నేను ఫుల్ హ్యాపీ - పూరి జగన్నాథ్ | Heart Attack celebrates platinum disc | Sakshi
Sakshi News home page

నేను ఫుల్ హ్యాపీ - పూరి జగన్నాథ్

Published Sat, Feb 15 2014 11:57 PM | Last Updated on Fri, Mar 22 2019 1:53 PM

నేను ఫుల్ హ్యాపీ - పూరి జగన్నాథ్ - Sakshi

నేను ఫుల్ హ్యాపీ - పూరి జగన్నాథ్

 ‘‘నిర్మాతగా, దర్శకునిగా ఈ సినిమా విషయంలో నేను ఫుల్ హ్యాపీ. సమిష్టి కృషి వల్లే ఈ విజయం సాధ్యమైంది’’ అని పూరీ జగన్నాథ్ అన్నారు. నితిన్ కథానాయకుడిగా పూరీ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘హార్ట్ ఎటాక్’. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ప్లాటినమ్ డిస్క్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా పూరీ మాట్లాడుతూ-‘‘ఈ సినిమాకు పనిచేసిన ప్రతి టెక్నీషియన్ ప్రాణం పెట్టి పనిచేశాడు. ప్రకాష్‌రాజ్ తన సొంత సినిమా పనిమీద బిజీగా ఉన్నా... అవన్నీ కాసేపు పక్కనపెట్టి ఈ సినిమాలో యాక్ట్ చేశారు. ఇంతటి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు నా కృతజ్ఞతలు’’ అని తెలిపారు. ‘‘ఈ సినిమాతో నాకు మాస్ ఇమేజ్ వచ్చింది.
 
 డివైడ్ టాక్‌తో మొదలైన ఈ చిత్రం రోజురోజుకీ హిట్ టాక్‌ని సొంతం చేసుకుంది. పంపిణీదారులందరూ హ్యాపీగా ఉన్నారు. అనూప్ సంగీతం, భాస్కరభట్ల సాహిత్యం ఈ సినిమా విజయానికి ఓ కారణాలు. నా కెరీర్‌లోనే దిబెస్ట్ అనదగ్గ ఫైట్స్ ఇందులో చేశాను. రామ్-లక్ష్మణ్ సూపర్ ఫైట్స్ ఇచ్చారు. హ్యాట్రిక్ విజయాన్నిచ్చిన ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అని నితిన్ చెప్పారు. పూరీజగన్నాథ్‌తో పనిచేయడం కంఫర్ట్‌గా ఉంటుందని, ఆయనతో మళ్లీ మళ్లీ పనిచేయాలని ఉందని అనూప్‌రూబెన్స్ కోరారు. అందరూ సిన్సియర్ ఎఫెర్ట్ పెట్టడం వల్లే ఈ విజయం సాధ్యమైందని అలీ అన్నారు. ఈ కార్యక్రమంలో భాస్కరభట్ల, రామ్-లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement