
సాక్షి,హైదరాబాద్: రాజధాని హైదరాబాద్ నగరంలో మంగళవారం(ఆగస్టు13) ఉదయం భారీ వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట్, ఎస్సార్‌నగర్, బాలానగర్, బేగంపేట్, సికింద్రాబాద్, అల్వాల్ ప్రాంతాల్లో కురిసిన వర్షంతో రోడ్లపై అక్కడక్కడా భారీగా నీరు నిలిచింది. దీంతో రోడ్లపై ట్రాఫిక్ జామ్ అయింది. వాహనదారులు ఇబ్బంది పడ్డారు.