
సాక్షి, హైదరాబాద్ : నగరంలో శుక్రవారం సాయంత్రం కురిసిన భారీ వర్షం కారణంగా ట్రాఫిక్ ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. పలు చోట్ల రోడ్లపై భారీగా వర్షపు నీరు నిలిచిపోవడంతో ఆఫీసుల నుంచి ఇళ్లకు బయలుదేరిన ఉద్యోగులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.ఈ ట్రాఫిక్‌లో సామాన్యులే కాదు సెలబ్రిటీలు కూడా చిక్కుకున్నారు. ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలు గంటల తరబడి రోడ్లపై నిలిచిపోవడంతో జనాలు మెట్రో రైలును ఆశ్రయిస్తున్నారు. హీరో నితిన్ కూడా ట్రాఫిక్ బారి నుంచి తప్పించుకోవడానికి మెట్రోలో ప్రయాణించారు.
మరోవైపు మాదాపూర్, హైటెక్‌సిటీ, కొండాపూర్‌లలో వాహనాలు గంటల తరబడి రోడ్లపై నిలిచిపోయాయి. కూకట్‌పల్లి ప్రధాన మార్గంలో కిలోమీటర్ల మేర వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment