సాక్షి, హైదరాబాద్: నగర పరిధిలో వర్షాలతో ప్రజలకు ఏ ఇబ్బంది కలగలేదని.. జీహెచ్‌ఎంసీ అద్భుతంగా పని చేస్తోందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో నగర వర్షాలపై సమీక్ష నిర్వహించిన ఆయన.. భయంకర పరిస్థితులు ఉన్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని తోసిపుచ్చారు.
హైదరాబాద్ లో భారీ వర్షం కురిసినప్పటికి ప్రజలకు ఇబ్బంది కలుగలేదు. మంత్రి కేటీఆర్ దూరదృష్టితో SNDP వర్క్ ఫలితం ప్రజలను ఇబ్బందుల నుంచి తప్పించింది. జీహెచ్ఎంసీ పరిధిలో పనిచేస్తోన్న అన్ని శాఖలను నేను అభినందిస్తున్నా. GHMC కంట్రోల్ రూమ్ మూడు షిఫ్ట్‌ల్లో పనిచేస్తోంది. గత ప్రభుత్వాలు వర్షాల సమస్యలను తప్పించుకొని పారిపోయాయి.కానీ, బీఆర్ఎస్ మాత్రం సమస్యను సమర్థవంతంగా ఎదుర్కొంటోంది.
మరోవైపు.. ట్రాఫిక్ సమస్య పరిష్కరించేందుకు పోలీస్ కృషి చేస్తోంది. గాజుల రామరంలో లే అవుట్ సరిగా లేకపోవడం వల్ల ఇబ్బంది అవుతుంది. నాలా పనుల్లో 36కుగానూ.. 30 పూర్తి అయ్యాయి. నగరంలో ఎడతెరిపిలేని వర్షాలతో ఏదో జరిగిపోతోందని.. భయంకరమైన పరిస్థితులు నెలకొన్నాయని ప్రచారం ఉత్తదే అని తేల్చేశారాయన. హైదరాబాద్ ప్రజల కోసం ప్రభుత్వం, జిహెచ్ఎంసి పనిచేస్తున్నాయని.. ఏదైనా సమస్య ఉంటే టోల్‌ఫ్రీ నెంబర్స్‌కు ఫిర్యాదు చేయాలని కోరారాయన. అలాగే.. భారీ వర్ష సూచన ఉన్నప్పుడు ప్రజలు రోడ్ల మీదకు రావొద్దని విజ్ఞప్తి చేశారు. ఎప్పటికప్పుడు సెల్‌ఫోన్లకు EVDM ద్వారా అప్రమత్తం చేస్తున్నామని.. అసలు ఈ కాన్సెప్ట్ దేశంలో ఎక్కడా లేదని మంత్రి తలసాని పేర్కొన్నారు.
ట్రాఫిక్ వల్లే ఇబ్బంది
జీహెచ్ఎంసీ పరిధిలో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ తెలిపారు. ‘‘వచ్చిన ఫిర్యాదులను అదే రోజు క్లియర్ చేస్తున్నాం. జీహెచ్ఎంసీ పరిధిలో 2వేలకు పైగా సిబ్బంది ఫీల్డ్ పై ఉన్నారు అని తెలిపారామె. అయితే.. ట్రాఫిక్ సమస్య వల్ల కొంత ఇబ్బంది అవుతోంది. వర్షం కురిసిన తరువాత రెండు గంటల సమయం పడుతుందని వెల్లడించారు. అలాగే.. జీహెచ్‌ఎంసీ పరిధిలో 11సెంటిమిటర్ల వర్షపాతం నమోదు అయ్యిందని.. ప్రజలు అత్యవసరం అయితేనే బయటకు రావాలని కోరారామె.
పాత భవనాలకు నోటీసులిచ్చాం
జీహెచ్‌ఎంసీ పరిధిలో జులై నెలలో పడాల్సిన వర్షం కంటే.. 60శాతం ఎక్కువగా పడిందని జీహెచ్ఎంసి కమిషనర్ రొనాల్డ్ రోస్ తెలిపారు. ‘‘జీహెచ్ఎంసి పరిధిలో 455 టీమ్స్ పనిచేస్తున్నాయి. 399 మాన్‌సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాం. DRF టీమ్స్ 30 ఉన్నాయి. 197 మోటార్లు నీళ్లను తీసివేయ్యడానికి జిహెచ్ఎంసి పరిధిలో ఉన్నాయి. 9 టీమ్స్ గార్బేజ్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసాము. చుట్టుపక్కల 185 చెరువులు ఉన్నాయి.. 35 చెరువులు FTL వరకు వచ్చాయి. అన్ని చెరువులను మానిటరింగ్ చేస్తున్నాం. 238 వాటర్ లాగింగ్ పాయింట్స్ జిహెచ్ఎంసి పరిధిలో ఉన్నాయని తెలిపారాయన.
సర్కిల్ వారిగా వర్షపాతంను జిహెచ్ఎంసి మానిటరింగ్ చేస్తోందని.. శిథిలావస్థకు చేరిన భవనాలను గుర్తించి...నోటీసులు ఇచ్చినట్లు వెల్లడించారాయన. అలాగే.. నగరంలో సెల్లార్స్ తవ్వడంపై నిషేధం ఉడడంతో కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారాయన. ప్రస్తుతం నగరంలో 130 రిలీఫ్ సెంటర్స్ను సిద్ధం చేసుకున్నామని, ప్రజలకు సమస్యలు వస్తే గనుక అక్కడికి తరలిస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment