water logged
-
HYD: దంచికొట్టిన వర్షం.. రోడ్లపై వరద
సాక్షి,హైదరాబాద్: రాజధాని హైదరాబాద్ నగరంలో మంగళవారం(ఆగస్టు13) ఉదయం భారీ వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట్, ఎస్సార్‌నగర్, బాలానగర్, బేగంపేట్, సికింద్రాబాద్, అల్వాల్ ప్రాంతాల్లో కురిసిన వర్షంతో రోడ్లపై అక్కడక్కడా భారీగా నీరు నిలిచింది. దీంతో రోడ్లపై ట్రాఫిక్ జామ్ అయింది. వాహనదారులు ఇబ్బంది పడ్డారు. -
జీ20 ప్రాంగణంలోకి వర్షం నీరు
సాక్షి, న్యూఢిల్లీ: దేశరాజధానిలో ఆదివారం కురిసిన భారీ వర్షం ప్రభావం జీ20 సదస్సుపైనా పడింది. సదస్సు జరుగుతున్న ప్రగతిమైదాన్‌లోని భారత మండపంలోకి నీరు చేరింది. సిబ్బంది నీటిని బయటకు పంపే ఏర్పాట్లు చేపట్టారు. ఆయా దేశాల ప్రతినిధులు నీళ్లలోనే అటూఇటూ నడుస్తున్న వీడియోను కాంగ్రెస్ పార్టీ ‘ఎక్స్’లో షేర్ చేసింది. ‘జీ20 ఏర్పాట్ల కోసం రూ.2,700 కోట్లు కేంద్రం ఖర్చు చేసింది. ఇప్పుడు ఒక్క వర్షానికే భారత మండపం నీటితో నిండిపోయింది. పంపులతో సిబ్బంది నీటిని బయటకు పంపుతున్నారు. అభివృద్ధిలో డొల్లతనం బయటపడింది..’ అంటూ కాంగ్రెస్ ‘ఎక్స్’లో వ్యంగ్యంగా పేర్కొంది. ఈ వీడియోను షేర్ చేస్తూ ‘దేశ వ్యతిరేక అంతర్జాతీయ కుట్రలో వానలు కూడా భాగమే’అంటూ ఆ పార్టీ ప్రతినిధి సుప్రియ వ్యాఖ్యానించారు. ‘జీ20 సదస్సు సాగుతుండగానే భారత్ మండపంలోని వరదనీరు చేరిందన్న విషయాన్ని మీడియా ప్రస్తావించనేలేదు. మోదీజీ, దేశాన్ని ఎలా పాలించాలో మా నుంచి మీరు నేర్చుకోలేదు. కానీ, మీడియాను ఎలా మేనేజ్ చేయాలో మిమ్మల్ని చూసి మేం నేర్చుకోవాలి’అంటూ ఆ పార్టీ నేత పవన్ ఖేరా పేర్కొన్నారు. జనవరి 21న అయోధ్య రామాలయం ప్రారంభం అయోధ్య: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో భవ్య రామమందిర ప్రారం¿ోత్సవానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. వచ్చే ఏడాది జనవరి 21 నుంచి మూడు రోజులపాటు ఈ వేడుకలు నిర్వహించనున్నట్లు విశ్వ హిందూ పరిషత్(వీహెచ్‌పీ) కార్యనిర్వాహక అధ్యక్షుడు అలోక్ కుమార్ ఆదివారం చెప్పారు. ఈ కార్యక్రమానికి లక్ష మందికిపైగా మత ప్రముఖులను ఆహా్వనించనున్నట్లు తెలిపారు. అయోధ్యలో రామ మందిర ప్రారం¿ోత్సవానికి సన్నాహకంగా ఈ ఏడాది సెపె్టంబర్ 30 నుంచి అక్టోబర్ 15 దాకా లక్షలాది గ్రామాల్లో ‘శౌర్యయాత్ర’లు నిర్వహించేందుకు బజరంగ్ దళ్ ఏర్పాట్లు చేస్తోంది. -
కాలనీలను భారీగా ముంచెత్తిన వరద నీరు
-
గన్నవరం: భానురేఖ కుటుంబానికి సీఎం సిద్ధరామయ్య పరిహారం ప్రకటన
సాక్షి, బెంగళూరు/గన్నవరం: కర్ణాటకలో ఊహించని రీతిలో వరద ప్రమాదంలో మృతి చెందింది ఏపీ యువతి భానురేఖా రెడ్డి(23). కుటుంబంతో సరదాగా బయటకు వెళ్లగా.. అండర్ పాస్‌లో భారీగా నిలిచిన నీటిలో ట్యాక్సీ చిక్కుకుని ఆమె కన్నుమూసింది. ఈ ఘటన గురించి తెలియగానే సీఎం సిద్ధరామయ్య వెంటనే సెయింట్ మార్తా ఆస్పత్రికి వెళ్లారు. భానురేఖ మృతదేహాన్ని పరిశీలించి.. ఆమె కుటుంబ సభ్యులను ఓదార్చారు. బాధిత కుటుంబానికి ఐదు లక్షల పరిహారం ప్రకటించడంతో పాటు ఆస్పత్రిలో చేరిన నలుగురు కుటుంబ సభ్యులకు ఉచిత చికిత్స అందించనున్నట్లు ప్రకటించారు. కృష్ణా జిల్లా(ఏపీ) ఉంగుటూరు మండలం తేలప్రోలు గ్రామానికి చెందిన భానురేఖ ఎలక్ట్రానిక్ సిటీలోని ఇన్ఫోసిస్ క్యాంపస్‌లో పని చేస్తున్నారు. కుటుంబంతో సహా బెంగళూరు చూడాలని ఆదివారం సాయంత్రం ఓ క్యాబ్‌ను బుక్ చేసుకుని బయల్దేరింది. అండర్‌పాస్‌లోని బారికేడ్ పడిపోవడం, అది గమనించకుండా రిస్క్ చేసి ఆ నీళ్లలోంచి వెళ్లాలని డ్రైవర్ ప్రయత్నించడం వల్లే ఈ ఘోరం జరిగిందని సీఎం సిద్ధరామయ్య మీడియాకు ఘటన గురించి వివరించారు. దర్యాప్తు చేస్తాం! ఇదిలా ఉంటే.. భానురేఖను ఆస్పత్రికి తీసుకొచ్చే సమయానికి ఆమె కొన ఊపిరితో ఉందని, ఆమెకు చికిత్స అందించేందుకు వైద్యులు నిరాకరించారని, దానికి తామే సాక్షులమని కొందరు రిపోర్టర్లు సీఎం సిద్ధరామయ్య వద్ద ఆరోపించారు. ఈ ఆరోపణలపై సీఎం సిద్ధరామయ్య స్పందిస్తూ.. దర్యాప్తు జరిపి రుజువైతే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అయితే ఆస్పత్రి వర్గాలు మాత్రం భానురేఖ ఆస్పత్రికి చేరుకునేలోపే చనిపోయిందని అంటున్నాయి. Karnataka CM Siddaramaiah met the family members of 23-year-old woman Bhanurekha who died after drowning in the waterlogged underpass in KR Circle area in Bengaluru. pic.twitter.com/aqQW3yG0Qy — ANI (@ANI) May 21, 2023 డ్రైవర్ దూకుడు వల్లే.. ఆదివారం సాయంత్రం తన కుటుంబంతో కలిసి సరదాగా బయటకు వెళ్తామని క్యాబ్ బుక్ చేసుకుంది భానురేఖ. భానురేఖ, ఐదుగురు కుటుంబ సభ్యులు క్యాబ్‌లో బయల్దేరారు. అయితే కేఆర్ సర్కిల్ అండర్ పాస్ వద్ద భారీగా వరద నీరు చేరి ఉంది. ఆ సమయంలో అవతలి ఎండ్‌లో ఎదురుగా కొన్ని వాహనాలు నిలిచి ఉండడం గమనించిన క్యాబ్ డ్రైవర్.. వెళ్లిపోవచ్చనే ఉద్దేశంతో కారును వేగంగా ముందుకు పోనిచ్చే యత్నం చేశాడు. కారు అండర్‌పాస్ మధ్యలోకి రాగానే.. ఒక్కసారిగా మునిగిపోయింది. దీంతో క్యాబ్‌లోని భానురేఖ కుటుంబ సభ్యులు కేకలు వేస్తూ సాయం కోసం ఆర్తనాదాలు చేశారు. బయటకు వచ్చి తమ ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేశారు. ఈలోపు అక్కడ గుమిగూడిన కొందరు వాళ్లను రక్షించే యత్నం చేశారు. చీరలు, తాడులు విసిరి వాళ్లను బయటకు లాగేందుకు ప్రయత్నించారు. నీరు క్రమక్రమంగా వేగంగా అండర్‌పాస్‌ను ముంచెత్తడంతో అది సాధ్యపడలేదు. ఈలోపు అక్కడికి చేరుకున్న సహాయక సిబ్బంది ఈదుకుంటూ వెళ్లిన ఇద్దరిని రక్షించారు. ఆపై నిచ్చెన ద్వారా అందరినీ బయటకు లాగి ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రికి చేరుకున్నాక భానురేఖ మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. అదే కేఆర్ సర్కిల్లోని అదే పాస్ వద్ద మరో మహిళా ప్యాసింజర్ ఆటోతో సహా చిక్కుకుపోగా.. పైకి ఎక్కి ఆమె తన ప్రాణాలను రక్షించుకుంది. రెస్క్యూ సిబ్బందిని ఆమెను బయటకు తీసుకొచ్చారు. కేవలం గంట పాటు కురిసిన భారీ వర్షానికి.. ఇలా ఆ లోతట్టు ప్రాంతం మునిగిపోవడంతోనే ఈ విషాదం నెలకొంది. స్వగ్రామంలో విషాద ఛాయలు సాక్షి, కృష్ణా: బెంగుళూరులో సాఫ్ట్ వేర్ ఉద్యోగిని బత్తుల భాను రేఖ మృతితో స్వగ్రామం తేలప్రోలులో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆమె తండ్రిది వీరపనేనిగూడెం. అయితే.. భాను రేఖ మాత్రం తల్లితో కలిసి అమ్మమ్మ ఇంట్లోనే పెరిగింది. బెంగళూరుకు వెళ్లకముందు ఆమె హైదరాబాద్‌లో ఉంది. ఆదివారం జరిగిన ఘటనలో ఆమె కన్నుమూసింది. ఉంగుటూరు మండలం తేలప్రోలులోని ఇంటివద్ద భాను రేఖ పార్థివదేహం కోసం కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు. అయితే.. పోస్టుమార్టం అనంతరం బెంగుళూరు నుండి తేలప్రోలుకి భాను భౌతిక కాయం చేరుకోనుంది. -
నీట మునిగిన అమరావతి.. చెరువును తలపిస్తున్న వైనం!
సాక్షి, అమరావతి: ఏపీలో భారీ కురుస్తున్న విషయం తెలిసిందే. కాగా, వర్షాల నేపథ్యంలో అమరావతి నీట మునిగింది. భారీ వర్షాల కురుస్తున్న క్రమంలో అమరావతి ప్రాంతం వర్షపు నీటితో చెరువును తలపిస్తోంది. ఆ ప్రాంతంలో వర్షపు నీరు భారీగా నిలిచిపోయింది. -
తమిళనాడును ముంచెత్తుతున్నవానలు
-
ఢిల్లీలో భారీ వర్షం.. 18 ఏళ్ల తర్వాత తొలిసారి
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షానికి రహదారులన్ని జలమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కాగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఇక దేశ రాజధానిలో శుక్రవారం నుంచి ఏకదాటిగా కురుస్తున్న వర్షంతో 18 ఏళ్ల రికార్డు బద్దలయింది. 18 ఏళ్ల తర్వాత అత్యధిక వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలకు ఢిల్లీవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాలతో ఢిల్లీలోని నారేలా ప్రాంతంలో ఓ ఇల్లు కుప్పకూలిపోయింది. ప్రమాదంలో ఎవరికీ ఏం కాలేదు. మధు విహార్, జోర్‌బాగ్, మోతీబాగ్, ఆర్కేపురం, సదర్ బజార్ ప్రాంతాలు నీటితో రోడ్లు నిండిపోయాయి. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రాణిఖేదాలోని అండర్‌పాస్ మొత్తం నీటితో మునిగిపోయింది. రేపు ఉదయం వరకు భారీ వర్షం కొనసాగుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన పరిస్థితులతో సెప్టెంబర్ 16-17 తేదీల్లో కుంభవృష్టి కురుస్తుందని పేర్కొంది. చదవండి: Covid-19: ‘ఎర్ర చీమల చట్నీ’ వాడాలని చెప్పలేం -
కుండపోత వానతో రోడ్లు, కాలనీలు జలమయం
-
అధ్వానంగా మారిన బిహార్ మెడికల్ కాలేజీ హాస్పిటల్
-
ఇక్కడ వైద్యం అంటే నరకంలో బెర్త్ కన్ఫామ్
పట్న: కోవిడ్ విజృంభిస్తోన్న వేళ వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యం బాగా పెరిగింది. ఇక ఆస్పత్రుల సంగతైతే చెప్పక్కర్లేదు. ముఖ్యంగా కరోనా వార్డులను చాలా పరిశుభ్రంగా ఉంచాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో ప్రస్తుతం ప్రభుత్వ ఆస్పత్రలను కూడా విధిగా ప్రతి రోజు శుభ్రం చేస్తున్నారు. అయితే బిహార్‌లోని ఓ ఆస్పత్రిని చూస్తే.. ఎవరికి దాన్ని హాస్సిటల్ అని పిలవాలనిపించదు. ఎక్కడికక్కడ పెరుకుపోయిన చెత్త.. రోడ్లపై నిలిచిపోయిన మురికి నీరు.. మనుషులతో పాటు ఆస్పత్రి ప్రాంగణంలో పందులు, పశువులు కూడా అక్కడే తిరుగుతున్నాయి. రోగులకు వైద్య సేవలతో పాటు ఈ జంతువులను తరమడం అక్కడ సిబ్బంది విధుల్లో భాగం అయ్యింది. బిహార్‌లోని పురాతన వైద్య కళాశాలలలో ఒకటైన దర్భంగా మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో(డీఎంసీహెచ్) ఇలాంటి దృశ్యాలు నిత్యకృత్యం అయ్యాయి. సమస్తిపూర్, మధుబని, సహర్సాతో సహా అనేక జిల్లాల ప్రజలు ఈ డీఎంసీహెచ్పై ఆధారపడతారు. కాని ఇక్కడ వైద్యం చేయించుకోవడం అంటే.. నరకంలో ప్రవేశించడమే అంటున్నారు స్థానికులు. అత్యవసర విధులు నిర్వహించే నర్సులు, డాక్టర్లు మురికి నీటి కాలువలను దాటుకుంటూ అక్కడకు చేరుకోవాలి. ఈ క్రమంలో దీపా కుమారి అనే నర్సు మాట్లాడుతూ.. ‘‘గత 27 సంవత్సరాలుగా ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నాను. వర్షాకాలంలో ఇది మరింత తీవ్రమవుతుంది’’ అని తెలిపారు. ఇలాంటి అపరిశుభ్ర వాతావరణంలో ఫ్రంట్‌లైన్ కార్మికులు తమ ప్రాణాలను పణంగా పెట్టి సేవ చేయవలసి వస్తుంది. డీఎంసీహెచ్ మెడికల్ సూపరింటెండెంట్ మణి భూషణ్ శర్మ కార్యాలయం కూడా ఈ చెత్త మధ్యనే ఉంది. ఆయన తన ఆఫీస్‌కు చేరుకోవాలంటే ఓ గార్డు, డ్రైవర్ సహాయం తీసుకోవాల్సి వస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఈ ఆస్పత్రి చాలా పాతది, లోతట్టు ప్రాంతంలో ఉంది. ఇదే ప్రాంగణంలో కొత్తగా నిర్మించిన భవనంలో కోవిడ్ బాధితులకు చికిత్స చేస్తున్నాం. కానీ అక్కడకు చేరుకునే పరిసరాలు కూడా ఇలానే నీరు నిండిపోయి ఉంటాయి. సిబ్బంది చాలా తక్కువగా ఉండటం కూడా సమస్యే’’ అన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజనులు మండిపడుతున్నారు. పన్నుల రూపంలో మా దగ్గర నుంచి లక్షల్లో దోచేస్తూ.. కనీస సౌకర్యాలు కల్పించని ఈ ప్రభుత్వాలు ఎందుకు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: మానవత్వం మచ్చుకైనా లేదు.. అంత ‘మనీ’తత్వమే -
కోల్‌కతా జలమయం..
సాక్షి, కోల్‌కతా : కొద్దిపాటి జల్లులకే మన నగరాలు జలాశయాల్లా మారుతున్నాయి. కోల్‌కతాలో మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షాలతో నగరం జలమయమైంది. రోడ్డుపై మోకాలి లోతుపైగా నీరు నిలిచి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం నెలకొంది. డ్రైన్లు పొంగిపొర్లుతుండటంతో కోల్‌కతాలో బుధవారం జనజీవనం స్థంభించింది. రహదారులపై నిలిచిన నీటి ఉధృతి తగ్గకపోవడంతో వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా, కోల్‌కతాలో ఇప్పటివరకూ 15 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని, మరో 24 గంటలు భారీ వర్షాలు కురుస్తాయని వాతావారణ కేంద్రం అంచనా వేయడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మరోవైపు బెంగాల్, అసోంనూ భారీ వర్షాలు ముంచెత్తాయి. బెంగాల్లో భారీ వర్షాలు, పిడుగుపాటుకు పది మంది మరణించారని అధికారులు తెలిపారు. అటు అసోంనూ వర్షాలు వణికిస్తున్నాయి. గత రెండు రోజులుగా ఎడతెరిపిలేని వర్షాలతో రహదారులు జలమయమయ్యాయి. గాలుల ఉధృతికి భారీ వృక్షాలు నేలకొరగడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. -
న్యూఢిల్లీలో భారీ వర్షాలు
న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలోని పలు ప్రాంతాలలో శనివారం భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షపు నీరు రహదారులపై నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దాంతో రహదారిపై ఎక్కడి వాహనాలు ఎక్కడ నిలిచిపోయాయి. భారీగా వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.