traffic jam
-
తప్పిన ముప్పు.. నడిరోడ్డుపై డీజిల్ ట్యాంకర్ బోల్తా
చిలకలగూడ: ట్రాఫిక్ రద్దీ ప్రాంతంలో నడిరోడ్డుపైన ఓ డీజిల్ ట్యాంకర్ బోల్తా పడింది. ఒక్కసారిగా జరిగిన ఈ ప్రమాదంతో అటు పోలీసులు..ఇటు ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో అప్రమత్తమైన ట్రాఫిక్, హైడ్రా, ఫైర్ విభాగాలు చాకచక్యంగా వ్యవహరించి పెను ప్రమాదాన్ని తప్పించాయి. వివరాల్లోకి వెళ్తే..చిలకలగూడ ట్రాఫిక్ ఠాణా పరిధిలోని మెట్టుగూడ ఆలుగడ్డబావి వద్ద సోమవారం ఉదయం 11.30 గంటల ప్రాంతంలో లోడుతో వెళ్తున్న డీజల్ ట్యాంకర్ వెనుక టైర్ పగిలి.. డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. దీంతో డీజిల్ లీకై రోడ్డుపై ప్రవహించింది. నిప్పు అంటుకోకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. సమాచారం అందుకున్న వెంటనే ఈస్ట్‌జోన్ ట్రాఫిక్ ఏసీపీ సంపత్‌కుమార్, చిలకలగూడ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు స్పందించి సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. వెంటనే ఫైరింజన్లను రప్పించి మంటలు అంటుకోకుండా భారీగా ఫోమ్‌ను స్ప్రే చేయించారు. మూడు క్రేన్ల సాయంతో బోల్తా పడిన ట్యాంకర్‌ను అక్కడి నుంచి తొలగించారు. జీహెచ్ఎంసీ సిబ్బంది సాయంతో రహదారులపై పడిన డీజిల్‌పై మట్టిపోయించారు. వాహనదారులకు ఎటువంటి ప్రమాదం జరగకుండా బారికేడ్లను అడ్డుపెట్టారు. సుమారు మూడున్నర గంటలు శ్రమపడి పరిస్థితిని చక్కదిద్దారు. ట్యాంకర్ వాహనం డ్రైవింగ్ చేస్తున్న మల్లాపూర్‌కు చెందిన చంద్రశేఖర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. అనుమానం వచి్చన ట్రాఫిక్ పోలీసులు డ్రైవర్ చంద్రశేఖర్‌కు బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు నిర్వహించగా, మద్యం తాగి వాహనం నడిపినట్లు నిర్ధారణ అయింది. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్‌లో 105 బీఏసీ (బ్లడ్ ఆల్కహాల్ కంటెంట్)పాయింట్లు వచ్చాయి. దీంతో చంద్రశేఖర్‌పై గోపాలపురం లా అండ్ ఆర్డర్ పోలీసులు కేసు నమోదు చేశారు. సకాలంలో స్పందించిన ట్రాఫిక్ పోలీసులను పలువురు అభినందించారు. మెట్టుగూడ కార్పొరేటర్ రాసూరి సునీత ఘటన స్థలానికి చేరుకుని తన వంతు సాయం అందించారు. -
సచివాలయానికి సిటీ బస్సులు.. ప్రయాణికులకు తిప్పలు
సాక్షి, సిటీబ్యూరో: సిటీ బస్సులు సచివాలయానికి పరుగులు తీశాయి. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ప్రభుత్వం వివిధ ప్రాంతాల నుంచి మహిళలను పెద్ద ఎత్తున తరలించింది. ఇందుకోసం సిటీబస్సులను ఏర్పాటు చేశారు. రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, భువనగరి, చౌటుప్పల్, సంగారెడ్డి తదితర శివారు జిల్లాలతో పాటు నగరంలోని వివిధ నియోజకవర్గాల నుంచి కూడా ప్రజలను పెద్ద సంఖ్యలో తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. దీంతో ప్రైవేట్ వాహనాలతో పాటు ఆర్టీసీ బస్సులు కూడా ఏర్పాటు చేశారు. బస్సులన్నీ సచివాలయం కోసమే ఏర్పాటు చేయడంతో సాధారణ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ముఖ్యంగా సాయంత్రం విధులు ముగించుకొని ఇళ్లకు చేరుకొనే ప్రభుత్వ, ప్రైవేట్ రంగానికి చెందిన ఉద్యోగులు, వ్యాపారులు, స్కూళ్లు, కాలేజీల నుంచి ఇళ్లకు బయలుదేరిన విద్యార్థులు గంటలతరబడి బస్సుల కోసం పడిగాపులు కాశారు. చివరకు ఆటోలు, తదితర ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లవలసి వచ్చింది. మరోవైపు సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమం నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ స్తంభించింది. అమీర్‌పేట్, ఖైరతాబాద్, నెక్లెస్ రోడ్డు, లిబర్టీ, ఇందిరాపార్కు లోయర్‌ట్యాంక్‌బండ్ తదితర చోట్ల వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి. వాహనదారులు గంటల తరబడి ట్రాఫిక్‌లోనే ఉండాల్సి వచ్చింది. -
రైతులపైకి టియర్ గ్యాస్
శంభు: పంజాబ్–హరియాణా సరిహద్దుల్లోని శంభు వద్ద 44వ నంబర్ జాతీయ రహదారిపై శుక్రవారం మధ్యాహ్నం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడం వంటి పలు డిమాండ్లతో రైతు సంఘాలు ఢిల్లీ చలో కార్యక్రమాన్ని ప్రకటించడం తెలిసిందే. ఇందులో భాగంగా రైతులు, రైతు సంఘాల నేతలతో కూడిన 101 మందితో కూడిన రైతు జాతా సరిగ్గా మధ్యాహ్నం ఒంటిగంటకు శంభులోని నిరసన దీక్షా శిబిరం నుంచి కాలినడకన బయలుదేరింది. సంయుక్త కిసాన్ మోర్చా(రాజకీయేతర), కిసాన్ మజ్దూర్ సంఘ్ జెండాలను చేబూనిన రైతులు కొన్ని మీటర్ల దూరం మాత్రమే వెళ్లగలిగారు. నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయని, ముందుకు రావద్దని పోలీసులు వారిని పదేపదే కోరారు. అయినప్పటికీ, రైతులు పలు అంచెల బారికేడ్లను దాటుకుని, వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుగా ఏర్పాటు చేసిన ఇనుప మేకులను, ఇనుప ముళ్ల కంచెను తొలగించారు. సిమెంట్ బారికేడ్లనూ దాటేందుకు యత్నించారు. ఇనుప కంచెను కొందరు ఘగ్గర్ నదిలోకి దొర్లించారు. దీంతో, పోలీసులు వారిపైకి పలు రౌండ్ల టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు. రైతులు టియర్ గ్యాస్ నుంచి రక్షణ కోసం తడి గన్నీ బ్యాగులతో కళ్లు, ముఖాన్ని కప్పేసుకున్నారు. బారికేడ్లపై నుంచి వస్తున్న వారిపైకి పోలీసులు లాఠీలు ఝళిపించారు. టియర్ గ్యాస్‌తో గాయపడిన కనీసం ఆరుగురు రైతులను అంబులెన్సుల్లో ఆస్పత్రులకు తరలించారు. రైతులు గాయపడిన నేపథ్యంలో జాతాను శుక్రవారానికి నిలిపి వేస్తున్నట్లు రైతు నేత సర్వాన్ సింగ్ చెప్పారు. తదుపరి కార్యాచరణపై చర్చించుకుని, నిర్ణయం తీసుకుంటామన్నారు. కాగా, అంబాలా జిల్లాలో గురువారం నుంచే నిషేధాజ్ఞలు అమలవుతున్నాయి. ఐదు, అంతకంటే ఎక్కువ మంది ఒకే చోట గుమికూడరాదని ప్రకటించారు. ముందు జాగ్రత్తగా శుక్రవారం జిల్లాలోని స్కూళ్లకు సెలవు ప్రకటించారు. అంబాలా జిల్లాలోని 11 గ్రామాల పరిధిలో ఈ నెల 6 నుంచి 9వ తేదీ వరకు మొబైల్ ఇంటర్నెట్ సేవలపై నిషేధం విధించారు. పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలను ఆ మార్గంలో మోహరించారు. -
బెంగళూరు ట్రాఫిక్.. ఇలా చేస్తే నో టెన్షన్!
‘రష్యాలో ఒక మూల నుంచి ఇంకో మూలకు కారులో ప్రయాణించాలంటే 149 గంటలు పడుతుంది. అంతసేపు ప్రయాణించినా ఇంకా రష్యాలోనే ఉంటాం. బెంగళూరు పరిస్థితి కూడా సరిగ్గా ఇలాగే ఉంది’ బెంగళూరు ట్రాఫిక్ రద్దీపై ఇటీవల ఎక్స్‌లో ఓ మహిళ పెట్టిన పోస్ట్ ఇది. ఇండియా ఐటీ క్యాపిటల్‌గా పేరుగాంచిన బెంగళూరులో ట్రాఫిక్ కష్టాలు నిత్యకృత్యం. బెంగళూరు వాసులు రోడ్డు మీదకు వచ్చారంటే నరకప్రాయమే. ట్రాఫిక్ రద్దీతో గంటలకొద్దీ రోడ్లపై గడపాల్సి ఉంటుంది. తమ ట్రాఫిక్ కష్టాలను సోషల్ మీడియా వేదికగా ఏకరువు పెడుతుంటారు. జోకులు, సెటైర్లు కూడా షేర్ చేస్తుంటారు.బెంగళూరు మెట్రో సిటీలో జనాభా అంతకంతకు పెరుగుతోంది. ప్రస్తుతంలో బెంగళూరు మహా నగరంలో దాదాపు 1.4 కోట్ల మంది నివసిస్తున్నారు. పెరుగుతున్న జనాభా కారణంగా వ్యక్తిగత వాహనాల వినియోగం కూడా అధికం కావడంతో ట్రాఫిక్ రద్దీ నానాటికీ ఎక్కువవుతోంది. నగర రహదారులు వాహనాలతో కిక్కిరిసిపోతున్నాయి. ఫలితంగా ఎక్కడా చూసినా ట్రాఫిక్ జామ్‌లే దర్శనమిస్తున్నాయి. ఈ కష్టాల నుంచి గట్టెక్కడానికి ట్రాఫిక్‌ను నియంత్రించే వ్యూహాత్మక, సమగ్ర విధానం చాలా అవసరమని బెంగళూరు వాసులు అభిప్రాయపడుతున్నారు.ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం చేయాల్సిన వాటి గురించి బెంగళూరు వాసి ఒకరు ఎక్స్‌లో పెట్టిన పోస్ట్ తాజాగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. వచ్చే ఐదేళ్లలో చేపట్టాల్సిన చర్యల గురించి ప్రస్తావించడం ఆలోచింపజేస్తోంది. బెంగళూరులో ప్రస్తుతం 1.05 కోట్ల ప్రైవేటు వాహనాలు ఉండగా, గత అక్టోబర్ నెలలో కొత్తగా 70 వేల ప్రైవేటు వెహికిల్స్ రోడ్డెక్కినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. బెంగళూరులో ట్రాఫిక్ రద్దీకి ఎక్కువగా (87.6 శాతం) ప్రైవేటు వాహనాలు కారణమవుతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే బెంగళూరులో ట్రాఫిక్ మరింత నరకప్రాయం అవుతుంది. ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు ప్రభుత్వం దీర్ఘకాలిక చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి 5 ఏళ్లలో చేపట్టాల్సిన చర్యలు..1. బెంగళూరు జనాభాలో ప్రస్తుతం 10 శాతం మంది మాత్రమే ప్రజా రవాణా వ్యవస్థను వినియోగిస్తున్నారు. ఈ సంఖ్యను 70 శాతానికి పెంచాలి.2. ఆర్టీసీ బస్సు, మెట్రో రైలు, సైకిల్ రైడ్ వంటి బహుముఖ ప్రయాణాలను ప్రోత్సహించాలి.3. ఆక్రమణలు తొలిగించి వీధులను ప్రయాణానికి అనువుగా మార్చాలి. పాదచారులు ఏ ఆటంకాలు లేకుండా నడిచేలా ఉండాలి.చదవండి: ఇండియా సిలికాన్ సిటీలో సిగ్నల్ దాటాలంటే చుక్కలే4. బెంగళూరులో బస్సుల సంఖ్య పెంచాలి. పెద్ద బస్సులతో పాటు మినీ బస్సులు కూడా అవసరం. నివాస ప్రాంతాల నుంచి మెట్రో రైలు, పెద్ద బస్సులకు అనుసంధానంగా మినీ బస్సులు నడపాలి.5. నగరంలోని అన్ని ప్రాంతాలను కవర్ చేస్తూ, ఎక్కువ మంది ప్రయాణించేలా మెట్రో రైలు పరిధిని విస్తరించాలి. సబర్బన్ రైలు సేవలను కూడా విస్తృతం చేయాలి.6. ఫుట్‌పాత్‌లు, సైకిల్, బస్ లేన్లకు ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రయాణం సాఫీగా సాగేలా చూడాలి. BENGALURU city is now home to 1.4 crore people & 1.05 crore private vehiclesThe city added around 70k new private vehicles in the last month, with Private vehicles now dominating 87.6% of trafficSteps needed to be taken during the next 5 years as a major priority for the city… pic.twitter.com/ulagWNybVR— Karnataka Weather (@Bnglrweatherman) November 21, 2024 -
సిటీకి తిరుగు ప్రయాణం.. రోడ్లపై ఫుల్ ట్రాఫిక్ జామ్!
సాక్షి, హైదరాబాద్: దీపావళి పండుగ ముగిసింది. దీంతో, సిటీ నుంచి గ్రామాలకు వెళ్లినవారు తిరుగు ప్రయాణం అయ్యారు. ఈ క్రమంలో వాహనాలతో రహదారులు రద్దీగా మారాయి. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగింది. ఫుల్ ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.దీపావళికి సొంతూరుకు వెళ్లిన వారు తిరిగి హైదరాబాద్‌కు వస్తుండటంతో జాతీయ రహదారి వాహనాలతో కిక్కిరిసింది. యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి టోల్‌ప్లాజా వద్ద వాహనాలు వరుసకట్టాయి. హైదరాబాద్ శివారు అబ్దుల్లాపూర్‌మెట్ నుంచి ఎల్బీనగర్ వరకు స్వల్పంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. విజయవాడ, నల్గొండ, ఖమ్మం, నార్కట్‌పల్లి, కోదాడ, సూర్యాపేట తదితర ప్రాంతాల నుంచి వాహనాలు వస్తున్నాయి. ఇటు, కరీంనగర్, నిజామాబాద్ నుంచి కూడా భారీగా వాహనాలు వస్తుండటంతో నగర శివారులో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. -
Bengaluru: కార్లు వదిలి నడుచుకుంటూ వెళ్లిన ప్రయాణికులు, ఎందుకంటే!
బెంగళూరు పేరు చెబితేనే ట్రాఫిక్ అంటూ వాహనదారులు భయపడిపోతూ ఉంటారు. కిలోమీటర్ దూరానికే గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుని సగం జీవితం రోడ్డుపైనే గడపాల్సి వస్తుందంటూ తరచూ నగరవాసులు సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటారు. సాధారణ సమయంలోనే ఇలా ఉంటే.. అదే వర్షాలు కురిసి వరద నీటితో రోడ్లు అన్నీ నిండిపోయిన సందర్భంలో ఏర్పడే ట్రాఫిక్ గురించి ఇక చెప్పనవసరం లేదు.తాజాగా అలాంటి పరిస్థితే ఎదురైంది. బుధవారం కురిసిన భారీ వర్షాలకు బెంగళూరు అతలాకుతలమైంది. పలు ప్రాంతాలను వరద నీరు ముంచెత్తింది. మోకాళ్లలోతు నీటిలో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రోడ్లపై వరదనీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.ఎలక్ట్రానిక్ సిటీ ఫ్లైఓవర్‌పై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. టెకీలంతా తమ పనులను ముగించుకొని ఇంటికి వెళ్లే సమయం కావడంతో ఫ్లైఓవర్‌పై భారీగా జామ్ నెలకొంది. దాదాపు మూడు గంటలకు పైగా ఫ్లైఓవర్‌పైనే చిక్కుకుపోయిన పరిస్థితి తలెత్తింది. దీంతో విసుగుచెందిన కొందరు తమ కాళ్లకు పని చెప్పారు. వాహనాలను వదిలేసి నడుచుకుంటూ ఇంటి బాట పట్టారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.Completely Jammed from past 1.5 hrs in the #electroniccity flyover. I must have reached my home now which is 30kms away. Logged out at 5:20 and we are still stuck! We can see most of the employees of various companies frustrated and starting to walk. @madivalatrfps pic.twitter.com/wqvXuIArN6— KpopStan🤍 (@PratikfamHouse) October 23, 2024 -
దసరా ఎఫెక్ట్: పంతంగి టోల్‌ప్లాజా వద్ద ట్రాఫిక్‌జామ్
సాక్షి,యాదాద్రి భువనగిరిజిల్లా: దసరా పండుగ సొంతూళ్లలో జరుపుకునేందుకు హైదరాబాద్ వాసులు గ్రామాల బాట పట్టారు. చాలా మంది తమ సొంత కార్లలోనే ఊళ్లకు పయనమయ్యారు. చౌటుప్పల్ మండలంలోని పంతంగి టోల్‌ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరాయి. దీంతో హైదరాబాద్-విజయవాడ రూట్లో భారీగా ట్రాఫిక్‌జామ్ అయింది. కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. మరోపక్క దసరాకు పల్లెబాట పట్టిన ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి వెళ్లే రైళ్లు, బస్సులు కిటకిటలాడుతున్నాయి.ఇదీ చదవండి: తెలంగాణలో సద్దుల బతుకమ్మ సంబరాలు -
మీరు మనుషులేనా
-
హైదరాబాద్‌లో కుండపోత వర్షం
సాక్షి,హైదరాబాద్:రాజధాని హైదరాబాద్ నగరంలో మళ్లీ ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. శనివారం(సెప్టెంబర్21)సాయంత్రం నగరంలోని పలు ప్రాంతాల్లో వాన దంచి కొట్టింది. కొండాపూర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, బేగంపేట, పంజాగుట్ట సికింద్రాబాద్, ఉప్పల్,బోడుప్పల్,నాగోల్,దిల్సుఖ్నగర్, చైతన్యపురి,కోఠి,అబిడ్స్,నాంపల్లి ప్రాంతాల్లో ఏకధాటిగా రెండుగంటల పాటు అతి భారీ వర్షం పడింది. #HYDTPinfoIt's #Raining heavily.Commuters are requested to drive carefully.#HyderabadRains pic.twitter.com/2tKy5y1vg9— Hyderabad Traffic Police (@HYDTP) September 21, 2024 భారీ వర్షంతో రోడ్లపై నీరు వరదలై పారింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వర్షం కారణంగా నగరంలోని పలు ప్రధాన రోడ్లపై ట్రాఫిక్‌జామ్ అయింది. కాగా, శుక్రవారం రాత్రి నగరమంతా రెండు గంటలపాటు భారీ వర్షం పడిన విషయం తెలిసిందే. భారీ వర్షం కారణంగా నిలిచిన నీళ్లు పూర్తిగా తొలగక ముందే మళ్లీ వర్షం పడడంతో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి.ఇదీ చదవండి: తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలే -
ట్రాఫిక్ వలయంలో సాగర్ పరిసర ప్రాంతాలు.. వాహనదారులకు అలర్ట్
హైదరాబాద్, సాక్షి: గణేష్ నిమజ్జనం తో హుస్సేన్‌సాగర్ పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్‌జామ్ అయ్యింది. నిమజ్జనానికి గణపయ్యలు క్యూ కట్టడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ట్యాంక్ బండ్‌వైపు రావొద్దని.. ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని వాహనదారులకు నగర పోలీసులు సూచిస్తున్నారు.రేపు ‘మహా’ నిమజ్జనం ఉండడం, నిన్న ఆదివారం కావడంతో నగరంలోని చాలా విగ్రహాలు ట్యాంక్‌బంక్‌కు చేరుకున్నాయి. అయితే విగ్రహాలను తరలిస్తున్న వాహనాలను నిన్న రాత్రి నుంచి నియంత్రించేందుకు సిబ్బంది లేకపోవడం, పైగా వాటిల్లో భారీ వాహనాలు ఉండడంతో.. నిమజ్జనానికి గంటల తరబడి టైం పడుతోంది. ఇక.. సాగర్ పరిసరాల్లో ట్రాఫిక్ పోలీసులు లేరన్న మీడియా కథనాలకు అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. వాహనాలను త్వరగతిన పంపించేందుకు యత్నిస్తున్నారు. అయితే.. ఈలోపు వాహనాల రద్దీ పెరిగిపోయింది. ఖైరతాబాద్, టెలిఫోన్ భవన్, నాంపల్లిలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో ట్యాంక్ బండ్ వైపుగా వెళ్లకపోవడం మంచిదని వాహనదారులకు అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు ట్రాఫిక్ ఆంక్షల నేపథ్యంలో.. ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్తున్న వాళ్లకు సైతం నరకం కనిపిస్తోంది.రేపు ఖైరతాబాద్ మహా గణపతితో పాటు భారీ విగ్రహాల నిమజ్జనం కొనసాగనుంది. ఇప్పటికే తగిన ఏర్పాట్లు చేసినట్లు జీహెచ్ఎంసీ ప్రకటించింది. శోభాయాత్ర భద్రత కోసం పాతికవేల మంది సిబ్బందిని మోహరించినట్లు పోలీస్ శాఖ తెలిపింది. ఇక.. ఖైరతాబాద్ గణేషుడికి ఇవాళ పూజలు నిర్వహించి.. షెడ్డు తొలగింపు పనులు చేపట్టారు. రేపు ఉదయం ఆరు గంటలకు శోభాయాత్ర మొదలుపెడతారు. మధ్యాహ్నాం లోపు నిమజ్జనం చేస్తారు. ఎల్లుండి సాయంత్రంకల్లా నగరంలోని అన్ని విగ్రహాల నిమజ్జనం పూర్తి కావొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. క్లిక్ చేయండి: భారీ గణపయ్య దగ్గర కోలాహలం చూశారా? -
HYD: దంచికొట్టిన వర్షం.. రోడ్లపై వరద
సాక్షి,హైదరాబాద్: రాజధాని హైదరాబాద్ నగరంలో మంగళవారం(ఆగస్టు13) ఉదయం భారీ వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట్, ఎస్సార్‌నగర్, బాలానగర్, బేగంపేట్, సికింద్రాబాద్, అల్వాల్ ప్రాంతాల్లో కురిసిన వర్షంతో రోడ్లపై అక్కడక్కడా భారీగా నీరు నిలిచింది. దీంతో రోడ్లపై ట్రాఫిక్ జామ్ అయింది. వాహనదారులు ఇబ్బంది పడ్డారు. -
సాగర్‌కు పోటెత్తిన పర్యాటకులు.. భారీగా ట్రాఫిక్ జామ్
సాక్షి, నల్గొండ జిల్లా: నాగార్జున సాగర్‌కు పర్యాటకుల తాకిడి పెరగడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఆదివారం సెలవు దినం కావడంతో తెలుగు రాష్ట్రాల నుంచి ప్రాజెక్ట్ అందాలను చూసేందుకు పర్యాటకులు భారీగా తరలివచ్చారు. దీంతో సాగర్ పరిసర ప్రాంతాదలు కిటకిటలాడాయి. ట్రాఫిక్ జామ్ కారణంగా అంబులెన్స్ ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకోవడంతో రోగి, బంధువులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.నాగార్జునసాగర్ జలాశయం నిండుకుండలా మారింది. వారం రోజులుగా ప్రాజెక్టు క్రస్ట్‌గేట్ల నుంచి దిగువకు నీటి విడుదల కొనసాగుతోంది. మరోవైపు, నాగార్జునసాగర్ ప్రాజెక్టు డ్యామ్ వద్ద సీఆర్పీఎఫ్ సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. రాజకీయ నాయకుల సిఫార్సు ఉన్నవారిని మాత్రమే డ్యామ్ పైకి పంపుతున్నారని పర్యాటకులు ఆరోపిస్తున్నారు. -
ముంబయిని ముంచెత్తుతున్న భారీ వర్షాలు
ముంబయి: మహారాష్ట్ర రాజధాని ముంబయి నగరాన్ని వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఆదివారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి నగరంలోని ప్రధాన రోడ్లపై పలు చోట్ల నీరు నిలిచి ట్రాపిక్ జామ్ అయింది. పలు రూట్లలో లోకల్ రైలు సర్వీసులకు అంతరాయం కలిగింది. ట్రాక్‌పై చెట్లు పడిపోవడంతో కసారా-టిట్వాలా సెక్షన్లో రైళ్లను రద్దు చేశారు. నగరంలో మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు పడే ఛాన్సుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. నగరంలో రోడ్లపై నీళ్లు నిలిచిన వీడియోలను పలువురు ముంబైకర్లు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. -
హైదరాబాద్‌లో భారీ ట్రాఫిక్ జామ్!
సాక్షి,హైదరాబాద్ : హైదరబాద్ కురిసిన వర్షాల కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామైంది. ఐకియా సర్కిల్ దగ్గర వర్షం తర్వాత ఆఫీస్ ముగియడంతో వాహనాలు ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చాయి. దీంతో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి.బయో డైవర్సిటీ మాదాపూర్ వరకు ట్రాఫిక్ ఆగిపోవడంతో వాహనదారులు చుక్కలు చూస్తున్నారు. ట్రాఫిక్‌ను క్లియర్ చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగారు. ఐటీ ఉద్యోగులు దశలవారీగా ప్రత్యామ్నాయ మార్గాల్లో తమ తమ గమ్య స్థానాలకు వెళ్లాలని సూచిస్తున్నారు పోలీసులు.సైబరాబాద్ పరిధిలో అటు గచ్చిబౌలి మొదులుకుని గచ్చిబౌలి, మాదాపూర్ బయో డైవర్సిటీ సిగ్నల్,ఐకియా, హైటెక్ సిటీ ఫ్లైఓవర్,జేఎన్టీయూ ఫ్లైఓవర్లో భారీగా ట్రాఫిక్ జామ్ కనిపిస్తోంది. గంటపాటు ఎడతెరిపిలేకుండా వర్షం కురియడంతో వాహనాలన్నీ ఎక్కడికక్కడా నిలిచిపోయాయని పోలీసులు చెబుతున్నారు.వర్షం తగ్గగానే ఒక్కసారిగా వాహనాలన్నీ రోడ్డెక్కాయి. ముందుకు కదల్లేని పరిస్థితి నెలకొంది. నానక్ రామ్ గూడా మొదులుకుని గచ్చిబౌలీ, బయోడైవర్సిటీ ట్రాఫిక్ నిలిచిపోయింది. ఫలితంగా మాదాపూర్ వెళ్లాలన్నా.. ఇటు జేఎన్టీయూ వెళ్లాలన్నా ఐకియా సిగ్నల్ మీది నుంచి వెళ్లాల్సి ఉంది. ప్రత్యామ్నాయ మార్గం లేకపోవడంతో ఆ మార్గంలో ట్రాఫిక్ స్తంభించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఈ తరుణంలో నగర ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావొద్దని జీహెచ్ఎంసీ అధికారులు సూచిస్తున్నారు. పోలీసులు సైతం ఉద్యోగులు ఓ గంట ఆలస్యంగా ఆఫీస్‌ల నుంచి ఇంటికి వెళ్లాలని విజ్ఞప్తి చేస్తున్నారు. -
ATTENTION PLEASE: కూడళ్లూ.. 'కష్టాలు'..
సాక్షి, హైదరాబాద్: బండి తీసి రోడ్డెక్కాం.. ఆ రోడ్డు ఎంత బాగున్నా.. ఫ్లైఓవర్ ఎక్కి ఎంచక్కా దూసుకెళ్లినా.. ఏదైనా జంక్షన్ రాగానే ఉత్సాహం కాస్తా తుస్సుమంటుంది. అడుగులో అడుగేస్తున్నట్టుగా కదులుతున్న వాహనాలతో చిరాకు మొదలవుతుంది. ఎడమ వైపు ‘ఫ్రీలెఫ్ట్’ ఉంటుందేమో అనుకుంటే.. ఇరుకైన జంక్షన్‌తో అదీ ప్యాక్ అయిపోయి ఉంటుంది. ఎలాగోలా జంక్షన్ దాటేసి, కాస్త దూరంలోని మరో ఫ్లైఓవర్ ఎక్కుదామనుకుంటే.. దానికి ముందే మళ్లీ వాహనాల నత్తనడక మొదలవుతుంది. చిరాకు మరింత పెరిగిపోతుంది. ఎవరైనా వీఐపీ కోసం ట్రాఫిక్ గానీ ఆపి ఉంటే.. ఈ ‘మంట’ నషాళానికి అంటుతుంది.హైదరాబాద్ మహా నగరంలో కూడళ్ల నిర్వహణ సరిగా లేక జనం తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.సిగ్నల్ ఫ్రీ సిటీ కోసం చర్యలు చేపట్టినా..హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ సిగ్నల్ ఫ్రీగా సాగేందుకు గత పదేళ్లలో పలు చర్యలు చేపట్టారు. కొత్తగా కొన్ని ఫ్లై ఓవర్లు నిర్మించారు. అయినా ప్రజలకు రవాణా కష్టాలు తీరలేదు. పెరుగుతున్న వాహనాల సంఖ్యకు అనుగుణంగా రోడ్ల విస్తరణ చేపట్టకపోవడం, జంక్షన్లను అభివృద్ధి చేయకపోవడమే దీనికి కారణమన్న విమర్శలు వస్తున్నాయి. వాహనాలు జంక్షన్ల వద్ద చాలాసేపు ఆగిపోవాల్సి వస్తోంది. దాంతో ప్రయాణ సమయం, ఇంధన వ్యయంతోపాటు కాలుష్యం కూడా పెరిగిపోతోంది. మరోవైపు జంక్షన్ల వద్ద ఫుట్‌పాత్‌లు సరిగా లేక పాదచారులు నడవడానికి, రోడ్డు దాటడానికి తీవ్రంగా ఇబ్బందిపడాల్సి వస్తోంది.భారీగా విస్తరణకు నిర్ణయించినా.. త్రీవేలు, చౌరస్తాలు, పెద్ద జంక్షన్లున్న చోట ట్రాఫిక్ ఇబ్బందులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. దీనితో జంక్షన్లను విస్తరించి, అభివృద్ధి చేయాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. తొలుత జోన్‌కు రెండు చొప్పున నగరవ్యాప్తంగా 12 జంక్షన్లను అభివృద్ధి చేయాలనుకున్నారు. తర్వాత వీటిని 60కి పెంచారు. నగరంలోని మరిన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలను గుర్తించి.. మొత్తం 127 జంక్షన్లకు విస్తరించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అందులో 13 చోట్ల మాత్రమే పనులు చేపట్టారు. మిగతావీ మొదలై, పనులన్నీ పూర్తయ్యేందుకు ఎంతకాలం పడుతుందో చెప్పలేని పరిస్థితి. ఆస్తుల సేకరణ, యుటిలిటీస్ షిఫ్టింగ్ వంటివి ఈ పనులకు ఆటంకంగా ఉన్నాయి. రెండేళ్ల క్రితం చేపట్టిన వాటిల్లో పూర్తికానివే కాక ఇంకా పనులే ప్రారంభం కానివీ ఉన్నాయి. జీహెచ్ఎంసీలో పనులకు కొంతకాలంగా బిల్లుల చెల్లింపులు ఆలస్యమవుతుండటంతో పనులకు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేరు. సగానికిపైగా జంక్షన్లకు ఇంకా డీపీఆర్‌లే పూర్తి కాలేదు.ఫ్లైఓవర్ దాటితే అంతే.. కొన్ని ప్రాంతాల్లో ఫ్లైఓవర్ల మీదుగా ప్రయాణం వేగంగా సాగుతున్నప్పటికీ.. ఫ్లైఓవర్ దాటగానే ట్రాఫిక్ చిక్కులు రెట్టింపు అవుతున్నాయి. ఉదాహరణకు ఐటీ కారిడార్‌లోని ప్రాంతాల నుంచి దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి, ఎలివేటెడ్ కారిడార్ మీదుగా వేగంగా ఆగకుండా వచ్చే వాహనాలు జూబ్లీహిల్స్‌లో రోడ్ నంబర్ 45 చౌరస్తాలో ఒక్కసారిగా జామ్ అవుతున్నాయి. అక్కడి ఇరుకైన జంక్షన్ దీనికి కారణం. ఫ్లై ఓవర్లపై చూపిన శ్రద్ధ జంక్షన్ల విస్తరణలో చూపకపోవడంతో వాహనదారులకు తిప్పలు తప్పడం లేదు.⇒ జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతాల నుంచి పంజగుట్ట ఫ్లైఓవర్ మీదుగా బేగంపేట, సికింద్రాబాద్‌ల వైపు వెళ్లాల్సిన వాహనాలు, ఫ్లైఓవర్ కింద నుంచి ఖైరతాబాద్ దిశగా వెళ్లాల్సిన వాహనాలు అన్నీ ఫ్లైఓవర్‌కు ముందు, పంజగుట్ట చౌరస్తా వద్ద జామ్ అవుతున్నాయి. నగరంలో చాలా ఫ్లైఓవర్లకుముందు, చివరల్లోఇదే పరిస్థితి ఉంది.జంక్షన్లను అభివృద్ధి చేస్తారిలా.. ముఖ్యమైన జంక్షన్ల వద్ద వాహనాలు సులువుగా మలుపుతిరగడంతోపాటు పాదచారులు సులభంగా రోడ్డు దాటేందుకు ప్రాధాన్యమిస్తూ అభివృద్ధి చేయనున్నట్లు ఇంజనీర్లు తెలిపారు. అందులో భాగంగా చేపట్టే పనులేంటో వెల్లడించారు.⇒ వాహనాలు సాఫీగా మలుపు తిరిగేలా రోడ్లను విశాలం చేస్తారు. ⇒ జంక్షన్లో అన్నివైపులా పాదచారులు సులభంగా రోడ్డు దాటేలా జీబ్రా క్రాసింగ్స్ ఏర్పాటు చేస్తారు. ⇒ బస్టాపులున్న జంక్షన్ల వద్ద ఎటువైపు వెళ్లే బస్సు ఎక్కాలనుకుంటే పాదచారులు అటువైపు వెళ్లేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తారు. అవసరమైతే పెలికాన్ సిగ్నల్స్ ఏర్పాటు చేస్తారు. ⇒ ఫ్రీ లెఫ్ట్ కోసం ప్రత్యేక మార్కింగ్స్ వేస్తారు. ⇒ రాత్రివేళ జంక్షన్ అందంగా కనిపించేలా ప్రత్యేక లైటింగ్ ఉంటుంది. కూర్చునేందుకు బెంచీలు, ఇతర ఏర్పాట్లు చేస్తారు. ⇒ జంక్షన్ల వద్ద రోడ్డు డివైడర్లలో అందంగా కనిపించేలా, ఆక్సిజన్ అందేలా మొక్కలు పెంచుతారు. ⇒ పాదచారుల కోసం ఫుట్‌పాత్‌లు,వరద నీరు నిలవకుండా కాలువలు నిర్మిస్తారు.విశాలంగా ఉన్నా తప్పని తిప్పలు..శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలోని ఆరాంఘర్ జంక్షన్ విశాలంగా ఉన్నప్పటికీ పాదచారులకు తిప్పలు తప్పడం లేదు. రోడ్డు ఒకవైపు నుంచి మరోవైపు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అడపాదడపా ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. ఈ జంక్షన్ వద్ద ఆర్టీసీ బస్సులు కూడా ఎక్కడ పడితే అక్కడ ఆగుతుండటంతో ఉరుకులు పరుగులు పెట్టాల్సి వస్తోంది. ఇక్కడ అండర్‌పాస్ ఉన్నా గందరగోళ పరిస్థితి కనిపిస్తోంది. ఈ క్రమంలో ఈ జంక్షన్‌ను కూడా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. రెండేళ్ల క్రితమే ప్రతిపాదనలు రూపొందించినా.. కాంట్రాక్టర్లు ముందుకు రాక నేటికీ పనులు మొదలు కాలేదు.శాస్త్రీయంగా పరిశీలించి పనులు చేయాలి కేవలం ఫ్లైఓవర్లు, యూటర్న్ల ఏర్పాటు వల్ల ట్రాఫిక్ సమస్యలు తీరవు. యూటర్న్లు ఏర్పాటు చేసేందుకు శాస్త్రీయంగా సిమ్యులేషన్ స్టడీ చేసి, ట్రాఫిక్ సమస్య పరిష్కారమయ్యేలా వాటి ప్రదేశాన్ని ఎంపిక చేయాలి. కానీ నగరంలోని చాలా ప్రాంతాల్లో ఇది సరిగా జరుగుతున్నట్టు లేదు. ఏ పనులైనా సైంటిఫిక్ స్టడీతో చేస్తే ప్రయోజనం ఉంటుంది. -
ట్రాఫిక్‌పై డ్రోన్ కన్ను
సాక్షి, హైదరాబాద్: నిత్యం బిజీగా ఉండే రోడ్డు.. మధ్యలో ఓ కారు మొరాయించి నిలిచిపోయింది. దాంతో ట్రాఫిక్ జామ్ మొదలైంది. ఆ ప్రాంతానికి పైన గాల్లో ఎగురుతున్న ‘డ్రోన్’ద్వారా పోలీసులు ఇది చూశారు. వెంటనే ట్రాఫిక్ రిలీఫ్ వ్యాన్ వచి్చ, మొరాయించిన కారును అక్కడి నుంచి తరలించింది. వాహనాలన్నీ సాఫీగా ముందుకు సాగిపోయాయి. అంటే భారీగా ట్రాఫిక్ జామ్ కాకముందే.. సమస్య పరిష్కారమైపోయింది. ఇదేదో చాలా బాగుంది కదా. ఇకపై గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ట్రాఫిక్ చిక్కులకు ఇలా సింపుల్‌గా చెక్ పడిపోనుంది. తొలుత సైబరాబాద్ పరిధిలో.. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో దీనికి సంబంధించి ‘థర్డ్ ఐ ట్రాఫిక్ మానిటరింగ్ డ్రోన్’అందుబాటులోకి వచ్చేసింది. పైలట్ ప్రాజెక్టు కింద ఐకియా, దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జి, హఫీజ్‌పేట, హైటెక్ సిటీ, మాదాపూర్, రాయదుర్గం తదితర ఐటీ కారిడార్ ప్రాంతాల్లో ఆదివారం ఈ డ్రోన్‌ను వినియోగించారు. రోడ్లపై ట్రాఫిక్ జామ్‌లు, వాహనాల రద్దీ ఎక్కడ ఎక్కువగా ఉంది? జంక్షన్ల వద్ద వాహనాల వేగం ఎలా ఉంది? ఎక్కడైనా నీరు నిలిచి ఉందా? అనే అంశాలతోపాటు రోడ్డు ప్రమాదాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించవచ్చు. ఏదైనా సమస్య ఏర్పడితే ట్రాఫిక్ పోలీసు బృందాలు వెంటనే స్పందించి పరిష్కరించవ చ్చు. వాహనాలు సు లభంగా, వేగంగా ప్రయాణించేందుకు వీలవుతుంది. ఎలా పనిచేస్తాయంటే..? థర్మల్ ఇమేజింగ్ టెక్నాలజీ, రేడియో ఫ్రీక్వెన్సీల సాయంతో ఈ డ్రోన్ సైబరాబాద్ కమిషనరేట్‌లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానమై ఉంటుంది. భూమి ఉపరితలం నుంచి 150–170 మీటర్ల ఎత్తులో ఎగురుతుంది. ఈ డ్రోన్‌కు ఉండే మూడు అత్యాధునిక కెమెరాలతో, ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే ఉదయం, సాయంత్రం వేళల్లో రోడ్డు మీద ట్రాఫిక్ జామ్‌లు, వాహనాల రద్దీ, కదలికలను చిత్రీకరిస్తుంది.రియల్ టైమ్‌లో కంట్రోల్ సెంటర్‌కు పంపిస్తుంది. కంట్రోల్ సెంటర్ సిబ్బంది ట్రాఫిక్ పరిస్థితి, రద్దీని విశ్లేíÙంచి, ఏదైనా సమస్య ఉంటే గమనించి క్షేత్రస్థాయిలోని ట్రాఫిక్ పోలీసులకు సమాచారం ఇస్తారు. తద్వారా ట్రాఫిక్‌ను క్రమబదీ్ధకరిస్తారు. గాలిలో ఏకధాటిగా 45 నిమిషాల పాటు తిరగగలిగే సామర్థ్యమున్న ఈ డ్రోన్ 15 కిలోమీటర్ల దూరం వరకు హెచ్డీ క్వాలిటీ వీడియోను పంపించగలదు. ఇతర కమిషనరేట్లలో.. సైబరాబాద్ పోలీసుల ట్రాఫిక్ నిర్వహణ కోసం డ్రోన్లను వినియోగించాలని గతంలోనూ ఆలోచన చేశారు. అప్పుడప్పుడు డ్రోన్లను అద్దెకు తీసుకొచ్చి వినియోగించేవారు. తాజాగా కార్పొరేట్ సామాజిక సేవ (సీఎస్ఆర్) కింద ‘సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్సీఎస్సీ)’నిధులతో సొంతంగా ఒక డ్రోన్‌ను కొనుగోలు చేశారు. దీని ఫలితాలను బట్టి మరిన్ని డ్రోన్లను సమకూర్చుకోనున్నారు.ఇప్పటికే హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో వినాయక నిమజ్జనం, హనుమాన్ జయంతి, బోనాలు, శ్రీరామనవమి, షాబ్–ఈ–బరాత్ వంటి ర్యాలీలు, జాతరల సమయంలో డ్రోన్లను వినియోగిస్తూ నిఘా పెడుతున్నారు. ఇకపై ట్రాఫిక్ పర్యవేక్షణ కోసమూ వినియోగించనున్నారు. హైదరాబాద్‌లో డ్రోన్లు, సీసీ కెమెరాల ఏర్పాటు, నిర్వహణ కోసం ప్రత్యేకంగా ‘డీ–కెమో’విభాగం ఉంది. దీనికి డీసీపీ/ఏసీపీ ర్యాంకు అధికారి హెడ్‌గా ఉంటారు.ట్రాఫిక్ పోలీసులకు శిక్షణ డ్రోన్ ఆపరేషన్ ప్రాథమిక దృష్టి ముఖ్యంగా ఐటీ కారిడార్ మీద ఉంటుంది. ఇక్కడ అధిక ట్రాఫిక్ ఉన్న ప్రాంతాలను గుర్తించి తగిన చర్యలు తీసుకోవడంలో ట్రాఫిక్ పోలీసులకు డ్రోన్ సాయం అందిస్తుంది. ఈ మేరకు డ్రోన్ వినియోగంపై ట్రాఫిక్ పోలీసులకు శిక్షణ ఇవ్వనున్నాం. – అవినాష్ మహంతి,పోలీస్ కమిషనర్, సైబరాబాద్‘ట్రాఫిక్’కు వాడే డ్రోన్ ప్రత్యేకతలు ఇవీ:డ్రోన్ పేరు: మావిక్ 3 ప్రో ధర: రూ.5.5 లక్షలు బరువు: ఒక కిలో బ్యాటరీ: 5 వేల ఎంఏహెచ్. సుమారు 4 గంటల బ్యాకప్ గరిష్ట ఎత్తు: భూమి ఉపరితలం నుంచి 400 మీటర్లు విజిబులిటీ: 5 కిలోమీటర్ల దూరం వరకు గరిష్ట వేగం: సెకన్‌కు 8 మీటర్లు. గాలి, వర్షం లేకపోతే వరి్టకల్‌గా సెకన్‌కు 21 మీటర్ల వేగంతో ఎగరగలదు. స్టోరేజ్ 8 జీబీ నుంచి 1 సామర్థ్యం: టీబీ వరకు ఉంటుంది. -
చంద్రబాబు ప్రమాణస్వీకారం.. విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు
-
ట్యాంక్‌బండ్ కేంద్రంగా భారీ ట్రాఫిక్ జామ్
ట్యాంక్‌బండ్ కేంద్రంగా సోమవారం సాయంత్రం భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. గంటకు పైగా ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోవడంతో వాహనచోదకులు తీవ్ర అసహనానికి లోనయ్యారు. ఓ దశలో ట్రాఫిక్ పోలీసులు పట్టించుకోవట్లేదంటూ అక్కడ ఉన్న సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. పీక్ అవర్ కావడంతోనే ట్రాఫిక్ ఆగిందంటూ పోలీసులు వివరణ ఇచ్చారు. జంట నగరాలకు ఉన్న కనెక్టింగ్ రూట్లలో ప్రధానమైన ట్యాంక్‌బండ్‌పై ట్రాఫిక్ జామ్స్ నిత్యకృత్యంగా మారిపోయాయి. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి వచ్చిన తర్వాత తెలుగుతల్లి ఫ్లైఓవర్ మీదుగా వెళ్లే వాహనాల సంఖ్య పెరిగింది. ఫలితంగా తరచూ ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతుండటంతో కట్టమైసమ్మ దేవాలయం, అంబేడ్కర్ విగ్రహం చౌరస్తాల వద్ద అధికారులు కొన్ని మార్పుచేర్పులు చేశారు. దీంతో ట్యాంక్‌బండ్ పైన గతంలో ఎన్నడూ లేనంతగా రద్దీ పెరిగింది. ఈ కారణాల నేపథ్యంలో సోమవారం సాయంత్రం ట్యాంక్‌బండ్ కేంద్రంగా వాహనాలు పెద్ద సంఖ్యలో ఆగిపోయాయి. లిబర్టీ, ఖైరతాబాద్, రాణిగంజ్ వైపుల నుంచి వచ్చే వాహనాల ట్రాఫిక్ జామ్‌తో దాదాపు గంటకు పైగా వాహనచోదకులు ఎక్కడికక్కడే నిలిచిపోవాల్సి వచ్చింది. ‘భారీగా వాహనాలు రావడం, పీక్ అవర్ కావడంతో పాటు రవీంద్రభారతి, రిజర్వ్ బ్యాంక్, ఇక్బాల్ మీనార్, తెలుగుతల్లి ఫ్లైఓవర్, అంబేడ్కర్ చౌరస్తాల వైపు నుంచి అప్పర్ ట్యాంక్‌బండ్‌కు వెళ్లే వాహనాలు నెమ్మదిగా కదులుతుండటంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది’ అని ట్రాఫిక్ విభాగం అధికారులు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. -
హైదరాబాద్‌లో దంచికొట్టిన వాన.. భారీగా ట్రాఫిక్ జాం (ఫొటోలు)
-
వాహనాలతో కిక్కిరిసిన రహదారి
బీబీనగర్: యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం గూడూరు టోల్‌ప్లాజాతో పాటు హైదరాబాద్– వరంగల్ జాతీయ రహదారి ఆదివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు వాహనాలతో కిక్కిరిసిపోయింది.యాదాద్రితో పాటు స్వర్ణగిరికి భక్తులు భారీగా తరలిరాగా, శుభకార్యాలు కూడా ఎక్కువగా ఉండడంతో 40వేల వరకు వాహనాలు గూడూరు టోల్‌ప్లాజా గుండా రాకపోకలు సాగించాయి. టోల్‌ప్లాజా వద్ద గూడూరు నుంచి పగిడిపల్లి వరకు వాహనాలు బారులుదీరాయి. -
HYD: ఏపీకి క్యూ కట్టిన ప్రజలు.. పలుచోట్ల ట్రాఫిక్ జాం
తెలుగు రాష్ట్రాల్లో ఓట్ల పండగకు సమయం సమీపించింది. మే 13న జరిగే ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ, తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు హైదరాబాద్ నగర వాసులు సొంత ఊళ్లకు పయనమవుతున్నారు. ఉద్యోగ, ఉపాధి రీత్యా హైదరాబాద్‌లో స్థిరపడిన వారంతా స్వస్థలాలకు తరలి వెళ్లడంతో శనివారం ఉదయం నుంచే రోడ్లన్నీ రద్దీగా మారాయి. నేటి నుంచి వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో(శనివారం, ఆదివారం సోమవారం పోలింగ్) ఊర్లకు వెళ్లేవారితో పలు టోల్గేట్ల వద్ద ట్రాఫిక్‌జామ్ ఏర్పడుతోంది.హైదరాబాద్ నుంచి విజయవాడ మీదుగా రాజమహేంద్రవరం, విశాఖపట్నం వైపు వెళ్తున్న వాహనాలు పెద్ద సంఖ్యలో రోడ్డుపైకి చేరుకోవడంతో హైదరాబాద్- విజయవాడ హైవేపై ట్రాఫిక్ జామ్ అవుతోంది. వాహనాలు నెమ్మదిగా ముందుకు సాగుతున్నాయి. దీంతో హైదరాబాద్ శివారు హయత్‌నగర్ నుంచి అబ్దుల్లాపూర్‌మెట్ వరకు ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోంది. చౌటుప్పల్, పంతంగి టోల్‌ప్లాజాల వద్ద వాహనాలు బారులు తీరాయి. మరోవైపు నల్లగొండ జిల్లా కొర్లపాడు టోల్ గేట్ వద్ద వాహనాలు బారులుతీరాయి. ఎన్టీఆర్ జిల్లాజగ్గయ్యపేట మండలం చిల్లకల్లు టోల్ ప్లాజా వద్ద పెరిగిన వాహనాల రద్దీ.ఏపీలో ఎన్నికల సందర్భంగా తెలంగాణ నుండి ఆంధ్రకు భారీగా తరలిస్తున్న ఓటర్లు.వాహనాల రద్దీతో పెంచిన కౌంటర్లు.పంతంగి టోల్గేట్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్.హైదరాబాద్ నుంచి భారీగా తరలి వెళ్తున్న ఆంధ్ర ఓటర్లు.పంతంగి నుంచి చౌటుప్పల్ హయత్ నగర్ వరకు భారీగా వాహనాలు.ఉదయం నుంచి గంటలకు నిలిచిపోయిన వాహనాలు.నిన్న రాత్రి నుంచి కొనసాగుతున్న వాహనాల రద్దీ.హైదరాబాద్‌లో స్థిర పడ్డ ఓటర్లు ఓటు వేసేందుకు ఆసక్తి..పోలింగ్‌కు ముందే తమ గ్రామాలకు చేరుకునేలా హైదరాబాద్ నుంిచి పయనం. ప్రయాణీకుల రద్దీతో బస్సు స్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిటకిట లాడుతున్నాయి.రైలు టిక్కెట్లు కొన్నప్పటికీ రైలు ఫుల్ కావడంతో బస్సులలో వెళ్లడానికి ఆరంఘర్ చౌరస్తాకు చేరుకుంటున్న ప్రయాణీకులు.సంక్రాంతి, దసరాకు కనిపించినంత రద్దీ కనబడుతుంది.గత నెల రోజుల క్రితమే రైళ్లు, బస్సుల రిజిస్ట్రేషన్ చేసుకున్న ఓటర్లు. -
Dilli Chalo 2.0: ఢిల్లీ సరిహద్దులో యుద్ధవాతావరణం
అష్ట దిగ్బంధనంలో దేశ రాజధాని ఢిల్లీ సింగు బోర్డర్ వద్దకు భారీగా చేరుకున్న రైతులు రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగంతో చెల్లాచెదురైన నిరనసన కారులు శంభు బోర్డర్ వద్ద హైటెన్షన్ పోలీసులపై రాళ్లు రువ్విన రైతులు #WATCH | Protesting farmers vandalise flyover safety barriers at the Haryana-Punjab Shambhu border. pic.twitter.com/vPJZrFE0T0 — ANI (@ANI) February 13, 2024 పంజాబ్, హర్యానా సరిహద్దుల్లో ఉద్రిక్తత బారికేడ్లు, ముళ్ల కంచెలు ఏర్పాటు చేసిన పోలీసులు ఎక్కడిక్కడ రహదారులను మూసివేసిన పోలీసులు పంజాబ్, హర్యానా నుంచి ఢిల్లీ వైపు వస్తున్న రైతులు రైతుల ట్రాక్టర్లు ఢిల్లీలోకి రాకుండా సరిహిద్దుల్లో పటిష్ట భద్రత కనీస మద్దతు ధరపై చట్టం చేయాలని రైతుల డిమాండ్ #WATCH | Protesting farmers throw police barricade down from the flyover at Shambhu on the Punjab-Haryana border as they march towards Delhi to press for their demands. pic.twitter.com/oI0ouWwlCj — ANI (@ANI) February 13, 2024 ఢిల్లీ వ్యాప్తంగా నెలరోజులపాటు 144 సెక్షన్ డ్రోన్లతో పర్యవేక్షిస్తున్న భద్రతా బలగాలు అంబాల హైవేపైకి భారీగా రైతులు ఢిల్లీలో భారీగా ట్రాఫిక్ జాం రైతుల చలో ఢిల్లీ రహదారులను మూసివేసిన పోలీసులు పలుచోట్ల అతినెమ్మదిగా కదులుతున్న వాహనాలు ఢిల్లీ సరిహద్దుల్లో టెన్షన్.. టెన్షన్.. పంజాబ్,హర్యానా సరిహద్దుల్లో ఉద్రిక్తత సరిహద్దుల వద్ద రైతులను అడ్డుకున్న పోలీసులు రైతుల టియర్ గ్యాస్ ప్రయోగం ఢిల్లీ ముట్టడికి రైతుల యత్నం 2020 ఉద్యమం తరహాలో పోరుగు సిద్ధమైన రైతులు పంజాబ్, హర్యానా నుంచి ఢిల్లీ వైపు వస్తున్న రైతులు తమ డిమాండ్లు పరిష్కరించే వరకు ఉద్యమం ఆగదన్న రైతులు ఆరు నెలలకు సరిపడా ఆహార పదార్థాలతో బయల్దేరిన రైతులు ధీర్ఘకాలిక ఉద్యమాన్ని కొనసాగించాలని రైతులు నిర్ణయం మంత్రులతో చర్చలు విఫలం కావడంతో మొదలైన రైతుల మార్చ్ శాంతియూతంగా ఆందోళన కొనసాగిస్తామని రైతులు స్పష్టం సాక్షి, ఢిల్లీ: రైతుల ఢిల్లీ ఛలో యాత్రతో నగర సరిహద్దులో యుద్ధవాతావరణం నెలకొంది. ముట్టడికి బయల్దేరిన రైతు సంఘాలను అడ్డుకునేందుకు పోలీసులు తీవ్రంగా యత్నిస్తున్నారు. ఈ క్రమంలో సంభూ సరిహద్దులో అడ్డగించే క్రమంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆందోళనకారుల్ని అదుపు చేసేందుకు రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగించారు పోలీసులు. డ్రోన్ ద్వారా టియర్ గ్యాస్ ప్రయోగించిన దృశ్యాలు చక్కర్లు కొడుతున్నాయి. టియర్ గ్యాస్ ప్రయోగంతో చెల్లాచెదురైన నిరసనకారులు.. అంబాల హైవే పైకి చేరారు. #WATCH | Police use tear gas drones at the Haryana-Punjab Shambhu border to disperse protesting farmers. pic.twitter.com/LcyGpDuFbv — ANI (@ANI) February 13, 2024 మరోవైపు.. పంజాబ్, హర్యానాల నుంచి నిరసనకారులు ఢిల్లీ వైపు వచ్చే యత్నం చేస్తేఉన్నారు. ఇంకోపక్క రైతన్నల ఢిల్లీ ఛలో ప్రభావంతో.. నగరంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. రహదారుల దగ్గర పోలీసుల మోహరింపు.. తనిఖీలతో.. వాహనాలు భారీ సంఖ్యలో నిలిచిపోయాయి. అతినిదానంగా వాహనాలు కదులుతుండడంతో.. కిలో మీటర్ దూరం దాటేందుకు గంటల సమయం పడుతోందని వాహదనదారులు సోషల్ మీడియాలో వాపోతున్నారు. రైతుల మెగా మార్చ్‌ను భగ్నం చేసేందుకు.. ఢిల్లీకి దారి తీసే ప్రధాన సరిహద్దుల వద్ద భారీగా పోలీసులు మోహరించారు. సిమెంట్ దిమ్మెలు, కంచెలతో అడ్డుకునే యత్నం చేస్తున్నారు. సింగూ, టిక్రిలతో పాటు ఢిల్లీ(ఘజియాబాద్), యూపీ నొయిడాల సరిహద్దు ప్రాంతాలైన ఘాజిపూర్, చిల్లా వద్ద పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. అయితే పోలీసులు మాత్రం దారుల్ని పూర్తిగా మూసేయలేదని.. ఫెన్సింగ్‌లో పాక్షికంగా మూసేసి తనిఖీల అనంతరం అనుమతిస్తున్నామని చెబుతున్నారు. #Traffic snarls on the highway from #Gurugram towards #DelhiPolice place concrete slabs on the road as a part of measures to stop farmers from marching to Delhi#DelhiNCR #FarmersProtest pic.twitter.com/oqCel5wEUf — cliQ India (@cliQIndiaMedia) February 13, 2024 అలాగే అత్యవసరాల వస్తువులను సైతం అనుమతిస్తున్నట్లు చెబుతున్నారు. కానీ, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దృశ్యాలు మాత్రం ఘోరంగా ఉన్నాయి. ఎన్‌హెచ్ 48పై కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు ఆందోళనకు తరలివస్తున్న రైతుల్ని పంజాబ్ పోలీసులు అనుమతిస్తుండడం గమనార్హం. #WATCH | Punjab Police allows protesting farmers to cross Rajpura bypass to head towards Haryana's Ambala onward to Delhi for their protest to press for their demands pic.twitter.com/yCMvdNnD8t — ANI (@ANI) February 13, 2024 ఇదిలా ఉంటే.. పలు డిమాండ్ల సాధన కోసం ఢిల్లీ ఛలోను ప్రారంభించారు. మంగళవారం ఉదయం పంజాబ్, హర్యానా ఇలా సమీప ప్రాంతాల నుంచి యాత్రను ప్రారంభించారు. అయితే ముందుగానే అప్రమత్తమైన పోలీసులు.. సరిహద్దుల్లో కంచెలతో భారీగా మోహరించారు. దీంతో ఏం జరగనుందా? అనే ఉద్రిక్త వాతావరణం నెలకొంది. #WATCH | Delhi Police personnel and barricades deployed at ITO intersection, section 144 CrPC imposed, in view of farmers' protest march to Delhi demanding a law guaranteeing MSP for crops pic.twitter.com/ZSUhHhFFA7 — ANI (@ANI) February 13, 2024 కేంద్ర ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలమవడంతో.. ముందుగానే నిర్ణయించినట్లు ‘ఢిల్లీ చలో’ పేరుతో భారీస్థాయిలో ఆందోళన చేపట్టేందుకు రైతులు కదిలారు. పంజాబ్, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్ సహా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో రైతన్నలు ఇప్పటికే దేశ రాజధాని దిశగా కదిలారు. మరోవైపుభగ్నం చేసేందుకు పోలీసులు అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. #WATCH | Farmers begin their 'Delhi Chalo' march from Fatehgarh Sahib in Punjab. pic.twitter.com/WE7mXiPu9J — ANI (@ANI) February 13, 2024 #WATCH | Farmers begin their 'Delhi Chalo' march from Shambhu Border. pic.twitter.com/tKEF6iEHkZ — ANI (@ANI) February 13, 2024 సోమవారం నాడు.. యాత్రను విరమించుకోవాలని సూచించిన కేంద్రం.. రైతుసంఘాల నాయకులతో చండీగఢ్ వేదికగా సోమవారం దాదాపు అర్ధరాత్రి వరకూ చర్చలు కొనసాగించింది. కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, అర్జున్ ముండాల నేతృత్వంలోని ప్రభుత్వ బృందం.. రైతుల ప్రతినిధులుగా వచ్చిన ఎస్కేఎం (రాజకీయేతర) నేత జగ్జీత్సింగ్ డల్లేవాల్, కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ ప్రధాన కార్యదర్శి సర్వన్‌సింగ్ పంధేర్ తదితరులతో సమాలోచనలు జరిపింది. డిమాండ్లు ఏంటంటే.. కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)కు భరోసా కల్పించేలా చట్టం చేయడం, స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల అమలు, పంటరుణాల మాఫీ, రైతులు-రైతుకూలీలకు పింఛన్లు ఇవ్వడం, మూడు వ్యవసాయ చట్టాలకు (తర్వాత రద్దయ్యాయి) వ్యతిరేకంగా 2020-21లో ఉద్యమించినప్పుడు రైతులపై పెట్టిన కేసుల ఉపసంహరణ వంటి డిమాండ్లపై ఈ భేటీలో విస్తృతంగా చర్చ నడిచింది. వీటిలో.. 2020-21 నాటి కేసుల ఉపసంహరణకు కేంద్ర బృందం అంగీకరించింది. నాటి ఆందోళనల సమయంలో మరణించిన అన్నదాతల కుటుంబాల్లో ఇంకా ఎవరికైనా పరిహారం దక్కకుండా ఉండిఉంటే.. వారికీ పరిహారం అందించేందుకు సమ్మతించింది. ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించాల్సిందేనని రైతు నాయకులు ప్రధానంగా డిమాండ్ చేశారు. దానిపై ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో ఢిల్లీ మార్చ్ యథాతథంగా కొనసాగనున్నట్లు కేంద్ర మంత్రులతో భేటీ అనంతరం సర్వన్‌సింగ్ పంధేర్ ప్రకటించారు. మరోవైపు రైతు నాయకులతో కేంద్రం ఈ నెల 8న కూడా చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. ఆంక్షల వలయంలో హస్తిన రైతులను అడ్డుకునేందుకు ఢిల్లీ పోలీసులు ముమ్మర ఏర్పాట్లు చేశారు. అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా నివారించేందుకు నగరంలో సోమవారం నుంచి నెల పాటు సెక్షన్-144 విధిస్తూ దిల్లీ పోలీసు కమిషనర్ సంజయ్ అరోడా ఉత్తర్వులు జారీ చేశారు. రైతుల నిరసనను సంఘ విద్రోహశక్తులు తమకు అనుకూలంగా మలుచుకునే ముప్పుందని అందులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రజాభద్రతను దృష్టిలో పెట్టుకొని ఆంక్షలు విధిస్తున్నట్లు తెలిపారు. పెళ్లిళ్లు, అంతిమయాత్రలకు ముందస్తు అనుమతులు తీసుకోవాలని స్పష్టం చేశారు. #WATCH | Delhi: Security heightened at Delhi borders in view of the march declared by farmers towards the National Capital today. (Visuals from Jharoda border) pic.twitter.com/xcFCYaeoMz — ANI (@ANI) February 13, 2024 -
ఢిల్లీలో ఆప్, బీజేపీ పోటాపోటీ నిరసనలు
న్యూఢిల్లీ: బీజేపీ, ఆప్ చేపట్టిన పోటీపోటీ నిరసనలతో శుక్రవారం సెంట్రల్ ఢిల్లీ ప్రాంతం రణరంగాన్ని తలపించింది. రెండు పార్టీల శ్రేణులు నేరుగా తలపడే పరిస్థితిని నివారించేందుకు పోలీసులు పలు అంచెల్లో బారికేడ్లను ఏర్పాటు చేశారు. దేశ రాజధాని వ్యాప్తంగా పోలీసులను పెద్ద సంఖ్యలో మోహరించారు. పండిట్ దీన్ దయాళ్ మార్గ్(డీడీయూ)వైపు వచ్చే వాహనాలను దారి మళ్లించారు. భారీ ట్రాఫిక్ జామ్‌తో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో బీజేపీ మోసానికి పాల్పడిందని ఆరోపిస్తూ ఆమ్ఆద్మీ పార్టీ(ఆప్) శుక్రవారం బీజేపీ ప్రధాన కార్యాలయం ఎదురుగా నిరసన తెలపాలని నిర్ణయించింది. అదేసమయంలో, ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా ఆప్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టాలని కాషాయ పార్టీ తీర్మానించుకుంది. ఆ మేరకు రెండు పార్టీల నేతలు, కార్యకర్తలు బయలుదేరగా పోలీసులు వారిని 800 మీటర్ల దూరంలో ఆపేశారు. రోడ్డుపై పలు అంచెల్లో బారికేడ్లను ఏర్పాటు చేసి, పెద్ద సంఖ్యలో బలగాలను మోహరించి పరస్పరం తలపడే పరిస్థితిని నివారించారు. రెండు పార్టీల నాయకులు అక్కడే ధర్నా చేపట్టారు. ఈడీ సమన్లకు అయిదోసారీ డుమ్మా ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలపై ప్రశ్నించేందుకు ఈడీ బుధవారం ఐదోసారి పంపిన సమన్లనూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పట్టించుకోలేదు. శుక్రవారం విచారణకు డుమ్మా కొట్టారు. -
పెళ్లి ముహుర్తం ముంచుకొస్తోంది.. అప్పుడు ఏమైందంటే..
‘పెళ్లి జరగాలంటే?’ అనే ప్రశ్నకు ‘రెండు మనసులు కలవాలి’ అనే సిన్మా డైలాగ్ చెబుతాం. బెంగళూరు విషయానికి వస్తే మాత్రం ‘వధూవరులు టైమ్‌కు ఫంక్షన్ హాల్‌కు చేరుకోవాలి’ అనే జవాబే వినిపిస్తుంది. బెంగళూరులో ట్రాఫిక్ జామ్ అనేది తరచుగా వార్తల్లో ఉండే అంశం. బెంగళూరులో ఒక వధువు ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకుపోయింది. మరో వైపు పెళ్లి ముహుర్తం ముంచుకొస్తోంది. దీంతో బ్రైడల్ కారును విడిచి పరుగెత్తుతూ మెట్రో రైలు ఎక్కింది వధువు. ముహుర్తం టైమ్‌కు ముందుగానే ఫంక్షన్ హాల్‌కు చేరుకుంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో వధువు మెట్రో ఆటోమేటిక్ ఎంట్రీ గేటును దాటి రైలు ఎక్కుతున్న దృశ్యాలు కనిపిస్తాయి. ‘మెట్రోవాలే దుల్హనియా లేజాయేంగే’ ‘ప్రాక్టికల్ పర్సన్. విష్ హర్ గ్రేట్ ఫ్యూచర్’ ‘స్మార్ట్ థింకింగ్’... ఇలాంటి రకరకాల కామెంట్స్ నెటిజనుల నుంచి వెల్లువెత్తాయి. -
పోటెత్తిన భక్తజనం
అయోధ్య: అయోధ్య అక్షరాలా భక్తజన సంద్రంగా మారుతోంది. అంగరంగ వైభవంగా కొలువుదీరిన బాలరామున్ని కళ్లారా దర్శించుకునేందుకు దేశ నలుమూలల నుంచీ భక్తులు సరయూ తీరానికి పోటెత్తుతున్నారు. సోమవారం ప్రాణప్రతిష్ట వేడుక ప్రధానంగా వీఐపీలకు మాత్రమే పరిమితమైన విషయం తెలిసిందే. సాధారణ భక్తులకు మంగళవారం నుంచి అనుమతిస్తామని ముందుగానే ప్రకటించారు. దాంతో తెల్లవారుజాము మూడింటి నుంచే భారీ క్యూ లైన్లు మొదలయ్యాయి. ఉదయానికల్లా అవి విపరీతంగా పెరిగిపోయాయి. ఆలయానికి దారితీసే ప్రధాన రహదారి రామ్ పథ్ భక్తుల వరదతో నిండిపోయింది. వారి జై శ్రీరాం నినాదాలతో పరిసరాలన్నీ ప్రతిధ్వనించాయి. పోలీసు సిబ్బంది కష్టమ్మీద వాటిని నియంత్రించారు. ఉదయం ఆరింటి నుంచి 11.30 దాకా దర్శనాలను అనుమతించారు. ఆ సమయంలో ఏకంగా 2.5 లక్షల నుంచి 3 లక్షల మంది దర్శనం చేసుకున్నారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం ఏడింటికి రెండో విడతలో మరో 2 లక్షల పై చిలుకు భక్తులకు దర్శనం జరిగినట్టు అయోధ్య డివిజనల్ కమిషనర్ గౌరవ్ దయాల్ తెలిపారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ మంగళవారం అయోధ్యను సందర్శించి భక్తులకు దర్శన ఏర్పాట్లు తదితరాలను స్వయంగా పర్యవేక్షించారు. దేశ నలుమూలల నుంచీ... అయోధ్యకు తరలివస్తున్న భక్తుల్లో మహారాష్ట్ర, తెలంగాణ మొదలుకుని అటు పశ్చిమబెంగాల్, అసోం దాకా పలు రాష్ట్రాల వారున్నారు. వీరిలో చాలామందికి అయోధ్య సందర్శన ఇదే తొలిసారి. వీరిలో చాలామంది కనీసం రెండు మూడు రోజుల పాటు ఉండి నగరాన్ని పూర్తిగా సందర్శించేలా ప్లాన్ చేసుకున్నవారే. పలువురు భక్తులు రైల్వేస్టేషన్, బస్టాండ్ల నుంచి నేరుగా లగేజీతో సహా ఆలయానికి వచ్చేస్తున్నారు! సోమవారం మాదిరిగానే మంగళవారం కూడా తెల్లవారుజామునే ఆలయ పరిసరాల్లో రామ్ ధున్ మారుమోగింది. అయోధ్యకు వాహనాల ట్రాఫిక్ కూడా ఊహాతీతంగా పెరిగిపోయింది. దాంతో నగరానికి 30 కిలోమీటర్ల దూరం దాకా ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతున్నాయి. మనందరి జ్ఞాపకాల్లో శాశ్వతం: మోదీ అయోధ్య భవ్య మందిరంలో సోమవారం బాల రాముని ప్రాణప్రతిష్ట మహోత్సవం జరిగిన తీరు మనందరి జ్ఞాపకాల్లో శాశ్వతంగా ఉండిపోతుందని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. వేడుకకు సంబంధించిన వీడియోలను ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ప్రాణప్రతిష్ట క్రతువులో ముఖ్య యజమానులుగా పాల్గొన్న 14 మంది దంపతుల్లోనూ ఇదే భావన వ్యక్తమైంది. దాన్ని సాటిలేని దివ్యానుభూతిగా అభివర్ణించారు. దాన్ని ఎన్నటికీ మర్చిపోలేమని వారణాసిలోని మణికరి్ణక ఘాట్ శ్మశానవాటిక కాటికాపరి కుటుంబానికి చెందిన అనిల్ చౌదరి, సప్నాదేవి దంపతులు అన్నారు. వీరందరినీ దేశ నలుమూలల నుంచీ ప్రత్యేకంగా ఎంపిక చేయడం తెలిసిందే. అయోధ్య రామయ్య ఇకపై బాలక్ రామ్ అయోధ్య మందిరంలో కొలువుదీరిన రామ్ లల్లాను ఇకపై బాలక్ రామ్‌గా పిలవనున్నారు. స్వామి ఐదేళ్ల బాలుని రూపులో ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆలయ పూజారి అరుణ్ దీక్షిత్ తెలిపారు. ఆలయాన్ని బాలక్ రామ్ మందిర్‌గా పిలవనున్నట్టు ప్రకటించారు. వారణాసికి చెందిన ఆయన సోమవారం బాలరాముని ప్రాణప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘‘ఇప్పటిదాకా దాదాపు 60 దాకా ఆలయాల ప్రాణప్రతిష్టల్లో పాలుపంచుకున్నా. వాటన్నింట్లోనూ అయోధ్య ప్రాణప్రతిష్ట సర్వోత్తమం. ఆ సందర్భంగా అత్యంత అలౌకికానుభూతికి లోనయ్యా’’ అని దీక్షిత్ చెప్పుకొచ్చారు. ఆరు హారతులు, నైవేద్యాలు బాలక్ రామ్ రోజూ ఆరు హారతులు అందుకోనున్నాడు. స్వామికి ఉదయం మంగళారతితో మొదలు పెట్టి శృంగార, భోగ, ఉపతన, సంధ్యా హారతుల అనంతరం చివరగా శయనారతితో నిద్ర పుచ్చుతారు. బాలక్ రాముడు సోమవారం తెలుపు వ్రస్తాల్లో, మంగళవారం ఎరుపు, బుధవారం ఆకుపచ్చ, గురువారం పుసుపు, శుక్రవారం గోధుమ, శనివారం నీలం, ఆదివారం గులాబీ రంగు వ్రస్తాలంకరణలో భక్తులకు దర్శనమిస్తాడు. రబ్డీ, ఖీర్, పళ్లు, పాలతో పాటు పలురకాల నైవేద్యాలు అందుకుంటాడు.