Taliban Govt Asks to China for Help International Recognition - Sakshi
Sakshi News home page

ఆ గుర్తింపు కోసం తాలిబన్‌ల పాకులాట.. చైనాతో చర్చలు! రెచ్చిపోయి అమెరికాపై..

Published Tue, Jan 18 2022 5:27 PM | Last Updated on Tue, Jan 18 2022 7:13 PM

Taliban Govt Asks China To Help International Recognition - Sakshi

గ్లోబల్‌ పొలిటికల్‌ సినారియోలో మరో ఆసక్తికర పరిణామం ఒకటి చోటు చేసుకుంది. అఫ్గనిస్థాన్‌లో పాలన కొనసాగిస్తున్న తాలిబన్‌ ప్రభుత్వం..  ఇప్పుడు చైనా సాయం కోరుతోంది. ఇదే అదనుగా అమెరికాపై విమర్శలు ఎక్కుపెట్టింది డ్రాగన్‌ కంట్రీ.


తమ ఇస్టామిక్‌ ఎమిరేట్‌ ప్రభుత్వానికి(తాలిబన్‌ ప్రభుత్వం).. అంతర్జాతీయ సమాజంలో గుర్తింపు దక్కేలా చూడాలంటూ చైనాను వేడుకుంటున్నారు తాలిబన్లు. తద్వారా ఓవర్సీస్‌లో నిలిచిపోయిన 9 బిలియన్‌ డాలర్ల నిధులకు మోక్షం దక్కుతుందేమోనని ఆశాభావం వ్యక్తం చేస్తోంది. అంతర్జాతీయ సమాజం నుంచి గుర్తింపు కోసం కావాల్సిన పరిస్థితులన్నీ ఇప్పుడు మాకు ఉన్నాయి. చైనా ఇస్లామిక్‌ ఎమిరేట్‌కు పెద్ద దిక్కుగా సాయం చేయాలని కోరుకుంటున్నాం అని తాలిబన్‌ ప్రతినిధి బిలాల్‌ కరిమి మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 

నో రికగ్నిషన్‌
అమెరికా, అమెరికా మిత్రపక్ష దేశాలు, రష్యా, చైనా.. ఇలా ఏ దేశం కూడా ఇప్పటిదాకా అఫ్గనిస్థాన్‌లోని తాలిబన్‌ ప్రభుత్వాన్ని గుర్తించింది లేదు. ఉగ్రవాదంతో ముడిపడి ఉండడం, మానవ హక్కుల్ని కాలరాయడం, అమ్మాయిలను విద్యకు దూరం చేయడంతో పాటు ప్రస్తుతం తాలిబన్‌ కేబినెట్‌లో ఉన్న సభ్యులు కొందరిపై అమెరికా, ఐరాస ఆంక్షలు ఉన్నాయి. అందుకే అగష్టులో అధికారం చేపట్టినప్పటికీ.. ఇప్పటిదాకా తాలిబన్‌ ప్రభుత్వానికి అంతర్జాతీయ సమాజం గుర్తింపు దక్కలేదు. 

నివేదికలతో తారుమారు
అయితే అధికారం చేపట్టాక సంస్కరణలకు పెద్ద పీట వేస్తామని తాలిబన్లు ప్రకటించుకున్నారు. ఉగ్రవాదాన్ని ప్రొత్సహించబోమని, అఫ్గనిస్థాన్‌లో ఉగ్రచర్యల కట్టడికి ప్రయత్నిస్తామని, ఉమెన్‌ ఫ్రెండ్లీ ప్రభుత్వంగా కొనసాగుతామని ప్రకటించుకుంది. ఈ తరుణంలో పరిస్థితులు అనుకూలిస్తాయని భావిస్తుండగా.. సొంత దేశంలో కొన్ని ఘటనలు(వ్యతిరేక ఉద్యమాలు), 2022లో దేశం తీవ్ర ఆహార సంక్షోభం ఎదుర్కొనబోతోందని ఐరాస ఇచ్చిన హెచ్చరికల నివేదికతో గుర్తింపు ఆలస్యం అవుతోంది. ఈ తరుణంలో రంగంలోకి దిగిన తాలిబన్లు.. చైనా సంప్రదింపుల ద్వారా గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నారు. 

ఈమధ్యే చైనా రాయబారి వాంగ్‌ యూతో సమావేశమైన తాలిబన్‌ మంత్రి సిరాజుద్దీన్‌ హక్కానీ.. చైనా మద్దతు కోరినట్లు తెలుస్తోంది. దీనికి సానుకూల స్పందన లభించినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ భేటీలో అమెరికన్‌,యూరోపియన్‌ బ్యాంకుల నిధులు నిలిచిపోవడానికి అమెరికానే కారణమని ఇరువర్గాలు ఆరోపించినట్లు సమాచారం. ‘ఆర్థిక ఆంక్షల ద్వారా అఫ్గన్‌ల మీద ప్రతీకారం తీర్చుకోవడం అమెరికాకు మంచిది కాదు’ అంటూ వాంగ్‌ వ్యాఖ్యలు చేయడం విశేషం. ఇదిలా ఉంటే ఎఫ్‌బీఐ మోస్ట్‌ వాంటెడ్‌ లిస్ట్‌లో తాలిబన్‌ మంత్రి హక్కానీ ఉన్నాడు.

చదవండి: తాలిబన్ల పిలుపునకు స్పందన.. అమెరికా సాయం, యూఎన్‌ భారీ ప్రణాళిక

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement