చిత్తూరు(టౌన్), న్యూస్‌లైన్: క్రీడల్లో దేశానికి మంచి పేరు తేవాలని చిత్తూరు ఎమ్మెల్యే సీకేబాబు క్రీడాకారులకు సూచించారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్వంలో చిత్తూరులోని మెసానికల్ క్రీడా మైదానంలో 59వ రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ అండర్-14, 17 బాలబాలికల బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్-2013 పోటీలు గురువారం ప్రారంభమయ్యాయి. క్రీడలను ఎమ్మెల్యే సీకే బాబు ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రస్థాయి పోటీలకు చిత్తూరు ఆతిథ్యం ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు.
క్రీడాకారులు గెలుపోటములను సమానంగా తీసుకోవాలని సూచించారు. డీఈవో ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ షటిల్ బ్యాడ్మింటన్ క్రీడలో దేశానికి అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు ఉందన్నారు. రాష్ట్రానికి చెందిన సైనా నెహ్వాల్ ఒలింపిక్స్‌లో పతకం సాధించిన విషయం గుర్తుచేశారు. శుక్ర, శనివారాల్లో పోటీలు జరుగుతాయన్నారు. చిత్తూరు డీఎస్పీ రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ శారీరక, మానసిక ఆరోగ్యానికి క్రీడలు దోహదపడతాయని చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే, డీఈవో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో డీఎస్‌డీవో సయ్యద్, చిత్తూరు డీవైఈవో చిట్టిబాబు, కడప ఆర్‌ఐపీ (రీజనల్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్) భానుమూర్తి, రాష్ట్ర పర్యవేక్షకులు రాఘవరెడ్డి, జిలానీబాషా, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి రవీంద్రారెడ్డి, రెండో పట్టణ సీఐ సుధాకర్‌రెడ్డి, ట్రాఫిక్ సీఐ గిరిధర్ తదితరులు పాల్గొన్నారు.
రెండో రౌండ్‌లోకి పలు జట్లు
బ్యాడ్మింటన్ పోటీలు గురువారం మధ్యాహ్నం హోరాహోరీగా సాగాయి. అండర్-14 బాలుర విభాగంలో ప్రకాశంపై వెస్ట్ గోదావరి, కరీంనగర్‌పై కర్నూలు, నల్గొండపై వరంగల్, నెల్లూరుపై చిత్తూరు, ఆదిలాబాద్‌పై గుంటూరు, కృష్ణాపై హైదరాబాద్ జట్లు విజయం సాధించి రెండో రౌండ్లోకి ప్రవేశించాయి. అలాగే బాలికల విభాగంలో శ్రీకాకుళంపై చిత్తూరు, వరంగల్‌పై హైదరాబాద్, ఆదిలాబాద్‌పై హైదరాబాద్, కరీంనగర్‌పై కృష్ణా, నెల్లూరుపై నిజామాబాద్, వెస్ట్ గోదావరిపై కడప జట్లు గెలు పొందాయి. అండర్-17 బాలుర విభాగంలో నిజామాబాద్‌పై ప్రకాశం, గుంటూరుపై వరంగల్, ఆదిలాబాద్‌పై కడప, మెదక్‌పై కృష్ణా, మహబూబ్‌నగర్‌పై వైజాగ్, కరీంనగర్‌పై శ్రీకాకుళం, బాలికల విభాగంలో శ్రీకాకుళంపై విజయనగరం, ఆదిలాబాద్‌పై కరీంనగర్, ఈస్ట్ గోదావరిపై రంగారెడ్డి, నల్గొండపై వెస్ట్ గోదావరి, కడపపై వైజాగ్ జట్లు గెలుపొందాయి.
క్రీడల్లో దేశానికి పేరుతేవాలి
Published Fri, Dec 27 2013 4:15 AM | Last Updated on Sat, Sep 2 2017 1:59 AM
Advertisement
Advertisement