![Veteran Producer Nitin Manmohan Passes Away At Hospital In Mumbai - Sakshi](/styles/webp/s3/article_images/2022/12/29/NIT.jpg.webp?itok=0Zsa7XR9)
సినీ ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత నితిన్ మన్మోహన్ కన్నుమూశారు. ఇటీవలె గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన ఆయన సుమారు 15రోజుల పాటు వెంటిలేటర్‌పైనే ఉన్నారు. అయితే ఆరోగ్యం విషమించడంతో ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన స్నేహితుడు, నిర్మాత కలీమ్ ఖాన్ ద్రువీకరించారు. నితిన్ మన్మోహన్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
బోల్ రాధా బోల్ (1992), ఆర్మీ (1996), షూల్ (1999), లవ్ కే లియే కుచ్ భీ కరేగా (2001) దస్ (2005), యమ్లా పగ్లా దీవానా (2011), రెడీ (2011) వంటి పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించిన ఆయన కొన్ని సినిమాకు కథా రచయితగానూ ఉన్నారు. డిసెంబర్3న తీవ్ర గుండెపోటుతో ఆసుపత్రిలో చేరారు. అప్పటినుంచి వెంటిలేటర్‌పైనే ఉన్నారు. మరోవైపు తండ్రి అనారోగ్యానికి గురైన విషయం తెలియగానే నితన్ మన్మోహన్ కొడుకు సోహమ్ ఇటీవలె భారత్‌కు చేరుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment