తెలుగు సినిమాలకు అంతర్జాతీయ గుర్తింపు గొప్ప విషయం  | TS Minister Talasani Srinivas Yadav About Telugu Movies International Recognition | Sakshi
Sakshi News home page

తెలుగు సినిమాలకు అంతర్జాతీయ గుర్తింపు గొప్ప విషయం 

Published Sun, Oct 16 2022 1:20 AM | Last Updated on Sun, Oct 16 2022 1:20 AM

TS Minister Talasani Srinivas Yadav About Telugu Movies International Recognition - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలుగు సినిమాలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడం ఎంతో గొప్ప విషయమని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ పేర్కొన్నారు. ఇటీవల జాతీయస్థాయిలో ఉత్తమ చిత్రంగా ఎంపికై రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకున్న కలర్‌ఫొటో చిత్ర దర్శకు డు సందీప్‌రాజ్‌ శనివారం వెస్ట్‌ మారేడ్‌పల్లిలోని మంత్రి శ్రీనివాస్‌ యాదవ్‌ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశా రు.

ఈ సందర్భంగా సందీప్‌ రాజ్‌ తనకు లభించిన అవా ర్డు, ప్రశంసా పత్రాన్ని మంత్రికి చూపించారు. మంత్రిని కలిసిన వారిలో యాదవ్‌ సంఘం రాష్ట్ర యువజన నాయకులు నవీన్‌ యాదవ్, రాహుల్‌ యాదవ్, ప్రదీప్, వంశీరెడ్డి, గంగాధర్‌ ఉన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement