నితిన్‌కి టర్నింగ్ పాయింట్...
‘‘ఇడియట్, అమ్మ-నాన్న-ఓ తమిళమ్మాయి, పోకిరి చిత్రాల తర్వాత నిర్మాతగా, దర్శకునిగా నాకు పూర్తి సంతృప్తినిచ్చిన సినిమా ‘హార్ట్ ఎటాక్’. నా కెరీర్‌లో మరో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ అయ్యే రేంజ్‌లో సినిమా వచ్చింది’’ అని పూరి జగన్నాథ్ అన్నారు. నితిన్ కథానాయకునిగా ఆయన స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘హార్ట్ ఎటాక్’. ప్యాచ్‌వర్క్ మినహా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా గురించి పూరీ ఇంకా చెబుతూ -‘‘నితిన్‌కి ఇది చాలా పెద్ద సినిమా అవుతుంది.
అనూప్ మ్యూజిక్ చాలా బాగా చేశాడు. ఆరు పాటలూ సూపర్‌హిట్ అవుతాయి. ఆడియో వేడుకను జనవరి తొలివారంలో డిఫరెంట్‌గా ప్లాన్ చేశాం. జనవరి 31న సినిమా విడుదల చేస్తాం’’ అని తెలిపారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటించాలనే కోరిక ‘హార్ట్ ఎటాక్’తో తీరిందని, తన కెరీర్‌కి ఈ సినిమా పెద్ద టర్నింగ్ పాయింట్ అవుతుందని నితిన్ చెప్పారు. ఆదాశర్మ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: అమోల్ రాథోడ్, కూర్పు: ఎస్.ఆర్.శేఖర్, కళ: బ్రహ్మ కడలి, పాటలు: భాస్కరభట్ల, సమర్పణ: లావణ్య.