రువులను సుందరంగా తీర్చిదిద్దాలన్నారు. నల్గొండ జిల్లాలోని బుద్ధవనం, ఆదిలాబాద్ జిల్లాలోని కొమరంభీమ్ ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. పర్యాటక రంగాన్ని పోత్సహించేందుకు ప్రతి జిల్లాలో మేనేజర్లను నియమించాలని అధికారులను ఆదేశించారు. -
పదేళ్ల కిందటే ‘స్వచ్ఛ’ గ్రామం
* ఆసియాలోనే పరిశుభ్రమైన పల్లెగా ‘మావ్లిన్నోంగ్’ * 2003లోనే అంతర్జాతీయ గుర్తింపు మేఘాలయ: ఎక్కడ చూసినా పచ్చని పచ్చిక.. ప్రతి ఇంట్లో మరుగుదొడ్లు.. రహదారుల పక్కనే చెత్త వేసేందుకు వెదురుబుట్టలు.. ఇదంతా విదేశాల్లోని నగరాలు, గ్రామాల గురించి చెపుతున్న సంగతులు కాదు. మనదేశంలోని అత్యంత పరిశుభ్రమైన గ్రామం గురించిన విశేషాలివీ. ఇది మనదేశంలోనే కాదు ఆసియాలోనే పరిశుభ్రమైన గ్రామం. ఈశాన్య రాష్ట్రం మేఘాలయలో ఉంది ఈ చిన్న గ్రామం. దీని పేరు ‘మావ్లిన్నోంగ్’. ప్రధాని మోదీ పిలుపుతో ఇప్పుడు దేశంలోని ప్రతి నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో ప్రజలు స్వచ్ఛభారత్ అంటూ పరిశుభ్రతా కార్యక్రమాలను చేపడుతున్నారు. అయితే మావ్లిన్నోంగ్ ఎప్పటి నుంచో పరిశుభ్రమైన గ్రామంగా భాసిల్లుతోంది. అందువల్లే దీన్ని ఆసియాలోనే పరిశుభ్రమైన గ్రామంగా 2003లో ఇండియా డిస్కవరీ మేగజీన్ గుర్తించింది. 2007 నాటికే బహిరంగ మల విసర్జనకు స్వస్తి చెప్పిన మావ్లిన్నోంగ్ ప్రజలు గ్రామంలో ఉన్న 91 ఇళ్లలో నిర్మల్ భారత్ అభియాన్‌లో భాగంగా మరుగుదొడ్లు నిర్మించుకున్నారు. ‘‘నా చిన్నతనం నుంచే మా గ్రామం పరిశుభ్రంగా ఉంది. మా తాతల కాలం నుంచీ ఇలాగే ఉందని విన్నాం. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత’’ అని మావ్లిన్నోంగ్ గ్రామస్తుడు రెండార్ ఖోంగ్పోస్రెమ్ చెప్పాడు. ప్రతి రోజూ ఈ గ్రామాన్ని సుమారు 200 మంది పర్యాటకులు సందర్శిస్తుంటారు. ఇండియా డిస్కవరీ మేగజీన్ గుర్తింపు తర్వాత పర్యాటకుల సంఖ్య బాగా పెరిగింది. జర్మనీకి చెందిన కెర్లిన్ అలాంటి వారిలో ఒకరు. ఆమె 11 వారాలుగా ఈ గ్రామంలోనే బస చేస్తోంది. ఇంటర్నెట్లో చూసి ఈ గ్రామంలో పర్యటించేందుకు వచ్చినట్టు ఆమె తెలిపింది. ‘‘నేనే భారత్‌లో చాలా గ్రామాలను చూశాను. కానీ ఇది భిన్నమైనది. పరిశుభ్రంగా ఉంటుంది. తోటలు ప్రత్యేకమైనవి. ప్రకృతి సంరక్షణకు గ్రామంలో అందరూ పాటుపడతారు. అదే మావ్లిన్నోంగ్ ప్రత్యేకత. ఇది నాకు స్వర్గంలా కనిపిస్తోంది’’ అని కెర్లిన్ చెప్పారు. మరోవైపు మావ్లిన్నోంగ్ భవిష్యత్తులోనూ తన ప్రత్యేకతను చాటుకుంటుందని గ్రామస్తులు నమ్మకంగా చెపుతున్నారు. పరిసరాలను ఎలా శుభ్రంగా ఉంచుకోవాలనే విషయాన్ని నాలుగేళ్ల నుంచే చిన్నారులు కూడా ఇక్కడి స్కూళ్లలో నేర్చుకుంటున్నారు. -
బాలీవుడ్ గాడ్‌మదర్.. షబానా అజ్మీ
ఏకంగా ఐదుసార్లు ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకున్న ఘనత... అందులోనూ వరుసగా మూడేళ్లు ఈ అవార్డు అందుకున్న ఘనత ఆమె సొంతం. రంగస్థల పునాదిని విడవకుండానే అంతర్జాతీయ గుర్తింపు సాధించిన ఘనత కూడా ఆమెకే చెల్లింది. పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేసేందుకు కాలేజీలో చదువుకున్న మనస్తత్వ శాస్త్రం ఆమెకు బాగానే ఉపకరించింది. వైవిధ్య భరితమైన పాత్రలు, విలక్షణమైన నటనకు చిరునామా షబనా అజ్మీ. హైదరాబాద్‌లో సాంస్కృతిక వాతావరణం గల కుటుంబంలో పుట్టింది. తల్లి షౌకత్ అజ్మీ రంగస్థల నటిగా ప్రసిద్ధురాలు. తండ్రి కైఫీ అజ్మీ సుప్రసిద్ధ కవి. వారిద్దరూ కమ్యూనిస్టు పార్టీ సభ్యులే. వారి ఇల్లు ఎప్పుడూ కమ్యూనిస్టు పార్టీ సభ్యులతో సందడి సందడిగా ఉండేది. అలా చిన్నప్పటి నుంచే వామపక్ష భావజాలం మధ్య పెరిగింది షబానా. ఆమె సినిమాల్లోనూ ఆ భావజాల ప్రభావమూ కనిపిస్తుంది. ఆమె బాల్యంలోనే అజ్మీ కుటుంబం బాంబేకి తరలిపోయింది. షబానా అక్కడే సెయింట్ జేవియర్ కాలేజీ నుంచి సైకాలజీలో డిగ్రీ పూర్తిచేసింది. తర్వాత నటనపై ఆసక్తితో పుణేలోని ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో (ఎఫ్టీఐఐ) చేరింది. ఎఫ్టీఐఐ 1972 బ్యాచ్‌లో టాపర్‌గా నిలిచింది. ‘అంకుర్’మే ఆరంభం... షబానా నట ప్రస్థానం ‘అంకుర్’తో ప్రారంభమైంది. మరో ‘హైదరాబాదీ’ శ్యామ్ బెనగళ్‌కు దర్శకుడిగా ఇదే తొలిచిత్రం. హైదరాబాద్‌లో జరిగిన నిజజీవిత సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించడం మరో విశేషం. ఇందులో షబానా సహజ నటన సినీ విమర్శకుల ప్రశంసలు పొందింది. తొలిచిత్రమే ఆమెకు ఉత్తమ నటిగా 1975లో జాతీయ అవార్డు తెచ్చిపెట్టింది. నిజానికి ‘అంకుర్’ కంటే ముందే కె.ఎ.అబ్బాస్ చిత్రం ‘ఫాస్లా’, కాంతిలాల్ రాథోడ్ చిత్రం ‘పరిణయ్’లకు షబానా సంతకాలు చేసింది. వాటి తర్వాత సంతకం చేసిన ‘అంకుర్’ ముందుగా విడుదలైంది. ఆ తర్వాత ‘అర్థ్’ (1983), ఖాందార్ (1984), ‘పార్’ (1985), గాడ్ మదర్ (1999) కూడా షబానాకు జాతీయ అవార్డులు తెచ్చిపెట్టాయి. బాలీవుడ్లో సమాంతర సినిమాల స్వర్ణయుగం మొదలైన కాలంలో తెరపైకి వచ్చిన షబానాకు అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది ఇలాంటి సినిమాలతోనే. అలాగని ఆమె ‘అమర్ అక్బర్ ఆంథోనీ’ వంటి కమర్షియల్ సినిమాలూ చేయకపోలేదు. సత్యజిత్ రే దర్శకత్వంలో ‘షత్రంజ్కే ఖిలాడీ’, మృణాల్‌సేన్ దర్శకత్వంలో ఖాందార్, జెనెసిస్, ఏక్ దిన్ అఛానక్ వంటి చిత్రాలు ఆమెకు పేరు తెచ్చిపెట్టాయి. సినిమాల్లో తలమునకలుగా ఉంటూనే, రంగస్థలంపైనా విరివిగా ప్రదర్శనలు ఇచ్చే షబానా అంకితభావం హాలీవుడ్‌నూ ఆకట్టుకుంది. జాన్ ష్లెసింగర్ దర్శకత్వంలో ‘మేడమ్ సౌసాజ్కా’, రోలండ్ జాఫీ దర్శకత్వంలో ‘సిటీ ఆఫ్ జాయ్’ వంటి హాలీవుడ్ చిత్రాల్లో షబానా నటించింది. సినీ కెరీర్ ఊపులో ఉన్న సమయంలోనే బాలీవుడ్ గీతరచయిత జావేద్ అక్తర్‌ను పెళ్లాడింది. పెళ్లి తర్వాత సైతం ఆమె ‘ఫైర్’ వంటి సాహసోపేతమైన సినిమాల్లోనూ నటించింది. దీపా మెహతా చిత్రం ‘వాటర్’లో శకుంతల పాత్ర కోసం షబానా గుండు చేయించుకుంది. దీనిపై వివాదాలు తలెత్తడంతో కొంత షూటింగ్ తర్వాత అటకెక్కింది. ఐదేళ్ల తర్వాత తిరిగి షూటింగ్ చేపట్టినా, షబానా స్థానంలో సీమా బిశ్వాస్ ఆ పాత్ర ధరించింది. సామాజిక చైతన్యశీలి... షబానా నటనకు మాత్రమే పరిమితం కాలేదు. సామాజిక కార్తకర్తగానూ ఆమెది చురుకైన పాత్ర. బాలలు, మహిళలు, అట్టడుగు వర్గాల వారి హక్కుల కోసం పలు ఆందోళనల్లో పాల్గొంది. మత సామరస్యం కోసం ఢిల్లీ నుంచి మీరట్‌కు నాలుగు రోజుల యాత్రలోనూ పాల్గొంది. ఎయిడ్స్ బాధితులు, హెచ్ఐవీ పాజిటివ్ చిన్నారుల కోసం ప్రచారంలో చురుగ్గా పాల్గొన్న షబానా, బెంగాలీ చిత్రం ‘మేఘ్లా ఆకాశ్’లో ఎయిడ్స్ రోగులకు చికిత్స చేసే వైద్యురాలి పాత్రలో సహజ నటనను ప్రదర్శించింది. భారత ప్రభుత్వం ఆమెను 1997లో రాజ్యసభకు నామినేట్ చేసింది. ఐక్యరాజ్య సమితి ఆమెను 1998లో గుడ్‌విల్ అంబాసిడర్‌గా నియమించింది. భారత ప్రభుత్వం ఆమెను 1988లో ‘పద్మశ్రీ’, 2012లో ‘పద్మభూషణ్’ అవార్డులతో సత్కరించింది. ఇవేకాకుండా, నటిగా షబానా పలు అంతర్జాతీయ అవార్డులనూ పొందింది. - పన్యాల జగన్నాథదాసు -
క్రీడల్లో దేశానికి పేరుతేవాలి
చిత్తూరు(టౌన్), న్యూస్‌లైన్: క్రీడల్లో దేశానికి మంచి పేరు తేవాలని చిత్తూరు ఎమ్మెల్యే సీకేబాబు క్రీడాకారులకు సూచించారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్వంలో చిత్తూరులోని మెసానికల్ క్రీడా మైదానంలో 59వ రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ అండర్-14, 17 బాలబాలికల బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్-2013 పోటీలు గురువారం ప్రారంభమయ్యాయి. క్రీడలను ఎమ్మెల్యే సీకే బాబు ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రస్థాయి పోటీలకు చిత్తూరు ఆతిథ్యం ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు. క్రీడాకారులు గెలుపోటములను సమానంగా తీసుకోవాలని సూచించారు. డీఈవో ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ షటిల్ బ్యాడ్మింటన్ క్రీడలో దేశానికి అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు ఉందన్నారు. రాష్ట్రానికి చెందిన సైనా నెహ్వాల్ ఒలింపిక్స్‌లో పతకం సాధించిన విషయం గుర్తుచేశారు. శుక్ర, శనివారాల్లో పోటీలు జరుగుతాయన్నారు. చిత్తూరు డీఎస్పీ రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ శారీరక, మానసిక ఆరోగ్యానికి క్రీడలు దోహదపడతాయని చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే, డీఈవో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో డీఎస్డీవో సయ్యద్, చిత్తూరు డీవైఈవో చిట్టిబాబు, కడప ఆర్ఐపీ (రీజనల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్) భానుమూర్తి, రాష్ట్ర పర్యవేక్షకులు రాఘవరెడ్డి, జిలానీబాషా, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి రవీంద్రారెడ్డి, రెండో పట్టణ సీఐ సుధాకర్‌రెడ్డి, ట్రాఫిక్ సీఐ గిరిధర్ తదితరులు పాల్గొన్నారు. రెండో రౌండ్లోకి పలు జట్లు బ్యాడ్మింటన్ పోటీలు గురువారం మధ్యాహ్నం హోరాహోరీగా సాగాయి. అండర్-14 బాలుర విభాగంలో ప్రకాశంపై వెస్ట్ గోదావరి, కరీంనగర్‌పై కర్నూలు, నల్గొండపై వరంగల్, నెల్లూరుపై చిత్తూరు, ఆదిలాబాద్‌పై గుంటూరు, కృష్ణాపై హైదరాబాద్ జట్లు విజయం సాధించి రెండో రౌండ్లోకి ప్రవేశించాయి. అలాగే బాలికల విభాగంలో శ్రీకాకుళంపై చిత్తూరు, వరంగల్‌పై హైదరాబాద్, ఆదిలాబాద్‌పై హైదరాబాద్, కరీంనగర్‌పై కృష్ణా, నెల్లూరుపై నిజామాబాద్, వెస్ట్ గోదావరిపై కడప జట్లు గెలు పొందాయి. అండర్-17 బాలుర విభాగంలో నిజామాబాద్‌పై ప్రకాశం, గుంటూరుపై వరంగల్, ఆదిలాబాద్‌పై కడప, మెదక్‌పై కృష్ణా, మహబూబ్‌నగర్‌పై వైజాగ్, కరీంనగర్‌పై శ్రీకాకుళం, బాలికల విభాగంలో శ్రీకాకుళంపై విజయనగరం, ఆదిలాబాద్‌పై కరీంనగర్, ఈస్ట్ గోదావరిపై రంగారెడ్డి, నల్గొండపై వెస్ట్ గోదావరి, కడపపై వైజాగ్ జట్లు గెలుపొందాయి.