Hyderabad: Heavy Rains, IMD Issues Orange Alert - Sakshi
Sakshi News home page

Orange Alert to Hyderabad: హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం.. ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ

Published Mon, Jul 24 2023 6:21 PM | Last Updated on Mon, Jul 24 2023 8:20 PM

Hyderabad: Heavy Rains, Imd Issues Orange Alert - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌లో వరుణుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఇప్పటికే గత వారం నుంచి ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తుండగా మరో రెండురోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈమేరకు సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలంగాణ రాష్ట్రానికి రెడ్‌ అలెర్ట్‌ జారీ చేయగా.. హైదరాబాద్‌కు ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ చేసింది.

హైదరాబాద్‌లో కుంభవృష్టి
హైదరాబాద్‌లో కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో నగరంలోని రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. పలుచోట్ల తీవ్ర ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ట్యాంక్‌బండ్‌, ఖైరతాబాద్‌-పంజాగుట్ట, బేగంపేట- సికింద్రాబాద్‌, గచ్చిబౌలి ఐకియా రూట్‌లో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. హైటెక్‌ సిటీ నుంచి జూబ్లీ చెక్‌పోస్టు వరకు వాహనాలు నిలిచిపోయాయి. అప్రమత్తమైన జీహెచ్‌ఎంసీ అధికారులు .. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించారు.

► కంట్రోల్‌ రూం నంబర్లు: 040-2111 1111, 9000113667, 
 

సోమవారం ఉదయం వానలు నుంచి కాస్త ఉపశమనం పొందామని నగర వాసులు అనుకున్నారో లేదో..  సాయంత్రం నుంచి భాగ్యనగరంలో భారీ వర్షం కురుస్తోంది. దీంతో ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. నగరంలోని ప్రధాన కూడలిలో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. ఈ క్రమంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని తెలిపారు. 


కాగా దక్షిణ ఒడిస్సా - ఉత్తర ఆంధ్రప్రదేశ్ దగ్గరలోని వాయువ్య బంగాళాఖాతం,  పరిసరాల్లోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయని తెలిపింది. ఈ అల్పపీడనం జూలై 26వ తేదీన వాయుగుండంగా మారుతుందని అంచనా వేసింది.

 


నగరం.. జలమయం

►అంబర్పేట్ నుండి దిల్సుఖ్ నగర్ కు వెళ్లే ప్రధాన రహదారి మూసారాంబాగ్ బ్రిడ్జిపై వర్షం నీరు భారీగా నిలిచిపోయింది. దీంతో వాహనదారుల ఇక్కట్లు పడుతున్నారు. ప్రత్యామ్నాయ రహదారి గోల్నాక నుంచి  వెళ్ళాలంటున్న పోలీసు వాహనదారులకు సూచిస్తున్నారు.

►నిజాంపేట....కేపీహెచ్‌బీ. ....కూకట్ పల్లి....మూసాపేటలలోనూ భారీ వర్షం కురుస్తోంది. వానల కారణంగా పలు చోట్ల రోడ్లపై భారీగా నీరు చేరడంతో చెరువును తలపిస్తోంది. 

►రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ గండిపేట్ కిస్మత్పూర్ అత్తాపూర్ పలు ప్రాంతాలలో గంట ఒక పైగా భారీ వర్షం కురవడంతో రోడ్లంతా జలమయం అయిపోయాయి. ఒక్కసారిగా భారీ వర్షం పడటంతో పలు కాలనీలో హైవే రోడ్లపై కూడా భారీ ట్రాఫిక్ జామ్ తో పాటు భారీ వర్షం కురుస్తుంది.

చదవండి: ప్రభుత్వ ఉద్యోగులుగా వీఆర్‌ఏలు.. ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement