nitin
-
జయం మూవీలో ఫస్ట్ హీరోయిన్ గా రష్మీనే తీసుకున్నాం : నితిన్
-
బలగం వేణు సినిమా లో ఎల్లమ్మ గా సాయి పల్లవి
-
లక్కీ భాస్కర్ డైరెక్టర్ పై మండి పడుతున్న నితిన్, అఖిల్
-
ఆస్ట్రేలియాలో ఆటా పాటా
ఆస్ట్రేలియా వెళ్లింది ‘రాబిన్‌హుడ్’ టీమ్. ‘భీష్మ’ (2020) వంటి సూపర్‌హిట్ ఫిల్మ్ తర్వాత హీరో నితిన్–దర్శకుడు వెంకీ కుడుముల కాంబినేషన్లో రూపొందుతున్న తాజా చిత్రం ‘రాబిన్‌హుడ్’. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ఆస్ట్రేలియాలో జరుగుతోంది. నితిన్, శ్రీలీల కాంబినేషన్లో ఓ డ్యూయెట్ సాంగ్‌ను చిత్రీకరిస్తున్నారు మేకర్స్.మెల్బోర్న్లోని అందమైన లొకేషన్స్‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ పాటకు కృష్ణకాంత్ లిరిక్స్ రాయగా, శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఈ సాంగ్‌తో పాటు కొంత టాకీపార్టు చిత్రీకరణ కూడా ఆస్ట్రేలియాలో జరగనుంది. ఈ సినిమాకు జీవీ ప్రకాశ్‌కుమార్ సంగీతం అందిస్తున్నారు. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబరు 20న విడుదల కానుంది. -
ఆయ్‌కి ఎన్టీఆర్ అభినందనలు
ఎన్టీఆర్ బావమరిది, ‘మ్యాడ్’ ఫేమ్ నార్నే నితిన్, నయన్ సారిక హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఆయ్’. అంజి కె. మణిపుత్ర దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు, విద్యా కొప్పినీడి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 15న విడుదలైంది.తమ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోందని చిత్రబృందం పేర్కొంది. తాజాగా ‘ఆయ్’ యూనిట్ ఎన్టీఆర్‌ను కలిసింది. సినిమా విజయం సాధించినందుకు యూనిట్ సభ్యులను ఎన్టీఆర్ అభినందించారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. -
అతిథి పాత్రకు సై?
అందం, అభినయం పరంగా తెలుగు ప్రేక్షకుల్లోనూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న మలయాళ బ్యూటీ నిత్యా మీనన్ తెలుగు సినిమా అంగీకరించి దాదాపు రెండేళ్లయింది. ప్రస్తుతం తమిళంలో ‘కాదలిక్క నేరమిల్లయ్, డియర్ ఎక్సెస్’ సినిమాలు చేస్తున్నారు. ఇవి తెలుగులోనూ విడుదలయ్యే అవకాశం ఉంది. మరి... నిత్యా మీనన్ స్ట్రయిట్ తెలుగు సినిమా సంగతి ఏంటి? అంటే... ఆమె ఓ తెలుగు సినిమా అంగీకరించారనే ప్రచారం జరుగుతోంది. నితిన్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘తమ్ముడు’ సినిమాలో అతిథి పాత్రకు సై అన్నారట నిత్య. గతంలో నితిన్, నిత్యా మీనన్ జంటగా నటించిన ‘ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే’ చిత్రాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. అలా హిట్ పెయిర్ అనిపించుకున్నారు. తాజాగా నితిన్ హీరోగా రూ΄÷ందుతున్న ‘తమ్ముడు’లో సప్తమీ గౌడ కథానాయికగా నటిస్తున్నారు. నటి లయ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. ఇందులో ఉన్న కీలకమైన అతిథి పాత్రకు నిత్యా మీనన్‌ని తీసుకున్నారని సమాచారం. -
రాబిన్ హుడ్‌తో జోడీ?
హీరో నితిన్–హీరోయిన్ రాశీ ఖన్నా మరోసారి జోడీగా నటించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్‌నగర్ వర్గాలు. నితిన్–రాశీ ఖన్నా ‘శ్రీనివాస కళ్యాణం’ (2018) మూవీలో జోడీగా నటించిన సంగతి తెలిసిందే. తాజాగా వీరిద్దరూ ‘రాబిన్ హుడ్’ సినిమాలో నటించనున్నారని టాక్. ‘భీష్మ’ (2020) వంటి హిట్ మూవీ తర్వాత హీరో నితిన్–డైరెక్టర్ వెంకీ కుడుముల కాంబినేషన్లో వస్తున్న ద్వితీయ చిత్రం ‘రాబిన్ హుడ్’. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 20న విడుదల కానుంది. అయితే ఈ మూవీలో కథానాయిక ఎవరు? అనే విషయంపై స్పష్టత లేదు. తొలుత రష్మికా మందన్న హీరోయిన్గా నటిస్తారనే వార్తలొచ్చాయి. ఆ తర్వాత శ్రీలీల పేరు తెరపైకి వచ్చింది. తాజాగా రాశీ ఖన్నాని తీసుకున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరి నితిన్‌కి జోడీగా రాశీ ఖన్నా ఫిక్స్ అయ్యారా? లేకుంటే మరో హీరోయిన్ తెరపైకి వస్తారా? అనే విషయంపై చిత్ర యూనిట్ నుంచి స్పష్టత రావాల్సి ఉంది. -
రాబిన్‌హుడ్ డేట్ ఫిక్స్
నితిన్ హీరోగా రూపొందుతోన్న తాజా చిత్రం ‘రాబిన్‌హుడ్’ విడుదల తేదీ ఖరారు అయింది. డిసెంబర్ 20న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, ‘వెన్నెల’ కిశోర్ కీలక పాత్రలు ΄ోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘‘అన్ని వాణిజ్య అంశాలతో పాటు వినోదంతో రూపొందుతోన్న చిత్రం ‘రాబిన్‌హుడ్’. ఈ చిత్రంలో నితిన్ మునుపెన్నడూ చూడని సరికొత్త పాత్రలో కనిపిస్తారు. తన గెటప్ నుండి క్యారెక్టరైజేషన్ వరకు పూర్తిగా డిఫరెంట్‌గా ప్రెజెంట్ చేస్తున్నారు వెంకీ కుడుముల. క్రిస్మస్ సెలవులు, ఆ తర్వాత న్యూ ఇయర్ సెలవులు మా సినిమాకి కలిసి రానున్నాయి’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్, కెమెరా: సాయి శ్రీరామ్. -
సోదరుడే కాలయముడై..
మైసూరు: ఇతర మతానికి చెందిన యువకుడిని ప్రేమించిందనే కోపంతో చెల్లిని సొంత అన్న చెరువులోకి తోసేయగా.. ఆమెను కాపాడేందుకు ప్రయత్నించిన తల్లి కూడా జలసమాధి అయ్యింది. ఈ దారుణం మైసూరు జిల్లా హుణసూరు తాలూకా మరూరు గ్రామంలో జరిగింది. వివరాలు.. మరూరుకు చెందిన సతీశ్, అనిత(43) దంపతుల కుమారుడు నితిన్ కూలి పనులకు వెళ్తుండగా.. ధను శ్రీ(18) బీకాం రెండో సంవత్సరం చదువుతోంది. ఈక్రమంలో మారూరుకు పొరుగున ఉన్న హనగోడు గ్రామానికి చెందిన ఇతర మతస్తుడైన యువకుడిని ధనుశ్రీ ప్రేమిస్తోంది. ఈ విషయం తెలిసిన నితిన్ తరుచూ ధనుశ్రీతో గొడవ పడేవాడు. మంగళవారం సాయంత్రం బంధువులకు బాగా లేదంటూ నితిన్ బైక్‌పై తన సోదరి ధనుశ్రీని, తల్లి అనితను బయటకు తీసుకెళ్లాడు. ఊరి బయట ఉన్న చెరువు వద్ద ధనుశ్రీ ప్రేమ విషయమై వారి మధ్య గొడవ జరిగింది. ఇంతలో పట్టరాని కోపంతో నితిన్ తన చెల్లి చేతులను టవల్‌తో కట్టేసి చెరువులోకి తోసేశాడు. ఆ వెంటనే కుమార్తెను కాపాడుకునేందుకు తల్లి అనిత కూడా చెరువులోకి దూకింది. దీంతో తల్లిని రక్షించేందుకు నితిన్ నీటిలోకి దూకాడు. కానీ తల్లీకూతురు నీళ్లలో మునిగి మరణించారు. ఆ తర్వాత నితిన్ ఇంటికి వచ్చి తండ్రి సతీశ్‌కు ఈ విషయం తెలియజేశాడు. బుధవారం ఉదయాన్నే గ్రామస్తులు, ఫైర్ సిబ్బంది చెరువులో గాలించి అనిత, ధనుశ్రీ మృతదేహాలను బయటకు తీశారు. హుణసూరు రూరల్ పోలీసులు నితిన్‌ను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. -
ఈగోని పక్కన పెడితే ఆడియన్స్‌కి దగ్గరవుతాం
‘‘గ్లోబల్ స్థాయికి వెళ్లాలని ‘ఆర్ఆర్ఆర్’, ‘పుష్ప’ సినిమాలను చేయలేదు. కథాబలం ఉండటంతో ఆ సినిమాలను జపాన్ వంటి ఇతర దేశాల ప్రేక్షకులూ ఆదరించారు. గ్లోబల్ అప్పీల్ ఉన్న కథ కోసం ఎదురు చూస్తూ ఉంటే టైమ్ వృథా అవుతుంది. నాకు వచ్చిన కథలు చేసుకుంటూ వెళ్తున్నాను. ఈ క్రమంలో పాన్ ఇండియా కథ ఏదైనా సెట్ అయితే ఓకే. అయినా నాకలాంటి పెద్ద పెద్ద ఆశలు లేవు. తెలుగులోనే సినిమాలు చేయాలని ఉంది’’ అని హీరో నితిన్ అన్నారు. నితిన్, శ్రీ లీల జంటగా వక్కంతం వంశీ దర్శకత్వంలో సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించిన ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మేన్’ రేపు రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో నితిన్ చెప్పిన విశేషాలు. ► ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మేన్’లో నా పాత్రలో త్రీ షేడ్స్ ఉన్నాయి. కథ రీత్యా జూనియర్ ఆర్టిస్ట్‌గా కనిపిస్తాను. అలా అని ఈ సినిమాలో జూనియర్ ఆర్టిస్టుల కష్టాల గురించి చెప్పడం లేదు. ఆ పాత్ర నుంచి కామెడీ పండించాం. ‘ఎక్స్ట్రా’ చిత్రంలో ఇంట్రవెల్లో వచ్చే ట్విస్ట్ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంది. కథ కొత్తది కాక΄ోవచ్చు కానీ పాయింట్ చాలా కొత్తగా ఉంటుంది. ఈ సినిమా కథ విన్నప్పుడల్లా హాయిగా నవ్వుకున్నాను. కథ స్క్రీన్ మీదకు వచ్చినప్పుడు కూడా సేమ్ ఫీలింగ్. ►వక్కంతం వంశీగారి కథలతో వచ్చిన ‘కిక్’, ‘రేసు గుర్రం’, ‘ఊసరవెల్లి’, ‘టెంపర్’ చిత్రాలను గమనిస్తే హీరో క్యారెక్టరైజేషన్ కొత్తగా, విభిన్నంగా ఉంటుంది. ‘ఎక్స్ట్రా’ చిత్రంలోనూ ఇలానే ఉంటుంది. స్క్రీన్ ప్లే కొత్తగా ఉంటుంది. ►సినిమాలో రావు రమేశ్‌గారు నాకు తండ్రిగా నటించారు. ఆయనకు, నాకు మధ్య వచ్చే సీన్స్ వినోదాత్మకంగా ఉంటాయి. కొంత సెంటిమెంట్ కూడా ఉంటుంది. రాజశేఖర్‌గారు సెకండాఫ్‌లో వస్తారు. సందర్భానుసారంగా కామెడీ వస్తుంటుంది. ►సినిమాలో నేను జూనియర్ ఆర్టిస్టు్టను కాబట్టి ‘శ్రీమంతుడు’, ‘బాహుబలి’ వంటి సినిమాల ప్రస్తావనతో కాస్త కామెడీ ఉంటుంది. వినోదం కోసమే ఇలా చేశాం. ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ వంటి సినిమాల్లో వెంకటేశ్‌గారి పాత్రపై ఇతర పాత్రధారులు జోక్స్ వేస్తుంటారు. ఇమేజ్, ఈగోల గురించి ఆలోచించకుండా పాత్ర కోసం నటిస్తే ఆడియన్స్‌కు మరింత దగ్గర కావొచ్చు. ఈ విషయంలో నాకు వెంకటేశ్‌గారు స్ఫూర్తి. ►ప్రస్తుతం వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాను. ఈ చిత్రంలో శ్రీ లీల హీరోయిన్. అలాగే వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘తమ్ముడు’ సినిమా చేస్తున్నాను. కథ నచ్చితే గ్రే షేడ్ (కాస్త నెగటివ్ టచ్ ఉన్న పాత్రలు) ఉన్న పాత్రలు చేయడానికి రెడీగా ఉన్నాను. -
ఎక్స్ట్రా వినోదం ఉంటుంది – నితిన్
నితిన్, శ్రీలీల జంటగా వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఎక్స్ట్రా’. ‘ఆర్డినరీ మ్యాన్’ అనేది ఉపశీర్షిక. సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 8న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమాలోని ‘ఒలే ఒలే పాపాయి పలాసకే వచ్చేయ్..’ అనే మాస్ సాంగ్ ప్రోమోను విడుదల చేశారు. సంగీత దర్శకుడు హ్యారిస్ జైరాజ్ స్వరపరచిన ఈ పాటకు కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించగా రామ్ మిరియాల, ప్రియ హేమెస్ పాడారు. ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్లో నితిన్ మాట్లాడుతూ– ‘‘నా కెరీర్లోనే బెస్ట్ క్యారెక్టర్‌ను ఈ సినిమాలో చేశాను. సినిమా ఎక్స్ట్రా ఎంటర్టైన్మెంట్తో ఉంటుంది’’ అన్నారు. ‘‘ట్రైలర్‌కు పదింతల వినోదం మా సినిమాలో ఉంటుంది. ఈ సినిమా విషయంలో నాకు సప్రోర్ట్ చేసిన నితిన్‌గారికి థ్యాంక్స్. ఇంట్రవెల్ సన్నివేశంలో ఓ మంచి ట్విస్ట్ ఉంది’’ అన్నారు వక్కంతం వంశీ. ‘‘టైటిల్‌కి తగ్గట్టు ఈ సినిమా ఎక్స్ట్రార్డినరీగా ఉంటుంది’’ అన్నారు సుధాకర్ రెడ్డి. -
నా 21 ఏళ్ల కెరీర్ లో నా బెస్ట్ రోల్ ఇదే..!
-
ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ టీం తో ఫన్ టైం
-
ఎక్స్ట్రార్డినరీ సాంగ్
ఎక్స్ట్రార్డినరీ లెవల్లో డ్యాన్స్ చేశారు నితిన్. వక్కంతం వంశీ దర్శకత్వంలో నితిన్, శ్రీలీల జంటగా నటిస్తున్న చిత్రం ‘ఎక్స్ట్రా: ఆర్డినరీ మ్యాన్’. రాజశేఖర్ ఓ కీలక పాత్రధారి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ శివార్లలో జరుగుతోంది. ఓ భారీ సెట్లో 300 మందికి పైగా ఫారిన్ డ్యాన్సర్స్‌తో జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో నితిన్, శ్రీలీలపై ఓ మాస్ సాంగ్‌ను చిత్రీకరిస్తున్నారు. ఈ పాటతో ఈ సినిమా చిత్రీకరణ పూర్తవు తుందని, మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయని యూనిట్ పేర్కొంది. శ్రేష్ఠ్ మూవీస్, ఆదిత్యా మూవీస్ అండ్ ఎంటర్టైన్మెంట్స్, రుచిర ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై ఎన్. సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబరు 8న విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం: హ్యారిస్ జైరాజ్. -
ఎక్స్‌ట్రాలోకి స్వాగతం
ఎన్నో విలక్షణమైన పాత్రలతో అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించి, వారి హృదయాల్లో తనదైన స్థానం సొంతం చేసుకున్న హీరో రాజశేఖర్ ‘ఎక్స్ ట్రా– ఆర్డినరీ మేన్ ’ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. అందులో భాగంగా సోమవారం ఆయన సెట్స్‌లోకి అడుగుపెట్టారు. నితిన్ , శ్రీలీల జంటగా వక్కంతం వంశీ దర్శకత్వంలో ‘ఎక్స్ట్రా: ఆర్డినరీ మేన్ ’ చిత్రం తెరకెక్కుతోంది. శ్రేష్ఠ్ మూవీస్, ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్టైన్మెంట్, రుచిర ఎంటర్టైన్ మెంట్స్‌పై సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో రాజశేఖర్ నటిస్తున్నట్లు యూనిట్ ప్రకటించింది. ఈ మేరకు ఆయన సెట్స్‌లోకి అడుగు పెట్టగా, మేకర్స్ స్వాగతం పలికారు. ‘‘ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్గా ‘ఎక్ ్సట్రా’ రూపొందుతోంది. ఇప్పటి వరకు తన కెరీర్లో చేయని పాత్రను నితిన్ ఈ సినిమాలో చేస్తున్నారు’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ మూవీ డిసెంబరు 8న విడుదలకానుంది. -
మరికాస్త ముందుకు ఎక్స్ట్రా
అనుకున్న సమయానికంటే ముందుగానే థియేటర్స్‌కు వస్తున్నారు హీరో నితిన్ . వక్కంతం వంశీ దర్శకత్వంలో నితిన్ హీరోగా ‘ఎక్స్ట్రా: ఆర్డినరీ మేన్ ’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. శ్రేష్ఠ్ మూవీస్, ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్టైన్మెంట్, రుచిర ఎంటర్టైన్ మెంట్స్‌పై సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాను తొలుత డిసెంబరు 23న విడుదల చేయాలనుకున్నారు. అయితే ఆ సమయానికి ప్రభాస్ హీరోగా నటించిన ‘సలార్:సీజ్ఫైర్’ చిత్రం రిలీజ్‌కు సిద్ధం కావడంతో ‘ఎక్స్ట్రా’ని కాస్త ముందుగానే డిసెంబరు 8న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు హారిస్ జైరాజ్ స్వరకర్త. -
ఆ క్వాలిటీస్ ఉంటే చాలు పెళ్లికి రెడీ..!
-
ఫాంహౌస్‌లో గెట్ టు గెదర్ పార్టీ: విషాదంగా మారిన ప్రయాణం
జమ్మికుంట/చేవెళ్ల: కుటుంబ సభ్యులంతా ఆదివారం సరదాగా గడపాలని అనుకున్నారు. ఓ ఫాంహౌస్‌లో గెట్ టు గెదర్ పార్టీ ఉండడంతో వారి కారులో బయలుదేరారు. ఈ ప్రయాణం కాస్త విషాదంగా మారింది. పోలీసులు తెలిపిన ప్రకారం.. కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన హైతా యుగేందర్, అనురాధ దంపతులు. హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. చేవెళ్ల సమీపంలోని ఓ ఫాంహౌస్‌లో ఆత్మీయ సమ్మేళనం ఉండడంతో యుగేందర్ దంపతులు, వారి పెద్ద కుమారుడు శరణ్, కోడలు సంఘవి, చిన్న కుమారుడు నితిన్ (27) కారులో ప్రయాణమయ్యారు. నితిన్ కారు డ్రైవ్ చేస్తుండగా, చేవెళ్ల మండల కేంద్రానికి సమీపంలో అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న స్తంభాన్ని ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నితిన్ తలకు బలమైన గాయమవగా, కారులో ప్రయాణిస్తున్న వారి కుటుంబ సభ్యులకు స్వల్ప గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రులను చేవెళ్ల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు నితిన్ అప్పటికే మృతి చెందినట్లు ప్రకటించారు. చేతికి వచ్చిన కొడుకు వ్యాపారం చేస్తూ కుటుంబానికి అండగా నిలబడ్డాడు. ఈ ఘటన వారి కుటుంబంలో విషాదం నింపింది. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. నితిన్ మృతితో జమ్మికుంటలో విషాదం నెలకొంది. -
బిల్లు కట్టలేక బిడ్డను ఆసుపత్రిలో వదిలేశారు..
సైదాబాద్(హైదరాబాద్): వైద్యానికైన బిల్లు చెల్లించేస్తోమత లేక నిరుపేద దంపతులు తమ కూతురును ఆసుపత్రిలోనే వదిలేశారు. ఐదురోజులుగా ఎంత ప్రయత్నించినా ఆదుకునేనాథుడులేక దీనస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. హైదరాబాద్ ఐఎస్ సదన్ డివిజన్ సింగరేణి కాలనీలో నివసించే నితిన్, ప్రవల్లిక ఏడాదిన్నర క్రితం ప్రేమవివాహం చేసుకున్నారు. నితిన్ కిరాయి ఆటో నడుపుతూ భార్యను పోషిస్తున్నాడు. 13 రోజుల క్రితం వారికి కూతురు జన్మించింది. అయితే పసిపాపకు ఊపిరితిత్తుల సమస్య ఉండటంతో మెరుగైన వైద్యం కోసం ఒవైసీ ఆసుపత్రిలో చేర్చారు. ఏడురోజుల చికిత్స అనంతరం చిన్నారి కోలుకుంది. వైద్యానికిగాను రూ.లక్షా 16 వేల బిల్లు అయింది. అయితే వారి వద్ద కేవలం రూ. 35 వేలు మాత్రమే ఉన్నాయి. మిగిలిన డబ్బులు కట్టడానికి సహాయం కోసం ఎవరిని అడిగినా ఫలితం లేకపోయింది. దాంతో బిల్లు కట్టలేక ఆ దంపతులు తమ కూతురును ఆసుపత్రిలోనే వదిలేశారు. గత ఐదు రోజులుగా తమను ఆదుకునేవారి కోసం ఎదురు చూస్తున్నారు. మంగళవారం సేవాలాల్ బంజారా సంఘం కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడుతూ తమ ఆవేదన వ్యక్తం చేశారు. సంఘం అధ్యక్షుడు కొర్ర మోతీలాల్ నాయక్ మాట్లాడుతూ దాతలు ఈ నిరుపేద కుటుంబానికి అండగా నిలిచి ఆసుపత్రి బిల్లు కట్టేందుకు సాయం చేయాలని కోరారు. -
టీజర్.. ట్రైలర్ క్రేజీగా ఉన్నాయి
‘‘మార్క్ ఆంటోనీ’ సినిమా ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ క్రేజీగా ఉన్నాయి. ఈ చిత్రం కచ్చితంగా విజయం సాధిస్తుంది. ఈ చిత్రంతో విశాల్ మరో స్థాయికి వెళ్లాలి’’ అని హీరో నితిన్ అన్నారు. విశాల్, రీతూ వర్మ జంటగా నటించిన చిత్రం ‘మార్క్ ఆంటోనీ’. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో ఎస్. వినోద్ కుమార్ నిర్మించారు. ఎస్జే సూర్య, సునీల్, సెల్వరాఘవన్ కీలక ΄ాత్రల్లో నటించిన ఈ సినిమా ఈ నెల 15న రిలీజవుతోంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ‘మార్క్ ఆంటోనీ’ ప్రీ రిలీజ్ వేడుకకి ముఖ్య అతిథిగా హాజరయ్యారు హీరో నితిన్. విశాల్ మాట్లాడుతూ–‘‘నా మొదటి చిత్రం ‘చెల్లమే’ (ప్రేమ చదరంగం) విడుదలై సెప్టెంబర్ 10కి 19 ఏళ్లు అవుతోంది. ప్రేక్షకులు టికెట్ కొని నా సినిమాలు చూస్తున్నారు. ఆ డబ్బుతో నేను, నా ఫ్యామిలీ మాత్రమే బాగుండాలనుకోను. ఆ డబ్బు అందరికీ ఉపయోగపడాలనుకుంటాను. ‘మార్క్ ఆంటోనీ’ని తెలుగులో వేణుగారు రిలీజ్ చేస్తున్నందుకు థ్యాంక్స్’’ అన్నారు. ‘‘ఇది తండ్రీ కొడుకుల కథ’’ అన్నారు అధిక్. ‘‘నా లైఫ్‌లో తమిళ సినిమా చేస్తాననుకోలేదు. నాకు రెండో అవకాశం ఇచ్చాడు అధిక్’’ అన్నారు నటుడు సునీల్. -
నితిన్ ‘తమ్ముడు’ సినిమా కాన్సెప్ట్ ఇదేనా..?
నితిన్ హీరోగా నటించనున్న కొత్త సినిమాకు ‘తమ్ముడు’ టైటిల్ ఖరారైంది. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు అనిల్ రావిపూడి కెమెరా స్విచ్చాన్ చేయగా, ఫైనాన్షియర్ ప్రసాద్ క్లాప్ కొట్టారు. దర్శకుడు వంశీ పైడిపల్లి తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘కొన్ని సినిమా టైటిల్స్ చాలా బాధ్యతతో వస్తుంటాయి. మీ అంచనాలకు మించి ఉండేలా ఈ సినిమా చేస్తాం’’ అని పేర్కొన్నారు నితిన్. ‘‘సెప్టెంబర్ 1నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. ‘దంగల్, కహానీ, తారే జమీన్ పర్’ లాంటి సక్సెస్ ఫుల్ చిత్రాలకు వర్క్ చేసిన సత్యజిత్ పాండే (సేతు) ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడిస్తాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. అయితే అక్క– తమ్ముళ్ల అనుబంధం నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం ఉండనుందని టాలీవుడ్ టాక్. -
లక్షల్లో ఉద్యోగం వదిలేశాడు.. 200కెఫెలు.. రూ. 100 కోట్ల టర్నోవర్!
నితిన్ సలూజా.. టీ కేఫ్ చైన్ ‘చాయోస్’ వ్యవస్థాపకుడు. నితిన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) పూర్వ విద్యార్థి. చదువు పూర్తయ్యాక అమెరికా చేరుకున్నాడు. ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగిగా చేరాడు. లక్షల్లో ప్యాకేజీ అందుకున్నాడు. అయినా నితిన్ సంతృప్తి చెందలేదు. సొంతంగా ఏదైనా చేయాలని భావించి, ఇండియా వచ్చాడు. నితిన్ తన ఆలోచనలను అమలు చేసే పనిలో పడ్డాడు. అనతికాలంలోనే అతని కంపెనీ కోట్లకు పడగలెత్తింది. నితిన్ సలూజా ప్రయాణం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గట్టి పట్టుదల, సంకల్పబలంతో.. నితిన్ తన స్టార్టప్ బిజినెస్‌లో మొదట్లో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు. గట్టి పట్టుదల, సంకల్పబలంతో తన సంస్థను విజయ శిఖరాలకు తీసుకెళ్లాడు. స్టార్‌బక్స్, కేఫ్ కాఫీ డే, కేఫ్ మోచా, బరిస్టా లాంటి కాఫీ షాపుల ఆధిపత్యం ఉన్న మనదేశంలో ‘కెయోస్’ తనకంటూ ఒక పేరు తెచ్చుకునేలా నితిన్ నిరంతర కృషి చేశాడు. ఇది భారతదేశంలోని ప్రముఖ టీ కేఫ్ కంపెనీగా అవతరించింది. నితిన్ సలుజా స్థాపించిన ‘కెయోస్’ అనతికాలంలోనే రూ. 100 కోట్ల టర్నోవర్ కలిగిన కంపెనీగా నిలిచింది. ఉద్యోగం వదిలేసి ఇండియాకు.. నితిన్ సలూజా ఐఐటీ బాంబేలో మెకానికల్ ఇంజినీరింగ్ చదివారు. చదువు పూర్తయ్యాక ఆయన ఒక అమెరికన్ కంపెనీకి కార్పొరేట్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్‌గా పనిచేశారు. అమెరికా కంపెనీలో నితిన్ జీతం లక్షల్లో ఉండేది. నితిన్, అతని భార్యకు అమెరికాలో టీ అమ్మే వారెవరూ కనిపించలేదు. దీంతో నితిన్ కేఫ్‌ను తెరవాలని నిర్ణయించుకున్నాడు. ఉద్యోగం వదిలేసి ఇండియా వచ్చాడు. సొంతంగా టీ వ్యాపారం ప్రారంభించాలనే ఆలోచనతో పని చేయడం మొదలుపెట్టాడు. గురుగ్రామ్‌లో మొదటి కేఫ్ భారతదేశంలో కాఫీ అందించే అనేక కేఫ్‌లు ఉన్నాయని, అయితే అవి టీ అందించడం లేదని అతను భావించాడు. భారతదేశంలో టీ తాగే ప్రత్యేక సంస్కృతి ఉంది. ప్రజలు అనేక రకాల టీలను ఆస్వాదిస్తుంటారు. దీనిని ఆధారంగా చేసుకున్న నితిన్ భారతదేశంలోని టీ తాగేవారి అవసరాలను తీర్చగల టీ కేఫ్‌ను ప్రారంభించాలని అనుకున్నాడు. 2012లో నితిన్, అతని స్నేహితుడు రాఘవ్ సంయుక్తంగా ‘చాయోస్’ని స్థాపించారు. వారు గురుగ్రామ్‌లో మొదటి కేఫ్‌ని ఏర్పాటు చేశారు. కస్టమర్లకు 'మేరీ వాలీ చాయ్' అందించడం ప్రారంభించారు. నితిన్ మొదట్లో తానే స్వయంగా ఆర్డర్లు తీసుకుని, టీ తయారుచేసి అందించేవాడు. 200కు మించిన ‘చాయోస్’ కేఫ్‌లు కోవిడ్ సమయంలో ‘చాయోస్’ అనేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంది. 2020లో తిరిగి ట్రాక్‌లో పడింది. నితిన్ కష్టానికి సరైన ఫలితం దక్కింది. 2020లో కంపెనీ 100 కోట్ల ఆదాయాన్ని సాధించింది. ముంబై, బెంగళూరు, చండీగఢ్, పూణేలలో నితిన్ చాయోస్ స్టోర్లు నెలకొల్పారు. నేడు భారతదేశం అంతటా 200కు మించిన చాయోస్ కేఫ్‌లు ఉన్నాయి. చాయోస్ మన దేశంలో ప్రీమియం టీని అందించే కేఫ్. ఇది భారతీయులు తాము కోరుకునే అన్ని రుచుల టీలను అందిస్తుంది. ఇది కూడా చదవండి: అంతరిక్షంలోకి వెళితే వయసు పెరగదా? ‘నాసా’ పరిశోధనలో ఏమి తేలింది? -
శ్రీలీల.. డేంజర్ పిల్లా!
‘అరె బ్లాక్ అండ్ వైట్ సీతాకోక చిలుకవా.., ఒక ముళ్లు కూడా లేనే లేని రోజా పువ్వా.., డేంజర్ పిల్లా..’ అని పాడుతున్నారు నితిన్. వక్కంతం వంశీ దర్శకత్వంలో నితిన్, శ్రీలీల జంటగా నటిస్తున్న చిత్రం ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మేన్’. శ్రేష్ఠ్ మూవీస్, ఆదిత్య మూవీస్– ఎంటర్టైన్మెంట్స్, రుచిర ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్‌పై సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హారిస్ జైరాజ్ స్వరపరచిన ఈ చిత్రంలోని ‘డేంజర్ పిల్లా..’ పాటను బుధవారం రిలీజ్ చేశారు. ఈ పాటను కృష్ణకాంత్ రాయగా అర్మాన్ మాలిక్ పాడారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. -
మన్మధుడుగా నితిన్..శ్రీలీలతో రొమాన్స్..
-
ఇదీ 'కిక్' సినిమాకు డబుల్ 'ఎక్స్ట్రా' : వక్కంతం వంశీ
నితిన్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాకు ‘ఎక్స్ట్రా’ అనే టైటిల్ ఖరారు చేశారు. ‘ఆర్డినరీ మేన్ ’ అనేది ట్యాగ్‌లైన్ . ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్నారు. శ్రేష్ఠ్ మూవీస్, ఆదిత్యా మూవీస్ అండ్ ఎంటర్టైన్మెంట్స్, రుచిర ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబరు 23న విడుదల కానుంది. తాజాగా ఆదివారం ఈ సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్, రిలీజ్ డేట్‌ను ప్రకటించారు మేకర్స్. ‘‘కిక్’ సినిమా తర్వాత ఆ రేంజ్లో క్యారెక్టర్ బేస్డ్ స్క్రిప్ట్‌తో ‘ఎక్స్ ట్రా’ సినిమా తెరకెక్కుతోంది. ఆడియన్స్ రోలర్ కోస్టర్ లాంటి ఎక్స్పీరియన్స్ ఇస్తూనే, నవ్విస్తూ సర్ప్రైజ్లతో మెప్పిస్తుంది మా సినిమా’’ అన్నారు వక్కంతం వంశీ. ఈ సినిమాకు సంగీతం: హారిస్ జైరాజ్. -
ఆఫీసర్స్ ఆన్ డ్యూటీ.. చూసేందుకు రెడీనా..?
బాక్సాఫీస్ కలెక్షన్లు దండుకోవడానికి థియేటర్స్ స్టేషన్లో కొందరు స్టార్స్ పోలీసాఫీసర్స్‌గా చార్జ్ తీసుకోనున్నారు. కొందరు పోలీస్ యూనిఫామ్ వేసుకుని, సెట్స్‌లో లాఠీ తిప్పుతున్నారు. మరికొందరు కథలు విన్నారు.. యూనిఫామ్‌తో సెట్స్‌కి వెళ్లడానికి రెడీ అవుతున్నారు. ఇక ఆఫీసర్స్ ఆన్ డ్యూటీ వివరాలు తెలుసుకుందాం. మళ్లీ డ్యూటీ ‘మూండ్రు ముగమ్’ (1982), ‘పాండియన్ ’ (1992), హిందీలో ‘హమ్’ (1991), ‘దర్బార్’ (2020)... ఇలా ఇప్పటివరకూ రజనీకాంత్ ఏడెనిమిది చిత్రాల్లో పోలీసాఫీసర్‌గా నటించారు. మళ్లీ రజనీ పోలీస్‌గా చార్జ్ తీసుకోనున్నారట. టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా ఓ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ చిత్రంలో ముస్లిమ్ పోలీసాఫీసర్ పాత్రలో రజనీ కనిపించనున్నారని టాక్. సుభాస్కరన్ నిర్మించనున్న ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. ఇక ఆగస్టు 10న విడుదల కానున్న ‘జైలర్’ చిత్రంలో రజనీ జైలర్ పాత్రలో నటించిన విషయం తెలిసిందే. పోలీస్ స్పిరిట్ పోలీసాఫీసర్‌గా ప్రభాస్ కటౌట్ స్క్రీన్‌పై సూపర్‌గా ఉంటుందని, సిల్వర్ స్క్రీన్‌పై ఖాకీ డ్రెస్ వేసిన ఫుల్ లెంగ్త్ పోలీసాఫీసర్ పాత్రలో ప్రభాస్‌ను చూడాలని ఆయన ఫ్యాన్స్ ఎప్పట్నుంచో ఆశపడుతున్నారు. వీరి ఆశ ‘స్పిరిట్’తో తీరనుందనే టాక్ వినిపిస్తోంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ‘స్పిరిట్’ అనే చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రభాస్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపిస్తారని తెలిసింది. భూషణ్ కుమార్, ప్రణయ్‌రెడ్డి వంగా, క్రిషణ్ కుమార్ నిర్మించనున్న ఈ చిత్రం షూటింగ్ ఈ ఏడాది చివర్లో ్రపారంభం కానుందట. పుష్పర కాలం తర్వాత... ‘శౌర్యం (2008)’, ‘గోలీమార్ (2010)’ వంటి చిత్రాల్లో గోపీచంద్ పోలీస్‌గా సిల్వర్ స్క్రీన్‌పై డ్యూటీ చేశారు. పుష్కర కాలం తర్వాత గోపీచంద్ మళ్లీ పోలీస్‌గా లాఠీ పట్టారు. హర్ష తెరకెక్కిస్తున్న ‘భీమా’ చిత్రం కోసమే పోలీస్‌గా డ్యూటీ చేస్తున్నారు గోపీచంద్. కేకే రాధామోహన్ నిర్మిస్తున్న ఈ సినిమా విడుదల తేదీపై త్వరలోనే ఓ స్పష్టత రానుంది. ఆఫీసర్ అర్జున్ పోలీసాఫీసర్ అర్జున్ సర్కార్‌గా బాధ్యతలు తీసుకోనున్నారు నాని. ‘హిట్’ ఫ్రాంచైజీలో ‘హిట్ 3’ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ‘హిట్ 1’లో విశ్వక్సేన్, ‘హిట్ 2’లో అడివి శేష్ పోలీసాఫీసర్స్‌గా నటించారు. ‘హిట్ 3’లో పోలీసాఫీసర్ అర్జున్ సర్కార్‌గా నాని నటించనున్నారు. శైలేష్ కొలను దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం షూటింగ్ వచ్చే ఏడాది ్రపారంభమవుతుందట. కొన్ని సన్నివేశాల్లో... హీరో నితిన్ పోలీసాఫీసర్‌గా చార్జ్ తీసుకున్నారు. వక్కంతం వంశీ దర్శకత్వంలో సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘ఎక్స్ట్రా’ (ప్రచారంలో ఉన్న టైటిల్). శ్రీలీల హీరోయిన్. ఇందులో హీరోగా నటిస్తున్న నితిన్ కొన్ని సీన్స్‌లో పోలీస్‌గా కనిపిస్తారట. అమరన్.. ఇన్ ది సిటీ ‘బ్లాక్’, ‘సీఎస్ఐ: సనాతన్’ వంటి చిత్రాల్లో ఆది సాయికుమార్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫీసర్‌గా సిల్వర్ స్క్రీన్ క్రైమ్స్‌ను చేధించారు. తాజాగా ‘అమరన్: ఇన్ ది సిటీ చాఫ్టర్ 1’ చిత్రంలో ఆది సాయికుమార్ పోలీసాఫీసర్‌గా ఓ కేసును పరిశోధిస్తున్నారు. ఎస్. బాలేశ్వర్ దర్శకత్వంలో ఎస్వీఆర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ది కానిస్టేబుల్ ‘హ్యాపీ డేస్’, ‘కొత్త బంగారు లోకం’, ‘కుర్రాడు’ వంటి సినిమాల్లో హీరోగా నటించిన వరుణ్ సందేశ్ తాజాగా పోలీస్ డ్రెస్ వేసుకున్నారు. ఆర్యన్ సుభాన్ దర్శకత్వంలో రూపొందుతున్న సస్పెన్స్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ ‘ది కానిస్టేబుల్’. ఈ చిత్రంలో వరుణ్ సందేశ్ కానిస్టేబుల్ పాత్ర చేస్తున్నారు. ‘బలగం’ జగదీష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ ఏడాదే ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఎవరు? హంతకులు ఎవరు? అనేది కనిపెట్టేందుకు జేడీ చక్రవర్తి ఓ స్కెచ్ వేశారు. పోలీసాఫీ సర్గా జేడీ చక్రవర్తి వేసిన ఈ స్కెచ్ డీటైల్స్ ‘హూ’ సినిమాలో తెలుస్తాయి. జేడీ చక్రవర్తి నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ఇది. రెడ్డమ్మ కె. బాలాజీ నిర్మించారు. త్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్‌ని ప్రకటిస్తారు. పోలీసులే ప్రధాన నిందితులైతే... దోషులను పట్టుకునే పోలీసులే నిందులైతే ఏం జరుగు తుంది? అనే కథాంశంతో దర్శకుడు తేజా మార్ని ఓ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రంలో శ్రీకాంత్, రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్, వరలక్ష్మీ శరత్‌కుమార్ ప్రధాన పాత్రలు పోషించారు. పోలీస్ డిపార్ట్మెంట్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ చిత్రంలోని ముఖ్య తారలంతా పోలీసులుగా నటిస్తున్నారని తెలిసింది. ‘ఖడ్గం’ (2002), ‘ఆపరేషన్ దుర్యోధన’ (2007), ‘టెర్రర్’ (2016) వంటి సినిమాల్లో పవర్ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో నటించిన శ్రీకాంత్ ఈ చిత్రంలో ఓ డిఫరెంట్ పోలీస్‌గా కనిపిస్తారు. ‘బన్నీ’ వాసు నిర్మించిన ఈ చిత్రం ఈ ఏడాదే రిలీజ్ కానుంది. పోలీస్ రన్నర్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా ‘రన్నర్’. విజయ్ చౌదరిని దర్శకుడిగా పరిచయం చేస్తూ విజయ్ భాస్కర్, ఫణీంద్ర, ఎం. శ్రీహరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పోలీస్ నేపథ్యంలో తండ్రీ కొడుకుల అనుబంధంతో సాగే ఈ చిత్రంలో పోలీసాఫీసర్ పాత్రలో జానీ మాస్టర్ నటిస్తున్నారని తెలిసింది. వీరే కాదు... మరికొందరు కూడా పోలీసాఫీసర్లుగా కనిపించడానికి రెడీ అవుతున్నారు. -
నార్నే నితిన్ కొత్త సినిమా షురూ
హీరో ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ హీరోగా కొత్త సినిమా షురూ అయింది. అంజిబాబు కంచిపల్లి దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో నయన్ సారిక హీరోయిన్గా నటిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ 2 పిక్చర్స్‌పై బన్నీ వాసు, విద్యా కొప్పినీడి నిర్మిస్తున్న ఈ చిత్రం గురువారం ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి నిర్మాత ‘దిల్’ రాజు కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ కొట్టారు. డైరెక్టర్ చందు మొండేటి గౌరవ దర్శకత్వం వహించగా, దర్శకుడు మారుతి స్క్రిప్ట్‌ను మేకర్స్‌కు అందించారు. ‘‘జీఏ 2 బ్యానర్లో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రమిది’’ అన్నారు మేకర్స్. ఈ చిత్రానికి సహనిర్మాత: ఎస్కేఎన్, కెమెరా: సమీర్ కళ్యాణ్, సంగీతం: రామ్ మిర్యాల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: భానుప్రతాప్, రియాజ్ చౌదరి, అజయ్ గద్దె. -
క్రేజీ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న రష్మిక.. ఛాన్స్ కొట్టేసిన యంగ్ హీరోయిన్!
ప్రస్తుతం టాలీవుడ్లో ఓ రేంజ్లో దూసుకెళ్లున్న హీరోయిన్లు వారిద్దరే. ఆ ఇద్దరు స్టార్ హీరోలతో ఛాన్స్‌లు కొట్టేస్తూ ఇండస్ట్రీని షేక్ చేస్తున్నారు. అంతే కాకుండా వారిద్దరి మధ్యనే విపరీతమైన పోటీ నెలకొంది. డైరెక్టర్స్ కూడా హీరోయిన్ల ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. కొన్ని సినిమాలు ఎంపిక చేశాక హీరోయిన్స్ ఏదో ఒక కారణంతో తప్పుకోవడం సాధారణంగా జరుగుతూ ఉంటుంది. అయితే తాజాగా ఓ క్రేజీ ప్రాజెక్ట్ నుంచి స్టార్ హీరోయిన్ తప్పుకున్నట్లు వార్తలొస్తున్నాయి. అంతే కాకుండా మరో హీరోయిన్ను సెలెక్ట్ చేయడం కూడా జరిగిపోయిందట. ఇంతకీ టాలీవుడ్‌ను ఊపేస్తున్న ఆ ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసుకుందాం. (ఇది చదవండి: శ్రీలీల బదులు రష్మిక.. సూపర్ ఛాన్స్ కొట్టేసింది!) ఒకరు నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కాగా.. మరొకరు పెళ్లసందడి ఫేమ్ శ్రీలీల. పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్లో గుర్తింపు తెచ్చుకున్న రష్మిక ప్రస్తుతం బాలీవుడ్లో యానిమల్, పుష్ప-2, రెయిన్ బో సినిమాలతో బిజీగా ఉంది. అయితే ఈ ఏడాది భీష్మ కాంబినేషన్ నితిన్‌కు జోడీగా మరో చిత్రంలో నటిస్తోంది. ఇప్పటికే అఫీషియల్ కూడా ప్రకటించేశారు. కానీ ఈ చిత్రం నుంచి రష్మిక తప్పుకుందని వార్తొలొస్తున్నాయి. ఆమె స్థానంలో పెళ్లి సందడి ఫేమ్ శ్రీలీల ఛాన్స్ కొట్టేసిందని టాలీవుట్‌లో టాక్ వినిపిస్తోంది. భీష్మ డైరెక్టర్ వెంకీ కుడుముల తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం నుంచి రష్మిక వైదొలిగినట్లు తెలుస్తోంది. అయితే ఆమె చేతిలో వరుసగా భారీ సినిమాలు చేతిలో ఉండడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కాగా.. ఇప్పటికే మహేష్ బాబు నటించిన గుంటూరు కారం చిత్రంలో పూజా హెగ్డే స్థానంలోనూ శ్రీలీల ఛాన్స్ కొట్టేసింది. రష్మిక తర్వాత శ్రీలీలనే టాప్ హీరోయిన్గా కనిపిస్తోంది. ఈ ఏడాదిలోనే ఆదికేశవ, స్కంద, భగవంత్ కేసరి, గుంటూరు కారం, వీడీ12, ఉస్తాద్ భగత్ సింగ్‌తో సహా దాదాపు ఏడు చిత్రాలలో నటిస్తోంది. కాగా.. గతంలో.. హీరో నితిన్, హీరోయిన్ రష్మికా మందన్నా భీష్మ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. మరోసారి క్రేజీ కాంబో రిపీట్ కాబోతోందని ఆశించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. (ఇది చదవండి: నయన్ భర్తకు వార్నింగ్ ఇచ్చిన షారుక్ ఖాన్!) -
దిల్ రాజు నుంచి నితిన్, శ్రీముఖి, చమ్మక్ చంద్ర వరకు.. అంతా ఇక్కడి వారే!
చలనచిత్ర రంగంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన పలువురు తమదైన ముద్ర వేశారు. నటులుగా, హాస్య నటులుగా, గాయకులుగా, దర్శక నిర్మాతలుగా గుర్తింపు పొందారు. నిర్మాతలుగా డి.ప్రభాకర్, దిల్ రాజు, నటులు, హాస్యనటులుగా నితిన్, అదితి, శ్రీముఖి, వెన్నెల కిషోర్, చమ్మక్‌చంద్ర.. ఇలా ఎందరో తెలుగు సినీ జగత్తులో సత్తా చాటి జిల్లాకు పేరు తెచ్చారు. సినిమాలలో సత్తా చాటుతున్న ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన పలువురు ప్రముఖులపై సండే స్పెషల్.. యాంకర్ నుంచి యాక్టర్ దాకా.. నిజామాబాద్ నగరానికి చెందిన శ్రీముఖి యాంకర్‌గా గుర్తింపు పొందారు. సినిమా, టీవీ ప్రోగ్రాములకు యాంకర్‌గా పనిచేస్తూ ఉన్నత స్థాయికి ఎదిగిన ఆమె.. సినిమాల్లోనూ రాణిస్తున్నారు. ఆమె కు టుంబ సభ్యులు నిజామాబాద్‌లో ఉండడంతో అప్పుడప్పుడు నిజామాబాద్ వచ్చి వెళ్తుంటుంది. దిల్ రాజు.. నిజామాబాద్ నగరానికి సమీపంలోని నర్సింగ్‌పల్లికి చెందిన దిల్ రాజు.. నిర్మాతగా, డిస్టిబ్యూటర్‌గా సినీ ఇండస్ట్రీని శాసిస్తున్నారు. ఆయన ప్రముఖ నటీనటులందరితో ఎన్నో సినిమాలు తీశారు. ఆయన సొంతూరులో ఇందూరు తిరుమల పేరుతో భారీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించారు. నిర్మాతగా ఎందరినో సినిమా రంగంలోకి తీసుకువచ్చారు. నవ్వుల రారాజు వెన్నెల కిషోర్ కామారెడ్డికి చెందిన కిషోర్ సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా అమెరికాలో పనిచేశారు. అప్పట్లో వెన్నెల సినిమాలో నటించే అవకాశం రావడంతో ఆయన సినీరంగం వైపు మళ్లారు. వెన్నెల సినిమాలో నటించడంతో ఆయన పేరు వెన్నెల కిషోర్‌గా మారిపోయింది. హాస్యనటుడిగా కిషోర్ ఎంతో పేరు సంపాదించారు. ప్రస్తుతం దాదాపు అన్ని సినిమాల్లోనూ కిషోర్ పాత్ర ఉంటుండడం విశేషం. ఉత్తమ హాస్యనటుడిగా ఆయన నంది పురస్కారం కూడా అందుకున్నారు. అప్పుడప్పుడూ కామారెడ్డికి వచ్చి తన కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులని కలిసి వెళ్తుంటారు. నటీమణిగా ఎదుగుతున్న అదితి.. కామారెడ్డి పట్టణానికి చెందిన అదితి మ్యాకాల్.. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఆమె తండ్రి రాంచంద్రం హైదరాబాద్‌లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నారు. ఆమె అర్జున్‌రెడ్డి, జంటిల్మెన్, అమీతుమీ, షాదీ ముబారక్వంటి సినిమాల్లో నటించింది. అలాగే పాష్ పోరీస్, మాయాబజార్ వంటి వెబ్‌సిరీస్‌లలోనూ నటిస్తోంది. నటనతో పాటు కూచిపూడి నృత్యంలోనూ ఆమె రాణిస్తోంది. టాప్ హీరోగా గుర్తింపు పొందిన నితిన్.. నిజామాబాద్‌కు చెందిన సినీ హీరో నితిన్ తొలి సినిమా ‘జయం’తోనే ప్రేక్షకులను మెప్పించారు. తన నటనతో ఇండస్ట్రీలో టాప్ స్టార్లలో ఒకరిగా ఎదిగారు. నితిన్ తండ్రి సుధాకర్‌రెడ్డి ప్రొడ్యూసర్‌గా కొనసాగుతున్నారు. అలాగే ప్రముఖ నిర్మాత దిల్‌రాజుకు నితిన్ దగ్గరి బంధువు. నితిన్ బందువులు చాలా మంది నిజామాబాద్‌లోనే ఉన్నారు. హాస్యం పండించే చమ్మక్ చంద్ర గాంధారి మండలం వెంకటాపూర్‌కు చెందిన గిరిజన బిడ్డ చమ్మక్ చంద్ర.. తన నటనతో హాస్యం పండిస్తూ అందరినీ మెప్పిస్తున్నారు. టీవీ చానళ్లలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొని గుర్తింపు పొందారు. సినిమాల్లోనూ హాస్య నటుడిగా రాణిస్తున్నారు. ఆయన తరచూ సొంతూరుకు వచ్చి వెళ్తుంటారు. వచ్చినప్పుడల్లా అందరినీ కడుపుబ్బా నవ్విస్తుంటారు. సినీ గాయకుడిగా విష్ణుకిషోర్ ఆర్మూర్ మండలం కోమన్‌పల్లికి చెందిన విష్ణుకిషోర్ జానపద గాయకుడిగా తన ప్రస్థానం మొదలుపెట్టి సినీ గాయకుడిగా, సంగీత దర్శకుడిగా ఎదిగారు. సినిమాల్లోనూ నటిస్తున్నారు. తెలంగాణ ఉద్యమ కాలంలో ఉద్యమ గీతాలు పాడిన విష్ణుకిషోర్.. ఉమ్మడి జిల్లాలో అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వీకేఆర్ స్టూడియోను స్థాపించారు. మ్యూజిక్ డైరెక్టర్‌గానూ రాణిస్తున్నారు. భగవాన్ సినిమా నిర్మాత ప్రభాకర్ కామారెడ్డి పట్టణానికి చెందిన నిర్మాత దివంగత డి.ప్రభాకర్ ప్రియా ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రెబల్ స్టార్ కృష్ణంరాజు హీరోగా భగవాన్ సినిమాను నిర్మించారు. అప్పట్లో అది సూపర్‌హిట్ అయ్యింది. ఆ తర్వాత ఆయన నాయకురాలు, ప్లీజ్ నాకు పెళ్లయ్యింది వంటి సినిమాలకు ప్రొడ్యూసర్‌గా పనిచేశారు. అలాగే డి్రస్టిబ్యూటర్గానూ పనిచేశారు. కామారెడ్డిలో ఆయన స్థాపించిన ప్రియా థియేటర్లు రెండు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. కామారెడ్డి మున్సిపల్ కాకముందు ఆయన సర్పంచ్‌గానూ సేవలందించారు. నిర్మాతగా రజిత్‌రావ్ అడుగులు.. ఆర్మూర్‌కు చెందిన వ్యాపారవేత్త బల్గూరి రజిత్‌రావ్ సినీరంగంలో అడుగుపెట్టారు. ఇటీవల ‘అన్‌స్టాపబుల్’ చిత్రాన్ని నిర్మించారు. చిన్ననాటి నుంచి సినిమాల మీద ఉన్న మోజుతో ఆయన సినీ నిర్మాణ రంగంలో అడుగుపెట్టి గుర్తింపు పొందారు. సినీ, రాజకీయ రంగ పెద్దలతో సన్నిహిత సంబంధాలున్న రజిత్‌రావ్.. నిర్మాతగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. గేయ రచయితగా రుద్రంగి రమేశ్ మద్నూర్ మండల కేంద్రానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు రుద్రంగి రమేశ్ అనేక సినిమాలకు పాటలు రాశారు. మాస్ పవర్, పోలీస్ పవర్, పోరాటం, మిస్టర్ ఐటం, సినిమా సినిమా, ప్రేమిస్తే చంపేస్తారా, నైజాం సర్కరోడా, రుద్రనాగు, హృదయం, దిల్లున్నోడు, నువ్వంటే ఇష్టం వంటి సినిమాలకు పాటలు రాశారు. అలాగే భక్తి గీతాలు కూడా ఎన్నో రచించారు. -
హీరోయిన్‌కు ఏమాత్రం తీసిపోని నితిన్ భార్య షాలిని (ఫొటోలు)
-
Union Budget 2023-24: కొత్త పన్ను విధానం ఆకర్షణీయం
న్యూఢిల్లీ: నూతన పన్ను విధానం 2023–24 బడ్జెట్‌తో ఆకర్షణీయంగా మారినట్టు ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) చైర్మన్ నితిన్ గుప్తా తెలిపారు. ఎక్కువ మంది ఇన్వెస్టర్లకు ఇది ప్రయోజనకరమని, తక్కువ పన్ను రేటును వారు ఆస్వాదిస్తారని చెప్పారు. బడ్జెట్ అనంతరం ఓ వార్తా సంస్థతో గుప్తా మాట్లాడారు. తగ్గింపులు, మినహాయింపులను క్రమంగా దూరం చేయడం కోసమే నూతన పన్ను విధానంలో (మినహాయింపుల్లేని) కొత్త శ్లాబులు, రేట్లు ప్రకటించడానికి కారణంగా పేర్కొన్నారు. దీని ద్వారా వ్యక్తులు, సంస్థలపై పన్ను రేట్లు తగ్గించాలన్న దీర్ఘకాలిక డిమాండ్‌ను చేరుకోవడం సాధ్యపడుతుందన్నారు. ‘‘నూతన పన్ను విధానాన్ని రెండేళ్ల క్రితం (2020–21 బడ్జెట్లో) ప్రతిపాదించాం. అయినప్పటికీ తగిన ప్రతిఫలాన్ని ఇవ్వడం లేదు. ఇప్పుడు ప్రభుత్వం శ్లాబులను మార్చింది. దీనివల్ల పన్ను చెల్లింపుదారులకు రేట్లు, శ్లాబులు ఇప్పుడు చాలా స్పష్టంగా అర్థమవుతాయి’’అని చెప్పారు. కార్పొరేట్ విభాగంలో పన్ను చెల్లింపుదారులకు ఇదే మాదిరి చర్యలను కొంత కాలం క్రితం ప్రకటించగా, వారికి ప్రయోజనకరంగా మారినట్టు గుప్తా తెలిపారు. నూతన పన్ను విధానంతో లబ్ధి పొందని వర్గాలు చాలా తక్కువన్నారు. దీనిలో స్టాండర్డ్ డిడక్షన్ కల్పించినందున, అది పాత విధానంలోని ప్రయోజనాలకు ఏ మాత్రం తీసిపోదన్నారు. పన్ను చెల్లింపు దారుల ఇష్టమే.. నూతన పన్ను విధానం డిఫాల్ట్ (ప్రమేయం లేని)గా ఉంటున్నందున, పాత పన్ను విధానంలో ఉన్నవారిపై ప్రభావం పడుతుందా? అన్న ప్రశ్నకు.. ఏ విధానం అయినా ఎంపిక చేసుకుని రిటర్నులు దాఖలు చేసే స్వేచ్ఛ పన్ను చెల్లింపుదారులకు ఉంటుందని నితిన్‌గుప్తా చెప్పారు. కావాలంటే పాత పన్ను విధానానికి కూడా మారిపోవచ్చన్నారు. ‘‘డిఫాల్ట్ అంటే ఫైలింగ్ పోర్టల్ స్క్రీన్‌పై ముందు కనిపిస్తుంది. కానీ, అక్కడ ఏ పన్ను విధానం అనే ఆప్షన్ ఉంటుంది. కావాల్సిన విధానాన్ని ఎంపిక చేసుకోవచ్చు’’అని గుప్తా వివరించారు. ఏ వర్గం పన్ను చెల్లింపుదారులను కూడా నిరుత్సాహపరచబోమన్నారు. నూతన పన్ను విధానంలో రూ.7 లక్షల వరకు పన్ను చెల్లించే అవకాశం లేకుండా రిబేట్ కల్పించడం తెలిసిందే. దీనికి అదనంగా రూ.50 వేల స్టాండర్డ్ డిడక్షన్ ప్రయోజనం కూడా ప్రకటించారు. పాత విధానంలో అయితే రూ.5 లక్షలకు మించిన ఆదాయంపై 20% పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కాకపోతే వివిధ సెక్షన్ల కింద తగిన సాధనాల్లో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అంతిమంగా కొత్త విధానమే తక్కువ పన్ను రేట్లతో, మినహాయింపుల్లేని, సులభతర పన్నుల విధానానికి (నూతన పన్ను విధానం) మళ్లడమే ప్రభుత్వ ధ్యేయమని కేంద్ర ప్రభుత్వ రెవెన్యూ విభాగం కార్యదర్శి సంజయ్ మల్హోత్రా తెలిపారు. రెవెన్యూ శాఖ నిర్వహించిన విశ్లేషణ ప్రకారం ఏటా రూ.15 లక్షలు ఆర్జించే వ్యక్తి పాత పన్ను విధానంలో రూ.3.75 లక్షల వరకు క్లెయిమ్‌లు పొందొచ్చని.. కానీ, తక్కువ పన్ను రేట్లతో దీనికి ప్రత్యామ్నాయ పన్నుల విధానాన్ని ప్రతిపాదించినట్టు చెప్పారు. నూతన పన్ను విధానం తప్పనిసరి చేయడానికి ఎలాంటి గడువు పెట్టుకోలేదని స్పష్టం చేశారు. -
ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్.. హీరో నితిన్ న్యూ లుక్
స్టార్ హీరో నితిన్ ఇటీవల మాచర్ల నియోజకవర్గం సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అభిమానులను మెప్పించలేకపోయింది. నితిన్‌కి జోడీగా కృతీశెట్టి నటించింది. ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. రాజ్‌కుమార్ ఆకెళ్ల సమర్పణలో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాస్త నిరాశపరిచింది. అయితే తాజాగా హీరో నితిన్ న్యూ లుక్‌లో దర్శనమిచ్చాడు. అంజనేయస్వామి స్వామి దీక్ష ధరించి కనిపించాడు. ఈ విషయాన్ని తన ట్విటర్లో పోస్ట్ చేశాడు. దీక్ష ధరించిన దుస్తుల్లో ఉన్న ఫోటోను షేర్ చేశారు. బాబాయ్ హోటల్ ప్రారంభించిన నితిన్ హైదరాబాద్‌లో బాబాయ్ హోటల్ బ్రాంచ్‌ను నితిన్ చేతుల మీదుగా మణికొండలో ప్రారంభించారు. డైరెక్టర్ శశికాంత్ తన స్నేహితులతో కలిసి ఫ్రెండ్స్ ఫ్యాక్టరీని స్థాపించారు. ఫ్రెండ్స్ ఫ్యాక్టరీ పేరు మీదే ఈ బాబాయ్ హోటల్‌ను హైద్రాబాద్‌లోని మణికొండకు తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత సుధాకర్ రెడ్డి, డైరెక్టర్ వెంకీ కుడుముల, రామ జోగయ్య శాస్త్రి, రచయిత దర్శకుడు వక్కంతం వంశీ పాల్గొన్నారు. Sri Anjaneyam 🙏🙏 Sarvadha Jayam..!! Enjoy ur Aadhivaaram 🤗🤗 pic.twitter.com/JUn0zNnsHi — nithiin (@actor_nithiin) January 22, 2023 -
ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ నిర్మాత కన్నుమూత
సినీ ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత నితిన్ మన్మోహన్ కన్నుమూశారు. ఇటీవలె గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన ఆయన సుమారు 15రోజుల పాటు వెంటిలేటర్‌పైనే ఉన్నారు. అయితే ఆరోగ్యం విషమించడంతో ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన స్నేహితుడు, నిర్మాత కలీమ్ ఖాన్ ద్రువీకరించారు. నితిన్ మన్మోహన్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. బోల్ రాధా బోల్ (1992), ఆర్మీ (1996), షూల్ (1999), లవ్ కే లియే కుచ్ భీ కరేగా (2001) దస్ (2005), యమ్లా పగ్లా దీవానా (2011), రెడీ (2011) వంటి పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించిన ఆయన కొన్ని సినిమాకు కథా రచయితగానూ ఉన్నారు. డిసెంబర్3న తీవ్ర గుండెపోటుతో ఆసుపత్రిలో చేరారు. అప్పటినుంచి వెంటిలేటర్‌పైనే ఉన్నారు. మరోవైపు తండ్రి అనారోగ్యానికి గురైన విషయం తెలియగానే నితన్ మన్మోహన్ కొడుకు సోహమ్ ఇటీవలె భారత్‌కు చేరుకున్నారు. -
అభిమానులకు నితిన్ త్వరలోనే సర్ ప్రైజ్ ఇవ్వనున్నారా?
టాలీవుడ్ హీరోల్లో నితిన్ స్టైలే వేరు. ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో వరుస హిట్ సినిమాలతో దూసుకెళ్లాడు. ప్రముఖ దర్శకులతో సైతం చిత్రాలు చేశారు. మాస్ మూవీస్ చేయడంతో పాటు లవ్ అండ్ రొమాంటిక్ చిత్రాల్లోనూ నటించారు. అలా హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కెరీర్ పరంగా హిట్ సినిమాలతో ఫ్లాప్ చిత్రాలు కూడా ఉన్నాయి. ఎప్పుడు సినిమాలతో బిజీగా ఉండే నితిన్.. జూన్ 2020లో వివాహబంధంలోకి అడుగుపెట్టారు. షాలిని అనే అమ్మాయితో ఏడడుగుల బంధంతో ఒక్కటయ్యారు. అయితే తాజాగా నితిన్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అతను త్వరలోనే తండ్రి కాబోతున్నాడన్న టాక్ వినిపిస్తోంది. వివాహం అయినప్పటినుంచి ఇప్పటిదాకా ఈ జంట అభిమానులకు ఎలాంటి గుడ్ న్యూస్ చెప్పలేదు. అప్పడప్పుడు సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టడం తప్ప ఎలాంటి సర్ ప్రైజ్ ఇవ్వలేదు. అయితే దీపావళి సందర్భంగా ఈ జంట ఓ ఫోటోను షేర్ చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. దీంతో అభిమానులు ఏమైనా గుడ్ న్యూస్ ఉంటుందా అని కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ విషయాన్ని నితిన్ స్వయంగా రివీల్ చేయనున్నట్లు సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. ఆయన ఇటీవల నటించిన చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’. నితిన్‌కి జోడీగా కృతీశెట్టి నటించింది. ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. రాజ్‌కుమార్ ఆకెళ్ల సమర్పణలో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాస్త నిరాశపరిచింది. Happy Diwali 🪔…. From ours to yours ❤️ pic.twitter.com/CkA7pT8IEi — nithiin (@actor_nithiin) October 24, 2022 -
జేపీ నడ్డాతో ముగిసిన హీరో నితిన్ భేటీ..
సాక్షి, హైదరాబాద్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో హీరో నితిన్ భేటీ ముగిసింది. అనంతరం మీడియాతో మాట్లాడకుండా నితిన్ వెళ్లిపోయారు. కాగా జేపీ నడ్డా- నితిన్ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వరంగల్ పర్యటనను పూర్తి చేసుకున్న నడ్డా తిరిగి శంషాబాద్ నోవాటెల్ చేరుకొని హీరో నితిన్‌తో సమావేశమయ్యారు. వీరితోపాటు లక్ష్మణ్, రామచంద్రరావు ఉన్నారు. నితిన్‌తో సమావేశం అనంతరం బీజేపీ ముఖ్యలతో నడ్డా భేటీ అయ్యారు. ఇదిలా ఉండగా ఇవాళ ఉదయం జేపీ నడ్డాతో భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్‌భేటీ అయిన విషయం తెలిసిందే. ఇక గతవారం హీరో జూనియర్ ఎన్టీఆర్‌తో అమిత్‌షా సమావేశమయ్యారు. చదవండి: అవన్నీ అబద్దాలని చెప్పే దమ్ము టీఆర్ఎస్ నేతలకు ఉందా? కిషన్ రెడ్డి ఫైర్ -
మరో ఇరవై ఏళ్లు మీ కోసం కష్టపడతా
‘‘నేను ఇండస్ట్రీకి వచ్చి ఇరవై ఏళ్లు అవుతోంది. ప్రేక్షకులు, అభిమానుల సపోర్ట్ లేకుంటే నేను ఇక్కడ ఉండేవాణ్ణి కాదు.. మీ అభిమానం, ప్రేమకి థ్యాంక్స్. మరో ఇరవై ఏళ్లు అయినా మీ కోసం నేను ఇలాగే కష్టపడతాను.. మీ సపోర్ట్ ఇలాగే ఉండాలి’’ అని నితిన్ అన్నారు. ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో నితిన్ హీరోగా నటించిన చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’. కృతీశెట్టి, కేథరిన్ హీరోయిన్లు. రాజ్‌కుమార్ ఆకెళ్ల సమర్పణలో సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో నితిన్ మాట్లాడుతూ– ‘‘నా మనసుకు చాలా దగ్గరైన సినిమా ‘మాచర్ల నియోజకవర్గం’. నేపథ్య సంగీతానికి మణిశర్మగారు కింగ్ అంటారు. కానీ మా సినిమా చూశాక తండ్రికి తగ్గ తనయుడు కాదు.. తండ్రిని మించిన తనయుడిగా స్వరసాగర్ నేపథ్య సంగీతం కొట్టాడు. ఈ సినిమా మీకందరికీ ఫుల్ మీల్స్. ఈ చిత్రంతో రాజశేఖర్ పెద్ద కమర్షియల్ డైరెక్టర్ అవుతాడని నమ్ముతున్నాను. ఆగస్టు 12న గట్టిగా కొట్టబోతున్నాం’’ అన్నారు. అతిథిగా పాల్గొన్న దర్శకుడు సురేందర్ రెడ్డి మాట్లాడుతూ–‘‘దిల్’ సినిమా తర్వాత నితిన్‌ని కలిసి భయం భయంగా ఓ కథ చెప్పాను. అప్పుడు తను ఇచ్చిన ధైర్యంతో వెళ్లి ‘అతనొక్కడే’ సినిమా చేశా. అప్పటి నుంచి నితిన్‌తో సినిమా చేయాలనుకునే వాణ్ణి.. భవిష్యత్‌లో తప్పకుండా చేస్తా. ‘మాచర్ల నియోజకవర్గం’ పెద్ద హిట్ కావాలి’’ అన్నారు. ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ–‘‘నేను ఈ స్థాయికి రావడానికి పదిహేనేళ్లు పట్టింది. ఇండస్ట్రీలో ఎడిటర్‌గా బ్రేక్ ఇచ్చిన పూరి జగన్నాథ్‌గారికి థ్యాంక్స్. ఎడిటర్‌గా ఉన్న నన్ను డైరెక్టర్ని చేసిన నితిన్‌కి థ్యాంక్స్. ‘మాచర్ల నియోజకవర్గం’ చిత్రంతో సాలిడ్ హిట్ కొట్టబోతున్నాం’’ అన్నారు. ఈ వేడుకలో చిత్ర సహ నిర్మాత హరి, దర్శకులు హను రాఘవపూడి, వక్కంతం వంశీ, మేర్లపాక గాంధీ, మెహర్ రమేశ్, నటులు బ్రహ్మాజీ, సముద్రఖని తదితరులు పాల్గొన్నారు. -
స్వచ్ఛంద సేవా సంస్థను ప్రారంభిస్తా
‘‘నా సినిమాల ఎంపిక రాంగ్ ఛాయిస్ అని అనుకోవడం లేదు. నేను ఇండస్ట్రీకి వచ్చి ఏడాదే అవుతోంది. ప్రతిరోజూ ఎప్పుడెప్పుడు షూటింగ్‌కి వెళ్దామా? అనే ఆసక్తితో ఉంటాను. ఇలాంటి సమయంలో నాకు షూటింగ్ లేకపోతే అది నా రాంగ్ ఛాయిస్ అవుతుంది’’ అని కృతీశెట్టి అన్నారు. నితిన్ హీరోగా, కృతీ శెట్టి, కేథరిన్ హీరోయిన్లుగా ఎమ్ఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించిన చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’. సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదల అవుతోంది. ఈ సందర్భంగా కృతీ శెట్టి పంచుకున్న విశేషాలు.. ► ‘మాచర్ల నియోజకవర్గం’ కథ విన్న వెంటనే ఒప్పుకున్నాను. ఇందులో స్వాతి పాత్రలో కనిపిస్తాను. నా క్యారెక్టర్లో విభిన్నమైన షేడ్స్ ఉన్నాయి. ఇది కమర్షియల్ మూవీయే అయినప్పటికీ నా పాత్రకు మచి ప్రాధాన్యం ఉంది. ఓ మంచి ప్యాకేజŒ తో ఆడియన్స్ ఎంటర్టైన్ అయ్యేలా ఈ సినిమా ఉంటుంది. ► నితిన్‌గారు తొలి చిత్రం ‘జయం’లో ఎలా ఫ్రెష్‌గా ఉన్నారో ‘మాచర్ల నియోజకవర్గం’ లోనూ అలానే ఉన్నారు. ఆయన నిజాయితీ వల్లే ఇరవై ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారని అనుకుంటున్నాను. నాకూ ఇలాంటి ప్రయాణం ఉండాలంటూ దీవించమని నితిన్గారిని అడిగాను(నవ్వుతూ). రాజశేఖర్‌గారికి ఇది తొలి సినిమా అయినా అనుభవం ఉన్న దర్శకుడిలా అనిపించారు. ► విలక్షణ నటిగా ప్రేక్షకులు నన్ను గుర్తించాలని విభిన్నమైన పాత్రలు చేస్తున్నాను. అందుకే ‘ఉప్పెన’లో బేబమ్మ పాత్ర చేసిన వెంటనే ‘శ్యామ్ సింగరాయ్’లో మోడ్రన్గాళ్గా చేశా. ‘ఉప్పెన’ లో విలక్షణ నటుడు విజయ్ సేతుపతిగారితో కలిసి నటించాను. నటనలో విలక్షణ పాత్రలు చేయాలనే స్ఫూర్తి ఆయన వల్లే నాలో కలిగిందేమో!. వినోదం, వైవిధ్యం.. రెండూ బ్యాలెన్స్ చేసేలా ప్రాజెక్ట్స్‌కు సైన్ చేశాను. కానీ నేను నటించిన కమర్షియల్ చిత్రాలు ఈ మధ్య వరుసగా విడుదల అయ్యాయి. సూర్యగారి ‘అచలుడు’, సుధీర్ బాబుగారి ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ చిత్రాల్లో విభిన్నంగా కనిపిస్తాను. ► లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్స్, బాలీవుడ్ సినిమాలు చేయాలనే ఆలోచన లేదు. ఓ స్వచ్ఛంద సేవా సంస్థను ప్రారంభించాలని చిన్నతనం నుంచి అనుకుంటున్నాను. త్వరలోనే ఇందుకు సంబంధించిన పనిని స్టార్ట్ చేస్తాను. నా సినిమాల ఫలితాల గురించి నాకు ఎలాంటి రిగ్రేట్స్ లేవు. ఏదైనా లెర్నింగ్ ఎక్స్పీరియన్స్గానే భావిస్తాను. నా సినిమాలు చూస్తున్నప్పుడు ఆడియన్స్ ఎంటర్టైన్ అవ్వాలనే కష్టపడతాను. ప్రస్తుతం నాగచైతన్య హీరోగా వెంకట్‌ప్రభు దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా చేస్తున్నాను. మరికొన్ని కొత్త సినిమాలకు సైన్ చేశాను. వివరాలు త్వరలో వెల్లడిస్తాను. ► నాకు బెస్ట్ ఫ్రెండ్ అంటే మా అమ్మగారే. నేను చూసిన స్ట్రాంగ్ ఉమెన్ కూడా ఆమె. నాకు చిన్నప్పటి స్నేహితులు కూడా ఉన్నారు. ముంబైలో ఉంటే ఫ్రెండ్షిప్డేని బాగా సెలబ్రేట్ చేసుకునేదాన్ని. -
20 ఏళ్ల ప్రయాణం.. ఇది మామూలు విషయం కాదు: దిల్ రాజు
‘‘జయం’(2002) సినిమాతో మొదలైన నితిన్ ప్రయాణం ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకోవడం మామూలు విషయం కాదు. తెలుగు చిత్ర పరిశ్రమలోనే ఎక్కువ మంది హీరోలు ఉన్నారు. ఇంత పోటీలో కూడా నితిన్ సక్సెస్ ఫుల్‌గా ఉండటం గొప్ప విషయం. ‘మాచర్ల నియోజకవర్గం’ బ్లాక్‌బస్టర్ అవుతుంది’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. నితిన్, కృతీశెట్టి, కేథరీన్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’. ఎమ్.ఎస్. రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో రాజ్‌కుమార్ ఆకెళ్ల సమర్పణలో శ్రేష్ట్ మూవీస్‌పై సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 12న రిలీజ్ కానుంది. మహతి స్వర సాగర్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘రా రా రెడ్డి.. ఐ యామ్ రెడీ’ పాట లిరికల్ వీడియోను ‘దిల్’ రాజు విడుదల చేశారు. కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించిన ఈ పాటను లిప్సిక ఆలపించారు. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. పాట రిలీజ్ సందర్భంగా నితిన్ మాట్లాడుతూ– ‘‘నా అభిమానుల కోసం ఈ చిత్రంలో హెవీ డ్యాన్స్ నంబర్స్ పెట్టాం. ‘రా రా రెడ్డి..’ పాటలో నా ‘జయం’ చిత్రంలోని ‘రాను రాను అంటూనే..’ పాటను రిపీట్ చేయడం ప్రత్యేకంగా అనిపించింది. అంజలి కాలికి గాయమైనప్పటిMీ ఫ్లోర్ మూమెంట్స్‌ని హార్డ్‌వర్క్‌తో కంప్లీట్ చేశారు’’ అన్నారు. ‘‘మాచర్ల నియోజకవర్గం’ సూపర్ హిట్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు రాజశేఖర్ రెడ్డి. -
కమల్‌గారు గ్లోబల్ స్టార్: విక్టరీ వెంకటేశ్
‘‘దక్షిణాది సినిమాలో రెండు శకాలు ఉంటే.. ఒకటి కమల్‌హాసన్‌గారికి ముందు.. మరొకటి కమల్‌గారు వచ్చిన తర్వాత. ఆయనతో ఓ ఫుల్ లెంగ్త్ రోల్ చేయాలని ఉంది. కమల్‌గారు నాకు అపూర్వ సహోదరులు’’ అని అన్నారు హీరో వెంకటేశ్. కమల్‌హాసన్, విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రల్లో లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం ‘విక్రమ్’. ఈ సినిమాను తెలుగులో ‘విక్రమ్: హిట్ లిస్ట్’ పేరుతో హీరో నితిన్ రిలీజ్ చేస్తున్నారు. ఈ నెల 3న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా జరిగిన ‘విక్రమ్: హిట్ లిస్ట్’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న వెంకటేశ్ మాట్లాడుతూ – ‘‘కమల్‌గారి ‘పదినారు వయదినిలే’ (పదహారేళ్ల వయసు) చూసిన తర్వాత నేను క్లీన్»ౌల్డ్. ఆయన నటించిన ‘మరో చరిత్ర’ ప్రతి యాక్టర్‌కు జీపీఎస్. ‘దశావతారం’లాంటి సినిమా చేయాలంటే ఓ యాక్టర్‌కు ధైర్యం సరిపోదు. ‘ఏక్ దూజే కేలియే’తో ఆయన ఫస్ట్ పాన్ ఇండియా స్టార్. ఈ రోజు కమల్‌గారు గ్లోబల్ స్టార్. యాక్టర్, డైరెక్టర్, రైటర్, సింగర్, కొరియోగ్రాఫర్, పొలిటీషియన్, మంచి మానవతావాది.. ఇలా చెబితే.. దశావతారాలు కాదు.. ఆయనలో శతావతారాలు కనపడతాయి. ‘విక్రమ్’ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్న సుధాకర్, నితిన్‌లకు కంగ్రాట్స్’’ అన్నారు. కమల్‌హాసన్ మాట్లాడుతూ – ‘‘దాదాపు 45 ఏళ్ల క్రితం ఏయన్నార్‌గారి ‘శ్రీమంతుడు’ సినిమాకు డ్యాన్స్ అసిస్టెంట్‌గా హైదరాబాద్ వచ్చాను. అప్పట్నుంచి నేను తెలుగు ఫుడ్ తింటున్నాను. నా కెరీర్లో ఎన్నో హిట్స్‌ను తెలుగు ప్రేక్షకులు ఇచ్చారు. డైరెక్టర్ బాలచందర్‌గారితో నేను 36 సినిమాలు చేశాను. అదే నా పీహెచ్డీ. నా స్టైల్, రజనీకాంత్ స్టైల్ ఆయన్నుంచే వచ్చాయి. వెంకీగారు ఓసారి గోవాకు వస్తే, ఫిల్మ్ ఫెస్టివల్‌కు వచ్చారా? అన్నాను. మిమ్మల్ని చూడటానికి వచ్చానన్నారు. నాకు తెలిసింది చెప్పాను. ఆయనకు మరో వేవ్ వచి్చంది. ఇప్పుడు నా బ్రదర్ ఇక్కడ ఉన్నందుకు సంతోషంగా ఉంది. నేను, వెంకీగారు ‘మర్మయోగి’ సినిమా చేయాల్సింది. చేసి ఉంటే మా కెరీర్లో మంచి హిట్‌గా నిలిచి ఉండేది. ‘విక్రమ్’ సినిమాకు మంచి టీమ్ కుదిరింది. ఈ సినిమా హిట్ మీ (ప్రేక్షకులు) చేతుల్లోనే ఉంది. డైరెక్టర్ లోకేశ్‌గారు నాలాగే (బ్యాక్‌గ్రౌండ్ లేకుండా) ఇండస్ట్రీలోకి వచ్చారు. ఇలాంటివారిని నేను మరింత గౌరవిస్తాను. ఇండియన్ ఫిల్మ్స్... పాన్ ఇండియా చాలదు.. పాన్ వరల్డ్. అది మీ (ప్రేక్షకులు) సహకారం లేకుండా జరగదు. మంచి సినిమాలు ఇవ్వండని మీరు డిమాండ్ చేయాలి. ఇవ్వడానికి మేం సిద్ధంగా ఉన్నాం. నేను మంచి సినిమాకు అభిమానిని’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో కమల్‌గారి అద్భుతమైన యాక్షన్‌ను చూస్తారు’’ అన్నారు లోకేశ్ కనగరాజ్. ‘‘కమల్‌హాసన్‌గారు ప్రైడ్ ఆఫ్ ఇండియా’’ అన్నారు నితిన్. ‘‘తెలుగులో ‘విక్రమ్’ను రిలీజ్ చేసే చాన్స్ ఇచి్చన కమల్‌గారికి థ్యాంక్స్’’ అన్నారు సుధాకర్ రెడ్డి. -
ఏకైక సౌత్ ఇండియన్ హీరో నితిన్ మాత్రమే.. ఎందులో అంటే ?
Nithin Is The First South Indian Hero With Highest Views: బాలీవుడ్ ఆడియెన్స్‌కు కొన్నిసార్లు తమ చిత్రాలకంటే ఇతర భాష సినిమాలను ఎక్కువగా ఆదరిస్తారు. అందుకే యూట్యూబ్‌లో బీటౌన్ చిత్రాలకంటే హిందీలో డబ్ అయిన మూవీస్‌కే ప్రజాదరణ వస్తోంది. ఇలా హిందీలో ఎక్కువ ప్రేక్షకాదరణ పొందిన ఏకైక సౌత్ ఇండియా హీరోగా నితిన్ మాత్రమే రికార్డ్‌కెక్కాడు. గత కొన్నేళ్లుగా యూట్యూబ్‌లో నితిన్ సినిమాలకు ఎక్కవ వ్యూస్ వస్తున్నాయి. యూట్యూబ్‌లో తన చిత్రాలు హిందీలో డబ్ అవడమేకాకుండా బాలీవుడ్ ప్రేక్షక అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు నితిన్. నితిన్ నటించిన హిందీ డబ్బింగ్ చిత్రాలన్నింటికి కలిపి యూట్యూబ్‌లో 2.3 బిలియన్ల వ్యూస్ రావడం విశేషంగా మారింది. నితిన్ నటించిన తెలుగు మూవీస్ అన్నీ హిందీ డబ్బింగ్ రైట్స్ కోసం భారీ మొత్తంగా వసూలు చేయడంతో నిర్మాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం నితిన్ మాచర్ల నియోజకవర్గం సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎమ్ఎస్ రాజా శేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కృతిశెట్టి హీరోయిన్గా చేస్తోంది. -
ఇష్క్ @ 10
-
సినిమాని పాటలు డామినేట్ చేస్తున్నట్లుగా చూడొద్దు
‘‘ఒకే ఆల్బమ్‌లో ఒకదానికొకటి భిన్నంగా అనిపించే పాటలు ఉండటం అరుదు. దేవిశ్రీ ప్రసాద్ తన ఆల్బమ్‌లోని పాటలన్నీ డిఫరెంట్ వేరియేషన్స్‌తో ఉండేందుకు ప్రయత్నిస్తారు. ‘రంగ్ దే’ ఆల్బమ్ అలాంటిదే’’ అని పాటల రచయిత శ్రీమణి అన్నారు. నితిన్, కీర్తీ సురేష్ జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రంగ్ దే’. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 26న విడుదలవుతోంది. ఈ చిత్రంలోని నాలుగు పాటలు రాసిన శ్రీమణి విలేకరులతో మాట్లాడుతూ– ‘‘100% లవ్’ సినిమాతో దేవిశ్రీతో నా ప్రయాణం మొదలైంది. ఈ ఏప్రిల్‌తో మా ప్రయాణానికి పదేళ్లు పూర్తవుతాయి. ‘తొలిప్రేమ’ చిత్రం నుంచే వెంకీ అట్లూరితో కలిసి పనిచేస్తున్నాను. సాధారణంగా మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చే ట్యూన్స్‌కే మేం లిరిక్స్ రాస్తుంటాం. ఒక్కోసారి కాన్సెప్ట్‌కు తగ్గ లిరిక్స్ రాసుకొని, ఆ తర్వాత ట్యూన్స్ కట్టడం జరుగుతుంది. ప్రతి పాటనూ ఓ ఛాలెంజ్‌గానే తీసుకుంటాను. నేను రాసే పాటని మొదట నా భార్యకు లేదంటే నా ఫ్రెండ్ మురళికి, రైటర్ తోట శ్రీనివాస్‌కు వినిపిస్తుంటాను. ఫిలాసఫికల్ సాంగ్స్‌ని మాత్రం సీతారామశాస్త్రిగారికి వినిపించి, సలహాలు తీసుకుంటుంటాను. ‘జులాయి’ నుంచే సితార ఎంటర్టైన్మెంట్స్ చిత్రాలకు పాటలు రాస్తున్నాను. సినిమా విడుదలకు ముందే పాటలు హిట్టయితే, సినిమాని పాటలు డామినేట్ చేస్తున్నట్లుగా చూడకూడదు. లవ్ స్టోరీకి పాటలు పాపులర్ అయితే కమర్షియల్‌గా అది సినిమాకు ఎంతో ఉపయోగపడుతుంది’’ అన్నారు. -
కాలంతో పాటు వెళ్లడమే మంచిది
‘‘నేను తీసిన కొన్ని సినిమాలు ప్రేక్షకుల్ని నిరుత్సాహపరచి ఉండొచ్చు. కానీ ‘చెక్’ మాత్రం నిరుత్సాహపరచదు. అన్ని వర్గాల ప్రేక్షకులకు మా సినిమా నచ్చుతుంది’’ అని దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి అన్నారు. నితిన్ హీరోగా, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘చెక్’. భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనంద ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 26న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి చెప్పిన విశేషాలు. ► నితిన్ తో సినిమా చేయాలనుకున్నాం. రెండుమూడు కథలు అనుకున్నా కుదరలేదు. ఫైనల్‌గా ‘చెక్’ బావుంటుందనుకుని చేశాం. నితిన్‌ని మైండ్‌లో పెట్టుకుని ఈ కథ రాయలేదు. కథ పూర్తయ్యాక కలిశాను. తనకి ‘చెక్’ పాత్ర బాగా సూట్ అవుతుందని చేశాం. ఈ సినిమాలో హ్యూమన్ డ్రామా ఆకట్టుకుంటుంది. ► హీరో ఒక ఉరిశిక్ష పడ్డ ఖైదీ.. అయితే బాగా తెలివైనవాడు. క్రెడిట్ కార్డ్స్ ఫ్రాడ్ చేస్తుంటాడు. అనుకోకుండా ఒక పెద్ద ప్రమాదంలో జైలులో పడితే ఉరిశిక్ష పడుతుంది. అతను క్షమాభిక్ష కోసం రాష్ట్రపతికి దరఖాస్తు పెట్టుకుంటాడు. హీరో చెస్ బాగా ఆడి వరుసగా విజయాలు సాధిస్తున్నాడని అతడిపై సానుభూతి కలిగి, ఉరిశిక్షపై రాష్ట్రపతికి అభిప్రాయం మారొచ్చు. ఆట, క్షమాభిక్ష... ఈ రెండు అంశాల నేపథ్యంలో ‘చెక్’ సన్నివేశాలు ఉంటాయి. ఈ కథలో చదరంగం ఆటకు చాలా ప్రాధాన్యం ఉంది. ► 70 శాతం సినిమా జైలులో సాగుతుంది. కరోనా వల్ల బయటకు వెళ్లలేక జైలు సీక్వెన్సులు కొంచెం పెంచాల్సి వచ్చింది. ‘ఐతే’ తర్వాత నేను, కల్యాణీ మాలిక్ పని చేయాలనుకున్నా పరిస్థితుల వల్ల కుదరలేదు. ఇప్పుడు కుదరడం అదృష్టం అనుకోవాలి. తన నేపథ్య సంగీతంతో సినిమాను మరో స్థాయికి తీసుకువెళ్లాడు. ఈ చిత్రంలో రకుల్ న్యాయవాదిగా నటించారు. ప్రియా ప్రకాశ్ ఫ్లాష్‌బ్యాక్‌లో వస్తుంది. ► ఆనందప్రసాద్ చాలా మంచి నిర్మాత. మొదట కథ వింటారు. కథ నచ్చితే మళ్లీ ఫైనల్ కాపీ చూస్తారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అన్నే రవిగారు వెనుక ఉండి నడిపిస్తుంటారు. ‘ప్రేక్షకుల ఆలోచనల కంటే మీరు అడ్వాన్స్డ్’ అని చాలామంది నన్ను అంటారు.. అడ్వాన్స్ అవ్వడం కూడా తప్పే. కాలం కంటే ముందు, వెనుక ప్రయాణించకూడదు. కాలంతో పాటు ప్రయాణించాలి. ► ‘చెక్’ సినిమాకన్నా ముందే రెండు సినిమాలు ఒప్పుకున్నాను. వాటిలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలో ఒకటి, వేరే సంస్థలో మరో సినిమా చేస్తాను. -
‘చెక్’ పెట్టేందుకు నితిన్ రెడీ..
‘నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను’ అని ప్రియా ప్రకాశ్ వారియర్ పాట అందుకుంటే ‘మార్నింగ్ అవ్వకముందే వెలుగుల్తో వచ్చేస్తాను. ఫుల్‌మూన్ లేకుండానే వెన్నెల్లో ముంచేస్తాను’ అని నితిన్ అన్నారు. నితిన్ , ప్రియా ప్రకాశ్‌ల ఈ ప్రేమ పాట ‘చెక్’ సినిమా కోసమే. చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో నితిన్, రకుల్‌ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాశ్ వారియర్ లీడ్ రోల్స్‌లో వి. ఆనంద్ ప్రసాద్ నిర్మించిన చిత్రం ‘చెక్’. ఈ సినిమాలోని ‘నిన్ను చూడకుండా’ అనే పాటను గోవాలో చిత్రీకరించారు. ‘‘నితిన్ , ప్రియా ప్రకాశ్ వారియర్లపై చిత్రీకరించిన ఈ పాటతో సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ పాటకు కల్యాణీ మాలిక్ సంగీతం అందించారు. శ్రీమణి లిరిక్స్ ఇచ్చారు. కథ ప్రకారం సినిమాలో ఒక్క పాట మాత్రమే ఉంటుంది. ఈ సినిమాను ఈ నెల 26న విడుదల చేస్తున్నాం’’ అని నిర్మాత అన్నారు. -
భాష లేని ఊసులాట!
‘‘ఏమిటో ఇది వివరించలేనిది.. మది ఆగమన్నది తనువాగనన్నది.. భాష లేని ఊసులాట సాగుతున్నది.. అందుకే ఈ మౌనమే ఓ భాష అయినది.. కోరుకోని కోరికేదో తీరుతున్నది...’’ అంటూ ప్రేయసికి తన ప్రేమను తెలియజేస్తున్నారు నితిన్. ఈ ప్రేమ పాట ‘రంగ్ దే’ చిత్రం కోసమే. నితిన్, కీర్తీ సురేష్ జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ‘ఏమిటో ఇది వివరించలేనిది..’ అంటూ సాగే ఈ చిత్రంలోని తొలి పాట వీడియోను విడుదల చేశారు. ఈ పాటకి శ్రీమణి సాహిత్యం సమకూర్చారు. హరిప్రియ, కపిల్ కపిలన్ పాడారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు అందించారు. ‘‘ఈ రొమాంటిక్ మెలోడీని వీక్షకులకు కనువిందు కలిగేలా చిత్రీకరించారు వెంకీ అట్లూరి. ఈ నెల చివరి వారం నుంచి చిత్రానికి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తాం. దుబాయ్‌లో పాటల చిత్రీకరణతో త్వరలోనే షూటింగ్ పూర్తవుతుంది. 2021 సంక్రాంతికి సినిమా విడుదల చేస్తాం’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రానికి సమర్పణ: పీడీవీ.ప్రసాద్, కెమెరా: పీసీ శ్రీరామ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్.వెంకటరత్నం (వెంకట్). -
నితిన్ సినిమాకు నో చెప్పిన బుట్టబొమ్మ!
ఒక భాషలో హిట్టయిన చిత్రాలను మరో భాషలోకి రీమేక్ చేయడం సినీ పరిశ్రమలో సర్వసాధారణమైన విషయం. హిందీలో ఆయుష్మాన్ ఖురానా, రాధికా ఆప్టే హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘అంధాదున్’ సూపర్ హిట్ అయ్యింది. ఇందులో టబు ముఖ్యపాత్ర పోషించారు. అంధుడైన హీరో జీవితంలో టబు రావడం వల్ల జరిగిన మార్పులు ఈ సినిమాలో కథను మలుపు తిప్పుతాయి. అయితే హిందీలో హిట్టయిన ‘అంధాదున్’ చిత్రాన్ని తెలుగులో నితిన్ హీరోగా రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మేర్లపాక గాంధీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో కథానాయిక పాత్ర కోసం వరుస విజయాలతో దూసుకుపోతున్న బుట్టబొమ్మ పూజా హెగ్డేను సంప్రదించగా నిరాకరించినట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు అంత ప్రాముఖ్యత ఉండదని, అందుకే పూజా తిరస్కరించినట్లు కొందరు చెబుతుంటే, పారితోషికం సమస్య వల్ల నో చెప్పిందని మరికొందరు అంటున్నారు. ఏదేమైనా ఇప్పుడు ఈ న్యూస్ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. చదవండి: బుట్టబొమ్మను కన్నెత్తి చూడని అఖిల్ -
నితిన్-షాలినీల వివాహం
-
పేటలోకి ఎంట్రీ
‘మిర్చి, అత్తారింటికి దారేది, అఆ, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ తదితర చిత్రాల్లో క్యారెక్టర్ నటిగా కీలక పాత్రలు చేసి, మెప్పించారు నదియా. ఆమె మరో పవర్ఫుల్ రోల్లో కనిపించనున్నారని సమాచారం. నితిన్ హీరోగా రూపొందనున్న ‘పవర్‌పేట’లో ఓ కీలక పాత్రకు నదియాని సంప్రదించారట. ఈ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని తెలిసింది. ‘ఛల్ మోహన్ రంగ’ చిత్రం తర్వాత హీరో నితిన్, దర్శకుడు కృష్ణచైతన్య కాంబినేషన్లో తెరకెక్కనున్న చిత్రం ఇది. ఇందులో కీర్తీ సురేష్ కథానాయికగా నటించబోతున్నారని తెలిసింది. నటుడు సత్యదేవ్ ఓ కీలక పాత్ర చేయనున్నారు. కథరీత్యా ఇందులో నితిన్ మూడు గెటప్స్‌లో కనిపిస్తారు. నితిన్ లుక్స్ కోసం హాలీవుడ్ మేకప్‌మేన్‌ని తీసుకోబోతున్నారట టీమ్. ఈ చిత్రం రెండు భాగాల్లో విడుదలవుతుందనే ప్రచారం జరుగుతోంది. -
అర్జున్.. అను వచ్చేశారు
‘భీష్మ’ వంటి హిట్ చిత్రం తర్వాత నితిన్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘రంగ్ దే’. కీర్తీ సురేశ్ కథానాయికగా నటిస్తున్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. నేడు నితిన్ పుట్టినరోజు సందర్భంగా మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రంలో అర్జున్ పాత్రలో నితిన్, అను పాత్రలో కీర్తీ సురేశ్ నటిస్తున్నారు. ఈ పాత్రలను పరిచయం చేస్తూ మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రానికి కెమెరా: పి.సి. శ్రీరామ్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్. వెంకటరత్నం (వెంకట్). పుట్టినరోజు వేడుకల్లేవ్.. పెళ్లి వాయిదా కరోనా వైరస్ ప్రభావం నేపథ్యంలో నేడు తన పుట్టినరోజు వేడుకల్ని జరుపుకోవడం లేదని, ఏప్రిల్ 16న దుబాయ్‌లో జరగాల్సిన పెళ్లిని కూడా వాయిదా వేశానని నితిన్ తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ– ‘‘ప్రస్తుతం దేశంలో ఎలాంటి ఆందోళనకర పరిస్థితులున్నాయో మీకు తెలుసు. లాక్డౌన్ కొనసాగుతుండటంతో నేడు నా పుట్టినరోజుని జరుపుకోకూడదని నిర్ణయించుకున్నాను. ఎక్కడా కూడా నా జన్మదిన వేడుకలు జరపవద్దు. నా పెళ్లిని కూడా వాయిదా వేసుకుంటున్నాను. ఈ సంక్షోభ సమయంలో మనం ఇళ్లల్లో కాలు మీద కాలేసుకొని కూర్చొని, మన కుటుంబంతో గడుపుతూ బయటకు రాకుండా ఉండటమే దేశానికి సేవ చేసినట్లు’’ అన్నారు. ∙కీర్తీ సురేశ్, నితిన్ -
నితిన్ రీమేక్ మూవీ: డైరెక్టర్..
భీష్మ సినిమా హిట్‌గా నిలవడంతో ఫుల్‌జోష్‌లో ఉన్న నితిన్ మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. అయితే ఈసారి స్ట్రేట్ సినిమాతో కాకుండా రీమేక్‌తో అభిమానులను అలరించనున్నాడు. బాలీవుడ్లో గత ఏడాది బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన చిత్రం ‘అంధాధూన్’.. విభిన్న కథాంశాలను ఎంచుకునే హీరో ఆయుష్మాన్ ఖురానా, టబు ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమా రీమేక్ హక్కులను నిర్మాత సుధాకర్ రెడ్డి సొంతం చేసుకున్నారు. ఇందులో ఆయన కుమారుడు నితిన్ హీరోగా నటించనున్న సంగతి తెలిసిందే. Glad to announce our next production, a remake of #Andhadhun. Featuring @actor_nithiin and directed by @MerlapakaG. Glimpses from the official launch today! Bankrolled by #SudhakarReddy & #NikithaReddy. Presented by #BMadhu. More details soon!! #ProductionNo6 pic.twitter.com/rzpiARQl8J — Sreshth Movies (@SreshthMovies) February 24, 2020 ఈ క్రమంలో ఈ చిత్రానికి సంబంధించి శ్రేష్ఠ్ మూవీస్ తాజా అప్డేట్ను అభిమానులతో పంచుకుంది. నితిన్.. ‘అంధాధున్’ కు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు సినిమాను అధికారికంగా లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. కాగా వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ రాజా వంటి సినిమాలతో మేర్లపాక గాంధీ హిట్లు కొట్టిన సంగతి తెలిసిందే. ఇక అంధాధున్ సినిమా ఒరిజినల్లో నటించిన టబు రీమేక్‌లోనూ కనిపిస్తారా? వేచి చూడాలి. -
సైబర్ క్రైమ్ గురించి చెప్పాం
ధృవ కరుణాకర్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘అశ్వమేథం’. జి.నితిన్ దర్శకత్వం వహించారు. ప్రియా నాయర్, వందనాయాదవ్, శుభా మల్హోత్రా, రూపేష్‌లు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 9న విడుదల కానుంది. ఈ సందర్భంగా నితిన్ మాట్లాడుతూ– ‘‘తెలుగు చిత్రపరిశ్రమలో ‘అశ్వమేథం’ నా తొలి చిత్రం. ఈ సినిమాకు ముందు రెండు మరాఠీ సినిమాలకు దర్శకత్వం వహించాను. ఒకటి విడుదలైంది. దానికి ‘దాదాసాహెబ్ ఫాల్కే జన్మభూమి’ అవార్డు వచ్చింది. మరో సినిమా ఈ ఆగస్టులో విడుదల కానుంది. నాకు హిందీ, మరాఠీ, గుజరాతీ భాషలు వచ్చు. ఈ సినిమా నిర్మాత ద్వారా తెలుగులో స్ట్రయిట్ సినిమా చేసే అవకాశం వచ్చింది. నాకు తెలుగు భాష రాదు. మాట్లాడగలను. ఇక ‘అశ్వమేథం’ చిత్రం విషయానికి వస్తే.. డిజిటల్ ఎకానమీ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. సైబర్ క్రైమ్ అంశాలను ప్రస్తావించాం. హీరో ధృవ చాలా కష్టపడ్డాడు. డూప్ లేకుండా చేశాడు. రెండు చేజ్ సీక్వెన్స్‌లను కలుపుకుని సినిమాలో మొత్తం ఎనిమిది యాక్షన్ సీక్వెన్స్‌లు ఉన్నాయి. చిత్రీకరణలో భాగంగా ధృవ దాదాపు 14సార్లు గాయపడ్డారు. అందుకే సినిమా కాస్త ఆలస్యమైంది.’’ అని అన్నారు ఇంకా మాట్లాడుతూ– ‘‘ప్రస్తుతం బాలీవుడ్‌పై సౌత్ సినిమాల ప్రభావం బాగా ఉంది. అల్లు అర్జున్, ఎన్టీఆర్, రవితేజ వంటి హీరోల సినిమాలను మొబైల్స్‌లో ఎక్కువగా చూస్తున్నారు. సౌత్‌కు చెందిన సినిమాలు బాలీవుడ్లో మంచి హిట్ సాధిస్తున్నాయి. రాజమౌళిగారు తెలుగు సినిమా గొప్పదనాన్ని పెంచారు’’ అని చెప్పుకొచ్చారు. -
జెట్ స్పీడ్‌లో దూసుకుపోతున్న నితిన్
ఓ వైపు భీష్మ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు.. నిన్ననే మరో చిత్రానికి కొబ్బరికాయ కొట్టేశాడు.. నేడు మరో చిత్రాన్ని అనౌన్స్ చేసేశాడు హీరో నితిన్. వరుస చిత్రాలతో బిజీ బిజీగా ఉన్న ఈ హీరో ప్రస్తుతం కీర్తి సురేష్‌తో జోడి కట్టనున్నాడు. తాజాగా ఈ కొత్త చిత్ర విశేషాలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. వెంకీ కుడుముల దర్శకత్వంలో భీష్మ చిత్ర షూటింగ్‌ను ప్రారంభించగా.. చంద్రశేఖర్ యేలేటి డైరెక్షన్లో మరో సినిమాను ఆదివారం ప్రారంభించాడు నితిన్. తాజాగా వెంకీ అట్లూరితో కలిసి చేయబోయే కొత్త సినిమా కబుర్లను అభిమానులతో పంచుకున్నాడు. ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్గా నటించనుందని, ఈ సినిమాకు రంగ్‌దే అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు తెలిపాడు. ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్పై నాగవంశీ నిర్మించగా.. సినిమాటోగ్రఫర్‌గా పీసీ శ్రీరామ్ పనిచేయనున్నారు. #Nithiin29 is titled as RANG DE! Working with the Young n talented dir Venky atluri, costarring @KeerthyOfficial n produced by @vamsi84 @SitharaEnts AND cinematography by my ALL TIME FAV D.o.P @pcsreeram sir 😍😍😍😍😍😍😍 #RangDe #gimmesomelove pic.twitter.com/NeaO2rllRB — nithiin (@actor_nithiin) June 24, 2019 -
సోషల్‌మీడియా సెన్సేషన్‌కు.. తెలుగులో చాన్స్
ఓవర్‌నైట్‌లో వచ్చిన స్టార్‌డమ్‌ను ఎక్కువకాలం నిలుపుకోలేకపోయింది ప్రియా ప్రకాశ్ వారియర్. ఒకే ఒక్క కనుగీటు, ముద్దుగన్నుతో కుర్ర హృదయాలను పేల్చిన ప్రియా వారియర్.. ‘లవర్స్ డే’ సినిమాతో చతికిల పడింది. ఈ సినిమా రిలీజైన తరువాత ప్రియా వారియర్‌కు గడ్డుకాలం మొదలైంది. ఈ మూవీలో తన లుక్స్, నటనకు నెగెటివ్ టాక్ వచ్చింది. అప్పటివరకు ఆమెకు క్యూ కట్టిన ఆఫర్స్ అన్నీ ఆవిరయ్యాయి. లవర్స్ డే రిలీజైన తరువాత దాదాపు ఇండస్ట్రీకి దూరమైంది. అయితే తాజాగా తెలుగులో ఓ అవకాశాన్ని దక్కించుకుంది. నితిన్-చంద్రశేఖర్ యేలేటి చిత్రంలో ప్రియా వారియర్ హీరోయిన్గా నటిస్తుంది. ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలను చిత్రయూనిట్ నేడు నిర్వహించింది. భవ్య క్రియేషన్స్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రకుల్‌ప్రీత్ నటిస్తుండగా.. ఎమ్ఎమ్ కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. నితిన్ ప్రస్తుతం ‘భీష్మ’ చిత్రంలో బిజీగా ఉన్నాడు. -
నితిన్ మెట్రో ఎందుకు ఎక్కాడంటే..
సాక్షి, హైదరాబాద్ : నగరంలో శుక్రవారం సాయంత్రం కురిసిన భారీ వర్షం కారణంగా ట్రాఫిక్ ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. పలు చోట్ల రోడ్లపై భారీగా వర్షపు నీరు నిలిచిపోవడంతో ఆఫీసుల నుంచి ఇళ్లకు బయలుదేరిన ఉద్యోగులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.ఈ ట్రాఫిక్‌లో సామాన్యులే కాదు సెలబ్రిటీలు కూడా చిక్కుకున్నారు. ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలు గంటల తరబడి రోడ్లపై నిలిచిపోవడంతో జనాలు మెట్రో రైలును ఆశ్రయిస్తున్నారు. హీరో నితిన్ కూడా ట్రాఫిక్ బారి నుంచి తప్పించుకోవడానికి మెట్రోలో ప్రయాణించారు. మరోవైపు మాదాపూర్, హైటెక్‌సిటీ, కొండాపూర్‌లలో వాహనాలు గంటల తరబడి రోడ్లపై నిలిచిపోయాయి. కూకట్పల్లి ప్రధాన మార్గంలో కిలోమీటర్ల మేర వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. -
నితిన్‌కు జోడిగా ‘మహానటి’?
శ్రీనివాస కళ్యాణం బోల్తాకొట్టడంతో ఆచితూచి ప్రాజెక్ట్‌లను ఓకే చేస్తున్నాడు హీరో నితిన్. అఆ తరువాత ఆ రేంజ్ హిట్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం యువ దర్శకుడు వెంకీ కుడుములతో భీష్మ చిత్రాన్ని పట్టాలెక్కిస్తున్నాడు. మహానటితో కీర్తి సురేష్ ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్‌లో ఓ రేంజ్లో క్రేజ్ సంపాదించుకుంది. అయితే మహానటి సినిమా తరువాత తెలుగులో ఇప్పటివరకు మరో చిత్రానికి ఓకే చెప్పలేదు. ప్రస్తుతం కీర్తి బోనీ కపూర్ తెరకెక్కిస్తున్న ఓ చిత్రంలో నటించనుంది. ఇదికాకుండా తమిళ,తెలుగు ద్విభాషా చిత్రానికి కూడా ఓకే చెప్పినట్లు టాక్. అయితే తాజాగా తొలిప్రేమ ఫేమ్ వెంకీ అట్లూరి చెప్పిన కథ కీర్తికి నచ్చిందని.. ఆ చిత్రంలో నటించేందుకు అంగీకరించినట్లు సమాచారం. ఈ చిత్రంలో నితిన్‌కు జోడిగా కీర్తి సురేష్ నటించనున్నట్లు తెలుస్తోంది. మరి ఈ చిత్రంపై ఇప్పటివరకు హీరోగానీ, హీరోయిన్‌గానీ అధికారికంగా స్పందించలేదు. -
బిజీ బ్యాచిలర్
భుజం గాయం కారణంగా కొన్ని నెలలుగా కెమెరా ముందుకు వెళ్లని నితిన్ మళ్లీ షూటింగ్స్‌తో బిజీ అవ్వడానికి రెడీ అయ్యారు. ‘ఛలో’ ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా ‘భీష్మా’ ది బ్యాచిలర్ అనే సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమా రెగ్యులర్ షుటింగ్‌ను ఈ నెల 25న స్టార్ట్ చేయనున్నారట. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. రష్మికా మండన్నా హీరోయిన్. ‘ఛలో’ తరహాలోనే ఈ ‘భీష్మా’ కూడా పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రంగా ప్లాన్ చేశారట. ఈ సినిమానే కాకుండా ‘కుమారి 21ఎఫ్’ ఫేమ్ సూర్య ప్రతాప్ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మించనున్న ఓ సినిమాను అంగీకరించారు నితిన్. ఈ రెండు సినిమాలతో నితిన్ ఈ ఏడాది బిజీ బిజీగా ఉండబోతున్నారు. ‘భీష్మ’ సినిమాకు సాగర్ మహతి సంగీత దర్శకుడు. -
ఈ డైలాగ్స్ ఇప్పుడే చెబితే క్లైమాక్స్‌లో ఏం చెబుతాం!!
నూతన వధువరులను ‘శతమానం భవతి’ అని దీవిస్తారు. గొప్ప సంప్రదాయాలను ‘నూరేళ్లు వర్థిల్లాల’ని కోరుకుంటారు. మన వివాహవ్యవస్థ ప్రపంచానికి ఆదర్శం. మన సినిమా భావోద్వేగాల సమ్మిళితం. మంచి విలువలను చెప్పే మంచి సినిమా వర్థిల్లాలి. మన సంస్కృతికి పదే పదే ఆయువు పోస్తూ ఉండాలి. శతమానం భవతి! వేగేశ్న సతీష్‌గారితో ‘శతమానం భవతి’ వంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేశాక మళ్లీ ఆయన దర్శకత్వంలోనే ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్ మూవీ ‘శ్రీనివాస కళ్యాణం’ని ఎందుకు ఓకే చేశారు? ‘దిల్’ రాజు: మేజర్‌గా నేను రెండు విషయాలు ఆలోచిస్తా. ఒకటి స్టోరీ. రెండోది స్టోరీ ఐడియా. కథ, ఐడియా ఇంట్రెస్ట్‌గా ఉంటే ఓకే చేస్తా. వర్కౌట్ అవుతుందా? లేదా? అనే విషయం గురించి ఆలోచించను. ‘శతమానం భవతి’ సినిమాను అలాగే పిక్ చేశాను. ‘శ్రీనివాస కళ్యాణం’ సినిమాను కూడా అలాగే ఎంపిక చేసుకున్నాను. ‘శతమానం భవతి’ అనేది ఒక కథ అని, ‘శ్రీనివాస కళ్యాణం’ అనేది ఒక మూమెంట్ అనే క్లారిటీ ఉంది. సినిమాలోని 8, 9 మూమెంట్స్ అద్భుతంగా ఉంటాయి. ఆడియన్స్ నుంచి వాటికి మంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమాకు మంచి టాక్ రావడానికి కూడా ఆ సీన్సే కారణమని నా నమ్మకం.‘శతమానం భవతి’లో కథ వెంటనే స్టార్ట్ అవుతుంది. ‘శ్రీనివాస కల్యాణం’లో ప్రీ ఇంట్రవెల్ నుంచి స్ట్రాంగ్ కథ మొదలవుతుంది. ఫస్ట్ హాఫ్‌లోని మూమెంట్స్‌కు ఆడియన్స్ ఎంగేజ్ అవుతారనే నమ్మకం ఎలా కలిగింది? ‘దిల్’ రాజు: నిజం చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ గురించి భయపడుతూనే ఉన్నాం. కానీ మంచి మూమెంట్స్ ఉన్నాయి కదా అనే ధైర్యం ఓ పక్కన ఉంది. ‘హ్యాపీ డేస్’ కథ కాదు. ఫోర్ ఇయర్స్ ట్రావెలింగ్ మూమెంట్స్. శేఖర్‌గారు చేసిన ‘ఫిదా’ సినిమా కూడా ట్రావెల్ ఫిల్మ్. ఈ సినిమాను కూడా నేను అలానే భావించాను. పెళ్లి మీద ట్రావెల్ ఫిల్మ్ అనే ఆలోచనపై నమ్మకం ఉంచాను. రషెష్ చూసినప్పుడు ఫీల్ గుడ్ ఫిల్మ్ అనిపించింది. ఇదే విషయాన్ని ఎడిటర్‌కు చెప్పాను. ఆ తర్వాత ఫస్ట్ కాపీ రెడీ అయ్యాక సినిమా చూసిన వారందరూ చాలా బాగుందని చెప్పడం స్టార్ట్ చేశారు. మంచి ఫీల్ కలిగింది. ఆడియన్స్ రెస్పాన్స్ చూశాక నా నమ్మకం నిజమైందని అనిపిస్తోంది. ఓ నిర్మాతగా ఈ పెళ్లికి మీరే పెద్ద. పెళ్లిలో ఎన్నో అలకలు, గొడవలు ఉంటాయి. ఈ పెళ్లి తీసేటప్పుడు ఆన్సెట్స్లో ఏవైనా అలకలున్నాయా? ‘దిల్’ రాజు: చంఢీఘడ్‌లో షూటింగ్ చేసినప్పుడు సతీష్ అలిగినట్లు ఉన్నాడు. నితిన్: నాకు తెలుసు.. నాకు తెలుసు(నవ్వులు). ‘దిల్’ రాజు: చండీఘడ్ షెడ్యూల్లో ఓ రోజు సెట్లో సీన్ పేపర్స్ చదివాను. నిజానికి షూటింగ్ ముందే అన్నీ ఓకే చేసుకుంటాం. కానీ సెట్లో ఆ రోజు నాకు ఎందుకో కొత్త కొత్త డౌట్స్ వచ్చాయి. డైలాగ్స్ లెంగ్త్ ఎక్కువగా ఉంది కదా అని సతీష్‌ని అడిగాను. ‘అవునా..సార్ అన్నాడు’. సరే అని నేను బ్రేక్‌ఫాస్ట్‌కి వెళ్లొచ్చి చూసే సరికి సతీష్ డైరెక్టర్ సీట్లో లేడు. చూస్తే పక్కకి వెళ్లి ఏదో రాస్తున్నాడు. ఒక మనిషి ఎక్స్ప్రెషన్ అండ్ బాడీ లాంగ్వేజ్ సడన్‌గా మారవు. అప్పుడు సతీష్‌లో నాకు మార్పు కనిపించింది. ఏమైందో తెలుసుకుందామని అసోసియేట్ డైరెక్టర్ని పిలిచా. మీరు ‘సడన్‌గా సీన్ చేంజ్ చేయమంటే ఎవరైనా హర్ట్ అవుతారు కదా సార్’ అన్నాడు. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చేశాను. చండీఘడ్ వెళ్లిన శిరీష్ కూడా హైదరాబాద్ తిరిగొచ్చి ‘సతీష్ ఎందుకో ఈ షెడ్యూల్ అంతా డిస్ట్రబ్డ్‌గా ఉన్నాడు’ అన్నాడు. సతీష్ హైదరాబాద్ వచ్చాక అడిగితే చెప్పలేదు. ఇప్పుడు చెబుతాడు. కారణం తెలుసుకుందాం. నితిన్: నేను షూట్లో ఉన్నాను. అంతకుముందు చెప్పినది ఇవ్వకుండా వేరే సీన్ పేపర్స్ ఇచ్చారు. నేను షాక్ అయ్యాను. ఇది కాదు కదా అనుకున్నా. సతీష్: సినిమాలో చండీఘడ్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తాం. పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు తరఫు బంధువులు, స్నేహితులు ఆ వేడుకలో కనిపించాలి. అయితే చండీఘడ్‌లో క్రౌడ్‌ని చూసినప్పుడు ఏదో నిరుత్సాహం కలిగింది. అక్కడి పంజాబీ లోకల్ ఆర్టిస్టులను తీసుకున్నాం. దాంతో నేటివిటీ మిస్ అవుతుందా? అని ఆలోచిస్తున్నాను. సెట్లో వేరే చిన్న చిన్న డిస్ట్రబెన్సెస్ ఉన్నాయి. అదే టైమ్‌లో ‘దిల్’ రాజుగారు సీన్ కాస్త మార్చుదామా అంటే, ఏదోలా అనిపించింది. ఇంతకుముందు ఎప్పుడు ఆయన అలా అనలేదు కదా అనుకున్నాను. ‘దిల్’ రాజు: యాక్చువల్లీ మా ఇద్దరి వేవ్‌లెంగ్త్ చాలా బాగుంటుంది. సతీష్‌తో ఈ రెండు సినిమాల ‘శతమానం భవతి, శ్రీనివాస కళ్యాణం’ 110 రోజుల జర్నీలో ఆ రోజు నాకు క్వశ్చన్ మార్క్‌లా మిగిలిపోయింది. సతీష్: సెట్లో సీన్ కరెక్షన్ అంటే ఎవరికైనా కాస్త టైమ్ పడుతుంది కానీ నేను ఓ పది నిమిషాల్లో కరెక్ట్ చేసేస్తా. అది రైటర్‌గా నా అదృష్టం అనుకుంటున్నాను. ఈ సినిమాలో రైటర్‌గా నేను ఇష్టపడి రాసుకున్న కొన్ని డైలాగ్స్ ఉంటాయి. సెట్ వాతావరణంలో ఆ రోజు నా మూడ్ సరిగా లేదు. ఆ టైమ్‌లో రాజుగారు వచ్చి.. ‘ఈ డైలాగ్స్ ఇప్పుడే చెబితే క్లైమాక్స్‌లో ఏం చెబుతాం’ అన్నారు. నిజానికి ఫస్ట్ హాఫ్‌లో పెళ్లి గురించి నితిన్ మాట్లాడే స్ట్రాంగ్ డైలాగ్స్ అవి. కావాలంటే క్లైమాక్స్ కోసం మళ్లీ రాసుకోవచ్చు కదా అనిపించింది. అలా అని ‘దిల్’ రాజుగారికి ఎదురు చెప్పలేను. ఎందుకంటే నాకంటే సినిమా కథను ఆయన ఎక్కువగా ప్రేమిస్తారు. నా కంటే ఎక్కువగా ఆలోచిస్తారు. నిజానికి తెలుగువారిని తీసుకురమ్మని ప్రొడక్షన్ వారికి చెప్పకపోవడం నా తప్పే. దాంతో మూడాఫ్తో పక్కకు వెళ్లిపోయి రాస్తూ కూర్చున్నాను. అంతే. రాజుగారి మీద నాకేం ఉంటుంది (నవ్వుతూ). ఓకే రాజుగారూ.. మ్యాటర్ క్లియర్ అయింది. ఇక, ఈ సినిమాలో డైలాగ్స్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. నలుగురూ మీకు నచ్చిన ఒక్కో డైలాగ్ చెబుతారా. ముందు రాశీతో స్టార్ట్ చేద్దాం.. రాశీఖన్నా: ఓ సీన్లో సితార గారితో ఇప్పటికీ వాసు (సినిమాలోని నితిన్ క్యారెక్టర్) వాళ్లది జాయింట్ ఫ్యామిలీనే అమ్మా అన్నప్పుడు.. ‘ఎఫెక్షన్స్ ఉన్న దగ్గరే రిలేషన్స్ స్ట్రాంగ్‌గా ఉంటాయి’ అని చెబుతారు. ఆ డైలాగ్ నచ్చింది. నందిత: నేను చెప్పిన డైలాగ్స్ అన్నీ నాకు ఇష్టమే. ముఖ్యంగా.. ‘నా అనే వాళ్ల దగ్గర ఏమీ దాచకూడదు. చెప్పాల్సిన టైమ్‌లో చెప్పకపోతే జీవితాంతం బాధపడటం తప్ప ఇంకా ఏమీ మిగలదు’ అనేవి నా మనసుకి బాగా దగ్గర అయ్యాయి. మీ ఇంట్లో చెప్పకుండా దాచిన విషయాలు ఏమైనా ఉంటే షేర్ చేసుకోండి? నందిత: ఏమీ లేవు. అమ్మానాన్నతో అన్నీ చెప్పేస్తా. ‘దిల్’ రాజు: నిజమే చెబుతున్నావా? ఫ్రెండ్స్ దగ్గర.. బాయ్‌ఫ్రెండ్స్ దగ్గర ఏమైనా దాచావా? నందిత: అయ్యో.. నాకు బాయ్‌ఫ్రెండ్సే లేరండీ. నితిన్: అబ్బా.. చా.. (నవ్వులు). మీరు చెప్పండి నితిన్.. మీకు నచ్చిన డైలాగ్ ఏది? నితిన్: ఫస్టాఫ్‌లో లవ్ ప్రాబ్లమ్‌తో ఫ్రెండ్ సూసైడ్ అటెంప్ట్ట్ చేసినప్పుడు..‘జాబ్ ఇచ్చినోడికి జాబ్ వదిలేసేటప్పుడు చెప్పావ్. ఇల్లు అద్దెకి ఇచ్చినోడికి ఇల్లు వదిలేసేటప్పుడు చెప్పావ్. మరి ప్రాణం ఇచ్చిన అమ్మకు ప్రాణాలు వదిలేసేటప్పుడు చెప్పాలి కదరా?’ అనే డైలాగ్‌కు కనెక్ట్ అయ్యాను. ‘దిల్’ రాజు: నాకు పర్టిక్యులర్‌గా ఓ సీన్‌కి కళ్లలో నీళ్లు తిరిగాయి. సెకండాఫ్‌లో ‘నానమ్మా.. నా పెళ్లిలో నీ 70 ఏళ్ల జీవితం కనిపిస్తుంది. రేపు నేను 70 ఏళ్ల జీవితం చూసుకోవాలి కదా. పెళ్లి గురించి మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి’ అని జయసుధగారిని నితిన్ అడిగినప్పుడు... ‘మీ తాతయ్యగారు ఒక మాట చెప్పేవారు రా. మన కన్న తల్లిదండ్రులను ఎంత బాగా చూసుకుంటామో. మన లైఫ్‌లోకి వచ్చి, మన పిల్లలకు జన్మనిచ్చే భార్యను కూడా అంతే బాగా చూసుకోవాలి అని’. ఆ డైలాగ్ రాగానే నిజం కదా అనిపించింది. సినిమాలో పెళ్లి గ్రాండ్‌గా జరిగింది. మీ ముగ్గురూ అలానే చేసుకోవాలనుకుంటున్నారా? నితిన్: నాకైతే అలానే చేసుకోవాలని ఉంది. అంతా మన సంప్రదాయం ప్రకారం జరగాలనుకుంటున్నాను. రాశీఖన్నా: కథ వింటున్నప్పుడే నాకు చాలా నచ్చింది. ఈ సినిమా చేసినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఈ మధ్యలో మనం గమనిస్తే చాలా డివోర్స్‌లు చూస్తున్నాం. ఈ సమయంలో ఇలాంటి కథ చెపాల్సిన అవసరం ఉందనిపించింది. నేను చాలా నేర్చుకున్నాను. నార్త్, సౌత్ చాలా డిఫరెంట్. బేసిక్‌గా నేను చాలా ట్రెడిషనల్. ఈ సినిమా చేశాక సౌత్‌లో పెళ్లి ఎలా చేస్తారో తెలిసింది. అన్నీ కుదిరితే అలానే చేసుకోవాలనుకుంటున్నాను. నేనైతే ఎమోషనల్‌గా కూడా ఈ మూవీకి కనెక్ట్ అయ్యాను. నందిత: మా అమ్మనాన్నాలది లవ్ మ్యారేజ్. ఇద్దరి వైపు బంధువులు రాకపోకలు తక్కువ. అసలు లేదనే చెప్పాలి. దాంతో నాకు రిలేషన్స్ గురించి అంతగా తెలీదు. ‘శ్రీనివాస కళ్యాణం’ చేస్తున్నప్పుడు రిలేషన్షిప్ బాండింగ్ తెలిసింది. తెలుగు సంప్రదాయాలు నచ్చాయి. ఇలాగే పెళ్లి చేసుకోవాలన్న ఫీలింగ్ కలిగింది. నితిన్.. మీరు క్లైమాక్స్‌లో పెద్ద పెద్ద డైలాగ్స్ చెప్పారు. ఏకంగా మంత్రాలు కూడా చెప్పారు. ఎటువంటి హోమ్ వర్క్ చేశారు? నితిన్: ఫస్ట్ నాకు కథ చెప్పినప్పుడు డైలాగ్స్ చాలా బావున్నాయి. సినిమా స్టార్ట్ అయ్యే వారం ముందు ప్రాక్టీస్ మొదలుపెడితే సరిపోతుందనుకున్నాం. కట్ చేస్తే.. తర్వాత ‘మీరు చెప్పడంలేదు. పంతులుగారితో చెప్పిస్తున్నాం’ అన్నారు. ఓకే అనుకున్నాను. లాస్ట్ మినిట్‌లో నువ్వే చెప్పాలన్నారు. పెళ్లి మంత్రాలంటే మామూలా? మాంగల్యం తంతునానేన.. ఈజీగానే వస్తుంది. అయితే మిగతావన్నీ అంత ఈజీ కాదు కదా. మనసులో ‘సార్ ఏంటి సార్ ఇదీ’ అనుకున్నాను. సతీష్: ప్లస్ పాయింట్ ఏంటంటే నితిన్‌కి తెలుగు చదవడం బాగా వచ్చు. మా టీమ్‌లో చాలా మంది టింగ్లీష్ బ్యాచ్. (అంటే తెలుగు డైలాగ్స్ ఇంగ్లీష్‌లో రాసుకోవడం). పవిత్రత ఉన్న మంత్రాలు. సరిగ్గా పలకపోతే మంత్రాలు తప్పుగా ఉచ్చరించారు అని మా మీద పడిపోతారు. సో.. చాలా కేర్ తీసుకున్నాం. సింగిల్ టేక్‌లో చెప్పాడు నితిన్. నితిన్: ముందు నీకు ఎంత గుర్తుంటే అంత చెప్పు. కట్ షాట్స్ తీసుకుందాం అన్నారు. కానీ లాస్ట్ మినిట్‌లో సింగిల్ షాట్లో చేసేద్దామన్నారు. ఇక చూడండి.. చిన్నప్పుడు పద్యాలు బట్టీ పట్టినట్టు నేర్చుకున్నాను. మీ పెళ్లికి మీరే మంత్రాలు చెప్పుకోవచ్చేమో! నితిన్: ఆల్మోస్ట్. ఒకవేళ పంతులుగారు ఎక్కడైనా తప్పు చదివినా సార్ అది కాదు ఇలా అని చెప్పేస్తానేమో. రైటర్, డైరెక్టర్‌గా ఉమ్మడి కుటుంబాలు అంతరించిపోతున్నాయి అని ‘శతమానం భవతి’, ‘శ్రీనివాస కళ్యాణం’లో పెళ్లి విశిష్టతను గుర్తు చేస్తున్నారా? సతీష్: గుర్తు చేయడం ఏం కాదు. హైందవ సంస్కృతి, సంప్రదాయం ప్రపంచంలోనే అందరికీ తలమానికం. అలాంటి సంప్రదాయాలని మనం కనీసం పాటించకుండా వేరే వేరే వాటిని పట్టుకొని పోవడం పర్సనల్‌గా నాకు నచ్చలేదు. అలాగే నేను చెబితే ఆచరిస్తారా? లేదా అనేది వేరే విషయం. స్కూల్లో మాస్టర్ నీతి పద్యం అందరికీ ఒకలానే చెబుతాడు. కొంతమంది అర్థం చేసుకొని, పాటిస్తారు. కొందరు జస్ట్ విన్నాను, ఎగ్జామ్‌లో రాసి వదిలేస్తాను అనుకుని పాస్ అయిపోతారు. వాళ్లదీ తప్పుకాదు, వీళ్లదీ తప్పు కాదు. ‘శతమానం భవతి’ని ఆదరించారు కాబట్టే ‘శ్రీనివాస కళ్యాణం’ వచ్చింది. ఒకవేళ ఆ సినిమా ఆడకపోయింటే ఈ సినిమా కచ్చితంగా వచ్చేది కాదు. నాతో చాలా మంది అన్నారు ఇంతకు ముందు అమ్మానాన్నల దగ్గరకు సంవత్సరానికి ఒకసారి వెళ్లేవాళ్లం. ఇప్పుడు వీలు కుదిరినప్పుడల్లా ఇంటికి వెళ్లిపోతున్నానని అంటున్నారు. కొందరినైనా కదిలించాం కదా. కొంతమందైనా ఆచరించారు కదా అనే సంతృప్తి. ఇప్పుడు ‘శ్రీనివాస కళ్యాణం’ గురించి ఓ ఎగ్జాంఫుల్ చెబుతాను. పెళ్లి సీన్లో చెప్పులు వదిలేసి హీరో హీరోయిన్ మండపం మీదకు వెళ్లాలి. కథ చెప్పినప్పుడు కెమెరామేన్ సమీర్ రెడ్డికి మండపం మీద అష్టదిక్పాలకులు ఉంటారు, ఋషులు ఉంటారు అని చెప్పా. షూట్ చేస్తున్నప్పుడు ఆయన ఆ ఫీల్‌తోనే చేశారు. ఆ తర్వాత రాజమండ్రిలో ఆయన రిలేటివ్స్ పెళ్లికి వెళ్లారు. అక్కడ మండపంలో ఎవరో చెప్పులు వేసుకొని తిరిగేస్తున్నారంట. వాళ్లను పిలిచి ‘పైన దేవుళ్లుంటారంట. చెప్పులు వేసుకొని తిరగకూడదు’ అని చెప్పారట. ఇలా కొంత మంది చేయగలిగినా పెళ్లి మీద ఒక విలువ పెరుగుతుంది. క్రియేటీవ్ సైడ్ రాజుగారు ఎక్కువ క్రెడిట్ తీసుకుంటున్నారని మీకు అనిపించిందా? సతీష్: అనిపించలేదు. ఎందుకంటే నాకంటే ఎక్కువ ఆయన ఆలోచిస్తారు సినిమా గురించి. ఆల్రెడీ ‘దిల్’ రాజు అంటే ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్. వేగేశ్న సతీశ్‌కి జస్ట్ సెకండ్ మూవీ. ‘శతమానం భవతి’ నుంచి నేను ఆయనలో చూసిందేంటంటే సినిమాను ప్రేమిస్తారు. చిన్న చిన్నవి కూడా పట్టించుకుంటారు. ఇలా ఉంటే బావుండు అని సలహాలు ఇస్తారు. ‘సతీశ్ ఇలా చెయ్.. ఇలా చేయ్’ అనరు. ఒకవేళ అలానే ఉంటే ‘శతమానం భవతి’ తర్వాత ఈ జర్నీ ఉండదు కదా. ఆయన డామినేట్ చేస్తున్నారు అన్న విషయం కరెక్ట్ అయ్యుంటే ఈ సినిమా చేయను కదా. ఇక్కడ ఎవ్వరి క్రెడిట్‌నీ ఎవ్వరూ తీసుకెళ్లరు. రాజు గారి కాంపౌండ్‌లో అలానే జరిగితే డైరెక్టర్స్ బయటకు వెళ్లి సినిమాలు ఎలా తీస్తారు? ఇప్పుడీ సినిమాకి డైలాగ్స్‌కు మంచి పేరొస్తోంది కదా. అవి నేనే రాసుకోవాలి. యాక్టర్స్‌కి సీన్ నేనే వివరించాలి. రాజుగారు సీన్ బావుందా? బాలేదా అనే సజెషన్ ఇస్తారు. అప్పుడు కూదా కొత్త సీన్ రాసేది నేనే కదా. ‘దిల్’ రాజు: సినిమా అంటే ట్రైన్. దర్శకుడు, నిర్మాత పట్టాలు. పాత రోజుల్లో గొప్ప జర్నీ సాగిందంటే ఇద్దరి మధ్యా మంచి సింక్ ఉండబట్టే. ఏడిద నాగేశ్వరరావు– కె.విశ్వనా«ద్, నాగిరెడ్ది–కేవి రెడ్డి, శ్యామ్‌ప్రసాద్–కోడి రామకృష్ణ.. వీళ్ల జర్నీని తీసుకుందాం. దర్శక–నిర్మాతలిద్దరూ బాగా కనెక్ట్ అయ్యారు కాబట్టే జర్నీ బాగుంది. నిర్మాత చెబితే ఎందుకు వినాలిరా అంటే కుదరదు. ఇప్పుడు చాలా మంది అలానే ఉన్నారు. నేను సలహాలైతే ఇవ్వగలను కానీ సతీష్ చేసే పని చేయలేను కదా. నేను రాయలేను కదా. కథ తనే రాయాలి. డైలాగ్స్ తనే రాసుకోవాలి. సినిమా తీయాల్సిందీ తనే కదా. ఈ సినిమాకి ముందుగా నితిన్‌ని అనుకోలేదట? ‘దిల్’ రాజు: మా ప్రొడక్షన్లో సినిమాలు ఎలా ఉంటాయంటే ఒక స్టోరీ కుదరగానే, దానికి ఎవరు బాగుంటారా? అని ఓ ముగ్గురు హీరోలను పేర్లను పేపర్ మీద రాసుకుంటాను. ఈ కథకు ఎన్టీఆర్, రామ్‌చరణ్, నితిన్ పేర్లను రాసుకున్నాను. ఎన్టీఆర్‌కు చెప్పాం కూడా. తర్వాత మాకే అనిపించింది. స్టార్ హీరోతో చే స్తే కొన్ని సార్లు ఫ్యాన్స్ కోసం ఫైట్లు, మాస్ ఎలిమెంట్స్ అంటూ కాంప్రమైజ్ అవ్వాలి. వెంటనే నితిన్‌కు కథ చెప్పాం. సూపర్‌గా ఉంది. చేసేద్దాం అన్నాడు మీ సంస్థలో వచ్చిన ‘బొమ్మరిల్లు’ మ్యాజిక్ రిపీట్ అవుతుందనుకుంటున్నారా? ‘దిల్’ రాజు: ‘బొమ్మరిల్లు’తో పోల్చలేం. మంచి సినిమా ఇవ్వగలిగాం అన్న సంతృప్తి ఉంది. నితిన్: త్రివిక్రమ్ నాతో ఓ మాట చెప్పారు. మంచి కంటే చెడు ఎక్కువ స్పీడ్‌గా ట్రావెల్ చేస్తుంది. మంచి అనేది స్లోగా వెళ్తుంది.. కానీ వెళ్తుంది. నా నమ్మకం ఏంటంటే ఈ సినిమా మెల్లి మెల్లిగా రీచ్ అవుతుంది. ‘దిల్’ రాజు: సొసైటీలో నెగటివ్ వైబ్రేషన్స్ ఎక్కువ. రివ్యూలు, ఇండస్ట్రీ, ఆడియన్స్‌లో కొంతమంది.. ఒక వైపు మంచి. ఒకవైపు చెడు. మంచి సినిమాను ఎవరు ఆపుతారు. షో షోకి మౌత్ టాక్ పెరుగుతుంది. ‘కేరింత’ సినిమాని రిలీజైన రోజున దేవీ థియేటర్లో చూశాను. కలెక్షన్స్ లేవు. కానీ ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. అప్సెట్ అయ్యాను. ఆఫీసులో కూర్చుని ఆలోచిస్తుంటే థియేటర్ ఫుల్ అని శ్రీకాకుళం నుంచి ఫోన్. వెంటనే సినిమాలో ఏదో స్పార్క్ ఉందని ప్రమోషన్ స్టార్ట్ చేశాను. సినిమా హిట్టయింది. ‘శ్రీనివాస కళ్యాణం’ను వదలను. కొంచెం పుష్ చేయాలి. ఈ సినిమా చూసి, చాలామంది ‘మంచి ఫీల్ కలిగింది. బాగుంది’ అని మెసేజ్ చేశారు. సినిమా సరిగ్గా లేకపోతే ప్రమోట్ చేసి రుద్దడానికి ట్రై చేయను. నేనే సినిమా నుంచి షిఫ్ట్ అయిపోతా. కనెక్ట్ అవుతుంది అని నమ్మితేనే ప్రమోట్ చేస్తాను. ఇది బాగా కనెక్ట్ అయ్యే సినిమా. ముగ్గురు బ్యాచిలర్స్ (నితిన్, నందిత, రాశీ ఖన్నా) పెళ్లి ఎప్పుడు చేసుకుంటారో చెప్పాలి? రాశీఖన్నా: పెళ్లి ప్లాన్స్ ఇప్పుడు లేవు. అబ్బాయిలు కూడా లేరు (నవ్వుతూ).. ‘దిల్’ రాజు: ప్లాన్ లేదని చెప్పు. అంతేకానీ అబ్బాయిలు లేరని అనకు (నవ్వుతూ) రాశీని చేసుకోవడానికి అబ్బాయిలు లేరా? (నవ్వుతూ) రాశీఖన్నా: అబ్బాయిలు నిజంగానే లేరండీ.. నమ్మాలి. ‘సాక్షి’: ఇంత అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి అబ్బాయిలు ముందుకు రారా. కావాలంటే స్వయంవరం పెడదామా? ‘దిల్’ రాజు, నితిన్: అవును.. స్వయంవరం పెడదాం (నవ్వులు). నితిన్: మా అమ్మవాళ్లు మ్యాచెస్ చూస్తున్నారు. ఇంకో 8 నెలలు టైమ్ పడుతుంది. ‘దిల్’ రాజు: 2019లోపే నీ పెళ్లి ఉంటుందేమో. నితిన్: 2019 ఇయర్ క్లోజింగ్ లోపు చేసుకోకపోతే మా ఇంట్లో వాళ్లు చంపేస్తారు. నందిత: తెలుగు ఇండస్ట్రీలోకి ఇప్పుడే వచ్చాను కదా. ఆర్టిస్ట్‌గా శాటిస్ఫ్యాక్షన్ దక్కాలి. అప్పుడే పెళ్లి. సతీష్: అంటే తెలుగు ఇండస్ట్రీలోకి ఎప్పుడో వచ్చి ఉంటే ఇప్పుడు చేసుకునేదానివా? నందిత: (నవ్వేస్తూ). తెలియదు. అయినా పెళ్లికి ఇప్పుడు తొందరపడటంలేదు. – సినిమా డెస్క్ -
‘శ్రీనివాస కళ్యాణం’ సెన్సార్ రిపోర్ట్
లై, ఛల్‌మోహన్ రంగా సినిమాల ఫలితాలతో నితిన్ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. కానీ ఆశించినంత మేర విజయం సాధించలేకపోయాడు. ఈ కుర్ర హీరో తన సినీ కెరీర్లో మరిచిపోలేని హిట్ ఇచ్చిన దిల్ రాజుతో కలిసి మళ్లీ ఇన్నేళ్లకు ఇంకో సినిమాను చేస్తున్నాడు. ‘దిల్’ సినిమా ఇటు నితిన్, దిల్ రాజు కెరీర్స్‌ను నిలబెట్టింది. మళ్లీ వీరిద్దరు కలిసి ‘శ్రీనివాస కళ్యాణం’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఈ మధ్యే విడుదలైన ట్రైలర్‌కు విపరీతమైన స్పందన వస్తోంది. భారీ తారాగణంతో వస్తోన్న ఈ మూవీపై అంచనాలు పెరుగుతున్నాయి. ప్రకాష్ రాజ్, సీనియర్ నరేష్, రాజేంద్ర ప్రసాద్, జయసుధల నటన ఈ సినిమాకు ప్లస్ అయ్యేలా ఉంది. హీరో హీరోయిన్ల కూల్ లుక్స్‌కు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలను శనివారం పూర్తి చేసుకుంది. సెన్సార్ కత్తెరకు పని చెప్పకుండా.. క్లీన్ యూ సర్టిఫికేట్‌ను పొందినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ చిత్రం ఆగస్టు 9న విడుదల కానుంది. 2 hours and 20 minutes. Zero cuts. All set for a grand release on August 9th. #SrinivasaKalyanam@actor_nithiin @RaashiKhanna @Nanditasweta @mickeyjmeyer Directed by #vegesnasatish. #SrinivasaKalyanamFromAug9th pic.twitter.com/ActZnbuga6 — Sri Venkateswara Creations (@SVC_official) August 4, 2018 -
‘శ్రీనివాస కళ్యాణం’ ట్రైలర్ విడుదల
-
కనువిందు చేస్తున్న ‘శ్రీనివాస కళ్యాణం’ ట్రైలర్
‘అ ఆ’ సినిమాతో భారీ హిట్ కొట్టాడు నితిన్. తరువాత ‘లై’, ‘ఛల్ మోహన్‌రంగా’ సినిమాలు చేసినా.. ఆ స్థాయిలో విజయవంతం కాలేదు. అయితే నితిన్ కేరిర్‌కు ఊపునిచ్చిన సినిమా ‘దిల్’. ఈ సినిమాను నిర్మించిన రాజు ‘దిల్’ రాజుగా ఇండస్ట్రీలో ఓ గుర్తింపును తెచ్చుకున్నారు. మళ్లీ ఇన్నేళ్ల తరవాత నితిన్ హీరోగా, దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో తెరకెక్కుతున్న సినిమా శ్రీనివాస కళ్యాణం. ఈ మూవీలో మిక్కి జే మేయర్ అందించిన పాటలు ఇప్పటికే పాపులర్ అయ్యాయి. భారీ తారాగణంతో వస్తోన్న ఈ మూవీపై అందరి దృష్టి నెలకొంది. తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌ను సూపర్‌స్టార్ మహేష్ బాబు రిలీజ్ చేశారు. పెళ్లంటే.. పెద్ద పండుగ అని జయసుధ చెప్పే డైలాగ్‌లు ఆకట్టుకోగా.. పెళ్లి వేడుకను అద్భుతంగా చూపెట్టారు . నితిన్, రాశిఖన్నా కూల్ లుక్స్‌లో బాగున్నారు. ఇక సినిమాలో కీలకపాత్రలు పోషిస్తున్న ప్రకాష్ రాజ్, జయసుధ, రాజేంద్ర ప్రసాద్, సీనియర్ నరేష్‌ల నటన హైలెట్‌గా నిలవనుంది. ‘శతమానం భవతి’ ఫేమ్ సతీష్ వేగేశ్న ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ ఆగస్టు 9న విడుదల కానుంది. -
త్వరలో సెట్స్ మీదకు ‘భీష్మ’
ఛలో సినిమాతో సూపర్ హిట్ అందుకున్న వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా ఓ సినిమా ప్రారంభం కానుందన్న టాక్ చాలా రోజులుగా వినిపిస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాకు భీష్మ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ప్రస్తుతం శ్రీనివాస కళ్యాణం పనుల్లో బిజీగా ఉన్న నితిన్ ఈ సినిమాతో త్వరలో ప్రారంభించనున్నాడట. ఇప్పటికే వెంకీ ఫుల్ స్క్రిప్ట్ తో రెడీగా ఉండటంతో ఆగస్టు మొదటి వారంలోనే షూటింగ్ ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. డిఫరెంట్ లవ్ స్టోరితో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సింగిల్ ఫర్ ఎవర్ అనేది ట్యాగ్ లైన్. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న శ్రీనివాస కళ్యాణంలో నితిన్ రాశీఖన్నా హీరోయిన్గా నటిస్తుండగా శతమానంభవతి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న సతీష్ వేగేశ్న ఈ చిత్రానికి దర్శకుడు. -
చంపింది దత్త పుత్రుడే..
ఆదిలాబాద్‌రూరల్: దత్తత తీసుకొని అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసిన కొడుకే కాలయముడయ్యాడు. నాలుగు రోజుల క్రితం జిల్లా కేంద్రంలోని టీచర్స్‌కాలనీకి చెందిన ఎల్ఐసీ ఉద్యోగి గేడాం గోవర్ధన్‌ను అతని దత్తత కుమారుడు నితీన్తోపాటు నితిన్ అన్న మడావి లింగేశ్వర్, స్నేహితులు మెస్రం రాము, డి.అమర్, కుమ్రె సాహిర్, గేడాం పింటులు హత్య చేశారని డీఎస్పీ నర్సింహారెడ్డి తెలిపారు. శనివారం మావల పోలీస్‌స్టేషన్‌లో ఆదిలాబాద్‌రూరల్ సీఐ ప్రదీప్‌కుమార్, ఎస్సై అనిల్‌తో కలిసి విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. దత్తత కుమారుడు నితిన్ వ్యవహర శైలి నచ్చకపోవడంతో తండ్రి గోవర్ధన్ నా వద్ద నుంచి వెళ్లిపో అని మందలించాడు. దీంతో నితిన్ అప్పటి నుంచి తండ్రితో గొడవ పడుతూవస్తున్నాడు. దత్తత తీసుకున్న తండ్రి ఇంటి నుంచి వెళ్లిపోమన్నడంతో తాను ఆస్తి కోకొల్పోతానని భావించిన నితిన్ హత్యకు పథకం పన్నాడు. ఇదే విషయంపై నితిన్ సోదరుడు జైనథ్ మండలంలోని పెండల్వాడకు చెందిన మడావి లింగేశ్వర్తో చర్చించాడు. సోదరుడు లింగేశ్వర్ మహారాష్ట్రలోని బోరి గ్రామానికి చెందిన మెస్రం రాము, దాడంజే అమర్, కుమ్రె సాహిర్‌తో మాట్లాడారు. గోవర్ధన్‌ను హత్య చేయడానికి వారితో రూ.2.50 లక్షలకు ఒప్పందం కుదర్చుకున్నాడు. లింగేశ్వర్ వద్ద డబ్బులు లేకపోవడంతో బంగారం తాకట్టుపెట్టి రుణం తీసుకొని, అడ్వాన్స్ కింద రూ.10వేలు ఇచ్చాడు. కారులో వెళ్లి అదే రోజు రాత్రి సినిమా చూశారు. అనంతరం 26న రాత్రి 1.30 గంటల ప్రాంతంలో గోవర్ధన్ నిద్రిస్తున్న సమయంలో మెస్రం రాము, దడేంజ అమర్ ఇంట్లోకి వెళ్లి క్లచ్ వైర్ మెడకు వేసి నోటి నుంచి శబ్ధం రాకుండా గొంతు నొక్కి చంపారు. భార్య రాధాబాయి గోవర్ధన్ మృతిపై తనకు అనుమానం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దత్తత కుమారుడు నితిన్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా వాస్తవాలు తెలిశాయని డీఎస్పీ వివరించారు. ఈ మేరకు గేడం నితిన్, మడావి లింగేశ్వర్, మెస్రం రాము, కెమ్రె సాహిర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని, మిగతా ఇద్దరు దడంజే అమర్, కారుడ్రైవర్ గేడం పింటు పరారీలో ఉన్నారని తెలిపారు. వారి నుంచి కారు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. -
‘శ్రీనివాస కళ్యాణం’పై నితిన్ ట్వీట్!
దిల్ సినిమా ఏ రేంజ్లో హిట్ అయిందో తెలిసిందే. ఈ సినిమా ఇద్దరి కెరీర్‌ను గాడిలో పెట్టింది. హీరోగా నితిన్, నిర్మాతగా రాజును నిలబెట్టింది. సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకుని దిల్ రాజుగా ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్‌గా ఎదిగారు. ఈ సినిమాలో వీరిద్దరికి మాత్రమే కాకుండా ప్రకాష్ రాజ్ పోషించిన పాత్రకు కూడా మంచి గుర్తింపే లభించింది. మళ్లీ ఇన్నేళ్ల తరువాత.. ఈ కాంబినేషన్లో ఓ మూవీ పట్టాలెక్కుతోంది. నితిన్ , రాశిఖన్నా జంటగా దిల్‌రాజు బ్యానర్లో శ్రీనివాస కళ్యాణం మూవీలో తెరకెక్కుతోంది. దాదాపు షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఈ మూవీపై నితిన్ ‘మళ్లీ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి దిల్ కాంబో వస్తోందం’టూ.. ట్వీట్ చేశారు. The DIL combo is back to entertain u all once more 😀😀#SrinivasaKalyanam pic.twitter.com/BEfQVwPLlr — nithiin (@actor_nithiin) June 30, 2018 -
డైరెక్టర్ డాలీతో నితిన్?
‘అ ఆ’ సినిమాతో 50 కోట్ల క్లబ్ లో చేరిన నితిన్ తరువాత వరుసగా లై, ఛల్ మోహన్ రంగ సినిమాలతో నిరాశపరిచాడు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో శ్రీనివాస కళ్యాణం సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. శతమానం భవతి సినిమాతో సక్సెస్ సాధించిన సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం... నితిన్ ఓ ఫెయిల్యూర్ డైరెక్టర్‌తో సినిమా చేసేందుకు రెడీ అయ్యారట. కాటమరాయుడు డైరెక్టర్ డాలీ (కిషోర్ పార్థసాని)తో తన తదుపరి సినిమాను చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. డాలీ చెప్పిన కథలో హీరో క్యారెక్టర్ కొత్తగా ఉండటంతో నితిన్ అంగీకరించినట్టుగా తెలుస్తోంది. శ్రీనివాస కళ్యాణం తరువాత నితిన్ చేయబోయే సినిమా ఇదే అన్న ప్రచారం జరుగుతున్నా అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. -
మోహన్ రంగడు
-
చల్ మోహన్ రంగా ట్రైలర్
సాక్షి, హైదరాబాద్ : ఎలా ఉన్నానండీ.. సన్నీలియోన్ సిస్టర్లా ఉన్నావ్..!! ఏంటోనండీ అంతా మీ అభిమానం గొప్పగొప్పవాళ్లతో పోల్చేస్తున్నారు. ఊటీలో చలేస్తే కోట్లు వేసుకోవాలి.. మగాళ్లకు బీట్లు వేయకూడదు అనే డైలాగ్స్‌తో చల్ మోహన్ రంగా ట్రైలర్ ఆకట్టుకుంటోంది. పూర్తి స్థాయి లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది. చాక్లెట్ బాయ్ లుక్‌లో హిరో నితిన్ ట్రైలర్లో మంచి జోష్‌ను కనబరిచారు. నితిన్, మేఘా ఆకాశ్‌లు జంటగా నటించిన ఈ చిత్రానికి కృష్ణ చైతన్య దర్శకత్వం వహించారు. తన ట్రేడ్ మార్క్ మాటలతో ప్రేక్షకులను అలరించే త్రివిక్రమ్ ఈ చిత్రానికి కథ అందించారు. మరి మీరు ఓ సారి ట్రైలర్‌ను చూసేయండి. -
నితిన్ ‘శ్రీనివాస కళ్యాణం’ మొదలైంది
-
‘ఛల్ మోహన్ రంగ’ సెకండ్ లిరికల్ సాంగ్ రిలీజ్
-
హీరో నితిన్‌కు హైకోర్టులో ఊరట
సాక్షి, హైదరాబాద్: హీరో నితిన్, ఆయన సోదరి నిఖితారెడ్డిలకు హైకోర్టులో ఊరట లభించింది. ‘అఖిల్’ సినిమాకు సంబంధించి వారిపై సైబరాబాద్ 20వ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో నమోదైన కేసును హైకోర్టు కొట్టేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తి తీర్పు వెలువరించారు. ‘అఖిల్’ సినిమా హక్కుల విషయంలో తనవద్ద రూ.50 లక్షలు తీసుకుని, హక్కులు ఇవ్వకుండా తనను మోసం చేశారంటూ సికింద్రాబాద్ సైనిక్‌పురికి చెందిన గంగాధర సత్యనారాయణ అనే వ్యక్తి మల్కాజ్గిరి, సైబరాబాద్ రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కమ్ 20వ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో గతేడాది సెప్టెంబర్ 23న ఫిర్యాదు చేశారు. నితిన్, నిఖితను మూడో, నాల్గో నిందితులుగా పేర్కొన్నారు. నితిన్ తండ్రి, నిర్మాత సుధాకర్‌రెడ్డిని రెండో నిందితునిగా, శ్రేష్ట్ మూవీస్‌ను మొదటి నిందితునిగా చేర్చారు. వారందరికీ కోర్టు సమన్లు జారీ చేసింది. దీనిపై నితిన్, నిఖితారెడ్డి, సుధాకర్‌రెడ్డి, శ్రేష్ట మూవీస్ వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. సత్యనారాయణ తన ఫిర్యాదులో నితిన్, నిఖితారెడ్డిలను శ్రేష్ట మూవీస్ సంస్థలో భాగస్వాములంటూ తప్పుగా పేర్కొని వారిపైనా కేసు పెట్టారని, అందులో వారు భాగస్వాములు కాదని పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్‌రెడ్డి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ వాదనను హైకోర్టు ఆమోదించి కేసును కొట్టివేసింది. -
శతక్కొట్టిన నితిన్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) ఇంటర్ స్కూల్ క్రికెట్ టోర్నమెంట్లో భవన్స్ శ్రీ అరబిందో బ్యాట్స్‌మన్ ఎ. నితిన్ (170 బంతుల్లో 175; 20 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీతో చెలరేగాడు. దీంతో సెయింట్ మార్క్స్ బాయ్స్టౌన్తో జరిగిన మ్యాచ్‌లో భవన్స్ శ్రీ అరబిందో జట్టు ఘనవిజయం సాధించింది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో 192 పరుగులతో బాయ్స్టౌన్ను ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన భవన్స్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్లకు 308 పరుగుల భారీస్కోరు చేసింది. అనంతరం సెయింట్ మార్క్స్ బాయ్స్టౌన్ 35.2 ఓవర్లలో 116 పరుగులకు ఆలౌటైంది. ఇమామ్ షరీఫ్ (50) అర్ధసెంచరీ చేశాడు. ప్రత్యర్థి బౌలర్లలో ప్రజ్వల్ రాజ్ 4 వికెట్లు దక్కించుకున్నాడు. ఇతర మ్యాచ్‌ల ఫలితాలు ఫ్రోబెల్స్: 195 (విశాల్ 45; తరుణ్ 3/34), నారాయణ కాన్సెప్ట్ స్కూల్: 140 (చేతన్ 70; శ్రీకర్ 4/42). సుజాత హైస్కూల్: 220 (అచ్యుత్ రామ్ 56; శశి కుమార్ 3/45), సెయింట్ ప్యాట్రిక్స్ హైస్కూల్: 221/6 (సోమన్ సాత్విక్ 71, శశి కుమార్ 63). లయోలా జూనియర్ కాలేజ్: 94 (యశ్వంత్ 5/12), హెచ్‌పీఎస్: 96/7 (యోగేశ్ భటి 4/30, కుశాల్ 3/38). ఆల్‌సెయింట్స్: 230 (పి. శివ 39, జఫరుల్లా ఖాన్ 114; సుమిత్ ఓజా 4/68, రోహిత్ 3/32), వెస్లీ జూనియర్ కాలేజ్: 234/9 (సాయి వినయ్ 64, వైష్ణవ్ రెడ్డి 52; పి. శివ 4/31). సాక్రెడ్ హార్ట్స్ హైస్కూల్ 240 (మెల్విన్ 64; శివ 4/58), జాన్సన్ గ్రామర్ స్కూల్: 110 (శశి 30; సయ్యద్ 3/19). సెయింట్ మోజెస్ హైస్కూల్: 166 (జితేంద్ర 43; జి. రోహిత్ 3/35, రాజ సింహా 4/31), జెనెసిస్ ఇంటర్నేషనల్ స్కూల్: 128 (మణికంఠ 3/32, సాకేత్ 3/24). శ్రీనిధి ఇంటర్నేషనల్ స్కూల్: 313/8 (రోహిత్ రెడ్డి 63, వివేక్ 63, సాయితేజ 52; సాయి శ్రుతీశ్ 4/56), సెయింట్ జోసెఫ్ హైస్కూల్: 114/6 (కిర్స్టీ 49 నాటౌట్). గ్లోబల్ ఇంటర్నేషనల్ స్కూల్: 98 (కె. జగదీశ్ 30; సూరజ్ పటేల్ 4/14, తిలక్ రెడ్డి 3/33), నీలకంఠ విద్యాపీఠ్ ఇంటర్నేషనల్ స్కూల్: 100/7 (తిలక్ రెడ్డి 34; రణ్‌ధీర్ 3/15). సుల్తాన్ ఉలూమ్: 91 (రాహుల్ కుమార్ 30, ప్రకాశ్ 3/21, ఉదయ్ కిరణ్ 4/17), మెలూహా ఇంటర్నేషనల్ స్కూల్: 92/1 (ఆర్. కీర్తన్ 31, ఉదయ్‌కిరణ్ 37). -
ఛలో అమెరికా
నితిన్ హీరోగా కృష్ణచైతన్య దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో మేఘా ఆకాష్ కథానాయిక. నిఖితా రెడ్డి సమర్పణలో పవన్‌కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్, శ్రేష్ట్ మూవీస్‌పై సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ అందజేశారు. విభిన్న లోకేషన్లలో ఐదు రోజులపాటు హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం నెక్ట్స్ షెడ్యూల్ యూఎస్‌లో జరగనుంది. నిర్మాత మాట్లాడుతూ– ‘‘విభిన్నమైన వినోదాత్మక కథతో రూపొందుతున్న చిత్రమిది. ఈ రోజు నుంచి దాదాపు 35రోజుల పాటు యూఎస్‌లో షూటింగ్ జరపబోతున్నాం. అక్కడ కీలక సన్నివేశాలతో పాటు సాంగ్స్, ఫైట్స్ చిత్రీకరించనున్నాం’’ అన్నారు. నరేశ్, రావు రమేశ్, లిజి, ప్రగతి, నర్రా శ్రీను, శ్రీనివాసరెడ్డి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: తమన్. -
అప్పుడు నిరాశపడలేదు... ఆ తర్వాత పొంగిపోలేదు
‘‘అందాల రాక్షసి’ ఫలితం చూసి నిరాశ పడలేదు. ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’ విజయం చూసి పొంగిపోలేదు. హిట్టూ ఫ్లాపుల గురించి ఆలోచిస్తే క్రియేటివిటీకి దూరమైపోతామని నా అభిప్రాయం. మనసుకు నచ్చిన సినిమాలను చేసుకుంటూ వెళ్లాలన్నదే నా అభిమతం’’ అన్నారు హను రాఘవపూడి. నితిన్, మేఘా ఆకాశ్ జంటగా ఆయన దర్శకత్వంలో రామ్ ఆచంట, గోపీ ఆచంట, అనిల్ సుంకర నిర్మించిన సినిమా ‘లై’. వెంకట్ బోయినపల్లి చిత్రసమర్పకులు. రేపు రిలీజవుతోన్న ఈ సినిమా గురించి హను చెప్పిన సంగతులు... ⇒ అబద్ధాల వల్ల ఓ యువకుడు ఎలాంటి సమస్యల్లో చిక్కుకున్నాడనేది చిత్రకథ. అయితే... అతను చెప్పే ప్రతి అబద్ధం వెనుక ఓ నిజం దాగుంటుంది. అదే ‘లై’లో అసలు లాజిక్–మేజిక్. ప్రేక్షకులు ఆ మేజిక్‌ను క్యాచ్ చేస్తే... సినిమా చాలా సరదాగా సాగుతుంది. నాకు తెలిసి ప్రేమలేని కథ, సినిమా ఉండదు. కాకపోతే సినిమాను బట్టి, కథను బట్టి ఆ ప్రేమను చూపించే విధానం మారుతుంటుంది. ఈ ‘లై’ కూడా ప్రేమకథే. మంచి యాక్షన్ అంశాలను మేళవించి రివెంజ్ డ్రామా నేపథ్యంలో తీశా. ⇒ ఎప్పట్నుంచో నితిన్ నాతో సినిమా చేయాలనుకుంటున్నాడు. ‘అందాల రాక్షసి, కృష్ణగాడి వీరప్రేమగాథ’ సినిమాల మధ్య గ్యాప్ వచ్చినప్పుడు నా మైండ్‌లో ఓ ఐడియా వచ్చింది. వెంటనే కథ రెడీ చేశా. నితిన్‌కు చెప్పగానే నచ్చేసింది. విలన్ యాంగిల్ నుంచి సినిమా సాగుతుంది. విలన్ క్యారెక్టరైజేషన్ కూడా స్టైలిష్‌గా, డిఫరెంట్‌గా ఉంటుంది. అయితే... ఆ పాత్రకు అర్జున్‌గారు అయితే బాగుంటుందనుకున్నా. నేను ఆయనకు పెద్ద అభిమానిని. కానీ, అర్జున్‌గారి దగ్గరకెళ్లి కథ చెప్పేంత ధైర్యం లేదు. సుధాకర్‌రెడ్డిగారు (నితిన్ తండ్రి) ఆయన దగ్గరకు తీసుకెళితే, భయపడుతూనే కథ చెప్పా. ‘కథ నచ్చింది. నేను చేస్తున్నా’ అని అర్జున్‌గారు చెప్పగానే, సిన్మా హిట్టవుతుందనే నమ్మకం వచ్చేసింది. ⇒ కథ ప్రకారం, నితిన్ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని సినిమా తీశాం. స్క్రీన్‌పై చూస్తే 70 కోట్ల బడ్జెట్ సినిమాలా ఉంటుంది. మా నిర్మాతలు నాకెంతో స్వేచ్ఛనిచ్చారు. అనిల్‌గారి ప్లానింగ్ సూపర్బ్. విజయం వచ్చాక మనం చెప్పేది చాలామంది వింటారు. కానీ, ఏం చెబుతున్నామనే దాంట్లో స్పష్టత లేదంటే, ఎప్పటికీ తప్పుల్ని సరిదిద్దుకునే ఛాన్స్ రాదు. ⇒ ఆర్మీ నేపథ్యంలో నానీతో ఓ స్వచ్ఛమైన ప్రేమకథ చేయబోతున్నా. దాన్ని లడఖ్‌లోనే చిత్రీకరించాలి. మే వరకు అక్కడ చిత్రీకరణ చేయలేం గనుక ఈలోపు మరో సినిమా చేయాలనుకుంటున్నా. అఖిల్ కోసం ఓ టిపికల్ సబ్జెక్ట్ రెడీ చేశా. మా మధ్య డిస్కషన్స్ కూడా జరిగాయి. కానీ, అదెప్పుడు సెట్స్‌పైకి వెళుతుందనేది చెప్పలేను. -
ఆయన సినిమాల్లోని ఒక్క సీన్ అయినా వాడుకుంటా!
‘అ ఆ’ హిట్ తర్వాత ఏ సినిమా చెయ్యాలి? అనే డైలమాలో త్రివిక్రమ్‌గారికి ఫోన్ చేశా. రెగ్యులర్ సినిమా కాకుండా కొంచెం వైవిధ్యమైన సినిమా చేయమన్నారు. చాలా కథలు విన్నా.. నచ్చలేదు. హను రాఘవపూడి చెప్పిన కథ నచ్చడంతో ఫస్ట్ సిట్టింగ్‌లోనే ఓకే చేశా’’ అని నితిన్ అన్నారు. నితిన్, మేఘా ఆకాష్ జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో వెంకట్ బోయనపల్లి సమర్పణలో రామ్ ఆచంట, గోపీ ఆచంట, అనీల్ సుంకర నిర్మించిన ‘లై’ ఈ నెల 11న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నితిన్ చెప్పిన విశేషాలు... ♦ ఆవారాగా తిరిగే ఓ కుర్రాడు అమెరికా వెళ్లి బాగా డబ్బున్న అందమైన అమ్మాయిని పెళ్లాడి డాలర్స్ సంపాదించుకోవాలనుకుంటాడు. అలా యూఎస్ వెళ్లి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? అన్నదే ఈ చిత్రకథ. సినిమా ప్రారంభం నుంచి ఇంట్రెస్టింగ్గా, థ్రిల్లింగ్‌గా ఉంటుంది. ♦ ఒక ఎమోషన్‌తో, మంచి స్టైలిష్ సినిమా చూశామనే ఫీలింగ్‌తో ఆడియన్స్ థియేటర్స్ నుంచి బయటికి వస్తారు. నా మార్కెట్‌ని దృష్టిలో పెట్టుకొని కథకు అవసరమైనంత ఖర్చుపెట్టి హాలీవుడ్ స్థాయిలో ఈ సినిమా నిర్మించినందుకు నిర్మాతలకి థ్యాంక్స్. ఈ సినిమా చిత్రీకరణను ఎక్కువ శాతం అమెరికాలోని కాస్ట్లీ ప్రదేశాల్లో జరిపాం. ♦ యాక్షన్ సీన్స్ కోసం బ్యాంకాక్‌లో ట్రైనింగ్ తీసుకున్నా. కిచ్చ మాస్టర్ ఫెంటాస్టిక్ యాక్షన్ కంపోజ్ చేశారు. ‘లై’ సినిమా నాకొక కొత్త ఇమేజ్‌తోపాటు నా కెరీర్లో మరచిపోలేని చిత్రంగా నిలుస్తుంది. ♦ ‘శ్రీ ఆంజనేయం’ తర్వాత అర్జున్‌గారితో వర్క్ చేయడం హ్యాపీ. ఆయన్నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా. సినిమాలో మా ఇద్దరి మధ్య గేమ్ థ్రిల్లింగ్‌గా ఉంటుంది. క్లైమాక్స్ ఫైట్‌లో అర్జున్‌గారు రియలిస్టిక్‌గా చేశారు. ♦ మణిశర్మగారు ఈ సినిమాకి ప్రాణం పెట్టి సంగీతం ఇచ్చారు. ఆయన రీ–రికార్డింగ్ ఎక్స్ట్రార్డినరీ. హను, నేను వన్ ఇయర్ నుంచి ట్రావెల్ అవుతున్నాం. ఫస్ట్ సార్.. అని పిలుచుకునేవాళ్లం. ఆ తర్వాత పేర్లు పెట్టి.. ఇప్పుడు ఏరా.. పోరా అనుకుంటున్నాం. అంత క్లోజ్ అయ్యాం. ♦ ‘తమ్ముడు’లో పవన్ కల్యాణ్‌గారు లుంగీ కట్టుకుని, బీడీ కాల్చే డ్యాన్స్ సీన్‌ని ‘లై’లో వాడాం. నేను పవన్‌కి వీరాభిమాని. ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. లైఫ్‌లాంగ్ నా సినిమాల్లో ఆయన చిత్రంలోని ఏదొక సీన్ ఉపయోగిస్తాను. ఆయనంటే నాకంత ఇష్టం. ♦ ప్రస్తుతం కృష్ణచైతన్య దర్శకత్వంలో పవన్‌కల్యాణ్–త్రివిక్రమ్గార్లు నిర్మిస్తున్న సినిమా చేస్తున్నాను. ఇందులో మేఘా ఆకాష్ హీరోయిన్. కొన్ని కథలు వింటున్నా. ఏదీ ఫైనలైజ్ కాలేదు. చర్చల దశలోనే ఉన్నాయి. -
పొట్టకొసినా అబద్ధమే చెప్తాను!
-
పొట్టకొసినా అబద్ధమే చెప్తాను!
'నా పేరు ఏ. సత్యం. అంటే వాడుకభాషలో అసత్యం. పొట్టకొసినా, భగవద్గీత మీద ఒట్టు వేసినా అబద్ధమే చెప్తాను. నిజం చచ్చినా చెప్పను' అంటున్నాడు నితిన్. ఆయన నటించిన తాజా చిత్రం 'లై'.. అంటే అబద్ధం. అబద్ధాలు చుట్టూ ఈ సినిమా అల్లుకున్నట్టు సినిమా ట్రైలర్ చూస్తే చెప్పేయొచ్చు. ఎందుకంటే.. 'మనం అబద్ధాలే మాట్లాడుకుందాం. అర్థమైందా?' అని హీరోయిన్ అంటే.. 'నువ్వు పెద్ద బాగోవు.. బాగా యావరేజ్' అని హీరో బదులిస్తాడు.. ఇక 'అబద్ధాలకు కూడా అమ్మాయిలు పడిపోతారని ఫస్ట్ టైమ్ తెలిసింది' అని హీరోయిన్ సిగ్గులొలికితే.. 'అసలు అమ్మాయిలు పడేదే అబద్ధానికి.. పాపం అమాయకులు..' అంటూ హీరో హస్కీ వాయిస్‌లో చెప్తాడు. మొత్తానికి ఈ అబద్ధాల కథేంటో తెలుసుకోవాలంటే ఈ నెల 11 వరకు ఆగాల్సిందే. నితిన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘లై’... వెంకట్ బోయనపల్లి సమర్పణలో రామ్ ఆచంట, గోపీ ఆచంట, అనీల్ సుంకర నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 11న విడుదల కానుంది. మణిశర్మ స్వరకర్త. ఈ సినిమా ప్రీ-రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా థియేట్రికల్ ట్రైలర్‌ను సుకుమార్, ఆడియోను త్రివిక్రమ్ లాంచ్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా ట్రైలర్ ఆకట్టుకుంటోంది. -
దర్శకులు మూడు రకాలు! – త్రివిక్రమ్
– త్రివిక్రమ్ ‘‘దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ డైరెక్టర్లు రెండు రకాలు. ఎడిటింగ్ రూమ్ డైరెక్టర్లు. సెట్ డైరెక్టర్లు అన్నారు. ఆయనకు తెలియని మూడో రకం డైరెక్టర్లు కూడా ఉన్నారు. సినిమా అంతా అయిపోయి రిలీజ్ తర్వాత ఇది ఇలాకన్నా ఇంకోలా చేస్తే బాగుండు అనుకుంటాను. అది నేను. సో .. మూడో రకం డైరెక్టర్లు కూడా ఉన్నారు’’ అన్నారు డైరెక్టర్ త్రివిక్రమ్. నితిన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘లై’. వెంకట్ బోయనపల్లి సమర్పణలో రామ్ ఆచంట, గోపీ ఆచంట, అనీల్ సుంకర నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 11న విడుదల కానుంది. మణిశర్మ స్వరకర్త. ఈ సినిమా ప్రీ–రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. థియేట్రికల్ ట్రైలర్‌ను సుకుమార్, ఆడియోను త్రివిక్రమ్ లాంచ్ చేశారు. త్రివిక్రమ్ మాట్లాడుతూ– ‘‘నేను మణిశర్మ ఫ్యాన్‌ని. ఆయన గురించి చెప్పే స్థాయి మనకు లేదు. ట్రైలర్ చూసిన తర్వాత ఈ సినిమా హిట్ అవుతుందనుకున్నాను. రామ్ ఆచంట, గోపీ ఆచంట, అనీల్ సుంకర, వెంకట్‌లా సినిమాను ప్రేమించి తీసే నిర్మాతలు చాలా తక్కువ మంది ఉంటారు’’ అన్నారు. డైరెక్టర్ సుకుమార్ మాట్లాడుతూ– ‘‘డైరెక్టర్లు రెండు రకాలు. ఎడిటింగ్ రూమ్ డైరెక్టర్, సెట్ డైరెక్టర్. నేను ఎడిటింగ్ రూమ్ డైరెక్టర్‌ను. హను సెట్లో సీన్‌ను ఊహించగలడు. రామ్‌గారి ప్రేమ, గోపీగారి నిశ్శబ్దం, అనిల్‌గారి దూకుడు కలిస్తే 14 రీల్స్. ఇప్పుడు వీరికి తోడుగా వెంకట్ వచ్చారు. వారి కోసం సినిమా పెద్ద హిట్ కావాలి. నితిన్ లుక్ బాగుంది’’ అన్నారు. ‘‘ఈ సినిమా అవుట్‌పుట్ బాగా రావడం వెనక చిత్రబృందం కృషి ఎంతో ఉంది. ఈ సినిమాను నితిన్ నాకన్నా ఎక్కువగా నమ్మాడు’’ అన్నారు హను రాఘవపూడి. నితిన్ మాట్లాడుతూ– ‘‘కల్యాణ్ (పవన్ కల్యాణ్) గారు ఈ ఫంక్షన్‌కి రాలేదు. ఆయన సోల్మెట్ త్రివిక్రమ్ వచ్చారు కాబట్టి, ఆయన వచ్చినట్టే. నా కెరీర్లో ఇది 24వ సినిమా. నెక్ట్స్ 25వ సినిమా కల్యాణ్‌గారి ఫస్ట్ ప్రొడక్షన్లో నేను చేయబోతున్న ఫస్ట్ సినిమా. అంతకంటే ఒక ఫ్యాన్‌గా నాకేం కావాలి. అనిల్‌గారు నా స్వీట్ హార్ట్. గోపీగారు, రామ్‌గారు, వెంకట్‌గారు చాలా ప్యాషనెట్ అండ్ డేరింగ్ ప్రొడ్యూసర్స్. హనూకి సినిమా అంటే పిచ్చి, ప్యాషన్. మణిశర్మ మంచి మ్యూజిక్ ఇచ్చారు. రీ–రికార్డింగ్ ఇంటర్నేషనల్ లెవల్లో ఉంటుంది’’ అన్నారు. నిర్మాత అనిల్ సుంకర మాట్లాడుతూ– ‘‘మూవీ స్టార్ట్ చేసిన రోజునే ఆగస్టు 11న రిలీజ్ అనుకున్నాం. ఇప్పుడు అదే రోజున రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు. ఈ వేడుకలో చిత్రబృందంతో పాటు పలువురు అతిథులు పాల్గొన్నారు. -
ఐదు రోజులు ఇక్కడ... తర్వాత అమెరికాలో!
సెట్స్‌పైకి వెళ్లడానికి ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న కృష్ణచైతన్య స్క్రిప్టుకు నితిన్ క్లాప్ కొట్టారు. వీళ్లిద్దరి కలయికలో రూపొందుతోన్న సినిమా చిత్రీకరణ సోమవారం మొదలైంది. నితిన్ హీరోగా పాటల రచయిత కృష్ణచైతన్య దర్శకత్వంలో పవన్‌కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్, శ్రేష్ఠ్ మూవీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రమిది.నిన్నటినుంచి ఈ శుక్రవారం వరకు అంటే... ఐదు రోజులపాటు ఈ షెడ్యూల్ హైదరాబాద్‌లో జరుగుతుందని చిత్రబృందం తెలిపింది. ఆగస్టులో అమెరికాలో భారీ షెడ్యూల్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నితిన్ సరసన ‘లై’లో నటిస్తున్న మేఘా ఆకాశ్ ఇందులోనూ హీరోయిన్గా నటిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి మూలకథను అందించారు. రావు రమేశ్, నరేశ్, ప్రగతి, లిజీ, నర్రా శ్రీను, శ్రీనివాసరెడ్డి, మధు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఎస్. తమన్, కెమెరా: నటరాజ్ సుబ్రమణ్యమ్ (‘అఆ’ ఫేమ్), కళ: రాజీవ్ నాయర్, కూర్పు: ఎస్.ఆర్. శేఖర్, సమర్పణ: నిఖితారెడ్డి, నిర్మాత: సుధాకర్‌రెడ్డి, కథనం–మాటలు–దర్శకత్వం: కృష్ణచైతన్య. -
నితిన్ 'లై' టీజర్
-
నితిన్ 'లై' టీజర్ వచ్చేసింది
నితిన్, మేఘా ఆకాశ్‌లు జంటగా నటిస్తున్న చిత్రం 'లై'- లవ్ ఇంటిలిజెన్స్ ఎనిమిటీ అనేది ఉప శీర్షిక. హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర టీజర్‌ను మంగళవారం విడుదల చేశారు. అర్జున్ ఈ చిత్రంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. 'కోట్లమంది సైనికులు సరిపోలేదట. పంచ పాండవులూ సాధించలేదట. చివరికి కృష్ణుడూ ఒంటరి కాదట. అబద్ధం తోడు లేకుండా ఏ కురుక్షేత్రం పూర్తవదట. అశ్వత్థామ హతః కుంజరః' అంటూ సాగిన టీజర్‌లోని డైలాగ్‌లు సినిమాపై ఇంట్రెస్ట్‌ను కల్పిస్తున్నాయి. సినిమాలో అర్జున్ పాత్రపై విపరీతమైన ఆసక్తి నెలకొంది. యాక్షన్ సినిమాలకు అర్జున్ పెట్టింది పేరు. అలాంటిది యాక్షన్ లుక్‌లో కనిపిస్తున్న లై సినిమాలో ఆయన ఉండటం ప్లస్ పాయింట్ అయ్యేలా ఉంది. వచ్చే నెల 11వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. -
భంబోలో ఉందిరా పోరి
పోరడు అమెరికా పోయిండు. అక్కడో చిన్నదాన్ని చూశాడు. ఇంకేముంది? మనోడికి పగలే వెన్నెల కాసినట్టు ఉంది. వెంటనే... ‘భంబోలే ఉన్నదిరా పోరి... బంబాటు గుందిరా నారి’ అని ఓ పాటేసుకున్నాడు. పాటతో ఆగలేదు. పోరిని ప్రేమించాడు. ఆ పోరడు నితిన్. పోరి మేఘా ఆకాశ్. వీళ్ల ప్రేమకథ ఏ కంచికి చేరిందనేది ఆగస్టు 11న తెలుస్తుంది. నితిన్, మేఘా ఆకాశ్ జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట, అనీల్ సుంకర నిర్మిస్తున్న సినిమా ‘లై’. లవ్.. ఇంటెలిజెన్స్.. ఎన్‌మిటి.. అనేది ఉపశీర్షిక. ఇందులో తొలి పాట ‘భంబోలే ఉన్నదిరా పోరి...’ను చికాగోలో విడుదల చేశారు. నిర్మాతలు మాట్లాడుతూ – ‘‘చికాగోలో విడుదల చేసిన తొలి పాటకు మంచి స్పందన లభిస్తోంది. మణిశర్మ అద్భుతమైన స్వరాలందించారు. 75 రోజుల పాటు అమెరికాలో టాకీతో పాటు భారీ యాక్షన్ సీన్లు తీశాం. మరో పది రోజులు హైదరాబాద్‌లో జరిగే షెడ్యూల్‌తో సినిమా చిత్రీకరణంతా పూర్తవుతుంది. ఆగస్టు 11న చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అన్నారు. అర్జున్, శ్రీరామ్, రవికిషన్, పృథ్వీ, బ్రహ్మాజీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: యువరాజ్, సంగీతం: మణిశర్మ, సమర్పణ: వెంకట్ బోయనపల్లి. -
ఎప్పటివరకూ దాచేస్తారు?
నితిన్ ఏం దాచేస్తున్నాడు? అంటే తన ట్రెండీ యూత్‌ఫుల్ ఫేస్ అట! నితిన్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ ‘లై’. ఆల్రెడీ ఈ సిన్మాలో అతని ఫస్ట్ లుక్ విడుదలైంది. గుబురు గడ్డం, గుండ్రటి కళ్లద్దాలతో రీసెంట్గా నితిన్ చేసిన సినిమాలతో కంపేర్ చేస్తే లుక్ చాలా డిఫరెంట్‌గా ఉంది. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే... సినిమా అంతా నితిన్ ఈ లుక్కులో ఉండరట! యూత్‌ఫుల్ ట్రెండీ లుక్ మరొకటి ఉందట. ఫ్లాష్‌బ్యాక్‌లోని ప్రేమకథలో ట్రెండీ లుక్‌లో కనిపిస్తారని కృష్ణానగర్ కుర్రాళ్లు చెప్పుకుంటున్నారు. మరి, ఆ లుక్‌ను సినిమా విడుదలకు ముందు బయటపెడతారో? లేక దాచేసి, తెర మీదే చూపిస్తారో? వెయిట్ అండ్ సీ! ‘అందాల రాక్షసి, కృష్ణగాడి వీరప్రేమగాథ’ సినిమాల ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వంలో రామ్ ఆచంట, గోపీ ఆచంట, అనీల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమా క్లైమాక్స్‌ను కాలిఫోర్నియా (అమెరికా)లోని మొజావేలో ఉన్న మిడెస్ట్లో థౌజెండ్ ఫ్లైట్స్ మధ్య షూట్ చేస్తున్నారిప్పుడు. -
22 డేస్ టు గో!
అటు అభిమానులకు, ఇటు హీరోలకు కిక్కిచ్చే కాంబినేషన్లు కొన్ని ఉంటాయి. పవన్–త్రివిక్రమ్–నితిన్ కాంబినేషన్ అటువంటిదే. ఆత్మీయ మిత్రుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో కలసి వీరాభిమాని నితిన్ హీరోగా పవన్‌కల్యాణ్ ఓ సినిమా నిర్మిస్తున్నారనే వార్త ప్రేక్షకులకు భలే కిక్ ఇచ్చింది. నితిన్ కూడా చాలా ఎగ్జయిట్ అయ్యారు. గతేడాది నవంబర్‌లో కృష్ణచైతన్య దర్శకుడిగా ప్రారంభమైన ఈ సినిమా గురించి మరో వార్త లేకపోయే సరికి కాస్త కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. అసలు, ఈ సినిమా ఏమైందని ఆరా తీస్తే... ఈ నెల 26న రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని ప్రొడక్షన్ హౌస్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. త్రివిక్రమ్ అందించిన మూలకథకు కృష్ణచైతన్య ఫుల్ బౌండ్ స్క్రిప్ట్ రెడీ చేశారట. ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న ‘లై’ సినిమా చిత్రీకరణ నిమిత్తం నితిన్ అమెరికాలో ఉన్నారు. ఈనెల 14తో ‘లై’ అమెరికా షెడ్యూల్ పూర్తవుతుంది. ఆ తర్వాత కొంచెం రెస్ట్ తీసుకుని కృష్ణచైతన్య సినిమా ప్రారంభిస్తారన్న మాట! -
శ్రీమాన్... శ్రీవారు!
సమ్సారం సంసారంలో సినిమా ప్రసూన... విసిగివేసారి... ఉక్రోషం, ఉడుకుమోత్తనం, ఆగ్రహం, ఆవేశం ఆవహించగా... ‘‘అసలు మీ ఎవ్వరికీ కనిపించకుండా వెళితే కాని మీరు దారికి రారు’’ అని వంటింట్లోకి వెళ్లిపోయింది. ‘కోడలిగా నేను ఈ ఇంటికి వచ్చిన కొత్తలోనే చెప్పింది అత్తయ్య.. మొగుడిని మనిషిలాగే చూడు.. దేవుడిని చెయ్యకు అని. అప్పుడు అర్థం కాలేదు ఆ మాట విలువ. ఇప్పుడు తెలిసొస్తోంది!’ మంచం మీద ఉండలా పడి ఉన్న తడి తుండును తీసి బాల్కనీలో విసురుగా దులుపుతూ అంది ప్రసూన. ‘అందుకే అన్నారు... పెద్దల మాట చదన్నం మూట అని. ఆ రోజే మా అమ్మ చెప్పిన మాట సరిగ్గా విని నువ్వు అర్థం చేసుకుని ఉంటే దేవుడిలా వినడమే తప్ప నోరెత్తలేని ఖర్మ నాకూ పట్టుండేది కాదు’ డ్రెస్సింగ్ టేబుల్ ముందు తల దువ్వుకుంటూ అన్నాడు నింపాదిగా శ్రీకర్. చిర్రెత్తుకొచ్చింది ప్రసూనకు. ‘ఏ విషయంలో మీకు మాట్లాడే చాన్స్ ఇవ్వకుండా చేశాను?’ అంది ఆవేశంగా. ‘ఏ విషయంలో మాట్లాడనిచ్చావని?’ మీసాలను దువ్వుకుంటూ అన్నాడు అదే నింపాదితనంతో. ‘నిజంగా తప్పుచేశాను’ నిస్సహాయంగా సణుక్కుంటూ వంటింట్లోకి వెళ్లింది. ‘ఫలితం నేను అనుభవిస్తున్నా’ అన్నాడు డైనింగ్ హాల్లోకి వస్తూ! ఆ మాటకు స్పందనగా వంటింట్లో గిన్నెలు చప్పుడు చేశాయి గట్టిగా! డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చీలో కూర్చుంటూ అన్నాడు... కాదు... కేకేశాడు శ్రీకర్... ‘దేవుడికి నైవేద్యం’ అంటూ! ‘ఈ దేవుడికి మామూలు నైవేద్యాలు ఏం సరిపోతాయి.. పెళ్లాం రక్తమాంసాల భక్ష్యం కావాలి కాని’ అంటూ టేబుల్ మీద కంచం పెట్టింది శబ్దం వచ్చేంత కోపంగానే. ఆమె కోపం ఆయనకు నోటీస్ అయినా పట్టించుకోలేదు. శ్రీకర్ బ్యాంక్ మేనేజర్. ప్రసూన గృహిణి. ఇద్దరు పిల్లలు. పెళ్లయి అత్తారింటికి వెళ్తున్నప్పుడు అమ్మమ్మ, నానమ్మ, మేనత్త సహా అమ్మ చెప్పిన మాటలనూ బాగా గుర్తుంచుకుని భర్తకు ఏ చిన్న అసౌకర్యం కలగనివ్వకూడదనే వాగ్దానం కూడా చేసుకుంది తనకుతానే ప్రసూన. అత్తింట్లో అడుగుపెట్టినప్పటి నుంచి ఆ ప్రకారమే నడుచుకోవడమూ మొదలుపెట్టింది. కోడలి ప్రవర్తన చూసిన అత్తమ్మ భవిష్యత్తులో ఆ పిల్ల ఎంత కష్టపడనుందో తన అనుభవరీత్యా అంచనా వేసి ఇచ్చిన సలహానే... ‘మొగుడిని మనిషిగానే చూడు దేవుడిని చేయకు’ అని. కన్న కొడుకు గురించి తల్లి అలా అనడం మొదట్లో జీర్ణించుకోలేకపోయింది కోడలు. కాని యేడాది తిరగకముందే అత్తమ్మ సలహా ఎంత విలువైనదో తెలిసొచ్చింది. అయితే అప్పటికే జరగాల్సిన అనర్థం జరిగిపోయింది. శ్రీమాన్ శ్రీవారు శ్రీమతి సపర్యలకు అలవాటుపడి ఆ సేవలకు ఒళ్లు, మెదడు అప్పగించి ఇంట్లో సొంతంగా పనిచేసుకోవడమనే మాటను మరిచిపోయాడు. బ్రష్ మీద పేస్ట్ దగ్గర్నుంచి స్నానానికి నీళ్లు దాకా భార్య పెడితేనే ఆ మొగుడి మెదడు స్నానమనే ప్రోగ్రామ్‌ను కంప్లీట్ చేస్తుంది. చివరకు కంచంలో ఆమె అన్నం వడ్డిస్తేనే ఆయన తినడమనే తంతంగం పూర్తి చేస్తాడు. ఆయన భోజనం అయిపోయేవరకు అసాంతం ఆమె పక్కనే ఉండి కంచంలో ఏం లేదో... ఏం ఉందో చూస్తూ వడ్డించాలిసిందే. ఏదో పని వల్ల పొరపాటున అక్కడి నుంచి ఆమె కదిలి వెళ్లిందో కంచంలో తిండి అయిపోగానే అదే టేబుల్ మీద అలాగే ప్లేట్ పక్కనే ఎంగిలి చేయితోనే కునుకు తీస్తాడు అతను. ‘అయ్యో... అలా పడుకున్నారేంటి? పిలిచి ఏం కావాలో అడగొచ్చు కదా’ అని తనేదో తప్పు చేసినట్టు ఫీలయిపోయి ప్లేట్లో ఆయనకు కావల్సినవి మళ్లీ వడ్డిస్తుంది ఆ మహా ఇల్లాలు. ఈయనగారు తాత్పరంగా లేచి... ‘నా భోజనం కన్నా నీకు ముఖ్యమైన పనేదో ఉన్నట్టుంది. డిస్టర్బ్ చేయడం ఎందుకని నువ్వు వచ్చే వరకు టైమ్ వేస్ట్ కాకుండా ఓ కునుకు తీద్దామనుకున్నా’ అంటాడు ఆమెను నొప్పించడానికి వ్యంగ్యాన్ని అస్త్రంగా చేసుకుంటూ. ఆ హబ్బీ నిర్లక్ష్యం, లేజీనెస్ ఏ స్థాయిదంటే... బ్యాంక్ పని తప్ప ఇంకే పని చేయడు. ఇంట్లో పూచిక పుల్ల ముట్టుకోడు. స్నానం చేసి తుడుచుకున్నాక తుండు గుడ్డను ఉండలా విసిరేస్తే అది ఎక్కడ పడిందో కూడా వెనక్కి తిరిగి చూడడు. ఇందాకటి ఈ శ్రీమతి కోపానికి, అసహనానికి కారణం అదే. పదేళ్లయినా ఆ అలవాటును మాన్పించలేకపోతోంది. తుడుచుకున్నాక తుండును కనీసం ఒక చోట పెట్టే ప్రయత్నం చేయించలేకపోతోంది. తనకు కావాల్సిన వాటిని కూడా ఆయన తెచ్చుకోడు. ‘చెప్పుకోవడానికి కూడా సిగ్గే... ఆయన గడ్డం గీసుకునే బ్లేడ్ దగ్గర్నుంచి ఆండర్వేర్స్ దాకా అన్నీ నేనే తేవాలి’ అంటూ అక్కచెల్లెళ్ల దగ్గర ఎన్నో సార్లు వాపోయింది ఆ పిల్ల. ‘కొత్తలో కథ రివర్స్‌గా ఉండింది కదే... మా ఆయన వేసుకునే బట్టలు నేనే సెలెక్ట్ చేయాలి అంటూ గర్వంగా చెప్పేదానివి. బావగారి బట్టలు అంటే... యు మీన్ అండర్వేర్సా?’ అంటూ చెల్లెలు చాలాసార్లు ఆటపట్టించింది కూడా! చిన్నప్పటి నుంచి డ్రైవింగ్ అంటే ఇష్టమని పట్టుబట్టి డ్రైవింగ్ నేర్చుకుంది. నేర్చుకున్న పాపానికి డ్రైవర్ ఉద్యోగం కూడా చేయాల్సి వస్తోంది అని బాధపడితే... ‘మా ఆయన నేను లేకుండా ఎక్కడికీ వెళ్లడు అని చెప్తుంటే ఏంటో అనుకున్నా అక్కాయ్... ఇదన్న మాట సంగతి’అంటూ తమ్ముడూ ఎకసెక్కమాడాడు. బీర్వాలోంచి వేసుకోవాల్సిన బట్టలు ఆయన తీసుకోవాల్సి వస్తే పైన దొంతర మొత్తం జారి కింద పడాల్సిందే. మళ్లీ అవన్నీ సర్దుకునే పెంట పని ఎక్కడ పెట్టుకుంటుంది అని బట్టలు తీసే బాధ్యత కూడా తనే నెత్తిమీద వేసుకుంది. యేడాదికోసారి ఎప్పుడైనా తనకు ఒంట్లో బాగాలేనప్పడు ఒక్క పూట ఒక్క పని చేయాల్సి వస్తే ఇల్లు పందిరవడమే. ‘అబ్బబ్బ... ఏ పనీ సరిగ్గా చేయరు కదా... నీట్నెస్ అన్న మాటే లేదు మీ డిక్షనరీలో’ అని విసుక్కుంటుంది. దాన్నీ బహు ఒడుపుగా వాడుకోవడం మొదలుపెట్టాడు భర్త. ‘అరేయ్... ఒక్కతే ఎంత పని అని చేసుకుంటుందిరా... ఇంట్లో ఉన్నప్పుడైనా కాస్త సాయం చేయొచ్చుకదా’ అని అతని తల్లిగారు అంటే కోడలి అత్తగారు అంటే... ‘అమ్మా... నాకు నువ్వు నీట్నెస్ నేర్పించలేదే. తనకేమో నీట్నెస్ ఓసీడీ(అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్). నేను సాయం చేసి డబుల్ వర్క్ పెట్టే బదులు చేయకుండా ఉండడమే తనకు, నాకు, మనకు క్షేమదాయకం!’’ అంటాడు చాలా మర్యాదగా. ఇవన్నిటితో విసిగివేసారి... ఉక్రోషం, ఉడుకుమోత్తనం, ఆగ్రహం, ఆవేశం ఆవహించగా... ‘‘అసలు మీ ఎవ్వరికీ కనిపించకుండా వెళితే కాని మీరు దారికి రారు’’ అని వంటింట్లోకి వెళ్లిపోయింది ఒకసారి. మళ్లీ ఏదో గుర్తొచ్చి హాల్లోకి వచ్చిన అర్థాంగికి నట్టనడుమ ధ్యాన భంగిమలో కూర్చున్న భర్త, ఇద్దరు పిల్లలు కనపడ్డారు. ‘కళ్లెందుకు మూసుకున్నారు?’ అంది ఆశ్చర్యంగా.‘తెరిస్తే నువ్ కనడతావని’ అన్నాడు ఆయన నెమ్మదిగా. ‘నేను కనపడడమేంటి?’ మళ్లీ ఆశ్చర్యం ఆమెలో.‘ఇందాకే అన్నావ్‌గా మా ఎవ్వరికీ కనపడకుండా పోతే బాగుండు అని. నువ్వు వెళ్లడం ఎందుకు మేమే కళ్లు మూసుకుంటే సరిపోతుంది కదా అని.. ’ అన్నాడు. ఏం చేయలేక ‘నా ఖర్మ’ అంటూ తల కొట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది ప్రసూన. ‘దీనికి సంసారసారం ఎన్నటికీ బోధపడదు పాపం... వెర్రిది’ అని నిట్టూర్చింది అత్తగారు. సినిమాలో సంసారం సినిమా: దిల్ నా కొడుకును ఎందుకండీ తిట్టి పోసుకుంటారు... అని భర్తను విసుక్కుంటుంది.చలపతిరావు ఓ బాధ్యత గల తండ్రి. ఆయనకు తగిన ఇల్లాలు సుధ. వారి ముద్దుల తనయుడు నితిన్(శీను) కాలేజీ కుర్రాడు. చలపతిరావుకు గుడికి వెళ్లడం అలవాటు. ఓ రోజు గుడికి వెళదామని చలపతిరావు, సుధ, వేణుమాధవ్(శీనుకి మేనమామ)... ఎదురు చూస్తుంటారు. సాయంత్రం ఐదు గంటలైనా నితిన్ ఇంటికి రాడు. అప్పుడు... ఆ కోపాన్ని భార్యపై ప్రదర్శిస్తుంటాడు చలపతిరావు. ‘వెధవ.. వెధవన్నర వెధవ.. ఎక్కడ తగలెడ్డాడే వీడు. అస్సలు మనకు గుడికి వెళ్లే యోగం ఉందా? లేదా? ఇవ్వాళ. పనికిమాలిన వెధవ’ అని చలపతిరావు తిట్ల దండకం అందుకుంటాడు. ‘ఎందుకండీ నా కొడుకును అలా తిట్టి పోసుకుంటారు?’ అంటుంది సుధ. ‘తిట్టక, ముద్దెట్టుకోమంటావా? గుడికి వెళదామని నాలుగు గంటలకు బట్టలు వేసుకుని కూర్చున్నా.. ఇప్పుడు ఐదైంది’ కోపంతో అరుస్తాడు చలపతిరావు. ‘ఇంకో గంట ఆగితే ఆరవుద్ది బావా’ బదులిస్తాడు వేణు. ‘ఇంకో రెండు గంటలు ఆగితే ఏడవుద్ది. అప్పుడు గుడి కూడా మూసేస్తారు. అసలు ఎక్కడికి వెళ్లాడురా వీడు?’ ప్రశ్నిస్తాడు చలపతి. వాడికి తెలీదని అంటున్నాడుగా బదులిస్తుంది సుధ. ‘అయితే నీకు తెలుసన్నమాట. ఎక్కడికి వెళతానని చెప్పాడు?’ భార్యని ప్రశ్నిస్తాడు చలపతి. ‘బయటికి వెళ్లేటప్పుడు ఎక్కడికి? అని అడగకూడదని మీరే కదండీ చెప్పారు?’ జవాబిస్తుంది సుధ. నాటకాలాడుతున్నారా? అంటూ చలపతి మండిపడతాడు. ‘హమ్మయ్య... వచ్చేశాడు బావా’ వేణు జవాబు. వచ్చాడా? ఆత్రుతగా గుమ్మంవైపు చూసిన చలపతి ‘ఏడిరా వచ్చాడన్నావ్?’ అంటాడు. ఏదో నీ తృప్తి కోసం చెప్పా బావా... అనగానే వేణు చెంప చెళ్లుమనిపించిన చలపతి... ‘నీ సంతోషం కోసం కొట్టా’ అంటాడు చలపతి. ‘వాడు డిస్కోకు వెళ్లాడని నేను చెప్పను బావా’ అంటూనే చెప్పేస్తాడు వేణు. ‘డిస్కో కా... వాడికి డబ్బులెక్కడి నుంచి వచ్చినయ్?’ అని భార్య వైపు చూస్తాడు చలపతి. సీన్ కట్ చేస్తే గదిలో మంచం మీద నిద్రపోతూ కనిపిస్తాడు నితిన్. ‘డిస్కో కా.. వాడికి డబ్బులెక్కడి నుంచి వచ్చినయ్?’ సినిమా: అతడు బ్రహ్మానందం మహా గడసరి. హేమ అమాయకురాలు. భర్త మాటంటే వేదం. తను ఏం చెప్పినా ఇలా చిటికెలో చేసేస్తుంటుంది. ఆ కంగారులో ఒక్కోసారి నోరు జారుతుంటుంది. ఆ మాటలకు బ్రహ్మానందం ఆమెను విసుక్కుంటుంటాడు. వేసవి సెలవులు కావడంతో హేమ పుట్టింటికి వచ్చి ఉంటుంది. బ్రహ్మానందం కూడా అత్తారింటికొస్తాడు. భర్త ఇంటికి రాగానే... ‘రేపొస్తానన్నారు?’ అంటుంది హేమ. ‘రైల్వేస్టేషన్లో ఫ్లాట్‌ఫామ్‌పై పడుకుని రేపొస్తా’ అని భార్యపై విసుక్కుంటాడు బ్రహ్మీ. ‘ఎందుకండీ అంత కోపం...’ అని అతడిని బుజ్జగించే ప్రయత్నం చేస్తుంది హేమ. ‘కోప్పడక.. ఇంట్లో అన్ని కార్లు పెట్టుకుని అల్లుడి కోసం కనీసం ఒక్క కారైనా స్టేషన్‌కి పంపలేరా?’ అని మండిపడతాడు బ్రహ్మానందం. ‘స్నానానికి వేడి నీళ్లు పెట్టి కాఫీ తీసుకురా’ అని ఆర్డరేస్తాడు భార్యకి. కాఫీ తీసుకొస్తుంది హేమ. ‘సాసర్ ఏదే? అంటే సెకండ్ డే కదా అని తీసేశారా? రేపటి నుంచి కాఫీ అడిగితే అడుక్కునేవాడికి పోసినట్లు దోసిట్లో పోస్తారా?’ చిర్రుబుర్రులాడతాడు బ్రహ్మీ. సాసర్ తెద్దామని లోనికి వెళ్లబోతుంది హేమ. ‘ఎక్కడికి? దీన్ని(కాఫీ కప్పు) ఏం చేయమంటావ్? నువ్వొచ్చే వరకు ఒలింపిక్ జ్యోతిని పట్టుకున్నట్లు ఇలా పట్టుకుని నిలబడనా?’ అని మండిపడతాడు. ‘ఇవ్వండి’ అని కప్పు తీసుకుంటుంది హేమ. ‘విసుక్కుంటున్నావేంటే?’ అంటాడు బ్రహ్మీ. నేనా? అని హేమ అనగానే, మరి నేనా? అని ప్రశ్నిస్తాడు. దీంతో నోటిపై చేయి పెట్టుకుని ఇంటిలోకి వెళ్లి మళ్లీ కాఫీ తెచ్చిస్తుంది. క్వశ్చన్ మార్కుతో చూస్తాడు. ‘సాసర్ ఉంది కదండీ’ అని హేమ అనగానే... ‘సాసర్లో కప్పు, కప్పులో కాఫీ ఉంటే సరిపోద్దా? వేడిగా ఉండక్కర్లేదా?’ అని దబాయిస్తాడు. వేడి చేసి తెస్తానండి అంటుంది హేమ. ఇలాంటి భర్తలు సినిమాలోనే కాదు మన చుట్టూ కూడా కనిపిస్తారు. ‘సాసర్లో కప్పు.. కప్పులో కాఫీ ఉంటే సరిపోద్దా? వేడిగా ఉండక్కర్లేదా?’ – సరస్వతి రమ -
నితిన్ హీరోగా భారీ చిత్రం
‘అఆ’ చిత్రం తర్వాత కొంచెం గ్యాప్ తీసుకున్న నితిన్ ఇప్పుడు రెండు మూడు చిత్రాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో ఏకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోన్న చిత్రంతో పాటు కృష్ణచైతన్య దర్శకత్వంలో పవన్‌కల్యాణ్, త్రివిక్రమ్ సంయుక్తంగా నిర్మిస్తోన్న సినిమాలో నటిస్తున్నారు. ఆ రెండు చిత్రాలు సెట్స్‌పైన ఉండగానే నితిన్ మరో సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ‘ఏమైంది ఈవేళ’, ‘బెంగాల్ టైగర్’ వంటి విజయవంతమైన చిత్రాలు నిర్మించిన కె.కె.రాధామోహన్ హీరో నితిన్‌తో భారీ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై శ్రీమతి లక్ష్మీరాధామోహన్ సమర్పణలో ఈ చిత్రం తెరకెక్కనుంది. రాధామోహన్ మాట్లాడుతూ – ‘‘నితిన్‌తో ఓ సూపర్‌హిట్ సినిమా తీయాలని కథ తయారు చేస్తున్నాం. ఇప్పటికే కథా చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం నితిన్ నటిస్తున్న రెండు సినిమాల తర్వాత ఆగస్ట్‌లో మా చిత్రం ప్రారంభమవుతుంది. పూర్తి వివరాలు త్వరలో చెబుతాం’’ అన్నారు. -
నమ్మించి స్నేహం, అశ్లీల ఫోటోలతో వేధింపులు
-
నమ్మించి స్నేహం, అశ్లీల ఫోటోలతో వేధింపులు
- అశ్లీల ఫొటోలు తీసి బ్లాక్‌మెయిలింగ్ - పోలీసులను ఆశ్రయించిన బాధిత యువతులు - కంచరపాలెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు విశాఖ : అందమైన అమ్మాయిలతో మాటలు కలిపి నమ్మించి స్నేహం పెంచుకుంటాడు... అనంతరం వారితో చనువుగా ఉన్న సమయంలో ఫొటోలు తీస్తాడు... వాటిని ఆసరాగా చేసుకుని కోరిక తీర్చమని బ్లాక్‌మెయిలింగ్ చేస్తాడు... ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా సుమారు 30 మంది యువతుల జీవితాలతో ఆడుకున్నాడు మద్దిలపాలెంకు చెందిన నయవంచకుడు నితిన్. బీటెక్ చదువుతున్నానని, క్యాంపస్ ఇంటర్వ్యూలో ఎంపికయ్యానని, త్వరలో ఉద్యోగం వస్తుందని నమ్మించి పలువురు అమ్మాయిలతో స్నేహం పెంచుకుని మోసం చేశాడు. అశ్లీల ఫొటోలు తీసి బ్లాక్మెయిల్ చేసి లోబరుచుకున్నాడని కొందరు యువతులు కంచరపాలెం పోలీస్ స్టేషన్లో మంగళవారం ఫిర్యాదు చేశారు. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... మద్దిలపాలెంలో ఉంటున్న నితిన్ తన స్నేహితుని సాయంతో కంచరపాలెం స్టేషన్ పరిధిలో ఉన్న ఎలుకల గాయత్రి ఫోన్ నంబర్ సేకరించి స్నేహం పెంచుకున్నాడు. గాయత్రికి సినిమాలపై ఉన్న ఆసక్తిని గమనించి తాను షార్ట్‌ఫిల్మ్‌లు తీస్తానని, వాటిలో అవకాశాలు కల్పిస్తానని నమ్మించాడు. అందుకోసం మంచి ఫొటోలు తీయించుకోవాలని చెప్పాడు. దీంతో సినిమాల మీద ఉన్న ఆసక్తితో ఫొటోలు తీయించుకునేందుకు గాయత్రి అంగీకరించింది. అయితే ఫొటోలు తీయించుకునే సమయంలోను, దుస్తులు మార్చుకునేటపుడు అశ్లీల ఫొటోలు తీసిన నితిన్ అప్పటి నుంచి బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించాడు. తన కోరిక తీరిస్తేనే ఫొటోలు ఇస్తానని చెప్పి గాయత్రిని లోబరుచుకున్నాడు. ఇలా మరో అమ్మాయి ప్రియను కూడా ప్రేమిస్తున్నానని నమ్మించి పెళ్లి కూడా చేసుకున్నాడు. అక్కడితో ఆగకుండా రోజా అనే అమ్మాయిని కూడా ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. రాత్రి సమయంలో వీడియో కాల్ చేయాలని రోజూ వేధిస్తుండేవాడని ఆ యువతి వాపోయింది. ఇలా సుమారు 30 మంది యువతులను నితిన్ వేధించాడని పోలీసులు, బాధితులు చెబుతున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, నిందితుడిని అదుపులోకి తీసుకుంటామని సీఐ చంద్రశేఖరరావు తెలిపారు. -
'నితిన్ విషయంలో అనుమానించొద్దని కాల్చుకుంది'
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మెర్సిడిస్ కారులో జరిగిన యువతి హత్య కేసు కొత్త మలుపు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. తొలుత ఆమెను తానే హత్య చేసినట్లు ఒప్పుకున్న శుభం గుప్తా ఇప్పుడు ప్లేటు ఫిరాయించాడు. తాను అసలు ఆమెను చంపనేలేదని తనే కాల్చుకొని చనిపోయిందంటూ విచారణ అధికారుల ముందు చెప్పాడు. అయితే, కేసును తప్పుదోవపట్టించేందుకు అతడు ప్రయత్నిస్తున్నాడని పోలీసులు చెబుతున్నారు. కొంత దూరం నుంచే కాల్పులు జరిపినట్లుగా తమవద్ద స్పష్టమైన ఆధారాలు ఉన్నట్లు వారు తెలిపారు. కొన్ని రోజుల కిందట స్థానిక నజఫ్ గఢ్‌కు చెందిన సిమ్రన్(17) ఇద్దరు స్నేహితులతో కలిసి షాపింగ్‌కు వెళ్లింది. అనంతరం ఇద్దరితో కలిసి మెర్సిడిస్ కారులో ఇంటి సమీపానికి చేరుకుంది. అక్కడ ఓ యువకుడు కారు దిగి వెళ్లిపోగా కారులోనే ఉన్న శుభం గుప్తా, సిమ్రన్ మాత్రమే ఉన్నారు. తన మాజీ బాయ్‌ఫ్రెండ్ నితిన్‌తో సిమ్రన్ సన్నిహితంగా ఉండటం, అబద్ధాలు చెబుతుండటంపై శుభం ఆమెను ప్రశ్నించాడు. అనంతరం వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆమె తల్లి చూస్తుండగానే అతడు సిమ్రన్ను తుపాకీతోనే కాల్చేశాడు. ఆమె చనిపోయింది. పోలీసుల ముందు నేరం కూడా ఒప్పుకున్నాడు. కానీ, విచారణ అధికారుల ముందు మాత్రం తమ మధ్య వాగ్వాదం జరిగిన తర్వాత సిమ్రన్ తన చేతిలోని తుపాకీ లాక్కొని కాల్చుకొని చనిపోయిందంటూ కొత్తగా చెప్పాడు. తాను నితిన్ గురించి అబద్ధం చెప్పడం లేదని ప్రూవ్ చేసుకునేందుకు కాల్చుకుందని తెలిపాడు. తనను నమ్మకుంటే నిజంగానే కాల్చుకొని చనిపోతానని చెప్పిందని, తాను అలా చేస్తుందని ఊహించలేకపోయానంటూ పోలీసులముందు అబద్ధాలు చెప్పాడు. కానీ, శుభం చెప్పేదంతా కట్టుకథేనని, అసలు నిజాలు త్వరలోనే తెలుస్తాయని చెప్పారు. -
అంతం లేనిదీ ప్రేమ!
సినిమాల్లోనైనా.. సినిమా వేడుకల్లోనైనా... దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు సూటిగా చెప్పాలనుకున్న విషయాన్ని చెబుతాయి. కొన్ని పదాలకు ఆయన ఇచ్చే నిర్వచనాలు ఆకట్టుకుంటాయి. ఐడియా దర్శక, నిర్మాతల్లో ఎవరిదో కానీ త్రివిక్రమ్ ఓ నిర్మాతగా వ్యవహరిస్తున్న తాజా సినిమా టైటిల్‌కి కూడా భలే నిర్వచనం కుదిరింది. నితిన్ హీరోగా పాటల రచయిత కృష్ణచైతన్య దర్శక త్వంలో పవన్ కల్యాణ్, త్రివిక్రమ్, సుధాకర్‌రెడ్డి నిర్మిస్తున్న సినిమాకి ‘జ్ఛీ’ (‘అబద్ధం’ అని అర్థం) అనే టైటిల్ ఖరారు చేశారట. ‘లవ్ ఈజ్ ఎండ్లెస్’ అనేది ఉపశీర్షిక. అంటే.. ‘ప్రేమ అనంతం’ అని అర్థం. ‘జ్ఛీ’కి వీళ్లు ఇచ్చిన నిర్వచనం బానే ఉంది. మరి.. ‘లై’ అంటే అబద్ధం కాబట్టి.. ప్రేమకూ, అబద్ధానికీ కూడా సినిమాలో ఏదో ముడి ఉండే ఉంటుంది. -
రెస్టారెంట్లో సమంత సందడి
-
సూపర్ మచ్చి...
నగరానికి చెందిన ఫ్యాషన్ డిజైనర్ నీరజ కోన.. సినీ నటుడు నితిన్‌తో కలిసి రెస్టారెంట్ రంగంలోకి అడుగుపెట్టారు. మాదాపూర్‌లోని కావూరిహిల్స్‌లో వీరు ‘టీ గ్రిల్’ పేరిట మల్టిక్యుజిన్ రెస్టారెంట్‌ను నెలకొల్పారు. దీనిని సినీ నటి సమంత శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రెస్టారెంట్ వంటకాలను టేస్ట్ చేసి ‘సూపర్ మచ్చి...’ అంటూ కితాబిచ్చారు. విశాలమైన ప్రాంగణంలో ఏర్పాటైన ఈ రెస్టారెంట్‌ను రాయల్ ట్రెడిషనల్ థీమ్‌తో తీర్చిదిద్దారు. నోరూరించే వంటలు రుచి చూస్తూ.. ఫొటోలకు పోజులిస్తూ సందడి చేసింది. - సాక్షి, సిటీబ్యూరో -
అభిమాని కోసం ఆత్మీయ మిత్రుడితో...
పవన్‌కల్యాణ్ నిర్మాతగా మారారనేది కొత్త విషయం కాదు. ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ నిర్మాతల్లో ఆయనొకరు. పవన్‌కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ ఆ చిత్ర నిర్మాణంలో భాగస్వామి అనేది అందరికీ తెలిసిందే. తాజాగా ఆత్మీయ మిత్రుడు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో కలసి ఓ చిత్రం నిర్మిస్తున్నారు. అయితే.. ఇందులో పవన్ హీరోగా నటించడం లేదు. ఆయన అభిమాని నితిన్ హీరో. పాటల రచయిత కృష్ణచైతన్య ఈ చిత్రానికి దర్శకుడు. ‘రౌడీ ఫెలో’ తర్వాత ఆయన దర్శకత్వం వహిస్తున్న రెండో చిత్రమిది. నితిన్ తండ్రి సుధాకర్‌రెడ్డి శ్రేష్ఠ్ మూవీస్ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం బుధవారం ప్రారంభమైంది. దేవుని పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి త్రివిక్రమ్ కెమేరా స్విచ్చాన్ చేయగా, పవన్‌కల్యాణ్ క్లాప్ ఇచ్చారు. తొలిసారి వేరే హీరోతో పవన్ సినిమా నిర్మిస్తుండడం ఓ విశేషమైతే... త్రివిక్రమ్ ఓ నిర్మాతగానే కాకుండా మూల కథను కూడా అందించడం మరో విశేషం. ఈ చిత్రానికి కళ: రామకృష్ణ, కెమేరా: ఎన్. నటరాజ సుబ్రహ్మణ్యన్. -
ఆ ముగ్గురితో మూడు సినిమాలు!
గోపీచంద్.. నితిన్.. నాగశౌర్య.. ఇప్పుడీ ముగ్గురు హీరోలతో విడి విడిగా మూడు సినిమాలు చేస్తున్నట్టు నిర్మాత కేకే రాధామోహన్ ప్రకటించారు. ‘అధినేత’, ‘ఏమైంది ఈవేళ’, ‘బెంగాల్ టైగర్’ సినిమాల తర్వాత శ్రీసత్యసాయి ఆర్ట్స్ పతాకంపై పృథ్వీ, నవీన్ చంద్ర హీరోలుగా ఇ.సత్తిబాబు దర్శకత్వంలో కేకే రాధామోహన్ నిర్మించిన ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ ఈ నెలలోనే విడుదల కానుంది. జనవరిలో నాగశౌర్యతో సినిమా ప్రారంభిస్తారు. త్వరలో ఈ మూడు సినిమాల వివరాలను ప్రకటించనున్నారు. -
డై..లాగి కొడితే...
సినిమా : జయం రచన, దర్శకత్వం: తేజ వెంకటరమణ (నితిన్), సుజాత (సదా) ఒకే కాలేజీలో చేరతారు. కాళ్లకు పట్టీలు వేసుకొచ్చిందని సుజాతను ఏడిపిస్తాడు అలీబాబా (సుమన్ శెట్టి). ఆ కారణంతో మరుసటి రోజు రైల్వేస్టేషన్ వరకూ పట్టీలు వేసుకొచ్చిన సుజాత వాటిని తన చెల్లికి ఇచ్చి సాయంత్రం తీసుకురమ్మని కాలేజీకి వస్తుంది. అదేంటండి.. పట్టీలు తీసేశారని వెంకటరమణ అడుగుతాడు. అవును.. తీసేశాను. నీకెందుకు? పట్టీలు వేసుకుంటే ఎందుకు వేసుకున్నావని మీరే ఏడిపిస్తారు.. తీసేస్తే.. ఎందుకు తీసేశారని మళ్లీ మీరే అడుగుతారు. వేసుకుంటే వేసుకుంటా.. తీసేయాలనిపిస్తే తీసేస్తా.. అసలు నా సంగతి నీకెందుకయ్యా.. నీకూ, నాకూ ఏంటి సంబంధం? ‘వెళ్లవయ్యా.. వెళ్లు.. వెళ్లూ...’ అంటుంది సుజాత. ఈ డైలాగ్ ఎంత పాపులర్ అంటే.. ఇప్పటికీ ఎక్కడో చోట వినిపిస్తూనే ఉంటుంది. -
చాంప్స్ రితేశ్, నితిన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అంతర్ జిల్లా జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో రితేశ్, బాల కిషన్, నితిన్ కుమార్, అమలన్ బోర్గోహెన్ సత్తా చాటారు. రాష్ట్ర అథ్లెటిక్స్ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పోటీల్లో 100మీ. పరుగు విభాగంలో విజేతలుగా నిలిచారు. గచ్చిబౌలి స్టేడియంలో శనివారం జరిగిన 100మీ. పరుగు ఈవెంట్లో అండర్-14 బాలుర విభాగంలో రితేశ్ (11.7సె.), అభిశేఖర్ (11.9సె.), రాహుల్ (12.3సె.)... అండర్- 16 విభాగంలో బాలకిషన్ (11.2సె.), హరికృష్ణ (11.3సె.), చైతన్య (11.9సె.)... అండర్-18 విభాగంలో నితిన్ కుమార్ (11.0సె.), రామకృష్ణ (11.2సె.), సుధీర్ కుమార్ (11.3సె.)... అండర్-20 విభాగంలో అమలన్ (10.9సె.), నరేశ్ (11.0సె.), అయ్యప్ప ప్రసాద్ (11.2సె.)లు వరుసగా తొలి మూడు స్థానాల్ని సంపాదించారు. బాలికల 100మీ. పరుగులో అండర్ - 16 విభాగంలో దీప్తి (13.0సె.) మొదటి స్థానంలో నిలవగా... జంగు బాయ్ (13.4సె.), ఝాన్సీ (13.6సె.) రెండు, మూడు స్థానాల్ని సంపాదించుకున్నారు. అండర్-18 విభాగంలో భానుచంద్రిక (13.0సె.), విద్యశ్రీ (13.2సె.), చైతన్య (14.3సె.) తొలి మూడు స్థానాల్ని దక్కించుకున్నారు. ఇతర పోటీల విజేతల వివరాలు అండర్ -14 బాలురు 600మీ: 1. నిఖిల్ (1:29.5సె.), 2. సతీశ్ (1:29.7సె.), 3. అంజద్ (1:29.9సె.) లాంగ్‌జంప్: 1. సాయి తరుణ్ (5.56మీ.), 2. భార్గవ్ (5.32మీ.), 3. మధు (5.13మీ.) షాట్‌పుట్: 1. రవితేజ (12.72మీ.), 2. నగేశ్ (11.73మీ.), 3. వీరేంద్ర (11.15మీ.) బాలికలు 600మీ.: 1. భాగ్యలక్ష్మీ (1:41.3సె.), 2. మహాలక్ష్మీ (1:53.9సె.), 3. మౌనిక (1:56.5సె.) లాంగ్ జంప్: 1. మహేశ్వరి (4.10మీ.), 2. రుచిత (4.03మీ.), 3. గంగా జమున (4.03మీ.) షాట్‌పుట్: 1. నవీన (7.86మీ.), 2. భవ్య (7.06మీ.), 3. మేఘన (6.71మీ.) అండర్-16 బాలురు: 400మీ.: 1. అరవింద్ (51.2సె.), 2. రోహిత్ కుమార్ (53.9సె.), 3. అహ్మద్ జైన్ (55.0సె.) షాట్‌పుట్: 1. సత్యవాన్ (13.89మీ.), 2. రాము (11.70మీ.), 3. సిడ్నీ జాన్సన్ (11.59మీ.) బాలికలు 400మీ.: 1. ప్రేరణ లక్ష్మీ (1:09.9సె.), 2. గంగోత్రి (1:13.3సె.), 3. తరుణి (1:15.5సె.) అండర్-18 బాలురు: డిస్కస్ త్రో: 1. సాహిల్ (48.21మీ.), 2. శివ (39.90మీ.), 3. రవి (38.04మీ.) బాలికలు: 1. సాయిప్రియాంక (26.61మీ.), 2. మాన్విత (24. 77మీ.), 3. అలేఖ్య (22.60మీ.) అండర్-20 బాలురు: షాట్‌పుట్: 1. సాయి కుమార్ (13.42మీ.), 2.ధీరజ్ (11.17మీ.), 3. ఓంకార్ (10. 82మీ.) బాలికలు: డిస్కస్ త్రో: 1. మానస (23.15మీ.), 2. శిరీష (14మీ.), 3. నవీన (12.73మీ.) -
దోస్త్ మేరా దోస్త్
ఫ్రెండ్షిప్ డే స్పెషల్ ఇంటర్వ్యూ కలిసి చాయ్ తాగేవాళ్లు... కమ్మని కబుర్లు చెప్పేవాళ్లు... ఫ్రెండ్స్ అంటే వీళ్లేనా? ఊహూ... ఎనీ టైమ్ నీకు నేనున్నా అని భరోసా కలిగించేవాళ్లు... అలాంటి ఫ్రెండ్ ఒక్కరు దొరికినా లక్కీయే హీరో నితిన్... డిజైనర్ కోన నీరజ లక్కీ పీపుల్... ఈ ఇద్దరూ మంచి ఫ్రెండ్స్... ఈ ఇద్దరికీ కామన్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు... • సమంత, రకుల్, నితిన్.. ఇలా మీ ఫ్రెండ్స్ లిస్ట్ చాలానే ఉంటుందేమో? నీరజ: అవునండి. యాక్చువల్‌గా చిత్ర పరిశ్రమలో మంచి స్నేహితులు దొరకడం చాలా కష్టం. ఈ విషయంలో నేను చాలా లక్కీ. నాకు గొప్ప స్నేహితులు దొరికారు. అందులో నితిన్ ఒకడు. వెరీ డౌన్ టు ఎర్త్. ఓ హీరోలా అనిపించడు. పక్కింటి కుర్రాడిలానే ఉంటాడు. చాలా మంచోడు. • మీరు తొలిసారి కలిసింది ఎప్పుడు? ‘గుండెజారి గల్లంతయ్యిందే’ కాస్ట్యూమ్ డిస్కషన్స్ టైమ్‌లో కలిశాను. నేను ఓ కాస్ట్యూమ్ డిజైనర్, తను ఓ హీరో.. ఫస్ట్‌లో మా రిలేషన్ అంతే. ఎక్కువగా మా డిస్కషన్లో సినిమా విషయాలు మాత్రమే ఉండేవి. • మరి... మంచి స్నేహితులు ఎప్పుడయ్యారు? మా ఇద్దరికీ కామన్ ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. గ్యాంగ్ అందరూ ఒక్కటే. షూటింగ్ ఉన్నా.. లేకున్నా.. స్నేహితులు అందరం కలుస్తూ ఉండేవాళ్లం. అలా మేమిద్దరం క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యాం. • మీ ఇద్దరికీ కామన్‌గా ఉండే ఇష్టాల గురించి? ఫుడ్ అండ్ ట్రావెలింగ్. సరదగా కబుర్లు చెప్పుకోవడం. షాపింగ్.. ఏం చేయకుండా ఖాళీగా ఉండడం అన్నా ఇష్టమే. • ‘ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఎ ఫ్రెండ్ ఇన్ డీడ్’ అంటారు కదా. మీ ఫ్రెండ్షిప్? అలాంటిదే.. నాకు అవసరమైన ప్రతి సందర్భంలోనూ నితిన్ అండగా నిలబడతాడు. సలహాలు ఇస్తుంటాడు. • పెళ్లైన తర్వాత మరో అబ్బాయితో స్నేహం సాధ్యమేనా? మీ భర్త ఏమంటారు? ఎందుకు సాధ్యం కాదు? పెళ్లయినంత మాత్రన వేరే అబ్బాయితో స్నేహం చేయకూడదా? మనం పెరిగిన సంస్కృతి, సంప్రదాయాల వల్ల ఆడ, మగ స్నేహం అంటే అదో వింతగా అనిపించడం సహజం. మిగతావారు ఏం ఆలోచిస్తారో అర్థం చేసుకోగలను. కానీ, మా స్నేహం ఇటువంటి విషయాలకు అతీతమైనది. నా పెళ్లికి ముందే మేమిద్దరం మంచి ఫ్రెండ్స్. నిజం చెప్పాలంటే ఆ తర్వాత మా స్నేహం బలపడింది. పెళ్లి తర్వాత నా స్నేహితుల్లో మా ఆయన ఒకరు అయ్యారు. మేం ముగ్గురం కలిస్తే సందడికి కొదవ ఉండదు. • నితిన్ ప్లస్ అండ్ మైనస్‌లు ఏంటి? ప్లస్ పాయింట్స్ ఏంటంటే.. జాలి ఎక్కువ. మైనస్.. చాలా మొండిఘటం. • వ్యక్తిగతంగా, వృత్తిపరంగా నితిన్ భవిష్యత్ ఎలా ఉండాలనుకుంటున్నారు? హీరోగా మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆశిస్తున్నాను. వ్యక్తిగతంగా పెళ్లి చేసుకుని జీవితంలో ఓ ఇంటివాడైతే చూడాలనుంది. తనకు సరిజోడి ఎప్పుడు వెతుక్కుంటాడా? అని ఎదురుచూస్తున్నాను. • నీరజతో మీ ఫ్రెండ్షిప్ గురించి? నితిన్: నీరూ.. నీరజ కోనను నేనలాగే పిలుస్తాను. మా పరిచయం అయిన కొన్నాళ్లకు మేము ఇద్దరం క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యాం. మా ఇద్దరి మధ్య ఓ ప్రత్యేకమైన అనుబంధం ఉంది. నా క్లోజ్ ఫ్రెండ్ సర్కిల్లో నీరూ ఒకటి. • మీది ప్రొఫెషనల్ ఫ్రెండ్షిప్పా? రీల్ అండ్ రియల్.. నీరూ, నేను గుడ్ ఫ్రెండ్స్. రీల్ లైఫ్ స్టైలిస్ట్.. రియల్ లైఫ్‌లో కూడా బెస్ట్ ఫ్రెండ్ అయితే చాలా అడ్వాంటేజ్. • మీ ఫ్రెండ్స్‌లో చాలామంది అబ్బాయిలున్నారు. వాళ్లకీ, నీరజాకీ డిఫరెన్స్? ఏం లేదని అనుకుంటున్నాను. మేమంతా కలసి పార్టీలు చేసుకుంటాం. సరదాగా కూర్చుని కబుర్లు చెప్పుకుంటాం. అబ్బాయిలతో నేనెంత సరదాగా ఉంటానో.. నీరూతో కూడా అంతే సరదాగా ఉంటాను. • ఓ ఫ్రెండ్‌గా నీరజ భవిష్యత్తు ప్రొఫెషనల్‌గా, పర్సనల్‌గా ఎలా ఉండాలని కోరుకుంటున్నారు? ప్రొఫెషనల్‌గా ఇంకా ఎత్తుకి ఎదగాలని కోరుకుంటున్నా. ఫ్యాషన్ డిజైనింగ్ వైజ్‌గా ఓ సొంత బ్రాండ్ ప్రారంభించాలన్నది తన లక్ష్యం. అది నెరవేరాలని ఆశిస్తున్నా. నీరూ వ్యక్తిగత జీవితం చాలా బాగుంది. నీరూ కొడుకు అన్ష్ చాలా క్యూట్‌గా ఉంటాడు. కొడుకుతో చాలా ఎంజాయ్ చేస్తుంది. ఆ ఆనందం ఎప్పటికీ అలా కొనసాగాలి. • పెళ్లయిన అమ్మాయితో ఫ్రెండ్షిప్ సాధ్యమేనా? నీరజ భర్తతో మీ అనుబంధం గురించి? ఫ్రెండ్షిప్ అనేది ఒకరి వైవాహిక జీవితంతో ముడి పడి ఉండదు. యాక్చువల్‌గా నీరూకి థ్యాంక్స్ చెప్పాలి. తనతో పాటు నాకు మరో మంచి ఫ్రెండ్‌ని కూడా ఇచ్చింది. అతనే అజయ్, నీరజ భర్త. నాకు చాలా మంచి స్నేహితుడు. మా ఫ్రెండ్స్ సర్కిల్ అంతటికీ తను కూడా క్లోజ్ అయ్యాడు. మాతో ఆయన వేవ్‌లెంగ్త్ బాగా కుదిరింది. • నీరజ ఎలాంటి అమ్మాయి? చాలా క్రియేటివ్ పర్సన్. తెలివైన అమ్మాయి • మీ టఫ్ టైమ్‌లో తన సలహాలు తీసుకుంటారా? తప్పకుండా. ఇప్పటికి అలానే ఉన్నాం. ఎప్పటికీ అలా ఉండాలని కోరుకుంటున్నాను. • మీ ఫ్రెండ్లో ఉన్న ప్లస్సులు, మైనస్సులు? ఎదుటి వ్యక్తి చెప్పేది కాదనకుండా వింటుంది. ప్లస్ పాయింట్ అదే. మైనస్ పాయింట్ ఏంటంటే.. ఎవరినైనా ఈజీగా నమ్మేస్తుంది. -
నవ్వులే నవ్వులు!
‘అధినేత’,‘ ఏమైంది ఈవేళ’, ‘బెంగాల్ టైగర్’ తదితర చిత్రాలను నిర్మించిన కేకే రాధామోహన్ తాజాగా నవీన్‌చంద్ర హీరోగా ఓ చిత్రం నిర్మించనున్నారు. ‘ఓ చినదాన’, ‘తిరుమల తిరుపతి వెంకటేశ’, ‘యముడికి మొగుడు’ వంటి చిత్రాలను తెరకెక్కించిన ఇ.సత్తిబాబు ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. శ్రీమతి లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై తెరకెక్కే ఈ చిత్రం షూటింగ్ ఈ నెల 18 నుంచి ప్రారంభం కానుంది. నిర్మాత మాట్లాడుతూ - ‘‘పూర్తి వినోదాత్మక చిత్రమిది. ప్రేక్షకులకు వంద శాతం నవ్వులు పంచుతుంది. సత్తిబాబు ఈ కథను బాగా హ్యాండిల్ చేస్తారనే నమ్మకం ఉంది’’ అన్నారు. నితిన్ హీరోగా భారీ చిత్రం ఇదే బ్యానర్లో నితిన్ హీరోగా రాధాకృష్ణ నిర్మించనున్న భారీ చిత్రం డిసెంబర్లో ప్రారంభమవుతుంది. -
‘అ...ఆ’ మూవీ స్టిల్స్
-
సమంతకు హీరోల స్పెషల్ విషెస్
ముచ్చటగా మూడోసారి సమంతతో జత కడుతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు.. పుట్టినరోజు సందర్భంగా ఆమెకు స్పెషల్ విషెస్ చెప్పారు. మహేష్ తాజా చిత్రం 'బ్రహ్మోత్సవం'లో సమంత కూడా ఓ కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇంతకు ముందే బ్రహ్మోత్సవం ఫస్ట్ లుక్ మోషన్ పిక్చర్‌ను ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేసిన మహేష్.. గురువారం సమంత పుట్టినరోజు సందర్భంగా విషెస్ చెబుతూ మహేష్, సమంతలు కలిసి ఉన్న మరో పోస్టర్‌ను తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. కలర్ఫుల్గా ఉన్న ఆ పోస్టర్ చూసి అభిమానులు ఖుషీ అవుతున్నారు. మరోవైపు త్రివిక్రమ్ డైరక్షన్లో నితిన్ సరసన హీరోయిన్గా 'అ..ఆ' సినిమాలో నటిస్తున్నారు సమంత. 'అనసూయా రామలింగం' అంటూ ఆమె పాత్ర పేరుతో విషెస్ చెప్తూ నితిన్ కూడా ఓ పోస్టర్‌ను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. సోషల్ మీడియాలో సినీ ప్రముఖులు, అభిమానుల నుంచి సమంతకు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అందరికీ థాంక్యూ చెబుతూనే ఈ రోజంతా గడిచిపోయేంత బిజీగా ఉంది సమంత. Happy birthday @Samanthaprabhu2... Have a great year :) pic.twitter.com/Gg5Q2jcB0E — Mahesh Babu (@urstrulyMahesh) 28 April 2016 Wishing my Anasuya Ramalingam @Samanthaprabhu2 and my superkool friend n my fav costar a verryy happyy buddayy.. -
నితిన్‌ను ఉక్కిరి బిక్కిరి చేసిన సర్దార్
యంగ్ హీరో నితిన్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'అ..ఆ..'(అనసూయా రామలింగం వర్సెస్ ఆనంద్ విహారి) సినిమా సెట్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ దర్శనమిచ్చారు. తాను నటిస్టున్న సినిమా సెట్‌కు పవర్ఫుల్ గెస్ట్ వచ్చారని నితిన్ ట్విట్టర్ లొ పేర్కొన్నారు. ఆయన ముందు నటించడం చాలా ఆనందాన్నిచ్చిందని, ఒకింత నెర్వస్‌గా ఫీలయ్యానని తెలిపారు. పవన్, నితిన్, త్రివిక్రమ్ కలిసి దిగిన ఫోటోను కూడా ట్విట్ చేశారు. ఇటీవలే పవన్ కల్యాణ్ నటించిన 'సర్ధార్ గబ్బర్ సింగ్' ట్రయిలర్‌లోని ఓ సన్నివేశాన్ని నితిన్ అనుకరించిన వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీనికి నటి సమంత, దర్శక - రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ లు కూడా తోడయ్యారు.ఓ చెక్క బొమ్మ పై పవన్ కల్యాణ్ అటూ ఇటూ ఊగుతూ ఉండే సన్నివేశం సర్ధార్ గబ్బర్ సింగ్ ట్రయలర్‌లో కనిపిస్తుంది. అయితే సరిగ్గా అలానే నితిన్ కూడా చేశాడు. దీనికి నటి సమంత కొరియోగ్రఫీ చేయగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహించాడు. ప్రతి వేసవిలో పవన్ నుంచి వచ్చే మామిడి పళ్లను ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకోవడం మనకు తెలుసు. ఈసారి ఏకంగా పవర్ స్టారే తన సినిమా సెట్ లో ప్రత్యక్షమవ్వడంతో నితిన్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. POWERFUL guest on our sets last nite!!was very nervous excited n happy to perform in front of him🙈😳😊😃😃 pic.twitter.com/PQG7C0SBlz — nithiin (@actor_nithiin) 20 April 2016 -
పరిచయం కావడానికి పాతికేళ్లు!
‘అ’ అంటే ఏంటి? ‘అనసూయా రామలింగం’. మరి.. ‘ఆ’ అంటే ఆనంద్ విహారి. ఈ రెండక్షరాలూ పక్క పక్కనే ఉంటాయి. కానీ, అనసూయ, ఆనంద్ విహారి ఎక్కడెక్కడో ఉంటారు. ఓ సందర్భంలో ఒకే ట్రైన్ ఎక్కుతారు. మాటలు కలపకుండానే - ఒకరి పేర్లు ఒకరికి తెలిసిపోతాయ్. అప్పుడు సమంత తనలో తాను ‘పక్క పక్కనే ఉండే అక్షరాలు. పరిచయం కావడానికి పాతికేళ్లు పట్టింది’ అనుకుంటుంది. బుధవారం విడుదలైన ‘అ.. ఆ’ టీజర్లో సమంత అనే ఈ మాటలు ఇప్పుడు అందరి నోటా వినిపిస్తున్నాయి. రొమాంటిక్ ఫీల్‌తో కనిపించే ఈ టీజర్ చాలు.. దర్శకుడు త్రివిక్రమ్ అందమైన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ని ఇవ్వనున్నారని చెప్పడానికి! అనసూయా రామలింగం పాత్రలో సమంత, ఆనంద్ విహారిగా నితిన్ నటిస్తున్న ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్ మరో కథానాయిక. ఒక కీలకమైన పాత్రలో నదియా నటిస్తున్నారు. మమత సమర్పణలో సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ - ‘‘టీజర్‌కు మంచి స్పందన లభించినందుకు ఆనందంగా ఉంది. ఇది చక్కని ఫీల్‌గుడ్ రొమాంటిక్ మూవీ. మిక్కీ జె. మేయర్ స్వరపరచిన పాటలను ఈ నెలలో, మే ప్రథమార్ధంలో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: పి.డి.వి. ప్రసాద్. -
హాట్ సమ్మర్లో... కూల్ ఫిల్మ్
శివరాత్రితో ‘శివ...శివ...’ అంటూ చలి ఎగిరిపోయి, ఎండలు పెరుగుతున్న టైమ్‌లో తెలుగు చిత్రసీమ కూడా క్రమంగా వేడెక్కుతోంది. ఎగ్జామ్స్ సీజన్ అవగానే కొత్త సినిమాలతో బాక్సాఫీస్‌పై దాడి చేయడానికి దర్శక, నిర్మాతలు సిద్ధమవుతున్నారు. నితిన్, సమంత, మలయాళ ‘ప్రేమమ్’ ఫేమ్ అనుపమా పరమేశ్వరన్‌లు హీరో హీరోయిన్లుగా, దర్శక - రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందిస్తున్న తాజా చిత్రం ‘అ...ఆ...’ (అనసూయా రామలింగం వర్సెస్ ఆనంద్ విహారి) కూడా ఈ వేసవిలోనే మే 6న రిలీజ్‌కు సిద్ధమవుతోంది. హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) బృందం గురువారం నాడు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఈ వారం టీజర్... మే 6న సినిమా కుటుంబమంతా కలసి చూసి ఆనందించదగ్గ, రొమాంటిక్-కామెడీ కోవకు చెందిన లవ్‌స్టోరీ ఇది. ‘‘ఇటీవలే కేరళలోని పొల్లాచ్చి పరిసరాల్లో కీలకమైన టాకీ, పాటలు చిత్రీకరించాం. ప్రస్తుతం హైదరాబాద్ పరిసరాల్లో సినిమా చిత్రీకరణ తుది దశలో ఉంది. శుక్రవారం నుంచి ప్యాచ్‌వర్క్ షూటింగ్, ఈ నెల 24 నుంచి వారం రోజుల పాటు రెండు పాటల చిత్రీకరణ చేయనున్నాం’’ అని చిత్ర యూనిట్ వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. అలాగే, ఈ వారంలోనే సినిమా ఫస్ట్ లుక్, టీజర్ విడుదల చేయనున్నారు. మిక్కీ జె. మేయర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా పాటలను ఏప్రిల్ రెండోవారంలో జనం ముందుకు తీసుకురానున్నారు. ఆ వెంటనే మే 6న సినిమా రిలీజ్. నిజాయతీ నిండిన ప్రయత్నం నదియా, సీనియర్ నరేశ్, ప్రవీణ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఎన్. నటరాజ సుబ్రమణియన్ కెమేరా, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పి.డి.వి. ప్రసాద్ ఎగ్జిక్యూటివ్ నిర్మాత. వ్యక్తుల మధ్య అనుబంధాలనూ, కుటుంబ సంబంధాలనూ త్రివిక్రమ్ మార్కు శైలి ఆహ్లాదకరమైన సన్నివేశాలు, సంభాషణలు, ఆలోచింపజేసే అంశాలతో నిజాయతీగా, వాస్తవిక ధోరణిలో ఈ సినిమాలో చూపెట్టనున్నట్లు భోగట్టా. వెరసి, గత వేసవికి అల్లు అర్జున్ ‘సన్నాఫ్ సత్యమూర్తి’తో ప్రేక్షకులకు విందు చేసిన త్రివిక్రమ్ ఈసారి హీరో నితిన్‌తో పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ‘అ...ఆ...’ను జనం ముందుకు తెస్తున్నారు. ‘‘ఈ హాట్ సమ్మర్లో ఇది కూల్ సినిమా’’ అని చిత్ర యూనిట్ వర్గాలు అభివర్ణించాయి. ఎండలు మండే ‘మే’ వేళ ఎవరైనా కోరుకొనేది అదేగా! -
ఆమెతో మాట్లాడాక రిలీఫ్ అయ్యా: విష్ణు
హైదరాబాద్ : తృటిలో రోడ్డు ప్రమాదం నుంచి బయటపడిన హీరోయిన్ ప్రణీతకు పరామర్శలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు హీరోలు ఆమెకు ఫోన్ చేసి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ప్రణీత ఆదివారం ఖమ్మం నుంచి హైదరాబాద్ వస్తుండగా నల్లగొండ జిల్లా మోత వద్ద ఆమె ప్రయాణిస్తున్న ఇన్నోవా వాహనం ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ప్రణీతతో పాటు వాళ్ల అమ్మ, సాయకురాలు కూడా స్వల్పంగా గాయపడ్డారు. ఆమె ఖమ్మం లో ఓ వస్త్ర దుకాణంలో ప్రారంభోత్సవానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కాగా తాను క్షేమంగానే ఉన్నానని, షాక్ నుంచి ఇంకా బయటపడలేదని ప్రణీత అనంతరం ట్వీట్ చేసింది. తమ సిబ్బందికి గాయాలయ్యాయని తెలిపింది. ప్రమాదం సంభవించిన వెంటనే స్పందించి అంబులెన్స్ కు సమాచారం అందించిన వారికి ధన్యవాదాలు తెలిపింది. ప్రమాదానికి సంబంధించిన ఫొటోలు ట్విటర్ లో పోస్ట్ చేసింది. మినీ బస్సులో శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్న ప్రణీత అక్కడ నుంచి బెంగళూరు వెళ్లింది. ప్రమాద వార్త తెలియడంతో హీరో నితిన్, మంచు విష్ణు..ప్రణీతకు ఫోన్ చేసి పరామర్శించారు. 'రియల్లీ ప్రణీతతో మాట్లాడిన తర్వాత రిలీఫ్ అయ్యా. సీట్ బెల్ట్ పెట్టుకోవడంతో ఆమె సేఫ్‌గా బయటపడింది. ఇది చూసి అయినా మనలో చాలామంది ఇకనుంచి సీట్ బెల్ట్ పెట్టుకుంటే బాగుంటుంది' అని మంచు విష్ణు ట్విట్ చేశాడు. డైనమెట్ చిత్రంలో మంచు విష్ణు, ప్రణీత కలిసి నటించారు. కాగా గతంలో మోతె వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో హీరో జూనియర్ ఎన్టీఆర్ గాయపడిన విషయం తెలిసిందే. Really relieved after talking to @pranitasubhash.God has been kind.she is safe cause of wearing the seat belt.Hope many of us learn frm this — Vishnu Manchu (@iVishnuManchu) February 14, 2016 -
విద్యార్థిని కిడ్నాప్ కేసులో నిందితుల అరెస్ట్
తిరుచానూరు: ఇంజినీరింగ్ విద్యార్థిని కిడ్నాప్ కేసులో ఏడుగురు నిందితులను తిరుచానూరు పోలీసులు బుధవారం అరెస్టుచేశారు. సీఐ సురేంద్రనాయుడు విలేకరులకు వివరాలు వెల్లడించారు. తిరుమల వన్ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఏఎస్ఐగా పనిచేస్తున్న నాగమణి, ఈస్టు పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న శ్రీనివాసమూర్తి దంపతుల కుమారుడు నితిన్‌కల్యాణ్ బీటెక్ పూర్తిచేసి చెన్నైలోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. సదుం మండలం బనుగుపల్లెకు చెందిన సదాశివరెడ్డి కుమార్తె, నితిన్‌కల్యాణ్ ప్రేమించుకుని విడిపోయారు. సదాశివరెడ్డి కుమార్తె రేణిగుంట సమీపంలోని ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతోంది. ఈ క్రమంలో 21వ తేదీన ఆమె కళాశాలలో పరీక్ష రాసి తండ్రితో కలిసి ద్విచక్ర వాహనంలో ఇంటికి వెళుతోంది. అదే సమయంలో నితిన్‌కల్యాణ్, అతని స్నేహితులు నవీన్, సాయికృష్ణ, లోకేష్, అరుణ్‌కుమార్, అనిల్‌కుమార్, స్నేహితురాలు యాస్మిన్ ఇష్రాయిత్ రెండు కార్లలో వచ్చి వారిని అడ్డగించారు. విద్యార్థినిని కిడ్నాప్ చేసి అప్పలాయగుంట శివాలయంలో ఆమెను బలవంతంగా నితిన్‌కల్యాణ్ పెళ్లి చేసుకుని హైదరాబాదుకు తీసుకెళ్లాడు. అక్కడ ఆమె నితిన్‌కల్యాణ్ కళ్లుగప్పి ఇంటికి చేరుకుంది. తల్లిదండ్రులతో కలిసి తిరుచానూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అర్బన్ ఎస్పీ గోపినాథ్ జెట్టి ఆదేశాల మేరకు తిరుపతి ఈస్టు డీఎస్పీ రవిశంకర్‌రెడ్డి ఆధ్వర్యంలో సీఐ సురేంద్రనాయుడు నిందితుడు నితిన్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇదే సమయంలో విద్యార్థినిని వెతుక్కుంటూ తిరుపతి వచ్చిన నితిన్, అతని స్నేహితులను తుమ్మలగుంట క్రాస్‌లో అరెస్టు చేశారు. విలేకర్ల సమావేశంలో ఎస్ఐలు చిరంజీవి, వెంకటనరసింహ, ఏఎస్ఐలు ఈఎంఎస్ నాయుడు, శంకరయ్య పాల్గొన్నారు. -
దేవరాంపల్లిలో షూటింగ్ సందడి
చేవెళ్ల మండలం దేవరాంపల్లి గ్రామ సమీపంలోని బ్రిడ్జి వద్ద శుక్రవారం సినిమా షూటింగ్ సందడి నెలకొంది. హీరో నితిన్, హీరోయిన్ సమంతలతో దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాత రాధాకృష్ణ(చిన్నబాబు) నిర్మిస్తున్న చిత్రం సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరిం చారు. ఓ ఫైట్ సీన్‌ను బ్రిడ్జిపై షూట్ చేశారు. హారికహాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమాకు అ...ఆ అని పేరు పెట్టినట్లు తెలుస్తోంది. రెండుమూడురోజుల పాటు గ్రామ సమీపంలో మరికొన్ని సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు సమాచారం. షూటింగ్‌ను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున రావడంతో సందడి నెలకొంది. - చేవెళ్ల రూరల్ -
అఖిల్‌కి నా రేటింగ్ ఐదుకి ఐదు! - నాగార్జున
‘‘అఖిల్ నా కొడుకు అయిపోయాడు కాబట్టి, నేను పొగడలేక పోతున్నాను. వేరే హీరో అయితే మొహమాటపడకుండా పొగిడేవాణ్ణి. మొన్నా మధ్య ‘కంచె’ సినిమా చూశాను. నాగబాబుగారి అబ్బాయి వరుణ్ అద్భుతంగా నటించాడు. చాలా కష్టపడి చేశాడు’’ అని అక్కినేని నాగార్జున అన్నారు. అఖిల్‌ని హీరోగా పరిచయం చేస్తూ, హీరో నితిన్ నిర్మించిన ‘అఖిల్’ చిత్రం బుధవారం విడుదలైన విషయం తెలిసిందే. గురువారం హైదరాబాద్‌లో ఈ చిత్రం విజయోత్సవం జరిగింది. నాగార్జున మాట్లాడుతూ - ‘‘మామూలుగా మీడియావాళ్లు రేటింగ్స్ ఇస్తుంటారు కదా. నన్ను కనుక అఖిల్‌కి రేటింగ్ ఇవ్వమంటే తన నటనకి ఐదుకి ఐదు ఇస్తాను. మొదటి సినిమాకే అంత కష్టపడటం అనేది మామూలు విషయం కాదు. ఈ సినిమా విషయంలో నేనూ, అఖిల్ తిట్టుకున్నామని మీడియాలో కొందరు అనుకుంటున్నారు. అసలు మా ఫ్యామిలీలో ఆ కల్చరే లేదు. మా కుటుంబం గురించి తెలిసినవాళ్లకి ఆ విషయం తెలుసు. అయినా ఈ రోజుల్లో కూడా తిట్టుకోవడం ఏంటి? అఖిల్, చైతన్యలను ‘మీకు కోపమే రాదా’ అని అడుగుతుంటాను. మా మధ్య సంభాషణ అంత కూల్‌గా ఉంటుంది. వినాయక్‌గారు బి, సీ సెంటర్స్ అభిమానులందర్నీ థియేటర్‌కి రప్పించగలిగారు. ఒక మాస్ హీరోకి వచ్చినంత రెస్పాన్స్ రావడం ఆనందంగా ఉంది. అమల చాలా ఆనందంగా ఉంది. నితిన్, సుధాకర్‌రెడ్డి రాజీపడకుండా నిర్మించారు. నేను చేసిన 30 సెకన్ల సీన్‌కి మంచి అప్లాజ్ వచ్చింది. అభిమానులందరూ నన్నూ, అఖిల్నీ ఒకేసారి తెర పై చూసి ఆనందానికి లోనయ్యారు’’ అని చెప్పారు. వినాయక్ మాట్లాడుతూ - ‘‘నా సినిమాలో మంచి ఓపెనింగ్స్ సాధించిన సినిమా ఇది. అఖిల్ నటనకు థియేటర్లలో ఫ్యాన్స్ విజిల్స్ వేస్తున్నారు’’ అని అన్నారు. అఖిల్ మాట్లాడుతూ - ‘‘నేనింకా ట్రాన్స్‌లోనే ఉన్నాను. మొదటి సినిమా కాబట్టి మానసికంగా ఒత్తిడికి గురయ్యాను. ఇంత భారీ ఓపెనింగ్స్, వసూళ్లను అస్సలు ఊహించలేదు. అక్కినేని అభిమానుల వల్లే ఇది సాధ్యమైంది’’ అన్నారు. నితిన్ మాట్లాడుతూ - ‘‘అఖిల్ నాకు ఫ్రెండ్ మాత్రమే కాదు. తమ్ముడిలాంటివాడు. అందుకే తను పెద్ద కమర్షియల్ హీరో కావాలన్నది నా ఆశ. ఒక హీరోని పెద్ద కమర్షియల్ హీరోగా ఆవిష్కరించడం వినాయక్‌గారికి బాగా తెలుసు. ఈ సినిమా మొదటి రోజు 10 కోట్లు షేర్ సాధించింది. నాకు తెలిసి ఇండియాలో ఏ కొత్త హీరో సినిమా ఇంత వసూళ్లు రాబట్టలేదు. ఈ సినిమాకి డివైడ్ టాక్ వచ్చిన మాట వాస్తవం. మామూలుగా ఒక సినిమాకి డివైడ్ టాక్ వస్తే, మధ్యాహ్నం ఆటకే వసూళ్లు పడిపోతాయి. కానీ, ఈ సినిమా రెండో రోజు వసూళ్లు కూడా బాగున్నాయి’’ అని చెప్పారు. ఈ వేడుకలో సుధాకర్ రెడ్డి, బ్రహ్మానందం, వెన్నెల కిశోర్, సాయేషా సైగల్ మాట్లాడారు. -
‘అనసూయ... వర్సెస్ ఆనంద్’ షూటింగ్ ప్రారంభం
-
కంటెంట్ నమ్మిన కొరియర్...
ఇవాళ ఆధునిక ప్రపంచంలో రకరకాల వైద్య పరిశోధనలు జరుగుతున్నాయి. కానీ, అలాంటి పరిశోధనల్లో కొన్నింటి కోసం జనం నమ్మకాన్ని వమ్ము చేసి ద్రోహానికి పాల్పడితే? అలాంటి అక్రమం అనుకోకుండా బయటపడితే? ఒక సామాన్యుడు తన డ్యూటీ తాను సక్రమంగా చేసే క్రమంలో సమాజానికి తోడ్పడే కథానాయకుడిగా పరిణమిస్తే? ఈ సింపుల్ పాయింట్‌ను జెట్ స్పీడ్‌లో కాకుండా... కొరియర్ స్పీడ్‌లో చెప్పిన ప్రయత్నం - ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’. హీరో నితిన్ ఒక కొత్తరకం కథను ట్రై చేశాడు. అందుకు కారణం ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన క్రియేటివ్ డెరైక్టర్ గౌతమ్ మీనన్ కావచ్చు. రకరకాల కారణాల వల్ల ప్రొడక్షన్లో జాప్యం జరిగి రెండున్నర ఏళ్ల కాలం తీసుకున్న ఈ సినిమా వినాయక చవితికి విడుదలయ్యింది. కొరియర్ చుట్టూ తిరిగే కథ కల్యాణ్ (నితిన్) ఒక మామూలు మధ్యతరగతి కుర్రాడు. చిన్నప్పటి నుంచి అక్క (సురేఖావాణి) చాటున పెరుగుతాడు. కొరియర్ సర్వీస్ ఆఫీసులో పనిచేసే స్నేహితుడు (‘సత్యం’ రాజేష్) హీరోకు తోడు. స్నేహితుడి బదులు అనుకోకుండా కొరియర్ ఇవ్వడానికి వెళ్ళి, ఖాదీ భండార్‌లో పనిచేసే సూపర్వైజర్ గర్ల్ కావ్య (యామీ గౌతమ్)ను చూస్తాడు. చూడగానే ప్రేమలో పడతాడు. ఆమెకు వారానికి రెండో మూడో కొరియర్లు రాకపోతాయా, వాటిని ఇచ్చే మిషతో ఆమెకు దగ్గర కాకపోతానా అనే ఆలోచనతో అంతకు ముందు వద్దనుకున్న కొరియర్ బాయ్ ఉద్యోగంలో చేరతాడు. సినిమాకు మెయిన్ పాయింట్ మాత్రం మరోచోట ఉంటుంది. ఎక్కడో బుకారెస్ట్‌లో పరిశోధనలు చేస్తుంటాడు ఒక డాక్టర్ (అశుతోష్ రాణా). చూపు పోయిందనుకున్న వాళ్ళకు కూడా తన పరిశోధన ద్వారా చూపు తెప్పిస్తాడు. అయితే, ఆ పరిశోధన క్రమంలో అతని హాస్పిటల్లో గర్భవతులకు అర్ధంతరంగా అబార్షన్లు అవుతుంటాయి. ఆ అబార్షన్లకూ, ఈ పరిశోధనకూ చిత్రమైన సంబంధం ఉంటుంది. కోట్ల డాలర్లు సంపాదిస్తున్న ఆ డాక్టర్ అక్కడ పోలీసులు, దర్యాప్తుల గోల నుంచి తప్పించుకొనేందుకు మకాం ఇండియాకు మార్చేస్తాడు. హైదరాబాద్ కేంద్రంగా కార్పొరేట్ హాస్పిటల్ నడుపుతూ, తన పరిశోధన కోసం అబార్షన్ల రాకెట్‌ను గుడివాడ లాంటి చిన్న ఊళ్ళతో సహా తెలుగు నేల అంతటా విస్తరింపజేస్తాడు. ఆ అబార్షన్ల వెనుక ఉన్న రహస్యం ఏమిటన్నది గుడివాడ హాస్పిటల్‌లోని వార్డ్బాయ్ మాణిక్యం (‘అమృతం’ సీరియల్ ఫేమ్ వాసు ఇంటూరి)కి అనుకోకుండా తెలుస్తుంది. దాంతో ఆ వార్డ్బాయ్ ఈ వ్యవహారాన్ని రాష్ట్రంలో అవినీతి, అక్రమాలపై నిస్వార్థంగా పోరాడే హైదరాబాద్‌లోని సోషల్‌వర్కర్ సత్యమూర్తి (నాజర్)కి చేరవేయడానికి ప్రయత్నిస్తాడు. మందు చీటీల ప్రిస్క్రిప్షన్లు, గర్భవతులకు డాక్టర్లిస్తున్న అనుమానాస్పద ట్యాబ్లెట్ల సీసా కొరియర్ చేస్తాడు. హైదరాబాద్‌కు వెళ్ళిన ఆ కొరియర్ సంగతి విలన్ డాక్టర్ల బృందానికి తెలుస్తుంది. ఆ కొరియర్ డెలివరీ అనుకోకుండా మన కథానాయకుడు కల్యాణ్ పని కింద పడుతుంది. ఆ కొరియర్ గమ్యానికి చేరకూడదనీ, చేరినా వ్యవహారం సత్యమూర్తి ద్వారా మీడియాకు పొక్కకూడదనీ విలన్లు తంటాలు పడుతుంటారు. ఆ కథ తెలియని మన కొరియర్ బాయ్ కళ్యాణ్‌కు అసలు సంగతి ఎలా తెలిసింది? తెలిశాక ఏం చేశాడు? ఏమైందన్నది మిగతా సినిమా. గర్భస్రావాలకు లింక్ అయిన ఆ పరిశోధన ఏమిటన్న పాయింట్ తెరపై చూడాల్సిన సస్పెన్స్ పాయింట్. డ్యాన్స్... కెమేరా... యాక్షన్... హీరో ఇమేజ్ ఉన్న నితిన్ ఈ కామన్‌మ్యాన్ క్యారెక్టర్లో ఇమిడిపోవడానికి బాగానే ప్రయత్నించారు. కొన్ని సీన్స్‌లో అతని నటన, ముఖ్యంగా పాటల్లో వేసిన స్టెప్పుల కోసం అతను పడిన శ్రమ బాగుంది. ఖాదీ దుస్తుల సేల్స్‌గర్ల్‌గా యామీ గౌతమ్ పెద్దగా చేయడానికి ఏమీ లేదు. హర్షవర్ధన్, సురేఖావాణి పాత్రల పరిధి మేరకు నటించారు. ఇక, ‘సత్యం’ రాజేశ్‌తో పాటు సప్తగిరి, ‘గుండు’ సుదర్శన్, దువ్వాసి మోహన్, జెన్నీ లాంటి సుపరిచిత నటులు ఉన్న ఒకటి, రెండు సీన్స్‌లోనే కాసేపు వినోదం అందిస్తారు. యాక్షన్ సీన్లు, సెకండాఫ్ బైక్ ఛేజ్ సీన్ టెంపోతో నడుస్తుంది. కెమేరా వర్క్ కూడా బాగుంది. ముఖ్యంగా ఫస్టాఫ్‌లో కొన్ని షాట్లు, సీన్లో తానూ భాగమే అన్నట్లుగా కెమేరాతో పాటు ప్రేక్షకుల కళ్ళు ప్రయాణిస్తాయి. దర్శకుడు గౌతమ్ మీనన్ ఈ సినిమాకు కేవలం సమర్పకుడు, నిర్మాతే. కానీ, పబ్లిసిటీ చూసి ఆయన తరహా లవ్‌స్టోరీనో, యాక్షనో ఆశిస్తే చిక్కే! తమిళ టీవీ నటుడు ప్రేమ్‌సాయికి దర్శకుడిగా ఇదే తొలి సినిమా. రెండు భాషల్లో వేర్వేరు హీరోతో చేసిన ఈ ద్విభాషా చిత్రంలో తమిళ వాసన కనిపించకపోవడం చెప్పుకోదగ్గ విశేషం. కథకు కీలకమైన పాయింట్ ఏమిటనేది - టైటిల్స్ పడుతున్నప్పటి నుంచి సినిమా ఫస్టాఫ్ అంతటా ఒకటికి రెండు సంఘటనల ద్వారా చెబుతూ వచ్చారు. దాంతో, ఆ పాయింట్‌ను ఇంటర్వెల్ ముందు బయటపెట్టే సరికల్లా ప్రేక్షకుడు కూడా మానసికంగా ఒక క్లారిటీతో ఉంటాడు. సరైన టైమ్ చూసుకొని ఇంటర్వెల్ పడుతుంది. ఆ క్రమంలో ఆ కీలకమైన విషయం ఎలా బయటకొచ్చింది, అందుకోసం హీరో ఎలా పోరాడాడన్నవే సెకండాఫ్ ముప్పావు గంట! అయితే, క్లైమాక్స్‌కు వచ్చేసరికి కథ చాలా సింపుల్‌గా, అర్ధంతరంగా ముగించారేమోనన్న భావన కలిగే అవకాశం ఉంది. హీరో పాత ప్రొఫెషన్ తాలూకు నైపుణ్యాన్ని ఆఖరు క్షణంలో వాడటం బాగుంది. అక్క సెంటిమెంట్ అదనం చాలా చిన్న పాయింట్‌తో వచ్చిన ఈ చిన్న సినిమా నిడివి పరంగా కూడా చిన్నదే. నిజానికి ఈ కథకు బలమైన సెంటిమెంటల్ కోణం- హీరో అక్కాబావలకు కూడా పన్నెండేళ్ళుగా పిల్లలు పుట్టకపోవడం. రాక రాక గర్భం దాల్చిన హీరో అక్కకు కూడా విలన్ డాక్టర్ గర్భస్రావమయ్యే ఆ ట్యాబ్లెట్ల సీసా ఇవ్వడం! డాక్టరిచ్చిన ఆ మందు వేసుకోమని హీరోయే తన అక్క చేతికి ఇవ్వడం! ఈ సెంటిమెంటల్ ట్రాక్‌ను దర్శక-రచయిత ఎందుకనో పెద్దగా వాడుకోలేదు. దాన్ని కొంత పొడిగిస్తే, సినిమాకు లెంగ్త్‌తో పాటు లేడీస్ సెంటిమెంట్ కూడా బాగానే కలిసొచ్చేది. కాసేపు కాలక్షేపం కోసం వెళితే మాత్రం ఈ ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’ ఆశాభంగం చేయడు. ఇవాళ ఆ మాత్రం కరుణ చూపినా, ప్రేక్షకులు పరమానందభరితులై సినిమా చూసేస్తున్నారు కాబట్టి, ఈ సినిమాకే కాదు... పరిశ్రమ పచ్చగా కళకళలాడడానికీ అది ఉపయోగమే! -
ఈసారి దర్శకుడిగా నితిన్‌తో సినిమా చేస్తా : గౌతమ్‌మీనన్
‘‘నితిన్‌తో ‘కొరియర్‌బాయ్ కళ్యాణ్’ నిర్మాతగా లాంగ్ జర్నీ చేశా. అతనితో పనిచేయడం మంచి ఎక్స్పీరియన్స్. లవ్‌స్టోరీతో పాటు థ్రిల్లర్ ఎలిమెంటున్న ఫ్యామిలీ ఎంటర్ై టైనర్ ఇది. త్రివిక్రమ్‌తో నితిన్ చేస్తున్న ‘అ..ఆ..’ తర్వాత, నా దర్శకత్వంలో నితిన్ హీరోగా మంచి యాక్షన్ లవ్‌స్టోరీ సినిమా చేస్తా’’ అని దర్శకుడు గౌతమ్‌మీనన్ చెప్పారు. ఆయన సమర్పణలో నితిన్, యామీగౌతమ్ జంటగా తయారైన చిత్రం ‘కొరి యర్ బాయ్ కళ్యాణ్’. ప్రేమ్‌సాయి దర్శకుడు. ఈ 17న ఈ చిత్రం విడుదల. శనివారం హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లా డుతూ, ‘‘తమిళంలో కన్నా తెలుగులో ఇది భారీ చిత్రం. థియేటర్స ఖాళీ లేకపోవడంతో తమిళ వెర్షన్ (జై హీరోగా తయారైన ‘తమిళ్ సెల్వనుమ్- తనియార్ అంజలుమ్’) రెండు వారాల తర్వాత రిలీజవుతోంది’’ అని చెప్పారు. ‘‘ఓ అభిమాని ‘సీబికె’ అంటే కంటెంట్ బేస్డ్ కథ అని ట్వీట్ చేశాడు. నిజంగానే ఇది కంటెంట్ బేస్డ్ మూవీ. ఇమేజ్ను పక్కనపెట్టి కంటెంట్‌ను నమ్మి ఈ సినిమా చేశా. సిస్టర్ సెంటిమెంట్‌తో లాస్ట్ఫ్రేమ్ దాకా గ్రిప్పింగ్‌గా ఉంటుంది. ఇలాంటి సినిమాలు సక్సెసైతే మరిన్ని వైవిధ్యమైన కథలు వస్తా’’యని నితిన్ అన్నారు. -
కొరియర్ బాయ్ కళ్యాణ్
ప్రేయసిని ఇంప్రెస్ చేయడానికి పని లేని కల్యాణ్ ఉరఫ్ పీకె... కొరియర్ బాయ్ అవతారం ఎత్తాడు. లవ్‌స్టోరీ క్లయిమాక్స్‌కు వచ్చిందన్న అతని ఆనందాన్ని ఓ కొరియర్ కవర్ ఆవిరి చేసింది. మరి.. ఆ కవర్లో ఏముందో ఈ నెల 17న నితిన్ వెండితెర మీద చెబుతానంటున్నారు. ఆయన హీరోగా దర్శకుడు గౌతమ్ మీనన్ సమర్పణలో ప్రేమకథ నేపథ్యంలో సాగే సస్పెన్స్ థ్రిల్లర్‌గా ప్రేమ్‌సాయి తెరకెక్కించిన చిత్రం ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’. స్వతహాగా పవన్‌కల్యాణ్ అభిమాని అయిన నితిన్ ఈ చిత్రం టైటిల్‌ని ఎంతో ఇష్టంగా పెట్టుకు న్నారని, పవన్ అభిమా నులను అలరించే సన్నివేశాలు ఇందులో ఉన్నాయని గౌతమ్ మీనన్ చెప్పారు. -
వెంటనే ఓకే చెప్పేశా - నితిన్
‘‘నా మనసుకు చాలా దగ్గరైన సినిమా ఇది. ‘ఇష్క్’ తర్వాత రకరకాల కథలు వింటున్నప్పుడు గౌతమ్‌మీనన్ ఈ కథ గురించి చెప్పారు. కథ విని వెంటనే ఓకే చెప్పేశా’’ అని హీరో నితిన్ చెప్పారు. దర్శకుడు గౌతమ్‌మీనన్ సమర్పణలో నితిన్, యామీ గౌతమ్ జంటగా వెంకట్ సోమసుందరం, రేష్మ ఘటాల, సునీత తాటి నిర్మించిన చిత్రం ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’. ప్రేమ్‌సాయి దర్శకుడు. కార్తీక్, అనూప్ రూబెన్స్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన అఖిల్ మాట్లాడుతూ-‘‘గౌతమ్ మీనన్‌గారు డెరైక్ట్ చేసిన సినిమాల్లో కథలు చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. తొలి సారిగా ఆయన తెలుగులో నిర్మించిన ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘ప్రేమ్‌సాయి చాలా ఆసక్తికరమైన కథాంశంతో ఈ చిత్రాన్ని చాలా బాగా తీశారు. అన్ని కష్టాలను దాటి ఇప్పుడు ఈ సినిమాతో ముందుకు వ స్తున్నాం’’ అని నిర్మాత గౌతమ్‌మీనన్ తెలిపారు. నితిన్‌తో కలిసి పనిచేయడం మంచి ఎక్స్పీరియన్స్ అని దర్శకుడు ప్రేమ్‌సాయి అన్నారు. ఈ వేడుకలో రచయిత కోన వెంకట్, హీరోలు నాగైచె తన్య, నాని, రానా, నిర్మాతలు ‘మల్టీ డైమన్షెన్’ రామ్మోహనరావు, సునీత తాటి తదితరులు పాల్గొన్నారు. -
లవ్ స్టోరీస్ పై కన్నేసిన నితిన్
-
నితిన్ సరసన రకుల్...?
నితిన్ సరసన రకుల్ ప్రీత్‌సింగ్ నటించబోతున్నారా? అవునంటున్నాయి సినీ వర్గాలు. మల్లిడి వేణు అనే నూతన దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించనున్నారని, జూన్ నుంచి ఈ సినిమా స్టార్ట్ అవుతుందని సమాచారం. -
లవర్ బాయ్ కాదు - కొరియర్ బాయ్
-
మరో లవ్ స్టోరీకి గ్రీన్ సిగ్నల్
-
కామెడీ క్లాస్-వేణు మాధవ్
*కామెడీ క్లాస్ : వేణు మాధవ్ *ఆ సీన్ గుర్తొస్తే... దిల్ షూటింగ్... వినాయక్ లాంటి పెద్ద దర్శకుడితో పనిచేయడం... ఆ సినిమాలో నాది ఫుల్‌లెంగ్త్ క్యారెక్టర్ కావడంతో మంచి ఊపు మీదున్నా. పల్లెటూర్లో సీన్. విలన్ ఇంటికి నేను, నితిన్ వెళతాం. నితిన్ దొంగతనంగా అటకెక్కేస్తాడు. ఇంట్లోకి వెళితే విలన్ చంపేస్తాడని గ్యారంటీగా తెలుసు కాబట్టి... ఎక్కడ దాక్కోవాలో తెలీక రోడ్లు పట్టుకుని తిరుగుతుంటా. ఓ పిల్లగ్యాంగ్ పేకాడుతూ కనపడితే... వాళ్ల చేత ‘పైసల్తియ్యి బే’ అని మర్యాదగా పిలిపించుకుని నేనూ కార్డ్స్ పట్టుకుంటా. ఆడాలంటే గేదెను కదలకుండా పట్టుకోవాలనేది కండిషన్. కార్డ్స్ చేతిలో ఉన్నాయి కాబట్టి... తాడును నడుముకి చుట్టుకుంటా. అది అటూ ఇటూ కదులుతూంటుంది. చిర్రెత్తి ‘నీ తల్లి...’ అని తిడతా. అసలే బర్రె. మనకి పాలు ఇచ్చి పోషించేది... తిడుతుంటే ఊరుకుంటదా... కుప్పలు, వరికుప్పలు తేడా లేకుండా అది రన్నింగ్... దాని తాడు మన నడుముకు ఉంది కాబట్టి వెనుకే నేను దొర్లింగ్.. ఈ సీన్ గుర్తొస్తే మీరంతా లాఫింగ్ కదా. షూటింగ్ అయిపోయాక ఇంటికెళ్లిన దగ్గర్నుంచి నాకు వామిటింగే. అప్పటికీ వినయ్ అన్న (వినాయక్) చెప్పాడు కూడా... వేణూ... డూప్‌ని పెడదాం అని. నేను వింటే కదా... బ్యాడ్‌టైమ్... సారీ బర్రె టైమ్. చిన్నతనంలోని సరదాలు మా ఊరు కోదాడ. టూరింగ్ టాకీస్ లాంటి చిన్న థియేటర్లలో ఏఎన్నార్, ఎన్టీయార్... సినిమాలు ఆడుతుండేవి. కొత్త బొమ్మ వచ్చిందని రిక్షాకు మైక్ పెట్టి ఎనౌన్స్ చేస్తూండేవారు. మైక్రిక్షా కనపడితే ఎక్కడలేని సంతోషం! దాని మీదకి ఒక్క ఎగురు ఎగిరి నేను మైక్ పట్టుకునేవాడ్ని. మన గొంతు ఊరంతా వింటుంటే గొప్పగా ఉండేది. ఇందులో చిన్న ఇబ్బంది ఏమిటంటే... ఈ గొంతు మా అన్నయ్యలిద్దరికీ వినపడేది. దీంతో నన్ను వెతుక్కుంటూ వచ్చి, నిక్కరు విప్పి మరీ ఉతుక్కుంటా తీసుకుపోయేవారు. అమ్మా అన్నలు ‘కొట్టిన్రు చూడే’ అంటే అమ్మ అయ్యో అనకుండా... పాత చీపురు తీసుకుని తన వాటా తను పూర్తి చేసేది. హు... ఆ రోజులే వేరులెండి. బ్రేక్ తర్వాత... బ్రహ్మానందం అంటే పాతకక్షలున్నాయి. అందుకే ఫస్ట్ మారుతి కారు కొన్నప్పుడు ఎమ్మెస్ అన్ననొక్కడ్నే ఎక్కన్నా అని పిలిచా. ఆయనింటే కదా. ‘‘బ్రహ్మానందాన్ని కూడా పిలవరా, బాగోదు’’ అంటూ పోజు కొట్టి నేను బ్రహ్మానందాన్ని కూడా పిలిచేలా చేశాడు. ఓ శుభముహూర్తాన ఊరి శివార్లలో షూటింగైపోయాక ఇద్దర్నీ కారెక్కించుకున్నా. కాసేపు మంచిగానే నడిపి... తర్వాత సూపర్‌స్పీడ్‌లో మెలికలు తిప్పేశా. ఎమ్మెస్సన్న కంగారు. ‘అరేయ్ ఆపరా’ అంటూ అరుపులు. నేనేమో కారు నడుపుతూ సీలింగ్ వంక కంగారుగా చూడడం... దీంతో ఎమ్మెస్ అన్న ‘ఏరా ఏంటి వెతుకుతున్నావ్?’ అని కంగారుగా అడిగితే, ‘‘బ్రేక్ అన్నా, పైన ఎక్కడో ఉండాలి కనపడట్లే’’ అన్నా. ఇగ చూస్కోండి... కారాపాక బ్రహ్మానందం గంటన్నర పాటు నవ్వీ నవ్వీ... రిపోర్టింగ్ : ఎస్.సత్యబాబు -
పడి లేచారు..!
పంచామృతం: ఇక అయిపోయిందనుకున్నారంతా. కోలుకోవడం కష్టమే.. అనే అభిప్రాయాలూ వినిపించాయి. గతంలో ఎంతో వైభవాన్ని చూశారు... రకరకాల కారణాలతో విరామం లేదా, వైఫల్యాల వల్ల కొంత ఇబ్బందిని కూడా ఎదుర్కొన్నారు. అయితే తిరిగి బంతిలాగా దూసుకురావడమే వీరి గొప్పదనం. మళ్లీ తమ సత్తా, స్థాయి ఏమిటో చూపిస్తున్నారు. వీరు వ్యక్తిగతంగా వెలుగుతున్నవారే కాదు, వర్తమానంలో ఇబ్బందులు ఎదుర్కొనే వారికి స్ఫూర్తిప్రదాతలు కూడా! అమితాబ్ బచ్చన్ ఈ సూపర్‌స్టార్ కమ్‌బ్యాక్ ఒక వ్యక్తిత్వ వికాస పాఠమే అవుతుంది. సినిమాల ఫెయిల్యూర్లు, ఏబీసీఎల్ నష్టాలు అమితాబ్ కథ అయిపోయిందనిపించాయి. ఆ సమయంలో అమితాబ్ అప్పుల పద్దు గురించి మీడియాలో రకరకాల వార్తలు వచ్చాయి. అయితే అమితాబ్ అలాంటి దశను అధిగమించాడు. కౌన్‌బనేగా కరోడ్‌పతి ద్వారా, సినిమాల ద్వారా తన స్థాయి ఏమిటో తెలియజెప్పాడు! నితిన్ వరస ఫెయిల్యూర్లు... కొన్ని సినిమాలు అయితే ఎప్పుడొచ్చి వెళ్లాయో కూడా చాలామందికి తెలియని పరిస్థితి. తొలి సినిమాతోనే టాలీవుడ్లో మంచి గుర్తింపు సొంతం చేసుకొన్న నితిన్‌ను మధ్యలో కొన్ని రోజులు వరసగా వైఫల్యాలు వెంబడించాయి. అయితేనేం.. ‘ఇష్క్’తో మళ్లీ నితిన్టైమ్ స్టార్ట్ అయ్యింది. ఫామ్‌లోకి వచ్చిన బ్యాట్స్‌మన్‌లా ఇప్పుడు చెలరేగుతున్నాడు ఈ హీరో! సల్మాన్ ఖాన్ వరస వివాదాలు.. పోలీస్ కేసులు, చెడ్డపేరు... దాదాపు దశాబ్దం కిందట సల్మాన్ పరిస్థితి ఇది. బాలీవుడ్ బ్యాడ్‌బాయ్ ఇమేజ్ను తెచ్చేసుకున్నాడు ఈ హీరో. ఇండస్ట్రీకి హిట్స్‌ను ఇచ్చి ఎంతో అభిమానగణాన్ని సంపాదించుకొన్న సల్మాన్... తాగి కారు నడిపిన కేసులో, కృష్ణజింకలను వేటాడిన కేసులోనూ దోషిగా ఉన్నాడు. ఇలాంటి ఇబ్బందికరమైన దశను తన సినిమాల ద్వారానే సల్లూ అధిగమించాడు. కేసులు కొనసాగుతున్నా... సినిమాల ద్వారా అలరిస్తూ అభిమానుల మనసులను అయితే గెలుచుకున్నాడు. టైగర్ వుడ్స్ దాదాపు ఐదేళ్ల క్రితం అమెరికన్ గోల్ఫ్ ఆటగాడు టైగర్ వుడ్స్ తీవ్ర మైన వివాదాల్లో కూరుకున్నాడు. ఎంతో అభిమానగణాన్ని కలిగిన వుడ్స్పై తీవ్రమైన ఆరోపణలు వినిపించాయి. అనేక మంది మహిళలు ‘మాకు వుడ్స్‌తో లైంగిక సంబంధముంది’ అని ప్రకటించుకున్నారు. కొన్ని నెలల పాటు వుడ్స్ శృంగారలీలలు అమెరికన్, ప్రపంచ మీడియాకు మంచి మేత అయ్యాయి. అలాంటి వార్తలు వుడ్స్ వ్యక్తిగత, క్రీడాజీవితాలను దెబ్బతీశాయి. ఎండార్స్మెంట్ ఆదాయంపై కూడా దెబ్బకొట్టాయి. అయితే అదంతా గతం. ఇప్పుడు.. వుడ్స్ ఆటలో మళ్లీ చాంపియన్. ఎండార్స్మెంట్ విషయంలో కూడా! ఆండ్రీ అగస్సీ 1992లో అందుకొన్న తొలి టైటిల్‌తో అగస్సీ ప్రభ మొదలైంది. అయితే కెరీర్ ఆరంభంలో టాప్‌టెన్ స్థాయి ర్యాంకింగ్స్‌లో ఉన్న అగస్సీ ర్యాంక్ ఒకదశలో 141కి పడిపోయిందంటే ఆశ్చర్యం కలగకమానదు. కుటుంబపరమైన సమస్యలు, ఫామ్‌లేమి కలసి 1997ల నాటికి అగస్సీ కథ అయిపోయిందనే అభిప్రాయాన్ని కలిగించాయి. అయితేనేం.. లెజెండరీ ఆటగాడు మళ్లీ పంజా విసిరాడు. 1999 తర్వాత వరుసగా నాలుగు గ్రాండ్‌స్లామ్‌లు గెలిచి గ్రాండ్‌గా టెన్నిస్ నుంచి విరామం తీసుకొన్నాడు. -
శ్రీవారి సన్నిధిలో హీరో నితిన్
-
తొలిప్రేమలాగా 'చిన్నదాన నీకోసం' కూడా
తిరుమల : ఈ నెల 25న విడుదల కానున్న 'చిన్నదాన నీకోసం' సినిమా ప్రతిఒక్కర్నీ ఆలరిస్తుందని హీరో నితిన్ ధీమా వ్యక్తం చేశాడు. కుటుంబమంతా కలిసి చూడదగ్గ చిత్రమని నిత్ తెలిపాడు. వచ్చే గురువారం సినిమా విడుదల సందర్భంగా.... నితిన్ కుటుంబ సభ్యులతో కలిసి శనివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు. దర్శనాల విరామ సమయంలో అతను స్వామివారి సేవలో పాల్గొన్నాడు. అనంతరం అర్చకులు నితిన్‌ను ఆశీర్వదించి తీర్ధప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా చిత్ర విజయంపై ఇష్క్ హీరో ధీమా వ్యక్తం చేశారు. తన ప్రతి సినిమా విడుదలకు ముందు స్వామివారిని దర్శించుకోవటం తనకు సెంటిమెంట్‌గా మారిందన్నాడు. తొలిప్రేమ చిత్రంలాగా 'చిన్నదాన నీకోసం' కూడా అందర్ని ఆకట్టుకుంటుందన్నాడు. ప్యూర్ లవ్ స్టోరీతో పాటు కామెడీ కూడా ఉంటుందని తెలిపాడు. గత రెండు సినిమాల్లో పాటలు పాడిన... తాను ఈ చిత్రంలో పాట పాడలేదని...విలేకర్ల అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు. ఇక 'కొరియర్ బాయ్ కళ్యాణ్' సినిమా మార్చిలో ప్రేక్షకుల ముందుకు వస్తుందని చెప్పాడు. ఈ సందర్భంగా నితిన్‌తో ఫోటోలు దిగేందుకు పలువురు పోటీ పడ్డారు. -
కుర్ర హీరోలు.. దూసుకుపోతున్నారు..!
-
పవన్ ఫోటోకో ముద్దు!
హైదరాబాద్: అభిమానులు లేకుంటే ఏ హీరో లేడని నితిన్ అన్నారు. జయాపజయాలతో సంబంధం లేకుండా కథానాయకులకు అండగా నిలిచేది అభిమానులేనని పేర్కొన్నారు. తాను హీరోగా నటించిన 'చిన్నదాన నీ కోసం' ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం గురువారం సాయంత్రం జరిగింది. ఈ సందర్భంగా నితిన్ మాట్లాడుతూ... కాలు బెనకడంతో ఈ సినిమాలో ఓ పాటకు డాన్స్ సరిగా చేయలేకపోయానని తెలిపారు. ఇందుకు ఫ్యాన్స్ తనను క్షమించాలని వేడుకున్నారు. అభిమానులు చూపిస్తున్న ప్రేమతోనే ఇంత కష్టపడుతున్నానని చెప్పారు. తనపై చూపిస్తున్న అభిమానానికి ధన్యవాదాలు తెలిపారు. తామంతా పవన్ కళ్యాణ్ అభిమానులమని పునరుద్ఘాటించారు. ఈ సందర్భంగా ఓ అభిమాని పవన్ కళ్యాన్, నితిన్ చిత్రపటాన్ని ఆయనకు బహూకరించారు. పవన్ కళ్యాణ్ చిత్రాన్ని ముద్దాడి నితిన్ తన అభిమానాన్ని సభాముఖంగా చాటారు. పవన్ ఫోటో ఎక్కడ పెట్టుకుంటారని అడగ్గా... ఆయన తన గుండెల్లో ఉన్నారంటూ నితిన్ జవాబిచ్చారు. 'చిన్నదాన నీ కోసం' సినిమా అందరికీ నచ్చుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో హీరోయిన్ మిస్తీ, దర్శకుడు కరుణాకరన్, నిర్మాతలు సుధాకర్‌రెడ్డి, నిఖితారెడ్డి, సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ తదితరులు పాల్గొన్నారు. చివర్లో చిన్నదాన నీ కోసం పాటకు నితిన్, మిస్తీ స్టెప్పులు వేసి అభిమానులను అలరించారు. -
అదాశర్మ... అప్పుడే టీవీకా?!
అందచందాలు మెండుగా ఉన్నా అందరూ సినిమాల్లో రాణించలేరని అదాశర్మని చూస్తే అర్థమవుతుంది. ‘1920’ చిత్రంలో దెయ్యం పట్టిన పిల్లగా నటించి అదరగొట్టిన అదా... ఆ తర్వాత మరికొన్ని సినిమాలు చేసింది. తెలుగులో నితిన్ సరసన ‘హార్ట్ అటాక్’లోనూ నటించింది. కానీ కలసి రాలేదు. దాంతో బుల్లితెరకు బయలుదేరిందని తెలుస్తోంది. బాలీవుడ్ నిర్మాత, దర్శకుడు విపుల్ షా తీయబోతోన్న సీరియల్లో అదా ప్రధాన పాత్రలో నటించబోతోందట. దాంతో అదా అప్పుడే సీరియల్స్‌కి వెళ్లడమేంటని కొందరు అంటున్నారు. ఏం చేస్తుంది పాపం! చాన్సుల కోసం చూసి చూసి విసిగిపోయి ఉంటుంది. అయినా బుల్లితెరకి రావడం ఆమెకు బాధాకరమేమో కానీ, అంత చక్కని అమ్మాయి సీరియల్స్‌లో కనిపించడమంటే టెలివిజన్ ప్రేక్షకులకు సంతోషకరమైన విషయమే! -
రాఖీ కట్టి రూ.3 లక్షలు కొట్టేసింది
అన్న చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ. సోదరీమణులు రాఖీలు కట్టి స్వీట్లు పంచి పెట్టడం, అన్నదమ్ములు బహుమతులు ఇవ్వడం ఈ పండుగ సంప్రదాయం. సాధారణ ప్రజల నుంచి సెలబ్రెటీల వరకూ సోదరులు తమ స్థాయిలో అక్కాచెల్లెళ్లకు బహుమతులు ఇస్తుంటారు. అయితే కొంతమంది సరదాగానే తమ సోదరుల నుంచి ముక్కు పిండి మరీ బహుమతులు వసూలు చేస్తుంటారు. ఇక సెలబ్రెటీల విషయానికి వస్తే టాలీవుడ్ హీరో మంచు విష్ణు రాఖీ బహుమతిపై స్పందించాడు. ''మామూలుగానే లక్ష్మి మా నుంచి గిప్ట్‌లు డిమాండ్ చేస్తుంది. ఇక రాఖీ పండుగకి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. లాస్ట్ ఇయర్ రాఖీ కట్టి రూ.3 లక్షలు డిమాండ్ వసూలు చేసింది. దాంతో ఆమె తనకు కాల్సినవి కొనుక్కుంది. ఒకవేళ మనోజ్ ఆ సమయంలో వేరే ప్రాంతంలో ఉంటే, అతని కోటా కూడా నా నుంచే వసూలు చేస్తుంది'' అని విష్ణు మురిపెంగా చెప్పటం విశేషం. హీరో ఆది తన అక్క జ్యోతిర్మయికి రాఖీ సందర్భంగా ఈసారి కారు ప్రజెంట్ చేయబోతున్నాడు. సినిమా ప్రమోషన్ సందర్భంగా ఈసారి తన సోదరి దగ్గరకు బెంగళూరు వెళ్లలేకపోతున్నానని, అలాగే ఆమె కూడా కుటుంబంతోను, డాక్టర్ కావడంతో తన వృత్తిలోను బిజీగా ఉన్నందున కలవలేకపోయినట్లు తెలిపారు. అయితే జ్యోతిర్మయి తనకు రాఖీ పంపిందని, ఈసారి ఆమెను కలిసినప్పుడు కారును గిప్ట్గా ఇవ్వనున్నట్లు చెప్పాడు. ఇష్క్‌తో లైమ్‌లైట్‌లోకి వచ్చిన యువ హీరో నితిన్ తన సోదరి నిఖితకు ఫర్నిచర్ ప్రజెంట్ చేస్తున్నాడు. తామిద్దరూ రెగ్యులర్‌గా కలుస్తామని, తన సోదరి ఇటీవలే గెటెడ్ కమ్యూనిటీలో విల్లా కొనుగోలు చేసిందని... ఆ ఇంటికి కావల్సిన ఫర్నిచర్‌తో పాటు అవసరమైనవి కొనిపెడుతున్నట్లు నితిన్ తెలిపాడు. రన్ రాజా రన్ అంటూ దూసుకొచ్చిన హీరో శర్వానంద్....తన యంగర్ సిస్టర్స్‌తో ధూమ్ ధామ్‌గా రాఖీ పౌర్ణమిని జరుపుకున్నాడు. ఓ అక్క యూఎస్‌లో, మిగతా ఇద్దరు హైదరాబాద్‌లోనే ఉంటారని తెలిపాడు. అక్క అక్కడ నుంచి తనకు రాఖీ పంపిందని, ఇక మిగతా ఇద్దరితో కలిసి డిన్నర్‌కి వెళ్లి ఎంజాయ్ చేసినట్లు తెలిపాడు. అక్క చెల్లెళ్లతో కలిసి గడిపేందుకు, గిప్ట్‌లు ఇచ్చేందుకు రాఖీ పండుగ చక్కని అవకాశమని శర్వానంద్ తెలిపాడు. వచ్చే వారం తన సోదరి దగ్గరకు యూఎస్ వెళుతున్నట్లు చెప్పాడు. -
చిన్నదాన నీకోసం...
గతుకుల రోడ్డుపై ప్రయాణిస్తున్న కారు... ఒక్కసారి హైవే ఎక్కితే ఎలా ఉంటుంది? అచ్చంగా నితిన్ కెరీర్ అలాగే ఉంది. వరుస విజయాలతో విమాన వేగంతో దూసుకుపోతున్నాడు నితిన్. ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే, హార్ట్ ఎటాక్ చిత్రాలతో హ్యాట్రిక్ కొట్టేశాడు. ఈ విజయాలను ఇలాగే కొనసాగించాలనే దృఢ నిశ్చయంతో ఉన్నాడు నితిన్. అందుకే తన ఇమేజ్‌కు తగ్గట్టుగా చక్కని ఫీల్‌గుడ్ లవ్స్టోరీలనే ఎంచుకుంటున్నాడు. ప్రస్తుతం కరుణాకరన్ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు ‘చిన్నదాన నీకోసం’ అనే పేరును ఖరారు చేశారనేది తాజా సమాచారమ్. తను నటించిన ‘ఇష్క్’ చిత్రంలోని ‘చిన్నదాన నీకోసం...’పాట పల్లవిలోని తొలి పదాన్నే తన సినిమా టైటిల్‌గా చేసుకోవడం విశేషం. నితిన్ సొంత నిర్మాణ సంస్థలో ఈ చిత్రం రూపొందుతోంది. -
ఈ ‘కేవ్’ ఓనర్ పూరీ జగన్నాథ్!
సీన్ నం.1 ఎనిమిది నెలల క్రితం... హైదరాబాద్ జూబ్లీ హిల్స్‌లోని రోడ్ నం. 31లో ఓ పాత బిల్డింగ్‌ను కూలగొడుతున్నారు. మొత్తం కూల్చేసి పునాదులు తీయడానికే చాలా రోజులు పట్టింది. కట్ చేస్తే... సీన్ నం.2 2014 జూలై 31... ఇప్పుడా ప్లేస్‌లో "cave'వెలిసింది. ‘కేవ్’ అంటే గుహ. మామూలుగా గుహలుండేది కొండల్లో. మరి నగరం మధ్యలో ఈ ‘కేవ్’ ఏంటి? ఆ ‘కేవ్’కి "restricted'అంటూ గేట్ ఏంటి? ‘సాక్షి’కి మాత్రమే "unrestricted'ఎంట్రీ దొరకడమేంటి? ఎన్నెన్నో నిర్మాణ విశేషాలున్న ఈ ‘కేవ్’ గురించి ఓనర్ పూరీ జగన్నాథ్‌నే అడిగేస్తే పోలా..! మీ ఆఫీస్ అదిరింది... మీ టేస్ట్ కనబడుతోంది... పూరీజగన్నాథ్: థ్యాంక్యూ... ఎన్టీఆర్, ప్రభాస్, రవితేజ, నితిన్, రామ్‌గోపాల్‌వర్మ, ప్రకాశ్‌రాజ్, చార్మి, రానా వచ్చారు. వాళ్లకైతే పిచ్చపిచ్చగా నచ్చేసింది. ఎన్టీఆర్ అయితే అప్పటికప్పుడు బోస్ కంపెనీ వాళ్ళ సింగిల్ టవర్ కాన్సెప్ట్ స్పీకర్ తెప్పించి నాకు గిఫ్ట్‌గా ఇచ్చారు. ఇలాంటి ఆఫీస్‌లో ఇలాంటివే ఉండాలని చెప్పారు. రామూ గారు మా ఆఫీస్ స్టాఫ్‌ను పిలిచి ‘‘మీ ఆఫీస్ ఇంత టేస్ట్‌ఫుల్‌గా ఉంది కదా. మీరు రెగ్యులర్ జీన్స్, షర్ట్స్‌లో రావద్దు. బెర్ముడాలు, టీ షర్ట్స్ వేసుకు రండి’’ అని చెప్పారు. ఆఫీస్ చూడడం కోసం రోజూ చాలామంది వస్తున్నారు. ఇండియాలోనే ఇలాంటి సినిమా ఆఫీస్ లేదని అందరూ అంటున్నారు. సినిమాకి ఫస్ట్‌లుక్ ఇచ్చినట్లుగా, ఈ ఆఫీస్ ఫస్ట్‌లుక్ మీడియాలో ఫస్ట్ మీకే ఇస్తున్నా... అందుకే మిమ్మల్ని ఆహ్వానించా... అసలు ఇంత భారీ స్థాయిలో, అత్యాధునికంగా ఆఫీసు కట్టాలని ఎందుకనిపించింది? పూరీజగన్నాథ్: నేను ఎనిమిదో తరగతిలో ఉన్నప్పుడే మా కాలనీలో ఓ చిన్న గది అద్దెకు తీసుకుని పర్సనల్ ఆఫీస్ ఏర్పాటు చేసుకున్నా. రాసుకోవడం, బొమ్మలు వేసుకోవడం లాంటివి అక్కడే చేసేవాణ్ణి. మా ఇంట్లో వాళ్లకు ఆ విషయం తెలీదు. ఒకసారి అనుమానమొచ్చి అడిగితే, ఏదో చెప్పి కవర్ చేశా. నాకంటూ పర్సనల్‌గా ఓ స్పేస్ ఉండాలనేది మొదట్నుంచీ నా కోరిక. మామూలుగా అందరికీ హాలీడే అంటే పనిచేయని రోజు. నాకు మాత్రం పనిచేస్తేనే హాలీడే. సో, మనం పనిచేసే ఏరియా హాలీడే మూడ్‌లో ఎగ్జైటింగ్‌గా ఉండాలి. అందుకే ఈ ఆఫీస్. అయినా నేను ఇంట్లో కన్నా ఎక్కువ ఆఫీస్‌లోనే ఉంటాను. అదొక రీజన్. సినిమా ఎంత స్పీడ్‌గా తీస్తారో ఆఫీస్ కూడా అంత స్పీడ్‌గా కట్టించేసినట్టున్నారు? పూరీజగన్నాథ్: (నవ్వుతూ) అవును. కేవలం 8 నెలల్లో ఈ బిల్డింగ్ రెడీ అయిపోయింది. హైదరాబాద్‌లో ఇంత ఫాస్ట్‌గా ఏ బిల్డింగూ రెడీ అయి ఉండదు. ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఇంత గొప్పగా ఆఫీస్ కట్టుకోవడం ఎలా అనిపిస్తోంది? పూరీజగన్నాథ్: నా టైమ్ బావుందంతే! మధ్యలో మీ టైమ్ బాగోలేనట్టుంది? పూరీజగన్నాథ్: నేను నమ్మే కాన్సెప్ట్ ఎప్పుడూ ఒక్కటే... ‘నథింగ్ ఈజ్ పర్మినెంట్’. మంచి అయినా, చెడు అయినా ఏదీ శాశ్వతం కాదు. అంత పర్మినెంట్ కానప్పుడు ఇంత డబ్బు ఖర్చుపెట్టి, ఆఫీసు కట్టడం అవసరమా? పూరీజగన్నాథ్: (నవ్వుతూ) మీరు ఇది బిల్డింగ్ అనుకుంటున్నారా..? కేవ్ అండీ బాబూ. ఇంతకు ముందు మీ పాత ఆఫీస్ కూడా చాలా క్రియేటివ్‌గా ఉండేది కదా. దాన్నెందుకు తీసేశారు? పూరీజగన్నాథ్: అవును... అప్పట్లో ఆ ఆఫీస్ కూడా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ. అయితే దాన్ని టెంపరరీగానే కట్టా. ఒక దశలో అప్పుల పాలై ఆ ఆఫీసు అమ్మేశా. ‘బిజినెస్‌మేన్’ సినిమా తర్వాత పుంజుకుని ఈ ఆఫీసు కొని, ఇక్కడున్న పాత బిల్డింగ్ పడగొట్టి నా డ్రీమ్ ఆఫీస్ కట్టుకున్నా. ఇందులోనే నా రెసిడెన్స్ కూడా. మీ ఆఫీస్ ఎంత బాగుందో, మీ హోమ్ థియేటర్ అంతకన్నా బాగుంది... పూరీజగన్నాథ్: నేనెక్కువ గడిపేది హోమ్ థియేటర్లోనే. యాపిల్ ఐ ట్యూన్స్ ద్వారా ఏ సినిమా కావాల్సి వస్తే, ఆ సినిమా ఇక్కడ చూడొచ్చు. అంతా శాటిలైట్ టెక్నాలజీ. మన అరచేతిలో వరల్డ్ సినిమా మొత్తం ఉన్నట్టే. ఒక్క సినిమాలు అనేకాదు, పాటలు, డాక్యుమెంటరీలు, టీవీ షోలు... ఇలా అన్నీ చూడొచ్చు. జస్ట్ ఐ ప్యాడ్ ద్వారానే కూర్చున్న చోట నుంచి కదలకుండా ఇవన్నీ ఆపరేట్ చేయొచ్చు. లైట్స్ ఆన్ అండ్ ఆఫ్, ఏసీ ఆపరేటింగ్ కూడా ఐ ప్యాడ్ ద్వారా చేసుకోవచ్చు. సినిమాలు చూడనప్పుడు దీన్ని డ్రాయింగ్ రూమ్‌లా కూడా వాడుకోవచ్చు. కర్టెన్స్ ఓపెన్ చేసుకుంటే, చుట్టూ ఉన్న ప్రకృతిని ఆస్వాదిస్తూ సరదాగా ముచ్చట్లాడుకోవచ్చు. ఒకసారి పైకి చూడండి. పైన సీలింగ్‌కి వాడిన వాల్‌పేపర్‌కు ఓ స్పెషాల్టీ ఉంది. లండన్‌లో ఫేమస్ ప్లే అయిన ‘ఫ్యాంటమ్ ఆఫ్ ది ఓపెరా’ వాల్ పోస్టర్ అది. ఆ నాటకం గొప్పతనం ఏంటంటే - గత యాభై ఏళ్లుగా నిర్విరామంగా ప్రదర్శిస్తూనే ఉన్నా, ఇప్పటికీ అది హౌస్‌ఫుల్లే. ఇక్కడ వాడిన ఆడియో సిస్టమ్స్ కూడా చాలా అత్యాధునికం. హైదరాబాద్‌లో ఈ తరహా సిస్టమ్ ఇదే మొట్టమొదటిదట. ఈ ఆఫీస్ డిజైనింగ్ ఆలోచన అంతా మీదేనా? పూరీజగన్నాథ్: జయకిరణ్ అని హైదరాబాద్‌లో ఫేమస్ ఆర్కిటెక్ట్. నా స్నేహితుల ఇళ్లల్లో ఆయన వర్క్ చూసి, ఈ ప్రాజెక్ట్ అప్పగించా. ఆయనతో గంటలు గంటలు కూర్చొని నా పిచ్చి అంతా చెప్పా. దానికి తగ్గట్టే ఆయన డిజైన్ చేశారు. ఫ్లోరింగ్ అంతా చాలా కొత్తగా ఉంది! పూరీజగన్నాథ్: నాకు రెగ్యులర్ ఫ్లోరింగ్ నచ్చదు. ఇలా పాలిపోయినట్టుగా, రస్టిక్‌గా ఉంటేనే ఇష్టం. క్యాలిఫోర్నియా స్లేట్ని కొన్ని గోడలకు వాడాం. స్పెయిన్ నుంచి ఆర్డర్ చేసిన ఉడెన్ ఫ్లోర్లా అనిపించే టైల్స్ మరికొన్ని చోట్ల వాడాం. అంతా రెడీ అయ్యాక ఫ్లోర్స్‌ను క్లీన్ చేయడానికి కొంతమంది వచ్చారు. ఆ టైమ్‌లో ఒకామె నాతో అన్న మాటలు విని నాకు నవ్వొచ్చింది. ‘‘ఏం సార్... ఇంత పెద్ద బిల్డింగ్ కట్టుకున్నారు. ఫ్లోరింగ్ మాత్రం సెకండ్ హ్యాండ్ కొన్నారేం’’ అందామె. ఆ డిజైనింగ్ అలా ఉంటుందని ఆమెకు తెలియదు కదా. ఇంతకూ మీ హోమ్ స్టూడియోకు ‘కేవ్’ అనే పేరు ఎందుకు పెట్టినట్టు? పూరీజగన్నాథ్: ప్రపంచం ఓ అడవి లాంటిది. అందులో నేనో జంతువును. నేను ఉండడానికి ఓ కేవ్ దొరికిందంతే. సరే... దీనికి ఎంత బడ్జెట్ అయ్యింది? పూరీజగన్నాథ్: ఇప్పుడు అవసరమా! ముందు మంచి కాఫీ తాగండి. మా ఆఫీస్‌లో కాఫీ బార్ కూడా ఉంది. కేపర్చినో, ఎక్స్‌ప్రెసో... ఇలా ఏది కావాల్సి వస్తే అది తాగొచ్చు. - పులగం చిన్నారాయణ The Man Behind.... ఆర్కిటెక్ట్‌గా నా కెరీర్ 1998లో మొదలైంది. ఇప్పటివరకూ ఉన్న నా క్లయింట్స్ అందరిలోకెల్లా పూరీగారు డిఫరెంట్. ఫలానాది వాడుతున్నామంటే ‘ఓకే’ అనేసేవారు. నాకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు. పూరీ గారితో వర్క్ చేయడం వెరీ ఫన్. నా ఐడియాలను బాగా గౌరవించేవారు. ఆయన బిహేవియర్ ప్యాట్రన్‌ను దృష్టిలో పెట్టుకునే, ఈ ఆఫీస్ డిజైన్ చేశాం. ఆయనకు ప్రకృతి ఇష్టం కాబట్టి, చుట్టూ చెట్లు, మొక్కలు, పచ్చదనానికి ప్రాధాన్యమిచ్చాం. ఆయనకు బ్లాక్ అంటే ఇష్టం. ఆందుకే ఈ ఆఫీస్‌లో ఎక్కువ అంశాలు బ్లాక్ కలర్లో కనిపిస్తాయి. ఆయన చాలా ఇన్ఫార్మల్గా ఉంటారు. అందుకే ఆఫీస్‌ను కూడా ఇన్ఫార్మల్గా డిజైన్ చేశాం. 18,000 చదరపు అడుగుల్లో ఈ ఆఫీస్ కట్టాం. గ్రౌండ్ ఫ్లోర్ అంతా పార్కింగ్‌కు ఉంచేశాం. ఫస్ట్ ఫ్లోర్ సినిమా ఆఫీస్. సెకండ్ ఫ్లోర్లో జగన్‌గారి పర్సనల్ రూమ్, లైబ్రరీ, ఫొటోసెషన్ రూమ్‌తో పాటు రెసిడెన్స్ ఉండేలా డిజైన్ చేశాం. ఫ్రంట్ ఎలివేషన్‌ను ఐరన్ గ్రిల్స్‌తో లైన్స్‌లా పెట్టడానికి కారణం కొత్తగా, స్టయిలిష్‌గా ఉంటుందనే. దానికి తోడు ఈయన తీసే సినిమాల వల్ల ఆఫీసు మీద అప్పుడప్పుడు రాళ్లు పడుతుంటాయి కదా... (నవ్వేస్తూ). ఇది యాక్చ్యువల్‌గా గ్లాస్ హౌస్. లైటింగ్ కూడా నేచురల్‌గా ఉంటుంది. పగలు లైట్లు వాడనవసరమే లేదు. ఇంకా చెప్పాలంటే, లైటింగ్ ఎక్కువ అవుతోందని స్టిక్కరింగ్ చేయాల్సి వచ్చింది. టై మీద సోలార్ ప్యానెల్స్ ఉన్నాయి. భవిష్యత్తులో పూర్తి స్థాయిలో సోలార్ ఎనర్జీ వాడుకునే విధంగా ఏర్పాట్లు చేశాం. ఏసీని కూడా సోలార్ ఎనర్జీతో రన్ చేసుకోవచ్చు. - జయకిరణ్, ఆర్కిటెక్ట్ ఆఫీస్ ముందు 11 అడుగుల యూరోపియన్ స్టాచ్యూ... యూరోపియన్ స్టాచ్యూను రెప్లికా చేసి ఆఫీస్ ముందు పెడుతున్నాం. సుమారు 11 అడుగుల ఎత్తు ఉంటుందా స్టాచ్యూ. అలాగే అమెరికా నుంచి 10 అడుగుల రెక్కలున్న పెద్ద ఫ్యాన్లు తెప్పిస్తున్నాం. ఆ కంపెనీ వాళ్లకు మన స్పెసిఫికేషన్స్ నచ్చితేనే ఆర్డర్ ఓకే చేస్తారు. ఆఫీస్‌లో సోఫాలన్నీ దాదాపుగా టచ్ ఆపరేటెడ్. ఆఫీస్‌లో ఇంటర్‌కామ్ ఉంది. అంతా ఇంటర్నెట్ ఆపరేటెడ్. ఫారిన్ నుంచి కూడా ఇంటర్‌కామ్‌లో మాట్లాడొచ్చు. ఆఫీస్‌లో ఎక్కడేం జరుగుతోందో... ఐ ప్యాడ్ ద్వారా ప్రపంచం ఏ మూలన ఉన్నా చూడొచ్చు. ఫారిన్ వెళ్లినప్పుడు ఇంకా కొత్త కొత్త ఐటమ్స్ కొనాలి. ఫొటోలు: శివ మల్లాల -
పవన్, ప్రిన్స్ 'సై'మా!
కుటుంబ విలువలకు ప్రాధాన్యమిచ్చిన చిత్రాలతో గతేడాది హిట్లు సాధించిన పవన్ కళ్యాణ్, మహేశ్ బాబు ఈసారి సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్(సైమా)-2014 అవార్డుల రేసులో పోటీ పడుతున్నారు. పవన్- అత్తారింటికి దారేదీ, మహేష్- సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలతో ఈ టాలీవుడ్ టాప్ హీరోలు పోటీలో ముందున్నారు. ఫిల్మ్‌ఫేర్ అవార్డుల్లో ఎక్కువ ఈ రెండు చిత్రాలే దక్కించుకున్నాయి. 'అత్తారింటికి దారేదీ' నాలుగు అవార్డులను సొంతం చేసుకోగా, 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' రెండు అవార్డులను ఎగరేసుకెళ్లింది. మహేశ్ బాబు ఉత్తమ నటుడిగా ఎంపికయ్యాడు. ప్రిన్స్'కు నాలుగో ఫిలింఫేర్ అవార్డు కావడం విశేషం. అంతకుముందు ఒక్కడు, పోకిరి, దూకుడు చిత్రాలకు అవార్డు అందుకున్నాడు. సైమాలోనూ పవన్, ప్రిన్స్ ముందు వరుసలో నిలిచారు. ఉత్తమ నటుడు విభాగంలో వీరితో పాటు వెంకటేష్(సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు), ప్రభాస్(మిర్చి), రామ్ చరణ్(నాయక్), నితిన్(గుండెజారి గల్లంతయిందే) కూడా రేసులో ఉన్నారు. వీరిలో ఉత్తమ నటుడిగా ఎంపికవుతారన్నది సెప్టెంబర్ లో తెలుస్తుంది. మలేసియాలోని కౌలాలంపూర్ లో సెప్టెంబర్ 12, 13న సైమా అవార్డుల ప్రదానోత్సవం జరుగుతుంది. 'గబ్బర్ సింగ్'లో నటనకు గతేడాది పవన్ కళ్యాణ్ 'సైమా' ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నాడు. పవన్ ఈసారి కూడా 'సైమా'లో పాగా వేస్తాడో, లేదో చూడాలి. -
థ్యాంక్యూ పవన్ సార్..
ప్రతి ఏడాదీ వేసవిలో పవన్ కల్యాణ్ నుంచి కొంతమందికి ఓ పార్శిల్ అందుతుంది. అది మామిడిపళ్ల బుట్ట. ‘గబ్బర్‌సింగ్’ చిత్రంలోలా పాపిడి బిళ్లెట్టుకున్న అమ్మాయి ఈ మామిడి పళ్లను తీసుకురాదు కానీ, ఈ పళ్ల రుచి మాత్రం కెవ్వు కేక అట. పవన్ కల్యాణ్‌కి హైదరబాద్ శివార్లలో మామిడి తోట ఉంది. అందులో పండిన తాజా మామిడి పళ్లను ఆప్తులకు పంపిస్తుంటారు. ప్రతి ఏడాదీ ఈ పళ్లు అందుకుంటున్నవారిలో నితిన్ కూడా ఉన్నారు. ఈ ఏడాది ఈ పార్శిల్ రాగానే ఆనందం పట్టలేక, కెవ్వు కేక పెట్టినంత పని చేశారట నితిన్. ‘‘పవర్‌స్టార్ ఈ ఏడాది కూడా నాకు మామిడిపళ్లు పంపించారు. చాలా రుచిగా ఉన్నాయి. థ్యాంక్యూ సార్’’ అంటూ ట్విట్టర్ ద్వారా తన ఆనందాన్ని పంచుకున్నారు. -
నితిన్ కొత్త చిత్రం ప్రారంభోత్సవం
-
ముంబయ్ భామతో ప్రేమాయణం
ప్రేమకథా చిత్రాలకు నప్పే హీరో నితిన్. ప్రేమకథా చిత్రాలను అద్భుతంగా తెరకెక్కించే నైపుణ్యం ఉన్న దర్శకుడు కరుణాకరన్. ఈ ఇద్దరి కలయికలో ఓ సినిమా వస్తే.. అది కూడా వారి తరహా ప్రేమకథా చిత్రమైతే?... చెప్పడానికేముంటుంది? ప్రేక్షకుల మనసులు కొల్లగొట్టే సినిమా ఇస్తారని చెప్పొచ్చు. ఈ కాంబినేషన్లో శ్రేష్ట్ మూవీస్ నిర్మిస్తున్న సినిమా బుధవారం హైదరాబాద్‌లో ఆరంభమైంది. నితిన్‌తో ‘ఇష్క్’, ‘గుండెజారి గల్లంతయ్యిందే’వంటి రెండు విజయవంతమైన చిత్రాల తర్వాత ఈ సంస్థ నిర్మిస్తున్న చిత్రం ఇది. నిఖితారెడ్డి, సుధాకర్‌రెడ్డి సంయుక్తంగా రూపొందిస్తున్న ఈ చిత్రానికి విక్రమ్‌గౌడ్ సమర్పకుడు. బాలీవుడ్ భామ మిస్తీ కథానాయిక. ముహూర్తపు సన్నివేశానికి సదానంద్ గౌడ్ కెమెరా స్విచాన్ చేయగా, నిర్మాత రామ్మోహన్ రావు క్లాప్ ఇచ్చారు. వీవీ వినాయక్ గౌరవ దర్శకత్వం వహించారు. వచ్చే నెల 2న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని, ఇక్కడే కాకుండా విదేశాల్లోనూ షూటింగ్ చేయనున్నామని నిఖితారెడ్డి తెలిపారు. -
ఫుల్ రొమాన్స్...
మాస్ ఇమేజ్ కోసం వెంపర్లాడకుండా, ప్రేమకథల వైపు ఎప్పుడైతే దష్టి సారించారో... అప్పట్నుంచీ నితిన్ కెరీర్ సూపర్స్పీడ్ అందుకుంది. వరుస విజయాలు ఆయన ఖాతాలో చేరుతున్నాయి. ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే, హార్ట్ఎటాక్... ఇలా వరుస విజయాలతో ఫుల్ జోష్ మీదున్నారు నితిన్. త్వరలో రాబోతున్న ఆయన సినిమా.. ‘కొరియర్‌బోయ్ కల్యాణ్’ కూడా ప్రేమకథే కావడం గమనార్హం. ఇప్పుడు అదే ఊపుతో మరో ప్రేమకథకు పచ్చజెండా ఊపారు నితిన్. ప్రేమకథలు తీయడంలో సిద్ధహస్తునిగా పేరుగాంచిన కరుణాకరన్ దర్శకత్వంలో ఫుల్ రొమాన్స్ చేయబోతున్నారు. శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై సుధాకరరెడ్డి, నిఖితారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. బాలీవుడ్ కథానాయిక మిస్తీ ఇందులో హీరోయిన్. ఈ నెల 21న ఈ సినిమా పూజా కార్యక్రమాలు లాంచనంగా జరుగనున్నాయి. ఇష్క్, గుండెజారి... తర్వాత తాము నిర్మిస్తున్న మూడో సినిమా ఇదని, జూన్ 2న చిత్రీకరణ మొదలుపెట్టి మన దేశంలోనూ, విదేశాల్లోనూ చిత్రీకరణ జరుపుతామని, భారీ నిర్మాణ వ్యయంతో తెరకెక్కనున్న ఈ చిత్రం భారీ విజయాన్ని కూడా సొంతం చేసుకుంటుందనే నమ్మకం ఉందని నిర్మాతలు అన్నారు. ఈ చిత్రానికి మాటలు: హర్షవర్ధన్, కెమెరా: ఆండ్రూ, సంగీతం: అనూప్ రూబెన్స్, కళ: రాజీవ్ నాయర్, సమర్పణ: విక్రమ్‌గౌడ్. -
స్టార్ స్టార్ సూపర్ స్టార్ - నితిన్
-
పబ్కెళ్తాను గానీ తాగను
నా ఆల్‌టైమ్ ఫేవరెట్ సినిమాలంటే... చిన్నప్పుటి నుంచీ సినిమాలంటే ఇష్టం. కానీ... సినిమాపై ప్రత్యేక అభిమానాన్ని కలిగించిన సినిమా మాత్రం శంకర్ దర్శకత్వంలో కమలహాసన్ నటించిన ‘భారతీయుడు’. ఇప్పటికీ ఆ సినిమా టీవీల్లో వస్తే వదలను. ఇక అందులో కమల్ సార్ నటన గురించి నేనుమాట్లాడటం అంటే... కామెడీగా ఉంటుంది. అలాగే పవన్ కల్యాణ్ నటించిన ‘సుస్వాగతం, తొలిప్రేమ’ కూడా నా ఆల్‌టైమ్ ఫేవరెట్లు. సినిమా తర్వాత నాకు ఇష్టమైనది... సినిమా తర్వాత గేమ్స్ అంటే ఇష్టం. క్రికెట్ బాగా ఆడతా. ఆల్‌రౌండర్‌ని కూడా. స్కూల్, కాలేజ్ టైమ్‌లో ఆడేవాణ్ణి. ఇండస్ట్రీకి వచ్చాక కూడా సీసీఎల్ ఆడాను. కానీ ఇప్పుడు ఆడటం లేదు. ఎందుకంటే... మమ్మల్ని అలంకారానికి మాత్రమే తీసుకుంటున్నారు. అక్కడకెళ్లాక ఆడేవాళ్లు వేరే. ఫీల్డింగులు చేసుకోవడంతోనే మాకు సరిపోతోంది. అందుకే... ఈ దఫా నేను వెళ్లలేదు. నాకిష్టమైన దేశాలు... మన భారతదేశమంటే చచ్చేంత ఇష్టం. తర్వాత దుబాయ్, స్పెయిన్. అక్కడి వాతావరణం, సంస్కృతులు నన్ను కట్టిపడేశాయి. పుస్తకమా? వామ్మో! నా వరకు నాకు అతి కష్టమైన పని పుస్తకాలు చదవడమే. పెద్ద బోరింగ్. అయితే... కొందరు ఫ్రెండ్స్ సలహాల మేరకు ఇప్పుడిప్పుడే చదువుదాం అనుకుంటున్నా. నా ఫేవరెట్ డిష్.... పప్పు, ఆవకాయ ఉంటే చాలు.. ఫుల్‌గా లాగించేస్తా. అంతకు మించిన ఫేవరెట్ డిష్ నాకు ఇంకొకటి లేదు. ఎన్నిసార్లు తిన్నా వెగటు అనిపించని డిష్ అది. నా గుడ్, బ్యాడ్ హ్యాబిట్స్... ఎక్కువగా ఆలోచించడం నా బ్యాడ్ హ్యాబిట్ అని కొందరంటారు. నా ఉద్దేశంలో అదే నా గుడ్ హ్యాబిట్ కూడా! నాకు రిలాక్సేషన్ ఇచ్చేది... {ఫెండ్స్‌తో కలిసి పబ్బులకు వెళ్లతా. ఎంజాయ్ చేస్తా. పబ్బులకు వెళ్లడం తప్పు కాదని నా అభిప్రాయం. ఈ రోజుల్లో యూత్‌కు అది సహజం. అయితే అక్కడికెళ్లాక మందు మాత్రం తాగను. నేను చెప్పేది నిజం. లవ్? ఎరేంజ్డ్? ఏదైనా నాకు ఓకే.... ఇప్పటివరకూ నేనెవర్నీ లవ్ చేయలేదు. నన్నే చాలామంది లవ్ చేశారు. అయితే... దాన్ని ప్రేమ అనకూడదు. ఆకర్షణ అన్నమాట. చదువుకునే రోజుల్లోనే నాలుగైదు ప్రేమలేఖలు అందుకున్నా. హీరో అయ్యాకైతే లెక్కే లేదు. ట్విట్టర్లోకి ఎక్కాక వేలల్లో లవ్ ట్వీట్స్ వస్తున్నాయి! ఇక పెళ్లి విషయానికి వస్తే... నాకు ప్రేమ వివాహమైనా, పెద్దలు కుదిర్చిన వివాహమైనా... ఏదైనా ఓకే. అయితే... ప్రేమ వివాహం చేసుకోవడానికి తగ్గ అమ్మాయి ఇప్పటిదాకా నాకు కనిపించలేదు. కనిపిస్తే మాత్రం ప్రపోజ్ చేసి పెళ్లి చేసేసుకుంటా. అయితే మా పెద్దవాళ్లు అదే పనిలో ఉన్నారు. నాకు ఏ మాత్రం ఛాన్స్ దొరుకుతుందో చూద్దాం! - బుర్రా నరసింహ -
లవర్స్ మూవీ ఫస్ట్ లుక్ లాంచ్
-
నేను ఫుల్ హ్యాపీ - పూరి జగన్నాథ్
‘‘నిర్మాతగా, దర్శకునిగా ఈ సినిమా విషయంలో నేను ఫుల్ హ్యాపీ. సమిష్టి కృషి వల్లే ఈ విజయం సాధ్యమైంది’’ అని పూరీ జగన్నాథ్ అన్నారు. నితిన్ కథానాయకుడిగా పూరీ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘హార్ట్ ఎటాక్’. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ప్లాటినమ్ డిస్క్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా పూరీ మాట్లాడుతూ-‘‘ఈ సినిమాకు పనిచేసిన ప్రతి టెక్నీషియన్ ప్రాణం పెట్టి పనిచేశాడు. ప్రకాష్‌రాజ్ తన సొంత సినిమా పనిమీద బిజీగా ఉన్నా... అవన్నీ కాసేపు పక్కనపెట్టి ఈ సినిమాలో యాక్ట్ చేశారు. ఇంతటి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు నా కృతజ్ఞతలు’’ అని తెలిపారు. ‘‘ఈ సినిమాతో నాకు మాస్ ఇమేజ్ వచ్చింది. డివైడ్ టాక్‌తో మొదలైన ఈ చిత్రం రోజురోజుకీ హిట్ టాక్ని సొంతం చేసుకుంది. పంపిణీదారులందరూ హ్యాపీగా ఉన్నారు. అనూప్ సంగీతం, భాస్కరభట్ల సాహిత్యం ఈ సినిమా విజయానికి ఓ కారణాలు. నా కెరీర్లోనే దిబెస్ట్ అనదగ్గ ఫైట్స్ ఇందులో చేశాను. రామ్-లక్ష్మణ్ సూపర్ ఫైట్స్ ఇచ్చారు. హ్యాట్రిక్ విజయాన్నిచ్చిన ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అని నితిన్ చెప్పారు. పూరీజగన్నాథ్‌తో పనిచేయడం కంఫర్ట్‌గా ఉంటుందని, ఆయనతో మళ్లీ మళ్లీ పనిచేయాలని ఉందని అనూప్‌రూబెన్స్ కోరారు. అందరూ సిన్సియర్ ఎఫెర్ట్ పెట్టడం వల్లే ఈ విజయం సాధ్యమైందని అలీ అన్నారు. ఈ కార్యక్రమంలో భాస్కరభట్ల, రామ్-లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. -
ఎవరేమనుకున్నా.. డోంట్ కేర్!.
‘‘మొన్న ‘ఇష్క్’... నిన్న ‘గుండెజారి గల్లంతయ్యిందే’... ఇప్పుడు ‘హార్ట్ ఎటాక్’తో హ్యాట్రిక్ పూర్తయిపోయింది’’ అని నితిన్ సంతోషం వెలిబుచ్చారు. పూరి జగన్నాథ్‌తో సినిమా చేయాలన్న తన కల నెరవేరిందని ఆనందం వ్యక్తం చేస్తూ నితిన్ చెప్పిన ముచ్చట్లు. నేనంటే గిట్టనివాళ్లు చేసిన పనేమో! తొలిరోజు ఫ్లాప్ టాక్ ఎందుకొచ్చిందో నాకే అర్థం కావడంలేదు. నేనంటే గిట్టనివాళ్లు చేసిన పనేమో! అయితే... విదేశాల్లో ఈ టాక్ ప్రభావం చూపించింది. ఇక్కడున్నంత స్ట్రాంగ్‌గా అక్కడ వసూళ్లు లేవు. ఇక్కడ మాత్రం నా కెరీర్లోనే నంబర్‌వన్ సినిమాగా నిలిచింది. నా కెరీర్లో ‘గుండెజారి గల్లంతయ్యిందే’ అత్యధిక ప్రారంభ వసూళ్లు తెచ్చిన సినిమా. దాన్ని తేలిగ్గా అధిగమించేసింది ‘హార్ట్ ఎటాక్. ‘ఇష్క్’ ‘ఎ’ క్లాస్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటే.. ‘గుండెజారి...’ ‘ఎ,బి’ కేంద్రాల్లో బాగా ఆడింది. ‘హార్ట్ ఎటాక్’ అయితే... ఎ,బిలతో పాటు ‘సి’క్లాస్ ప్రేక్షకుల్ని కూడా ఆకట్టుకోవడం ఆనందంగాఉంది. ఆనందంతో కన్నీళ్లొచ్చాయి కూల్‌గా పని చేయించుకోవడం పూరీగారి స్టైల్. ఆయన్ను ఫాలో అయి చెప్పినట్లు చేశానంతే. మార్నింగ్ షో ఫ్లాప్ టాక్ వచ్చింది. అయినా థియేటర్‌కెళ్లి పబ్లిక్‌లో సినిమా చూశాం. ప్రేక్షకుల అభిమానం, సినిమాతో వాళ్లు కనెక్టవుతున్న తీరు చూసి ఆనందంతో కన్నీళ్లొచ్చాయి. ఎందుకంటే.. పర్టిక్యులర్‌గా ఈ సినిమాకు మేం పడ్డ కష్టం అలాంటిది. మళ్లీ పూరీతో పనిచేసే అవకాశం వస్తే వదులుకోను. నా పారితోషికం పెంచాననడం అవాస్తవం ఈ మధ్య బయటి సంస్థల్లో నేను సినిమాలు చేయలేదు. పూరీగారి బ్యానర్లో ‘హార్ట్ ఎటాక్’ చేశాను. అది కూడా నా సొంత సంస్థ కిందే లెక్క. సో... నేను పారితోషికం పెంచాననడం అవాస్తవం. ప్రస్తుతం నా దృష్టంతా కథలపైనే. ప్రేమకథలే నాకు సరిగ్గా సరిపోతాయి కాబట్టి.. ఇక నుంచీ నా వయసుకి తగ్గట్టుగా ప్రేమకథల్నే ఎంపిక చేసుకుంటాను. మంచి కథ, కాంబినేషన్ సెట్ అయితే... మల్టీస్టారర్ చేయడానికి కూడా నేను రెడీ. ఇలా బురద జల్లుతున్నారేమో! నేను పవన్‌కల్యాణ్‌గారి పేరు వాడుకుంటున్నానని చాలామంది అనుకుంటున్నారు. బహుశా... నేను సక్సెస్‌లోకి రావడం వల్లే నాపై ఇలాంటి బురద జల్లుతున్నారని నా అభిప్రాయం. నిజానికి ‘జయం’ నుంచే నా సినిమాల్లో ఎక్కడో ఒక చోట పవన్‌కల్యాణ్‌గారి సన్నివేశమో, డైలాగో ఉండేలా చూసుకుంటూ వచ్చాను. ఆయనపై నాకున్న ప్రేమ అది. నేనేంటో పవన్‌గారికి తెలుసు. ఆయనేంటో నాకు తెలుసు. మధ్యలో ఎవరేమనుకున్నా డోంట్ కేర్. మార్చి నుంచి కరుణాకరన్ సినిమా... ఒక పాట మినహా ‘కొరియర్‌బోయ్ కల్యాణ్’ పూర్తయింది. ఏప్రిల్‌లో సినిమాను విడుదల చేస్తాం. అది కూడా ప్రేమకథే. ఇప్పటివరకూ అలాంటి కాన్సెప్ట్ రాలేదు. అలాగే సురేందర్‌రెడ్డి శిష్యుడు శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో ఓ చిత్రం చేయబోతున్నాను. ఈ నెల 9న షూటింగ్ మొదలవుతుంది. మార్చిలో కరుణాకరన్ సినిమా షూటింగ్ మొదలవుతుంది. ఈ రెండూ మా సొంత సినిమాలే. -
పూరీ, నితిన్‌ల ఎటాక్
-
సినిమా రివ్యూ: హార్ట్ ఎటాక్
వరుస విజయాలతో దూసుకుపోతున్న నితిన్...సరియైన హిట్ కోసం ఎదురు చూస్తున్న దర్శకుడు పూరి జగన్నాథ్ క్రేజీ కాంబినేషన్ తో రూపొందిన 'హార్ట్ ఎటాక్' చిత్రం ప్రారంభం నుంచి ఓ పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత ఫస్ట్ లుక్, ఆడియో ప్రేక్షకుల్లో మరింత అంచనాలను పెంచింది. గత వైభవాన్ని నిలబెట్టుకునేందుకు పూరి చేసిన ప్రయత్నంలో భాగంగా వచ్చిన 'హార్ట్ ఎటాక్' చిత్రం ప్రేక్షకుల సంతృప్తి పరిచిందా? బాక్సాఫీస్ వద్ద ఎలాంటి టాక్ ను సంపాదించుకుందనే విషయాన్ని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సింది. అమెరికాలో ఓ యాక్సిడెంట్ లో తల్లి తండ్రులను కోల్పోయిన వరుణ్ (నితిన్) స్పెయిన్ లో ఎదో ఒక జాబ్ చేసేస్తూ కాలం వెళ్లదీస్తుంటాడు. అమ్మాయిలతో ప్రేమలో పడటం వేస్ట్ అనే భావనలో వరుణ్ ఉంటాడు. తన స్నేహితురాలు, కృష్ణ భక్తుడు రమణ (బ్రహ్మనందం) కూతురు ప్రియ (కేశ ఖంబటి) కు సహాయం చేసేందుకు స్పెయిన్ కు చేరుకున్న హయతి (అదా శర్మ)ని చూసి ఇష్టపడుతాడు. కాని హయతిపై ప్రేమ లేదని.. కేవలం ఓ ముద్దు మాత్రమే ఇవ్వాలని వరుణ్ వెంటపడి వేధిస్తుంటాడు. వరుణ్ సహాయం తీసుకుని తన స్నేహితురాలి సమస్యను పరిష్కరించడంలో హయతి సక్సెస్ అవుతుంది. ఈ క్రమంలో వరుణ్ తో ప్రేమలో హయతి ప్రేమలో పడుతుంది. వరుణ్ కోరినట్లే హయతి ముద్దు ఇస్తుంది. కాని ఓ కారణంతో వరుణ్ ను స్పెయిన్ లో వదిలేసి.. చెప్పపెట్టకుండా గోవాకు హయతి చేరుకుంటుంది. అయితే తన కుటుంబాన్ని ఓ ప్రాబ్లం నుంచి గట్టేక్కించడానికి డ్రగ్ మాఫియా కార్యకలాపాలను, అమ్మాయిల అక్రమ రవాణా చేసే మఖాన్ కమర్తి (విక్రమ్ జిత్) తో పెళ్లికి ఒప్పుకుంటుంది. హయతిని ప్రేమిస్తున్నాని రియలైజ్ అయిన వరుణ్ గోవాకు చేరుకుంటాడు. గోవాకు చేరుకున్నవరుణ్.. హయతి ప్రేమను పొందడంలో ఎలా సఫలమవుతాడు? ప్రియకు వచ్చిన సమస్య ఏంటి? ప్రేమిస్తున్న వరుణ్ కు దూరంగా హయతి ఎందుకు ఉండాలనుకుంది? మాఫియా డాన్ తో హయతి పెళ్లికి ఎందుకు ఒప్పుకుంది లాంటి ప్రశ్నలకు తెరపైనే సమాధానం దొరుకుతాయి. విశ్లేషణ: దర్శకుడు పూరి జగన్నాథ్ కథలో రెగ్యులర్ కనిపించే హీరో పాత్రనే నితిన్ పోషించాడు. నితిన్ ను ఓ కొత్త లుక్ లో చూడటానికి అవకాశం కలిగినా.. కథ పరంగా నితిన్ క్యారెక్టరైజేషన్ లో కొత్తదనం ఎక్కడా కనిపించదు. హీరోయిజాన్ని తెరకెక్కించే విషయంలో కూడా అదే పూరి మార్క్ పాత వాసన కనిపించింది. గతంలో హీరో పాత్ర పరంగానూ, కారెక్టరైజేషన్ విషయంలోనూ పక్కాగా లాజిక్ లుండేవి. అయితే ఈ చిత్రంలో మాత్రం లాజిక్ లను..హీరో క్యారెక్టరైజేషన్ ను పూర్తిగా పూరి గాలికి వెదిలేశాడేంటబ్బా అనే ఫీలింగ్ సినిమా చూసినంత సేపు వెంటాడుతునే ఉంటుంది. గత చిత్రాల్లో రక్షిత, ఇలియానా, తమన్నా, అమలాపాల్ లాంటి హీరోయిన్ల క్యారెక్టరైజన్ ఫర్ ఫెక్ట్ గా ఉండేది. అయితే ఈచిత్రంలో ఆదా శర్మకు పూరి అన్యాయం చేశాడనే చెప్పవచ్చు. కథలో బలమైన విలన్ లేకపోవడం ఈ చిత్రానికి మరో మైనస్ పాయింట్. పూరి సినిమాలలో బ్రహ్మనందం, ఆలీలతో కూడిన బ్రహ్మండమైన కామెడీ ట్రాక్ ఉంటుంది. అయితే ఈ చిత్రంలో కృష్ణ భక్తుడిగా రమణ పాత్రలో బ్రహ్మనందం, రజనీ పాత్రలో ఆలీ కనిపించినా.. అంతగా గొప్పగా ఆకట్టుకోలేకపోయారు. దేవన్, ప్రకాశ్ రాజ్ లను పూర్తి స్థాయిలో వాడుకోవడంలో కొంత విఫలమయ్యారు. ఇక ఈ చిత్రంలో గొప్పగా చెప్పుకోవాల్సింది అమోల్ రాథోడ్ ఫోటోగ్రఫి. స్పెయిన్, గోవా ప్రదేశాల్లో లోకేషన్లను అమోల్ రాథోడ్ అద్బుతంగా చిత్రీకరించారు. ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ ను అందించారు. స్క్రీన్ ప్లే రోటిన్.. పూరి మార్క్ డైలాగ్స్ అక్కడక్కడా ఓకే అనిపించినా.. పూర్తిస్థాయిలో పేలలేదనే చెప్పవచ్చు. ఒకటి రెండు పాటలు ఆకట్టుకునే పాటల్ని అనూప్ రూబెన్ అందించారు. బ్యాక్ గ్రౌండ్ స్కోరు పేలవంగానే ఉంది. సాధారణంగా పూరి రూపొందించిన ప్రతి ప్రేమ కథలోనూ గొప్ప ఫీల్ ఉంటుంది. ఈ చిత్ర లవ్ స్టోరిలో ఫీల్ లేకపోవడం 'హార్ట్ ఎటాక్' చిత్రంలో ప్రధాన లోపం. తెలుగు ప్రేక్షకుల నేటివిటికి సుదూరంగా ఉన్న ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంలో వెనకపడిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి దగ్గరగా ఉండే విధంగా పూరి జాగ్రత్తలు తీసుకునేవారు. ఈ మధ్య కాలంలో ప్రేక్షకుల టేస్ట్ ను పట్టించుకోవడం లేదనే వాదన కు బలం చేకూర్చేలా ఈ చిత్రం ఉందని చెప్పవచ్చు.. ఏది ఏమైనా దర్శకుడు పూరి జగన్నాథ్ నుంచి విభిన్న చిత్రాన్ని ఆశించిన ప్రేక్షకులకు, అభిమానులను నిరాశ పరిచారనే చెప్పవచ్చు. పూర్తిగా యూత్ ను లక్ష్యంగా చేసుకుని నిర్మించిన ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్ని నమోదు చేసుకుందోననే విషయాన్ని తెలుసుకోవడానికి మరికొంత సమయం వేచి చూడాల్సిందే. -
నన్ను నమ్మి ఈ సినిమా చూడండి! - పూరి
‘‘ఇది ప్రేమకథ. ఈ కథకు పాటలే ప్రాణం. మంచి పాటలు స్వరపరచినందుకు అనూప్‌కి థ్యాంక్స్ చెప్పాలి. అలీ, బ్రహ్మానందం పాత్రలు బాగా నవ్విస్తాయి. నన్ను నమ్మి ఈ సినిమా చూడండి. ఏమాత్రం నిరుత్సాహపడరు’’ అన్నారు పూరి జగన్నాథ్. నితిన్, అదా శర్మ జంటగా లావణ్య సమర్పణలో పూరి టూరింగ్ టాకీస్ పతాకంపై స్వీయదర్శకత్వంలో పూరి నిర్మించిన చిత్రం ‘హార్ట్ ఎటాక్’. రేపు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అనూప్ రూబెన్స్ స్వరపరచిన ఈ చిత్రం పాటలు విజయం సాధించిన సందర్భంగా హైదరాబాద్‌లో ఆడియో సక్సెస్‌మీట్ జరిగింది. ఈ లోగోను బ్రహ్మానందం ఆవిష్కరించారు. ఈ వేడుకలో నితిన్ మాట్లాడుతూ -‘‘పాటలు సూపర్ హిట్టయ్యాయి. అనూప్, నా కాంబినేషన్లో ఇది మూడో హిట్. పూరీ స్టయిల్లో ఉండే ఎమోషనల్ లవ్‌స్టోరి. డైలాగ్స్ బ్రహ్మాండంగా ఉంటాయి. ఈ సినిమా విజయంపై చాలా నమ్మకంతో ఉన్నాను. వంద శాతం విజయం ఖాయం’’ అన్నారు. బ్రహ్మానందం మాట్లాడుతూ -‘‘ఒక హార్ట్ ఇంకో హార్ట్‌కి ఎటాక్ ఇస్తే ఎలా ఉంటుందో అలా ఈ హార్ట్ ఎటాక్ ఉంటుంది. అనూప్ ట్రెండీ సాంగ్స్ ఇచ్చాడు. కొత్త హెయిర్‌స్టయిల్‌తో నితిన్ కొత్త లుక్‌లో కనిపిస్తాడు. నాది మెసేజ్‌తో కూడిన కామెడీ కేరెక్టర్. సినిమా చాలా బాగుంటుంది. ఎంజాయ్ చేయదగ్గ విధంగా ఉంటుంది’’ అని చెప్పారు. అనూప్ మాట్లాడుతూ -‘‘ఎప్పట్నుంచో పూరి జగన్నాథ్‌గారి సినిమాకి పని చేయాలనుకుంటున్నాను. ఈ సినిమాకి కుదిరింది. అది కూడా లవ్‌స్టోరీ చేయడం ఆనందంగా ఉంది’’ అన్నారు. ఈ వేడుకలో అలీ, అదాశర్మ, బ్రహ్మ కడలి, అమోల్ రాథోడ్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
‘హార్ట్ ఎటాక్’ సినిమా స్టిల్స్
-
నితిన్ హార్ట్ ఎటాక్ సెకండ్ ట్రైలర్
-
భాలీవుడ్ నటుడుతో నితిన్
-
స్టైలియర్... 2013...
ఈ ఏడాది దాదాపు అందరు స్టార్లూ తమదైన స్టైల్స్‌తో తెరని మెరిపించారు. సినిమా ఫ్యాషన్లను అనుకరించేవారికి ఈ ఏడాది ఫుల్ మీల్స్. ఒక్కో తార ఒక్కో రకంగా అభిమానులకు సరికొత్త స్టైల్స్‌ని అందించారు. అలాంటి ఫ్యాషన్ శైలుల్లో కొన్ని... ఓల్డ్ కు ‘చెక్’చెప్పిన మహేష్...: అబ్బా ఎప్పుడూ అవే గీతల చొక్కాలా అంటూ చెక్స్ షర్ట్స్‌కు కాలం చెల్లించేస్తున్న దశలో... హీరో మహేష్‌బాబు చెక్స్ డిజైన్స్ ఉండే చొక్కాల పాలిట ఆపద్బాంధవుడయ్యాడు.‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలో చారల చొక్కాలతో ప్రిన్స్ అమ్మాయిలను ‘చూసిందల్లా పదినిమిషాలకే ’ పడేయడాన్ని తెరపై చూసిన ప్రేక్షకులు చారల చొక్కాల కోసం షాపుల దగ్గర, డిజైనర్ల దగ్గర బారులు తీరారు. ‘ఆర్’...హుషార్: ‘లైలా ఓ లైలా ఆజావో మేరీ లైలా’ అంటూ హిందీ లిరిక్స్‌కు చిందులేసిన రామ్‌చరణ్... తెలుగు ప్రేక్షకులకు స్టైల్ అక్షరాలు నేర్పాడు. ‘నాయక్’ సినిమాలో వచ్చిన ఆ పాటలో రామ్‌చరణ్ ధరించిన ‘ఆర్’ అక్షరం ఉన్న టీషర్ట్ ప్రేక్షకులకు బాగా నచ్చేసింది. అచ్చం అదే తరహాలో ఆర్ అక్షరంతో సహా ఉండే టీషర్ట్లను ధరించిన కుర్రకారు రామ్‌చరణ్‌లా ఫీలై హుషారెత్తి పోయారు. కార్పొరేట్‌కు ‘మిర్చి’ఘాటు...: పర్పుల్ కలర్‌కు గ్రే కలర్ కాంబినేషన్, వైట్ కలర్‌కు క్రీమ్ ప్యాంట్‌ను జతచేయడం... ఇలా క్లాసీలుక్లో స్పైసీగా ఆకట్టుకున్న మిర్చిలాంటి కుర్రాడు తన ఫ్యాషన్ల ఘాటును కార్పొరేట్ కంపెనీల్లో గుబాళించాడు. ‘మిర్చి’లో ప్రభాస్ ధరించిన దుస్తులు కార్పొరేట్ కంపెనీల్లో పనిచేసే కుర్రకారును ఒక ఊపు ఊపాయి. అచ్చం అలాంటి కలర్ కాంబినేషన్స్ కోరుతూ బొటిక్‌లకు పనిపెట్టినవారెందరో... బంతిపూల జానకి... ఇంతి ఫ్యాషన్ల ‘కీ’...: ముద్దబంతి పూవులా ఉండే కాజల్... లేసులతో అల్లిన బ్లౌజ్‌లతో అమ్మాయిలకు స్టైలాభ్యాసం చేయించింది. ‘బాద్షా’తో జతకట్టిన ఈ బ్యూటీఫుల్ గాళ్... నెట్టెడ్ జాకెట్లతో అబ్బాయిలకు వలవేయడం ఎలానో అమ్మాయిలకు నేర్పించింది. ఏదైతేనేం... ‘బంతిపూల జానకి’ పాటలో కాజల్ ధరించిన బ్లౌజ్‌లు ఆడపిల్లలకు లే‘టేస్ట్’ ఫ్యాషన్‌గా మారాయి. పచ్చప్యాంట్ కోసం ‘రన్.. రన్’... గుండెజారి బ్లేజర్ అయ్యిందే...: పొడవాటి బ్లేజర్ ధరించి ‘గుండెజారి గల్లంతయ్యిందే’ అంటూ నితిన్ వేసిన స్టెప్స్ చూసిన అమ్మాయిలు ఏం పారేసుకున్నారో కానీ... అబ్బాయిలు ఆ బ్లేజర్ మీద మనసు పారేసుకున్నారు. అబ్బాయిలు ధరించడానికి సంకోచించే పింక్కలర్ బ్లేజర్‌ను ఆ సినిమా టైటిల్‌సాంగ్‌లో దర్జాగా ధరించి నితిన్ సృష్టించిన డ్రెస్‌కోడ్... ఫ్యాషన్ల కోడిని కూయించింది. బ్లేజర్ లెంగ్త్ విషయంలోనూ ఇది సరికొత్త ఒరవడి సృష్టించింది. ఇక...ఫ్యాష‘నిజం’...: పవనిజం ఎంత నిజమో... పవన్‌కళ్యాణ్ సృష్టించే ఫ్యాషన్ కూడా అంతే నిజం అని ‘అత్తారింటికి దారేది’ నిరూపించింది. ఈ సినిమాలో పవన్ ధరించిన ఓ పొడుగు చేతుల చొక్కా సరికొత్త ట్రెండ్‌కు దారి చూపింది. ‘బాపుగారి బొమ్మ’ పాటలో వేసుకున్న బ్లేజర్, షాపింగ్‌మాల్‌లో ప్రణీతని అల్లరిపెడుతున్నవారితో ఢిష్యూ ఢిష్యూ టైమ్‌లో వేసుకున్న మోచేయి దగ్గర చారలతో ఉండే ఎర్రరంగు పొడుగు చేతుల చొక్కా... ఈ రెండూ కుర్రకారును ఫాలో అయ్యేలా చేశాయి. సార్థకనామథేయుడు...: బన్నీని ‘స్టైలిష్‌స్టార్’ అని అనడం అతిశయోక్తి ఎంతమాత్రం కాదని నిరూపించిన ‘ఇద్దరమ్మాయిలతో’... సినిమా ఒకటీ అరా కాదు బోలెడన్ని ఫ్యాషన్లను మోసుకొచ్చింది. ‘రన్న్’ర పాటలో వేసుకున్న గ్రీన్ కలర్ ప్యాంట్ దగ్గర్నుంచి...చేతికి రకరకాల హ్యాండ్ యాక్సెసరీస్‌ను ధరించడం... వేళ్లకు వెరైటీ రింగ్స్... ఇవన్నీ జంక్ జోష్ ఉన్న యూత్‌కి బాగా పట్టేశాయి. - ఎస్.సత్యబాబు సినిమాయే ఫ్యాషన్‌కు కేరాఫ్... కుటుంబ కథా చిత్రాలు, మాస్ మసాలా, లవ్, ఫ్యాక్షన్, హర్రర్.. విభిన్న రకాల సినిమాల హిట్స్‌ను ఇచ్చిన 2013... డిఫరెంట్ ఫ్యాషన్స్‌ను కూడా తెరమీదకు తెచ్చింది. ఇప్పటికీ సినిమాలే డ్రెస్సింగ్ ట్రెండ్స్‌ను డిసైడ్ చేస్తున్నాయని మరోసారి ఈ ఏడాది ప్రూవ్ చేసింది. మాలాంటి స్టైలిస్ట్‌లకు చేతినిండా పనిపెట్టిన సంవత్సరమిది. - కోన నీరజారెడ్డి, సినీ స్టైలిస్ట్ -
నితిన్‌కి టర్నింగ్ పాయింట్...
‘‘ఇడియట్, అమ్మ-నాన్న-ఓ తమిళమ్మాయి, పోకిరి చిత్రాల తర్వాత నిర్మాతగా, దర్శకునిగా నాకు పూర్తి సంతృప్తినిచ్చిన సినిమా ‘హార్ట్ ఎటాక్’. నా కెరీర్లో మరో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ అయ్యే రేంజ్లో సినిమా వచ్చింది’’ అని పూరి జగన్నాథ్ అన్నారు. నితిన్ కథానాయకునిగా ఆయన స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘హార్ట్ ఎటాక్’. ప్యాచ్‌వర్క్ మినహా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా గురించి పూరీ ఇంకా చెబుతూ -‘‘నితిన్‌కి ఇది చాలా పెద్ద సినిమా అవుతుంది. అనూప్ మ్యూజిక్ చాలా బాగా చేశాడు. ఆరు పాటలూ సూపర్‌హిట్ అవుతాయి. ఆడియో వేడుకను జనవరి తొలివారంలో డిఫరెంట్‌గా ప్లాన్ చేశాం. జనవరి 31న సినిమా విడుదల చేస్తాం’’ అని తెలిపారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటించాలనే కోరిక ‘హార్ట్ ఎటాక్’తో తీరిందని, తన కెరీర్‌కి ఈ సినిమా పెద్ద టర్నింగ్ పాయింట్ అవుతుందని నితిన్ చెప్పారు. ఆదాశర్మ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: అమోల్ రాథోడ్, కూర్పు: ఎస్.ఆర్.శేఖర్, కళ: బ్రహ్మ కడలి, పాటలు: భాస్కరభట్ల, సమర్పణ: లావణ్య. -
హార్ట్ ఎటాక్ సినిమా స్టిల్స్
-
స్పెయిన్‌లో ‘హార్ట్ ఎటాక్’
టైటిల్ నుంచే ప్రేక్షకులలో అసక్తిని రేకెత్తించడం పూరిజగన్నాథ్ ప్రత్యేకత. టైటిల్స్‌కి తగ్గట్టే ఆయన సినిమాలు కూడా కొత్తగా ఉంటాయి. ప్రస్తుతం ‘హార్ట్ ఎటాక్’ చిత్రం షూటింగ్లో బిజీగా ఉన్నారాయన. ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే విజయాలతో మంచి జోష్ మీదున్న నితిన్ కథానాయకునిగా స్వీయదర్శకత్వంలో పూరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ స్పెయిన్‌లో జరుగుతోంది. ప్రస్తుతం నితిన్‌పై యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. యాభై రోజుల పాటు అక్కడే చిత్రీకరణ జరుగుతుందని యూనిట్ వర్గాల సమాచారం. వైవిధ్యమైన కథాకథనాలతో ప్రేమ, యాక్షన్ మిళితమైన ఎంటర్టైనర్గా పూరీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. నితిన్ లుక్ ఈ చిత్రంలో కొత్తగా ఉంటుందని చిత్ర వర్గాల భోగట్టా. ఆదాశర్మ ఈ చిత్రం ద్వారా కథానాయికగా పరిచయం అవుతున్నారు. ప్రముఖ తారాగణం నటించే ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా: అమోల్ రాథోడ్, కూర్పు: ఎస్.ఆర్.శేఖర్.